1. వృక్ష, జంతు కళేబరాలు కుళ్లకుండా ఉండటానికి ఏ రసాయన పదార్థాన్ని ఉపయోగిస్తారు?
జ: ఫార్మలిన్
2. పొటాషియం నైట్రేట్, కోక్, గంధకం మిశ్రమాన్ని దేనికి ఉపయోగిస్తారు?
జ: తుపాకీ మందుగా
3. పేలుడు పదార్థంగా ఉపయోగించే అమ్మోనాల్ వేటి మిశ్రమం?
జ: అల్యూమినియం పొడి + అమ్మోనియం నైట్రేట్
4. 10% కార్బన్ డైఆక్సైడ్, 90% ఆక్సిజన్ వాయువుల మిశ్రమాన్ని ఏమంటారు?
జ: కార్బోజన్
5. కిందివాటిలో అత్యధిక కాటనేషన్ సామర్థ్యం ఉన్న మూలకం ఏది?
జ: కార్బన్
6. కిందివాటిలో అలోహం ఏది?
1) ఫ్లోరిన్ 2) ఆక్సిజన్ 3) 1, 2 4) యురేనియం
జ: 1, 2
7. కిందివాటిలో అతి భారయుతమైన మూలకం ఏది?
1) హీలియం 2) యురేనియం 3) ఇనుము 4) జింక్
జ: యురేనియం
8. ‘గమాక్సిన్’ రసాయన నామం ఏమిటి?
జ: బెంజీన్ హెక్సాక్లోరైడ్
9. ‘ఫైర్‌డాంప్’ అని ఏ వాయువును పిలుస్తారు?
జ: మీథేన్
10. కింది అంశాలను జతపరచండి.
సాధారణ నామం రసాయన నామం
a) మైలుతుత్తం i) సోడియం సల్ఫేట్
b) జిప్సం ii) కాల్షియం సల్ఫేట్
c) సాల్ట్‌కేక్ iii) కాపర్ సల్ఫేట్
జ: a-iii, b-ii, c-i
11. కిందివాటిలో ‘ఆమ్లాల రాజు’ అని దేన్ని అంటారు?
1) హైడ్రోక్లోరిక్ ఆమ్లం 2) సల్ఫ్యూరిక్ ఆమ్లం 3) ఎసిటిక్ ఆమ్లం 4) నైట్రిక్ ఆమ్లం
జ: సల్ఫ్యూరిక్ ఆమ్లం
12. చక్కెర లేదా సుక్రోజ్ రసాయన ఫార్ములా?
జ: C12H22O11
13. కిందివాటిలో అతి తేలికైన, బరువైన మూలకాలు ఏవి?
1) లిథియం, ఆస్మియం 2)ఆస్మియం, లిథియం
3) అల్యూమినియం, ఆస్మియం 4) ఆస్మియం, అల్యూమినియం
జ: లిథియం, ఆస్మియం
14. సోడియం లోహాన్ని ఎందులో నిల్వ చేస్తారు?
జ: కిరోసిన్
15. నిప్పు ఆర్పే యంత్రం (Fire Extinguisher) లో ఉండే వాయువు....
జ: కార్బన్ డైఆక్సైడ్
16. పాలు ఏ రకానికి చెందిన కొల్లాయిడ్ ద్రావణం?
జ: నీటిలో కొవ్వు విక్షేపణ చెందితే ఏర్పడింది
17. నాన్‌స్టిక్ వంట పాత్రలపై కింది ఏ పూత ఉంటుంది?
జ: టెఫ్లాన్
18. కిందివాటిలో పాలిమర్‌కు ఉదాహరణ ఏది?
1) పాలు 2) సుక్రోజ్ 3) సహజ రబ్బరు 4) బ్యూటేన్
జ: సహజ రబ్బరు
19. ఎరువుల్లో ఉండే మూడు ముఖ్య మూలకాలు ఏవి?
జ: నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం
20. రసాయనికంగా నీరు ఒక.....
జ: ఆక్సైడ్
21. వర్షపు నీరు pH విలువ ఎంత?
జ: 5.6
22. కిందివాటిలో మిశ్రమ ఎరువుకు ఉదాహరణ?
1) అమ్మోనియం సల్ఫేట్ 2) యూరియా 3) అమ్మోనియం క్లోరైడ్ 4) NPK
జ: NPK
23. కింది ఏ వాయువులను ఉపయోగించి అమ్మోనియా వాయువును తయారు చేస్తారు?
1) ఉదజని, ఆక్సిజన్ 2) నత్రజని, క్లోరిన్ 3) ఉదజని, నత్రజని 4) నత్రజని, ఆక్సిజన్
జ: ఉదజని, నత్రజని
24. సెంట్రల్ గ్లాస్ అండ్ సెరామిక్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
జ: జాదవ్‌పూర్
25. కింది అంశాలను జతపరచండి.
