Q.

కళ్యాణి చాళుక్య రాజ్యస్థాపకుడు ఎవరు?    

 • తైలపుడు
 • సత్యాశ్రయుడు
 • జయ సింహుడు
 • సోమేశ్వరుడు
Answer: తైలపుడు


Remaining Questions

Q.

‘రాక్షసగుళ్లు’ నిర్మాణం ఏ ప్రాంతంలో కనిపిస్తుంది?

 • దక్షిణ భారత్‌
 • ఈశాన్య భారత్‌
 • కశ్మీర్‌ ప్రాంతం
 • పైవన్నీ
Answer: పైవన్నీ

Q.

‘మనసులోని భావ పరంపరను ఏ పదాలు, ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో ఆ పదాలే, ఆ వాక్యాలే భాష’ అన్నదెవరు?

 • రామచంద్ర వర్మ
 • రామచంద్ర శుక్ల
 • చామ్‌స్కీ
 • స్టర్ట్‌వర్ట్‌
Answer: రామచంద్ర వర్మ

Q.

కిందివాటిలో ‘బరువును కోల్పోయే పరిశ్రమ’ అని దేనిని పిలుస్తారు?

 • పట్టు
 • ఉన్ని
 • నూలు
 • పంచదార
Answer: పంచదార

Q.

6 గం. 20 ని. లకు ప్రతిబింబ సమయం ఎంత?

 • 4 గం. 40 ని.
 • 5 గం. 40 ని.
 • 5 గం. 20 ని.
 • 6 గం. 40 ని.
Answer: 5 గం. 40 ని.

Q.

కిందివాటిలో సింధూ నాగరికత సరిహద్దులకు సంబంధించి సరికానిది? 

ఎ) ఈ నాగరికత దక్షిణ సరిహద్దు - గుజరాత్‌లోని భగట్రావ్‌ 

బి) ఈ నాగరికత ఉత్తర సరిహద్దు - పంజాబ్‌లోని రూపర్‌ 

సి) ఈ నాగరికత పశ్చిమ సరిహద్దు - సుట్కాజందూర్‌ 

డి) ఈ నాగరికత తూర్పు సరిహద్దు - ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌

 • ఎ, బి
 • బి, డి
 • డి
Answer: డి

Q.

కొఠారీ కమిషన్‌కు సంబంధించి కిందివాటిలో సరైంది-

 • ఒక కిలోమీటరు దూరంలో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలి.
 • విద్య అనేది వ్యక్తి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలి.
 • బాలికల విద్యను ప్రోత్సహించాలి.
 • పైవన్నీ
Answer: పైవన్నీ

Q.

ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ అండ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ (IUCN) భారతదేశంలో అంతరించిపోయే వృక్షాల జాబితాలో చేర్చిన వృక్షం?

 • ఎర్రచందనం
 • మంచి గంధం
 • జిట్టెగ
 • టెక్సాస్‌
Answer: ఎర్రచందనం

Q.

కిందివాటిని సరైన క్రమంలో అమర్చండి.
 

A) హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం 1) పాలను పెరుగుగా మారుస్తుంది
B) మ్యూకస్‌ 2) కొవ్వులపై పనిచేస్తుంది
C) పెప్సిన్‌ 3) జీర్ణాశయానికి రక్షణనిస్తుంది
D) లైపేజ్‌ 4) ప్రొటీన్లపై పనిచేస్తుంది
E) రెనిన్‌ 5) సూక్ష్మజీవులను సంహరిస్తుంది

 

 • A-1, B-3, C-2, D-4, E-5
 • A-5, B-3, C-4, D-2, E-1
 • A-4, B-3, C-5, D-2, E-1
 • A-4, B-2, C-1, D-5, E-3
Answer: A-5, B-3, C-4, D-2, E-1

Q.

ఇనుము తుప్పు పట్టినప్పుడు భారం ఏమవుతుంది?

 • పెరుగుతుంది
 • తగ్గుతుంది
 • మారదు
 • స్థిరం
Answer: పెరుగుతుంది

Q.

యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

 • రాంచి
 • జాదుగూడ
 • కోల్‌కతా
 • చెన్నై
Answer: జాదుగూడ

Q.

బల్వంత్‌రాయ్‌ మెహతా కమిటీని ఎందుకు నియమించారు?

 • మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను సూచించడానికి
 • రెండంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను సూచించడానికి
 • CDP, NESS కార్యక్రమాల పనితీరును పరిశీలించడానికి
 • ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేయడానికి
Answer: CDP, NESS కార్యక్రమాల పనితీరును పరిశీలించడానికి

Q.

వేరు వ్యవస్థలోని ఏ భాగాలు నీరు, ఖనిజ లవణాలను శోషించే పాత్ర పోషిస్తాయి?

 • ప్రధాన వేరు
 • పార్శ్వ వేర్లు
 • మూలకేశాలు
 • పైవన్నీ
Answer: మూలకేశాలు

Q.

కిందివాటిలో ‘డ్రాగ్‌’ అని ఏ ఘర్షణను పిలుస్తారు?

