• facebook
  • whatsapp
  • telegram

ఆఫ్రికా ఖండం

1. ఆఫ్రికా, ఐరోపా ఖండాలను వేరుచేస్తున్న జలభాగం?

1) మధ్యధరా సముద్రం  2) నల్ల సముద్రం    3) కాస్పియన్‌ సముద్రం  4) ఎర్ర సముద్రం


2. ఆఫ్రికాలోని ఎత్తయిన శిఖరం కిలిమంజారో. దాని ఎత్తు ఎంత?

1) 5985 మీ.     2) 5895 మీ.     3) 5598 మీ.    4) 5095 మీ.


3. కింది వాటిలో సరైంది?

1) న్యాస, చాద్‌ ఉప్పునీటి సరస్సులు      2) చాద్, గామి ఉప్పునీటి సరస్సులు

3) విక్టోరియా, చాద్‌ మంచినీటి సరస్సులు     4)  విక్టోరియా, గామి మంచినీటి సరస్సులు


4. కలహారి ఎడారిలో ప్రవహించే నది?

1)  నైలు      2)  నైగర్‌    3) కాంగో   4) ఆరెంజ్‌


5. కింది వాటిలో ఆఫ్రికా ఖండానికి సంబంధించి సరికానిదేది?

1) మానవ సంతతికి పుట్టినిల్లు     2) ఉత్తర, దక్షిణ గోళాల్లో విస్తరించింది

 3) అతి విశాలమైన ఖండం     4) నూతన మతాలకు పుట్టినిల్లు


6. మధ్యధరా సముద్రంతో సరిహద్దు కలిగిన ఆఫ్రికా దేశాలు?

1) మొరాకో, అల్జీరియా, లిబియా, ఈజిప్ట్ట్‌       2) ఈజిప్ట్, నైజర్, లిబియా, ట్యునీషియా

 3) అల్జీరియా, ఈజిప్ట్, ట్యునీషియా, ఎరిత్రియా   4) మొరాకో, సూడాన్, ఈజిప్ట్‌


7. జాంబియా, జింబాబ్వేల్లో విరివిగా లభించే ఖనిజం?

1) రాగి       2) ఇనుము     3) బంగారం   4)  పెట్రోలు


8. మదీర, అజోర్స్‌ ద్వీపాలు ఏ జలభాగంలో ఉన్నాయి?

1) మధ్యధరా సముద్రం   2) అట్లాంటిక్‌ మహాసముద్రం     3) హిందూ మహాసముద్రం      4)  ఎర్ర సముద్రం


9. భారతదేశాన్ని, ఆఫ్రికాను వేరు చేస్తున్న  జలభాగం?

1)  ఎర్ర సముద్రం    2) హిందూ మహాసముద్రం     3)  అరేబియా సముద్రం  4)  సూయజ్‌ కాలువ


10. ఎర్ర సముద్రం తీరాన ఉన్న దేశాలు?

1)  లిబియా, ఈజిప్ట్, సూడాన్‌       2)ఈజిప్ట్, ఇథోపియా, సోమాలియా    

3) సోమాలియా, సూడాన్, ఈజిప్ట్‌     4)  సోమాలియా, లిబియా, ఈజిప్ట్‌


11. దక్షిణాఫ్రికా భూభాగంలో పరివేష్టితమైన దేశం?

1)  నమీబియా    2) బోట్్సవానా     3) జాంబియా    4)  లిస్తో


12. ఆఫ్రికా ఖండంలో ఎన్ని దేశాలు ఉన్నాయి?

1) 51     2) 52     3)  53     4)  54


13. ఆఫ్రికా ఖండం ఏ సంవత్సరంలో వెలుగులోకి వచ్చింది?

1) 1820   2)1830      3) 1840     4) 1850


14. ఆఫ్రికాలో ఏ నెలలో సూర్యుడు ఉత్తర ప్రాంతంలో ఉదయిస్తాడు?

1) డిసెంబరు    2) సెప్టెంబరు    3) ఆగస్టు   4) జూన్‌


15. జాంబేజీ నది ఏ సముద్రంలో కలుస్తుంది?

1) హిందూ మహాసముద్రం    2) అట్లాంటిక్‌     3) ఎర్ర సముద్రం    4) మధ్యధరా సముద్రం


16. ఆగ్నేయ ఆఫ్రికాలో ఉండే పర్వతాలను ఏమంటారు?

