• facebook
  • whatsapp
  • telegram

పరమాణు నిర్మాణం 

మాదిరి ప్ర‌శ్న‌లు

1. పదార్థం అతి సూక్ష్మకణాలైన 'అణు', 'పరమాణువు'ల సమ్మిళతమని తెలియజేసింది ఎవరు?
జ‌: కణాదుడు

 

2. పదార్థం అతి సూక్ష్మకణాలైన పరమాణువులను కలిగి ఉంటుందని తెలియజేసింది
జ‌: డెమోక్రటిస్

 

3. ఒక మూలకానికి చెందిన పరమాణువులన్నీ ఒకే రకంగా ఉంటాయి. అన్ని ధర్మాల్లోనూ ఒకేలా ప్రవరిస్తాయని తెలియజేసిన శాస్త్రజ్ఞుడు ఎవరు?
జ‌: డాల్టన్

 

4. పరమాణువును విభజించడానికి వీలవుతుందని ఉత్సర్గనాళిక ప్రయోగాల ద్వారా తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు?
జ‌: విలియం క్రూక్స్

 

5. ఉత్సర్గనాళికలో వాయు పీడనాన్ని ఎంతకు తగ్గిస్తారు.
జ‌: 0.001 మి.మీ.

 

6. ఉత్సర్గనాళికలో విద్యుత్ ద్వారాలను ఎన్ని వోల్టుల విద్యుత్ జనకానికి కలుపుతారు?
జ‌: 10000 వోల్టులు

 

7. ఉత్సర్గనాళికలోని మార్పులను గుర్తించడానికి ధన విద్యుత్ ద్వారం వద్ద అమర్చే తెర ఏది?
జ‌: జింక్ సల్ఫైడ్

 

8. ఉత్సర్గనాళికలో రుణ ధృవ కిరణాలను (Cathode rays) కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు?
జ‌: థామ్సన్

 

9. రుణ ధృవ కిరణాలను విద్యుత్ క్షేత్రం ద్వారా పంపినప్పుడు అవి విద్యుత్‌క్షేత్రం ఏ దిశ వైపునకు దిశను మార్చి ప్రయాణిస్తాయి?
జ‌: ఆనోడ్ వైపు

 

10. రుణ ధృవ కిరణాల్లోని అతి సూక్ష్మమైన కణాన్ని ఏమంటారు?
జ‌: ఎలక్ట్రాన్

 

11. రుణ ధృవ కిరణాల్లోని కణాలు సంతరించుకున్న ఆవేశం
జ‌: రుణాత్మకం

 

12. కిందివాటిలో రుణ ధృవ కిరణాల ధర్మం
A) రుణ ధృవ కిరణాలు రుజుమార్గంలో ప్రయాణిస్తాయి.
B) రుణ ధృవ కిరణాలు యాంత్రిక చలనాన్ని కలగజేస్తాయి.
C) రుణావేశ కణాల సముదాయమే రుణ ధృవ కిరణాలు.
D) అన్నీ
జ‌: D (అన్నీ)

13. రుణ ధృవ కిరణాల్లోని కణాలకు ఎలక్ట్రాన్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు?
జ‌: జి.జె. స్టోనీ

 

14. విద్యుత్, అయస్కాంత క్షేత్రాలు లేనప్పుడు కాథోడ్ కిరణాలు ఏ విధంగా ప్రయాణం చేస్తాయి?
జ‌: సరళరేఖలో

 

15. మిల్లికాన్ 'నూనె చుక్క పద్ధతి' ప్రయోగం ద్వారా కనుక్కున్నది
జ‌: ఎలక్ట్రాన్ ఆవేశం

 

16. ఆర్.ఎ. మిల్లికాన్ 'నూనె చుక్క ప్రయోగం' ద్వారా నిర్ధారించిన ఎలక్ట్రాన్ ఆవేశం ఎంత?
జ‌: − 1.6 × 10−19C

 

17. ఎలక్ట్రాన్‌ను కనుక్కున్న శాస్త్రవేత్త
జ‌: థామ్సన్

 

18. ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి
జ‌: 9.1 × 10−31 kg

 

19. కాథోడ్ కిరణాలు రుజుమార్గంలో చలిస్తాయి. వీటి కణాలు సంతరించుకున్న ఆవేశం
జ‌: రుణాత్మకం

 

20. కాథోడ్ కిరణాలు కలిగి ఉండేది
జ‌: ద్రవ్యరాశి, ఆవేశం


21. ఎలక్ట్రాన్ విశిష్టావేశం (e/m) విలువ
A) 1.76 × 107 e.m.u./గ్రామ్           B) 1.761 × 108 కూలుంబ్/గ్రామ్
C) 5.28 × 1017 e.m.u./గ్రామ్           D) అన్నీ
జ‌: D (అన్నీ)

