• facebook
  • whatsapp
  • telegram

కాలం - దూరం

ముఖ్యాంశాలు


వేగం = 

లేదా దూరం = వేగం x కాలం

లేదా కాలం = 

ఒక వాహనం రెండు సమాన దూరాలను v1, v2 వేగాలతో ప్రయాణించిన ఆ వాహన సగటు వేగం = 

ఒక వాహనం తన ప్రయాణ దూరంలో సగం దూరాన్ని  vవేగంతోనూ, మిగిలిన సగం దూరాన్ని v2 వేగంతోనూ ప్రయాణిస్తే ఆ వాహన సగటు వేగం = 


1. ఒక రైలు సాధారణ వేగంతో స్టేషన్‌ A నుంచి Bని 45 నిమిషాల్లో చేరుకోగలదు. అలా కాకుండా దాని వేగాన్ని 5 కి.మీ./గం. తగ్గిస్తే ఆ దూరాన్ని 48 నిమిషాల్లో ప్రయాణిస్తుంది. అయితే A,B స్టేషన్ల మధ్య దూరమెంత?

1) 20 కి.మీ.   2) 30 కి.మీ.     3) 50 కి.మీ.   4) 60 కి.మీ.

సాధన: A,Bల మధ్య దూరం = X కి.మీ. అనుకోండి.

రైలు సాధారణ వేగం = 

​​​​​​​

లెక్క ప్రకారం, రైలు వేగాన్ని తగ్గించిన తరువాత, A నుంచి Bకి ప్రయాణించడానికి పట్టిన కాలం = 48 నిమిషాలు.

లేదా

రైలు వేగం = V కి.మీ./గంట. అనుకోండి.

సమాధానం: 4




2. ఒక రైలు సాధారణ వేగంతో 10 కి.మీ. దూరాన్ని 12 నిమిషాల్లో ప్రయాణించగలదు. దాని వేగాన్ని 5 కి.మీ./గం. తగ్గిస్తే  ఆ దూరాన్ని ప్రయాణించడానికి పట్టే కాలమెంత?

1) 12 ని.30 సె.    2) 13 ని.20 సె.

3) 13 ని.45 సె.    4) 13 ని.15 సె.

సాధన: రైలు సాధారణ వేగం = 

​​​​​​​

సమాధానం: 2



 

3. ఒక రైలు స్టేషన్‌ A నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి స్టేషన్‌ Bని అదేరోజు సాయంత్రం 4:30 ని.లకు చేరింది. రైలు సాధారణ వేగం 40 కి.మీ./గంట. అయితే A,B స్టేషన్ల మధ్య దూరమెంత?

1) 420 కి.మీ.     2) 360 కి.మీ.   3) 320 కి.మీ.    4) 280 కి.మీ.

సాధన: రైలు వేగం = 40 కి.మీ./గంట.

రైలు స్టేషన్‌ A నుంచి స్టేషన్‌ Bకి చేరడానికి పట్టిన కాలం

= సాయంత్రం 4 : 30  ఉదయం 6 : 00

= 16 : 30  6 : 00 = 10 : 30 గంట.

= 20 X 21 = 420 కి.మీ.     

సమాధానం: 1




4. 72 కి.మీ./గంట. వేగంతో ప్రయాణించే ఒక బస్సు 10 సెకన్లలో ఎంత దూరం ప్రయాణిస్తుంది?

1) 160 మీ.        2) 240 మీ.       3) 180 మీ.       4) 200 మీ.

సాధన: బస్సు వేగం = 72 కి.మీ./గంట. 

​​​​​​​

10 సెకన్లల్లో బస్సు ప్రయాణించే దూరం = వేగం X కాలం

= 20 X 10 = 200 మీ.

సమాధానం: 4 




5. రాకేష్‌ 4 కి.మీ./గంట. వేగంతో కొంత నిర్దిష్ట దూరాన్ని  3గం.45ని.ల్లో నడిచాడు. అయితే అతడు అదే దూరాన్ని 18 కి.మీ./గంట. వేగంతో సైకిల్‌పై ప్రయాణిస్తే ఎంత సమయం పడుతుంది?

1) 45 ని.    2) 50 ని.    3) 48 ని.    4) 52 ని.

సాధన: నడక వేగం = 4 కి.మీ./గంట., 

నడిచిన కాలం = 3 గంట.45 ని ⇒

నడిచిన దూరం = 4  = 15 కి.మీ.

సైకిల్‌పై అదే దూరాన్ని ప్రయాణించడానికి పట్టే కాలం = 

​​​​​​​

సమాధానం: 2




6. 100 మీ. పరుగు పందెంలో నరేంద్ర, శ్రీధర్‌ని 5సెకన్ల తేడాతో ఓడించాడు. నరేంద్ర వేగం 18 కి.మీ./గంట. అయితే శ్రీధర్‌  వేగమెంత?(కి.మీ./గంటల్లో)

1) 12.4     2) 13.4      3) 14.4      4) 15.4

సాధన: పరుగు పందెంలో నరేంద్ర తీసుకున్న సమయం

   

సమాధానం: 3 

Posted Date : 08-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