• facebook
  • whatsapp
  • telegram

వృక్ష శరీరధర్మ శాస్త్రం

1. మొక్క పొడవును ఏ పరికరంతో కొలుస్తారు?

1) ఆక్సనోమీటర్‌   2) గోనియోమీటర్‌

3) ఎనిమోమీటర్‌  4) హీమోసైటోమీటర్‌

జ: ఆక్సనోమీటర్‌   

 

2. మొక్కల పెరుగుదలను నియంత్రించే రసాయన పదార్థాలు ఏవి?

1) ఫైటోఫెరోమోన్‌లు 2) ఫైటో హార్మోన్‌లు

3) పాలీ ఎమైన్‌లు   4) ఫైటో రెక్సిన్‌లు

జ: ఫైటో హార్మోన్‌లు

 

3. అవీనా వక్రత పరీక్ష మొక్కల కణజాలంలో ఉత్పన్నమయ్యే ఏ ఫైటోహార్మోన్‌ ఆవిష్కరణకు సంబంధించింది?

1) అబ్‌సైసిక్‌ ఆమ్లం   2) జిబ్బరెల్లిన్‌     3) ఆక్సిన్‌          4) ఎథిలీన్‌

జ: ఆక్సిన్‌          

 

4. మొక్కల్లో సహజంగా లభించే ఆక్సిన్‌కు ఉదాహరణ?

1) NAA          2) IBA        3) 2, 4 - D       4) IAA

జ: IAA

 

5. IAA అంటే ఏమిటి?

1) ఇండోల్‌ ఎసిటిక్‌ యాసిడ్‌       2) ఇండోల్‌ ఆల్కహాలిక్‌ యాసిడ్‌

3) ఇండోల్‌ ఎసిటిక్‌ ఆల్కహాల్‌    4) ఇండోల్‌ ఆల్కైల్‌ ఆల్డిహైడ్‌

జ: ఇండోల్‌ ఎసిటిక్‌ యాసిడ్‌

 

6. కిందివాటిలో సింథటిక్‌ ఆక్సిన్‌లు ఏవి?

i. నాఫ్తలీన్‌ ఎసిటిక్‌ ఆమ్లం (NAA)

ii. ఇండోల్‌ బ్యుటైరిక్‌ ఆమ్లం (IBA)

iii. 2, 4 డైక్లోరో ఫినాక్సీ ఎసిటిక్‌ ఆమ్లం (2, 4 - D)

1) i, ii     2) ii, iii     3) i, iii     4) i, ii, iii

జ: i, ii, iii

 

7. మొక్కల్లో ఇండోల్‌ ఎసిటిక్‌ ఆమ్లం సంశ్లేషణకు ఆధారంగా ఉండే ఎమైనో ఆమ్లం? 

1) ట్రిప్టోఫాన్‌       2) గ్లైసిన్‌     3) ఫినైల్‌ ఎలనిన్‌    4) లైసిన్‌

జ: ట్రిప్టోఫాన్‌       

 

8. కిందివాటిలో సరైన వాక్యాలేవి?

i. కాండాగ్రంలో ఉత్పన్నమయ్యే ఆక్సిన్‌లు ఆధారాభిసారంగా కింది భాగాలకు రవాణా అవుతాయి.

ii. ఆక్సిన్‌ల రవాణా చాలా నెమ్మదిగా జరుగుతుంది.

iii. సాధారణంగా కాండంలో కొనభాగం నుంచి పీఠభాగం వరకు క్రమంగా ఆక్సిన్‌ గాఢత తగ్గుతుంది.

iv. ఆకులు ముదురుతున్న కొద్దీ లేతపత్రాల్లో ఉండే ఆక్సిన్‌ గాఢత తగ్గుతుంది.

