• facebook
  • whatsapp
  • telegram

ఉష్ణం 

* ఉష్ణం ఒక శక్తి స్వరూపం. ఇది వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు ప్రయాణిస్తుంది.
* ఉష్ణానికి C.G.S. ప్రమాణం కెలోరి.
     SI ప్రమాణం జౌల్.
* ఒక గ్రాము నీటి ఉష్ణోగ్రతను 1°C పెంచడానికి అవసరమైన ఉష్ణాన్ని కెలోరి అంటారు.
     1 కెలోరి = 4.186 జౌళ్లు
     1 కిలో కెలోరి = 4186 జౌళ్లు
* ఒక వస్తువు ఉష్ణం గురించి అధ్యయనం చేసే శాస్త్రం కెలోరి మెట్రి.
* ఉష్ణ రాశిని కొలవడానికి బాంబ్ కెలోరిమీటరు ఉపయోగిస్తారు.
* ఉష్ణం ఎల్లప్పుడూ అధిక ఉష్ణోగ్రత ఉండే వస్తువు నుంచి అల్ప ఉష్ణోగ్రత ఉండే వస్తువు వైపు ప్రయాణిస్తుంది.
    ఇది మూడు పద్ధతుల్లో జరుగుతుంది.
        1. ఉష్ణ వహనం
        2. ఉష్ణ సంవహనం
        3. ఉష్ణ వికిరణం

1. ఉష్ణ వహనం: వస్తువు లేదా పదార్థంలోని కణాల చలనం లేకుండా ఉష్ణప్రసారం జరుగుతుంది.
ఉదా: అన్ని ఘనపదార్థాలు, ద్రవస్థితిలోని పాదరసంలో జరిగే ఉష్ణ ప్రసారం.
* ఈ ప్రక్రియలో ఉష్ణ ప్రసారం చాలా ఆలస్యంగా జరుగుతుంది.
* కణాలకు ఎలాంటి స్థానభ్రంశం ఉండదు.

 

2. ఉష్ణ సంవహనం: వస్తువు లేదా పదార్థంలోని కణాల స్థానాంతర చలనం ద్వారా ఉష్ణ ప్రసారం జరుగుతుంది.
ఉదా: అన్ని ద్రవపదార్థాలు (పాదరసం తప్ప), వాయు పదార్థాల్లో జరిగే ఉష్ణ ప్రసారం.
* భూపవనాలు, సముద్ర పవనాలు ఏర్పడేందుకు కారణం ఉష్ణ సంవహనం.
* వెంటిలేటర్లు, పొగగొట్టం, చిమ్నీలు మొదలైనవి ఉష్ణ సంవహనం సూత్రం ఆధారంగా పనిచేస్తాయి.

 

3. ఉష్ణ వికిరణం: యానకంతో నిమిత్తం లేకుండా ఉష్ణ ప్రసారం జరుగుతుంది.
* సూర్యుడి నుంచి బయలుదేరిన ఉష్ణ వికిరణాలు మొదట శూన్యంలోనూ, తర్వాత భూమి చుట్టూ ఉన్న వాతావరణంలోకి ప్రవేశించి భూమిని చేరతాయి.
* ఇది చాలా త్వరగా జరుగుతుంది.
* యానకం ఉష్ణోగ్రత మారకుండా స్థిరంగా ఉంటుంది.
* ఒక పాత్రలో ఉండే వేడి ద్రవాన్ని స్టీలు చెంచాతో కలియబెట్టినప్పుడు అది వేడెక్కడానికి గల కారణం ఉష్ణవహనం.
* భూగోళం వేడెక్కడానికి కారణం ఉష్ణ వహనం, సంవహనం, వికిరణం.

