• facebook
  • whatsapp
  • telegram

సమఘనం (cube)

ముఖ్యాంశాలు

 సమఘనం భుజం 'a' యూనిట్లు అయితే,

i) ఆ సమఘన భూపరిధి = 4a యూనిట్లు

ii) సమఘనం భూ వైశాల్యం = a 2 చ.యూ.

iii)  పక్కతల వైశాల్యం = 4a2 చ.యూ.

vi) సంపూర్ణతల వైశాల్యం = 6a2 చ.యూ.

v)  ఘనపరిమాణం = a3 ఘ.యూ.
1. ఒక సమఘనం భుజం 9 సెం.మీ. అయితే దాని పక్కతల వైశాల్యం ఎంత? (చ.సెం.మీ.లలో)

1)184       2)192    3) 284        4) 324

సాధన: సమఘనం భుజం (a) = 9 సెం.మీ.

పక్కతల వైశాల్యం = 4 (a )2 = 4(9)2

 = 4 (81)

 = 324  చ.సెం.మీ 

సమాధానం: 4

2. ఒక సమఘనం భుజం 12 సెం.మీ. అయితే దాని ఘనపరిమాణం ఎంత? (ఘ.సెం.మీ.లలో)

1) 1728     2) 1436     3) 1568    4)1248

సాధన: సమఘనం భుజం (a) = 12 సెం.మీ.

సమఘనం ఘనపరిమాణం (v) = a3

= 123 = 1728  ఘ.సెం.మీ.

సమాధానం: 1

3. ఒక సమఘనం సంపూర్ణతల వైశాల్యం 1536 చ.సెం.మీ. అయితే దాని ఘనపరిమాణం ఎంత? (ఘ.సెం.మీ.లలో)

1) 1728      2) 4096      3) 2744       4) 1575

సాధన: సమఘనం సంపూర్ణతల వైశాల్యం 


సమాధానం: 2

4. ఒక సమఘనం ఘనపరిమాణం 125 ఘ.సెం.మీ. అయితే దాని పక్కతల వైశాల్యం...... (చ.సెం.మీ.లలో)

1) 100        2) 150    3) 200    4) 225


సమాధానం: 1

5. సంఖ్యాత్మకంగా ఒక సమఘనం ఘనపరిమాణం దాని సంపూర్ణతల వైశాల్యానికి సమానం. అయితే దాని భుజం ఎంత? (యూనిట్లలో) 

1) 4        2) 6        3) 8       4) 2

సాధన: సమఘనం భుజం = a అనుకోండి.

లెక్కప్రకారం, సమఘనం ఘనపరిమాణం  = సంపూర్ణతల వైశాల్యం

⇒ a3= 6a2⇒ a = 6 యూ.

సమాధానం: 2

6. 4 సెం.మీ. భుజంగా ఉన్న రెండు సమఘనాలను ఒకదాని పక్కన మరొకదాన్ని అతికిస్తే దీర్ఘఘనం ఏర్పడింది. అయితే దాని సంపూర్ణతల వైశాల్యం ఎంత? (చ.సెం.మీ.లలో)

1) 120     2) 140     3) 152    4) 160


సమాధానం: 4

7. మూడు లోహ సమఘనాల భుజాలు వరుసగా 3 సెం.మీ., 4 సెం.మీ., 5 సెం.మీ. వాటిని కరిగించి ఒకే సమఘనంగా తయారుచేస్తే ఏర్పడే ఫలిత సమఘనం భుజం ఎంత? (సెం.మీ.లలో)   

1) 6     2) 7     3) 8      4) 12

సాధన:a1, a2, a3 భుజాలుగా ఉన్న లోహ సమఘనాలను కరిగించి ఒకే సమఘనంగా రూపొందించాక ఫలిత సమఘనం భుజం "a" అయితే,

⇒ a3 = a13+ a23 + a33

⇒ a3 = 33+ 43+53

 = 27+ 64+125 = 216 = 63

⇒ a = 6 సెం.మీ.

సమాధానం: 1

8. రెండు సమఘనాల భుజాల నిష్పత్తి 3 : 4. అయితే వాటి సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి?

1) 3 : 4       2) 4 : 3     3) 9 : 16    4)16 : 9

సాధన: రెండు సమఘనాల భుజాల నిష్పత్తి = s1 : s2 = 3 : 4

వాటి సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి 

= 6a12 : 6a22

= s12 : s22

= 32 : 42 = 9 : 16

  సమాధానం: 3

9. రెండు సమఘనాల భుజాల నిష్పత్తి 15 : 17. అయితే వాటి ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత? 

1) 225 : 289      2)  3375 : 4914         3)17 : 15      4) 289 : 225 

సాధన: రెండు సమఘనాల భుజాల నిష్పత్తి 

= s1 : s2 = 15 : 17

వాటి ఘనపరిమాణాల నిష్పత్తి

 = s13 = s1

= 153 : 173

= 3375 : 4913

సమాధానం: 2

10. రెండు సమఘనాల ఘనపరిమాణాల నిష్పత్తి 729 : 1000. అయితే వాటి సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి ఎంత?

