• facebook
  • twitter
  • whatsapp
  • telegram

 మాతృభావన

III. భాషాంశాలు

పదజాలం
1. కింది పర్యాయ పదాలకు సంబంధించిన పదాన్ని పాఠంలో గుర్తించి గడిలో రాయండి.


2. కింది ఆధారాలను బట్టి గళ్లను పూరించండి.

అడ్డం:
1. సీతకు అగ్నిగుండం కూడా ఇలా ఉంటుంది (4)
4. 'అంబుదం' దీన్నే ఇలా కూడా అంటారు (2)                
5. సావిత్రి చరిత్ర విశేషణం (3)                                        
6. పాపం కాదు పుణ్యానికి నిలయం (4)
 9. కుడివైపు నుంచి సీతకు మరో పేరు (3) 
10. కుడివైపు నుంచి శివాజీ కోప్పడిన సేనాని (4)
12. ఈ పాఠం కవి ఇంటి పేరు (4)
14. పాఠంలో శివాజీ తొలి పలుకు (1)

 

నిలువు:
2. సోన్‌దేవుడు ఎవరిని బంధించాడని శివాజీ కోపించాడు (4)
3. శివాజీ గౌరవించిన కాంత వంశం (3)
6. రావణుడి తాత (4)
7. యవన కాంత స్వస్థలం (4)
8. సోన్‌దేవుడి మదోన్మాదానికి కారణం (2)
11. శివాజీని సోన్‌దేవుడు పిలిచినట్టు మీరూ పిలవండి (2)
13. శీర్షాసనం వేసిన త్వరితం, వేగం (2)


3. కింది ప్రకృతులకు సరైన వికృతులను జతపరచండి.
ప్రకృతి                                       వికృతి
అ) రాజ్ఞి                   ( 4 )            1) ఆన
ఆ) ఆజ్ఞ                   ( 1 )             2) రతనం
ఇ) ఛాయ                ( 5 )             3) బత్తి
ఈ) రత్నం               ( 2 )             4) రాణి
ఉ) భక్తి                    ( 3 )             5) చాయ


4. కింది పదాల్లోని ప్రకృతి - వికృతి పదాలను వేరుచేసి రాయండి
గౌరవము      బమ్మ         పుణ్యము           బ్రహ్మ         జోతి           పున్నెము
రాసి              గీము          జ్యోతి                 దోషము      గృహము    అంబ
అమ్మ           భాగ్యము     దోసము              గారవము   రాశి           బాగ్గెము
జ:  ప్రకృతి            వికృతి
గౌరవము            గారవం
రాశి                     రాసి
అంబ                   అమ్మ
బ్రహ్మ                   బమ్మ
పుణ్యము             పున్నెం
జ్యోతి                   జోతి
భాగ్యము             బాగ్గెము
దోషము               దోసము
గృహము             గీము

వ్యాకరణాంశాలు
1. కింది పదాలను పరిశీలించండి. వాటిలో సవర్ణదీర్ఘ, గుణ, వృద్ధి సంధులున్నాయి. గుర్తించి, విడదీసి సూత్రాలు రాయండి.
జ: సవర్ణదీర్ఘ సంధి పదాలు:
1) పుణ్య + ఆవాసం - పుణ్యావాసం
2) స్నిగ్ధ + అంబుద - స్నిగ్ధాంబుద
సూత్రం: అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశం అవుతుంది.

గుణ సంధి పదాలు:
1) మద + ఉన్మాదం - మదోన్మాదం
2) సరభస + ఉత్సాహం - సరభసోత్సాహం
సూత్రం: 'అ' కారానికి ఇ, ఉ, ఋ లు పరమైతే క్రమంగా ఏ, ఓ, ఆర్ లు ఆదేశంగా వస్తాయి.

వృద్ధి సంధి పదాలు:
1) గుణ + ఔద్ధత్యం - గుణౌద్ధత్యం
2) రస + ఏకస్థితి - రసైక స్థితి
సూత్రం: 'అ' కారానికి ఏ, ఐ లు పరమైతే 'ఐ' కారం; ఓ, ఔ లు పరమైతే 'ఔ' కారం; ఋ, ౠలు పరమైతే 'ఆర్' కారం వస్తాయి.