పదార్థాలు - రకాలు
ఉష్ణ ప్రసారాన్ని అనుసరించి పదార్థాలను రెండు రకాలుగా విభజించవచ్చు.
     1. ఉష్ణ వాహకాలు
     2. ఉష్ణ బంధకాలు

 

1. ఉష్ణ వాహకాలు
* వీటిద్వారా ఉష్ణ ప్రసారం జరుగుతుంది.
* అత్యుత్తమ ఉష్ణ వాహకం 'వెండి'. తర్వాత Cu, Al, Fe మొదలైనవి.

 

2. ఉష్ణ బంధకాలు:

* వీటి ద్వారా ఉష్ణ ప్రసారం జరగదు.
* అత్యుత్తమ ఉష్ణ బంధక పదార్థం 'వజ్రం'.
* ప్లాస్టిక్, చెక్కదిమ్మె మొదలైనవి ఉష్ణ బంధకాలు.

 

ఉష్ణోగ్రత (Temperature)
ఒక వస్తువు చల్లదనం లేదా వెచ్చదనాన్ని ఉష్ణోగ్రత అంటారు.

 

ప్రమాణాలు: SI ప్రమాణం డిగ్రి కెల్విన్ (oK).
సెల్సియస్ లేదా సెంటీగ్రేడు, డిగ్రి ఫారన్‌హీట్ (oF)
* సెల్సియస్, ఫారన్‌హీట్, కెల్విన్ మానాల మధ్య ఉండే సంబంధం

* మంచు ఉష్ణోగ్రతను కెల్విన్‌లలో తెలిపినప్పుడు K = (C + 273)
                                               = 0 + 273 K
* 100oC = 100 + 273 = 373 K అవుతుంది.
* సెల్సియస్, ఫారన్‌హీట్‌లు ఒకదాంతో మరొకటి ఏకీభవించే రీడింగ్ -40
   C = F = x

                                           8x = -320
                                              = -40
* కెల్విన్, ఫారన్‌హీట్ ఒకదాంతో ఒకటి ఏకీభవించే రీడింగ్ 574.6 oF
* నీటి అసంగత వ్యాకోచం 4 oC లేదా 277 oK
* ఆరోగ్యవంతుడైన మానవుడి సాధారణ శరీర ఉష్ణోగ్రత 37 oC లేదా 310 oK
* పాలను పాశ్చరేజేషన్ చేసే ఉష్ణోగ్రత 67 oC లేదా 340 oK
* -273 oC లేదా 0 oK  ను పరమశూన్య ఉష్ణోగ్రత అంటారు. ఈ ఉష్ణోగ్రత వద్ద వాయువు పీడనం శూన్యం అవుతుంది.

ఉష్ణమాపకాలు, రకాలు
* వేడిచేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయి అనే ధర్మం ఆధారంగా థర్మామీటరు పనిచేస్తుంది. సాధారణంగా థర్మామీటర్లలో పాదరసాన్ని ఉపయోగిస్తారు.
* సాధారణ వాతావరణ పీడనం వద్ద మంచు కరిగే ఉష్ణోగ్రతను ప్రమాణ అథో స్థిర స్థానంగానూ, నీరు మరిగే ఉష్ణోగ్రతను ఊర్థ్వ స్థిర స్థానంగానూ తీసుకుంటారు.

క్లినికల్ థర్మామీటర్8
* వైద్యులు ఉపయోగించే థర్మామీటరు ఫారన్‌హీట్ మానంలో ఉంటుంది.
* రీడింగులు 95 oF నుంచి 110 oF వరకు ఉంటాయి.
* దీనిలో పాదరసం ఉపయోగిస్తారు.

 

ఆల్కహాల్ థర్మామీటరు
* శీతల ప్రదేశాల్లో ఉష్ణోగ్రతను కనుక్కునేందుకు ఉపయోగిస్తారు.
* దీన్ని ఉపయోగించి -130o నుంచి 75 oC వరకు ఉష్ణోగ్రతను కనుక్కోవచ్చు.

