• facebook
  • whatsapp
  • telegram

చక్రవాతాలు - సునామీ

1. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి.
a) స్పానిష్ భాషలో టోర్నడో అంటే 'ఉరుముల తుపాన్' అని అర్థం.
b) గ్రీకు భాషలో కైక్లోన్ అంటే 'తిరుగుతున్న నీరు' అని అర్థం.
జ: a, b సరైనవి
2. కిందివాటిని జతపరచండి.
ప్రాంతాలు                  
సైక్లోన్

a) జపాన్, చైనా        i) బ్లిజార్డ్స్

b) ఆస్ట్రేలియా         ii) హరికేన్లు

c) వెస్టిండీస్          iii) విల్లీ - విల్లీ

d) అంటార్కిటికా      iv) టైఫూన్లు

                      v) టోర్నడోలు

జ: a-iv, b-iii, c-ii, d-i

3. దేశంలో తొలి విపత్తు రేడియోను ఎక్కడ ఏర్పాటు చేశారు?
జ: కడలూర్
4. ప్రపంచ చక్రవాతాల్లో భారతదేశ తీర ప్రాంతంలో ఎంత శాతం తుపాన్లు సంభవిస్తున్నాయి?
జ: 10%
5. సునామీలు ఎక్కువగా ఎప్పుడు సంభవిస్తాయి?
      1) పగలు         2) రాత్రి       3) పగలు, రాత్రి         4) అన్ని వేళల్లో
జ: 4 (అన్ని వేళల్లో)
6. పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ ఎక్కడ ఉంది?
జ: హోనొలులు
7. 2017 సెప్టెంబరులో ఫ్లోరిడా, క్యూబాను తీవ్రంగా నష్టపరిచిన హరికేన్?
జ: ఇర్మా
8. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో తుపాన్లు ఏ నిష్పత్తిలో సంభవిస్తాయి?
జ: 4 : 1

గత పోటీ పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు1. 2011, మార్చి 11న ఏ దేశంలో సంభవించిన సునామీ వల్ల వేలాది మంది మరణించారు?(గ్రూప్-4, 2012)
జ: జపాన్
2. భారతదేశంలో ఎంత మేర తీరప్రాంతం తుపాన్లు, గాలివానలు, సునామీలకు గురవుతుంది?(గ్రూప్-4, 2012)
జ: 5700 కి.మీ.
3. సముద్రాల్లో సునామీ సంభవించినప్పుడు దాని తరంగ/అలల ప్రయాణ వేగం ఎంత?(పంచాయతీ సెక్రటరీ, 2013)
జ: 800 కి.మీ./గంట
4. 1999లో ఒడిశాలో సంభవించిన తీవ్ర తుపాన్ వేగం ఎంత?(హాస్టల్ వెల్ఫేర్, 2017)
జ: 260 - 270 కి.మీ./గంట
5. కిందివాటిలో విపత్తు కానిది? (ఏఎస్‌వో - 2017, ఏపీ)
1) ప్రాణ నష్టంలేని తుపాన్      2) ఆర్థిక నష్టంలేని తుపాన్
3) ప్రాణ, ఆర్థిక నష్టంలేని తుపాన్     4) గాలి లేని, వర్షాలకు కారణమయ్యే అల్పపీడన ద్రోణి
జ: 4 (గాలి లేని, వర్షాలకు కారణమయ్యే అల్పపీడన ద్రోణి)
6. ఉష్ణమండల తుపాన్లను గుర్తించడానికి ఉపయోగించే సాధనం?(ఏఎస్‌వో-2017)
జ: తీరప్రాంత రాడార్‌లు
7. 2014లో విశాఖపట్టణాన్ని తీవ్రంగా నష్టపరిచిన తుపాన్?(డీఎల్-2017)
జ: హుద్‌హుద్
8. జపాన్ భాషలో సునామీ అంటే?(డిప్యూటీ సర్వేయర్-2017)
జ: హర్బర్ వేవ్


 

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విపత్తు నిర్వహణ చట్టం - 2005

 2005, మే 30న కార్యనిర్వహక ఉత్తర్వు ద్వారా ప్రధాని ఛైర్మన్‌గా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థను ఏర్పాటుచేశారు. దీన్ని యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం 'ప్రకృతి వైపరీత్యాల నష్ట నివారణ' అనే పేరుతో 2005, డిసెంబరు 23న పార్లమెంట్‌లో ఆమోదించింది. ఈ చట్టంపై 2006, జనవరి 9న రాష్ట్రపతి సంతకం చేశారు.
* 2006, సెప్టెంబరు 27న ఛైర్మన్, తొమ్మిది మంది సభ్యులతో కూడిన 'జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ - NDMA' లాంఛనంగా అమల్లోకి వచ్చింది.
* జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ మొదటి ఛైర్మన్ డాక్టర్ మన్మోహన్ సింగ్, వైస్ ఛైర్మన్ డాక్టర్ మర్రి శశిధర్ రెడ్డి. వీరు 2014లో రాజీనామా చేశారు.
* 2014 డిసెంబరులో ఎన్‌డీఏ ప్రభుత్వం నూతన విపత్తు నిర్వహణలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సభ్యులను తగ్గించింది. ప్రస్తుతం ఒక ఛైర్మన్, అయిదుగురు సభ్యులు ఉన్నారు.
* ప్రస్తుత NDMA ఛైర్మన్ నరేంద్ర మోదీ; సభ్యులు కమల్ కిశోర్, డి.ఎన్. శర్మ, ఎన్.సి. మర్వా, ఆర్.కె. జైన్.

* విపత్తు నిర్వహణ చట్టాన్ని 2009, అక్టోబరు 22న కేంద్రమంత్రి మండలి ఆమోదించి దేశ వ్యాప్తంగా అమలు చేసింది. దీన్నే జాతీయ విపత్తు నిర్వహణ విధానం (నేషనల్ పాలసీ ఫర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ - NPDM) అంటారు.
* జాతీయ విపత్తు మొదటి సమావేశాన్ని 2006, నవంబరు 29న; రెండో సమావేశాన్ని 2009, నవంబరు 6న దిల్లీ విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించారు. విపత్తు పరిహారాన్ని 2015, ఏప్రిల్ 1 నుంచి అందిస్తున్నారు. నూతన విధానం ప్రకారం ఒక వ్యక్తి విపత్తు వల్ల మరణిస్తే రూ.4 లక్షలు, 60% గాయాలైతే రూ.2 లక్షలు నష్ట పరిహారంగా ఇస్తారు.

 

జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక (నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ - NDMP):
            2016, జూన్ 1న దిల్లీలో నూతన జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికను నరేంద్ర మోదీ ప్రభుత్వం విడుదల చేసింది ఈ ప్ర‌ణాళిక‌ను కింది స‌ద‌స్సుల ల‌క్ష్యాల‌కు అనుగుణంగా రూపొందించారు.
a) 2015 మార్చి - జపాన్ (సెండాయ్) - అంతర్జాతీయ విపత్తు కుదింపు సదస్సు (DRR - Disaster Risk Reduction)
b) 2015 సెప్టెంబరు - అమెరికా (న్యూయార్క్) - సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సదస్సు (SDG - Sustainable Development Goals)
c) 2015 డిసెంబరు - ఫ్రాన్స్ (పారిస్) - వాతావరణ మార్పు సదస్సుల (COP - 21)
            ఈ ప్రణాళిక 2015 - 2030 వరకు స్పల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికల్లో మొత్తం 14 లక్ష్యాలను సాధించాలని నిర్ణయించింది. స్పల్పకాలిక 5 సంవత్సరాలు, మధ్యకాలిక 10 సంవత్సరాలు, దీర్ఘకాలిక 15 సంవత్సరాలుగా నిర్ణయించారు.       

* 2005 విపత్తు నిర్వహణ చట్టం సెక్షన్ 11 ప్రకారం జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక (NDMP) దేశం మొత్తానికి చట్ట/న్యాయ బద్ధమైంది. సెక్షన్ 37 ప్రకారం దేశంలోని అన్ని మంత్రిత్వ శాఖలకు ఇది వర్తిస్తుంది.
 

విపత్తు నిర్వహణ స్థాయి (Levels of Disasters):
            విపత్తు నిర్వహణ అత్యున్నతాధికారి కమిటీ (HPC) - 2001 నివేదిక ప్రకారం 2016లో జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికలో విపత్తు దుర్బలత్వాన్ని తగ్గించడానికి వివిధ కేటగిరీలుగా విభజించారు. ఒక సాధారణ కేటగిరీని కూడా రూపొందించారు.
స్థాయి - 1 (L1) - జిల్లా స్థాయిలో విపత్తు ప్రణాళికలను నిర్వహిస్తూ, రాష్ట్రస్థాయి విపత్తు నిర్వహణ సహాయాన్ని కలిగి ఉండటం
స్థాయి - 2 (L2) - రాష్ట్రస్థాయి విపత్తు నిర్వహణ అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ నిర్వహణ సహాయాన్ని కలిగి ఉండటం
స్థాయి - 3 (L3) - రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఒకే సమయంలో దీర్ఘకాలిక విపత్తు సంభవించినప్పుడు
స్థాయి - 0 (L0) - ఒక ప్రాంతం సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు
* జాతీయ విపత్తు నిర్వహణ కో ఆర్డినేటర్ - కేంద్ర హోంమంత్రి.

జాతీయ విపత్తు నిర్వహణ విధాన నిర్ణయ కమిటీలు (National Level Decision Making bodies for DM) 

విపత్తు ఉపశమనం/నోడల్ మంత్రిత్వ నిర్వహణ (Nodel Ministry for Management/Mitigation of Disasters)  
 

జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళం (NDRF)
           2005 విపత్తు చట్టం సెక్షన్ 44 ప్రకారం 2006లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని ఏర్పాటు చేశారు. ఇది హోంమత్రి నిర్వహణలో ఉంటుంది. దీనికి ఒక డైరెక్టర్ జనరల్ ఉంటాడు. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ (ఐపీఎస్). ప్రస్తుతం దేశంలో మొత్తం 5 దళాల్లో 12 బెటాలియన్లు, ప్రతి బెటాలియన్‌లో 1149 మంది ఉంటారు. ఈ బెటాలియన్లకు ప్రకృతి, రేడియోలాజికల్, న్యూక్లియర్, బయోలాజికల్, కెమికల్ విపత్తులపై బాధ్యత ఉంటుంది. ఇందులో BSF-3, ITBP-2, CRPF-3, CISF-2, SSB-2 ఉంటాయి. 

 

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణం - జీవ వైవిధ్యం

* జీవులు, వాటి ఆవాసాల మధ్య ఉండే సంబంధాల అధ్యయనాన్ని ఆవరణ శాస్త్రం (Ecology) అంటారు.  ఈ పదం Oekos (ఆవాసం), Logos (అధ్యయనం) అనే రెండు గ్రీకు పదాల నుంచి ఆవిర్భవించింది.
* ఆవరణ శాస్త్రం అనే పదాన్ని మొదటిసారిగా ఎర్నెస్ట్ హెకెల్ ఉపయోగించారు.
* భూమిపై ఉన్న జీవులు, అవి విస్తరించిన ప్రాంతాలన్నింటితో కలిపి జీవావరణం ఏర్పడింది.
* IUCN (International Union For Conservation of Nature & Natural Resources) ప్రకారం ప్రతిజాతి జీవులు, విభిన్న జాతి జీవులు, అవి నివసిస్తున్న ఆవరణ వ్యవస్థల మధ్య ఉన్న వైవిధ్యాన్ని జీవ వైవిధ్యం (Bio Diversity) అంటారు.
* ప్రపంచంలో బ్రెజిల్, చైనా, కొలంబియా, ఆస్ట్రేలియా, కాంగో, ఈక్వెడార్, ఇండోనేషియా, మడగాస్కర్, మలేషియా, మెక్సికో, పపువా న్యూగినియా, పెరూ, ఫిలిప్పీన్స్, దక్షిణాఫ్రికా, అమెరికా, వెనెజులా, భారతదేశం మెగా డైవర్స్ కంట్రీస్ (అత్యధిక జీవ వైవిధ్యత ఉన్న దేశాలు)గా ప్రసిద్ధిగాంచాయి.
* ప్రపంచ భూభాగంలో 2.4% భూభాగాన్ని ఆక్రమిస్తున్న భారతదేశం ఇప్పటివరకు గుర్తించిన వాటిలో సుమారు 7.8% జీవ జాతులను కలిగి జీవ వైవిధ్యంతో అలరారుతోంది.  దీనిలో 45000 రకాలకు పైగా వృక్ష జాతులు (వీటిలో 15000కు పైగా పూల మొక్కలు), సుమారు 2500 రకాలకుపైగా చేప జాతులు, 1200కు పైగా పక్షి జాతులు భారతదేశంలో ఉన్నాయి.
* భారతదేశంలో ప్రధానంగా పశ్చిమ కనుమలు, నల్లమల కొండలు, శేషాచల కొండలు, హిమాలయాలు, భారతదేశ ఈశాన్య ప్రాంతం విభిన్న జీవ జాతులకు నిలయంగా ఉన్నాయి.
* ఇప్పటికీ ఏటా పశ్చిమ కనుమలు, ఈశాన్య ప్రాంతంలో అనేక కొత్త జీవ జాతులను కనుక్కుంటున్నారు.
* ఈ ఆవరణ వ్యవస్థలు ఇదివరకెప్పుడూ లేని విధంగా తీవ్ర స్థాయిలో ప్రమాదాలను ఎదుర్కొంటున్నట్లు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ గుర్తించింది.
* సహజ వనరుల అధిక దుర్వినియోగం ద్వారా ప్రధానంగా కలప కోసం అడవుల నరికివేత, వ్యవసాయ భూముల విస్తరణ, మైనింగ్, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, రోడ్డు, రైలు మార్గాలు, డ్యామ్‌లు, విద్యుత్ అవసరాలను తీర్చడానికి విద్యుత్ కేంద్రాల నిర్మాణం లాంటి మానవ అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఆవరణ వ్యవస్థలు ఎన్నో ఒడుదుడుకులకు లోనవుతున్నాయి. 
* భారతదేశంలో మొత్తం 18 బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయి.

 

భారతదేశంలోని బయోస్పియర్ రిజర్వులు

భారతదేశంలో జీవవైవిధ్యత పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు
* వన్యజీవుల పర్యవేక్షణ, పరిరక్షణ కోసం 1952లో Indian Board for Wildlife ను ఏర్పాటు చేశారు.  1972లో వన్య మృగ సంరక్షణా చట్టం చేశారు.
* 1982లో డెహ్రాడూన్ కేంద్రంగా Wildlife Institute of India ను ప్రారంభించారు.
*  1983లో ప్రభుత్వం National Wildlife Action Plan ను ప్రారంభించింది. 
* 2002లో జీవ వైవిధ్య పరిరక్షణ కోసం జీవ వైవిధ్య చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. దీన్ని అమలుచేయడానికి చెన్నై కేంద్రంగా National Bio Diversity Authority ని ఏర్పాటు చేశారు.

 

జీవ సమాజంలోని జీవుల మధ్య ఉండే విభిన్నతను 'జీవ వైవిధ్యం' అంటారు. ఆవరణ వ్యవస్థలకు సంబంధించిన జీవుల సంఖ్య, భిన్నత్వ ం, మార్పు చెందే తత్వాలన్నీ జీవ వైవిధ్యానికి సంబంధించినవే. అందుకే ప్రకృతిని గమనిస్తే విభిన్న రకాల వృక్షాలు, జంతువులు, జీవులు కనిపిస్తాయి.
 

జీవ వైవిధ్య స్థాయులు
జీవ వైవిధ్య క్రమానుగత స్థాయి ప్రకారం ప్రధానంగా 3 రకాలు. అవి.. 
1. జన్యుపర జీవ వైవిధ్యం (జెనిటిక్ బయోడైవర్సిటీ)
2. జాతిపర జీవవైవిధ్యం (స్పీసిస్ బయోడైవర్సిటీ)
3. ఆవరణ వ్యవస్థల జీవవైవిధ్యం (ఇకో సిస్టమ్ బయోడైవర్సిటీ)

 

జన్యుపర జీవవైవిధ్యం
ఇది ఒక జాతిలో ఉండే జీవవైవిధ్యం. అంటే ఒకే జాతికి చెందిన జీవుల మధ్య ఉన్న విభిన్నతలకు సంబంధించింది. జీవుల జీవకణాల్లోని క్రోమోజోముల్లోని జన్యువులు ఆ జీవి వ్యక్తిగత లక్షణాలను నిర్ధారిస్తాయి.
ఉదా: జన్యుపర జీవవైవిధ్యం కారణంగా కొందరు సన్నగా, లావుగా, పొడవుగా, పొట్టిగా, తెల్లటి చర్మంతో, వివిధ రంగుల్లో ఉండటం; ఒకే జాతికి చెందిన కుక్కలు, పిల్లులూ, పుష్పాలు మొదలైనవి.

 

జాతిపర జీవ వైవిధ్యం
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించినా, నేటికీ భూగోళంపై కచ్చితంగా ఎన్ని జాతులకు చెందిన జీవులున్నాయో ఎవరికీ తెలియదు.
* భూమ్మీద 10-14 మిలియన్ల జాతులు/ జీవులున్నట్లు అంచనా. ఇవి చాలావరకు కీటకాలు, సూక్ష్మజీవులే.

 

ఆవరణ వ్యవస్థల జీవ వైవిధ్యం

దీనిలో ఒక భౌగోళిక ప్రాంతంలోని అరణ్యాలు, పచ్చిక బయళ్లు, ఎడారులు లాంటి భౌమావరణ వ్యవస్థలు; నదులు, సరస్సులు, నదీ ముఖద్వారాలు, తీర ప్రాంతాలు, మహా సముద్ర ప్రాంతాలు లాంటి జలావరణానికి చెందిన విభిన్న ఆవాసాలకు సంబంధించిన జీవ వైవిధ్యం ఉంటుంది. ఇందులో శీతోష్ణస్థితి ప్రముఖ పాత్ర వహిస్తుంది.
ఉదా: భూమధ్యరేఖ వర్షారణ్యంలో జీవ వైవిధ్యం అధికస్థాయిలో ఉండగా, అందుకు భిన్నంగా ఉష్ణ ఎడారులు, ధ్రువ ప్రాంతాల్లో చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది.
* ఆహారం, నివాసం, ఆరోగ్యం కోసం అనాదిగా మానవులు భూగోళపు జీవ వైవిధ్యంపై ఆధారపడుతున్నారు.

 

కాలుష్య ప్రభావం
జీవ వైవిధ్యం సహజ, వ్యవసాయ వ్యవస్థల ఉత్పాదకతలను పెంపొందిస్తుంది. ఆధునిక నాగరకత ఫలితంగా ఉత్పన్నమవుతున్న కాలుష్యం మానవుడు నివసిస్తున్న ప్రాంతాలన్నింటిలోని జీవ వైవిధ్యంపై అనేక రకాల వ్యతిరేక ప్రభావాలను చూపుతోంది.
ఉదా: అటవీ ప్రాంతాలను పంట భూములు, రహదారులు, క్వారీలు, గనులుగా మారుస్తున్నారు.
జీవావరణ సమతౌల్యం

ఒక జీవ సంఘంలో కాలానుగుణంగా జీవావరణం ద్వారా క్రమంగా సంభవించే మార్పులుంటాయి. ఇవి మినహా జన్యుపరమైన.. జాతులు, ఆవరణ వ్యవస్థల మధ్య ఉండే జీవ వైవిధ్యం స్థిరంగా ఉండి, అది సహజసిద్ధమైన క్రియాశీల సమతాస్థితిలో ఉంటే, అలాంటి స్థితిని జీవావరణ సమతౌల్యం అంటారు.
* ఈ సమతౌల్యాన్ని ప్రభావితం చేసే అంశాల్లో శీతోష్ణస్థితిలో వచ్చే మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతోపాటు మానవ ప్రభావం మరీ ముఖ్యమైంది.
* భూకంపాలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు విరగడం, హిమ సంపాతాలు, వరదలు, కరవు కాటకాల్లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఆయా ప్రభావిత ప్రాంతాల్లో జీవావరణ సమతౌల్యాన్ని ప్రభావితం చేస్తాయి.
* జీవావరణ సమతౌల్య పరిరక్షణ కోసం అనుసరణీయ, దీర్ఘకాలిక, శాస్త్రీయ అవలోకనంతో వెంటనే చర్యలు చేపట్టాలి.

 

జాతిపర జీవ వైవిధ్యంలో మ్యాపింగ్
బ్రిట్స్, పాల్ విలియమ్స్, డికీయిర్‌రైట్, చారిస్ హంప్ రేజర్ శాస్త్రవేత్తలు ప్రపంచంలో జీవవైవిధ్య పటాలను మొదటిసారి తయారు చేశారు. వీరు జీవ వైవిధ్య మ్యాప్‌లో 'వరల్డ్ మ్యాప్‌'ను అభివృద్ధి చేశారు. దీనిలో మూడు రకాలున్నాయి.


1. ఆల్ఫా పటాలు (ఆల్ఫా మ్యాప్స్): ఇందులో ప్రత్యేక ప్రాంతాల్లో మొత్తం జాతిపర సంఖ్యలను పొందుపరిచి, విశ్లేషణాత్మకమైన వివిధ ప్రాంతాల్లో జీవ వైవిధ్య అధ్యయన పటాల్లో గుర్తించారు.
 

2. బీటా పటాలు (బీటా మ్యాప్స్): ఇందులో జీవ వైవిధ్య నిర్మాణాలు, జాతిపర నిర్మాణాలు, పోలికలు, సంఘాలు, కొలతలు, ఆవరణ సమతౌల్యంలో జాతిపర మార్పులను ఈ పటాల్లో గుర్తించారు.
 

3. గామా పటాలు (గామా మ్యాప్స్): ఇందులో భౌగోళిక ప్రాంతాల్లో జాతిపర మార్పుల గణాంకాలు, వాటికి అయిన ఖర్చుల్లాంటి వివరాలను ఈ పటాల్లో పొందుపరిచారు.
 

తడి భూభాగాలు (వెట్ ల్యాండ్స్): భూమి ఉపరితలంపై నీటితో ఉన్న ప్రాంతాల్లో ఆవరణ వ్యవస్థలను సంరక్షించడానికి, వివిధ జీవులను, వృక్షాలను, నేలలను, వన్య ప్రాణులను కాపాడటానికి ఈ ప్రాంతాలు ఉపయోగపడతాయి.
రామ్‌సర్ సమావేశం (రామ్‌సర్ కన్వెన్షన్): ఇరాన్‌లో 1971, ఫిబ్రవరి 2న అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్యత్వం ఉన్న దేశాలు రామ్‌సర్ ఒప్పందంపై సంతకం చేశాయి. 1975, డిసెంబరు 21న ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం కొన్ని తడి ప్రాంతాలను గుర్తించారు. 

 

వన్యమృగ సంరక్షణపై అంతర్జాతీయ సమావేశం
ప్రపంచంలో జరిగిన 5 ప్రధాన అంతర్జాతీయ వన్యప్రాణి సమావేశాల్లో భారత్ పాల్గొంది. మనదేశంలో పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది.
* అంతర్జాతీయ వ్యాపార అటవీ వృక్ష జాతులు (Flora), జంతు జాతులు (Fauna) సమావేశంలో 1976, జులై 20న భారతదేశం సంతకం చేసింది.
* మానవ, జీవావరణ కార్యక్రమాన్ని (ఎంఏబీ- మ్యాన్ అండ్ బయోడైవర్సిటీ) యునెస్కో 1971లో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో 2012 నాటికి 117 దేశాల్లో 598 బయోస్ఫియర్ సంస్థలు సభ్యత్వం తీసుకున్నాయి.
* జీవవైవిధ్య సమావేశం 1992, జూన్ 5న రియో డీ జెనీరోలో జరిగింది.

 

భారతదేశంలో జీవవైవిధ్యం
ప్రపంచంలో భారతదేశం 12వ మెగా జీవవైవిధ్య దేశం. మన దేశం ప్రపంచంలో 2.5 శాతం భౌగోళిక వైశాల్యం కలిగి ఉంది. ప్రపంచంలో 7.8 శాతం జాతిపర వైవిధ్యం భారత్ సొంతం. ఇదో రికార్డు. ప్రపంచంలో ఇండో-మళాయన్ అత్యంత విస్తీరణ ప్రాంతం.
* మన దేశంలో వృక్ష సంబంధ జాతులు 46,000 ఉన్నాయి. ఇవి ప్రపంచంలో 7 శాతం. ఇందులో 33 శాతం వ్యాధుల బారిన పడుతున్నాయి.
* మన దేశంలో సుమారు 15,000 రకాల పూల మొక్కలు ఉన్నాయి. ఇవి ప్రపంచంలో 6 శాతం. ఇందులో 1500 రకాలు జాతిపర వ్యాధుల బారిన పడుతున్నాయి.
* దేశంలో సుమారు 81,000 జంతుపర జాతులున్నాయి. ప్రపంచ జంతు సంపదలో ఇది 6.5 శాతం. 

 

* భారత్ 1972లో వన్య మృగ సంరక్షణ చట్టాన్ని చేసింది. అంతకు ముందు 5 జాతీయ హోదా కలిగిన పార్కులు ఉండేవి.
* వన్యమృగ సంరక్షణ సవరణ చట్టాన్ని 2006లో చేశారు. అదే ఏడాది సెప్టెంబరు 4 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా జాతీయ పులుల అటవీ అథారిటీ, వన్యమృగ క్రైమ్ కంట్రోల్ బ్యూరోలను ఏర్పాటు చేశారు.

 

జాతీయ వన్యమృగ ఆచరణ ప్రణాళిక
జాతీయ వన్యమృగ బోర్డును 1982లో కేంద్రం ఏర్పాటు చేసింది. మొదటి జాతీయ వన్యమృగ ఆచరణ ప్రణాళికను 1983లో ప్రారంభించారు.

 

జాతీయ జీవ వైవిధ్య చట్టం
ఈ చట్టాన్ని 2002లో చేశారు. 2003, అక్టోబరు 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ చట్టం కిందకు
1. జాతీయ జీవ వైవిధ్య అథారిటీ (ఎన్‌బీఏ),
2. జాతీయ జీవ వైవిధ్య బోర్డ్(ఎస్‌బీబీ),
3. జీవ వైవిధ్య నిర్వహణ కమిటీ (బీఎంసీ) వస్తాయి. జాతీయ జీవ వైవిధ్య అథారిటీ సంస్థను చట్టబద్ధ హోదాతో చెన్నై (2003)లో ఏర్పాటు చేశారు. భారత్‌లోని పలు జీవ వైవిధ్య సంస్థల వివరాలివి..
* వన్యమృగ సంస్థ - 1996లో డెహ్రాడూన్‌లో ఏర్పాటు.
* భారత వన్యమృగ బోర్డు - 2001 డిసెంబరు 7న పునర్‌నిర్మాణం
* జంతు సంక్షేమ డివిజన్లు - 2002 జులై నుంచి అమలు
* జంతు సంక్షేమ జాతీయ సంస్థ (ఎన్ఐఏడబ్ల్యూ) - ఫరీదాబాద్ (1960 చట్టం ప్రకారం ఏర్పడింది)
* బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా - 1890 ఫిబ్రవరి 13న స్థాపించారు
* జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - 1916 (కోల్‌కతా)లో ఏర్పాటు

 

భారతదేశంలో జీవ వైవిధ్య సంరక్షణలు

ఎలిఫెంట్ ప్రాజెక్టు
1992 ఫిబ్రవరిలో ఎలిఫెంట్ ప్రాజెక్టును స్థాపించారు. దేశంలో ప్రస్తుతం 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సుమారు 32 ఎలిఫెంట్ ప్రాజెక్టులున్నాయి. ఇవి ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో అత్యధికంగా ఉన్నాయి. 

టైగర్ ప్రాజెక్టు
భారత ప్రభుత్వం 1973, ఏప్రిల్ 1న పులుల (టైగర్ రిజర్వ్) ప్రాజెక్టును ప్రారంభించింది. దేశంలో మొదటి ప్రాజెక్టు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్.  

 

బయోస్ఫియర్ రిజర్వ్
ప్రాదేశిక, తీర ప్రాంత ఆవరణ సమతౌల్యాన్ని కాపాడటానికి యునెస్కో చట్రం కింద మానవ, జీవావరణ కార్యక్రమంలో భాగంగా మనదేశంలో 1986లో బయోస్ఫియర్‌ను స్థాపించారు. దేశంలో మొదటి బయోస్ఫియర్ నీలగిరి. ప్రస్తుతం దేశంలో 18 బయోస్ఫియర్ రిజర్వ్‌లున్నాయి. వీటిలో 9 ప్రపంచ బయోస్ఫియర్ నెట్‌వర్క్‌లో ఉన్నాయి. దేశంలోని 7 బయోస్ఫియర్‌లను యునెస్కో దత్తత తీసుకుంది. 

 

 

మెరైన్ నేషనల్ పార్క్‌లు

మన దేశంలో 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద గుజరాత్ ప్రభుత్వం అటవీశాఖ ఆధ్వర్యంలో గల్ఫ్ ఆఫ్ కచ్‌లో; జామ్‌నగర్ జిల్లా ఓకా, జోదియాల వద్ద 1982లో 270 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో మెరైన్ నేషనల్ పార్కు ప్రారంభించింది. ఇది దేశంలోనే మొదటి జాతీయ మెరైన్ పార్కు.
దేశంలో ప్రధాన ప్రవాళభిత్తిక (కోరల్ రీఫ్) కోసం గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ అఖాతం, గల్ఫ్ ఆఫ్ కచ్, అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లలో ఏర్పాటు చేశారు. వివరాలివి..
1. పాక్ అఖాతం - తమిళనాడు (రామేశ్వరం)
2. గల్ఫ్ ఆఫ్ మన్నార్ - తమిళనాడు (ట్యూటికోరిన్)
3. అండమాన్, నికోబార్ - బంగాళాఖాతం
4. గల్ఫ్ ఆఫ్ కచ్ - గుజరాత్
5. లక్షద్వీప్ - అరేబియా సముద్రం

 

భారతదేశంలోని ప్రవాళ భిత్తికల పరిశోధనా సంస్థలు

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఓషన్ డెవలప్‌మెంట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్- అహ్మదాబాద్
జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - కోల్‌కతా
కేంద్ర మెరైన్ ఫిషరీస్ పరిశోధన సంస్థ - మదురై
సెంటర్ ఫర్ ఎర్త్ స్టడీస్ - త్రివేండ్రం
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ - గోవా

 

మాదిరి ప్రశ్నలు

1. కిందివాటిలో భారత జాతీయ జలచరం (అక్వాటిక్ ఆనిమల్) ఏది?
ఎ) డాల్ఫిన్ బి) తాబేలు సి) తిమింగలం డి) ఏదీకాదు
జ: (ఎ)

 

2. సమాజంలో అన్ని స్థాయి జీవుల మధ్య విభిన్నతను ఏమంటారు?
ఎ) పర్యావరణం బి) జీవ వైవిధ్యం సి) సమాజం డి) వైవిధ్యం
జ: (బి)

 

3. జీవ వైవిధ్య క్రమానుగత స్థాయులు ఎన్ని రకాలు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
జ: (బి)

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భూకంపాలు - భూపాతాలు

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. భూకంపాలు అతి తీవ్రంగా సంభవించే జోన్ -V లో ఉన్న ప్రాంతం ఏది? (ఏఎస్‌వో - 2017)
జ: షిల్లాంగ్

 

2. ప్రపంచ విపత్తుల్లో భూకంపాలు, సునామీల శాతం ఎంత? (గ్రూప్ - 4, 2012)
జ: 8 శాతం

 

3. హిమాలయ ప్రాంతంలో భూకంపాలు రావడానికి కారణం? (గ్రూప్ - 1, 2017, ఏపీ)
జ: భూపటంలో పలకలు ఢీకొట్టడం

 

4. భూకంప సమయంలో ఏ నేల ఎక్కువగా ప్రకంపిస్తుంది? (హాస్టల్ వెల్ఫేర్ - 2017)
జ: మెత్తటి నేల

 

5. కొండ చరియలు తరచుగా ఏ రాష్ట్రంలో విరిగి పడతాయి? (గ్రూప్ - 2, 2016)
జ: ఉత్తరాఖండ్

 

మాదిరి ప్రశ్నలు

 

1. భారత ప్రాదేశిక విస్తీర్ణంలో ఎంత శాతం భూకంప దుర్బలత్వం ఉంది?
జ: 59%

 

2. ఉరుములు, మెరుపులను గుర్తించే సాధనం?
జ: లైట్నింగ్ డిటెక్టర్

 

3. దిల్లీ, హైదరాబాద్‌లు ఏ భూకంప జోన్‌లలో ఉన్నాయి?
జ: జోన్ - 4, 2

 

4. కిందివాటిలో దేన్ని నియంత్రించడానికి 'లాండ్ స్త్లెడ్ జోనేషన్ మ్యాపింగ్ పద్ధతి'ని ఉపయోగిస్తారు?
     1) భూకంపాలు       2) కొండచరియలు విరిగిపడటం      3) హిమపాతాలు      4) సహజ అటవీ కార్చిచ్చు
జ: 2 (కొండచరియలు విరిగిపడటం)

 

5. హిమలయ ప్రాంతాల్లో తరచుగా హిమపాతాలు ఎక్కడ సంభవిస్తాయి?
     1) జమ్మూకశ్మీర్      2) హిమాచల్‌ ప్రదేశ్      3) ఉత్తరాఖండ్      4) అన్నీ
జ: 4 (అన్నీ) 

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

చక్రవాతాలు - సునామీ

       ప్రపంచంలో చక్రవాతాల ప్రభావం 21% ఉండి ఆయాదేశాల్లో అధిక నష్టాన్ని కలిగిస్తుంది. భూ ఉపరితలంపై ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి (1970) పరిశీలిస్తే గల్ఫ్ ఆఫ్ మెక్సికో, అమెరికా, చైనా, ఫిలిప్పీన్స్ దేశాలు అత్యధిక చక్రవాతాలకు గురవుతున్నాయి. అత్యధిక ప్రాణ, ఆస్తి నష్టం ఆసియా ఖండంలోని బంగ్లాదేశ్‌లో సంభవించింది. 1970, నవంబరు 12న బంగ్లాదేశ్‌లో సంభవించిన 'బోలా' తుపాన్ వల్ల 5 లక్షల మంది మరణించారు.
* భూ ఉపరితలం 71% నీటితో విస్తరించి 5 మహాసముద్రాలుగా విభజితమైంది. ఈ మహాసముద్రాల పరిధిలో 177 దేశాలు తీరప్రాంతాలతో విస్తరించి ఉండటం వల్ల వాటిపై చక్రవాతాల ప్రభావం అధికంగా ఉంటుంది. చక్రవాతాలను అల్పపీడన ద్రోణి లేదా వాయుగుండం అంటారు. ఇవి 98% సముద్రాలు, 2% భూ ఉపరితలంపై నుంచి ప్రయాణిస్తాయి.
 

చక్రవాతం
       చక్రవాతాన్ని సైక్లోన్ అంటారు. ఈ పదాన్ని మొదటగా హెన్రీ పిడింగ్‌టన్ ఉపయోగించారు. సైక్లోన్ గ్రీకు భాషా పదమైన 'కైక్లోన్' నుంచి వచ్చింది. కైక్లోన్ అంటే తిరుగుతున్న నీరు లేదా చుట్టుకున్న పాము అని అర్థం.
చక్రవాతం/సైక్లోన్ ఏర్పడే విధానం
       సముద్రాలపై అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడే ప్రాంతంలో నీరు వేడెక్కి, వ్యాకోచించి అల్పపీడనంగా మారుతుంది. ఈ అల్పపీడనం వైపు నలు దిశల నుంచి అధిక పీడన వ్యవస్థలు కేంద్రీకృతం కావడాన్ని చక్రవాతం అంటారు. చక్రవాతాలు జేర్కిన్ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటాయి.
జేర్కిన్ సిద్ధాంతం ప్రకారం చక్రవాతాలు 2 రకాలు
అవి: 1) ఉష్ణమండల చక్రవాతాలు
       2) సమశీతోష్ణ చక్రవాతాలు  
ఉష్ణమండల చక్రవాతాలు (Tropical Cyclones): ఇవి 0° - 23  కర్కట, మకరరేఖల మధ్య అధిక ఉష్ణోగ్రతల వల్ల సంభవిస్తాయి. ప్రపంచంలో వీటి ప్రభావం 90% వరకు ఉంటుంది.
సమశీతోష్ణ చక్రవాతాలు (Temperate Cyclones): ఇవి 35° - 66
   ఆర్కిటిక్, అంటార్కిటిక్ మధ్య ప్రాంతంలో సంభవిస్తాయి.
* ఈ విధంగా భూమధ్య రేఖ నుంచి ఉష్ణ వాయురాశులు, ధృవాల నుంచి శీతల వాయురాశులు వీస్తాయి. ఈ ఉష్ణ, శీతల వాయురాశులు కలిసే ప్రాంతాన్నే 'వాతాగ్రం' అంటారు. దీని వద్ద గాలి అవ్యవ్యాకోచం చెంది ఉరుములు, మెరుపులు ఏర్పడే ప్రాంతాన్ని 'కేంద్రకుడ్యం' అంటారు. అది తీర ప్రాంతంలో తుపాన్‌గా మారడాన్ని 'లాండ్‌ఫాల్' అంటారు. చక్రవాతం ఏర్పడే ప్రాంతం వద్ద వ్యాసం 30 కి.మీ. - 370 కి.మీ., గాలివేగం గంటకు 31 కి.మీ. - 221 కి.మీ. వరకు ఉంటుంది.

* అమెరికాలో 2017, సెప్టెంబరులో ఇర్మా తుపాన్ 279 కి.మీ./గంట; ఒడిశాలో 1999, అక్టోబరులో 268 కి.మీ./గంట వేగంతో సైక్లోన్ సంభవించింది.

సైక్లోన్ మండలాలు
        ప్రపంచంలో ప్రతి ఏడాది సగటున 97 తుపాన్లు సంభవిస్తున్నాయి. వీటి ఉద్ధృతి మే, నవంబరు నెలల మధ్య ఉంటుంది. ఉద్ధృతిని బట్టి ఆయా దేశాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు.

 

టోర్నడో: ఇది ప్రపంచంలోనే అత్యంత భయానకమైంది. 98% టోర్నడోలు అట్లాంటిక్ మహాసముద్రం, అమెరికాలో సంభవిస్తాయి. స్పానిష్ భాషలో టోర్నడో అంటే 'ఉరుముల తుపాన్' అని అర్థం. దీని వేగాన్ని, తీవ్రతను 'ఫుజితా స్కేలు' తో కొలుస్తారు.
 

తుపాన్
భారతదేశానికి మూడువైపుల సముద్రం ఉండి, 7516 కి.మీ. మేర తీరరేఖ వ్యాపించి ఉంది. దేశ భౌగోళిక వైశాల్యంలో ప్రధాన తీర ప్రాంత భూభాగం 5400 కి.మీ., అండమాన్ నికోబార్ దీవులు 1900 కి.మీ., లక్షదీవులు 132 కి.మీ. మేర తుపాన్ తీవ్రతను కలిగి ఉన్నాయి.
      ప్రపంచ ఉష్ణమండల తుపాన్లలో భారత తీరప్రాంతంలో సంభవించే తుపాన్లు 10% కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయి. మన దేశంలో సగటున ఏటా 6 తుపాన్లు సంభవిస్తున్నాయి. వీటి తీవ్రత మే - జూన్; అక్టోబరు - నవంబరు మధ్య ఎక్కువగా ఉంటుంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో తుపాన్ల తీవ్రత 4 : 1 నిష్పత్తిలో ఉంటుంది. ప్రధానంగా బంగాళాఖాతం పరిధిలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్ బంగలోనూ; పుదుచ్చేరి తూర్పు తీరంలోనూ; పశ్చిమ తీర ప్రాంతం (అరేబియా సముద్రం) పరిధిలోని గుజరాత్‌లోనూ తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తుపాన్ వచ్చినప్పుడు సముద్రంలోని అలలు 6 మీ. ఎత్తుకు లేస్తాయి. వీటిని గుర్తించడానికి టైడ్‌గేజ్ నెట్‌వర్క్ లేదా రాడార్‌లను ఉపయోగిస్తారు.
       ఆంధ్రప్రదేశ్‌లోని 9 జిల్లాల్లో 974 కి.మీ. మేర బంగాళాఖాత తీరరేఖ వ్యాపించి ఉంది. ఈ ప్రాంతంలోని 44% భూభాగం తుపాన్ ప్రభావానికి గురవుతుంది. వీటి వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో అక్టోబరు డిసెంబరు మధ్య అధిక నష్టం వాటిల్లుతుంది. తెలంగాణ భూపరివేష్టిత రాష్ట్రం కాబట్టి దీనిపై తుపాన్ ప్రభావం ఉండదు.