2. కింది పదాల్లో ఉత్వ, త్రిక, రుగాగమ, లులనల సంధులున్నాయి. పదాలను విడదీసి, సంధి జరిగిన తీరును చర్చించండి.
అ) బంధమూడ్చి            ఆ) అవ్వారల           ఇ) భక్తురాలు             ఈ) బాలెంతరాలు
ఉ) గుణవంతురాలు        ఊ) దేశాలలో          ఋ) పుస్తకాలు           ౠ) సమయాన
జ: ఉత్వ సంధి పదం: బంధము + ఊడ్చి - బంధమూడ్చి
సూత్రం: ఉత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యం.
రుగాగమ సంధి పదాలు: భక్త + ఆలు - భక్తురాలు
గుణవంత + ఆలు - గుణవంతురాలు
సూత్రం: కర్మధారయంలో తత్సమ పదాలకు 'ఆలు' శబ్దం పరమైతే పూర్వపదం చివరనున్న అత్వానికి ఉత్వం, రుగాగమం వస్తాయి.
* బాలెంత + ఆలు - బాలెంతరాలు
సూత్రం: పేదాది శబ్దాలకు 'ఆలు' పరమైతే కర్మధారయంలో రుగాగమం వస్తుంది.
త్రిక సంధి పదం: ఆ + వారల - అవ్వారల
సూత్రం: త్రికం మీది అసంయుక్త హల్లుకు ద్విత్వం బహుళంగా వస్తుంది. సంయుక్తాక్షరం కాని హల్లు ద్విత్వాక్షరంగా మారుతుంది. మొదటి దీర్ఘాక్షరం హ్రస్వం అవుతుంది.
లు, ల, న, ల సంధి పదాలు:
దేశము + లలో - దేశాలలో
పుస్తకము + లు - పుస్తకాలు
సమయము + న - సమయాన
సూత్రం: లు, ల, న, లు పరమైనప్పుడు ఒక్కోసారి 'ము' వర్ణానికి లోపమూ, దాని పూర్వ స్వరానికి దీర్ఘం వస్తాయి


3. కింది పద్య పదాల్లోని అలంకారాన్ని గుర్తించండి. లక్షణాలను సరిచూడండి.
అ) అనుచున్ జేవుఱుమీఱు కన్నుఁగవతో, నాస్పందదోష్టంబుతో ఘన హుంకారము
తో నటద్భ్రుకుటితో, గర్జిల్లునా బోన్‌సలేశుని జూడన్...
జ: పై పద్య పాదాల్లో 'స్వభావోక్తి' అలంకారం ఉంది.
స్వభావోక్తి అలంకారం: ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా వర్ణిస్తే దాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు.

లక్షణాలను సరిచూస్తే
శివాజీకి కోపం వచ్చినప్పుడు ఎరుపురంగు కన్నులతో, అదిరిపడే పై పదవితో, గొప్ప హుంకారంతో, కదలాడే కనుబొమ్మ ముడితో గర్జిస్తూ ఉన్నాడు. ఆయన తీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం వల్ల ఇది స్వభావోక్తి అలంకారం.


4. కింది పద్య పాదాలకు గురు, లఘువులను గుర్తించి; గణ విభజన చేసి అవి ఏ పద్యాలకు సంబంధించినవో నిర్ణయించండి. లక్షణాలను చర్చించండి.
అ) ఆ - యేమీ యొకరాణివాసమును బుణ్యావాసమున్ దెచ్చినా
ఆ) అనల జ్యోతుల నీ పతివ్రతలఁ బాపాచారులైడాయు భూ

పై పద్యపాదం 'శార్దూలం' కు చెందింది.

శార్దూలం - లక్షణాలు
1. నాలుగు పాదాలుంటాయి.
2. ప్రతి పాదంలో వరుసగా మ, స, జ, స, త, త, గ అనే గణాలు వస్తాయి.
3. యతి స్థానం 13వ అక్షరానికి చెల్లుతుంది.
4. ప్రాస నియమం ఉంటుంది.
5. మొత్తం 19 అక్షరాలు ఉంటాయి.

