• facebook
  • whatsapp
  • telegram

జీవావిర్భావ పరిణామం

1. ‘ఆర్జిత లక్షణాల అనువంశికత’ అనే జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన   శాస్త్రవేత్త?

జ: లామార్క్‌ 


2. కిందివాటిలో ‘లామార్కిజం’లోని ప్రధానాంశాలు ఏవి?

i)  పర్యావరణ కారకాలైన ఉష్ణోగ్రత, కాంతి, పీడనం, ఆర్ధ్రత లాంటివి సజీవులపై ప్రభావాన్ని చూపిస్తూ, వాటిలో మార్పులకు కారణమవుతున్నాయి.

ii) జీవులకు ఏర్పడిన కొత్త అవసరాలు శరీరంలో నూతన మార్పులకు సహకరిస్తాయి.

iii) ఒక అవయవాన్ని నిరంతరం ఉపయోగించడం వల్ల అది మరింత ప్రభావవంతం అవుతుంది. దాన్ని సరిగ్గా ఉపయోగించలేకపోతే అవశేష అవయవంగా మారుతుంది.

జ: i, ii, iii


3. జిరాఫీ పొడవైన మెడ, ముందు కాళ్లు కింది ఏ జీవపరిణామ సిద్ధాంతాన్ని సరైన రీతిలో తెలుపుతాయి?

జ: లామార్కిజం 


4. బీజద్రవ్య సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త?

జ: వీస్‌మన్‌


5. కింది ఏ సిద్ధాంతాన్ని బీజద్రవ్య సిద్ధాంతం కచ్చితంగా వ్యతిరేకిస్తుంది? 

జ: లామార్కిజం


6. బీజద్రవ్య సిద్ధాంతం ప్రధాన ప్రతిపాదన?

జ: జీవుల్లో లక్షణాలు కేవలం బీజద్రవ్యం ద్వారా మాత్రమే అనువంశికత చెందుతాయి.


7. ‘డార్వినిజం’ అంటే?

జ: ప్రకృతివరణం ద్వారా జీవుల ఆవిర్భావం.


8. ప్రకృతివరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడంలో డార్విన్‌కు సహకరించింది?

జ: ఆల్ఫ్రెడ్‌ రసెల్‌ వాలెస్‌ 


9. ‘ది ఆరిజన్‌ ఆఫ్‌ స్పీసిస్‌ బై మీన్స్‌ ఆఫ్‌ నేచురల్‌ సెలక్షన్‌’ గ్రంథాన్ని రచించింది?

జ: చార్లెస్‌ డార్విన్‌  


10. కిందివాటిలో డార్వినిజాన్ని సరిగ్గా వివరించిన ఉదాహరణ?

జ: ఇండస్ట్రియల్‌ మెలనిజం


11. కిందివాటిలో డార్విన్‌ సిద్ధాంతానికి ఆధారమైన అంశాలు ఏవి? 

i) మనుగడ కోసం పోరాటం       ii) బలవంతులదే మనుగడ

iii) సహజవరణం        iv) ఆర్జిత లక్షణాల అనువంశికత

జ: i, ii, iii 


12. ప్రపంచ సర్వే చేయడానికి డార్విన్‌ వినియోగించిన ఓడ?

జ: HMS బీగిల్‌ 


13. బీజద్రవ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి వీస్‌మన్‌ ఏ జీవులపై ప్రయోగాలు చేశారు?

జ: ఎలుకలు


14. ‘ఫిలాసఫీ జూలాజిక్‌’ గ్రంథకర్త?

జ: లామార్క్‌ 


15. కిందివారిలో డార్విన్‌ పరిశోధనలను ప్రభావితం చేసినవారు? 

i) మాల్థస్‌       ii) చార్లెస్‌ లైల్‌       iii) మెండల్‌    iv) లామార్క్‌

జ:  i, ii  


16. మాల్థస్‌ రాసిన ఏ వ్యాసం ప్రాచుర్యం పొందింది?

జ: ప్రిన్సిపల్స్‌ ఆఫ్‌ పాపులేషన్‌


17. ‘ప్రిన్సిపల్స్‌ ఆఫ్‌ జియాలజీ’ అనే వ్యాసాన్ని రాసింది?

జ:  చార్లెస్‌ లైల్‌  


18. డార్విన్‌ సిద్ధాంతంలోని ప్రధాన లోపాలు ఏవి?

i) చిన్న చిన్న వైవిధ్యాలను కూడా ప్రధాన కారకాలుగా గుర్తించడం.

ii) జెర్మైనల్, సొమాటిక్‌ వైవిధ్యాలకు మధ్య తేడాలు గుర్తించలేకపోవడం.

iii) ప్రకృతివరణం అనే భావన.

జ: i, ii  


19. డార్విన్‌ సిద్ధాంతంలోని లోపాలను సవరించి, ప్రతిపాదించిన జీవపరిణామ   వాదం ఏది?

జ: నియోడార్వినిజం 


20. నియోడార్వినిజం ప్రకారం పరిణామక్రమానికి ప్రధాన కారణాలు?

జ: ఉత్పరివర్తనాలు, సహజవరణం 


21. నియోడార్వినిజం భావనకు ప్రధానంగా సహకరించిన శాస్త్రవేత్తలు ఎవరు?

i) వీస్‌మన్‌      ii) గ్రిగర్‌ జాన్‌ మెండల్‌       iii) డెవ్రీస్‌       iv) లామార్క్‌

జ: i, ii, iii 


22. కిందివాటిలో ప్రకృతివరణ దృగ్విషయానికి ఉదాహరణలు ఏవి?

i) DDT క్రిమినాశకానికి దోమలు నిరోధకతను ప్రదర్శించడం.

ii) సికెల్‌సెల్‌ ఎనీమియా వ్యాధి.

iii) వినియోగించని అవయవాలు అవశేష అవయవాలుగా రూపాంతరం చెందడం.