 

ఇటీవల ఏర్పడిన తుపాన్లు
* 2017 సెప్టెంబరులో ఫ్లోరిడా, క్యూబా దేశాల్లో - ఇర్మా హరికేన్,
* 2016 డిసెంబరులో దక్షిణ భారత్, అండమాన్, థాయిలాండ్‌లలో - వార్ధా తుపాన్,
* 2015 ఆగస్టులో భారత్, బంగ్లా, బర్మా దేశాల్లో - కొమెన్ తుపాన్,
* 2014 అక్టోబరులో విశాఖపట్నం, నేపాల్‌లో - హుద్‌హుద్ తుపాన్ సంభవించాయి.
 

సునామీ
      సముద్ర అంతర్భాగంలో భూకంపాలు ఏర్పడినప్పుడు అలలు తీరప్రాంతాన్ని చేరి తుపానుగా మారడాన్నే 'సునామీ' అంటారు. ఆ సమయంలో అలలు పదుల అడుగుల ఎత్తులో పైకి ఎగసి తీరప్రాంతంలోని భూభాగాన్ని తీవ్ర నష్టానికి గురిచేస్తాయి. ఒక పెద్ద భూకంపం తర్వాత సునామీ ముప్పు అనేక గంటలపాటు ఉంటుంది. ఆ సమయంలో ప్రమాదకరమైన పెద్ద అలలు ఏర్పడతాయి.
* సునామీ అనే పదం జపనీస్ భాష నుంచి వచ్చింది. జపాన్ భాషలో 'సు' (Tsu) అంటే రేవు/సముద్రం, 'నామి' (Nami) అంటే అలలు/తరంగం/కెరటాలు అని అర్థం. సముద్ర ఉపరితల నీరు తరంగాల ద్వారా ఉప్పొంగడాన్నే సునామీగా భావిస్తారు.
* సునామీలను జపాన్‌లో హర్బర్ వేవ్, ఆంగ్లంలో సిస్మిక్ సీ వేవ్, తెలుగులో సముద్ర ఉప్పెన, తమిళంలో అజిహిపెరాలై అని అంటారు.
* సునామీ వచ్చినప్పుడు సముద్ర ఉపరితలంపై రెండు శృంగాల మధ్య దూరం 100 కి.మీ., తరంగాల ఎత్తు 30 మీ., తరంగ ప్రయాణ వేగం 800 కి.మీ./గంట ఉంటుంది. మైదాన ప్రాంతంలో సునామీ గంటకు 50 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ఇవి ఏ సమయంలోనైనా సంభవించవచ్చు.

కారణాలు:
1. సముద్రంలో భూకంపాలు ఏర్పడటం.
2. అగ్ని పర్వతాలు పేలడం.
3. కొండ చరియలు (భూపాతాలు) విరిగిపడటం.
    వీటిలో 80% సునామీలు భూకంపాల వల్ల వస్తాయి. ఈ కారణాల వల్ల పెద్దపెద్ద అలలు ఏర్పడి తీరప్రాంతాలను అతలాకుతలం చేయడాన్ని 'సునామీ' అంటారు.


విస్తరణ:
* 75% సునామీలు పసిఫిక్ మహాసముద్రం, దాని దీవుల్లో సంభవిస్తున్నాయి. అందువల్ల పసిఫిక్‌ను 'అగ్నివలయం' (Ring Fire) అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో అధికంగా సుగామీచే, హవాయి దీవులు, జపాన్, ఓషియానీయ దీవులు ఉంటాయి.
* 25% మధ్యదరా, కరేబియన్, పశ్చిమ, తూర్పు పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రంలో సంభవిస్తున్నాయి.
ఉదా: అమెరికాలోని అలస్కా, హవాయి దీవుల్లోని 'హిలో' అనే ప్రాంతంలో ఎత్తయిన అలలతో తీవ్రమైన సునామీలు సంభవిస్తాయి.


భారతదేశంలో సునామీ
       మనదేశంలో సునామీ తీవ్రత హిందూ మహాసముద్ర ప్రభావం వల్ల 1% మాత్రమే ఉంటుంది. దేశం మొత్తం తీరప్రాంతంలో 300 కి.మీ. పొడవున దీని ప్రభావం ఉంది.
* తూర్పుతీర బంగాళాఖాతంలో తమిళనాడు నుంచి అండమాన్ - నికోబార్, ఇండోనేషియా దీవుల వరకు; పశ్చిమ తీర అరేబియాలో గుజరాత్, పాక్ మాక్రీన్ దీవుల నుంచి మాల్దీవుల వరకు ఉంటుంది.
ఉదా: 2004, డిసెంబరు 26న రిక్టర్ స్కేలుపై 9.0 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల హిందూ మహాసముద్రంలో సునామీ ఏర్పడింది. దీని వల్ల 11 దేశాల్లో మొత్తం 2,30,000 ప్రాణనష్టం జరిగింది. భారత్‌లో అండమాన్ దీవులు, తమిళనాడులోని కడలూర్ జిల్లా అత్యధిక నష్టానికి గురయ్యాయి.

* 2011, మార్చి 11న జపాన్‌లో ఫుకుషిమా వద్ద పెద్ద సునామీ వచ్చింది.

 నివారణ చర్యలు:
* 1920లో మొదటిసారిగా హవాయి దీవుల్లో సునామీ హెచ్చరిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
* 1946లో 'పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్‌'ను హవాయి దీవుల్లోని హోనొలులు సమీపాన ఏర్పాటు చేశారు.
1999లో హైదరాబాద్ కేంద్రంగా ఎర్త్ మినిష్టర్ ఆధ్వర్యంలో 'ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్‌మేషన్ సర్వీస్' (INCOIS) ను ప్రారంభించారు. ఇది పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్ర సమాచారాన్ని అందిస్తుంది.
* సునామీలను ముందుగా గుర్తించడానికి ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో హెచ్చరికలు జారీ చేయవచ్చు. కేబుళ్ల ద్వారా భూమికి అనుసంధానం చేసిన సునామీ డిటెక్టర్లను సముద్రంలో 50 కి.మీ. అడుగున ఉంచుతారు. ఇవి ఉపరితల అలజడులను గుర్తించి ఉపగ్రహాలకు ప్రసారం చేస్తాయి.
* 2015 డిసెంబరులో తొలి విపత్తు ఎఫ్ఎం (107.8) రేడియోను తమిళనాడులోని కడలూర్‌లో ప్రారంభించారు.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విపత్తు - నిర్వహణ

1. అంతర్జాతీయ విపత్తు కుదింపు మూడో సదస్సు ఎక్కడ జరిగింది?
జ: 2015 మార్చి - సెండాయ్ ‌


2. కిందివాటిని జతపరచండి.

వాయువు

అంశం/ప్రభావం

i) మిథైల్‌ ఐసోసైనేట్‌

a) జైవిక వ్యవస్థ

ii) ఏజెంట్‌ ఆరెంజ్‌

b) కిరణ ధార్మిక

iii) రేడియో తరంగాలు

c) రసాయనిక

iv) మైకోటాక్సిన్స్‌

d) పారిశ్రామిక

i ii iii iv
జ: d c b a


3. రాస్టార్, వెక్టార్‌ నమూనాలు ఎందులో భాగాలు?
జ: భౌగోళిక సమాచార వ్యవస్థ


4. నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ భూతల కేంద్రం (Earth Station) ఎక్కడ ఉంది?
జ: షాద్‌నగర్‌

 

5. కిందివాటిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగం కానిది?
1) పేదరికం, ఆకలిని నిర్మూలించడం 2) ఉత్పత్తి, వినియోగాన్ని పెంపొందించడం
3) క్రీడా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం 4) లింగ సమానత్వం, మహిళా సాధికారత
జ: 3 (క్రీడా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం)


6. గ్రీన్‌పీస్‌ ఉద్యమం మొదట దేనికి వ్యతిరేకంగా జరిగింది?
జ: అణు వ్యతిరేకత


7. కిందివాటిలో జల కాలుష్యం వల్ల రాని వ్యాధి?
1) కలరా 2) కామెర్లు 3) మలేరియా 4) డయేరియా
జ: 3 (మలేరియా)


8. కిందివాటిని ఆరోహణ క్రమంలో అమర్చండి.
1) జాతీయ హరిత ట్రైబ్యునల్‌ 2) జీవ వైవిధ్య చట్టం
3) జాతీయ వన్యప్రాణి చట్టం 4) జల కాలుష్య నియంత్రణ చట్టం
జ: 3421


9. పర్యావరణంపై భారత పార్లమెంట్‌ చేసిన చట్టాల్లో సరికానిది.
1) పర్యావరణ పరిరక్షణ చట్టం - 1986 2) బయోస్ఫియర్‌ చట్టం - 1988
3) వాయు కాలుష్య నియంత్రణ చట్టం - 1981 4) హాట్‌స్పాట్‌ చట్టం - 2006
జ: 2 (బయోస్ఫియర్‌ చట్టం - 1988)

 

10. కిందివాటిలో సరైంది?
a) క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం వాతావరణ మార్పునకు సంబంధించింది.
b) మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ ఓజోన్‌ తరుగుదలకు సంబంధించింది.
జ: a, b సరైనవి


11. కిందివాటిలో సరికానిది?
1) అంతర్జాతీయ సునామీ దినోత్సవం - నవంబరు 5 2) అంతర్జాతీయ అటవీ దినోత్సవం - మార్చి 20
3) అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవం - ఏప్రిల్‌ 22 4) అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం - మే 22
జ: 2 (అంతర్జాతీయ అటవీ దినోత్సవం - మార్చి 20)


12. కిందివాటిని జతపరచండి.

సమావేశం

వేదిక

i) ఓజోన్‌ తగ్గుదల సదస్సు

a) న్యూదిల్లీ

ii) అంతర్జాతీయ సౌర కూటమి సదస్సు

b) కిగాలి

iii) COP - 24 సదస్సు

c) న్యూయార్క్‌

iv) సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సదస్సు

d) కెటోవీస్‌

 

e) పారిస్‌

జ: i-,b ii-a, iii-d, iv-c

 

13. కిందివాటిలో సరైంది ఏది?
1) సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 2015 - 30 వరకు వర్తిసాయి
2) SDG లో మొత్తం 17 లక్ష్యాలు, 169 ఉప లక్ష్యాలు ఉన్నాయి
3) సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను 2015, సెప్టెంబరు 25న ఆమోదించారు
జ: 1, 2, 3 సరైనవి


14. అప్పికో ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది?
జ: కర్ణాటక


15. కిందివాటిలో పర్యావరణ ఉద్యమాలకు సంబంధించి సరికానిది?
1) క్షిపణులకు వ్యతిరేకంగా బాలియాపాల్‌ ఉద్యమం జరిగింది.
2) మేధాపాట్కర్‌ ‘నర్మద బచావో’ ఆందోళన చేపట్టారు.
3) ఝార్ఖండ్‌లో చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా జంగిల్‌ బచావో ఉద్యమం జరిగింది.
4) యురేనియం వ్యతిరేక ఉద్యమం నిశ్శ‌బ్ద లోయలో జరిగింది.
జ: 4 (యురేనియం వ్యతిరేక ఉద్యమం నిశ్శ‌బ్ద లోయలో జరిగింది.)

 

16. కిందివాటిని జతపరచండి.

i) ధరిత్రీ సదస్సు

a) జోహెన్నస్ ‌బర్గ్‌ - 2002

ii) పర్యావరణ సదస్సు

b) హైదరాబాద్‌ - 2012

iii) జీవవైవిధ్య సదస్సు

c) స్టాక్‌హోం - 1972

iv) సుస్థిరాభివృద్ధి సదస్సు

d) రియో - 1992

i ii iii iv
జ: d c b a


17. జీవావరణ పిరమిడ్‌లో మొదటి మెట్టులో ఉన్నదెవరు?
జ: ఉత్పత్తిదారులు


18. కిందివాటిలో జాతీయ విపత్తు నిర్వహణ సపోర్ట్‌ ప్రోగ్రాంను నిర్వహించేది?
1) ISRO 2) GIS 3) NRSA 4) NGRI
జ: 3 (NRSA)


19. క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
జ: 2005, ఫిబ్రవరి 16

 

20. జాతీయ కార్యాచరణ ప్రణాళిక వాతావరణ మార్పు కోసం 2016 డిసెంబరులో ఎన్ని జాతీయ ప్రణాళికలను అమలుపరిచింది?
జ: 8


21. కిందివాటిలో సరైనవి గుర్తించండి.  
1) 2016 కరవు నిర్వహణ కరదీపిక దీర్ఘకాలిక కరవు 33% ఉన్నట్లు పేర్కొంది.
2) కరవు పీడిత ప్రాంతం కింద 35% ఉన్నట్లు పేర్కొంది.
3) 10% కంటే ఎక్కువ అవపాతం లోపించినట్లయితే దాన్ని వాతావరణ కరవు అంటారు.
జ: 1, 2, 3 సరైనవి


22. కిందివాటిని జతపరచండి.

అంశం

శాతం

i) కరవు ప్రభావం

a) 10%

ii) వరద ప్రభావం

b) 59%

iii) భూకంప ప్రభావం
iv) తుపాన్ల ప్రభావం

c) 12%
d) 68%

e) 15%

i ii iii iv
జ: d c b a

 

23. నైలోమీటర్‌ సాధనాన్ని దేన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు?
జ: వరదలు


24. కిందివాటిలో ఉష్ణ మండల చక్రవాత వర్గీకరణ వేగానికి సంబంధించి సరికానిది.
1) తుపాన్‌ స్ట్రోమ్‌ : 62 - 88 కేఎంపీహెచ్‌ 2) వాయుగుండం : 31 - 49 కేఎంపీహెచ్‌
3) అల్పపీడన ద్రోణి : 50 - 61 కేఎంపీహెచ్‌ 4) సూపర్‌ సైక్లోన్‌ : 221 కేఎంపీహెచ్‌ పైన
జ: 3 (అల్పపీడన ద్రోణి : 50 - 61 కేఎంపీహెచ్‌) 


25. కొరియాలీస్‌ ఎఫెక్ట్‌ ప్రకారం చక్రవాతాల గమనానికి సంబంధించి సరైంది.
1) ఉత్తరార్ధ గోళంలో చక్రవాతాలు సవ్య పద్ధతిలో వీస్తాయి.
2) దక్షిణార్ధ గోళంలో అపసవ్య పద్ధతిలో వీస్తాయి.
జ: 1, 2 రెండూ సరైనవికావు


26. కిందివాటిలో సరైంది ఏది?
1) హజార్డ్‌ అనే పదం అరబిక్‌ భాష నుంచి వచ్చింది.
2) డిజాస్టర్‌ అనే పదం ఫ్రెంచ్‌ భాష నుంచి ఆవిర్భవించింది.
జ: 1, 2 సరైనవి

 

27. కిందివాటిలో ప్రకృతి విపత్తుల్లో భాగం కానిది?

1) హిమపాతాలు 2) ఉరుములు, పిడుగులు 3) వన నిర్మూలన 4) ఉష్ణశీతల గాలులు
జ: 3 (వన నిర్మూలన)


28. ప్రస్తుతం దేశంలోని ఎన్ని రాష్ట్రాలు ప్రకృతి వైపరీత్యాలకు గురవుతున్నాయి?
జ: 27


29. భారతదేశంలో భౌగోళికంగా కరవులు ఎక్కువగా ఏ ప్రాంతంలో సంభవిస్తున్నాయి?
జ: పశ్చిమ - దక్షిణ భారత్‌


30. విపత్తు సంభవించినప్పుడు అవసరమైనవి?
1) అత్యవసర స్పందన, సహాయం 2) పునరావసం, పునర్నిర్మాణం
3) సంసిద్ధత 4) అన్నీ
జ: 4 (అన్నీ)


31. కిందివాటిలో సరికానిది.
1) జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని (NDRF) విపత్తు చట్టం సెక్షన్‌ 44 ప్రకారం ఏర్పాటు చేస్తారు.
2) NDRF కేంద్ర హోంమంత్రి నిర్వహణలో ఉంటుంది.
3) NDRF లో ప్రస్తుతం 12 బెటాలియన్లు ఉన్నాయి.
4) ప్రస్తుతం 10వ CRPF బెటాలియన్‌ విజయవాడలో ఉంది. 4
జ: 4

 

32. ప్రపంచంలో సంభవించే వైపరీత్యాల్లో కిందివాటిలో సరికానిది?

  1. భూకంపాల వల్ల 8% నష్టం కలుగుతుంది 2) వరదల వల్ల 30% నష్టం కలుగుతుంది
    3) చక్రవాతాల వల్ల 21% నష్టం కలుగుతుంది. 4) కరవుల వల్ల 20% నష్టం కలుగుతుంది.
    జ: 4 (కరవుల వల్ల 20% నష్టం కలుగుతుంది.)


33. ఏదైనా భౌగోళిక ప్రాంతంలో లేదా ఒక కమ్యూనిటీలో సంభవించే వైపరీత్యాల వల్ల జరిగే నష్ట తీవ్రత, పరిధి, పరిస్థితులు దేనికి దారితీస్తాయి?
జ: దుర్బలత్వం


34. 1999, ఆగస్టు 20న విపత్తు నిర్వహణపై అత్యున్నతాధికార కమిటీని ఎవరి అధ్యక్షతన వేశారు?
జ: జె.సి. పంత్‌


35. విపత్తు తీవ్రతను సాధారణంగా దేన్ని బట్టి అంచనా వేస్తారు?
జ: ప్రాణ, ఆస్తి నష్టం

 

36. కిందివాటిలో విపత్తులు, వాటి నోడల్‌ మంత్రి బాధ్యతలను జతపరచండి.

విపత్తు

మంత్రి

i) పరిశ్రమలు - రసాయనాలు

A) హోంమంత్రి

ii) హిమపాతాలు

B) వ్యవసాయ మంత్రి

iii) కరవులు

C) రక్షణ మంత్రి

iv) NDRF

D) పర్యావరణ - అటవీ మంత్రి

 

E) పరిశ్రమల మంత్రి

i ii iii iv
జ: D C B A

 

37. కింది అంశాల్లో సరైన వాటిని గుర్తించండి.
1) జాతీయ విపత్తు నిర్వహణ మొదటి సమావేశం న్యూదిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో 2006, నవంబరు 29న జరిగింది.
2) జాతీయ విపత్తు నిర్వహణ సమావేశాలకు ప్రధాన మంత్రి అధ్యక్షత వహిస్తారు.
జ: 1, 2 సరైనవి


38. కిందివాటిని జతపరచండి.

కమిటీ

ఛైర్‌పర్సన్‌

i) కేబినెట్‌ కమిటీ

A) కేంద్ర హోంమంత్రి

ii) జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ

B) హోం కార్యదర్శి

iii) జాతీయ కార్యనిర్వహణ కమిటీ

C) కేబినెట్‌ కార్యదర్శి

iv) విపత్తు సమన్వయ కమిటీ

D) ప్రధానమంత్రి

i ii iii iv
జ: D C B A


39. అంతర్జాతీయ విపత్తు తగ్గింపు మూడో సదస్సు 2015, మార్చి 18న ఎక్కడ జరిగింది?
జ: సెండాయ్‌

 

40. నూతన జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక (NDMP) ను 2016, జూన్‌ 1న న్యూదిల్లీలో ఎవరు విడుదల చేశారు?
జ: ప్రధానమంత్రి


41. కిందివాటిని జతపరచండి.

సంస్థ

కార్యాలయం

i) అంతర్జాతీయ విపత్తు తగ్గింపు సంస్థ

A) బ్యాంకాక్‌

ii) ఆసియా విపత్తు ప్రతిస్పందన సంస్థ

B) జెనీవా

iii) సార్క్‌ విపత్తు తగ్గింపు సంస్థ

C) నాగ్‌పుర్‌

iv) నేషనల్‌ సివిల్‌ డిఫెన్స్‌ కాలేజీ

D) దిల్లీ

 

E) పుణె

i ii iii iv
జ: B A D C


42. కింది అంశాల్లో సరైనవాటిని గుర్తించండి.
1) అంతర్జాతీయ సునామీ అవగాహన దినోత్సవం - నవంబరు 5
2) జాతీయ విపత్తు అవగాహన దినోత్సవం - అక్టోబరు 29
3) అంతర్జాతీయ విపత్తు కుదింపు దశాబ్దం - 1990 - 2000
జ: 1, 2, 3

 

43. దీర్ఘకాలిక విపత్తు ప్రణాళిక అభివృద్ధిని ఏ రకమైన విపత్తు స్థాయిలో సూచిస్తారు?
జ: L3


44. ‘జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక’ (NDMP)లో మొత్తం ఎన్ని లక్ష్యాలు ఉన్నాయి?
జ: 14


45. కింది అంశాల్లో సరైనవి.
1) విపత్తు సహాయ నిధిని ఏర్పాటుచేయాలని 9వ ఆర్థిక సంఘం మొదట సిఫారసు చేసింది.
2) 13వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు జాతీయ విపత్తు సహాయక నిధిని 2010, ఏప్రిల్‌ 1న ప్రారంభించారు.
3) 14వ ఆర్థిక సంఘం 2015-20కి గాను ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,489 కోట్లను సిఫారసు చేసింది.
జ: 1, 2, 3

Posted Date : 11-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు - చట్టాలు

మాదిరి ప్రశ్నలు

1. తెలంగాణ రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ఎవరు?
ఎ) జోగు రామన్న బి) అజ్మీరా చందూలాల్ సి) జూపల్లి కృష్ణారావు డి) కొప్పుల ఈశ్వర్
జ: (ఎ)

 

2. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ ఎవరు?
ఎ) బహుగుణ బి) రాజీవ్‌శర్మ సి) అనురాగ్‌శర్మ డి) ఎ.కె.చాందా
జ: (బి)

 

3. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఎప్పుడు ఏర్పడింది?
ఎ) 2014, జులై 6 బి) 2015, జులై 6 సి) 2014, ఆగస్టు 6 డి) 2015, ఆగస్టు 6
జ: (ఎ)

 

4. ప్రాంతీయ సామాజిక ఉద్యమాలు ఏ దశకం నుంచి ప్రారంభమయ్యాయి?
ఎ) 1980 బి) 1990 సి) 2000 డి) 1970
జ: (ఎ)

 

5. తెలంగాణలో యురేనియం నిక్షేపాలున్న జిల్లా ఏది?
ఎ) రంగారెడ్డి బి) మహబూబ్‌నగర్ సి) నల్గొండ డి) మెదక్
జ: (సి)

 

6. 'సిటిజన్స్ ఆగైనిస్ట్ పొల్యూషన్' అనే పర్యావరణ స్వచ్ఛంద సంస్థ ఎప్పుడు ఏర్పడింది?
ఎ) 1986 బి) 1987 సి) 1988 డి) 1989
జ: (ఎ)

 

7. 'ఛత్రీ, గమన, పుకార్, చెలిమి' అనేవి ఏమిటి?
ఎ) వ్యాపార సంస్థలు బి) ప్రకటన సంస్థలు సి) స్వచ్ఛంద సంస్థలు డి) ప్రభుత్వ సంస్థలు
జ: (సి)

 

8. మూసీనది కాలుష్య వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇచ్చిన పర్యావరణవేత్త ఎవరు?
ఎ) బాబా ఆమ్టే బి) మేధా పాట్కర్ సి) రాజేంద్ర సింగ్ డి) బహుగుణ
జ: (బి)

 

9. 2000, జూన్ 24న ఏర్పడిన 'ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్' కన్వీనర్ ఎవరు?
ఎ) ఎం.వేదకుమార్ బి) డాక్టర్ కిషన్‌రావు సి) కె.పురుషోత్తంరెడ్డి డి) రామారావు
జ: (ఎ)

 

10. నల్గొండలో యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమానికి మద్దతునిచ్చిన గిరిజన సమాఖ్య నాయకుడు ఎవరు?
ఎ) రవీంద్రనాయక్ బి) నాగేశ్వర్‌రావు సి) వీరేంద్రనాయక్ డి) ధరేంద్రసింగ్
జ: (ఎ)

 

11. నల్గొండ జిల్లాలో 'యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం' అనే స్వచ్ఛంద సంస్థ ఎప్పుడు ఏర్పడింది?
ఎ) 2005 బి) 2006 సి) 2007 డి) 2008
జ: (బి)

 

12. మూసీ నది వెంబడి ఉద్యానవనం అభివృద్ధి చేసేందుకు ప్రారంభించిన ప్రాజెక్టు ఏది?
ఎ) హరితపత్రం బి) నందనవనం సి) మిత్రవనం డి) జలవనమండలి
జ: (బి)

 

13. 2006 నవంబరు 21న హైదరాబాద్‌లో కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు 'హైదరాబాద్ బచావో' అనే నినాదంతో పాదయాత్ర ఎక్కడ నిర్వహించారు?
ఎ) మియాపూర్ నుంచి ఎల్బీనగర్ బి) జూబ్లీహిల్స్ నుంచి ఫలక్‌నుమా సి) పురానా పూల్ నుంచి అంబర్‌పేట డి) అంబర్‌పేట నుంచి మలక్‌పేట
జ: (సి)

 

14. 'వాటర్ మెన్ ఆఫ్ ఇండియా, జోహడ్ వాలా బాబా' అనే బిరుదులు ఎవరివి?
ఎ) వందనా శివా బి) సునీతా నారాయణ్ సి) అన్నాహజారే డి) రాజేంద్రసింగ్
జ: (డి)

 

15. టైమ్ మ్యాగజైన్ 'పర్యావరణ హీరో'గా ఎవరిని అభివర్ణించింది?
ఎ) సునీతా బి) అన్నాహజారే సి) వందనాశివ డి) మాధవ్ ప్రియదాస్
జ: (సి)

 

16. 'జలమందిర్ యాత్ర' పేరుతో గుజరాత్‌లో ప్రజలను చైతన్యపరిచిన జానపద గాయకుడు ఎవరు?
ఎ) రామ్‌బియా బి) మాధూరిప్రియ సి) రామ్‌లీలావాలా డి) మనోహర్‌బియా
జ: (ఎ)

Posted Date : 11-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు-చట్టాలు

పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ లక్ష్యాలుగా తెలంగాణలో పలు సామాజిక ఉద్యమాలు జరిగాయి. వీటిలో నల్గొండ జిల్లాలో యురేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా.. రాజధాని నగరంలో మూసీ నది ప్రక్షాళన దిశగా నిర్వహించిన ఉద్యమాలు ప్రధానమైనవి. స్థానికుల నుంచి వ్యక్తమైన నిరసనలు ఉద్యమాలుగా మారాయి. వీటికి పలు సంస్థలు, ప్రముఖుల నుంచి మద్దతు లభించడంతో కొంతమేర విజయవంతమయ్యాయి. 
                   మన దేశంలో పర్యావరణ ఉద్యమాలు గ్రామస్థాయి నుంచి 1970లలోనే ప్రారంభమయ్యాయి. 1980వ దశకం నుంచి తెలంగాణలో సామాజిక ఉద్యమాలు మొదలయ్యాయి. 1990వ దశకం నుంచి ఉద్యమాలు తీవ్రమయ్యాయి. ప్రపంచీకరణ, నయా ఉదారవాదం పేర్లతో చోటు చేసుకున్న ప్రపంచవ్యాప్త ఆర్థిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే పర్యావరణ ఉద్యమాలు ఊపందుకున్నాయి. ప్రాంతీయంగా కూడా పర్యావరణం, మానవ హక్కుల పరిరక్షణ దిశగా సాగిన సామాజిక ఉద్యమాలు అనేక అంశాలను లేవనెత్తాయి. ఇలాంటి ఉద్యమాలు సాధారణంగా రాజకీయ పార్టీలకు దూరంగా.. ఒక ఆశయం కోసం పనిచేస్తాయి. ప్రజాస్వామిక విధానాల్లోనే కార్యక్రమాలను రూపొందిస్తాయి.

 

యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం
భారత యురేనియం సంస్థ (యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ - యూసీఐఎల్) తెలంగాణలో నల్గొండ జిల్లా నాగార్జున జలాశయం సమీపంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో యురేనియం నిక్షేపాలున్నట్లు గుర్తించింది. దీని సమీప గ్రామాల్లో సుమారు 1303 ఎకరాల్లో యురేనియం నిక్షేపాలున్నట్లు యూసీఐఎల్ నిర్ధారించింది. 2001 ఫిబ్రవరిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యురేనియం మైనింగ్, శుద్ధి కర్మాగారాన్ని స్థాపించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదించింది.
* 2002 సెప్టెంబరులో నల్గొండ జిల్లాలోని పెద్దగట్టు, లంభాపురం గ్రామాల్లో యురేనియం గనుల తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కింద 795 ఎకరాల్లో సుమారు రూ.315 కోట్లతో దాదాపు 20 ఏళ్ల వరకు తవ్వకాలు చేయడానికి నిర్దేశించింది. అనుమతుల అనంతరం నమూనాల కోసం తవ్వకాలను ప్రారంభించడంతో అప్పట్లో స్థానికులు దీన్ని వ్యతిరేకించారు.
* 2005లో దేవరకొండ పరిధిలో యురేనియం తవ్వకాలకు ప్రయత్నించగా అక్కడి స్థానికుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో తవ్వకాలను నిలిపివేశారు. 2006లో 'యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం' అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి పెద్దఎత్తున స్థానికులు ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమానికి గిరిజన సమాఖ్య అధ్యక్షుడు రవీంద్రనాయక్ మద్దతు తెలిపారు. పర్యావరణవేత్తలు, జన విజ్ఞాన వేదిక, పౌరహక్కుల సంఘం నాయకులు కూడా మద్దతిచ్చారు.
* 2007లో లంభాపురం, పెద్దగట్టు, శేరుపల్లి, చిట్రియాల, పెద్దమూల, కాచరాజుపల్లి గుట్టల్లోని అటవీ ప్రాంతంలో దేశ రక్షణ, అణ్వాయుధాల తయారీకి ఉపయోగపడే యురేనియం నిక్షేపాలున్నట్లు యురేనియం సంస్థ పరిశోధనలో తేలింది. దీంతో 2007లో మళ్లీ యురేనియం శుద్ధి కర్మాగార నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ పనులను అక్కడి స్థానికులు పెద్దఎత్తున అడ్డుకున్నారు. ప్రజలకు మద్దతుగా 20 స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. ఇది చివరికి ప్రజా ఉద్యమంగా మారి నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెనుకంజ వేసి పనులను వాయిదా వేసింది.

 

మూసీ కాలుష్య వ్యతిరేక ఉద్యమం
1980వ దశకం నుంచి హైదరాబాద్ నగర శివార్లలో పారిశ్రామిక ప్రాంతాలు విస్తరించాయి. దీంతో పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలన్నీ మూసీ నదిలో కలవడం వల్ల అది ఒక మురికి కాలువగా మారింది. వాస్తవంగా.. మూసీ నది హైదరాబాద్ మీదుగా ప్రవహిస్తుండటం వల్ల నగర ప్రజల తాగునీటి అవసరాలకు ఉద్దేశించి దీని ఉపనదిపై హుస్సేన్‌సాగర్ సరస్సును పూర్వకాలంలో నిర్మించారు. అయితే కాలక్రమేణా ఈ నీరు కలుషితమైంది. హుస్సేన్‌సాగర్‌లో ప్రతిరోజూ జంట నగరాల నుంచి 350 మిలియన్ లీటర్ల మురికినీరు, పారిశ్రామిక వ్యర్థ పదార్ధాలు కలుస్తున్నట్లు గత పరిశోధనల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో 1986లో డాక్టర్ కిషన్‌రావు, కె.పురుషోత్తమ్‌రెడ్డిల ఆధ్వర్యంలో 'సిటిజన్స్ ఆగైనిస్ట్ పొల్యూషన్' అనే పర్యావరణ స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి స్థానిక ప్రజలను కూడగట్టారు. ఇతర పర్యావరణ సంఘాలతో కలిసి మూసీ కాలుష్య వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టారు. నదీ పరీవాహక ప్రాంత ప్రజల జీవించేహక్కును కాపాడాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1988లో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఫలితంగా కొన్ని పరిష్కారాలను కనుక్కున్నారు. 1989లో హానికరమైన వ్యర్థపదార్ధాల నిర్వహణ, నిల్వ, పరిష్కారాల కోసం 'హానికరమైన వ్యర్థపదార్థాల' నియమావళిని ప్రభుత్వం రూపొందించింది. ఈమేరకు ఉద్యమం కొంత విజయం సాధించింది.
* 2000లో మూసీ నదిలోని నీటిని ఒక చిన్న కాంక్రీట్ కాలువ ద్వారా ప్రవహింపజేసి.. నదీ జలాల ప్రాంతాన్ని ఉద్యానవనంగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించి తెలుగుదేశం ప్రభుత్వం 'నందనవనం' అనే ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ నది సమీపంలో మురికివాడలను నిర్మూలించాలని ప్రయత్నించింది. దీంతో ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 'మూసీ బచావో ఆందోళన్' అనే నినాదంతో స్థానిక సామాజిక సంస్థలు ఉద్యమం చేపట్టాయి. దీనికి పర్యావరణవేత్త మేధా పాట్కర్ మద్దతు ఇవ్వడంతో ఈ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది.
* 2000, జూన్ 24న 'ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్' అనే సంస్థను ప్రారంభించారు. ఈ ఫోరమ్ కన్వీనర్ ఎం.వేదకుమార్ ఆధ్వర్యంలో 'హైదరాబాద్ బచావో' అనే పర్యావరణ ఉద్యమం మొదలైంది. 2006, నవంబరు 21న కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు పురానా పూల్ వంతెన నుంచి అంబర్‌పేట వరకు పాదయాత్ర చేపట్టారు. వీరితో పాటు నగరంలోని ఛత్రీ, గమన అనే రెండు స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి.
* 2007లో మూసీనదిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ జలమండలి మూసీ నది పొడవునా దశలవారీగా మురుగు శుద్ధి, ప్రక్షాళన పనులను చేపట్టడానికి 10 సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను సిద్ధం చేసింది. అయితే వీటివల్ల అక్కడి జనావాసాలకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయని 'సేవ్ మూసీ రివర్ క్యాంపైన్' పేరుతో స్థానిక పర్యావరణ సెల్ 2009, జూన్ 2న ఉద్యమం ప్రారంభించింది. ఈ ఉద్యమానికి మద్దతుగా సేవ్ లేక్స్ సొసైటీ, సేవ్ రాక్స్ సొసైటీ, అక్షర, ప్రజా చైతన్య వేదిక, పుకార్, చెలిమి ఫౌండేషన్, హెరిటేజ్ వాచ్ లాంటి పర్యావరణ సంఘాలు పాదయాత్ర చేసి ప్రజలను చైతన్యపరిచాయి.
* 2009 నుంచి నగరం వేగంగా విస్తరిస్తున్న కొద్దీ మూసీ నది పరివాహక ప్రాంతాలు రియాల్టర్లు, కబ్జాదారుల ఆక్రమణలకు గురవుతూ వస్తున్నాయి. మలక్‌పేట, హిమాయత్‌నగర్, అజ్గంపురా, కాచీగూడ ప్రాంతాల్లో మూసీ నది ఆక్రమణలకు గురైంది. ముఖ్యంగా ఒక సంస్థ నదీ పరివాహ ప్రాంతాన్ని కబ్జాచేసి వేసిన వెంచర్ చుట్టూ ప్రహరీగోడను నిర్మించింది. దీనికి వ్యతిరేకంగా కొందరు 'మూసీ బచావో' పేరుతో పెద్ద ర్యాలీని నిర్వహించారు. పలువురు నాయకులు, ప్రజా సంఘాలు దీనికి మద్దతు తెలిపాయి. ఈ ఉద్యమకారుల డిమాండ్‌కు స్పందించి జీహెచ్ఎంసీ కబ్జాదారులపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించింది.
* తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన జీవితాన్ని అందించడానికి పర్యావరణ నిర్వహణ ద్వారా ఆర్ధిక వృద్ధి సాధించడమే లక్ష్యం. - టీఎస్ పీసీబీ విజ‌న్‌

 

* నదీ జలాల్లో 'విష' ప్రవాహం
మానవ మనుగడ దేనిపై ఆధారపడి ఉందో ఆ పర్యావరణం కాలుష్యం దెబ్బకు విషతుల్యంగా మారుతోంది. పారిశ్రామికీకరణ ప్రభావంతో వెదజల్లుతున్న కాలుష్యం పౌర సమాజాన్ని ఊపిరి సలపనీయడం లేదు. నదీ జలాలు, పరిసర ప్రాంతాల్లో చిమ్ముతున్న విష ప్రభావానికి మూగజీవాలు చనిపోతున్నాయి. మనుషులు కూడా బలై పోతున్నారు. ఈ విపత్కర పరిస్థితిని రూపుమాపాలంటూ ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలుగా సాగిన ప్రధాన ఉద్యమాలేమిటో చూద్దాం..


పౌరహక్కుల ఉద్యమాలు తమ అజెండాలో పర్యావరణ సమస్యలకు తొలి ప్రాధాన్యం ఇచ్చాయి. కాలుష్యం లేని పర్యావరణంలో జీవించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని ఈ ఉద్యమాలు భావించాయి. ఈమేరకు పారిశ్రామిక కాలుష్యానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అణుశక్తి వినియోగం, అణు విద్యుత్ కర్మాగారాల ఏర్పాటు, అణు యుద్ధాలు లాంటివాటిని వ్యతిరేకిస్తూ పౌర హక్కుల ఉద్యమాలు కొనసాగుతున్నాయి. అలాగే భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, భారీ పరిశ్రమల ఏర్పాటు, మైనింగ్ తదితర కార్యకలాపాలకు భూసేకరణ జరిపే క్రమంలో.. కొన్ని కుటుంబాలు తమ భూములను కోల్పోతున్నాయి. ఇలాంటి నిరాశ్రయుల హక్కుల సాధన కోసం పోరాటాలు జరుగుతున్నాయి.


కాలుష్య వ్యతిరేక ఉద్యమాలు: మన దేశంలో శతాబ్దాలుగా నదులు, వాగులు, ఏరులు.. ప్రజలకు తాగునీటిని అందిస్తున్నాయి. పరిశ్రమల వాణిజ్య అవసరాలు తీరుస్తున్నాయి. మత్స్య సంపదలోనూ కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే పారిశ్రామికీకరణ వల్ల ఇవి చాలామేర కలుషితం అయ్యాయి. ప్రత్యేకంగా ఉత్తరాన ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ్‌బంగ రాష్ట్రాలకు చెందిన నగరాల్లో గంగానది పొడవునా ఉన్న పంచదార, కాగితం, ఎరువులు, రసాయనాలు, రబ్బరు, పెట్రోకెమికల్స్ పరిశ్రమల నుంచి వచ్చే కలుషితాలన్నీ నదిలో కలుస్తున్నాయి. దక్షిణాన కూడా పలు పరిశ్రమలు గోదావరి, కావేరి, తుంగభద్ర నదులను కలుషితం చేస్తున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో కాలుష్య వ్యతిరేక ఉద్యమాలు చోటు చేసుకున్నాయి. ఈ ఉద్యమాల ఫలితంగా ప్రభుత్వాలు కొన్ని చర్యలతోపాటు పలు చట్టాలను కూడా రూపొందించాయి.


'సోన్'లో గరళం: మధ్యప్రదేశ్‌లోని షోడోల్ జిల్లాలో సోన్ నది పక్కనున్న అమ్లాయ్ నగరంలో 1965లో ఓరియంటల్ పేపర్ మిల్స్ అనే కాగితం పరిశ్రమ ఏర్పాటైంది. ఇది పెట్టిన రెండేళ్లకే కలుషిత పదార్థాల వల్ల నదిలోని చేపలు, పరిసర ప్రాంతాల్లో పశువులు మరణించాయి. 1970 నుంచి నది చుట్టుపక్కల ప్రాంతాల్లోని 20 గ్రామాల ప్రజలు పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యం వల్లే నదీ జలాలు విషపూరితం అయ్యాయంటూ అధికారులకు, కలెక్టరుకు, మంత్రులకు విన్నవించుకున్నారు. అయినా యాజమాన్యం దీనిపై స్పందించలేదు. 1973లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ, దిల్లీ) బృందం ఈ ప్రాంతంలో సర్వే జరిపింది. పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యం వల్ల పశువుల్లో పాల దిగుబడి తగ్గిందని; నదిలోని చేపలు, గ్రామాల్లోని పశువులు క్రమంగా చనిపోతున్నాయని తెలిపింది. దీంతో అక్కడి ప్రజలు పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమం చేపట్టారు. దీని ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 1974లో నీటి కాలుష్య నియంత్రణ చట్టాన్ని రూపొందించింది.


