• facebook
  • whatsapp
  • telegram

జీవ సంపద  

మాదిరి ప్రశ్నలు

1. వేచూర్‌ పశు జాతులు ఏ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి? (ASO 2016)
జ: కేరళ

 

2. కిందివాటిలో పాలిచ్చే జాతి కానిది? (SSC 2016)
1. గిర్‌సంద్‌        2. సహివాల్‌          3. నగోరి          4. దేవుని
జ: (3) నగోరి

 

3. పశు సంపద గణాంకాలను ఎన్నేళ్లకు ఒకసారి చేస్తారు? (RRB 2016)
జ: 5

 

4. ప్రపంచంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే దేశం? (GROUP-2, 2011)
జ: భారత్‌

 

5. పంది మాంసాన్ని ఏమని పిలుస్తారు? (FBO 2017)
జ: పోర్క్‌

 

6. 20వ జంతుసంపద గణాంకాల ప్రకారం అత్యధికంగా పశు సంపదను పెంచిన రాష్ట్రాలు?
జ: పశ్చిమ బంగ - తెలంగాణ

 

7. ప్రపంచంలోనే అత్యంత మేలైన జాతిగా ప్రసిద్ధిచెందింది?
జ: ఒంగోలు

 

8. దేశంలో అత్యధిక జంతు సంపద ఉన్న రాష్ట్రం?
జ: ఉత్తర్‌ప్రదేశ్‌

 

ఇంధన ఖనిజాలు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. నల్ల బంగారం అని దేన్ని పిలుస్తారు?
జ. బొగ్గు

 

2. Brown Coal అని దేన్ని పిలుస్తారు?
జ. లిగ్నైట్

 

3. భారతదేశంలో అతి పొడవైన పైప్‌లైన్ ఏది?
జ. హజిర - బిజయ్ పూర్ - జ‌గ్‌దీశ్‌పూర్‌ పైప్‌లైన్

 

4. మోనజైట్ నిల్వలు భారతదేశంలో అత్యధికంగా ఎక్కడ ఉన్నాయి?
జ. కేరళ తీరం

 

5. ప్రైవేట్‌రంగంలో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ అయిన రిలయన్స్ పెట్రోలియం ఎక్కడ ఉంది?
జ. జామ్‌నగర్

 

6. దేశంలోనే మొట్టమొదటి చమురు నిక్షేపాన్ని ఎక్కడ కనుక్కున్నారు?
జ. దిగ్బయ్

 

7. కాంబే చమురు క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి?
జ. గుజరాత్

 

8. భారతదేశంలో అత్యధికంగా బొగ్గును ఉత్పత్తిచేసే ప్రాంతం?
జ. దామోదర్ లోయ

 

9. ఝరియా బొగ్గు నిక్షేపాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
జ. ఝార్ఖండ్

 

10. ఆంధ్రప్రదేశ్‌లో యురేనియం నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయి?
జ. కడప

 

11. చమురు నిక్షేపాలను వెలికి తీసేందుకు ఏర్పాటు చేసిన సంస్థ ఏది?
జ. ONGC

 

12. Ailabet చమురు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది?
జ. గుజరాత్

 

13. యురేనియంను మొదటిసారిగా భారతదేశంలో ఎక్కడ కనుక్కున్నారు?
జ. ఝార్ఖండ్

 

14. సహజ వాయువు రవాణాను నియంత్రించడానికి ఏర్పాటు చేసిన సంస్థ ఏది?
జ. GAIL

 

15. Keonjhar, Mayurbhanj ఖనిజ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది?
జ. ఒడిశా

 

16. భారతదేశంలో ప్రభుత్వ రంగంలో పెద్దదైన 'కొయాలి' (Koyali) ఆయిల్ రిఫైనరీ ఎక్కడ ఉంది?
జ. గుజరాత్

 

విద్యుత్‌శక్తి వనరులు

1. కిందివాటిలో సరైన దాన్ని గుర్తించండి.
ఎ) శక్తి వనరులను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. 
బి) పునరుత్పత్తి చేసేవి, చేయలేనివి అనే రెండు రకాల శక్తి వనరులు ఉంటాయి.
జ. ఎ, బి సరైనవి


2. కిందివాటిలో పునరుత్పాదక శక్తివనరు కానిది?
1) సౌరశక్తి         2) పవనశక్తి    3) భూతాపశక్తి       4) అణుశక్తి
జ. 4) అణుశక్తి


3. సమృద్ధిగా లభించే వాణిజ్యశక్తి వనరులను ఏమని పిలుస్తారు?
జ. రెన్యువబుల్‌ ఎనర్జీ   


4. బొగ్గు, చమురు, సహజవాయువు లాంటివి ఏ రకమైన వనరులు?
జ. అంతరించిపోయేవి   


5. 2018-19 కేంద్ర విద్యుత్‌ శాఖ సంస్థ అంచనాల ప్రకారం కింది అంశాల్లో సరికానిది.
జ. సంప్రదాయేతర/రెన్యువబుల్‌ ఎనర్జీ సుమారు 25% ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది.

