• facebook
  • whatsapp
  • telegram

కొల్లాయిడ్‌ ద్రావణాలు

మాదిరి ప్రశ్నలు


1. స్టార్చ్‌ ద్రావణం ఏ రకం కొల్లాయిడ్‌ ద్రావణానికి ఉదాహరణ?

1) లయోఫిలిక్‌        2) ద్రవప్రియ

3) ద్రవవిరోధి         4) 1, 2

 

2. కిందివాటిలో లయోఫోబిక్‌ కొల్లాయిడ్‌  ద్రావణానికి ఉదాహరణ?

1) గోల్డ్‌ సోల్‌      2) సిల్వర్‌ సోల్‌

3) చక్కెర ద్రావణం   4) 1, 2

 

3. హైడ్రోసోల్‌లో విక్షేపణ యానకం ఏమిటి?

1) ఆల్కహాల్‌      2) గాలి

3) నీరు          4) పైవన్నీ

 

4. కిందివాటిలో ఎమల్షన్‌ రకానికి చెందిన కొల్లాయిడ్‌ ద్రావణం?

1) జున్ను  2) పాలు  

3) పొగ  4) మేఘం

 

5. ఎమల్షన్‌ ఏ రకానికి చెందిన కొల్లాయిడ్‌ ద్రావణం?

1) ఘనంలో ద్రవం   2) ద్రవంలో వాయువు 

3) వాయువులో ద్రవం 4) ద్రవంలో ద్రవం

 

6. ద్రవ పదార్థాల్లో ఘన పదార్థం విక్షిప్తం చెందిన కొల్లాయిడ్‌ ద్రావణాన్ని ఏమంటారు?

1) సోల్‌         2) ఏరోసోల్‌

3) ఘన సోల్‌     4) పైవన్నీ

 

7. కిందివాటిలో ‘సోల్‌’ రకానికి చెందిన కొల్లాయిడ్‌ ద్రావణం?

i. రక్తం           ii. పెయింట్‌

iii. సిరా         iv. గోల్డ్‌ సోల్‌

1) i, ii, iv        2) i, iv

3) ii, iii          4) i, ii, iii, iv

 

8. కిందివాటిలో సజాతీయ మిశ్రమం ఏది?

1) గ్లూకోజ్‌ ద్రావణం  2) సుక్రోజ్‌ ద్రావణం  

3) సజల నత్రికామ్లం  4) పైవన్నీ

 

9. కింది అంశాలను జతపరచండి.

జాబితా - ఎ                 జాబితా - బి 

a) నిజద్రావణం              i) కణ పరిమాణం 1nm -1000 nm

b) కొల్లాయిడ్‌ ద్రావణం    ii) కణ పరిమాణం 1 nm

c) అవలంబనం              iii) కణ పరిమాణం > 1000 nm

1) a-ii, b-i, c-iii        2) a-iii, b-i, c-ii

3) a-ii, b-iii, c-i       4) a-iii, b-ii, c-i

 

10. కిందివాటిలో కొల్లాయిడ్‌ ద్రావణానికి ఉదాహరణ?

i. ఉప్పు ద్రావణం  ii. యూరియా ద్రావణం 

iii. పాలు        iv. రక్తం

v. జున్ను        vi. పొగమంచు

1) i, iii, v         iii, iv, v, vi

3) ii, iv, vi        4) iv, v, vi 

 

11. వాయువులో వాయు పదార్థాలు ఏ రకం ద్రావణాలను ఏర్పరుస్తాయి?

1) అవలంబనాలు      2) నిజ ద్రావణాలు   

3) కొల్లాయిడ్‌ ద్రావణాలు 4) పైవన్నీ

 

12. కింది అంశాలను జతపరచండి.

కొల్లాయిడ్‌ రకం      ఉదాహరణ

a) జెల్‌             i) పొగ 

b) ఏరోసోల్‌        ii) జున్ను 

c) ఘనసోల్‌       iii) ప్యూమిస్‌ రాళ్లు

1) a-i, b-ii, c-iii        2) a-ii, b-iii, c-i

3) a-ii, b-i, c-iii       4) a-iii, b-i, c-ii

 

13. ‘నురుగు’ (ఫోమ్‌) ఏ రకం కొల్లాయిడ్‌ ద్రావణం?