'చాలియార్' కలుషితం: కేరళలోని చాలియార్ నది పక్కన 1958లో బిర్లా సంస్థ గ్వాలియర్ రేయాన్స్ పరిశ్రమను స్థాపించింది. దీని నుంచి విడుదలయ్యే కాలుష్యం వల్ల ఆ నదిలోని చేపలన్నీ చనిపోయాయి. నది నుంచి నీరు వెళ్లే పంట పొలాలు నాశనమయ్యాయి. పరిసర గ్రామాల ప్రజలకు చర్మ రోగాలు సోకాయి. దీంతో వీరంతా 1963లో కాలుష్యాన్ని అదుపు చేయాలని కోరుతూ పరిశ్రమ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపారు. 1975లో ఇది భారీ ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఫలితంగా 1981లో కాలుష్య నియంత్రణ మండలి కంపెనీ యాజమాన్యంపై కేసులు పెట్టింది.
గోవాలో ఉద్యమం: 1973లో గోవాలో జువారి ఆగ్రో కెమికల్స్ లిమిటెడ్ అనే ఎరువుల పరిశ్రమను ప్రారంభించారు. పని ప్రారంభించిన 3 నెలలకే కాలుష్యం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. చుట్టుపక్కల ఉన్న కొబ్బరి చెట్లు కూడా మాడిపోయాయి. దీంతో 1974 మార్చి 31న సలదాన్హా అనే ఉపాధ్యాయుడు స్థానిక ప్రజలతో కలిసి కాలుష్య వ్యతిరేక సంఘాన్ని ఏర్పాటు చేశారు. వీరంతా పరిశ్రమకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.


కాలుష్య కర్మాగారం: ముంబయికి గాలి వచ్చే నైరుతి దిశలోని అలీబాగ్ ప్రాంతంలో ఎరువుల కర్మాగారాన్ని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు స్థాపించాయి. ఈ పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యం వల్ల పర్యావరణం దెబ్బతిని, ప్రజలు కాలుష్యానికి గురవుతున్నారని అక్కడి ప్రజలు గుర్తించారు. వీరంతా దీన్ని వేరే ప్రాంతానికి తరలించాలని ఉద్యమం చేపట్టారు. ప్రజల ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం దీన్ని మరోచోటుకు తరలించింది.


భోపాల్ దుర్ఘటన
* 1984, డిసెంబరు 2 అర్ధరాత్రి భోపాల్‌లోని 'యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్' (అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ) అనే ఎరువుల తయారీ పరిశ్రమ నుంచి 'మిథైల్ ఐసోసైనేట్' అనే ప్రమాదకర విషవాయువు వెలువడింది. ఇది 3 వేల మంది మరణానికి కారణమైంది. భారతదేశంలో సంభవించిన పారిశ్రామిక దుర్ఘటనల్లో అతి భయానక విపత్తుగా ఇది చరిత్ర పుటల్లో నిలిచింది. అనంతర కాలంలో ఈ వాయువు దుష్ప్రభావం ఫలితంగా దాదాపు 15 వేల మంది మరణించారు. 5 లక్షల మంది శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు గురయ్యారు. లక్షలాది మంది ప్రజలు వికలాంగులు, అంధులుగా మారారు. జీవచ్చవాలుగా మిగిలిన వారు చాలామంది ఉన్నారు.
* ఈ సంఘటనలో ప్రధాన నిందితుడైన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ సీఈవో వారెన్ ఆండర్సన్‌ను 1985 ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు. అయితే అతడు బెయిల్‌పై అమెరికా వెళ్లాడు. 1986లో రషీదాబీ, చంపాదేవి శుక్లా భోపాల్ బాధితులకు న్యాయం చేయాలని పెద్దఎత్తున ఉద్యమం నడిపారు. దేశప్రజల నుంచి వ్యక్తమైన తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
* 1989లో రషీదాబీ, చంపాదేవి ఆధ్వర్యంలో 'భోపాల్ హతశేషుల ఉద్యమం' నడిచింది. దిల్లీలో వేలాది ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తమకు న్యాయం చేయమని కోరుతూ నాటి ప్రధాని రాజీవ్‌గాంధీకి వినతి పత్రం సమర్పించారు.
* 1999లో చంపాదేవి ఇతర ఉద్యమకారులతో కలిసి న్యూయార్క్ కోర్టులో 'యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్'పై ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. 2002లో రషీదాబీ, చంపా కలిసి న్యూఢిల్లీలో 19 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. భోపాల్ బాధితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.
* రషీదాబీ, చంపా చేసిన సేవలకు గుర్తింపుగా 2004లో వారికి 'గోల్డ్‌మన్ పర్యావరణ బహుమతి' లభించింది. ఈ పురస్కారాన్ని పర్యావరణ రంగంలో నోబెల్ బహుమతిగా పరిగణిస్తారు. వీరి పోరాటానికి కొన్ని అంతర్జాతీయ సంస్థలు మద్దతు ఇచ్చాయి. అవి..
* ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ - బ్రిటన్
* భోపాల్ మెడికల్ అప్పీల్ - బ్రిటన్
* గ్రీన్‌పీస్ ఇంటర్నేషనల్ - బ్రిటన్
* అసోసియేషన్ ఫర్ ఇండియన్ - అమెరికా
* కోర్ వాచ్ - అమెరికా
* పెస్టిసైడ్ యాక్షన్ నెట్‌వర్క్ - అమెరికా
* భోపాల్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ - జపాన్
* విషయం మళ్లీ 2010లో వార్తల్లోకి వచ్చింది. 2011లో కేంద్రం బాధితులకు రూ.1500 కోట్ల అదనపు ప్యాకేజీని సిఫారసు చేసింది. ఇటీవల ఈ కేసును కొట్టేశారు.
* కేంద్ర ప్రభుత్వం 1984లో 'పర్యావరణ పరిరక్షణ చట్టం'ను రూపొందించింది. 1986లో పారిశ్రామిక కాలుష్య నియంత్రణ చట్టాలను అమలు చేసింది.

Posted Date : 11-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భూకంపాలు - భూపాతాలు

            భూగోళంలోని అన్ని ప్రదేశాల్లో భూకంపాలు నిరంతరం వస్తుంటాయి. కొన్నింటిని మనం కనీసం గుర్తించలేం కూడా. భూకంపాలు సంభవించినప్పుడు పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. ఇలాంటి భూకంపాల వల్ల భవనాలకు, వంతెనలకు, ఆనకట్టలకు, ప్రజలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. కొన్ని సందర్భాల్లో భూకంపాల వల్ల వరదలు, కొండ చరియలు విరిగి పడటం, సునామీ రావడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది.
ఉదా: 2004, డిసెంబరు 24న హిందూ మహాసముద్రంలో ఏర్పడిన సునామీ వల్ల భారతదేశ తూర్పు తీరప్రాంతంలో, అండమాన్ నికోబార్ దీవుల్లో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది.
భూకంపం ఎందుకు వస్తుంది?
భూమి అంతర్భాగంలో ఎక్కడైనా ఒకచోట ఆకస్మిక అలజడి వచ్చినప్పుడు కంపనాలు ఉపరితలాన్ని చేరడాన్నే భూకంపం అంటారు. అంటే భూ ఉపరితల భూభాగం కొన్ని పొరలతో నిర్మితమై ఉంటుంది. ఇలా భూమి పొరల్లో అన్నింటి కంటే పెద్దదైన 'భూపటలం' అంతర్భాగంలో అత్యధిక శక్తి వల్ల ఏర్పడే అలజడితో భూకంపాలు ఏర్పడతాయి. వీటినే 'పలక చలనాలు' అంటారు.
భూమి లోపల ఉన్న పలకల కదలికల వల్ల కొన్ని ప్రాంతాల్లో తరచుగా భూకంపాలు రావడానికి అవకాశం ఉంటుంది. భూకంపాలు ఆ ప్రాంత ఉపరితలాన్ని బలహీన ప్రాంతంగా మారుస్తాయి. ఇలాంటి బలహీన ప్రాంతాలను 'సిస్మిక్ ప్రాంతాలు' లేదా 'భూకంప ప్రభావిత ప్రాంతాలు' అంటారు.

 

భూకంపాలు - కారణాలు
భూకంపాలు ఎప్పుడు, ఎక్కడ సంభవిస్తాయో ముందుగా చెప్పడం కష్టం. అయితే కింది కారణాల వల్ల భూకంపాలను కొంతవరకు గుర్తించవచ్చు.
అవి: 1) అగ్నిపర్వతాల ఉద్భేదన ప్రక్రియ
        2) అంతర్భాగంలో జరిగే కేంద్రక విస్ఫోటనం
        3) గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టడం
        4) భూ అంతర్భాగంలో పలక చలనాలు (ప్లేట్స్ ఆఫ్ టెక్టానిక్స్)
పై కారణాల వల్ల భూ అంతర్భాగంలో ఎక్కడైన అత్యధిక శక్తి విడుదలైనప్పుడు కంపనాలు ప్రారంభమైన మూల స్థానాన్ని 'భూకంపనాభి' అంటారు. నాభి నుంచి ఉపరితలానికి చేరే ప్రాంతాన్ని 'అధికేంద్రం' అంటారు. భూకంప నాభి నుంచి ప్రకంపనాలు పరావర్తనం చెంది వక్రీభవిస్తాయి.

 

భూకంప కదలికలు - తరంగాలు
భూ అంతర్భాగంలో కదలికలు/ పలక చలనాలు భూ ఉపరితలంపై తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. వీటినే 'సిస్మిక్ తరంగాలు' అంటారు. వీటిని భూకంప లేఖిని ద్వారా గుర్తిస్తారు.
ఇవి మూడు రకాలు:
ఎ) భూమిలో ప్రారంభమయ్యే మొదటి తరంగాలను 'p' లేదా ప్రాథమిక తరంగాలు అంటారు. ఇవి ఒత్తిడితో కూడిన శబ్ద తరంగాలు. అన్ని మాధ్యమాల ద్వారా ప్రయాణిస్తాయి.
బి) రెండో తరంగాలను 's' లేదా గౌణ తరంగాలు అంటారు. ఇవి నిటారుగా/ ఊర్థ్వ వ్యాప్తంగా, ఘన పదార్థాల్లో మాత్రమే ప్రయాణిస్తాయి. భూ కేంద్రం ద్వారా ప్రయాణించవు.
సి) 'p', 's' తరంగాల వల్ల వచ్చే ఉపరితల తరంగాలను 'L' లేదా దీర్ఘ తరంగాలు అంటారు. వీటి వల్ల భూ ఉపరితల నష్టం తీవ్రంగా ఉంటుంది.

 

భూకంపాలు - విస్తరణ
* భూకంపాలు తరచుగా సంభవిస్తుంటాయి.
* ఇవి అగ్నిపర్వత ప్రాంతాల్లో, ముడుత పర్వతాలు ఉన్నచోట ఎక్కువగా సంభవిస్తాయి.
* ఇప్పటివరకు భూకంపాలను గుర్తించని ప్రాంతం ఆస్ట్రేలియా.
* భూకంపాలను ముందుగా పిల్లులు, పాములు, పశువులు గుర్తిస్తాయి.
* ప్రపంచంలో భూకంపాలు 68% పసిఫిక్ మహాసముద్రం, 21% మధ్యదరా ప్రాంతాలు, 11% ఇతర ప్రాంతాల్లో సంభవిస్తాయి.

 

భూకంపాలు - పరికరాలు
* భూకంపాలను నమోదు చేసే పరికరాన్ని సిస్మోగ్రాఫ్/ భూకంప లేఖిని అంటారు. దీన్నే మెర్కెలి స్కేలు అని పిలుస్తారు. ఈ స్కేలును  ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా ఉపయోగించవచ్చు.
* భూకంపం సంభవించిన ప్రదేశాన్ని, సమయాన్ని గుర్తించేదే భూకంప దర్శిని.
* భూకంపాల తీవ్రతను రిక్టర్ స్కేలుతో గుర్తిస్తారు. దీన్ని ట్రైనైట్రోటోల్యూన్ (TNT) పదార్థం ఆధారంగా లెక్కిస్తారు. రిక్టర్ స్కేలుపై 09 పాయింట్లు ఉంటాయి. అయితే రిక్టర్ స్కేలు కొలత 7.0 కంటే ఎక్కువ న‌మోదైన‌ప్పుడు తీవ్రమైన విధ్వంసం జరుగుతుంది.
* భూకంప తీవ్రతను మరో పద్ధతి ద్వారా 'భ్రామక పరిమాణ' స్కేలును ఉపయోగించి కనుక్కోవచ్చు.

 

రిక్టర్ స్కేలు రీడింగ్ - భూకంప ప్రభావం
రిక్టర్‌స్కేలు                 -              భూకంప ప్రభావం
ఎ) 3.5 కంటే తక్కువ   -      మానవులు గుర్తించలేరు. రోజుకు 1000 సార్లు సంభవిస్తాయి.
బి) 3.5 - 5.4             -     కిటికీలు, కిచెన్ వస్తువులు కదులుతాయి. ఏడాదికి 49 వేల సార్లు వస్తాయి. విధ్వంసం ఉండదు.
 సి) 5.5 - 6.0            -     భవనాలు, నాణ్యతలేని నిర్మాణాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఏడాదికి 6,200 సార్లు వస్తాయి.
డి) 6.1 - 6.9             -    100 కి.మీ. వైశాల్యంలో తీవ్రత ఉంటుంది.
ఇ) 7.0 - 7.9             -    పెద్ద భూకంపాలు, ఆస్తి, ప్రాణ నష్టం అధికంగా ఉంటుంది.
ఎఫ్) 8.0 కంటే ఎక్కువ  -  తీవ్రమైన విధ్వంసం జరుగుతుంది. ఏడాదికి ఒకసారి వస్తుంది. అతి పెద్ద భూకంపాలు
ఇప్పటివరకు రిక్టర్‌స్కేలుపై 9.0 వచ్చిన భూకంపాలు
1) 1960 చిలీ  2) 1964 అలస్కా 3) 2004 ఇండోనేసియా, భారతదేశం

 

భూకంపాలు - ఫలితాలు
* భూకంపాలు నిర్ణీత వ్యవధిలో (ఒక నిమిషంలోపే) వస్తాయి.
* భూకంపాలకు పగలు, రాత్రి సమయాలుండవు. అన్ని వేళల్లో సంభవిస్తాయి. వీటివల్ల ప్రాణ నష్టం అధికంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య  ఉంటాయి.
*  భూకంపాల వల్ల చమురు బావులు, గ్యాస్ పైపులు పగిలి అగ్ని ప్రమాదం సంభవించవచ్చు. సునామీ కూడా సంభవిస్తుంది.

 

భారతదేశంలో భూకంపాలు
* భారతదేశంలో భూకంపాలు ఎక్కువగా హిమాలయ పర్వత పాదాల వద్ద సంభవిస్తాయి. దేశంలో తరచుగా అసోం, గుజరాత్, మహారాష్ట్ర, జమ్మూ, బిహార్‌లో వస్తున్నాయి.
ఉదా: 1897లో ఈశాన్య షిల్లాంగ్‌లో రిక్టర్ స్కేలుపై 8.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.
* జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ హైదరాబాద్ భూకంపాలను 5 జోన్లుగా నిర్ధారించింది. 2002లో జోన్ - I ను జోన్ - II లో విలీనం చేశారు. ప్రస్తుతం 4 జోన్లు ఉన్నాయి. వీటిలో జోన్ V అత్యంత తీవ్రమైన విధ్వంసం కలిగిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర జమ్మూ, బిహార్, ఉత్తరాఖండ్, పశ్చిమ గుజరాత్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవులు జోన్ - V లో ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీ 4వ జోన్ పరిధిలో ఉంది.
* భారత భౌగోళిక ప్రాదేశిక ప్రాంతంలో భూకంపాల వల్ల సుమారు 59% దుర్బలత్వం సంభవిస్తుంది.
ఉదా: 1) 2001, జనవరి 26 - గుజరాత్ భుజ్ భూకంపం
         2) 2005, అక్టోబరు 8 - జమ్మూ కశ్మీర్ ఉరి, తంగదర్ భూకంపం
         3) 2011, అక్టోబరు 5 - సిక్కిం భూకంపం
         4) 2015, ఏప్రిల్ 25 - కాఠ్‌మాండూ, బిహార్ భూకంపం
* ప్రాంతీయ భూకంప ప్రమాదాలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ఆగ్నేయ ప్రాంతంలోని చిత్తూరు, కడప, నెల్లూరు, కృష్ణా, గోదావరి మైదానాలు 3వ జోన్‌లోనూ, హైదరాబాద్ నగరం 2వ జోన్‌లోను ఉన్నాయి.

 

భూకంప అధ్యయనాలు - పరిశోధన
* భూకంపాలను సిస్మాలజీ ద్వారా అధ్యయనం చేస్తారు.
* సమాన భూకంప ప్రాంతాలను కలిపే రేఖలను 'ఐసో సిస్మిల్స్' అంటారు.
* అంతర్జాతీయ భూకంప అధ్యయన కేంద్రం - లండన్.
* జాతీయ భూకంప పరిశోధన సమాచార కేంద్రం - న్యూదిల్లీ.
* ఇండో రష్యా భూకంప పరిశోధన కేంద్రం - న్యూదిల్లీ.
* జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ - హైదరాబాద్.
1898లో మొదటి భూకంప అధ్యయన కేంద్రాన్ని కోల్‌కతాలో ఏర్పాటు చేశారు.
* రూర్కీ (ఉత్తర్ ప్రదేశ్)లోని కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ భూకంపం వచ్చినప్పుడు తట్టుకునే భవన నిర్మాణ ప్రణాళికలను రూపొందించింది.

 

భూపాతాలు
* వాలుగా ఉండే నిర్మాణ ప్రదేశాల్లో ప్రకృతి కారకాల వల్ల కొంత భాగం విడివడి బయటకు కొట్టుకుని పోయి క్రమక్షయం చెందడాన్ని 'భూపాతం' అంటారు. వీటినే కొండ చరియలు విరిగి పడటం లేదా పదార్థ నాశనం అంటారు. ఇటీవల 2018 ఆగస్టులో కేరళలో అధిక వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి.
* ఇవి ఎక్కువగా పర్వత వాలు ప్రదేశాలు, నదీ వక్రతల ప్రాంతాలు, అధిక వర్షం కురిసే కొండ ప్రాంతాల్లో సంభవిస్తాయి. అందుకే ఇలాంటి ప్రదేశాల్లో గృహ నిర్మాణం 'పిరమిడ్' ఆకారంలో ఉండటం వల్ల భూపాతాల నుంచి రక్షణ పొందవచ్చు.
భారతదేశంలో వీటి వల్ల 15 శాతం దుర్బలత్వం ఏర్పడుతుంది. ఉత్తర భారతదేశంలోని హిమాలయాలు 7 పొరల అవక్షేప శిలలతో ఏర్పడి ఉన్న కారణంగా ప్రపంచ భూపాతాల్లో అధికంగా 30 శాతం ఇక్కడే సంభవిస్తున్నాయి.
ఉదా: 2013, జూన్ 16, 17 తేదీల్లో ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ప్రాంతంలో కొండచరియలు ఎక్కువగా విరిగిపడ్డాయి.
* దక్షిణ భారతదేశంలోని నీలగిరి కొండల్లో అధిక వర్షం, అడవులను నరికివేయడం వల్ల ఎక్కువగా భూపాతాలు ఏర్పడుతున్నాయి.
* భూపాతాలను 'లాండ్‌స్త్లెడ్ జోనేషన్ మ్యాపింగ్ పద్ధతి' ద్వారా ముందే గుర్తిస్తారు. 2004 నుంచి భూపాతాలకు నోడల్ ఏజెన్సీగా జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్‌కతా బాధ్యత వహిస్తుంది.

 

హిమపాతాలు:
* వీటినే మంచుకొండలు విరిగి పడటం అంటారు. ఇవి ఎక్కువగా అతి శీతల, ఎత్తయిన ప్రాంతాల్లో భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల పర్వతం పైభాగం నుంచి కిందికి జాలువారుతూ తీవ్రమైన ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగిస్తాయి.
* ఈ రకమైన మంచు లేదా హిమపాతాలు సాధారణంగా ద్రాస్, ఫెర్ పంజాల్, స్పిటి, లేహ్, బద్రీనాథ్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
* హిమాలయ ప్రాదేశిక ప్రాంతంలో ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌లోని చంబా, కులు, స్పిటి, కిన్నార్; ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ, చమోలీ ప్రాంతాల్లో హిమపాతాలు సంభవిస్తాయి.

 

ఉరుములు, మెరుపులు:
మేఘాలు ప్రయాణించేటప్పుడు గాలిలోని కణాలతో ఘర్షణ వల్ల ఆవేశపూరితం అవుతాయి. ఒక ఆవేశపూరిత మేఘానికి దగ్గరగా మరో మేఘం వచ్చినప్పుడు అది రెండో మేఘంపై వ్యతిరేక ఆవేశాన్ని ప్రేరేపిస్తుంది. అందువల్ల ధన, రుణ ఆవేశాల మధ్య ఉత్సర్గం (discharge) జరిగి పెద్ద ఎత్తున వెలుగు చారికలు/ రేఖలతో పాటు ధ్వని ఉత్పత్తి అవుతుంది. వీటినే మెరుపులు, ఉరుములు అంటారు. ఈ ప్రక్రియను 'విద్యుత్ ఉత్సర్గం' అంటారు. ఇది రెండు లేదా అంతకంటే ఎక్కువ మేఘాల మధ్య జరుగుతుంది. ఇవి ఎక్కువగా వర్షం వచ్చే ముందు వస్తాయి. వీటిని 'లైట్నింగ్ డిటెక్టర్ల' ద్వారా 90 శాతం కచ్చితత్వంతో కనిపెట్టవచ్చు. దీని ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని పుణెలో ఉంది. లైట్నింగ్ డిటెక్టర్లను ఫిన్‌లాండ్ తయారు చేస్తుంది. పిడుగులు/ మెరుపుల నుంచి పెద్ద భవనాలను, కట్టడాలను రక్షించడానికి 'తటి ద్వాహకం' (Lightning) లను ఉపయోగిస్తారు.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆవరణ వ్యవస్థ - పర్యావరణ క్షీణత

1. మేఘమథనం లేదా కృత్రిమ వర్షం కురిపించడానికి వాడే మిశ్రమాలు
    1) డ్రై ఐస్     2) సిల్వర్ అయోడైడ్     3) సాల్ట్ పౌడర్     4) అన్నీ
జ: 4 (అన్నీ)


2. జీవావరణం అత్యధికంగా ఉండే ఆవరణం?
జ: జలావరణం


3. కిందివాటిలో సరైంది.
    a) ఎన్విరాన్ అనే పదం ఫ్రెంచ్ భాష నుంచి వచ్చింది.
    b) ఎన్విరాన్ అంటే చుట్టూ జీవులతో కూడిన ప్రాంతం అని అర్థం.
జ: a, b సరైనవి


4. ఇకాలజీ అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించిన శాస్త్రవేత్త?
జ: హెకెల్


5. కిందివాటిలో స్వయం పోషకాలు?
    1) వినియోగదారులు     2) విచ్ఛిన్నకారులు    3) ఉత్పత్తిదారులు     4) ఏదీకాదు
జ: 3 (ఉత్పత్తిదారులు)


6. పత్రాలు, పుస్తకాలు పసుపు రంగులోకి మారడానికి కారణం?
జ: సల్ఫర్ డై ఆక్సైడ్


7. జీవావరణ పిరమిడ్‌ను తయారుచేసిన శాస్త్రవేత్త
జ: చార్లెస్ హెల్టన్


8. అతినీలలోహిత కిరణాల నుంచి రక్షించే ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉంది?
జ: స్ట్రాటో ఆవరణం


గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడటానికి కారణం? (పోలీస్ కానిస్టేబుల్ 2016, సబ్ ఇన్‌స్పెక్టర్ 2018)
జ: క్లోరోఫ్లోరో కార్బన్లు


2. ఆవరణ వ్యవస్థ ఆహార గొలుసు పిరమిడ్ మొదటి మెట్టులో ఉండేది? (గ్రూప్-1, 2017)
జ: ఉత్పత్తిదారులు


3. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొదట ఉపయోగించినవారు? (ఏఈ, 2015)
జ: ట్రాన్స్‌లే

 

4. కింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి.
    a) అతినీలలోహిత కిరణాలు సూర్యుడి నుంచి భూఉపరితలానికి చేరతాయి.
    b) పరారుణ కిరణాలు భూఉపరితలం నుంచి పరావర్తనం చెందుతాయి.
జ: a, b సరైనవి


5. ఆమ్ల వర్షానికి కారణమయ్యే వాయువు (గ్రూప్-4, 2012; డీఎస్సీ 2017)
జ: సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్

Posted Date : 07-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కాలుష్యం

యావత్తు భూమండలం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కాలుష్యం ఒకటి. మానవ జీవనం ప్రశాంతంగా సాగిపోవడానికి తోడ్పడే ప్రకృతిని దారుణంగా దెబ్బతీస్తున్న కాలుష్యం ఫలితంగా ఎన్నో దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. ప్రధాన జీవాధారాలైన గాలి, నీరు, పర్యావరణం తీవ్రంగా కలుషితం అవుతున్నాయి. ఇందుకు దారితీసిన పరిస్థితులు, అనంతర పరిణామాలపై టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల కోసం అందిస్తున్న అధ్యయన సమాచారం..


భూగోళం నాలుగు ఆవరణాలతో కూడి ఉంది. అవి శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం. ఈ ఆవరణాలన్నింటిని కలిపి పర్యావరణం అంటారు. ఒక జీవి చుట్టూ ఉండే భౌతిక, రసాయనిక, జీవ పరిస్థితులను పర్యావరణం లేదా పరిసరాలు అని చెప్పవచ్చు. ఈ పర్యావరణాన్ని అనేక రకాల కాలుష్యాలు దెబ్బతీస్తున్నాయి.


కాలుష్యం అంటే..?
భౌతిక, థర్మల్, జైవిక, రేడియోధార్మిక ధర్మాల్లో సంభవించే మార్పులు జీవుల ఆరోగ్యం, భద్రతకు హాని కలిగించే విధంగా ఉంటే దాన్ని కాలుష్యంగా పరిగణిస్తారు. ప్రస్తుత సమాజంలో వేగంగా విస్తరిస్తున్న ఆరోగ్య సమస్యలకు కాలుష్యమే ప్రధానమైన కారణం. కాలుష్యానికి గురవుతున్నవారిలో మహిళలు, పిల్లలే ఎక్కువ. 1972 జూన్ 5న స్టాక్‌హోంలో ప్రపంచ పర్యావరణ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ప్రసంగంలో పర్యావరణ ప్రాధాన్యాన్ని వివరించారు. ప్రకృతి, పర్యావరణం గురించి చర్చించిన అధర్వణ వేదంలోని కొన్ని అంశాలను ప్రస్తావించారు. పూర్వీకులు ప్రకృతిని ఆరాధించేవారని.. భూమి, గాలి, నీరు, ఆకాశం, అంతరిక్షం - వీటిలోని సమస్త జీవ జాతులన్నింటిలోనూ శాంతి పరిఢవిల్లాలని ప్రార్థించేవారని తన ప్రసంగంలో పేర్కొన్నారు. పర్యావరణం కలుషితం కాకుండా చూడాలని, ప్రకృతి సమతౌల్యం సాధిస్తేనే భూమండలంపై ఉన్న సమస్త జీవులు సురక్షితంగా ఉండగలుగుతాయని పిలుపునిచ్చారు.


కాలుష్య కారకాలు
జనాభా విస్ఫోటమే అన్ని రకాల కాలుష్యానికి ప్రధాన కారణం. తారు, చెత్త లాంటి వ్యర్థ పదార్థాలు; సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్, అమ్మోనియం, ఫ్లోరిన్, క్లోరిన్, హైడ్రోజన్ లాంటి వాయువులు; ఫ్లోరైడ్ లాంటి రసాయన పదార్థాలు; సీసం, ఇనుము, జింకు, పాదరసం లాంటి మూలకాలు; హెర్బిసైడ్లు, క్రిమిసంహారక మందులు, కృత్రిమ ఎరువులు, రేడియో ధార్మిక పదార్థాలు, శబ్దం, అధిక ఉష్ణం.. ఇవన్నీ కాలుష్య కారకాలే. జనాభా విపరీతంగా పెరగడంతో నీటి వినియోగం కూడా ఎక్కువైంది. ఇది కూడా కాలుష్యానికి కారణమవుతోంది.


జల కాలుష్యం
సమస్త జీవులకు నీరు ప్రాణాధారం. తాగడానికి, పంటలకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు, మానవ నిత్యావసరాలకు నీరు చాలా అవసరం. జల కాలుష్యంతో నీటి స్వభావం మారిపోతోంది. ఉపయోగానికి పనికి రాకుండా పోతోంది. అంతేకాదు దాని ఉపయోగం ప్రమాదకరం కూడా. అన్ని ప్రాంతాల్లో కావాల్సినంత పరిమాణంలో మంచినీరు లభించడం లేదు.


ప్రాణకోటికి ప్రమాదకరమైన అదనపు పదార్థాలు నీటిలో కలవడాన్ని జల కాలుష్యంగా నిర్వచించవచ్చు. ఇది జీవరాశులకు తీవ్రమైన హాని కలిగిస్తుంది. స్వచ్ఛమైన నీటిలో ఆక్సిజన్, హైడ్రోజన్, సేంద్రీయ సమ్మేళనాలు, ఫాస్ఫేట్‌లు, ఒండ్రుమట్టి, సూక్ష్మజీవులు లాంటివి కలిసి ఉంటాయి. కాలుష్యం వల్ల వీటి మధ్య సమతౌల్యం దెబ్బతింటుంది.


జల కాలుష్య కారకాలు
1) మురుగు వ్యర్థ పదార్థాలు
2) అంటు వ్యాధుల ఏజెంట్లు
3) విదేశీ సేంద్రీయ రసాయనాలు
4) రసాయనిక ఖనిజ పదార్థాలు, సమ్మేళనాలు


పర్యావరణ సమస్యలు
పరాన్నజీవులు, సూక్ష్మజీవులను తనలో ఇముడ్చుకుని నీరు కలుషితమవుతుంది. వాస్తవానికి ఎన్నో వ్యాధులు, ఇతర పర్యావరణ ప్రమాదాల కంటే నీటి కాలుష్యమే ప్రధానమైంది. విపరీతంగా పెరుగుతున్న జనాభా, పారిశ్రామికీకరణ వల్ల స్వచ్ఛమైన నీటికి కొరత ఏర్పడుతోంది. కలుషిత నీరు వివిధ రోగాలకు కారణమవుతోంది. భారతదేశంలో 80 శాతం వ్యాధులు జల కాలుష్యం వల్ల సంభవిస్తున్నాయి.


నీటి కాలుష్య దుష్ఫలితాలు
* కలరా, టైఫాయిడ్, విరోచనాలు లాంటి వ్యాధులు సంక్రమించడం.
* జలచరాలు.. ముఖ్యంగా చేపలు చనిపోవడం. దాంతో జల ఆహార నిల్వలు తగ్గిపోవడం.
* నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉన్న సందర్భాల్లో దంతాలపై ఉండే ఎనామిల్ ఊడిపోవడం, గారకట్టడంతోపాటు ఎముకలు దెబ్బతినడం.
* నైట్రేట్‌లు ఎక్కువగా ఉంటే చిన్నపిల్లల రక్తం నీలిరంగులోకి మారి ఒక రకమైన వ్యాధి బారిన పడటం.
* నీటిలో ఫాస్ఫేట్‌లు ఎక్కువై జలచరాలు చనిపోవడం.
* నీటిలో కొన్నిరకాల విష రసాయనాల ప్రమాణం ఎక్కువైన సందర్భాల్లో పిల్లలు కురూపులు, వికలాంగులుగా జన్మించడం.


నివారణ చర్యలు
* పారిశ్రామిక మురుగులో సేంద్రీయ పదార్థాలైన కర్బనం, నత్రజని, గంధకం, సీసం, పాదరసం లాంటి రసాయనాలు ఉంటాయి. ఈ మురుగు సహజ నీటివనరుల్లో కలిస్తే అవి కలుషితం అవుతాయి.
* పరిశ్రమలు విడుదల చేసే మురుగును శుద్ధిచేసే బాధ్యతను ఆయా పారిశ్రామిక యాజమాన్యాలే నిర్వహించి, మురుగు శుద్ధి కర్మాగారాలను నెలకొల్పాలి.
* ఇళ్లలోని మురుగుకోసం ఆక్సిడేషన్ సాండ్స్, సెప్టిక్ ట్యాంకులను ప్రతి ఇంటిలో నిర్మించుకోవాలి. మురుగునీటిని శుద్ధి చేయకుండా వదలడం శిక్షార్హమైన నేరం.
* కాలుష్య నియంత్రణ పట్ల ప్రజల్లో అవగాహన కలిగించాలి.
* కాలుష్య నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలి.


ధ్వని కాలుష్యం
మనం వినగలిగే శబ్దాల మోతాదుకు మించి వినే శబ్దాన్నే ధ్వని కాలుష్యం అనవచ్చు. వాహనాలు, పరిశ్రమలు, లౌడ్ స్పీకర్లు వంటివి ధ్వని కాలుష్య కారకాలు.
బహిరంగ ప్రదేశాల్లో ఉదయం 50 డెసిబుల్స్‌కి మించని ధ్వని ఆరోగ్యకరమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నివేదికలు తెలుపుతున్నాయి. పర్యావరణ నిపుణులు ధ్వని కాలుష్యం సుమారు 70 డెసిబుల్స్ స్థాయిని మించి ఉండరాదని చెబుతున్నారు. వివిధ పట్టణాలు, నగరాల్లో రద్దీ సమయాల్లో ప్రధాన రహదారుల్లో ధ్వని కాలుష్యం 90 నుంచి 110 డెసిబుల్స్ వరకు ఉంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాలు, పరిమితుల ప్రకారం.. ధ్వని తీవ్రత పారిశ్రామిక వాడల్లో రాత్రి 65 డెసిబుల్స్, పగలు 75 డెసిబుల్స్; నివాస ప్రాంతాల్లో రాత్రి 45 డెసిబుల్స్, పగలు 55 డెసిబుల్స్; ఆస్పత్రుల వద్ద రాత్రి 45 డెసిబుల్స్, పగలు 50 డెసిబుల్స్ మించి ఉండకూడదు.
* రైల్వేలు, పరిశ్రమలు, నిర్మాణ రంగ కార్యకలాపాలు, ప్రజా సమూహాలు, లౌడ్ స్పీకర్‌లు.. ఇవన్నీ ధ్వనిని వ్యాప్తి చేస్తాయి. ధ్వని ఎక్కువగా ఉన్నప్పుడు పర్యావరణంలో అసమతౌల్యం ఏర్పడుతుంది. ఇలా నిరంతర ధ్వని కాలుష్య ప్రభావం వల్ల శ్రామిక సామర్థ్యం, వారి వృత్తిపరమైన పనితీరు క్షీణిస్తుంది.


ధ్వని కాలుష్య సమస్యలు
* నిద్రలేమి
* తొందరగా అలసిపోవడం
* వికారం, అధిక రక్తపోటు
* అల్సర్లు, రక్తహీనత, నరాలపై తీవ్ర ప్రభావం
* తలనొప్పి, శ్వాస సంబంధ వ్యాధులు, వినికిడి సమస్యలు
* మెదడు, నాడీ వ్యవస్థ క్రమంగా దెబ్బతిని, చికాకు పెరగడం.


వాయు కాలుష్యం
వాతావరణంలో వాయువులు సాధారణ నిష్పత్తిలో ఉన్నంత వరకు కాలుష్యం ఉండదు. కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సైడ్, ధూళి కణాలు, పొగ, పొగమంచు లాంటివి గాలిలో అధికంగా చేరడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది.


వాయు కాలుష్య కారణాలు
* నిబంధనలను పాటించని వ్యవసాయ కార్యకలాపాలు
* పదార్థాల దహనం
* యంత్రాల సహాయంతో జరిగే ఉత్పత్తి ప్రక్రియలు
* ద్రావణాల ఉపయోగం
* అణుధార్మిక పదార్థాల వినియోగం


దుష్ప్రభావాలు
వాయు కాలుష్యం మానవుడి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇది శ్వాస, రక్త ప్రసరణ వ్యవస్థల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
* కార్బన్ మోనాక్సైడ్ రక్తంలోని హిమోగ్లోబిన్‌తో కలిసిపోయి శరీరానికి తగినంత ఆక్సిజన్ అందకుండా చేస్తుంది.
* సల్ఫర్ డై ఆక్సైడ్ ఊపిరితిత్తులపై ప్రభావాన్ని చూపుతుంది. ఆస్తమాకు కారణమవుతూ, మరణాల రేటును పెంచుతుంది.
* నైట్రోజన్ డై ఆక్సైడ్ - బ్రాంకైటీస్, ఆస్తామా వ్యాధులను కలిగిస్తుంది.
* గాలిలో అధిక పరిమాణంలో ఉన్న సీసం ఎముకలు, కాలేయం, గుండె, మూత్రపిండాల పనితీరుపై చెడుప్రభావాన్ని చూపుతుంది.
* శిలాజ ఇంధనం అధికంగా వాడటం వల్ల గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ శాతం పెరిగి హరితగృహ ప్రభావానికి దారితీస్తుంది.


నివారణ చర్యలు
* వాయు కాలుష్యాన్ని నివారించేందుకు బ్యాగ్ ఫిల్టర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెస్పిటేటర్స్ లాంటి నియంత్రణ పరికరాలను ఉపయోగించాలి.


రేడియో ధార్మిక కాలుష్యం
రేడియేషన్‌కు గురికావడం ప్రకృతి సహజమే అయినా అణువిద్యుత్తు, అణ్వస్త్రాల ఉత్పత్తి భారీస్థాయిలో చేపట్టడం వల్ల మానవులు భారీ పరిమాణంలో రేడియేషన్‌కు గురవుతున్నారు. ఆయా సంస్థలు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ప్రత్యక్షంగా రేడియో ధార్మికతకు గురవుతున్నారు. ఫలితంగా క్యాన్సర్, జన్యు సంబంధ వ్యాధులబారిన పడుతున్నారు. పిల్లలు అనారోగ్యంతో జన్మిస్తున్నారు.


ముఖ్యాంశాలు
* ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతున్న ప్రధాన సమస్యల్లో పర్యావరణ కాలుష్యం ఒకటి.
* ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో తేలిందేమిటంటే.. ఒక్క భారతదేశంలోని ఆరు ప్రధాన నగరాల్లోనే ఏటా సుమారు 40-50 వేల మంది కాలుష్యం వల్ల చనిపోతున్నారు.
* భారతదేశంలోని సహజ నీటి వనరుల్లో సుమారు 80 శాతం నీరు కలుషితమై.. మనుషులు, జంతువులు, పశుపక్ష్యాదులకు కూడా తాగడానికి పనికిరావడం లేదని ఇటీవల ఒక సర్వేలో తేలింది.
* తెలంగాణలో గోదావరి నదీతీరం వెంబడి ఉన్న సిర్‌పూర్‌లో కాగితపు వ్యర్థాలు, అక్కడి ప్రజలు గోదావరిలోకి వదిలే కాలుష్యాలు ఏటూరునాగారం ప్రజలపై ప్రభావం చూపిస్తాయి. ఈ రెండు ప్రాంతాల కలుషితాల ప్రభావం భద్రాచలం మీద ఉంటుంది.
* ప్రపంచం మొత్తం వాతావరణ కాలుష్యంలో సగానికి పైగా కాలుష్యానికి ఒక్క అమెరికాయే కారణమవుతోంది.


అత్యంత కలుషితమై'నది' గంగా
భారతదేశంలోని గంగానది సుమారు 1760 కి.మీ.ల మేర కలుషితమై ప్రపంచంలో అత్యంత పొడమైన కలుషిత నదిగా మారడంతో.. ఈ పరిస్థితిని నివారించేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం రూ. 10 వేల కోట్లను కేటాయించింది. 'గంగానది ప్రక్షాళన' పేరుతో కేంద్ర జలవనరుల సంఘం నివారణ చర్యలు చేపడుతోంది. దీనికి ప్రధాన కారణం.. దేశ విస్తీర్ణంలో గంగానది పరివాహక ప్రాంతం 8.61 లక్షల చదరపు కిలోమీటర్లు (1/4వ వంతు) ఉండి.. 45 కోట్ల మంది ప్రజలు జీవిస్తుండటమే.

