• facebook
  • twitter
  • whatsapp
  • telegram

రామాయణ విశ్వరూపం

చదవండి - తెలుసుకోండి

 రామాయ‌ణం మాన‌వ జీవ‌న విలువ‌ల‌ను చూపే అక్ష‌ర‌మ‌ణి ద‌ర్ప‌ణం. కాబ‌ట్టే కొండ‌లు, స‌ముద్రాలు ఉన్నంత వ‌ర‌కు రామాయ‌ణం ఉంటుంద‌ని బ్ర‌హ్మ సెల‌విచ్చాడు. ఇలా శాశ్వ‌త‌త్త్వాన్ని స‌ముపార్జించుకున్న రామాయ‌ణాన్ని ర‌చించింది వాల్మీకి మ‌హ‌ర్షి. దేశ విదేశాల్లో వివిధ భాష‌ల్లో ఎన్నో రామాయ‌ణాలు వ‌చ్చాయి. వాట‌న్నింటికి వాల్మీకి రామాయ‌ణ‌మే మాతృక‌. ఆయా క‌వులు వారి ప్ర‌తిభ‌ను అనుస‌రించి రామాయ‌ణ క‌థ‌ను లోకానికి అందించారు. ఇందులో కొంద‌రు మూలాన్ని అనుస‌రించారు. మ‌రికొంద‌రు సొంతంగా రాశారు.

ఇలా వచ్చిన రామాయణాల్లో... 

*  సంస్కృత సాహిత్యాన్ని పరిశీలిస్తే పురాణాల్లో 'రామకథ' కనిపిస్తుంది.
* 'ఆధ్యాత్మ రామాయణం', తత్వ ప్రధానంగా సాగిన రచన.
* కాళిదాసు 'రఘువంశం' రామచరిత్రగా, పూర్వుల చరిత్రను ఆవిష్కరించిన కావ్యం.
* భోజుడు రామకథను 'చంపూ రామాయణం' గా రాశాడు.
* భాసుడు రామకథను 'ప్రతిమా నాటకం' గా రాశాడు.
* భవభూతి నాటకంగా 'ఉత్తర రామచరితం'ను రచించాడు.
* ధనంజయుడు రామాయణ, భారత కథలను కలిపి 'రాఘవ పాండవీయం' అనే ద్వ్యర్థి కావ్యం రచించాడు.
* దివాకర ప్రకాశభట్టు కాశ్మీరీ భాషలో 'రామావలోక చరిత, 'లవకుశ యుద్ధచరిత'ను రాశాడు.
* సమర్థ రామదాసు - 'రామాయణం' (మరాఠీ) రాశాడు.
* మోరోపంత్ - 'లవకుశాఖ్యానమ్'
* కృత్తివాస - ఓఝూ రామాయణం వంగాభాషలో ప్రసిద్ధి
* కంబ మహాకవి - రామాయణం (తమిళం)
* ఎళుత్తచ్చన్ - ఆధ్యాత్మ రామాయణం (మలయాళం)
* నాగచంద్రుడు - రామచంద్ర చరిత పురాణం (కన్నడ)
* సిద్ధేంద్రయోగి - విచిత్ర రామాయణం (ఒరియా)
* గోస్వామి తులసీదాస్ - రామచరిత్ మానస్ (హిందీకి ఉపభాష అయిన అవధీలో)
* రామలీల నాటకం (పంజాబీ)
* తెలుగులో తొలి రామాయణం గోన బుద్ధారెడ్డి రచించిన 'రంగనాథ రామాయణం'.
* తాళ్లపాక అన్నమాచార్యుడు - 'ద్విపద రామాయణం'.
* కట్టా వరదరాజు 'రామాయణం', ఏకోజీ రామాయణం' ద్విపదలో ఉన్నాయి.
* తిక్కన - 'నిర్వచనోత్తర రామాయణం'.
* హుళక్కి భాస్కరుడు ప్రధానంగా, అతడి కుమారుడు మల్లికార్జున భట్టు, శిష్యుడు రుద్రదేవుడు, మిత్రుడు అయ్యలార్యుల సహకారంతో 'భాస్కర రామాయణం' రాశాడు.
* మొల్ల - 'రామాయణం'.
* అయ్యలరాజు రామభద్రుడు - 'రామాభ్యుదయం'
* తంజావూరును పాలించిన రఘునాథ నాయకుడు 'రఘునాథ రామాయణం' రాశాడు.
* కూచిమంచి తిమ్మకవి - 'అచ్చ తెలుగు రామాయణం'
* గోపీనాథ వేంకటకవి - 'గోపీనాథ రామాయణం'
* కంకంటి పాపరాజు - 'ఉత్తర రామాయణం'
* కాణాదం పెద్దన - 'ఆథ్యాత్మిక రామాయణం'
* గద్వాల ప్రభువులు 'యథాశ్లోక తాత్పర్య రామాయణం' రాయించారు
* వావికొలను సుబ్బారావు - 'ఆంధ్ర వాల్మీకి రామాయణం'
* శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి - 'శ్రీకృష్ణ రామాయణం'
* విశ్వనాథ సత్యనారాయణ - 'శ్రీమద్రామాయణ కల్పవృక్షం'
* పింగళి సూరన 'రాఘవ పాండవీయం' (ద్వ్యర్థి కావ్యం)
* ఎలకూచి బాలసరస్వతి, నెల్లూరి రాఘవ కవి - 'యాదవ రాఘవ పాండవీయం' (ద్వ్యర్థి కావ్యం)
* నంబెరుమాళ్లు పురుషకారి కేశవయ్య - 'దాశరథి చరిత్ర'
* శ్రీరామ సంబంధంగా త్యాగయ్య, అన్నమయ్య, కంచెర్ల గోపన్న కీర్తనలు రాశారు.

