• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Personality Development 

ఈ యూనిట్ విద్యార్థులను తమ లక్ష్యం వైపు ఆలోచన రేకెత్తించేలా ఉంటుంది. జీవితంలో విజయం సాధించాలంటే సానుకూల దృక్పథం, క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల అనేవి ప్రధానంగా ఉండాలి. ఈ లక్షణాలు అన్నివిధాలా అభివృద్ధికి (Personality Development) తోడ్పడతాయి. సుధాచంద్రన్, స్టీఫెన్ హాకింగ్, హెలెన్ కెల్లర్ లాంటివారు శారీరక వైకల్యాన్ని అధిగమించి జీవితంలో విజయం సాధించడానికి ఈ లక్షణాలే ముఖ్య కారణం. మన సానుకూల దృక్పథమే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే Attitude is Altitude (మన వైఖరే మన ఎదుగుదల) అంటారు
 

'A' Reading: Attitude is Altitude
అభ్యసనా లక్షణాలు: మీరు ఈ సెక్షన్ చివరలో కిందివాటి గురించి తెలుసుకుంటారు.
   1. Nick Vujicic తన శారీరక వైకల్యాన్ని అధిగమించిన తీరు.
   2. Nick వ్యక్తిగతంగా జీవించడానికి తల్లిదండ్రులు అందించిన సహాయం.
   3. సానుకూల దృక్పథం, క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావం లాంటి లక్షణాలు విజయానికి సోపానాలు.
   4. 'ఎదుగుదలకు శారీరక వైకల్యం అడ్డుకాదు.
   5. Defining and non - defining relative clauses గురించి.
   6. News report, Biography, Description, Interview లాంటి discourses మీద అవగాహన.

 

