మాదిరి ప్రశ్నలు
1. రాగిని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
జ: రాజస్థాన్
2. రూర్ ఆఫ్ ఇండియా (Ruhr of India) అని దేనికి పేరు?
జ: ఛోటానాగ్పుర్ పీఠభూమి
3. మానవుడు తొలిసారిగా ఉపయోగించిన ఖనిజం ఏది?
జ: రాగి
4. ప్యాకేజింగ్ పరిశ్రమలో అత్యధికంగా ఉపయోగిస్తున్న ఖనిజం ఏది?
జ: అల్యూమినియం
5. వజ్రపు గనులు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది?
జ: మధ్యప్రదేశ్
6. గెలీనా ఏ ఖనిజపు ధాతువు?
జ: సీసం
7. థర్మల్ ఇన్సులేషన్లో ముఖ్యంగా ఉపయోగించే ఖనిజం ఏది?
జ: రాతినార
8. ఆంధ్రప్రదేశ్లో బంగారు గనులు ఉన్న జిల్లా ఏది?
జ: అనంతపురం
9. నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది?
జ: తమిళనాడు
10. రాగితో జింకును కలపడం వల్ల ఏర్పడే Alloy ఏది?
జ: ఇత్తడి
11. సున్నపురాయిని ప్రధానంగా ఏ పరిశ్రమలో ముడి సరుకుగా ఉపయోగిస్తారు?
జ: సిమెంట్ పరిశ్రమ
12. అల్యూమినియం ఖనిజ రూపం ఏది?
జ: బాక్సైట్
13. మాంగనీస్ ఖనిజం ఏ రాష్ట్రంలో అత్యధికంగా లభిస్తుంది?
జ: ఒడిశా
14. ఏ ఖనిజం ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది?
జ: అభ్రకం
15. బంగారం ఏ శిలల్లో లభిస్తుంది?
జ: క్వార్ట్జ్ శిలలు