1) 81 : 100      2) 100 : 81     3) 9 : 80     4) 10 : 9

సాధన: రెండు సమఘనాల ఘనపరిమాణాల నిష్పత్తి = 729 : 1000

⇒ v1 : v2 = 729 : 1000

⇒s13 :s23 = 93 : 103

⇒ s1 : s2 = 9 : 10

ఆ సమఘనాల సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి = 6s12 : 6s22

=s12 : s22 = 92 : 102 = 81 : 100

సమాధానం: 1

11. 1.8 సెం.మీ. భుజంగా ఉన్న ఒక లోహ సమఘనం బరువు 135 గ్రా. అదే లోహంతో చేసిన మరొక సమఘనం భుజం పొడవు 2.4 సెం.మీ. అయితే ఆ లోహ సమఘనం బరువు ఎంత? (గ్రాముల్లో)

1) 240       2) 280      3) 320      4) 360

సాధన: రెండు సమఘనాల భుజాల నిష్పత్తి 

= 1.8 : 2.4

= 18 : 24 = 3 : 4

ఆ సమఘనాల బరువుల నిష్పత్తి = వాటి ఘనపరిమాణాల నిష్పత్తి 

= 33 : 43 = 27 : 64

రెండో సమఘనం బరువు =135/27 x 64 

                            = 320 గ్రా.

సమాధానం: 3

12. ఒక సమఘనం భుజాన్ని 20% పెంచితే, దాని ఉపరితల వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత?

1) 20%      2) 24%       3) 40%      4) 44% 

సాధన: ఒక సమఘనం భుజాన్నిx% పెంచితే దాని ఉపరితల వైశాల్యంలో పెరుగుదల శాతం


సమాధానం: 4

13. ఒక సమఘనం భుజాన్ని 20% పెంచితే దాని ఘనపరిమాణంలో పెరుగుదల శాతం ఎంత?

1) 60%    2) 72.8%       3)64.5%        4) 20%

సాధన: ఒక సమఘనం భుజాన్ని x % పెంచితే దాని ఘనపరిమాణంలో పెరుగుదల


సమాధానం: 2

* ఒక సమఘనం భుజం 4 సెం.మీ. దాని అన్ని తలాలకు రంగులేసి 1 సెం.మీ. భుజంగా ఉండే సమఘనాలుగా కత్తిరిస్తే వచ్చే

i) చిన్న ఘనాల సంఖ్య....

ii) రంగువేయని ఘనాల సంఖ్య....

iii) ఒకవైపు రంగువేసిన ఘనాలు సంఖ్య... 

iv) రెండువైపులా రంగులేసిన ఘనాల సంఖ్య....

* మూడువైపులా రంగులేసిన ఘనాల సంఖ్య...

సాధన: ఒక సమఘనం భుజం "a" యూనిట్లు అయితే ( a ≥ 2 ) ఆ సమఘనాన్ని 1 సెం.మీ. భుజంగా ఉండే సమఘనాలుగా కత్తిరిస్తే వచ్చే

i) చిన్న ఘనాల సంఖ్య = a3 = 43 = 64

ii) రంగువేయని ఘనాల సంఖ్య  = (a-2)3 = (4-2)3 = 23 = 8

iii) ఒకవైపు రంగువేసిన ఘనాల సంఖ్య = 6 (a-2)2

= 6 (4 - 2)2 = 6 (2) 2 = 6(4) = 24

i) రెండువైపులా రంగులేసిన ఘనాల సంఖ్య = 12(a-2)

   

= 12(4 - 2)

= 12(2) = 24    

* మూడువైపులా రంగులేసిన ఘనాల సంఖ్య = 0

* 6 సెం.మీ భుజంగా 3 సమఘనాలు ఉన్నాయి. వాటిని ఒకదాని పక్కన మరొక దాన్ని అతికిస్తే ఏర్పడే దీర్ఘఘనం పక్కతల వైశాల్యం...... (చ.సెం.మీ.లలో) 

1) 288      2) 324      3) 364       4) 384

సాధన:

ఒక్కొక్క సమఘనం భుజం = 6 సెం.మీ.

సమఘనాలను అతికించాక ఏర్పడ్డ దీర్ఘఘనం పొడవు (l) = 6 + 6 + 6 = 18 సెం.మీ.

వెడల్పు(b) = 6 సెం.మీ. 

ఎత్తు (h) = 6 సెం.మీ.

దీర్ఘఘనం పక్కతల వైశాల్యం = 2h (l+b)

= 2 x 6 (18 + 6) = 12 x 24 = 288 చ.సెం.మీ.

 సమాధానం: 1
 

Posted Date : 18-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