 • ప్రవాహి ఘర్షణ
 • స్థైతిక ఘర్షణ
 • దొర్లుడు ఘర్షణ
 • జారుడు ఘర్షణ
Answer: ప్రవాహి ఘర్షణ

Q.

ధ్వనిని స్పష్టంగా వినాలంటే పరావర్తన తలం నుంచి పరిశీలకుడి మధ్య ఉండాల్సిన కనీస దూరం?

 • 26 మీ.
 • 17 మీ.
 • 19 మీ.
 • 20 మీ.
Answer: 17 మీ.

Q.

భారత అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించిన కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.

ఎ) భారతదేశ మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట.

బి) ఆర్యభట్ట ఉపగ్రహాన్ని అంతరిక్ష ప్రయోగాల కోసం తయారుచేశారు. 

సి) భారతదేశ రెండో ఉపగ్రహం భాస్కర-1.

డి) ఆర్యభట్ట ఉపగ్రహాన్ని 1975, ఏప్రిల్‌ 19న రష్యా వాహక నౌక సహాయంతో కక్ష్యలో ప్రవేశపెట్టారు.

ఇ) భాస్కర-1 ఉపగ్రహాన్ని భూవనరులు, వాతావరణ పరిశోధనల కోసం నిర్మించారు.

 • ఎ, బి, సి, డి, ఇ
 • బి, సి, డి
 • సి, డి, ఇ
 • బి, సి, ఇ
Answer: ఎ, బి, సి, డి, ఇ

Q.

చోళుల కాలం నాటి భూదానాలను జత చేయండి.

1) దేవదాన ఎ) దేవాలయ నిర్వహణ భూమి
2) శాలభోగ బి) జైన మతస్థుల భూమి
3) వెల్లన్‌వాగై సి) బ్రాహ్మణేతరుల భూమి
4) పల్లించ్చందం డి) పాఠశాల నిర్వహణ భూమి

 

 • 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
 • 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
 • 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
 • 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
Answer: 1-ఎ, 2-డి, 3-సి, 4-బి

Q.

భారతదేశంలో 25వ హైకోర్టు ఏది?

 • తెలంగాణ
 • మేఘాలయ
 • మణిపుర్‌
 • ఆంధ్రప్రదేశ్‌
Answer: ఆంధ్రప్రదేశ్‌

Q.

ఉష్ణమండల సతతహరిత అడవుల్లో వృక్షాలు  దాదాపుగా ఎంత ఎత్తు వరకు పెరుగుతాయి?

 • 60 మీటర్లకు పైగా
 • 40 మీటర్లు
 • 50 మీటర్లు
 • 55 మీటర్లు
Answer: 60 మీటర్లకు పైగా

Q.

సింధు నాగరికత కాలంలో అమ్మతల్లి బొమ్మలు దేనితో చేశారు?

 • నల్లరాయి
 • కంచు, రాగి
 • కాల్చిన బంకమట్టి
 • తెల్లటి సున్నపురాయి
Answer: కాల్చిన బంకమట్టి

Q.

కిందివాటిలో పరశ్రవ్య ధ్వనిని గుర్తించండి.
 

 • 18 Hz
 • 180 Hz
 • 25 Hz
 • 39 Hz
Answer: 18 Hz

Q.

2019, మార్చి 6న ఏర్పాటు చేసిన న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ గురించి కిందివాటిలో సరికాని వాక్యం ఏది?

ఎ) ఇది డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ నియంత్రణలో ఉంటుంది.

బి) అంతరిక్ష కార్యకలాపాలకు సంబంధించిన కన్సల్టెన్సీ సర్వీసులను నియంత్రిస్తుంది.

సి) ఉపగ్రహాల లాంచింగ్‌ సేవలు, ట్రాన్స్‌పాండర్‌ల లీజు, రిమోట్‌ సెన్సింగ్‌ సేవలు లాంటివి నిర్వహిస్తుంది.

డి) ఇది ఉపగ్రహాలను తయారుచేసి ప్రయోగిస్తుంది.

ఇ) వాహక నౌకల తయారీని పరీక్షిస్తుంది.
 

 • ఎ, బి
 • సి, డి
 • ఎ, ఇ
 • డి, ఇ
Answer: డి, ఇ

Q.

తొలివేద ఆర్యుల ముఖ్యవృత్తి?
 

 • వ్యవసాయం
 • పశుపోషణ
 • వర్తక వ్యాపారం
 • 2, 3
Answer: పశుపోషణ

Q.

తుర్రేబాజ్‌ ఖాన్‌ ఏ ప్రాంతంలో సిపాయిలకు నాయకత్వం వహించాడు?
 

 • హైదరాబాద్‌
 • ఢిల్లీ
 • కడప
 • బరేలి
Answer: హైదరాబాద్‌

Q.

కింది ఏ దేశాన్ని ‘బంగారు ఉన్ని దేశం’ అంటారు?
 

 • ఇండొనేసియా
 • భారతదేశం
 • ఆస్ట్రేలియా
 • అమెరికా
Answer: ఆస్ట్రేలియా

Q.