Posted Date : 08-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప‌ర్యావ‌ర‌ణ సంక్షోభం

* పరిరక్షణ అత్యవసరం
* మూడోవంతు అడవులతో ముప్పు నివారణ

జనాభా పెరుగుదల.. పెరుగుతున్న అవసరాలు.. మానవ తప్పిదాలు.. తదితర అంశాల నేపథ్యంలో పర్యావరణం విధ్వంసానికి గురవుతోంది. ఓజోన్ పొర ఛిద్రమవుతోంది.. భూమి వేడెక్కిపోతోంది.. అడవులు నాశనమై పోతున్నాయి.. కాలుష్యం పెరిగిపోతోంది.. ఇవన్నీ పర్యావరణాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. మానవాళిని భయంకర విపత్తుల్లోకి తీసుకెళుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పర్యావరణానికి ఎన్నటికీ పూడ్చలేని నష్టం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలా పర్యావరణం దెబ్బతినడానికి కారణాలేమిటి? ఎలాంటి దుష్ఫలితాలుంటాయి? నివారణ చర్యలేమిటి? తెలుసుకుందామా!
జీవావరణ వ్యవస్థలోని జనాభా పెరుగుదల వల్ల పర్యావరణ సమస్యలు ఏర్పడుతున్నాయి. జనాభా పెరిగే కొద్దీ మానవ నివాసానికి; వ్యవసాయ భూమి, వంటచెరకు కోసం అడవులను, పచ్చిక బయళ్లను నాశనం చేస్తుండటం వల్ల భూమి మృత్తికలు, వాటిలోని సారం కొట్టుకుపోతున్నాయి. సాగుచేయడం ద్వారా మిగిలే వ్యర్థ, ఘన, ద్రవ పదార్థాలు.. అనాగరిక పారిశుద్ధ్య అలవాట్ల వల్ల పర్యావరణ సంక్షోభం ఏర్పడుతోంది. ఈ వ్యర్థాలను తగిన విధంగా నియంత్రించకపోవడంతో శిలావరణ, జల, వాయు సంక్షోభానికి దారి తీస్తోంది. కొన్ని వ్యవసాయ విధానాలతోపాటు పురుగుమందులు, రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల భూమి రసాయన, జైవిక సంక్షోభానికి గురవుతోంది.


ఓజోన్ పొర (O3)
ఓజోన్ పొరలో రంధ్రాలు లేదా ఛిద్రాలు ఏర్పడటం వల్ల పర్యావరణం దెబ్బతింటోంది. భూగోళాన్ని ఆవరించి ఉన్న వాతావరణాన్ని 5 పొరలుగా విభజించారు. వీటిని రెండు భాగాలుగా వర్గీకరించవచ్చు. అవి..


జలహారం: ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమమే జలహారం. దీన్నే 'వాటర్ గ్రిడ్' పథకం అంటారు. ఈ పథకం కింద గ్రామాల్లో ప్రతి వ్యక్తికి 100 లీటర్లు, పట్టణాల్లో 130 లీటర్ల చొప్పున నీటిని అందించాలనేది లక్ష్యం. దీన్ని మొదట నల్గొండ జిల్లా చౌటుప్పల్ వద్ద ఏర్పాటు చేశారు. దీనికి జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక 'హడ్కో అవార్డు' లభించింది.


ఎ. సమరూప ఆవరణాలు: ఇందులో ట్రోపో, స్ట్రాటో, మీసో ఆవరణాలు 90 కి.మీ.ల లోపు ఉండి సమాన నిష్పత్తులు, ధర్మాలు ఉన్నందున వీటిని సమరూప ఆవరణాలు అంటారు.


బి. బహురూప ఆవరణాలు: ఇందులో థర్మో, ఎక్సో ఆవరణాలు 90 కి.మీ.ల పైన వేర్వేరు నిష్పత్తుల్లో ఉన్నందున వీటిని బహురూప ఆవరణాలు అంటారు.
భూఉపరితలంపై 18-50 కి.మీ.ల వరకు ఉన్న ఆవరణాన్ని స్ట్రాటో ఆవరణం అంటారు. ఈ ఆవరణంలో 25-40 కి.మీ.ల మధ్య ఒక దట్టమైన పొర ఉంటుంది. దీన్నే ఓజోన్ పొర అంటారు. ఆక్సిజన్‌కు మరో రూపమే ఓజోన్. ఆక్సిజన్‌లోని ఒక కణంలో రెండు అణువులుంటే, ఓజోన్‌లో మూడు అణువులు ఉంటాయి. ఈ ఓజోన్ వాయువు పొర సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను అడ్డగించి, భూమికి చేరకుండా నిరోధిస్తుంది. ఫలితంగా ఆ కిరణాలు భయంకర వినాశకర విపత్తు నుంచి మానవాళిని రక్షిస్తాయి.


దుష్ఫలితాలు
అతినీలలోహిత కిరణాలు అధిక సంఖ్యలో భూమిని చేరితే కలిగే దుష్ఫలితాలు..
* జీవరాశుల చర్మం చిట్లిపోయి, జీవకణాలు సర్వనాశనం అవుతాయి.
* చర్మ సంబంధ క్యాన్సర్, కంటి వ్యాధులు, రోగనిరోధక శక్తి కోల్పోవడం లాంటి రుగ్మతలకు దారితీస్తుంది.
* మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియను మందగింపజేస్తుంది. తేలిగ్గా తెగుళ్లకు గురవుతాయి.
* ఈ కిరణాలు సముద్ర జలాల్లోని జీవరాశులకు కూడా హాని కలిగిస్తాయి.


మానవుడే కారణం
ఓజోన్ పొర విధ్వంసానికి మానవుడే ప్రధాన కారణం. ఈ విధ్వంసంలో 'క్లోరో ఫ్లోరో కార్బన్లు' ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటినే 'క్లోఫోకాలు' (ఈ ఒక కణం క్లోరిన్, ఫ్లోరిన్, కర్బనాల మిశ్రమం) అంటున్నారు. వీటితోపాటు బ్రోమిన్ కూడా ప్రమాదకారిగా మారింది. దీన్ని అగ్నిమాపక పరికరాల్లో ఉపయోగిస్తున్నారు.
పంటలపై చల్లే స్ప్రేలు, రిఫ్రిజిరేటర్లు, ప్లాస్టిక్, ఫోమ్, డిటర్జెంట్ల ఉత్పత్తుల తయారీ వల్ల వాతావరణంలో క్లోఫోకాలు ప్రతి సంవత్సరం ఒక మిలియన్ టన్నుకంటే ఎక్కువగా విడుదల అవుతున్నాయి. దీనివల్ల ఏటా లక్ష మందికి పైగా చర్మ క్యాన్సర్‌తో మరణిస్తున్నారు.


85 శాతం ధ్వంసం
ఓజోన్ పొర మందం సన్నగిల్లుతున్నట్లు శాస్త్రవేత్తలు 1980 దశాబ్దంలోనే గమనించారు. ఆర్కిటిక్ ప్రాంతంపై ఉండే ఓజోన్ పొర 85 శాతం పైగా ధ్వంసమైందని తాజా పరిశీలనల్లో తేలింది. దీని ప్రభావం వల్ల ఉత్తర యూరప్ ప్రాంతంలో చర్మ క్యాన్సర్ పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో ఓజోన్ పొర ప్రస్తుతం 14 మిలియన్ చదరపు మైళ్ల మేర ఛిద్రమైందని ఓజోన్ పొరపై పరిశోధన చేసిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం తెలిపింది.


నివారణ : ఓజోన్ పొర నివారణలో భాగంగా ప్రపంచ దేశాలన్నీ ఒకేతాటిపైకి రావాలి. ఏరోసాల్ ప్రొపల్లెంట్లు, ప్లాస్టిక్ ఫోమ్స్, రిఫ్రిజిరేటర్లలో వాడే సింథటిక్ రసాయనాలను తగ్గించి ప్రత్యామ్నాయాల వైపు ప్రయాణించాలి. ఇందులో భాగంగా ఈ ప్రమాద తీవ్రతను, వాటి దుష్ఫలితాలను గుర్తించి అమెరికా, జపాన్ లాంటి దేశాలు 'క్లోఫోకాలకు' ప్రత్యామ్నాయ రసాయనాలను తయారు చేస్తున్నాయి. అయితే ఇవి చాలా ఖరీదైనవి. పేద, బడుగు, అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా తయారు చేసుకోగలిగినప్పుడు పూర్తిగా క్లోఫోకాలను నిషేధించవచ్చు.
* ఇటీవల వోక్స్‌వ్యాగన్ కంపెనీ తయరుచేసిన కార్లలో పర్యావరణ సంక్షోభానికి దారితీసే వాయువులు ఉన్నట్లు తేలినందున అమెరికా ఆ కంపెనీపై ఆంక్షలు విధించింది.


భూతాపం (గ్లోబల్ వార్మింగ్)
భూగోళం వేడెక్కడాన్ని 'భూతాపం' అంటారు. ఇలా భూమిపై ఉష్ణోగ్రత పెరగడానికి గ్రీన్‌హౌస్ వాయువులు కారణమవుతున్నాయి. కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, క్లోఫోకాలు, ఓజోన్, నైట్రస్ ఆక్సైడ్ లాంటి వాయువులను 'గ్రీన్‌హౌస్' వాయువులు అంటారు. ఇలా భూమిని చేరిన సూర్యరశ్మి ఉపరితలం నుంచి పై పొరల్లోకి వెళ్లకుండా ఈ వాయువులు అడ్డగించడం వల్ల భూమి ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. ఈ గ్రీన్‌హౌస్ ప్రభావానికి సగానికి పైగా కార్బన్ డై ఆక్సైడ్ (CO2) కారణం. ముఖ్యంగా పశ్చిమ పారిశ్రామిక దేశాలే ఈ వాయువుల పెరుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.


దుష్ఫలితాలు : గ్రీన్‌హౌస్ ప్రభావంతో భూమండలం వేడెక్కుతోంది. దీనివల్ల జీవావరణం తీవ్ర దుష్ఫలితాలకు లోనవుతోంది.
* ప్రాథమికంగా భూమిలో తేమ తరిగిపోయి ఆహారోత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల వ్యవసాయ సంక్షోభం తలెత్తుతుంది.
* సముద్ర జలాలు బాగా వ్యాకోచిస్తాయి. వీటివల్ల సముద్ర మట్టం పెరిగి, తీరప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ప్రజలు నిర్వాసితులు అవుతున్నారు.
* ధ్రువ ప్రాంతాల్లోని మంచు కరగడం ప్రారంభిస్తే జల ప్రళయమే వచ్చి ప్రపంచంలో అనేక ప్రాంతాలు, దీవులు ముంపునకు గురై కొట్టుకుపోతాయి.
ఉదా: అంటార్కిటికా ఖండంలోని మంచు కరిగిపోతే సముద్ర నీటిమట్టం 55 మీటర్ల వరకు పెరుగుతుందని అంటార్కిటికా పరిశోధన సంస్థ అధ్యయనంలో తేలింది. మన దేశంలో అంటార్కిటికా పరిశోధన కేంద్రం గోవాలో ఉంది. దీనివల్ల హిందూ మహాసముద్రంలోని 'మాల్దీవులు' మునిగిపోయే ప్రమాదం ఉంది.


నివారణ చర్యలు : శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం భూమి వేడెక్కడం మానవుడు ఎదుర్కొంటున్న భయంకర విపత్తుల్లో ముఖ్యమైంది.
* ప్రపంచ దేశాలన్నీ ముందుగా అడవులను పరిరక్షించాలి. ముఖ్యంగా దక్షిణ అమెరికా, ఆఫ్రికాల్లో జరుగుతున్న వన నిర్మూలనను వెంటనే ఆపాలి.
* అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ బీడు భూముల్లో వనీకరణ చేపట్టాలి. భారతదేశంలో సుమారు 12 లక్షల ఎకరాల భూమి వ్యర్థంగా ఉన్నట్లు అంచనా వేశారు. ఇలాంటి చోట్ల వనీకరణ జరగాలి.
* విద్యుదుత్పాదనకు బొగ్గు, సహజవాయువుల వాడకాన్ని తగ్గించాలి. వాటి స్థానంలో ఇతర మార్గాలను అన్వేషించాలి. సౌరశక్తి, అలల కదలిక, గాలి ప్రసరణ లాంటి మార్గాల్లో విద్యుదుత్పాదనను భారీ ఎత్తున చేపట్టాలి. ఉదాహరణకు.. మన దేశంలో పశ్చిమ్‌బంగ - టైడల్ శక్తి; ఉత్తర్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, రాజస్థాన్ - సౌరశక్తి; తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ - పవన శక్తి; తమిళనాడు, కేరళ - అలల శక్తి ద్వారా విద్యుదుత్పాదనలో ముందున్నాయి.
* రోడ్డు, రైలు మార్గాలకు ప్రత్యామ్నాయంగా జల మార్గ రవాణాను ప్రోత్సహించాలి.
* ఎయిర్ కండిషనింగ్, కార్లు లాంటి నిత్యావసరాలు కాని ఉపకరణాల వినియోగాన్ని తగ్గించాలి.


జనాభా పెరుగుదల, నగరీకరణ
క్రీ.పూ. 8 వేల సంవత్సరాల కిందటే వ్యవసాయం ప్రారంభమైందని అంచనా. అప్పట్లో ప్రపంచ జనాభా కేవలం 40 లక్షలు ఉంటే అది క్రీ.శ.1750 నాటికి 50 కోట్లు. ప్రస్తుతం ప్రపంచ జనాభా 732 కోట్లకు చేరింది. ఇలా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నివాస, రవాణా, ఆరోగ్యం, ఆహారం తదితర సదుపాయాలను ప్రభుత్వాలు కల్పించాల్సి ఉంటుంది. వీటి కోసం భారీ పరిశ్రమలను స్థాపించాలి. ఫలితంగా ఆయా పరిశ్రమలు విడుదల చేసే వ్యర్థాల వల్ల కాలుష్యం పెరుగుతోంది. రెండో ప్రపంచ యుద్ధానంతరం రసాయన ప్రగతి కూడా విపరీతంగా పెరిగింది. దీంతో మూడో ప్రపంచ దేశాల్లో సాంప్రదాయిక సహజ వనరుల స్థానంలో కృత్రిమ పదార్థాల వినియోగం ఎక్కువైంది. ఇటీవల పత్తి, ఉన్ని, పట్టుకు బదులు నైలాన్, సింథటిక్ పదార్థాలు; కలపకు బదులు అల్యూమినియం; పొలాల్లో సేంద్రియ ఎరువులకు బదులు రసాయనిక ఎరువుల వినియోగం ఎక్కువ కావడం వల్ల పర్యావరణం సంక్షోభానికి గురైంది.
జనాభా పెరుగుతున్న కొద్దీ నివాసాలకు, వ్యవసాయ వినియోగం కోసం అడవులను నిర్మూలిస్తున్నారు. ఇలా జనాభా అవసరాల కోసం అడవులను నరికి వేయడంతో వన్యమృగాలు కూడా అంతరించి పోతున్నాయి. వాతావరణ తరంగాల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల గాలిలో తిరిగే పక్షి సంతతి అంతరించి పోయింది. ఫలితంగా ప్రకృతిలో సమతౌల్యత దెబ్బతిని పర్యావరణం, పరిసరాలు కలుషితమవుతున్నాయి.


దుష్ఫలితాలు
'మనం' వనరుల సంక్షోభంలో ఉన్నాం.. ఎందుకంటే వైద్య సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపడటం వల్ల భూమ్మీద జనాభా భారం అధికమవుతోంది.. ఇలా అధిక జనాభా వల్ల, పదార్థాలను వృథా చేయడంతో పర్యావరణానికి ఎన్నటికీ పూడ్చలేని నష్టం పెరిగిపోయే గండం వస్తుందని హైస్టన్ క్లేడ్ అనే భూవిజ్ఞాన శాస్త్రవేత్త పేర్కొన్నారు.
* 1900 సంవత్సరం నాటికి ప్రపంచం మొత్తం మీద 700 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న అడవులు 1975 నాటికి 290 కోట్ల హెక్టార్లకు పరిమితమైపోయాయి. 2010 నాటికి అవి మూడోవంతు అంతరించి పోతాయని ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థలు హెచ్చరించాయి.
* ప్రపంచ జనాభాలో ప్రస్తుతం 17.7% భారతదేశంలో ఉంటే, ప్రపంచ అడవుల విస్తీర్ణంలో సుమారు ఒక శాతం మాత్రమే భారతదేశంలో ఉన్నాయి. ఇలా దేశంలో సగటున 15 లక్షల హెక్టార్లలో ప్రతి సంవత్సరం అటవీ ప్రాంతం అంతరిస్తోంది.


నివారణ చర్యలు
* ప్రకృతిలో పర్యావరణ సమతౌల్యతను కాపాడటానికి.. మొత్తం భూవిస్తీర్ణంలో మూడో వంతు అడవులు ఉండి తీరాలని తీర్మానం చేసుకున్నాం. ఇవి పర్వత, కొండచరియల్లో 60 శాతం, మైదాన ప్రాంతంలో 20 శాతం ఇతర ప్రాంతాల్లో మిగిలిన శాతం అడవులు ఉండాలని భారతదేశం 1952లో తీర్మానం చేసింది. ఈ ప్రకారం అడవుల పెంపకం, పరిరక్షణ దిశగా చర్యలు చేపట్టాలి.
* అడవులు తగ్గుతున్న కొద్దీ ప్రకృతిలో సమతౌల్యత దెబ్బతింటుంది. అందువల్ల మానవుడి దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతం ఉన్న అడవులను పరిరక్షించడంతో పాటు కొత్త ప్రాంతాల్లో వన సమీకరణ చేపట్టాలి.
* జనాభా పెరుగుదలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అక్షరాస్యత శాతాన్ని పెంచి, స్త్రీ విద్యను నిర్బంధం చేయడం ద్వారా అధిక జనాభా సమస్యను నివారించవచ్చు.


నగరాలు, పట్టణాల్లో కాలుష్యం
21వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో పరిశ్రమలు, వాహనాల రద్దీ, జనసాంద్రత భారీగా పెరిగింది. దీనికి తగ్గట్టే కాలుష్యం కూడా పెరిగింది. వాతావరణంలో ఆక్సిజన్ స్థాయి తగ్గి, విషవాయువుల పరిమాణం పెరగడంతో ప్రజారోగ్యం దెబ్బతింటోంది.
ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లో తక్షణమే పరిష్కరించాల్సిన సమస్యల్లో జల, వాయు, ధ్వని కాలుష్యాలతోపాటు పరిసరాల కాలుష్యం కూడా ప్రధానమైంది.
పట్టణాల్లో ఇళ్లతోపాటు, మార్కెట్లు, హోటళ్లు, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు కూడా తీవ్ర కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయి. వీటిని చాలా దూర ప్రాంతాలకు తరలించి శుద్ధి చేయాలి.


దుష్ఫలితాలు
* పట్టణాల్లో మురుగు నీటిపారుదల సౌకర్యాలు, మలమూత్ర విసర్జనకు సదుపాయాలు లేనందున.. వర్షాకాలంలో చెత్తాచెదారాలు, మురుగుతో మంచినీరు కలుషితం అవుతోంది. రోగకారక క్రిములు పెరుగుతున్నాయి.
* ఈగలు, దోమలు వ్యాప్తి చెందడం వల్ల అనేక అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి.
* మురికి గుంటలు దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయి. మలేరియా, మెదడువాపు, బోదకాలు లాంటి వ్యాధుల వ్యాప్తికి ఇవి కారణమవుతున్నాయి.


నివారణ చర్యలు
* రసాయన ఎరువులు, క్రిమిసంహారకాల వాడకం తగ్గించడం ద్వారా పర్యావరణ పరిస్థితులను మెరుగు పరచవచ్చు.
* పారిశ్రామిక కాలుష్య నివారణ కోసం సైక్లోన్ సెపరేటర్స్, వెన్చూరి స్క్రూబర్స్, స్ప్రేటవర్స్, బ్యాగ్ ఫిల్టర్స్ లాంటి పరికరాలను అమర్చాలి.


పర్యావరణ సంక్షోభానికి కారణమవుతున్న ప్రధాన అంశాలు
* తరుగుతున్న ఓజోన్ పొర మందం
* భూమి వేడెక్కుతున్న ప్రక్రియ
* పరిశ్రమల ద్వారా జరిగే కాలుష్యాలు
* జనాభా విపరీతంగా పెరిగిపోవడం
* 50 సంవత్సరాల వయసున్న ఒక వృక్షం ఏటా ఒక టన్ను ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. 50 టన్నుల నీటిని నిల్వ చేస్తుందని అంచనా. ఈ లెక్కన దాని జీవిత కాలంలో దాదాపు రూ.15 లక్షల లాభాన్ని చేకూరుస్తుంది.


మాదిరి ప్రశ్నలు

1. ఏ కార్ల కంపెనీలో పర్యావరణ క్షీణతకు దారితీసే వాయువులున్నాయనే అంశం ఇటీవల వార్తాల్లోకి వచ్చింది?
ఎ) స్కోడా      బి) వోక్స్‌వ్యాగన్     సి) మారుతి     డి) టాటా
జ: (బి)


2. భారత ప్రభుత్వం జాతీయ అటవీ తీర్మానాన్ని ఏ సంవత్సరంలో చేసింది?
ఎ) 1952    బి) 1953    సి) 1962    డి) 1963
జ: (ఎ)


3. 'బోదకాలు' వ్యాధి దేని వల్ల వ్యాప్తి చెందుతుంది?
ఎ) నీరు      బి) పందులు     సి) దోమలు     డి) గాలి
జ: (సి)


4. కిందివాటిలో సజాతి ఆవరణం కానిది ఏది?
ఎ) ట్రోపో     బి) స్ట్రాటో     సి) మీసో     డి) థర్మో
జ: (డి)


5. కింది ఏ ఆవరణంలో ఓజోన్ పొర ఉంటుంది?
ఎ) స్ట్రాటో      బి) ట్రోపో      సి) మీసో     డి) ఎక్సో
జ: (ఎ)

Posted Date : 05-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ ప‌థ‌కాలు

* కాలుష్య నియంత్రణ చర్యలు
* 'స్వచ్ఛ' కార్యక్రమాల అమలు
* అడవుల పెంపకానికి కార్యాచరణ


కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం నవ సామాజిక, ఆర్థిక నిర్మాణంలో ముందడుగు వేస్తున్న క్రమంలో కొన్ని సామాజిక, ఆర్థిక అడ్డంకులను ఎదుర్కోవడం సహజం. ఆ కోణంలో పరిశీలిస్తే తెలంగాణ ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకుని ఉంది. కాలుష్యాన్ని నివారించే క్రమంలో ప్రభుత్వం రాష్ట్రంలో జలహారం, స్వచ్ఛ తెలంగాణ, హరితహారం, మన ఊరు-మన ప్రణాళిక లాంటి అనేక కార్యక్రమాలను ప్రజలందరి భాగస్వామ్యంలో అమలు చేస్తూ ప్రణాళికలను రూపొందించింది.
మనచుట్టూ ఆవరించి ఉన్న జీవ, నిర్జీవ సమూహాల మొత్తాన్ని పర్యావరణం అంటారు. ఈ పర్యావరణం కాలుష్యం బారిన పడటానికి కారణమయ్యే పరిశ్రమలు అత్యధికంగా హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నాయి. వీటిద్వారా వెలువడే వ్యర్థాల వల్ల పర్యావరణం బాగా కలుషితమవుతోంది. పారిశ్రామిక, రసాయనిక, జీవ వ్యర్థాల వల్ల పర్యావరణం దెబ్బతిని, వరుసగా భూమి, జల, వాయు కాలుష్యాలు ఏర్పడుతున్నాయి. ఇందులో ఎక్కువశాతం భూగర్భజలం కలుషితమవుతోంది. రసాయన, క్రిమి సంహారక, ఔషధ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు దాదాపు 75 శాతం నీటి కాలుష్యానికి కారణమవుతున్నాయని పర్యావరణ పరిశోధన సంస్థ అధ్యయనంలో తేలింది.
మూసీ నదీపరివాహక ప్రాంతాలైన రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో చిన్న కార్ఖానాలు (పరిశ్రమలు) చాలా ఉన్నాయి. వీటి ద్వారా కూడా వ్యర్థ పదార్థాలు ఎక్కువ మోతాదులో విడుదలవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో జనాభా కూడా చాలా ఎక్కువ. దీంతో ఈ కలుషితాల వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాగే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌లోని కలుషిత నీటి వల్ల చుట్టూ ఉండే ప్రజలు తీవ్రమైన పర్యావరణ కాలుష్య ప్రభావానికి గురవుతున్నారు.
పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకే రకంగా లేవు. అత్యధిక పర్యావరణ కాలుష్యానికి గురిచేసే పరిశ్రమలు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా కేంద్రీకృతమై ఉండటం వల్ల అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
2015లో ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సర్వే కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమల వివరాలు, శాతాలను ఇటీవల పేర్కొంది. ఆ వివరాలు..

చట్ట వ్యతిరేకంగా అధిక కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలు రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉన్నాయి. ఇవి ఎక్కువగా రసాయన, జీవ వ్యర్థ పదార్థాలను సమీపంలోని కాలువలు, నదులు, డ్రైనేజీల్లోకి విడుదల చేస్తున్నాయి. దాంతో ఈ జిల్లాల పరిసర ప్రాంతాల్లోని దాదాపు 5 వేల గ్రామాల్లో ధ్వని, వాయు, రేడియోధార్మిక కాలుష్యాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కలుషితమైన భూగర్భ జలాలను వినియోగిస్తున్న ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ రకమైన కలుషిత పదార్థాల వల్ల చర్మ, శ్వాస, గుండె, నేత్ర, ఊపిరితిత్తులు, కాలేయ సంబంధిత వ్యాధులతోపాటు అల్సర్లు, కీళ్లనొప్పులు వంటివాటి బారిన పడుతున్నారు. భయంకరమైన క్యాన్సర్ లాంటి రోగాలకు కూడా గురవుతున్నారు.
రాష్ట్రంలో కాలుష్య నివారణకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఈ దిశగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళుతోంది. ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమాలు..


స్వచ్ఛ తెలంగాణ
భారత ప్రభుత్వం 2014, అక్టోబరు 2న స్వచ్ఛభారత్ అభియాన్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 4,041 పట్టణాల్లో క్లీన్ - స్ట్రీట్, రోడ్ లాంటి కార్యక్రమాలను చేపట్టారు. దీనికంటే ముందు యూపీఏ ప్రభుత్వం రూ.37,159 కోట్లతో గ్రామీణ శానిటేషన్ కోసం 'నిర్మల్ భారత్ అభియాన్' కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్వచ్ఛభారత్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 2015, మే 16న 'స్వచ్ఛ తెలంగాణ - హైదరాబాద్‌'ను ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హైదరాబాద్‌లో ప్రారంభించారు. 'స్వచ్ఛ తెలంగాణ' కార్యక్రమాన్ని ప్రజలందరి భాగస్వామ్యంతో 68 పట్టణాల్లో అమలు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. రాబోయే అయిదేళ్లలో కాలుష్యరహిత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించడానికి దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. బడ్జెట్‌లో రూ. 979 కోట్లు కేటాయించారు.
ఇటీవల కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 'స్వచ్ఛభారత్' కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 476 నగరాలను సర్వే చేయగా మైసూరు (కర్ణాటక) మొదటిస్థానంలో నిలిచింది. రాజధానులవారీగా చేసిన సర్వేలో ప్రథమ స్థానంలో బెంగళూరు, చివరిస్థానంలో పట్నా(బిహార్) ఉన్నాయి. హైదరాబాద్ 275, వరంగల్ 33 స్థానాల్లో ఉన్నాయి.


జలహారం
ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమమే జలహారం. దీన్నే 'వాటర్ గ్రిడ్' పథకం అంటారు. ఈ పథకం కింద గ్రామాల్లో ప్రతి వ్యక్తికి 100 లీటర్లు, పట్టణాల్లో 130 లీటర్ల చొప్పున నీటిని అందించాలనేది లక్ష్యం. దీన్ని మొదట నల్గొండ జిల్లా చౌటుప్పల్ వద్ద ఏర్పాటు చేశారు. దీనికి జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక 'హడ్కో అవార్డు' లభించింది.


మన ఊరు - మన ప్రణాళిక
తెలంగాణలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా 'మన ఊరు - మన ప్రణాళిక' పేరుతో అయిదేళ్లపాటు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రూ. 22,500 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇలా చెరువులను పునరుద్ధరించడం ద్వారా జీవవైవిధ్యాన్ని సమతౌల్యం చేయడానికి వీలవుతుంది. దీనివల్ల చెరువుల పరిసర ప్రాంతాల్లో పచ్చదనం, వివిధ జీవాలను పెంచడం సాధ్యమవుతుంది.


జీవవైవిధ్యం
పర్యావరణాన్ని పెంపొందించడానికి 2002లో రాష్ట్ర అటవీ పథకాన్ని (స్టేట్ ఫారెస్ట్ పాలసీ) తిరిగి ప్రారంభించారు. దీని ప్రకారం విజన్-2020లో వివిధ రకాల అటవీ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఫారెస్ట్ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రాష్ట్రంలో 3 అంచెల పద్ధతిని ప్రవేశపెట్టారు.
1) రాష్ట్ర స్థాయి - స్టేట్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎస్ఎఫ్‌డీఏ)
2) డివిజన్ స్థాయి - ఫారెస్ట్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎఫ్‌డీఏ)
3) గ్రామ స్థాయి - వన సంరక్షణ సమితి (వీఎస్ఎస్)

 

పర్యావరణంపై అవగాహన
నేటి తరానికి పర్యావరణం పట్ల అవగాహన కలిగించడంలో పర్యావరణ పరిరక్షణ సమూహాలు (ఇకో క్లబ్స్) ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. వీటిని దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలు; విద్యాసంస్థల్లో ప్రవేశపెట్టారు. ఇవి చేపట్టే వివిధ పర్యావరణ సానుకూల చర్యల కోసం కేంద్ర పర్యావరణ శాఖ నిధులను మంజూరు చేస్తుంది.


సమూహ కార్యక్రమాలు
* పర్యావరణం కలుషితమైన ప్రదేశాలు, పతనావస్థలో ఉన్న ప్రాంతాలు, వన్యప్రాణులున్న జంతు ప్రదర్శన శాలలను దర్శించడం.
* వివిధ సంస్థల్లో పర్యావరణ సమస్యలు / అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి సమావేశాలు, చర్చలు, ప్రముఖుల ప్రసంగాలు ఏర్పాటు చేయడం.
* బాణాసంచా, లౌడ్ స్పీకర్లు, ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం.
* కాలుష్య నియంత్రణలో వినూత్న మార్గాలను అన్వేషించి, వాటిని అమలు పరిచే సంస్థలకు అందించడం.
* రహదారుల అందాన్ని, పరిశుభ్రతను పెంచేందుకు చెట్లు, పూల మొక్కలు పెంచడం లాంటి కార్యక్రమాలు చేపట్టడం.


హరితహారం
మిశ్రమ మొక్కల పథకం కింద తెలంగాణలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణ సమతౌల్యం సాధించడానికి ప్రస్తుతం ఉన్న 25 శాతం అడవులను 33 శాతానికి పెంచడం ఈ పథకం ఉద్దేశం. 'మన ప్రణాళిక' అనే కార్యక్రమం కింద రాష్ట్రంలో 3,889 నర్సరీలను గుర్తించారు. 2015 నాటికి 40 కోట్ల మొక్కలు పెంచాలని నిర్ణయించారు.
మొదటగా ఈ పథకాన్ని 2015, జులై 3-7 వరకు చేపట్టారు. రాష్ట్రప్రభుత్వం 2014-15లో సీఏఎమ్‌పీఏ (కాంపన్సేటరీ ఎఫారిస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ) కార్యక్రమాన్ని చేపట్టింది.


ముఖ్యాంశాలు
* అంతర్జాతీయ బయో డైవర్సిటీ దినోత్సవాన్ని మే 22న నిర్వహిస్తారు.
* ప్రపంచంలో మొత్తం 170 బయోడైవర్సిటీ బోర్డులుండగా.. తెలంగాణలోని 10 జిల్లాలోని 66 మండలాల్లోను, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ బయో డైవర్సిటీ బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
* తెలంగాణలో (2014-15) 3 జాతీయ పార్కులు, 9 వన్యప్రాణి కేంద్రాలు, 4 జింకల పార్కులు, 2 జంతు ప్రదర్శన శాలలు, 65 సాక్రెడ్ గ్రూవ్స్ ఉన్నాయి.
* కేంద్ర పర్యావరణ, అటవీశాఖ 2015లో తెలంగాణలో 'ప్రాణహిత'ను పర్యావరణ పరిరక్షణ పార్కుగా ప్రకటించింది. ఈ ప్రాంతం చుట్టూ 5 కి.మీ. పరిధిలో పలురకాల జంతువులను పెంచాలని నిర్ణయించింది.


మాదిరి ప్రశ్నలు

1. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
ఎ) జూన్ 5      బి) మార్చి 21      సి) మార్చి 8     డి) మే 22
జ: (డి)


2. ఇటీవల కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలంగాణలో ఏ ప్రాంతాన్ని పర్యావరణ పరిరక్షణ పార్కుగా ప్రకటించింది?
ఎ) మంజీర     బి) ప్రాణహిత     సి) అలీసాగర్     డి) కిన్నెరసాని
జ: (బి)


3. కిందివాటిలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాల్లో పర్యావరణంతో సంబంధం లేనిది ఏది?
ఎ) ఆసరా     బి) జలహారం      సి) స్వచ్ఛ తెలంగాణ     డి) హరితహారం
జ: (ఎ)


4. తెలంగాణలో అత్యధిక పారిశ్రామిక, రసాయన కేంద్రాలు ఉన్న జిల్లాలు ఏవి?
ఎ) రంగారెడ్డి     బి) మెదక్     సి) హైదరాబాద్     డి) పైవన్నీ
జ: (డి)


5. తెలంగాణ పర్యావరణ పరిశోధన సంస్థ అధ్యయనంలో 75% నుంచి 80% రసాయన, క్రిమి, ఔషధ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు ఏ రకమైన కాలుష్యానికి కారణమవుతున్నాయని తెలిపింది?
ఎ) నీటి     బి) వాయు     సి) ధ్వని     డి) రేడియోధార్మిక
జ: (ఎ)


6. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
ఎ) మే 22     బి) మార్చి 21     సి) డిసెంబరు 10    డి) జూన్ 21
జ: (బి)


7. 'ఫ్లోరైడ్ (F2)' సమస్య అధికంగా ఉన్న తెలంగాణ జిల్లా ఏది?
ఎ) మెదక్     బి) రంగారెడ్డి     సి) నల్గొండ     డి) వరంగల్
జ: (సి)


8. తెలంగాణ రాష్ట్ర ప్రధాన పరిశ్రమల మొత్తంలో కాలుష్యం లేని పరిశ్రమల శాతం ఎంత?
ఎ) 29.58%      బి) 64.98%     సి) 5.43%    డి) 0.033%
జ: (సి)


9. తెలంగాణలో 'స్వచ్ఛ తెలంగాణ - హైదరాబాద్' కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు?
ఎ) ఈఎస్ఎల్ నరసింహన్         బి) కె.చంద్రశేఖర్ రావు   
సి) కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా       డి) రాజీవ్ శర్మ
జ: (ఎ)


10. తెలంగాణలో 'స్వచ్ఛ తెలంగాణ - హైదరాబాద్' కార్యక్రమాన్ని ఏ రోజున చేపట్టారు?
ఎ) 2015, మే 10 - 14     బి) 2015, మే 16 - 20     సి) 2015, మే 20 - 24     డి) 2015, మే 1 - 4
జ: (బి)


11. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక 'హడ్కో అవార్డు' కిందివాటిలో దేనికి లభించింది?
ఎ) హరితహారం    బి) స్వచ్ఛ తెలంగాణ    సి) జలహారం    డి) మన ఊరు - మన ప్రణాళిక
జ: (సి)


12. 'క్లీన్ ఇండియా మిషన్‌'లో ఇటీవల భారతదేశ 476 నగరాల్లో తెలంగాణలోని గ్రేటర్ వరంగల్ నగరం ఎన్నో స్థానం దక్కించుకుంది?
ఎ) 275      బి) 34      సి) 33      డి) 13
జ: (సి)


13. తెలంగాణలో హరితహారం కార్యక్రమం ఎప్పుడు చేపట్టారు?
ఎ) 2015, జులై 3 - 7             బి) 2015, జులై 7 - 10
సి) 2015, ఆగస్టు 3 - 7          డి) 2015, సెప్టెంబరు 7-10
జ: (ఎ)

Posted Date : 05-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

తుపాను

* సముద్రంపైన ఉష్ణోగ్రత, పీడనాల్లో తేడా వల్ల వేగంగా వీచేగాలిని తుపాను అంటారు. దీని వల్ల అధిక వర్షపాతం సంభవిస్తుంది. సముద్రంలో కెరటాల ఉధృతి పెరుగుతుంది. దీంతో సముద్ర తీరప్రాంతాలకు అధిక నష్టం వాటిల్లుతుంది. వేగంగా వీచే గాలుల వల్ల వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోతాయి. జనావాసాలు దెబ్బతింటాయి. పండ్ల తోటలకూ అపార నష్టం.

* తుపాను వల్ల కలిగే వర్షంతో వరదలు సంభవించి ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. తుపాను ప్రభావం  తీవ్రతను బట్టి వందల సంఖ్య నుంచి వేల సంఖ్యలో ప్రాణ నష్టం జరుగుతుంది. పశుసంపదకు నష్టం వాటిల్లుతుంది. వరదల వల్ల ఆవరణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది.