సిక్స్ గరిష్ఠ - కనిష్ఠ ఉష్ణమాపకం:
* ఒక రోజులో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలను తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు.
* దీనిలో పాదరసం, ఆల్కహాల్ ఉంటాయి.
* గరిష్ఠ ఉష్ణోగ్రతను పాదరసం బల్బులోనూ, కనిష్ఠ ఉష్ణోగ్రతను ఆల్కహాల్ బల్బులోనూ వినియోగిస్తారు.

 

అయస్కాంత ఉష్ణోగ్రత మాపకం:
* దీన్ని ఉపయోగించి పరమశూన్య ఉష్ణోగ్రత -273 oC లేదా 0o Kను కచ్చితంగా కొలవవచ్చు.
* ఉష్ణ విద్యుత్, ఉష్ణోగ్రతా మాపకం సీబెక్ ఫలితం ఆధారంగా పనిచేస్తుంది.
* దీన్ని ఉపయోగించి కీటకాల ఉష్ణోగ్రతను 0.025 oC వరకు కచ్చితంగా కొలవవచ్చు.

 

పైరోమీటరు
* బట్టీలు, కొలిమిల్లోని ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు.
* ఆప్టికల్ పైరోమీటరును సూర్యుడు లేదా నక్షత్రాల్లోని అత్యధిక ఉష్ణోగ్రతను కొలవడానికి వాడతారు.
* పాదరస కాలుష్యం వల్ల వచ్చే వ్యాధి 'మినిమాటా'.
* ఒక వస్తువులోని అణువుల సరాసరి గతిజశక్తి దాని పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది.
* ఉష్ణశక్తి ప్రసార దిశను నిర్ణయించేది ఉష్ణోగ్రత, ఆ శక్తి ఉష్ణం.

విశిష్టోష్ణం (Specific Heat)
     ఏకాంక ద్రవ్యరాశి ఉండే పదార్థ ఉష్ణోగ్రతను ఒక డిగ్రీ పెంచడానికి కావాల్సిన ఉష్ణాన్ని ఆ పదార్థ విశిష్టోష్ణం అంటారు.
   Q = msΔT

SI ప్రమాణాలు: joul/ kg K
1 Cal = 1 K.Cal/ kg - K
      = 4.2 × 103 Joul/ kg - K

* పదార్థాల విశిష్టోష్ణాన్ని కెలోరిమితి సహాయంతో కొలుస్తారు.
* పదార్థంలోని కణాలు
   i) రేఖీయ గతిశక్తి
   ii) భ్రమణ గతిశక్తి
   iii) కంపన శక్తి
   iv) స్థితిజశక్తిని కలిగి ఉంటాయి.
* వీటన్నింటి మొత్తాన్ని అంతర్గత శక్తి అంటారు.
* విశిష్టోష్ణం పదార్థాల స్వభావంపై ఆధారపడుతుంది.
* ఫ్రిజ్ నుంచి బయటకు తీసి ఉంచిన వివిధ రకాల పండ్లతో పోల్చినట్లయితే పుచ్చకాయ ఎక్కువ సమయం పాటు చల్లదనాన్ని నిలిపి ఉంచుకుంటుంది. పుచ్చకాయలో అధికంగా నీరు ఉంటుంది. నీటి విశిష్టోష్ణం విలువ ఎక్కువ.
* సమోసాను చేతితో తాకినప్పుడు వేడిగా అనిపించకపోయినప్పటికీ... దాన్ని తింటే లోపలి పదార్థాలు వేడిగా ఉన్నాయని తెలుస్తుంది. దీనికి కారణం సమోసా లోపల ఉన్న పదార్థాల విశిష్టోష్ణం ఎక్కువ.

