• facebook
  • whatsapp
  • telegram

డేటా సఫీషియన్సీ

సమాచారం సరిపోయిందా?

ఒక ప్రశ్నకు జవాబు కనిపెట్టాలంటే కొంత సమాచారం కావాలి. అది అవసరమైన మేరకు ఉంటేనే సమాధానం సాధించడం సాధ్యమవుతుంది. ఇచ్చిన సమాచారం సరిపోతుందా లేదా అనేది చెప్పగలిగినా కూడా రీజనింగ్‌లో మార్కులు సంపాదించుకోవచ్చు. అంటే సమస్య పరిష్కార ప్రక్రియపై సరైన అవగాహన ఉండాలి. దాన్ని ఎలా పెంపొందించుకోవాలో డేటా సఫీషియన్సీ ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేస్తే పోటీ పరీక్షార్థులకు అర్థమవుతుంది.

  డేటా సఫీషియన్సీ టాపిక్‌లో భాగంగా పరీక్షలో ఒక ప్రశ్న ఇస్తారు. దాని కింద రెండు ప్రవచనాలు ఉంటాయి. అభ్యర్థి ప్రశ్నకు కచ్చితమైన సమాధానాన్ని గుర్తించాల్సిన పనిలేదు. కానీ ఇచ్చిన ప్రశ్నకు జవాబు సాధించడానికి కావాల్సిన సమాచారం ఆ ప్రవచనాల్లో ఉందో లేదో కనిపెట్టాలి. సాధారణంగా ప్రశ్నల రూపం ఈ విధంగా ఉంటుంది.

* ప్రతి ప్రశ్నలో రెండు ప్రవచనాలు (I, II) ఇస్తారు. ఈ నియమాల ఆధారంగా సమాధానాలను గుర్తించాలి. 

1) కేవలం ప్రవచనం I ద్వారా మాత్రమే సమాధానం గుర్తించినప్పుడు

2) కేవలం ప్రవచనం II ద్వారా మాత్రమే సమాధానం గుర్తించినప్పుడు

3) ప్రవచనం I, II ల్లోని సమాచారాన్ని కలిపి సమాధానం గుర్తించినప్పుడు    

4) I, II ప్రవచనాల్లోని సమాచారాన్ని కలిపినా కూడా సమాధానం గుర్తించలేనప్పుడు 

మాదిరి ప్రశ్నలు

1. తరగతిలో ఆద్య ర్యాంకు ఎంత?

I. తరగతిలో మొత్తం 26 మంది విద్యార్థులు ఉన్నారు.

II. ఆద్య కంటే తరగతిలో 9 మంది తక్కువ మార్కులు పొందారు. 

1) కేవలం ప్రవచనం I ద్వారా మాత్రమే సమాధానం గుర్తించినప్పుడు

2) కేవలం ప్రవచనం II ద్వారా మాత్రమే సమాధానం గుర్తించినప్పుడు

3) ప్రవచనం I, II ల్లోని సమాచారాన్ని కలిపి సమాధానం గుర్తించినప్పుడు    

4) I, II ప్రవచనాల్లోని సమాచారాన్ని కలిపినా కూడా సమాధానం గుర్తించలేనప్పుడు 

సమాధానం: 3 

వివరణ: ప్రవచనాలు I, II ద్వారా

26 - 9 = 17

ఆద్య కంటే 9 మంది తక్కువ మార్కులు పొందారు. అంటే ఆద్య ర్యాంకు 17 అని తెలుస్తుంది. 

2. ఆగస్టులో 14వ రోజు ఏ వారం? 

I. ఆగస్టులో చివరి రోజు బుధవారం

II. ఆగస్టులో మూడో శనివారం 

1) కేవలం ప్రవచనం I ద్వారా మాత్రమే సమాధానం గుర్తించినప్పుడు

2) కేవలం ప్రవచనం II ద్వారా మాత్రమే సమాధానం గుర్తించినప్పుడు

3) ప్రవచనం I, II ల్లోని సమాచారాన్ని కలిపి సమాధానం గుర్తించినప్పుడు    

4) I, II ప్రవచనాల్లోని సమాచారాన్ని కలిపినా కూడా సమాధానం గుర్తించలేనప్పుడు 

సమాధానం: 2

వివరణ: ప్రవచనం - II ద్వారా

3వ శనివారం 17 అంటే 14వ రోజు బుధవారం అని తెలుస్తుంది. 

