1. రెండు రకాల కాఫీ పొడుల ధరలు వరుసగా కేజీ రూ.3000, రూ.2500. వీటిని ఏ నిష్పత్తిలో కలిపితే ఫలిత మిశ్రమం విలువ కేజీ రూ.2700 అవుతుంది?
1) 1 : 2 2) 1 : 3 3) 2 : 3 4) 3 : 2
సమాధానం: 3
2. ఒక కార్యాలయంలోని ఉద్యోగుల సగటు వేతనం రూ.50,000. అందులో అధికారుల సగటు జీతం రూ.1,40,000, మిగిలిన ఉద్యోగుల సగటు వేతనం రూ.40,000. ఆ ఆఫీసులోని మొత్తం ఉద్యోగుల సంఖ్య 750. అయితే ఉద్యోగుల్లో ఎంతమంది అధికారులు ఉన్నారు?
1) 50 2) 75 3) 160 4) 80
సాధన:

కార్యాలయంలో అధికారులు, మిగిలిన ఉద్యోగుల నిష్పత్తి = 10,000 : 90,000 = 1 : 9
అధికారుల సంఖ్య =
= 75 మంది
సమాధానం: 2
3. ఒక పాఠశాలలో 280 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో బాలుర సగటు వయసు 13 ఏళ్లు. బాలికల సగటు వయసు 11 సంవత్సరాలు. మొత్తం విద్యార్థుల సగటు వయసు 11 1/2 ఏళ్లు.
అయితే ఆ పాఠశాలలో మొత్తం ఎంతమంది బాలికలు ఉన్నారు?
1) 210 2) 180 3) 175 4) 200
సాధన:
= 1: 3
పాఠశాలలోని బాలికల సంఖ్య

సమాధానం: 1
4. ఒక తరగతిలో బాలుర సగటు బరువు 69.3 కేజీలు. బాలికల సగటు బరువు 59.4 కేజీలు. మొత్తం విద్యార్థుల సగటు బరువు 63.8 కేజీలు. అయితే ఆ తరగతిలోని బాలుర శాతం?
1) 40% 2)


సాధన:
బాలబాలికల నిష్పత్తి = 4.4 : 5.5
= 4.4 : 5.5
= 4 : 5
5. ఒక వసతిగృహంలో 230 మంది బాలురు, కొంతమంది బాలికలు ఉన్నారు. ప్రతి విద్యార్థికి సగటున నెలకు 8.1 కేజీల బియ్యం అవసరం. బాలురు సగటున 10.25 కేజీలు, బాలికలు సగటున 4.5 కేజీలు ఆహారంగా తీసుకుంటారు. అయితే ఆ వసతిగృహంలో ఉన్న బాలికలు ఎంతమంది?
1) 144 2) 128 3) 72 4) 86
సాధన:
బాలురు, బాలికల నిష్పత్తి = 3.6 : 2.15
= 360 : 215 ⇒ 72 : 43
వసతిగృహంలో ఉన్న బాలికల సంఖ్య

సమాధానం: 4
6. ఒక వ్యాపారి 80 డజన్ల నారింజ పండ్లను విక్రయించాడు. అతడు కొన్ని పండ్లను 4% నష్టానికి మిగిలిన వాటిని కొన్న ధరకే అమ్మాడు. మొత్తం మీద అతడికి 3% నష్టం వచ్చింది అయితే నష్టానికి అమ్మిన నారింజ పండ్లు ఎన్ని? (డజన్లలో)
1) 30 2) 25 3) 45 4) 60
సాధన:

నష్టానికి అమ్మిన నారింజ పండ్లకు, కొన్న ధరకి అమ్మిన నారింజ పండ్ల సంఖ్యకు ఉన్న నిష్పత్తి = 3 : 1
నష్టానికి అమ్మిన నారింజ పండ్ల సంఖ్య

= 60 డజన్లు
సమాధానం: 4
7. ఒక తరగతిలో 60 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి ఒక పరీక్షలో వచ్చిన సగటు మార్కులు 63. బాలురు, బాలికల సగటు మార్కులు వరుసగా 65, 62. అయితే ఆ తరగతిలోని బాలురు ఎంతమంది?
1) 30 2) 25 3) 24 4) 20
సాధన:
బాలురు, బాలికల నిష్పత్తి = 1 : 2
సమాధానం: 4