 

6. ప్రపంచంలో విద్యుత్‌శక్తి ఉత్పత్తి సామర్థ్యంలో భారత్‌ ఎన్నో స్థానంలో ఉంది?
జ.  మూడో స్థానం 


7.  2017-18 లెక్కల ప్రకారం ప్రపంచంలో భారత్‌ ఎన్నో అతిపెద్ద జలవిద్యుత్తు ఉత్పత్తి దేశం?
జ.  ఏడు


8. భారతదేశంలో తొలి హైడల్‌ ఆధారిత విద్యుత్తు కేంద్రం?
జ. సిద్రాపాంగ్‌ - పశ్చిమ్‌ బంగ  


9. భారతదేశంలో అతిపెద్ద జల విద్యుత్తు కేంద్రం ఎక్కడ ఉంది?
జ. తేహ్రి హైడల్‌ ప్రాజెక్టు - ఉత్తరాఖండ్‌    


10. భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని న్యూక్లియర్‌ రియాక్టర్లు ఉన్నాయి?
జ. 22

 

11.     చెరకు పిప్పిగా పిలిచే బగస్సీ ఏ విద్యుత్‌శక్తికి ప్రధాన ముడి వనరు?
జ. బయోమాస్‌ 


12. ‘డైనమో’ ద్వారా ఉత్పత్తి చేసే శక్తి దేని ప్రధాన వనరు?
జ.  గాలి శక్తి  


13. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ఓషియన్‌ థర్మల్‌ ఎనర్జీ కన్‌వర్షన్‌ ్బవీగినిద్శిను అభివృద్ధి చేయాలని ప్రకటించారు? 
జ. కవరత్తి - లక్షద్వీప్‌ 


14. లడఖ్‌లో ఉన్న ‘పుగ్‌వ్యాలీ’ దేనికి ప్రసిద్ధి?
జ.  భూతాప కేంద్రం  


15. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆలీఘర్‌ జిల్లా కల్యాణపూర్‌ దేనికి ప్రసిద్ధి?
జ. మొదటి సౌరశక్తి ప్లాంట్‌ 


16. ఫొటో వోల్టాయిక్‌ సెల్స్‌ ్బశిజుద్శిను వినియోగించి ఏ రకమైన విద్యుత్‌శక్తిని తయారుచేస్తారు?
జ. సౌరశక్తి   


17. కిందివాటిలో సరైన అంశాలను గుర్తించండి.
ఎ) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మించిన మొదటి జల  విద్యుత్‌ కేంద్రం- శ్రీశైలం హైడల్‌ ప్రాజెక్టు
బి) తెలంగాణలో అతిపెద్ద జలవిద్యుత్‌ కేంద్రం - శ్రీశైలం ఎడమ కాలువ హైడల్‌ ప్రాజెక్టు
జ. ఎ, బి సరైనవి


18. భారతదేశం పవన విద్యుత్‌ ఉత్పత్తిలో ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది?
జ. 4వ 


19. తమిళనాడులోని ‘ముప్పండల్‌’ దేనికి ప్రసిద్ధి?
జ. పవనశక్తి 


20. భారత్‌లో మొదటి భూతాపశక్తి కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
జ. మణికరన్‌ - హిమాచల్‌ ప్రదేశ్‌  


21. దేశంలో అతిపెద్ద సౌర విద్యుత్‌శక్తి ఉత్పత్తి ప్లాంట్‌ ఎక్కడ ఉంది?
జ. కుముత  


22. భారత ప్రభుత్వం 2022 నాటికి ఎంత మొత్తం సౌర విద్యుత్‌ శక్తి సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది?
జ. 175 గిగావాట్లు 


23. సౌరవిద్యుత్‌ను అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు?
జ. కర్ణాటక, తెలంగాణ 


24. బయోగ్యాస్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
జ.  మహారాష్ట్ర  


25.  ‘జట్రోఫా’ మొక్కలను ఏ రకమైన శక్తి తయారీకి పెంచుతున్నారు?
జ. బయో డీజిల్‌  


26.  బయోగ్యాస్‌ తయారీలో వాడే మిశ్రమాలు ఏవి?
జ. మీథేన్‌, హైడ్రోజన్‌ సల్ఫైడ్‌, కార్బన్‌ డై ఆక్సైడ్‌  

 

27. భారతదేశంలో మొదటి తరంగశక్తి ప్లాంట్‌ ‘విజ్‌ ఇంజమ్‌’ ఏ రాష్ట్రంలో ఉంది?
జ. కేరళ  


28. భారతదేశంలో తొలి సముద్ర టైడల్‌ (పోటుపాటుల్శు విద్యుత్‌ ప్లాంట్‌ను ఎక్కడ ప్రారంభించారు? 
జ.  గల్ఫ్‌ ఆఫ్‌ కచ్‌ - గుజరాత్‌  


29. పునర్వినియోగ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
జ. మహారాష్ట్ర   


30. 2018 మార్చి 11న రెన్యువబుల్‌ ఎనర్జీని పెంపొందించడానికి అంతర్జాతీయ సౌర కూటమి (ISA) సదస్సు ఎక్కడ జరిగింది?
జ. న్యూదిల్లీ  


31. కింది అంశాలను పరిశీలించండి. 
ఎ) 1975 లో స్థాపించిన నేషనల్‌ హైడ్రోఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌లో జల విద్యుత్‌తో పాటు ప్రస్తుతం సౌర, భూతాప, టైడల్, పవనశక్తి లాంటి వాటిని అభివృద్ధి చేస్తున్నారు.
బి) నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ నిర్వహణలో ప్రస్తుతం 55 పవర్‌ స్టేషన్లు ఉన్నాయి. ఇందులో 24 బొగ్గు, 7 గ్యాస్‌/డీజిల్, 2 జల విద్యుత్, ఒకటి పవనశక్తి, 11 సోలార్‌ ఆధారిత ప్రాజెక్టులు ఉన్నాయి.
జ. ఎ, బి సరైనవి 

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