• facebook
  • whatsapp
  • telegram

ఖండచలన సిద్ధాంతం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. ఆల్ఫ్రెడ్ వెజినర్ రాసిన గ్రంథం ఏమిటి?
జ: Origin of Continents & Oceans

 

2. సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ (Sea Floor Spreading) అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
జ: హ్యారీ హెస్

 

3. ప్రస్తుతం టెథిస్ సముద్ర అవశేషంగా దేన్ని భావిస్తున్నారు?
జ: మధ్యధరా సముద్రం

 

4. ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా మొదలైనవి ఉన్న ఖండాన్ని పూర్వం ఏమని పిలిచారు?
జ: గోండ్వానా

 

5. ప్లేట్ టెక్టానిక్స్ అనే పదాన్ని తొలిసారిగా 1965 లో ఎవరు ప్రయోగించారు?
జ: టుజో విల్సన్

 

6. ఖండ పళ్లేలు ఒకదానికి ఎదురుగా మరొకటి వచ్చినప్పుడు ఏ భూస్వరూపాలు ఏర్పడతాయి?
జ: ముడత పర్వతాలు

 

7. సముద్ర పళ్లేలు ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు ఏ స్వరూపాలు ఏర్పడతాయి?
జ: మహాసముద్ర అగాధాలు

 

8. ప్రపంచంలోనే అతి లోతైన అగాధం ఏది?
జ: మెరియానా అగాధం

 

9. రింగ్ ఆఫ్ ఫైర్ దేన్ని ఆవరించి ఉంది?
జ: పసిఫిక్ మహాసముద్రం

 

10. ఏ దేశంలో ప్రపంచలోనే అత్యధిక స్థాయిలో భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు సంభవిస్తుంటాయి?
జ: జపాన్

 

11. ఇండోనేషియా ద్వీపాల సమూహాలు ఏర్పడానికి కారణం?
జ: సముద్రపు పళ్లేలు దగ్గరగా జరగడం

 

12. దక్షిణ అమెరికా పళ్లెం, ఆఫ్రికా పళ్లెం ఒకదానికొకటి దూరంగా జరగడం ద్వారా ఏ దేశ వైశాల్యం పెరుగుతోంది?
జ: ఐస్‌లాండ్

 

13. సముద్రపు పటలం ఏ శిలలతో తయారై ఉంటుంది?
జ: బసాల్ట్ శిలలు

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