 

22. పరమాణువులో రుణావేశం ఉన్న ప్రాథమిక కణం
జ‌: ఎలక్ట్రాన్

 

23. అతి తక్కువ ద్రవ్యరాశి ఉన్న ప్రాథమిక కణం ఏది?
జ‌: ఎలక్ట్రాన్

 

24. ఉత్సర్గనాళంలో రుణ ధృవ కిరణాలు వెలువడటానికి అనుకూలమైన పరిస్థితులు
జ‌: తక్కువ పీడనం, ఎక్కువ విద్యుత్

 

25. ధన ధృవ కిరణాలను కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు?
జ‌: గోల్డ్‌స్టెయిన్

 

26. ఉత్సర్గనాళికలో ఆనోడ్ వైపు నుంచి కాథోడ్ దిశగా రుజుమార్గంలో చలించే కిరణాలు
జ‌: కెనాల్ కిరణాలు

 

27. ఉత్సర్గనాళికలో కాథోడ్ వైపు నుంచి ఆనోడ్ దిశగా రుజుమార్గంలో చలించే కిరణాలు
జ‌: కాథోడ్ కిరణాలు

 

28. పరస్పరం ఎదురెదురు దిశల్లో ప్రయాణించే కిరణాలు ఏవి?
జ‌: కాథోడ్ కిరణాలు, ఆనోడ్ కిరణాలు

 

29. హైడ్రోజన్ వాయువు నుంచి ఏర్పడిన అతి చిన్న తేలికైన ధనావేశ అయాన్‌ను ఏమంటారు?
జ‌: ప్రోటాన్

 

30. ధన ధృవ కిరణాల అతి సూక్ష్మమైన కణాన్ని ఏమంటారు?
జ‌: ప్రోటాన్

 

31. ఆనోడ్ కిరణాలు రుజుమార్గంలో చలిస్తాయి. వీటి కణాలు సంతరించుకున్న ఆవేశం
జ‌: ధనాత్మకం

 

32. పరమాణువులో ధనావేశం ఉన్న ప్రాథమిక కణం
జ‌: ప్రోటాన్

 

33. ఆనోడ్ కిరణాలు కలిగి ఉండేది
జ‌: ఆవేశం, ద్రవ్యరాశి

 

34. ప్రోటాన్ ఆవేశం
జ‌: +1.602 × 10−19 C

 

35. ప్రోటాన్‌ను కనుక్కున్న శాస్త్రవేత్త
జ‌: గోల్డ్‌స్టెయిన్

 

36. ప్రోటాన్ ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ల ద్రవ్యరాశి కంటే ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది?
జ‌: 1837

 

37. ప్రోటాన్ ద్రవ్యరాశి
జ‌: 1.672 × 10−27 kg

 

38. ఏ కణాల ప్రవాహాన్ని కేనాల్ కిరణాలుగా వ్యవహరిస్తారు?
జ‌: ప్రోటాన్‌లు

 

39. న్యూట్రాన్‌ను కనుక్కున్న శాస్త్రవేత్త
జ‌: జేమ్స్ చాడ్విక్

 

40. ద్రవ్యరాశి కలిగి విద్యుదావేశం లేని ప్రాథమిక కణం
జ‌: న్యూట్రాన్

 

41. న్యూట్రాన్ ద్రవ్యరాశి గ్రాముల్లో
జ‌: 1.674 × 10-24

 

42. న్యూట్రాన్, ప్రోటాన్ ద్రవ్యరాశులు వరుసగా amu లలో
జ‌: 1.0087, 1.0078

 

43. బెరీలియం రేకును లేదా బోరాన్ న్యూక్త్లెడ్‌ను α − కణాలతో తాడనం చేసినప్పుడు వెలువడే కణం ఏది?
జ‌: న్యూట్రాన్
44. కిందివాటిలో న్యూట్రాన్ లేని మూలకం ఏది?
A) హైడ్రోజన్          B) ఆక్సిజన్         C) నియాన్         D) ఫ్లోరిన్
జ‌: A (హైడ్రోజన్) 

 

45. న్యూటాన్‌ల సంఖ్యలో తేడా కలిగిన ఒకే మూలకానికి చెందిన పరమాణవులు
జ‌: ఐసోటోన్‌లు

 

46. న్యూట్రాన్‌కు సంబంధించి కిందివాటిలో సరికానిది
A) సంకేతం − n               B) సాపేక్ష ఆవేశం సున్నా
C) ద్రవ్యరాశి 9.109 × 10-31 kg      D) ద్రవ్యరాశి 1.0087 amu
జ‌: C (ద్రవ్యరాశి 9.109 × 10-31 kg)

47. విద్యుత్, అయస్కాంత క్షేత్రాల్లో విచలనం లేని కణం
జ‌: న్యూట్రాన్

 