‘యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజ భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతీ పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష’ అని చెప్పిందెవరు?
 

 • స్టర్ట్‌వర్ట్‌
 • ఎఫ్‌.డి.సాసర్‌
 • హెగెల్‌
 • ఇజ్లర్‌
Answer: స్టర్ట్‌వర్ట్‌

Q.

1968 జాతీయ విద్యా విధానానికి ఆధారం ఏది?
 

 • ప్రభుత్వ ప్రణాళిక
 • సెకండరీ విద్యా కమిషన్‌
 • కొఠారీ కమిషన్‌
 • ఈశ్వరీభాయ్‌ పటేల్‌ కమిషన్‌
Answer: కొఠారీ కమిషన్‌

Q.

కిందివాటిలో దంతాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి.

A) దంతాలపై ఉండే ఎనామిల్‌ వాటి రక్షణకు తోడ్పడుతుంది.

B) మన శరీరంలో అత్యంత గట్టి పదార్థం ఎనామిల్‌.

C) 17 - 25 సంవత్సరాల మధ్య వచ్చే దంతాలను జ్ఞానదంతాలు అంటారు.

D) పయోరియా, జింజివైటిస్‌ అనేవి దంత వ్యాధులు.
 

 • A, B
 • B, C, D
 • C, D
 • A, B, C, D
Answer: A, B, C, D

Q.

 పాకిస్థాన్‌లోని పశ్చిమ పంజాబ్‌ ప్రాంతంలో హరప్పా నాగరికతను కనుక్కున్న సంవత్సరం?

 • 1921
 • 1922
 • 1923
 • 1924
Answer: 1921

Q.

క్రికెట్‌ బ్యాట్‌ల తయారీకి వాడే కలప పేరు? 
 

 • విల్లోస్‌
 • దేవదారు
 • సిల్వర్‌ఫర్‌
 • స్ప్రూస్‌
Answer: విల్లోస్‌

Q.

ఒక వ్యక్తి సాయంత్రం 6 గంటలకు భోజనానికి వెళుతూ గడియారాన్ని గమనించి ముల్లుల మధ్యకోణం 110° ఉన్నట్లుగా చూశాడు. తిరిగి సాయంత్రం 7 గంటల సమయంలో వచ్చి చూస్తే రెండు ముల్లుల మధ్య కోణం మళ్లీ 110° గా ఉంది. అయితే అతడు భోజనానికి వెళ్లి వచ్చిన కాలం ఎంత?
 

 • 60 ని.
 • 40 ని.
 • 50 ని.
 • 45 ని.
Answer: 40 ని.

Q.

అశోక్‌ మెహతా కమిటీని ఎప్పుడు నియమించారు? 
 

 • 1957
 • 1978
 • 1977
 • 1967
Answer: 1977

Q.

మద్యం తాగిన వ్యక్తిని పరీక్షించే నిర్ధారణ పరికరంలో ఉపయోగించే పదార్థం?

 • రాక్‌సాల్ట్‌
 • మైలుతుత్తం
 • పొటాషియం డైక్రోమేట్‌
 • పొటాషియం అయోడైడ్‌
Answer: పొటాషియం డైక్రోమేట్‌

Q.

‘ఆన్‌ ది కాజెస్‌ ఆఫ్‌ ప్లాంట్స్‌’ గ్రంథకర్త?

 • అరిస్టాటిల్‌
 • ప్లేటో
 • థియోఫ్రాస్టస్‌
 • లిన్నేయస్‌
Answer: థియోఫ్రాస్టస్‌

Q.

వాహనాల వెనుక భాగంలో అధిక సంఖ్యలో టైర్లను ఏర్పాటు చేయడానికి కారణమేంటి?

 • వైశాల్యం తగ్గించి, పీడనం పెంచడం
 • వైశాల్యం పెంచి, పీడనం తగ్గించడం
 • వైశాల్యం, పీడనం రెండూ తగ్గించడం
 • వైశాల్యం, పీడనం రెండూ పెంచడం
Answer: వైశాల్యం పెంచి, పీడనం తగ్గించడం

Q.

    కిందివాటిలో అతిధ్వనుల ఉపయోగం కానిది?
 

 • పాల నుంచి కొవ్వును వేరుచేయడం.
 • పాత్రల్లోని పగుళ్లను గుర్తించడం.
 • దృఢమైన లోహాలకు రంధ్రాలు చేయడం.
 • పైవన్నీ
Answer: పైవన్నీ

Q.

కింది వాక్యాలను పరిశీలించి, సరైనవి గుర్తించండి.  

ఎ) జియోస్టేషనరీ ఉపగ్రహ కక్ష్య ఎత్తు 35,786 కి.మీ.

బి) సమాచార ఉపగ్రహాలను జియోస్టేషనరీ కక్ష్యలో ప్రవేశపెడతారు.

సి) సమాచార ఉపగ్రహాల్లో ఉన్న ట్రాన్స్‌పాండర్‌లు సమాచార చేరవేతకు ఉపయోగపడుతాయి.

