• facebook
  • whatsapp
  • telegram

పేదరికం రకాలు

మాదిరి ప్రశ్నలు

1. ఒక దేశం ఆదాయ సమానత్వాన్ని సాధించినప్పుడు అదృశ్యమయ్యే పేదరికం ఏది?
ఎ) నిరపేక్ష పేదరికం            బి) సాపేక్ష పేదరికం
సి) పాక్షిక పేదరికం            డి) నిరపేక్ష - సాపేక్ష పేదరికం
జ: (బి)


2. 'పావర్టీ ఇన్ ఇండియా' అనే గ్రంథాన్ని ఎవరు రచించారు?
ఎ) దాదాభాయ్ నౌరోజీ     బి) మిన్హాస్     సి) దండేకర్, రథ్     డి) బర్దన్
జ: (సి)


3. మన దేశంలో పేదరికపు అంచనాలను అధికారికంగా ప్రకటించే సంస్థ ఏది?
ఎ) ప్రణాళిక సంఘం          బి) నేషనల్ శాంపిల్ సర్వే సంస్థ
సి) ప్రణాళిక మంత్రిత్వ శాఖ      డి) కేంద్ర గణాంక సంస్థ
జ: (ఎ)


4. మొత్తం జనాభాలో పేద ప్రజల శాతం తెలిపే పేదరిక లెక్కింపు కొలమానం?
ఎ) పేదరిక వ్యత్యాస సూచి        బి) సేన్ పేదరిక సూచి 
సి) బహుపార్శ్వ పేదరిక సూచి       డి) తలల లెక్కింపు పద్ధతి
జ: (డి)


5. పేదరికాన్ని అంచనా వేసే పద్ధతిని సమీక్షించడానికి 2005 డిసెంబరులో వేసిన కమిటీ ఏది?
ఎ) లక్డావాలా       బి) తెందూల్కర్      సి) రంగరాజన్     డి) అహ్లూవాలియా
జ: (బి)


6. ఎన్ఎస్ఎస్‌వో (68వ రౌండ్) ప్రకారం భారతదేశ మొత్తం జనాభాలో పేదరికంలో ఉన్న జనాభా శాతం ఎంత?
ఎ) 26.1        బి) 22.9         సి) 21.9         డి) 20.9
జ: (సి)


7. 'ట్రికిల్ డౌన్ సిద్ధాంతం' ప్రకారం ఒక దేశంలో వృధ్ధి జరుగుతున్నపుడు పేదరికం ఏ విధంగా ఉంటుంది?
ఎ) పెరుగుతుంది       బి) తగ్గుతుంది      సి) స్థిరంగా ఉంటుంది      డి) సంబంధం లేదు
జ: (బి)


8. 'గరీబీ హటావో' అనే నినాదం ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేసిన ప్రధాని ఎవరు?
ఎ) జవహర్ లాల్ నెహ్రూ             బి) లాల్‌బహదూర్ శాస్త్రి
సి) చరణ్ సింగ్               డి) ఇందిరాగాంధీ
జ: (డి)


9. పేదరిక నిర్మూలకు 20 సూత్రాల కార్యక్రమాన్ని ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశ పెట్టారు?
ఎ) 3వ ప్రణాళిక      బి) 4వ ప్రణాళిక       సి) 5వ ప్రణాళిక        డి) 6వ ప్రణాళిక
జ: (సి)


10. గ్రామీణ ప్రాంతాల్లో అవస్థాపనా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు 10వ ప్రణాళికలో ప్రారంభించిన పథకం ఏది?
ఎ) జాతీయ పనికి ఆహార పథకం             బి) సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన
సి) ఎంజీఎన్ఆర్ఈజీఎస్           డి) భారత్ నిర్మాణ్ యోజన
జ: (డి)


11. కిందివాటిలో పేదరికానికి కారణం కానిది ఏది?
ఎ) జనాభా పెరుగుదల            బి) మూలధన కొరత
సి) ఆర్థిక శక్తి వికేంద్రీకరణ           డి) ద్రవ్యోల్భణ పెరుగుదల
జ: (సి)


12. ఇటీవల ప్రవేశపెట్టిన 'జన్‌ధన్ యోజన' ఉద్దేశం ఏమిటి?
ఎ) గ్రామీణ పేదల ఉత్పాదకతను పెంచడం         బి) జనాభాను శీఘ్రంగా నియంత్రించడం
సి) గ్రామీణ ప్రజల ఆదాయాలను పెంచడం        డి) ఆర్థికంగా సమ్మిళితం
జ: (డి)


13. తెందూల్కర్ కమిటీ అంచనాల ప్రకారం భారతదేశంలో అత్యధిక శాతం పేదలున్న రాష్ట్రం ఏది?
ఎ) ఒడిశా       బి) బిహార్        సి) రాజస్థాన్        డి) ఉత్తర్‌ప్రదేశ్
జ: (ఎ)


14. భారతదేశంపై ప్రత్యేక దృష్టితో పేదరికం గురించి అధ్యయనాలను చేసినందుకు ఈ ఏటి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ఆంగస్ డీటన్ ఏ దేశానికి చెందినవారు?
ఎ) అమెరికా          బి) జపాన్       సి) ఫ్రాన్స్         డి) స్కాట్లాండ్
జ: (డి)


15. తెలంగాణ ప్రభుత్వం 'ఆసరా' పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది?
ఎ) 2014, అక్టోబరు            బి) 2014, ఆగస్టు 
15 సి) 2014, జూన్ 2            డి) 2014, నవంబరు 8
జ: (డి)


16. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'కల్యాణ లక్ష్మి' పథకం ఎవరికి ఉద్దేశించింది?
ఎ) పేద ఎస్సీ బాలికలకు            బి) పేద ఎస్టీ బాలికలకు
సి) పేద ఎస్సీ, ఎస్టీ బాలికలకు       డి) పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలికలకు
జ: (సి)

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎన్టీపీసీ

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