• facebook
  • whatsapp
  • telegram

ఆవ‌ర‌ణ శాస్త్రం

1. జీవులు, వాటి చుట్టూ ఉండే బాహ్య పరిసరాల మధ్య సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రం?

1) ఆవరణ శాస్త్రం        2) జన్యుపరిణామ శాస్త్రం 

3) ప్రతిబల శరీరధర్మ శాస్త్రం      4) బాహ్య స్వరూప శాస్త్రం


2. ఆవరణ శాస్త్రంలో నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణంగా పరిగణించేది ఏది?

1) పర్యావరణ ఘటకం      2) ఆవరణ వ్యవస్థ    

3) జీవుల సంఖ్య      4) సామాజిక పరస్పర అవగాహన


3. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొదటిసారి ప్రయోగించిన శాస్త్రవేత్త?

1) హక్స్‌లే        2) మ్యాక్స్‌లే      3) టాన్స్‌లే        4) ఓడమ్‌


4. కిందివాటిలో భౌమ్య ఆవరణ వ్యవస్థకు ఉదాహరణలు?

i. అటవీ ఆవరణ వ్యవస్థ 

ii. గడ్డి భూములు 

iii. టండ్రా ఆవరణ వ్యవస్థ 

iv. ఎడారి ఆవరణ వ్యవస్థ 

1) i, ii, iii        2) i, ii, iv 

3) i, iii, iv        4) i, ii, iii, iv


5. కిందివాటిలో జీవి సహజస్థానంగా దేన్ని పేర్కొంటారు?

1) ఆవాసం        2) ఉనికి     3) బయోమ్‌        4) నిచ్‌


6. జల సంబంధ ఆవరణ వ్యవస్థలను ప్రధానంగా ఎన్ని రకాలుగా విభజించొచ్చు?

1) 1    2) 2    3) 3    4) 4


7. ఏ ఆవరణ వ్యవస్థలో అయినా గమనించదగ్గ ప్రధాన అనుఘటకాల సంఖ్య?

1) 4    2) 3    3) 2    4) 1


8. కిందివాటిలో నిర్జీవ అనుఘటకాలు ఏవి?

i. గాలి        ii. నీరు      iii. విచ్ఛిన్నకారులు       iv. కాంతి

1) i, ii, iii, iv        2) i, ii, iii 

3) i, iii, iv          4) i, ii, iv


9. కిందివాటిలో సజీవ అనుఘటకాలుగా  విభజించదగినవి ఏవి?

i. ఉత్పత్తిదారులు      

ii. వినియోగదారులు 

iii. విచ్ఛిన్నకారులు 

iv. అక్షాంశ, రేఖాంశాలు

1) i, ii, iii        2) ii, iii, iv 

3) i, ii, iv        4) i, ii, iii, iv


10. ఏ ఆవరణ వ్యవస్థలోనైనా చనిపోయిన జంతు, వృక్ష కళేబరాలను విచ్ఛిన్నం చేస్తూ జీవరసాయన వలయాలు జరగడానికి కారణమైన జీవ అనుఘటకాలు ఏవి?

1) ఉన్నతజాతి మొక్కలు 

2) ఉన్నతజాతి జంతువులు

3) బ్యాక్టీరియా, శిలీంద్రాల లాంటి విచ్ఛిన్నకారులు 

4) రేడియోధార్మిక లక్షణాలు ఉన్న విఘటన రసాయనాలు


11. ఆవరణ వ్యవస్థలో శక్తి ఉత్పాదకాలు?

1) ఉత్పత్తిదారులు      2) వినియోగదారులు 

3) విచ్ఛిన్నకారులు     4) శాకాహారులు


12. ఆవరణ వ్యవస్థలో ప్రథమ వినియోగదారులు?

1) ఉత్పత్తిదారులు        2) శాకాహారులు 

3) మాంసాహారులు       4) విచ్ఛిన్నకారులు


13. ఆవరణ వ్యవస్థలో శక్తికి మూలం?

1) నీరు     2) నేల      3) సూర్యుడు      4) లవణాలు


14. ఆవరణ వ్యవస్థలో మాంసాహారుల స్థానం?

1) శాకాహారులు       2) ప్రథమ వినియోగదారులు 

3) విచ్ఛిన్నకారులు      4) ద్వితీయ వినియోగదారులు


15. కిందివాటిలో ఆవరణ వ్యవస్థ విధులు లేదా క్రియాత్మక అంశాలు ఏవి?

i. అవసరమైన ఆవరణ సంబంధ ప్రక్రియలను నియంత్రించడం ద్వారా జీవవ్యవస్థను స్థిరత్వం చేయడం.

ii. ఆవశ్యక మూలకాలు లేదా పోషకాల వలయాలు జీవ, నిర్జీవ అనుఘటకాల మధ్య జరగడం.

iii. ఆవరణ వ్యవస్థలో వివిధ శక్తిస్థాయుల మధ్య సమతౌల్యతను కాపాడటం.