మిశ్రమాల పద్ధతి సూత్రం:
 వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణం = చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణం

     
* 20oC ఉష్ణోగ్రత ఉన్న 50 గ్రాముల నీటిని 40oC ఉష్ణోగ్రత ఉన్న 50 గ్రాముల నీటికి కలిపితే మిశ్రమం ఫలిత ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది?
సాధన: m1 = 50 గ్రా., m2 = 50 గ్రా., T= 20°C, T2 = 40oC

  T = 30oC.
బాష్పీభవనం:
* ఏ ఉష్ణోగ్రత వద్ద ద్రవ పదార్థం, వాయుపదార్థంగా మారుతుందో ఆ ఉష్ణోగ్రతను బాష్పీభవన ఉష్ణోగ్రత అంటారు.
» నీటి మరిగే స్థానం 100 oC.
* ఇది శీతలీకరణ ప్రక్రియ.
* చెమట పట్టినప్పుడు ఫ్యాన్ ఆన్ చేస్తే చల్లగా అనిపిస్తుంది. కారణం బాష్పీభవనం
* ఫ్యాన్ గాలికి ఉంచినప్పుడు స్పిరిట్ తొందరగా ఆవిరి అవడం.

సాంద్రీకరణం:
* వాయువు ద్రవంగా స్థితి మార్పు చెందడాన్ని సాంద్రీకరణం అంటారు.
* ఇది ఒక ఉష్ణీకరణ ప్రక్రియ.
* వేసవి రోజుల్లో షవర్ కింద స్నానం చేసిన తర్వాత శరీరం వెచ్చగా అనిపించడానికి కారణం సాంద్రీకరణం.
* చల్లని నీటితో నింపిన గాజు గ్లాసు గోడలపై నీటి అణువులు ఏర్పడతాయి. దీనికి సాంద్రీకరణే కారణం.
ఉత్పతనం: ఘనపదార్థం నేరుగా వాయుస్థితిలోకి మారడం.
ఉదా: కర్పూరం కరగడం, NH4Cl స్ఫటికాలు ఆవిరి అవడం, నాఫ్తలీన్ గుళికలు మొదలైనవి.
ఆర్ద్రత: గాలిలోని నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ద్రత అంటారు.
* వివిధ ఉపరితలాలపై సాంద్రీకరణం చెందిన నీటి బిందువులను తుషారం అంటారు.
* పొగలా గాలిలో తేలియాడే నీటి బిందువులను పొగమంచు అంటారు.

 

మరగడం:
 ఏదైనా పీడనం, స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలోని పదార్థం వాయు స్థితిలోకి మారడాన్ని మరగడం అంటారు. ఆ ఉష్ణోగ్రతను ద్రవం మరిగే స్థానం(Boiling Point) అంటారు.
* బాష్పీభవనం ఏ ఉష్ణ్రోగత వద్దనైనా జరుగుతుంది. కానీ మరగడం అనేది ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే జరుగుతుంది.
* నీరు ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారడానికి వినియోగమయ్యే ఉష్ణాన్ని బాష్పీభవన గుప్తోష్ణం అంటారు.


గుప్తోష్ణం C.G.S. ప్రమాణం = Cal/ gram
SI ప్రమాణం = joule/ kg
* సాధారణ పీడనం వద్ద నీటి బాష్పీభవన గుప్తోష్ణం విలువ 540 Cal/ gm.

 

ద్రవీభవనం:
* స్థిర ఉష్ణోగ్రత వద్ద ఘనపదార్థం, ద్రవంగా మారే ప్రక్రియను ద్రవీభవనం అంటారు. దీన్నే విలీనం అంటారు.
* ఏ ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలోని పదార్థం, ద్రవస్థితిలోకి మారుతుందో ఆ ఉష్ణోగ్రతను ద్రవీభవన స్థానం అంటారు. కణాల మధ్య 'ఆకర్షణ బలం'పై ఇది ఆధారపడుతుంది.
* స్థిర ఉష్ణోగ్రత వద్ద 1 గ్రాము ఘనపదార్థం పూర్తిగా ద్రవంగా మారడానికి కావాల్సిన ఉష్ణాన్ని ద్రవీభవన గుప్తోష్ణం అంటారు. 

. 
* మంచు ద్రవీభవన గుప్తోష్ణం విలువ 80 Cal/ gm.

