• facebook
  • whatsapp
  • telegram

 ప్రాంతీయ సంస్థలు

ప్రపంచ దేశాల మధ్య సహకారాన్ని, ప్రాంతీయ సమతౌలత్యను పెంపొందించడానికి, వర్ధమాన దేశాలకు అవసరమైన తోడ్పాటును అందించేందుకు వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ కూటములను ఏర్పాటు చేశారు. ఇవి ఆయా లక్ష్యాలను సాధించేందుకు తమ వంతు కృషి చేస్తున్నాయి. 


జీ-8 దేశాల కూటమి
చమురు ధరలు విపరీతంగా పెరగడంతో నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై చర్చించడానికి 1975లో అప్పటి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు వెలారీ గిస్కార్‌ డిఎస్టెంగ్, నాటి జర్మనీ ఛాన్సలర్‌ హెల్మట్‌ సిండ్‌ ఫ్రాన్స్‌లో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  దీనికి కొనసాగింపుగా 1976, జూన్‌లో పోర్టారికోలోని సాన్‌జువాన్‌లో మరో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా, బ్రిటన్, ఇటలీ, జపాన్, కెనడా దేశాలతో కూడిన ‘జీ - 7’ అధికారికంగా ఏర్పడింది. ఈ కూటమి ప్రపంచ దేశాల ఆర్థికాభివృద్ధి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వాణిజ్య సంబంధ అంశాలను చర్చించడంతో పాటు, వర్ధమాన దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ‘అంతర్జాతీయ వేదిక’గా మారింది. కొంతకాలానికి ఇది అంతర్జాతీయ రాజకీయాలను కూడా చర్చించే వేదికగా మారి, ప్రబలమైన కూటమిగా అవతరించింది.
* 1997లో డెన్వర్‌లో జరిగిన జీ-7 కూటమి సమావేశంలో రష్యాను సభ్యదేశంగా చేర్చుకున్నారు. దీంతో ఇది జీ-8 కూటమిగా మారింది.


దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్‌)
దక్షిణాసియా దేశాల మధ్య పరస్పర ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించాలని బంగ్లాదేశ్‌ మాజీ అధ్యక్షులు జియావుర్‌ రెహమాన్‌ భావించారు. దీనికోసం సార్క్‌ ను ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు.
* 1985, డిసెంబరు 8న బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో నిర్వహించిన సమావేశంలో సార్క్‌ను ఏర్పాటుచేశారు.
* ప్రారంభంలో ఇందులోని సభ్య దేశాలు 7. అవి: బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక.
* 2007, ఏప్రిల్‌లో న్యూదిల్లీలో జరిగిన 14వ సార్క్‌ సమావేశాల్లో ఎనిమిదో సభ్యదేశంగా ఆఫ్గనిస్థాన్‌ చేరింది. ప్రస్తుతం ఇందులో ఎనిమిది సభ్యదేశాలు ఉన్నాయి.
* సార్క్‌ సమావేశాలకు పరిశీలక హోదా ఉన్న దేశాలుగా అమెరికా, చైనా, జపాన్, ఇరాన్, యూరోపియన్‌ యూనియన్‌లకు అవకాశం కల్పించారు.


సార్క్‌ లక్ష్యాలు:
* దక్షిణాసియా దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించడం.
* ప్రజల సంక్షేమం, వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయడం.
* ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని సాధించడం.
* పేదరిక నిర్మూలన, అక్షరాస్యత పెంపుదలకు కృషి చేయడం.
* సీమాంతర ఉగ్రవాదాన్ని నిర్మూలించి, సుస్థిర ప్రగతి, శాంతిని సాధించడం.


సార్క్‌ దేశాల ప్రాంతీయ కేంద్రాలు

ప్రాంతీయ కేంద్రం ప్రధాన కార్యాలయం
వ్యవసాయ సమాచార కేంద్రం ఢాకా
వాతావరణ పరిశోధక కేంద్రం ఢాకా
ట్యూబర్‌క్యులోసిస్ కేంద్రం కాఠ్‌మాండూ
సమాచార కేంద్రం కాఠ్‌మాండూ
మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఇస్లామాబాద్‌
ఇంధన కేంద్రం ఇస్లామాబాద్
విపత్తు నిర్వహణ కేంద్రం న్యూదిల్లీ
డాక్యుమెంటేషన్‌ కేంద్రం న్యూదిల్లీ
కోస్తా ప్రాంతాల నిర్వహణ కేంద్రం మాల్దీవులు
సాంస్కృతిక కేంద్రం  శ్రీలంక
అటవీ కేంద్రం భూటాన్‌
దక్షిణాసియా విశ్వవిద్యాలయం న్యూదిల్లీ
సార్క్‌ ప్రధాన కార్యాలయం కాఠ్‌మాండూ

 

SAFTA - (South Asian Free Trade Agreement) 
సార్క్‌ సభ్యదేశాలు ‘దక్షిణాసియా దేశాల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’ ్బళీతినీగిత్శిను 2006, జులై 1 నుంచి అధికారికంగా అమల్లోకి తెచ్చాయి. దీని ప్రకారం భారత్, పాకిస్థాన్, శ్రీలంక దేశాలు 2013 నాటికి తమ కస్టమ్స్‌ సుంకాలు 0  5 శాతం మధ్యలో ఉండేలా చూడాలి. ఆర్థికంగా వెనుకబడిన బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మాల్దీవులు 2018 నాటికి తమ కస్టమ్స్‌ సుంకాలను 0  5 శాతానికి తేవాలని నిర్దేశించారు.


సార్క్‌ - ఇతర ప్రత్యేకతలు
* సార్క్‌ ఏర్పడి 2010 నాటికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో థింపూ(భూటాన్‌)లో సార్క్‌ రజతోత్సవ సదస్సును నిర్వహించారు.
* సార్క్‌ 2007ను హరిత దక్షిణాసియా సంవత్సరంగా ప్రకటించింది.
* 1990 - ఇయర్‌ ఆఫ్‌ గర్ల్‌ చైల్డ్‌
* 1995 - ఇయర్‌ ఆఫ్‌ పావర్టీ ఎరాడికేషన్‌
* 1999 - ఇయర్‌ ఆఫ్‌ బయోడైవర్సిటీ
* 2008 - ఇయర్‌ ఆఫ్‌ గుడ్‌ గవర్నెన్స్‌


జీ-20 దేశాల కూటమి
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేసేందుకు అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలను సమన్వయం చేసి ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు 1999లో ‘జీ-20’ దేశాల కూటమి ఏర్పడింది. దీన్ని ప్రారంభించిన మొదట్లో ఏటా ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశాలు జరిగేవి.
* 2008లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం తర్వాత ఇది ఆర్థిక విధానాల్లో సహకారం అందించుకునే దేశాధినేతల వేదికగా మారింది. ఇది నిర్వహించే సమావేశాల్లో ప్రపంచ ఆర్థిక సుస్థిరత, ఆర్థిక ప్రగతి కొనసాగింపునకు అవసరమైన అనేక తీర్మానాలు రూపొందించి అమలు చేస్తోంది.
* 1999 వరకు జీ-8 కూటమిలోని సంపన్న దేశాలు మాత్రమే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గమనాన్ని నిర్దేశిస్తూ వచ్చాయి. జీ-20 కూటమి ఏర్పాటుతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా ఈ వేదికపై ప్రాతినిధ్యం లభించింది.
* అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వ సాధన కోసం కీలక విధానాల రూపకల్పనకు, పారిశ్రామిక దేశాలు, కొత్తగా ఎదుగుతున్న మార్కెట్‌ దేశాల మధ్య చర్చలు, అధ్యయనం, సమీక్షను ప్రోత్సహించడం జీ-20 కూటమి లక్ష్యం. ఇందులో బ్రిట్టన్‌ ఉడ్స్‌ కవలలైన అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచబ్యాంక్‌ కూడా భాగస్వాములుగా ఉన్నాయి.
* జీ-20 కూటమిలో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, యూరోపియన్‌ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, బ్రిటన్, అమెరికా దేశాలకు సభ్యత్వం ఉంది.


జీ-20 కూటమి 15వ శిఖరాగ్ర సదస్సు
* జీ-20 దేశాధినేతల 15వ శిఖరాగ్ర సదస్సు 2020, నవంబరు 21, 22 తేదీల్లో వర్చువల్‌ విధానంలో జరిగింది. ఈ సమావేశానికి సౌదీ అరేబియా అధ్యక్షత వహించింది.
* ‘21వ శతాబ్దంలో అందరికీ అవకాశాలను గుర్తించడం’ అనే నినాదంతో ఈ సదస్సు  జరిగింది. ఈ సదస్సులో ప్రధానంగా కొవిడ్‌-19 సంక్షోభం, దాని ప్రభావం నేపథ్యంలో అంతర్జాతీయంగా సమ్మిళిత, సుస్థిరత, ఆర్థిక పురోగమనం సాధించడం ఎలా అనే అంశాలపై  చర్చలు జరిగాయి. కొవిడ్‌ లాంటి వ్యాధులను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు సంసిద్ధంగా ఉండటం, ప్రజల సంక్షేమం, పరిరక్షణ కోసం ప్రణాళికలు రూపొందించడం, అందుకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం మొదలైన అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు.


భారత ప్రధాని ప్రసంగం
* 2020, నవంబరు 21న భారత ప్రధాని నరేంద్ర మోదీ జీ-20 దేశాల కూటమి సమావేశంలో ప్రసంగించి, కింది అంశాలను ప్రస్తావించారు.
* రెండో ప్రపంచయుద్ధం తర్వాత భూమి మీద మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు కొవిడ్‌-19.
* జీ-20 దేశాలు అంతర్జాతీయ ఆర్థిక పురోగమన అంశంపైనే కాకుండా భూగోళం పరిరక్షణ, భవిష్యత్తులో మానవుల మనుగడను దృష్టిలో ఉంచుకుని నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించాలి.
* కొవిడ్‌-19 అనంతరం ప్రపంచంలో ఒక కొత్త అంతర్జాతీయ సూచీని రూపొందించాలి. ఈ సూచీలో 4 ప్రధానాంశాలు ఉండాలి. అవి:
1. ప్రపంచవ్యాప్తంగా విస్తృతస్థాయిలో ప్రతిభావంతుల బృందాన్ని రూపొందించడం.
2. కొత్త సాంకేతికతలు సమాజంలో అన్ని వర్గాలకూ అందేలా చేయడం.
3. పాలనా వ్యవస్థల్లో పారదర్శకతను సాధించడం.
4. భూగ్రహాన్ని పరిరక్షించే స్ఫూర్తిని అన్ని దేశాలు పెంపొందించడం.


భవిష్యత్తులో జీ-20 సమావేశాలు, వేదికలు
* జీ-20 కూటమి దేశాల సమావేశాలకు 2021లో ఇటలీ; 2022లో ఇండోనేసియా; 2023లో భారత్‌; 2024లో బ్రెజిల్‌ అధ్యక్షత వహిస్తాయి.

Posted Date : 22-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ

             మన దేశంలో ఇన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎలా ఏర్పడ్డాయి? ఇంతకు ముందు ఈ నిర్మాణం ఏవిధంగా ఉండేది? వివిధ సంస్కృతులతో విస్తరించి, భిన్నత్వాన్ని ప్రదర్శించే ఈ భూభాగంలో ఏకత్వాన్ని సాధించడంలో ఎలాంటి కృషి జరిగింది..? ఈ అంశాలను పాలిటీ అధ్యయనంలో భాగంగా పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.
      స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశంలో రెండు రాజకీయ విభాగాలు ఉండేవి. మొదటిది బ్రిటిష్‌ ప్రభుత్వ ప్రత్యక్ష పాలనలోని ప్రావిన్సులు. రెండోది బ్రిటిష్‌ సర్వసమున్నతాధికారం కింద స్వదేశీ రాజుల పాలనలో ఉన్న సంస్థానాలు. స్వాతంత్య్రానంతరం పాలనా సౌలభ్యం కోసం దేశాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగా వర్గీకరించారు.
            భారత యూనియన్‌ కంటే భారత భూభాగం అనే భావన చాలా విస్తృతమైంది. యూనియన్‌లో రాష్ట్రాలు మాత్రమే ఉంటాయి. కానీ భారత భూభాగంలో రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలు, భారత ప్రభుత్వం ఆర్జించిన ఇతర ప్రాంతాలూ ఉంటాయి. కేంద్రంతో రాష్ట్రాలు అధికారాలను పంచుకుంటాయి. కేంద్రపాలిత ప్రాంతాలు సెంట్రల్‌ గవర్నమెంట్‌ ప్రత్యక్ష పాలనలో ఉంటాయి.

 

రాజ్యాంగం ప్రారంభంలో..
1950 జనవరి, 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చేనాటికి మన దేశంలోని భూభాగాలను నాలుగు విభాగాలుగా ఏర్పాటు చేశారు.
1) పార్ట్‌ - A రాష్ట్రాలు: గతంలో బ్రిటిష్‌ పాలిత ప్రాంతాలుగా ఉన్నవాటిని ఈ విభాగంలో చేర్చారు. వీటి సంఖ్య 9. అవి అసోం, బిహార్‌, బాంబే, మధ్యప్రదేశ్‌, మద్రాస్‌, ఒడిశా, పంజాబ్‌, యునైటెడ్‌ ప్రావిన్స్‌, పశ్చిమ్‌బంగ.
2) పార్ట్‌ - B రాష్ట్రాలు: శాసనసభలు లేని స్వదేశీ సంస్థానాలను ఈ విభాగంలో చేర్చారు. వీటి సంఖ్య 9. అవి జమ్మూ-కశ్మీర్‌, మధ్యభారత్‌, హైదరాబాద్‌, మైసూర్‌, పాటియాలా అండ్‌ తూర్పు పంజాబ్‌, రాజస్థాన్‌, సౌరాష్ట్ర, ట్రావెన్‌కోర్‌ కొచ్చిన్‌, వింధ్యప్రదేశ్‌.
3) పార్ట్‌ - C రాష్ట్రాలు: గతంలో చీఫ్‌ కమిషనరేట్‌ ప్రాంతాలుగా ఉన్నవాటిని, కొన్ని స్వదేశీ సంస్థానాలను ఈ విభాగంలో చేర్చారు. వీటి సంఖ్య 10. అవి అజ్మీర్‌, భోపాల్‌, బిలాస్‌పూర్‌ కూంచ్‌, కూచ్‌-బిహార్‌, కూర్గ్‌, దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, కచ్‌, త్రిపుర, మణిపూర్‌.
4) పార్ట్‌ - D రాష్ట్రాలు: ఈ విభాగంలో అండమాన్‌ నికోబార్‌ దీవులను చేర్చారు.

 

రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ కమిషన్‌
1953, అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటుచేయాలని ఉద్యమించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ కర్ణాటకలోని బెల్గాంను సందర్శించినప్పుడు ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే ఉద్దేశంతో తగిన సిఫారసులు చేసేందుకు ప్రభుత్వం 1953 డిసెంబరులో రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. దీనికి ఫజల్‌ అలీ ఛైర్మన్‌గా, కె.ఎం.పణిక్కర్‌, హెచ్‌.ఎన్‌.కుంజ్రూ సభ్యులుగా వ్యవహరించారు. ఈ కమిషన్‌ తన నివేదికను 1955 సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.

 

సిఫారసులు:
* పార్ట్‌ - A, B, C, D లుగా ఉన్న రాష్ట్రాలన్నింటినీ రద్దుచేసి వాటిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్‌ వ్యవస్థీకరించాలి.
* ఒకే భాష - ఒకే రాష్ట్రం అనే వాదన సమంజసం కాదు.
* దేశాన్ని 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలి.
* పరిపాలనా సౌలభ్యం కోసం ప్రాంతీయ మండళ్లు (Zonal Councils) గా ఏర్పాటుచేయాలి.
* దిల్లీలో జాతీయ మైనార్టీ భాషల కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలి.

 

పార్లమెంటు - రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ చట్టం
 ఫజల్‌ అలీ కమిషన్‌ సిఫారసుల్లో కీలకమైన వాటిని 1956లో జరిగిన 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత పార్లమెంటు ఆమోదించింది. దీంతో రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ఏర్పడి, మన దేశంలో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఆవిర్భవించాయి.
1956లో ఏర్పాటైన రాష్ట్రాలు: అసోం, బెంగాల్‌, బిహార్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, మద్రాస్‌, కేరళ, మైసూర్‌, ముంబయి, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌.
1956లో ఏర్పాటైన కేంద్రపాలిత ప్రాంతాలు: దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, అమోని, మినికాయ్‌, లాక్‌దీవులు, అండమాన్‌, నికోబార్‌ దీవులు, త్రిపుర, మణిపూర్‌.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజ్యాంగం - చారిత్రక పరిణామం

1. భారతదేశంలో ప్రత్యేక మత నియోజక వర్గాలను ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు?
జ: మింటో-మార్లే సంస్కరణల చట్టం - 1909

 

2. భారత్‌లో మత నియోజక వర్గాల పితామహుడని ఎవరిని పేర్కొంటారు?
జ: లార్డ్‌ మింటో

 

3. మన దేశంలో రాష్ట్రస్థాయిలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం?
జ: మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం - 1919

 

4. భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలనను ప్రవేశపెట్టడమే లక్ష్యమని ఏ చట్టంలో పేర్కొన్నారు?
జ: మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం - 1919

 

5. కేంద్ర శాసనసభలో మొదటిసారి ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టం?
జ: మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం - 1919

 

6. ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో సభ్యుడిగా నియమితులైన తొలి భారతీయుడు?
జ: సత్యేంద్ర ప్రసాద్‌ సిన్హా

 

7. మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం - 1919ను ‘సూర్యుడులేని ఉదయం’ అని ఎవరు అభివర్ణించారు?
జ: బాలగంగాధర్‌ తిలక్‌

 

8. మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం - 1919కు సంబంధించి సరైంది?
1) కేంద్ర బడ్జెట్‌ నుంచి రాష్ట్ర బడ్జెట్‌ను వేరుచేశారు.          2) లండన్‌లో భారత హైకమిషనర్‌ పదవిని ఏర్పాటు చేశారు.
3) సాధారణ బడ్జెట్‌ నుంచి రైల్వే బడ్జెట్‌ను వేరుచేశారు.     4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

9. రాష్ట్రాల్లోని ‘ద్వంద్వ ప్రభుత్వ’ విధానాన్ని ఏ చట్టం రద్దు చేసింది?
జ: భారత ప్రభుత్వ చట్టం - 1935

 

10. భారత ప్రభుత్వ చట్టం - 1935కు సంబంధించి సరైంది.
1) కేంద్రం, రాష్ట్రాల మధ్య మూడు రకాల అధికారాల విభజనను పేర్కొటుంది.
2) రాష్ట్రస్థాయిలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టింది.
3) దిల్లీలో ఫెడరల్‌ కోర్ట్‌ను ఏర్పాటు చేసింది.
4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

Posted Date : 27-07-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశం - సమాఖ్య, ఏకకేంద్ర వ్యవస్థల సమ్మేళనం

          విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలతో విస్తరించిన భారతదేశం ఏకీకృతంగా ఎలా ఉంది? కేంద్రం, రాష్ట్రాలకు అధికారాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ వాటిని కలిపి ఉంచే శక్తి ఏమిటి? అధికారాల విభజనకు ప్రాతిపదిక ఏది? పాలిటీ అధ్యయనంలో భాగంగా వీటన్నింటిపై పోటీ పరీక్షార్థులు అవగాహనను పెంచుకోవాలి.
          కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఉన్న సంబంధాలను ఆధారం చేసుకొని రాజకీయ, ప్రభుత్వ వ్యవస్థల నిర్మాణాన్ని సమాఖ్య, ఏకకేంద్రాలుగా పేర్కొంటారు. సమాఖ్య వ్యవస్థలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య అధికారాల పంపిణీ జరుగుతుంది. ఏకకేంద్రంలో పరిపాలన అధికారాలు మొత్తం కేంద్రం వద్ద ఉంటాయి.

 

సమాఖ్య లక్షణాలు
 

ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ: మన రాజ్యాంగం ప్రకారం జాతీయస్థాయిలో కేంద్ర, ప్రాంతీయస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాధాన్యం ఉన్న విదేశీ వ్యవహారాలు, బ్యాంకింగ్‌, రైల్వేలు, తంతి తపాలా మొదలైన అంశాలను నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం, ప్రజారోగ్యం, శాంతిభద్రతలు తదితరాలను పర్యవేక్షిస్తాయి.
రాజ్యాంగ ఆధిక్యత: భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం ద్వారా ఏర్పడి, రాజ్యాంగం ద్వారానే అధికారాలను పొంది, రాజ్యాంగ పరిధికి లోబడి పనిచేస్తాయి. దేశంలోని వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ రాజ్యాంగ పరిధికి లోబడే వ్యవహరించాలి.

 

లిఖిత రాజ్యాంగం: భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ప్రారంభ రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్‌, 8 షెడ్యూల్స్‌, 22 భాగాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజ్యాంగంలో 12 షెడ్యూళ్లు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్మాణం, అధికారాలు, విధులు వాటి నిర్వహణలో పరిమితులను రాజ్యాంగం నిర్దేశిస్తుంది. ఆర్టికల్‌ 73 కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిని, ఆర్టికల్‌ 162 రాష్ట్రప్రభుత్వాల అధికార పరిధిని వివరిస్తాయి.
భారత రాజ్య వ్యవస్థ సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగానూ, అసాధారణ పరిస్థితుల్లో ఏక కేంద్రంగానూ వ్యవహరిస్తుంది. - డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌
భారత రాజ్యాంగం అర్ధ సమాఖ్య - కె.సి.వేర్‌

 

అధికారాల విభజన
          కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజనను మూడు రకాలుగా చేసి ఏడో షెడ్యూల్‌లో పొందుపరిచారు. ఇది సమాఖ్య వ్యవస్థ లక్షణం.
కేంద్ర జాబితా: దీనిలో జాతీయ ప్రాధాన్యం ఉన్న 97 అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటి సంఖ్య సుమారు 100.
రాష్ట్ర జాబితా: దీనిలో ప్రాంతీయ ప్రాముఖ్యం ఉన్న 66 అంశాలను పొందుపరిచారు. ప్రస్తుతం వీటి సంఖ్య దాదాపు 61.
ఉమ్మడి జాబితా: దీనిలో జాతీయ, ప్రాంతీయాలకు సంబంధించిన 47 అంశాలను పేర్కొన్నారు. ప్రస్తుతం వీటి సంఖ్య సుమారు 52. ఈ జాబితాల్లో లేని అంశాలను ‘అవశిష్టాధికారాలు’ అంటారు. అవి కేంద్ర ప్రభుత్వానికి చెందుతాయి.
సమాఖ్య వ్యవస్థ దేశాలు: అమెరికా, రష్యా, స్విట్జర్లాండ్‌, కెనడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, మెక్సికో.
ఏకకేంద్ర వ్యవస్థ దేశాలు: శ్రీలంక, బ్రిటన్‌, చైనా, జపాన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రాథమిక హక్కులు

1. మత స్వాతంత్య్రపు హక్కు గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్‌లో వివరించారు?
జ: ఆర్టికల్స్‌ 25 - 28

 

2. ‘భారతీయులు తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు’ అని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో పేర్కొన్నారు?
జ: ఆర్టికల్‌ 25

 

3. ఆర్టికల్‌ 26లో పేర్కొన్న అంశాన్ని గుర్తించండి.
1) భారతీయులు మతపరమైన వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛను కలిగి ఉన్నారు.
2) మతాభివృద్ధికి అవసరమైన ధర్మాదాయ సంస్థలను స్థాపించి, నిర్వహించుకోవచ్చు.
3) ధర్మాదాయ సంస్థలు సమకూర్చుకునే నిధులపై పన్నులు ఉండవు.
4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

4. మన దేశంలో మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రజల నుంచి ఎలాంటి పన్నులూ వసూలు చేయకూడదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ నిర్దేశిస్తోంది?
జ: ఆర్టికల్‌ 27

 

5. ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వ ధన సహాయం పొందే ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో మత బోధనను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ నిషేధిస్తోంది?
జ: ఆర్టికల్‌ 28

 

6. ఆర్టికల్‌ 25 ప్రకారం హిందువులు అంటే?
1) హిందువులు                    2) జైనులు, బౌద్ధులు
3) సిక్కులు                        4) అందరూ
జ: 4 (అందరూ)

 

7. ఎస్‌.పి. మిట్టల్‌ ‌VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు సంబంధించి సరికానిది?
జ: ఆర్య సమాజం హిందూమతంలో అంతర్భాగం

 

8. అల్పసంఖ్యాక వర్గాలవారు తమ ప్రత్యేక భాష, లిపి, సంస్కృతులను పరిరక్షించుకునే హక్కును కలిగి ఉన్నారని రాజ్యాంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటోంది?
జ: ఆర్టికల్‌ 29

 

9. అల్పసంఖ్యాక వర్గాలవారు తమ ప్రత్యేక భాష, లిపి, సంస్కృతులను అభివృద్ధి చేసుకునేందుకు ప్రత్యేక విద్యాసంస్థలను స్థాపించుకోవచ్చు. దానికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం నుంచి అందుకోవచ్చని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ చెబుతోంది?
జ: ఆర్టికల్‌ 30

 

10. పార్లమెంటు రూపొందించిన చట్టం ప్రకారం అల్ప సంఖ్యాక వర్గాన్ని గుర్తించండి.
జ: మతపరమైన అల్పసంఖ్యాక వర్గం, సంస్కృతి పరమైన అల్పసంఖ్యాక వర్గం

 

11. మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలను గుర్తించేదుకు దేన్ని యూనిట్‌గా తీసుకుంటారు?
జ: దేశం

 

12. భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలను నిర్దారించేందుకు దేన్ని యూనిట్‌గా తీసుకుంటారు?
జ: రాష్ట్రం

 

13. ప్రారంభ రాజ్యాంగంలో ఆస్తిహక్కు గురించి ఏ ఆర్టికల్‌లో పేర్కొన్నారు?
జ: ఆర్టికల్‌ 31

 

14. ఆస్తిహక్కుకు సంబంధించి కిందివాటిలో సరికానిది?
జ: దీన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు.

 

15. రాజ్యాంగ పరిహారపు హక్కును ప్రాథమిక హక్కులకు హృదయం లాంటిదని ఎవరు అభివర్ణించారు?
జ: డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌

 

16. కిందివాటిలో రిట్స్‌కు సంబంధించి సరికానిది?
1) రిట్‌ అంటే ఉన్నత న్యాయస్థానం జారీ చేసే తప్పనిసరిగా పాటించాల్సిన ఆదేశం.
2) ఆదేశిక సూత్రాల అమలు కోసం వీటిని న్యాయస్థానాలు జారీ చేస్తాయి.
3) ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టు 5 రకాల రిట్స్‌ జారీ చేస్తుంది.
4) ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టులు 5 రకాల రిట్స్‌ జారీ చేస్తాయి.
జ: 2 (ఆదేశిక సూత్రాల అమలు కోసం వీటిని న్యాయస్థానాలు జారీ చేస్తాయి.)

 

17. ఆర్టికల్‌ 33 ప్రకారం ప్రాథమిక హక్కులు ఎవరికి పూర్తిగా లభించవు?
1) సైనిక, పారామిలటరీ దళాలు                                      
2) గూఢచార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు
3) పోలీసు, ఇతర రక్షణ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు            
4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

18. ఆర్టికల్‌ 34 ప్రకారం విధించే ఏ శాసనం అమల్లో ఉన్న ప్రాంతాల్లోని ప్రజల ప్రాథమిక హక్కులపై పరిమితులు విధిస్తారు?
జ: సైనిక శాసనం

 

19. ‘మీరు నిర్బంధించిన వ్యక్తిని ప్రయాణ సమయం మినహాయించి మొత్తం శరీరంతో సహా 24 గంటల్లోగా నా ముందు హాజరు పరచు’ అని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆదేశం/రిట్‌ ఏది?
జ: హెబియస్‌ కార్పస్‌

 

20. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా అధికారాలు లేనప్పటికీ ఎవరైనా అధికారాలు చెలాయిస్తుంటే వారిని నియంత్రించేందుకు న్యాయస్థానం జారీ చేసే రిట్‌?
జ: కోవారెంటో

 

21. దిగువ న్యాయస్థానం తన పరిధిలో లేని కేసును విచారిస్తుంటే తక్షణం ఆ విచారణను నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానం జారీచేసే రిట్‌?
జ: ప్రొహిబిషన్‌

 

22. కిందివాటిలో న్యాయస్థానాలు న్యాయస్థానాలపైన జారీ చేసే రిట్‌ ఏది?
1) సెర్షియోరరీ                               2) ప్రొహిబిషన్‌
3) సెర్షియోరరీ, ప్రొహిబిషన్‌               4) మాండమస్‌
జ: 3 (సెర్షియోరరీ, ప్రొహిబిషన్‌)

 

23. ప్రభుత్వోద్యోగి తన విధిని సక్రమంగా నిర్వహించకపోతే ‘నీ విధిని నీవు సక్రమంగా నిర్వహించు’ అంటూ ఉన్నత న్యాయస్థానం జారీ చేసే రిట్‌?
జ: మాండమస్‌

 

24. హెబియస్‌ కార్పస్‌ రిట్‌ను ఎవరిపై జారీచేసే అవకాశం ఉంటుంది?
జ: ప్రభుత్వ వ్యక్తులు, ప్రైవేట్‌ వ్యక్తులు

 

25. హక్కులు, విధులు ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాల వంటివి అని అభివర్ణించినవారు?
జ: హెచ్‌.జె. లాస్కి

 

26. న్యాయస్థానం ఒక పనిని చేయమని లేదా వద్దని ఇచ్చే ఆదేశాన్ని ఏమంటారు?
జ: ఇంజక్షన్‌

 

27. PIL అంటే?
జ: Public Interest Litigation

 

28. PIL అనే భావన (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) మొదటిసారిగా ఏ దేశంలో ఆవిర్భవించింది?
జ: అమెరికా

 

29. మన దేశంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) అనే భావనకు విస్తృత ప్రాచుర్యం కల్పించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి?
జ: జస్టిస్‌ పి.ఎన్‌. భగవతి

 

30. న్యాయస్థానం కేసును స్వతహాగా అంటే తనకు తానే తీసుకుని విచారించడాన్ని ఏమంటారు?
జ: సుమోటో

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత పార్లమెంట్ - లోక్‌సభ

       కేంద్ర ప్రభుత్వ సర్వోన్నత శాసన నిర్మాణ సంస్థ భారత పార్లమెంట్. లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రపతిని కలిపి పార్లమెంట్ (79వ అధికరణ) అంటారు. రాష్ట్రపతి పార్లమెంట్‌లో అంతర్భాగం. రాజ్యాంగంలోని 5వ భాగంలో 79 నుంచి 122 వరకు ఉన్న అధికరణలు పార్లమెంట్ నిర్మాణం, అధికారాలు, విధుల గురించి వివరిస్తాయి.
      పార్లమెంట్‌లోని దిగువ సభను లోక్‌సభ House of the People అంటారు. ఇందులో రాజ్యాంగం ప్రకారం గరిష్ఠంగా 552 మంది ఉండవచ్చు. 550 మందిని జనాభా ఆధారంగా విభజించిన ప్రాదేశిక నియోజక వర్గాల నుంచి ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఆంగ్లో ఇండియన్ వర్గం నుంచి ఇద్దరిని రాష్ట్రపతి నియమించవచ్చు. అయితే ప్రస్తుతం వివిధ రాష్ట్రాల నుంచి 530 మంది, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 13 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న సభ్యులు 543 మంది, ఆంగ్లో ఇండియన్లకు సరైన ప్రాతినిధ్యం లేనప్పుడు ఆ వర్గం నుంచి ఇద్దరిని రాష్ట్రపతి నియమిస్తారు. ప్రస్తుత సభ్యుల సంఖ్య 545. ఎన్నికలు రహస్య ఓటింగ్ పద్ధతిలో జరుగుతాయి. ప్రస్తుతం అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్ నుంచి 80 మందికి, సిక్కిం, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరికి మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. కేంద్రపాలిత ప్రాంతమైన జాతీయ రాజధాని దిల్లీకి ఏడుగురు, మిగిలిన 6 కేంద్రపాలిత ప్రాంతాలకు ఒకరు చొప్పున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 25, తెలంగాణ నుంచి 17 మంది లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
* లోక్‌సభ సభ్యులు రాష్ట్రపతి లేదా రాష్ట్రపతి నియమించిన అధికారి ద్వారా ప్రమాణ స్వీకారం చేస్తారు. సాధారణంగా రాష్ట్రపతి నియమించిన ప్రోటెం స్పీకర్ (Pro Tem Speaker) ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సంప్రదాయం ప్రకారం సభలో అత్యధిక అనుభవం ఉన్న సీనియర్‌ను ప్రోటెం స్పీకర్‌గా నియమిస్తారు. ప్రోటెం స్పీకర్‌తో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. స్పీకర్ 10 మంది సభ్యులతో ప్యానల్ స్పీకర్ల జాబితాను రూపొందిస్తారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేని సమయంలో ప్యానల్ స్పీకర్ సభకు అధ్యక్షత వహిస్తారు. ఆయన కూడా అందుబాటులో లేకపోతే సభ సభ్యులు తమలో నుంచి ఒకరిని తాత్కాలిక స్పీకర్‌గా నియమించుకుంటారు.
* ప్రధానమంత్రి లోక్‌సభకు నాయకుడిగా వ్యవహరిస్తారు. ప్రధానమంత్రి రాజ్యసభ సభ్యుడైతే ఆయన రాజ్యసభ నాయకుడిగా వ్యవహరిస్తూ, లోక్‌సభలో సభ్యత్వం ఉన్న తన మంత్రివర్గ సహచరుడిని లోక్‌సభ నాయకుడిగా నియమిస్తారు.
* ప్రస్తుత లోక్‌సభలో (16వ లోక్‌సభ) 38 పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ కనీసం 10 శాతం స్థానాలు పొందలేకపోవడంతో ప్రతిపక్ష పార్టీ నాయకుడి హోదాను పొందలేకపోయాయి. అయితే ఇది రాజ్యాంగబద్ధ పదవి కాదు. పార్లమెంటరీ సంప్రదాయం మాత్రమే.
* లోక్‌సభలోని సభ్యులు ఎన్నుకున్న స్పీకర్ ఆ సభకు అధ్యక్షత వహిస్తారు. స్పీకర్ లేని సమయంలో డిప్యూటీ స్పీకర్ లేదా ఉపసభాపతి సభకు అధ్యక్షత వహిస్తారు. ప్రస్తుతం సుమిత్రా మహాజన్ స్పీకర్‌గా, యం.తంబిదురై డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు.
* లోక్‌సభ సభ్యులు తమ రాజీనామా పత్రాన్ని లోక్‌సభ స్పీకర్‌కు రాయాల్సి ఉంటుంది. స్పీకర్ సంతృప్తి మేరకు వాటిని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.
* స్పీకర్ అనుమతి లేకుండా సభ సమావేశాలకు 60 రోజులు గైర్హాజరు అయితే వారి సభ్యత్వం రద్దవుతుంది.
నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ: 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే జనాభా లెక్కల సేకరణ తర్వాత పార్లమెంట్ నియమించే నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజక వర్గాల సంఖ్యను పెంచడం లేదా ప్రాదేశిక సరిహద్దులను మార్చడం, షెడ్యూల్డ్ కులాలు, తెగల నియోజక వర్గాలను నిర్ణయిస్తుంది. ప్రస్తుతం లోక్‌సభలో షెడ్యూల్డ్ కులాలకు 84, షెడ్యూల్డ్ తెగలకు 47, మొత్తం 131 (24.03%) స్థానాలను రిజర్వు చేశారు.
లోక్‌సభ కాలపరిమితి: సభ సమావేశమైన మొదటి రోజు నుంచి 5 సంవత్సరాలు అంతకంటే ముందు కూడా ప్రధానమంత్రి సిఫారసుపై రాష్ట్రపతి లోక్‌సభను రద్దు చేయగలరు. అంతేకాకుండా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు లోక్‌సభ గడువును అదనంగా ఒక సంవత్సరం పొడిగించవచ్చు.
                                                               

 లోక్‌సభ స్పీకర్

     రాజ్యాంగంలో 93 నుంచి 97 వరకు ఉన్న అధికరణలు స్పీకర్ పదవి గురించి వివరిస్తాయి. లోక్‌సభకు స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. స్పీకర్ లేని సమయంలో డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. బ్రిటిష్ పాలనా కాలంలో 1921 వరకు కేంద్ర శాసన మండలికి గవర్నర్ జనరల్ అధ్యక్షత వహించేవారు. 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా కేంద్ర శాసన మండలికి ప్రెసిడెంట్ (స్పీకర్), డిప్యూటీ ప్రెసిడెంట్ (డిప్యూటీ స్పీకర్) పదవులను ఏర్పాటు చేశారు. ఇది 1921 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో ఫ్రెడరిక్ వైట్ ప్రెసిడెంట్‌గా, సచ్చిదానంద సిన్హా (వైస్ ప్రెసిడెంట్)డిప్యూటీ స్పీకర్‌గా నియమితులయ్యారు. కేంద్రశాసన మండలికి విఠల్‌భాయ్ జె. పటేల్ మొదటిసారిగా ఎన్నికైన ప్రెసిడెంట్ (స్పీకర్). 1935 భారత ప్రభుత్వ చట్టం ఈ పేర్లను స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌గా మార్చినప్పటికీ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మాత్రమే అమల్లోకి వచ్చాయి.
* లోక్‌సభ సభ్యులు తమలో నుంచి ఒకరిని స్పీకర్‌గా, మరొకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటారు. స్పీకర్ ఎన్నిక తేదీని రాష్ట్రపతి నిర్ణయిస్తారు. కానీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తేదీని స్పీకర్ నిర్ణయిస్తారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవి ప్రమాణ స్వీకారం అనేది ప్రత్యేకంగా ఉండదు.
* లోక్‌సభ రద్దు అయినప్పటికీ తిరిగి లోక్‌సభ ఏర్పడేంతవరకూ స్పీకర్ పదవిలో కొనసాగుతారు.
* స్పీకర్, డిప్యూటీ స్పీకర్ జీతభత్యాలను భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
* స్పీకర్‌కు లోక్‌సభలో నిర్ణాయక ఓటు హక్కు ఉంటుంది.
* స్పీకర్ లోక్‌సభను తాత్కాలికంగా వాయిదా వేయగలరు.
* పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. స్పీకర్ లేని సందర్భంలో డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు.
* ఒక బిల్లును ద్రవ్య బిల్లా లేదా సాధారణ బిల్లా అని నిర్ణయించే అంతిమ అధికారం లోక్‌సభ స్పీకర్‌కే ఉంటుంది.
* లోక్‌సభ సభ్యులకు సంబంధించి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు చేయడంలో స్పీకర్ అంతిమ నిర్ణయం తీసుకుంటారు. అయితే స్పీకర్ నిర్ణయం సుప్రీంకోర్ట్ న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత పార్లమెంట్ - లోక్‌సభ

నమూనా ప్రశ్నలు
 

1. 'వెస్ట్ మినిస్టర్' తరహా పార్లమెంట్ అంటే?
జ‌: వెస్ట్ మినిస్టర్ అనే ప్రాంతంలో ఉన్న బ్రిటిష్ పార్లమెంట్

 

2. భారతదేశానికి అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని కాదని పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని భారత రాజ్యాంగ నిర్మాతలు అనుసరించడానికి కారణం?
     a. బ్రిటిష్ పాలనాకాలం నుంచి ప్రజలకు పరిచయం ఉండటం 
     b. బాధ్యతాయుత ప్రభుత్వం 
     c. పార్లమెంట్, మంత్రి మండలి మధ్య వివాదాలకు అవకాశం 
     d. వివిధ రాష్ట్రాల మధ్య భిన్నత్వం ఎక్కువగా ఉండటం
జ‌: a, b, c, d సరైనవి

 

3. లోక్‌సభ స్పీకర్ ఏ సందర్భంలో నిర్ణాయక ఓటు కంటే ముందే మొదటి ఓటింగ్‌లో పాల్గొనవచ్చు?
జ‌: స్పీకర్‌ను తొలగించే తీర్మానం

 

4. లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను ఎవరి పేరు మీద ప్రవేశపెడతారు?
జ‌: రాష్ట్రపతి

 

5. రాజ్యసభ ఆమోదించిన సాధారణ బిల్లును లోక్‌సభ ఎంతకాలంలో ఆమోదించాలి?
జ‌: కాల పరిమితి లేదు

 

6. కింది జాబితాల్లోని అంశాలను జతపరచండి.
     List A                                  List B
a. వైస్ ఛాంబర్                         1. 102వ అధికరణ 
b. అవిశ్వాస తీర్మానం                 2. రాజ్యసభ
c. రాజ్యసభలో రాష్ట్రాల ప్రాతినిధ్యం  3. లోక్‌సభ
d. పార్లమెంట్ సభ్యుల అనర్హతలు   4. IV షెడ్యూల్
జ‌: a-2, b-3, c-4, d-1

 

7. ఏ విషయాల్లో లోక్‌సభకు, రాజ్యసభకు సమాన అధికారాలు ఉంటాయి?
     a. రాజ్యాంగ సవరణ బిల్లు 
     b. రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానం 
     c. సుప్రీంకోర్ట్ న్యాయమూర్తులపై అభిశంసన 
     d. జాతీయ అత్యవసర పరిస్థితి
జ‌: అన్నీ సరైనవే

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత ఆర్థిక సంఘం

         ఆర్థిక సంఘం సిఫారసులను ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలని రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదు. కేంద్ర ప్రభుత్వ విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకోవచ్చు. అయితే సాధారణంగా ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేస్తారు. ఆర్థిక సంఘం సిఫారసులు అమలు చేయాలని న్యాయస్థానాలను ఆశ్రయించే అధికారం రాష్ట్రాలతోపాటు మరెవరికీ లేదు.
        భారత ఆర్థిక సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ, అర్ధ న్యాయ సంస్థ (Quasi-federal). ఇది ఒక సలహా సంస్థ. భారతదేశంలో సమాఖ్య వ్యవస్థ ఉంది. కాబట్టి సమాఖ్యలో ఆర్థిక వనరులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగబద్ధంగా పంపిణీ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తోన్న సహకార సమాఖ్యలో ఆర్థిక సంఘం సిఫారసులకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. పన్నుల వల్ల కేంద్ర ప్రభుత్వానికి అధిక ఆదాయ వనరులు సమకూరతాయి. రాష్ట్రాలు ప్రజలకు సన్నిహితంగా ఉంటూ తక్కువ వనరులతో, అధిక వ్యయంతో కూడిన కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదాయ వనరుల విషయంలో కేంద్రం - రాష్ట్రాల మధ్య (Verticle), రాష్ట్రాల మధ్య (Horizontal) అనేక వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకుని వనరులను పునఃపంపిణీ చేయడానికి రాజ్యాంగ నిర్మాతలు ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఏ సమాఖ్య వ్యవస్థలోనూ ఇలాంటి అధికారాలతో ఏర్పడిన సంస్థ మరొకటి లేదు.

