మాదిరి ప్రశ్నలు
1. మొదటి పంచవర్ష ప్రణాళికలో ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రధాన కారణం ఏమిటి?
జ: అనుకూల రుతుపవనాలు
2. నాలుగో పంచవర్ష ప్రణాళిక విజయవంతం కాకపోవడానికి ఏర్పడిన ప్రధాన అవరోధం ఏది?
1) బంగ్లాదేశ్ కాందీశీకుల సమస్య 2) రుతుపవనాల వైఫల్యం
3) పాకిస్థాన్‌తో యుద్ధం 4) అన్నీ
జ: 4(అన్నీ)
3. ఇందిరాగాంధీ రద్దు చేసిన ప్రణాళిక ఏది?
జ: నిరంతర ప్రణాళిక
4. ఏ పంచవర్ష ప్రణాళికా కాలంలో భారతదేశ అభివృద్ధికి సంబంధించిన ప్రధాన బాధ్యత ప్రభుత్వ రంగానికి మారింది?
జ: 2వ
5. కిందివాటిలో మహలనోబిస్ నాలుగు రంగాల నమూనాలో అంశం కానిది ఏది?
1) విదేశీ వ్యాపార రంగం
2) వినియోగ వస్తువులను ఉత్పత్తి చేసే రంగం
3) మూలధన వస్తువులను ఉత్పత్తి చేసే రంగం
4) సేవలను ఉత్పత్తి చేసే రంగం
జ: 1(విదేశీ వ్యాపార రంగం)
6. నిరుద్యోగ నిర్మూలనకు ప్రాధాన్యం ఇచ్చిన పంచవర్ష ప్రణాళిక ఏది?
జ: 6వ
7. పంచవర్ష ప్రణాళికలు లేని కాలం ఏది?
జ: 1967
8. ప్రజా ప్రణాళికను రూపొందించింది ఎవరు?
జ: ఎం.ఎన్. రాయ్
9. సామ్యవాద దృక్పథంతో రూపొందించిన పంచవర్ష ప్రణాళిక ఏది?
జ: 2వ
10. కనీస అవసరాల కార్యక్రమం ప్రారంభించిన ప్రణాళిక ఏది?
జ: 5వ
11. ముఖర్జీ ఫార్ములా దేని స్థానంలో వచ్చింది?
జ: గాడ్గిల్ ఫార్ములా
12. మనదేశానికి ప్రణాళికా సంఘం అవసరమని సూచించిన మొదటి జాతీయ నాయకుడు ఎవరు?
జ: సుభాష్ చంద్రబోస్
13. కిందివాటిలో సరికానిది ఏది?
1) ప్రణాళికా సంఘం - 1950, మార్చి 15
2) ప్రణాళికలు - ఉమ్మడి జాబితా
3) భారత ప్రణాళికల రూపశిల్పి - జవహర్లాల్ నెహ్రూ
4) పిగ్మీ ప్రణాళికలు - రోలింగ్ ప్రణాళిక
జ: 4(పిగ్మీ ప్రణాళికలు - రోలింగ్ ప్రణాళిక)
14. కిందివాటిలో నాలుగో పంచవర్ష ప్రణాళికా కాలంలో చేపట్టని పథకం ఏది?
1) పనికి ఆహార పథకం 2) ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్
3) కరవు ప్రాంతాల అభివృద్ధి పథకం 4) గ్రామీణ పనుల కార్యక్రమం
జ: 1(పనికి ఆహార పథకం)
15. ఆరో పంచవర్ష ప్రణాళిక అమలు చేసిన కాలం ఏది?
జ: 1980 - 85
16. భారత ఆర్థిక వ్యవస్థను సాధారణంగా కిందివిధంగా వర్ణిస్తారు?
1) పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ 2) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
3) సామ్యవాద ఆర్థిక వ్యవస్థ 4) ఏదీకాదు
జ: 2(మిశ్రమ ఆర్థిక వ్యవస్థ)
17. హరడ్ - డోమర్ వృద్ధి నమూనా ఏ ప్రణాళికకు ఆధారమైంది?
జ: 1వ
18. మౌలిక, భారీ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన ప్రణాళిక ఏది?
జ: 2వ
19. సామాజిక అభివృద్ధి పథకాన్ని (సీడీపీ) ఒక తీర్థయాత్రగా ఎవరు వర్ణించారు?
జ: ఎస్.కె. డే
20. ధైర్యంతో కూడిన ప్రణాళిక అని కిందివాటిలో ఏ ప్రణాళికను పిలుస్తారు?
1) 1వ 2) 2వ 3) 10వ 4) 11వ
జ: 2(2వ)
21. విదేశీ మారకద్రవ్య నిరోధక చట్టం (ఫెరా) రూపొందించిన సంవత్సరం ఏది?