జ: i, ii  


23. కిందివాటిలో డార్వినిజానికి అనుబంధ సిద్ధాంతాలు ఏవి?

i) కృత్రిమవరణం    ii) లైంగికవరణం       iii) పాన్‌జెనిసిస్‌ సిద్ధాంతం

జ: i, ii, iii  


24. మ్యుటేషన్‌ థియరీ లేదా ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త?

జ: హ్యూగో డెవ్రీస్‌   


25. హ్యూగో డెవ్రీస్‌ తన పరిశోధనలకు వినియోగించిన మొక్క ఏది?

జ: ఈనోథిరా లామార్కియానా


26. కిందివాటిలో ఉత్పరివర్తన సిద్ధాంతంలోని ప్రధానాంశాలను గుర్తించండి?

i) జీవపరిణామానికి ఉత్పరివర్తనాలు ప్రధాన ముడిసరుకుగా ఉపయోగపడుతున్నాయి.

ii) ఈ ఉత్పరివర్తనాలు అన్ని దిశల్లో పరిణామాన్ని ప్రేరేపిస్తాయి.

iii) చిన్న ఉత్పరివర్తనం కూడా కొత్త జీవుల ఏర్పాటుకు కారణమతుంది.

iv) ప్రకృతి ఉపయోగకరమైన ఉత్పరివర్తనాలను ప్రోత్సహిస్తూ, హానికరమైన వాటిని తొలగిస్తూ పరిణామక్రమానికి దోహదం చేస్తుంది.

జ: i, ii, iii, iv

 

27. కిందివాటిలో ఉత్పరివర్తనాలకు సంబంధించి సరైనవి?

i) ఇవి అకస్మాత్తుగా గమనించదగ్గ అనువంశిక లక్షణాలకు కారణమవుతాయి.

ii) ఇవి ప్రతి జీవిలో సంభవించే అవకాశం ఉంది.

iii) కొన్ని సందర్భాల్లో వీటిని మానవుడు కృత్రిమంగా ప్రేరేపించవచ్చు.

జ: i, ii, iii  


28. ఆధునిక జీవపరిణామ సంశ్లేష సిద్ధాంతం లేదా మోడరన్‌ సింథటిక్‌ థియరీ ఆఫ్‌ ఎవల్యూషన్‌ను ప్రతిపాదించిన వారిలో ముఖ్యుడు?

జ: హక్స్‌లీ  


29. ఆధునిక జీవపరిణామ సంశ్లేష సిద్ధాంతం ప్రకారం కిందివాటిలో ఏవి పరిణామక్రమాన్ని ప్రేరేపిస్తాయి?

i) జన్యు ఉత్పరివర్తనాలు    ii) జన్యు పునఃసంయోజనం

iii) క్రోమోజోముల్లో సంభవించే సంఖ్యాపరమైన, నిర్మాణాత్మక మార్పులు.

iv) సహజవరణం      v) ప్రత్యుత్పత్తి సంబంధ వేర్పాటు

జ: i, ii, iii, iv, v


30. ఏ భావనను సీవల్‌ రైట్‌ ప్రభావం లేదా సీవల్‌ రైట్‌ ఎఫెక్ట్‌ అని పిలుస్తారు?

జ: జెనిటిక్‌ డ్రిఫ్ట్‌  


31. కింది వాటిలో జన్యు వైవిధ్యానికి కారణం?

జ: పర్యావరణ, జన్యు కారకాలు  


32. ప్రాదేశిక వేర్పాటు వల్ల కొత్త జీవుల ఆవిర్భావం జరిగితే ఆ నూతన జీవుల ఆవిర్భావాన్ని ఏమంటారు?

జ: అల్లోపాట్రిక్‌ స్పిసియేషన్‌


33. జన్యు సంబంధ పృథఃకరణానికి ప్రధాన కారణం?

i) ఆత్మవంధ్యత్వం     ii) సంకరణ వంధ్యత్వం

iii) జన్యు పునఃసంయోజనం

జ: i, ii 


34. ఒకే జనాభాలో రెండు అంతకంటే ఎక్కువ వైరుధ్య లక్షణాలు ఉన్న జీవులు (ఒకే ప్రదేశంలో నివసించినా) కలిసి ఉండటాన్ని పరిణామక్రమం రీత్యా ఏమని పిలుస్తారు?

జ: పాలీమార్ఫిజం 


35. మానవ పరిణామక్రమం, సంస్కృతి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?

జ: ఆంత్రోపాలజీ


36. ఆధునిక మానవుడికి దగరి సంబంధీకులుగా వేటిని పేర్కొంటారు?

జ: చింపాంజీలు  


37. ఆధునిక మానవుడికి ప్రత్యక్ష పూర్వికులు?

జ: హోమో ఎరక్టస్‌ 


38. మనిషి శాస్త్రీయనామం ఏమిటి?

జ: హోమోసెపియన్స్‌  


39. మానవుడి శాస్త్రీయనామాన్ని సూచించింది?

జ: లిన్నేయస్‌


40. కిందివాటిలో అవశేష అంగానికి ఉదాహరణ?

జ: మానవుడిలోని ఉండుకం


41. నిర్మాణ సారూప్యతను ప్రదర్శించే అవయవాలు?

జ: కీటకం రెక్కలు, పక్షి రెక్కలు

Posted Date : 17-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