• facebook
  • whatsapp
  • telegram

వైపరీత్యానికి దుర్బలత్వం తోడైతే!

విపత్తులు - ప్రాథమిక భావనలు

 

 

ప్రకృతి వనరులను ధ్వంసం చేసి, ప్రజలకు అపార నష్టం కలిగించే ఆకస్మిక సంఘటనలే విపత్తులు. ప్రకృతిపరమైన, మానవ ప్రేరేపిత చర్యలు ఇందుకు కారణమవుతాయి. ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒక చోట విపత్తు సంభవిస్తూనే ఉంటుంది. అయితే ఆధునిక కాలంలో  వాటి వల్ల ఆస్తి, ప్రాణనష్టాలతో పాటు పర్యావరణం కూడా దెబ్బతింటోంది. ఈ పరిస్థితికి కారణాలు, నివారణ చర్యలు, విపత్తు నిర్వహణకు సంబంధించిన ప్రాథమికాంశాల గురించి పోటీ పరీక్షార్థులు విధిగా తెలుసుకోవాలి. మన దేశంలో ఎక్కువగా తలెత్తే విపత్తులు, అందుకు కారణమవుతున్న పరిస్థితులు, గణాంకాలపై సమగ్ర అవగాహనతో ఉండాలి.

 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 

 

1. డిజాస్టర్‌ అనే పదాన్ని ఏ భాష నుంచి గ్రహించారు?

1) ఫ్రెంచ్‌   2) లాటిన్‌   3) గ్రీకు   4) అరబిక్‌


2. విపత్తు అనేది కిందివాటిలో దేని ఫలితం?

1) వైపరీత్యం     2) దుర్బలత్వం  

3) విపత్కర స్థితి       4) 1, 2


3. ఏదైనా సమాజం (ప్రాంతం)లో సంభవించిన వైపరీత్యం వల్ల నష్టపోయిన ఆస్తులు, వనరులు, ప్రాణాలను, జీవనోపాధి పునరుద్ధరించుకోగల ఆ సమాజ నైపుణ్యాలను ఏమని పిలుస్తారు?

1) వైపరీత్యం     2) విపత్తు    

3) దుర్బలత్వం     4) సామర్థ్యం


4. అంతర్జాతీయ విపత్తు కుదింపు దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?

1) అక్టోబరు 2       2) అక్టోబరు 3 

3) అక్టోబరు 12      4) అక్టోబరు 13


5. భారతదేశంలో విపత్తు కుదింపు నివారణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?

1) అక్టోబరు 13        2) అక్టోబరు 23   

3) అక్టోబరు 26       4) అక్టోబరు 29


6. సార్క్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (SDMC) కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?

1) కాబూల్‌ 2) ఢాకా 3) న్యూదిల్లీ 4) లాహోర్‌


7. 1999లో కె.సి.పంత్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ‘అత్యున్నత అధికార కమిటీ’ దేశంలో ఎన్నిరకాల విపత్తులను గుర్తించింది.

1) 15     2) 13    3) 31    4) 25


8. ప్రపంచంలో విపత్తు ప్రభావిత ప్రాంతాలు, శాతాలను జతపరచండి.

విపత్తులు శాతాలు
ఎ) వరదలు 1) 21%
బి) గాలి దుమారాలు 2) 30%
సి) కరవు, కాటకాలు 3) 19%
డి) భూకంపాలు, సునామీలు 4) 8%

1) ఎ-2, బి-4, సి-1, డి-3       2) ఎ-2, బి-1, సి-3, డి-4

3) ఎ-2, బి-1, సి-4, డి-3     4) ఎ-1, బి-2, సి-3, డి-4


9. కిందివాటిలో పర్యావరణ క్షీణత వల్ల ఏర్పడే వైపరీత్యం ఏది?

1) వరదలు     2) దుర్భిక్షం   

3) భూపాతం     4) భూకంపాలు


10. ఏదైనా భౌగోళిక ప్రాంతంలో ప్రజాజీవనానికి, ఆస్తులకు నష్టాన్ని కలగజేసే శక్తి ఉన్న ఆకస్మిక సంఘటనలు-

1) విపత్తులు     2) దుర్బలత్వం  

3) వైపరీత్యం     4) పైవన్నీ


11. ‘సార్క్‌ దూర విపత్తు నిర్వహణ సమాచార కేంద్రం’ ఎక్కడ ఉంది?

1) కొలంబో      2) కాఠ్‌మాండూ 

3) ఢాకా       4) న్యూదిల్లీ


12. విపత్తు ఒక సంఘటన, దాని వల్ల- 

1) మానవ నష్టం కలుగుతుంది        2) ఆస్తి నష్టం కలుగుతుంది

3) జంతువుల నష్టం కలుగుతుంది         4) పైవన్నీ


13. ప్రమాదం ఒక అపాయకరమైన సంఘటన. అది..

