• facebook
  • whatsapp
  • telegram

శాస్త్రవిభాగాలు - అధ్యయనం చేసే అంశాలు  

* అకౌస్టిక్స్ - ధ్వనిని అధ్యయనం చేసే శాస్త్రం.

* అగ్రొస్టాలజీ - గడ్డిమొక్కల అధ్యయనం.

* అనాటమీ - మొక్కలు, జంతువుల శరీర నిర్మాణాల అధ్యయనం.

* ఆంథ్రోపాలజీ - మానవుడి పుట్టుక, సంస్కృతుల అధ్యయనం.

* ఆర్బోరికల్చర్ - వృక్షాలు, కూరగాయల పెంపకానికి సంబంధించిన అధ్యయనం.

* ఆస్ట్రోనాటిక్స్ - విశ్వాంతర ప్రయాణం గురించిన అధ్యయనం.

* బ్యాక్టీరియాలజీ - బ్యాక్టీరియా అధ్యయనం.

* బయోకెమిస్ట్రీ - జీవుల్లోని రసాయనాల అధ్యయనం.

* బయోమెట్రీ - గణితాన్ని మానవజీవితానికి అనువర్తింపజేయడం.

* కార్డియాలజీ - గుండెను అధ్యయనం చేసే శాస్త్రం.

* సిటాలజీ - జలచర క్షీరదాల అధ్యయనం.

* కార్పాలజీ - ఫలాలు, విత్తనాల అధ్యయనం.

* కీమోథెరపీ - రసాయనాలను ఉపయోగించి వివిధ వ్యాధులకు చికిత్స చేయడం.

* కాంకాలజీ - మొలస్కా జీవుల కర్పరాల అధ్యయనం.

* కాస్మాలజీ - విశ్వం ఆవిర్భావం, విశ్వచరిత్ర గురించి అధ్యయనం.

* క్రేనియాలజీ - పుర్రెల అధ్యయనం.

* క్రిప్టోగ్రఫీ - రహస్య లిపి గురించి అధ్యయనం.

* క్రిస్టలోగ్రఫీ - స్ఫటికాల నిర్మాణం, రూపం, ధర్మాల గురించిన అధ్యయనం.

* క్రయోజెనిక్స్ - అతితక్కువ ఉష్ణోగ్రతల ఉత్పత్తి, నియంత్రణ, వీటి అనువర్తనాల అధ్యయనం.

* సైటాలజీ - కణాన్ని అధ్యయనం చేసే శాస్త్రం.

* సైటోఫాథాలజీ - కణవ్యాధుల అధ్యయనం.

* డక్టైలాలజీ - వేలిముద్రల అధ్యయనం.

* డక్టైలోగ్రఫీ - వ్యక్తులను గుర్తించడానికి వేలిముద్రలు ఉపయోగించి చేసే అధ్యయనం.

* డెండ్రాలజీ - వృక్షాల అధ్యయనం.

* ఇకాలజీ - జీవులకు, ఆవరణానికి మధ్య ఉన్న సంబంధం, చర్యల అధ్యయనం.

* ఎంబ్రియాలజీ - పిండం, అభివృద్ధికి సంబంధించిన అధ్యయనం.

* ఎండోక్రైనాలజీ - అంతస్రావ గ్రంథులు, అవి స్రవించే రసాయనాలు (హార్మోన్ల) ను అధ్యయనం చేసే శాస్త్రం.

* ఎంటమాలజీ - కీటకాల అధ్యయనం.

* ఇథాలజీ - జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం.

* యూజెనిక్స్ - తరువాతి తరంలో మంచి లక్షణాలున్న సంతనాన్ని పొందడం గురించి అధ్యయనం.

* జెనెటిక్స్ - అనువంశికత, అనువంశిక సూత్రాల అధ్యయనం.

* జియోబయాలజీ - భూమిపై ఉండే జీవుల అధ్యయనం.

* జెరంటాలజీ - వృద్ధాప్యం, వృద్ధ్యాప్యంలో వచ్చే వ్యాధుల అధ్యయనం.