పాఠ్యాంశం
   కాళ్లు, చేతులు లేకపోతే జీవించడం సాధ్యమేనా! ఒక్కసారి ఊహించుకోండి. అది అంత సులువుకాదని మనకు తెలుసు. కానీ Nick Vujicic కాళ్లు, చేతులు లేకపోయినప్పటికీ ఎన్నో సమస్యలను ఎదుర్కొని జీవితంలో విజయం సాధించాడు. ఆ సమస్యలు ఏమిటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడో తెలుసుకుందాం.
   Nick Vujicic మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా)లో జన్మించాడు. ప్రస్తుతం లాస్ఏంజిల్స్‌లో ఉంటున్నాడు. ఇతడు జన్మించినప్పుడు తండ్రి ఆస్పత్రి వదిలి వాంతి చేసుకున్నాడు, బాగా కలత చెందాడు. తల్లి 4 నెలల వరకు దగ్గరికి తీసుకోలేదు. వృత్తి రీత్యా నర్సు అయిన ఆ తల్లి తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ... ఇలా జన్మించినందుకు బాధపడింది.
   Nick ఎడమ తుంటి భాగాన ఉన్న చిన్న పాదం సమతా స్థితిలో ఉండటానికి, పనులు చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని Nick ముద్దుగా "Chicken Drumstick" అని పిలుచుకుంటాడు.
   Nick కు 18 నెలల వయసులో ధైర్యం ఇవ్వడం కోసం, ఈత నేర్పించడానికి తండ్రి అతడిని నీటిలో వేశాడు. తర్వాత Nick ఫుట్‌బాల్, స్కేట్ బోర్డింగ్ నేర్చుకున్నాడు. తండ్రి కంప్యూటర్ ప్రోగ్రామర్ కావడం వల్ల 6 ఏళ్ల వయసులో టైప్ నేర్పించాడు. తల్లి పెన్ను/పెన్సిల్ పట్టుకోవడానికి వీలుగా ప్రత్యేక సాధనాన్ని కాలుకు అమర్చి రాయడం నేర్పింది. Nick కూర్చున్న విద్యుత్ చక్రాల బండిని నడిపించేందుకు వ్యక్తిగత సహాయకులను ఏర్పాటు చేశారు.
8 ఏళ్ల వయసులో Nick చాలా మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఏడుస్తూ తనను తాను హతమార్చుకోవాలనిపిస్తుందంటూ తల్లితో చెప్పాడు. ఈ రూపాన్ని ఇచ్చినందుకు భగవంతుడిని నిందిస్తూ, తల్లిదండ్రులు లేకపోతే తన పరిస్థితి ఏమిటని భయపడ్డాడు. 10 ఏళ్ల వయసులో నీటిలో మునిగి చనిపోవాలనుకున్నాడు. అది విఫలమైంది.
   13 ఏళ్ల వయసులో ఒక దివ్యాంగుడు సాధించిన విజయాన్ని దినపత్రికలో చదివి స్ఫూర్తి పొందాడు. తన మానసిక దృక్పథంలో మార్పు వచ్చింది. ఈ రూపం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా తన శక్తి సామర్థ్యాల గురించి ఆలోచించాడు. ప్రపంచ పర్యటనలో భాగంగా 2008లో సర్ఫింగ్ మాస్టర్ Bethany Hamilton ను కలిశాడు. (12 ఏళ్ల వయసులో ఇతడి ఒక చేతిని షార్క్ చేప తినేసింది). అతడి దగ్గర సర్ఫింగ్, 360 డిగ్రీల స్పిన్ ఎలా చేయాలో నేర్చుకున్నాడు. చాలా దేశాలు పర్యటించి ప్రేరణాత్మక ప్రసంగాలు ఇచ్చాడు. 1990లో ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు పొందాడు.
   ''నేను విఫలమైతే మళ్లీ ప్రయత్నం... మళ్లీ ప్రయత్నం... మళ్లీ ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నా ప్రసంగాల ద్వారా ఒక వ్యక్తిని ప్రోత్సహిస్తే నా జీవితం ధన్యమైనట్లుగా భావిస్తాను అని Nick చెప్పాడు. జీవితంలో అసాధ్యమనేది లేదు, అన్నీ సాధ్యమే అని నిక్ జీవితం తెలియజేస్తుంది.
   'జీవితంలోని సవాళ్లు మన నమ్మకాలను దృఢపరుస్తాయే తప్ప అవి మనమీద పరిగెత్తవు అనేది Nick ప్రగాఢ విశ్వాసం.
   ''The challenges in our lives are there to strengthen our convictions. They are not there to run us over'' - Nick

Glossary:
Kick down (Phr.V) = Strike forcibly with the foot.
Medical Explanation (Phr.) = Cause stated by Medical Science.
Give me the eye (Idiom) = Look at someone in a way that communicate romantic interest.
Freak out (Phr.V) = Make someone upset.

 

Grammar
Defining and Non - Defining relative clauses

 

1. The woman who taught him surfing had been bitten off by a shark.
In this sentence the relative clause defines the woman. So it is a defining relative clause.

 

2. Nick, who was teased and bullied had an electric wheel chair for mobility.
In this sentence the relative clause adds extra information about Nick. This is a non - defining relative clause and it is preceded and followed by a comma or a hyphen.
e.g.: The Brave 26 - year old - who is mainly a torso - plays football and Golf, swims and surfs.

 

I. The following are some more defining and non - defining relative clauses from text.
    1. A disabled man who had managed to achieve great things and helped others.
    2. Nick, who was born in Melbourne, Australia, but now lives in Los Angeles.
    3. Nick has a small foot on his left hip which helps him balance and enables him to kick.
    4. I decided to be thankful for what I do have.
    5. Nick, who later achieved a degree in financial planning and real estate.

 

II. Complete the sentences with defining or non - defining relative clauses.
      1. This is the peaceful place .....
      2. The 'Mahaprasthanam' is a popular book ..............
      3. Suresh ............... has left the school just now.
      4. Is this the street ......
      5. The express ..... has just arrived.

Answers
      1. where my parents lived.
      2. which is read by all.
      3. who won the prize.
      4. which leads to temple.
      5. which she has been waiting for.

Posted Date : 26-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు