• facebook
  • whatsapp
  • telegram

వాణిజ్య బ్యాంకులు 

ఇండియన్‌ ఎకానమీ


భారతదేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ - వాణిజ్య బ్యాంకులు 


జాతీయీకరణ చేసిన 14 బ్యాంకులు

code

1 3 2 1 2 1 2 3
a b c d i p s u

1)అలహాబాద్‌ బ్యాంక్‌ (కోల్‌కతా)

 

 2)బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బరోడా)

 

 3)బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ముంబయి)

 

4)బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (పుణె)


 5) సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (కోల్‌కతా)


 6) కెనరా బ్యాంక్‌ (మంగళూరు)


 7) దేనా బ్యాంక్‌ (ముంబయి)


  8) ఇండియన్‌ బ్యాంక్‌ (మద్రాస్‌)


  9)ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (మద్రాస్‌)


 10) పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (దిల్లీ)


11) సిండికేట్‌ బ్యాంక్‌ (మణిపాల్‌)    


12) యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ముంబయి)

 

 13) యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (కోల్‌కతా)


  14) యునైటెడ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌      (కోల్‌కతా)

 

రెండో విడత బ్యాంకుల జాతీయీకరణ


* రెండో విడత బ్యాంకుల జాతీయీకరణ కూడా ఇందిరా గాంధీ నేతృత్వంలోనే జరిగింది. దీనివల్ల దేశంలో మొత్తం 80% బ్యాంకులు ప్రభుత్వ అధీనంలోకి వచ్చాయి. 1980, ఏప్రిల్‌ 15న రూ.200 కోట్లు అంతకంటే ఎక్కువ రిజర్వ్‌ డిపాజిట్లు ఉన్న 6 బ్యాంకులను జాతీయం చేశారు. అవి:


1. ఆంధ్రా బ్యాంక్‌ (హైదరాబాద్‌) 


2. కార్పొరేషన్‌ బ్యాంక్‌ (ఉడిపి)


3. న్యూ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (దిల్లీ) 


4. పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ (అమృత్‌సర్‌)


5. ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ (దిల్లీ)


6. విజయా బ్యాంక్‌ (మంగళూరు)


* 1993, సెప్టెంబరు 4న న్యూ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో విలీనం చేశారు. దీంతో జాతీయం చేసిన మొత్తం బ్యాంకుల సంఖ్య 20 నుంచి 19కి తగ్గింది.

 

బ్యాంకుల జాతీయీకరణ ఫలితాలు


బ్యాంకింగ్‌ రంగంపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ప్రభుత్వ సబ్సిడీ, సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లే వీలు కలిగింది.

 

చిన్న గ్రామాల్లో సైతం ప్రభుత్వ బ్యాంకుల శాఖలు ఏర్పాటయ్యాయి.


బ్యాంకుల ద్వారా లావాదేవీలు నిర్వహించే అలవాటు ప్రజల్లో విస్తరించింది.


ప్రాధాన్య రంగాల కింద బ్యాంకులు వ్యవసాయ రంగానికి తప్పనిసరిగా రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. దీంతో రైతులకు మేలు కలిగింది.


జాతీయీకరణ ముందునాటి పరిస్థితులతో పోలిస్తే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణలభ్యత పెరిగింది.


1990 తర్వాత దేశంలో ప్రైవేట్‌ బ్యాంకుల విస్తరణ జరిగింది. టెక్నాలజీ సాయంతో కొన్ని ప్రైవేట్‌ బ్యాంకులు శరవేగంగా వృద్ధి చెందాయి. అయినప్పటికీ ప్రభుత్వ బ్యాంకుల ప్రభావం తగ్గలేదు. 


దేశంలో ఇప్పటివరకు రుణాల్లో 66%, డిపాజిట్లలో 65% వాటా ప్రభుత్వరంగ బ్యాంకులదే.


ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం - ప్రయోజనాలు


బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (BOB)

 

2019, ఏప్రిల్‌ 1న దేనా బ్యాంక్, విజయా బ్యాంక్‌లను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనం చేశారు.