 

రాజ్యాంగ హోదా

     రాజ్యాంగంలోని XII వ భాగంలో 280 నుంచి 281 వరకు ఉన్న నిబంధనలు ఆర్థిక సంఘం నియామకం, నిర్మాణం, విధులు, సిఫారసులను సమర్పించడం లాంటి అంశాలను వివరిస్తాయి.
 

నియామకం - అర్హతలు

     ఆర్థిక సంఘం ఛైర్మన్, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు. 280(1) నిబంధన ప్రకారం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లేదా అవసరమని భావించినప్పుడు రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఇది ఒక తాత్కాలిక సంస్థ. ఆర్థిక సంఘానికి ఛైర్మన్‌గా ప్రజా వ్యవహారాల్లో అనుభవం ఉన్నవారిని నియమిస్తారు. ఉదాహరణకు 2017, నవంబరు 27న 15వ ఆర్థిక సంఘానికి ఛైర్మన్‌గా నియమితులైన ఎన్.కె. సింగ్ మాజీ రాజ్యసభ సభ్యుడు. పదవీ విరమణ పొందిన కేంద్ర రెవెన్యూ కార్యదర్శి, మాజీ ప్రణాళికా సంఘం సభ్యుడు. ఆర్థిక సంఘంలో సభ్యులుగా నియమితులు కావడానికి కిందివాటిలో ఏదో ఒక అర్హత ఉండాలి.
 * హైకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావడానికి అవసరమైన అర్హతలు ఉండాలి.
 * ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, ఖాతాలకు సంబంధించి ప్రత్యేక పరిజ్ఞానం ఉండాలి.
 * ఆర్థిక పాలనా వ్యవహారాల్లో విస్తృతమైన అనుభవం ఉండాలి.
 * అర్థశాస్త్ర నిపుణుడై ఉండాలి. అయితే నియమించే సభ్యుడి వ్యక్తిగత ప్రయోజనాలు ఆర్థిక సంఘం విధులను ప్రభావితం చేసే అవకాశం ఉండకూడదు. ఈ మేరకు రాష్ట్రపతి సంతృప్తి చెందాలి. రాష్ట్రపతి కోరిన సమాచారాన్ని అందించాలి.

 

అనర్హతలు:
  1) మానసిక బలహీనత ఉండకూడదు.
  2) ఆర్థికంగా దివాలా తీసి ఉండకూడదు.
  3) దుర్మార్గమైన కార్యకలాపాల్లో పాల్గొని నేరస్తుడై ఉండకూడదు.
  4) ఆర్థిక సంఘం విధి నిర్వహణను ప్రభావితం చేసే వ్యక్తిగత ప్రయోజనాలు ఉండకూడదు.

 

ఆర్థిక సంఘం నిర్మాణం

      ఆర్థిక సంఘం బహుళ సభ్య సంఘం. ఇందులో ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు. వీరి నియామకానికి కావాల్సిన అర్హతలు, ఎంపిక చేసే విధానాన్ని పార్లమెంట్ నిర్ణయిస్తుంది. పార్లమెంట్ 'ఆర్థిక సంఘ చట్టం' (ఇతర నిబంధనలు) 1951 (Finance Commission (Miscellaneous Provisions) Act 1951) ని రూపొందించింది. ఇందులో ఆర్థిక సంఘం అధ్యక్షుడు, సభ్యుల నియామకం, అర్హతలు, అనర్హతలు, పదవీ కాలం, అధికారాలు లాంటి అంశాలను పేర్కొన్నారు.
 

పదవీ కాలం:

        ఆర్థిక సంఘం శాశ్వత సంస్థ కాదు. కాబట్టి దీనికి నిర్ణీత పదవీ కాలం ఉండదు. ఆర్థిక సంఘం అధ్యక్షుడు, సభ్యులు నియామక పత్రంలో రాష్ట్రపతి ప్రత్యేకంగా పేర్కొన్న కాలం వరకు విధులు నిర్వహిస్తారు. నిర్దేశించిన కాలపరిమితి లోపల నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 15వ ఆర్థిక సంఘాన్ని 2017 నవంబరులో నియమించారు. 2019 అక్టోబరు లోపల నివేదిక సమర్పించాల్సిందిగా రాష్ట్రపతి ఆదేశించారు. అయితే ఆర్థిక సంఘం నివేదిక నిర్ణీత కాలవ్యవధి వరకు అమల్లో ఉంటుంది. ఉదాహరణకు 14వ ఆర్థిక సంఘం నివేదిక 2015 నుంచి 2020 వరకు, 15వ ఆర్థిక సంఘం నివేదిక 2020 నుంచి 2025 వరకు అమల్లో ఉంటాయి.
* ఒకసారి ఆర్థిక సంఘంలో సభ్యుడిగా పనిచేసిన వ్యక్తిని తిరిగి ఆ పదవిలో నియమించవచ్చు. ఆర్థిక సంఘం సభ్యులు రాజీనామా చేయాలంటే తమ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి పేరుమీద రాసి, రాష్ట్రపతికి సమర్పించాలి. ఆర్థిక సంఘంలోని సభ్యులు పూర్తికాలం (Full time) లేదా పాక్షిక కాలం (Part time) రాష్ట్రపతి కోరిన విధంగా విధులను నిర్వహిస్తారు. ఆర్థిక సంఘం ఛైర్మన్, సభ్యుల జీతభత్యాలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది.

ప్రత్యేక అధికారాలు

* భారత ఆర్థిక సంఘం అర్ధ న్యాయ సంస్థ కాబట్టి విధి నిర్వహణలో సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలు ఈ సంఘానికి ఉంటాయి.
* భారతదేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి లేదా సంస్థనైనా సాక్ష్యంగా తన ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయగలదు.
* తనకు కావాల్సిన సాక్ష్యాధార పత్రాలను (Documents) సమర్పించాలని ఆదేశించగలదు.
* ప్రభుత్వ రికార్డులు ఇవ్వాలని ఏ కోర్టును లేదా ప్రభుత్వ కార్యాలయాన్నైనా కోరవచ్చు.

విధులు

రాజ్యాంగంలోని నిబంధన 280(3) ప్రకారం కింది అంశాలకు సంబంధించి తగిన సూచనలు చేయాలి    

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ అయ్యే లేదా పంపిణీ చేయాల్సిన పన్నుల (Divisible pool)నికర రాబడులను, కేంద్రం - రాష్ట్రాల మధ్య కేటాయించడానికి అనుసరించాల్సిన మార్గదర్శక సూత్రాలను సిఫారసు చేయడం.
* భారత సంఘటిత నిధి నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన సహాయక గ్రాంటులను ఇవ్వడానికి తగిన నియమాలను (Principles) సూచించడం (275వ రాజ్యాంగ నిబంధన).
* రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫారసులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాల్లోని పంచాయతీల ఆర్థిక వనరులను పెంచేందుకు తగిన సిఫారసులు చేయడం (73వ రాజ్యాంగ సవరణ చట్టం).
రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాల్లోని మున్సిపాలిటీలకు మరిన్ని ఆర్థిక వనరులను అందజేయడానికి రాష్ట్ర సంఘటిత నిధిని పెంచడానికి అవసరమైన చర్యలను సూచించడం (74వ రాజ్యాంగ సవరణ చట్టం).
* భారతదేశ ఆర్థిక స్థిరత్వ సాధన కోసం రాష్ట్రపతి కోరిన అంశంపై తగిన సలహాలు, సూచనలు, మార్గదర్శకాలను రూపొందించడం.

 

పనితీరు

     ఆర్థిక సంఘం ఛైర్మన్, సభ్యుల నియామకం జరిగి, దాని విధి, విధానాలను నిర్ణయించాక రాబోయే అయిదేళ్లకు సాధారణ వ్యయం, రెవెన్యూ వివరాలను సమర్పించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాస్తారు.
* రెవెన్యూ, వ్యయానికి సంబంధించి రాష్ట్రాల నుంచి అందిన వివరాలను, అందులోని విశ్వసనీయతను పరిశీలించి, సంబంధిత రాష్ట్రాల అధికారులను సమావేశపరచి అసాధారణమైన, ఆచరణకు సాధ్యం కాని వాటిని తొలగిస్తుంది.
* తర్వాతి దశలో ఆర్థిక సంఘం అన్ని రాష్ట్రాలను సందర్శించి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమై రాష్ట్రాలకు కావాల్సిన ఆర్థిక సహాయం గురించి వారి వాదనలను వింటుంది.
* ప్రతి రాష్ట్రం తమకు కావాల్సిన ఆర్థిక సహాయం పెంచాల్సిన అవసరాన్ని ఆర్థిక సంఘానికి ప్రతిపాదిస్తుంది. ఆర్థిక సంఘం కేవలం రాష్ట్ర ప్రభుత్వం నుంచే కాకుండా వివిధ రాజకీయ పార్టీలు, స్థానిక సంస్థలు, వివిధ సంఘాలు, ప్రముఖ వ్యక్తులు సమర్పించే నివేదికలను స్వీకరిస్తుంది.
* ఆర్థిక సంఘం చివరగా దిల్లీలో సమావేశమై చర్చించి, తుది నివేదికను రూపొందించి, రాష్ట్రపతికి సమర్పిస్తుంది. రాష్ట్రపతి ఆ నివేదికను కేంద్ర కేబినెట్‌కు పంపిస్తారు. చివరగా ఆర్థిక సంఘం సిఫారసులు, దానిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను గురించి వివరించే నోట్‌తో సహా రాష్ట్రపతి పార్లమెంట్ ఉభయ సభల ఎదుట ఉంచేలా చూస్తారు. పార్లమెంట్‌లో చర్చించి, ఆమోదించాక ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేయడం లేదా సవరణలు చేయడం జరుగుతుంది.

 

ఆర్థిక సంఘాలు, పేర్కొన్న ముఖ్యాంశాలు

* మొదటి ఆర్థిక సంఘం ఆదాయ పన్నులో 55 శాతం, ఎక్సైజ్ సుంకంలో 40 శాతం రాష్ట్రాలకు కేటాయించింది. కేటాయింపులకు జనాభాను 80 శాతం, పన్ను వసూళ్లను 20 శాతం ప్రాతిపదికగా తీసుకున్నారు.
* రెండో ఆర్థిక సంఘం ఆదాయ పన్నులో 66 శాతం, ఎక్సైజ్ సుంకంలో 25 శాతం రాష్ట్రాలకు కేటాయించింది. కేటాయింపులకు జనాభాను 90 శాతం, పన్ను వసూళ్లను 10 శాతం ప్రాతిపదికగా తీసుకున్నారు. నిధుల కేటాయింపునకు జనాభానే ప్రధానాంశంగా పరిగణించారు. కొద్దిపాటి మార్పులతో ఇదే విధానం 4వ ఆర్థిక సంఘం వరకు కొనసాగింది.
* 5వ ఆర్థిక సంఘం మొదటిసారిగా మూడు రాష్ట్రాలకు (జమ్మూ కశ్మీర్, అసోం, నాగాలాండ్) ప్రత్యేక హోదా కల్పించాలని సూచించింది. జాతీయాభివృద్ధి మండలి సిఫారసు మేరకు (అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్) ఈ సంఖ్య 11కు పెరిగింది.
ఏడో ఆర్థిక సంఘం జనాభాతోపాటు తలసరి ఆదాయం (25 శాతం), వెనుకబడినతనం లేదా పేదరికం, రెవెన్యూ వ్యయాలను ప్రామాణికంగా తీసుకుని 50 శాతం నిధులను కేటాయించింది.
* 12వ ఆర్థిక సంఘం మార్కెట్ల నుంచి నేరుగా రుణాలను సేకరించే స్వేచ్ఛ రాష్ట్రాలకు కల్పించాలని సిఫారసు చేసింది. అలాగే నిధులను నేరుగా పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేయాలని సూచించింది.
* ప్రస్తుతం (2015 - 20) 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అమల్లో ఉన్నాయి. 14వ ఆర్థిక సంఘం పన్ను వసూళ్లలో రాష్ట్రాలకు కేటాయింపులు 32 శాతం నుంచి 42 శాతానికి పెంచాలని సూచించింది. స్థానిక సంస్థలకు నిధులను 2011 జనాభా ప్రాతిపదికన బదిలీ చేయాలని పేర్కొంది. ఆంధ్రపదేశ్ సహా రెవెన్యూ లోటు ఉన్న 11 రాష్ట్రాలకు రూ.1.94 లక్షల కోట్ల గ్రాంట్లను సిఫారసు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.22,113 కోట్లు కేటాయించాలని సిఫారసు చేసింది. నిధుల కేటాయింపునకు మొదటిసారిగా పర్యావరణం అనే అంశాన్ని (అటవీ విస్తీర్ణం) ప్రాతిపదికగా తీసుకుంది.
* వస్తు, సేవల పన్ను (GST) అమల్లోకి వచ్చిన తర్వాత మొదటి మూడు సంవత్సరాలకు రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని 100 శాతం కేంద్రం భరించాలని, నాలుగో సంవత్సరం 75 శాతం, అయిదో సంవత్సరం 50 శాతం భరించాలని సూచించింది. దీనికోసం 'వస్తు, సేవల పన్ను నిధి'ని ఏర్పాటు చేయాలని పేర్కొంది.
* 15 వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్.కె.సింగ్, ఆర్థిక సంఘం సభ్యులు: శక్తికాంతదాస్ (ఆర్థిక వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి), రమేష్ చాంద్ (నీతిఆయోగ్ సభ్యులు), అశోక్ లాహిరి (మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు), అనూప్ సింగ్ (జార్జి టౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్).
* ఇది సహకార సమాఖ్య లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీతో పాటు కేంద్ర, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలపై 'వస్తు సేవల పన్ను' ప్రభావంపై ప్రత్యేకంగా సమీక్షిస్తుంది. రుణస్థాయులు, నగదు నిల్వలు, కేంద్ర రాష్ట్రాల్లో ద్రవ్య క్రమశిక్షణ లాంటివి పరిశీలించి తగిన సిఫారసులు చేస్తుంది. సమర్పించాల్సి ఉంది

 

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజ్యాంగ సంస్థలు

           భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన దేశంలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం
(Indirect Democracy) అమల్లో ఉంది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులే పాలకులు. ప్రజలు రాజ్యాంగబద్ధంగా లభించే ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా నిర్ణీత కాలానికి ప్రతినిధులను ఎన్నుకుంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు సకాలంలో సక్రమంగా జరిగే ఎన్నికలు వెన్నెముక, చుక్కాని లాంటివి.

ఎన్నికల సంఘం

ప్రజాస్వామ్యం విజయవంతంగా పనిచేయడానికి అవసరమైన పరిస్థితుల్లో నిర్ణీత కాలానికి జరిగే ఎన్నికలు ముఖ్యమైనవి. అలాంటి ఎన్నికల నిర్వహణకు మన దేశంలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ ఎన్నికల సంఘం.
* రాజ్యాంగం 15వ భాగంలో 324 నుంచి 329 వరకు ఉన్న నిబంధనలు ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తున్నాయి.
* నిబంధన 324(2) ప్రకారం ఎన్నికల సంఘంలో ప్రధానాధికారితోపాటు రాష్ట్రపతి నిర్ధారించినంత మంది ఎన్నికల అధికారులుంటారు. పార్లమెంట్ చేసిన చట్టాలకు అనుగుణంగా రాష్ట్రపతి ఎన్నికల ప్రధానాధికారిని లేదా అధికారులను నియమిస్తారు.
* 1950 నుంచి 1989 వరకు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (Chief Election Commissioner) మాత్రమే ఉండేవారు. 1989, అక్టోబరు 16న త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేశారు. 1990 జనవరిలో ఏకసభ్య సంఘంగా మార్చారు. 1993, అక్టోబరు 1 నుంచి త్రిసభ్య సంఘంగా కొనసాగుతోంది. ఇతర ఎన్నికల కమిషనర్లను నియమించినప్పటికీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఈ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
* ఎన్నికల సంఘం నిర్ణయాధికారంపై సుప్రీంకోర్ట్ తీర్పు చెబుతూ ముగ్గురు కమిషనర్లకు సమాన అధికారాలుంటాయని, సమన్వయం కుదరకపోతే మెజారిటీ నిర్ణయం చెల్లుబాటవుతుందనీ వెల్లడించింది.
* ఎన్నికల కమిషనర్లను నియమించినప్పటి నుంచి 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయో పరిమితి వచ్చేవరకూ అధికారంలో కొనసాగుతారు. రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను సంప్రదించి ప్రాంతీయ ఎన్నికల సంఘాలను ఏర్పాటు చేస్తారు.
* ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్ధ. సుప్రీంకోర్ట్ న్యాయమూర్తిని అభిశంసించే పద్ధతినే ఎన్నికల సంఘం కమిషనర్‌ను అభిశంసించడానికి అనుసరించాలని నిబంధన 324(5) సూచిస్తుంది. నిబంధన 324(6) ప్రకారం ఎన్నికల అధికారులను, ప్రాంతీయ ఎన్నికల అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సిఫారసు లేకుండా తొలగించడానికి వీలులేదు.
* జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తారు.

విధులు

      రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితాను తయారుచేయడం, ఎన్నికల తేదీలు నిర్ణయించడం ఎన్నికల సంఘం విధులు.
* ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రూపొందించి,  సక్రమంగా నిర్వహించడం. శాంతియుతంగా అక్రమాలు లేకుండా జరగడానికి పోలీసు సిబ్బంది సహకారం తీసుకోవడం.
* రాజకీయ పార్టీలకు గుర్తింపునివ్వడం, పార్టీలకు గుర్తులు కేటాయించడం, కొన్ని పరిస్థితుల్లో రద్దు చేయడం మొదలైనవి కూడా ఎన్నికల సంఘం విధులు.
* ఒక పార్టీకి ఏదైనా ఒక రాష్ట్ర ఎన్నికల్లో కనీసం 4% ఓట్లు వస్తే దాన్ని ప్రాంతీయ పార్టీగా, 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో 6% ఓట్లు వస్తే జాతీయ పార్టీగా గుర్తిస్తారు.
* ఎన్నికల వివాదాల్లో న్యాయస్థానాల్లో పాల్గొని పరిష్కరించడం, డిపాజిట్ల నిర్వహణ ఈ సంఘం ముఖ్య విధులు.
* స్వేచ్ఛాపూరిత వయోజన ఓటింగ్ పద్ధతి ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి ఆత్మ లాంటిది. 326 నిబంధన ప్రకారం మన దేశంలో పౌరులందరికీ కుల, మత, వర్ణ, వర్గ భేదాలు లేకుండా సార్వజనీన వయోజన ఓటింగ్ విధానాన్ని ఏర్పాటు చేశారు.
* 325 నిబంధన ప్రకారం కుల, మత, వర్గ విచక్షణతో ఎవరినీ ఓటర్ల జాబితా నుంచి తొలగించకూడదు.
* రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కొత్తలో 21 సంవత్సరాల వయోపరిమితి నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించారు. దేశంలో యువతకు ఎన్నికల్లో భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు వయో పరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు.

 

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్

* ఇది బ్రిటిష్‌వారి పాలనాంశాల నుంచి మన దేశానికి సంక్రమించిన పాలనా వ్యవస్థ (Controller and Auditor General - CAG). 1753లో భారత్‌లో ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ డిపార్ట్‌మెంట్‌ను మొదటిసారిగా ప్రారంభించారు. వివిధ ప్రావిన్స్‌లు ఖాతాల నిర్వహణకు అకౌంటెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి.
* 1857లో లార్డ్ కానింగ్ చర్యల వల్ల బొంబాయి, మద్రాస్, బెంగాల్‌ను ఒక అకౌంటెంట్ జనరల్ ఆధిపత్యంలోకి తెచ్చారు. 1919లో ఆడిటర్ జనరల్‌కు భారత ప్రభుత్వం నుంచి స్వతంత్రత కల్పించారు. 1935 చట్టం ద్వారా ఇతడికి ఫెడరల్ కోర్ట్ న్యాయమూర్తి హోదా కల్పించారు.
* స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆడిటర్ జనరల్‌కు 1950లో 'కంప్ట్రోలర్' అనే పదాన్ని చేర్చి, ప్రభుత్వ ఖాతాల తనిఖీ, వ్యయ సఫలత, అక్రమాలు బయటకు తీసే అవకాశం కల్పించారు.
* 'రాజ్యాంగం సృష్టించిన అధికారుల్లో అత్యంత ముఖ్యుడు కాగ్' - అంబేడ్కర్.
* రాజ్యాంగ నిబంధన 148 ప్రకారం కాగ్‌ని రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. 1953లో పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం ఇతడి పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయో పరిమితి వచ్చేవరకు. కాగ్ రాజీనామా చేయాలంటే తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి.
* సుప్రీంకోర్ట్ న్యాయమూర్తికి లభించిన వేతనం కాగ్‌కు లభిస్తుంది. అవినీతి, అసమర్థత ఆరోపణలుంటే కాగ్‌ను పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ఆమోదించడం ద్వారా తొలగించవచ్చు. (సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై అభిశంసన మాదిరిగా.)                 విధులు
      నిబంధన 149లో కాగ్ విధులను తెలియజేశారు. 1976 వరకు కాగ్ ఖాతాల నిర్వహణకు కూడా అధిపతిగా ఉండేవారు. ఖాతాల నిర్వహణకు ఒక కంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్‌ను (CGA)నియమించిన తర్వాత ఖాతాల నిర్వహణ బాధ్యతల నుంచి కాగ్‌కు విముక్తి లభించింది.
* 'బయటి వ్యక్తుల ప్రమేయం లేకుండా తనకు తానుగా విషయాలను క్షుణ్నంగా పరిశీలించి తీర్పునిచ్చే సుప్రీం మాస్టర్ కాగ్' - పట్టాభి సీతారామయ్య.
* ప్రభుత్వ ఖాతాల సంఘానికి హితుడిగా వ్యవహరించే కాగ్ కింది విధులను నిర్వర్తిస్తారు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయ వ్యయాలను పరిశీలించి ఆడిట్ చేయడం.
* ప్రభుత్వం చేసిన వ్యయం చట్టబద్దంగా జరిగిందా లేదా నిర్దేశిత అధికారి ద్వారా జరిగిందా లేదా అని పరిశీలించడం.
* కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లావాదేవీలను ఆడిట్ చేయడం, రాష్ట్రపతికి, గవర్నర్లకు నివేదికలు ఇవ్వడం.
* కంటింజెన్సీ ఫండ్ నుంచి తీసిన ధనం వ్యయాన్ని పరిశీలించడం. ప్రభుత్వ రంగ సంస్థల, అన్ని ప్రభుత్వ విభాగాల ఖాతాలను ఆడిట్ చేయడం.
* కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధుల విడుదలకు కాగ్ ప్రమేయం ఉండదు.
* కాగ్ ఆదాయ వ్యయాలనే కాకుండా గోదాముల్లో నిల్వలను కూడా ఆడిట్ చేయవచ్చు.
* కాగ్ స్వతంత్రంగా వ్యవహరించడానికి వీలుగా కొన్ని రక్షణలను కల్పించారు.
* పదవి నుంచి తొలగించడానికి అభిశంసన తీర్మానం ఆమోదించడం ఒక్కటే మార్గం. పదవీ కాలంలో జీతభత్యాలు, సర్వీసు నిబంధనలను సవరించకూడదు. పదవీ విరమణ తర్వాత ఏ ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదు. జీత భత్యాలను సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.¤ మన దేశంలో తొలి కాగ్ వి. నరసింహారావు
* ప్రస్తుత కాగ్ రాజీవ్ మెహ్రిషి.
* తొలి ఎన్నికల ప్రదానాధికారి టి. సుకుమార సేన్
* ప్రస్తుత ఎన్నికల సంఘ కమిషనర్లు (త్రిసభ్య సంఘం) ప్రధానాధికారి ఓంప్రకాష్ రావత్; సునీల్ ఆరోరా, అశోక్ లావాసా.

ఆర్థిక సంఘం

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరులను పంపిణీ చేయడానికి ఏర్పాటు చేసిన సంస్థ ఆర్థిక సంఘం.
* రాజ్యాంగం 12వ భాగం 280, 281 నిబంధనలు ఆర్థిక సంఘం నిర్మాణం, విధులను తెలియజేస్తున్నాయి. నిబంధన 280(1) ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి ఈ సంఘాన్ని నియమిస్తారు.
* 1951 సంవత్సరం విత్త చట్టం ప్రకారం ఆర్థిక సంఘం ఏర్పడింది. 1959 సంవత్సరం సవరణ ప్రకారం ఈ సంఘం రాష్ట్రపతికి సలహాలివ్వాలని కూడా నిర్ణయించారు.
* ఆర్థిక సంఘంలో ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. వీరి అర్హతలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. కానీ సాధారణంగా కింది అర్హతలు ఉండాలి.
* ఛైర్మన్‌కు ప్రజా సంబంధ విషయాల్లో విషయ పరిజ్ఞానం ఉండాలి.
* నలుగురు సభ్యులు అర్థశాస్త్రంలో నిష్ణాతులై ఉండాలి. అకౌంటింగ్, ఆడిటింగ్‌లలో అనుభవం ఉండాలి.
* హైకోర్ట్ న్యాయమూర్తికి కావలసిన అర్హతలుండాలి.
* విత్తపాలనలో నిష్ణాతులై ఉండాలి.

విధులు

    కేంద్ర, రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీకి సూచనలు ఇవ్వడం. పంపిణీ చేసిన పన్నులను, రాబడులను రాష్ట్రాల మధ్య కేటాయించడం. భారత సంఘటిత నిధి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ల మీద నియమాలు రూపొందించడం.
* రాష్ట్రపతి కోరిన ఇతర విషయాలపై సూచనలివ్వడం.
* ఆర్థిక సంఘం తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. ఆ నివేదికకు విశ్లేషణ జతపరిచి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేలా చేస్తుంది. ఆర్థిక సంఘం సిఫారసులను రాష్ట్రపతి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.
* మొదటి ఆర్థిక సంఘం ఛైర్మన్ కె.సి. నియోగి.
* ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా, కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలపై విచారణ సంఘం ఛైర్మన్‌గా పని చేసింది పి.వి. రాజమన్నార్.
* ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసి 6వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా పని చేసింది కాసు బ్రహ్మానంద రెడ్డి.
* బొంబాయి ముఖ్యమంత్రి, 8వ ఆర్థిక సంఘం ఛైర్మన్ వై.బి. చవాన్.
* ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా, ఏపీ తాత్కాలిక గవర్నర్‌గా, ప్రధాని సలహాదారుగా సేవలందించింది సి. రంగరాజన్.
* ప్రస్తుత ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్.కె. సింగ్.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ - యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)

కార్యనిర్వహణ శాఖను రెండు భాగాలుగా విభజించుకుంటే మొదటిది రాజకీయ కార్యనిర్వాహక వర్గం. రాష్ట్రపతి, ప్రధాని, మంత్రిమండలి, వీరు తీసుకున్న నిర్ణయాలు వాస్తవంగా అమలు చేసేది రెండో భాగం - ప్రభుత్వ ఉద్యోగులు.
* అలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సమర్థులను ఎంపిక చేయడానికి రాజ్యాంగం ఏర్పాటుచేసిన స్వతంత్ర సంస్థ 'యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్' .
* రాజ్యాంగంలోని 14వ భాగంలో 316 నుంచి 323 నిబంధనల వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పాటు, అధికారాలు, విధుల గురించి తెలియజేస్తాయి.
* భారత ప్రభుత్వ చట్టం 1919 ప్రకారం యూపీఎస్సీ ఏర్పడింది. 1926లో లీ కమిషన్ సిఫారసుల మేరకు నిర్మాణం చేశారు. 1935 చట్టంలో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తోపాటు రాష్ట్ర సర్వీస్ కమిషన్‌లను ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విడివిడిగా సర్వీస్ కమిషన్‌లను ఏర్పాటు చేశారు. రెండు మించిన రాష్ట్రాలకు ఉమ్మడి సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసుకోవచ్చు.
* యూపీఎస్సీలో ఒక ఛైర్మన్, రాష్ట్రపతి నిర్ణయం మేరకు 9 - 11 మంది సభ్యులుంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. వీరి అర్హతలను రాజ్యాంగంలో సూచించలేదు. కానీ మొత్తం సభ్యుల్లో సగం మంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పరిపాలన అనుభవం ఉన్నవారిని నియమించాలి. మిగిలినవారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారం ప్రకారం జరుగుతుంది. ప్రస్తుతం ఛైర్మన్, పది మంది సభ్యులున్నారు.
* వీరి పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయోపరిమితి వచ్చేవరకు ఏదిముందుగా వస్తే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
* యూపీఎస్సీ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడటానికి కొన్ని చర్యలు చేపట్టారు. వీరి వేతనాలను భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో తప్ప వేతనాలను తగ్గించకూడదు.
* అవినీతి, అసమర్థ ఆరోపణలుంటే 317 నిబంధన ప్రకారం సుప్రీంకోర్ట్ న్యాయమూర్తితో విచారణ జరిపించి, అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్‌లో ఆమోదించడం ద్వారా అధికారం నుంచి తొలగించవచ్చు. ఏ కారణంతో తొలగించినా సుప్రీంకోర్ట్ సలహా తీసుకోవాలి. తొలగింపు, అభిశంసన రాజ్యాంగపరమైన ప్రక్రియ.
విధులు: అఖిల భారత సర్వీసులు, కేంద్ర ప్రభుత్వ సర్వీసులు, కేంద్రపాలిత ప్రాంతాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో పని చేయడానికి అభ్యర్థులను పోటీ పరీక్షల ద్వారా ఎంపిక చేయడం.
* ఈ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు, క్రమశిక్షణా చర్యలు మొదలైన సర్వీసు నిబంధనల్లో సలహాలివ్వడం.
* తొలి యూపీఎస్సీ ఛైర్మన్ హెచ్.కె. కృపలానీ, ప్రస్తుత ఛైర్మన్ వినయ్ మిట్టల్.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత రాజ్యాంగ పరిణామ క్రమం 

ఈస్టిండియా కంపెనీ 

బ్రిటిష్ రాణి ఎలిజిబెత్ - I బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ భారతదేశంలో వ్యాపార కార్యకలాపాల నిర్వహణ కోసం 1600 డిసెంబరు 31 న 'చార్టర్' ద్వారా అనుమతిని జారీ చేసింది. ఈ చార్టర్ కాలపరిమితి 15 సంవత్సరాలు. దీన్ని తర్వాతి కాలంలో పొడిగిస్తూ వచ్చారు.
*  కంపెనీ (ఈస్టిండియా కంపెనీ) బక్సార్ యుద్ధం (1765) లో విజయం సాధించి, 'బెంగాల్ దివానీ అధికారాన్ని' పొందడం ద్వారా ఒక రాజకీయ శక్తిగా ఎదిగింది. ఇది కంపెనీ పాలనకు పునాదైంది. 1765 నుంచి 1773 వరకు ద్వంద్వ ప్రభుత్వం కొనసాగింది.
*  భారతదేశంపై బ్రిటిష్ ప్రభుత్వం తన సార్వభౌమాధికారాన్ని రెగ్యులేటింగ్ చట్టం 1773 ద్వారా ప్రకటించింది. అనేక మార్పులతో కంపెనీపాలన 1858 వరకు కొనసాగింది. 1858 నుంచి 1947 లో భారతదేశం స్వాతంత్య్రం పొందేవరకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యక్షంగా పాలన సాగించింది. బ్రిటిష్ పాలనలో భారతీయుల డిమాండ్లు, విన్నపాలు, చర్చలు, విమర్శలు, ఉద్యమాల ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం అనేక చట్టాలను చేసింది. ఈ చట్టాల క్రమాన్ని భారత రాజ్యాంగ చరిత్రగా చెప్పవచ్చు.
*  భారత రాజ్యాంగ చరిత్రను రెండు భాగాలుగా విభజించవచ్చు. అవి:
    1) ఈస్టిండియా కంపెనీ పాలన (1773 - 1858)
    2) బ్రిటిష్ ప్రభుత్వ పాలన (1858 - 1947)

 

ఈస్టిండియా కంపెనీ పాలన 
కంపెనీని స్థాపించినప్పుడు బ్రిటిష్ రాణి / చక్రవర్తి సర్వాధికారి. కానీ 1773 నాటికి బ్రిటిష్ పార్లమెంటు సార్వభౌమాధికార సంస్థగా అవతరించింది. దీంతో బ్రిటిష్ పార్లమెంటు ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి, చక్కదిద్దడానికి అనేక చట్టాలు చేసింది. అందులో మొదటిది రెగ్యులేటింగ్ చట్టం 1773.

 

రెగ్యులేటింగ్ చట్టం 1773

 దీన్ని భారతదేశంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా వర్ణిస్తారు. దీన్ని బ్రిటిష్ పార్లమెంటులో అప్పటి ప్రధాని 'లార్డ్ నార్త్' ప్రవేశపెట్టాడు. ఇది 1773 జూన్ నుంచి అమల్లోకి వచ్చింది. ఇదే భారత రాజ్యాంగానికి పునాదైంది. 
ముఖ్యాంశాలు: ఈ చట్టం ఇంగ్లండ్, భారతదేశంలో కంపెనీకి సంబంధించి అనేక మార్పులను చేసింది.
ఇంగ్లండ్‌లో వచ్చిన మార్పులు:
* కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ (కంపెనీ పాలక వర్గం) పదవీకాలాన్ని ఒక సంవత్సరం నుంచి 4 సంవత్సరాలకు పెంచారు. ప్రతి సంవత్సరం మొత్తం సభ్యుల్లో 1/4 వ వంతు పదవీ విరమణ చేస్తారు. తిరిగి అంతేమంది ఎన్నికవుతారు.
* కంపెనీ ప్రొప్రైటర్లు (యజమానులు) ఓటు హక్కు అర్హత పొందడానికి కనీసం 6 నెలలకు బదులు సంవత్సర కాలం పాటు, 500 పౌండ్లకు బదులు 1000 పౌండ్లకు మించిన వాటాలున్న వారికి పరిమితం చేశారు.
భారతదేశంలో వచ్చిన మార్పులు:
* బెంగాల్ గవర్నర్ హోదాను బెంగాల్ గవర్నర్ జనరల్‌గా మార్చారు. మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీల నిర్వహణపై బెంగాల్ గవర్నర్ జనరల్‌కు పర్వవేక్షణ అధికారాన్ని కల్పించారు. 
* 'గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి'ని ఏర్పాటు చేశారు. ఇందులో నలుగురు సభ్యులు ఉంటారు. వీరి పదవీకాలం 5 సంవత్సరాలు. గవర్నర్ జనరల్‌కు విధి నిర్వహణలో సాయపడటం దీని ప్రధాన విధి. కౌన్సిల్‌లో నిర్ణయాలు మెజారిటీ ప్రాతిపదికపై తీసుకుంటారు. గవర్నర్ జనరల్‌కు నిర్ణాయక ఓటు (Casting Vote) ను కల్పించారు.
* కలకత్తాలోని ఫోర్ట్ విలియం (బ్రిటిష్ వర్తక స్థావరం)లో సుప్రీంకోర్టు ఏర్పాటును ప్రతిపాదించింది. ఇది 1774 లో ఏర్పాటైంది. ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు సాధారణ న్యాయమూర్తులు ఉంటారు. మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంఫే. సుప్రీంకోర్టు తీర్పులపై 'కింగ్ కౌన్సిల్' (రాజు లేదా రాణి కౌన్సిల్ నిర్ణయాలను పాటించడం) కు అప్పీల్ చేసుకోవచ్చు.
* గవర్నర్ జనరల్, కౌన్సిల్ సభ్యులు, సుప్రీంకోర్టు ప్రధాన, సాధారణ న్యాయమూర్తులు, ఇతర ఈస్టిండియా కంపెనీ ఉద్యోగులు ప్రైవేటు వ్యాపారం చేయడాన్ని, స్థానికుల (భారతీయులు) నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బహుమతులు తీసుకోవడాన్ని నిషేధించింది.
* కంపెనీకి 20 సంవత్సరాల కాలపరిమితికి (పొడిగిస్తూ) చార్టర్ జారీ చేశారు.

 

పిట్స్ ఇండియా చట్టం 1784 

 రెగ్యులేటింగ్ చట్టం 1773 లోని లోపాలను సవరిస్తూ, ప్రభుత్వ యంత్రాంగం సరిగా పనిచేయడమే ఈ చట్టం ఉద్దేశమని అప్పటి ఇంగ్లండ్ ప్రధాని 'విలియం పిట్' తెలియజేశారు. అతడి పేరు మీద ఈ చట్టం 'పిట్స్ ఇండియా' చట్టంగా ప్రాచుర్యం పొందింది. 
ముఖ్యాంశాలు: ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి 'బోర్డ్ ఆఫ్ కమిషనర్స్' ఏర్పాటైంది. దీన్నే 'బోర్డ్ ఆఫ్ కంట్రోల్' అని కూడా అంటారు. దీనికి 'సెక్రటరీ ఆఫ్ స్టేట్' అధ్యక్షుడు. ఇతడికి నిర్ణాయక ఓటును కల్పించారు. సభ్యుల కాల పరిమితి 4 సంవత్సరాలు.
* ఈస్టిండియా కంపెనీ విధులను వాణిజ్య, రాజకీయ విధులుగా విభజించి, వాణిజ్య విధులను పూర్తిగా 'కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌'కు, రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతను 'బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌'కు అప్పగించారు. భారతదేశంలోని కంపెనీ భూభాగాలు, ఆదాయంపై ఈ బోర్డుకు సంపూర్ణ అధికారాన్ని కల్పించారు.
* గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలికి ప్రెసిడెన్సీ ప్రాంతాలపై ప్రత్యక్ష నియంత్రణ అధికారాన్ని ఇచ్చారు. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి ఆదేశాలను పాటించని గవర్నర్లను, ప్రెసిడెన్సీ కౌన్సిళ్లను సస్పెండ్ చేసే అధికారం గవర్నర్ జనరల్‌కు ఇచ్చారు.
* 1786 లో జరిగిన సవరణ ఫలితంగా గవర్నర్ జనరల్ కౌన్సిల్ నిర్ణయాలను తోసిపుచ్చే అధికారం గవర్నర్ జనరల్‌కు వచ్చింది. అంతేకాకుండా గవర్నర్ జనరల్‌నే సర్వసైన్యాధ్యక్షుడిని చేశారు. ఈ సవరణ చట్టంతో గవర్నర్ జనరల్‌కు తన కౌన్సిల్ నిర్ణయాలను 'వీటో' చేసే అధికారం వచ్చింది. గవర్నర్ జనరల్ పదవి, అధికారాలు సుస్థిరం, విస్తృతమయ్యాయి.
* గవర్నర్ జనరల్, గవర్నర్ల కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 4 నుంచి 3 కు తగ్గించారు.

 

చార్టర్ చట్టం 1793 

ఫ్రాన్స్ పరిణామాలు (ఫ్రెంచి విప్లవం) ఇంగ్లండ్ వాణిజ్యంపై వ్యతిరేక ప్రభావం చూపడంతో విదేశీ వ్యాపారాన్ని, సముద్ర ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి కంపెనీ సహకారం అవసరమైంది.
ముఖ్యాంశాలు: కంపెనీ అధీనంలోని ప్రాంతాలు, వాటిపై వచ్చే ఆదాయాన్ని మరో 20 సంవత్సరాలపాటు కంపెనీకే అప్పగించారు.
¤ స్వదేశీ ఖర్చుల పేరుతో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సభ్యుల, కార్యాలయ సిబ్బంది జీతభత్యాలు, ఇతర ఖర్చులను కంపెనీ ప్రభుత్వం (భారతదేశం నుంచి వచ్చే రెవెన్యూ) భరించే విధంగా చట్టంలో మార్పు చేశారు. ఇది 1793 నుంచి భారత ప్రభుత్వ చట్టం 1919 అమల్లోకి వచ్చేవరకు కొనసాగింది.
¤ గవర్నర్ జనరల్ కౌన్సిల్ సమావేశాలకు గవర్నర్ జనరల్ లేని సమయంలో 'వైస్ ప్రెసిడెంట్' అధ్యక్షత వహిస్తాడు. వైస్ ప్రెసిడెంట్‌ను నియమించే అధికారాన్ని గవర్నర్ జనరల్‌కు ఇచ్చారు.
¤ భారతదేశంలో ఆంతరంగిక పాలనకు తగిన నిబంధనలను తయారు చేసే అధికారాన్ని గవర్నర్ జనరల్ కౌన్సిల్‌కు ఇచ్చారు. భారతీయుల వ్యక్తిగత ఆస్తులు, వారసత్వం, వివాహం, మత విషయాలకు సంబంధించి గవర్నర్ జనరల్ జారీచేసే నిబంధనలు శాసనాలతో సమానమైన విలువను కలిగి ఉంటాయి. దీని ఆధారంగానే 'కారన్ వాలీస్ కోడ్' రూపొందింది. దీంతో భారతదేశంలో రాతపూర్వక శాసన నిర్మాణం ప్రారంభమైందని చెప్పవచ్చు.
¤ కంపెనీ ఉద్యోగులకు 'సీనియారిటీ' ప్రాతిపదికపై ప్రమోషన్లను కల్పిస్తారు.

 

చార్టర్ చట్టం 1813 

భారత రాజ్యాంగ క్రమపరిణామంలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా చెప్పొచ్చు.
ముఖ్యాంశాలు: భారతదేశంలో కంపెనీ పాలనను మరో 20 సంవత్సరాల పాటు పొడిగించారు. కంపెనీ పాలన కొనసాగినప్పటికీ కంపెనీ ప్రాంతాలపై రాణి / చక్రవర్తి సార్వభౌమాధికారాన్ని స్పష్టంగా ప్రకటించింది.
* కంపెనీకి ఉన్న వ్యాపార గుత్తాధికారాన్ని తొలగించారు. బ్రిటిష్ పౌరులందరికీ భారతదేశంలో స్వేచ్ఛా వ్యాపారాన్ని అనుమతించింది. అయితే కంపెనీ ప్రయోజనాల దృష్ట్యా తేయాకు, చైనాతో వ్యాపారంలోనూ కంపెనీకి ఉన్న గుత్తాధికారం కొనసాగింది.
* భారతీయులను సంస్కరించడం, విజ్ఞానవంతులను చేయడం కోసం మిషనరీల ప్రవేశానికి అవకాశం కల్పించారు. అవి భారతదేశంలో చర్చ్‌లు, ఆసుపత్రులు, విద్యాలయాలను స్థాపించడం ద్వారా మత మార్పిడులకు అవకాశం ఏర్పడింది.
* భారతీయులకు విజ్ఞానశాస్త్రాన్ని పరిచయం చేయడం, ప్రోత్సహించడం కోసం రూ.1,00,000 తో ఒక నిధిని భారతదేశంలో ఏర్పాటు చేశారు.
* పన్నులను విధించడానికి, వాటిని చెల్లించని వారిపై చర్యలను తీసుకునే అధికారాన్ని స్థానిక సంస్థలకు ఇచ్చారు.
* కంపెనీ పరిపాలనలో పనిచేసే సివిల్ సర్వెంట్లకు శిక్షణా సదుపాయాన్ని కల్పించారు. పౌర ఉద్యోగులకు హేలీబ్యూరి కాలేజ్‌లోను (ఇంగ్లండ్), సైనికోద్యోగులకు ఎడిస్ కోంబ్‌లోని మిలిటరీ సెమినరీలోను శిక్షణను ఏర్పాటు చేశారు. * ఈ రెండింటినీ 'బోర్డ్ ఆఫ్ కంట్రోల్' అధీనంలో ఉంచారు.

 

చార్టర్ చట్టం 1833 

భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం కేంద్రీకృత పాలనా వ్యవస్థను ఏర్పాటుచేసింది. కంపెనీ భూభాగాలు బ్రిటిష్ రాణి లేదా చక్రవర్తి వారసులకు చెందుతాయని ప్రకటించింది.  
ముఖ్యాంశాలు: ఈస్టిండియా కంపెనీ పాలనను మరో 20 సంవత్సరాలు పొడిగించారు. అయితే తేయాకు, చైనాతో ఉన్న వ్యాపార గుత్తాధిపత్యాన్ని రద్దు చేశారు. 
* కంపెనీ వ్యాపార లావాదేవీలను రద్దుచేసి, పరిపాలనా సంస్థగా మార్చారు.
* 'బోర్డ్ ఆఫ్ కంట్రోల్' నిర్మాణంలో మార్పు తెచ్చారు. అనేక మంది మంత్రులు పదవిరీత్యా సభ్యులయ్యారు. ఉదాహరణకు - లార్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కౌన్సిల్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ మొదలైనవారు.
* 'గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్' హోదాను 'గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా'గా మార్చారు. మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా 'విలియం బెంటింక్'.
* గవర్నర్ జనరల్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 3 నుంచి 4 కు పెంచారు. నాలుగో సభ్యుడిగా 'లా మెంబరు'ను చేర్చారు. కౌన్సిల్‌లో మొదటి లా మెంబరు లార్డ్ మెకాలే.
* బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీ కౌన్సిళ్లను రద్దు చేశారు. గవర్నర్ జనరల్ కౌన్సిల్‌కే పూర్తి శాసనాధికారం లభించింది. గవర్నర్ జనరల్ అధ్యక్షతనున్న కౌన్సిల్ శాసనాలు 'బ్రిటిష్ - ఇండియా' మొత్తానికి, అందరు వ్యక్తులకు, న్యాయస్థానాలకు వర్తిస్తాయి.
* భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి ఒక భారతీయ 'లా కమిషన్‌'ను నియమించారు. దీనికి మొదటి అధ్యక్షుడు లార్డ్ మెకాలే.
* సివిల్ సర్వీస్ నియామకాల్లో బహిరంగ పోటీ పద్ధతి (open competition) ని ప్రతిపాదించారు. కానీ 'కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్' వ్యతిరేకించడంతో అది అమల్లోకి రాలేదు.
* భారత వ్యవహారాల మంత్రిని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్షుడిగా చేశారు.
* భారతదేశంలో బానిసత్వాన్ని రద్దు చేయడానికి తగిన చర్యలు తీసుకునే బాధ్యతను గవర్నర్ జనరల్ కౌన్సిల్‌పై ఉంచింది.
* యూరోపియన్లకు భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా నివాసం ఏర్పరచుకోవడానికి అనుమతించారు.

 

చార్టర్ చట్టం 1853 

బ్రిటిష్ పార్లమెంటు చేసిన చార్టర్ చట్టాల్లో చివరిది. అతి తక్కువ కాలం అమల్లో ఉన్న, నిర్దిష్ట కాలపరిమితి లేకుండా జారీ చేసిన చట్టం ఇది.
ముఖ్యాంశాలు: గవర్నర్ జనరల్ కౌన్సిల్ విధులను శాసన, కార్యనిర్వాహక విధులుగా విభజించి, శాసనాలను రూపొందించడానికి 'ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌'ను ఏర్పాటు చేశారు. శాసన నిర్మాణం కోసం 12 మంది సభ్యులు ఉంటారు. ఇది రూపొందించే చట్టాలకు గవర్నర్ జనరల్ ఆమోదం అవసరం. గవర్నర్ జనరల్‌కు వీటో అధికారం ఉంటుంది. 'సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌'నే మినీ పార్లమెంటు అంటారు. దీంతో భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థను మొదటిసారిగా పరిచయం చేసినట్లయ్యింది.
* కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ (కేంద్ర శాసన మండలి)లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించారు. మొత్తం 12 మందిలో గవర్నర్ జనరల్, సర్వసైన్యాధ్యక్షుడు, కౌన్సిల్‌లోని నలుగురు సాధారణ సభ్యులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక సాధారణ న్యాయమూర్తి, నలుగురు సభ్యులను మద్రాసు, బొంబాయి, బెంగాల్, ఆగ్రా నుంచి తీసుకున్నారు.
* బ్రిటిష్ ఇండియాలో సివిల్ సర్వీసు నియామకాలను సార్వజనీన లేదా బహిరంగ పోటీ ద్వారా నియమించే పద్ధతిని ప్రవేశపెట్టారు. అంతవరకూ 'కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్' నియమించేవారు.
* కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ సంఖ్యను 24 నుంచి 18 కి తగ్గించారు. వీరిలో ఆరుగురిని నియమించే అధికారం రాణి లేదా చక్రవర్తికి ఇచ్చారు.
* 'గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా'కు ఉన్న 'గవర్నర్ ఆఫ్ బెంగాల్' అనే హోదాను రద్దు చేశారు.
* భారతదేశంలో వ్యాపార సంస్థగా ప్రారంభమైన ఈస్టిండియా కంపెనీ 1858 నాటికి కేవలం పరిపాలనా సంస్థగానే మిగిలింది. ఇది 1857 సిపాయిల తిరుగుబాటు (లేదా) ప్రథమ స్వాతంత్య్ర పోరాటం తర్వాత రద్దయింది. కంపెనీ స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యక్షంగా పాలనాధికారాలను స్వీకరిస్తూ 1858 నవంబరు 1 న ఒక ప్రకటన జారీ చేసింది.  
 * భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ద్వారా రూపొందించినప్పటికీ ఇది ఒక సుదీర్ఘ చారిత్రక క్రమపరిణామ ఫలితమని చెప్పొచ్చు.
 *  బ్రిటిష్ - ఇండియా ప్రాంతాల పాలన కోసం 1773 నుంచి 1947 వరకు బ్రిటిష్ ప్రభుత్వం అనేక చట్టాలను చేసింది.
 * ఇవి భారత రాజ్యాంగ రూపకల్పనలో రాజ్యాంగ పరిషత్‌కు ఆధారంగా నిలిచాయి. 

 

చార్టర్‌ చట్టం, 1813

* ఈ చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీకి భారత్‌లో 20 ఏళ్ల పాటు వర్తక, వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు అనుమతి లభించింది.

* భారత్‌లో ఈస్టిండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని రద్దు చేస్తూ ‘స్వేచ్ఛా వాణిజ్యాన్ని’ (చైనాతో వ్యాపారం, తేయాకు వ్యాపారం మినహా) ప్రవేశపెట్టారు.

* స్థానిక స్వపరిపాలనా సంస్థలకు పన్నులు విధించే అధికారాన్ని, అవి చెల్లించని వారిపై చర్యలు తీసుకునే అవకాశాన్ని కల్పించారు.

* భారత్‌లోకి క్రైస్తవ మిషనరీల ప్రవేశానికి  అవకాశం కల్పించారు. ఇది తర్వాతి కాలంలో మనదేశంలో మతమార్పిడులకు దారితీసింది.

* భారత్‌లో విద్యాభివృద్ధి కోసం సంవత్సరానికి లక్షరూపాయలు కేటాయించారు.

* ‘బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌’ పర్యవేక్షణ అధికారాలను, విధివిధానాలను స్పష్టంగా పేర్కొన్నారు. దీని పరిధిని విస్తృతం చేశారు.

* ప్రైవేట్‌ వ్యక్తులు భూములు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించారు.

* ఈ చట్టం చేసే సమయంలో ‘మార్క్వస్‌ హేస్టింగ్స్‌’ గవర్నర్‌ జనరల్‌గా ఉన్నారు.

చార్టర్‌ చట్టం, 1833

* ఈ చట్టం ద్వరా ‘ఈస్టిండియా కంపెనీ’కి మరో 20 ఏళ్ల పాటు భారత్‌లో వర్తక, వాణిజ్య నిర్వహణకు అవకాశం కల్పించారు. దీన్నే ‘సెయింట్‌ హెలీనా’ చట్టంగా పేర్కొంటారు.

* బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ పదవి పేరును ‘భారతదేశ గవర్నర్‌ జనరల్‌’గా మార్చారు. మొట్టమొదటి భారతదేశ గవర్నర్‌ జనరల్‌గా ‘విలియం బెంటింక్‌’ వ్యవహరించారు. ఇతడికి ఆర్థిక, సివిల్, మిలటరీ అధికారాలు అప్పగించారు.

* భారతదేశంలో ‘బానిసత్వాన్ని’ రద్దు చేయాలని తీర్మానించారు. దీన్ని లార్డ్‌ ఎలిన్‌ బరో వ్యతిరేకించడంతో అమల్లోకి రాలేదు.

* భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి లార్డ్‌ మెకాలే అధ్యక్షతన ‘మొదటి లా కమిషన్‌’ను ఏర్పాటు చేశారు.

* బొంబాయి, మద్రాస్‌ ప్రభుత్వాల శాసనాధికారాలను తొలగించారు. కార్యనిర్వాహక మండలితో కూడిన గవర్నర్‌ జనరల్‌కు పూర్తి శాసనాధికారం లభించింది.

* గవర్నర్‌ జనరల్‌ కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్యను నాలుగుకు పెంచారు. అందులో ఒక న్యాయ సభ్యుడిగా లార్డ్‌ మెకాలేకు ప్రాతినిధ్యం కల్పించారు.

* ‘ఈస్టిండియా కంపెనీ’ వ్యాపార లావాదేవీలను రద్దు చేసి, దాన్ని పరిపాలనా సంస్థగా మార్చారు. తేయాకు, చైనాతో వ్యాపారాన్ని ఈస్టిండియా కంపెనీ గుత్తాధిపత్యం నుంచి తొలగించారు.

* యూరోపియన్లు భారతదేశానికి వలస వచ్చేందుకు, ఇక్కడ భూమి, ఆస్తులను సంపాదించుకునేందుకు పూర్తి స్వేచ్ఛ కల్పించారు. దీంతో బ్రిటిష్‌ వలస రాజ్యస్థాపనకు చట్టబద్ధత కలిగింది. భారతదేశంలో ‘కేంద్రీకృత పాలన’కు తుదిమెట్టుగా ఈ చట్టాన్ని పేర్కొన్నారు.

* సివిల్‌ సర్వీసుల నియామకాల్లో బహిరంగ పోటీ పద్ధతిని ప్రతిపాదించారు. భారతీయులకు ఉద్యోగకల్పనలో వివక్ష చూపకూడదని తీర్మానించారు. దీన్ని ‘కోర్ట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌’ వ్యతిరేకించడంతో పూర్తిగా అమల్లోకి రాలేదు.

* భారతదేశంలో ముగ్గురు ‘బిషప్‌’లను  నియమించారు. కలకత్తాలోని ‘బిషప్‌’ను  భారతదేశం మొత్తానికీ క్రైస్తవ మతాధిపతిగా ప్రకటించారు.

చార్టర్‌ చట్టం, 1853

* ఇది ‘ఈస్టిండియా కంపెనీ’ పాలనా కాలంలో ప్రవేశపెట్టిన చివరి చార్టర్‌ చట్టం. ఇందులో భారత్‌లో ఈస్టిండియా కంపెనీ హక్కులను పొడిగించే అంశాన్ని ప్రస్తావించలేదు. దీంతో కంపెనీ పాలన త్వరలో అంతమవుతుందని స్పష్టమైంది.

* గవర్నర్‌ జనరల్‌ అధికార విధులను శాసన, కార్యనిర్వాహక విధులుగా విభజించారు. శాసనాల రూపకల్పనకు ‘సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌’ను ఏర్పాటు చేశారు. ఇది బ్రిటిష్‌ పార్లమెంటులా తన విధులను నిర్వహిస్తుంది.

* కేంద్ర లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించారు. ఇందులో మొత్తం ఆరుగురు సభ్యులు ఉంటారు. బెంగాల్, బొంబాయి, మద్రాస్, ఆగ్రాల నుంచి నలుగురికి ప్రాతినిధ్యం కల్పించారు.

* సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో జాతి వివక్ష లేకుండా బహిరంగ పోటీ విధానాన్ని ప్రవేశపెట్టారు. 

* 1854లో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలపై అధ్యయనం కోసం లార్డ్‌ మెకాలే అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

మూడో దశ (1858-1909)

* 1857లో భారత్‌లో చెలరేగిన సిపాయిల తిరుగుబాటు తర్వాత 1858 నుంచి భారతదేశ పరిపాలన బ్రిటిష్‌ రాజు/ రాణి నియంత్రణలోకి వెళ్లింది. అప్పటి నుంచి రూపొందిన చట్టాలను ‘కౌన్సిల్‌ చట్టాలు’ లేదా ‘భారత ప్రభుత్వ చట్టాలు’గా పేర్కొంటారు.

భారత ప్రభుత్వ చట్టం, 1858:

* 1858, నవంబరు 1న విక్టోరియా మహారాణి భారతదేశ పరిపాలనా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడి ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్య్రం, సంక్షేమం తమ లక్ష్యమని ఆమె ప్రకటించారు.

* ఈ చట్టం ద్వారా భారత్‌లో ‘ఈస్టిండియా కంపెనీ పాలన’ రద్దయ్యి, దేశం బ్రిటిష్‌ సామ్రాజ్యంలో అంతర్భాగమైంది.

* భారతదేశ పరిపాలనకు అవసరమైన శాసనాలను బ్రిటిష్‌ పార్లమెంటు రూపొందిస్తుంది.

* లండన్‌లో ‘భారతరాజ్య కార్యదర్శి’ ్బళీ’‘౯’్మ్చ౯్వ ్న÷ ళ్మ్చ్మీ’్శ అనే పదవిని ఏర్పాటు చేశారు. ఇది బ్రిటిష్‌ కేబినెట్‌లో అంతర్భాగంగా ఉంటూ, మనదేశ పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి బ్రిటిష్‌ పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది.

* భారతరాజ్య కార్యదర్శికి పరిపాలనలో సహకరించడానికి 15 మంది సభ్యులతో కూడిన ‘కౌన్సిల్‌’ను ఏర్పాటు చేశారు.

* ‘గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా’ హోదాను ‘వైస్రాయ్‌ ఆఫ్‌ ఇండియా’గానూ వ్యవహరించారు. ఈ వ్యక్తిని బ్రిటిష్‌ పాలిత రాష్ట్రాలతో వ్యవహరించేటప్పుడు గవర్నర్‌ జనరల్‌గా, స్వదేశీ సంస్థానాలతో వ్యవహరించేటపుడు ‘వైస్రాయ్‌’గా పేర్కొన్నారు.

* మొట్టమొదటి గవర్నర్‌ జనరల్, వైస్రాయ్‌ పదవిని ‘లార్డ్‌ కానింగ్‌’ నిర్వహించారు.

* వైస్రాయ్‌ దేశంలో బ్రిటిష్‌ రాణి మొట్టమొదటి ప్రత్యక్ష ప్రతినిధి. వీరు భారతదేశ పాలనను బ్రిటిష్‌ రాణి పేరుతో నిర్వహిస్తారు. వీరి పదవీకాలం అయిదేళ్లు. పాలనలో సహకరించేందుకు ఒక కార్యనిర్వాహక మండలి ఉంటుంది.

* ఈ చట్టాన్ని ‘గుడ్‌ గవర్నెన్స్‌ ఆఫ్‌ ఇండియా’గా పేర్కొంటారు.

* ఈ చట్టం ద్వారా బ్రిటిష్‌ రాణి ‘భారత సామ్రాజ్ఞి’ అనే బిరుదు పొందారు.

* దీని ద్వారానే భారత రాజ్యాంగ చరిత్ర ప్రాంభమైందని డి.డి.బసు పేర్కొన్నారు.

* బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్, కోర్ట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ అనే ద్వంద్వపాలన రద్దయ్యింది.

* 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, భారతదేశంలోని యూరోపియన్‌ వడ్డీ వ్యాపారులు తిరుగుబాటు చేశారు. దీన్నే ‘వైట్‌ మ్యుటినీ’ (జ్తూi్మ’ ల్య్మీi-్వ) లేదా  ‘యూరోపియన్‌ తిరుగుబాటు’గా చెప్తారు.

* ఈ చట్టం ప్రకారం భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్‌ ప్రభుత్వం కింది విధానాన్ని అనుసరించి, అమలు చేసింది.

రాజ్యాంగ పరిణామ క్రమం - మూడోదశ

ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టాలు

భారతదేశంపై తమ పట్టును కొనసాగించడానికి బ్రిటిష్‌వారు అనేక చట్టాలను రూపొందించారు. ఇవి భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో అంతర్భాగంగా ఉపకరిస్తూ, మన రాజ్యాంగ రూపకల్పనకు తోడ్పడ్డాయి. వీటిలో కౌన్సిల్‌ చట్టాలు ముఖ్యమైనవి. భారత రాజ్య కార్యదర్శితో కూడిన 15 మంది కౌన్సిల్‌ సభ్యుల పేరు మీదుగా వీటిని రూపొందించారు. అందుకే వీటిని కౌన్సిల్‌ చట్టాలుగా పేర్కొంటారు. ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టాలు, వాటిలోని ముఖ్యాంశాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. 

ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1861

* లార్డ్‌ కానింగ్‌ భారతదేశ గవర్నర్‌ జనరల్, వైస్రాయ్‌గా ఉన్న కాలంలో ‘ఇండియన్‌  కౌన్సిల్‌ చట్టం, 1861’ని రూపొందించారు.

* ఈ చట్టం ద్వారా భారతీయులకు మొదటిసారి శాసన నిర్మాణంలో పాల్గొనే అవకాశం ఇచ్చారు. గవర్నర్‌ జనరల్‌కు ‘ఆర్డినెన్స్‌’ను జారీచేసే అధికారాన్ని కల్పించారు.

* మంత్రులకు మంత్రిత్వశాఖలను కేటాయించే ‘పోర్ట్‌ఫోలియో’ విధానానికి చట్టబద్ధత కల్పించారు.

* రెగ్యులేటింగ్‌ చట్టం, 1773 ద్వారా రద్దుచేసిన బాంబే, మద్రాస్‌ ప్రెసిడెన్సీల శాసనాధికారాలను పునరుద్ధరించారు. 

* ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను వివరించే ‘వార్షిక బడ్జెట్‌’ను ప్రవేశపెట్టే విధానాన్ని ప్రారంభించారు.

* బెంగాల్, పంజాబ్, ఈశాన్య సరిహద్దు ప్రావిన్సుల్లో నూతన లెజిస్లేటివ్‌ కౌన్సిళ్లను ఏర్పాటు చేశారు.

* లార్డ్‌ కానింగ్‌ ‘లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌’కు అనధికార సభ్యులుగా కొంతమంది భారతీయులను నామినేట్‌ చేశారు. వీరిలో పటియాలా మహారాజు నరేంద్రసింగ్, బెనారస్‌ మహారాజు దేవ్‌నారాయణ్‌ సింగ్, సర్‌ దినకర్‌రావు మొదలైనవారు ఉన్నారు.

* భారతదేశంలో మొదటి హైకోర్టును 1862లో కలకత్తాలో నెలకొల్పారు. అదే ఏడాది మద్రాస్, బాంబే హైకోర్టులను ఏర్పాటు చేశారు. 

* వివిధ లా కమిషన్ల సిఫార్సుల మేరకు 1859లో ‘సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌’ను రూపొందించారు. 1860లో ‘ఇండియన్‌ పీనల్‌ కోడ్‌’, 1861లో ‘క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌’లను రూపొందించారు.

విభజించు- పాలించు విధానం

* భారత్‌లో అతివాద - మితవాద నాయకుల మధ్య తీవ్రమైన ఘర్షణ ఉండేది. దీన్ని గుర్తించిన ఆంగ్లేయులు అతివాదులను వేరుచేసి, మితవాదులను తమకు అనుకూలంగా తిప్పుకోవాలని ప్రయత్నించారు. 

* ఇందులో భాగంగానే ‘మింటో - మార్లే సంస్కరణల చట్టం’ ద్వారా విభజించు- పాలించు అనే విధానాన్ని బ్రిటిష్‌వారు అనుసరించారు.

ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1892

* 1885లో భారత జాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) ఏర్పడింది. విద్యావంతులైన భారతీయులు బ్రిటిష్‌ పాలనలోని లోపాలను తెలియజేస్తూ భారతీయుల్లో చైతన్యాన్ని తీసుకురావడం ప్రారంభించారు. దీంతో ఆంగ్లేయులు ఆందోళన చెంది, ఇక్కడి ప్రజలను సంతృప్తిపరచడానికి ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1982ను రూపొందించారు.

* ఈ చట్టం ద్వారా కేంద్ర, రాష్ట్రాలకు చెందిన లెజిస్లేటివ్‌ కౌన్సిళ్లలో సభ్యుల సంఖ్యను పెంచారు.

* కేంద్ర శాసనసభలో భారతీయ సభ్యుల ప్రాతినిధ్యం ఆరుకు పెరిగింది. వారు: గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్‌ బెనర్జీ, రాస్‌బిహారి ఘోష్,  ఫిరోజ్‌షా మెహతా, దాదాబాయ్‌ నౌరోజీ, బిల్‌గ్రామి.

* మనదేశంలో మొదటిసారిగా పరోక్ష పద్ధతిలో ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు.

* కౌన్సిల్‌ సభ్యులకు బడ్జెట్‌పై చర్చించే అవకాశాన్ని, ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు అడిగే అధికారాన్ని కల్పించారు.

* కేంద్ర శాసనసభలో సభ్యుల సంఖ్య 10 మందికి తగ్గకుండా, 16 మందికి మించకుండా ఉండాలని నిర్దేశించారు.

* రాష్ట్ర శాసనసభల్లో సభ్యుల సంఖ్య 8 మందికి తగ్గకుండా 20 మందికి మించకుండా ఉండాలని పేర్కొన్నారు.

నాలుగో దశ (1909-35)

ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1909 

* దీన్నే మింటో - మార్లే సంస్కరణల చట్టం 1909 అని కూడా అంటారు.

* 1909లో అప్పటి భారత రాజ్య కార్యదర్శి లార్డ్‌ మార్లే, గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ మింటో ఈ సంస్కరణల చట్టాన్ని రూపొందించారు.

* ఈ చట్టం ద్వారా వైస్రాయ్‌ కార్యనిర్వాహక కౌన్సిల్‌లోని సభ్యుల సంఖ్యను శాసన ప్రక్రియ కోసం 16 నుంచి 60కి పెంచారు. 

* మద్రాస్, బెంగాల్, యునైటెడ్‌ ప్రావిన్స్, బిహార్, ఒడిశా రాష్ట్రాల శాసన వ్యవస్థల్లో సభ్యుల సంఖ్యను 50కి పెంచారు.

* కేంద్ర లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ పేరును ‘ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌’గా మార్చారు.

* గవర్నర్‌ జనరల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో మొదటిసారిగా భారతీయులకు ప్రాతినిధ్యాన్ని కల్పించారు. ఈవిధంగా కౌన్సిల్‌కు వెళ్లిన మొదటి భారతీయుడు సత్యేంద్రప్రసాద్‌ సిన్హా. ఈయన్ను న్యాయసభ్యుడిగా నియమించారు.

* కేంద్ర, రాష్ట్ర శాసనసభ్యులకు అనుబంధ ప్రశ్నలు వేయడానికి, బడ్జెట్‌పై తీర్మానాలు ప్రవేశపెట్టడానికి అవకాశం కల్పించారు.

* మొదటిసారిగా ‘ఎన్నికల పద్ధతి’ని ప్రవేశపెట్టారు. శాసనసమండలిలో అనధికార సభ్యుల ఎన్నికకు ఈ పద్ధతి వర్తిస్తుంది. ఓటర్లను మతాలు, వర్గాలవారీగా విభజించారు.

* ముస్లింలు, వ్యాపార సంఘాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. ముస్లింలకు వారి జనాభాకు మించి ప్రాతినిధ్యం కల్పించారు. వీరిని ముస్లిం ఓటర్లే ఎన్నుకునేలా వీలు కల్పించారు. ఇందుకోసం ‘ప్రత్యేక మత నియోజకవర్గాలను’ ఏర్పాటు చేశారు.

* ఈ చట్టం ద్వారా మతతత్వానికి చట్టబద్దత కల్పించారు. అందుకే లార్డ్‌ మింటోను భారత్‌లో ‘మత నియోజకవర్గాల పితామహుడి’గా పేర్కొంటారు.

* 1911లో లార్డ్‌ హార్డింజ్‌ - ఖిఖి కాలంలో భారతదేశ రాజధానిని కలకత్తా నుంచి దిల్లీకి మార్చారు. 

* ఈ చట్టం హిందువులు - ముస్లింల మధ్య వేర్పాటువాదానికి దారితీసి, భారతదేశ విభజనకు కారణమైందని జవహర్‌లాల్‌ నెహ్రూ పేర్కొన్నారు.

* 1909 మింటో మార్లే సంస్కరణల చట్టం‘కేవలం నీడ లాంటి ఆకారాన్ని మాత్రమే అందించిందని, ఇది చంద్రకాంతితో సమానం’’ అని అనేకమంది రాజనీతిజ్ఞులు పేర్కొన్నారు.

* ఈ చట్టం ద్వారా స్థానిక సంస్థల్లో ఎన్నికయ్యే ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచాలని భావించారు. ప్రాథమిక విద్య బాధ్యతను మున్సిపల్‌ వ్యవస్థలకు అప్పగించాలని ప్రయత్నించారు.

* 1913లో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో లాలా హరదయాళ్‌ ‘గదర్‌’ పార్టీని స్థాపించారు. ఈ పార్టీలో చేరిన ఏకైక తెలుగు వ్యక్తి ‘దర్శి చెంచయ్య’.

* ‘‘ఈ సంస్కరణలు భారతదేశంలో పార్లమెంటరీ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సంబంధించినవి కావు’’ అని లార్డ్‌ మార్లే వ్యాఖ్యానించారు.

* భారతీయుల్లో పెరిగిపోతున్న అసంతృప్తిని, స్వాతంత్య్ర కాంక్షను నిలువరించే ఉద్దేశంతో ఆంగ్లేయులు అనేక చర్యలు చేపట్టారు. వాటిలో ‘మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం, 1919’ కీలకమైంది. ఇందులోని అనేక మౌలికాంశాలు భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలకపాత్ర పోషించాయి. వీటిపై పరీక్షార్థులకు అవగాహన అవసరం.

మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం, 1919

1919లో అప్పటి భారత రాజ్య కార్యదర్శి మాంటేగ్, గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ చెమ్స్‌ఫర్డ్‌ కలిసి ఈ సంస్కరణల చట్టాన్ని రూపొందించారు. భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలనను అందించడం దీని ముఖ్య లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ చట్టం 1921 నుంచి అమల్లోకి వచ్చింది.

చట్టంలోని ముఖ్యాంశాలు: భారతదేశంలో తొలిసారి పార్లమెంటరీ విధానానికి పునాదులు పడ్డాయి. కేంద్ర శాసనసభలో ‘ద్విసభా విధానాన్ని’ ప్రవేశపెట్టారు.

కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్స్‌:

* దీన్ని ‘ఎగువ సభ’గా పేర్కొంటారు. ఇందులోని సభ్యుల పదవీకాలాన్ని 5 సంవత్సరాలుగా నిర్దేశించారు.

* ఈ సభలో ఉన్న సభ్యుల సంఖ్య 60. వీరిలో 34 మంది ఎన్నికైనవారు కాగా, మిగిలిన 26 మందిని గవర్నర్‌ జనరల్‌ నామినేట్‌ చేస్తారు. 

* ఈ సభకు గవర్నర్‌ జనరల్‌ ఎక్స్‌అఫీషియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. దీని స్ఫూర్తితోనే మన రాజ్యసభను ఏర్పాటు చేశారు.

లెజిస్లేటివ్‌ అసెంబ్లీ:

* దీన్ని ‘దిగువసభ’గా పేర్కొంటారు. దీనిలోని సభ్యుల పదవీకాలం 3 సంవత్సరాలు. 

* ఇందులోని మొత్తం సభ్యుల సంఖ్య 144. వీరిలో 104 మంది ఎన్నికైనవారు కాగా, 40 మంది నామినేట్‌డ్‌ సభ్యులు.

* 1925 ఫిబ్రవరిలో ఈ సభకు మొదటి అధ్యక్షుడిగా సర్‌ ఫెడరిక్‌ వైట్‌ను, ఉపాధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హాను నియమించారు.

* భారతీయుడైన విఠల్‌భాయ్‌ పటేల్‌ 1925, ఆగస్టులో ఈ సభకు మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 

అధికారాల విభజన: 1919 నాటి మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రెండు రకాల అధికారాల విభజనను పేర్కొన్నారు. అవి: 

కేంద్ర జాబితా: ఇందులో 47 అంశాలు ఉన్నాయి. జాతీయ ప్రాధాన్యం ఉన్న విదేశీ వ్యవహారాలు, దేశరక్షణ, పోస్టల్, కరెన్సీ, రైల్వే మొదలైన అంశాలు కేంద్ర జాబితా కిందకి వస్తాయి.

రాష్ట్ర జాబితా: ఇందులో 51 అంశాలు ఉన్నాయి. ప్రాంతీయ ప్రాధాన్యం కలిగిన వ్యవసాయం, నీటి పారుదల, ప్రజారోగ్యం, రోడ్డురవాణా, స్థానిక స్వపరిపాలన మొదలైన అంశాలు రాష్ట్ర జాబితాలో ఉంటాయి.

ద్వంద్వపాలన (Dyarchy): 1919 నాటి మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం ద్వారా రాష్ట్రాల్లో ‘ద్వంద్వపాలన’ను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ప్రభుత్వ పాలనాంశాలను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి:

రిజర్వ్‌డ్‌ అంశాలు: వీటిలో అత్యంత ప్రాధాన్యం ఉన్న 28 అంశాలు ఉన్నాయి. భూమి శిస్తు, పరిశ్రమలు, ఆర్థిక, న్యాయ, నీటిపారుదల మొదలైనవి ఇందులో ఉన్నాయి. 

* వీటికి సంబంధించిన వ్యవహారాలను సంబంధిత రాష్ట్రాల గవర్నర్లు నిర్వహిస్తారు. వీరికి  ‘కార్య నిర్వాహక మండలి’ సహాయం చేస్తుంది. 

* కార్య నిర్వాహక మండలి సభ్యులు తమ విధి నిర్వహణలో రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. అంటే వీరికి అధికారాలు మాత్రమే ఉంటాయి, విధులు ఉండవు.

ట్రాన్స్‌ఫర్డ్‌ అంశాలు: వీటిలో ప్రాధాన్యం, అధికారాలు లేని 22 అంశాలు ఉన్నాయి. స్థానిక పాలన, వ్యవసాయం, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం మొదలైన వాటిని భారతీయ మంత్రుల సహాయంతో సంబంధిత రాష్ట్రాల గవర్నర్లు నిర్వహిస్తారు. 

* ఈ మంత్రులు ఆయా రాష్ట్రాల శాసనసభల్లో సభ్యులుగా ఉండి, తమ విధి నిర్వహణలో శాసనసభకు బాధ్యత వహిస్తారు.

* మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం, 1919 ద్వారా బ్రిటిష్‌ ఇండియా పరిపాలన కింది విధంగా రూపాంతరం చెందింది.

పాలనా విభాగం కార్య నిర్వాహక వర్గం  శాసన  వ్యవస్థ  న్యాయ వ్యవస్థ   
ఇంగ్లండ్‌ భారత  వ్యవహారాల మంత్రి, భారత  కౌన్సిల్, భారత  హైకమిషనర్‌ పార్లమెంట్‌ ప్రీవి కౌన్సిల్‌
ఇండియా గవర్నర్‌ జనరల్, గవర్నర్‌ జనరల్ కౌన్సిల్ కేంద్ర  శాసనసభ  సుప్రీంకోర్టు
రాష్ట్రం   గవర్నర్‌ రాష్ట్ర  శాసనసభ హైకోర్టు

ఇతర ముఖ్యాంశాలు

* భారతదేశ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ‘భారత హైకమిషనర్‌’ అనే పదవిని సృష్టించి, లండన్‌లో  కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

* భారత రాజ్య కార్యదర్శి జీతభత్యాలను భారతదేశ ఆదాయం నుంచి కాకుండా, బ్రిటిష్‌ ఆదాయం నుంచి చెల్లించాలని నిర్ణయించారు.

* సిక్కులు, క్రిస్టియన్లు, ఆంగ్లో ఇండియన్లు, యూరోపియన్లకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు. దీని ద్వారా మనదేశంలో మతపరమైన ప్రాతినిధ్యాన్ని విస్తృతం చేశారు.

* పరిమితమైన ప్రత్యక్ష ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టి, భారతీయులు ప్రత్యక్షంగా పరిపాలనలో భాగస్వాములయ్యే అవకాశాన్ని కల్పించారు.

* కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య; వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించే అధికారాన్ని వైస్రాయ్‌కి కల్పించారు.

* మొదటిసారిగా కేంద్ర బడ్జెట్‌ నుంచి రాష్ట్రాల బడ్జెట్‌ను వేరు చేశారు. రాష్ట్రాల శాసనసభకు తమ బడ్జెట్‌ను తామే రూపొందించుకునే అధికారాన్ని కల్పించారు.

* ‘పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’ ఏర్పాటుపై అధ్యయనం చేయడానికి ‘లీ’ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇది 1926లో తన నివేదికను సమర్పించగా కేంద్రం, రాష్ట్రాల్లో వేర్వేరు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లను ఏర్పాటు చేశారు.

* సాధారణ బడ్జెట్‌ నుంచి రైల్వే బడ్జెట్‌ను వేరు చేశారు.

* 1921లో ‘ప్రభుత్వ ఖాతాల సంఘం’(Public Accounts Committee)ని ఏర్పాటు చేశారు.

* ఆస్తి పన్ను చెల్లింపు, విద్య ప్రాతిపదికన పరిమిత ఓటు హక్కును కల్పించారు. దీంతో మన దేశంలో కేవలం 2.6% ప్రజలకు మాత్రమే ఓటు హక్కు లభించింది.

మహిళలకు ఓటు హక్కు - మార్గదర్శకాలు

* మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం, 1919 ప్రకారం మహిళలకు ఓటు హక్కును ఎప్పుడు, ఎలా కల్పించాలనే అధికారాన్ని ‘ప్రొవిన్షియల్‌ శాసనసభల’కు అప్పగించారు.

* 1920లో ట్రావెన్‌కోర్‌ సంస్థానం మొదటిసారి మహిళలకు ఓటు హక్కు కల్పించింది.

* 1921లో మద్రాస్, బాంబే రాష్ట్రాలు మహిళలకు ఓటు హక్కు కల్పించాయి.

* 1927లో ‘మద్రాస్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌’కు డాక్టర్‌ ముత్తులక్ష్మిరెడ్డి ఎన్నికయ్యారు.

విమర్శలు

* మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టాన్ని బాలగంగాధర్‌ తిలక్‌ ‘సూర్యుడు లేని ఉదయంగా’ విమర్శించారు.

* ‘‘భారతదేశంలో ద్వంద్వపాలన అనేది దాదాపు దూషించే మాట అయ్యింది. ఒక వ్యక్తి మరో వ్యక్తిని ‘నీవు డైయార్కివి’ అని అరవడం నేను విన్నాను’’ అని సర్‌ బట్లర్‌ పేర్కొన్నారు.

మడ్డీమాన్‌ కమిటీ, 1924

చిత్తరంజన్‌ దాస్, మోతీలాల్‌ నెహ్రూ ఆధ్వర్యంలోని ‘స్వరాజ్య పార్టీ’ కేంద్ర శాసన వ్యవస్థలోకి ప్రవేశించి, బ్రిటిష్‌ వారి ముందు అనేక డిమాండ్లను ఉంచింది. అవి: 

* ద్వంద్వపాలనా విధానాన్ని రద్దు చేయడం.

* రాజకీయ ఖైదీలను విడుదల చేయడం.

* సివిల్, డిఫెన్స్‌ సర్వీసుల్లో భారతీయులకే అవకాశం కల్పించి, స్వపరిపాలన అందించడం.

* భారతీయ పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను రూపొందించడం.

* స్వరాజ్య పార్టీ, ఇతర జాతీయ నాయకుల ఒత్తిడి కారణంగా బ్రిటిష్‌ వారు 1919 నాటి మాంటేగ్‌ - చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం అమలు తీరును సమీక్షించాలని నిర్ణయించారు. దీని కోసం 1924లో అలెగ్జాండర్‌ మడ్డీమాన్‌ అధ్యక్షతన 9 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

* ఈ కమిటీలో శివస్వామి అయ్యర్, తేజ్‌ బహదూర్‌ సప్రూ, ఆర్‌.పి.పరంజపే, మహ్మద్‌ ఆలీ జిన్నా మొదలైన భారతీయులు కూడా ఉన్నారు.

* ఏకాభిప్రాయంతో నివేదికను ఇవ్వడంలో ఈ కమిటీ విఫలమైంది. ఆంగ్లేయుల ప్రాబల్యం ఉన్న ఈ కమిటీ ద్వంద్వపాలనను సమర్థించింది.

సైమన్‌ కమిషన్‌ 1927

* 1919 నాటి మాంటేగ్‌ - చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం అమలు తీరును సమీక్షించేందుకు అప్పటి బ్రిటన్‌ ప్రధాని బాల్డ్విన్‌ 1927లో సర్‌ జాన్‌ సైమన్‌ నేతృత్వంలో ఒక కమిషన్‌ను నియమించారు. ఇందులో ఏడుగురు సభ్యులు ఉన్నారు.

* ఈ కమిషన్‌లో ఒక్క భారతీయుడికి కూడా ప్రాతినిధ్యం లభించలేదు. దీంతో దేశ పౌరులంతా ‘సైమన్‌ గో బ్యాక్‌’ నినాదంతో దీన్ని వ్యతిరేకించారు.

* సైమన్‌ కమిషన్‌ భారత్‌లో రెండుసార్లు పర్యటించింది. మొదటిసారి 1928, ఫిబ్రవరి 3 నుంచి మార్చి 31 వరకు; రెండోసారి 1928, అక్టోబరు 11 నుంచి 1929, ఏప్రిల్‌ 6 వరకు పర్యటించింది. ఈ కమిషన్‌ 1930లో తన నివేదికను సమర్పించింది.

నివేదికలోని ముఖ్యాంశాలు:

* భారతదేశంలో సమాఖ్య తరహా విధానాన్ని ఏర్పాటు చేయడం.

* 1919 నాటి మాంటేగ్‌ - చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం ద్వారా ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలనను రద్దు చేయడం.

* చట్ట సభల్లో భారతీయులకు ప్రవేశం కల్పించి, వారిని పరిపాలనలో భాగస్వాములను చేయడం.

* భాష ప్రాతిపదికన ఒడిశా, సింధు రాష్ట్రాలను ఏర్పాటు చేయడం.

* హైకోర్టులపై కేంద్ర ప్రభుత్వానికి పాలనాపరమైన నియంత్రణ ఉండేలా చూడటం

* భారతీయులకు సార్వజనీన వయోజన ఓటు హక్కును, ప్రాథమిక హక్కులను నిరాకరించడం సమంజసమే అని నివేదికలో పేర్కొంది.

* కులాలవారీగా (కమ్యూనల్‌) ప్రాతినిధ్యం కల్పించడం సమంజసం కానప్పటికీ, దీనికి ప్రత్యామ్నాయం లేని కారణంగా కొనసాగించాలని సూచించింది.

బట్లర్‌ కమిటీ, 1927

* బ్రిటిష్‌ వారు 1927లో సైమన్‌ కమిషన్‌తో పాటు హర్‌కోర్ట్‌ బట్లర్‌ అధ్యక్షతన ‘భారత రాజ్యాల కమిటీ’ని ఏర్పాటు చేశారు.

* బ్రిటిష్‌ ఇండియా, భారత రాజ్యాల (సంస్థానాల) మధ్య సంతృప్తికరమైన ఆర్థిక సంబంధాలను సూచించడం దీని లక్ష్యం.

* ఈ కమిటీలో డబ్ల్యూ.ఎస్‌.హాల్‌వర్త్, ఎస్‌.సి.పీల్స్‌ సభ్యులుగా ఉన్నారు. ఇది 16 రాజ్యాల్లో అమల్లో ఉన్న ఆర్థిక సంబంధాలను పరిశీలించి, 1929లో తన నివేదికను సమర్పించింది.

నెహ్రూ రిపోర్ట్, 1928

* సైమన్‌ కమిషన్‌ను బహిష్కరిస్తున్నట్లు 1927, నవంబరు 14న అప్పటి భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ అయ్యంగార్‌ ప్రకటించారు. దీంతో అసహనానికి గురైన అప్పటి భారత వ్యవహారాల మంత్రి లార్డ్‌ బిర్కెన్‌హెడ్‌ 1927, నవంబరు 24న బ్రిటిష్‌ ఎగువ సభలో మాట్లాడుతూ ‘‘భారతీయులు అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగ రచన చేసుకోగలరా?’’ అని సవాలు చేశారు.

* భారత జాతీయ నాయకులు ఈ సవాలును స్వీకరించి, 1928, మే 19న బొంబాయిలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో రాజ్యాంగ రచనకు ఒక ఉప సంఘాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. 9 మంది సభ్యులున్న ఈ సంఘానికి మోతీలాల్‌ నెహ్రూ అధ్యక్షత వహించారు.

* ఈ ఉపసంఘం ఇచ్చిన నివేదికనే నెహ్రూ రిపోర్ట్, 1928గా పేర్కొంటారు.

దీపావళి ప్రకటన, 1929

భారత్‌లో రాజ్యాంగ సంస్కరణలపై చర్చించేందుకు లండన్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరుగుతుందని, త్వరలోనే భారతదేశానికి స్వయంప్రతిపత్తి కల్పిస్తామని, 1929, అక్టోబరు 31న లార్డ్‌ ఇర్విన్‌ ప్రకటించారు. దీన్నే దీపావళి ప్రకటన అంటారు.

రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు

* సైమన్‌ కమిషన్‌ సమర్పించిన నివేదికలోని అంశాలపై భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలతో చర్చించేందుకు బ్రిటిష్‌ వారు లండన్‌లో మూడు రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించారు. 

* భారత్‌లో పరిపాలన, భవిష్యత్తులో ప్రవేశపెట్టే పాలనా సంస్కరణల కోసం భారతీయుల అభిప్రాయాలను సేకరించటం ఈ సమావేశాల ఉద్దేశం. 

* బ్రిటన్‌ ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్‌ అప్పటి భారత గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ ఇర్విన్‌తో చర్చించి ఈ సమావేశాల నిర్వహణకు శ్రీకారం చుట్టారు.

మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశం, 1930

* ఈ సమావేశం 1930, నవంబరు 12 నుంచి 1931, జనవరి 19 వరకు జరిగింది. ఇందులో 89 మంది ప్రముఖులు పాల్గొన్నారు. 

* ‘సంపూర్ణ బాధ్యతాయుత పాలన’పై చర్చిస్తామని బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రత్యేక హామీని ఇవ్వకపోవటంతో భారత జాతీయ కాంగ్రెస్‌ ఈ సమావేశాన్ని బహిష్కరించింది.

రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశం, 1931

* ఇది 1931, సెప్టెంబరు 7 నుంచి 1937, డిసెంబరు 1 వరకు జరిగింది.

* 1931, మార్చి 5న గాంధీ - ఇర్విన్‌ ఒడంబడిక జరగడంతో ఈ సమావేశానికి ‘భారత జాతీయ కాంగ్రెస్‌’ తరఫున గాంధీజీ ప్రాతినిధ్యం వహించారు. 

* ఇందులో 107 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అల్ప సంఖ్యాక వర్గాల సమస్యలపై గాంధీజీ, మహ్మద్‌ అలీ జిన్నా మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 

* బ్రిటిష్‌ వారు అనుసరిస్తున్న ‘విభజించు, పాలించు’ విధానానికి వ్యతిరేకంగా గాంధీజీ ఈ సమావేశాన్ని బహిష్కరించి భారత్‌కు తిరిగి వచ్చారు. ఆయన్ను ఆంగ్లేయులు అరెస్ట్‌ చేసి ఎరవాడ జైలుకు తరలించారు.

కమ్యూనల్‌ అవార్డ్, 1932: చట్టసభల్లో మైనార్టీ వర్గాల ప్రాతినిధ్యం పెంచాలని 1932, ఆగస్టు 16న ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్‌ ప్రతిపాదించారు. దీన్నే కమ్యూనల్‌ అవార్డ్‌ అంటారు.

* దీని ప్రకారం ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్‌లకే కాకుండా షెడ్యూల్డ్‌ కులాల వారికి కూడా ప్రత్యేక నియోజకవర్గాలను ప్రతిపాదించారు. దీన్ని వ్యతిరేకిస్తూ గాంధీజీ 1932, సెప్టెంబరు 20న పుణెలోని ఎరవాడ జైలులో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.

* 1932, సెప్టెంబరులో గాంధీజీ - అంబేడ్కర్‌ మధ్య పుణె ఒడంబడిక జరిగింది. ఈ కారణంగా గాంధీజీ ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. 

* కమ్యూనల్‌ అవార్డ్‌ కంటే ఎక్కువగా షెడ్యూల్డ్‌ కులాల వారికి ప్రత్యేక అవకాశాలు కల్పించారు.

మూడో రౌండ్‌ టేబుల్‌ సమావేశం, 1932

* ఈ సమావేశం 1932, నవంబరు 17 నుంచి 1932, డిసెంబరు 24 వరకు జరిగింది. దీనికి 46 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 

* ఈ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం లేదు.

* లండన్‌లో జరిగిన ఈ మూడు రౌండ్‌ టేబుల్‌ సమావేశాలకు డా. బి.ఆర్‌. అంబేడ్కర్, మహ్మద్‌ అలీ జిన్నా హాజరయ్యారు. రెండో సమావేశంలో సరోజినీ నాయుడు పాల్గొన్నారు.

శ్వేత పత్రం, 1933: రౌండ్‌టేబుల్‌ సమావేశాల్లో చర్చించిన అంశాలతో బ్రిటిష్‌ ప్రభుత్వం ఒక శ్వేత పత్రాన్ని ప్రచురించింది. దీనిలోని ప్రతిపాదనలను లార్డ్‌ లిన్‌లిత్‌గో అధ్యక్షతన గల బ్రిటిష్‌ పార్లమెంట్‌కు చెందిన జాయింట్‌ సెలక్ట్‌ కమిటీ పరిశీలించింది. ఇది 1934, నవంబరు 11న తన నివేదికను సమర్పించింది. దీన్ని భారత జాతీయ కాంగ్రెస్‌ తిరస్కరించింది.
 

రాజ్యాంగ పరిణామ క్రమం (అయిదో దశ)

భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో రాజ్యాంగ రూపకల్పనకు అనేక అంశాలు తోడ్పడ్డాయి. వాటిలో ముఖ్యమైనవి ‘భారత ప్రభుత్వ చట్టం, 1935’, ‘ఆగస్టు ప్రతిపాదనలు, 1940’, ‘క్రిప్స్‌ ప్రతిపాదనలు 1942’.


క్రిప్స్‌ ప్రతిపాదనలు, 1942

రెండో ప్రపంచ యుద్ధకాలంలో భారతీయుల సహకారాన్ని పొందేందుకు బ్రిటన్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ తన కేబినెట్‌లో మంత్రిగా ఉన్న సర్‌ స్టాఫర్డ్‌ క్రిప్స్‌ను 1942, మార్చి 22న భారతదేశానికి పంపాడు. అతడు కింద పేర్కొన్న అంశాలను ప్రతిపాదించాడు:

* భారతీయులకు అవసరమైన నూతన రాజ్యాంగ రూపకల్పనకు ‘రాజ్యాంగ పరిషత్‌’ ఏర్పాటు.

* రెండో ప్రపంచ యుద్ధానంతరం భారతదేశానికి స్వయం ప్రతిపత్తిని కల్పించడం.

* రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అమల్లో ఉన్న రాజ్యాంగాన్ని అమలు చేసుకోవచ్చు లేదా నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకోవచ్చు.

* క్రిప్స్‌ ప్రతిపాదనలను గాంధీజీ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘ఇవన్నీ దివాళా తీస్తున్న బ్యాంకు మీద ముందు తేదీ వేసిన చెక్కు లాంటివి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. వీటికి నిరసనగా గాంధీజీ 1942, ఆగస్టు 8న క్విట్‌ ఇండియా ఉద్యమానికి పిలుపునిస్తూ, ప్రజలకు 'Do or Die' అనే నినాదాన్ని ఇచ్చారు.


భారత ప్రభుత్వ చట్టం 1935


* భారత్‌లో పరిపాలన కోసం బ్రిటిష్‌ ప్రభుత్వం తయారు చేసిన రాజ్యాంగ సంస్కరణ చట్టాల్లోకెల్లా ఇది సమగ్రమైంది. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్రిటిష్‌ పార్లమెంటు రూపొందించిన అతిపెద్ద చట్టం ఇది. లండన్‌లో జరిగిన మూడు రౌండ్‌ టేబుల్‌ సమావేశాల చర్చలు, తీర్మానాలు ఈ చట్టానికి ఆధారం. భారత రాజ్యాంగ రూపకల్పనలో భాగంగా రాజ్యాంగ నిర్మాతలు సుమారు 70% పైగా అంశాలను ఈ చట్టం నుంచే గ్రహించారు. అందుకే దీన్ని భారత రాజ్యాంగానికి ‘మాతృక’, ‘జిరాక్స్‌ కాపీ’గా పేర్కొంటారు. ఈ చట్టంలో 321 ఆర్టికల్స్, 
10 షెడ్యూల్స్‌ ఉన్నాయి. ఈ చట్టం 1937, ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది.

చట్టంలోని ముఖ్యాంశాలు


అఖిలభారత సమాఖ్య ఏర్పాటు: 

      ఈ చట్టం ద్వారా మనదేశంలో ‘అఖిలభారత సమాఖ్య’ను ప్రతిపాదించారు. ఇందులో 11 రాష్ట్రాలు, 6 చీఫ్‌కమిషనర్‌ ప్రాంతాలు, సమాఖ్యలో చేరడానికి అంగీకరించిన స్వదేశీ సంస్థానాలు ఉంటాయి.

అధికారాల విభజన:

      ఈ చట్టం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 3 రకాల అధికారాల విభజనను పేర్కొన్నారు. అవి:


ఫెడరల్‌ జాబితా: దీనిలో 59 అంశాలు ఉన్నాయి. జాతీయ ప్రాధాన్యం ఉన్న దేశ రక్షణ, కరెన్సీ, రైల్వే, విదేశీ వ్యవహారాలు మొదలైన కీలకాంశాలను ఇందులో పేర్కొన్నారు.

రాష్ట్ర జాబితా: దీనిలో 54 అంశాలు ఉన్నాయి. ప్రాంతీయ ప్రాధాన్యం ఉన్న వ్యవసాయం, నీటిపారుదల, స్థానిక స్వపరిపాలన, విద్య మొదలైన అంశాలను ఈ జాబితాలో చేర్చారు.

ఉమ్మడి జాబితా: దీనిలో 36 అంశాలు ఉన్నాయి. వివాహం, విడాకులు, వారసత్వ హక్కులు మొదలైన అంశాలను ఇందులో పొందుపరిచారు.

కేంద్ర శాసన వ్యవస్థలో సభ్యుల సంఖ్య పెంపు:

      ఈ చట్టం ద్వారా కేంద్ర శాసనశాఖలో ద్విసభా విధానాన్ని కొనసాగిస్తూ, వాటిలో సభ్యుల సంఖ్యను పెంచారు.

కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్స్‌ (Council of states): దీన్ని ఎగువ సభగా పేర్కొంటారు. ఇందులో సభ్యుల సంఖ్యను 260గా నిర్ణయించారు. వీరిలో 1/3వ వంతు సభ్యులను మనదేశంలోని స్వదేశీ సంస్థానాలకు కేటాయించారు.

లెజిస్లేటివ్‌ అసెంబ్లీ (Legislative Assembly): దీన్ని దిగువ సభగా పేర్కొంటారు. ఇందులో సభ్యుల సంఖ్యను 375గా నిర్ణయించారు. వీరిలో 1/3వ వంతు సభ్యులను మనదేశంలోని స్వదేశీ సంస్థానాలకు కేటాయించారు.

రాష్ట్రాల్లో ద్విసభా విధానం:

* భారత ప్రభుత్వ చట్టం, 1935 ద్వారా రాష్ట్రాల్లో ‘ద్విసభా విధానాన్ని’ ప్రవేశపెట్టారు. భారత్‌లో 11 బ్రిటిష్‌పాలిత రాష్ట్రాలు ఉండగా, వాటిలోని 6 రాష్ట్రాల్లో ఈ విధానాన్ని తీసుకొచ్చారు. అవి: అసోం, బెంగాల్, బిహార్, మద్రాస్, ఉత్తర్‌ ప్రదేశ్, బొంబాయి.

*  రాష్ట్రాల్లో ‘లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌’ను ఎగువసభగా, ‘లెజిస్లేటివ్‌ అసెంబ్లీ’ని దిగువసభగా పేర్కొన్నారు.

రాష్ట్రాల్లో ద్వంద్వ పాలనా విధానం రద్దు:

      1919లో ప్రవేశపెట్టిన ‘ద్వంద్వ పాలనా’ విధానాన్ని భారత ప్రభుత్వ చట్టం, 1935 ద్వారా రద్దుచేసి, రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి కల్పించారు. రాష్ట్రాల్లోని రిజర్వ్‌డ్, ట్రాన్స్‌ఫర్డ్‌ జాబితాలను రద్దుచేసి, రాష్ట్ర జాబితాలో ఉన్న 54 అంశాలపై భారతీయ మంత్రులకు అధికారాలు కల్పించారు.

కేంద్రంలో ద్వంద్వ పాలనా విధానం ఏర్పాటు:

     భారత ప్రభుత్వ చట్టం, 1935 ద్వారా కేంద్రంలో ద్వంద్వ పాలనా విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా పాలనాంశాలను 2 రకాలుగా వర్గీకరించారు. అవి:

రిజర్వ్‌డ్‌ అంశాలు: ఇందులో అధికారాలు, ఆదాయవనరులు కలిగిన కీలకాంశాలు ఉన్నాయి. వీటిని గవర్నర్‌ జనరల్‌ నియమించిన ముగ్గురు సభ్యుల కౌన్సిల్‌ సహాయంతో నిర్వహిస్తారు.

ట్రాన్స్‌ఫర్డ్‌ అంశాలు: ఇందులో అంతగా ప్రాధాన్యంలేని అధికారాలు, ఆదాయ వనరులు లేని అంశాలున్నాయి. వీటిని 10 మందికి మించకుండా భారతీయులతో ఏర్పాటు చేసిన మంత్రిమండలి సహాయంతో గవర్నర్‌ జనరల్‌ నిర్వహిస్తారు.

ఫెడరల్‌ కోర్టు ఏర్పాటు:

కేంద్ర, రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాల పరిష్కారం కోసం దిల్లీలో ఫెడరల్‌ కోర్టును ఏర్పాటు చేశారు. ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఆరుగురు ఇతర న్యాయమూర్తులు ఉంటారు. దీనికి మొదటి ప్రధాన న్యాయమూర్తిగా సర్‌ మారిస్‌ గ్వేయర్‌ వ్యవహరించారు. ఈ కోర్టు వెలువరించిన తీర్పులను ఇంగ్లండ్‌లోని ‘‘ప్రీవి’’ (Privy) కౌన్సిల్‌లో అప్పీల్‌ చేసుకోవచ్చు.

ఇతర అంశాలు

* ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం జాతీయ స్థాయిలో ‘ఫెడరల్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’ను రాష్ట్ర స్థాయిలో ‘స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’ను ఏర్పాటు చేశారు.

* భారతదేశం నుంచి ‘బర్మా’ను వేరు చేశారు.

* కొత్తగా ఒడిశా, సింధు రాష్ట్రాలను ఏర్పాటు చేశారు.

* శాసన వ్యవస్థలో షెడ్యూల్డ్‌ కులాలు, మహిళలు, ఇండియన్‌ క్రిస్టియన్లు, యూరోపియన్లు, కార్మికులు, ఆంగ్లో ఇండియన్లకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటుచేసి, కమ్యూనల్‌ ప్రాతినిధ్యాన్ని విస్తృతం చేశారు.

* ‘‘అడ్వకేట్‌ జనరల్‌’’ పదవిని ఏర్పాటు చేశారు. వీరు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన న్యాయసలహాదారులుగా ఉంటారు.

* స్థానిక స్వపరిపాలనకు ప్రాధాన్యం కల్పించి, ప్రాంతీయ పరిపాలనాంశాలను భారతీయ మంత్రుల అధికార పరిధిలోకి తెచ్చారు.

* గవర్నర్‌ జనరల్‌కు విశేషమైన అధికారాలను కల్పించారు. దీని ద్వారా ‘కేంద్ర లెజిస్లేటివ్‌ అసెంబ్లీ’ చేసిన తీర్మానాలపై ‘వీటో’ (Veto) అధికారాన్ని కల్పించారు. అవసరమైతే గవర్నర్‌ జనరల్‌ సంబంధిత తీర్మానాలను బ్రిటిష్‌ రాణి పరిశీలన కోసం ఇంగ్లండ్‌కు పంపొచ్చు.

* రాష్ట్రాలపై కేంద్రం నియంత్రణను తగ్గించారు. గవర్నర్లనే రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధ అధిపతులుగా పరిగణించారు.

* భారత ప్రభుత్వం చట్టం, 1935 ప్రకారం 1937లో 11 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. 8 రాష్ట్రాల్లో భారత జాతీయ కాంగ్రెస్‌ విజయం సాధించగా, మిగిలిన 3 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.

* ఆర్థికపరమైన అంశాలను క్రమబద్ధీకరించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI)ను ఏర్పాటు చేశారు.

ప్రముఖుల విమర్శలు

* ‘‘ఇది కచ్చితంగా పిచ్చిది, సమూలంగా చెడ్డది, మొత్తానికి అనంగీకృతమైంది’’   - మహ్మద్‌ అలీ జిన్నా

* ‘‘మంచి వాహనానికి చక్కటి బ్రేకులు అమర్చి, ముఖ్యమైన ఇంజిన్‌ను బిగించడం మర్చిపోయారు’’     - జవహర్‌లాల్‌ నెహ్రూ

ఆగస్టు ప్రతిపాదనలు

1940, ఆగస్టు 8న అప్పటి భారత గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ లిన్‌లిత్‌గో రాజ్యాంగ సంస్కరణలపై భారతీయులకు ప్రతిపాదనలు చేశారు. వీటినే  ‘ఆగస్టు ప్రతిపాదనలు’ అంటారు. అవి: 

* అన్ని రాజకీయ పార్టీలు, స్వదేశీ సంస్థానాల ప్రతినిధులతో కూడిన యుద్ధ సలహామండలిని ఏర్పాటు చేయడం.

* రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి (Dominion status)తో కూడిన పాక్షిక స్వాతంత్య్రాన్ని కల్పించడం.

* రాజ్యాంగ పరిషత్‌లో అల్పసంఖ్యాక వర్గాలవారికి తగిన ప్రాతినిధ్యం కల్పించడం.

Posted Date : 11-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అంత‌ర్జాతీయ సంబంధాలు

వివిధ దేశాల మధ్య ఏర్పడిన రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశాంగ సంబంధాలను ‘అంతర్జాతీయ సంబంధాలు’ అంటారు. ప్రస్తుత కాలంలో వీటి ప్రాధాన్యం ఎంతో పెరిగింది. ప్రపంచ రాజకీయాల్లో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
* అంతర్జాతీయ సంబంధాలు అనే పదాన్ని మొదటిసారిగా జెర్మీ బెంథామ్‌ అనే రాజనీతి తత్త్వవేత్త ప్రాచుర్యంలోకి తెచ్చారు.
* క్రీ.శ.1648లో జరిగిన ‘వెస్ట్‌ ఫేలియా’ సంధిని అంతర్జాతీయ సంబంధాలకు మూలంగా పేర్కొంటారు. దీని ద్వారా యూరప్‌ ఖండానికి చెందిన స్వతంత్ర దేశాలు తమ దౌత్యవేత్తల ద్వారా ప్రపంచశాంతి స్థాపనకు ముందుకొచ్చాయి.
* మానవజాతి మనుగడను మలుపుతిప్పిన ‘సాంస్కృతిక పునరుజ్జీవనం’ ఫలితంగా వివిధ దేశాల మధ్య ఉండే ప్రాంతీయ సంబంధాలు ‘అంతర్జాతీయ దౌత్య సంబంధాలు’గా ఆచరణలోకి వచ్చాయి.
* 191418 మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయ సమాజం ఒక నిర్దిష్ట రూపాన్ని సంతరించుకుంది.
* ప్రపంచ రాజకీయ సమస్యల పరిష్కారానికి ముఖ్య సాధనంగా అంతర్జాతీయ సంబంధాలు ఏర్పడ్డాయని మార్గెంథో, థామ్సన్‌ పేర్కొన్నారు.
* ‘అంతర్జాతీయ సంబంధాలు’ అనే అంశాన్ని 1919లో తొలిసారిగా ఒక అధ్యయన అంశంగా ‘వేల్స్‌’ విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్టారు. వీటి అధ్యయనం కోసం ‘ఉడ్రో విల్సన్‌’ పేరుతో ఒక ప్రత్యేక పీఠాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని అధిష్ఠించిన తొలి వ్యక్తి ఆల్ఫ్రెడ్‌ జమరిన్‌.
* 1919లో అమెరికాలోని జార్జిటౌన్‌ విశ్వవిద్యాలయంలో; 1924లో సదరన్‌ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో; 1923లో పారిస్‌ విశ్వవిద్యాలయంలో ఇలాంటి పీఠాలను ఏర్పాటు చేశారు.

 

నానాజాతి సమితి పాత్ర
* ప్రపంచ దేశాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఏర్పడిన మొదటి అంతర్జాతీయ సంస్థ నానాజాతి సమితి.
* 1920లో 24 సభ్యదేశాలతో ఇది ఏర్పడింది.
* బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు ఇందులో సభ్యులుగా చేరాయి. కానీ అమెరికా, కెనడా దేశాలు సభ్యత్వం పొందలేదు.

 

ప్రాధాన్యతకు కారణాలు
* రాజకీయ సార్వభౌమత్వం ఉన్న స్వతంత్ర రాజ్యాల ఆవిర్భావం.
* రెండో ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పులు.
* వలసవాదం, సామ్రాజ్యవాదం అంతరించడం.
* అభివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు.
* ప్రపంచంలోని ప్రతి దేశం తన అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నించడం.
* ఉగ్రవాదం, పేదరికం, పర్యావరణ సమస్యలను ఎదుర్కోవడానికి అవసరమైన వ్యూహం కోసం.
* నూతన అంతర్జాతీయ సంస్థల ఆవిర్భావం.
* అగ్రరాజ్యాల వ్యూహాలు, సైనిక విధానాలు.
* ప్రపంచ దేశాల్లో మారుతున్న వైఖరులు.
* అమెరికా, సోవియట్‌ రష్యాల మధ్య జరిగిన ప్రచ్ఛన్నయుద్ధం ముగింపు.
* సోవియట్‌ రష్యా విచ్ఛిన్నం, అమెరికా అగ్రరాజ్యంగా అవతరించడం.


మొదటి ప్రపంచ యుద్ధ ప్రభావం
* మొదటి ప్రపంచయుద్ధం తర్వాత ప్రపంచ దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
* ప్రపంచంలో శాంతి, సామరస్యాలను పరిరక్షించాల్సిన ఆవశ్యకతను అన్ని దేశాలు గుర్తించాయి.
* యుద్ధం ప్రపంచ మానవాళిపై తీవ్ర ప్రభాం చూపింది.
* అగ్రరాజ్యాల సామ్రాజ్యకాంక్ష ప్రస్ఫుటమైంది.
* అపారమైన ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.
* యుద్ధంలో గెలిచిన, ఓడిన దేశాల ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో పడింది.
* ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా దేశాలు తమ ప్రాబల్యాన్ని పెంచుకున్నాయి.
* వివిధ దేశాలు ఏర్పర్చుకున్న ‘రహస్య కూటముల’ వల్ల జరిగిన నష్టాలు ప్రపంచ రాజ్యాలకు అర్థమయ్యాయి.
* యుద్ధాన్ని ఒక ఉన్నతమైన ఆదర్శంగా, జాతీయ పరిశ్రమగా భావించిన జర్మన్లు తీవ్ర సంక్షోభానికి కారణమయ్యారు. యుద్ధానంతరం అపార నష్టానికి, అవమానాలకు గురయ్యారు.
* ఒకే జాతి, ఒకే రాజ్యం అనే సిద్ధాంతం ప్రాతిపదికగా యూరప్‌ దేశాల పునరేకీకరణ జరిగింది.
* అంతర్జాతీయ రాజకీయాల్లో జాతీయవాదం వ్యాప్తిచెంది, ప్రజాస్వామ్య సిద్ధాంతాల ప్రాబల్యం పెరిగింది.
* అప్పటి అమెరికా అధ్యక్షుడైన ఉడ్రో విల్సన్‌ ప్రతిపాదించిన 14 సూత్రాలు ప్రపంచ దేశాల్లో ఆదరణ పొందాయి. ఆ సూత్రాల్లో ఒకటైన జాతుల స్వయం నిర్ణయాధికార సిద్ధాంతం నూతన జాతీయ రాజ్యాల ఆవిర్భావానికి పునాదులు వేసింది.
* బ్రిటన్‌ విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయి.


వర్సయిల్స్‌ సంధి (1919, జనవరి 18)
* పారిస్‌ నగర శివార్లలోని ‘వర్సయిల్స్‌’ రాజభవన ప్రాకారంలో మొదటి ప్రపంచ యుద్ధానికి ముగింపు పలుకుతూ ఓ సమావేశం జరిగింది. ఇందులో యుద్ధానంతర పరిస్థితులను సమీక్షించి, సుస్థిర శాంతిస్థాపన కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో 70 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో యుద్ధంలో ఓడిపోయిన దేశాలపై గెలుపొందిన దేశాలు అవమానకరమైన షరతులు విధించాయి.
* ‘ఓడిపోయిన వారి నెత్తిన గెలిచిన వారు షరతులు విధించడం సహజమే. కానీ, ఈ సమావేశంలో విధించిన షరతులు ఆధునిక చరిత్రలో లేవు’ అని ఇ.హెచ్‌.కార్‌ అనే రాజనీతిజ్ఞుడు వ్యాఖ్యానించారు.


రెండో ప్రపంచ యుద్ధ ప్రభావం
* 1939, సెప్టెంబరు 1న పోలెండ్‌పై జర్మనీ దాడి చేయడంతో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణుబాంబులు ప్రయోగించడంతో జపాన్‌ లొంగిపోయింది. దీంతో రెండో ప్రపంచయుద్ధం ముగిసింది. ఈ యుద్ధం అంతర్జాతీయ సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. వాటిలోని ముఖ్యాంశాలు.
* ఈ యుద్ధం వల్ల ప్రపంచంలోని అనేక దేశాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితమయ్యాయి.
* అక్షరాజ్యాలపై మిత్రరాజ్యాలు విజయం సాధించడంతో ప్రపంచవ్యాప్తంగా నూతన రాజకీయ మార్పులు సంభవించాయి.
* మిత్రరాజ్యాలు యుద్ధకాలంలో ప్రదర్శించిన సమన్వయం, సమైక్యతలను యుద్ధానంతరం ప్రదర్శించలేదు.
* అమెరికా - సోవియట్‌ రష్యాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం ప్రారంభమై ప్రపంచంలో మరోసారి శాంతికి విఘాతం కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి.
* అమెరికా - సోవియట్‌ రష్యాలు అగ్రరాజ్యాలుగా అవతరించి, సైనిక కూటముల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాయి.
* ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని వివిధ వలస పాలిత దేశాల్లో జాతీయోద్యమాలు ఊపందుకున్నాయి. ఆ ఖండాల్లో నూతనంగా స్వాతంత్య్రం పొందిన అనేక దేశాలను సోషలిస్టు భావాలు ఆకర్షించాయి.
* ప్రపంచీకరణ విధానాల ఫలితంగా వివిధ దేశాల మధ్య అంతరాలు తగ్గాయి.
* ప్రపంచ దేశాల మధ్య సమాచార, సాంకేతిక పరిజ్ఞానం, వస్తుసేవలు, పెట్టుబడుల అనుసంధానత పెరిగింది.
* బహుళజాతి సంస్థలు అవతరించి, ప్రాబల్యంలోకి వచ్చాయి.
* అలీన విధానం అనేక దేశాల విదేశాంగ విధానంగా అవతరించింది.


అంతర్జాతీయ సంబంధాలు - కీలక ఘట్టాలు
వెస్ట్‌ ఫేలియా సంధి (1648): ఇది ప్రొటెస్టెంట్లు, కేథలిక్‌లకు మధ్య జరిగిన శాంతియుత సంధి. దీని ప్రకారం హాలెండ్, స్విట్జర్లాండ్‌లు స్వతంత్ర గణతంత్ర రాజ్యాలుగా గుర్తింపు పొందాయి. ఈ సంధి ఫలితంగా ఇంగ్లండ్, ఫ్రాన్స్, స్వీడన్‌లు అగ్రరాజ్యాలుగా అవతరించాయి.
యుటెరిచ్‌ సంధి (1713): * ఈ సంధి వల్ల ‘శక్తి సమతౌల్యం’ ప్రధాన సిద్ధాంతంగా అవతరించింది. దీని అమలుకు ఇంగ్లండ్‌ - ఆస్ట్రియాలు నాయకత్వం వహించాయి. ఫ్రాన్స్‌ తీవ్ర నష్టానికి గురైంది. ప్రష్యా ఏకీకరణకు బలమైన పునాది పడింది. ప్రష్యా ఏకీకరణ జరిగి, ‘ఫ్రెడరిక్‌ ది గ్రేట్‌’ నాయకత్వంలో శక్తిమంతమైన రాజ్యంగా అవతరించింది. 
వియన్నా కాంగ్రెస్‌ (1815): * మెటర్నిక్, టెల్లిరాండ్‌ అనే ఇద్దరు వ్యక్తుల వ్యూహం వియన్నా కాంగ్రెస్‌గా చరిత్రలో నిలిచిపోయింది. దీని ద్వారా ఫ్రాన్స్, దాని పొరుగు దేశాల మధ్య రక్షణరేఖను ఏర్పర్చారు. పోలెండ్‌ను ప్రష్యా, ఆస్ట్రియా, రష్యాలు తమలో తాము విభజించి పంచుకున్నాయి.
క్రిమియా యుద్ధం (1854-56): * కాన్‌స్టాంటినోపుల్‌పై ఆధిపత్యం కోసం ఈ యుద్ధం జరిగింది. ఇందులో రష్యాపై బ్రిటన్, ఫ్రాన్స్‌ దేశాలు ఉమ్మడిగా పోరాడి విజయం సాధించాయి. రష్యా ఓడి నష్టపోయింది.


ఫ్రాంకో - ప్రష్యన్‌ యుద్ధం (1870 - 71)
* ఈ యుద్ధం ప్రష్యా, ఫ్రాన్స్‌కు మధ్య జరిగింది. ఇందులో ఫ్రాన్స్‌ ఓడింది. బిస్మార్క్‌ నాయకత్వంలో ప్రష్యా శక్తిమంతమైంది. యూరప్‌లో జర్మనీ అగ్రరాజ్యంగా అవతరించింది. ఫ్రాన్స్‌ ప్రాబల్యం తగ్గింది.

 

నమూనా ప్రశ్నలు
1. అంతర్జాతీయ సంబంధాలు అనే పదాన్ని మొదటిసారిగా ప్రాచుర్యంలోకి తెచ్చిన రాజనీతి తత్వవేత్త ఎవరు?
1) జెర్మీ బెంథామ్‌       2) జీన్‌బోడిన్‌ 
3) అరిస్టాటిల్‌       4) హెచ్‌.జె.లాస్కి


2. 1919లో ఏ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ సంబంధాలను ఒక అధ్యయన అంశంగా ప్రవేశపెట్టింది?
1) పారిస్‌ విశ్వవిద్యాలయం 
2) సదరన్‌ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం 
3) ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం 
4) వేల్స్‌ విశ్వవిద్యాలయం


3. 1920లో ఏర్పడిన ‘నానాజాతి సమితి’లో సభ్యత్వం లేని దేశాన్ని గుర్తించండి.
1) బ్రిటన్‌        2) అమెరికా 
3) ఫ్రాన్స్‌        4) జర్మనీ


4. యుద్ధాన్ని ఒక ఉన్నతమైన ఆదర్శంగా, జాతీయ పరిశ్రమగా భావించిన ఏ దేశస్థులు మొదటి ప్రపంచ యుద్ధానంతరం అవమానాలకు గురయ్యారు?
1) అమెరికా        2) జపాన్‌         3) జర్మనీ        4) ఇటలీ


5. అమెరికా మాజీ అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌ ప్రతిపాదించిన సూత్రాలు ఎన్ని?
1) 12      2) 14      3) 21      4) 41 


6. ‘జాతుల స్వయం నిర్ణయాధికార సిద్ధాంతాన్ని’ ప్రతిపాదించింది ఎవరు?
1) విన్‌స్టన్‌ చర్చిల్‌       2) జార్జి వాషింగ్టన్‌ 
3) ఉడ్రో విల్సన్‌         4) అడాల్ఫ్‌ హిట్లర్‌


7. ‘ఓడిపోయిన వారి నెత్తిన గెలిచినవారు షరతులు విధించడం సహజమే, కానీ వర్సయిల్స్‌ సంధి సమావేశంలో విధించిన షరతులు ఆధునిక చరిత్రలో లేవు’ అని వ్యాఖ్యానించిన రాజనీతి తత్వవేత్త ఎవరు?
1) ఈ.హెచ్‌.కార్‌    2) రాబర్ట్‌ హాక్‌         3) జీన్‌ బోడిన్‌       4) థామస్‌ హాబ్స్‌


8. అంతర్జాతీయ సంబంధాలపై రెండో ప్రపంచయుద్ధ ప్రభావాన్ని గుర్తించండి.
1) అలీన విధానం అనేక దేశాల విదేశాంగ విధానంగా రూపొందింది.
2) ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని వలసపాలిత దేశాల్లో జాతీయోద్యమాలు ప్రారంభమయ్యాయి.
3) బహుళజాతి సంస్థలు అవతరించి, ప్రాబల్యంలోకి వచ్చాయి.
4) పైవన్నీ 


9. 1648లో జరిగిన ఏ సంధి ఫలితంగా హాలెండ్, స్విట్జర్లాండ్‌లు స్వతంత్ర గణతంత్ర రాజ్యాలుగా అవతరించాయి?
1) వెస్ట్‌ ఫేలియా సంధి            2) యుటెరిచ్‌ సంధి  
3) ఫ్రాంకో సంధి         4) వర్సయిల్స్‌ సంధి


సమాధానాలు: 1-1, 2-4, 3-2, 4-3, 5-2, 6-3, 7-1, 8-4, 9-1.

Posted Date : 24-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అంతర్జాతీయ సంస్థలు

ప్రపంచ దేశాల మధ్య సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సహకారాన్ని సాధించేందుకు, విశ్వమానవాళి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, మానవ హక్కుల పరిరక్షణకు, పర్యావరణాన్ని కాపాడేందుకు వివిధ అంతర్జాతీయ సంస్థలను స్థాపించారు. ఇవి ప్రపంచ దేశాల మధ్య సమన్వయాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాయి.


యూనివర్సిటీ ఫర్‌ పీస్‌
* ప్రపంచ దేశాల మధ్య నిరాయుధీకరణను సాధించడం, వివిధ దేశాల మధ్య తలెత్తే సమస్యలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించడం, అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడం దీని ప్రధాన లక్ష్యాలు.
* 1980లో కోస్టారికా కేంద్రంగా యూనివర్సిటీ ఫర్‌ పీస్‌ను నెలకొల్పారు. ఇది మానవ హక్కులు, శాంతి, విద్య మొదలైన అంశాలపై విశేష పరిశోధనలు నిర్వహిస్తోంది.


బ్రెట్టన్‌ ఉడ్స్‌ కవలలు
* 1944, జులై 22న యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికాలోని న్యూహాంప్‌షైర్‌ రాష్ట్రంలోని బ్రెట్టన్‌ ఉడ్స్‌ నగరంలో  UN Monetary and Financial Conference జరిగింది. ఇందులో ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలను ఏర్పాటు చేసే ఒప్పందం కుదిరింది.
* వీటిని బ్రెట్టన్‌ ఉడ్స్‌ కవలలు అంటారు.


ప్రపంచ బ్యాంక్‌ (World Bank) 
ఇది రెండు విభాగాలను కలిగి ఉంది.
*  International Bank for Reconstruction and Development (IBRD)
* International Development Association (IDA) 

* వీటికి అనుబంధంగా మరో 3 ప్రత్యేక విభాగాలున్నాయి. అవి:
* International Finance Corporation (IFC)
* Multilateral Investment Guarantee Agency (MIGA)
* International Centre for Settlement of Investment Disputes (ICSID) 

* అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఆర్థిక వనరులను సమీకరించి, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు ప్రపంచబ్యాంక్‌ కృషి చేస్తోంది. దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్‌ డి.సి.లో ఉంది.


అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (International Monetary Fund)
* అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌)ను 1944, జులై 22న స్థాపించారు. ఇది 1945, డిసెంబరు 27 నుంచి అమల్లోకి వచ్చింది. అంతర్జాతీయ ద్రవ్య, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం, అంతర్జాతీయ వాణిజ్యాభివృద్ధితో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలను పెంపొందించడం, వాస్తవ ఆదాయవృద్ధికి ప్రణాళికలు రూపొందించడం, సభ్యదేశాల్లో ఉత్పత్తి వనరుల పెరుగుదలకు కృషి చేయడం దీని ముఖ్య ఉద్దేశాలు. ఐఎంఎఫ్‌ ప్రధాన కార్యాలయం వాషింగ్టన్‌ డి.సి.లో ఉంది.


ప్రపంచ వాణిజ్య సంస్థ  (World Trade Organisation) 
* ప్రపంచ దేశాల మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 1948లో GATT (General Agreement on Tariffs and Trade) ఏర్పడింది. ఇది 1995, జనవరి 1న ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)గా అవతరించింది.
* వస్తువులు, సేవలు, ఇతర విషయాల్లో సభ్యదేశాల మధ్య స్వేచ్ఛా, వాణిజ్య నిబంధనలను వర్తింపజేయడం, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య అభివృద్ధిని, ఆర్థికపరమైన సంస్కరణలను ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవా (స్విట్జర్లాండ్‌)లో ఉంది.


ఇంటర్‌ పోల్‌ (International Criminal Police Organisation) 
* 1914లో మొరాకోలోని మాంటెకార్లో వద్ద మొదటి అంతర్జాతీయ క్రిమినల్‌ పోలీస్‌ కాంగ్రెస్‌ సమావేశం జరిగింది. ఇందులో బెల్జియం దేశానికి చెందిన ప్రిన్స్‌ ఆల్బర్డ్‌ - I ఇంటర్‌పోల్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
* ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ పోలీస్‌ కమిషన్ (ICPC) వియన్నా (ఆస్ట్రియా)లో 1923లో 20 సభ్యదేశాలతో ప్రారంభమైంది.
* 1930లో  ICPC  సెక్రటేరియట్‌ను వియన్నాలో ఏర్పాటు చేశారు.
* 1956లో జరిగిన 25వ సమావేశంలో ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ పోలీస్‌ కమిషన్‌ (ICPC)ను ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ పోలీస్‌ ఆర్గనైజేషన్‌ (ICPO) గా మార్చారు. దీని సంకేతాన్ని  INTERPOL గా గుర్తించారు.
* ఇంటర్‌పోల్‌కు 1996లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో పరిశీలక హోదాను కల్పించారు.
* ఇంటర్‌పోల్‌ ప్రధాన కార్యాలయం లయోన్స్‌ (ఫ్రాన్స్‌)లో ఉంది. దీని అధికారిక భాషలు: ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్‌. 

 

అంతర్జాతీయ నేర న్యాయస్థానం (International Criminal Court) 
* యుద్ధ నేరాలపై విచారణ జరిపే లక్ష్యంతో 2002, జులై 1న అంతర్జాతీయ నేర న్యాయస్థానాన్ని (ఐసీసీ) ఏర్పాటు చేశారు. మానవ సమూహాల పట్ల ఘోరమైన నేరాలు, యుద్ధనేరాలపై విచారణ జరిపే అధికారం దీనికి ఉంది.
* హత్యలు, చిత్రహింసలు, అత్యాచారాలతో సహా మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడేవారు, దేశాధినేతలు మొదలు సామాన్య పౌరుల వరకు ఎవరిపైనైనా విచారణ జరిపే అధికారం దీనికి ఉంది.
* ఐసీసీ ఏర్పాటును సమర్థించిన దేశాల్లోని కోర్టులు విచారణ జరపలేని, తీవ్రనేరాలకు సంబంధించిన కేసుల్ని దీనికి నివేదించొచ్చు. వాటిపై ఐసీసీ విచారణ చేపడుతుంది.
* 1998, జులైలో రోమ్‌ నగరంలో జరిగిన సమావేశంలో ఐసీసీ ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందంపై 139 దేశాలు సంతకాలు చేశాయి. ఐసీసీ అమల్లోకి రావాలంటే వీటిలోని 60 దేశాలు గెజిట్‌ నోటిఫికేషన్‌ను వెలువరించాలని నిర్దేశించారు.
* 2002, జూన్‌ నాటికి 66 దేశాలు రోమ్‌ ఒప్పందాన్ని ధ్రువీకరించాయి. 2002, జులై 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీని ప్రధాన కార్యాలయం ది హేగ్‌ (నెదర్లాండ్స్‌)లో ఉంది.


యునైటెడ్‌ నేషన్స్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ 
* 1964, డిసెంబరు 30న  United Nations Conference on Trade and Development - UNCTAD ని ఏర్పాటుచేశారు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో తీర్మానం ద్వారా దీన్ని నెలకొల్పారు. యూఎన్‌ఓ సభ్యదేశాలన్నీ దీనికి ప్రాతినిధ్యం వహిస్తాయి. 
* ఈ సంస్థ ప్రతి నాలుగేళ్లకోసారి సభ్యదేశ రాజధానిలో సమావేశమవుతుంది. దీని ప్రధాన కార్యాలయం జెనీవా (స్విట్జర్లాండ్‌)లో ఉంది.


లక్ష్యాలు:
* అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం.
* అభివృద్ధి చెందుతున్న వర్ధమాన దేశాల్లో త్వరితగతిన ఆర్థిక ప్రగతికి కృషి చేయడం.
* అభిలషణీయమైన వాణిజ్యాభివృద్ధి విధానాలను రూపొందించి అమలు చేయడం.
* వాణిజ్యానికి సంబంధించి వివిధ యూఎన్‌ఓ సంస్థలను సమన్వయపరచడం.
* ప్రభుత్వాల వాణిజ్యాభివృద్ధి విధానాలను, వివిధ ప్రాంతీయ, ఆర్థిక సంస్థలను సమన్వయపరచడం. 


ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ 
* 1973లో అరబ్‌ దేశాలు చమురు ఎగుమతిని ఆపేయడంతో వాటి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఫలితంగా అనేక దేశాలు సమస్యలను ఎదుర్కొన్నాయి.
* దీంతో చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే (OECD - ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ కో ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) దేశాలన్నీ 1974లో పారిస్‌ (ఫ్రాన్స్‌)లో ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ)ను ఏర్పాటు చేశాయి.
* శక్తి (ఎనర్జీ)కి సంబంధించి ఏర్పడే సంక్షోభాలపై సభ్యదేశాల మధ్య సమన్వయం సాధించడం, చమురు సరఫరాలోని అవరోధాలను అధిగమించడం ఈ సంస్థ లక్ష్యాలు.


ఇంటర్నేషనల్‌ కమిటీ ఆఫ్‌ ది రెడ్‌క్రాస్‌ (ICRC)
* 1859లో ఆస్ట్రియా, ఫ్రాన్స్‌ దేశాల మధ్య సాల్‌ఫెరినో యుద్ధం జరిగింది. ఇందులో గాయపడిన సైనికులకు స్విట్జర్లాండ్‌ దేశానికి చెందిన మానవతావాది జీన్‌ హెన్రీ డ్యునాంట్‌ అత్యవసర సహాయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈయన కృషి ఫలితంగా 1864లో ఇంటర్నేషనల్‌ కమిటీ ఆఫ్‌ది రెడ్‌క్రాస్ (ICRC) అమల్లోకి వచ్చింది.
* హెన్రీ డ్యునాంట్‌ 1862లో ఎ మెమొరీ ఆఫ్‌ సాల్‌ఫెరినో గ్రంథాన్ని రాశారు. ఇందులో ప్రపంచంలోని అన్ని దేశాల్లో వాలంటరీ రిలీఫ్‌ సొసైటీలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
* 1864లో జరిగిన జెనీవా సదస్సులో మిత్రుడైనా, శత్రువైనా యుద్ధంలో గాయపడిన వారికి సహాయం అందించాలని ఇందులో పాల్గొన్న అనేక దేశాలు తీర్మానించాయి.
* రెడ్‌క్రాస్‌ ప్రాయోజిత దేశాల్లో క్రిస్టియన్‌ దేశాలు రెడ్‌క్రాస్‌ను అదే పేరుతో పిలుస్తుండగా, ముస్లిం దేశాలు రెడ్‌ క్రీసెంట్‌ పేరుతో పిలుస్తున్నాయి.
* 1917, 1944, 1963లో  ICRC కి నోబెల్‌ శాంతి బహుమతి లభించింది.
* దీని ప్రధాన కార్యాలయం జెనీవా (స్విట్జర్లాండ్‌)లో ఉంది.


లక్ష్యాలు: 
* అంతర్గత హింస నియంత్రణకు కృషి చేయడం.
* యుద్ధంలో క్షతగాత్రులైన బాధితులకు సహాయం అందించడం.
* మానవతావాదాన్ని ప్రవచించే సిద్ధాంతాల అమలుకు కృషిచేయడం.

Posted Date : 20-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఐక్యరాజ్య సమితి

రెండో ప్రపంచయుద్ధం తర్వాత 1945, అక్టోబరు 24న ‘ఐక్యరాజ్యసమితి’  (United Nations Organisation) ఏర్పడింది. ఏటా ఇదే రోజున ఐక్యరాజ్యసమితి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచశాంతి పరిరక్షణ, అంతర్జాతీయ సహకారం, ప్రపంచ దేశాల మధ్య సమన్వయం, వివిధ సమస్యలను శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకోవడం దీని ప్రధాన లక్ష్యాలు. 


నేపథ్యం
* ఐక్యరాజ్యసమితి ఏర్పాటుకు ‘అట్లాంటిక్‌ చార్టర్‌’ కారణం. దీనిపై 1941, ఆగస్టు 14న అప్పటి బ్రిటన్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ డి.రూజ్‌వెల్ట్‌ సంతకాలు చేశారు.
* యునైటెడ్‌ నేషన్స్‌ అనే పదాన్ని 1942లో ఫ్రాంక్లిన్‌ డి.రూజ్‌వెల్ట్‌ సూచించారు.
* 1944లో ‘డంబర్టన్‌ ఓక్స్‌’ వద్ద జరిగిన సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా దేశాల ప్రతినిధులు విస్తృత సంప్రదింపులు జరిపిన అనంతరం ‘ఐక్యరాజ్యసమితి’ అనే అంతర్జాతీయ సంస్థను నెలకొల్పాలని నిర్ణయించారు.
* 1945, జూన్‌ 26న శాన్‌ఫ్రాన్సిస్కోలో 50 దేశాలు సమావేశమై ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను రూపొందించి, సంతకాలు చేశాయి. ఇందులో పోలెండ్‌ పాల్గొన లేదు. తర్వాత చార్టర్‌పై సంతకం చేసి, 51వ సభ్యదేశంగా చేరింది. భారత్‌ 1945 నుంచి ఇందులో సభ్యదేశంగా కొనసాగుతోంది.
* ఐక్యరాజ్యసమితిలో స్విట్జర్లాండ్ (190); తూర్పు తైమూర్‌ (191) వ సభ్యదేశంగా  చేరాయి. 2006, జూన్‌ 28న మాంటెనిగ్రో (192); 2011, జులై 9న దక్షిణ సూడాన్‌ 193వ సభ్యదేశంగా చేరాయి. 
* ఐక్యరాజ్యసమితిలో వాటికన్‌ సిటీ, తైవాన్‌లకు సభ్యత్వం లేదు.
* ఐక్యరాజ్యసమితి సాధారణ సభ  (General Assembly) తొలి సమావేశం 1946, జనవరి 10న లండన్‌లో జరిగింది.
* ఐక్యరాజ్యసమితి రాజ్యాంగంలోని ప్రవేశిక ముసాయిదాను దక్షిణాఫ్రికా దేశానికి చెందిన జాన్‌ క్రిస్టియాన్‌ రూపొందించారు.
* ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం  అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది. దీని  నిర్మాణానికి అవసరమైన భూమిని జాన్‌.డి.రాక్‌ఫెల్లర్‌ సమకూర్చారు.
* ఐక్యరాజ్యసమితి అధికార భాషలు ఇంగ్లిష్, ఫ్రెంచ్, రష్యన్, అరబిక్, స్పానిష్, చైనీస్‌.


జెండా
* ఐక్యరాజ్యసమితి జెండాను 1947, అక్టోబరు 20న సాధారణ సభ ఆమోదించింది.  జెండా వెనుకభాగం మొత్తం లేత నీలంరంగులో ఉండి, దానిపై తెల్లరంగు గ్లోబు ఉంటుంది. గ్లోబుకు రెండువైపులా శాంతికి చిహ్నమైన రెండు ఆలివ్‌కొమ్మలు ఉంటాయి. జెండా పొడవు, వెడల్పుల నిష్పత్తి 3 : 2.
* 2001లో ఐక్యరాజ్యసమితికి, దాని సెక్రటరీ జనరల్‌ కోఫీ అన్నన్‌కు నోబెల్‌ శాంతి బహుమతి లభించింది.


ప్రధాన అంగాలు
ఐక్యరాజ్యసమితిలో ప్రధాన అంగాలు 6. అవి:
1) సాధారణ సభ    2) భద్రతా మండలి 
3) ఆర్థిక, సామాజిక మండలి 
4) ధర్మకర్తృత్వ మండలి 
5) అంతర్జాతీయ న్యాయస్థానం 
6) సచివాలయం


సాధారణ సభ: ఐక్యరాజ్యసమితిలోని సభ్యదేశాలన్నీ సాధారణ సభలో సభ్యదేశాలుగా కొనసాగుతున్నాయి. ప్రతి సభ్యదేశం ఈ సభకు అయిదుగురు ప్రతినిధులను పంపుతుంది. కానీ తీర్మానాలపై ఓటింగ్‌ సమయంలో దేశానికి ఒకే ఓటు ఉంటుంది. సాధారణ సభ సమావేశాలు ఏటా సెప్టెంబరు మూడో మంగళవారం ప్రారంభమవుతాయి. భద్రతామండలి సిఫార్సుల మేరకు  సాధారణ సభ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తారు. దీని అధ్యక్ష, ఉపాధ్యక్షుల పదవీకాలం ఒక సంవత్సరం. 
* సాధారణ సభకు అధ్యక్షురాలిగా వ్యవహరించిన తొలి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిట్‌. ఈ సభలో ఏదైనా కీలక తీర్మానం ఆమోదం పొందాలంటే 2/3 వంతు ప్రత్యేక మెజారిటీ అవసరం.


సాధారణ సభ - అధికారాలు, విధులు
* యూఎన్‌ఓ చార్టర్‌లోని అన్ని అంశాలను చర్చించడం, బడ్జెట్‌ను ఆమోదించడం.
* యూఎన్‌ఓలో నూతన సభ్యదేశాలను చేర్చుకోవడం.
* యూఎన్‌ఓ ద్వారా ఏర్పాటైన వివిధ కమిటీలు ఇచ్చే నివేదికలను పరిశీలించి, వాటిని ఆమోదించడం.
* ప్రపంచ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి, పరిష్కరించడం.
* అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల నియామకానికి సిఫార్సులు చేయడం.
* భద్రతామండలికి తాత్కాలిక సభ్యదేశాలను ఎన్నుకోవడం.
* ప్రపంచ పార్లమెంట్‌గా వ్యవహరించడం.


భద్రతామండలి (Security Council): 
భద్రతామండలిలో మొత్తం 15 సభ్య దేశాలుంటాయి. వీటిలో శాశ్వత సభ్యదేశాలు అయిదు. అవి: అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా. ఈ దేశాలకు వీటో అధికారం ఉంటుంది. మిగిలిన 10 తాత్కాలిక సభ్యదేశాలు. వీటిని రెండేళ్ల పదవీకాలానికి 2/3 ప్రత్యేక మెజార్టీతో   సాధారణ సభ ఎన్నుకుంటుంది.
* తాత్కాలిక సభ్యదేశాల్లో ఆసియా, ఆఫ్రికా నుంచి అయిదు, లాటిన్‌ అమెరికా నుంచి రెండు, పశ్చిమ యూరప్‌ నుంచి రెండు, తూర్పు యూరప్‌ నుంచి ఒక దేశాన్ని ఎంపిక చేస్తారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తారు.
* భద్రతామండలి అధ్యక్ష పదవిని సభ్యదేశాలు ఆంగ్లవర్ణమాల ప్రకారం రొటేషన్‌ పద్ధతిలో నెలకోసారి నిర్వహిస్తాయి.
* 1988లో భద్రతామండలికి నోబెల్‌ శాంతి బహుమతి లభించింది.
* భారతదేశం భద్రతామండలిలో 1951, 1967, 1972, 1977, 1984, 1991, 2011, 2021లో తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైంది.


ఆర్థిక, సామాజిక మండలి  (Economic and Social Council): ఇందులోని సభ్యదేశాలు 54. వీటిని సాధారణ సభ 2/3వ వంతు ప్రత్యేక మెజారిటీతో ఎన్నుకుంటుంది. వీటి పదవీకాలం మూడేళ్లు. ఏటా 1/3వ వంతు సభ్య దేశాలు పదవీ విరమణ చేస్తాయి.
* ఆర్థిక, సామాజిక మండలి సంవత్సరానికి కనీసం మూడుసార్లు సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఇవి న్యూయార్క్, జెనీవా నగరాల్లో జరుగుతాయి.
* ఈ మండలి పేదరికం, నిరక్షరాస్యత నిర్మూలన; అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విద్య, ఆరోగ్య వ్యవహారాలకు  సంబంధించి సాధారణసభకు బాధ్యత వహిస్తుంది.
* ఆర్థిక, సామాజిక మండలి తన కార్యకలాపాల నిర్వహణకు కొన్ని ప్రాంతీయ కమిషన్లను ఏర్పాటు చేసింది. అవి:
* జెనీవా ప్రధాన కార్యాలయంగా యూరప్‌ ఆర్థిక కమిషన్‌  (ECF). 
* బ్యాంకాక్‌ ప్రధాన కార్యాలయంగా ఆసియా, పసిఫిక్‌ దేశాల ఆర్థిక, సామాజిక కమిషన్‌ (ESCAP).
* శాంటియాగో (చిలీ) ప్రధాన కార్యాలయంగా లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ దేశాల ఆర్థిక కమిషన్‌  (ECLAC). 
*  అడీస్‌ అబాబా (ఇథియోపియా) ప్రధాన కార్యాలయంగా ఆఫ్రికా ఆర్థిక కమిషన్‌ (ECA). 
* అమ్మాన్‌ (జోర్డాన్‌) ప్రధాన కార్యాలయంగా పశ్చిమాసియా ఆర్థిక సామాజిక కమిషన్‌ (ESCWA). 


ధర్మకర్తృత్వ మండలి (Trusteeship Council): 
* ఇతర దేశాల పాలన కింద కొనసాగే భూభాగాల ప్రయోజనాలను పరిరక్షించే ఉద్దేశంతో ఈ మండలిని ఏర్పాటు చేశారు. సంబంధిత భూభాగాలకు స్వాతంత్య్రం కల్పించడం లేదా వాటిని స్వపరిపాలనకు సిద్ధం చేసేందుకు ఇది కృషి చేస్తుంది. 1994 నాటికి దీని పర్యవేక్షణలోని సుమారు 11 భూభాగాలు స్వతంత్రంగా మారాయి లేదా ఏదో ఒక స్వతంత్ర దేశంలో విలీనమయ్యాయి. దీని ఫలితంగా ప్రస్తుతం ఈ మండలి నామమాత్రంగా మిగిలింది. ఇందులో ఎలాంటి సమావేశాలు జరగడం లేదు.


అంతర్జాతీయ న్యాయస్థానం  (International court of Justice): 
* ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను అనుసరించి 1945లో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం ది హేగ్‌ (నెదర్లాండ్స్‌)లో ఉంది. ఈ న్యాయస్థానంలో  15 మంది న్యాయమూర్తులు ఉంటారు. వీరి పదవీకాలం తొమ్మిదేళ్లు. న్యాయమూర్తులను సాధారణ సభ, భద్రతామండలి ఎన్నుకుంటాయి. ప్రతి మూడేళ్లకోసారి 1/3వ వంతు న్యాయమూర్తులు పదవీ విరమణ చేస్తారు. అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్ష, ఉపాధ్యక్షులను మూడేళ్ల పదవీకాలానికి ఎన్నుకుంటారు.
* అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తి పదవి చేపట్టిన భారతీయులు నలుగురు.
1) బెనగళ్‌ నరసింగరావు       2) కె.నాగేంద్రసింగ్‌
3) రఘునందన్‌ స్వరూప్‌ పాఠక్‌ 
4) దల్వీర్‌ భండారీ (ప్రస్తుతం కొనసాగుతున్నారు.)
* అంతర్జాతీయ న్యాయస్థానానికి తొలి మహిళా అధ్యక్షురాలు: రోజాలిన్‌ హిగ్గిన్స్‌ (బ్రిటన్‌).
* అంతర్జాతీయ న్యాయస్థానానికి భారత్‌కు చెందిన కె.నాగేంద్రసింగ్‌ అధ్యక్షులుగా, రఘునందన్‌ స్వరూప్‌ పాఠక్‌ ఉపాధ్యక్షులుగా వ్యవహరించారు.
* అంతర్జాతీయ న్యాయస్థాన అధికారిక భాషలు: ఇంగ్లిష్, ఫ్రెంచ్‌
* ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య తలెత్తే న్యాయ సంబంధ సమస్యలను విచారించి, అంతర్జాతీయ న్యాయస్థానం కీలక తీర్పులు ఇస్తుంది. ఈ తీర్పులను అంతిమంగా పరిగణిస్తారు. వీటిపై అప్పీలు చేసుకునే అవకాశం ఉండదు. అయితే కొన్ని ప్రత్యేకాంశాల విషయంలో తీర్పు వచ్చిన పదేళ్లలోపు పునఃపరిశీలనకు నివేదించవచ్చు.


సచివాలయం  (Secretariat):
* ఇది ఐక్యరాజ్యసమితి పాలనా కేంద్రం. సెక్రటరీ జనరల్‌ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సచివాలయానికి ముఖ్య కార్యనిర్వాహకులు సెక్రటరీ జనరల్‌. వీరి పదవీకాలం అయిదు సంవత్సరాలు. భద్రతామండలి సిఫార్సుల మేరకు సాధారణ సభ సెక్రటరీ జనరల్‌ను నియమిస్తుంది.


డిప్యూటీ సెక్రటరీ జనరల్‌:  యూఎన్‌ఓ డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ పదవిని 1998లో ఏర్పాటు చేశారు. తొలి డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా కెనడా దేశానికి చెందిన లూయిస్‌ ప్రిచెట్టి ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ పదవిలో నైజీరియా దేశానికి చెందిన అమీనా జె మహ్మద్‌ కొనసాగుతున్నారు.


సెక్రటరీ జనరల్స్‌

పేరు దేశం పదవీకాలం
1. ట్రిగ్వేలి నార్వే 1946 - 1953
2. దాగ్‌ హమ్మర్‌షీల్డ్‌ స్వీడన్‌ 1953 - 1961
3. యుథాంట్ మయన్మార్ 1961 - 1971
4. కుర్దు వాల్దీమ్‌ ఆస్ట్రియా 1972 - 1982
5. జేవియర్‌ పెరేజ్‌ డిక్యులర్ పెరూ 1982 - 1992
6. బౌత్రోస్ ఘలీ ఈజిప్ట్‌ 1992 - 1997
7. కోఫీ అన్నన్‌ ఘనా 1997 - 2007
8. బాన్‌కీ మూన్‌ దక్షిణ కొరియా 2007 - 2017
9. ఆంటోనియో గుటెరస్‌ పోర్చుగల్ 2017 నుంచి కొనసాగుతున్నారు.

 

ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు
ప్రపంచశాంతి, ప్రగతి సాధన కోసం వివిధ దేశాల్లోని ఆయా అంశాలను సమన్వయం చేసేందుకు ఐక్యరాజ్యసమితి అనేక అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలను నిర్దిష్ట ప్రణాళికలతో పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.


ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల నిధి (United Nations International Children’s Fund - UNICEF) 
రెండో ప్రపంచయుద్ధం తర్వాత బాలలకు అన్ని రకాలుగా సహకరించే లక్ష్యంతో 1946లో ‘ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి’ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీన్ని ‘ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల నిధి’గా పిలుస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని బాలల సమగ్రాభివృద్ధికి ఇది కృషి చేస్తోంది. అనేక వర్థమాన దేశాల్లో బాలల ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం అందించడం, రోగ నియంత్రణ లాంటి కార్యక్రమాలను చేపడుతోంది. బాలలను ఎదుగుతున్న పౌర సమాజంగా అభివృద్ధి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలల స్థితిగతులపై యునిసెఫ్‌ ఏటా ఒక నివేదికను ప్రచురిస్తుంది. దీనికి 1965లో నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది.


ఐక్యరాజ్యసమితి విద్యా, వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ  (United Nations Educational Scientific and Cultural Organisation - UNESCO) 
యునైటెడ్‌ కింగ్‌డమ్, ఫ్రాన్స్‌ దేశాలు విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థను స్థాపించేందుకు 1945లో సమావేశమయ్యాయి. దీని ఫలితంగా 1946, నవంబరు 4న యునెస్కో ఏర్పడింది.  దీన్ని 1946, డిసెంబరులో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సంస్థగా గుర్తించింది. యునెస్కో విద్యా, సైన్స్, సమాచార ప్రసారాలు, సాంస్కృతిక రంగాల్లో సహకరించడం ద్వారా అంతర్జాతీయ సమన్వయాన్ని సాధించి, ప్రపంచ శాంతికి కృషిచేస్తోంది. ఇది మేధోపరమైన సహకారాన్ని పెంపొందించేందుకు అనేక ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది.

* అందరికీ ప్రాథమిక విద్యను అందించడం; ప్రాథమిక విద్యా వ్యాప్తికి చేసే సాయాన్ని విస్తరించడం, ప్రాథమిక విద్యా ప్రమాణాలను విస్తరించడం, పెంపొందించడం; 21వ శతాబ్దానికి సార్వజనీన విద్యను సాధించడం యునెస్కో లక్ష్యాలు.
* అంతర్జాతీయ విద్యా ప్రణాళిక సంస్థ (IIEP), అంతర్జాతీయ విద్యా బ్యూరో  (IBE) , యునెస్కో పరిధిలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నాయి. శిక్షణ, పరిశోధనా రంగాల అభివృద్ధి కోసం 1963లో పారిస్‌ కేంద్రంగా ఐఐఈపీ ఏర్పడింది. ఐబీఈ 1969లో యునెస్కోలో అంతర్భాగమైంది.
* శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సహకారం అందించేందుకు యునెస్కో కైరో, జకార్తా, నైరోబీ, వెనిస్, న్యూదిల్లీలో తన కార్యాలయాలను ఏర్పాటు చేసింది. దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఉంది.
* యునెస్కోలో జనరల్‌ కాన్ఫరెన్స్, ఎగ్జిక్యూటివ్‌ బోర్డులు కీలకమైనవి. ఎగ్జిక్యూటివ్‌ బోర్డులోకి 58 దేశాలను 4 సంవత్సరాల పదవీ కాలానికి జనరల్‌ కాన్ఫరెన్స్‌  ఎన్నుకుంటుంది. జనరల్‌ కాన్ఫరెన్స్‌లో యూఎన్‌ఓలోని సభ్యదేశాలన్నీ సభ్యులుగా ఉంటాయి.

 

ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (United Nations Industrial Development Organisation - UNIDO) 
పారిశ్రామిక, అభివృద్ధి రంగాల్లో యూఎన్‌ఓ కార్యక్రమాలను సమన్వయపరచి, సమీక్షించడానికి 1967, జనవరి నుంచి యూఎన్‌ఐడీఓ తన పనిని ప్రారంభించింది. ఈ సంస్థ 1985లో యూఎన్‌ఓ ప్రత్యేక అనుబంధ సంస్థగా గుర్తింపు పొందింది.
* యూఎన్‌ఐడీఓలో జనరల్‌ కాన్ఫరెన్స్, ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు “ (IDB) ప్రోగ్రాం అండ్‌ బడ్జెట్‌ కమిటీ  (PBC), సెక్రటేరియట్‌ ప్రధానమైన విభాగాలు.  జనరల్‌ కాన్ఫరెన్స్‌ ఈ సంస్థ విధివిధానాలను నిర్ణయిస్తుంది. 
* దీనికి ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు విధానాలను సమీక్షించే అధికారం ఉంది. దీనిలో 53 దేశాలు సభ్యులుగా ఉంటాయి.  వీటిలో అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి 33, అభివృద్ధి చెందిన మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాల నుంచి 15, ఈశాన్య యూరప్‌ దేశాల నుంచి 5 ఎన్నికవుతాయి. ఈ దేశాలను నాలుగేళ్ల పదవీ కాలానికి జనరల్‌ కాన్ఫరెన్స్‌ ఎన్నుకుంటుంది.
* ప్రోగ్రాం అండ్‌ బడ్జెట్‌ కమిటీలో 27 సభ్యదేశాలు జనరల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా రెండేళ్ల పదవీకాలానికి ఎన్నికవుతాయి.
* యూఎన్‌ఐడీఓ ప్రధాన కార్యాలయం వియన్నా (ఆస్ట్రియా)లో ఉంది.

 

ఆహార వ్యవసాయ సంస్థ  (Food and Agriculture Organisation - FAO) 
* 1946, డిసెంబరు 14 నుంచి ఆహార వ్యవసాయ సంస్థ  (FAO) ఐక్యరాజ్యసమితి ప్రత్యేక అనుబంధ సంస్థగా గుర్తింపు పొందింది. వివిధ దేశాల్లో పౌష్టికాహారం, ప్రజల జీవన ప్రమాణాల స్థాయులను పెంచడం; అన్ని రకాల  వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల దిగుబడులను, పంపిణీ రంగాలను అభివృద్ధి పరచడం; గ్రామీణ ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచడం ద్వారా ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ఎఫ్‌ఏఓ కృషి చేస్తోంది.
* ఇందులో జనరల్‌ కాన్ఫరెన్స్, కౌన్సిల్, సెక్రటేరియట్‌ అనే విభాగాలు ఉంటాయి. జనరల్‌ కాన్ఫరెన్స్‌లో సభ్యదేశాల ప్రతినిధులు ఉంటారు. ఇది రెండేళ్లకోసారి సమావేశమవుతుంది. కొత్త దేశాలను జనరల్‌ కాన్ఫరెన్స్‌ 2/3వ వంతు మెజార్టీతో ఆమోదిస్తే ఎఫ్‌ఏఓలో సభ్యత్వం లభిస్తుంది.
* ఎఫ్‌ఏఓ కౌన్సిల్‌లో 49 మంది సభ్యులుంటారు. వీరిని మూడేళ్ల పదవీకాలానికి జనరల్‌ కాన్ఫరెన్స్‌ ఎన్నుకుంటుంది. దీని ప్రధాన కార్యాలయం రోమ్‌ (ఇటలీ)లో ఉంది. 

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation - WHO) 
* ప్రపంచ ఆరోగ్య సంస్థ  (WHO) 1947, నవంబరు 15 నుంచి ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సంస్థగా గుర్తింపు పొందింది. అన్నివర్గాల ప్రజలకు అత్యుత్తమ ఆరోగ్య సదుపాయాలు కల్పించడం దీని లక్ష్యం. మశూచి (స్మాల్‌పాక్స్‌) నిర్మూలనలో ఈ సంస్థ కీలకపాత్ర పోషించింది.
* హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌పై ఐక్యరాజ్యసమితి ఉమ్మడి కార్యక్రమం 1996లో ప్రారంభమైంది. గుండెపోటు, క్షయ, ఎయిడ్స్, డయేరియా, క్యాన్సర్‌ మొదలైన ప్రాణాంతక వ్యాధుల నియంత్రణకు విశేష కృషి జరిగింది.
* ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవా (స్విట్జర్లాండ్‌)లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం; మే 31న పొగాకు వ్యతిరేక దినోత్సవం; డిసెంబరు 1న ఎయిడ్స్‌ వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.


WHO ప్రాంతీయ కార్యాలయాలు:
* ఆగ్నేయాసియా - న్యూదిల్లీ (ఇండియా)
* ఈశాన్య మధ్యధరా ప్రాంతాలు- అలెగ్జాండ్రియా (ఈజిప్ట్‌)
* పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతం - మనీలా (ఫిలిప్పీన్స్‌)
* అమెరికా - వాషింగ్టన్, డి.సి.
* ఆఫ్రికా - బ్రజెవిల్లే (కాంగో)
* యూరప్‌ - కోపెన్‌హెగన్‌ (డెన్మార్క్‌)


అంతర్జాతీయ కార్మిక సంస్థ (International Labour Organisation ILO) 
* 1919, ఏప్రిల్‌ 11న నానాజాతి సమితికి అనుబంధంగా స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థగా అంతర్జాతీయ కార్మిక సంస్థను (ILO) స్థాపించారు. ఇది 1946లో ఐక్యరాజ్యసమితికి ప్రత్యేక అనుబంధ సంస్థగా మారింది.
* కార్మికుల స్థితిగతులు, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, అంతర్జాతీయంగా ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ఈ సంస్థ పాటుపడుతోంది. కార్మికుల సంక్షేమం, అభిలషణీయమైన కార్మిక చట్టాల రూపకల్పనలో ఇది ఎనలేని కృషి చేస్తోంది.
* ఈ సంస్థలో శాశ్వత సభ్య దేశాలు 10. 
* దీనికి 1969లో నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. దీని ప్రధాన కార్యాలయం జెనీవా (స్విట్జర్లాండ్‌)లో ఉంది.


ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ (United Nations Environment Programme - UNEP) 
* యూఎన్‌ఓ 1972లో స్టాక్‌హోం (స్వీడన్‌)లో పర్యావరణంపై నిర్వహించిన సమావేశం ఫలితంగా ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ ఏర్పడింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రపంచ పర్యావరణ పరిరక్షణ; పర్యావరణానికి సంబంధించిన అన్ని విషయాల్లో అంతర్జాతీయ సహకారం; పర్యావరణ సమస్యలపై ప్రభుత్వాలు దృష్టిసారించేలా చూడటం; పర్యావరణానికి సంబంధించిన విజ్ఞానాన్ని అంతర్జాతీయ సమాజం పరస్పరం మార్చుకోవడానికి కృషి చేయడం.
* వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో ప్రజలను భాగస్వాములను చేసి, అవగాహనను పెంపొందించేందుకు ప్రయత్నించడం.
* ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ ప్రధాన కార్యాలయం నైరోబి (కెన్యా)లో ఉంది.


ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం (United Nations University) 
* ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 1972, డిసెంబరు 11న చేసిన తీర్మానం ద్వారా ఈ సంస్థ ఏర్పడింది. అభివృద్ధి, సంక్షేమం, మానవ ప్రగతి, మనుగడ విషయాల్లో పరిశోధనతో పాటు శిక్షణ ఇస్తుంది. ఈ విశ్వవిద్యాలయ కౌన్సిల్‌ ముఖ్య విభాగాల్లో వివిధ దేశాలకు చెందిన విద్యావేత్తలు, యూఎన్‌ఓ సెక్రటరీ జనరల్, యునెస్కో డైరెక్టర్‌ తదితరులు ఉంటారు.
* ఈ విశ్వవిద్యాలయం ప్రపంచశాంతి సాధన, గ్లోబల్‌ ఎకానమీ, సాంఘిక, సాంస్కృతిక ప్రగతి, బయోటెక్నాలజీ మొదలైన విషయాల్లో పరిశోధనలు నిర్వహిస్తుంది. 
* దీని ప్రధాన కార్యాలయం టోక్యో (జపాన్‌)లో ఉంది.


అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (International Atomic Energy Agency - IAEA)
* 1953లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డ్వైట్‌ ఐసన్‌హోవర్‌ ఐక్యరాజ్యసమితి సాధారణ సభను ఉద్దేశించి ప్రసంగించారు. అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకు వినియోగించేందుకు ఒక అంతర్జాతీయ సంస్థ అవసరమని ప్రతిపాదించారు.
* అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగించడమెలా అనే అంశంపై 1956లో న్యూయార్క్‌లో జరిగిన సదస్సులో 70 దేశాల ఆమోదముద్ర ఫలితంగా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) చట్టరూపం దాల్చింది.
* ఈ సంస్థ 1957, జులై 29 నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఇది యూఎన్‌ఓలో ప్రత్యేక సంస్థగా కాకుండా స్వయం ప్రతిపత్తి గల సంస్థగా పేరొందింది.
* అణుపరిజ్ఞానాన్ని శాంతియుత, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించేలా కృషి చేయడం; అరాచక శక్తులు, ఉగ్రవాదుల చేతుల్లోకి అణు పరిజ్ఞానం వెళ్లకుండా నిరంతర పర్యవేక్షించడం దీని ప్రధాన విధి.
* ఐఏఈఏలో జనరల్‌ కాన్ఫరెన్స్, బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్, సెక్రటేరియట్‌లు ప్రధాన విభాగాలు. జనరల్‌ కాన్ఫరెన్స్‌లో ఐఏఈఏలోని సభ్య దేశాలన్నింటికీ సభ్యత్వం ఉంటుంది.
* బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ సాధారణంగా సంవత్సరానికి నాలుగుసార్లు సమావేశమవుతుంది. దీనిలో ఉన్న 22 మంది సభ్యులను జనరల్‌ కాన్ఫరెన్స్‌ ఎన్నుకుంటుంది. 13 మంది సభ్యులను (అణుశక్తి రంగంలో ప్రసిద్ధులైన వారిని) బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ నియమిస్తుంది.
* సెక్రటేరియట్‌కు డైరెక్టర్‌ జనరల్‌ అధ్యక్షత వహిస్తారు. ఈయన్ను అయిదేళ్ల పదవీకాలానికి బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ నియమిస్తుంది.
* గవర్నర్ల బోర్డ్, డైరెక్టర్‌ జనరల్‌కు శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాయపడేందుకు 1958లో శాస్త్రీయ సలహా మండలిని ఏర్పాటు చేశారు. 1975లో అణు సలహా సంఘం ఏర్పడింది. దీనిలో 138 దేశాలకు సభ్యత్వం ఉంది.
* అణ్వస్త్రవ్యాప్తిని నిరోధించడానికి చేసిన కృషికి 2005లో ఐఏఈఏకి, దాని అధ్యక్షుడు మహ్మద్‌ అల్‌ బరాదీకి నోబెల్‌శాంతి బహుమతి లభించింది. దీని ప్రధాన కార్యాలయం వియన్నా (ఆస్ట్రియా)లో ఉంది.
* 1970 మార్చిలో అణ్వస్త్ర విస్తరణ నిరోధక ఒప్పందం  (NPT); 1996, సెప్టెంబరు 10న సమగ్ర అణుపరీక్షల నిషేధ ఒప్పందం (CTBT) అమల్లోకి వచ్చాయి.

Posted Date : 20-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రాథమిక హక్కులు

పీడన నిరోధపు హక్కు (నిబంధనలు 23-24) 
వ్యక్తి హుందాతనాన్ని, ఆత్మగౌరవాన్ని పెంపొందించడం, దోపిడీకి గురికాకుండా కాపాడటమే ఈ హక్కు ఉద్దేశం.

 

నిబంధన 23(1)
ఈ నిబంధన ప్రకారం చట్టానికి వ్యతిరేకంగా మనుషుల క్రయ, విక్రయాలు జరపడం, వెట్టిచాకిరి, నిర్బంధంగా పని చేయించడాన్ని నిషేధించారు. దీని ప్రకారం వ్యభిచారం, దేవదాసి లేదా జోగిని పద్ధతులను నిషేధించారు (వీటిని అమలు చేయడానికి పార్లమెంటు 1956 లో అశ్లీల, అసభ్య వ్యాపార నిరోధక చట్టాన్ని రూపొందించింది. దీన్ని 2006 లో సవరించారు).
* వెట్టిచాకిరీ నిరోధక చట్టం 1976
* కనీస వేతనాల చట్టం 1948, 1976
* అనైతిక కార్యకలాపాల నిషేధ చట్టం 1978
* సమాన పనికి సమాన వేతన చట్టం 1976
* 23 (2) ప్రకారం ప్రజా ప్రయోజనం కోసం నిర్బంధంగా పౌరులు, ఉద్యోగులతో రుసుము చెల్లించి లేదా చెల్లించకుండా సేవ చేయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ఇందులో మతం, జాతి, కులం, వర్గం మొదలైన వివక్షలను చూపకూడదు. నిర్బంధ మిలిటరీ సేవ, నిర్బంధ సామాజిక సేవ బలవంతపు వెట్టిచాకిరీ కిందికి రావు.

 

నిబంధన 24 
దీని ప్రకారం 14 సంవత్సరాల్లోపు పిల్లలతో కర్మాగారాలు, గనులు, ఇతర ప్రమాదకరమైన ఉత్పత్తులకు సంబంధించిన పనులు చేయించకూడదు.ఉదాహరణకు భవన నిర్మాణం, రైల్వేలు మొదలైనవి. అయితే, ఈ నిబంధన హానికరంకాని పనుల్లో నియమించుకోవడాన్ని నిషేధించలేదు. ఈ నిబంధన అమలుకు రాజ్యాంగం అమల్లోకి రాకముందు కొన్ని చట్టాలున్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పార్లమెంటు అనేక చట్టాలు చేసింది. అవి:
1. బాలల ఉపాధి చట్టం - 1938
2. ఫ్యాక్టరీల చట్టం - 1948
3. ప్లాంటేషన్ కార్మిక చట్టం - 1951
4. మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కార్మికుల చట్టం - 1951
5. గనుల చట్టం - 1952
6. మనుషుల అక్రమ వ్యాపార నిషేధ చట్టం - 1956
7. మర్చంట్ షిప్పింగ్ చట్టం - 1958
8. ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ చట్టం - 1958
9. అప్రెంటిస్ చట్టం - 1961
10. బీడీ, సిగరెట్ కార్మికుల చట్టం - 1966
11. బాలకార్మిక (నిషేధ, నియంత్రణ) చట్టం - 1986
12. బాలకార్మిక హక్కుల చట్టం - 2005
13. 2006 లో ప్రభుత్వం 14 సంవత్సరాల్లోపు పిల్లలతో గృహ సంబంధ పనులు, వ్యాపార సంస్థల్లో (ఉదాహరణకు హోటళ్లు, దాబాలు, దుకాణాలు, టీ దుకాణాలు మొదలైనవి) పనులకు నియమించుకోవడాన్ని నిషేధించింది.

 

మత స్వాతంత్య్రపు హక్కు (నిబంధనలు 25-28) 
భారతదేశంలో ప్రభుత్వ వ్యవహారాల్లో మత ప్రమేయం ఉండదు. అయితే 'లౌకిక' అనే పదాన్ని రాజ్యాంగంలో (ప్రవేశిక) 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976 లో చేర్చారు.
* నిబంధన 25(1) ప్రకారం ప్రజా సంక్షేమం, నైతికత, ఆరోగ్యం మొదలైన అంశాలకు లోబడి, ప్రజలు తమ అంతరాత్మను, తమకు ఇష్టమైన మత విశ్వాసాలను అనుసరించడానికి, స్వీకరించడానికి, ప్రచారం చేసుకోవడానికి హక్కు ఉంది. అయితే, ఇతర మతాలవారిని బలవంతంగా తమ మతంలోకి చేర్చుకునే హక్కు లేదు.
* 25(2)(a) ప్రకారం మత సంబంధ కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఆర్థిక, రాజకీయ లేదా ఇతర సంక్షేమ కార్యకలాపాలకు పరిమితం చేయడం లేదా నియంత్రణ చేయడం కోసం ప్రభుత్వం చట్టాలను రూపొందించవచ్చు.
* 25(2)(b) సామాజిక సంక్షేమం, సాంఘిక సంస్కరణల్లో భాగంగా హిందూ దేవాలయాల్లోకి, హిందూ మత సంబంధ వర్గాల ప్రవేశానికి ప్రభుత్వం చట్టాలను రూపొందించవచ్చు (సిక్కులు కృపాణాలను లేదా ఖడ్గాలను ధరించడం, తీసుకువెళ్లడం సిక్కు మత సంప్రదాయంలో భాగంగానే పరిగణించాలి).
* 25(2)(b) ప్రకారం సిక్కులు, జైనులు, బౌద్ధులను కూడా హిందువులుగానే పరిగణిస్తారు.

 

నిబంధన 26 
ఇది మత వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛకు సంబంధించిన నిబంధన. ప్రజాశాంతి, నైతికత, ఆరోగ్యానికి లోబడి వ్యక్తులు కింది హక్కులను కలిగి ఉంటారు.
     (a) మత, ధార్మిక సంస్థలను స్థాపించవచ్చు.
     (b) తమ మత వ్యవహారాలను తామే నిర్వహించుకోవచ్చు.
     (c) స్థిర, చర ఆస్తులను మత సంస్థలు సమకూర్చుకోవచ్చు.
     (d) చట్ట ప్రకారం స్థిర, చరాస్తులను నిర్వహించుకునే హక్కు ఉంటుంది.

 

నిబంధన 27 
ఈ నిబంధన మతం పేరుతో పన్నులు వసూలు చేయడాన్ని నిషేధిస్తుంది.
* మత వ్యాప్తి లేదా పోషణ కోసం ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడాన్ని నిషేధించారు. కానీ, మత ప్రాతిపదికపై ప్రత్యేక సేవలను అందించినందుకు ప్రభుత్వం ప్రజల నుంచి చార్జీ వసూలు చేయవచ్చు. ఉదా: దేవాలయంలో ప్రత్యేక దర్శనాలు, సేవల కోసం ప్రత్యేక ఫీజు వసూలు చేయడం రాజ్యాంగానికి విరుద్ధం కాదు. 

నిబంధన 28 
ఈ నిబంధన విద్యాలయాల్లో మత బోధన గురించి తెలియజేస్తుంది.
* 28 (1) ప్రకారం ప్రభుత్వ నిధులతో నిర్వహించే విద్యాసంస్థల్లో మత బోధనను నిషేధించారు.
* 28 (2) ప్రకారం ఏదైనా ధార్మిక సంస్థ లేదా ధర్మకర్తల మండలి స్థాపించి, పాలనాపరంగా ప్రభుత్వమే నిర్వహించే కొన్ని విద్యాలయాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మత బోధన చేయవచ్చు.
* 28 (3) ప్రకారం ప్రభుత్వం గుర్తించిన లేదా ప్రభుత్వ సహాయం పొందే (ఎయిడెడ్) విద్యా సంస్థల్లో మతపరమైన ప్రార్థనలు, కార్యకలాపాలు ఉన్నప్పటికీ, విద్యార్థులు వాటిలో పాల్గొనవచ్చు లేదా పాల్గొనకుండా ఉండవచ్చు. మైనర్లు అయిన విద్యార్థులు సంరక్షకుల అభీష్టం మేరకు నడుచుకునే అవకాశం ఉంది. వారిని మత ప్రార్థనల్లో, కార్యకలాపాల్లో తప్పనిసరిగా పాల్గొనమని బలవంతం చేయకూడదు.

సాంస్కృతిక, విద్యా విషయక హక్కు (నిబంధనలు 29-30)   
భాష, మతపరమైన అల్ప సంఖ్యాకులు తమ మతాన్ని, భాషను, సంస్కృతిని కాపాడుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి ప్రత్యేకంగా ఈ హక్కును కల్పించినప్పటికీ, అధిక సంఖ్యాకులు కూడా ఈ హక్కులను కలిగి ఉంటారు.
* 29(1) ప్రకారం భారత ప్రజలకు (ఏ వర్గం వారైనా) తమ భాష, లిపి, సంస్కృతిని కాపాడుకునే హక్కు ఉంటుంది.
* 29(2) ప్రకారం ప్రభుత్వం నిర్వహిస్తున్న/ ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుతున్న విద్యా సంస్థల్లో మతం, జాతి, కులం, భాష కారణాల వల్ల ప్రవేశాన్ని నిరాకరించరాదు.
* 30(1) ప్రకారం మతం లేదా భాషా ప్రాతిపదికపై అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన ప్రజలు ప్రత్యేక విద్యాసంస్థలను స్థాపించి, నిర్వహించుకోవచ్చు.
* 30(1)(A) ప్రకారం మైనారిటీలు నిర్వహిస్తున్న విద్యాసంస్థలను, వాటి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునప్పుడు వారికి ప్రత్యేక నష్టపరిహారాన్ని చెల్లించాలి.
* 30(2) ప్రకారం ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేసే విషయంలో విద్యాసంస్థలను అల్పసంఖ్యాక వర్గాలునిర్వహించే విద్యాసంస్థలు, అధిక సంఖ్యాక వర్గాలు నిర్వహించే విద్యాసంస్థలు అనే తేడా చూపకూడదు.

