• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పరీక్షలో ఉపవాచకం

* మానవతా విలువలు, భారతీయ సంస్కృతి, మానవ జీవితధర్మాలను వివరించే ఇతిహాసం 'రామాయణం'. 

* రామాయణం నుంచి తల్లిదండ్రుల అనురాగం, సోదరప్రేమ, రాజధర్మం, ఉత్తమ ఆదర్శాలు, రాజ్యపాలన, మానవ స్వభావం, స్నేహబంధం, వినయం, వివేకంతో మెలగడం లాంటి మంచి విషయాలను    నేర్చుకుంటాం. అలాగే ప్రతి పాత్రలోని సందేశాలను గ్రహించాలి.

* పబ్లిక్ పరీక్షలో ఉపవాచకం (రామాయణం) నుంచి 11 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి.

* మొదటి పేపరులో 'స్వీయ రచన' సామర్థ్యం కింద రెండు ప్రశ్నలు వస్తాయి. వాటిలో ఒకదానికి సమాధానం రాయాలి. సమాధానం 12 నుంచి 15 వాక్యాల్లో రాస్తే సరిపోతుంది. సమాధానానికి '6' మార్కులు కేటాయించారు.

* రెండో పేపరులో 'అవగాహన - ప్రతిస్పందన' సామర్థ్యం కింద మొదటి ప్రశ్నగా గద్యం ఉపవాచకం నుంచి

వస్తుంది. గద్యానికి సంబంధించిన ప్రశ్నలు వివిధరకాలుగా అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు చొప్పున '5' మార్కులు కేటాయించారు.

మొదటి పేపరులో '6 మార్కులు' పొందాలంటే...

* ఆరు 'కాండా'ల్లోని విషయాన్ని అవగాహనతో చదవాలి.

* ప్రశ్నలు నేరుగా అడగరు. కాబట్టి విశ్లేషణాత్మక ఊహను పెంపొందించుకోవాలి.

* 'కాండా'ల్లోని పాత్రలు, వాటి స్వభావాన్ని క్షుణ్నంగా పరిశీలించాలి.

* సన్నివేశాలకు అనుగుణంగా అభిప్రాయాలు తెలియజేయాలి.

* 'కాండా'ల ఆధారంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ 'కాండ'లో ఏయే అంశాలు ఉన్నాయో ఆయా కాండల వారిగా గుర్తుపెట్టుకోవాలి.

ఉదా: రాముడు వాలిని చంపడం (కిష్కింధ కాండ)

* చదివేటప్పుడు నిజ జీవితానికి అనుసంధానం చేసుకుంటూ చదవాలి.

రెండో పేపరులో '5' మార్కులు పొందాలంటే...

* ఇచ్చిన గద్యాన్ని క్షుణ్నంగా చదవాలి. గద్యంలోనే సమాధానాలు ఉంటాయి.

* గద్య సంబంధ ప్రశ్నలు ఇచ్చి జవాబులు రాయమంటారు. తప్పొప్పులు గుర్తించమని కూడా అడగొచ్చు. ప్రశ్నలను తయారు చేయమనడం, పదాలు ఇచ్చి వివరణలు రాయమనడం. కీలకాంశాలు *రాయమనడం, పదాలు రాయమనడం ఇలా రకరకాలుగా అడగొచ్చు. కాబట్టి ఆయా విధానాలపై అవగాహన పెంపొందించుకోవాలి.

 ఒక వాక్యంలో సమాధానం రాయాలి.

* 'కాండా'ల వారిగా విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి సంబంధిత గద్యం 'ఏ కాండ లోనిది' అని కూడా అడిగే అవకాశం ఉంటుంది.

 ఇచ్చిన గద్యాన్ని చక్కగా చదివి అవగాహన చేసుకోవాలి.

రచయిత: అంజాగౌడ్

Posted Date : 25-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

 
 

విద్యా ఉద్యోగ సమాచారం

telugu

OTHER SUBJECTS

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