డి) ట్రాన్స్‌పాండర్‌లు ఉపగ్రహానికి, యాంటిన్నాలకు మధ్య సంధానకర్తగా పనిచేస్తాయి.
 

 • ఎ, బి
 • బి, సి, డి
 • ఎ, బి, సి, డి
 • సి, డి
Answer: ఎ, బి, సి, డి

Q.

చోళుల కాలం నాటి గ్రామ కమిటీ సభ్యుడు (కుదువోలై)కి ఉండాల్సిన అర్హతలు

ఎ) 35 - 70 ఏళ్ల మధ్యలో ఉండాలి   బి) సొంత భూమి ఉండాలి

సి) సొంత ఇల్లు ఉండాలి   డి) వేదాలు, ధర్మ శాస్త్రాలు తెలిసి ఉండాలి

 • ఎ, బి, సి
 • ఎ, బి, సి, డి
 • బి, సి, డి
 • ఎ, సి, డి
Answer: ఎ, బి, సి, డి

Q.

భారతదేశంలో కలకత్తా, బాంబే, మద్రాసు   హైకోర్టులు ఎప్పుడు ఏర్పాడ్డాయి? 

 • 1861
 • 1862
 • 1726
 • 1793
Answer: 1862

Q.

కిందివారిలో ఎవరు సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నారు?

 • రైతులు
 • జమీందార్లు
 • రాజులు
 • పైవారంతా
Answer: పైవారంతా

Q.

భారతదేశంలో సుమారు ఎన్ని రకాల జంతు జాతులు ఉన్నాయి?
 

 • 15,000
 • 25,000
 • 80,000
 • 90,000
Answer: 90,000

Q.

హరప్పా ప్రజల ప్రధాన దైవం?
 

 • పశుపతి
 • అమ్మతల్లి
 • విష్ణువు
 • రుద్రుడు
Answer: అమ్మతల్లి

Q.

కిందివారిలో ఎవరిని దాసదస్యులుగా పిలిచారు?
 

 • సింధు ప్రజలు
 • ఆర్యులు
 • ఆంధ్రులు
 • ఎవరూకాదు
Answer: సింధు ప్రజలు

Q.

కిందివాటిలో తప్పుగా ఉన్నవాటిని గుర్తించండి.

A) శాకాహార జంతువుల్లో నాలుగు జతల లాలాజల గ్రంథులుంటాయి.

B) మానవుడిలో అతిపెద్ద లాలాజల గ్రంథి పెరోటిడ్‌ గ్రంథి.

C) ఆహార వాహికలో ఆహారం పెరిస్టాలిటిక్‌ చలనాలను చూపుతుంది

D) లాలాజలం జీర్ణక్రియలో ఎలాంటి పాత్ర వహించదు.
 

 • A మాత్రమే
 • B, C
 • D మాత్రమే
 • C మాత్రమే
Answer: D మాత్రమే

Q.

48 గంటల్లో రెండు ముల్లులు ఎన్ని సార్లు లంబంగా ఉంటాయి?
 

 • 22
 • 44
 • 66
 • 88
Answer: 88

Q.

కిందివాటిలో 'City of Weaver'  అని  దేన్ని పిలుస్తారు?
 

 • అమృత్‌సర్‌
 • పానిపట్‌
 • కాన్పూర్‌
 • పట్నా
Answer: పానిపట్‌

Q.

కిందివాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి.

ఎ) 9000 ఏళ్ల కిందట బెలూచిస్థాన్‌ వద్ద వ్యవసాయం చేశారు.

బి) 5000 ఏళ్ల కిందట దక్షిణ భారతదేశంలో జంతు పోషణ జరిగింది.

సి) 6000 ఏళ్ల కిందట కశ్మీర్‌ వద్ద వ్యవసాయం చేశారు.

డి) 5000/4000 ఏళ్ల కిందట బిహార్‌ వద్ద వ్యవసాయం చేశారు.
 

 • డి
 • సి
 • బి, సి
Answer: సి

Q.

‘విద్యా దశల్లో సాధారణ విద్య అంతర్భాగంగా పని అనుభవాన్ని ప్రవేశపెట్టాలి’ అని పేర్కొన్న విద్యా కమిషన్‌?
 

 • సెకండరీ విద్యా కమిషన్‌
 • కొఠారీ కమిషన్‌
 • రామ్మూర్తి కమిషన్‌
 • జనార్ధన్‌రెడ్డి కమిషన్‌
Answer: కొఠారీ కమిషన్‌

Q.

సిగరెట్‌ పెట్టెల తయారీకి వాడే కలప పేరు? 

 • సెమూల్‌
 • హల్థా
 • సెడార్‌
 • చెస్ట్‌నట్స్‌
Answer: హల్థా

Q.

‘ప్రకృతి ప్రత్యాయ పద నిరూపణమే భాష’ అన్నది ఎవరు?
 

 • మాఘడు
 • నిఘంటుకారులు
 • వ్యాకరణకారులు
 • ఎరిక్‌ మాడ్సన్‌
Answer: వ్యాకరణకారులు

Q.