* గైనకాలజీ - స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, వ్యాధుల అధ్యయనం.

* హెమటాలజీ - రక్తం, రక్తసంబంధ వ్యాధుల అధ్యయనం.

* హెపటాలజీ - కాలేయం, కాలేయసంబంధ వ్యాధుల అధ్యయనం.

* హిస్టాలజీ - కణజాలాల అధ్యయనం.

* హార్టికల్చర్ - ఉద్యానవన పంటల అధ్యయనం.

* హైడ్రాలజీ - వాతావరణంలో, భూమిపై ఉండే నీటి ధర్మాలు, వాటిలో అది ఉండే విధానాన్ని గురించి చేసే అధ్యయనం.

* హైడ్రోపతి - బాహ్యంగా, అంతర్గతంగా నీటిని ఉపయోగించి వ్యాధులకు చికిత్స చేయడంపై అధ్యయనం.

* హైడ్రోఫోనిక్స్ - పోషకజలాల్లో మొక్కలను పెంచడం.

* హిప్నాలజీ - నిద్ర గురించి అధ్యయనం.

* ఇక్తియాలజీ - చేపల అధ్యయనం.

* ఇమ్యునాలజీ - వ్యాధినిరోధకత అధ్యయనం.

* లిథాలజీ - రాళ్ల ధర్మాల అధ్యయనం.

* మలకాలజీ - మొలస్కా లేదా కర్పరం ఉన్న జీవుల అధ్యయనం.

* మెటలోగ్రఫీ - లోహాలు, మిశ్రమలోహాల స్ఫటిక నిర్మాణం గురించి అధ్యయనం.

* మెట్రాలజి - బరువులు, తూనికల అధ్యయనం.

* మైక్రోబయాలజీ - సూక్ష్మజీవుల అధ్యయనం.

* మినరాలజీ - ఖనిజాల విస్తరణ, గుర్తింపు, ధర్మాల అధ్యయనం.

* మైకాలజీ - శిలీంధ్రాలు, అవి కలిగించే వ్యాధుల అధ్యయనం.

* మెర్మికాలజీ - చీమలను అధ్యయనం చేసే శాస్త్రం.

* నెఫ్రాలజీ - మూత్రపిండాలు, వీటిలోని నెఫ్రాన్ల అధ్యయనం.

* న్యూరాలజీ - నాడీ వ్యవస్థ అధ్యయనం.

* న్యూమరాలజీ - అంకెల అధ్యయనం.

* ఆబ్‌స్టెస్ట్రిక్స్ - గర్భధారణ, శిశుజననం గురించి అధ్యయనం.

* ఓషియానోగ్రఫీ - సముద్రాలు, వాటిలోని ఖనిజ సంపదను అధ్యయనం చేసే శాస్త్రం.

* ఒడన్‌టాలజీ - దంతాల అధ్యయనం.

* ఒల్‌ఫక్టాలజీ - వాసనను అధ్యయనం చేసే శాస్త్రం.

* ఆంకాలజీ - వ్రణాల అధ్యయనం.

* ఆప్తమాలజీ - కళ్లు, కంటి సంబంధ వ్యాధుల అధ్యయనం.

* ఊలజీ - పక్షిగుడ్ల అధ్యయనం.

* ఓటోరైనోలారింగాలజీ - గొంతు, ముక్కు, చెవి అధ్యయనం.

* పేలియోబాటనీ - శిలాజ మొక్కల అధ్యయనం.

* పేలియంటాలజీ - శిలాజాల అధ్యయనం.

* పేలియోజువాలజీ - శిలాజ జంతువుల అధ్యయనం.

* పారాసైటాలజీ - పరాన్నజీవులు, ఇవి కలిగించే వ్యాధుల అధ్యయనం.

* పాథాలజీ - వ్యాధుల అధ్యయనం.

* పెడాలజీ - నేలల స్వభావం, అవి ఏర్పడటం, వాటి ధర్మాల అధ్యయనం.