3. ఒక సంకేత భాషలో 13 అంటే stop smoking, 59 అంటేinjurious habit అయితే 9, 5 ను తెలియజేసే పదాలు? 

I. 157 అంటే stop bad habit

II. 834 అంటే smoking is injurious

1) కేవలం ప్రవచనం I ద్వారా మాత్రమే సమాధానం గుర్తించినప్పుడు

2) కేవలం ప్రవచనం II ద్వారా మాత్రమే సమాధానం గుర్తించినప్పుడు

3) ప్రవచనం I, II ల్లోని సమాచారాన్ని కలిపి సమాధానం గుర్తించినప్పుడు    

4) I, II ప్రవచనాల్లోని సమాచారాన్ని కలిపినా కూడా సమాధానం గుర్తించలేనప్పుడు

సమాధానం: 1

వివరణ: 13 stop smoking 

157 stop bad habit 

పై రెండింటి నుంచి stop = 1

59 injurious habit

habit = 5 smoking = 1 injurious = 9   

 ప్రశ్నలో ఇచ్చిన సమాచారం, ప్రవచనం - I ద్వారా injurious = 9, habit = 5

4. D కి ఎంతమంది కుమారులు ఉన్నారు?

I. A తండ్రికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.

II. B అనే వ్యక్తి Aకి సోదరుడు, D కి కుమారుడు.

1) కేవలం ప్రవచనం I ద్వారా మాత్రమే సమాధానం గుర్తించినప్పుడు

2) కేవలం ప్రవచనం II ద్వారా మాత్రమే సమాధానం గుర్తించినప్పుడు

3) ప్రవచనం I, II ల్లోని సమాచారాన్ని కలిపి సమాధానం గుర్తించినప్పుడు    

4) I, II ప్రవచనాల్లోని సమాచారాన్ని కలిపినా కూడా సమాధానం గుర్తించలేనప్పుడు

సమాధానం: 4 

వివరణ: ప్రవచనం I, II ల నుంచి 

A, B లను దీ పిల్లలుగా చెప్పవచ్చు. కానీ, ఇక్కడ A లింగం తెలియదు. అలాగే D 3వ పిల్లవాడి గురించి వివరణ లేదు కాబట్టి ఈ రెండు ప్రవచనాల నుంచి కూడా సమాధానం గుర్తించలేం. 

5. A, B, C, D, E లు ఒక వరుసలో కూర్చున్నారు. A, E ల మధ్య B ఉన్నాడు. అయితే వరుసలో సరిగ్గా మధ్యన ఎవరు ఉన్నారు?

I. A అనే వ్యక్తి B కి ఎడమవైపున, అలాగే D కి కుడివైపు ఉన్నాడు. 

II. C అనే వ్యక్తి కుడివైపు చివరన ఉన్నాడు.

1) కేవలం ప్రవచనం I ద్వారా మాత్రమే సమాధానం గుర్తించినప్పుడు

2) కేవలం ప్రవచనం II ద్వారా మాత్రమే సమాధానం గుర్తించినప్పుడు

3) ప్రవచనం I, II ల్లోని సమాచారాన్ని కలిపి సమాధానం గుర్తించినప్పుడు    

4) I, II ప్రవచనాల్లోని సమాచారాన్ని కలిపినా కూడా సమాధానం గుర్తించలేనప్పుడు

సమాధానం: 3 

వివరణ: ప్రవచనం I ద్వారా క్రమం DAB 

DABE

ప్రవచనం II ద్వారా క్రమం  DABEC

 B అనే వ్యక్తి సరిగ్గా మధ్యలో ఉన్నాడు. 