1) భూకంపం కావచ్చు       2) సునామీ కావచ్చు 

3) వరదలు కావచ్చు     4) పైవన్నీ


14. కిందివాటిలో ఒక మానవ కారక విపత్తు?

1) వరద       2) భూకంపం  

3) కరవు      4) బాంబు పేలుడు


15. కిందివాటిలో ప్రకృతి విపత్తుకు ఉదాహరణ?

1) తుపాను     2) భూకంపం

3) సునామీ       4) పైవన్నీ


16. ‘ఒక సమాజం మౌలిక నిర్మాణానికి, సాధారణ పనితీరుకు అంతరాయం కలిగించే ఆకస్మిక లేదా తీవ్ర దురదృష్టాన్ని విపత్తు అంటారు’. ఈ నిర్వచనాన్ని ఎవరు ఇచ్చారు?

1) ప్రపంచ బ్యాంకు       2) UNO   

3) NDMA       4) ADB


17. ఒక సమాజం దుర్బలత్వాన్ని తెలిపే అంశానికి సంబంధించి కిందివాటిలో సరికానిది?

ఎ) జనసాంద్రత తక్కువగా ఉండటం.

బి) మౌలిక వసతులు అధికంగా ఉండటం.

సి) ఆ సమాజంలోని నివాస ప్రాంతం ఎక్కువ ఎత్తులో ఉండటం.

డి) పేదరికం, నిరుద్యోగిత స్థాయి తక్కువగా ఉండటం, అక్షరాస్యత  స్థాయి అధికంగా ఉండటం.

ఇ) వైపరీత్యా భరిత ప్రాంతానికి దూరంగా ఉండటం

1) ఎ, బి, డి      2) ఎ, డి  

3) బి, సి, డి     4) పైవేవీ కావు


18. కిందివాటిని పరిశీలించండి.

ప్రతిపాదన (A): వైపరీత్యాలన్నీ విపత్తు స్థాయిని  పొందలేవు.

కారణం (B): ఎక్కువ దుర్బలత్వంతో కూడిన ప్రాంతాల్లో ఒక మోస్తరు వైపరీత్యమైనా విపత్తు స్థాయిని పొందగలదు.

1) (A), (R) లు సరైనవి, (A) కి (R) సరైన వివరణ

2) (A), లు సరైనవి, (A) కి (R) సరైన వివరణ కాదు

3) (A) సరైంది, (R) సరైంది కాదు

4) (A) సరైంది కాదు, (R) సరైంది


19. బిల్డింగ్‌ మెటీరియల్స్, టెక్నాలజీ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (BMTPC) కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?

1) లఖ్‌నవూ      2) రూర్కీ  

3) న్యూదిల్లీ      4) చెన్నై


20. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వశాఖ పరిధిలో ఉండే ‘బిల్డింగ్‌ మెటీరియల్స్, టెక్నాలజీ ప్రమోషన్‌ కౌన్సిల్‌’ వైపరీత్య ప్రాంత వివరాలను వెల్లడించే ‘వల్నరబిలిటీ అట్లాస్‌’ను ఏ సంవత్సరంలో రూపొందించింది?

1) 1996          2) 1997  

3) 1998          4) 1999


21. కిందివాటిలో దేశంలో తీవ్రమైన భూకంప దుర్బలత్వ ప్రాంతాలు?

1) హిమాలయాలు        2) గంగా సింధు మైదాన ప్రాంతం 

3) గుజరాత్‌లోని అలియాబాద్‌ భ్రంశరేఖ  4) పైవన్నీ


22. కిందివాటిని జతపరచండి.

జాబితా - 1     జాబితా - 2
ఎ) వైపరీత్యం 1) వైపరీత్య ఫలితం
బి) దుర్బలత్వం 2) ప్రమాదకర శక్తి ఉన్న సంఘటన
సి) సామర్థ్యం 3) వైపరీత్యాల వల్ల కలిగే నష్ట తీవ్రతను పెంచే ఒక ప్రాంత పరిధి
డి) విపత్తు 4) వైపరీత్యాల వల్ల నష్టాల నుంచి తిరిగి కోలుకునే సమాజ నైపుణ్యాలు

1) ఎ-2, బి-3, సి-4, డి-1    2) ఎ-2, బి-1, సి-3, డి-4

3) ఎ-2, బి-1, సి-4, డి-3         4) ఎ-1, బి-2, సి-3, డి-4


23. UNISDR (యునైటెడ్‌ నేషన్స్‌ ఇంటర్నేషనల్‌ స్ట్రాటజీ ఫర్‌ డిజాస్టర్‌ రిడక్షన్‌) ను ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?

1) ప్యారిస్‌      2) న్యూయార్క్‌ 

3) టోక్యో     4) జెనీవా


24. కిందివాటిలో ప్రకృతి, మానవ ప్రేరేపితమైన విపత్తు కానిది ఏది?