* ఫార్మకాగ్నసీ - ఔషధాలు, శరీరంపై వీటి ప్రభావాలను అధ్యయనం చేసే శాస్త్రం.

* ఫొటోబయాలజీ - జీవులపై కాంతిప్రభావం అధ్యయనం

* ఫిథిసియాలజీ - క్షయవ్యాధిని శాస్త్రీయంగా అధ్యయనం చేయడం.

* ఫిజియాలజీ - జీవుల్లోని వివిధ అవయవాల పనితీరుపై అధ్యయనం.

* ఫైకాలజీ - శైవలాల అధ్యయనం.

* ఫైటోజని - మొక్కలపుట్టుక, పెరుగుదలల అధ్యయనం.

* ఫైటోఫాథాలజీ - మొక్కల వ్యాధుల అధ్యయనం.

* పోమాలజీ - ఫలాలు, వాటి అభివృద్ధికి సంబంధించిన అధ్యయనం.

* పొటమాలజీ - నదుల అధ్యయనం.

* సైకియాట్రి - మానసిక సమస్యలు, వ్యాధుల అధ్యయనం.

* సైకాలజీ - మానవ ప్రవర్తనను అధ్యయనం చేయడం.

* టెరిడాలజీ - టెరిడోఫైటా మొక్కల అధ్యయనం.

* రేడియోబయాలజీ - జీవులపై వికిరణ ప్రభావాన్ని అధ్యయనం చేయడం.

* రేడియాలజీ - x-కిరణాలు, రేడియో ధార్మికత గురించి అధ్యయనం.

* సెసిమాలజీ - భూకంపాల అధ్యయనం.

* సెలినాలజీ - చంద్రుడి పుట్టుక, స్వభావం, చలనంపై అధ్యయనం.

* సెరికల్చర్ - పట్టు పురుగులపెంపకంపై అధ్యయనం

* థెరాప్టిక్స్ - చికిత్స గురించి అధ్యయనం చేయడం.

* టాక్సికాలజీ - విషాలపై అధ్యయనం.

* యూరాలజీ - మూత్రకోశం, మూత్రనాళాలు, వ్యాధుల అధ్యయనం.

* వైరాలజీ - వైరస్ పై అధ్యయనం.

* ఆర్నియాలజీ - సాలీళ్ల అధ్యయనం.

* బాట్రకాలజీ - కప్పల అధ్యయనం.

* హెర్పటాలజీ - సరీసృపాల అధ్యయనం.

* మమ్మాలజీ - క్షీరదాల అధ్యయనం.

* నిడాలజీ - పక్షిగూళ్ల అధ్యయనం.

* ఒఫియాలజీ - పాముల గురించిన అధ్యయనం.

* సారాలజీ - బల్లుల అధ్యయనం.

* ఆండ్రాలజీ - పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అధ్యయనం.

* యూఫినిక్స్ - జన్యు వ్యాధుల చికిత్సఅధ్యయనం.

మెలనాలజీ - వర్ణద్రవ్యాల (Pigments) అధ్యయనం.

* ఒనిరియాలజీ (Oneriology) - కలల అధ్యయనం.

* కారియాలజీ - కణంలోని కేంద్రకం అధ్యయనం.

* ఒలెరికల్చర్ - కూరగాయలనిచ్చే మొక్కల అధ్యయనం.

* డెండ్రోక్రోనాలజీ - మొక్కల్లో వార్షిక వలయాల ఆధారంగా వృక్షాల వయసును నిర్ణయించడం.

* లిమ్నాలజీ - మంచి నీటి ఆవరణ వ్యవస్థ అధ్యయనం

* క్రయోబయాలజీ - అతిశీతల ఉష్ణోగ్రత వద్ద జీవించే జీవుల అధ్యయనం.

* డెర్మటాలజీ - చర్మాన్ని అధ్యయనం చేసే శాస్త్రం.

* ఆంజియాలజీ - రక్తనాళాల అధ్యయనం.

Posted Date : 14-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