1) i, ii, iii          2) ii, iii, iv       3) i, iii, iv      4) i, ii, iii, iv

జ: i, ii, iii, iv​​​​​​​

 

9. ఆక్సిన్‌లు కణస్థాయిలో చూపే ప్రభావాలు ఏవి?

i. కణవిభజన       ii. కణవ్యాకోచం     iii. కణవిభేదనం    iv. కణసంకోచం

1) i, ii, iv       2) ii, iii, iv      3) i, ii, iii        4) ii, iv

జ: i, ii, iii        

 

10. సాధారణంగా కొన్ని మొక్కల్లో అగ్రకోరకాలు పార్శ్వకోరకాల పెరుగుదలను నిరోధిస్తాయి. ఈ దృగ్విషయాన్ని ఏమంటారు?

1) అగ్రాభిసారత     2) అగ్రాధిక్యత       3) ఆధారాభిసారత   4) ఆధారాధిక్యత

జ: అగ్రాధిక్యత

 

11. అగ్రాధిక్యతకు కారణమైన వృద్ధి నియంత్రికం?                                           

1) ఆక్సిన్‌          2) జిబ్బరెల్లిన్‌        3) అబ్‌సైసిక్‌ ఆమ్లం  4) ఎథిలీన్‌

జ: ఆక్సిన్‌          ​​​​​​​

 

12. ఆక్సిన్‌ల శరీర ధర్మ ప్రభావాలను అనుసరించి కిందివాటిలో సరైన వాక్యాలేవి?

i. ఆక్సిన్‌లు సాధారణంగా పుష్పోత్పత్తిని నిరోధిస్తాయి.

ii. ఆక్సిన్‌ల సాయంతో అనిషేక ఫలాలను ఉత్పత్తి చేయొచ్చు.

iii. లేత పత్రాల్లో పత్రదళంలో ఉత్పత్తయ్యే ఇండోల్‌ ఎసిటిక్‌ ఆమ్లం అవి రాలిపోకుండా చేస్తుంది.

iv. పండిన పత్రాల్లో ఆక్సిన్‌ల పరిమాణం తగ్గడం వల్ల ఎండాకాలంలో ఆకులు రాలిపోతాయి.

1) i, ii, iii     2) ii, iii, iv       3) iii, iv      4) i, ii, iii, iv 

జ:  i, ii, iii, iv ​​​​​​​

 

13. మొక్కల్లో అనువర్తన చలనాలు అంటే ఏమిటి?

1) అంతర్గత కారకాల ప్రేరణ వల్ల మొక్కలు చూపే చలనాలు.

2) పోషకాహార లోపం వల్ల మొక్కల పత్రాలు చూపే వివిధ రకాల ఆకార సంబంధ మార్పులు.

3) పరిసర కారకాల ప్రేరణ వల్ల మొక్కల్లో జరిగే చలనాలు.

4) మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరుపుకోవడం వల్ల ఏర్పడే కార్బోహైడ్రేట్లు చేసే చలనాలు.

జ: పరిసర కారకాల ప్రేరణ వల్ల మొక్కల్లో జరిగే చలనాలు.​​​​​​​

 

14. మొక్కల్లో కాంతి అనువర్తన చలనాన్ని ప్రదర్శించేది?

1) వేరు భాగం     2) పుష్పం      3) బెరడు         4) కాండ భాగం

జ: కాండ భాగం

 

15. మొక్కల్లో గురుత్వానువర్తన చలనాలను ప్రదర్శించే భాగం?

1) వేరు         2) కాండం     3) పుష్పం       4) కాండాగ్రం

జ: వేరు         ​​​​​​​

 

16. కలుపు మొక్కల నిర్మూలనకు ఉపయోగించే సింథటిక్‌ ఆక్సిన్‌లు లేదా హెర్బిసైడ్‌ లేదా వీడిసైడ్‌లలో ఉండే సంశ్లేషక ఆక్సిన్‌లు ఏవి?

i. 2, 4 - D        ii. 2, 4, 5 - T  

iii. ఇండోల్‌ బ్యుటైరిక్‌ యాసిడ్‌      iv. నాఫ్తలీన్‌ ఎసిటిక్‌ యాసిడ్‌

1) i, ii, iii       2) i, ii     3) ii, iii, iv      4) i, ii, iii, iv

జ: i, ii​​​​​​​

 

17. 2, 4  D అంటే ఏమిటి?