యక్ష గానాలు

* వెల్లూరి వేంకట కవి - 'రామలీలా యక్షగానం' 
* శేషాచల కవి - 'ధర్మపురి రామాయణం'
* ముద్దు బాలంభట్టు - 'మంథెన రామాయణం'
* కందుకూరి రుద్రకవి - 'సుగ్రీవ విజయం'
* మోక్షగుండం సుబ్బకవి - 'సీతాకళ్యాణం'

నాటకాలు

* కోలాచలం శ్రీనివాసరావు - 'సంపూర్ణ రామాయణం'
* బలిజేపల్లి లక్ష్మీకాంతకవి - 'ఉత్తర రాఘవం'
* ధర్మవరం గోపాలాచార్యులు - 'రామదాసు'
* పానుగంటి లక్ష్మీనరసింహారావు - 'కళ్యాణ రాఘవం'
* సెట్టిలక్ష్మీ నరసింహకవి - 'అహల్య'
* హరికథగా తాళ్లూరి నారాయణ కవి - 'మోక్షగుండ రామాయణం'
* బుర్రకథగా నదీరా సంపూర్ణ రామాయణన్ని తీర్చిదిద్దారు.

జానపదాలు

కుశలవ కుచ్చాల చరిత్రము, రామకథా సుధార్ణవము, శారదారామాయణం, లంకాయాగం, చిరుతుల రామాయణం, శ్రీరామజావిలి, సంక్షేపరామాయణం, చిట్టిరామాయణం.
* స్త్రీల రామాయణపు పాటలు
* శాంత గోవిందనామాలు, ఊర్మిళాదేవి నిద్ర, లక్ష్మణదేవర నవ్వు
* వచన రచన విభాగంలో గోపీనాథ కవి - 'విచిత్ర రామాయణం'
* పెడిపాటి పాపయ్య - 'రంగనాథ రామాయణం'
* చైనా, కాంబోడియా, జావా, సుమత్రా, లావోస్, వియత్నాం, మలేషియా దేశాల్లో కూడా రామాయణారసామృతం ప్రవహించింది.
* ప్రపంచ సాహిత్యంలో విస్తృతంగా ప్రజల హృదయాల్లోకి ప్రసరించిన కావ్యంగా 'రామాయణం' నిలిచింది.
* రామాయణం ఆదికావ్యం, అద్వితీయకావ్యం.

Posted Date : 19-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

 
 

విద్యా ఉద్యోగ సమాచారం

telugu

OTHER SUBJECTS

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