1) i, ii, iii       2) i, ii      3) ii, iii        4) i, iii


16. కిందివాటిలో ఆహారగొలుసును సరిగా సూచించే క్రమం?

1) విచ్ఛిన్నకారులు వినియోగదారులు శాకాహారులు ఉత్పత్తిదారులు

2) ఉత్పత్తిదారులు శాకాహారులు మాంసాహారులు విచ్ఛిన్నకారులు 

3) శాకాహారులు విచ్ఛిన్నకారులు ఉత్పత్తిదారులు  

4) శాకాహారులు మాంసాహారులు మొక్కలు విచ్ఛిన్నకారులు


17. కిందివాటిని జతపరచండి.

శక్తిస్థాయి              జీవులు

i) T1                a) విచ్ఛిన్నకారులు

ii) T2              b) మాంసాహారులు

iii) T3             c) శాకాహారులు

iv) T4            d) మొక్కలు

1) i-c , ii-d, iii-a, i-b 

2) i-c, ii-d, iii-b, i-a  

3) i-d, ii-b, iii-c, i-a  

4) i-d, ii-c, iii-b, i-a


18. కిందివాటిలో అత్యధిక శక్తి కావాల్సిన శక్తిస్థాయిలోని జీవులు?

1) ద్వితీయ వినియోగదారులు       2) విచ్ఛిన్నకారులు 

3) ప్రాథమిక ఉత్పత్తిదారులు     4) ప్రాథమిక వినియోగదారులు


19. కిందివాటిలో సరైన జతలను ఎంపిక చేయండి.

    శాస్త్రవేత్త                  భావన/ పదం

i. ఎర్నెస్ట్‌ హెకెల్‌    -     ఆవరణ వ్యవస్థ

ii. ఏజీ టాన్స్‌లే     -     ఆవరణ శాస్త్రం

iii. ఎల్టన్‌              -     ఆవరణ సంబంధ పిరమిడ్‌లు

1) i, ii        2) ii, iii       3) i, iii        4) iii మాత్రమే 


20. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?

i. వినియోగదారులన్నీ స్వయం పోషకాలు.

ii. సూర్యుడి కాంతి బహిర్గతంగా అందుబాటులో ఉండే సమయాన్ని ఫొటో పీరియడ్‌గా పేర్కొంటారు.

iii. ఉత్పత్తిదారులను సాంకేతికంగా హెటిరోట్రోప్‌లు అంటారు.

1) i, ii, iii        2) i, ii        3) i, iii        4) ii మాత్రమే


21. ప్రమాణ కాలంలో ప్రమాణ వైశాల్యంలో ఉత్పత్తిదారులతో ఉత్పత్తయిన మొత్తం బయోమాస్‌ లేదా జీవద్రవ్యాన్ని ఏమంటారు?

1) స్థూల ప్రాథమిక ఉత్పాదకత     2) నికర ప్రాథమిక వినియోగ శక్తి

3) నికర ప్రాథమిక ఉత్పాదకత      4) ద్వితీయ ఉత్పాదకత


22. ఆవరణ వ్యవస్థకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?

1) ప్రాథమిక వినియోగదారులు ప్రాథమిక ఉత్పత్తిదారులపై చాలా తక్కువగా ఆధారపడతాయి.

2) సాధారణంగా ప్రాథమిక వినియోగదారుల సంఖ్య ప్రాథమిక ఉత్పత్తిదారుల సంఖ్య కంటే ఎక్కువగా ఉంటుంది.

3) ప్రాథమిక ఉత్పత్తిదారులు ప్రాథమిక వినియోగదారుల కంటే ఎక్కువగా ఉంటాయి.

4) ఆవరణ వ్యవస్థలో అన్నింటికంటే ద్వితీయ వినియోగదారుల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది.


23. కిందివాటిలో హెమియోస్టాసిస్‌ లేదా సమానావస్థ స్థితి అని దేన్ని అంటారు?

1) బాహ్య వాతావరణ పరిస్థితికి అనుగుణంగా జీవావరణ వ్యవస్థలు మారిపోవడం.

2) బాహ్య వాతావరణ పరిస్థితుల్లో మార్పులకు అనుగుణంగా జీవావరణ వ్యవస్థలు మార్పును నిరోధించడం లేదా జీవావరణ వ్యవస్థల అంతర్గత పరిస్థితులు స్థిరంగా ఉండేలా చూడటం.

3) స్వీయ నియంత్రణ విధానంలో విఘాతాల వల్ల సహజ నియంత్రణను కోల్పోవడం.

4) హోమియోపతి వైద్యవిధానంలో ఉపయోగించే జీవద్రవ్య ఉత్పాదనాశక్తిలో మార్పు రేటు.