కిందివాటిలో దేన్ని అధికంగా పీలిస్తే ‘ఫాసీజా’ అనే వ్యాధి వస్తుంది?
 

 • క్లోరిన్‌
 • నైట్రోజన్‌
 • హైడ్రోజన్‌
 • ఫాస్ఫరస్‌
Answer: ఫాస్ఫరస్‌

Q.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు అంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను ఎప్పుడు అమలు చేశారు? 

 • 1958, అక్టోబరు 2
 • 1959, అక్టోబరు 2
 • 1956, నవంబరు 1
 • 1959, ఆగస్టు 15
Answer: 1959, అక్టోబరు 2

Q.

విత్తనం అంకురించినప్పుడు గురుత్వానువర్తనానికి అనుకూలంగా పెరిగే మొక్కలోని ఏకైక భాగం?
 

 • వేరు
 • కాండం
 • ప్రకాండం
 • కణుపు
Answer: వేరు

Q.

గుడ్డు మెత్తటి పరుపుపై పగలదు. గచ్చునేలపై కొంత ఎత్తు నుంచి వదిలితే పగులుతుంది కారణం?
 

 • కాలం తగ్గి, బలం పెరుగుతుంది
 • కాలం పెరిగి, బలం తగ్గుతుంది
 • కాలం, బలం తగ్గుతాయి
 • కాలం, బలం పెరుగుతాయి
Answer: కాలం పెరిగి, బలం తగ్గుతుంది

Q.

    సైనికులు కవాతు చేస్తున్నప్పుడు వంతెన రాగానే ఆపుతారు. దీనికి ప్రధాన కారణం?

 • ధ్వని పరావర్తనం
 • ధ్వని వివర్తనం
 • అనునాదం
 • ధ్వని వక్రీభవనం
Answer: అనునాదం

Q.

భూ దిగువ ఉపగ్రహ కక్ష్య (లోఎర్త్‌ ఆర్బిట్‌) గురించి కిందివాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.

ఎ) ఈ కక్ష్య ఎత్తు భూమి నుంచి 200-2000 కి.మీ.

బి) హబుల్‌ టెలిస్కోపు 560 కి.మీ. భూదిగువ  ఉపగ్రహకక్ష్యలో ఉంది.

సి) భూపరిశీలన ఉపగ్రహాలు, రిమోట్‌ సెన్సింగ్‌  ఉపగ్రహాలు ఈ కక్ష్యలో ఉంటాయి.

 • ఎ, బి, సి
 • బి, సి
 • ఎ, సి
 • బి మాత్రమే
Answer: ఎ, బి, సి

Q.

చోళుల కాలంనాటి పరిపాలన గురించి తెలిపే శాసనం?
 

 • తంజావూరు శాసనం
 • ఉత్తర మేరూర్‌ శాసనం
 • గంగైకొండ చోళపుర శాసనం
 • పైవన్నీ
Answer: ఉత్తర మేరూర్‌ శాసనం

Q.

ఢిల్లీ హైకోర్టు ఏర్పడిన సంవత్సరం?
 

 • 1861
 • 1862
 • 1966
 • 1950
Answer: 1966

Q.

కాన్పుర్‌లో సిపాయిల తిరుగుబాటు నాయకుడు?
 

 • తాంతియా తోపే
 • నానాసాహెబ్‌
 • మౌల్వీ అహ్మదుల్లా
 • కున్వర్‌ సింగ్‌
Answer: నానాసాహెబ్‌

Q.

భారతదేశంలో దాదాపుగా ఎన్ని రకాల పుష్పించే మొక్కలు ఉన్నాయి?
 

 • 10,000
 • 15,000
 • 20,000
 • 25,000
Answer: 15,000

Q.

కింది ఏ మొక్కను అర్యులు ప్రధాన దైవంగా భావించారు?
 

 • సోమ
 • రావి
 • తులసి
 • ఏదీకాదు
Answer: సోమ

Q.

'National Institute of Fashion Technology' ఏ నగరంలో ఉంది?

 • ముంబయి
 • చెన్నై
 • హైదరాబాదు
 • ఢిల్లీ
Answer: హైదరాబాదు

Q.

షోలా అడవులు భారత్‌లో ఎక్కడ ఉన్నాయి?

 • హిమాలయాల్లో 1800 మీ. - 3300 మీ. ఎత్తులో
 • మధ్యప్రదేశ్‌లో హోషంగాబాద్‌ జిల్లాలో
 • పంజాబ్‌ హిమాలయాలు
 • నీలగిరి, అన్నామలై కొండల్లో 1200 మీ., అంతకంటే ఎక్కువ ఎత్తులో
Answer: నీలగిరి, అన్నామలై కొండల్లో 1200 మీ., అంతకంటే ఎక్కువ ఎత్తులో

Q.

ఆర్యుల అభిమాన వినోదం?
 

 • నృత్యం
 • సంగీతం
 • జూదం
 • రథాల పందేలు
Answer: రథాల పందేలు

Q.

ఒక రోజులో రెండు ముల్లులు ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి?
 