ఘనీభవనం:
* ద్రవస్థితిలో ఉన్న ఒక పదార్థం కొంత శక్తిని కోల్పోవడం ద్వారా ఘనస్థితిలోకి మారే ప్రక్రియను ఘనీభవనం అంటారు.
* సాధారణ వాతావరణ పీడనం (1 atm), OoC వద్ద నీరు ఘనీభవనం చెందుతుంది.
* నీరు ఘనీభవించినప్పుడు అది వ్యాకోచిస్తుంది (ఘనపరిమాణం పెరుగుతుంది). కాబట్టి నీటి సాంద్రత కంటే మంచు సాంద్రత తక్కువ. అందుకే నీటిపై మంచు తేలుతుంది.

 

ఇగరడం: వేడి చేయకుండానే ఒక ద్రవ పదార్థం ఆవిరై పరిసర ప్రాంతపు ఉష్ణోగ్రతను తగ్గించే ప్రక్రియను ఇగరడం అంటారు.
ఉదా: అరచేతిలో పెట్రోలు, ఈథర్‌ను ఉంచినప్పుడు చేయి చల్లబడటం.
* మరిగేస్థానం కంటే దిగువన ఏ ఉష్ణోగ్రత వద్దనైనా బాష్పంగా మరే దృగ్విషయం.
* పీడనాన్ని పెంచితే నీటి మరిగేస్థానం పెరుగుతుంది అనే సూత్రంపై ప్రెషర్ కుక్కర్ పనిచేస్తుంది.
     B.P. ∝ P
» పీడనాన్ని పెంచితే మంచు ద్రవీభవన స్థానం తగ్గుతుంది అనే సూత్రం ఆధారంగా స్కేటింగ్ చేస్తారు.  
  
 


   
పదార్థాలు - వ్యాకోచం
i) ఘనపదార్థాల వ్యాకోచం:

* ప్రతి ఘనపదార్థంలోనూ ద్రవ్యరాశి పొడవు, వెడల్పు, ఎత్తుల ప్రకారం విభజితమై ఉంటుంది.
* పొడవు వెంబడి వ్యాకోచిస్తే దైర్ఘ్యవ్యాకోచం అనీ; పొడవు, వెడల్పు రెండింటి వెంబడి వ్యాకోచిస్తే వైశాల్య వ్యాకోచమనీ, మూడు అంశాలతో వ్యాకోచం జరిగితే ఘనపరిమాణ వ్యాకోచం అని పిలుస్తారు.

అనువర్తనాలు:
* రైలు పట్టాల మధ్య తగినంత ఖాళీ వదిలి వేయడం.
* విద్యుత్, టెలిఫోన్ స్తంభాల మధ్య ఉండే తీగలను కొంచెం వదులుగా చేయడం.
* విద్యుత్ బల్బును సీలు చేయడానికి ప్లాటినం ఉపయోగించడం.
* గాజు పలకపై వేడి నీటిని లేదా ద్రవాన్ని చల్లినప్పుడు గాజు పొరల మధ్య అసమ వ్యాకోచం వల్ల ఆ పలక పగిలిపోతుంది.
* ఇన్వార్వ్ స్టీలు సంకోచ, వ్యాకోచాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని శృతిదండం, మీటరు స్కేలు, గోడ గడియార లోలకం తయారీలో ఉపయోగిస్తారు.
* ద్విలోహ పలకను ఉష్ణతాప నియంత్రక యంత్రం అంటారు. దీన్ని ఆటోమోటివ్ ఇస్ట్రీ పెట్టె, ఓవెన్లలో ఉష్ణోగ్రత క్రమబద్ధీకరణకు ఉపయోగిస్తారు.