2020, ఏప్రిల్‌ 1న ప్రభుత్వం విలీనం చేసిన బ్యాంకులు


1. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలను కలిపారు.


2. కెనరా బ్యాంక్‌లో సిండికేట్‌ బ్యాంక్‌ను విలీనం చేశారు.


3. యూనియన్‌ బ్యాంక్‌లో ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకులను కలిపారు.


4. ఇండియన్‌ బ్యాంక్‌లో అలహాబాద్‌ బ్యాంకును  విలీనం చేశారు..


* 2017లో మన దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య 27 ఉండగా, 2020 నాటికి వీటి సంఖ్య 12.


* మన దేశంలో అతి పెద్ద వాణిజ్య/ జాతీయ/ ప్రభుత్వరంగ బ్యాంకు - స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)


* దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు - బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.


* భారత్‌లో మూడో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు - పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌.


* మన దేశంలో అతిచిన్న ప్రభుత్వరంగ బ్యాంకు - పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌.


* కేంద్ర ప్రభుత్వం ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలను ప్రైవేటీకరణ చేయాలని భావిస్తోంది.


నీతి ఆయోగ్‌ ప్రైవేటీకరణకు సూచించిన బ్యాంకులు


1) UCO Bank

2) Bank of Maharashtra

3) Punjab and Sindh Bank

ప్రయోజనాలు:


బ్యాంకుల సంఖ్య తగ్గి, పనితీరు మెరుగుపడుతుంది. పెద్ద వ్యాపార సంస్థలకు అప్పులిచ్చే శక్తి బ్యాంకులకు పెరుగుతుంది.


బహిరంగ మార్కెట్‌ ద్వారా నిధుల సేకరణ సులభం అవుతుంది.


నిర్వహణ ఖర్చులు తగ్గి, ఆర్థికంగా బలపడొచ్చు.


మొండి బాకీల సమస్యను అధిగమించొచ్చు.


లాభాలు పెరిగి, నష్టభయాలు తగ్గుతాయి.


బ్యాంకుల పరిమాణం, వ్యాపారం, వినియోగదార్ల సంఖ్య పెరుగుతుంది. వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు బ్యాంకుకు సాధికారత లభిస్తుంది. సాంకేతికతను అందిపుచ్చుకుని వేగంగా అభివృద్ధి చెందొచ్చు.


ప్రస్తుతం దేశంలోని వివిధ బ్యాంకులు


 ప్రభుత్వరంగ బ్యాంకులు: 12


ప్రైవేట్‌ రంగ బ్యాంకులు: 21


ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు: 43


చిన్నవిత్త బ్యాంకులు: 12


 పేమెంట్‌ బ్యాంకులు: 6


 విదేశీ బ్యాంకులు: 45


 విత్త బ్యాంకులు:

1. National Bank for Agriculture and Rural Development (NABARD)

2. Export-Import Bank of India (EXIM Bank)

3. National Housing Bank sNHBz

4. Small Industries Development Bank of India (SIDBI) 

లోకల్‌ ఏరియా బ్యాకులు: 2

1. Coastal Area Bank Ltd

2. Krishna Bhima Samruddhi (KBS) Local Area Bank 

చిన్నవిత్త బ్యాంకులు


రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 2014, నవంబరు 27న చిన్నవిత్త బ్యాంకుల ఏర్పాటుకు సంబంధించి మార్గదర్శక సూత్రాలను వెలువరించింది.


బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో లేని ప్రజలకు ఆయా సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు, ‘సమ్మిళిత విత్తసేవలు’ (Financial Inclusion) అందించడం దీని ముఖ్య ఉద్దేశం.


రూ.100 కోట్ల కనీస ఈక్విటీ మూలధనంతో వీటిని స్థాపించొచ్చు. 


ఇవి ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరిస్తాయి. సన్నకారు, ఉపాంత రైతులు, చిన్న వ్యాపార సంస్థలు, అసంఘటితరంగంలో పనిచేసే వారికి ఈ బ్యాంకులు రుణాలు ఇస్తాయి.