1) 2, 4 - డైక్లో ఫినాక్‌ జెల్‌

2) 2, 4 - డై ఫినైల్‌ ఎమైన్‌

3) 2, 4, డైక్లోరో ఫినాక్సీ ఎసిటిక్‌ యాసిడ్‌

4) 2, 4 డై కార్బాక్సీ డై ఫినైల్‌ ఎసిటిక్‌ క్లోరైడ్‌

జ:  2, 4, డైక్లోరో ఫినాక్సీ ఎసిటిక్‌ యాసిడ్‌​​​​​​​

 

18. 2, 4, 5 - T అంటే ఏమిటి?

1) 2, 4, 5 ట్రై క్లోరో ఫినాక్సీ ఎసిటిక్‌ యాసిడ్‌

2) 2, 4, 5 ట్రై ఎమైనో కార్బాక్సీ నైట్రో టోలీన్‌

3) 2, 4, 5 ట్రై క్లోరో ఫినాక్‌ నైట్రిల్‌

4) 2, 4, 5 ట్రై కార్బాక్సీ టోలీన్‌

జ: 2, 4, 5 ట్రై క్లోరో ఫినాక్సీ ఎసిటిక్‌ యాసిడ్‌

 

19. జన్యుపరంగా కురచగా ఉండే బఠానీ, మొక్కజొన్న మొక్కలపై వేటిని ప్రయోగించినప్పుడు, అవి మామూలు మొక్కల్లాగా పొడవుగా పెరుగుతాయి?

1) ఆక్సిన్‌లు        2) ఎథిలిన్‌లు     3) జిబ్బరెల్లిక్‌ ఆమ్లం   4) అబ్‌సైసిక్‌ ఆమ్లం

జ: జిబ్బరెల్లిక్‌ ఆమ్లం

 

20. కిందివాటిలో జిబ్బరెల్లిన్‌లు చూపే శరీరధర్మ ప్రభావాలను గుర్తించండి.

i. జిబ్బరెల్లిన్‌లు ప్రధానంగా కణవ్యాకోచం ద్వారా కాండం పెరుగుదలను వృద్ధి చేస్తాయి.

ii. జిబ్బరెల్లిన్‌లను బాహ్యంగా మొక్కకు అందిస్తే మొగ్గలు, విత్తనాల్లో సుప్తావస్థ నిర్మూలితమవుతుంది.

iii. జిబ్బరెల్లిన్‌ల వల్ల కొన్ని మొక్కల్లో బోల్టింగ్‌ జరిగి, పుష్పిస్తాయి.

iv. జిబ్బరెల్లిన్‌లు అనిషేక ఫలనాన్ని ప్రోత్సహిస్తాయి.

1) i, ii, iii       2) ii, iii, iv     3) i, iii, iv            4) i, ii, iii, iv

జ: i, ii, iii, iv​​​​​​​

 

21. కింది వృక్షవృద్ధి నియంత్రికాలను వాటికి సంబంధించిన జీవమాపన విధానాలతో జతపరచండి.

జాబితా - ఎ            జాబితా - బి

i. ఆక్సిన్‌లు            a. పత్రరంధ్రాల మాపనక్రియ

ii. జిబ్బరెల్లిన్‌లు        b.కణ విభజన పరీక్ష

iii. సైటోకైనిన్‌లు        c. అమైలేజ్‌ జీవపరీక్ష

iv. అబ్‌సైసిక్‌ ఆమ్లం     d. అవీనా వక్రత పరీక్ష

                       e. లవణ శోషణ పరీక్ష

1) i-d, ii-c, iii-b, iv-a            2) i-e, ii-d, iii-b, iv-a

3) i-e, i-c, iii-b, iv-a           4) i-d, ii-e, iii-c, iv-a

జ:  i-d, ii-c, iii-b, iv-a

 