* తుపానులను ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుస్తారు. అట్లాంటిక్ సముద్రంపైన వచ్చే తుపానులను హరికేన్‌లనీ; పసిఫిక్ మహా సముద్రంపై కలిగే వాటిని టైఫూన్‌లనీ, ఆస్ట్రేలియాలో సంభవించే వాటిని విల్లి - విల్లిలనీ పిలుస్తారు. ప్రపంచంలో తుపాన్లు ఎక్కువగా సంభవించే 6 ప్రాంతాల్లో భారతదేశం కూడా ఒకటి.
* భారతదేశంలో బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో తుపానులు సంభవిస్తాయి. బంగాళాఖాతం తీరప్రాంతంలోని పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సాలకు అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ తుపాను ముప్పు పొంచి ఉంది. అరేబియా తీరప్రాంతంలో ఉండే గుజరాత్, మహారాష్ట్రల్లో మిగతా వాటి కంటే ముప్పు కొద్దిగా ఎక్కువ.
* భారతదేశంలో 8.5 % ప్రాంతానికి తుపాను ముప్పు ఉంది.          
* భారతదేశంలో 7516 కి.మీ. ప్రాంతానికి తుపాను ముప్పు పొంచి ఉంది. పాండిచ్చేరితోపాటు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌లు తుపాను ప్రభావానికి గురవుతున్నాయి. వీటితోపాటుగా అండమాన్ నికోబార్, లక్ష ద్వీప్ కూడా తుపాను తాకిడికి గురయ్యే ప్రాంతాలు. ఏటా బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో దాదాపుగా 5 నుంచి 6 తుపానులు సంభవిస్తాయి.
* వీటిలో 2 నుంచి 3 ఎక్కువ తీవ్రతను కలిగి ఉంటాయి. అరేబియా సముద్రంతో పోలిస్తే బంగాళాఖాతంలో ఎక్కువ తుపానులు వస్తాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో సంభవించే తుపానుల నిష్పత్తి 4 : 1. సాధారణ తుపాను సమయంలో గాలి సరాసరి వేగం గంటకు 65 కి.మీ. నుంచి 117 కి.మీ. వరకు ఉండవచ్చు. 
* తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటే గాలివేగం గంటకు 119 కి.మీ. నుంచి 164 కి.మీ. వరకు, అంతకంటే ఎక్కువగా కూడా ఉండవచ్చు. 1999 అక్టోబరు 29 న ఒరిస్సాలో సంభవించిన సూపర్‌సైక్లోన్‌లో గంటకు 250 కి.మీ. వేగంతో గాలులు వీచాయి.
నష్టాన్ని తగ్గించడానికి చేపట్టాల్సిన చర్యలు
* తీరప్రాంతాల్లో ముఖ్యంగా తుపానులు తరచుగా సంభవించే ప్రాంతాల్లో చెట్లను పెంచాలి. ఇక్కడి అడవులను పరిరక్షించాలి. తీర ప్రాంతాల్లో ఉండే మాంగ్రూవ్ అడవులు (మడ అడవులు), ఎత్తయిన వృక్షాలు తుపాను తీవ్రతను తగ్గిస్తాయి. దీనివల్ల వరదలు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. సముద్రపు ఒడ్డుకు దగ్గరలో ఉన్న వృక్షసంపద సహజ కవచంలా పనిచేసి తుపాను నష్టాన్ని తగ్గిస్తుంది. తీరప్రాంతాల్లో అడవులను పూర్తిగా కొట్టివేయడం వల్ల తుపాను ముప్పు పెరిగి సహజ విపత్తు కాస్తా మానవ సంబంధ విపత్తుగా మారుతోంది.
* తరచుగా తుపాన్లు సంభవించే ప్రాంతాలను గుర్తించి పటాలను తయారుచేయాలి. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో తాత్కాలిక, శాశ్వత చర్యలను చేపట్టవచ్చు. తుపానులను ఉపగ్రహాల సహాయంతో ముందుగానే గుర్తించవచ్చు. గాలి వీచే దిశ, వేగాన్ని బట్టి అక్కడి ప్రజలను హెచ్చరించి తుపాను నష్టాన్ని తగ్గించవచ్చు.
* తుపాను సంభవించే ప్రాంతాల్లో తక్కువ నష్టతీవ్రత ఉన్న ప్రదేశాలను గుర్తించి అక్కడ నివాసాలు, వసతులను, ఏర్పాటు చెయ్యాలి. తుపాను తాకిడికి ఎక్కువగా గురయ్యే ప్రదేశాల్లో ఇళ్లు, భవనాల నిర్మాణాల్లో మార్పులు చెయ్యాలి. ఇవి తుపానును తట్టుకునే విధంగా ఉండాలి. గృహాలను నేలమట్టం నుంచి ఎత్తుగా నిర్మించాలి, పైకప్పు వేలాడినట్టుగా కాకుండా మూసినట్టుగా ఉండాలి. ఇంటి చుట్టూ చెట్లను నాటడం వల్ల అవి సహజ రక్షణ కవచంలా పనిచేస్తాయి. సమాచార, విద్యుత్ వ్యవస్థలు దెబ్బతినకుండా ఉండేందుకు వాటిని భూగర్భ కేబుల్స్ ద్వారా సరఫరా చెయ్యాలి. తుపాన్లు సంభవించేటప్పుడు వరదలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని ఎదుర్కొనే చర్యలను కూడా చేపట్టాలి.  
* భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) రుతుపవనాలు, వర్షపాతం, తుపాన్ల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాడార్‌లు, ఉపగ్రహాల ద్వారా గ్రహించి అందజేస్తోంది. ఈ సమాచారం అందుకున్న ఏరియా సైక్లోన్ వార్నింగ్ సెంటర్స్ (ACWCs) తగిన హెచ్చరికలను జారీ చేస్తాయి. భారతదేశ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఐ) తుపాన్ల గురించి సమాచారాన్ని తెలియజేస్తుంది.
* తుపాన్ల వల్ల జరిగే నష్ట తీవ్రతను తగ్గించడానికి, భారత పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 1990 జులైలో బిల్డింగ్ మెటీరియల్స్, టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. తీర ప్రాంతాల్లో ఉన్న వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీల ద్వారా తగిన సమాచారాన్ని అందిస్తూ రక్షణ చర్యలను చేపడుతున్నాయి.
* ఇన్‌శాట్ ఉపగ్రహాలు, 10 రాడార్‌ల సహాయంతో కేంద్రం తుపాను ముప్పులను గమనించి తీర ప్రాంతాల ప్రజలను 48 నుంచి 24 గంటల ముందుగా హెచ్చరిస్తోంది. స్థానిక భాషల్లో తుపాను హెచ్చరిక సూచనలు అందిస్తోంది.

 

జాతీయ తుపాను ముప్పు నియంత్రణా ప్రాజెక్ట్
* భారతదేశంలోని తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రజలను తుపాను బారి నుంచి రక్షించడానికి, వారి ఆస్తులను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. దీన్ని కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రారంభించింది. దీన్ని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ) అమలు చేస్తోంది. హోంమంత్రిత్వశాఖ, ఎన్‌డీఎంఏ కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నాయి.
2011 నుంచి 2015 మధ్య ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తారు. ప్రపంచ బ్యాంక్ దీనికి నిధులను సమకూరుస్తుంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం రూ. 626.87 కోట్లు కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 165.13 కోట్లను సమకూర్చుకుంది. 
* ఇదేవిధంగా ఒరిస్సాకు కేంద్ర ప్రభుత్వం రూ. 520.93 కోట్లు కేటాయించగా ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ. 132.85 కోట్లు సమకూర్చుకుంది.
మొదట విడతగా ఈ ప్రాజెక్ట్‌ను ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌ల్లో అమలు చేయనున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ నిధులతో తుపాను సమయంలో తలదాచుకునే భవనాలు నిర్మిస్తారు. తుపాను వల్ల దెబ్బతిన్న రహదారులను, కరకట్టలను మరమ్మత్తు చేస్తారు. తుపాను విపత్తు గురించిన అవగాహనను ప్రజలకు కలిగిస్తారు.
* ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ (ఐసీజడ్ఎంపీ): కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖల సూచన మేరకు భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. దీనిలో భాగంగా గుజరాత్, ఒరిస్సా, పశ్చిమబెంగాల్‌ల తీర ప్రాంతాల రక్షణకు చర్యలు చేపడతారు. ఈ రాష్ట్రాల్లో తుపాను ముప్పు ప్రాంతాలను గుర్తించడం, మ్యాపింగ్ చేయడం, రాష్ట్రంలో తుపానును ఎదుర్కొనేందుకు పని చేస్తున్న శాఖలకు, సంస్థలకు నిధులను అందజేయడం ఈ ప్రాజెక్ట్ విధి. ఈ ప్రాజెక్టు కింద పశ్చిమ బెంగాల్‌కు రూ. 1425 కోట్లను కేటాయించారు.
* కోర్‌గ్రూప్ ఆన్ సైక్లోన్ మిటిగేషన్: తుపాను ముప్పును గమనించడానికి, నివారణకు జాతీయస్థాయిలో ముఖ్యమైన వ్యక్తులతో ఒక గ్రూపును ఏర్పరిచారు. దీనిలో భారత వాతావరణ శాఖ, కేంద్ర జల సంఘం, నేషనల్ రిమోట్‌సెన్సింగ్ ఏజెన్సీ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన నిపుణులు ఉంటారు. వీరితోపాటుగా తుపాను కార్యక్రమాలను పర్యవేక్షించే వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు ఉంటారు. వీరు తుపాను, వరదలకు సంబంధించిన హెచ్చరికలను జారీచేయడం; రాష్ట్ర, జాతీయస్థాయిలో వివిధ శాఖలు, సంస్థలను సమన్వయపరచడం లాంటి పనులను చేస్తారు.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వరదలు

నదీప్రవాహ మార్గాల హద్దులు (గట్లు)జల ప్రవాహాన్ని నిలువరించలేకపోవడం వల్ల పరీవాహక ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితిని 'వరద' అంటారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల భౌగోళిక పరిస్థితులు, శీతోష్ణస్థితులు, వర్షపాతం ఉండటంవల్ల ఏటా ఏదో ఒక ప్రాంతంలో వరదలు సంభవిస్తూ ఉంటాయి. అధిక వర్షపాతం ఉండే జూన్ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో వరదలు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
తుపాను, వాయుగుండాలు వచ్చినప్పుడు కూడా వరదలు వస్తాయి. అధిక వర్షపాతం, కూడా వరదలు రావడానికి కారణమవుతుంది. భారతదేశంలోని సుమారు 3290 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోని భూమి వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉంది.

ఏటా సరాసరి 75 లక్షల హెక్టార్ల భూమి వరదల ప్రభావానికి గురవుతోంది. సుమారు 1600 మంది వరదల వల్ల మరణిస్తున్నారు. సాలీనా రూ.1805 కోట్ల రూపాయల ఆస్తి, పంటనష్టం జరుగుతోంది. ఇళ్లు, రోడ్లు దెబ్బతింటున్నాయి. 1977లో అత్యధికంగా 11,316 మంది మృత్యువాత పడ్డారు. భారతదేశంలోని 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వివిధ ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉంది. దేశ విస్తీర్ణంలో 8 శాతం వరకూ భూభాగం వరదలకు గురయ్యే అవకాశముంది. గంగా, బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలు ఎక్కువగా వస్తుంటాయి.

 

వరదలు రావడానికి కారణాలు
* నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడటం, నది ప్రవాహ దిశను మార్చుకోవడం వల్ల వరదలు సంభవిస్తాయి.
* అధిక వర్షపాతం, వాయుగుండాలు, తుపాన్లు వరదలకు కారణమవుతాయి.
* నదులు, చెరువులు, కాల్వలకు గండ్లు పడటం; నదీ ప్రవాహ మార్గాలు పూడికతో నిండిపోవడం వల్ల వరదలు సంభవిస్తున్నాయి.

* అతిగా అడవులను నరికివేయడం, పర్వత ప్రాంతాల్లో నేల క్రమక్షయానికి గురవడం వల్ల వరదల ఉద్ధృతి పెరుగుతోంది.
* కొండ చరియలు విరిగిపడటంతో నదులు తమ ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం వల్ల వరదలు సంభవిస్తాయి.
* చెరువులు, ఆనకట్టలు, గట్ల నిర్మాణంలో సరైన ఇంజినీరింగ్ ప్రమాణాలను పాటించకపోవడం వల్ల కూడా వరదలు రావొచ్చు.
* మహానగరాల్లోని నాలాలు ప్లాస్టిక్ కవర్లు, చెత్త, ఇతర ఘన పదార్థాలతో నిండిపోవడం వల్ల అవి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నాయి. హైదరాబాద్, ముంబయి లాంటి నగరాల్లో ఈకారణంగానే వరదలు సంభవించాయి.

* వర్షం పడినప్పుడు నీరు నేలలోకి సరైనవిధంగా ఇంకకపోవడం వల్ల వరదలు ఎక్కువవుతాయి. నగరాల్లో నీరు ఇంకే మార్గాలకు పూర్తిగా అడ్డుపడటం వల్ల తరచుగా వర్షాకాలంలో వరదల తాకిడిని, వేసవిలో నీటి కొరతను ఎదుర్కొంటున్నాం.


వరద విపత్తు ఆధారంగా భారతదేశాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించవచ్చు.


బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతం
   బ్రహ్మపుత్ర, బారక్ నదులు, వీటి ఉపనదుల ప్రాంతాలు దీని కిందకు వస్తాయి. అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరం, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాల్లోని నదీ పరీవాహక ప్రాంతాల్లో జూన్ నుంచి సెప్టెంబరు వరకు అధిక వర్షపాతం (1100 మి.మీ. నుంచి 6350 మి.మీ.) నమోదవుతోంది. అందువల్ల సర్వసాధారణంగా ఈ ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి. ఇక్కడి నదులు పర్వత ప్రాంతాల్లో పుట్టి, దిగువకు రావడం వల్ల నేల క్రమక్షయానికి గురవడం, కొండచరిచయలు విరిగి పడటం కూడా ఎక్కువగా ఉంటోంది.


గంగానదీ పరీవాహక ప్రాంతం 
             గంగా దాని ఉపనదులైన యమున, సోన్, గండక్, కోసి, మహానంద, రాఫ్తి లాంటి నదీ పరీవాహక ప్రాంతాలు దీని కిందికి వస్తాయి. వీటి వల్ల ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్‌ని కొన్ని ప్రాంతాలు, పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో వరద ముప్పు ఉంది. ఇక్కడ సంవత్సరానికి 600 మి.మీ. నుంచి 1900 మి.మీ. వరకూ వర్షం కురుస్తుంది. ఈ రాష్ట్రాల్లో గంగానది వల్ల వరదలు ఎక్కువగా వస్తాయి.

ఉత్తర-పశ్చిమ నదీ పరీవాహక ప్రాంతం 
             బియాస్, రావి, చీనాబ్, జీలమ్ లాంటి నదుల ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. జమ్మూ-కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రాంతాల్లో ఈ నదుల వల్ల వరదలు సంభవిస్తాయి. గంగా పరీవాహక ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ వరద ముప్పు తక్కువే అయినప్పటికీ పూడిక సమస్య ఎక్కువ.


మధ్య భారతదేశం - దక్కన్ ప్రాంతాలు
నర్మదా, తిరుపతి, మహానంది, గోదావరి, కృష్ణా, కావేరి నదుల ప్రాంతాలు దీని కిందకు వస్తాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఒడిషా రాష్ట్రాలు ఈ నదుల వల్ల వరదల బారిన పడతాయి. ఒడిషాలోని కొన్ని జిల్లాల్లో వరదలు తరచుగా వస్తుంటాయి. ఈ రాష్ట్రాల్లో రుతుపవనాల సమయంలో, తుపాన్లు సంభవించినప్పుడు వరదలు వచ్చే అవకాశం ఎక్కువ.


వరదలకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నదీతీర ప్రాంతాల్లో, తరచుగా వరదలకు గురవడానికి అవకాశమున్న ప్రజలు వరదలు రావడానికి ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల వరదల సమయంలో తక్కువ నష్టం జరుగుతుంది.
* దగ్గరలోని పునరావాస కేంద్రాన్ని గుర్తించి అక్కడికి తొందరగా చేరే మార్గాన్ని తెలుసుకోవాలి.
* ప్రథమ చికిత్స పెట్టెలో మందులు, ఇతర సామాగ్రి ఉన్నాయా లేవో చూసుకోవాలి. ప్రత్యేకంగా డయేరియా, పాముకాటుకు సరైన ఔషధాలను సిద్ధం చేసుకోవాలి.

* రేడియో, టార్చిలైటు, బ్యాటరీలు, తాళ్లు, గొడుగు లాంటివి సమకూర్చుకోవాలి.

* మంచినీరు, ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు, ఇంధనం లాంటివి ముందుగానే సమకూర్చుకుని నిల్వ చేసుకోవాలి.
* నీరు తాకినా తడవని సంచుల్లో (water proof bags) దుస్తులు, ఇతర విలువైన వస్తువులను భద్రపరచుకోవాలి.
* గ్రామీణ ప్రాంతాల్లో ఎత్తయిన ప్రదేశాలను గుర్తించి, పశువులను అక్కడికి తీసుకు వెళ్లే ఏర్పాట్లు చేసుకోవాలి.

 
వరద వచ్చిన ప్రాంతంలో ఉండేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* సురక్షిత (కాచి వడపోసిన) నీటినే తాగాలి. లేకపోతే కలరా, డయేరియా లాంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది.
* ఆహార పదార్థాలను వరదనీటిలో తడవకుండా చూడాలి. వరద నీటిలో తడిసిపోయిన ఆహార పదార్థాలను తినకూడదు.
* నీటిని శుభ్రపరచడానికి బ్లీచింగ్ పౌడరు కలపాలి. పరిసరాల్లో సున్నాన్ని చల్లాలి.
* వరదనీటిలోకి వెళ్లకూడదు. వరదల సమయంలో పాముకాటు ప్రమాదాలు ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తెగిపడిన విద్యుత్ తీగలను తాకకూడదు.

 ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నా కొన్నిసార్లు అనూహ్యంగా వరదల ముంపునకు గురై తీవ్ర ఇబ్బందుల పాలవుతాం. వరదల సమయంలో తీసుకోవాల్సిన చర్యలను చూద్దాం...
* వరదలు సంభవించే కాలంలో తరచుగా రేడియో, టీవీ హెచ్చరికలను వింటూ ఉండాలి. ప్రభుత్వం లేదా వాతావరణ శాఖ చేసే హెచ్చరికలను గమనిస్తూ ఉండాలి.
* ప్రాంతీయ అధికారులు చేసే హెచ్చరికలను గమనిస్తూ, వాటికి అనుగుణంగా స్పందించాలి.
* ఆహార పదార్థాలు, నీరు, దుస్తుల లాంటివి దగ్గరగా ఉంచుకోవాలి.
* గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సామగ్రి, పశువులు, ఇతర సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.
* మన నివాస ప్రాంతాల్లో కొద్ది గంటల్లో వరద ముంపు ప్రమాదం ఉందని తెలిసినప్పుడు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి.
* సురక్షిత, పునరావాస కేంద్రాలకు వెళ్లేటప్పుడు తమ వెంట విలువైన వస్తువులు, పత్రాలు, అత్యవసర మందులు, దుస్తుల లాంటివి తీసుకు వెళ్లాలి.
* వస్తువులను నేలపై కాకుండా ఎత్తయిన ప్రదేశంలో ఉంచాలి. ఇంటికి వచ్చే విద్యుత్ కనెక్షన్లను తీసేయాలి.
* తెలియని ప్రదేశంలో నిల్వ ఉండే నీటిలోకి వెళ్లకూడదు.

 

వరదల వల్ల నష్టాలు
*వరదల వల్ల తీవ్ర ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లుతుంది. ఇళ్లు, పంటపొలాలు దెబ్బతింటాయి. పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడం వల్ల అది వ్యవసాయానికి పనికిరాకుండా పోతుంది. పంటపొలాలు మునిగిపోయి అధిక నష్టం కలుగుతుంది.
* వరదల వల్ల అనేకమంది నిరాశ్రయులవుతారు. పశువులు మృత్యువాత పడతాయి. తాగునీరు కలుషితమవుతుంది. తాగడానికి మంచినీరు దొరకదు.

* కలుషిత నీరు తాగడం వల్ల డయేరియా, కలరా లాంటి అంటువ్యాధులు ప్రబలుతాయి.
* నేల క్రమక్షయానికి గురై సారవంతం తగ్గుతుంది. జలాశయాల్లో పూడిక పెరుగుతుంది. అధిక వరదల వల్ల రోడ్లు, వంతెనలు, రైల్వే ట్రాక్‌లు దెబ్బతింటాయి. దీని వల్ల రవాణాకు ఆటంకం ఏర్పడుతుంది. విద్యుత్, టెలిఫోన్ వ్యవస్థలు నాశనమవుతాయి. భవనాలు దెబ్బతినడం వల్ల ఆస్తి నష్టం జరుగుతుంది. ఆహారం, పశుగ్రాసం కొరత ఏర్పడుతుంది.
* అటవీ ప్రాంతాల్లో వరదల వల్ల అక్కడి జీవవైవిధ్యం దెబ్బతింటుంది.
* వరదల వల్ల మహానగరాల్లో పల్లపు ప్రాంతాలు మునిగిపోతాయి. రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. కొండచరియలు విరిగిపడతాయి.
¤* ఆకస్మికంగా సంభవించే వరదల్లో కొందరు కొట్టుకుపోయి, మరణాలు సంభవిస్తాయి. పాత భవనాలు కూలిపోవడం లాంటి వాటి వల్ల కూడా ప్రాణనష్టం జరుగుతుంది. సముద్రతీర ప్రాంతాల్లో చేపలు పట్టేవారికి వలలు, పడవలకు నష్టం ఉంటుంది.

 

 నివారణ చర్యలు
* నదుల ఎగువ ప్రాంతాల్లో అడవులను పెంచాలి. దీనివల్ల వర్షపు నీరు అక్కడే భూమిలోకి ఇంకిపోయి వరదలు రాకుండా ఉంటాయి.
* పోడు వ్యవసాయాన్ని తగ్గించాలి, నీటి ప్రవాహానికి అడ్డంకులు కల్పించకూడదు.
* వరదనీటిని వరద కాల్వల ద్వారా ఇతర ప్రాంతాలకు మళ్లించాలి.
*వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో నదులపై ప్రాజెక్టులను, రిజర్వాయర్లను నిర్మించాలి.
* ముందస్తు హెచ్చరిక కేంద్రాల ద్వారా ప్రజలకు వరద ముప్పు గురించి ముందుగానే హెచ్చరికలు జారీ చేయాలి. ప్రభుత్వ యంత్రాంగం వరదల సమయంలో తక్షణం స్పందించి సహాయ చర్యలు చేపట్టాలి.
* లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎత్తయిన ప్రాంతాలకు తరలించాలి. అక్కడ వారికి ఆవాసాలు ఏర్పరచాలి.
* ఏటా తరచుగా వరదలు వచ్చే ప్రాంతాలను గుర్తించి శాశ్వత నివారణ కార్యక్రమాలను చేపట్టాలి. వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలతో మ్యాప్‌లను గీయాలి.
* పట్టణాల్లో డ్రైనేజి వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలి. అవసరమైతే మెరుగుపరచాలి.
* పెద్ద ఆనకట్టలతోపాటు చిన్న, చిన్న చెక్‌డ్యామ్‌లు, కాంటూర్ కందకాల లాంటివాటిని ఏర్పరచి నీటిని నియంత్రించవచ్చు.


 భారతదేశంలో వరద నియంత్రణా చర్యలు
  ప్రపంచంలో అధికంగా వరదలు సంభవించే ప్రాంతాల్లో భారత్ ఒకటి. రుతుపవన వర్షపాతం, నదులు తీసుకువచ్చే మట్టి, పర్వత ప్రాంతాల్లో కోతకు గురికావడం లాంటి కారణాల వల్ల భారతదేశంలో వరదలు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంది. మనకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ప్రభుత్వం వరద నివారణా చర్యలను చేపడుతోంది. పదో పంచవర్ష ప్రణాళికా కాలం వరకు వరదలు సంభవించే అవకాశమున్న 45.6 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో రక్షణ చర్యలు చేపట్టారు. 11వ పంచవర్ష ప్రణాళికా కాలంలో 2.18 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో అదనంగా రక్షణ చర్యలు చేపట్టారు.
1954లో 'నేషనల్ ఫ్లడ్ కంట్రోల్ ప్రోగ్రామ్‌'ను ప్రారంభించిన తర్వాత వరద నియంత్రణా చర్యలను వేగవంతం చేశారు. 'సెంట్రల్ వాటర్ కమిషన్' (CWC) అనే సంస్థ భారతదేశంలో వరదల గురించి ముందస్తు సమాచారాన్ని అందిస్తుంది.     
దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. ఇది రాష్ట్రాల్లో నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద సమాచారాన్ని సేకరించి, ఆయా ప్రదేశాల్లోని హెచ్చరికల కేంద్రాలకు పంపిస్తుంది. ఈ కేంద్రాలు సమాచారాన్ని స్థానిక ప్రజలకు తెలియజేస్తాయి.

 

వరద నష్టం తగ్గించడానికి చేపడుతోన్న చర్యలు
* వరదల సమయంలో తగిన చర్యలు చేపట్టడానికి 'నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్' (NDRF)కు చెందిన బెటాలియన్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. వీరికి తగిన శిక్షణనివ్వడంతోపాటు అధునాతన పరికరాలను సమకూర్చారు.

* వరదలు సంభవించిన ప్రాంతాల్లో ప్రభుత్వం తరఫున తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. వీటిలో ప్రజలకు అత్యవసర వైద్య సహాయాన్ని, ఔషధాలను అందిస్తారు.
* నీటిని నిల్వ చేయడానికి ఆనకట్టలు, రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు. దీనివల్ల నదుల్లో నీటిమట్టాన్ని నియంత్రించగలుగుతున్నాం. ఫలితంగా వరద ముప్పు తగ్గుతోంది. వీటిలో నిల్వ ఉన్న నీటిని తిరిగి వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి, తాగునీరు, పరిశ్రమలకు వినియోగించుకోవచ్చు. ప్రభుత్వం ఆనకట్టల భద్రతను కూడా పర్యవేక్షిస్తోంది.
* వరదల వల్ల కలిగే నష్టాన్ని నివారించడానికి, వరదల నివారణకు ఆనకట్టల్లో పూడిక ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. కాల్వల్లో నీరు సాఫీగా ప్రవహించేవిధంగా చూస్తున్నారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో నేలక్రమక్షయం జరగకుండా అడవులను పెంచుతున్నారు.
* జాతీయ రహదార్లు, వంతెనలు, రోడ్లు, రైల్వే ట్రాక్‌లు దెబ్బతినకుండా వాటిని ప్రత్యేక పద్ధతిలో నిర్మించడం, వాటి రక్షణ చర్యలు చేపట్టడం, వరదలకు ముందు, తర్వాత వాటిని పరిశీలించడం లాంటి చర్యలు చేపడుతున్నారు.

* వరదలకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే తెలుసుకోవడానికి, వాటిని నివారించడానికి భారత ప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో అనేక సంస్థలను ఏర్పాటు చేసింది.
* వరదలు సంభవించినప్పుడు ఆ నీటిని మళ్లించడానికి ప్రత్యేక కాల్వలను నిర్మిస్తున్నారు. తరచుగా వరదలు సంభవించే ప్రాంతాలను గుర్తించి వాటి మ్యాపులను గీస్తున్నారు. వీటి ద్వారా ఆయా ప్రాంతాల్లో శాశ్వత వరద నివారణా చర్యలు చేపట్టడమే కాకుండా ముందస్తు హెచ్చరికలను కూడా జారీచేయవచ్చు.
* సెంట్రల్ వాటర్ కమిషన్ (CWE), ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్‌మెంట్ (IMD) వారు భారతదేశంలోని 62 నదీ పరీవాహక ప్రాంతాల్లోని 945 ప్రదేశాల నుంచి నీరు, వాతావరణ సంబంధ సమాచారాన్ని గ్రహిస్తున్నారు.
దీన్ని నదీ పరీవాహక ప్రాంతాల్లోని ముందస్తు హెచ్చరికల కేంద్రాలకు పంపిస్తున్నారు. ఇలాంటి వరద హెచ్చరికల కేంద్రాలు భారతదేశంలో 175 ఉన్నాయి. వీటిలో మన రాష్ట్రంలో గోదావరీ పరీవాహక ప్రాంతంలో 18, కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో 9 ఉన్నాయి.

*భారతదేశంలో ఇలాంటి హెచ్చరికల కేంద్రాలు అత్యధికంగా గంగా, దాని ఉపనదుల ప్రాంతాల్లో 87 ఉన్నాయి.

* భారతదేశంలోని కొన్ని నదులు ఇతర దేశాల్లో కూడా ప్రవహిస్తున్నాయి. ఇతర దేశాల సరిహద్దు ప్రాంతాల్లో పుట్టి, మనదేశం ద్వారా ప్రవహించే నదులున్నాయి. భారత్ ఇలాంటి నదుల వల్ల కలిగే వరద నష్టాన్ని నివారించడం కోసం నేపాల్, చైనా, భూటాన్ లాంటి దేశాలతో కలిసి పని చేస్తోంది. వరదల నియంత్రణకు సంబంధించి వివిధ ఒప్పందాలను కుదుర్చుకుంది.
* సామాన్య ప్రజలకు వరదలకు సంబంధించిన అవగాహన, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను చైతన్యవంతం చేసే వివిధ కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఈ అంశాన్ని పాఠ్యాభాగాల్లోనూ చేరుస్తున్నారు. గ్రామస్థాయి నుంచి అన్ని వర్గాల వారికి శిక్షణ ఇస్తున్నారు. వివిధ సంస్థలు, విశ్వవిద్యాలయాలు వరదల గురించి పరిశోధనలు చేస్తున్నాయి.


 

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆవరణ వ్యవస్థ - పర్యావరణ క్షీణత

మాదిరి ప్రశ్నలు

1. మేఘమథనం లేదా కృత్రిమ వర్షం కురిపించడానికి వాడే మిశ్రమాలు
    1) డ్రై ఐస్     2) సిల్వర్ అయోడైడ్     3) సాల్ట్ పౌడర్     4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

2. జీవావరణం అత్యధికంగా ఉండే ఆవరణం?
జ: జలావరణం

 

3. కిందివాటిలో సరైంది.
    a) ఎన్విరాన్ అనే పదం ఫ్రెంచ్ భాష నుంచి వచ్చింది.
    b) ఎన్విరాన్ అంటే చుట్టూ జీవులతో కూడిన ప్రాంతం అని అర్థం.
: a, b సరైనవి

 

4. ఇకాలజీ అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించిన శాస్త్రవేత్త?
జ: హెకెల్

 

5. కిందివాటిలో స్వయం పోషకాలు?
    1) వినియోగదారులు     2) విచ్ఛిన్నకారులు    3) ఉత్పత్తిదారులు     4) ఏదీకాదు
: 3 (ఉత్పత్తిదారులు)

 

6. పత్రాలు, పుస్తకాలు పసుపు రంగులోకి మారడానికి కారణం?
జ: సల్ఫర్ డై ఆక్సైడ్

 

7. జీవావరణ పిరమిడ్‌ను తయారుచేసిన శాస్త్రవేత్త
జ: చార్లెస్ హెల్టన్

 

8. అతినీలలోహిత కిరణాల నుంచి రక్షించే ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉంది?
జ: స్ట్రాటో ఆవరణం

 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడటానికి కారణం? (పోలీస్ కానిస్టేబుల్ 2016, సబ్ ఇన్‌స్పెక్టర్ 2018)
జ: క్లోరోఫ్లోరో కార్బన్లు

 

2. ఆవరణ వ్యవస్థ ఆహార గొలుసు పిరమిడ్ మొదటి మెట్టులో ఉండేది? (గ్రూప్-1, 2017)
జ: ఉత్పత్తిదారులు

 

3. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొదట ఉపయోగించినవారు? (ఏఈ, 2015)
జ: ట్రాన్స్‌లే

 

4. కింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి.
    a) అతినీలలోహిత కిరణాలు సూర్యుడి నుంచి భూఉపరితలానికి చేరతాయి.
    b) పరారుణ కిరణాలు భూఉపరితలం నుంచి పరావర్తనం చెందుతాయి.
జ: a, b సరైనవి

 

5. ఆమ్ల వర్షానికి కారణమయ్యే వాయువు (గ్రూప్-4, 2012; డీఎస్సీ 2017)
జ: సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆవరణ వ్యవస్థ - పర్యావరణ క్షీణత

భూఉపరితలంపై క్రీ.పూ.10 వేల సంవత్సరాల కిందట వ్యవసాయం ప్రారంభమైనప్పుడు కేవలం 40 లక్షల జనాభా ఉండేది. క్రమానుగతంలో 1750 నాటికి 50 కోట్లు, 1900 నాటికి 100 కోట్లు, 1950 నాటికి 250 కోట్లు ఉంటే ప్రస్తుతం 700 కోట్లకు పెరిగింది. ఇది 2100 సంవత్సరం నాటికి 1000 కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా. ఈ విధంగా జనాభా విస్ఫోటనం వల్ల మానవ అవసరాలు పెరగడంతో అనేక పరిశ్రమలను స్థాపించారు. వీటి నుంచి వెలువడే ఉద్గారాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు పర్యావరణ కాలుష్యం పెరుగుతోంది.
        భూగోళంపై శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం అనే నాలుగు ఆవరణాలు ఉన్నాయి. ఈ ఆవరణాల మధ్య భూఉపరితలంపై అత్యధికంగా జలావరణంలో జీవావరణం ఆవరించి ఉంది. ఇది జంతు, వృక్ష, ప్రాణులను కలిగి ఉంటుంది.
* జీవుల ఆధారంగా జీవావరణాన్ని 3 వర్గాలుగా విభజించవచ్చు. అవి:
1) ఉత్పత్తిదారులు (Producers)
2) వినియోగదారులు (Consumers)
3) విచ్ఛిన్నకారులు (Decomposers)

 

ఉత్పత్తిదారులు: కిరణజన్య సంయోగక్రియ (సూర్యరశ్మి, నీరు) ద్వారా తమంతట తామే ఆహారాన్ని తయారు చేసుకొని స్వయం పోషకంగా జీవించే వాటిని ఉత్పత్తిదారులు అంటారు.
ఉదా: మొక్కలు, గడ్డి, లెగ్యుమినేసి జాతులు
వినియోగదారులు: ఉత్పత్తిదారులు తయారుచేసిన వాటిపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడి జీవించే వాటిని వినియోగదారులు అంటారు. ఇవి నాలుగు రకాలు.

 

1) శాఖాహారులు (Herbivores): ఇవి ఉత్పత్తిదారులపై ఆధారపడి ఉంటాయి.
ఉదా: మిడత, చిమ్మెట, ఉడుత, కుందేలు, జిరాఫీ, పశువులు.

 

2) మాంసాహారులు (Carnivores): ఇవి శాఖాహారులపై ఆధారపడి జీవిస్తాయి.
ఉదా: తేలు, పాము, చిరుత, పులి, సింహం.

 

3) సర్వభక్షకులు (Omnivores): ఇవి శాఖాహార, మాంసాహారులపై ఆధారపడి జీవిస్తాయి.
ఉదా: ఎలుక, పిల్లి, కుక్క, డేగ, మానవుడు (అతి ప్రధాన సర్వభక్షకుడు).

 

4) పూతికాహారులు (Detritivores): ఇవి మలిన జీవులపై ఆధారపడి జీవిస్తాయి.
ఉదా: చెదపురుగులు, చీమలు.
విచ్ఛిన్నకారులు: ఇవి విగత జీవులు (మరణించిన), వ్యర్థాలపై ఆధారపడి జీవిస్తాయి.
ఉదా: బ్యాక్టీరియా, శిలీంద్రాలు.

 

ఆవరణ వ్యవస్థ
        ఆవరణ శాస్త్రాన్ని ఆంగ్లంలో ఇకాలజీ (Ecology) అంటారు. ఇది గ్రీకు భాషలోని ఓయికస్ (ఇల్లు), లోగోస్ (అధ్యయనం) అనే రెండు పదాల నుంచి వచ్చింది. అంటే మన ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను అధ్యయనం చేయడం అని అర్థం. ఇకాలజీ అనే పదాన్ని మొదట 1866లో జర్మనీకి చెందిన హెర్నెస్ట్ హెకెల్ అనే జీవ శాస్త్రవేత్త ఉపయోగించాడు. ఆ తర్వాత బ్రిటన్‌కు చెందిన ట్రాన్స్‌లే ఆవరణ వ్యవస్థను వెలుగులోకి తెచ్చాడు. భౌతిక పరిసరాల్లోని జీవుల మధ్య సంబంధాన్ని తెలియజేసేదే ఆవరణ వ్యవస్థ అని పేర్కొన్నాడు.

 

పర్యావరణం
        పరిసరాల నుంచి పర్యావరణం అనే పదం వచ్చింది. పర్యావరణం 'ఎన్విరాన్' (Environ) అనే ఫ్రెంచ్ భాషా పదం నుంచి వచ్చింది. దీనికి అర్థం మనచుట్టూ ఉన్న ప్రాంతం. మానవుడి జీవనం, మొక్కలు, జంతు, వృక్ష; జీవ, నిర్జీవ అంశాలను అధ్యయనం చేసేదే పర్యావరణం.
* పర్యావరణంలో రెండు అణుఘటకాలు ఉంటాయి.
     1) నిర్జీవ అణుఘటకాలు (Abiotic Compounds)
     2) జీవ అణుఘటకాలు (Biotic Compounds)

 

నిర్జీవ అణుఘటకాలు: ఇవి ప్రకృతి నుంచి ఉద్భవించిన సహజ వనరులు.
ఉదా: గాలి, నీరు, నేల, ఆకాశం, అగ్ని.

 

జీవ అణుఘటకాలు: ఇవి సహజ వనరులపై ఆధారపడతాయి.
ఉదా: వీటిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, శిఖరాగ్ర వినియోగదారులు ఉంటాయి.

 

జీవావరణ పిరమిడ్
        చార్లెస్ హెల్టన్ ఆహార గొలుసు ఆధారంగా జీవావరణ పిరమిడ్‌ను తయారుచేశాడు. దీనిలో కింది నుంచి పైస్థాయికి ఉత్పత్తి ప్రవాహం తగ్గుతుంది. అలాగే పై నుంచి కింది స్థాయికి సంపద సంఖ్య తగ్గుతుంది.
     

పర్యావరణ కాలుష్యాలు
        మానవుడి దైనందిన జీవన కార్యకలాపాల ద్వారా ఘన, ద్రవ, వాయు వ్యర్థాలు జీవావరణ సమతౌల్యం దెబ్బతినే స్థాయిలో విడుదలవడాన్ని పర్యావరణ క్షీణత లేదా కాలుష్యం అంటారు. రసాయనాలు, ఖనిజాలు, పేపర్, చక్కెర లాంటి భారీ మౌలిక పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్యాలు అనేక సమస్యలకు కారణమవుతున్నాయి.

 

వాయు కాలుష్యం
భూగోళాన్ని ఆవరించి ఉన్న గాలిపొరను వాతావరణం అంటారు. ఇది భూగోళం చుట్టూ 6 కి.మీ. ఎత్తులో అత్యధికంగా వ్యాపించి భూభ్రమణ, గురుత్వాకర్షణ వల్ల సంకోచం, వ్యాకోచం చెందుతుంది. సహజ వాతావరణంలో అనేక వాయువులు ఉన్నప్పటికీ ప్రధానంగా 17 వాయువుల మిశ్రమం ఉంటుంది. వీటిలో.......
నత్రజని - 78.084%
ఆక్సిజన్ - 20.947%
కార్బన్ డై ఆక్సైడ్ - 0.0314%
మీథేన్ - 0.002%
హైడ్రోజన్ - 0.00005%
ఆర్గాన్, నియాన్, క్రిప్టాన్, గ్జినాన్ అనే వాయువులు నామమాత్రంగా ఉంటాయి. నత్రజని జడవాయువు కొన్ని బ్యాక్టీరియాలకు తప్ప జీవకోటి అవసరాలకు పనికి రాదు. ఆమ్లజని (ఆక్సిజన్) జీవకోటికి అత్యంత అవసరమైన వాయువు. బొగ్గుపులుసు వాయువు (CO2) కిరణజన్య సంయోగ క్రియ ద్వారా వృక్ష జాతుల్లో పిండి పదార్థాల తయారీకి ఉపయోగపడుతుంది. పరిశ్రమలు, ఖనిజాలు, బొగ్గు, చమురు లాంటివి వాడటం వల్ల కార్బన్లు, నైట్రోజన్, సల్ఫర్, ఫ్లోరైడ్, కార్బన్ డై ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్ వాయువులు గాలిలో అధిక పరిమాణంలో కేంద్రీకృతమై పర్యావరణానికి హాని కలిగించడాన్నే వాయు కాలుష్యం అంటారు.
        ప్రధానంగా గ్రీన్‌హౌస్ వాయువుల్లో కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం; మాంసం, జీవవ్యర్థాల నుంచి వెలువడే మీథేన్ పెరగడం; భూఉపరితల ఉష్ణోగ్రత అధికమై మంచుకొండలు, కొండచరియలు, సముద్ర మట్టం పెరగడం, వరదలు, తుపాన్లు లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రాణ నష్టం సంభవిస్తుంది. దీన్నే భూతాపం (గ్లోబల్ వార్మింగ్) అంటారు. అలాగే వాతావరణంలో సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ మిశ్రమాల వల్ల ఆమ్ల వర్షాలు కురుస్తున్నాయి. సల్ఫర్ డై ఆక్సైడ్ పెరిగి వివిధ పత్రాలు, లైబ్రరీ పుస్తకాలు పసుపు రంగులోకి మారుతున్నాయి.
        భూఉపరితలానికి 30 - 35 కి.మీ. ఎత్తులో ఉన్న స్ట్రాటో పొర అతినీలలోహిత కిరణాల నుంచి జీవరాశిని రక్షిస్తుంది. దీన్నే ఓజోన్ పొర (O3) అంటారు. రిఫ్రిజిరేటర్లు, ఏసీ, మిక్సీలు, క్లీనింగ్ సాల్వెంట్లు, క్లోరోఫ్లోరో కార్బన్‌ల (CFCs) వల్ల ఓజోన్ పొర పలచబడి దానికి రంధ్రాలు ఏర్పడుతున్నాయి. ఈ కారణంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు తీవ్రనష్టం జరుగుతుంది. వాయు కాలుష్యం వల్ల చర్మ, శ్వాసకోశ, మెదడు, గుండె, కంటి వ్యాధులు సంక్రమిస్తున్నాయి.

 

నేల కాలుష్యం
వివిధ వ్యర్థ పదార్థాల మిశ్రమం వల్ల భూమి యొక్క జీవ - భౌతిక - రసాయన ధర్మాల్లో మార్పులు ఏర్పడి, భూమి ఉత్పత్తి సామర్థ్యం తగ్గి నేల కాలుష్యం ఏర్పడుతుంది. భూ నాణ్యత కోల్పోవడాన్ని భూమి క్షీణత/కాలుష్యం అంటారు. భూమికోత, ఎడారీకరణ, లవణీకరణ, ఆమ్లీకరణ, అధిక పరిమాణంలో రసాయనాలు భూమిలోకి చొచ్చుకుపోయి భూసారం కోల్పోవడం వల్ల భూమి నాణ్యత క్షీణిస్తుంది. భూఉపరితలంపై ఉన్న సారవంతమైన పొర కొట్టుకుపోవడాన్ని భూమికోత అంటారు. విచక్షణా రహితంగా అడవులను నరికి పంటపొలాలుగా మార్చడం వల్ల ఇది ఏర్పడుతుంది.

