• facebook
  • whatsapp
  • telegram

పదాల పోలిక 

సూచనలు (ప్ర: 1 - 16): కింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.

1. గణితం : సంఖ్యలు :: చరిత్ర : ...

ఎ) తేదీలు   బి) యుద్ధాలు   సి) సంఘటనలు   డి) ప్రజలు

సాధన: సంఖ్యలకు సంబంధించిన శాస్త్రం గణితం.గతంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన దాన్ని చరిత్ర అంటారు. 

సమాధానం: సి



2. పొగతాగడం : నాడులు :: మద్యపానం : ....

ఎ) శిరస్సు    బి) నిషా    సి) కాలేయం    డి) సారాయి

సాధన: పొగాకు వల్ల శరీరంలోని నాడులు దెబ్బతింటాయి. మద్యపానం కారణంగా శరీరంలోని కాలేయానికి నష్టం వాటిల్లుతుంది.

సమాధానం: సి



3. ఇండియా : ఆసియా :: ఇంగ్లండ్‌ : ...

ఎ) ఇంగ్లిష్‌   బి) ఆస్ట్రేలియా   సి) యూరప్‌   డి) లండన్‌

సాధన: ఇండియా ఆసియా ఖండంలోని దేశం. ఇంగ్లండ్‌ యూరప్‌ ఖండంలోని దేశం.

సమాధానం: సి


 

4. బ్యాడ్మింటన్‌ : ఆటస్థలం :: స్కేటింగ్‌ : ....

ఎ) బాల్‌   బి) చేతికర్ర   సి) పతాక   డి) మంచు ప్రదేశం

సాధన: ఆటస్థలంలో బ్యాడ్మింటన్‌ ఆడతారు. స్కేటింగ్‌ను మంచు ప్రదేశంలో చేస్తారు.

సమాధానం: డి



5. సిరా : కలం :: రక్తం : ....

ఎ) ఎముకలు   బి) నాళం   సి) దానం   డి) ఊపిరితిత్తులు

సాధన: సిరా కలంలో ఉంటుంది. రక్తం రక్తనాళాల్లో ఉంటుంది.

సమాధానం: బి


 

6. రేడియో : శ్రోత :: సినిమా : ....

ఎ) నటుడు   బి) ప్రేక్షకుడు   సి) దర్శకుడు   డి) నిర్మాత

సాధన: రేడియో వినేవాడు శ్రోత. సినిమా చూసేవాడు ప్రేక్షకుడు.

సమాధానం: బి



7. సుక్రోజ్‌ : చక్కెర :: లాక్టోజ్‌ : .....

ఎ) సున్నం       బి) తేనె       సి) పాలు        డి) కోక్‌ 

సాధన: చక్కెరలో సుక్రోజ్, పాలలో లాక్టోజ్‌ ఉంటాయి.

సమాధానం: సి




8. ఒడ్డు : నది :: తీరం : ....

ఎ) సముద్రం    బి) జీవావరణం    సి) వర్షం    డి) వరద

సాధన: నదికి ఒడ్డు ఎలాగో, సముద్రానికి తీరం అలాగ.

సమాధానం: ఎ




9. కోపం : .... :: శాంతం : మిత్రుడు 

ఎ) బంధువు   సి) స్నేహితుడు  

సి) రక్ష       డి) శత్రువు 

సాధన: కోపం శత్రువులను పెంచితే, శాంతం మిత్రులను పెంచుతుంది.

సమాధానం: డి


 

10. దిగువసభ : శాసనసభ :: .... : ముఖ్యమంత్రి 

ఎ) రాష్ట్రపతి  బి) గవర్నర్‌  సి) ప్రధానమంత్రి  డి) స్పీకర్‌ 

సాధన: దేశానికి దిగువ సభ (లోక్‌సభ), రాష్ట్రానికి శాసనసభ. దేశానికి ప్రధానమంత్రి ఉంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటారు.

సమాధానం: సి




11. దుఃఖం : .... :: సంతోషం : పుట్టుక 

ఎ) విచారం       బి) దెబ్బ       సి) చావు       డి) బాధ

సాధన: పుట్టుక సంతోషాన్నిస్తే, చావు దుఃఖాన్నిస్తుంది.

సమాధానం: సి



12. ఫ్రాన్స్‌ : చైనా :: జర్మనీ : ....

ఎ) హాంగ్‌కాంగ్‌  బి) అమెరికా  సి) దిల్లీ  డి) ఏదీకాదు 

సాధన: ఫ్రాన్స్, చైనా, జర్మనీ, అమెరికా దేశాలు.

సమాధానం: బి


 


13. రేబిస్‌ : కుక్క ::.... : దోమ 

ఎ) పక్షవాతం   బి) క్షయ   సి) మలేరియా   డి) కలరా 

సాధన: రేబిస్‌ వ్యాధి కుక్క కాటు వల్ల వస్తుంది. మలేరియా వ్యాధి దోమకాటు వల్ల సంభవిస్తుంది.