22. వ్యవసాయరంగంలో జిబ్బరెల్లిన్‌ల ప్రాధాన్యాన్ని వివరించే కింది వాక్యాల్లో సరైనవి?

i. జిబ్బరెల్లిన్‌ల ప్రయోగం వల్ల ద్రాక్ష లాంటి పళ్లలో బీజరహిత ఫలాలను ప్రేరేపించవచ్చు.

ii. చెరకు మొక్కల దిగుబడిని, సుక్రోజ్‌ శాతాన్ని పెంచడం లాంటివి జిబ్బరెల్లిన్‌ల ప్రయోగం వల్ల సాధించవచ్చు.

iii. పాయిన్‌సెట్టియా, రోడోడెండ్రాన్‌ లాంటి మొక్కల్లో పుష్పాలు అధికంగా ఏర్పడటాన్ని జిబ్బరెల్లిన్‌ల ద్వారా సాధిస్తున్నారు.

iv. బార్లీ విత్తనాల అంకురోత్పత్తిని వేగవంతం చేయడానికి జిబ్బరెల్లిన్‌ ప్రయోగం ఉపయోగపడుతుంది. దీని వల్ల నాణ్యమైన వూల్స్‌ని ఉత్పత్తి చేయొచ్చు.

1) i, ii, iii         2) ii, iii, iv           3) i, iii, iv        4) i, ii, iii, iv

జ: i, ii, iii, iv​​​​​​​

 

23. మొక్కల్లో సహజంగా లభించే జియాటిన్‌ ఏ రకమైన ఫైటో హార్మోన్‌?

1) ఆక్సిన్‌        2) జిబ్బరెల్లిన్‌      3) సైటోకైనిన్‌     4) అబ్‌సైసిక్‌ ఆమ్లం

జ: సైటోకైనిన్‌     ​​​​​​​

 

24. మొక్కలపై సైటోకైనిన్‌లు చూపే ప్రభావానికి సంబంధించి కిందివాటిలో సరైన వాక్యాలేవి?                                 

i. సైటోకైనిన్‌లు ఆక్సిన్‌లతో కలిసి కణజాలాల్లో కణ విభజనను, స్వరూపోత్పత్తిని ప్రోత్సహిస్తాయి.

ii. కణజాలవర్ధనంలో సైటోకైనిన్‌లను వాడినప్పుడు కణవ్యాకోచం ప్రేరేపితమవుతుంది.

iii. విత్తనాల్లో సుప్తావస్థను సైటోకైనిన్‌లు తొలగిస్తాయి.

iv. సైటోకైనిన్‌లు అగ్రాధిక్యతను తొలగించి పార్శ్వమొగ్గల పెరుగుదలను ప్రేరేపిస్తాయి.

1) i, ii, iii, iv     2) i, ii, iii        3) i, iii, iv        4) i, ii, iv

జ: i, ii, iii, iv ​​​​​​​

 

25. ఫైటో హార్మోన్లలో ABA అంటే ఏమిటి?

1) ఎసిటైలీన్‌ యాసిడ్‌            2) అబ్‌సైసిక్‌ యాసిడ్‌

3) అబ్‌సార్బింక్‌ యాసిడ్‌      4) ఎమైనో బ్యుటైరిక్‌ యాసిడ్‌

జ: అబ్‌సైసిక్‌ యాసిడ్‌​​​​​​​

 

26. కిందివాటిలో మొక్కలపై ABA చూపే ప్రభావాలను గుర్తించండి.

i. ABA కణవిభజనను, కణవ్యాకోచాన్ని నిరోధిస్తుంది.

ii. ABA మొక్కల కోరకాల్లో, విత్తనాల్లో సుప్తావస్థను ప్రేరేపిస్తుంది.

iii. పత్రాలు, పుష్పాలు రాలిపోవడాన్ని ABA ప్రోత్సహిస్తుంది.

iv. మొక్కల్లో నీటిశోషణ తగ్గినప్పుడు ABAఉత్పత్తి అధికమై పత్రరంధ్రాలు మూసుకుంటాయి.