1) ద్రవంలో వాయువు  2) వాయువులో ద్రవం

3) ద్రవంలో ద్రవం    4) వాయువులో వాయువు

 

14. కిందివాటిలో సరైంది ఏది?

i. కొల్లాయిడ్‌ల పరిరక్షణ సామర్థ్యాన్ని పరిమాణాత్మకంగా గోల్డ్‌ సంఖ్యలో కొలుస్తారు.

ii. గోల్డ్‌ సంఖ్య విలువ తక్కువగా ఉంటే, కొల్లాయిడ్‌ పరిరక్షణ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.

1) i    2) ii    3) i, ii  4) పైవేవీకావు

 

15. అవక్షేపానికి కొద్దిగా ఎలక్ట్రోలైట్‌ను కలిపి బాగా కుదిపి కొల్లాయిడ్‌గా మార్చే పద్ధతిని ఏమంటారు?

1) స్కందనం       2) పెప్టీకరణం

3) డయాలసిస్‌      4) విసరణం

 

16. కొల్లాయిడ్‌ ద్రావణాన్ని అవక్షేపంగా మార్చే ప్రక్రియను ఏమంటారు?

1) పెప్టీకరణం      2) స్కందనం

3) అధిశోషణం     4) ఉత్ప్రేరణం

 

17. ‘రక్తం’ అనే కొల్లాయిడ్‌ ద్రావణంలో విక్షిప్త ప్రావస్థ ఏది?

1) నీరు          2) అల్బుమినాయిడ్‌

3) ద్రవ కొవ్వు     4) కేసిన్‌

 

18. కిందివాటిలో ధనావేశ కొల్లాయిడ్‌ ఏది?

1) గోల్డ్‌ సోల్‌                   2) సిల్వర్‌ సోల్‌

3) రక్తంలోని హిమోగ్లోబిన్‌  4) స్టార్చ్‌ సోల్‌

 

19. సాధారణ సబ్బు రసాయన నామం ఏమిటి?

1) కొవ్వు ఆమ్లాల సోడియం లవణం   2) కొవ్వు ఆమ్లాల పొటాషియం లవణం

3) ఆల్కైల్‌ బెంజీన్‌ సల్ఫోనేట్‌   4) 1, 2 

 

20. జంతు చర్మాన్ని టానిన్‌ అనే కొల్లాయిడ్‌ ద్రావణంలో నానబెట్టి, గట్టిపడేలా చేసే ప్రక్రియను ఏమంటారు?

1) ఎమల్సీకరణం      2) టానింగ్‌

3) గాల్వనీకరణం      4) జెలేషన్‌

 

21. పాలు ఏ రకం కొల్లాయిడ్‌ ద్రావణం?

1) నీటిలో తైలం రకం ఎమల్షన్‌  2) జెల్‌

3) తైలంలో నీటి రకం ఎమల్షన్‌   4) నురుగు

 

22. కిందివాటిలో బ్రౌనియన్‌ చలనానికి సంబంధించి సరైనవి?

i. బ్రౌనియన్‌ చలనాన్ని మొదటిసారిగా వృక్ష శాస్త్రవేత్త రాబర్ట్‌ బ్రౌన్‌ కనుక్కున్నారు.

ii. కొల్లాయిడ్‌ కణాల పరిమాణం, ద్రావణాల స్నిగ్ధత తక్కువగా ఉంటే బ్రౌనియన్‌ చలనానికి వేగం ఎక్కువగా ఉంటుంది.

iii. బ్రౌనియన్‌ చలనానికి ఉండే గిలకరించే స్వభావం వల్ల కొల్లాయిడ్‌ ద్రావణానికి స్థిరత్వం కలుగుతుంది.

iv. కొల్లాయిడ్‌ కణాలు కాంతిని అన్ని దిశల్లో పరిక్షేపణం చెందించడమే బ్రౌనియన్‌ చలనానికి కారణం.

1) i, iii              2) i, ii   

3) i, ii, iii          4) ii, iv

 

23. ప్రతిపాదన (A): కొల్లాయిడ్‌ ద్రావణం టిండాల్‌ ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. 