6. T అనే వ్యక్తి K కి ఏమవుతాడు? 

I. K కి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు A.

II. T యొక్క తల్లికి A, B అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 

1) కేవలం ప్రవచనం I ద్వారా మాత్రమే సమాధానం గుర్తించినప్పుడు

2) కేవలం ప్రవచనం II ద్వారా మాత్రమే సమాధానం గుర్తించినప్పుడు

3) ప్రవచనం I, II ల్లోని సమాచారాన్ని కలిపి సమాధానం గుర్తించినప్పుడు    

4) I, II ప్రవచనాల్లోని సమాచారాన్ని కలిపినా కూడా సమాధానం గుర్తించలేనప్పుడు

సమాధానం:  3

వివరణ: ప్రవచనం I, II ల నుంచి

7. A, B ల వేతనాల మధ్య నిష్పత్తి 4 : 3 అయితే తి వేతనం ఎంత? 

I. B వేతనం A వేతనంలో 75% 

II. B వేతనం రూ.4500.

1) కేవలం ప్రవచనం I ద్వారా మాత్రమే సమాధానం గుర్తించినప్పుడు

2) కేవలం ప్రవచనం II ద్వారా మాత్రమే సమాధానం గుర్తించినప్పుడు

3) ప్రవచనం I, II ల్లోని సమాచారాన్ని కలిపి సమాధానం గుర్తించినప్పుడు    

4) I, II ప్రవచనాల్లోని సమాచారాన్ని కలిపినా కూడా సమాధానం గుర్తించలేనప్పుడు

సమాధానం: 2 

వివరణ: ప్రవచనం II ద్వారా వేతనాల నిష్పత్తి = 4 : 3

8. గి అనే వ్యక్తి తీ, ది, దీ, ని, నీ అనే పాఠశాలల్లో దేనిలో ప్రవేశం పొందాడు? 

I. T అనే వ్యక్తి R  లేదా J  చదివిన పాఠశాలలో చదవడు.

II. R, J లు వరుసగా D, F లలో చదవరు.

1) కేవలం ప్రవచనం I ద్వారా మాత్రమే సమాధానం గుర్తించినప్పుడు

2) కేవలం ప్రవచనం II ద్వారా మాత్రమే సమాధానం గుర్తించినప్పుడు

3) ప్రవచనం I, II ల్లోని సమాచారాన్ని కలిపి సమాధానం గుర్తించినప్పుడు    

4) I, II ప్రవచనాల్లోని సమాచారాన్ని కలిపినా కూడా సమాధానం గుర్తించలేనప్పుడు

సమాధానం: 4

వివరణ: ప్రవచనాలు I, II ల నుంచి 

9. ఈ సంవత్సరంలో ఎన్ని ‘గ్రీటింగ్‌ కార్డ్స్‌’ అమ్ముడయ్యాయి?

I. గత సంవత్సరం అమ్మకాలు 2,935 కార్డులు.

II. ఈ సంవత్సరం అమ్మకాలు గత సంవత్సరం అమ్మకాలకు 1.2 రెట్లు.

1) కేవలం ప్రవచనం I ద్వారా మాత్రమే సమాధానం గుర్తించినప్పుడు

2) కేవలం ప్రవచనం II ద్వారా మాత్రమే సమాధానం గుర్తించినప్పుడు

3) ప్రవచనం I, II ల్లోని సమాచారాన్ని కలిపి సమాధానం గుర్తించినప్పుడు    

4) I, II ప్రవచనాల్లోని సమాచారాన్ని కలిపినా కూడా సమాధానం గుర్తించలేనప్పుడు

సమాధానం: 3 

వివరణ: ప్రవచనాలు I, II ల నుంచి ఈ సంవత్సరం అమ్మకాలు 2,935 x 1.2 = 3,522 

10. అక్షరం S కి కేటాయించిన సంఖ్య ఏది?

I. ఆంగ్ల అక్షరాలకు అవి ఉండే క్రమంలో 1 నుంచి 26 వరకు సంఖ్యను కేటాయించారు.

II. A, E, I, O, U లకు కేటాయించిన సంఖ్యలు వరుసగా 1, 2, 3, 4, 5    

1) కేవలం ప్రవచనం I ద్వారా మాత్రమే సమాధానం గుర్తించినప్పుడు

2) కేవలం ప్రవచనం II ద్వారా మాత్రమే సమాధానం గుర్తించినప్పుడు

3) ప్రవచనం I, II ల్లోని సమాచారాన్ని కలిపి సమాధానం గుర్తించినప్పుడు    

4) I, II ప్రవచనాల్లోని సమాచారాన్ని కలిపినా కూడా సమాధానం గుర్తించలేనప్పుడు

సమాధానం: 1 

వివరణ: ప్రవచనం I నుంచి S కి కేటాయించిన సంఖ్య ‘19’

రచయిత: గోలి ప్రశాంత్‌ రెడ్డి

Posted Date : 01-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

నమూనా ప్రశ్నపత్రాలు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