మాదిరి ప్రశ్నలు
1. శిలా ద్రవం ఘనీభవించగా ఏర్పడిన శిలలు ఏవి?
జ: అగ్నిశిలలు
2. శిలాజాలు లభించని శిలలకు ఉదాహరణ ఏది?
జ: అగ్నిశిలలు
3. శిలల రూపవిక్రియ అత్యధిక వేడిమి వల్ల సంభవించినట్లయితే దాన్ని ఏమంటారు?
1) తాప్తి 2) రూపాంతర స్పర్శ 3) స్పర్శ రూపాంతర ప్రాప్తి 4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)
4. రూప విక్రియ అత్యధిక పీడనం వల్ల సంభవిస్తే జరిగే ప్రక్రియ ఏది?
జ: గతిశీల రూపాంతర ప్రాప్తి
5. సంస్తరాల మీద తరగ గుర్తులు, పాదముద్రలు కనిపించే శిలలు ఏవి?
జ: అవక్షేప శిలలు
6. సున్నపురాయి రూపవిక్రియ తర్వాత పొందే రూపం?
జ: పాలరాయి