మాదిరి ప్రశ్నలు
1. త్రివర్గాలు అంటే ఏమిటి?
ఎ) ధర్మం, కామం, మోక్షం బి) ధర్మం, అర్థం, మోక్షం
సి) అర్థం, కామం, మోక్షం డి) ధర్మం, అర్థం, కామం
జవాబు: డి
2. భారతీయ హిందూ సమాజంలో ఏ అంశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు?
ఎ) ధర్మం బి) అర్థం సి) కామం డి) మోక్షం
జవాబు: డి
3. ఏ ఆశ్రమాన్ని గృహస్థ, సన్యాస ఆశ్రమాలకు వారధిగా పేర్కొంటారు?
ఎ) వానప్రస్థం బి) బ్రహ్మచర్యం సి) గృహస్థం డి) సన్యాసం
జవాబు: ఎ
4. ఉపనయన సమయంలో వైశ్యులకు ఉపదేశించే మంత్రం ఏది?
ఎ) గాయత్రీ మంత్రం బి) త్రిష్టుబ్ మంత్రం సి) జగతీ మంత్రం డి) ఏదీకాదు
జవాబు: సి
5. 'భాగవతం' ఒక ... ?
ఎ) శ్రుతి బి) స్మృతి సి) పురాణ గ్రంథం డి) ఇతిహాస గ్రంథం
జవాబు: సి
6. ద్విజులు అంటే ఏమిటి?
ఎ) రెండు జన్మలు కలిగినవారు
బి) ఉపనయన సంస్కారం కలిగినవారు
సి) పై రెండూ డి) ఏదీకాదు
జవాబు: సి
7. కిందివారిలో ద్విజులు ఎవరు?
ఎ) బ్రాహ్మణులు బి) క్షత్రియులు సి) వైశ్యులు డి) పై అందరూ
జవాబు: డి
8. వినడం ద్వారా, గురుముఖంగా, మననం చేసుకోవడం ద్వారా నేర్చుకునేవి ఏవి?
ఎ) స్మృతులు బి) శ్రుతులు సి) పురాణాలు సి) ఇతిహాసాలు
జవాబు: బి
9. ఎంత పురాతనమైనవైనా నిత్యనూతనంగా ఉండేవి ఏవి?
ఎ) ఇతిహాసాలు బి) పురాణాలు సి) వేదాలు డి) ఉపనిషత్తులు
జవాబు: బి
10. సమాజాన్ని ముందుకు కొనసాగించడం, నూతన వ్యక్తులను సమాజంలో భాగస్వామ్యం చేయడం అనే ధర్మం ఏ ఆశ్రమంలో కనిపిస్తుంది?
ఎ) బ్రహ్మచర్యం బి) గృహస్థం సి) వానప్రస్థం డి) సన్యాసం
జవాబు: బి