• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Wit and Humour

Concept Presentation:
 

'Our World Through English - Class X' లో Second Unitగా 'Wit and Humour' పాఠ్యాంశాన్ని ఇచ్చారు. హాస్యం, చతురత ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ 'Theme'ని చేర్చారు.
 

Reading B: The Dear Departed Part - II
నాటకం కొనసాగింపులో భాగంగా Mr. Abel Merryweather అనారోగ్యం నుంచి కోలుకుని కిందికి దిగివచ్చి కూతుళ్లు, అల్లుళ్లను చూసి ఆశ్చర్యానికి గురవుతాడు. వివరాలు రాబట్టాలని చూసిన కూతుళ్లు అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నిస్తారు. తర్వాత తన చెప్పులు, గోడ గడియారం, బీరువా అక్కడ ఉండక ఫోవడాన్నిగమనించి తన కూతుళ్ల దుష్టబుద్ధిని, వారి ఆలోచనలను అర్థం చేసుకుంటాడు. సాధారణ పరిస్థితుల్లో తనను బాగా చూసుకున్న కుమార్తెకు ఆస్తిని ఇవ్వాలనుకున్న ఆ తండ్రి వాళ్లకు బుద్ధి చెప్పాలనుకుంటాడు. యావదాస్తిని తనను బాగా చూసుకోగలదనే నమ్మకం ఉన్న Mrs. John Shorrocks ను వివాహం చేసుకుని తర్వాత తన ఆస్తిని ఆమె పేరుమీదకు మారుస్తున్నట్లు చెబుతాడు. చర్చిలో జరగబోయే తమ వివాహానికి రావాల్సిందిగా కూతుళ్లనుని ఆహ్వానిస్తాడు. మొత్తానికి నాటకీయ పరిణామాల మధ్య ఇద్దరు కూతుళ్లు తమ స్వార్ధబుద్ధికి తగిన శిక్షను అనుభవించారని చెప్పవచ్చు.

 

(Writer: Md.Shafi.T)

Posted Date : 07-07-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

 
 

విద్యా ఉద్యోగ సమాచారం