లక్షణ సమన్వయం:
* పై పద్యపాదాన్ని గమనిస్తే 'మ స జ స త త గ' అనే గణాలు వస్తాయి.
* యతి స్థానం మొదటి అక్షరమైన 'ఆ' కు పదమూడో అక్షరమైన 'ణ్యా'లోని 'ఆ' కు మైత్రి కుదిరింది.
ప్రాస అక్షరం 'య'.
* మొత్తం 19 అక్షరాలుంటాయి కాబట్టి ఇది శార్దూల పద్యం.

పై పద్యపాదం 'మత్తేభం' కు చెందింది.

మత్తేభం - లక్షణాలు
1. నాలుగు పాదాలుంటాయి.
2. ప్రతి పాదంలో వరుసగా స, భ, ర, న, మ, య, వ అనే గణాలు వస్తాయి.
3. యతి స్థానం 14వ అక్షరానికి చెల్లుతుంది.
4. ప్రాస నియమం ఉంటుంది.
5. మొత్తం 20 అక్షరాలుంటాయి.

లక్షణ సమన్వయం:
పై పద్యపాదంలో 'స భ ర న మ య వ' అనే గణాలు వచ్చాయి.
యతి స్థానం మొదటి అక్షరమైన 'అ' కు 14వ అక్షరమైన 'పా' లోని 'ఆ' కు మైత్రి కుదిరింది.
ప్రాస అక్షరం 'న'.
 మొత్తం 20 అక్షరాలున్నాయి కాబట్టి ఈ పద్యపాదం 'మత్తేభం'.


5. కింది పదాలను విడదీయండి:
అ) వాయం ‌
ఆ) రాణ్మహేంద్రవరం
ఇ) జగన్నాథుడు
పైవాటి విసంధి రూపాలు కింద పేర్కొన్నట్లే ఉన్నాయా? సరిచూసుకోండి. సంధి జరిగిన తీరును గమనించండి.
అ) వాక్ + మయం = వాయం = 'క్' స్థానంలో 'ఙ' వచ్చింది.‌
ఆ) రాట్ + మహేంద్రవరం = రాణ్మహేంద్రవరం = ట్ స్థానంలో 'ణ' వచ్చింది.
ఇ) జగత్ + నాథుడు = జగన్నాథుడు = 'త్' స్థానంలో 'న' వచ్చింది.
* పై మూడు సందర్భాల్లో పూర్వ పదాంతరంలో వరుసగా క, ట, త లున్నాయి.
* వాటికి 'మ' లేదా, 'న' పరమవుతాయి.
* అప్పుడు పదాంతంలోని 'క' కారం క వర్గ అనునాసికమైన 'ఙ' (క ఖ గ ఘ 'ఙ') గా, 'ట' కారం దాని అనునాసికమైన 'ణ' (ట ఠ డ ఢ 'ణ') గా, 'త 'కారం దాని అనునాసికమైన 'న' (త థ ద ధ 'న') గా మారాయి.
దీన్ని అనుసరించి ()......................
* వర్గ ప్రథమాక్షరాలకు (క, చ, ట, త, ప ) 'న' లేదా 'మ' పరమైనప్పుడు అదే వర్గ అనునాసికాలు ఆదేశమవుతాయి. దీన్నే 'అనునాసిక సంధి' అంటారు.
కింది పదాలను విడదీసి, 'అనునాసిక సంధి' సూత్రంతో అన్వయించి చూడండి.
అ) తన్మయం         ఆ) రాణ్మణి            ఇ) మరున్నందనుడు
అ) తన్మయం = తత్ + మయం
అనునాసిక సంధితో అన్వయం: సంధి ప్రకారం 'క చ ట త ప' లకు 'మ' లేదా 'న' పరమైతే అనునాసికాలు (ఙ, ఞ, ణ, న, మ) రావాలి. పై పదంలో 'త్' కారానికి 'మ' పరమైంది. అంటే 'త' వర్గం అనునాసికం 'న' ఆదేశంగా వచ్చింది.
(త్ + మ  న)
క  ఙ
చ  ఞ
ట  ణ
త  న
 ప  మ
పైన చూపిన ప్రకారం 'క చ ట త ప' లు 'ఙ ఞ ణ న మ' లుగా మారతాయి.
ఆ) రాణ్మణి = రాట్ + మణి
అన్వయం: పూర్వ పదంలోని చివరి వర్ణం 'ట్' కు పరపదంలోని మొదటి వర్ణం 'మ' పరమైంది.
అంటే ట్ + మ గా వస్తే 'ణ 'అనే అనునాసికాక్షరం వస్తుంది. అందుకే 'రాణ్మణి' గా మారింది.
ఇ) మరున్నందనుడు = మరుత్ + నందనుడు
అన్వయం: పూర్వ పదంలోని చివరి వర్ణం 'త్' కు, పరపదంలోని మొదటి వర్ణం 'న' పరమైంది.
అంటే త్ + న గా వస్తే 'న' అనే అనునాసికాక్షరం రావాలి కాబట్టి 'మరున్నందనుడు' గా వచ్చింది.
(త్ + న  న)