 

ఎడారీకరణ
ఎడారి భూములు నిస్సారంగా, ఇసుకతో ఉండి కఠినమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. పశువులు మేయడం, వృక్షాలను వంటచెరుకుగా ఉపయోగించడం, అడవులను నరకడం, క్షారీకరణ, లవణీకరణ వల్ల భూములు ఎడారులుగా మారుతున్నాయి.

 

లవణీకరణ
భూమిలో లవణాలు కేంద్రీకృతమవడం సహజంగా లేదా మానవ చర్యల వల్ల జరుగుతుంది. సముద్ర తరంగాలు, వాయుగుండాలు, వరదల వల్ల నేల లవణీకరణం చెందుతుంది. దీనితో పాటు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడటం; కృత్రిమ నీటి సదుపాయాలైన కాలువలు, గొట్టపుబావుల ద్వారా సేద్యం చేయడం వల్ల లవణీకరణ ఏర్పడుతుంది.

 

 ఆమ్లీకరణ
వాతావరణంలో సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ పెరగడంతో ఆమ్లవర్షాలు కురిసి భూఉపరితలంపై ఆమ్లీకరణ జరుగుతుంది. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు భూమిలోకి చొచ్చుకుపోవడం, భూ నాణ్యతను కాపాడే బ్యాక్టీరియా, వానపాములు లాంటి సూక్ష్మజీవులు అంతరించడం వల్ల భూ కాలుష్యం ఏర్పడుతుంది.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కరవులు - వరదలు

ప్రస్తుత ప్రపంచంలో జనాభా విస్ఫోటనం, వన నిర్మూలన, మానవ జీవ వ్యర్థాలు, అధిక పరిశ్రమల వ్యర్థాల వల్ల కార్బన్ల సంఖ్య అధికమై పర్యావరణం క్షీణించి అనేక ఖండాలు, దేశాల్లో భూతాపం పెరిగి కరవులు, వరదలు సంభవిస్తున్నాయి. ప్రత్యేకంగా పశ్చిమ పసిఫిక్‌లో ఎల్‌నినో, లానినో పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా అధిక కరవు కాటకాలు, వరదలు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా వివిధ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పోటీ పరీక్షల్లో విపత్తు నిర్వహణ - పర్యావరణ అంశాలపై ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు.
 

కరవు ఎలా వస్తుంది?
            కరవు అనేది వర్షపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి వైపరీత్యం. ఒక ప్రాంతంలో కురవాల్సినంతగా వర్షం కురవకపోతే ఆ ప్రాంతం పొడిగా మారుతుంది. దాన్నే కరవు అంటారు. కరవును క్షామం, అనావృష్టి అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాల్లో అవి ఉన్న భౌగోళిక స్థితుల వల్ల తక్కువ వర్షపాతం పడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నప్పుడు వాటిని 'కరవు పీడిత ప్రాంతాలు' అంటారు.

ఉదా: తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో ప్రతి అయిదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరవు ఏర్పడే అవకాశం ఉంది.
* ఒక ప్రాంతంలో అధిక లేదా అల్ప వర్షపాతాన్ని (70 - 100 సంవత్సరాల) సగటు సాధారణ వర్షపాతంతో పోల్చి కింది విధంగా చెబుతారు.
a) అధిక: + సగటు వర్షపాతం కంటే 20% ఎక్కువ.
b) సాధారణ: + సగటు వర్షపాతం కంటే 19% ఎక్కువ నుంచి 19% తక్కువ.
c) అల్ప: - సగటు వర్షపాతం కంటే 20% నుంచి 59% తక్కువ.
d) అత్యల్ప: - సగటు వర్షపాతం కంటే 60% తక్కువ.
* జాతీయ వ్యవసాయ కమిషన్ (National Commission for Agriculture) కరవును మూడు రకాలుగా పేర్కొంది.
a) వాతావరణ కరవు: ఈ రకమైన కరవు సాధారణ అవపాతంలో (వర్షం) 10% కంటే ఎక్కువ అవపాతం లోపించడం.
b) వ్యవసాయ కరవు: మృత్తికల్లో తేమ లోపించడం, నేలలు సరిగా లేకపోవడం.
c) జల సంబంధ కరవు: భూగర్భ జలాలు ఇంకిపోవడం, మృత్తికలు అంతర్ భౌమ జలాలను గ్రహించకపోవడం.

* 2016 డిసెంబరు జాతీయ కరవు నిర్వహణ కరదీపిక (Manual of Drought Management) లో కరవును నాలుగు రకాలుగా పేర్కొన్నారు.
a) 750 mm కంటే తక్కువ వర్షం - దీర్ఘకాలిక కరవు - 33%
b) 750 mm - 1125 mm మధ్య వర్షం - కరవు పీడిత ప్రాంతం - 35%
c) 1126 mm - 2000 mm అధిక వర్షం - సాధారణ కరవు - 24%
d) 2000 mm కంటే అధిక వర్షం - కరవులేని ప్రాంతం - 8% గా దేశభౌగోళిక వైశాల్యంలో కలిగి ఉంది.
* భారత వాతావరణ శాఖ (IMD) న్యూదిల్లీ కరవును 5 రకాలుగా వర్గీకరించింది. భారతదేశభౌగోళిక వైశాల్యంలో 68% కరవులు సంభవిస్తున్నాయి.

 

కరవు ప్రభావం:
         కరవు సంభవించిన ప్రాంతాల్లో దాని ప్రభావం క్రమేణ తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.
* భూగర్భ జల నీటి మట్టం పడిపోవడం, తాగు నీటి కొరత.
* పంటల విస్తీర్ణం తగ్గడం, వ్యవసాయ రంగంలో ఉపాధి తగ్గిపోవడం.
* ఆహార ధాన్యాల, పశుగ్రాస కొరత; పశువులు చనిపోవడం.
* పోషకాహార లోపం ప్రత్యేకించి చిన్న పిల్లల్లో అతిసారం, కలరా లాంటి రోగాలు; ఆహార కొరత వల్ల కంటి చూపు దెబ్బతినడం, పని కోసం ప్రజలు వలస వెళ్లడం.

కరవు నివారణ, దాన్ని ఎదుర్కోవడం:
* కరవు ఒక్కసారిగా సంభవించే ప్రమాదం కాదు. అది నిదానంగా వస్తుంది. దీన్నే Creeping Disaster అంటారు.
* మన దేశంలో ఇప్పటివరకు 25 ప్రధాన కరవులు సంభవించాయి.
* బెంగాల్ కరవు వల్ల 1770లో మొత్తం జనాభాలో 33% ( 1/3వ వంతు) మంది మరణించారు.
* 1943 - 44లో మన దేశంలో 3 - 4 మిలియన్ల మంది ప్రజలు కరవు బారిన పడ్డారు.
* మన దేశంలో తరచూ రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కరవులు ఏర్పడతాయి.
* కరవును నివారించడానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక అధికారులు నీటి సంరక్షణ విధానాలపై అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నారు.
* వర్షపు నీటిని ఇంకుడు గుంతల్లోకి మళ్లించడం ద్వారా భూగర్భ జలాలను పెంచవచ్చు.
* కరవు ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం సమగ్ర వాటర్‌షెడ్ యాజమాన్య పథకాలను (IWMP) అమలు చేస్తుంది.

 

వరదలు (Floods)
ఒక ప్రాంతంలో కొంతకాలం పొడిగా ఉండి అకస్మాత్తుగా అధిక వర్షాలతో ఆ ప్రాంతం పొంగి పొర్లడాన్ని వరదలు అంటారు. అంటే కురవాల్సిన వర్షం కంటే అధిక వర్షం రావడాన్ని 'వరద బీభత్సం' లేదా 'అతివృష్టి' అంటారు. సాధారణంగా వాతావరణ శాఖ (IMD) ప్రకారం భూ ఉపరితలంపై 12 అంగుళాల వర్షం కురిసినప్పుడు వరదగా ప్రకటిస్తారు.

ప్రధానంగా వరదలు అనేవి
a) అధిక వర్షం కురిసే మైదాన ప్రాంతాల్లో
b) పర్వత వాలు ప్రదేశాల్లో
c) నదీ వక్రత, తీర ప్రాంతాల్లో
d) పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది.
* ప్రకృతి విపత్తుల్లో వరదలు అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి ఆయా దేశాలను అకస్మాత్తుగా ముంచేస్తాయి. ఇవి ఆరు అంగుళాల వరదలో మనిషిని ప్రమాదంలోకి నెట్టి వేస్తాయి.
* ప్రపంచంలో ఎక్కువగా వరదలు ఆసియా తూర్పు దేశాల్లో (80%) సంభవిస్తున్నాయి.
* వరదల నుంచి కాపాడటానికి ఆయా ప్రాంత ప్రజలను హెచ్చరించేందుకు 'నైలో మీటర్' సాధనాన్ని ఉపయోగిస్తారు.
* గ్రామీణ ప్రాంతంలోని మైదాన వరదల కంటే పట్టణ ప్రాంతంలోని వరదలు వైశాల్యంలో 6 రెట్లు, ఎత్తులో 8 రెట్లు ఎక్కువగా వస్తాయి. కారణం పట్టణ ప్రాంతాల్లో డ్రైనేజీ సరిగా లేకపోవడం, ఇరుకు రోడ్లు, భూమి నీటిని పీల్చుకోకపోవడం.

 

భారతదేశం - వరదలు
               మన దేశంలో వరదలు ప్రధానంగా అతిపెద్ద నదులైన గంగా - సింధూ - బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థల్లో వస్తున్నాయి. వాటిలో ఆకస్మిక వరదలు ఎక్కువగా బ్రహ్మపుత్ర నది వల్ల సంభవిస్తున్నాయి.
A) ఉత్తర భారతదేశంలో 60% వరదలు గంగా - బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థల వల్ల సంభవిస్తున్నాయి.

గంగా నది  దాని ఉపనది ప్రాంతాలైన ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్, బెంగాల్‌లో అత్యధిక భౌగోళిక వైశాల్యం వరద ప్రమాదంలో ఉంది. అలాగే గంగా - బ్రహ్మపుత్ర నదుల వల్ల తరచుగా అసోం, బెంగాల్, ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్‌లో వరదలు వస్తున్నాయి.
ఉదా: 2013 జూన్ 17 నాటి ఉత్తరాఖండ్ వరదల వల్ల సుమారు 5 వేల మంది మరణించారు.
2016 సెప్టెంబరు 3 - 6 తేదీల్లో జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జీలం నది వరద వల్ల 300 మంది మరణించారు.
B) ద్వీపకల్ప భారత్‌లో 40% వరదలు స్థానిక నదుల వల్ల వస్తున్నాయి. దక్షిణ భారత్‌లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఎక్కువగా వరదలు వస్తాయి.
ఉదా: 2009లో తుంగభద్ర నది వల్ల కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన వరదలు వచ్చాయి.
              మన దేశంలో సగటున ప్రతి సంవత్సరం 7.5 మిలియన్ హెక్టార్లలో వరదలు వస్తున్నట్లు జాతీయ వరద కమిషన్ పేర్కొంది. దేశ  భౌగోళిక వైశాల్యంలో 40 మిలియన్ హెక్టార్ల భూభాగంలో వరద ప్రమాదం ఉన్నట్లు గుర్తించింది.
              జాతీయ విపత్తు వరద అంచనా ప్రకారం భౌగోళిక ప్రాంతంలో 12% వరదలు వస్తున్నట్లు పేర్కొంది. 2016 UNISDR ప్రకారం ప్రతి సంవత్సరం 5% వరదలను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నట్లు, విపత్తులకు ఖర్చు చేసే వ్యయంలో కేవలం వరదలకే 33% వెచ్చిస్తున్నట్లు అంచనా వేసింది.

 

వరదలు - నివారణ చర్యలు
* 1937లో బ్రిటిష్‌వారు వరదలను నివారించడానికి ఒక సివిల్ సర్వెంట్ ద్వారా 'ఫ్లడ్ రిలీఫ్ కమిషన్‌'ను ఏర్పాటు చేసి నివారణ చర్యలు చేపట్టేవారు.

* 1954లో 'జాతీయ వరద నియంత్రణ మండలి'ని (National Flood Control Board - NFCB) ఏర్పాటు చేశారు.
* 1980లో జాతీయ వరద కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
* 2010లో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీని NDMA మార్గదర్శకాల ప్రకారం పట్టణ వరద విపత్తు నివారణ (UFDM)ను రూపొందించారు.
* వరదలు వస్తున్నట్లు సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) హెచ్చరిస్తుంది.
* ప్రతి సంవత్సరం వరదల వల్ల 8.1 మిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూమి, 3.6 మిలియన్ హెక్టార్ల పంటలు నష్టపోతున్నాయి.
* వరదలను నివారించడానికి 2007-12 మధ్య 11వ ప్రణాళికలో రూ.8 వేల కోట్లను కేటాయించారు.

వరదలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

a) మరిగించిన నీటిని తాగాలి.
b) డయేరియా ప్రబలినప్పుడు టీ - డికాషన్లు, గంజి, లేతకొబ్బరి నీరు తీసుకోవాలి.
c) వ్యాధులు వ్యాప్తి చెందకుండా చుట్టుపక్కల బ్లీచింగ్ పౌడర్ చల్లాలి.
d) నీటిని శుద్ధి చేయడానికి హాలోజన్ (Halogen) బిళ్లలు ఉపయోగించాలి.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కరవులు - వరదలు

1. జాతీయ వరద నియంత్రణ మండలిని (NFCB) ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 1954

 

2. భారతదేశ భౌగోళిక వైశాల్యంలో ఎంత శాతాన్ని 'కరవు పీడిత' ప్రాంతంగా గుర్తించారు?
జ: 68%

 

3. భారత వాతావరణ శాఖ (IMD) న్యూదిల్లీ కరవును ఎన్ని రకాలుగా వర్గీకరించింది?
జ: 5

 

4. ఆకస్మిక వరదలు (Flash Floods) ఎప్పుడు వస్తాయి?
a) ఉరుములు, తుపాన్లు వచ్చినప్పుడు
b) అధిక వర్షం వల్ల నదులు ఉప్పొంగినప్పుడు
జ: a, b సరైనవి

 

5. 'జాతీయ వ్యవసాయ కమిషన్' ప్రకారం మృత్తిక తేమ కోల్పోవడం ఏ రకమైన కరవు?
జ: వ్యవసాయ కరవు

 

6. భారతదేశంలో ఆకస్మిక వరదలు ఎక్కువగా ఏ నది వల్ల సంభవిస్తుంటాయి?
జ: బ్రహ్మపుత్ర

 

7. 'హాలోజెన్' బిళ్లలను దేనికి ఉపయోగిస్తారు?
జ: నీటిని శుద్ధిచేయడానికి

 

8. వరదలు వస్తున్నప్పుడు భూజల తలాన్ని కొలవడానికి, ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడానికి ఉపయోగించే సాధనం?
జ: నైలో మీటర్

 

9. ఒక ప్రాంతంలో కరవును ఎంత శాతం వర్షపాతం నమోదైతే చాలా తక్కువ అని (-) గుర్తిస్తారు?
జ: సగటు కంటే 60% నుంచి 99% తక్కువ వర్షం

 

10. ప్రభుత్వం కరవు ప్రభావాన్ని తగ్గించడానికి కింది ఏ పథకాల ద్వారా కృషి చేస్తుంది?
(a) సమగ్ర వాటర్ షెడ్ యాజమాన్య పథకం
(b) భూగర్భ జలాలను పెంచడానికి ఇంకుడు గుంతల పథకం
జ: a, b సరైనవి

 

11. పట్టణ వరదలు ఏ మంత్రిత్వ శాఖ నిర్వహణలో ఉంటాయి?
జ: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ

 

12. భూ ఉపరితలంపై ఎంత మొత్తం నీరు ఉప్పొంగినప్పుడు వరదగా నమోదు చేస్తారు?
జ: 12 అంగుళాలు

 

13. కరవు అనేది?
జ: నిదాన ప్రక్రియ
                                                           

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
 

1. కిందివాటిలో నిదానంగా విస్తరించే విపత్తు? (ఏఎస్ఓ-2017)
    1) రసాయనిక                            2) భూకంపం
    3) కొండ చర్యలు విరగడం              4) కరవు
జ: 4 (కరవు)

 

2. కిందివాటిలో మానవ ప్రేరేపిత విపత్తు ఏది? (ఏఎస్ఓ-2017)
    1) చెన్నై వరదలు              2) చెన్నై సునామీ
    3) కేదార్‌నాథ్ వరద           4) తక్కువ వర్షం
జ: 1 (చెన్నై వరదలు)

 

3. క్షామం వల్ల ఎవరు ఎక్కువగా బాధపడతారు? (గ్రూప్-4, 2012)
జ: మహిళలు

 

4. భారతదేశంలో కరవు దేనితో ముడిపడి ఉంది? (పంచాయతీ కార్యదర్శి - 2013)
జ: రుతు పవనాలు

 

5. కిందివాటిలో ఏది కరవు నివారణా చర్య కాదు? (గ్రూప్-2, 2011)
    1) చెక్‌డ్యామ్‌ల నిర్మాణం                          2) చెరువులు పూడిక తీయడం 
     3) పొలంలో ఇంకుడు గుంత తవ్వడం         4) మొక్కలు నాటడం
జ: 4 (మొక్కలు నాటడం)

 

6. ''విపత్తులన్నీ ఆపదలే, కానీ ఆపదలన్నీ విపత్తులు కావు" ఈ ప్రకటన - (డిప్యూటీ సర్వేయర్-2017)
జ: నిజమైంది

 

7. భారతదేశంలో వరదలకు గురయ్యే ప్రదేశం సుమారు ఎంత శాతం ఉంది? (గ్రూప్-2, 2012)
జ: 12%

 

8. 2016 కరవు నిర్వహణ కరదీపిక ప్రకారం దీర్ఘకాలిక కరవును ఎంత వర్షపాతం ఉంటే ప్రకటిస్తారు? (గ్రూప్-1, 2017)
జ: 750 mm కంటే తక్కువ

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విపత్తు నిర్వహణ చట్టం - 2005  

మాదిరి ప్ర‌శ్న‌లు

 

1. పారిశ్రామిక రసాయన విపత్తులు ఏ నోడల్ మంత్రి నిర్వహణలో ఉంటాయి?
జ: పర్యావరణ, అటవీ మంత్రి

 

2. ఆసియా విపత్తుల ప్రతిస్పందన సంస్థ ఎక్కడ ఉంది?
జ: బ్యాంకాక్

 

3. NDRF 10వ బెటాలియన్ ఎక్కడ ఉంది?
జ: విజయవాడ

 

4. విపత్తుల్లో జిల్లా ప్రణాళిక విపత్తు అభివృద్ధి స్థాయి
జ: L1

 

5. 2015, సెప్టెంబరు 25న సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సదస్సు (SDG)ను ఎక్కడ నిర్వహించారు?
జ: న్యూయార్క్

 

6. 2015 - 2030 వరకు జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక విపత్తు కుదింపులో ఎన్ని లక్ష్యాలను పేర్కొంది?
జ: 14

 

7. కిందివారిలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీలో (NDMA) సభ్యులు కానివారు?
    1) జె.సి. పంత్                 2) డి.ఎన్. శర్మ
    3) ఎన్.సి మర్వా             4) కమల్ కిశోర్
జ: 1 (జె.సి. పంత్)

 

8. NRSA భూతల కేంద్రం (ఎర్త్ స్టేషన్) ఎక్కడ ఉంది?
జ: షాద్‌నగర్

 

9. ఇటీవల 2015 అంతర్జాతీయ (UNO) విపత్తు కుదింపు సదస్సు ఎక్కడ జరిగింది?
జ: జపాన్ - సెండాయ్

 

10. ఇటీవల విపత్తు నిర్వహణలో నూతనంగా ఏర్పాటు చేసిన NDRF దళం
జ: SSB

 

11. జాతీయ నిర్వహణ విపత్తు కమిటీ ఛైర్మన్
జ: హోంశాఖ కార్యదర్శి

 

12. జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ ఛైర్మన్
జ: క్యాబినేట్ కార్యదర్శి

 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

 

1. భారతదేశంలో ఎన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలు విపత్తులను ఎదుర్కొంటున్నాయి? (2011, గ్రూప్ 1)
జ: 25

 

2. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఎక్స్ అఫీషియో ఛైర్మన్? (2011, గ్రూప్ 2)
జ: ప్రధానమంత్రి

 

3. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) ఎవరి నిర్వహణలో ఉంటుంది? (2016, గ్రూప్ 2)
జ: హోంమంత్రి

 

4. జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక (NDMP)ను ప్రధాని ఎప్పుడు విడుదల చేశారు? (2016 డిప్యూటీ సర్వేయర్)
జ: 2016, జూన్ 1

 

5. సార్క్ విపత్తు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? (2012, గ్రూప్ 4)
జ: కాఠ్‌మాండూ

 

6. నేషనల్ సివిల్ డిఫెన్స్ సర్వీస్ కాలేజ్ ఎక్కడ ఉంది? (2012, గ్రూప్ 4; 2013, పంచాయతీ సెక్రటరీ)
జ: నాగ్‌పుర్

 

7. జాతీయ విపత్తు నిర్వహణ చట్టాన్ని పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది? (2011, గ్రూప్ 1)
జ: 2005, డిసెంబరు 23

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జీవుల ఆహారపు అలవాట్లు

జీవావరణంలో గొలుసులు.. పిరమిడ్‌లు!

  ఆహారం ప్రతి జీవికి ప్రాథమిక అవసరం. ఒక్కో జీవికి ఒక్కో రకమైన ఆహారపు అలవాటు ఉంటుంది.  కానీ ఏదో ఒక దశలో ఒక ప్రతి జీవి ఇంకో జీవికి ఆహారంగా ఉపయోపడటం ఈ ఆవరణ వ్యవస్థలోని ప్రత్యేక లక్షణం. ఆ విధంగా ప్రకృతిలోని ఆహారపు గొలుసులో ఏ జీవులు ఏయే స్థాయుల్లో ఉన్నాయో అభ్యర్థులు తెలుసుకోవాలి. వాటిపై పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. 

 

  ఆవరణ వ్యవస్థలోని జీవ సముదాయాల్లో వివిధ జీవజాతుల ఆహారపు అలవాట్లు విభిన్న రకాలుగా ఉంటాయి. శాకాహారులు, మాంసాహారులు, సర్వభక్షకాలు ఇలా భిన్న అలవాట్లతో జీవులుంటాయి. వాటి ఆహార అలవాట్లను పలు రకాలుగా విభజించవచ్చు.

 

ఉత్పత్తిదారులు: కావాల్సిన ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుని స్థానబద్ధంగా జీవించే జీవులను ఉత్పత్తిదారులు అంటారు. ఇవి ఇతర జీవులకూ ఆహారాన్ని అందిస్తాయి. వీటినే స్వయం పోషకాలు అంటారు.  ఆహార గొలుసులో ప్రథమ పోషక స్థాయిని ఆక్రమిస్తాయి. సౌరశక్తి నుంచి లేదా వివిధ రసాయన పదార్థాల నుంచి సంక్లిష్ట కర్బన పదార్థాలను తయారు చేసుకుని జీవిస్తాయి.

ఉదా: మొక్కలు, నీలి ఆకుపచ్చ శైవలాలు, వృక్ష ప్లవకాలు, బ్యాక్టీరియా

 

వినియోగదారులు: ఇవి ఆహార పదార్థాల కోసం ఉత్పత్తిదారులపై లేదా ఇతర వినియోగదారులపై ఆధారపడి జీవించే జీవజాతులు. వీటినే పరపోషకాలు అంటారు. ఆహార అలవాట్లను బట్టి ఈ జీవులను కింది రకాలుగా విభజించారు.

 

ఎ) ప్రథమ వినియోగదారులు: ఇవి తమకు కావాల్సిన ఆహార పదార్థాలను ప్రథమ పోషక స్థాయిలోని ఉత్పత్తిదారుల నుంచి పొందుతాయి. వీటిని శాకాహారులుగా పిలుస్తారు. ఇవి ఆహార గొలుసులో ద్వితీయ పోషక స్థాయిని కలిగి ఉంటాయి.

ఉదా: మిడతలు, గొల్లభామలు, కుందేళ్లు, జింకలు

 

బి) ద్వితీయ వినియోగదారులు: ఇవి తమకు కావాల్సిన ఆహారాన్ని ఉత్పత్తిదారులు, ప్రథమ వినియోగదారుల నుంచి పొందుతాయి. ఇవి శాకాహారులుగా, మాంసాహారులుగా జీవిస్తాయి. వీటినే ప్రాథమిక మాంసాహారులు లేదా సర్వభక్షకులు అని పిలుస్తారు. ఇవి ఆహార గొలుసులో తృతీయ పోషక స్థాయిని ఆక్రమిస్తాయి.

ఉదా: మానవులు, కుక్కలు, పిల్లులు, కోళ్లు

 

సి) తృతీయ వినియోగదారులు: ఇవి ప్రథమ, ద్వితీయ వినియోగదారులపై ఆధారపడి తమకు కావాల్సిన ఆహార పదార్థాలను పొందగలుగుతాయి. వీటిని ద్వితీయ మాంసాహారులుగా పరిగణిస్తారు. ఇవి ఆహార గొలుసులో చతుర్ద పోషక స్థాయిని ఆక్రమించి ఉంటాయి.

ఉదా: పెద్ద చేపలు, కొంగలు, గద్దలు, పాములు, నక్కలు, తోడేళ్లు

 

డి) అంతిమ వినియోగదారులు: ఆహార పదార్థాల కోసం ఇతర వినియోగదారులపై ఆధారపడతాయి. ఇవి ఆహార గొలుసులో పంచమ పోషక స్థాయిలో ఉంటాయి. ఉదా: పులులు, సింహాలు.

పరాన్నజీవులు: ఇతర జీవులపై నివసిస్తూ, వాటి శరీరాల నుంచి ఆహారాన్ని పొందుతూ ఆశ్రయం ఇచ్చిన జీవికి హాని కలిగించేవి. వీటినే పరాన్నజీవులు (పారాసైట్స్‌) అంటారు.

ఉదా: జలగ, నల్లి, నులిపురుగులు

 

విచ్ఛిన్నకారులు: ఇవి ఉత్పత్తిదారులు, వినియోగదారులు చనిపోయిన తరువాత వాటి మృత కళేబరాల్లోని సంక్లిష్ట కర్బన పదార్థాలను, సరళ అకర్బన పదార్థాలుగా విచ్ఛిన్నం చేసి మృత కళేబర కాలుష్యం నుంచి పర్యావరణాన్ని కాపాడతాయి. వీటిని ప్రకృతి పారిశుద్ధ్యులు (నేచురల్‌ స్కావెంజర్స్‌) అంటారు.

ఉదా: బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, రాబందులు

 

శక్తి పరిమాణాల ప్రకారం..

ఆహార గొలుసులోని వివిధ స్థాయుల్లో అందుబాటులోని శక్తి పరిమాణాలను అందించే వివిధ జీవజాతులకు చెందిన జనాభా, జీవ పదార్థాలను, రేఖీయంగా చూపించడాన్ని జీవావరణ పిరమిడ్‌లు అంటారు. వీటిని మొదట ఛార్లెస్‌ ఎల్టన్‌ అనే ఆవరణ శాస్త్రవేత్త ప్రతిపాదించడం వల్ల వీటిని ఎల్టోనియం పిరమిడ్‌లు అంటారు. వీటిని మూడు రకాలుగా విభజించారు.

 

సంఖ్యా పిరమిడ్‌లు: ఇవి వివిధ జనాభాల సంఖ్యాపరమైన సంబంధాన్ని ఆహార గొలుసులో వివిధ పోషక స్థాయుల్లో సూచిస్తాయి. సాధారణంగా పిరమిడ్లలో ఆధార స్థాయిలో ఉత్పత్తిదారుల సంఖ్య ఎక్కువగా ఉండి క్రమంగా అగ్రభాగానికి చేరేకొద్ది వివిధ పోషక స్థాయుల్లోని జీవుల సంఖ్య తగ్గుతుంది. కానీ కొన్నింటిలో ఇది తలకిందులుగా కూడా ఉంటుంది.

ఉదా: అటవీ ఆవరణ వ్యవస్థలో చేతితో అల్లిన నూలు కండె ఆకారంలో, పరాన్నజీవుల ఆవరణ వ్యవస్థలో తలకిందులుగా, మిగిలిన ఆవరణ వ్యవస్థల్లో నిట్టనిలువుగా సంఖ్యా పిరమిడ్‌లుంటాయి.

 

జీవరాశి పిరమిడ్‌లు: వివిధ పోషక స్థాయుల్లోని జీవ అనుఘటకాల భారం లేదా ద్రవ్యరాశి గురించి తెలిపే పిరమిడ్‌ పటాన్ని జీవరాశి పిరమిడ్‌ అంటారు. ఇందులో ఆధార భాగంలోని పోషకస్థాయి నుంచి శిఖర పోషకస్థాయి వరకు క్రమంగా జీవరాశి పరిమాణం తగ్గడాన్ని గమనించవచ్చు. ఇందులో గడ్డి మైదానాలు, అటవీ ఆవరణ వ్యవస్థలో పిరమిడ్‌లు నిట్టనిలువుగా ఉండగా, కొలను ఆవరణ వ్యవస్థలో తలకిందులుగా ఉంటుంది.

 

శక్తి పిరమిడ్‌లు: ఒక చదరపు మీటరు వైశాల్యం ఉన్న స్థలంలో సంవత్సరం పాటు వివిధ పోషక స్థాయుల్లోని జీవరాశులు వినియోగించిన శక్తి మొత్తాన్ని తెలిపే రేఖాపటం శక్తి పిరమిడ్‌. ఇందులో ఉత్పత్తిదారుల నుంచి అంతిమ వినియోగదారుల స్థాయి వరకు శక్తి క్రమంగా తగ్గుతుంది. వివిధ ఆవరణ వ్యవస్థల్లోని శక్తి పిరమిడ్‌లు నిట్టనిలువుగా ఉంటాయి.

 

మాదిరి ప్రశ్నలు

 

1. సంఖ్యా పిరమిడ్‌ కిందివాటిలో వేటిని సూచిస్తుంది?

1) ఒక నిర్దిష్ట ప్రాంతంలోని జాతుల సంఖ్య    2) ఒక జీవ సముదాయంలోని ఉపజాతులు

3) ఒక సముదాయంలోని జనాభా           4) పోషక స్థాయిలోని జీవి ద్రవ్యరాశి

 

2. కిందివాటిలో ఆహార గొలుసుకు మూలాధారం?

1) ఉత్పత్తిదారులు 2) వినియోగదారులు 3) విచ్ఛిన్నకారులు  4) పూతికాహారులు

 

3. కిందివాటిలో సర్వభక్ష జీవికి ఉదాహరణ

1) కుందేలు   2) పులి   3) ఏనుగు  4) కాకి

 

4. ఆవరణ వ్యవస్థలో మిడత, గొల్లభామ, కుందేలు ఏ వినియోగదారులు?

1) ప్రథమ  2) ద్వితీయ   3) అంతిమ  4) ఉత్పత్తిదారులు  

 

5. నిట్టనిలువు పిరమిడ్‌లో కోడి, పిల్లి, కుక్కలను ఏ పోషక స్థాయిలో చూపిస్తారు?

1) ప్రథమ  2) ద్వితీయ   3) తృతీయ   4) చతుర్థ 

 

6. ఆవరణ వ్యవస్థలో శక్తి పిరమిడ్‌లు ఏ విధంగా ఉంటాయి?

1) సమాంతరం    2) నిట్టనిలువు    3) తలకిందులు    4) అన్నీ

 

7. కొలను ఆవరణ వ్యవస్థలో పిరమిడ్‌ ఏ విధంగా ఉంటుంది?

1) తలకిందులుగా    2) నిట్టనిలువుగా    3) జిగ్‌జాగ్‌  4) నూలుకండె ఆకారం  

 

8. అటవీ ఆవరణ వ్యవస్థలో సంఖ్యా పిరమిడ్‌లు ఏ విధంగా ఉంటాయి?

1) తలకిందులుగా   2) అడ్డంగా   3) నూలుకండె ఆకారం  4) సిలిండర్‌ ఆకారం

 

9. సాధారణంగా పిరమిడ్‌లలో ఆధారస్థాయిలోని  అణుఘటకాలు?

1) ఉత్పత్తిదారులు  2) వినియోగదారులు   3) ద్వితీయ వినియోగదారులు    4) అన్నీ  

 

10. ఆకుపచ్చ శైవలాలు దేనికి ఉదాహరణ?

1) పరాన్నజీవులు   2) పూతికాహారులు   3) ప్రొడ్యూసర్స్‌   4) ట్రాన్స్‌ఫార్మర్స్‌

 

జవాబులు: 1-1, 2-1, 3-3, 4-1, 5-3, 6-2, 7-1, 8-3, 9-1, 10-3.

 

రచయిత: జల్లు సద్గుణరావు

 

Posted Date : 30-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆవరణ శాస్త్రం - పోషక వలయాలు

జీవనాధార వలయాలు

  భూమి మీద సమస్త జీవరాశులకు, జీవ పక్రియలకు సౌరశక్తి ప్రధాన ఆధారం. సౌరశక్తి వల్ల నీరు ఆవిరై మేఘాలుగా ఏర్పడుతుంది. తిరిగి వర్షించి చక్రీయ వలయంలో నీరుగానే మారుతుంది. ఆవరణ వ్యవస్థలోని కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్‌ లాంటి పోషకాలు నిరంతరం జీవులకు, వాటి పరిసరాలకు మధ్య చక్రీయంగా బదిలీ అవుతూ జీవుల పోషణకు ఉపయోగపడతాయి. అసలు ఈ వలయాలు జీవులకు ఎలా ఉపయోగపడుతున్నాయో పోటీపరీక్షల అభ్యర్థులు తెలుసుకోవాలి.

 

  ప్రతి జీవికి శ్వాసించడానికి, శారీరక ప్రక్రియలకు, ప్రత్యుత్పత్తి నిర్వహించడానికి నిరంతరం పోషక విలువలు కావాలి. కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్, ఫాస్ఫరస్, హైడ్రోజన్‌ మొదలైన ఖనిజ పోషకాలు నేలలో, నీటిలోనూ స్థిరంగా ఉంటాయి. వీటినే పోషకాల నిలకడ స్థితి అంటారు. అయితే ఇవి జీవులకు, వాటి పరిసరాలైన శిలావరణం, జలావరణం, వాతావరణాల మధ్య చక్రీయంగా బదిలీ అవుతూ జీవుల పోషణకు ఉపయోగపడుతుంటాయి. దీన్నే జీవ-భూ-రసాయన వలయం అంటారు. ఈ వలయం సక్రమంగా కొనసాగడంలో విచ్ఛిన్నకారులు కీలకపాత్ర పోషిస్తాయి.

  చనిపోయిన వృక్ష, జంతు కళేబరాల నుంచి ఏర్పడిన సేంద్రియ పదార్థాల్లో ప్రొటీన్లు, కొవ్వులు, పిండి పదార్థాలు ఉంటాయి. బ్యాక్టీరియా చర్యల వల్ల సేంద్రియ పదార్థాలు చివరికి సరళమైన పోషక పదార్థాలుగా మారతాయి. ఆకుపచ్చని మొక్కలు ఈ ఖనిజ పదార్థాలను గ్రహించి వాటిని మళ్లీ కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, లిపిడ్లు లాంటి సంక్లిష్ట ఆహార పదార్థాలుగా మార్చుకుంటాయి. అవి తిరిగి ఆహార గొలుసు ద్వారా ఆవరణ వ్యవస్థలోని జీవజాతులకు అందుతాయి. ఈ వలయం నిరంతరం కొనసాగుతుండటంతో ఆవరణ వ్యవస్థ సమతౌల్యంగా ఉంటుంది. 

 

పోషక వలయాలను కింది విధంగా విభజించారు.

 

ఆక్సిజన్‌ వలయం: పరిసరాల్లోని జీవులకు, నిర్జీవ పదార్థాలకు మధ్య జరిగే ఆక్సిజన్‌ వినిమయాన్ని ఆక్సిజన్‌ వలయం అంటారు. చెట్లు గాలిలోని కార్బన్‌ డై ఆక్సైడ్‌ని పీల్చుకుని, నీరు, సూర్యరశ్మి సమక్షంలో కిరణజన్యసంయోగ క్రియ జరిపి తిరిగి ఆకుల ద్వారా ఆక్సిజన్‌ను గాలిలోకి విడుదల చేస్తుంటాయి. వాతావరణంలో 21% వరకు ఉండే ఆక్సిజన్‌ నీటిలోనూ కొంత కరిగి ఉంటుంది. అదేవిధంగా ఓజోన్‌ పొరలో కూడా ఆక్సిజన్‌ మోతాదు ఎక్కువగానే ఉంటుంది. ఈ విధంగా ఆక్సిజన్‌ పుష్కలంగా లభించి సమస్త ప్రాణుల శ్వాసక్రియకు సరిపోతుంది.

 

కర్బన వలయం: వృక్ష, జంతు కణజాలాల నిర్మాణానికి కార్బన్‌ వెన్నెముక లాంటిది. భూమి మొదటి వాతావరణ పొర ట్రోపో ఆవరణంలో వాయు స్థితిలో లభించే కార్బన్‌ డై ఆక్సైడ్‌ని సూర్యకాంతి సమక్షంలో మొక్కలు శోషించుకుని కార్బోహైడ్రేట్స్‌ రూపంలో సంశ్లేషణ చెందిస్తాయి. ఈ పోషకం ఉత్పత్తిదారులు, వినియోగదారులకు బదిలీ అవుతూ చివరగా బ్యాక్టీరియాలు, శిలీంద్రాలు లాంటి విచ్చిన్నకారుల వల్ల సరళ అకర్బన పదార్థాలుగా విడిపోతుంది. అంతిమంగా దీనిలోని కార్బన్‌ వాయుస్థితిలో వాతావరణంలోకి, కార్బోనేట్, బైకార్బోనేట్‌ల రూపంలో జలావరణం, శిలావరణంలోకి బదిలీ అవుతుంది. ఈవిధంగా కార్బన్‌ ఘన, ద్రవ, వాయు స్థితిలో చక్రీయంగా బదిలీ అవుతూ తిరిగి మొక్కలు జరిపే కిరణజన్య సంయోగక్రియలో కార్బోనేట్స్‌ రూపంలో సంశ్లేషణ చెందుతుంది.

 

నత్రజని వలయం: వాతావరణంలో నైట్రోజన్‌ వాయువు 78% వరకు ఉంటుంది. ఇది జడవాయువు. రసాయన చర్యల్లో పాల్గొనదు. జీవులకు, చుట్టూ ఉన్న పరిసరాలకు మధ్య జరిగే నత్రజని పదార్థాల వినిమయాన్ని నత్రజని వలయం అంటారు. ప్రొటీన్లు, కేంద్రకామ్లాలు, అమైనో ఆమ్లాల నిర్మాణానికి నత్రజని మూలాధారం. అయినప్పటికీ జీవజాతులు నైట్రోజన్‌ని పరోక్షంగానే గ్రహిస్తాయి. రైజోబియం లాంటి బ్యాక్టీరియాల వల్ల వాతావరణంలోని నైట్రోజన్‌ వాయువు నేలలో నైట్రేట్లుగా స్థిరీకరణకు గురవుతుంది. దీన్నే నత్రజని స్థాపన అంటారు. ఈ నైట్రేట్లను వృక్షాలు నేల నుంచి గ్రహిస్తాయి. నత్రజని స్థాపన వల్ల వాతావరణంలోని అకర్బన నత్రజని, కర్బన నత్రజనిగా మారి మొక్కల్లోకి ప్రవేశిస్తుంది. మొక్కల దేహాల్లో కర్బన నత్రజని ప్రొటీన్లుగా మారుతుంది. మొక్కల కళేబరాల్లోని ఈ కర్బన నత్రజని సూడోమోనాస్‌ లాంటి నత్రీకరణ బ్యాక్టీరియా వల్ల వినత్రీకరణ (డీనైట్రిఫికేషన్‌) జరిగి కొంత నైట్రేట్లుగా నేలలోకి పోగా, మరికొంత స్వేచ్ఛా నత్రజని వాయువుగా మారి వాతావరణంలో కలుస్తుంది. ఈ విధంగా జీవులకూ, చుట్టూ ఉన్న పరిసరాలకు మధ్య జరిగే నత్రజని పదార్థాల వినిమయాన్ని నత్రజని వలయం అంటారు.

