• facebook
  • whatsapp
  • telegram

సేద్య విజ్ఞానం ఉందా? సిద్ధం కండి!

వ్యవసాయ విస్తరణ అధికారుల (గ్రేడ్‌-2) నియామ‌కాలను‌  రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు‌ చేప‌డ‌తాయి. ఈ ఏఈఓ నియామక పరీక్ష రాయాలంటే వ్యవసాయ విద్య లేదా అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా/ బీటెక్‌ (అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌) లేదా వ్యవసాయ పాలిటెక్నిక్‌ (సీడ్‌ టెక్నాలజీ, ప్లాంట్‌ ప్రొటెక్షన్‌, ఆర్గానిక్‌ ఫామింగ్‌) లేదా సీఏబీఎం (కమర్షియల్‌ అగ్రికల్చర్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌)లో డిగ్రీ పొంది ఉండాలి. ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వయసు 18 నుంచి 44 సంవత్సరాల్లోపు ఉండాలి.
 

ఎంపిక విధానం
1. ఆబ్జెక్టివ్‌ టైప్‌ టెస్ట్‌ (ఆన్‌లైన్‌/ ఓఎంఆర్‌ విధానంలో)
2. ఇంటర్వ్యూ
3. సర్టిఫికెట్ల తనిఖీ
 

ఉపయోగపడే ముఖ్యమైన పుస్తకాలు
అగ్రికల్చర్‌ (డిప్లొమా లెవల్‌)

1. Hand book of Agriculture - ICAR publication
2. General Agriculture - M.S. Rathore
3. Objective Agriculture- S.R. Kantwa
4. Plant science at a glance - Mangesh. Y
5. Agriculture Biotechnology - Gautam.V.K
6. Biotechnology - B.D. Singh

 

అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ (డిప్లొమా లెవల్‌)
1. Principles of Agriculture Engineering (vol 1 & 2) - Ojha & Michael
2. Soil & Water conservation Engineering - Dr. R. Suresh
3. Land & Water management Engineering - V.V.N. Murthy & Madan. K. Jha

ఈ పరీక్షలో పార్ట్‌ - ఎ, బిలకి సమానంగా వెయిటేజీ ఇస్తున్నారు. కాబట్టి, రెండూ బాగా చదవాలి. ప్రశ్నపత్రం పూర్తిగా ఆబ్జెక్టివ్‌ తరహాలోనే ఉంటుంది. అదే విధానంలో ప్రశ్నలను సాధన చేస్తే మేలు.
 

ఈ పద్ధతిలో చదివితే సరి!
పార్ట్‌-ఎ:
మొదటగా జనరల్‌ స్టడీస్‌, జనరల్‌ ఎబిలిటీస్‌ను బాగా చదవాలి. వీలైతే రోజూ వార్తాపత్రికలను అరగంటసేపు చదివి, ఇతరులతో చర్చించాలి.
తెలంగాణ చరిత్ర, నైసర్గిక స్వరూపం, సాయుధ పోరాటం, ఆవిర్భావం గురించి క్షుణ్ణంగా చదవాలి.
తెలంగాణ భాషపై పట్టు పెంచుకోవాలి. భారతదేశ ఆర్థికవ్యవస్థ, సంస్కృతి, సంప్రదాయం, వారసత్వ సంపద మొదలైన అంశాలను బాగా చదవాలి.
జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలపై దృష్టిసారించటం అవసరం.
వీటన్నింటితోపాటు ఇంగ్లిష్‌ భాష, వ్యాకరణాల్లో మెలకువలను తెలుసుకోవాలి.
 

పార్ట్‌-బి: (వ్యవసాయ డిప్లొమా స్థాయి)
మొదట వ్యవసాయశాస్త్రంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, వ్యవసాయ వాతావరణ శాస్త్రం, సేద్యవిజ్ఞాన శాస్త్రం, పంటల ప్రాముఖ్యం, మేలైన యాజమాన్య పద్ధతులు మొదలైన అంశాలను క్షుణ్ణంగా చదవాలి.
నేల విజ్ఞానం, సస్య లేదా వృక్ష ప్రజననం, పంటలపై వచ్చే చీడపీడలు, వాటి నివారణల గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
కూరగాయల సాగు, వాటిని పెంచే విధానం, కూరగాయల నిల్వలో అనుసరించాల్సిన సూత్రాలు, ఉద్యాన పంటల ద్వారా విలువ ఆధారిత పదార్థాల తయారీ మొదలైనవి చదవాలి.
వ్యవసాయ ఆర్థిక మెలకువలు, పంట రుణాలు, లీడ్‌ బ్యాంక్‌ పథకం, రైతు సహకార సంఘాలు - వాటి ప్రాముఖ్యం, వ్యవసాయ మార్కెటింగ్ ‌- వివిధ రకాల మార్కెట్లు, విత్తన పరిశ్రమ, వ్యవసాయ విస్తరణ, గ్రామీణాభివృద్ధి క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
 

అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ (డిప్లొమా )
సర్వేయింగ్‌- వాటి ముఖ్య సూత్రాలు, చైన్‌ సర్వేయింగ్‌, లెవెలింగ్ ‌- వాటి రకాలు, జీపీఎస్‌ (గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం)లను చదవాలి.
హైడ్రోలాజికల్‌ సైకిల్‌, వాటర్‌షెడ్ ‌- వాటి ప్రాముఖ్యం, ఇరిగేషన్‌- వాటి రకాలు, ప్రాముఖ్యం, డ్రైనేజ్‌, వర్క్‌షాప్‌ టెక్నాలజీల గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
వ్యవసాయ పనిముట్లు, హార్వెస్టర్స్‌, ట్రాక్టర్‌, పవర్‌ టిల్లర్లు, హరిత పందిర్లు- వాటి రకాలపై అవగాహన అవసరం.

Posted Date : 26-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