జ: 1973
22. కిందివాటిలో నూతన ఆర్థిక సంస్కరణల్లో భాగం కానిది ఏది?
1) స్ట్రక్చరల్ రిఫారమ్స్ (నిర్మాణాత్మక సంస్కరణలు)
2) విత్తరంగ సంస్కరణలు
3) జనాభా విధానం
4) కోశ సంస్కరణలు
జ: 3(జనాభా విధానం)
23. 3వ పంచవర్ష ప్రణాళిక ఎవరి నమూనా ప్రకారం రూపొందించారు?
జ: అశోక్ మెహతా
24. భారతదేశంలో నిరంతర ప్రణాళికలను రూపొందించిన ఆర్థికవేత్త ఎవరు?
జ: లకడవాలా
25. స్వాతంత్య్రం తర్వాత ప్రణాళికల్లో జరిగిన కృషి వల్ల భారత ఆర్థిక వ్యవస్థను ఏవిధంగా పేర్కొంటారు?
జ: అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ
26. 4వ పంచవర్ష ప్రణాళిక దేనిపై ఆధారపడి ఉంది?
జ: గాడ్గిల్ నమూనా
27. కిందివాటిలో 8వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు ఏవి?
ఎ) జనాభా వృద్ధిని నిరోధించడం
బి) వృద్ధి ప్రక్రియను కొనసాగించేందుకు అవస్థాపనా సదుపాయాలను బలోపేతం చేయడం
సి) శతాబ్ద అంతానికి సంపూర్ణ ఉద్యోగిత సాధించేందుకు సరిపడే ఉపాధి సృష్టించడం
జ: ఎ, బి, సి
28. కిందివాటిలో రాజా చెల్లయ్య కమిటీని ఏ సంస్కరణల కోసం నియమించారు?
1) పన్ను సంస్కరణలు 2) భూసంస్కరణలు
3) సేవా సంస్కరణలు 4) వర్తక సంస్కరణలు
జ: 1(పన్ను సంస్కరణలు)
29. భారత్‌లో ప్రణాళికల దీర్ఘకాలిక లక్ష్యం-
1) సాంఘిక న్యాయం 2) ఆర్థిక స్వావలంబన
3) ప్రజల జీవన ప్రమాణస్థాయిని పెంచుతూ అధికవృద్ధి రేటు 4) అన్నీ
జ: 4(అన్నీ)
30. పేదరిక నిర్మూలన, స్వావలంబన లక్ష్యాలుగా ప్రారంభించిన ప్రణాళిక ఏది?
జ: 5వ
31. నిధుల మంజూరు విషయంలో మొదటిసారి ప్రణాళికా సంఘం విచక్షణాత్మక పరిధిని తగ్గించిన ఫార్ములా-
జ: గాడ్గిల్ ఫార్ములా
32. సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమాన్ని ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించారు?
జ: 2వ
33. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఏ ప్రణాళికా కాలంలో ఏర్పడింది?
జ: 2వ
34. ఎడారి, కొండ ప్రాంతాల్లో 100 రోజులకు తక్కువ కాకుండా లాభదాయకమైన ఉపాధిని అందించేందుకు ప్రవేశపెట్టిన పథకం ఏది?
జ: ఉపాధి హామీ పథకం
35. అయిదో ప్రణాళిక ఎవరి నమూనా ప్రకారం రూపొందించారు?
జ: డి.పి. థర్
36. ప్రణాళికా సంఘానికి సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?
1) రాజ్యాంగేతర సంస్థ 2) సలహా సంఘం
3) పార్లమెంటు చట్టంచే ఏర్పాటు చేసిన సంస్థ 4) అన్నీ సరైనవే
జ: 4(అన్నీ సరైనవే)
37. జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకాన్ని (ఎన్ఆర్ఈపీ) ఏ ప్రణాళికా కాలంలో ప్రారంభించారు?
జ: 6వ
38. కిందివాటిలో పంచవర్ష ప్రణాళికా విరామం ఏది?
1) 1954 - 58 2) 1966 - 69 3) 1970 - 73 4) 1983 - 86
జ: 2(1966 - 69)
39. సింద్రీ ఎరువుల కర్మాగారం ఏర్పాటు చేసిన పంచవర్ష ప్రణాళిక ఏది?
జ: 1వ
40. మొదటి ప్రణాళికలో అధిక ప్రాధాన్యం దేనికి ఇచ్చారు?
జ: సత్వర వ్యవసాయాభివృద్ధి, యుద్ధం, దేశ విభజన వల్ల విచ్ఛిన్నమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడం
41. 10వ పంచవర్ష ప్రణాళికా ప్రారంభం నాటికి శ్రమశక్తిలో బ్యాక్లాగ్ నిరుద్యోగిత శాతం ఎంత?