 • 11
 • 22
 • 44
 • 24
Answer: 22

Q.

కిందివాటిని జతపరచండి. 

1) మహారాష్ట్ర  ఎ) నవస 
2) మధ్యప్రదేశ్‌ బి) నంద్రా 
3) ఆంధ్రప్రదేశ్‌ సి) బేతంచర్ల 
4) తమిళనాడు  డి) గుడియం 
   ఇ) రామ్‌గఢ్‌

  

    

    

 

                           
 

 • 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
 • 1-బి, 2-సి, 3-ఇ, 4-ఎ
 • 1-ఎ, 2-బి, 3-ఇ, 4-డి
 • 1-ఎ, 2-ఇ, 3-సి, 4-డి
Answer: 1-ఎ, 2-బి, 3-సి, 4-డి

Q.

‘భాష అనేది ఒక రథం లాంటిది. రథం అందరినీ మోయాలి’ అని పేర్కొన్నదెవరు? 

 • ప్రొఫెసర్‌ విట్నీ
 • జాన్‌ స్టువర్ట్‌ మిల్‌
 • రామ్‌ మనోహర్‌ లోహియా
 • ఎరిక్‌ మాడ్సన్‌
Answer: రామ్‌ మనోహర్‌ లోహియా

Q.

ఏ కమిటీ సూచనల మేరకు 1953 నుంచి అధ్యాపకుల వేతనాలు మెరుగయ్యాయి?
 

 • మొదలియార్‌ కమిషన్‌
 • రాధాకృష్ణన్‌ కమిషన్‌
 • సార్జెంట్‌ కమిషన్‌
 • సాడ్లర్‌ కమిషన్‌
Answer: రాధాకృష్ణన్‌ కమిషన్‌

Q.

కిందివాటిలో నోటిలో జరిగే జీర్ణక్రియకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. 

A) దంతాల వల్ల ఆహారం జీర్ణమవుతుంది.

B) లాలాజలంలో ఉండే ఎంజైమ్‌ టయలిన్‌.

C) టయలిన్‌ పిండిపదార్థాలను మాల్టోజ్‌ చక్కెరగా మారుస్తుంది.

D) నోటిలో పిండిపదార్థాలు మాత్రమే జీర్ణమవుతాయి.

E) నాలుకపైనున్న రుచి మొగ్గల వల్ల ఆహారం రసాయనికంగా మార్పు చెందుతుంది.
 

 • B, C, D, E
 • A, B, C, D
 • B, C, D
 • A, C, D, E
Answer: B, C, D

Q.

‘యవ’ అంటే ఏమిటి?

 • బార్లీ
 • బియ్యం
 • పప్పుధాన్యాలు
 • గోధుమ
Answer: బార్లీ

Q.

తాజ్‌మహల్‌ రంగు మారడంలో క్రియాశీలమైన వాయువు?

1) CO2    2) N2O

3) SO2    4) NH3
 

 • 1
 • 2
 • 3
 • 4
Answer: 3

Q.

భారతదేశంలో అధికంగా విస్తరించి ఉన్న అడవులు ఏవి?

 • సతతహరిత అడవులు
 • ఆకురాల్చు అడవులు
 • ముళ్లపొద అడవులు
 • మడ అడవులు
Answer: ఆకురాల్చు అడవులు

Q.

మీరట్‌ తరువాత సిపాయిల తిరుగుబాటు ఏ ప్రాంతానికి విస్తరించింది?

 • ఢిల్లీ
 • లక్నో
 • ఝాన్సీ
 • కాన్పూర్‌
Answer: ఢిల్లీ

Q.

భారతదేశంలో ఉష్ణమండల ఆర్ధ్రతతో కూడిన సతతహరిత అడవులు ఏ ప్రాంతంలో ఉన్నాయి?

 • పశ్చిమ హిమాలయాలు
 • పశ్చిమ కనుమల తూర్పు ప్రాంతం
 • పశ్చిమ కనుమల పశ్చిమ ప్రాంతం
 • తూర్పు హిమాలయాలు
Answer: పశ్చిమ కనుమల పశ్చిమ ప్రాంతం

Q.

మూడు అంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను అమలుచేసిన తొలి రాష్ట్రం?
 

 • రాజస్థాన్‌
 • ఆంధ్రప్రదేశ్‌
 • బిహార్‌
 • మధ్యప్రదేశ్‌
Answer: రాజస్థాన్‌

Q.

కిందివారిలో ఆర్యుల యుద్ధ దేవుడు ఎవరు?

 • అగ్ని
 • సోమ
 • వరుణ
 • ఇంద్ర
Answer: ఇంద్ర

Q.

‘మానవ జీవితానికి అవసరమైన సాంకేతిక, ఉద్దీపన ప్రయోజనాలను అందించేదే భాష’ అని చెప్పింది-

 • ఎమ్మన్‌ బాక్‌
 • రిచర్డ్‌ - ఓగ్డేన్‌
 • హెగెల్‌
 • చామ్‌స్కీ
Answer: రిచర్డ్‌ - ఓగ్డేన్‌

Q.