 

ఫాస్ఫరస్‌ వలయం: శక్తి వాహకంగా వ్యవహరించే ఫాస్ఫరస్‌ అవక్షేప వలయాల్లో చాలా ముఖ్యమైంది. ఫాస్ఫరస్‌ మూలకం అడినోసిన్‌ ట్రైఫాస్ఫేట్‌ ్బతిగిశ్శి గా కణజాల నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది భౌమావరణ వ్యవస్థలోనూ, జలావరణ వ్యవస్థలోనూ కొద్దిమొత్తంలో లభిస్తుంది. ఫాస్ఫాటిక్‌ శిలల శైథిల్యం ద్వారా లభించిన ఆర్ధోఫాస్ఫేట్‌ అయాన్ల రూపంలో ఉన్న అకర్బన ఫాస్ఫేట్లు.. వృక్షాల జీవన ప్రక్రియలో పాల్గొంటాయి. ఇవి ఆహారపు గొలుసుల ద్వారా క్రమంగా వినియోగదారులకు, విచ్ఛిన్నకారులకు ప్రవహించి చివరకు నేలలో కలుస్తాయి. నేలలో విడుదలైన ఫాస్ఫేట్లు తిరిగి వృక్షాలకు వినియోగమవుతాయి. ఆధునిక వ్యవసాయ రంగంలో ఫాస్ఫేట్‌ ఎరువుల వాడకం ఎక్కువవడంతో నీటిలో ఆక్సిజన్‌ తగ్గిపోయి యూట్రిఫికేషన్‌కు దారితీసి జలకాలుష్యం ఏర్పడుతోంది. 

 

జల వలయం: జీవులకు, వాటి చుట్టూ ఉన్న వాతావరణం, శిలావరణం, జలావరణం లాంటి భౌతిక పరిసరాలకు మధ్య నీరు ఘన, ద్రవ, వాయు స్థితుల్లో చక్రీయంగా బదిలీ కావడాన్ని జలచక్రంగా పిలుస్తారు. సూర్యుడి నుంచి భూమికి చేరే సౌర వికిరణం ద్వారా జలాశయాలు, మంచు ప్రాంతాల నుంచి బాష్పీభవనం (నీరు ఆవిరవడం), ఉత్పతనం (ఘన పదార్థాలు నీరుగా ఆవిరవడం), బాష్పోత్సేకం (చెట్ల నుంచి విడుదలయ్యే నీటిఆవిరి) లాంటి ప్రక్రియల ద్వారా నీరు గాలిలోకి చేరి మేఘాలుగా మారుతుంది. తిరిగి మేఘాలు ద్రవీభవనం చెంది వర్షంగా, ఘనీభవనం చెంది మంచుగా భూమికి చేరతాయి. ఈవిధంగా భూమిపై ఉన్న సమస్త జీవజాలానికి కావాల్సిన నీటి అవసరాలు తీరుతున్నాయి.

 

మాదిరి ప్రశ్నలు

 

1. జీవ సందీప్తి అంటే ఏమిటి?  

1) కొన్ని జీవులు కాంతి ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉండటం

2) కొన్ని జీవులు కాంతిని గ్రహించడం

3) కొన్ని జీవులు కాంతిని తీసుకోకపోవడం

4) గాలి, సూర్యరశ్మి సంయోగం చెందడం

 

2. సూర్యుడి నుంచి భూమికి చేరే సూర్యకాంతిని ఏమంటారు? 

1) సౌరవికిరణం 2) సూర్యపుటం 3) భూవికిరణం 4) పైవేవీకాదు

 

3. బాష్పోత్సేకం అంటే ఏమిటి?

1) చెట్లు వేర్ల ద్వారా నీటిని పీల్చుకోవడం           

2) చెట్లు ఆకుల ద్వారా నీటిని విడిచిపెట్టడం

3) చెట్లు ఆకు రాల్చడం                   

4) చెట్లు కార్బన్‌ డై ఆక్సైడ్‌ని పీల్చుకోవడం

 

4. ఘనపదార్థాలు నేరుగా ఆవిరవడాన్ని ఏమంటారు? 

1) బాష్పోత్సేకం 2) బాష్పీభవనం 3) ఉత్పతనం 4) హైడ్రేషన్‌

 

5. సౌర వికిరణం అంటే ఏమిటి?

1) సూర్యుడు బయటకు విడుదల చేసే శక్తి 

2) సూర్యుడి నుంచి భూమి గ్రహించే శక్తి

3) సూర్యుడి కేంద్రంలో ఉద్భవించే శక్తి 

4) సౌరశక్తి వల్ల నీరు ఆవిరవడం

 

6. వృక్ష, జంతు కణజాల నిర్మాణానికి వెన్నెముక లాంటిది? 

1) ఆక్సిజన్‌ 2) నైట్రోజన్‌ 3) కార్బన్‌ 4) హైడ్రోజన్‌

 

7. ఏదైనా ఒక ఆవరణ వ్యవస్థలో నిర్దిష్ట సమయంలో ఉన్నటువంటి అకర్బన పోషకాల మొత్తం పరిమాణాన్ని ఏమని పిలుస్తారు?

1) నిలకడ స్థితి 2) బయోమ్‌ 3) జీవ ద్రవ్యరాశి 4) బయోట్‌

 

8. ఆవరణ వ్యవస్థలో జీవులకు, పరిసరాలకు మధ్య పోషకాల చక్రీయ బదిలీ విధానాన్ని ఏమంటారు?  

1) భూ - జీవ వలయం 2) భూ- రసాయన వలయం 

3) భూ విజ్ఞాన వలయం 4) జీవ- భూ- రసాయన వలయం

 

సమధానాలు

1-1, 2-2, 3-2, 4-3, 5-1, 6-3, 7-1, 8-4.

 

జల వలయం:

Condensation = ద్రవీభవనం

Precipitation = అవపాతం

Evaporation = బాష్పీభవనం

Rain=  వర్షం

Snow = మంచు

Surface Runoff = ఉపరితల నీరు

Ground Water  = భూగర్భ జలం

 

జల్లు సద్గుణరావు


 

Posted Date : 19-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

చక్రవాతాలు

సుడిగాలుల విలయం

ప్రచండ వేగంతో వీచే గాలుల ధాటికి భారీ వృక్షాలు కూకటి వేళ్లతో కూలిపోతాయి. కరెంటు స్తంభాలు కట్టె పుల్లల్లాగా నేలకొరుగుతాయి. ఇళ్ల పైకప్పులు గాలిలో చెక్కర్లు కొడతాయి. వాటికి కుంభవృష్టి తోడై నీరు వరదలై పారుతుంది. తీరప్రాంతాలు మునిగిపోతాయి. ఈ విలయం ఎలా ఏర్పడుతుంది? ఆ సుడిగాలులు సృష్టించే విధ్వంసాలకు కారణం ఏమిటి? విపత్తు నిర్వహణ అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు వాటి గురించి తెలుసుకోవాలి. 

విధ్వంసం సృష్టించగలిగే వేగమైన గాలులు, కుండపోత వర్షంతో కూడిన వాతావరణ పరిస్థితినే చక్రవాతం అంటారు. ఇవి కొన్ని సందర్భాల్లో సముద్రనీటి మట్టాన్ని పెంచి, తీరంలోని భూభాగాన్ని ముంచెత్తే ఉప్పెనగా (అధిక వేళాతరంగాలు) కూడా మారతాయి. చుట్టూ అధిక పీడన ప్రాంతంతో ఆవరించిన అల్పపీడన ప్రాంతంలోని శక్తిమంతమైన గాలులతో కూడిన సుడులు తిరిగే వాతావరణ అలజడే చక్రవాత స్వరూపం. ఇవి ఉత్తరార్ధ గోళంలో అపసవ్య దిశలో, దక్షిణార్ధ గోళంలో సవ్య దిశలో సుడులు తిరుగుతాయి. చక్రవాతాన్ని ఆంగ్లంలో సైక్లోన్‌ అంటారు. అది ‘సైక్లోస్‌’ అనే గ్రీకు పదం నుంచి పుట్టింది. గ్రీకు భాషలో సైక్లోస్‌ అంటే పాము మెలికల చుట్ట అని అర్థం. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడిన ఉష్ణమండల తుపాన్లు సర్పిలాకారంగా ఉన్నట్లు గమనించిన హెన్రీ పెడింగ్టన్‌ అనే బ్రిటన్‌ వాతావరణ శాస్త్రవేత్త 1848లో వీటికి ‘సైక్లోన్‌’ అని పేరు పెట్టారు.

 

అల్పపీడనం నుంచే ఆవిర్భావం

సముద్ర ఉపరితలంపై ఏర్పడిన ఒక అల్పపీడన ప్రాంతం అన్ని వైపుల నుంచి అధిక పీడన గాలులను ఆకర్షించడం వల్ల మధ్యలో చక్రవాత కేంద్రం ఏర్పడుతుంది. దీని వ్యాసార్ధం సుమారు 20-30 కిలోమీటర్లు ఉంటుంది. ఆ పరిధిలో వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది. కానీ చుట్టూ చక్రవాత కుడ్యంగా పిలిచే ప్రాంతం విధ్వంసకర పవనాలతో అలజడి సృష్టిస్తుంది. ఈ చక్రవాతాలను మూడు దశలుగా విభజించారు.

1) రూపకల్పన దశ: బాష్పీభవనం ద్వారా గాలిలో 7,000 మీటర్ల ఎత్తు వరకు అధిక సాపేక్ష ఆర్ధ్రతను చేరుకోవడానికి సముద్ర నీటిలో 60 మీటర్ల లోతు వరకు 26 డిగ్రీసెంటీగ్రేడ్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండాలి. అలాంటప్పుడే క్రమంగా నీటిఆవిరి నల్లని క్యుములోనింబస్‌ మేఘాలుగా మారుతుంది. 

2) పరిపక్వ దశ: ఈ దశలో క్యుములో నింబస్‌ మేఘాలు ఉరుములు, మెరుపులను ఏర్పరుస్తూ చక్రవాత కంటి చుట్టూ పట్టీల్లా దట్టంగా అల్లుకుంటాయి. ఆ సమయంలో చక్రవాత కన్ను ఉపగ్రహ చిత్రాల్లో నల్లని కేంద్రం/చుక్కగా కనిపిస్తుంది. ఈ నల్లని కేంద్రం ఎంత చిన్నగా కనిపిస్తే చక్రవాతం అంత బలంగా మారుతుంది. చక్రవాతం క్రమంగా తన స్థానాన్ని జరుపుతూ తీరాన్ని తాకుతుంది.

3) బలహీనపడటం: గాలి పీడనంలో వచ్చిన మార్పుల వల్ల చక్రవాతం పైకి లేదా కిందికి జరిగినప్పుడు అకస్మాత్తుగా ఛేదనం చెంది బలహీనపడుతుంది. ఈ విధంగా చక్రవాతాల కాలవ్యవధి 24 గంటల కంటే తక్కువ వ్యవధి నుంచి 3 వారాల కన్నా ఎక్కువకాలం వరకు ఉండవచ్చు. ఒక చక్రవాతం మూడు దశలు పూర్తవడానికి సగటున 6 రోజులు పడుతుంది. అత్యంత సుదీర్ఘ చక్రవాతంగా పేరు పొందిన ‘టైఫూన్‌ జాన్‌’ 1994లో ఆగస్టు - సెప్టెంబరుల మధ్య 31 రోజులు పసిఫిక్‌ మహాసముద్రంలో కొనసాగింది.

 

వివిధ పేర్లు

చక్రవాతాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రాంతాలవారీగా వివిధ పేర్లతో పిలుస్తారు.

* హిందూ మహాసముద్రం (భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవులు, పాకిస్థాన్, అరేబియా దేశాలైన యెమన్, ఒమన్‌) దేశాల్లో - ఉష్ణమండల తుపాన్లు

* ఆస్ట్రేలియా - విల్లీ - విల్లీలు

* వాయవ్య పసిఫిక్‌లో చైనా, జపాన్‌ - టైఫూన్లు

* పిలిఫ్పైన్స్‌ - బగుయియేస్‌

* ఉత్తర అట్లాంటిక్‌ మహాసముద్రంలో అమెరికా తూర్పుతీరం పైన, వెస్టిండీస్‌ దీవులు - హరికేన్లు 

* అమెరికా సంయుక్త రాష్ట్రాల భూప్రాంతం - టోర్నడోలు

 

గాలి వేగం ఆధారంగా తుపాను తీవ్రత
కల్లోల రకం గాలి వేగం (గం./కి.మీ.లలో)
అల్పపీడనం (Low pressure) 31
వాయుగుండం (Depression) 31 - 49
తీవ్ర వాయుగుండం (Deep depression) 49 - 61
తుపాను కల్లోలం (Cyclonic storm)  61 - 88
తీవ్ర తుపాను కల్లోలం (Severe cyclonic storm) 88 - 118
అతి తీవ్ర తుపాను కల్లోలం (Very sever cyclonic storm) 118 - 221 
సూపర్‌ సైక్లోన్‌  221 కంటే ఎక్కువ


సూపర్‌ సైక్లోన్‌: 1999, అక్టోబరు 29న ఒడిశాలో సంభవించిన సూపర్‌ సైక్లోన్‌ వల్ల గంటకు 260 - 300 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. సముద్ర నీటిమట్టం 9 మీటర్లు కెరటాలతో ఉప్పెనగా మారి 140 మీటర్ల మేర తీరాన్ని ముంచేసింది. 10 వేల మంది మంది మరణించగా, 2 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి.

సాంకేతిక సహకారం: 2014, అక్టోబరు 12న విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను కుదిపేసిన హుద్‌-హుద్‌ తుపాను కారణంగా సూపర్‌ సైక్లోన్‌ కంటే తక్కువ వేగంతో గంటకు 180 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. 46 మంది చనిపోయారు. సాంకేతిక పరిజ్ఞానంతో తుపాన్లను ముందుగానే అంచనా వేసి అప్రమత్తం చేస్తుండటంతో ఇటీవల కాలంలో ప్రాణనష్టం తగ్గించడం సాధ్యమవుతోంది.

టోర్నడో: ఇది భూఉపరితలంపై ఏర్పడే చక్రవాతం. 3 - 30 నిమిషాలపాటు మాత్రమే కొనసాగుతుంది. కానీ గాలి వేగం గంటకు 200 కి.మీ. నుంచి అత్యధికంగా 400 కి.మీ. ఉంటుంది. ఆ సమయంలో పైకి విసిరే సుడిగాలినే టోర్నడో అంటారు. దీని గాలివేగాన్ని ఫుజితా స్కేల్‌తో కొలుస్తారు. టోర్నడోలు ఎక్కువగా అమెరికా, మెక్సికో దేశాల భూభాగాల్లో వస్తుంటాయి. పచ్చదనం తగ్గిపోయి కాంక్రీట్‌ జంగిల్‌ విస్తీర్ణం పెరుగుతున్న కారణంగానే అమెరికాలో టోర్నడోల తాకిడి తీవ్రరూపం దాలుస్తోంది. అప్పడప్పుడు ఆస్ట్రేలియాలో ఏర్పడుతున్న నీటి టోర్నడోల (వాటర్‌ స్పౌట్‌) గురించి వాతావరణ నిపుణులు చర్చలు జరుపుతున్నారు.


భారత్‌లో 

మన దేశానికి రెండువైపులా బంగాళాఖాతం, అరేబియా సముద్రాలు ఆవరించి ఉన్నాయి. వాటిలో వేడినీరు ప్రవహిస్తుండటంతో రెండు సందర్భాల్లో తుపాన్లు సంభవిస్తున్నాయి.

1) నైరుతి రుతుపవనాల ప్రవేశానికి ముందు - మే-జూన్‌ నెలల్లో అరేబియా సముద్రంలో సంభవించే చక్రవాతాలు ఈశాన్యం, తూర్పు, వాయవ్యం దిశల్లో కదిలి తీర దేశాల్లో ప్రభావం చూపిస్తున్నాయి.

2) ఈశాన్య రుతుపవనాల సమయంలో - అక్టోబరు - నవంబరు నెలల్లో బంగాళాఖాతంలో ఏర్పడే చక్రవాతాలు ఎక్కువగా వాయవ్యం వైపు, కొన్నిసార్లు ఉత్తరం, పశ్చిమ దిశల్లో కదిలి తీర ప్రాంతంలో ప్రభావం చూపుతున్నాయి.

* హిందూ మహాసముద్రంలో ఏర్పడే చక్రవాతాల వల్ల నష్టపోతున్న 8 దేశాలు 2004 నుంచి కొన్ని పేర్ల జాబితాను ముందుగానే రూపొందించాయి. వాటినే చక్రవాతాలకు పెడుతున్నారు. 2020లో మరో 5 దేశాలు ఇందులో చేరాయి. ప్రస్తుతం 13 దేశాల్లో ముందుగా నిర్ణయించిన పేర్ల జాబితాను చక్రవాతాల కోసం వినియోగిస్తున్నారు. 

* 1977, నవంబరు 19న సంభవించిన దివిసీమ తుపాను ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో నిలిచిపోయింది. నాటి విపత్తులో సుమారు 10 వేల మంది చనిపోయారు.

 

హెచ్చరికలు

రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు తుపాను హెచ్చరికలను నాలుగు దశల్లో జారీ చేస్తుంది.

1) ప్రీ సైక్లోన్‌ వాచ్‌: సముద్రంలో తుపాను ఏర్పడే పరిస్థితి ఉన్నప్పటి నుంచి అంటే 72 గంటల ముందు నుంచి హెచ్చరికలు జారీ చేస్తారు.

2) సైక్లోన్‌ అలర్ట్‌: తీరం వెంట ప్రతికూల ప్రభావం మొదలవుతుందని భావించిన 48 గంటల ముందు వెలువరిస్తారు.

3) సైక్లోన్‌ వార్నింగ్‌: తుపాను రాబోయే 24 గంటల్లో తీరాన్ని తాకుతుందని భావించినప్పుడు తుపాను హెచ్చరికలు చేస్తారు. ఇక్కడి నుంచి ప్రతి గంట గంటకి సమాచారం వెలువడుతుంది.

4) సైక్లోన్‌ హిట్‌ దశ: రాబోయే 12 గంటల్లో తుపాను తీరాన్ని తాకుతుందని అంచనా వేసిన సమయం నుంచి ఈ హెచ్చరిక మొదలవుతుంది. భూమిపై గంటకు 60 కి.మీ. వేగంతో గాలులు వీచే సమయం వరకు ఈ హెచ్చరిక జారీ చేస్తారు.


 

మాదిరి ప్రశ్నలు


1. దేశంలో గుజరాత్‌ తర్వాత రెండో పొడవైన తీరం ఉన్న రాష్ట్రం ఏది?

1) మహారాష్ట్ర     2) తమిళనాడు     3) ఆంధ్రప్రదేశ్‌     4) ఒడిశా


2. ఒకప్పుడు రేవు పట్టణంగా కొనసాగిన కోరింగ ప్రాంతం 1839లో వచ్చిన తుపానుకు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ప్రస్తుతం చిన్న గ్రామంగా కొనసాగుతోంది. ఆ ప్రాంతం ఏ జిల్లాలో ఉంది?

1) కాకినాడ     2) పశ్చిమ గోదావరి    3) నెల్లూరు    4) తిరుపతి


3. విశాఖపట్నాన్ని హుద్‌-హుద్‌ తుపాను ఏ తేదీన తాకింది?

1) 2014, అక్టోబరు 12        2) 2014, సెప్టెంబరు 14     3) 2015, ఆగస్టు 5     4) 2016, జనవరి 3


4. ఆంధ్రప్రదేశ్‌ ప్రాదేశిక తుపాను హెచ్చరిక కేంద్రం ఎక్కడుంది?

1) చెన్నై   2) విశాఖపట్నం    3) కోల్‌కతా    4) పారాదీప్‌ 


5. తీవ్రమైన తుపాను గాలులను అడ్డుకోవడానికి తీర ప్రాంతం వెంబడి పెంచే చెట్లను ఏమంటారు?

1) ఆశ్రయతోరణ మొక్కలు    2) మడ అడవులు    3) శృంగాకార అడవులు   4) ఆల్ఫైన్‌ అడవులు


6. భారతదేశంలో తుపానులు ఎక్కువగా సంభవించే నెలలు?

1) డిసెంబరు - జనవరి    2) జూన్‌ - జులై     3) అక్టోబరు - నవంబరు    4) మార్చి - ఏప్రిల్‌


7. భారతదేశంలో మొత్తం భూభాగంలో ఎంత శాతం చక్రవాతాలకు అనువుగా ఉంది?

1) 8%        2) 18%        3) 30%        4) 40%


8. 1970లో బంగ్లాదేశ్‌పై విరుచుకుపడి మూడు లక్షల మంది ప్రాణాలు బలిగొన్న తుపాను పేరు?

1) నైనా      2) లైలా      3) ట్రేసి     4) బోలా 


9. ఎంత వేగంతో గాలులు వీచినప్పుడు సూపర్‌ సైక్లోన్‌గా పిలవాలి?

1) గంటకు 221 కి.మీ.కంటే ఎక్కువ        2) గంటకు 118 కి.మీ.కంటే ఎక్కువ

3) గంటకు 88 కి.మీ. కంటే ఎక్కువ        4) గంటకు 400 కి.మీ. కంటే ఎక్కువ


10. మన దేశంలో బంగాళాఖాతానికి, అరేబియా సముద్రానికి మధ్య తుపాన్ల నిష్పత్తి ఎలా ఉంటుంది?

1) 4 : 1        2) 1 : 4        3) 2 : 6        4) 6 : 2

 

సమాధానాలు: 1-3,   2-1,   3-1,   4-2,   5-1,   6-3,   7-1,   8-4,   9-1,   10-1

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 01-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వ‌ర‌ద‌ల విప‌త్తు

జల విలయం

నదుల ప్రవాహాలు గట్లు దాటినా, అధిక వర్షాల వల్ల కురిసిన నీటిని అదుపు చేయలేకపోయినా వరదలు సంభవిస్తాయి. పొలాలను, జనావాసాలను ముంచేస్తాయి. ఆస్తులకు, ప్రాణాలకు నష్టాన్ని కలిగిస్తాయి. తాగునీరు కలుషితమైపోతుంది. పారిశుద్ధ్యం క్షీణించి అంటువ్యాధులు ప్రబలుతాయి. జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. ఇదంతా వరదలు సృష్టించే విలయమే. నదులకు నిలయమైన మన దేశంలో ఏటా ఈ పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి. విపత్తు నిర్వహణ అధ్యయనంలో భాగంగా వరదల స్థితిగతులను, కారణాలను, ప్రభావాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.

 

 

నీరు సాధారణ స్థితిని లేదా ప్రవాహ స్థాయిని మించినప్పుడు వరదలు వస్తాయి. వాన చినుకులు జడివానగా మారి కొన్ని గంటల  వ్యవధిలోనే వరదగా మారవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆనకట్టలు  తెగిపోవడం వల్ల ఎలాంటి హెచ్చరిక లేకుండా అకస్మాత్తుగా వరదలు సంభవించవచ్చు. ఎక్కువ శాతం వరదలకు నదీ ప్రవాహాలే ప్రధాన కారణం. వాటి అంతర్భాగం, ఆనకట్టల సామర్థ్యాన్ని మించి    ప్రవహించినప్పుడు చుట్టుపక్కల భూభాగాలను ముంచెత్తుతుంటాయి.

 

వరదల్లో రకాలు


నదీ వరదలు: వర్షాకాలంలో అధిక వర్షాల వల్ల, తుపాన్లు సంభవించే సందర్భాల్లోనూ, మంచు కరిగి నదిలో కలిసినప్పుడు నదీ వరదలు సంభవిస్తాయి. సముద్రంలోకి పంపే నీటి పరిమాణం కంటే ఎక్కువ నీటిని నది కలిగి ఉన్నప్పుడు నీరు పొంగి గట్టు దాటి   వరదలు సంభవిస్తాయి. వీటినే నదీ వరదలు అంటారు. నది తనలో ఉంచుకోగలిగిన నీటి పరిమాణాన్ని దాని పారుదల సామర్థ్యం అంటారు. నీటి పరీవాహక ప్రాంతం నుంచి ఒక సెకనులో ప్రవహించే నీటి పరిమాణాన్ని ‘డిశ్చార్జ్‌’ అంటారు.


తీరప్రాంత వరదలు: తుపాను వచ్చినప్పుడు, సముద్ర ఉప్పెనల వల్ల, సునామీలు సంభవించినప్పుడు, కొన్ని సందర్భాల్లో సముద్రంలో పెద్ద అలలు ఏర్పడినప్పుడు వచ్చే వరదలను తీర ప్రాంత వరదలు అంటారు.


నదీముఖద్వార వరదలు: సముద్రంలో ఉప్పెన కారణంగా గానీ, సునామీ కెరటాలు నెట్టుకొస్తున్నప్పుడుగానీ, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో సముద్రంలో వేలా తరంగాలు ఎక్కువగా ఉన్నప్పుడు గానీ, నది ద్వారా సముద్రంలోకి ప్రయాణించే నీటిని సముద్రం స్వీకరించలేక వెనక్కి పంపినప్పుడు తీరం వెంబడి వరదలు రావచ్చు. నదులు సముద్రంలో కలిసే ప్రదేశాలను నదీ ముఖ ద్వారాలు అంటారు.


మెరుపు వరదలు: హఠాత్తుగా మంచు కరిగి నదిలో చేరడం,  కొండలపైన కుండపోత వర్షాలు, ఆనకట్టలు పగిలిపోవడం, కూలిపోవడం వల్ల అకస్మాత్తుగా సంభవించేవి మెరుపు వరదలు.


పట్టణ వరదలు: పట్టణ ప్రాంతాల్లో నీటిపారుదల వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల, భారీ వర్షాలు కురిసినప్పుడు పట్టణాల్లో ఈ  వరదలు సంభవిస్తుంటాయి.


ప్రమాదం కారణంగా వచ్చే వరదలు: అధిక పరిమాణంలో నీటి సరఫరా చేసే నీటి గొట్టాలు పగిలిపోవడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు నీటితో మునిగిపోవడం ద్వారా వచ్చే వరదలు.

 

ప్రపంచ వరద స్థితిగతులు

ప్రపంచవ్యాప్తంగా మానవుల జీవనోపాధికి తీవ్ర నష్టం కలిగించే విపత్తుల్లో అత్యంత విధ్వంసకర విపత్తు వరదలు. ప్రపంచ మొత్తం విపత్తు నష్టాల్లో అత్యధికంగా 30% ఈ వరదల వల్లే జరుగుతోంది. దీని తర్వాత స్థానంలో 21% నష్టం తుపాన్ల వల్ల ఏర్పడుతోంది. ‘ద హ్యూమన్‌ కాస్ట్‌ ఆఫ్‌ వెదర్‌ రిలేటెడ్‌ డిజాస్టర్‌’ పేరుతో ఐక్యరాజ్యసమితి వెల్లడించిన నివేదిక ప్రకారం 1995-2015 మధ్య ప్రపంచవ్యాప్తంగా వరదల వల్ల 230 కోట్ల మంది ప్రభావితమయ్యారు. 1,57,000 మంది  మరణించారు. మొత్తం జల, వాతావరణ విపత్తుల్లో ఈ నష్టం 56% మేర ఉంది.


ఐక్యరాజ్యసమితి ‘అంతర్జాతీయ విపత్తు కుదింపు వ్యూహం (United Nations International Strategy for Disaster Reduction)’ రూపొందించిన గ్లోబల్‌ ఎసెస్‌మెంట్‌ రిపోర్ట్‌ 2011 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వరదల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న   జనాభాలో 90% మంది దక్షిణాసియా, తూర్పు ఆసియా, పసిఫిక్‌ దేశాల్లోనే ఉన్నారు. ఇందులో దక్షిణాసియా దేశాల్లో భారత్, బంగ్లాదేశ్‌లు ఎక్కువ ప్రభావానికి గురవుతున్నాయి. గత దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా వరద ప్రభావాన్ని ఎదుర్కొన్న దేశాలు చైనా, ఇండియా, బంగ్లాదేశ్, జర్మనీ, పోలండ్, మొజాంబిక్, అమెరికా వరుస   క్రమంలో ఉన్నాయి. 


ప్రపంచ వ్యాప్తంగా వివిధ వర్గాల వరద బాధితులు:  

 

* అల్పాదాయం ఉన్నవారు  50% 

* దిగువ మధ్యస్థాయి ఆదాయం ఉన్నవారు  26%  

*  అధిక మధ్యస్థాయి ఆదాయం ఉన్నవారు  23%  

* అధిక ఆదాయం ఉన్నవారు - 1%


భారతదేశంలో వరదలు

* ప్రపంచ మొత్తం వరద మరణాల్లో 1/5 (20%) మన దేశంలోనే సంభవిస్తున్నాయి. భారత్‌లో మొత్తం విపత్తు నష్టంలో 52% వరదల వల్లే జరుగుతోంది.


* దేశ వైశాల్యంలో 40 మిలియన్‌ హెక్టార్ల భూమి వరద ప్రభావానికి గురవుతోంది. ఇది దేశ వైశాల్యంలో 12%. (బిల్డింగ్‌ మెటీరియల్స్‌ టెక్నాలజీ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ప్రకారం)


* దేశంలో ఉత్తర, ఈశాన్య ప్రాంతాలు ఏటా వరద ముప్పు ఎదుర్కొంటున్నాయి.


* దేశంలోని అన్ని నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా గంగా, బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతాలు వరద పీడిత   ప్రాంతాలుగా ఉన్నాయి. 


* ఉద్ధృతిపరంగా చూస్తే ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు ఎక్కువగా వరదల బారిన పడుతున్నాయి.


* వరదల వల్ల దేశంలో ఏటా 40 లక్షల టన్నుల వడ్లు నీటిపాలవుతున్నాయని అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం (IRRI) వివరించింది.


* 1953 - 2009 మధ్య గమనిస్తే భారతదేశంలో వరదల వల్ల ఏటా సగటున రూ.1650 కోట్ల నష్టం మేర వాటిల్లింది. సగటున 1,464 మంది మరణిస్తున్నారు. 86,288 పశువులు చనిపోతున్నాయి.


వరద ముప్పు ప్రాంతాలు:  ప్రపంచంలో అత్యధిక వరద ముప్పు ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. ఇక్కడి వరదలకు రుతుపవన కాలాల్లో తక్కువ కాలంలో ఎక్కువ వర్షం కురవడం, అధిక పూడిక ఉన్న నదులు, వాలైన హిమాలయ పర్వత శ్రేణులు లాంటివి ముఖ్యమైన కారణాలు.   


గంగా నదీ పరీవాహక ప్రాంతం: దేశంలో వరద దుర్బలత్వం ఉన్న ప్రాంతాల్లో ఇది ప్రధానమైంది. అందులోనూ గంగా పరీవాహకంలోని ఉత్తర భాగం ఉపనదుల    కారణంగా తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఉత్తర్‌ ప్రదేశ్‌లో శారద, గాగ్రా నదుల వల్ల; బిహార్‌లో కోసీ, గండక్‌ నదుల వల్ల ఎక్కువగా వరదలు సంభవిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో దక్షిణ భాగంలో దామోదర్, జయ నదులు, వాటి ఉపనదుల వల్ల వరదలు సంభవిస్తున్నాయి.


బ్రహ్మపుత్ర, బరాక్‌ నదుల పరీవాహక ప్రాంతం: ఈ నదులు, వాటి ఉప నదులతో అస్సాం ఎక్కువగా వరదలకు గురవుతోంది. ఈ పరీవాహక ప్రాంతంలో పశ్చిమ బెంగాల్‌ ఉత్తర భాగంలో జల్దాకా, తీస్తా, తోర్సా నదులు వరదలకు కారణమవుతున్నాయి. అలాగే మణిపుర్‌లో తిలాంగ్, నంబుల్, చప్కి, తోబుల్‌ నదులు, అధిక వర్షాల వల్ల ఇంఫాల్‌లో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి.


వాయవ్య నదీ పరీవాహక ప్రాంతం: భారత వాయవ్య ప్రాంతంలో జీలం, చీనాబ్, రావి, సట్లెజ్, బియాస్, గగ్గర్‌ నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయి.


మధ్య భారత్, దక్కన్‌ పరీవాహక ప్రాంతం: ఈ ప్రాంతంలో గోదావరి, కృష్ణా, కావేరి, పెన్న, తుంగభద్ర, నర్మద మొదలైన నదుల పరీవాహక ప్రాంతాలు, ఒడిశాలోని   మహానది, బైతరణి, బ్రహ్మణి నదీ పరీవాహక ప్రాంతాలు వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి.

 

తెలుగు రాష్ట్రాల్లో వరదల స్వభావాలు

దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే పెద్ద  ఎత్తున ప్రాణ, ఆస్తి, పంట నష్టాలకు వరదలు కారణమవుతున్నాయి.

* తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌లో వరదల దుర్బలత్వం ఎక్కువ. గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, పెన్నా నదులు సముద్రంలో కలిసే నదీ ముఖ ద్వారాల్లో డెల్టా మైదానాలు ఏర్పడి, అవి విశాలంగా, పాయలుగానూ చీలిపోయి ప్రవహిస్తున్నాయి.

* ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద నదుల డెల్టాలతోపాటు చిన్న నదులు, వాగులు పొంగడం వల్ల, కొల్లేరు సరస్సు పరిసర ప్రాంతాలు రుతువుల కాలంలో వరదల్లో మునిగిపోతున్నాయి.

* గోదావరి, కృష్ణా నదులు తెలంగాణ వైపు కచ్చితమైన, స్థిరమైన ప్రవాహ మార్గాలు కలిగి ఉండటం, మానవ నిర్మిత ఆనకట్టలు వరద నీటిని సక్రమంగా మోసుకెళ్లడం వల్ల వరదల ప్రభావం అంతగా లేదు. అయినప్పటికీ తెలంగాణలో గోదావరి పరీవాహక మార్గంలో నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలు; ప్రాణహిత మార్గంలో ప్రస్తుత కొమురం భీమ్‌ జిల్లా రుతుపవనాల కాలంలో వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి.

 

వరదలపై అధ్యయనం: జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (GSI) ముంపునకు గురవుతున్న భూమి ఆకారాన్ని, పరీవాహక ప్రాంతం (హరివాణం) వైశాల్యం, నేల వాలు, మురుగు నీటిపారుదల వ్యవస్థ లాంటి వాటిపై సమాచారాన్ని సేకరించి వరద దుర్బలత్వ మ్యాపులను తయారు చేస్తుంది. 

Posted Date : 11-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సహజ వనరులు - పరిరక్షణ

వాడుకుంటూ.. కాపాడుకుంటూ!


ఎంత ఉపయోగించుకున్నా తరగదు గాలి. తవ్విన కొద్దీ తగ్గిపోతుంది బొగ్గు. అవి ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులు. జీవుల మనుగడకు మూలాధారాలు. వాటిని సక్రమంగా వాడుకొని ఆదిమానవుడు ఆరోగ్యంగా జీవిస్తే, విచక్షణారహితంగా వినియోగించుకుంటూ ఆధునిక జీవుడు పర్యావరణానికి ప్రమాదకరంగా మారాడు. స్థిరమైన అభివృద్ధికి పర్యావరణ పరిరక్షణ తప్పనిసరని ప్రపంచం గుర్తించింది. అందుకే వనరులను సరైన రీతిలో వాడుకుంటూ, కాపాడుకుంటూ ఉండాలని ప్రకటించింది. పర్యావరణాంశాల అధ్యయనంలో భాగంగా సహజ వనరులు, రకాలు, క్షీణత తదితర అంశాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.  
 


మానవుడికి అవసరమైన వస్తుసేవల ఉత్పత్తికి ఉపయోగపడే పదార్థాలు, శక్తి లాంటి వాటిని సహజవనరుల రూపంలో ప్రకృతి ప్రసాదిస్తోంది. ఆవరణ వ్యవస్థలు, జీవ రాశులు తమ విధులను నిర్వహించడానికి, మానవ సమాజాల సాంఘిక, ఆర్థిక నాగరికతల మనుగడకు కావాల్సిన శక్తిని అందించే వనరులనే సహజ వనరులు అంటారు. వివిధ ప్రామాణికతల ఆధారంగా వాటిని విభజించవచ్చు.


లభ్యతను అనుసరించి!

లభ్యతను అనుసరించి వనరులను వర్గీకరించారు. 

జీవ వనరులు: జీవావరణంలో ప్రాణం ఉండే అడవులు, జంతువులు, అనేక జీవజాతులే జీవ వనరులు. వృక్షాలు, జంతువులు మిలియన్ల సంవత్సరాల క్రితం నశించి, రూపాంతరం చెందడం వల్ల ఏర్పడిన బొగ్గు, చమురు, సహజ వాయువు లాంటి శిలాజ ఇంధనాలు జీవ వనరుల తెగకు చెందినవి.

నిర్జీవ వనరులు: జీవం లేని అనుఘటకాలు, సేంద్రియ పదార్థాల నుంచి లభించే వనరులే నిర్జీవ వనరులు. భౌతికపరమైన గాలి, నీరు, నేల లాంటివి ఈ వనరుల కోవకే చెందుతాయి. కాంతి, ఉష్ణం, వర్షపాతం తదితర శీతోష్ణస్థితి సంబంధితాలూ నిర్జీవ వనరులే. సేంద్రీయపరమైన కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, లిపిడ్స్‌ను కూడా జీవరహిత వనరులుగానే పరిగణిస్తారు నిరేంద్రియపరమైన సోడియం, కాల్షియం, ఫాస్ఫరస్‌ లాంటి రసాయనాలు నిర్జీవ వనరుల కిందకే వస్తాయి. 


 పునరుత్పత్తి సామర్థ్యాన్ని బట్టి!

మళ్లీ ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఆధారంగా వనరులను వర్గీకరించారు. 

పునరుద్ధరించగలిగే సహజ వనరులు: వినియోగిస్తున్నప్పటికీ తిరిగి ఉత్పత్తి చెందే సామర్థ్యం ఉన్నవి, మానవ ప్రయత్నాల ద్వారా కొత్తగా ఉత్పత్తి చేయగలుగుతున్న వనరులను పునరుత్పత్తి చెందే సహజ వనరులుగా భావించవచ్చు. ఇవి సాధారణంగా కాలుష్యరహితమైనవి. అందువల్ల వీటిని హరిత ఇంధనాలు అని పిలుస్తారు.

ఉదా: అటవీ వనరులు, పంట పొలాలు, జీవజాతుల ఉత్పత్తి, జలవనరులు, సౌరశక్తి, పవనశక్తి, ఓషన్‌ ఎనర్జీ, జియో థర్మల్‌ ఎనర్జీ, జలవిద్యుత్తు లాంటివి.

పునరుద్ధరించలేని సహజ వనరులు: ఈ వనరులు వినియోగించే కొద్దీ తరిగిపోతుంటాయి. వీటికి పునరుత్పత్తి సామర్థ్యం ఉండదు. మానవ ప్రయత్నం ద్వారా పునరుద్ధరించడం వీలు కాదు. ఇవి కాలుష్య కారకాలు. ప్రస్తుతం ఎక్కువ వినియోగంలో ఉన్నాయి.

ఉదా: శిలాజ ఇంధనాలు (బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, సహజ వాయువు రూపాంతరాలైన షెల్‌ గ్యాస్, గ్యాస్‌ హైడ్రేట్స్, కోల్‌బెడ్‌ మీథేన్‌), అణు ఇంధన   వనరులు (యురేనియం, థోరియం, ప్లుటోనియం) ప్రస్తుతం మానవుని జీవన గమనాన్ని యంత్ర శక్తి, సాఫ్ట్‌వేర్‌ సామర్థ్యమే నిర్దేశిస్తున్నాయి. కానీ వాటిని నడిపించడానికి ఇంధనశక్తి తప్పనిసరి. ఆ ఇంధన వనరుల్లో నూతన పోకడలు, విధానాల్లో అనేక మార్పులు కాలానుగుణంగా సంభవిస్తూనే ఉన్నాయి. వినియోగించే కాలం ఆధారంగా వాటిని వివిధ రకాలుగా విభజించవచ్చు.

1) సంప్రదాయ ఇంధన వనరులు: అనాదిగా మానవుడు వినియోగిస్తున్న ఇంధన వనరులివి. ఉదా: బొగ్గు, డీజిల్, సహజ వాయువు ఆధారంగా ఉత్పత్తి చేసే థర్మల్‌ విద్యుత్తు, జల విద్యుత్తు, అణుశక్తి; చోదక శక్తి కోసం వాడే ముడిచమురు, సహజ వాయువు లాంటివి. వీటిలో జల విద్యుత్తు మాత్రమే  పునరుత్పాదక ఇంధన వనరు.

2) సంప్రదాయేతర ఇంధన వనరులు: ఇవి ఇటీవల కాలంలో అభివృద్ధి చేసిన, అధిక ప్రాచుర్యం పొందిన ఇంధన వనరులు. వీటిని మళ్లీ రెండు రకాలుగా పేర్కొంటున్నారు.