జ: 9%
42. హరిత విప్లవం ప్రారంభించిన కాలం ఏది?
జ: వార్షిక ప్రణాళిక
43. రెండు విదేశీదాడులను ఎదుర్కొన్న ప్రణాళిక ఏది?
జ: 3వ
44. 9వ ప్రణాళికలో అధిక ప్రణాళికా కేటాయింపులు ఏ రంగంపై జరిగాయి?
జ: రవాణా - సమాచారం
45. బొకారో - ఇనుము ఉక్కు కర్మాగారం ఏ ప్రణాళికలో స్థాపించారు?
జ: 4వ
46. పేదరికాన్ని గుడ్డివాడు సైతం చూడగలడు అని వ్యాఖ్యానించింది ఎవరు?
జ: అమర్త్యసేన్
47. భారత ప్రణాళికల రూపశిల్పి ఎవరు?
జ: జవహర్లాల్ నెహ్రూ
48. రెండో పంచవర్ష ప్రణాళిక ప్రారంభం నుంచి భారతదేశం అవలంబించిన అభివృద్ధి వ్యూహం ఏ అంశాలపై ఆధారపడి ఉంది?
ఎ) ఎగుమతుల ప్రోత్సాహం బి) దిగుమతుల ప్రతిస్థాపన
సి) భారీ పరిశ్రమలు డి) తేలిక పరిశ్రమలు
జ: బి, సి మాత్రమే
49. రోలింగ్ ప్రణాళికను ఏ కాలంలో రూపొందించారు?
జ: 1978 - 80
50. 5వ పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యం ఏమిటి?
జ: పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వయంసమృద్ధిని సాధించడం
51. ఏ ప్రణాళికా కాలంలో సాధారణ ధరల స్థాయిలో తగ్గుదల ఏర్పడింది?
జ: 1వ
52. కిందివాటిలో ఆర్థికవేత్త లకడావాలా ప్రవేశపెట్టింది ఏది?
1) మానవ వనరుల ప్రణాళిక 2) రోలింగ్ ప్రణాళిక
3) అభివృద్ధి ప్రణాళిక 4) ఆర్థిక ప్రణాళిక
జ: 2(రోలింగ్ ప్రణాళిక)
53. సేన్ పేదరికపు గీత సమాజంలో సంపద పంపిణీ కంటే సంక్షేమ పంపిణీని కొలిచిందని పేర్కొనడానికి కారణం...
జ: పేదరికపు గీతకు ప్రతి వ్యక్తి ఆదాయం ఎంత తక్కువ, ఎంత ఎక్కువ ఉందో కొలిచాడు
54. మన దేశ మొదటి పంచవర్ష ప్రణాళిక దేనికి ప్రాధాన్యం ఇచ్చింది?
జ: వ్యవసాయ రంగం
55. పంచాయతీరాజ్ వ్యవస్థను ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించారు?
జ: 2వ
56. ప్రణాళికలను మొదటిసారిగా ప్రారంభించిన దేశం ఏది?
జ: రష్యా
57. 20 సూత్రాల కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రణాళిక ఏది?
జ: 5వ ప్రణాళిక (1975, జులై)
58. ఒరిస్సాలోని రూర్కెలా ఇనుము - ఉక్కు కర్మాగార స్థాపనకు సహాయం చేసిన దేశం ఏది?
జ: పశ్చిమ జర్మనీ
59. పేదరికపు తీవ్రతను అంచనా వేసేందుకు అతిపేద వర్గం అనే భావనను ఏ పంచవర్ష ప్రణాళికలో తీసుకొచ్చారు?
జ: 4వ
60. కిందివాటిలో రెండోతరం ఆర్థిక సంస్కరణలుగా వేటిని పిలుస్తారు?
1) శ్రామిక రంగంలో సంస్కరణలు 2) వ్యవసాయ రంగంలో సంస్కరణలు
3) రాష్ట్రాలకు సంస్కరణల విస్తరణ 4) అన్నీ
జ: 4(అన్నీ)
61. 12వ పంచవర్ష ప్రణాళికా కాలం ఏది?
జ: 2012 - 17
62. భారతదేశంలో ప్రణాళికలు, వాటి లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి మార్గదర్శకంగా పనిచేసేవి ఏవి?
జ: ఆదేశిక సూత్రాలు
63. Bold Plan అని ఏ ప్రణాళికను పిలుస్తారు?
జ: 2వ
64. Exim Bankను ఏ ప్రణాళికలో స్థాపించారు?
జ: 6వ