6. ఉపజాతి పద్యాల్లో తేటగీతి, ఆటవెలది పద్యాల లక్షణాలను తెలుసుకున్నారు కదా! ఇప్పుడు సీస పద్య లక్షణాలను పరిశీలిద్దాం.
సీస పద్యం లక్షణాలు:
* సీస పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి.
* ప్రతిపాదం రెండు భాగాలుగా ఉంటుంది. ప్రతి భాగంలో నాలుగు గణాల చొప్పున ఎనిమిది గణాలు ఒక పాదంలో ఉంటాయి. ఈ 8 గణాల్లో మొదటి ఆరు ఇంద్రగణాలు, చివరి రెండు సూర్యగణాలు.
(పాదం మొదటి భాగంలో 4 ఇంద్రగణాలు; రెండో భాగంలో వరుసగా రెండు ఇంద్రగణాలు, రెండు సూర్య గణాలు ఉంటాయి.)

* యతి ప్రతిపాదంలోనూ 3వ గణం మొదటి అక్షరంతో సరిపోతుంది. యతి లేని చోట ప్రాసయతి చెల్లుతుంది. పై పాదంలో ప్రాసయతిని గమనించారు కదా!
* ప్రాస నియమం లేదు.
* సీస పద్యం నాలుగు పాదాల తర్వాత తేటగీతి లేదా, ఆటవెలది తప్పని సరిగా ఉంటుంది.
కింది పద్య పాదాన్ని గణ విభజన చేసి లక్షణ సమన్వయం చేయండి.

పై పాదంలోని మొదటి భాగంలో '4' ఇంద్ర గణాలు; రెండో భాగంలో '2' ఇంద్ర గణాలు '2' సూర్య గణాలు వచ్చాయి.
యతి మొదటి గణం మొదటి అక్షరం మూడో గణం మొదటి అక్షరానికి చెల్లింది. మొదటి భాగంలో ధ - ధ్య లకు, రెండో భాగంలో 'వి - ధ్వీ' లకు కుదిరింది.
మీ పాఠంలోని 5వ పద్యం సీసం. ఆ పద్యం లక్షణాలను సరిచూడండి.
'మాతృభావన' పాఠంలోని 5వ పద్యం



సీసపద్య లక్షణాలను సరిచూస్తే
* పై పద్యంలోని నాలుగు పాదాల్లో 6 ఇంద్ర గణాలు, 2 సూర్య గణాలు వచ్చాయి.
* పై పద్యంలో నాలుగు పాదాల్లోని మొదటి భాగం, రెండు భాగాలను గమనిస్తే మొదటి భాగంలో 4 ఇంద్ర గణాలు; రెండో భాగంలో 2 ఇంద్ర గణాలు, 2 సూర్య గణాలు వచ్చాయి.
* పై పాదాల్లో యతి మైత్రి మొదటి గణం మొదటి అక్షరానికి, మూడో గణం మొదటి అక్షరానికి చెల్లింది. ఒకటో పాదంలో ప్రాస యతి చెల్లింది. రెండో పాదంలో మొదటి భాగంలో కూడా ప్రాస యతి చెల్లింది.
* సీస పద్యం తర్వాత 'తేటగీతి పద్యం ఉంది.
* సీస పద్యానికి ఉన్న లక్షణాలు పై పద్యానికి సరిపోయాయి.

Posted Date : 19-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు