1. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో నీటి నిర్వహణ ప్రాధాన్యత గురించి ఎన్నో లక్ష్యంలో పేర్కొంది?
జ: 6
2. ప్రపంచవ్యాప్తంగా మంచినీటి వనరుల్లో భారత్ ఎంతశాతం జల వనరుల్ని కలిగి ఉంది?
జ: 4%
3. కిందివాటిలో ఏ నదికి అత్యధిక నీటి నిల్వ సామర్థ్యం ఉంది?
జ: గంగ
4. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో అంతర్ రాష్ట్ర జలాల వివాదం గురించి ఉంది?
జ: 262
5. భూగర్భంలోని రాతి లేదా మట్టి పొరల్లో నిల్వ ఉన్న నీటిని ఏమంటారు?
జ: జలస్తరాలు
6. మనదేశంలో భూగర్భ జలాలను అన్వేషించడానికి ఆక్వాఫెర్ మ్యాపింగ్‌ను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం?
జ: హరియాణ
7. కిందివాటిలో ఏ ప్రాంతంలో భూగర్భ జలాలు అత్యంత కలుషితంగా ఉన్నాయి?
జ: భాగల్‌కోట్
8. భూగర్భ జలాలను పరిరక్షించడానికి, నియంత్రించడానికి భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో నమూనా బిల్లును ప్రతిపాదించింది?
జ: 2016, మే
9. మహానది జలాల ట్రైబ్యునల్ ఛైర్మన్ ఎవరు?
జ: ఖాన్విల్కర్
10. భూ ఉపరితల జలవనరుల్లో మొత్తం మంచినీటి వనరులు ఎంత శాతం?
జ: 3%
11. అంతర్ రాష్ట్ర నదీ జలాల బోర్డు, అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాస్పద చట్టాన్ని కేంద్రం ఎప్పుడు రూపొందించింది?
జ: 1956
12. 2015 నాటికి ప్రపంచ తలసరి నీటి లభ్యతలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?
జ: 133 వ స్థానం