పీడనానికి S.I. ప్రమాణం?
 

 • న్యూటన్‌
 • డైన్‌
 • జౌల్‌
 • పాస్కల్‌
Answer: న్యూటన్‌

Q.

స్నేహ సాయంత్రం 4 గం. 30 ని. కు ఇంటిపని మొదలుపెట్టి 80 నిమిషాల పాటు చేసింది. అయితే ఆమె ఏ సమయానికి పని పూర్తి చేసింది? 

 • ఉదయం 5 గం. 50 ని.
 • సాయంత్రం 5 గం. 50 ని.
 • ఉదయం 5 గం. 40 ని.
 • సాయంత్రం 5 గం. 40 ని.
Answer: సాయంత్రం 5 గం. 50 ని.

Q.

‘మాంచెస్టర్‌ ఆఫ్‌ ఆసియా’గా ఏ నగరాన్ని పిలుస్తారు?

 • ఢాకా
 • కొలంబో
 • కోయంబత్తూర్‌
 • ఒసాకా
Answer: ఒసాకా

Q.

కిందివాటిలో సరైన వాక్యాలు?

ఎ) వై.ఎస్‌.ఆర్‌. కడప జిల్లాలో చింతకుంట గ్రామం ఉంది.

బి) చింతకుంట గ్రామం వద్ద 200పైగా చిత్రాలున్నాయి.

సి) 200 పైగా చిత్రాల్లో పది ఎరుపు రంగులో ఉన్నాయి.

డి) ఈ ప్రాంతంలో జింక, దుప్పి, నక్క, కుందేలు, పక్షులు, మానవుల బొమ్మలు లేవు.

 • ఎ, బి, సి, డి
 • ఎ, బి, డి
 • బి, సి
 • ఎ, బి
Answer: ఎ, బి

Q.

కిందివాటిలో దంతాల గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి.    

A) దంతాల గురించిన అధ్యయనాన్ని ఓడంటాలజీ అంటారు.

B) కుంతకాలను ‘కొరికే దంతాలు’ అంటారు.

C) రదనికలను ‘చీల్చే దంతాలు’ అంటారు.

D) అగ్రచర్వణకాలు ఆహారం నమలడానికి ఉపయోగపడతాయి.

 • A, B
 • B, C
 • C, D
 • A, B, C, D
Answer: A, B, C, D

Q.

ప్రతీ పరీక్షలో ఎంత శాతం లక్ష్యాత్మక ప్రశ్నలు ప్రవేశపెట్టాలని లక్ష్మణ స్వామి మొదలియార్‌ సూచించారు?

 • 15-40%
 • 10-30%
 • 20-35%
 • 15-35%
Answer: 15-40%

Q.

సామాజిక అభివృద్ధి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది?

 • 1953, అక్టోబరు 2
 • 1952, అక్టోబరు 2
 • 1955, ఆగస్టు 15
 • 1952 జనవరి 26
Answer: 1952, అక్టోబరు 2

Q.

మండలం, వలనాడు, నాడు అనేవి ఏ రాజుల కాలంనాటి విభాగాలు?
 

 • పాండ్యులు
 • చోళులు
 • చేర
 • కాకతీయ
Answer: చోళులు

Q.

కిందివాటిలో  POCSO (Protection of Children From of Sexual Offences) కేసులను ఎవరు విచారిస్తారు?
 

 • సెషన్స్‌ కోర్టు
 • బాలల కోర్టు
 • జిల్లా కోర్టు
 • హైకోర్టు
Answer: బాలల కోర్టు

Q.

ఆకురాల్చు అడవులు సగటున ఎంత వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి?

 • 100 సెం.మీ. నుంచి 200 సెం.మీ.
 • 200 సెం.మీ. నుంచి 250 సెం.మీ
 • 70 సెం.మీ. నుంచి 100 సెం.మీ.
 • 70 సెం.మీ. నుంచి 200 సెం.మీ.
Answer: 70 సెం.మీ. నుంచి 200 సెం.మీ.

Q.

ప్రారంభంలో వేదాలు...........?

 • వేదాలను రచించారు.
 • వేదాలు గోడలు, గుహల మీద చిత్రరూపంలో చెక్కారు.
 • వేదాలు దేవుళ్లు మాత్రమే పఠించేవారు.
 • గురువు శిష్యులకు వేదాలను చెప్పేవారు.
Answer: గురువు శిష్యులకు వేదాలను చెప్పేవారు.

Q.

జనపనార మిల్లులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
 

 • ఝార్ఖండ్‌
 • బిహార్‌
 • ఒడిశా
 • పశ్చిమ బెంగాల్‌
Answer: పశ్చిమ బెంగాల్‌

Q.

మిథున్‌ రోజూ ఉదయం 4 గం. 30 ని. నుంచి  6 గం. 15 ని. వరకు; సాయంత్రం 4 గం. నుంచి 5 గం. 30 ని. వరకు యోగా చేస్తాడు. అయితే అతడు రోజూ ఎన్ని గంటలు యోగా చేస్తున్నాడు? 