1) అట్లాస్‌   2) డ్రాకెన్స్‌బర్గ్‌     3) ముర్రా   4)  బుజుంబురా


17. విక్టోరియా జలపాతం ఎత్తు ఎంత?

1)180 మీ.    2) 108 మీ.   3) 150 మీ.     4)105 మీ.


18. సహారా ఎడారిలో నివసించే సంచార జాతి?

1) పిగ్మీలు    2)బుష్‌మెన్‌లు     3) బిడౌనియన్లు     4) హమైట్లు


19. ఆఫ్రికా దక్షిణ భాగమైన గుడ్‌హోప్‌ అగ్రాన్ని మొదటగా చేరుకున్నది ఎవరు?

1)  హెన్రీ     2) బర్తలోమి డయాజ్‌   3) వాస్కోడిగామా    4) కొలంబస్‌


20. ఆఫ్రికాలోని సరస్సులు, నైలునది జన్మస్థానాన్ని గుర్తించింది ఎవరు?

1) లివింగ్‌స్టన్, స్టాన్లీ  2) లియోఫోర్డ్, స్టాన్లీ    3) కామెరున్, జేమ్స్‌గ్రాంట్‌    4)  రిచర్డ్‌ బర్టన్, జాన్‌స్పీన్,జేమ్స్‌గ్రాంట్‌


21. ఆఫ్రికాలో వలసలు ఏర్పడని దేశం?

1) దక్షిణాఫ్రికా    2) ఇథియోపియా    3) ఈజిప్ట్‌    4) నమీబియా


22. ఆఫ్రికాలో బానిస వర్తకం ముగిసిన కాలం?

1) 16వ శతాబ్దం    2) 17వ శతాబ్దం    3)18వ శతాబ్దం     4) 19వ శతాబ్దం


23. ఆఫ్రికాలో పెరిగే సవన్నా గడ్డిభూములను ఏమని పిలుస్తారు?

1)  పంపాలు    2) వెల్డులు        3) డౌనులు    4) స్టెప్పీలు


24. ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన అల్‌ అజేజియా ఏ దేశంలో ఉంది?

1)  లిబియా  2) ఈజిప్ట్‌      3) సూడాన్‌    4) అల్జీరియా


25. ఐరోపా వారు ఆఫ్రికా నుంచి బానిసలను ఏ దేశానికి ఎగుమతి చేశారు?

1) ఇంగ్లండ్‌    2) బెల్జియం    3) అమెరికా      4) ఫ్రాన్స్‌


26. చాక్లెట్ల తయారీలో ఉపయోగించే పంట?

1) జాపోట్‌     2) కోకో       3)  సిసల్‌నార    4) కస్సావా


27. భారత్‌లోని ముంబయి ఓడరేవు నుంచి ఈజిప్ట్‌కు బయలుదేరిన నౌకా మార్గం?

1) హిందూ మహాసముద్రం - ఎర్ర సముద్రం - మధ్యధరా సముద్రం

2) అరేబియా సముద్రం    - ఎడెన్‌ సింధు శాఖ - ఎర్ర సముద్రం - సూయజ్‌ కాలువ

 3) అరేబియా సముద్రం - మధ్యధరా సముద్రం - సూయజ్‌ కాలువ

4) హిందూ మహాసముద్రం - ఎర్ర సముద్రం - సూయజ్‌ కాలువ


28. ఆఫ్రికా వలసలకు సంబంధించి సరికాని జత?

1) లిబియా - ఇటలీ    2)మడగాస్కర్‌ - ఫ్రాన్స్‌       3) ఈజిప్ట్‌ - ఇంగ్లండ్‌    4) దక్షిణాఫ్రికా - పోర్చుగీస్‌


29. విక్టోరియా సరస్సు నుంచి నైలునది ప్రవహించే దిశ? 

1) తూర్పు   2) పడమర    3) ఉత్తరం   4) దక్షిణం


30. ఆఫ్రికాలో అధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు?

1)  పశ్చిమ, మధ్య భాగం   2)  తూర్పు, మధ్య భాగం    3) ఉత్తర భాగం    4) దక్షిణ, మధ్య భాగం


31. ఆసియా, ఆఫ్రికాలను కలిపే ద్వీపకల్పం ఏది?