ఆస్తి హక్కు (నిబంధన 31): ఈ హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు.
 

రాజ్యాంగ పరిరక్షణ హక్కు (నిబంధన 32) 
ప్రాథమిక హక్కులను పొందడంలో రాజ్యం లేదా సంస్థ లేదా వ్యక్తులు ఆటంకం కల్పిస్తే నిబంధన 32 ద్వారా సుప్రీం కోర్టు, నిబంధన 226 ద్వారా హైకోర్టులు రక్షణ కల్పిస్తాయి. అందుకే డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగ పరిరక్షణ హక్కును రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ, హృదయం అని వర్ణించారు.
* 32(1) ప్రకారం వ్యక్తి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు రక్షణ కల్పించమని సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చు.
* 32(2) ప్రకారం ప్రాథమిక హక్కుల రక్షణకు సుప్రీం కోర్టు 5 రకాల రిట్లను జారీ చేయగలదు. అవి... హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరరీ, కో-వారెంటో.
* 32(3) ప్రకారం సుప్రీం కోర్టు తన అధికారాలకు భంగం కలగకుండా, ఇతర న్యాయస్థానాలకు (జిల్లా కోర్టులు, స్థానిక కోర్టులు) కూడా రిట్లను జారీచేసే అధికారాన్ని కల్పిస్తూ పార్లమెంటు చట్టం చేయవచ్చు. (రిట్ అంటే తప్పనిసరిగా పాటించాల్సిన కోర్టు ఆదేశం లేదా ఉత్తర్వు).
* 32(4) ప్రకారం రాజ్యాంగంలో సూచించిన విధంగా తప్ప, ఏ ఇతర పద్ధతుల్లోనూ ప్రాథమిక హక్కుల పరిరక్షణ హక్కును (లేదా) రాజ్యాంగ పరిరక్షణ హక్కును తొలగించరాదు. అయితే, అత్యవసర పరిస్థితి విధించిన కాలంలో మార్షల్ లా లేదా సైనిక శాసనం అమల్లో ఉన్నప్పుడు ఈ నిబంధన అమలును తాత్కాలికంగా నిలిపివేయవచ్చు.
* పైన తెలిపిన ప్రాథమిక హక్కుల రక్షణకు ప్రజలు నేరుగా సుప్రీం కోర్టు, హైకోర్టులను ఆశ్రయించవచ్చు.

 

రిట్లు
హెబియస్ కార్పస్:  హెబియస్ కార్పస్ అనేది లాటిన్ భాషా పదం.ఇది అతి పురాతనమైన రిట్. హెబియస్ కార్పస్ అంటే To have the body (భౌతికంగా కనిపించడం). ఈ రిట్ ద్వారా స్వేచ్ఛా హక్కును (19 నుంచి 22 వరకు ఉన్న నిబంధనలు) కాపాడుకోవచ్చు.
* ఒక వ్యక్తిని నిర్బంధించినప్పుడు ఆ నిర్బంధానికి ఉన్న కారణాలు చట్ట సమ్మతమా, కాదా అని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. చట్ట సమ్మతం అయితే 24 గంటల లోపు న్యాయస్థానం ముందు హాజరుపరచాల్సిందిగా లేదా చట్ట సమ్మతం కాకపోతే వెంటనే విడుదల చేయాల్సిందిగా ఆదేశిస్తారు.
* ఈ రిట్‌ను ప్రభుత్వ అధికారులకు, సంస్థలకు, ప్రైవేట్ వ్యక్తులకు జారీ చేయవచ్చు. కానీ, రాష్ట్రపతి, గవర్నర్లు, విదేశీయులకు జారీ చేయకూడదు.

మాండమస్: మాండమస్ అంటే ఆదేశించడం (Command). ప్రభుత్వ అధికారి లేదా సంస్థ తమ విధి నిర్వహణలో తీవ్రమైన జాప్యం లేదా పని చేయడానికి నిరాకరిస్తే లేదా నిర్వహించనప్పుడు ఆ విధిని నిర్వర్తించమని న్యాయస్థానం ఇచ్చే ఆదేశమే మాండమస్.
* మాండమస్‌ను కేవలం ప్రభుత్వ సంస్థలు లేదా ప్రభుత్వ అధికారులపై మాత్రమే జారీ చేస్తారు. దీన్ని రాష్ట్రపతి, గవర్నర్లపై జారీ చేయకూడదు.

ప్రొహిబిషన్: ప్రొహిబిషన్ అంటే నిషేధం. దీన్ని కేవలం న్యాయస్థానాలకు మాత్రమే జారీ చేస్తారు. కింది న్యాయస్థానాలు (సుప్రీం కోర్టు, హైకోర్టులు కాకుండా) విచారణ జరుపుతున్న కేసును నిలిపివేయాల్సిందిగా సుప్రీం కోర్టు లేదా హైకోర్టులు ఈ రిట్‌ను జారీ చేస్తాయి. అలాగే విచారణ జరుపుతున్న న్యాయమూర్తికి ఆ కేసుతో సంబంధం ఉన్నప్పుడు కూడా ఈ రిట్‌ను జారీ చేస్తారు.
 

సెర్షియోరరీ: సెర్షియోరరీ అంటే సుపీరియర్. కింది కోర్టులు లేదా ట్రైబ్యునళ్లు తమ అధికార పరిధిని అతిక్రమించి ఒక కేసును విచారించి అంతిమ తీర్పును ఇచ్చినప్పటికీ, దాన్ని రద్దుచేసి సుప్రీం కోర్టు లేదా హైకోర్టులు తమ పరిధిలోకి తీసుకోవడానికి సెర్షియోరరీ అవకాశం కల్పిస్తుంది. దీన్ని ప్రైవేట్ సంస్థలు, శాసనసభలకు వ్యతిరేకంగా జారీ చేయకూడదు.
* ప్రొహిబిషన్, సెర్షియోరరీ రిట్లను జ్యుడీషియల్ రిట్లు అని కూడా అంటారు.

 

కోవారెంటో:  కో-వారెంటో అంటే 'ఏ అధికారంతో?' అని అర్థం. దీని ద్వారా కోర్టు, ఒక వ్యక్తి ఏ అధికారంతో ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాడో పరిశీలిస్తుంది. ఈ రిట్‌ను ప్రభుత్వ పదవుల్లోకి అక్రమంగా ప్రవేశించినవారిని, తొలగించడానికి ఉద్దేశించి రూపొందించారు.
* పైన తెలియజేసిన విధంగా సుప్రీం కోర్టు, హైకోర్టులు రిట్లను జారీ చేయడం ద్వారా ప్రజల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పిస్తాయి. అయితే అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు వీటిని జారీ చేయలేవు.
* డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగ పరిహారపు హక్కును రాజ్యాంగ ఆత్మ, హృదయంగా వర్ణించారు.
* భారత రాజ్యాంగంలో న్యాయసమీక్ష అనే పదాన్ని వాడకపోయినా, అంతర్గతంగా న్యాయసమీక్షాధికారాన్ని కల్పించింది - నిబంధన 13.
* విద్యాహక్కును ప్రాథమిక హక్కుగా తెలిపేది - నిబంధన - 21(A).
* నిబంధన 15 ప్రకారం రాజ్యాంగం 5 రకాల వివక్షలను నిషేధించింది.

 

ప్రాథమిక హక్కులు - ల‌క్ష‌ణాలు

సంప్రదాయమైవి, ఆధునికమైనవి: స్వేచ్ఛా, స్వాతంత్య్రపు హక్కు, మతస్వాతంత్య్రపు హక్కు లాంటి సంప్రదాయ హక్కులతో పాటు ఆధునిక హక్కులైన సమానత్వపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, విద్యా, సాంస్కృతిక హక్కులు సైతం ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగాలుగా కొనసాగుతున్నాయి.

సార్వత్రికం కావు:  ఆర్టికల్స్‌ 15, 16, 19, 29, 30లో పేర్కొన్న ప్రాథమిక హక్కులు కేవలం భారతీయులకు మాత్రమే వర్తిస్తాయి. భారత్‌లో నివసించే విదేశీయులకు వర్తించవు.
* ఆర్టికల్‌ 19లో పేర్కొన్న స్వేచ్ఛా, స్వాతంత్య్రపు హక్కు సాయుధ దళాల సిబ్బందికి లభించదు. 
* ఆర్టికల్స్‌ 14, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28లో పేర్కొన్న ప్రాథమిక హక్కులు భారత ప్రజలతోపాటు భారత భూభాగంలో ఉన్న విదేశీయులకు కూడా వర్తిస్తాయి.

న్యాయ సంరక్షణ:  పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ప్రాథమిక హక్కుల అమలుకు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ప్రాథమిక హక్కుల రక్షణ, అమలుకు ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టులు రిట్లు జారీచేస్తాయి.

నిరపేక్షమైనవి కావు: ప్రాథమిక హక్కులు అపరిమితమైనవికావు. దేశ సమగ్రత, సుస్థిరత దృష్ట్యా ప్రభుత్వం వీటిపై చట్టబద్ధమైన పరిమితులు విధించవచ్చు.

ప్రభుత్వ అధికారంపై పరిమితులు: ప్రాథమిక హక్కులను ప్రభుత్వాలు ఉల్లంఘించకూడదు. వీటికి వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి శాసనాలు రూపొందించడానికి అవకాశం లేదు. ప్రభుత్వాలు రూపొందించే చట్టాల కన్నా ప్రాథమిక హక్కులు ఉన్నతమైనవి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పనులు చేయకూడదో ప్రాథమిక హక్కులు పేర్కొంటాయి.

రద్దుకు అవకాశం లేనివి, కానీ సస్పెండ్‌ చేయొచ్చు: భారత రాష్ట్రపతి ఆర్టికల్‌ 352 ప్రకారం జాతీయ అత్యవసర స్థితిని ప్రకటించినప్పుడు ఆర్టికల్స్‌ 20, 21లో పేర్కొన్న ప్రాథమిక హక్కులు మినహాయించి మిగిలిన వాటిని తాత్కాలికంగా సస్పెండ్‌ చేయొచ్చు. కానీ పూర్తిగా రద్దుచేసే వీల్లేదు.

అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాల సంరక్షణ: దేశంలోని మెజారిటీ వర్గాల ఆధిపత్యం నుంచి అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలను కాపాడటం, జాతి సమగ్రతను సంరక్షించడం, వివిధ వర్గాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడంలో ప్రాథమిక హక్కులు కీలకపాత్ర పోషిస్తాయి. 
ఉదా: విద్యా, సాంస్కృతిక హక్కు ద్వారా అల్పసంఖ్యాక వర్గాల హక్కులకు రక్షణ కల్పించడం.

పౌరుల సమగ్రాభివృద్ధి సాధనాలు: పౌరులు గౌరవప్రదంగా జీవించడానికి, వారి వ్యక్తిత్వ వికాస అభివృద్ధి, స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు హామీఇవ్వడం ద్వారా ప్రాథమిక హక్కులు పౌరుల సమగ్రాభివృద్ధికి తోడ్పడుతున్నాయి.

వివరణ
*  1951లో చంపకం దొరైరాజన్‌ vs స్టేట్‌ ఆఫ్‌ మద్రాస్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కుల మీద ఆదేశిక సూత్రాలు స్వారీ చేయలేవు అని పేర్కొంది.
* 1973 లో కేశవానంద భారతి vs స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో సుప్రీంకోర్టు తీర్పుఇస్తూ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు పరస్పర పోషకాలని ప్రకటించింది.
* 1980 లో మినర్వామిల్స్‌ vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య సమన్వయాన్ని సాధించేందుకు సుప్రీంకోర్టు ప్రయత్నించింది.
* 1976 లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 42 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కులపై ఆదేశిక సూత్రాల ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నించింది.

ప్రాథమిక హక్కులు, సాధారణ హక్కులకు మధ్య భేదాలు
ప్రాథమిక హక్కులు
* ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచారు. వీటికి రాజ్యాంగం నుంచి హామీ లభిస్తుంది. ఇవి ప్రభుత్వ అధికారంపై పరిమితులు విధిస్తాయి.
* దేశ పౌరులు వీటిని వదులుకునే వీలులేదు.
* ప్రాథమిక హక్కుల సంరక్షణ, అమలుకు ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టును, ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టులను ఆశ్రయించవచ్చు.
* రాష్ట్రపతి ఆర్టికల్‌ 352 ప్రకారం జాతీయ అత్యవసర స్థితిని ప్రకటించినప్పుడు ఆర్టికల్స్‌ 20, 21లలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు మినహాయించి, ఇతర ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు.
* ప్రాథమిక హక్కులు సాధారణ హక్కుల కంటే ఉన్నతమైన ఆధిక్యత, స్వభావం కలిగి ఉన్నాయి.

సాధారణ హక్కులు
* సాధారణ హక్కులు పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభల ద్వారా రూపొందుతాయి. వీటికి హామీ ఉంటుంది. ఈ హక్కులు ప్రభుత్వానికి అదనపు అధికారాలు కల్పిస్తాయి.
* సాధారణ హక్కులను పౌరులు తమ ఇష్టానుసారం వదులుకోవచ్చు.
* సాధారణ హక్కుల అమలు కోసం పౌరులు కేవలం పరిమిత న్యాయస్థానాలను మాత్రమే ఆశ్రయించవచ్చు.
* వీటిని ఎలాంటి పరిస్థితిలోనైనా తాత్కాలికంగా నిలిపివేయడమే కాకుండా, రద్దు చేసే వీలు కూడా ఉంటుంది. 
* సాధారణ హక్కులు ప్రాథమిక హక్కులకు లోబడి ఉంటాయి.

ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య భేదాలు
ప్రాథమిక హక్కులు
* వీటిని రాజ్యాంగంలోని మూడో భాగంలో పేర్కొన్నారు.
* ఇవి రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 12 నుంచి 35 మధ్య పొందుపరిచి ఉన్నాయి.
* వీటిని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు.
* వీటికి న్యాయ సంరక్షణ ఉంది.
* ఇవి సర్వకాల, సర్వ వ్యవస్థల్లో అందుబాటులో ఉంటాయి.
* ఇవి వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను సాధించేందుకు ఉద్దేశించినవి.
* వీటి ద్వారా రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సాధించవచ్చు.
* ఇవి రాజ్యాంగ లక్ష్యాలను సాధించేందుకు సాధనాలుగా ఉపకరిస్తాయి.
* వీటి అమలుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు చేయాల్సిన అవసరం లేదు. 
* వీటిని జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో తాత్కాలికంగా నిలిపివేయవచ్చు.
* ప్రాథమిక హక్కులు వ్యక్తిగతమైనవి.
* వీటిని అమలు చేసే బాధ్యత న్యాయస్థానాలకు ఉంటుంది.
* ఇవి నకారాత్మక దృక్పథం కలిగినవి.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయకూడని పనులను తెలియజేస్తాయి.
* వీటికి ఆజ్ఞాపించే స్వభావం ఉంది.

ఆదేశిక సూత్రాలు
* వీటిని రాజ్యాంగంలోని నాలుగో భాగంలో పేర్కొన్నారు.
* వీటిని రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 36 నుంచి 51 మధ్య వివరించారు.
* ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్‌ రాజ్యాంగం నుంచి గ్రహించారు.
* వీటికి న్యాయస్థానాల రక్షణ లేదు.
* ప్రభుత్వాల ఆర్థికస్తోమతను అనుసరించి అందుబాటులో ఉంటాయి.
* సమాజ సమష్టి ప్రయోజనాలు సాధించేందుకు ఉద్దేశించినవి.
* వీటి ద్వారా సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించవచ్చు.
* ఆదేశిక సూత్రాలు రాజ్యాంగ లక్ష్యాలను తెలుపుతాయి.
* వీటి అమలుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు చేయాల్సి ఉంటుంది.
* ఇవి ఎప్పుడూ అమల్లోనే ఉంటాయి.
* ఇవి సామాజికపరమైనవి.
* వీటిని అమలు చేసే బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది.
* ఇవి సకారాత్మక దృక్పథాన్ని కలిగిఉంటాయి.
* ఆదేశిక సూత్రాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పనులను తెలుపుతాయి.
* ఇవి కేవలం సూచనప్రాయమైనవి.

 

ప్రాథమిక హక్కులు - సుప్రీంకోర్టు తీర్పులు

  భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ప్రాథమిక హక్కులకు ప్రభుత్వం ద్వారా లేదా మరే విధంగానైనా భంగం కలిగితే సుప్రీంకోర్టు, హైకోర్టుల ద్వారా కాపాడుకోవచ్చు. ప్రాథమిక హక్కులు సుప్రీంకోర్టు, హైకోర్టుల ఒరిజినల్ అధికార పరిధి లేదా ప్రారంభ విచారణాధికార పరిధి (కేసును నేరుగా తనే స్వీకరించి, విచారించి, తీర్పు ఇవ్వడం) కిందకు వస్తాయి. ఆస్తి హక్కు, స్వేచ్ఛ హక్కు, సమానత్వ హక్కు, పార్లమెంటు చేసిన కొన్ని రాజ్యాంగ సవరణ చట్టాలను సవాలు చేస్తూ అనేక వివాదాలు కోర్టుల్లో విచారణకు వచ్చాయి. అందులో ముఖ్యమైనవి......


I. సమానత్వ హక్కు (నిబంధనలు 14-18)
నిబంధన 14: చిరంజిత్ లాల్ చౌదరి Vs కేంద్ర ప్రభుత్వం (1950) కేసులో సుప్రీంకోర్టు (హెచ్.జె.కానియా) తీర్పునిస్తూ సమానుల్లో మాత్రమే సమానత్వం అమలు చేస్తారని తెలిపింది.
* బల్సారా Vs స్టేట్ ఆఫ్ బాంబే కేసు (1951)లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రక్షణ దళాలు, రాయబారులకు, సాధారణ ప్రజానీకానికి మధ్య వివక్ష చూపించడం 14 వ నిబంధనను ఉల్లంఘించినట్లు కాదని స్పష్టం చేసింది.
* సాఘీర్ అహ్మద్ Vs ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం కేసు (1955)లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రైవేట్ వ్యక్తులతో పోల్చినప్పుడు రాజ్యం ఒక ప్రత్యేక వర్గంగా భావించి, తనకు అనుకూలంగా గుత్తాధిపత్యాన్ని ఏర్పాటు చేయడం 14 వ నిబంధనను ఉల్లంఘించినట్లు కాదని తెలియజేసింది.
సుభాచంద్ Vs ఢిల్లీ ఎలక్ట్రికల్ సప్త్లె కేసు (1981) లో ప్రభుత్వ సర్వీసుల నియామకంలో వయసు, విద్యార్హతలు, కులం, లింగం మొదలైన అంశాల్లో వివక్ష చూపించడం, సమాన అవకాశాన్ని కల్పించే పరిధిలో ఉంటే అది రాజ్యాంగ విరుద్ధం కాదని సుప్రీంకోర్టు తెలిపింది.
* అసోసియేటెడ్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా Vs కేంద్ర ప్రభుత్వ కేసు (1988) లో విధులు, కర్తవ్యాలు ఒకే స్వభావం కలిగి ఉన్నా, బాధ్యతల పరిమాణం వేరుగా ఉన్నప్పుడు సమాన పనికి, సమాన వేతన నియమం వర్తించదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
* సమాన పని, సమాన విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు, ఇతర తాత్కాలిక ప్రాతిపదికపై పనిచేసే ఉద్యోగులకు కూడా, శాశ్వత ఉద్యోగులకు చెల్లించే విధంగా వేతనాలు చెల్లించాలని పంజాబ్‌లోని తాత్కాలిక ఉద్యోగులు వేసిన రిట్ పిటీషన్ కేసు - 2016 లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

నిబంధన 15: చంపకందొరై రాజన్ Vs మద్రాసు ప్రభుత్వం కేసు (1951)లో ఆదేశ సూత్రాలను అమలు చేయడానికి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించకూడదని తేల్చి చెప్పింది. దీన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 15 (4) క్లాజును చేర్చింది.
* యం.ఆర్.బాలాజీ Vs మైసూరు రాష్ట్ర ప్రభుత్వం (1963) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రిజర్వేషన్లు 50% కి మించరాదు అని స్పష్టం చేసింది.
* అయితే 76 వ రాజ్యాంగ సవరణ చట్టం, 1994 ద్వారా తమిళనాడులో కల్పించిన 69% రిజర్వేషన్లు రాజ్యాంగంలోని IXవ షెడ్యూల్‌లో చేర్చారు. దీని ద్వారా న్యాయసమీక్షాధికారానికి వీలు లేకుండా చేసింది. కానీ, 2006 లో సుప్రీంకోర్టు IXవ షెడ్యూల్ లోని అంశాలపై కూడా న్యాయసమీక్షాధికారం వర్తిస్తుందని తెలిపింది.
ఇనాందార్ Vs మహారాష్ట్ర ప్రభుత్వం (2005) కేసులో మైనారిటీ, మైనారిటీయేతర నాన్-ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలల్లో రిజర్వేషన్లు వర్తించవు అని తీర్పు ఇచ్చింది.
* సుప్రీంకోర్టు తీర్పును అధిగమించడానికి 93వ రాజ్యాంగ సవరణ చట్టం, 2005 ద్వారా 15 (5) క్లాజును చేర్చింది. దీని ప్రకారం 30 (1) నిబంధనను అనుసరించి ఏర్పడిన మైనారిటీ విద్యా సంస్థలు మినహా ఇతర విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపింది.

నిబంధన 16: దేవదాసన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1964) లో సుప్రీంకోర్టు క్యారీ ఫార్వర్డ్ రూల్ (రిజర్వేషన్ల విషయంలో) చెల్లదని తెలిపింది.
* ఎ.వి.ఎస్.నరసింహారావు Vs ఆంధ్రప్రదేశ్ (1970) కేసులో ఒకే రాష్ట్రంలో ఉన్న వ్యక్తుల మధ్య ఎలాంటి వివక్ష చూపరాదని, రాష్ట్రంలోని కొన్ని ఉద్యోగాలను రాష్ట్రం మొత్తంలో నివసిస్తున్న అందరికీ రిజర్వ్ చేయవచ్చని తెలిపింది. అంతేకాకుండా ముల్కీ నిబంధనల చట్టాన్ని రద్దు చేసింది.
* ఇందిరా సహానీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1992) లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ వెనుకబడిన తరగతులకు 27% రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధం కాదు, కానీ క్రీమీ లేయర్‌ను గుర్తించాలని పేర్కొంది.
* షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం కాబట్టి చెల్లవని కొట్టివేసింది.
* దీన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం 77 వ రాజ్యాంగ సవరణ చట్టం, 1995 ద్వారా 16 (4) క్లాజును చేర్చింది.

నిబంధన 18: బాలాజీ రాఘవన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1996) లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ లాంటివి ప్రత్యేక పురస్కారాలు మాత్రమే అని, బిరుదులు కావని, వీటిని పేరుకు ముందు లేదా తర్వాత వాడటం నిబంధనలకు వ్యతిరేకమని స్పష్టం చేసింది.


II. స్వేచ్ఛ-స్వాతంత్య్ర హక్కు (నిబంధనలు 19-22)
నిబంధన 19: బ్రిజ్ భూషణ్ Vs స్టేట్ ఆఫ్ ఢిల్లీ కేసు (1950)లో సుప్రీంకోర్టు (సయ్యద్ ఫజుల్ అలీ నాయకత్వంలోని బెంచ్) తీర్పునిస్తూ ఒక పత్రికపై దాని ప్రచురణకు ముందే సెన్సార్‌షిప్ విధించకూడదని తెలిపింది.
* కానీ కె.ఎ.అబ్బాస్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1970)లో సుప్రీంకోర్టు (హిదయతుల్లా) తీర్పునిస్తూ సినిమాలపై సెన్సార్‌షిప్ విధించే అధికారం ప్రభుత్వానికి ఉంది అని తెలిపింది.
* మేనకాగాంధీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1978) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ సంచార స్వేచ్ఛతో పాటు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ దేశంలోపల, విదేశాల్లో ఉన్నప్పుడు కూడా ఉంటుందని పేర్కొంది. కాబట్టి, భావవ్యక్తీకరణకు భౌగోళిక హద్దులు లేవని తెలిపింది.
* బిజయ్ ఎమాన్యూల్ Vs స్టేట్ ఆఫ్ కేరళ (1986) కేసులో సుప్రీంకోర్టు వాక్, భావ ప్రకటన స్వేచ్ఛలో మౌనంగా ఉండే హక్కు కూడా ఉంది అని అభిప్రాయపడింది. ఇది జాతీయ గీతం కేసుగా ప్రచారం పొందింది.
* అజయ్ కామా Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1988) కేసులో సుప్రీంకోర్టు, ప్రజా సంక్షేమం దృష్ట్యా వాహన డ్రైవర్లు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని ప్రభుత్వం చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధం కాదని, చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది.
* సోదన్ సింగ్ Vsన్యూదిల్లీ మున్సిపల్ కమిటీ (ఎన్‌డీఎంసీ) కేసు (1989) కు సంబంధించి సుప్రీంకోర్టు 1992లో తీర్పునిస్తూ క్రమబద్దీకరించిన రహదార్ల కాలిబాటలపై వ్యాపారం చేసుకునేందుకు (జీవనోపాధి) హాకర్లకు హక్కు ఉందని తెలియజేసింది.
సి.పి.ఐ.(యం) Vs భరత్ కుమార్ (1997) కేసులో సుప్రీంకోర్టు బంద్, హర్తాల్ మధ్య తేడాలను తెలియజేయడంతో పాటు బంద్ అనేది రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది.
* రంగరాజన్ Vs స్టేట్ ఆఫ్ తమిళనాడు (2003) కేసులో సుప్రీంకోర్టు, సమ్మె ప్రాథమిక హక్కు కాదని, ప్రభుత్వ కార్మికులు లేదా ఉద్యోగులు సమ్మెను ప్రాథమిక హక్కుగా వినియోగించకూడదని స్పష్టం చేసింది.
* శ్రేయా సింఘాల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (2015) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 66A భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు విరుద్ధమని, చెల్లదని స్పష్టం చేసింది. (నేపథ్యం- 2012 లో స్వర్గీయ బాల్ థాకరే మరణం తర్వాత ముంబయి బంద్‌కు పిలుపునివ్వడంపై షహీన్ దాదా, రీను శ్రీనివాసన్ తమ అసంతృప్తిని ఫేస్‌బుక్ ద్వారా తెలియజేశారు. దీంతో వారిని అరెస్టు చేశారు. కానీ ప్రజావ్యతిరేకత రావడంతో విడుదల చేశారు).

నిబంధన 20: నందిని సాత్పతి Vs డాని పి.ఎల్. (1978) కేసులో సుప్రీంకోర్టు బలవంతపు సాక్ష్యం అనే అంశాన్ని వివరించింది.
* స్వయంగా నిందను ఆపాదించుకోకూడదు.
* మౌనాన్ని పాటించే హక్కు నిందితుడికి ఉంటుంది.
* శారీరకంగా బెదిరించి, హింసించి పొందిన సాక్ష్యం, మానసిక క్షోభ కలిగించడం, ప్రతికూల పరిసరాలను కల్పించి ఒత్తిడి తేవడం, పదేపదే ప్రశ్నలు అడిగి విసిగించడం, శక్తికి మించిన బరువు, బాధ్యతలు మోపడం, బలవంతంగా నిందితుడి నుంచి సమాచారాన్ని రాబట్టడానికి పోలీసులు ఉపయోగించే ప్రత్యక్ష లేదా పరోక్ష, మానసిక లేదా శారీరక క్షోభకు గురిచేయడం బలవంతపు సాక్ష్యం కిందికి వస్తాయని సుప్రీంకోర్టు వివరించింది.
ఎ.ఎ.ముల్లా Vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర (1996) కేసులో సుప్రీంకోర్టు అవినీతి నిరోధక చట్టం కింద విచారించి నిర్దోషిగా విడుదలైన వ్యక్తిని, తిరిగి కస్టమ్స్ చట్టం, విదేశీమారక క్రమబద్దీకరణ చట్టం కింద రెండో విచారణ నిర్వహించడం 20 వ నిబంధనకు వ్యతిరేకం కాదని తేల్చి చెప్పింది. రెండు విచారణల్లోని అంశాలు వేర్వేరుగా ఉన్నాయని మొదటి, రెండో విచారణల్లోని వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, కాబట్టి రెండో విచారణ నిర్వహించవచ్చని వ్యాఖ్యానించింది.

నిబంధన 21: ఎ.కె.గోపాలన్ Vs స్టేట్ ఆఫ్ మద్రాసు (1950) కేసులో సుప్రీంకోర్టు 19, 21 ప్రకరణలు లేదా నిబంధనల పరిధులు వేరని తెలిపింది. 21 వ నిబంధనను అనుసరించి చేసిన శాసనం ప్రకారం నిర్బంధితులైనప్పుడు సహజ న్యాయసూత్రాలు వర్తించవని స్పష్టం చేసింది. అంటే ఒక వ్యక్తి స్వేచ్ఛను ఏ పరిస్థితుల్లో పరిమితం చేయవచ్చో చట్టం చేస్తే, అది చెల్లుబాటు అవుతుందని తెలిపింది.
* నీరజా చౌదరి Vs స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ (1984) కేసులో సుప్రీంకోర్టు (జస్టిస్ పి.భగవతి) తీర్పునిస్తూ వెట్టిచాకిరీ జీవించే హక్కు (నిబంధన 21)కు భంగకరం కాబట్టి, ప్రభుత్వాలు వెట్టిచాకిరీని  నిర్మూలించే శాసనాలను రూపొందించాలని ఆదేశించింది.
* ఉన్నిక్రిష్ణన్ Vs స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, (1993) కేసులో సుప్రీంకోర్టు (ఎల్.ఎం.శర్మ) చరిత్రాత్మక తీర్పునిస్తూ విద్యాహక్కు ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమని, అది లేకపోతే జీవించే హక్కుకు, వ్యక్తి గౌరవానికి అర్థం లేదని తెలియజేసి, విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని స్పష్టం చేసింది. అయితే విద్యార్జన హక్కు వయసును 14 సంవత్సరాలకు పరిమితం చేసింది. 14 సంవత్సరాల తర్వాత విద్యార్జన హక్కు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. (దీన్ని అమలు చేయడానికి ప్రభుత్వం 86వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది)
వీడియోకాన్ Vs మహారాష్ట్ర (2013) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 21వ నిబంధనలోని జీవించే హక్కు, స్వేచ్ఛ అనేవి విదేశీయులకు కూడా వర్తిస్తాయని తెలియజేసింది.

నిబంధన 22: ఎ.కె.గోపాలన్ Vs మద్రాసు ప్రభుత్వం (1950) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఒక వ్యక్తిని అరెస్టు చేసేముందు అతడిని ఏ కారణాలపై అరెస్టు చేస్తున్నారో తెలియజేయడం అరెస్టు చేసే పోలీసు అధికారి బాధ్యత. ఎందుకు అరెస్టు చేశారనే విషయాన్ని సాధ్యమైనంత త్వరలో తెలియజేయలేకపోతే, కారణాలను కోర్టుకు తెలపాల్సి ఉంటుందని పేర్కొంది.
* అబ్దుల్ సమద్ Vs ఉత్తర్‌ప్రదేశ్ (1962) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ అరెస్టు చేసిన వ్యక్తిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా 24 గంటలు గడిస్తే, ఆ వ్యక్తికి (అరెస్టు అయిన వ్యక్తి) విడుదల కావడానికి హక్కు ఉంటుందని తెలిపింది.
* జోగిందర్ కుమార్ Vs ఉత్తర్‌ప్రదేశ్ (1994) కేసులో సుప్రీంకోర్టు ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు, ఆ సమాచారాన్ని, దానికిగల కారణాలను కుటుంబ సభ్యులకు (లేదా) స్నేహితులకు (లేదా) సంబంధిత వ్యక్తులకు తప్పనిసరిగా తెలియజేయాలని చెప్పింది.


III. పీడన నిరోధక హక్కు (నిబంధనలు 23-24)
* పీపుల్స్ యూనియన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1982) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ.. ఈ ప్రాజెక్టు కోసం నియమించిన కార్మికులకు కనీస వేతనం కంటే తక్కువ వేతనం చెల్లించడం ప్రాథమిక హక్కుల్లోని 23వ నిబంధన ఉల్లంఘనగా తెలియజేసింది. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినందుకు కాంట్రాక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్) Vs యూనియన్ ఆఫ్ ఇండియా (2001) కేసులో సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమైంది. ఆకలి, పోషకాహార లోపాలను అరికట్టడానికి, ఆహార హక్కును చట్టబద్దంగా అమలు చేయాలని తీర్పునిచ్చింది. దీనివల్ల అనేక రాష్ట్రాలు మధ్యాహ్న భోజన పథకాన్ని (బడిపిల్లలకు) ప్రవేశపెట్టాయి.
* సలాల్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు కార్మికులు Vss జమ్మూ & కశ్మీర్ (1983) కేసులో సుప్రీంకోర్టు నిర్మాణ రంగం లాంటి ప్రమాదకరమైన పనుల్లో 14 ఏళ్లల్లోపు వారిని పనిలో చేర్చుకోకూడదని ఆదేశించింది.
* బందువా ముక్తిమోర్చా Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1997) కేసులో ప్రభుత్వం బాల కార్మికుల పునరావాస నిధిని ఏర్పాటు చేయాలని, బాల కార్మికులను పనిలో చేర్చుకునే యజమానిపై రూ.20,000 వరకు జరిమానా విధించి, ఆ నిధిలోకి జమచేయాలని సుప్రీంకోర్టు తెలిపింది.

Posted Date : 07-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అంతర్జాతీయ కూటములు

ప్రపంచంలోని వివిధ దేశాలు తమ స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూ, అంతర్జాతీయ సహకారం కోసం కూటములుగా ఏర్పడి పరస్పరం సహకరించుకుంటున్నాయి. తద్వారా ఆర్థిక, రాజకీయ, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో, దౌత్యపరంగా లబ్ధి పొందుతున్నాయి. ఇలాంటి అంతర్జాతీయ కూటములపై పోటీపరీక్షార్థులకు అవగాహన అవసరం.


కామన్వెల్త్‌ దేశాధినేతల కూటమి (Commonwealth Heads of Government Meeting - CHOGM)
పూర్వం ఉన్న బ్రిటిష్‌ వలస రాజ్యాల కూటమినే ‘‘కామన్వెల్త్‌’’గా పేర్కొనేవారు. ఇది 1931లో ‘లండన్‌’ కేంద్రంగా ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆసియా, ఆఫ్రికా, పశ్చిమార్ధగోళంలోని అనేక వలస రాజ్యాలు బ్రిటిష్‌ పాలన నుంచి విముక్తి పొందాయి. వీటిలో అనేక దేశాలు ‘‘కామన్వెల్త్‌ కూటమి’’లో చేరాయి. దీంతో ‘‘కామన్వెల్త్‌ ఆఫ్‌ నేషన్స్‌’’ పరిధి విస్తరించింది.
* ఆసియా నుంచి కామన్వెల్త్‌ ఆఫ్‌ నేషన్స్‌లో చేరిన మొదటి దేశం భారత్‌ (స్వాతంత్య్రానంతరం). 1947లో భారత్, పాకిస్థాన్‌లు; 1948లో శ్రీలంక (అప్పటి సిలోన్‌) ఈ కూటమిలో చేరాయి.
* కామన్వెల్త్‌ ఆఫ్‌ నేషన్స్‌కు అధికారిక రాజ్యాంగం లేదు. ఇంగ్లిష్‌ అధికారిక భాష. సభ్యదేశాల మధ్య పరస్పర సహకారాన్ని సాధించడం, శిఖరాగ్ర సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం దీని లక్ష్యం. ఈ కూటమికి బ్రిటిష్‌ రాజు/ రాణి అధిపతిగా వ్యవహరిస్తారు. ప్రతి రెండేళ్లకోసారి దీని సమావేశాలు జరుగుతాయి.
* ఆఫ్రికా, ఆసియా, అమెరికా, యూరప్, పసిఫిక్‌ ప్రాంతాల్లో ఉన్న అనేక పెద్ద, చిన్న, ధనిక, పేద దేశాలకు ఈ కూటమిలో సభ్యత్వం ఉంటుంది. అంతర్జాతీయంగా ఈ కూటమి తీసుకునే నిర్ణయాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ప్రస్తుతం ఇందులోని సభ్యదేశాల సంఖ్య 54.
* ఆఫ్రికా ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాలు 19. అవి: 
బోట్స్‌వానా, కామెరూన్, గాంబియా, ఘనా, కెన్యా, కింగ్‌డమ్‌ ఆఫ్‌ ఎస్వటిని, లెసోతీ, మలావి, మారిషస్, మొజాంబిక్, నమీబియా, నైజీరియా, రువాండా, సీషెల్స్, సియొర్రాలియోన్, దక్షిణాఫ్రికా, ఉగాండా, టాంజానియా,జాంబియా.
* ఆసియా ప్రాంతం నుంచి 8 దేశాలు భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మలేసియా, బ్రూనై, మాల్దీవులు, సింగపూర్, శ్రీలంక
* కరేబియన్, అమెరికా నుంచి 13 దేశాలు ఆంటిగువా - బార్బుడా, బహమాస్, బార్బడోస్, బెలీజ్, కెనడా, డొమినికా, గ్రెనడా, గయానా, జమైకా, సెయింట్‌ లూసియా, సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్, సెయింట్‌ విన్సెంట్‌ అండ్‌ ద గ్రెనడైన్స్, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో
* యూరప్‌ ప్రాంతం నుంచి 3 సైప్రస్, మాల్టా, బ్రిటన్‌ 
* పసిఫిక్‌ ప్రాంతం నుంచి 11 ఆస్ట్రేలియా, ఫిజి, కిరిబటీ, నైరు, న్యూజిలాండ్, పపువా న్యూ గినియా, సమోవా, సోలోమాన్‌ దీవులు, టోంగా, తువాలు, వనౌటు. 


ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్‌ కంట్రీస్‌ (OPEC) 
* వీశినిదిను 1960, సెప్టెంబరులో ఇరాక్‌ రాజధాని ‘బాగ్దాద్‌’లో నెలకొల్పారు. దీని స్థాపనలో ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులా దేశాలు కీలకపాత్ర పోషించాయి. ఇది 1961 నుంచి అమల్లోకి వచ్చింది.
* ప్రపంచవ్యాప్తంగా చమురు ఉత్పత్తిలో దాదాపు 3వ వంతు భాగాన్ని ‘OPEC’  సభ్యదేశాలే ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రపంచంలోని మొత్తం చమురు నిల్వల్లో సుమారు 70 శాతం ఈ దేశాలే కలిగి ఉన్నాయి.
* సభ్యదేశాల మధ్య సమన్వయాన్ని సాధించడం, అంతర్గత చమురు ధరల స్థిరీకరణ, పెట్రోలియం విధాన రూపకల్పన, ఎగుమతులకు అనుసరించాల్సిన విధానాలను రూపొందించడం OPEC  లక్ష్యాలు.
* దీని ప్రధాన కార్యాలయం వియన్నా (ఆస్ట్రియా)లో ఉంది. అధికార భాష ఇంగ్లిష్‌.
* ప్రస్తుతం దీనిలోని సభ్యదేశాల సంఖ్య 13. అవి:  అల్జీరియా, అంగోలా, కాంగో, ఈక్వటోరియల్‌ గినియా, గాబన్, ఇరాన్, ఇరాక్, కువైట్, లిబియా, నైజీరియా, సౌదీ అరేబియా, వెనిజులా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌.
* 2019, జనవరి 1న ‘ఖతార్‌’ దేశాన్ని  వీశినిది కూటమి నుంచి తొలగించారు.

 

ఆసియా - పసిఫిక్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ (APEC) 
* 1989లో అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని బాబ్‌ హాక్‌ ‘వివిధ దేశాల మధ్య స్వేచ్ఛా, మార్కెట్‌ అనుకూల దేశాల ఆర్థిక సంబంధాల సమన్వయానికి శాశ్వతమైన సంస్థను ఏర్పాటు చేయాలని’ ప్రతిపాదించారు.
* దీనిపై పసిఫిక్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌ చర్చలు జరిపి 1989 నవంబరులో ‘ఆసియా పసిఫిక్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌’’ (APEC)ను ఏర్పాటు చేసింది. దీని మొదటి సమావేశం ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా నగరంలో జరిగింది. ఇందులో పసిఫిక్‌ దేశాలైన ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, న్యూజిలాండ్, అమెరికాతో పాటు, అప్పటి ఏసియాన్‌ సభ్యదేశాలైన ఇండోనేసియా, మలేసియా, థాయ్‌లాండ్, సింగపూర్, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా, బ్రూనై మొదలైన దేశాలు పాల్గొన్నాయి.
* 1991లో దక్షిణ కొరియాలోని ‘సియోల్‌’లో జరిగిన సమావేశంలో చైనా, తైవాన్‌ దేశాల సభ్యత్వాన్ని ఆమోదించారు.
* సభ్యదేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక సహకారం; స్వేచ్ఛా వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడం; ప్రైవేట్‌ పెట్టుబడులను ప్రోత్సహించడం ఎపెక్‌ లక్ష్యం.
* దీని ప్రధాన కార్యాలయం ‘సింగపూర్‌’లో ఉంది. అధికారిక భాష ‘ఇంగ్లిష్‌’. సభ్యదేశాల సంఖ్య 21. దీనిలో భారత్‌కు సభ్యత్వం లేదు.
* తిశినిది దేశాల కూటమికి ప్రపంచ జనాభాలో 45%, ప్రపంచ వాణిజ్యంలో 46%, అంతర్జాతీయ అభివృద్ధిలో 70% వాటా ఉంది. ఏటా సభ్యదేశాల వాణిజ్య మంత్రుల మంత్రిత్వ సమావేశం జరుగుతుంది.


షాంఘై సహకార సమాఖ్య (SCO) 
* చైనా, సోవియట్‌ రిపబ్లిక్‌ దేశాల మధ్య సరిహద్దు వివాదాల పరిష్కారానికి 1996లో ‘షాంఘై సహకార సమాఖ్య’ను ఏర్పాటు చేశారు. ఇది ఆసియా ఖండంలో ఏర్పడిన ప్రాంతీయ భద్రతా గ్రూప్‌గా పేరొందింది. 
* దీనిలోని సభ్యదేశాలు 8. అవి: భారత్, రష్యా, చైనా, పాకిస్థాన్, కజికిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌. పరిశీలక హోదాలో ఉన్న దేశాలు: ఆఫ్గనిస్థాన్, బెలారస్, ఇరాన్, మంగోలియా.