1) i, ii, iii       2) ii, iii, iv       3) i, iii, iv     4) i, ii, iii, iv

జ: i, ii, iii, iv

 

27. వాయురూపంలో ఉండే వృక్షవృద్ధి నియంత్రికం?

1) అబ్‌సైసిక్‌ ఆమ్లం     2) ఇండోల్‌ ఎసిటిక్‌ ఆమ్లం

3) జిబ్బరెల్లిక్‌ ఆమ్లం    4) ఎథిలీన్‌

జ: ఎథిలీన్‌    ​​​​​​​

 

28. ఎక్కువగా పండిన పండ్ల నుంచి ఏ ఫైటోహార్మోన్‌ విడుదలవడం వల్ల పక్కన ఉన్న పండ్లు కూడా త్వరగా పక్వానికి వస్తాయి?

1) ఎథిలీన్‌    2) ఇండోల్‌ బ్యుటైరిక్‌ ఆమ్లం  

3) అబ్‌సైసిక్‌ ఆమ్లం   4) పిక్రిక్‌ ఆమ్లం

జ: ఎథిలీన్‌    ​​​​​​​

 

29. కిందివాటిలో సరళ నిర్మాణం ఉన్న వృక్షవృద్ధి నియంత్రకం?

1) CH4      2) C2H4      3) IAA      4) IBA

జ: C2H4    ​​​​​​​

 

30. కిందివాటిలో స్టిరాయిడ్‌ సంబంధ ఫైటో హార్మోన్‌లు ఏవి?

1) బ్రాసినో స్టిరాయిడ్‌లు  2) కార్టికో స్టిరాయిడ్‌లు  

3) కాల్చికో స్టిరాయిడ్‌లు  4) పిక్రికో స్టిరాయిడ్‌లు

జ: బ్రాసినో స్టిరాయిడ్‌లు​​​​​​​

 

31. కాంతి కాలావధి దేనికి సంబంధించింది?

1) కాంతి కాల ప్రమాణంలో ఉన్న తేడాను బట్టి మొక్కల్లో జరిగే శాఖీయాభివృద్ధికి

2) కాంతి కాల ప్రమాణంలో ఉన్న తేడాను బట్టి మొక్కల్లో జరిగే పుష్పించే అనుక్రియకు

3) కాంతి కాల ప్రమాణంలో ఉన్న తేడాను బట్టి మొక్కల్లో జరిగే అనువర్తన చలనానికి

4) కాంతి, నీటిశోషణ మధ్య ఉన్న సంబంధానికి కొలమానం

జ: కాంతి కాల ప్రమాణంలో ఉన్న తేడాను బట్టి మొక్కల్లో జరిగే పుష్పించే అనుక్రియకు​​​​​​​

 

32. ఏ వర్ణద్రవ్యం కాంతిని గ్రహించి, పుష్పించడాన్ని ప్రేరేపిస్తుంది?

1) ఫైటోజాంథిన్‌    2) ఫైటోక్రోమ్‌     3) ఫైటో రెడ్‌      4) ఫైకోబిలిన్‌

జ: ఫైటోక్రోమ్‌​​​​​​​

 

33. ఫైటోక్రోమ్‌ ఏయే రూపాల్లో ఉంటుంది?

1) Pr, Pfr     2) Pp, Ppr     3) Px, Py     4) Pnr, Pr 

జ: Pr, Pfr​​​​​​​

 

34. ఫైటోక్రోమ్‌ Pr రూపంలో ఉంటే ఏ కాంతిని గ్రహిస్తుంది?

1) దూరారుణ కాంతి    2) నీలి కాంతి     3) నల్లని కాంతి       4) అరుణ కాంతి

జ: అరుణ కాంతి

Posted Date : 20-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