1) అడవుల కార్చిచ్చు       2) దుర్భిక్షం   

3) భూపాతం      4) అగ్నిపర్వతాలు


25. కిందివాటిలో పర్వత ప్రాంతాల్లో ఏర్పడే వైపరీత్యం (Hazard) ఏది?

1) భూకంపాలు       2) భూపాతాలు   

3) కుండపోత వర్షాలు       4) పైవన్నీ


26. కిందివాటిలో నిరూపాకార చలనాల వల్ల ఏర్పడే వైపరీత్యానికి ఉదాహరణ?

1) హిమపాతాలు       2) చక్రవాతాలు   

3) భూకంపాలు       4) వరదలు


27. అత్యంత దుర్బలత్వ ప్రాంతంలో అతితీవ్రత ఉన్న వైపరీత్యం సంభవిస్తే అది దేనికి దారి తీస్తుంది?

1) బలమైన విపత్తు    2) బలహీన విపత్తు 

3) ఏ ప్రమాదం ఉండదు    4) చెప్పలేం


28. కింద తెలిపిన ఏ సందర్భాల్లో వైపరీత్యం విపత్తుగా మారుతుంది?

1) సమాజంలోని ఒక వర్గ ప్రజల ఆస్తి, ప్రాణనష్టాలకు వైపరీత్యం కారణమైనప్పుడు

2) వైపరీత్వం మానవ సంచారం లేని ప్రాంతాల్లో సంభవించిన దీర్ఘకాలంలో సమీప మానవ సమాజంలో దాని ప్రభావం ఉన్నప్పుడు 

3) ప్రభావిత ప్రాంత ప్రజల జీవనోపాధి దెబ్బతిని నిరాశ్రయులు అయినప్పుడు     4) పైవన్నీ


29. ఆపద (Risk) అనే ఫలితాన్ని కింది ఏ విధంగా వ్యక్తపరచవచ్చు?

1) (వైపరీత్యం × సామర్థ్యం) / దుర్బలత్వం

2) (వైపరీత్యం × దుర్బలత్వం) / సామర్థ్యం

3) (వైపరీత్యం × సామర్థ్యం)/విపత్కర స్థితి

4) (విపత్కర స్థితి × సామర్థ్యం)/వైపరీత్యం


30. పేదరికం, మౌలిక వసతుల లేమి, భౌతిక వనరుల కొరత లాంటి కారణాల వల్ల ఒక వైపరీత్యం కారణంగా ఏదైనా భౌగోళిక ప్రాంతంలో నష్ట తీవ్రతను పెంచే పరిస్థితుల సమూహాన్ని ఆ ప్రాంత   ........... అంటారు.

1) విపత్తు 2) వైపరీత్యం 3) దుర్బలత్వం 4) పైవన్నీ


31. విపత్తు అనే భావనకు సంబంధించి కిందివాటిలో సరైంది?

1) ప్రజాజీవనానికి నష్టం కలగజేయడంతో వారు నిరాశ్రయులవుతారు.

2) ధన, ప్రాణ నష్టాలు కలుగుతాయి, జీవనోపాధి దెబ్బతింటుంది.

3) ప్రభావిత ప్రజల జీవనోపాధి పునరుద్ధరించడానికి జాతీయ, అంతర్జాతీయ సహకారం అవసరం.విపత్తు ప్రభావాన్ని ఎదుర్కొనే సామర్థ్యాన్ని మించి వైపరీత్య ప్రభావం ఉంటుంది.

4) పైవన్నీ


32. ప్రపంచంలో సంభవించే విపత్తుల్లో భూకంపాలు, సునామీల శాతం ఎంత?

1) 6%   2) 7%   3) 8%   4) 9%


33. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకారం 2010 - 11 మధ్య విపత్తుల వల్ల జరిగిన ప్రాణ నష్టం?

1) 2310  2) 4877  3) 1677  4) 340


34. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం 1992 నుంచి 2000 మధ్య ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి సగటున ఎన్ని విపత్తులు సంభవించాయి?

1) 100   2) 300   3) 500   4) 800


35. కిందివాటిలో Rapid on set వైపరీత్యం ఏది?

1) భూకంపం     2) అగ్నిపర్వతాలు   

3) సునామీ      4) పైవన్నీ



సమాధానాలు

1-1; 2-4; 3-4; 4-4; 5-4; 6-3; 7-3; 8-2; 9-2; 10-3; 11-4; 12-4; 13-4; 14-4; 15-4; 16-2; 17-4; 18-1; 19-3; 20-2; 21-4; 22-1; 23-4; 24-4; 25-4; 26-3; 27-1; 28-4; 29-2; 30-2; 31-4; 32-3; 33-1; 34-2; 35-4.

 

 

రచయిత: ఇ.వేణుగోపాల్‌ 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 

Posted Date : 19-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