• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Wit and Humour

Concept Presentation:
 

'Our World Through English - Class X' లో Second Unitగా 'Wit and Humour' పాఠ్యాంశాన్ని ఇచ్చారు. హాస్యం, చతురత ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ 'Theme'ని చేర్చారు.
 

Reading C: The Brave Potter
'Wit and Humour' అనే themeలో భాగంగా Margueritc siek రచించిన 'The Brave Potter' కథ విద్యార్థులను బాగా ఆకట్టుకుంటుంది. కాల ప్రభావం వల్ల ఒక్కోసారి ఒక వ్యక్తి ధైర్యవంతుడు కానప్పటికీ, పరిస్థితుల అనుకూలత వల్ల ధైర్యవంతుడిగా చెలామణి కావచ్చు అనడానికి ఈ కథే నిదర్శనం.
చాలా సాధారణ వ్యక్తి అయిన ఒక 'కుమ్మరివాడు' తప్పిపోయిన తన గాడిదను వెతుక్కుంటూ ఒక వర్షపు రాత్రి అడవిలోకి వెళతాడు. అదే అడవిలో పూరి గుడిసెలో నివాసం ఉన్న ఒక వృద్ధురాలు ఆ గుడిసెలో తడుస్తూ గుడిసెకు ఉన్న రంధ్రాన్ని (Leak) తిడుతూ ఎంతటి భయంకరమైంది ఈ Leak అంటూ దాన్ని ఆశ్చర్యకరంగా వర్ణిస్తుంది. అదే సమయంలో అక్కడే వర్షానికి తలదాచుకున్న ఒక ముసలి పులి ఈ మాటలు విని 'Leak' అనేది తనకంటే భయంకరమైన, క్రూర జంతువుగా పొరపాటుగా అర్థం చేసుకుంటుంది. 'Leak'ను తలచుకుని పులి చాలా భయంగా అక్కడే ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి తాగిన మత్తులో రాత్రిపూట వర్షంలో తన గాడిదను వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన కుమ్మరి ఆ పులిని తన గాడిదగా భావిస్తాడు. తర్వాత దాన్ని గొలుసుతో బంధించి ఇంటికి తీసుకుని వెళ్లి బయట కట్టేస్తాడు. పులి కూడా కుమ్మరిని భయంకరమైన 'Leak'గా భావించి ఆ చీకట్లో ప్రతిఘటించక భయంగా కుమ్మరికి సహకరిస్తుంది. తెల్లవారగానే ఈ విషయం అందరికీ తెలిసి పులిని బంధించి తెచ్చిన పరాక్రమవంతుడిగా కుమ్మరిని పొగుడుతారు.తర్వాత కొద్దిరోజులకే శత్రురాజు ఆ పట్టణంపై దండెత్తగా కుమ్మరి ధైర్యసాహసాలను మంత్రుల ద్వారా విన్న రాజు అతడిని సేనాధిపతిగా నియమిస్తాడు. కనీసం గుర్రం ఎక్కడం కూడా చేతకాని కుమ్మరి బలవంతంగా తనను గుర్రానికి కట్టుకుని స్వారీ నేర్చుకోవడానికి ప్రయత్నించగా గుర్రం అదుపుతప్పి శత్రుశిబిరం వైపు పరుగెత్తుతుంది. ఆ ప్రయత్నంలో కుమ్మరి ఒక చెట్టు కాండాన్ని పట్టుకోగా అది వేళ్లతో సహా పెకిలించబడి తన చేతుల్లోకి వస్తుంది. అతడు అలాగే ఒక చేత్తో పెద్దచెట్టు, మరో చేత్తో కళ్లెం పట్టుకుని శత్రువుల శిబిరం వైపు భయంకరంగా వస్తుండగా చూసిన శత్రుసైన్యం అంతా భయపడి పారిపోతుంది. శత్రుదేశ రాజు భయపడి రాజీకోసం ముందుకు వస్తాడు. శత్రువులను ఓడించిన పరాక్రమవంతుడిగా కుమ్మరి గుర్తింపబడతాడు. కాబట్టి రెండు పరిస్థితుల్లో అనుకూల కాలం వల్ల కుమ్మరి ఎలాంటి గొప్ప పనులు చేయకపోయినా, గొప్ప వీరుడిగా అందరితో ప్రశంసలు పొందడమే ఈ కథ మూల సారాంశం.

 

(Writer: Md.Shafi.T)
 

Posted Date : 07-07-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

 
 

విద్యా ఉద్యోగ సమాచారం