కారణం (R): కొల్లాయిడ్‌ ద్రావణంలోని కణాలు కాంతిని అన్ని దిశల్లో పరిక్షేపణం చెందించడమే టిండాల్‌ ప్రభావానికి కారణం.

1) A నిజం కానీ R తప్పు 

2) A తప్పు కానీ R నిజం

3) A, R రెండూ నిజం, A కు R సరైన వివరణ

4) A, R రెండూ నిజం, A కు R సరైన వివరణ కాదు

 

24. ఎమల్షన్‌ను స్థిరంగా ఉంచేందుకు కలిపే పదార్థాన్ని ఏమంటారు?

1) ఆక్సీకరణ కారకం  2) క్షయకరణ కారకం

3) ఎమల్సీకరణ కారకం  4) నిర్జలీకరణ కారకం

 

25. కిందివాటిలో ఎమల్సీకరణ కారకానికి ఉదాహరణ ఏది?

1) గుడ్డు ఆల్బుమిన్‌    2) సబ్బు

3) గ్రాఫైట్‌ చూర్ణం     4) పైవన్నీ

 

26. పాలలోని ఎమల్సీకరణ కారకం ఏది?

1) ఆల్బుమిన్‌        2) కేసిన్‌

3) కేఫిన్‌           4) సబ్బు

 

27. కొన్ని లవణ ద్రావణాల అణువులు ఒక దానితో మరొకటి కలిసి సముచ్ఛయం చెంది ఏర్పడే కొల్లాయిడ్‌లను ఏమంటారు?

1) మిసెల్‌         2) జెల్‌

3) పాలిమర్‌        4) పైవేవీకావు

 

28. కిందివాటిలో రుణావేశ సోల్‌లు ఏవి?

1) గోల్డ్‌ సోల్‌      2) సిల్వర్‌సోల్‌

3) బంకమట్టి సోల్‌  4) పైవన్నీ

 

29. ఒక జెల్‌ను నిల్వ ఉంచినప్పుడు ద్రావణిని కోల్పోయి కుచించుకుపోయే ప్రక్రియను ఏమంటారు?

1) థిక్సోట్రొపి      2) సినెరిసిస్‌

3) ఎమల్షన్‌       4) జెలేషన్‌ 

30. కిందివాటిలో స్థితిస్థాపకత లేని జెల్‌?

1) సిలికా జెల్‌     2) అల్యూమినా జెల్‌

3) జిలాటిన్‌       4) 1, 2

 

31. కిందివాటిలో సహచరిత కొల్లాయిడ్‌?

1) సబ్బు        2) స్టార్చ్‌

3) గోల్డ్‌సోల్‌      4) సిల్వర్‌సోల్‌

 

32. ‘ఫాగ్‌’ ఏ రకం కొల్లాయిడ్‌ ద్రావణం?

1) ద్రవంలో వాయువు   2) వాయువులో ద్రవం

3) ద్రవంలో ద్రవం  4) ద్రవంలో ఘనం

 

33. అత్యంత బలమైన కొల్లాయిడ్‌ రకం?

1) జెల్‌         2) ఎమల్షన్‌

3) సోల్‌        4) ఘనసోల్‌

 

34. ‘గోల్డ్‌ సంఖ్య’ను మొదటగా ఉపయోగించిన శాస్త్రవేత్త?

1) జిగ్మాండి       2) రాబర్ట్‌ బ్రౌన్‌

3) నీల్స్‌బోర్‌       4) హెన్రీ

 

35. కిందివాటిలో అనుత్క్రమణీయ జెల్‌కు ఉదాహరణ ఏది?

1) జిలాటిన్‌       2) సిలికాజెల్‌

3) పొగమంచు     4) 1, 2

 

36. ‘సల్ఫర్‌ సోల్‌’ ఏ రకమైన కొల్లాయిడ్‌ ద్రావణానికి ఉదాహరణ?

1) హైడ్రోఫిలిక్‌     2) లయోఫిలిక్‌

3) సహచరిత     4) లయోఫోబిక్‌

 

37. ‘హైడ్రోసోల్‌’లో విక్షిప్త ప్రావస్థ, విక్షేపణ యానకం ఏమిటి?