 

ద్రవ పదార్థాల వ్యాకోచం
* ద్రవాలను వేడిచేసినప్పుడు అవి వ్యాకోచిస్తాయి.
* నిజ వ్యాకోచం = పాత్ర వ్యాకోచం + దృశ్య వ్యాకోచం
* 4oC వద్ద నీటిని వేడిచేసినా, చల్లబరిచినా అది వ్యాకోచిస్తుంది. దీన్ని నీటి అసంగత వ్యాకోచం అంటారు.
* 4o°C వద్ద నీటికి అధిక సాంద్రత ఉంటుంది.
* నీటి అసంగత వ్యాకోచాన్ని Dialatometer అనే పరికరంతో కొలుస్తారు.

 

అనువర్తనాలు
* అతి శీతల ప్రాంతాల్లో జలచరాలు జీవించడానికి గల కారణం.
* చలి కాలంలో వాహనాల రేడియేటర్లు పగిలిపోవడం.
* చలికాలంలో నల్లరేగడి నేలలు బీటలు వారడం.
* ప్రకృతిలో శిలా శైథిల్యం జరగడానికి నీటి అసంగత వ్యాకోచం కారణం.

 

వాయువుల వ్యాకోచం
* వాయువుల్లోని అణువుల మధ్య దూరం అధికంగా ఉండటం వల్ల వ్యాకోచం అధికంగా ఉంటుంది. (ఘన, ద్రవ పదార్థాలతో పోలిస్తే)
ఉదా: వేసవి కాలంలో వాహనాల టైర్లలోని గాలి వ్యాకోచించడం వల్ల అవి పగిలిపోతాయి.


సమస్యలు

ప్ర: 1 కి.గ్రా. నీటిని, నీటి ఆవిరిగా మార్చాలంటే ఎంత ఉష్ణం అందజేయాలి?
సాధన: Q = mL
      Q = 1000 gm × 540 = 5,40,000 Cal = 540 k. cal

 

ప్ర: 1 కి.గ్రా. నీటి ఉష్ణోగ్రతను 40oC నుంచి 60oC కి పెంచాలంటే ఎంత ఉష్ణాన్ని అందించాలి?
సాధన: Q = msΔT
          = 1000 gm × 1 × 20oC
          = 20,000 cal
          = 20 k.cal
   ΔΔT = T2 - T1
          = 60 - 40
          = 20oC
* రెండు అరచేతులను రుద్దినప్పుడు అవి వేడెక్కడం, సుత్తితో పదేపదే కొట్టడం వల్ల ఇనుము వేడెక్కడం, కుంకుడు గింజను తీసుకుని రాయిపై అరగదీసినప్పుడు అది వేడెక్కడం లాంటి ప్రక్రియలను గమనిస్తే...యాంత్రిక శక్తి 'ఉష్ణశక్తి'గా మారింది అని తెలుస్తుంది. 