24. కిందివాటిలో పర్యావరణ పిరమిడ్లు ఏవి?

i. సంఖ్యల పిరమిడ్లు 

ii. జీవ ద్రవ్య పిరమిడ్లు 

iii. శక్తి పిరమిడ్లు

1) i, ii, iii         2) i, ii   3) i, iii         4) ii, iii


25. ఆవరణ వ్యవస్థలో పోషక నిర్మాణాన్ని, వివిధ పోషక స్థాయుల్లో ఉండే ఉత్పత్తిదారులు, వినియోగదారులు అనుక్రమంగా జరిపే చర్యను రేఖాత్మకంగా చూపే చిత్రం?

1) పర్యావరణ డిజైన్‌లు       2) పర్యావరణ పిరమిడ్‌లు

3) పర్యావరణ వలయాలు       4) పర్యావరణ స్వరూపాలు


26. వివిధ పోషక స్థాయుల్లోని జీవరాశులకు ఏడాది కాలంలో ఉపయోగపడిన శక్తి మొత్తాన్ని తెలిపే రేఖాచిత్రం?

1) సంఖ్యా పిరమిడ్‌      2) జీవద్రవ్య పిరమిడ్‌ 

3) శక్తి పిరమిడ్‌      4) శిఖరస్థాయి పిరమిడ్‌


27. కిందివాటిలో ఏ ఆవరణ వ్యవస్థలోనైనా నిటారుగా ఉండే పర్యావరణ పిరమిడ్‌ ఏది?

1) పోషణ పిరమిడ్‌        2) సంఖ్యా పిరమిడ్‌ 

3) జీవద్రవ్య పిరమిడ్‌      4) శక్తి పిరమిడ్‌


28. ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి శక్తి ప్రవహించినప్పుడు ఎంత శక్తి బదిలీ అవుతుంది?

1) 50%        2) 60%        3) 10%        4) 80%


29. ప్రతి పర్యావరణ పిరమిడ్‌లోనూ అడుగు భాగంలో సూచించే పోషక స్థాయి ఏది?

1) ఉత్పత్తిదారులు        2) శాకాహారులు 

3) మాంసాహారులు       4) విచ్ఛిన్నకారులు


30. ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహ క్రమాన్ని సూచించే సరైన విధం ఏది?

1) ఉత్పత్తిదారులు విచ్ఛిన్నకారులు మాంసాహారులు శాకాహారులు

2) ఉత్పత్తిదారులు ప్రాథమిక వినియోగదారులు ద్వితీయ వినియోగదారులు విచ్ఛిన్నకారులు

3) విచ్ఛిన్నకారులు వినియోగదారులు శాకాహారులు ఉత్పత్తిదారులు

4) ఉత్పత్తిదారులు  మాంసాహారులు శాకాహారులు విచ్ఛిన్నకారులు

 

31. కిందివాటిలో సరైన వాక్యం ఏది?

1) ఆవరణ వ్యవస్థలో శక్తి ఏ స్థాయిలోనూ కనిపించదు.

2) ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు లేకపోయినా వాటి ప్రక్రియలకు విఘాతం కలగదు.

3) ఆవరణ వ్యవస్థలో శక్తి ఒకే క్రమంలో ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారుల వరకూ ప్రవహిస్తుంది.

4) పరాన్నజీవులు ప్రతి ఆహారగొలుసులో ప్రధానంగా ఉండే పోషక స్థాయి.

 

32. పర్యావరణ పిరమిడ్‌లలో సాధారణంగా అన్నిటికంటే పైన ఉండే జీవులు ఏవి?

1) అగ్రమాంసాహారులు      2) శాకాహారులు

3) ద్వితీయ వినియోగదారులు   4) ఉత్పత్తిదారులు

 

33. కిందివాటిలో జీవరసాయన వలయాల్లో, ఆవరణ వ్యవస్థలో పదార్థాల చక్రీయ రవాణా జరిగేవి?

i. ఫాస్ఫరస్‌        ii. కార్బన్‌      iii. నీరు        iv. నైట్రోజన్‌

1) i, ii, iii        2) ii, iii, iv       3) i, iii           4) i, ii, iii, i)

 

34. జలచక్రంలో మృత్తికకు పర్యావరణానికి మధ్య వారధిగా వ్యవహరించేవి?

1) మొక్కలు         2) జంతువులు  3) వైరస్‌లు          4) బ్యాక్టీరియా

 

35. కొన్ని ఆహార గొలుసులు కలిసి జాలకంలా తయారవడం వల్ల ఏర్పడేది?

1) ఆహార వల          2) శక్తి రూపాలు   3) శక్తి మూలకాలు    4) ఆహార వలయాలు


సమాధానాలు

1-1, 2-2, 3-3, 4-4, 5-1, 6-2, 7-3, 8-4, 9-1, 10-3, 11-1, 12-2, 13-3, 14-4, 15-1, 16-2, 17-4, 18-3, 19-4, 20-4, 21-1, 22-3, 23-2, 24-1, 25-2, 26-3, 27-4, 28-3, 29-1, 30-2, 31-3, 32-1, 33-4, 34-1, 35-1 

Posted Date : 17-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