సమాధానం: సి



14. .... : శ్రీలంక :: దిల్లీ : ఇండియా

ఎ) ఖాఠ్మాండు   బి) పారిస్‌   సి) కొలంబో   డి) ఏదీకాదు

సాధన: ఇండియా రాజధాని దిల్లీ. శ్రీలంక రాజధాని కొలంబో.

సమాధానం: సి


 

15. లక్షద్వీప్‌ : కవరత్తి :: అండమాన్‌ నికోబార్‌ : ......

ఎ) థామస్‌  బి) సిల్వస్సా  సి) పాండిచ్చేరి  డి) పోర్ట్‌బ్లెయిర్‌

సాధన: లక్షద్వీప్‌ రాజధాని కవరత్తి. అండమాన్‌ నికోబార్‌ రాజధాని పోర్ట్‌బ్లెయిర్‌.

సమాధానం: డి




16. కొబ్బరి : టెంక :: ఉత్తరం : ....

ఎ) స్టాంపు (తపాలాబిళ్ల)     బి) కవరు 

సి) తపాలా         డి) ఉత్తరం డబ్బా

సాధన: టెంక లోపల కొబ్బరి ఉంటుంది. అలాగే ఉత్తరాన్ని కవరు లోపల ఉంచుతారు.    సమాధానం: బి


 

సూచన: (ప్ర. 17 - 23): కింది ప్రశ్నల్లో రెండు పదాలు ఒకొకదానికొకటి నిర్దిష్ట సంబంధాన్ని కలిగి ఉన్నాయి. వాటి ఆధారంగా ఇచ్చిన ఆప్షన్స్‌లో సరైన జతను ఎంచుకోండి.


17. అడవి మనిషి : నాగరికత 

ఎ) చీకటి : వెలుతురు        బి) క్రూరం : జంతువు 

సి) క్రూరత్వం : శౌర్యమైన        డి) ఏదీకాదు 

సాధన: అడవి మనిషికి వ్యతిరేకం నాగరికత. చీకటికి వ్యతిరేకం వెలుతురు.

సమాధానం: ఎ


 

18. పదకోశం : పదాలు 

ఎ) అట్లాస్‌ : మ్యాప్స్‌      బి) లెక్సికాన్‌ : పదాలు   

సి) థెసారస్‌ : రైమ్‌    డి) కేటలాగ్‌ : తేదీలు 

సాధన: పదాల సేకరణ పదకోశం. తేదీలను కేటలాగ్‌లో చెప్తారు.

సమాధానం: డి


 

19. గాగుల్స్‌ : కళ్లు

ఎ) జడ : జుట్టు      బి) టై : నెక్‌  

సి) పుడక : రెగ్‌     డి) గ్లౌజులు : చేతులు 

సాధన: కళ్లకు రక్షణగా గాగుల్స్‌ను ధరిస్తే, చేతికి గ్లౌజులను వేసుకుంటారు.

సమాధానం: డి



20. ఆదర్శధామం : ఇంగ్లిష్‌

ఎ) ఒడిస్సీ : గ్రీక్‌      బి) తులసీదాస్‌ : సంస్కృతం  

సి) మోనాలిసా : ఇంగ్లిష్‌      డి) ఏదీకాదు

సాధన: ఆదర్శధామం ఆంగ్ల సాహిత్యంలో ఒక ప్రసిద్ధ రచన. ఒడిస్సీ గ్రీక్‌ సాహిత్యం.    సమాధానం: ఎ



21. ఫారోలు : ఈజిప్ట్‌ 

ఎ) రాజులు : భారతదేశం     బి) ప్రభుత్వం : రాష్ట్రం 

సి) సోక్రటీస్‌ : గ్రీస్‌        డి) ఏదీకాదు 

సాధన: ఈజిప్ట్‌ పాలకులను ఫారోలు అంటారు. అదేవిధంగా భారతదేశ పాలకులను రాజులు అంటారు. 

సమాధానం: ఎ


 

22. దుష్ప్రవర్తన : నేరం 

ఎ) క్రైమ్‌ : డిగ్రీ          బి) పోలీసు : జైలు  

సి) దొంగ : రాజు      డి) ప్రమాదం : విపత్తు 

సాధన: దుష్ప్రవర్తన తీవ్రమైతే నేరం, ప్రమాదం తీవ్రమైతే విపత్తు.    సమాధానం: డి



23. నిర్బంధించడం : ఖైదీ 

ఎ) అదుపులోకి తీసుకొను : అనుమానితుడు    బి) జాడ : పరారీ      

సి) అంబుష్‌ : సెంట్రీ            డి) ఏదీకాదు 

సాధన: ఖైదీని శిక్ష కోసం నిర్బంధిస్తారు. అదే విధంగా విచారణ కోసం అనుమానితుడ్ని అదుపులోకి తీసుకుంటారు.

సమాధానం: ఎ


 

Posted Date : 27-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