* నీటిని వేడి చేయడానికి ఎలక్ట్రిక్ హీటర్‌ను ఉపయోగిస్తాం. ఈ హీటర్‌లో విద్యుత్ శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది.
* గ్యాస్ స్టౌవ్‌లో రసాయన శక్తి ఉష్ణశక్తిగా, సోలార్ హీటర్‌లో సౌరశక్తి ఉష్ణశక్తిగా మారతాయి.
* థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉష్ణశక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది.
* స్టీమ్ ఇంజిన్‌లో ఉష్ణశక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది. ఇది ఆవిరి యంత్రం కదలడానికి ఉపయోగపడుతుంది.
* థర్మామీటర్లలో సంకోచ, వ్యాకోచం జరిపే ద్రవ పదార్థాలుగా పాదరసం, ఆల్కహాల్‌ను ఉపయోగిస్తారు.
* క్రీ.శ.1593లో మొదటి థర్మామీటరును గెలీలియో కనుక్కున్నారు. దీనిలో పదార్థంగా గాలిని ఉపయోగించారు.
* పసిపిల్లలు, చిన్న ప్లిలల శరీర ఉష్ణోగ్రతలను తెలుసుకోవడానికి థర్మిస్టర్ థర్మామీటరును ఉపయోగిస్తారు.
* డిజిటల్ థర్మామీటరు ఒక ఎలక్ట్రానిక్ సాధనం.
* కొంత ద్రవ్యరాశి కలిగి ఉండి, స్థలాన్ని ఆక్రమించేది ఏదైనా 'పదార్థం'గా చెప్పవచ్చు.
* పదార్థం మూడు స్థితుల్లో లభిస్తుంది.
      1. ఘనస్థితి
      2. ద్రవస్థితి
      3. వాయుస్థితి
* ఘనపదార్థాలు నిర్దిష్టమైన ఆకారాన్ని, ఘనపరిమాణాన్ని కలిగి ఉంటాయి.
* ద్రవ పదార్థాల ఆకారాలు అవి ఉండే పాత్రల ఆకారాలపై ఆధారపడి ఉంటాయి.
* ద్రవాలను ఒక పాత్ర నుంచి మరో పాత్రలోకి సులభంగా మార్చగలం. కాబట్టి వీటిని ప్రవాహాలు అని అంటారు.
* ద్రవాలకు నిర్దిష్ట ఆకారం లేనప్పటికీ, నిర్దిష్ట ఘనపరిమాణాన్ని కలిగి ఉంటాయి.
* పదార్థంలోని కణాల మధ్య కొంత ఖాళీ స్థలం ఉంటుంది.
* ద్రవ, వాయు పదార్థాల్లోని కణాలు నిరంతరం చలనంలో ఉంటాయి.
* వాయు పదార్థాలు నిర్దిష్ట ఆకారాన్ని, ఘనపరిమాణాన్ని కలిగి ఉండవు.
* ఘన, ద్రవ పదార్థాలతో పోలిస్తే వాయువులు అధిక సంపీడ్యతను కలిగి ఉంటాయి.
* ఇళ్లలో వంట అవసరాలకు ఉపయోగించే L.P.G. (Liquid Petrolium Gas), మోటారు వాహనాల్లో ఉపయోగించే CNG (Compressed Natural Gas) లను అధిక పరిమాణంలో ఉండే వాయువుతో సంపీడ్యం చెందించి తక్కువ పరిమాణంలో ఉండే సిలిండర్లలో నింపుతారు.

వ్యాపనం:
* అగరబత్తిని వెలిగించగానే దానిలోని సుగంధ ద్రవ్యం ఆవిరిగా మారి అగరబత్తి పొగతో పాటు గాలితో కలిసి గది అన్నివైపులా వ్యాపిస్తుంది. దీన్నే వ్యాపనం అంటారు.
* వాయువుల వ్యాపన రేటు ద్రవాలు, ఘనపదార్థాల కంటే అధికంగా ఉంటుంది.
* భూమిపై ప్రాణులు, మొక్కలు, జంతువుల మనుగడకు కారణం ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ లాంటి వాయువులు నీటిలో వ్యాపనం చెందడం.
* శ్వాసక్రియలో ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుంచి రక్తంలోకి వ్యాపనం చెందుతుంది.
* అలాగే CO2 రక్తం నుంచి ఊపిరితిత్తులకు వ్యాపనం చెందుతుంది.
* పదార్థపు కణాలు నిరంతరం కదులుతున్నప్పుడు మాత్రమే వ్యాపనం సాధ్యమవుతుంది.
* వాయువుల్లో వ్యాపన రేటు అధికంగా ఉంటుంది. దీనికి కారణం
   1. వాయువుల్లో కణాల చలన వేగం అధికంగా ఉండటం.
    2. కణాల మధ్య ఖాళీ స్థలం అధికంగా ఉండటం.
* వ్యాపన రేటు వాయువులు > ద్రవ పదార్థాలు > ఘన పదార్థాలు.
* ఉష్ణోగ్రతను పెంచినట్లయితే వ్యాపన రేటు పెరుగుతుంది.
ఘనస్థితిలోని CO2 ను పొడి మంచు అంటారు.

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎన్టీపీసీ

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