 • 3 గం. 15 ని.
 • 3 గం. 25 ని.
 • 4 గం. 15 ని.
 • 4 గం. 25 ని.
Answer: 3 గం. 15 ని.

Q.

భారతదేశంలో ఏ రకానికి చెందిన అడవులు ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించాయి?

 • తేమతో కూడిన సమశీతోష్ణ మండల పర్వత ప్రాంత అరణ్యాలు
 • ఉప ఉష్ణమండల అనార్ధ్ర సతతహరిత అరణ్యాలు
 • ఉష్ణమండల ఆర్ధ్రతతో కూడిన ఆకురాల్చు అరణ్యాలు
 • ఉష్ణమండల ఆర్ధ్రతతో కూడిన సతతహరిత అరణ్యాలు
Answer: ఉష్ణమండల ఆర్ధ్రతతో కూడిన ఆకురాల్చు అరణ్యాలు

Q.

ఢిల్లీలో సిపాయిల తిరుగుబాటును అణచివేసిన బ్రిటిష్‌ అధికారి?
 

 • కాంప్‌బెల్‌
 • హడ్సన్‌
 • లారెన్స్‌
 • జాన్సన్‌
Answer: హడ్సన్‌

Q.

నిశ్చితం (A): 12,000 ఏళ్ల కిందట ఆదిమానవుడు వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. 

కారణం (R): 12,000 సంవత్సరాల కాలంలో వాతావరణంలో మార్పులు వచ్చి ఉష్ణోగ్రతలు విపరీతంగా తగ్గిపోయాయి.
 

 • A, R లు సరైనవి. A కు R సరైన వివరణ కాదు
 • A, R లు సరైనవి. A కు R సరైన వివరణ.
 • A సరైంది కాదు, R సరైంది.
 • A సరైంది, R సరైంది కాదు
Answer: A సరైంది, R సరైంది కాదు

Q.

‘భాష మాట్లాడలేని మానవుడు లేనట్లే, భాషను మాట్లాడగల మానవేతర ప్రాణిలేదు’ అని ఎవరన్నారు?

 • పి.ఎస్‌.సుబ్రహ్మణ్యం
 • ఎడ్వర్డ్‌ సఫైర్‌
 • ఎరిక్‌ మాడ్సన్‌
 • జి.వి.సుబ్రహ్మణ్యం
Answer: పి.ఎస్‌.సుబ్రహ్మణ్యం

Q.

నిష్క అనేది ఒక....
 

 • వస్త్రం
 • ఆభరణం
 • వినోదం
 • తేనె
Answer: ఆభరణం

Q.

కింది వాక్యాలను పరిశీలించండి.

A) మానవుడిలో 3 జతల లాలాజల గ్రంథులుంటాయి.

B) మిక్సోవైరస్‌ పెరటోడిన్‌ అనే వైరస్‌ వల్ల గవద బిళ్లల వ్యాధి వస్తుంది.

పై వాక్యాల ఆధారంగా సరైన సమాధానాన్ని ఎన్నుకోండి.

 • A సరైంది, B సరైంది కాదు.
 • A, B లు సరైనవి. ఇవి రెండు ఒకదాంతో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి.
 • A, B లు సరైనవి. ఇవి రెండూ వేర్వేరు అంశాలు.
 • A సరైంది కాదు, B సరైంది.
Answer: A, B లు సరైనవి. ఇవి రెండు ఒకదాంతో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి.

Q.

దేశవ్యాప్తంగా మాధ్యమిక విద్యను సమన్వయం చేయడానికి కేంద్రీయ మాధ్యమిక విద్యా పరిషత్‌ను స్థాపించాలని సూచించిన విద్యా కమిషన్‌ ఏది?

 • రాధాకృష్ణన్‌ కమిషన్‌
 • కొఠారీ కమిషన్‌
 • సెకండరీ విద్యా కమిషన్‌
 • ఈశ్వరీభాయ్‌ పటేల్‌ కమిటీ
Answer: సెకండరీ విద్యా కమిషన్‌

Q.

చిప్స్‌ ప్యాకెట్లలో నింపే వాయువును గుర్తించండి.
 

 • నైట్రోజన్‌
 • హైడ్రోజన్‌
 • నియాన్‌
 • ఆర్గాన్‌
Answer: నైట్రోజన్‌

Q.

జాతీయ విస్తరణ సేవా పథకాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది?
 

 • 1952
 • 1953
 • 1955
 • 1972
Answer: 1953

Q.

తలం గరుకుదనం పెరిగితే ఘర్షణలో కలిగే మార్పు?
 

 • తగ్గుతుంది
 • పెరుగుతుంది
 • మార్పు ఉండదు
 • సగం అవుతుంది
Answer: పెరుగుతుంది

Q.

కిందివాటిలో ఏ యానకంలో ధ్వని వేగం ఎక్కువ?
 

 • గాలి
 • పాదరసం
 • నీరు
 • ప్లాస్టిక్‌
Answer: ప్లాస్టిక్‌