1)ట్రిపోలీ      2)  సినాయ్‌     3) సయ్యద్‌    4) జోరాన్‌


32. ఈజిప్ట్‌ నాగరికత వర్ధిల్లిన నదీ తీరం?

1) జాంబేజీ     2)  లింపొపో    3)  నైలు    4) ఆరెంజ్‌


33. ఆఫ్రికా ఖండాన్ని అన్వేషించిన వారెవరు?

1) లియోఫోర్డ్‌ - II     2)  లివింగ్‌స్టన్‌   3) స్టాన్లీ      4)  కామెరున్‌


34. ఆఫ్రికా ఖండాన్ని రెండు సమభాగాలుగా విభజిస్తున్న అక్షాంశం ఏది?

1)  భూమధ్యరేఖ     2)  కర్కటరేఖ      3)  మకరరేఖ    4) అక్షం


35. ఆఫ్రికా ఖండానికి పశ్చిమ సరిహద్దు ఏది?

1) హిందూ మహాసముద్రం    2)  మధ్యధరా సముద్రం      3)  అట్లాంటిక్‌ సముద్రం   4)  ఎర్ర సముద్రం


36. ఆయనరేఖలకు దక్షిణం, ఉత్తరం వైపు ఉండే ప్రాంతాలు?

1)  ఉష్ణ మండల ప్రాంతాలు    2) సమశీతోష్ణ ప్రాంతాలు   3) శుష్క ప్రాంతాలు     4)  ఎడారి ప్రాంతాలు


సమాధానాలు

1-1   2-2   3-2   4-4   5-4  6-1  7-1     8-2  9-3   10-3    11-4   12-4   13-3  14-4  15-2   16-2    17-2  18-3  19-2   20-4  21-2   22-4  23-2    24-1  25-3  26-2   27-2  28-4   29-3   30-1   31-2   32-3   33-2  34-1  35-3  36-2


మరికొన్ని...

1. కింది వాటిలో ఆఫ్రికాకు సంబంధించి సరికానిదేది?

1) శుష్క ప్రాంతలోని ఎడారి సహారా     2)  ఉష్ణమండల ఎడారి కలహారి

3) ఏనుగు జాతి గడ్డి - మధ్యస్థ వర్షం     4) గడ్డి భూములు - డౌనులు


2. దక్షిణాఫ్రికాలోని కింబర్లీలో విరివిగా లభించే ఖనిజం?

1) వజ్రాలు    2) బంగారం   3)రాగి    4) తగరం


3. అమెరికాలోని ఆఫ్రికా బానిసలకు స్వేచ్ఛ లభించిన సంవత్సరం?

1) 1860     2) 1863    3) 1866      4) 1869


4. నైజీరియా స్వాతంత్య్రం పొందిన సంవత్సరం?

1) అక్టోబరు 1, 1961   2) ఏప్రిల్‌ 14, 1962    3) అక్టోబరు 1, 1963     4) ఏప్రిల్‌ 25, 1964


5. ఆఫ్రికా నైరుతి దిశలో డ్రాకెన్స్‌బర్గ్‌ పర్వతాల వర్షచ్ఛాయా ప్రాంతంలోని ఎడారి?

1) కలహారి    2) సహారా    3)సహెల్‌    4)నూబియన్‌


6. విక్టోరియా సరస్సు చుట్టూ ఉన్న దేశాలేవి?

1)ఇథియోపియా, సోమాలియా, కెన్యా    2) జాంబియా, జింబాబ్వే, నమీబియా

3) ఉగాండా, కెన్యా, టాంజానియా       4) బోట్స్‌వానా, జాంబియా, లిస్తో


7. లవంగాల ద్వీపం ఏయే ద్వీపాల సమూహం?

1)  జాంజీబార్, పంబా     2)  జాంజీబార్, మడగాస్కర్‌   3) సోకోట్ర, జాంజీబార్‌       4) పిండి, సోకోట్ర


8. ఆఫ్రికా నైరుతి దిశలోని ఎడారి పేరు కలహారి. అయితే కలహారి అంటే అర్థం ఏమిటి?

1)   చీకటి ప్రాంతం     2) గొప్ప దాహం   3) రాతి ఎడారి    4)  మారుమూల


సమాధానాలు

1-4  2-1 3-1   4-3  5-1   6-3  7-1  8-2.

Posted Date : 04-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