 

హిందూ మహాసముద్ర తీరప్రాంత దేశ సహకార సమాఖ్య [Indian Ocean Rim Association for Regional Co-operation (IOR-ARC)] 
* హిందూ మహాసముద్ర ప్రాంతంలో వాణిజ్యపరమైన సహజ వనరుల వైజ్ఞానిక అభివృద్ధికి వ్యూహాలను రూపొందించడం దీని ప్రథమ కర్తవ్యం. ఇది ప్రపంచంలోనే కొత్తగా ఆవిర్భవించిన అతిపెద్ద ప్రాంతీయ (ఆర్థిక) సహకార సమాఖ్య.
* ఇది 1997లో ఏర్పడింది. భారత్‌ సహా ఇందులోని మొత్తం సభ్యదేశాల సంఖ్య 19. 


ఇస్లామిక్‌ దేశాల సమాఖ్య  (OIC) 
* 1971లో ముస్లిం దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మొరాకోలోని ‘రాబట్‌’లో 24 ఇస్లాం దేశాలకు చెందిన అధినేతలు సమావేశమయ్యారు. అదే ఏడాది మేలో సౌదీ అరేబియాలోని ‘జెడ్డా’లో ‘ఇస్లామిక్‌ దేశాల సమాఖ్య’ని అధికారికంగా  స్థాపించారు.
* 1972లో దీని చార్టర్‌ను ఆమోదించారు. ఇందులో మొత్తం 57 సభ్యదేశాలు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం జెడ్డా. అధికార భాషలు అరబిక్, ఇంగ్లిష్, ఫ్రెంచ్‌.
* సభ్యదేశాల మధ్య సంఘీభావాన్ని పెంపొందించడం; ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, వైజ్ఞానిక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించడం; జాతి వివక్షతను తొలగించడానికి ప్రయత్నించడం; పౌరహక్కుల కోసం పోరాడుతున్న వారికి మద్దతు ఇవ్వడం మొదలైనవి OIC లక్ష్యాలు.


ఆఫ్రికన్‌ యూనియన్‌ (African Union)
* 1963లో వలస పాలన నుంచి విముక్తి పొందిన దేశాలతో ‘‘ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఆఫ్రికా యూనియన్‌’’ (OAU) ఏర్పడింది. అప్పటి ఘనా దేశాధ్యక్షుడైన ‘‘క్వామిక్వైయా’’ దీని ఏర్పాటుకు విశేష కృషి చేశారు. రువాండా దేశంలో జరిగిన జాతుల పోరాటాలను, ఆఫ్రికా దేశాల మధ్య ప్రారంభమైన అంతర్గత పోరాటాలను నియంత్రించడంలో OAU విఫలమైంది.
* 2002, జులై 9న దక్షిణాఫ్రికాలోని ‘డర్బన్‌’లో జరిగిన సమావేశంలో 'OAU' ను ‘‘ఆఫ్రికన్‌ యూనియన్‌’’ (AU)గా మార్చారు.
* సభ్యదేశాల మధ్య ఉమ్మడి మార్కెటింగ్‌ విధానాలను అమలు పరచడం, ఉమ్మడి బ్యాంకింగ్‌ సేవల నిర్వహణ, స్వావలంబన, పరస్పర సహకారాన్ని పెంపొందించడం దీని ప్రధాన లక్ష్యాలు.
* AUకు తొలి ఛైర్మన్‌గా అప్పటి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు థాబో ఎంబెకీ వ్యవహరించారు.
* ఆఫ్రికన్‌ యూనియన్‌లో ప్రస్తుతం 55 సభ్యదేశాలు ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం అడీస్‌ అబాబా (ఇథియోపియా)లో ఉంది.
* ఆఫ్రికన్‌ యూనియన్‌లో ప్రధాన విభాగం ‘శాంతి భద్రతల మండలి’  (Peace and Security Council). దీనికి 15 సభ్యదేశాలు రొటేషన్‌ పద్ధతిలో ప్రాతినిధ్యం వహిస్తాయి.
* దీనిలోని మరో ప్రధాన విభాగం “New Partnership for Africa’s Development (NEPAD)”. అంతర్జాతీయ పెట్టుబడులకు తగిన భద్రతను కల్పించడం దీని ప్రధాన లక్ష్యం.

Posted Date : 03-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత రాజ్యాంగ నిర్మాణం

   భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ రూపొందించింది. రాజ్యాంగ పరిషత్ సభ్యులంతా పరోక్షంగా ఎన్నికైనవాళ్లే. జాతీయోద్యమంలో భాగంగా ఏర్పడిన విలువలకు అద్దం పడుతూ, భారత ప్రజల చిరకాల వాంఛ అయిన స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు, న్యాయం లాంటి రాజనీతి భావాలకు ప్రాధాన్యమిస్తూ.. రాజ్యాంగ రచన కొనసాగింది. భారతదేశ ప్రజలు 'రాజ్యాంగ పరిషత్' ఏర్పరచుకుని, తద్వారా రాజ్యాంగ రచన కొనసాగించాలని తొలుత ఎం.ఎన్.రాయ్ అభిప్రాయపడ్డారు.
       1930 - 32 మధ్యకాలంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో భారతీయులకు ప్రత్యేక రాజ్యాంగం కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 1940 ఆగస్టులో (ఆగస్టు ప్రతిపాదన) భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును బ్రిటన్ సూచనప్రాయంగా అంగీకరించింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం అధికారంలోకి వచ్చిన లేబర్ పార్టీ అధినేత అట్లీ భారత దేశానికి స్వాతంత్య్రం ఇచ్చి, రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి అంగీకరించారు. అంతకు ముందే, అంటే 1942లో క్రిప్స్ ప్రతిపాదనల ద్వారా బ్రిటిషర్లు తమ ఉద్దేశాలను మార్మికంగా తెలిపారు. ఆ తర్వాత 1946లో కేబినెట్ మిషన్ ప్లాన్ సూచనను అనుసరించి రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు.

 

రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు...
       1946 జూన్‌లో రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికలు జరిగాయి. దేశ జనాభాలో సుమారుగా ప్రతి 10 లక్షల జనాభాకు ఒక సభ్యుని చొప్పున రాజ్యాంగ పరిషత్‌లో ప్రాతినిధ్యం కల్పించారు. 
కేబినెట్ మిషన్ ప్లాన్ సూచన అనుసరించి బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి 292 మంది సభ్యులను ఎన్నుకున్నారు. స్వదేశీ సంస్థానాలకు 93 మందిని కేటాయించారు. చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల నుంచి నలుగురికి ప్రాతినిధ్యం కల్పించారు. మొత్తం సభ్యులు 389 మంది. అయితే దేశ విభజన కారణంగా ముస్లింలీగ్ సభ్యులు రాజ్యాంగ పరిషత్ నుంచి వైదొలగడంతో సభ్యుల సంఖ్య 299కి పడిపోయింది. వీరిలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు 229 మంది, స్వదేశీ సంస్థానాలకు 70 మంది ప్రాతినిధ్యం వహించారు.

 

రాజ్యాంగ పరిషత్ నిర్మాణం, పనితీరు...
       రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశాన్ని డిసెంబరు 9, 1946న నిర్వహించారు. ముస్లింలీగ్ ఈ సమావేశంలో పాల్గొనలేదు. సమావేశానికి డాక్టర్ సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించారు. తర్వాత డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్‌ను అధ్యక్షుడిగా, హెచ్.సి.ముఖర్జీని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. రాజ్యాంగ పరిషత్‌కు సలహాదారుగా బి.ఎన్.రావు వ్యవహరించారు. మనదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక కాబట్టి రాజ్యాంగ పరిషత్తులోనూ అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారు.

 

 

 

  
 

రాజ్యాంగ పరిషత్‌లోని వివిధ కమిటీలు
* రాజ్యాంగ పరిషత్ కార్యకలాపాల్లో భాగంగా ఎన్నో కమిటీలను నియమించింది. ఇందులో ప్రధానమైనవి ఎనిమిది. ఈ కమిటీలు, వాటి ఛైర్మన్‌ల వివరాలు.....
కేంద్ర అధికారాల కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
కేంద్ర రాజ్యాంగ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
రాష్ట్రాల రాజ్యాంగ కమిటీ - సర్దార్ వల్లభాయి పటేల్
ముసాయిదా కమిటీ - డా.బి.ఆర్.అంబేడ్కర్
ప్రాథమిక హక్కులు, మైనారిటీ కమిటీ - సర్దార్ వల్లభాయి పటేల్
(ఇందులో రెండు ఉప కమిటీలు ఉన్నాయి.)
అవి: a) ప్రాథమిక హక్కుల ఉప కమిటీ - జె.బి.కృపలానీ
      b) మైనారిటీ ఉప కమిటీ - హెచ్.సి.ముఖర్జీ
నియమ నిబంధనల కమిటీ - డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్
రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
సారథ్య కమిటీ - డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్
 పై కమిటీల్లో అత్యంత ముఖ్యమైంది ముసాయిదా కమిటీ. రాజ్యాంగాన్ని క్షుణ్నంగా పరిశీలించి, రూపొందించాల్సిన గొప్ప బాధ్యత ఈ కమిటీకి అప్పజెప్పారు. ఇందులో ఏడుగురు సభ్యులు....
* డా.బి.ఆర్.అంబేడ్కర్ (ఛైర్మన్)
* ఎన్.గోపాలస్వామి అయ్యంగార్
* అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
* డా.కె.ఎం.మున్షి
* సయ్యద్ మహ్మద్ సాదుల్లా
* ఎన్.మోహనరావు (బి.ఎల్.మిట్టల్ స్థానంలో)
* టి.టి.కృష్ణమాచారి (డి.పి.ఖైతాన్ స్థానంలో)

Posted Date : 07-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత రాజ్యాంగం - స్వభావం

రాజ్యాంగం అంటే
ఒక దేశ ప్రజలు, పాలకులు, పాలనా యంత్రాంగం పాటించాల్సిన అత్యున్నత చట్టం. దీనిలో ప్రభుత్వ విభాగాలు, దాని స్వరూపం, స్వభావం, లక్ష్యాలు, ఆశయాలను వివరించారు. రాజ్యాంగం అనేది లేకపోతే పాలనా వ్యవస్థ అదుపు తప్పి అరాచక, అస్తవ్యస్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది. 

 

రాజ్యాంగం - మూలాలు
 ప్రపంచంలో రాజనీతిని శాస్త్రీయంగా మొదటిసారిగా అధ్యయనం చేసినవారు గ్రీకు దేశీయులు. రాజనీతిశాస్త్ర పితామహుడు, గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ 158 రాజ్యాంగాలను విస్తృతంగా అధ్యయనం చేసి రాజ్యాంగం అనే భావనను తొలిసారిగా ప్రతిపాదించి, వివరించాడు.  ప్రపంచంలో తొలి రాజ్యాంగం బ్రిటిష్ రాజ్యాంగం. అయితే ఇది పరిణామాత్మక రాజ్యాంగం. ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగంగా అమెరికా రాజ్యాంగం అవతరించింది. రాజ్యాంగాన్ని సవరించడానికి అనుసరించే పద్ధతుల ఆధారంగా దాన్ని దృఢ, అదృఢ రాజ్యాంగంగా పేర్కొంటారు.

 

దృఢ రాజ్యాంగం
 ఏదైనా రాజ్యాంగాన్ని ప్రత్యేక మెజార్టీ ద్వారా అంటే 2/3వ లేదా 3/4వ వంతు మెజారిటీతో సవరించేది. ఈ విధానంలో రాజ్యాంగ సవరణ కఠినం. దీనికి ఉదాహరణ అమెరికా రాజ్యాంగం.

 

అదృఢ రాజ్యాంగం
ఏదైనా రాజ్యాంగాన్ని సాధారణ మెజార్టీ ద్వారా సవరించగలిగితే దాన్ని అదృఢ రాజ్యాంగం అంటారు. దీనికి ఉదాహరణ బ్రిటిష్ రాజ్యాంగం. రాజ్యాంగాన్ని రూపొందించడానికి ముందుగా ఏర్పాటు చేసేదే రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ పరిషత్. ప్రపంచంలో మొదటిసారిగా ఏర్పడిన రాజ్యాంగ పరిషత్తు క్రీ.శ.1787 నాటి అమెరికాలోని ఫిలడెల్ఫియా కన్వెన్షన్.
మన దేశంలో రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటును తొలిసారిగా ప్రతిపాదించిన భారతీయుడు ఎమ్.ఎన్. రాయ్ (1934) కాగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటును ప్రతిపాదించిన తొలి రాజకీయ పార్టీ స్వరాజ్యపార్టీ. 1942 నాటి క్రిప్స్ మిషన్ రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటును అధికారికంగా ప్రతిపాదించింది. 1918 డిసెంబరులో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో భారతీయ ప్రజాప్రతినిధులతో కూడిన రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయాలని తీర్మానించారు.


గాంధీజీ అభిప్రాయం 
గాంధీజీ 1922, జనవరి 5న యంగ్ ఇండియా అనే పత్రికలో ''స్వరాజ్ అనేది బ్రిటిష్‌వారు ఇచ్చే భిక్షకాదు, భారత ప్రజలు రాజకీయ భిక్షాటకులు కాదు" అని అన్నారు. 'రాజ్యాంగ నిర్మాణ సభ మాత్రమే దేశానికి అవసరమైన రాజ్యాంగాన్ని రూపొందించగలదు' అని పేర్కొన్నారు. 1937లో ఫైజాపూర్ వద్ద జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్  సమావేశంలో మొదటిసారిగా అధికార పూర్వకంగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటుకు డిమాండ్ చేశారు.

రాజ్యాంగ అభివృధ్ధి క్రమం
భారత రాజ్యాంగ అభివృధ్ధి క్రమాన్ని బి.సి. రావత్ అనే పండితుడు 6 దశలుగా అధ్యయనం చేయవచ్చని పేర్కొన్నాడు. అవి:
    1. మొదటి దశ: క్రీ.శ.1600 నుంచి 1773 వరకు
    2. రెండో దశ: క్రీ.శ.1773 నుంచి 1858 వరకు
    3. మూడో దశ: క్రీ.శ.1858 నుంచి 1909 వరకు
    4. నాలుగో దశ: క్రీ.శ.1909 నుంచి 1935 వరకు
    5. అయిదో దశ: క్రీ.శ.1935 నుంచి 1947 వరకు
    6. ఆరో దశ: క్రీ.శ.1947 నుంచి 1950 వరకు 

 

మొదటి దశ: క్రీ.శ.1600 నుంచి 1773 వరకు
క్రీ.శ.1600 డిసెంబరు 31న ఎలిజబెత్ మహారాణి అనుమతితో బ్రిటన్‌కు చెందిన ప్రైవేట్ వర్తకుల సంఘం ఈస్టిండియా కంపెనీ పేరుతో మన దేశంలో వర్తక, వాణిజ్యం నిర్వహించుకునే అవకాశాన్ని దక్కించుకుంది. ఈస్టిండియా కంపెనీ తన అధికార విస్తరణలో భాగంగా క్రీ.శ.1773 నాటికి 3 రాష్ట్రాలను స్వాధీనం చేసుకుంది.
అవి: 1) మద్రాసు
        2) బొంబాయి
        3) బెంగాల్
క్రీ.శ.1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయులు ఘన విజయం సాధించి, భారత్‌లో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేశారు. క్రీ.శ.1764లో జరిగిన బక్సార్ యుద్ధంలో విజయం సాధించిన ఆంగ్లేయులు మొగల్ చక్రవర్తి నుంచి దివానీ హక్కులు పొందారు. ఈస్టిండియా కంపెనీ భారీగా అవకతవకలకు పాల్పడేది.  ఈస్టిండియా కంపెనీలో జరుగుతున్న అవినీతిని వెలికితీయడానికి జనరల్ బుర్గోయిన్ అధ్యక్షతన బ్రిటిష్ ప్రభుత్వం ఒక రహస్య కమిటీని నియమించింది. ఈ కమిటీ ఈస్టిండియా కంపెనీలో భారీగా అవినీతి జరగుతుందని పేర్కొంటూ భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ కార్యక్రమాలను క్రమబద్ధం చేయాలని సిఫారసు చేసింది. ఈ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం 1773లో రెగ్యులేటింగ్ చట్టాన్ని చేసింది.

 

రెండో దశ: 1773 నుంచి 1858 వరకు
రెగ్యులేటింగ్ అంటే క్రమబద్ధం చేయడం అని అర్థం. భారత్‌లో ఈస్టిండియా కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధం చేయడానికి మనదేశంలో బ్రిటిష్‌వారు మొదటగా చేసిన చట్టం ఇది.
చట్టంలోని ముఖ్యాంశాలు
* ఈ చట్టాన్ని బ్రిటిష్ ప్రధాని లార్డ్ నార్త్ 1773, మే 18న బ్రిటిష్ పార్లమెంటులో ప్రవేశపెట్టాడు.
* ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం ఈస్టిండియా కంపెనీ (E.I.C.)కి భారతదేశంలో 20 సంవత్సరాల పాటు వ్యాపారం చేసుకునే అనుమతిని మంజూరు చేసింది.
* ఈ చట్టాన్ని అనుసరించి మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీలను బెంగాల్ రాష్ట్ర పరిధిలోకి తీసుకువచ్చారు.
* బెంగాల్ గవర్నర్ పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిగా మార్చారు.
* వారన్ హేస్టింగ్స్ 1773 అక్టోబరు 20న బెంగాల్ గవర్నర్ జనరల్‌గా నియమితులయ్యారు.   
* వారన్ హేస్టింగ్స్ బెంగాల్ గవర్నర్‌గా ఉన్న కాలంలోనే మనదేశంలో 1772లో కలెక్టర్ పదవిని సృష్టించారు.
* ఈ చట్టం ప్రకారం 1774లో కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో తొలిసారిగా సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు.
ఈ సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు సాధారణ న్యాయమూర్తులను నియమించారు. వారు:

 

* బెంగాల్ గవర్నర్ జనరల్‌కు సలహా ఇచ్చేందుకు నలుగురు సభ్యులతో కూడిన కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. అందులో క్లావెరింగ్, బార్‌వెల్, ఫిలిప్ ఫ్రాన్సిస్, మాన్‌సన్ ఉన్నారు.

సెటిల్‌మెంట్ చట్టం - 1781
* ఈ చట్టం ద్వారా భారత్‌లో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అని పేర్కొనడం ద్వారా బ్రిటిష్‌వారు అధికారికంగా మనదేశంపై తమ అధికారాన్ని వ్యవస్థాపితం చేశారు.

పిట్స్ ఇండియా చట్టం - 1784
* ఈ చట్టం ద్వారా రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించేందుకు ప్రయత్నించారు.
* ఈ చట్టాన్ని ఆనాటి బ్రిటిష్ ప్రధాని విలియం పిట్ జూనియర్ కాలంలో 1784లో బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించడం వల్ల దీనికి పిట్స్ ఇండియా చట్టం అనే పేరు వచ్చింది. 
* బెంగాల్ గవర్నర్ జనరల్‌గా వారన్ హేస్టింగ్స్ ఉన్న సమయంలో ఈ చట్టాన్ని చేశారు.
ముఖ్యాంశాలు
* ఈ చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీలో మొదటిసారిగా ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు.
* ఈ చట్టం ద్వారా భారతదేశంలో పరిపాలనాంశాలను 2 రకాలుగా విభజించారు.

1. వ్యాపార వ్యవహారాలు:
* వీటి నియంత్రణకు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌ను ఏర్పాటు చేశారు.
2. రాజకీయ వ్యవహారాలు
* వీటి నియంత్రణకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేశారు.
* ప్రభుత్వ పాలన, న్యాయం, శాంతిభద్రతలు లాంటి వ్యవహారాలను ఇది నియంత్రిస్తుంది.
* ముగ్గురు డైరెక్టర్లతో కూడిన ఒక రహస్య కమిటీ ఈ బోర్డ్ ఆదేశాలను భారతదేశానికి తెలియజేసేది.
* గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలికి ప్రెసిడెన్సీ ప్రాంతాలపై ప్రత్యక్ష నియంత్రణ అధికారాన్ని కల్పించారు.

చార్టర్ చట్టం - 1793
* చార్టర్ అంటే 'ఒప్పందం' అని అర్థం.
* ఈ చట్టాన్ని గవర్నర్ జనరల్ కారన్ వాలీస్ కాలంలో చేశారు.
* ఈ చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీ వ్యాపార హక్కులను మరోసారి 20 సంవత్సరాలు పొడిగించారు.
* గవర్నర్ జనరల్‌కు కౌన్సిల్ తీర్మానాలపై వీటో అధికారాన్ని కల్పించారు.
* బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌లోని సభ్యుల జీతాలు, ఇతర ఖర్చులు భారతదేశ రెవెన్యూ నుంచి చెల్లించేవారు.
* కమాండర్ ఇన్ చీఫ్ గవర్నర్ జనరల్ కౌన్సిల్‌లో సభ్యుడు కాదు.

 

చార్టర్ చట్టం - 1813
* ఈస్టిండియా కంపెనీ పాలనను మరో 20 ఏళ్లు పొడిగించారు.
* ఈ చట్టం ప్రకారం భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని రద్దు చేస్తూ (తేయాకు, చైనాతో వ్యాపారం మినహా) బ్రిటిష్ పౌరులందరికీ స్వేచ్ఛా వ్యాపార అవకాశాలను కల్పించారు.
* స్థానిక సంస్థలకు పన్నులు విధించే అధికారాన్ని, అవి చెల్లించని వారిపై చర్యలను తీసుకునే అధికారాన్ని అప్పగించారు.
* భారతదేశంలో విద్యావ్యాప్తికి సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు కేటాయించారు.
* ప్రభుత్వ ఉద్యోగాల్లో భారతీయులకు అవకాశం కల్పించారు.
* భారత్‌లోకి క్రైస్తవ మిషనరీల రాకను ఆహ్వానించారు.
* ఇది మనదేశంలో మతమార్పిడులకు కారణమైంది.
* కంపెనీ ఆదాయంపై, వ్యాపార లాభాలపై ప్రభుత్వానికి నియంత్రణ కల్పించారు.
* ప్రైవేట్ వ్యక్తులకు కూడా భూములు కొనుగోలు చేసుకునే హక్కులు కల్పించారు.
* బోర్డ్ ఆఫ్ కంట్రోల్ పరిధిని మరింత విస్తృతపరచారు.

 

చార్టర్ చట్టం - 1833
* ఈ చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీ పాలనను మరో 20 ఏళ్లపాటు పొడిగించారు.
* బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను భారతదేశ గవర్నర్ జనరల్‌గా మార్చారు.
* దీని ఫలితంగా బెంగాల్ గవర్నర్ జనరల్‌గా ఉన్న విలియం బెంటింక్ భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్‌గా మారారు. 
* ఇతడికి సివిల్, మిలిటరీ, ఆర్థిక అధికారాలు అప్పగించారు.
* రాష్ట్ర ప్రభుత్వాల శాసనాధికారాలను రద్దు చేసి, కార్యనిర్వహణ అధిపతియైన గవర్నర్ జనరల్‌కు పూర్తి శాసనాధికారాలను అప్పగించారు.
* కంపెనీ వ్యాపార లావాదేవీలను రద్దుచేసి, పరిపాలనా సంస్థగా మార్చారు.
* గవర్నర్ కార్యనిర్వాహక మండలి సభ్యులను నాలుగుకు పెంచి, అందులో ఒక న్యాయ సభ్యుడు ఉండేలా సవరణ చేశారు.
* మొదటి న్యాయ సభ్యుడిగా మెకాలేను నియమించారు.
* తేయాకు, చైనాతో వ్యాపారాన్ని కంపెనీ ఆధీనంలో నుంచి తొలగించారు.
* భారతదేశంలో బానిసత్వాన్ని రద్దు చేశారు. కానీ లార్డ్ ఎలిన్‌బరో వ్యతిరేకించడం వల్ల ఇది అమల్లోకి రాలేదు.
* సివిల్ సర్వీసుల నియామకాల్లో సార్వజనీన పోటీ పద్ధతిని ప్రతిపాదించారు. కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించడం వల్ల ఇది అమల్లోకి రాలేదు.
* ఈ చట్టాన్ని భారతదేశంలో కేంద్రీకృత పాలనకు తుది మెట్టుగా అభివర్ణిస్తారు.
* యూరోపియన్లు భారతదేశానికి వలస వచ్చేందుకు; భూమి, ఆస్తులు సంపాదించుకునేందుకు ఉన్న నియంత్రణలను తొలగించి వారికి పూర్తిస్థాయిలో స్వేచ్ఛను కల్పించారు.
* దీని వల్ల బ్రిటిష్ వలస రాజ్య స్థాపనకు చట్టబద్ధత కల్పించినట్లయ్యింది.
* భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి ఒక భారతీయ లా కమిషన్‌ను ఏర్పరిచారు. దీని మొదటి అధ్యక్షుడిగా లార్డ్ మెకాలేను నియమించారు.
* భారతీయ పాలనలో కోవనెంటెడ్ పోస్టుల్లో ప్రతిభ ఉన్న భారతీయులను నియమించాలని రాజా రామ్ మోహన్‌ రాయ్ మొదటిసారిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.
* ఈ చట్టాన్ని సెయింట్ హెలీనా చట్టంగా పేర్కొంటారు.

 

చార్టర్ చట్టం - 1853
* ఈస్టిండియా కంపెనీ పాలనలో ప్రవేశపెట్టిన చివరి చార్టర్ చట్టం.
* ఈ చట్టం ద్వారా లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను వేరుచేశారు.
* శాసనాలు రూపొందించే ప్రక్రియ కోసం ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌ను ఏర్పరిచారు.
* ఇది బ్రిటిష్ పార్లమెంటులా తన విధులను నిర్వహిస్తుంది. అందుకే దీన్ని మినీ పార్లమెంటు అంటారు.
* సివిల్ సర్వీస్ పరీక్షల్లో జాతి వివక్ష లేకుండా భారతీయులకు అనుమతి కల్పించి సార్వజనీన పోటీ విధానం ద్వారా నియమించే పద్ధతిని ప్రవేశపెట్టారు. దీనికోసం 1854లో లార్డ్ మెకాలే కమిటీని ఏర్పాటు చేశారు.
* కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిధ్యాన్ని కల్పించారు. మొత్తం ఆరుగురు శాసన సభ్యుల్లో నలుగురిని మద్రాస్, బొంబాయి, బెంగాల్, ఆగ్రా ప్రాంతాల నుంచి తీసుకున్నారు.
* శాసన నిర్మాణంలో భారతీయులకు తొలిసారిగా అవకాశం కల్పించారు. అయితే తుది నిర్ణయాధికారం మాత్రం గవర్నర్ జనరల్‌దే.
* వివిధ లా కమిషన్‌ల సిఫారసుల ద్వారా సివిల్ ప్రొసీజర్ కోడ్ (1859), ఇండియన్ పీనల్ కోడ్ (1860), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (1861)లను రూపొందించారు.
* కంపెనీ పాలనకు సంబంధించి నిర్దిష్ట వ్యవధిని పేర్కొనక పోవడం వల్ల కంపెనీ పాలన చక్రవర్తి చేతుల్లోకి మారడానికి ఈ చార్టర్ చట్టం అవకాశం కల్పించింది.
* 1773 నుంచి 1858 వరకు భారతదేశం ఈస్టిండియా కంపెనీ పాలన కింద ఉండేది. ఈ కాలంలో చేసిన చట్టాలను చార్టర్ చట్టాలు అంటారు.
* 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటును ఈస్టిండియా కంపెనీ సమర్థవంతంగా అణిచివేయలేదని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. 1858 నుంచి బ్రిటిష్ రాజు / రాణి నేరుగా అధికారాన్ని చేపట్టడం ప్రారంభమైంది. అందుకే 1858 తర్వాత చేసిన చట్టాలు భారత ప్రభుత్వ చట్టాలు లేదా కౌన్సిల్ చట్టాలుగా పేరొందాయి.

 

మూడో దశ: 1858 నుంచి 1909 వరకు
భారత ప్రభుత్వ చట్టం: 1858

* 1857 సిపాయిల తిరుగుబాటు అణిచివేత అనంతరం 1858, నవంబరు 1న బ్రిటిష్ రాణి విక్టోరియా మహారాణి భారతదేశ పరిపాలనా బాధ్యతలను స్వీకరిస్తూ ఒక ప్రకటనను జారీ చేసింది. 

అందులోని మఖ్యాంశాలు:
* ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు డి.డి. బసు ప్రకారం ఈ చట్టంతోనే భారత రాజ్యాంగ చరిత్ర ప్రారంభమైందని పేర్కొన్నారు.
* భారతదేశ గవర్నర్ జనరల్ అనే పదవిని భారతదేశ వైస్రాయిగా మార్చారు.
* భారత గవర్నర్ జనరల్, భారత వైస్రాయి అనే పదవులను ఒకే వ్యక్తి నిర్వహిస్తారు. మొదటి గవర్నర్ జనరల్, వైస్రాయి లార్డ్ కానింగ్.
* బ్రిటిష్ పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ జనరల్‌గా, స్వదేశీ సంస్థానాల్లో వైస్రాయిగా ఆ వ్యక్తి వ్యవహరిస్తారు.
* వైస్రాయి దేశంలో బ్రిటిష్ రాణి మొదటి ప్రత్యక్ష ప్రతినిధి. ఇతడు దేశ పాలనను బ్రిటిష్ రాణి పేరుతో నిర్వహిస్తాడు.
* ఈ చట్టం ద్వారా మన దేశంలో ఈస్టిండియా కంపెనీ పాలన రద్దయింది.
* భారతదేశంలో బ్రిటిష్ ప్రత్యక్ష పాలన ప్రారంభమైంది.
* ఇంగ్లండ్‌లో భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని సృష్టించారు.
* భారత రాజ్య కార్యదర్శి బ్రిటిష్ కేబినెట్‌లో భాగంగా భారతదేశ పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి బాధ్యత వహిస్తాడు.
* భారత రాజ్య కార్యదర్శికి పరిపాలనలో సలహాలు ఇవ్వడానికి 15 మంది సభ్యులతో ఒక సలహా సంఘాన్ని (కౌన్సిల్) ఏర్పాటు చేశారు.
* మొదటి భారత రాజ్య కార్యదర్శి: చార్లెస్ ఉడ్.
* భారత పాలనా వ్యవస్థలో క్రమానుగత శ్రేణిలో కేంద్రీకృత పాలనా వ్యవస్థను ప్రవేశపెట్టారు.
* ఈ చట్టాన్ని గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియాగా పేర్కొంటారు.
* ఈ చట్టాన్ని విక్టోరియా మహారాణి భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు మాగ్నాకార్టా లాంటిదిగా అభివర్ణించింది.
* ఈ చట్టం ద్వారా మనదేశంలో 1784లో ప్రవేశపెట్టిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ద్వంద్వ పాలన రద్దయ్యింది.
* ఈ చట్టం ద్వారా బ్రిటిష్ రాణి భారత సామ్రాజ్ఞి బిరుదు పొందింది.

* భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విధానంలో భాగంగా క్రమానుగత శ్రేణి పద్ధతి కింది విధంగా ఉంది.

 

 

 

కౌన్సిల్ చట్టం: 1861
* ఈ చట్టం భారతీయులకు శాసన నిర్మాణంలో పాలుపంచుకునే అవకాశం కల్పించింది.
* 1858లో విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా భారతదేశం బ్రిటిష్ ప్రత్యక్ష పాలన కిందకు వచ్చింది. దీనిలో భాగంగా భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ పార్లమెంటు రూపొందించిన చట్టాలన్నింటినీ కౌన్సిల్ చట్టాలుగా పేర్కొంటారు.
* భారతరాజ్య కార్యదర్శితో కూడిన 15 మంది కౌన్సిల్ సభ్యుల పేరుమీద చట్టాలను రూపొందిచడం వల్ల ఈ చట్టాలను కౌన్సిల్ చట్టాలు అంటారు.
* 1859లో లార్డ్ కానింగ్ కాలంలో మనదేశంలో ప్రవేశపెట్టిన పోర్ట్‌ఫోలియో విధానానికి చట్టబద్దత కల్పించారు.
* ప్రభుత్వంలోని మంత్రిమండలి సభ్యులకు శాఖలను కేటాయించడాన్ని పోర్ట్‌ఫోలియో విధానం అంటారు.
* 1862లో కలకత్తా, మద్రాస్, బొంబాయిలలో హైకోర్టులు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1866లో అలహాబాద్‌లో నాలుగో హైకోర్టును ఏర్పాటు చేశారు.
* 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా రద్దు చేసిన బొంబాయి, మద్రాస్ ప్రెసిడెన్సీల శాసన అధికారాలను పునరుద్ధరించడం ద్వారా వికేంద్రీకృత పాలనకు బీజాలు వేశారు.
* గవర్నర్ జనరల్‌కు ఆర్డినెన్స్‌లు జారీ చేసే అధికారం కల్పించారు.
* 1862లో వైస్రాయి లార్డ్ కానింగ్ కొంతమంది భారతీయులను అనధికార సభ్యులుగా నామినేట్ చేశాడు. ఈ విధంగా నామినేట్ అయినవారిలో బెనారస్ రాజు దేవ్ నారాయణ్‌సింగ్, పాటియాలా రాజు నరేంద్రసింగ్, సర్ దినకర్ రావు ఉన్నారు.
* బెంగాల్, పంజాబ్, ఈశాన్య సరిహద్దు ప్రావిన్సులతో నూతన లెజిస్లేటివ్ కౌన్సిళ్లను ఏర్పాటు చేశారు.
* ప్రభుత్వ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన సంవత్సర నివేదిక అయిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టే పద్ధతిని ప్రారంభించారు.

 

కౌన్సిల్ చట్టం: 1892
* 1885లో మనదేశంలో భారత జాతీయ కాంగ్రెస్ (I.N.C.) ఏర్పడి జాతీయోద్యమాన్ని ప్రారంభించింది. ఈ ఉద్యమంలో భాగంగా మితవాద నాయకులు గోపాలకృష్ణ గోఖలే నాయకత్వంలో పోరాడి ఆంగ్లేయులపై ఒత్తిడి తీసుకొచ్చారు.
* మితవాదులు బ్రిటిష్ పాలనలోని లోపాలను ఎత్తిచూపుతూ భారతీయ మేధావులను చైతన్యపరచి ప్రజాఉద్యమాన్ని నిర్మించారు. వీరిని ఎదుర్కొనేందుకు ఆంగ్లేయులు 1892 కౌన్సిల్ చట్టాన్ని చేశారు.
ఈ చట్టంలోని ముఖ్యాంశాలు
* ఈ చట్టం ద్వారా మొదటిసారిగా పరోక్ష పద్ధతిలో శాసన సభ్యులను ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు.
* కేంద్ర శాసనసభలో అనధికార సభ్యులను 10 మందికి తక్కువ కాకుండా, 16 మందికి మించకుండా, అలాగే రాష్ట్ర శాసనసభల్లో 8 మందికి తక్కువ కాకుండా 20 మందికి మించకుండా నియంత్రించారు.
* లెజిస్లేటివ్ కౌన్సిల్ అధికార పరిధిని విస్తృతపరిచి భారతీయులకు వైస్రాయి, గవర్నర్ల కౌన్సిళ్లలో స్థానం కల్పించారు. కౌన్సిల్‌లో ఆరుగురు భారతీయులకు ప్రాతినిధ్యం దక్కింది. వారు: 
     1. సురేంద్రనాథ్ బెనర్జీ
     2. దాదాభాయ్ నౌరోజీ
     3. గోపాలకృష్ణ గోఖలే
     4. ఫిరోజ్‌షా మెహతా
     5. రాస్‌బిహారి ఘోష్
     6. బిల్‌గ్రామీ
* ఈ చట్టం ద్వారా శాసనమండలి అధికారాలను విస్తృతం చేశారు. బడ్జెట్‌పై చర్చించడం లాంటి అధికారాలను కల్పించారు.
* ప్రజాప్రయోజనాల దృష్ట్యా శాసనసభల్లో ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు వేయడానికి సభ్యులకు అవకాశం కల్పించారు. అయితే ప్రశ్నలు అడగడానికి గవర్నర్, గవర్నర్ జనరల్‌ల ముందస్తు అనుమతి పొందాలి. శాసనసభల్లో తమ స్థానం నామమాత్రమే అని భావించిన భారతీయులు ఈ చట్టాన్ని వ్యతిరేకించారు.
ఈ దశలోని మరికొన్ని ముఖ్యాంశాలు
* లార్డ్ మెకాలే కృషి వల్ల భారత్‌లో 1835లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు.
* మెకాలే లా కమిషన్ చైర్మన్‌గా అనేక చట్టాలను క్రోడీకరించారు. 

 
* 1854 నాటి ఉడ్స్ డిస్పాచ్ భారత్‌లో ఆంగ్ల విద్యావిధానానికి మాగ్నాకార్టాగా పేరొందింది.
* కారన్ వాలీస్ భారత్‌లో సివిల్ సర్వీసులకు ఒక రూపం తీసుకొచ్చారు.
* లార్డ్ కర్జన్ చేసిన బెంగాల్ విభజన 1905, అక్టోబరు 16 నుంచి అమల్లోకి వచ్చింది.
* 1906లో ఢాకా నవాబు సలీముల్లాఖాన్ ఢాకాలో ముస్లింలీగ్‌ను ఏర్పరిచాడు. దీని మొదటి అధ్యక్షుడు ఆగాఖాన్.
* 1907లో సూరత్‌లో రాస్‌బిహారి ఘోష్ అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ అతివాదులు, మితవాదులుగా చీలిపోయింది.

నాలుగో దశ: 1909 - 1935
భారత కౌన్సిల్ చట్టం లేదా మింటో - మార్లే సంస్కరణలు: 1909

* 1892 కౌన్సిల్ చట్టంలోని లోపాలను సవరించడం, భారత్‌లో ఉద్ధృతమవుతున్న జాతీయోద్యమాన్ని ఎదుర్కోవడం, మితవాదులను సంతృప్తిపరచడం అనే లక్ష్యాల సాధనగా 1909లో మింటో మార్లే సంస్కరణలు చేశారు.
* ఆనాటి భారత వైస్రాయి మింటో, భారత రాజ్య కార్యదర్శి మార్లే పేర్లతో ఈ చట్టాన్ని చేయడం వల్ల దీన్ని మింటో - మార్లే సంస్కరణల చట్టం అంటారు.
ముఖ్యాంశాలు:
* మనదేశంలో మొదటిసారిగా పరిమిత ప్రాతిపాదికన ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టారు.
* కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌ను ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌గా మార్చారు.
* కేంద్ర, రాష్ట్ర శాసనమండళ్లలో సభ్యుల సంఖ్యను పెంచారు.
* వైస్రాయి కార్యనిర్వాహక కౌన్సిల్‌లోని సభ్యుల సంఖ్యను శాసన ప్రక్రియ కోసం 16 నుంచి 60కి పెంచారు.
* మద్రాస్, బెంగాల్, యునైటెడ్ ప్రావిన్స్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాల శాసనమండళ్లలో సభ్యత్వ సంఖ్యను 50కి; పంజాబ్, అస్సాం, బర్మాలలో 30కి పెంచారు.
* గవర్నర్ జనరల్ శాసనమండలిలో 4 రకాల సభ్యులుంటారు. వారు:
     1. నామినేటెడ్ అధికార సభ్యులు
     2. నామినేటెడ్ అనధికార సభ్యులు
     3. హోదారీత్యా సభ్యులు
     4. ఎన్నికైన సభ్యులు
* వైస్రాయి, గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో భారతీయులకు మొదటిసారిగా ప్రాతినిధ్యం కల్పించారు. కౌన్సిల్ సభ్యుడిగా నియమితులైన మొదటి భారతీయుడు సత్యేంద్రప్రసాద్ సిన్హా (న్యాయసభ్యుడు).
* 1906లో ఏర్పడిన ముస్లిం లీగ్ కృషి మేరకు మనదేశంలో ముస్లింలకు వారి జనాభాకు మించి ప్రత్యేక మత నియోజక వర్గాలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ముస్లిం సభ్యులను ముస్లింలే ఎన్నుకునేందుకు వీలైంది. అందుకే లార్డ్ మింటోను భారత్‌లో మత నియోజక వర్గాల పితామహుడిగా పేర్కొంటారు. ఈ విధానం 1947లో దేశ విభజనకు పునాది వేసింది.
* శాసనసభలో బడ్జెట్‌తో సహా అన్ని అంశాలపై ప్రశ్నించే అవకాశాన్ని, తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశాన్ని భారతీయులకు కల్పించారు.
* ఈ చట్టం ద్వారా ప్రెసిడెన్సీ కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు, భూస్వాములు, వ్యాపార సంస్థలకు కూడా ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించారు.
* కేంద్ర, రాష్ట్ర శాసనమండళ్లలో పోటీ చేసే అభ్యర్థులకు కచ్చితమైన అర్హతలను నిర్దేశించారు.
* 1911లో రెండో లార్డ్ హార్డింజ్ కాలంలో బెంగాల్ విభజనను రద్దు చేసి, భారతదేశ రాజధానిగా కలకత్తాకు బదులు దిల్లీని నిర్దేశించారు.
* మింటో మార్లే చట్టాన్ని చంద్రకాంతితో పోల్చారు. ఇది కేవలం నీడ లాంటి ఆకారాన్ని మాత్రమే అందించింది. ఈ చట్టం హిందువులు, ముస్లింల మధ్య వేర్పాటు బీజాలు నాటి భారతదేశ విభజనకు కారణమైందని జవహర్‌లాల్ నెహ్రూ వ్యాఖ్యానించారు.

