• facebook
  • whatsapp
  • telegram

విద్యుత్

మాదిరి ప్ర‌శ్న‌లు

1. 15Ω నిరోధం చివరల 6V పొటెన్షియల్ భేదం కలగజేస్తే వలయంలోని విద్యుత్ ప్రవాహం ఎంత?
జ: 0.4 A

 

2. ఒక వాహకం మధ్యచ్ఛేద వైశాల్యాన్ని స్థిరంగా ఉంచి పొడవును రెట్టింపు చేస్తే వాహక నిరోధం .....
జ: 2R

 

3. 50Ω నిరోధం ఉన్న ఏకరీతి నిరోధాన్ని అయిదు సమాన భాగాలుగా విభజించారు. వీటిని సమాంతరంగా కలిపితే ఫలిత నిరోధం-
జ: 2Ω

 

4. వాహకంలో ఒక ఆవేశాన్ని A నుంచి Bకు కదిలించారు. ఈ విధంగా ప్రమాణ ఆవేశాన్ని ఆ బిందువుల మధ్య కదల్చడానికి విద్యుత్ బలాలు చేయాల్సిన పని-
జ: A, B మధ్య పొటెన్షియల్ భేదం

 

5. జౌల్/కూలూంబ్ కిందివాటిలో దేనికి సమానం?
జ: వోల్ట్

 

6. తీగలో విద్యుత్ ప్రవాహం ........ పై ఆధారపడుతుంది.
జ: పొటెన్షియల్ భేదం, తీగ నిరోధం రెండింటిపై

 

7. వోల్ట్ అనేది దేనికి SI ప్రమాణం?
జ: పొటెన్షియల్ భేదం

 

8. ఆవేశ ప్రమాణం-
జ: కూలూంబ్

 

9. విద్యుత్ ప్రవాహం SI ప్రమాణం-
జ: ఆంపియర్

 

10. R1, Rలను సమాంతర అనుసంధానం చేస్తే ఫలిత నిరోధం ఎంత?
జ:  

 

11. 4Ω, 5Ω, 20Ω లను శ్రేణి సంధానం చేస్తే ఫలిత నిరోధం-
జ: 29Ω

 

12. విద్యుత్ సామర్థ్యం ....।
జ: P = V × I

13. 1 ఆంపియర్ =
జ:  

 

14. భూ ఉపరితలానికి ..... పొటెన్షియల్ ఉంటుంది.
జ: సున్నా

 

15. ఆదర్శ వోల్ట్ మీటర్ నిరోధం-
జ: చాలా ఎక్కువ

 

16. ఓమ్ నియమం ప్రకారం V =
జ: I × R

 

17. కిర్‌చాఫ్ జంక్షన్ నియమం ..... పై ఆధారపడి ఉంటుంది.
జ: ఆవేశం

 

18. 1 kWh = ..... జౌళ్లు
జ: 3.6 × 106
19. కిర్‌చాఫ్ లూప్ నియమం ...... పై ఆధారపడుతుంది.
జ: శక్తి

20. విశిష్ట నిరోధానికి ప్రమాణాలు .....
జ: ఓమ్/మీటరు

 

21. విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే సాధనం
జ: జనరేటర్

 

22. అయస్కాంత క్షేత్రంలో కదిలే అంశంపై పనిచేసే బలం గరిష్ఠం అయితే కదిలే ఆవేశానికి, క్షేత్రానికి మధ్యకోణం-
జ: 90o

 

23. విద్యుదయస్కాంత ప్రేరణంపై పనిచేసేది-
జ: మోటార్

 

24. విద్యుదయస్కాంతత్వాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త-
జ: ఆయిర్‌స్టెడ్

 

25. ఒక సమ అయస్కాంత క్షేత్రానికి లంబంగా ఉన్న విద్యుత్ ప్రవాహ తీగపై పనిచేసే బలం
జ: ILB

 

26. అయస్కాంత క్షేత్ర బలరేఖలు-
జ: ఖండించుకోవు

 

27. కిందివాటిలో విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేది-
ఎ) మోటారు        బి) బ్యాటరీ       సి) జనరేటర్       డి) స్విచ్
జ: మోటారు

 

28. ఫ్యూజ్ వైర్‌ను వేటితో నిర్మిస్తారు?
జ: టిన్, లెడ్

 

29. పిడుగులను ఆకర్షించే కడ్డీలను వేటితో తయారు చేస్తారు?
జ: రాగి

 

30. తడి చర్మంతో మానవుడి విద్యుత్ నిరోధం
జ: 10,000Ω 

 

31. గృహ అవసరాలకు వినియోగించే ఏకాంతర విద్యుత్ పౌనఃపున్యం
జ: 50 Hz

 

32. ఒక అశ్వ సామర్థ్యం = ...... వాట్‌లు.
జ: 746

 

33. కిందివాటిలో విద్యుత్ నిరోధక పదార్థం-
ఎ) వెండి         బి) రాగి         సి) పాదరసం         డి) వజ్రం
జ: వజ్రం

 

34. వీధి దీపాలను ఏ పద్ధతిలో కలుపుతారు?
జ: శ్రేణి


35. కిందివాటిలో విద్యుత్ వాహక ధర్మాన్ని ప్రదర్శించే అలోహం-
ఎ) గాజు              బి) గ్రాఫైట్             సి) బొగ్గు             డి) పింగాణీ
జ: బొగ్గు

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎన్టీపీసీ

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