48. పరమాణు కేంద్రకంలో లేని కణం
జ‌: ఎలక్ట్రాన్

 

49. పరమాణువులో ఉన్న ప్రాథమిక కణం ఏది?
A) ఎలక్ట్రాన్          B) ప్రోటాన్        C) న్యూట్రాన్       D) అన్నీ
జ‌: D (అన్నీ)

 

50. కేంద్రకంలో ఉన్న ముఖ్య మూల కణాలు
జ‌: ప్రోటాన్‌లు, న్యూట్రాన్‌లు

 

51. తటస్థ పరమాణువులో సమాన సంఖ్యలో ఉండేవి
జ‌: ఎలక్ట్రాన్‌లు, ప్రోటాన్‌లు

 

52. కేంద్రకం చుట్టూ తిరిగే కణాలు
జ‌: ఎలక్ట్రాన్‌లు

 

53. 'ఒక సిద్ధాంతాన్ని అనుసరించి పరమాణువు విభజించడానికి వీలుకాని అతి సూక్ష్మమైన కణం' అని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
జ‌: డాల్టన్

 

54. మొదటి పరమాణు నమూనాను ప్రతిపాదించింది
జ‌: జె.జె. థామ్సన్

 

55. థామ్సన్ పరమాణు నమూనాకు మరొక పేరు
A) ప్లమ్ పుడ్డింగ్         B) రైజిన్ పుడ్డింగ్     C) పుచ్చకాయ     D) అన్నీ
జ‌: D (అన్నీ)

 

56. పరమాణువు గోళాకారం (వ్యాసార్ధం సుమారు 1.0 × 10−10 m) లో ధనావేశం సమంగా పంపిణీ జరిగి, స్థిరమైన స్థిర విద్యుత్ అమరిక కోసం తగినరీతిలో గోళంలో ఎలక్ట్రాన్‌లు కూర్చబడి ఉంటాయని తెలిపిన శాస్త్రవేత్త
జ‌: థామ్సన్

 

57. పరమాణు ద్రవ్యరాశి పరమాణువు అంతటా సమంగా పంపిణీ జరిగే నమూనా
జ‌: థామ్సన్ నమూనా

 

58. పుచ్చకాయ గుజ్జులో ఉన్న గింజలతో పరమాణు నిర్మాణాన్ని పోల్చిన శాస్త్రవేత్త ఎవరు?
జ‌: థామ్సన్

 

59. కాథోడ్ కిరణాలను పల్చటి ఫిల్మ్‌ల లాంటి పదార్థాల ద్వారా పంపి కొన్ని పరిశోధనలను చేసి పరమాణువులో చాలా భాగం ఖాళీగా ఉందని నిర్ధారించిన శాస్త్రవేత్త
జ‌: లీనార్డ్

60. α − కణాలు ఏ విధంగా లభ్యమవుతాయి?
జ‌: ఎలక్ట్రాన్‌లను తొలగించిన హీలియం పరమాణువులు


61. α − కణాలు ఏ ప్రాథమిక కణాలతో నిర్మితమవుతాయి?
జ‌: రెండు ప్రోటాన్‌లు, రెండు న్యూట్రాన్‌లు

62. 'గ్రహ మండల నమూనా' అని ఏ పరమాణు నమూనాను అంటారు?
జ‌: రూథర్‌ఫర్డ్ నమూనా

 

63. మొత్తం ధనావేశం కేంద్రకంలో కేంద్రీకృతమై ఉంటుందని తెలిపిన శాస్త్రవేత్త
జ‌: రూథర్‌ఫర్డ్

 

64. రూథర్‌ఫర్డ్ పరమాణు నిర్మాణం దేనికి వ్యతిరేకం?
జ‌: విద్యుదయస్కాంత సిద్ధాంతం

 

65. మొత్తం ధనావేశం పరమాణు కేంద్రకంలో కేంద్రీకృతమై ఉంటుందని రూథర్‌ఫర్డ్ ఎందుకు భావించాడు?
జ‌: 
α  − కణాలు కేంద్రకంతో వికర్షించడం.

66. కిందివాటిలో రూథర్‌ఫర్డ్ పరమాణు నమూనా వేటిని వివరించలేకపోయింది?
A) పరమాణు స్థిరత్వం
B) హైడ్రోజన్ పరమాణువులో రేఖావర్ణ పటానికి మూలం
C) పరమాణు స్థిరత్వం, హైడ్రోజన్ పరమాణువులో రేఖావర్ణ పటానికి మూలం
D) ఏదీకాదు
జ‌: C (పరమాణు స్థిరత్వం, హైడ్రోజన్ పరమాణువులో రేఖావర్ణ పటానికి మూలం)

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎన్టీపీసీ

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