1. "కొన్ని నియమాల ఆధారంగా జీవులను వేర్వేరు వర్గాలుగా వేరు చేసి అమర్చే విధానం" ఏ శాస్త్ర పరిధిలోకి వస్తుంది?
జ: వర్గీకరణశాస్త్రం
2. జీవరాశులను గుర్తించి వర్గీకరించడానికి ప్రయత్నించిన తొలి వ్యక్తి?
జ: అరిస్టాటిల్
3. వర్గీకరణలో ప్రాథమిక ప్రమాణం (మూల ప్రమాణం)-
జ: జాతి
4. 'జాతులు' అనే పదాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎవరు?
జ: జాన్ రే
5. జాతిని రెండు పేర్లతో పిలిచే ద్వినామీకరణ విధానాన్ని మొదటగా ప్రవేశపెట్టింది-
జ: గాస్పర్డ్ బాహీన్
6. లిన్నెయస్ వర్గీకరణలో భాగంగా జంతువుల మీద రాసిన గ్రంథం పేరేంటి?
జ: సిస్టమా నాచురె
7. 'వర్గీకరణ' అనే పదాన్ని మొదట ప్రతిపాదించింది
జ: ఎ.పి.డి. కండోల్
8. "దగ్గర పోలికలు కలిగి, ఒకదాంతో ఒకటి స్వేచ్ఛగా సంపర్కం జరుపుకునే జీవరాశుల సమూహమే"-
జ: జాతి
9. వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఎవరు?
జ: లిన్నెయస్
10. చింతచెట్టు శాస్త్రీయ నామం - 'టామరిండస్ ఇండికా L' - ఇందులో 'L' అనే అక్షరం దేన్ని సూచిస్తుంది?
జ: ఆ చెట్టుకు శాస్త్రీయ నామం పెట్టింది లిన్నెయస్
11. భారతదేశంలో అనుసరిస్తున్న మొక్కల వర్గీకరణ విధానం-
జ: బెంథామ్, హుకర్ విధానం
12. 'అతిపురాతనమైన జీవులు' ఉన్న రాజ్యమేది?
జ: మొనీరా
13. 'నాస్టాక్, అనబీనా' లాంటి జీవులున్న రాజ్యం?
జ: మొనీరా
14. 'సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్లు' అని వేటినంటారు?
జ: డయాటమ్స్
15. 'భూమిని శుభ్రపరిచే తోటీలని' వేటినంటారు?
జ: శిలీంద్రాలు
16. 'ట్రాఖియోఫైటా' వర్గంలో అతి ప్రాథమికాలు -
జ: ఫెర్న్లు
17. 'మూన్ జెల్లీ'లు కింది ఏ వర్గానికి చెందిన జీవులు?
ఎ) ఫొరిఫెరా బి) టీనోఫోరా సి) సీలెంటిరేటా డి) అనెలిడా
జ: టీనోఫోరా
18. ఒక శాస్త్రవేత్త తన పరిశోధనల కోసం HCl లాంటి ఆమ్లమాధ్యమంలో కూడా నివసించగలిగే ఏకకణ జీవులను ఎన్నుకున్నాడు. అవి ఏ రాజ్యానికి చెందినవి?
జ: మొనీరా
19. కిందివాటిలో నిర్దిష్ట కేంద్రకం ఉన్న ఏకకణ జీవులను గుర్తించండి.
ఎ) మొనీరా బి) మెటాఫైటా సి) మెటాజోవా డి) ప్రొటిస్టా
డి) ప్రొటిస్టా
20. 'అత్యధిక వైవిధ్యం' చూపే జీవులు కింది ఏ రాజ్యానికి చెందుతాయి?
ఎ) మొనీరా బి) ప్రొటిస్టా సి) ప్లాంటే డి) అనిమేలియా
జ: అనిమేలియా
21. వర్గీకరణ శాస్త్రం ఏ విషయంలో ఉపయోగపడదు?
జ: జీవులలో వ్యాధుల వల్ల కలిగే మార్పులను అధ్యయనం చేయడానికి