ప్రస్తుతం మన దేశంలో ఇవి 12 ఉన్నాయి. అవి:

1) AU Small Finance Bank

2) Capital Small Finance Bank

3) Fincare Small Finance Bank

4) Equitas Small Finance Bank

5) ESAF Small Finance Bank

6) Suryoday Small Finance Bank

7) Ujjivan Small Finance Bank

8) Utkarsh Small Finance Bank

9) North East Small Finance Bank

10) Jana Small Finance Bank

11) Shivalik Small Finance Bank

12) Unity Small Finance Bank 

ప్రైవేట్‌ బ్యాంకులు 


బంధన్‌ బ్యాంక్‌


 స్థాపన: 2015, ఆగస్టు 23


 స్థాపకులు: చంద్రశేఖర్‌ ఘోష్‌


ప్రధాన కార్యాలయం: కోల్‌కతా


ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌


స్థాపన: 2015, అక్టోబరు 1

 

 ప్రధాన కార్యాలయం: ముంబయి


 స్థాపకులు: రాజీవ్‌ లాల్‌


హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (హెచ్‌డీఎఫ్‌సీ) బ్యాంక్‌


స్థాపన: 1994, ఆగస్టు


 ప్రధాన కార్యాలయం: ముంబయి


 ఇది దేశంలో అతిపెద్ద మొదటి ప్రైవేట్‌ రంగ బ్యాంకు 


ఇండస్ట్రియల్‌ క్రెడిట్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌    


కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఐసీఐ) బ్యాంక్‌


స్థాపన: 1955


 ప్రధాన కార్యాలయం: ముంబయి

 

 ఇది దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్‌రంగ బ్యాంకు


నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI)
 

దీన్ని 2008లో ఆర్‌బీఐ, ఇండియన్‌ బ్యాంక్‌ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. 


 యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ), రూపేకార్డ్‌ (2012), భీమ్‌ యాప్, భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టం, నేషనల్‌ ఆటోమేటెడ్‌ క్లియరింగ్‌ 


హౌస్‌లను ఇది తీసుకొచ్చింది. వీటివల్ల నగదు బదిలీ సులభతరం అయ్యింది.

పేమెంట్‌ బ్యాంకులు


* వీటిని 2014లో నచికేత్‌ మోర్‌ (Nachiket Mor) కమిటీ సిఫార్సు చేసింది.


* 2015, ఆగస్టు 19న వీటి ఏర్పాటుకు ఆమోదం లభించింది.


* మన దేశంలో ఏర్పాటైన మొదటి పేమెంట్‌ బ్యాంక్‌: ఎయిర్‌టెల్‌ పేమెంట్‌ బ్యాంక్‌.


ఉద్దేశం: 


* ఒక వ్యక్తి నుంచి రూ. లక్ష వరకు డిపాజిట్లు స్వీకరించడం. వారికి చెల్లింపు సేవలు అందించడం.


* అల్పాదాయ వర్గాలు, చిన్న వ్యాపారస్తులు, వలస కార్మికులు, అసంఘటిత రంగంలో పనిచేసేవారికి విత్త సేవలు అందుబాటులో ఉంచడం. 


ఈ బ్యాంకులు రుణాలు అందించడం లేదా క్రెడిట్‌కార్డులు జారీచేయడం లాంటివి చేయకూడదు. డెబిట్‌ కార్డులు జారీ చేయవచ్చు. 

 ప్రసుత్తం మన దేశంలో ‘6’ పేమెంట్స్‌ బ్యాంక్స్‌ ఉన్నాయి. అవి:

1) Airtel Payments Bank
2) India Post Payments Bank
3) Fino Payments Bank
4) Paytm Payments Bank
5) Jio Payments Bank Ltd
6) National Securities Depository Limited NSDL)

 


 


 

 


 

 

 

 

 


 

 

 

 


 

Posted Date : 04-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