1) వాయుపదార్థం, నీరు   2) ఘనపదార్థం, నీరు

3) ద్రవపదార్థం, నీరు    4) నీరు, ఘనపదార్థం

 

38. కిందివాటిలో కొల్లాయిడ్‌ ద్రావణానికి ఉదాహరణ కానిది ఏది?

1) పాలు      2) జెల్లీ

3) టింక్చర్‌ ఆఫ్‌ అయోడిన్‌  4) వెన్న

 

39. కిందివాటిలో ఏ ద్రావణం టిండాల్‌ ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది?

1) చక్కెర జలద్రావణం 

2) సాధారణ ఉప్పు జలద్రావణం

3) అల్ప గాఢతల వద్ద సబ్బు జలద్రావణం

4) అత్యధిక గాఢతల వద్ద సబ్బు జలద్రావణం

 

40. నిజ ద్రావణంలోని ద్రావిత కణాలు.....

1) కంటి చూపునకు కనిపిస్తాయి   

2) కంటి చూపునకు కనిపించవు

3) సాధారణ మైక్రోస్కోప్‌ ద్వారా కనిపిస్తాయి  

4) పైవేవీకావు

 

41. కిందివాటిలో పొగకు సంబంధించి సరైంది?

1) పొగ ఏరోసోల్‌ రకం కొల్లాయిడ్‌ ద్రావణానికి ఉదాహరణ

2) ఇది ఒక లయోఫోబిక్‌ కొల్లాయిడ్‌ ద్రావణం

3) పొగలో విక్షేపణ యానకం గాలి

4) పైవన్నీ

 

42. కిందివాటిలో కొల్లాయిడ్‌లకు సంబంధించింది ఏది?

1) టిండాల్‌ ప్రభావం   2) స్కందనం

3) తరంగదైర్ఘ్యం    4) బ్రౌనియన్‌ చలనం

 

43. కిందివాటిలో ఉత్క్రమణీయ సోల్‌ ఏది?

1) గోల్డ్‌సోల్‌      2) పాలు

3) రక్తం         4) స్టార్చ్‌సోల్‌

 

44. కిందివాటిలో విజాతీయ వ్యవస్థ కానిది ఏది?

1) ఎమల్షన్‌        2) జెల్‌

3) యూరియా జలద్రావణం   4) అవలంబనాలు

 

45. మిశ్రమ లోహాల్లో విక్షిప్త ప్రావస్థ, విక్షేపణ యానకం?

1) ద్రవం, వాయువు    2) వాయువు, ద్రవం

3) ఘనం, ఘనం    4) ఘనం, ద్రవం

 

46. ప్రతిపాదన (A): కొల్లాయిడ్‌ కణాలు బ్రౌనియన్‌ చలనాన్ని ప్రదర్శిస్తాయి

కారణం (R): ద్రావిత కణాల పరిమాణం కొల్లాయిడ్‌ ద్రావణాల్లో కంటే అవలంబనాల్లో తక్కువగా ఉంటుంది.

1) A నిజం, R తప్పు.   

2) A తప్పు, R నిజం.

3) A, R రెండూ నిజం.  A కు R సరైన వివరణ.

4) A, R రెండూ నిజం. A కు R సరైన వివరణ కాదు.

 

47. తైలంలో నీరు ఏ రకం ఎమల్షన్‌కు ఉదాహరణ?

1) కాడ్‌ లివర్‌ ఆయిల్‌  2) పాలు

3) సుక్రోజ్‌ ద్రావణం    4) పొగమంచు

 

48. కిందివాటిలో చర్మశుద్ధి ప్రక్రియ?

1) భస్మీకరణం       2) టానింగ్‌

3) గాల్వనీకరణం     4) సినెరిసిస్‌

 

స‌మాధానాలు

1-4, 2-4, 3-3, 4-2, 5-4, 6-1, 7-4, 8-4, 9-1, 10-2, 11-2, 12-3, 13-1, 14-3, 15-2, 16-2, 17-2, 18-3, 19-4, 20-2, 21-1, 22-3, 23-3, 24-3, 25-4, 26-2, 27-1, 28-4, 29-2, 30-4, 31-1, 32-2, 33-4, 34-1, 35-2, 36-4, 37-2, 38-3, 39-4, 40-2, 41-4, 42-3, 43-4, 44-3, 45-3, 46-1, 47-1, 48-2.

Posted Date : 09-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