• facebook
  • whatsapp
  • telegram

దత్తాంశ యోగ్యత

సూచనలు (ప్ర. 1 - 11): కింది వాటిలో ప్రతి ప్రశ్నకు రెండు ప్రకటనలు ఉన్నాయి. వాటిలో ఏది దత్తాంశానికి సరిపోతుందో గుర్తించి, ఇచ్చిన ఐచ్ఛికాల్లో సరైన దాన్ని ఎంచుకోండి.


ఎ) ప్రకటన i మాత్రమే సమాధానం ఇవ్వగలదు.


బి) ప్రకటన ii మాత్రమే సమాధానం ఇవ్వగలదు.


సి) రెండు ప్రకటనల ఆధారంగా కచ్చితమైన సమాధానం వస్తే


డి) రెండు ప్రకటనల్లో సమాధానానికి సరైన దత్తాంశం లేకపోతే 


ఇ) రెండు ప్రకటనల్లో ఏదో ఒకటి దత్తాంశానికి సమాధానం ఇస్తే


1. ఒక గ్రంథాలయంలో ఇంగ్లిష్, తెలుగు, హిందీ నవలలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ గ్రంథాలయంలోని తెలుగు నవలల సంఖ్య?


ప్రకటన i : గ్రంథాలయంలోని 1000 నవలల్లో 50% నవలలు ఇంగ్లిష్, హిందీ నవలలు


ప్రకటన ii : హిందీ నవలల సంఖ్య, ఇంగ్లిష్‌ నవలల సంఖ్య కంటే రెట్టింపు


సాధన: ప్రకటన i నుంచి తెలుగు నవలల సంఖ్య 



ప్రకటన ii నవలల మొత్తం సంఖ్యను కలిగి లేదు. కాబట్టి తెలుగు నవలల సంఖ్యను కనుక్కోవడానికి కావాల్సిన దత్తాంశం ఈ ప్రకటనలో లేదు.


సమాధానం:


2. మహేష్‌ ఇంటి నుంచి ఆఫీసుకి ఏ సమయంలో బయలుదేరతాడు?


ప్రకటన i : మహేష్‌ 8 : 30కి ఒక ఫోన్‌ కాల్‌ రిసీవ్‌ చేసుకున్నాడు.


ప్రకటన ii : మహేష్‌ కారు ఇంటి నుంచి బయలుదేరిన 45    నిమిషాల తరువాత 10 : 15 AM కు ఆఫీసుకు చేరుకున్నాడు.


సాధన: ప్రకటన ii ప్రకారం మహేష్‌ ఇంటి నుంచి ఆఫీసుకు బయలుదేరిన సమయం = 10 : 15 AM  45 నిమిషాలు.


                    = 9: 30 AM


ప్రకటన I లో సమాధానం రాబట్టడానికి అవసరమైన సమాచారం లేదు.   

సమాధానం: బి


3. ఈ సంవత్సరం డిసెంబరులో కార్తీక్‌ పుట్టినరోజు ఏ రోజు?


ప్రకటన I : కార్తీక్‌ పుట్టినరోజు - 10వ తేదీ తరువాత, 13వ తేదీలోపు వస్తుంది.


ప్రకటన II : కార్తీక్‌ పుట్టినరోజు గురువారం.


సాధన: గురువారం తేదీ ఇవ్వలేదు. కాబట్టి కార్తీక్‌ పుట్టినరోజు కనుక్కునేందుకు కావాల్సిన దత్తాంశం రెండు ప్రకటనల్లో లేదు


సమాధానం: డి


4. విమానం ధర ఎంత?


ప్రకటన I : 5 విమానాల ధర 50 కోట్లు


ప్రకటన II : విమానం ధర కారు ధరకు 100 రెట్లు. 


         ఒక కారు ధర 10 లక్షలు.


సాధన: ప్రకటన- I నుంచి విమానం ధర = 50/5 = 10 కోట్ల


ప్రకటన- II నుంచి విమానం ధర = 100 (10 లక్షలు)


 = 1000 లక్షలు = 10 కోట్లు


అంటే ఏ ప్రకటన నుంచైనా సరైన సమాధానం పొందొచ్చు.


సమాధానం:


5. తరగతిలో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు?


ప్రకటన I : 30 కంటే ఎక్కువ, 37 కంటే తక్కువ మంది విద్యార్థులు తరగతిలో ఉన్నారు.


ప్రకటన II : తరగతిలో 34 కంటే ఎక్కువ, 41 కంటే తక్కువ మంది విద్యార్థులున్నారు. తరగతిలోని విద్యార్థులందరినీ గ్రూపులుగా విభజిస్తే ఒక్కొక్క గ్రూపులో అయిదుగురు విద్యార్థులుంటారు.


సాధన: మొదటి ప్రకటన ప్రకారం తరగతిలో విద్యార్థుల సంఖ్య 31, 32, 33, 34, 35 లేదా 36


రెండో ప్రకటన ప్రకారం తరగతిలో విద్యార్థుల సంఖ్య 35 లేదా 40


రెండు ప్రకటనల నుంచి 35 ని సమాధానంగా పేర్కొనవచ్చు.