జాబితా-ఎ జాబితా-బి
a) లిథియం i) మూలకాల రారాజు
b) కార్బన్ ii) మందకొడి వాయువు
c) నైట్రోజన్ iii) తేలికైన లోహం
జ: a-iii, b-i, c-ii
26. కింది అంశాలను జతపరచండి.
జాబితా-ఎ జాబితా-బి
a) సహజ వాయువు i) ఆస్ప్రిన్
b) అనాల్జెసిక్ ii) సోడియం థయోసల్ఫేట్
c) హైపో iii) మీథేన్
జ: a-iii, b-i, c-ii
27. కిందివాటిలో సరైనవి ఏవి?
i) వజ్రం కార్బన్ మూలకం రూపాంతరం.
ii) క్లోరిన్ ఘాటైన వాసన కలిగిన ప్రమాదకర వాయువు.
iii) ఫ్లోరిన్ అత్యధిక చర్యాశీలతను ప్రదర్శించే హాలోజన్ మూలకం.
iv) పెట్రోలియం వివిధ హైడ్రోకార్బన్ల మిశ్రమం.
జ: i, ii, iii, iv
28. కిందివాటిలో ‘మాల్ట్ షుగర్’ అని దేన్ని అంటారు?
1) ఫ్రక్టోజ్ 2) లాక్టోజ్ 3) మాల్టోజ్ 4) సెల్యులోజ్
జ: మాల్టోజ్
29. ప్రతి ద్రవ పదార్థం తన ఉపరితలాన్ని ఏ విధంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది?
జ: కనిష్ఠంగా
30. ప్రోటీన్లు అధికంగా అభించే పదార్థాలు ఏవి?
1) మాంసం 2) పాలు 3) సోయాచిక్కుడు 4) పైవన్నీ
జ: పైవన్నీ
31. కిందివాటిలో విటమిన్ ఏది?
1) ఎసిటిక్ ఆమ్లం 2) సిట్రిక్ ఆమ్లం 3) ఫోలిక్ ఆమ్లం 4) ఫార్మిక్ ఆమ్లం
జ: ఫోలిక్ ఆమ్లం
32. కింది అంశాలను జతపరచండి.
జబితా-ఎ జాబితా-బి
a) విటమిన్లు i) శక్తి నిల్వలు
b) ఎంజైమ్‌లు ii) సూక్ష్మపోషకాలు
c) కొవ్వులు iii) ప్రోటీన్లు
జ: a-ii, b-iii, c-i
33. కిందివాటిలో స్థూల పోషకాలు ఏవి?
1) కార్బోహైడ్రేట్లు 2) ప్రోటీన్లు 3) కొవ్వులు 4) పైవన్నీ
జ: పైవన్నీ
34. మనం తీసుకునే ఆహారంలో అధికంగా....... ఉంటాయి.
జ: కార్బోహైడ్రేట్లు
35. కార్బోహైడ్రేట్లలో రసాయనికంగా ఉండే మూలకాలు ఏవి?
1) కార్బన్ 2) ఆక్సిజన్ 3) హైడ్రోజన్ 4) పైవన్నీ
జ: పైవన్నీ
36. సుక్రోజ్‌ను జలవిశ్లేషణ చేస్తే ఏర్పడే చక్కెర.....
i) ఫ్రక్టోజ్ ii) గ్లూకోజ్ iii) సెల్యులోజ్ iv) మాల్టోజ్
జ: i, ii
37. రక్తంలో ఏ చక్కెర స్థాయి ఎక్కువ అవడాన్ని డయాబెటిస్ అంటారు?
జ: గ్లూకోజ్
38. బీట్రూట్ నుంచి ఏ రకం చక్కెరను తయారు చేస్తారు?
జ: సుక్రోజ్
39. ప్రోటీన్లలో ఉండే మూలకాలు ఏవి?
i) కార్బన్ ii) ఆక్సిజన్ iii) నైట్రోజన్ iv) సల్ఫర్ v) హైడ్రోజన్ vi) లెడ్
జ: i, ii, iii, iv, v
40. కిందివాటిలో రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది ఏది?
1) డైనమో 2) బ్యాటరీ 3) పైరోమీటర్ 4) గాల్వనోమీటర్
జ: బ్యాటరీ
41. పదార్థ ఘనపరిమాణానికి ప్రమాణం ఏది?
1) కేజీ 2) మీటర్3 3) సెం.మీ.3 4) 1, 2
జ: 1, 2
42. కింది అంశాలను జతపరచండి.
జాబితా - ఎ జాబితా - బి
a) పార్సెక్ i) 10-15 మీటర్
b) ఫెర్మీ ii)107 ఎర్గ్
c) జౌల్ iii) 3.26 కాంతి సంవత్సరాలు
జ: a-iii, b-i, c-ii
43. పరమ శూన్య ఉష్ణోగ్రత = ........ o C
జ: - 273
44. వాతావరణ పీడనం విలువ నెమ్మదిగా తగ్గితే, అది దేన్ని సూచిస్తుంది?
జ: వర్షం రాకను