• facebook
  • whatsapp
  • telegram

క్యాలెండర్‌

విషమ రోజులు (Odd Days)


ఇచ్చిన రోజులను 7తో భాగిస్తే వచ్చిన శేషాన్ని విషమ రోజులు అంటారు.


1. 31 రోజుల్లో ఎన్ని విషమ దినాలు ఉంటాయి?


ఎ) 1       బి) 2       సి) 3       డి) ఏదీకాదు


4 వారాలు + 3 రోజులు


సమాధానం: సి

 

2. ఒక సాధారణ సంవత్సరంలో ఎన్ని విషమ రోజులు ఉంటాయి?


ఎ) 1       బి) 3       సి) 4       డి) 2


సాధన: సాధారణ సంవత్సరం అంటే 365 రోజులు


సమాధానం:

 

గమనిక:


 సాధారణ సంవత్సరంలో (365 రోజులు) 


= 52 వారాలు + 1 విషమ రోజు ఉంటాయి.


 లీపు సంవత్సరంలో (366 రోజులు) 


= 52 వారాలు + 2 విషమ రోజులు ఉంటాయి.


3. వందేళ్లలో ఎన్ని విషమ రోజులు ఉంటాయి?


ఎ) 2       బి) 3       సి) 1       డి) 5


సాధన: వందేళ్లలో 24 లీపు సంవత్సరాలు, 76 సాధారణ సంవత్సరాలు ఉంటాయి.


ప్రతి లీపు సంవత్సరానికి 2 విషమ రోజులు, ప్రతి సాధారణ సంవత్సరానికి 1 విషమ రోజు ఉంటాయి.


కాబట్టి 100 సంవత్సరాల్లో,

​​​​​​

17 వారాలు + 5 విషమ రోజులు


సమాధానం: డి

4. కింది వాటిలో సాధారణ సంవత్సరం ఏది?


ఎ) క్రీ.శ. 600         బి) క్రీ.శ. 1172        సి) క్రీ.శ. 1136         డి) క్రీ.శ. 1600


సాధన: ఇచ్చిన వాటిలో సాధారణ సంవత్సరం క్రీ.శ. 600. ఎందుకంటే 600 మినహా మిగిలిన సంవత్సరాల్లో చివరి రెండు సంఖ్యలను 4తో భాగించవచ్చు.


 100వ సంవత్సరం చివరి రోజు - శుక్రవారం


 200వ సంవత్సరం చివరి రోజు - బుధవారం


 300వ సంవత్సరం చివరి రోజు - సోమవారం


 400వ సంవత్సరం చివరి రోజు - ఆదివారం


 ఏదైనా శతాబ్ద సంవత్సరం చివరి రోజులుగా మంగళవారం, గురువారం, శనివారం ఉండవు.     

సమాధానం:


5. మన జాతీయ గీతం ‘జనగణమన’ను మొదటిసారి 1911, డిసెంబరు 27న ఆలపించారు. అయితే ఆ రోజు ఏ వారం?


ఎ) సోమవారం         బి) బుధవారం 


సి) మంగళవారం         డి) గురువారం

27 -డిసెంబరు -1911


​​​

3 అంటే బుధవారం     

సమాధానం: బి

 

6. 15-08-1947 ఏ రోజు?


ఎ) సోమవారం         బి) మంగళవారంసి) శనివారం         డి) శుక్రవారం


   5 = శుక్రవారం     

సమాధానం: డి


7. 24-01-2016 ఏ రోజు?


ఎ) ఆదివారం         బి) శనివారం  సి) శుక్రవారం         డి) ఏదీకాదు

 1 అంటే సోమవారం. కానీ సమాధానం ఆదివారం అవుతుంది. ఎందుకంటే ఇచ్చిన సంవత్సరం లీపు సంవత్సరం. కాబట్టి సోమవారం కంటే ముందు రోజైన ఆదివారాన్ని సమాధానంగా తీసుకోవాలి.


సమాధానం:


8. ఏదైనా సంవత్సరంలో జూన్‌ 14 మంగళవారం అయితే అక్టోబరు 15 ఏ రోజు అవుతుంది?


ఎ) శనివారం         బి) ఆదివారం  సి) శుక్రవారం         డి) ఏదీకాదు


సాధన:    జూన్‌  జులై  ఆగస్టు  సెప్టెంబరు అక్టోబరు  


మిగిలినరోజులు      16 +3 +3 +2 +15  యథావిధిగా    రోజు 

(ఇక్కడ జులై, అక్టోబరు మినహా మిగిలిన నెలలకు విషమ రోజులు తీసుకోవాలి.)

మంగళవారం నుంచి 4 అంటే శనివారం అవుతుంది.


సమాధానం:

శతాబ్దం కోడ్‌ ( century code )


  శతాబ్దం         కోడ్‌ 


1600  1699       6 

1700  1799      4

1800  1899       2  

1900  1999      0 

2000  2099      6


నెలల కోడ్‌ (monthes code )


నెల         కోడ్‌


జనవరి       0

ఫిబ్రవరి      3

మార్చి         3

ఏప్రిల్‌         6

మే               1

జూన్‌           4

జులై            6

ఆగస్టు          2

సెప్టెంబరు    5

అక్టోబరు        0

నవంబరు      3

డిసెంబరు      5


వారం కోడ్‌ (week code )


వారం         కోడ్‌


ఆది             0

సోమ            1

మంగళ         2

బుధ             3

గురు             4

శుక్ర             5

శని             6


రచయిత

బూసర గణేష్, 

విషయ నిపుణులు 

 

 

 


 

 

 

 

 


 

Posted Date : 28-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