ఎ) పునరుత్పాదక ఇంధన వనరులు: సౌర శక్తి, పవన శక్తి, బయో గ్యాస్, బయో డీజిల్, బయోమాస్‌ పవర్, బయో ఇథనాల్, చిన్న  తరహా జలవిద్యుత్తు, బగస్సీ - కోజనరేషన్‌ లాంటి తిరిగి ఉత్పత్తి చేయగలిగే శక్తి వనరులు.

బి) నవీన శక్తి వనరులు: ఇటీవలి కాలంలో సాంకేతిక సామర్థ్యంతో తయారై, వినియోగంలోకి వస్తున్న శక్తివనరులు.

ఉదా: హైడ్రోజన్‌ శక్తి, జియో థర్మల్‌ శక్తి, టైడల్‌ ఎనర్జీ, సీవేవ్‌ ఎనర్జీ, ఓషన్‌ థర్మల్‌ గ్రేడియంట్‌ ఎనర్జీ, షెల్‌ గ్యాస్, కోల్‌బెడ్‌ మీథేన్, గ్యాస్‌ హైడ్రేట్స్, బ్యాటరీలతో నడిచే వాహనాలు వంటివి.


అధిక వినియోగంతో క్షీణత

ఆదిమానవుడు అందుబాటులో ఉన్న సహజ వనరులను సహజ జీవనానికి మాత్రమే వినియోగించుకుని మంచి వాతావరణంలో ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడిపేవాడు. కానీ ఆధునిక మానవుడు అమూల్యమైన సహజ వనరులను విచక్షణారహితంగా వినియోగిస్తూ, ప్రమాదకరమైన వాతావరణంలో దుర్భర జీవితాన్ని సాగిస్తున్నాడు. మానవ కార్యకలాపాల వల్ల ప్రకృతి క్షీణించకుండా పరిరక్షించాల్సిన  ఆవశ్యకతను ఐక్యరాజ్యసమితి ‘వరల్డ్‌ ఛార్టర్‌ ఆఫ్‌ నేచర్‌ 1982’లో గుర్తించింది. వ్యక్తి స్థాయి నుంచి, అంతర్జాతీయ స్థాయి వరకూ అన్ని స్థాయుల్లో పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పింది. స్థిరమైన వృద్ధిని సాధించడానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి చట్టాల్లో పర్యావరణ పరిరక్షణను పొందుపరచాలని ఈ చార్టర్‌ వివరించింది.

సహజ వనరుల పరిరక్షణ విధానాలు: పునరుద్ధరించగలిగిన, పునరుద్ధరించలేని వనరుల వృద్ధి రేటు కంటే వినియోగ రేటు ఎక్కువగా ఉంటే దాన్ని సహజవనరుల క్షీణతగా పరిగణించవచ్చు. అది వ్యవసాయం, చేపల వేట, గనుల తవ్వకం, నీరు, శిలాజ ఖనిజాల వినియోగం లాంటి వాటిల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందువల్ల వనరుల నిర్వహణలో మూడు ప్రక్రియలు పాటించాలి. 

1) తగ్గించడం (Reduce): వీలైనంత వరకూ సహజ వనరుల వాడకాన్ని తగ్గించాలి. అనవసరంగా వాడకూడదు.

ఉదా: విద్యుత్తు వాడకం, నీటి వాడకం లాంటివి.

2) పునఃచక్రీయం (Recycle): సహజ వనరులపై ఒత్తిడి తగ్గించడానికి అప్పటికే వినియోగించడం ద్వారా లభించిన వేస్ట్‌ పేపర్, ప్లాస్టిక్, గ్లాస్‌ లాంటి పదార్థాలను పునరుత్పత్తి చేసి వినియోగించవచ్చు.

3) తిరిగి ఉపయోగించడం (Reuse): పచ్చళ్లకు, జామ్‌లకు వాడిన గాజు, ప్లాస్టిక్‌ బాటిళ్లను బయట పారేయకుండా తిరిగి వినియోగించవచ్చు. వార్తాపత్రికలను చదివిన తర్వాత ప్యాకింగ్‌ చేయడానికి వాడవచ్చు. ఈ విధంగా వాడిన వస్తువులనే మళ్లీ, మళ్లీ వినియోగించడం వల్ల సహజ వనరుల వృద్ధి, పరిరక్షణ సాధ్యమవుతుంది.


మాదిరి ప్రశ్నలు


1. కిందివాటిలో సంప్రదాయ ఇంధన వనరు కానిది ఏది?

1) బొగ్గు       2) అణువిద్యుత్‌      3) జలవిద్యుత్‌        4) కోల్‌బెడ్‌ మీథేన్‌

జ: 4

 


2. సహజ వనరుల పరిరక్షణ విధానాల్లో వరుస క్రమం ఏది?

  1) రెడ్యూస్‌ - రీసైకిల్‌ - రీయూజ్‌        2) రీసైకిల్‌ - రెడ్యూస్‌ - రీయూజ్‌ 

  3) రెడ్యూస్‌ - రీయూజ్‌ - రీసైకిల్‌        4) రీసైకిల్‌ - రీయూజ్‌- రెడ్యూస్‌ 

జ: 1

 

3. కిందివాటిలో కన్వెన్షనల్‌ శక్తి వనరు ఏది?

  1) జీవ ఇంధనాలు    2) సౌర శక్తి        3) జలవిద్యుత్‌       4) పవన శక్తి 

జ: 3

 

4. కిందివాటిలో సంప్రదాయేతర శక్తి వనరు ఏది?

  1) బయోగ్యాస్‌      2) సౌరశక్తి         3) టైడల్‌ శక్తి      4) పైవన్నీ

జ: 4 

 

5. కిందివాటిలో పునరుత్పాదక శక్తి వనరు కానిది?

  1) సౌర విద్యుత్‌       2) పవన విద్యుత్‌      3) ఓషన్‌ థర్మల్‌ ఎనర్జీ  4) ఏదీకాదు

జ: 4

 

6. సహజ వనరుల క్షీణత అంటే?

1) సహజ వనరుల పునరుద్ధరణ కంటే వాటి  వినియోగం ఎక్కువగా ఉండటం

2) సహజ వనరుల పునరుద్ధరణ కంటే వాటి వినియోగం తక్కువగా ఉండటం

3) సహజ వనరుల వినియోగం కంటే వాటి పునరుద్ధరణ ఎక్కువగా ఉండటం

4) ఏదీకాదు

జ: 1

 

7. కిందివాటిలో నవీన శక్తి వనరు ఏది?

  1) హైడ్రోజన్‌ ఎనర్జీ    2) టైడల్‌ ఎనర్జీ     3) సీవేవ్‌ ఎనర్జీ       4) పైవన్నీ

జ: 4

 

8. కిందివాటిలో సరికానిది?

1) ముడి చమురు సంప్రదాయ, పునరుత్పత్తి చెందని వనరు. 

2) పవన శక్తి సంప్రదాయేతర, పునరుత్పత్తి చెందే వనరు.

3) జియోథర్మల్‌ శక్తి నవీన, పునరుత్పత్తి చెందే వనరు.

4) సహజ వాయువు సంప్రదాయ, పునరుత్పత్తి చెందే వనరు.

జ: 4

 

9. పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఎప్పుడు చేశారు?

   1) 1890       2) 1986      3) 1980        4) 1952

జ: 2

రచయిత: జల్లు సద్గుణరావు 

Posted Date : 27-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కరవు

పట్టి పీడించే కాటకం!

 

కావాల్సినంత కురవని వర్షం, బీటలు వారిన భూములు, అడుగంటిన చెరువులు, ఎండిపోయిన పంటలు, నిస్సారమైన నేలలు, వీటి ప్రభావంతో వస్తుసేవలు అందక జనం పడే ఇబ్బందులు. ఇదే విపత్తు. సమాజ పురోగతిని కుంగదీసే ప్రకృతి విపరిణామం. ఇలాంటి కాటక పరిస్థితులు ఎందుకు ఏర్పడతాయి? నివారించే మార్గాలు ఏమిటి? తదితర అంశాలను ‘విపత్తు నిర్వహణ’ అధ్యయనంలో భాగంగా పరీక్షార్థులు తెలుసుకోవాలి.

  

 

ఒక భౌగోళిక ప్రాంతంలో సాధారణ పరిస్థితులకు భిన్నంగా కొంతకాలం వరకూ పూర్తిగా వర్షం లేకపోవడం లేదా అల్ప వర్షపాతం ఉండవచ్చు. ఇది శీతోష్ణస్థితి సాధారణ లక్షణం. దీనివల్ల నీరు, ఆహారం, పశుగ్రాసం కొరత ఏర్పడటం, ఉపాధి అవకాశాలు కొరవడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ పరిస్థితినే కరవు లేదా దుర్భిక్షం అని పిలుస్తారు. ఈ వైపరీత్యంతో వ్యవసాయదారులతోపాటు మొత్తం సమాజం కూడా ఇబ్బందులకు గురవుతుంది. 


ప్రధాన కారణాలు: 

* దేశంలో రుతుపవనాలు అసమానంగా విస్తరించడం.

* మానవ అభివృద్ధి వల్ల వృక్షసంపద దెబ్బతిని నీరు భూమిలో ఇంకకపోవడం.

* అధిక జనాభా వల్ల నీటివనరులపై ఒత్తిడి పెరగడం.

* పట్టణీకరణ పెరగడంతో నీటి నిల్వ ప్రాంతాలు, నీటివనరుల పరీవాహక ప్రదేశాలు ఆక్రమణకు గురవడం.

* నీటి అవసరాలు, నిర్వహణ గురించి ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం.

 

నాలుగు రకాలు

భారత వ్యవసాయ కమిషన్‌ కరవును నాలుగు రకాలుగా విభజించింది.

వాతావరణ సంబంధ కరవు: ఒక ప్రదేశంలో సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైనప్పుడు సంభవించే కరవును వాతావరణ సంబంధ కరవుగా పేర్కొనవచ్చు. ఇలాంటి కరవు కారణంగా మిగతా కరవులు ఏర్పడతాయి. ఇది అన్ని కరువుల్లోనూ అతి తీవ్రమైంది.


జల సంబంధ కరవు: చాలాకాలం పాటు ఏర్పడే వాతావరణ కరవు కారణంగా భూఉపరితలంపైన, భూగర్భంలో నీటివనరుల లభ్యత తగ్గిపోవడాన్ని జలసంబంధ కరవుగా నిర్వచించవచ్చు.


వ్యవసాయ సంబంధ కరవు: జలసంబంధ కరవు ఎక్కువ కాలం కొనసాగితే మృత్తికల్లో తేమ తగ్గిపోయి మొక్కలు, పంటలు ఆరోగ్యకరమైన పెరుగుదలకు తోడ్పడలేని స్థితిని వ్యవసాయ సంబంధ కరవుగా భావించవచ్చు.


సామాజిక - ఆర్థిక కరవు: పై మూడు రకాల కరవులతో పాటు వస్తువులు, సేవల సరఫరా డిమాండ్‌పైన ప్రభావం చూపడాన్ని సామాజిక - ఆర్థిక కరవుగా పిలుస్తారు. ఇది సమాజంలోని ప్రతి వ్యక్తిపైనా ప్రభావం చూపుతుంది.


ఎలా కొలుస్తారు?


1) కరవు ఆరంభం: ఒక ప్రదేశంలో సాధారణ వర్షపాతంలో 25 శాతం తగ్గడం లేదా ఉండాల్సిన వర్షపాతంలో 75 శాతం వరకే నమోదైతే కరవు మొదలైనట్లు పరిగణిస్తారు.


2) మిత కరవు: సాధారణ వర్షపాతంలో 26% నుంచి 50% వరకు తగ్గడం లేదా ఉండాల్సిన వర్షపాతంలో 50% వరకు మాత్రమే కురిస్తే మిత కరవుగా పిలుస్తారు.


3) తీవ్ర కరవు: సాధారణ వర్షపాతంలో 50% కంటే తగ్గితే తీవ్ర కరవుగా వ్యవహరిస్తారు. మన దేశంలో వాయవ్య ప్రాంతంలో బలహీన రుతుపవనాల వల్ల, పర్యావరణం దెబ్బతినడంతో అతి తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడుతుంటాయి.


ప్రపంచ స్థితిగతులు


* ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం సహజ విపత్తుల్లో కరవు ద్వారా వచ్చే విపత్తు వాటా 19 శాతం ఉంటుంది. మొత్తంగా చూస్తే కరవు విపత్తు 3వ స్థానంలో ఉంది (మొదటి స్థానం వరదలు - 30%, రెండో స్థానం తుపాన్లు - 21%).

* ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్‌ నేషన్స్‌ ఆఫీస్‌ ఫర్‌ డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ (యూఎన్‌డీఆర్‌ఆర్‌- జెనీవా) నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అన్నిరకాల సహజ విపత్తు మరణాల్లో కరవు, దుర్భిక్షం వల్ల అత్యధికంగా 45%, ఆ తర్వాత వరదల కారణంగా 16% మరణాలు సంభవిస్తున్నాయి.

* వరల్డ్‌ బ్యాంక్, యూఎన్‌ఓ సంయుక్తంగా విడుదల చేసిన సహజ వైపరీత్యాలు, అసహజ వైపరీత్యాల నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం సంభవించే విపత్తులు వరదలు, తుపాన్లు. అయితే ఆఫ్రికా దేశాల్లో మాత్రం కరవు తరచూ సంభవిస్తుంది.  

 

భారత్‌లో కరవు పరిస్థితులు

ఏటా దేశంలో 5 కోట్ల మంది ప్రజలు కరవు ప్రభావానికి గురవుతున్నారు. మొత్తం 640 జిల్లాల్లో 191 జిల్లాలు తీవ్ర కరవు ముప్పు ఎదుర్కొంటున్నాయి. దేశంలో మొత్తం వ్యవసాయ భూమిలో 68% భూమి క్షామం బారిన పడుతోంది. ఇది దేశం మొత్తం భూమిలో 16%. శుష్క, అర్ధశుష్క మండలాల్లో దాదాపు 8-9 ఏళ్లకు ఒకసారి తీవ్ర, అసాధారణ కరవు ఏర్పడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కరవు ఏటా సర్వసాధారణం.

ఉదా: రాజస్థాన్‌లో అత్యధిక ప్రాంతాల్లో 2000, 2001, 2002, 2003లలో వరుసగా నాలుగేళ్లు కరవు తాండవించింది.


కరవు తీవ్రత ఆధారంగా భారత వ్యవసాయ కమిషన్‌ దేశాన్ని అయిదు ప్రాంతాలుగా విభజించింది.


1. వాయవ్య భారతదేశం: రాజస్థాన్‌ తూర్పు, పశ్చిమ ప్రాంతాలు; గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాలు; పంజాబ్, హరియాణా, చండీగఢ్, దిల్లీ ప్రాంతాలను ఇందులో చేర్చారు. ఇది దేశంలో ఎక్కువగా కరవు ఎదుర్కొనే ప్రాంతం.


2. పశ్చిమ, మధ్య భారతదేశం: మహారాష్ట్రలోని మరట్వాడా, విదర్భ, ఉత్తర కర్ణాటక, మధ్యప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమ భాగాలు; కొంకణి, గోవా ప్రాంతాలు, తెలంగాణ ఇందులో ఉన్నాయి.


3. ద్వీపకల్ప భారతదేశం: ఆంధ్రప్రదేశ్, దక్షిణ కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలు.


4. మధ్య ఈశాన్య భారతదేశం: ఝార్ఖండ్, బిహార్, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌లో తూర్పు, పశ్చిమ భాగాలు.


5. ఈశాన్య భారతదేశం: అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపుర్, మిజోరం, త్రిపుర, హిమాలయాల దిగువనున్న పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాలు.

 

దేశంలో భూగర్భ జలాల వినియోగం ఆధారంగా రెండు ప్రాంతాలుగా విభజించారు.

డార్క్‌ జోన్‌: దేశంలో 40% ప్రాంతాన్ని డార్క్‌ జోన్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలను 50% కంటే ఎక్కువగా తోడేశారు.

ఉదా: రాజస్థాన్‌లోని సరిష్కా జాతీయ పార్కు ప్రాంతం.

గ్రే జోన్‌ ప్రాంతం: దేశంలో 30% ప్రాంతం గ్రే జోన్‌లో ఉంది. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలను అక్కడి వర్షపాతం కంటే ఎక్కువ పరిమాణంలో తోడేస్తుంటారు.

 

కరవు తీవ్రతను తగ్గించే చర్యలు: * వర్షం నీటిని సరైన మార్గాల్లోకి మళ్లించే విధానాలు (వాటర్‌ హార్వెస్టింగ్‌) పాటించాలి.

* దేశంలో ఉత్తర భారత నదులను, దక్షిణ భారత నదులను కాల్వల ద్వారా అనుసంధానించాలి.

* గుజరాత్‌లో ఝలరా, రాజస్థాన్‌లోని బోలిస్‌ లాంటి మెట్ల బావుల విధానం, చెరువుల నిర్మాణం లాంటి సంప్రదాయ జలసంరక్ష పద్ధతులను ప్రోత్సహించాలి.

* ప్రజల్లో కరవుపై అవగాహన కల్పించాలి.

* వర్షపాతం, జలాశయాలు, సరస్సులు, నదులు లాంటి వాటిలో నీటి లభ్యతను గమనిస్తూ సరైన నీటి పర్యవేక్షణ చేపట్టాలి.

* పొలాల నుంచి వృథాగా పోతున్న నీటిని వ్యవసాయ కుంటల్లాంటి ఉమ్మడి జలాశయాల్లోకి చేరేలా చూడాలి.

* ముందుగానే కరవు ప్రణాళికను తయారు చేసుకోవాలి.

* కరవు ప్రాంతంలో జీవనోపాధి ప్రణాళికలు, పంటల బీమా పథకాలు అమలు చేయాలి.


మాదిరి ప్రశ్నలు


1. అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?

1) హైదరాబాద్‌     2) బెంగళూరు     3) ఇందౌర్‌     4) కోల్‌కతా

జ: హైదరాబాద్‌

 

2. ఝలరా, బోలిస్‌ అనే సంప్రదాయ నీటి సంరక్షణ విధానాలు కింది వాటిలో దేనికి చెందుతాయి? 

1) చెరువులు    2) మెట్ల బావులు    3) ఆనకట్టలు    4) నీటి కాలువలు

జ: మెట్ల బావులు

 

3. ఇంటి పైకప్పు నుంచి జారే వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం దేనికి ఉదాహరణ?

1) వాటర్‌షెడ్‌ విధానం       2) రైన్‌ షాడో విధానం

3) రైన్‌ ప్రిసిపిటేషన్‌ విధానం      4) వాటర్‌ హార్వెస్టింగ్‌ విధానం

జ: వాటర్‌ హార్వెస్టింగ్‌ విధానం

 

4. భారతదేశ వ్యవసాయ భూమిలో కరవు భూమి ఎంత?

1) 38%      2) 68%      3) 48%      4) 28%

జ:  68%

 

5. భూగర్భ జలాలను 50% కంటే ఎక్కువగా వాడేసే ప్రాంతాలను ఏ జోన్‌గా నిర్ణయించారు?

1) డార్క్‌ జోన్‌     2) గ్రే జోన్‌     3) ఎల్లో జోన్‌      4) రెడ్‌ జోన్‌

జ: డార్క్‌ జోన్‌

 

6. సాధారణ వర్షపాతంలో ఎంత శాతం తగ్గితే కరవుగా భావిస్తారు? 

1) 25% వరకు    2) 50% వరకు    3) 75% వరకు    4) 10% వరకు

జ: 50% వరకు

 

7. ప్రపంచ సహజ విపత్తుల్లో కరవు విపత్తు వాటా ఎంత?

1) 50%      2) 19%      3) 5%          4) 80%

జ: 19%

 

8. మహారాష్ట్రలో రాలెగావ్‌ సిద్ధి గ్రామంలో కరవును పారదోలిన అనుసంధానకర్త, సామాజిక కార్యకర్త ఎవరు?

1) అన్నాహజారే     2) రాజేంద్రసింగ్‌      3) మేధాపాట్కర్‌      4) పాలేకర్‌

జ: అన్నాహజారే

 

9. దేశంలో కరవు తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం.

1) మధ్య భారతదేశం        2) ఈశాన్య భారతదేశం

 3) వాయవ్య భారతదేశం       4) హిమాలయ ప్రాంతం

జ: వాయవ్య భారతదేశం
 

10. భారత వ్యవసాయ పరిశోధనా మండలి కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?

1) దిల్లీ      2) ముంబయి      3) బెంగళూరు      4) కోల్‌కతా

జ: దిల్లీ

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 16-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అటవీ వనరులు - సంరక్షణ

తరగని సంపదకు.. తరాల సంక్షేమానికి!

 

భూగోళమనే శరీరానికి అడవులే ఊపిరితిత్తులు. అవి వాయు కాలుష్యాన్ని నివారించి జీవరాశికి స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారాన్ని అందిస్తాయి. అత్యంత విలువైన, ఎన్నటికీ తరిగిపోని ఆ సహజ సంపదను అందరూ కాపాడుకోవాలి. వనాలు క్షీణించే కొద్దీ కాలుష్యం, భూతాపం పెరిగిపోతాయి. వర్షాలు గతి తప్పుతాయి. దాంతో ఆహార సంక్షోభం సంభవిస్తుంది. అలాంటి సమస్యల నిరోధానికి, భవిష్యత్తు తరాల సంక్షేమానికి అడవులను రక్షించుకోవడం చాలా అవసరం. అందుకే మన దేశంలో అడవుల స్థితిగతులు, వాటిలో రకాలు, సంరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తదితర వివరాలను కాబోయే ప్రభుత్వ ఉద్యోగులు తెలుసుకోవాలి.

 

 

ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన సంపదలో అడవులు, ఉద్భిజ్జ సంపద అత్యంత ప్రధానమైనవి. ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో సహజసిద్ధంగా పెరిగే వృక్షాలను అడవులుగా భావిస్తే, వాటితో పాటు ఉండే గడ్డి మైదానాలు, పొదలు, మొక్కలు, లతలు అన్నింటినీ కలిపి ఉద్భిజ్జ సంపదగా పరిగణిస్తారు. ఫారెస్ట్‌ అనే పదం ఫోరెస్‌ (Fores) అనే లాటిన్‌ పదం నుంచి పుట్టింది. అడవులు పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా, మానవుడి ఆర్థిక, సామాజిక అవసరాలను తీరుస్తున్నాయి. మన దేశంలో 1987 నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి అడవుల లెక్కలను ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సేకరిస్తోంది. 2021లో సేకరించిన 17వ ఇండియన్‌ స్టేట్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌ ప్రకారం (ISFR) దేశంలో 7,13,789 చ.కి.మీ. (71.37 మిలియన్ల హెక్టార్లు) మేర అడవులున్నాయి. దేశ వైశాల్యంలో 21.71% విస్తరించాయి. 2019 నాటి ఐఎస్‌ఎఫ్‌ఆర్‌ లెక్కలతో పోలిస్తే 1,540 చ.కి.మీ. మేర అడవులు పెరిగాయి. ఈ పెరుగుదల అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో, ఆ తర్వాత తెలంగాణ, ఒడిశాలలో ఉంది.

 

విస్తరణ స్థితిగతులు

మన దేశ అడవులు ప్రపంచ అడవుల్లో 2% మాత్రమే ఉన్నప్పటికీ 10వ స్థానంలో ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలోని ఫుడ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ వారి గ్లోబల్‌ ఫారెస్ట్‌ రిసోర్సెస్‌ అంచనా ప్రకారం ప్రపంచంలో అత్యధిక అడవులు ఉన్న దేశాలు వరుసగా 1) రష్యా 2) బ్రెజిల్‌ 3) కెనడా.

దేశంలో అడవులు అత్యధికంగా విస్తరించిన రాష్ట్రం మధ్యప్రదేశ్‌ అయితే, అడవుల శాతం అత్యధికంగా ఉన్న రాష్ట్రం మిజోరం.


అడవుల విస్తీర్ణం రాష్ట్రాల్లో..

అత్యధికం అత్యల్పం
1. మధ్యప్రదేశ్‌ 1. హరియాణా
2. అరుణాచల్‌ప్రదేశ్‌ 2. పంజాబ్‌
3. ఛత్తీస్‌గఢ్‌ 3. గోవా

             

కేంద్రపాలిత ప్రాంతాల్లో..

అత్యధికం అత్యల్పం
1. జమ్ము-కశ్మీర్‌ 1. చండీగఢ్‌
2. అండమాన్‌ నికోబార్‌ దీవులు 2. లక్షదీవులు
3. లద్దాఖ్‌ 3. పుదుచ్చేరి


అడవుల శాతం రాష్ట్రాల్లో..

అత్యధికం అత్యల్పం
1. మిజోరం (85%) 1. హరియాణా (3.63%)
2. అరుణాచల్‌ ప్రదేశ్‌ (79%) 2. పంజాబ్‌ (3.67%)
3. మేఘాలయ (76%) 3. రాజస్థాన్‌ (4.87%)


కేంద్రపాలిత ప్రాంతాల్లో...

అత్యధికం అత్యల్పం
1. లక్షదీవులు (90.33%) 1. లద్దాఖ్‌ (1.35%)
2. అండమాన్‌ నికోబార్‌ దీవులు (82%) 2. పుదుచ్చేరి (11%)
3. జమ్ము-కశ్మీర్‌ (39%) 3. దిల్లీ (13%)

                      

దేశంలో అడవుల ప్రాంతీయ వర్గీకరణను గమనిస్తే అత్యధిక శాతం అడవులు ద్వీపకల్ప పీఠభూమిపై (57%) ఉన్నాయి. హిమాలయాలపైన 18%; పశ్చిమ కనుమలు, పశ్చిమ తీరంలో 10%; తూర్పు కనుమలు, తూర్పు తీరంలో 10%; మిగిలిన 5 శాతం ఉత్తర మైదానాల మీద విస్తరించి ఉన్నాయి.


అడవుల్లో రకాలు 

సాధారణంగా అడవులు వర్షపాతం, గాలిలో తేమ, ఉష్ణోగ్రత, సముద్ర మట్టం నుంచి ఎత్తు వంటి వాటిపై ఆధారపడి పెరుగుతాయి. భారతదేశంలో అనేక నిమ్నోన్నతాలు, శీతోష్ణ స్థితిగతుల్లో ప్రాంతాల మధ్య వ్యత్యాసాల వల్ల వివిధ రకాల అడవులు విస్తరించి ఉన్నాయి. కొంతమంది శాస్త్రవేత్తలు భారతదేశ అడవులను ఎన్నో విధాలుగా విభజించినప్పటికీ సాధారణ అవగాహన కోసం దేశంలో అడవులను కింది విధంగా వర్గీకరించవచ్చు.

 

ఉష్ణ మండల సతతహరిత అరణ్యాలు: ఈ రకం దేశంలో 21 శాతం విస్తరించి ఉన్నాయి. ఇవి పెరగడానికి 200 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం, సముద్ర మట్టం నుంచి 500 - 1500 మీ. కంటే ఎత్తయిన ప్రాంతం కావాలి. అందువల్ల ఇవి పశ్చిమ కనుమల పశ్చిమ భాగాల్లోనూ, అన్ని ఈశాన్య రాష్ట్రాల్లోనూ, అండమాన్‌ - నికోబార్‌ దీవుల్లో విస్తరించి ఉంటాయి. ఈ అడవుల్లో మహాగని, ఎబోని, రోజ్‌వుడ్, సింకోనా, సేముల్, ఇరులా లాంటి పొడవైన కాండాలు, వెడల్పయిన ఆకులు, గట్టి కలపనిచ్చే చెట్లు పెరుగుతాయి.

 

ఉష్ణమండల ఆకురాల్చు అడవులు: మన దేశ అడవుల్లో ఈ రకం అత్యధికంగా 65 శాతం ఉన్నాయి. 100 - 200 సెం.మీ. వర్షపాతం, సముద్ర మట్టం నుంచి 500 మీటర్ల ఎత్తు వరకు ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. కొండవాలులు, పీఠభూములు, మైదాన ప్రాంతాలు వీటికి అనుకూలం. ద్వీపకల్పం మీద, అన్ని పీఠభూముల్లో, తూర్పు కనుమల వెంబడి శివాలిక్‌ హిమాలయాల్లోనూ, లక్షదీవులు, అండమాన్‌ నికోబార్‌ తూర్పు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ అడవుల్లోనూ గట్టి కలప, వెడల్పు ఆకులుండే టేకు, మద్ది, సాల్, గంధపు చెట్లు, వెదురులాంటి వృక్ష సంపద ఉంటుంది.

 

ఉష్ణమండల పొదలు లేదా ఎడారి పొదలు: ఇవి ఎక్కువగా వాయవ్య భారత దేశంలోనూ, ద్వీపకల్పంలో కొండల తూర్పు భాగాల్లోని వర్షచ్ఛాయా ప్రాంతాల్లో 2% మేర విస్తరించి ఉన్నాయి. వీటికి 100 సెం.మీ. కంటే తక్కువ వర్షం సరిపోతుంది. ఇందులో తాటి, ఈత, కర్జూరం చెట్లు, బ్రహ్మజెముడు, నాగజెముడు వంటి పొదలు, చిన్న ఆకులు, దళసరి ఆకులుండే వృక్ష సంపద పెరుగుతుంది. ఇవి బాష్పోత్సేకాన్ని నిరోధిస్తాయి. కాబట్టి వీటిని ‘జీరోఫైట్స్‌’ వృక్షసంపద అంటారు.

 

హిమాలయ పర్వత అడవులు: ఎత్తయిన హిమాలయాల్లో పెరిగే వృక్షసంపద. ఇవి మిగతా ప్రాంతాలతో పోలిస్తే మంచులో పెరిగే ఆల్ఫైన్‌ అడవులు, సమశీతల శృంగాకార అడవుల వృక్ష సంపద ఉంటాయి. ఉదా: విల్లో, ఆల్టర్, దేవదారు, ఓక్‌ సిల్వర్‌ పర్‌.

 

మడ అడవులు: ఇవి ఉప్పు నీరు కలిసిన డెల్టాలు, ఈస్చ్యురీల్లో (నదీముఖాలు) పెరుగుతాయి. వీటినే టైడల్‌ ఫారెస్ట్‌ లేదా క్షారజల అరణ్యాలు అంటారు. ఇవి మన దేశంలో 2% మాత్రమే ఉన్నాయి. సముద్రతీరం ఉన్న 9 రాష్ట్రాలు, అండమాన్‌-నికోబార్‌ దీవులు, పుదుచ్చేరి, దాద్రానగర్‌ హవేలి ప్రాంతాల్లో అక్కడక్కడా విస్తరించి ఉన్నాయి. ఇవి సునామీలకు సహజ అడ్డుగోడలుగా ఉపయోగపడతాయి. వీటికి శ్వాసవేళ్లు, కాండాలలో గాలి గదులు ఉంటాయి. వీటితో చేపల వేటకు వాడే సంప్రదాయ పడవలను ఎక్కువగా తయారు చేస్తుంటారు.


అటవీ సంరక్షణకు ప్రభుత్వ చర్యలు

* అటవీ చట్టం - 1927

* వన్యప్రాణి సంరక్షణ చట్టం - 1972

* పులిని జాతీయ జంతువుగా ప్రకటించిన సంవత్సరం - 1972

* మొదటిసారిగా పులుల సంరక్షణ ప్రాంతాలను ఏర్పాటు చేసిన సంవత్సరం - 1973

* అటవీ పరిరక్షణ చట్టం - 1980

* పర్యావరణ చట్టం - 1986

* జీవ వైవిధ్య చట్టం - 2002

* వన మహోత్సవ కార్యక్రమం - ప్రతి సంవత్సరం జులైలో

* 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అడవులను ఉమ్మడి జాబితాలో చేర్చారు. ఆదేశిక సూత్రాల్లో కూడా పొందుపరిచారు.

* సామాజిక అడవుల కార్యక్రమం - 1980-82


మాదిరి ప్రశ్నలు


1. కిందివాటిలో మడ అడవులు లేని రాష్ట్రం ఏది?

1) పశ్చిమ బెంగాల్‌     2) తమిళనాడు     3) ఆంధ్రప్రదేశ్‌       4) అస్సాం

జ: అస్సాం

 

2. అడవుల విస్తీర్ణం అత్యధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది?

1) లద్దాఖ్‌      2) జమ్ము-కశ్మీర్‌      3) అండమాన్‌ - నికోబార్‌ దీవులు     4) లక్షదీవులు

జ: జమ్ము-కశ్మీర్‌

 

3. కింది ఏ అడవుల్లో జీవవైవిధ్యం ఎక్కువగా కనిపిస్తుంది?

1) దట్టంగా పెరిగే సతతహరిత అరణ్యాలు 

2) గడ్డి భూములు ఎక్కువగా ఉండే ఆకురాల్చు అడవులు

3) ముళ్ల పొదలు ఎక్కువగా ఉండే ఎడారి పొదలు

4) హిమాలయాల్లోని అడవులు

జ: గడ్డి భూములు ఎక్కువగా ఉండే ఆకురాల్చు అడవులు

 

4. కోరింగ అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది?

1) ఒడిశా      2) తమిళనాడు     3) కేరళ     4) ఆంధ్రప్రదేశ్‌

జ: ఆంధ్రప్రదేశ్‌​​​​​​​

 

5. జాతీయ అటవీ విధాన తీర్మానం ప్రకారం దేశంలో ఎంత శాతం అడవులు ఉండాలి?

1) 33.3%     2) 23.3%    3) 43.3%     4) 53.3%

జ: 33.3%

 

6. ఫారెస్ట్‌ అనే పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది?

1) గ్రీకు      2) అరబ్బీ     3) లాటిన్‌      4) స్పానిష్‌

జ: లాటిన్‌​​​​​​​

 

7. మన దేశంలో 90% కి మంచి అడవులు ఉన్న ప్రాంతం ఏది?

1) మిజోరం      2) లక్షదీవులు      3) అండమాన్‌ - నికోబార్‌      4) మధ్యప్రదేశ్‌

జ: లక్షదీవులు​​​​​​​

 

8. కింది ఏ దేశం మొదటిసారిగా అడవుల నరికివేతను నిషేధించింది?

1) డెన్మార్క్‌       2) నార్వే       3) అమెరికా      4) రష్యా

జ: నార్వే​​​​​​​

 

9. అడవి గాడిదల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?

1) కచ్, గుజరాత్‌     2) రాంచి, ఝార్ఖండ్‌     3) జోర్హాట్, అస్సాం    4) ఎర్నాకులం, కేరళ

జ: కచ్, గుజరాత్‌​​​​​​​

 

10. దేశంలో అత్యల్పంగా అడవులున్న రాష్ట్రం?

1) పంజాబ్‌       2) హరియాణా      3) రాజస్థాన్‌        4) సిక్కిం

జ: హరియాణా​​​​​​​


రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 25-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భూ సంపాతాలు

అమాంతం విరిగిపడే ఆపద! 


కొండచరియలు విరిగిపడ్డాయని, మంచు ప్రవాహాలు ముంచుకొచ్చాయని, రాతి ఖండాలు అమాంతం కూలిపోయాయని, అపార ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించాయని తరచూ వార్తలు వస్తుంటాయి. వీటికి భారీ వర్షాలు, భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాల వంటి ప్రకృతి ప్రకోపాలతోపాటు, అడవుల నరికివేత, అస్తవ్యస్త ఇంజినీరింగ్‌ విధానాల వంటి మానవ తప్పిదాలు కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ ప్రమాదాలను నిరోధించడానికి, నష్టతీవ్రతను తగ్గించడానికి ప్రభుత్వాలు నిరంతరం కృషిచేస్తుంటాయి. భవిష్యత్తు ఉద్యోగులుగా అభ్యర్థులు ఈ విపత్తు నిర్వహణ విధానాల గురించి అవగాహన పెంచుకోవాలి. 

 


ఎత్తయిన పర్వతాలు, కొండలు, వాలు ప్రాంతాల నుంచి రాళ్లు, మట్టి, బురద జారిపడటం, నెమ్మదిగా పడటం లేదా కిందికి దొర్లుతూ వచ్చే ప్రక్రియను భూపాతం లేదా కొండచరియలు విరిగిపడటం అంటారు. ఇలా అన్నిరకాల బృహత్‌ చలనాలను భూసంపాతం (Land Slides)అంటారు.

భూపాతాలు ఎక్కువగా పర్వత ప్రాంతాల్లోనే సంభవిస్తాయి. గనుల తవ్వకాలు, భూకంపాలు, వరదలు, అగ్నిపర్వతాల విస్ఫోటాల సమయంలోనూ భూపాతాలు జరగవచ్చు. భారీ వర్షాలు కురిసినప్పుడు కూడా కొండల ప్రాంతాల్లో భూపాతాలు ఏర్పడవచ్చు. ఇలాంటప్పుడు నదీ ప్రవాహాలను కొండచరియలు అడ్డుకోవడంతో వరదలు వస్తుంటాయి.

 

ప్రకృతి సంబంధ కారణాలు:

* కొండ ప్రాంతాలు ఎక్కువ వాలు కలిగి ఉండటం.

* వాలు ప్రాంతాలు గట్టిగా ఉండి చిన్న కదలికలకు కూడా విరిగిపడటం.

* తీవ్రమైన వర్షపాతం.

* రాతి ప్రదేశాలు బాగా క్రమక్షయానికి గురికావడం.

* భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు, వరదలు.

* నీటిపారుదల వ్యవస్థ సరైన దిశలో లేకపోవడం.

 

మానవ సంబంధ కారణాలు:

* చెట్లను విచక్షణారహితంగా కొట్టివేయడంతో జరిగే మృత్తికా క్రమక్షయం.

* సరైన ప్రణాళికలు లేకుండా వాలు ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించడం.

* సరైన ఇంజినీరింగ్‌ విధానాలు లేకుండా తవ్వకాలు జరపడం.

* ఇష్టానుసారంగా గనుల తవ్వకం.

* సమర్థ భూవినియోగ ప్రణాళికలు కొరవడటం.

 

భూపాతం రకాలు

1. ప్రపాతం (Falls): ఎత్తయిన వాలు లేదా శిఖరాల నుంచి వేరుపడిన శిలలు ఎగురుతూ, దొర్లుతూ రావడం వంటి అనూహ్య చలనాలను ప్రపాతం అంటారు.

2. శిథిల ప్రవాహం (Derbis flow): వదులైన మట్టి, రాళ్లు, సేంద్రియ పదార్థం లాంటివి గాలి, నీటితో కలిసి ముద్దగా ఏర్పడి వేగంగా దిగువకు ప్రవహించడం.

3. లహర్‌ ప్రవాహం (Lahar flow): అగ్నిపర్వతాల విస్ఫోటం వల్ల జ్వాలాబిల సరస్సులు విచ్ఛిన్నమై ఏర్పడిన బురద ప్రవాహం లేదా మంచు కరగడం వల్ల ఏర్పడిన శిథిల పదార్థం కిందికి ప్రవహించడం.

4. సర్పణం లేదా పాకడం (Creep): మట్టి లేదా శిలలు నెమ్మదిగా, నిటారుగా కిందికి జారడం. ఇవి రిటైనింగ్‌ గోడలు, కంచెలు, స్తంభాలను కిందికి నెట్టుకు వస్తాయి.

5. పంక ప్రవాహం (Mud flow): 50% ఇసుక, బురద మట్టి కలిగిన తడిపదార్థం వేగంగా ప్రవహించడాన్ని పంక ప్రవాహం అంటారు.

6. కూలిపోవడం (Topple): ఒక రాతి ఖండం ముందుకు వంగుతూ అమాంతంగా పడిపోవడాన్ని కూలిపోవడం అంటారు.

 

ప్రపంచ భూపాతాల దుర్బలత్వం: ప్రపంచంలో మొత్తం విపత్తుల్లో 4% భూపాతాల బెడద ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్య అన్ని ఖండాల్లోనూ ఏదో ఒక ప్రాంతంలో సంభవిస్తూ ఉంటుంది.

 

 

భారత్‌లో స్థితిగతులు:

* దేశంలో మొత్తం విపత్తుల్లో భూపాతాల దుర్బలత్వం 11%గా ఉంది.

* దేశంలో అధికశాతం భూపాతాలు కొండచరియలు విరిగిపడటం వల్లే జరుగుతున్నాయి.

* దాదాపు 0.49 మిలియన్‌ చ.కి.మీ.ల్లో భూపాతాలు సంభవిస్తున్నాయి. ఈ విస్తీర్ణం దేశ భూభాగంలో 0.15%.

* అత్యధికంగా హిమాలయ పర్వత ప్రాంతాల్లో, ఆ తర్వాత పశ్చిమ కనుమలు, వింధ్య పర్వతాల్లో భూసంపాతాలు జరుగుతున్నా