సమాధానం: సి


6. దినేష్‌ పుట్టినరోజు ఏ రోజు అవుతుంది?


ప్రకటన I : దినేష్‌ పుట్టినరోజు జనవరి 17 కంటే ముందుగానే ఉంటుందని పవన్‌ చెప్పాడు.


ప్రకటన II : దినేష్‌ పుట్టినరోజు జనవరి 15 తర్వాతే ఉంటుందని నరేంద్ర చెప్పాడు.


సాధన: ప్రకటన-I నుంచి జనవరి 17 కంటే ముందు  16, 15, 14...


 ప్రకటన-II నుంచి జనవరి 15 తర్వాత  16, 17, 18...


దినేష్‌ పుట్టినరోజు జనవరి 16.


రెండు ప్రకటనల ద్వారా సమాధానం వచ్చింది. 


సమాధానం: సి


7. విశాఖ, గుంటూరు మధ్యనున్న అతి తక్కువ దూరం ఎంత?


ప్రకటన I : విశాఖ, కాకినాడ నుంచి 30 కి.మీ. దూరంలో ఉంది.


ప్రకటన II : గుంటూరు, విజయవాడ నుంచి 50 కి.మీ. దూరంలో ఉంది.


సాధన: ఇచ్చిన ప్రకటనల ద్వారా సరైన సమాధానం పొందలేం. 


సమాధానం: డి


8. అయిదుగురు వ్యక్తులు A, B, C, D, E లు ఒక వృత్తాకార వలయంలా వృత్తకేంద్రాన్ని చూస్తున్నట్లు కూర్చున్నారు. అయితే D కు ఎడమవైపు ఉన్న మొదటి వ్యక్తి ఎవరు?


ప్రకటన I : C అనే వ్యక్తి A కి ఎడమవైపున రెండో వ్యక్తి B, Dలు పక్కపక్కనే కూర్చున్నారు.


ప్రకటన II : D అనే వ్యక్తి B కు ఎడమవైపున మొదటి వ్యక్తి. E అనే వ్యక్తి D, B ల పక్కన వ్యక్తి కాదు.


 

D కి ఎడమవైపు ఉన్న మొదటి వ్యక్తి A.


రెండు ప్రకటనలతో సమాధానం పొందొచ్చు.


సమాధానం: సి


9. టౌన్‌ T లో పోలీస్‌ఫోర్స్‌లోని పురుషులు, మహిళా అధికారుల నిష్పత్తి ఎంత?


ప్రకటన I : మహిళా అధికారుల సంఖ్య పురుష అధికారుల సంఖ్యలో సగం కంటే 250 తక్కువ. 


ప్రకటన II : మహిళా అధికారుల సంఖ్య పురుష 


  అధికారుల సంఖ్యలో 1/7 వ భాగం.


సాధన: పురుషుల సంఖ్య = a /2,-250 మహిళల సంఖ్య =a/2  - 250 అనుకోండి

b=a/2  - 250

a = 2b + 500

ప్రకటన-i  నుంచి 


మహిళల సంఖ్య =   250 


ఇది సమాధానం రాబట్టేందుకు సరిపోదు.


ప్రకటన-ii  నుంచి 


మహిళల సంఖ్య =  పురుషుల సంఖ్య x1/7


ప్రకటన-ii  నుంచి మాత్రమే పూర్తి సమాధానాన్ని రాబట్టగలం.


సమాధానం: బి


10. P, Q, T, V, M లను వారి ఎత్తు ప్రకారం ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు సరిగ్గా మధ్యలో ఎవరు ఉంటారు? 


ప్రకటన i :V అనే వ్యక్తి Q   కంటే పొడవు కానీ M కంటే పొట్టి


ప్రకటన ii :T అనే వ్యక్తి Q , M  ల కంటే పొడవు కానీ P కంటే పొట్టి


సాధన: ప్రకటన-i  నుంచి M > V > Q

ప్రకటన-ii  నుంచి T > Q, T > M, P > T

ప్రకటన-i, ii  లను కలిపితే  P > T > M > V > Q 


అంటే  Q < V < M <  T < P

సమాధానం:


11. A, B, C, D, E లలో ఎవరు అత్యల్ప బరువు ఉన్నారు? 


ప్రకటన i : B, E ల కంటే C ఎక్కువ బరువు ఉన్నాడు. 


కానీ D కంటే బరువు తక్కువ. 


ప్రకటన ii :  D అత్యధిక బరువున్న వ్యక్తి కాదు.  


సాధన: ప్రకటన-i  నుంచి C > B, C > E, D > C 


అంటే D > C > E > B  లేదా  D > C > B > E


ప్రకటన-ii  నుంచి A > D > C > B > E  లేదా 

A > D > C > E > B


అందువల్ల E లేదా B  లు అతి తక్కువ బరువు కలిగి ఉన్నారు.  


సమాధానం: డి


రచయిత

బూసర గణేష్, 

విషయ నిపుణులు 

Posted Date : 12-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