మాంటేగ్ - ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం: 1919
* భారత రాజ్య కార్యదర్శి మాంటేగ్, గవర్నర్ జనరల్ చెమ్స్‌ఫర్డ్ ఈ చట్టాన్ని రూపొందిచడం వల్ల దీనికి మాంటేగ్ - చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం అని పేరు వచ్చింది.
రూపొందించడానికి కారణాలు
* 1916 ఏప్రిల్‌లో పుణె కేంద్రంగా బాలగంగాధర తిలక్, సెప్టెంబరులో మద్రాస్ కేంద్రంగా అనిబిసెంట్ హోంరూల్ ఉద్యమాన్ని ప్రారంభించి భారత జాతీయోద్యమాన్ని బలోపేతం చేయడం.
* 1909 నాటి మింటో మార్లే సంస్కరణల చట్టం భారతీయులను సంతృప్తి పరచలేకపోవడం.
* 1919, ఏప్రిల్ 13న పంజాబ్‌లో జనరల్ డయ్యర్ వికృత చేష్ట జలియన్ వాలాబాగ్ దురంతం వల్ల భారతీయుల్లో పెల్లుబికిన ఆగ్రహ జ్వాలలను చల్లబరచడం.
* రౌలత్ చట్టాన్ని గాంధీజీ BLACK ACT (నల్ల చట్టం)గా అభివర్ణించి 1919, ఏప్రిల్ 6న జాతిని అవమానించిన దినంగా పాటించాలని భారతీయులకు పిలుపు నివ్వడం.
ముఖ్యాంశాలు
* భారతదేశంలో తొలిసారిగా బాధ్యతాయుతమైన పరిపాలనను ప్రవేశపెట్టారు. పార్లమెంటరీ విధానం ప్రారంభమైంది.
* భారత రాజ్య కార్యదర్శి వేతనాలను భారత ఆదాయం నుంచి కాకుండా బ్రిటన్ నుంచి చెల్లిస్తారు.
* కేంద్ర శాసనసభలో మొదటిసారిగా ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. అవి:

1. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ (ఎగువ సభ)
* దీనిలో 60 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 34 మంది ఎన్నికైనవారు. 26 మంది గవర్నర్ జనరల్ నామినేట్ చేసినవారు ఉంటారు.
* వీరి పదవీ కాలం 5 సంవత్సరాలు.
* దీనికి ఫ్రెడరిక్ వైట్ అధ్యక్షుడిగా పనిచేశారు.
* దీనికి గవర్నర్ జనరల్ ఎక్స్ అఫీషియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

2. లెజిస్లేటివ్ కౌన్సిల్ (దిగువ సభ)
* ఈ సభలో మొత్తం సభ్యుల సంఖ్య 144. వీరిలో 103 మంది ఎన్నికైనవారు కాగా, 41 మంది నామినేటెడ్ సభ్యులు.
* ఈ సభ పదవీకాలం 3 సంవత్సరాలు.
* ఈ సభకు తొలి అధ్యక్షుడు - విఠల్‌భాయ్ పటేల్, తొలి ఉపాధ్యక్షుడు - సచ్చిదానంద సిన్హా.
* కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, లెజిస్లేటివ్ అసెంబ్లీలను 1921లో ఏర్పాటు చేశారు.
* కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉండే పాలనాంశాలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితాలుగా విభజించారు.

 

1. కేంద్ర జాబితా
* ఈ జాబితాలో మొత్తం 47 అంశాలను చేర్చారు.
* జాతీయ ప్రాముఖ్యం గల అంశాలన్నీ ఈ జాబితాలో ఉన్నాయి.
ఉదా: దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, ప్రభుత్వ రుణం, నౌకాయానం, తంతి తపాలా, రక్షణ, కరెన్సీ, ఎగుమతులు, దిగుమతులు.

 

2. రాష్ట్ర జాబితా
* ఈ జాబితాలో మొత్తం 51 అంశాలను చేర్చారు.
* ప్రాంతీయ ప్రాముఖ్యం ఉన్న అంశాలను రాష్ట్ర జాబితాలో చేర్చారు.
ఉదా: ప్రజారోగ్యం, విద్య, వ్యవసాయం, అడవులు, స్థానిక ప్రభుత్వాలు, శాంతి భద్రతలు, రోడ్డు రవాణా, నీటిపారుదల.
* ఈ చట్టం ద్వారా రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలన (Dyarchy)ను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ప్రభుత్వ పాలనాంశాలను రెండు జాబితాలుగా వర్గీకరించారు. అవి:

 

1. రిజర్వ్‌డ్ జాబితా
* దీనిలో మొత్తం 28 పాలనాంశాలను నిర్దేశించారు.
* అత్యంత ప్రాధాన్యం ఉన్న అధికారాలు, ఆదాయమున్న విత్తం, భూమిశిస్తు, న్యాయం, నీటిపారుదల, పరిశ్రమలు మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి.
* ఈ అంశాలకు సంబంధించిన పరిపాలనాంశాలను కార్యనిర్వాహక మండలి సహాయంతో ఆయా రాష్ట్రాల గవర్నర్లు నిర్వహిస్తారు. ఈ కార్యనిర్వాహక వర్గ సభ్యులు తమ విధి నిర్వహణలో రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు.

 

2. ట్రాన్స్‌ఫర్డ్ జాబితా
* దీనిలో మొత్తం 22 అంశాలు ఉంటాయి.
* అధికారాలు లేని, ప్రాముఖ్యం లేని కేవలం బాధ్యతలు మాత్రమే కలిగి ఉండే అంశాలను దీనిలో చేర్చారు.
* స్థానిక పాలన, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, వ్యవసాయం దీనిలో ఉన్నాయి.
* రాష్ట్ర గవర్నర్లు ఈ అంశాల పాలనా వ్యవహారాలను భారతీయ మంత్రుల సహాయంతో నిర్వహిస్తారు. భారతీయ మంత్రులు ఆయా రాష్ట్ర శాసనసభల్లో సభ్యులై ఉంటారు. వీరు తమ విధుల నిర్వహణలో శాసనసభకు బాధ్యత వహిస్తారు.
» చట్టసభల్లో సిక్కులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారు.
» చట్టసభల్లో క్రైస్తవులకు, ఆంగ్లో ఇండియన్లకు, యూరోపియన్లకు కూడా ప్రత్యేక నియోజక వర్గాలు కేటాయించడం ద్వారా మతపరమైన ప్రాతినిధ్యాన్ని విస్తృతపరిచారు.
» ఆస్తి, పన్నులు చెల్లించే ప్రాతిపదికపై పరిమిత ఓటుహక్కును కల్పించారు.
» ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను తనిఖీ చేయడం కోసం ఆడిటర్ జనరల్ పదవిని ఏర్పాటుచేశారు. 
» లండన్‌లో భారత వ్యవహారాలను పర్యవేక్షించడానికి భారత హైకమిషనర్ అనే పదవిని సృష్టించారు. లండన్‌లో భారత హైకమిషనర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
» 1921లో ప్రభుత్వ ఖాతాల సంఘాన్ని (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ - పీఏసీ) ఏర్పాటు చేశారు.
» కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్‌ను వేరుచేశారు.
» గవర్నర్ జనరల్ కౌన్సిల్‌లోని ఆరుగురు సభ్యుల్లో ముగ్గురు భారతీయులకు అవకాశం కల్పించారు.
» కేంద్ర, రాష్ట్రాల మధ్య; అంతర్ రాష్ట్రాల మధ్య ఉత్పన్నమయ్యే వివాదాలను పరిష్కరించే అధికారం వైస్రాయికి ఇచ్చారు.
» పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు గురించి అధ్యయనం చేసి నివేదిక సమర్పించడానికి లీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా 1926లో కేంద్రంలో, రాష్ట్రాల్లో వేర్వేరుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పాటయ్యాయి.
» రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్ నుంచి వేరుచేశారు.
» మాంటేగ్ - ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం కేవలం మనదేశంలో 2.6% ప్రజలకు మాత్రమే ఓటుహక్కును కల్పించింది.  

1919 చట్టం తర్వాత బ్రిటిష్ ఇండియా పరిపాలన కింది విధంగా ఉంది 

 
 

1919 చట్టంపై ఉన్న విమర్శ:
» ''నేరమే అధికారమై నేరం చేస్తుంటే చూస్తూ ఊరుకున్న ప్రతి ఒక్కరూ నేరుస్థులే" - గాంధీజీ.
» ఈ చట్టం సూర్యుడు లేని ఉదయం లాంటిది అని బాలగంగాధర్ తిలక్ అభివర్ణించారు.
» 10 సంవత్సరాల తర్వాత ఈ చట్టం అమలు తీరును పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
» ఈ చట్టం 1921 నుంచి అమల్లోకి వచ్చింది.
» భారతదేశంలో ద్వంద్వ పాలన అనేది చాలావరకు దూషించే మాట అయింది. ''ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని నీవు డైయార్కివి అని అనడం విన్నాను" అని సర్ బట్లర్ అనే రచయిత పేర్కొన్నాడు.
» ద్వంద్వ పాలనను ఎప్పుడూ ఆదర్శంగా భావించలేదు. ఇంకో ఉత్తమ ప్రయోజన స్థితికి ఇది ఒక మెట్టు మాత్రమే. ఈ ఉత్తమ ప్రయోజనం పేరు పరిపూర్ణ స్వపరిపాలిత భారతదేశం అని పలాండే (రచయిత) పేర్కొన్నాడు.
» ద్వంద్వ ప్రభుత్వాన్ని మడ్డీ మాన్ కమిటీ సమర్థించింది.

 

సైమన్ కమిషన్: 1927
» 1919 నాటి మాంటేగ్ - చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలను సమీక్షించేందుకు నాటి బ్రిటన్ ప్రధాని బాల్డ్విన్ 1927 లో సర్ జాన్ సైమన్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఒక కమిషన్‌ను నియమించాడు.
» ఈ కమిషన్‌లో ఒక్క భారతీయుడికి కూడా ప్రాతినిధ్యం కల్పించకపోవడంతో భారతీయులు దీన్ని వ్యతిరేకించారు. సైమన్ గో బ్యాక్ అనే నినాదంతో ఉద్యమాన్ని ప్రారంభించారు.
» సైమన్ కమిషన్ భారతదేశంలో రెండు పర్యాయాలు పర్యటించింది.
    1) 1928, ఫిబ్రవరి 3 నుంచి మార్చి 31 వరకు
    2) 1928, అక్టోబరు 11 నుంచి 1929, ఏప్రిల్ 6 వరకు
» సైమన్ కమిషన్ తన నివేదికను 1930లో లండన్‌లోని బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించింది.

సైమన్ కమిషన్ నివేదికలో ముఖ్యాంశాలు:
» భారతదేశంలో సమాఖ్య తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.
» 1919లో రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలనను రద్దు చేయాలి.
» మంత్రులందరూ శాసనసభకు బాధ్యత వహించాలి.
» భారతీయులకు ప్రభుత్వ నిర్వహణలో స్వయం ప్రతిపత్తిని కల్పించాలి.
» హైకోర్టులపై కేంద్ర ప్రభుత్వానికి పాలనాపరమైన నియంత్రణను ఏర్పరచాలి.
» భాషా ప్రాతిపదికపై ఒరిస్సా, సింధు రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి.
» సార్వత్రిక వయోజన ఓటుహక్కు సాధ్యం కాదు.
» ప్రాథమిక హక్కులను నిరాకరించారు.
» కమ్యూనల్ ప్రాతినిధ్యం సమంజసం కాకపోయినా దీనికి ప్రత్యామ్నాయం లేని దృష్ట్యా కొనసాగించాలి.
» అధినివేశ ప్రతిపత్తి (డొమినియన్ స్టేటస్)తో కూడుకున్న స్వాతంత్య్రాన్ని తిరస్కరించాలి.
* సైమన్ కమిషన్ నివేదిక అనేది భారతదేశ సమస్యలపై ఒక సమగ్రమైన అధ్యయనం అని కూప్లాండ్ (రచయిత) పేర్కొన్నాడు. 1935లో చేసిన భారత ప్రభుత్వ చట్టంలో సైమన్ కమిషన్ సిఫారసులను పొందుపరిచారు.

 

నెహ్రూ నివేదిక : 1928
» సైమన్ కమిషన్‌ను బహిష్కరిస్తున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస అయ్యంగార్ ప్రకటించడంతో... భారతరాజ్య క్యార్యదర్శి లార్డ్ బిర్కెన్‌హెడ్ 1927, నవంబరు 24న బ్రిటిష్ ఎగువ సభలో ప్రసంగిస్తూ ''భారతీయులు అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగ రచన స్వయంగా రచించుకోగలరా'' అని భారతీయులకు సవాలు విసిరారు. ఆ సవాలును స్వీకరించిన భారత జాతీయ కాంగ్రెస్ 1928, మే 19న బొంబాయిలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. కాంగ్రెస్ నాయకులు భారత రాజ్యాంగ రచనకు మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన 9 మంది సభ్యులతో ఒక ఉపసంఘాన్ని నియమించారు.
నెహ్రూ నివేదికలోని ముఖ్యాంశాలు:
» భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి ఇవ్వాలి.
» కార్యనిర్వాహక శాఖ శాసనసభకు బాధ్యత వహించాలి.
» ఇందులో 19 ప్రాథమిక హక్కులను ప్రస్తావించారు.
» దేశంలో సమాఖ్య వ్యవస్థను ఏర్పాటుచేయాలి.
» పంజాబ్, బెంగాల్‌లోని ప్రత్యేక మత నియోజక వర్గాలను రద్దు చేయాలి.
» అల్పసంఖ్యాక వర్గాల వారికి శాసనమండళ్లలో కనీసం 10 సంవత్సరాల పాటు కొన్ని స్థానాలను కేటాయించాలి.

 

దీపావళి ప్రకటన:
» సైమన్ కమిషన్ నివేదికపైనా, భారత్‌లో రాజ్యాంగ సంస్కరణలపైనా చర్చించేందుకు లండన్‌లో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహిస్తామని... భారత్‌కు త్వరలోనే స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తామని భారత గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ 1929, అక్టోబరు 31న ఒక ప్రకటన చేశాడు. దీన్నే దీపావళి ప్రకటన అంటారు. 
» 1929లో బ్రిటన్‌లో జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత లేబర్ పార్టీ గెలుపొంది రామ్‌సే మెక్‌డొనాల్డ్ ప్రధానమంత్రి అయ్యాడు. ఇతడు గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్‌తో సంప్రదింపులు జరిపాడు. సైమన్ కమిషన్‌ను భారతీయులు తిరస్కరించడంతో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించడానికి ప్రయత్నించాడు. లండన్‌లో రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు.

 

మొదటి రౌండ్ టేబుల్ సమావేశం:
» ఇది లండన్‌లో 1930, నవంబరు 12 నుంచి 1931, జనవరి 19 వరకు జరిగింది. దీనిలో 89 మంది ప్రముఖులు పాల్గొన్నారు.
» ఈ సమావేశంలో ముస్లిం లీగ్ తరఫున జిన్నా, ఆగాఖాన్, మహ్మద్ షఫీ, ఫజల్ హక్; హిందూ మహాసభ తరఫున ఎమ్.ఆర్ .జయకర్, మూంజే; ఉదారవాదుల తరఫున తేజ్‌బహదూర్ సప్రూ, చింతామణి, బి.ఆర్. అంబేడ్కర్, హైదరాబాద్ దివాన్ అక్బర్ హైదర్ కూడా హాజరయ్యారు.
» ఈ సమావేశంలో సంపూర్ణ బాధ్యతాయుత పాలనపై చర్చిస్తామని ఆంగ్లేయులు ప్రత్యేక హామీని ఇవ్వనందున భారత జాతీయ కాంగ్రెస్ పాల్గొనలేదు. కాంగ్రెస్ పాల్గొనక పోవడం వల్ల ఈ సమావేశం విఫలమైంది. సమావేశంలో పాల్గొనని ప్రజా వర్గాల సహకారం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రధానమంత్రి రామ్‌సే మెక్‌డొనాల్డ్ ఈ సమావేశాన్ని ముగించినట్లు ప్రకటించాడు.

 

గాంధీ - ఇర్విన్ ఒప్పందం:
» కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేనిదే తాము నిర్వహించే సమావేశాలు సఫలం కావని గుర్తించిన ఆంగ్లేయ ప్రభుత్వం రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీని ఒప్పించాలని వైస్రాయి ఇర్విన్‌ను ఆదేశించింది. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో అరెస్టయిన గాంధీజీని విడుదల చేయడంతో 1931, మార్చి 5న గాంధీ, ఇర్విన్ మధ్య సమావేశం జరిగింది. దీన్నే గాంధీ ఇర్విన్ ఒప్పందం అంటారు. 
ముఖ్యాంశాలు:
» రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి.
» కాంగ్రెస్ శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేసి, రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటుంది.
» తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు పన్ను లేకుండా ఉప్పును తయారు చేసుకునే అవకాశాన్ని కల్పించాలి.
» శాసనోల్లంఘన ఉద్యమంలో స్వాధీనం చేసుకున్న ఆస్తులను తిరిగి ఇవ్వడం.

 

రెండో రౌండ్ టేబుల్ సమావేశం:
» ఇది లండన్‌లో 1931, సెప్టెంబరు 7 నుంచి డిసెంబరు 1 వరకు జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ తరఫున గాంధీజీ హాజరయ్యారు. స్వదేశీ సంస్థానాధిపతులతో సహా 107 మంది ప్రతినిధులు, మహిళా ప్రతినిధిగా సరోజినీ నాయుడు హాజరయ్యారు. బలహీన వర్గాల తరఫున బి.ఆర్.అంబేడ్కర్ పాల్గొన్నారు. అల్పసంఖ్యాక వర్గాల సమస్యలపై గాంధీజీ - మహ్మద్ అలీ జిన్నా ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఆంగ్లేయులు విభజించు -  పాలించు సూత్రాన్ని పాటించడం వల్ల గాంధీ సమావేశం నుంచి ఉపసంహరించుకుని భారత్‌కు రావడంతో ఆంగ్లేయులు అతడిని అరెస్ట్ చేశారు.
కమ్యూనల్ అవార్డు: 1932
» ఆనాటి బ్రిటన్ ప్రధాని రామ్‌సే మెక్‌డొనాల్డ్ 1932, ఆగస్టు 4న కమ్యూనల్ అవార్డును ప్రకటించాడు. దీని ప్రకారం ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లకే కాకుండా షెడ్యూల్డ్ కులాలకు కూడా ప్రత్యేక నియోజక వర్గాలను ప్రతిపాదించాడు. దీన్ని వ్యతిరేకిస్తూ మహాత్మాగాంధీ పూనాలోని ఎరవాడ కారాగారంలో 1932, సెప్టెంబరు 20న ఆమరణ నిరాహర దీక్షకు పూనుకున్నారు. దీంతో గాంధీజీ - అంబేడ్కర్ మధ్య పూనాలో ఒక ఒప్పందం కుదిరింది. దీన్నే పూనా ఒప్పందం - 1932 అంటారు. దీని ఫలితంగా కమ్యూనల్ అవార్డు కంటే ఎక్కువగా షెడ్యూల్డు కులాలకు అవకాశాలు లభించాయి. కమ్యూనల్ అవార్డు షెడ్యూల్డ్ కులాలను దళితులుగా పేర్కొంది.

 

మూడో రౌండ్ టేబుల్ సమావేశం:
» ఈ సమావేశం లండన్‌లో 1932, నవంబరు 17 నుంచి డిసెంబరు 24 వరకు జరిగింది. ఈ సమావేశానికి జాతీయ కాంగ్రెస్ నుంచి ఎవరూ హాజరు కాలేదు. ఈ సమావేశానికి జిన్నా, అంబేడ్కర్‌లతో సహా మొత్తం 46 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
» మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో చర్చించి, నిర్ణయించిన అంశాలతో బ్రిటిష్ ప్రభుత్వం ఒక శ్వేత పత్రాన్ని ప్రచురించింది. దీనిలోని ప్రతిపాదనలను లార్డ్ లిన్‌లిత్‌గో అధ్యక్షతన బ్రిటిష్ పార్లమెంటుకు చెందిన సెలెక్ట్ కమిటీ పరిశీలించి... 1934, నవంబరు 11న ఒక నివేదికను సమర్పించింది. ఈ నివేదికను కాంగ్రెస్ తిరస్కరించింది. ముస్లిం లీగ్ సమాఖ్య అనే భావనను తిరస్కరించి, ప్రాంతాలకు సంబంధించిన భాగాన్ని ఆమోదించింది.

 

5వ దశ: 1935 - 1947
భారత ప్రభుత్వ చట్టం - 1935

» బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన రాజ్యాంగ సంస్కరణల చట్టాలన్నింటిలో సమగ్రమైంది, భారత పరిపాలన కోసం రూపొందించిన చట్టాల్లో ముఖ్యమైంది.
» 800 సంవత్సరాల బ్రిటిష్ పార్లమెంటు చరిత్రలో ఆమోదం పొందిన అతిపెద్ద చట్టం.
» ఈ చట్టంలో 321 ఆర్టికల్స్, 10 షెడ్యూల్స్ ఉన్నాయి.
» ఈ చట్టం 1937, ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది.
» భారత రాజ్యాంగ నిర్మాతలు 70 శాతం పైగా అంశాలను ఈ చట్టం నుంచి గ్రహించారు. అందుకే ఈ చట్టాన్ని భారత రాజ్యాంగానికి జిరాక్స్ కాపీ లాంటిదని హస్రత్ మొహాని పేర్కొన్నాడు.
» భారతదేశంలో బాధ్యతాయుతమైన పాలనను అందించడం ఈ చట్టం ముఖ్య లక్ష్యంగా ప్రకటించారు.
చట్టంలోని ముఖ్యాంశాలు:
అఖిల భారత సమాఖ్య ఏర్పాటు:

» సైమన్ కమిషన్ సూచనలను అనుసరించి మనదేశంలో ఆంగ్లేయులు సమాఖ్య తరహా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సమాఖ్యలో 11 రాష్ట్రాలు, 6 చీఫ్ కమిషనర్ ప్రాంతాలు, సమాఖ్యలో చేరడానికి అంగీకరించిన స్వదేశీ సంస్థానాలు ఉంటాయి.
» కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 3 రకాల అధికార విభజన జరిగింది.
ఎ) కేంద్ర జాబితా: దీనిలో రక్షణ, కరెన్సీ, విదేశీ వ్యవహారాలు, తంతి తపాలా లాంటి జాతీయ ప్రాధాన్యం ఉన్న 59 అంశాలు ఉన్నాయి.
బి) రాష్ట్ర జాబితా: దీనిలో నీటిపారుదల, వ్యవసాయం, విద్య, స్థానిక పాలన లాంటి ప్రాంతీయ ప్రాధాన్యం ఉన్న 54 అంశాలు ఉన్నాయి.
సి) ఉమ్మడి జాబితా: దీనిలో వివాహం, విడాకులు, వారసత్వం లాంటి 36 అంశాలు ఉన్నాయి.
*  పైన పేర్కొన్న 3 జాబితాల్లో లేని అంశాలను అవశిష్టాధికారాలు అంటారు. వీటిని గవర్నర్ జనరల్‌కు బదలాయించారు. రాష్ట్రంలో ఉన్న ద్వంద్వ పాలను రద్దు చేసి, కేంద్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. కేంద్రంలో పాలనాంశాలను రిజర్వ్‌డ్, ట్రాన్స్‌ఫర్డ్ అంశాలుగా విభజించారు.

ఎ) రిజర్వ్‌డ్ జాబితా: దీనిలో ప్రాధాన్యం గల అధికారాలు, ఆదాయమున్న అంశాలు చోటుచేసుకున్నాయి. వీటిపై బ్రిటిష్ గవర్నర్ జనరల్‌కు అధికారం కల్పించారు.
బి) ట్రాన్స్‌ఫర్డ్ జాబితా: అధికారాలు, ఆదాయం లేని; అంతగా ప్రాధాన్యం లేని అంశాలను ఈ జాబితాలో చేర్చారు. దీనిలో బాధ్యతలు అధికంగా ఉంటాయి. వీటిని భారతీయ మంత్రులకు అప్పగించారు.

 

కేంద్ర శాసనసభ: కేంద్రంలో ద్విసభా విధానాన్ని కొనసాగిస్తూ సభల్లోని సభ్యుల సంఖ్యను పెంచారు.
ఎ) కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్:
    ఎగువసభ అయిన దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 260. దీనిలో మూడో వంతు సభ్యులను మన దేశంలోని స్వదేశీ సంస్థానాల ప్రతినిధులకు కేటాయించారు.
బి) లెజిస్లేటివ్ అసెంబ్లీ:
» దిగువసభ అయిన దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 375.

 

రాష్ట్రాల్లో ద్విసభా విధానం
» ఈ చట్టం ద్వారా భారత్‌లోని రాష్ట్రాల్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు.
» భారత్‌లోని మొత్తం 11 బ్రిటిష్ పాలిత రాష్ట్రాలకు గాను 6 రాష్ట్రాల్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు.
అవి: 1. అస్సాం
        2. బెంగాల్
        3. బీహార్
        4. ఉత్తర్‌ప్రదేశ్ (యునైటెడ్ ప్రావిన్స్)
        5. మద్రాస్
        6. బొంబాయి
» 1919 చట్టం ద్వారా మనదేశంలోని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని 1935 చట్టం ద్వారా రద్దుచేశారు.
» రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ రాష్ట్రాల్లో రిజర్వ్‌డ్, ట్రాన్స్‌ఫర్డ్ జాబితాలను రద్దుచేసి... రాష్ట్ర జాబితాలోని 54 అంశాలపై భారతీయ మంత్రులకు అధికారాలు కల్పించారు.

 

ఫెడరల్ కోర్టు:
» ఢిల్లీలో 1935, అక్టోబరు 1న ఫెడరల్ కోర్టును స్థాపించారు. ఇది 1937 నుంచి పని విధానాలను ప్రారంభించింది.
» మనదేశంలో సమాఖ్య విధానాన్ని ప్రవేశపెట్టినందున కేంద్రం - రాష్ట్రాలు; దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను ఇది పరిష్కరిస్తుంది.
» దీనిలో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు ఇతర న్యాయమూర్తులు ఉంటారు.
» మొదటి ప్రధాన న్యాయమూర్తి - మారిస్ గ్వేయర్.
» ఈ కోర్టు ఇచ్చిన తీర్పులపై లండన్‌లోని ప్రీవి కౌన్సిల్‌కు అప్పీలు చేసుకోవచ్చు.
» ఓటు హక్కును విస్తృతపరిచి, జనాభాలో 10 శాతానికి ఓటుహక్కును వర్తింపజేశారు.
» భారత ప్రభుత్వ చట్టం - 1935 ద్వారా బర్మాను భారతదేశం నుంచి వేరుచేశారు.
» ఒరిస్సా, సింధ్ అనే రెండు కొత్త ప్రావిన్సులను ఏర్పాటు చేశారు. బ్రిటిష్ ఇండియాపై బ్రిటిష్ పార్లమెంట్ సర్వాధిపత్యాన్ని పునరుద్ఘాటించారు.
» భారతదేశంలో ఆర్థిక విధానం, రుణ నియంత్రణ కోసం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు.
» ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం కేంద్రంలో ఒక ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను, రాష్ట్రాల్లో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఏర్పాటు చేశారు.
» రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన న్యాయ సలహాదారుడైన అడ్వకేట్ జనరల్ పదవిని సృష్టించారు.
» కేంద్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ జనరల్ బ్రిటిష్ రాణి పరిశీలన కోసం లండన్‌కు పంపే అధికారాన్ని కల్పించారు.
» సామాజికంగా వెనుకబడిన, బలహీన వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించారు.
» భారత రాజ్య కార్యదర్శికి సలహాను ఇచ్చే భారత కౌన్సిల్‌ను రద్దు చేశారు.
» 1937 నుంచి భారత ప్రభుత్వ చట్టం - 1935 అమల్లోకి వచ్చింది. 1937లో కేంద్ర, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరిగాయి.
» 11 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో 8 రాష్ట్రాల్లో భారత జాతీయ కాంగ్రెస్ విజయం సాధించింది. 3 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
» 1939, అక్టోబరులో బ్రిటిష్ వైఖరికి నిరసనగా 8 రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేశాయి.
» భారత ప్రభుత్వ చట్టం - 1935 ద్వారా ప్రవేశపెట్టిన ప్రధాన అంశం ప్రాంతీయ స్వపరిపాలన.

 

1935 చట్టంపై విమర్శలు
''ఇది పొట్టి మనుషులు (పిగ్మీస్) కట్టిన అవమానకరమైన గొప్ప కట్టడం (రాక్షస స్తంభం)" - విన్‌స్టన్ చర్చిల్
''భారత ప్రజలపై బ్రిటిష్ ప్రభుత్వం బలవంతంగా రుద్దిన చట్టం" - కె.టి. షా
''మనదేశంలో నూతన బానిసత్వానికి నాంది లాంటిది" - జవహర్‌లాల్‌ నెహ్రూ
''కచ్చితంగా పిచ్చిది, సమూలంగా చెడ్డది, మొత్తానికి అనంగీకృతమైంది" - మహ్మద్ అలీ జిన్నా
''ఒక మంచి వాహనానికి చక్కటి బ్రేకులను అమర్చి ముఖ్యమైన ఇంజిన్‌ను బిగించడం మరచిపోయారు" - జవహర్‌లాల్‌ నెహ్రూ
''భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో గోచరించే భూస్వామ్య వ్యవస్థను దృఢతరం చేయడానికి బ్రిటిష్ పాలకులు ఆడిన నాటకం" - సుభాష్ చంద్రబోస్

 

లిన్‌లిత్‌గో ఆగస్టు ప్రతిపాదనలు: 1940
» భారత గవర్నర్ జనరల్, వైస్రాయి అయిన లార్డ్ లిన్‌లిత్‌గో 1940, ఆగస్టు 8న రాజ్యాంగ సంస్కరణలపై చేసిన కొన్ని ప్రతిపాదనలను ఆగస్టు ప్రతిపాదనలు అంటారు. 
ముఖ్యాంశాలు:
» రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి కల్పించడం అనే విషయాన్ని పరిశీలించడం. భారత రాజ్యాంగాన్ని రూపొందించుకునే బాధ్యత ప్రధానంగా భారతీయులకే ఉంటుందని మొదటిసారిగా ప్రకటించారు.
» రాజ్యాంగ పరిషత్తులో అల్పసంఖ్యాక వర్గాల వారికి సముచిత ప్రాతినిధ్యం ఇవ్వడం. భారతీయులు రెండో ప్రపంచ యుద్ధంలో ఆంగ్లేయులకు సహకరించాలి.
» అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంస్థానాల ప్రతినిధులతో కూడిన యుద్ధ సలహా మండలిని ఏర్పాటు చేయడం.
» వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులకు గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో సభ్యత్వం కల్పించి మండలిని విస్తృతపరచడం.
» ఆగస్టు ప్రతిపాదనలను భారతీయులు తీవ్రంగా వ్యతిరేకించారు.

 

క్రిప్స్ ప్రతిపాదనలు: (1942)
      రెండో ప్రపంచ యుద్ధ సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బ్రిటన్ యుద్ధంలో భారతీయ సైన్యాల సహకారం పొందేందుకు క్రిప్స్ ప్రతిపాదనలు అనే పేరుతో బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ తన కేబినెట్ మంత్రి అయిన సర్ స్టాఫర్డ్ క్రిప్స్‌ను భారత్‌కు పంపాడు. 1942, మార్చి 22న భారత్‌కు వచ్చిన క్రిప్స్ ప్రతిపాదనల్లోని ముఖ్యాంశాలు
» భారత ప్రజల ప్రతిపాదన అయిన కొత్త రాజ్యాంగాన్ని నిర్మించడానికి రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు అవుతుందని ప్రకటించారు.
» గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో ఒక భారతీయుడికి సభ్యత్వం ఇస్తారు.
» రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగాన్ని కలిగి ఉండవచ్చు లేదా నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకోవచ్చు.
» బ్రిటిష్‌వారు గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని పేర్కొంటూ, దానికి బదులుగా భారతీయులు బ్రిటిష్‌వారికి సహకరించాలని అని పేర్కొన్నారు.
» భారతీయులకు అధినివేశ ప్రతిపత్తి (పాక్షిక స్వాతంత్య్రం) కల్పిస్తామని ప్రకటించారు.
» క్రిప్స్ ప్రతిపాదనలను వ్యతిరేకించిన భారత జాతీయ కాంగ్రెస్ చారిత్రక క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది.
» 1942, ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రకటిస్తూ గాంధీజీ Do or Die నినాదాన్ని ఇచ్చారు.
» క్రిప్స్ ప్రతిపాదనలను మహాత్మాగాంధీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ''దివాళా తీస్తున్న బ్యాంకు మీద ముందు తేది వేసి ఇచ్చిన ఒక చెక్కు లాంటిది" అని వ్యాఖ్యానించారు. (Post - dated cheque drawn on the crashing bank).

 

సి.ఆర్.ఫార్ములా: 1944
» 1944 మార్చిలో కాంగ్రెస్ తరఫున ముస్లిం లీగ్ సహకారం కోసం, మత సమస్యల పరిష్కారం కోసం, సమష్టి కృషి ద్వారా మాత్రమే స్వాతంత్య్రం సిధ్ధిస్తుంది అనే భావనతో చక్రవర్తుల రాజగోపాలాచారి ఈ ఫార్ములాను రూపొందించారు.  ఈ సూత్రాన్ని రాజగోపాలాచారి తన The way out pamphlet అనే కరపత్రాల ద్వారా ప్రచారంలోకి తీసుకొచ్చారు. 
ముఖ్యాంశాలు
» భారతదేశం స్వాతంత్య్రం కోరడాన్ని ముస్లిం లీగ్ ఆమోదించాలి. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్‌కు సహకరించాలి.
» దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత పాకిస్థాన్ ఏర్పాటును కోరుతున్న ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలనీ, మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని అనుసరించి నిర్ణయం తీసుకోవచ్చని సి.ఆర్.ఫార్ములాలో పేర్కొన్నారు.
» ప్రజాభిప్రాయ సేకరణ (Plebiscite) ను చేపట్టే ముందుగానే అన్ని పార్టీలకు దేశ విభజనపై వారి అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం కల్పిస్తారు.
» విభజన కారణంగా ప్రజలు తరలిపోవాల్సి వస్తే అది వారి అభీష్టం మేరకే జరగాలి.
» ఒకవేళ విభజన సంభవిస్తే దేశ రక్షణకు, వాణిజ్యానికి, ఇతర ముఖ్య ప్రయోజనాలకు పరస్పర ఒడంబడికలు జరగాలి.
» పాకిస్థాన్ ఏర్పాటును ప్రత్యక్షంగా అంగీకరించకపోవడాన్ని నిరసిస్తూ ముస్లిం లీగ్, దేశ విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఈ ఫార్ములాను వ్యతిరేకించాయి.

 

అమేరి - వేవెల్ ప్రణాళిక: 1945
    భారత వ్యవహారాల కార్యదర్శి అమేరి, భారత వైస్రాయి లార్డ్ వేవెల్ నాటి బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్‌తో చర్చించి, రూపొందించిన ప్రతిపాదనలను అమేరి - వేవెల్ ప్రణాళిక అంటారు.
దీనిలోని ముఖ్యాంశాలు:
» గవర్నర్ జనరల్‌కు వీటో అధికారం ఇచ్చారు.
» దేశ సార్వభౌమ, రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ లాంటి అంశాలపై బ్రిటిష్ ప్రభుత్వానికి అధికారాలు ఉంటూ మిగిలిన అంశాలపై భారతీయులకు అధికారాలు కల్పించడం.
» భారతదేశంలో బ్రిటిషర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఒక హై కమిషనర్‌ను నియమించడం.
» వైస్రాయి కార్యనిర్వాహక వర్గం జాతీయ ప్రభుత్వంగా వ్యవహరించడం.
» వైస్రాయి కార్యనిర్వాహక మండలిలో ముఖ్య సైనికాధికారి పదవిని భారతీయుడితో నింపడం.
» ఈ ప్రతిపాదనలను పరిశీలించేందుకు కాంగ్రెస్ నాయకులను జైళ్ల నుంచి విడుదల చేయడం.

 

సిమ్లా సమావేశం (Simla Conference): 1945
» వేవెల్ ప్రణాళికలోని అంశాలను చర్చించేందుకు వైస్రాయి వేవెల్ 1945, జులైలో సిమ్లాలో ఒక సమావేశాన్ని నిర్వహించాడు.
» కాంగ్రెస్, ముస్లిం లీగ్ మధ్య సయోధ్య కుదర్చడం కోసం భూలాభాయ్ దేశాయ్ (కాంగ్రెస్), లియాఖత్ అలీఖాన్ (ముస్లిం లీగ్) మధ్య ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
» భారత ముస్లింలకు ప్రతినిధిగా ముస్లిం లీగ్‌ను మాత్రమే పరిగణించాలని... లీగ్ సభ్యులు కాని ముస్లింలను రాజ ప్రతినిధి కార్యనిర్వాహక కౌన్సిల్‌లో చేర్చుకోరాదని మహ్మద్ అలీ జిన్నా పట్టు పట్టారు.
» పాకిస్థాన్ ఏర్పాటు గురించి ప్రస్తావన లేదనే కారణంతో ముస్లిం లీగ్, స్వాతంత్య్రం గురించి నిర్మాణాత్మక ప్రతిపాదన లేదనే కారణంతో కాంగ్రెస్ సమావేశం నుంచి నిష్క్రమించాయి.
కేబినెట్ మిషన్ (మంత్రిత్రయ రాయబారం): 1946
    రెండో ప్రపంచ యుద్ధానంతరం బ్రిటన్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. క్లెమెంట్ అట్లీ బ్రిటన్ ప్రధాని అయ్యారు. 1946, మార్చిలో బ్రిటన్ ప్రధాని అట్లీ పార్లమెంటులో ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. అందులోని సారాంశం:
1. అల్ప సంఖ్యాకుల హక్కుల పట్ల మాకు గుర్తింపు ఉంది.
2. అల్ప సంఖ్యాకులు నిర్భయంగా జీవించాల
3. అధిక సంఖ్యాకుల పురోగతిని కాదనే అల్పసంఖ్యాక వర్గాన్ని కూడా అనుమతించలేం.

క్లెమెంట్ అట్లీ భారత్‌కు పంపిన మంత్రిత్రయ రాయబారం లోని సభ్యులు:
     1. సర్ పెథిక్ లారెన్స్ (ఛైర్మన్)
     2. సర్ స్టాఫర్డ్ క్రిప్స్ (సభ్యుడు)
     3. ఎ.వి. అలెగ్జాండర్ (సభ్యుడు)
» కేబినెట్ మిషన్ 1946, మే 16న తన ప్రణాళికను వెలువరించింది.

 

కేబినెట్ మిషన్‌లోని ముఖ్యాంశాలు:
» భారతీయులు తమను తాము పాలించడం కోసం అవసరమైన రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి భారతీయులతో ఒక రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు.
» బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లోని రాష్ట్ర శాసనసభలతో రాజ్యాంగ పరిషత్తు సభ్యులను ఎన్నుకుంటారు.
» స్వదేశీ సంస్థానాలు రాజ్యాంగ పరిషత్తు‌కు తమ ప్రతినిధులను పంపే అవకాశం కల్పించారు.
» ప్రతి 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహించాలి.
» కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేని పాలనాంశాలపై శాసనాధికారం రాష్ట్రాలకు సంక్రమిస్తుంది.
» ప్రాంతీయ ప్రభుత్వాలకు శాసన నిర్మాణ శాఖలు ఏర్పాటవుతాయి.
» పాకిస్థాన్ దేశ ఏర్పాటును తిరస్కరించింది. 
» అధికార మార్పిడి జరిగే వరకు దేశంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించేలా ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని 14 మంది సభ్యులతో ఏర్పాటుచేయడం జరుగుతుంది.
» 1946, సెప్టెంబరు 2న తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ప్రారంభంలో సందేహించిన ముస్లిం లీగ్ 1946, అక్టోబరు 29న తాత్కాలిక ప్రభుత్వంలో చేరింది.
1946 నాటి తాత్కాలిక ప్రభుత్వంలోని మంత్రులు - శాఖలు

 
ఆరో దశ: 1947 - 1950
క్లెమెంట్ అట్లీ ప్రకటన: 1947
బ్రిటన్ ప్రధాని క్లెమెంట్ అట్లీ 1947, ఫిబ్రవరి 20న కామన్స్ సభలో మాట్లాడుతూ 1948, జూన్ నాటికి భారతదేశానికి స్వాతంత్య్రం ఇస్తామని ప్రకటించాడు. దీన్నే అట్లీ ప్రకటన అంటారు. ఈ ప్రకటనను మహాత్మాగాంధీ బ్రిటిష్‌వారు జారీచేసిన వాటిలో అత్యుత్తమమైందిగా ప్రశంసించారు.

 

మౌంట్‌బాటన్ ప్రణాళిక: 1947
» లార్డ్ వేవెల్ స్థానంలో 1947, మార్చి 22న గవర్నర్ జనరల్‌గా లార్డ్ మౌంట్‌బాటన్ నియమితుడయ్యాడు.
» ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య వల్ల దేశంలో చెలరేగిన హింసను, రక్తపాతాన్ని దృష్టిలో ఉంచుకుని మౌంట్ బాటన్ ఈ పథకాన్ని రూపొందించాడు.
» భారతదేశం రెండు డొమినియన్లుగా ఏర్పాటవుతుంది. హిందువులు ఎక్కువగా నివసించేవారు ఇండియన్ యూనియన్‌గా, ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం పాకిస్థాన్‌గా అవతరిస్తాయి. 
» స్వదేశీ సంస్థానాలు తమ ఇష్టానుసారం భారత్ లేదా పాకిస్థాన్‌లో చేరవచ్చు.
» అస్సాం భారతదేశ అంతర్భాగంగా ఉండిపోగా బెంగాల్, పంజాబ్‌లను మతప్రాతిపదికపై విభజించారు.
» బెలుచిస్థాన్, వాయవ్య ప్రాంతాలు భారతదేశంలో లేదా పాకిస్థాన్‌లో చేరే విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది.
» బ్రిటన్ ఆధ్వర్యంలో కామన్వెల్త్ కూటమిలో చేరే విషయంలో భారత్, పాకిస్థాన్‌లకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.
» మౌంట్‌బాటన్ పథకాన్ని ముస్లిం లీగ్ స్వాగతించగా, భారత జాతీయ కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ సందర్భంలో జిన్నా ఒక ప్రకటన చేస్తూ దేశాన్ని సాధ్యమైతే విభజిస్తాం లేకుంటే ధ్వంసం చేస్తాం అని వ్యాఖ్యానించాడు. జిన్నా ప్రకటనతో దేశంలో తీవ్ర హింస చెలరేగి, దేశ విభజన అనివార్యమైంది.
» ఈ సందర్భంలో ఢిల్లీలో జరిగిన మత సంఘర్షణ, హింస, రక్తపాతాలు గాంధీజీని తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి. మహాత్ముడు బాధాతప్త హృదయంతో దేశ విభజనకు తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించారు.
» సింధు రాష్ట్రం పాకిస్థాన్‌లో విలీనం కావాలని నిర్ణయించారు.
» అస్సాంలోని సేలట్ జిల్లాలో వాయవ్య సరిహద్దు రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ జరపగా పాకిస్థాన్‌లోనే విలీనం కావాలని అభిప్రాయం వచ్చింది.
» జునాగఢ్‌లో రెఫరెండం నిర్వహించగా భారత్‌లో విలీనం కావాలని నిర్ణయించారు.
» బెంగాల్ శాసనసభ తూర్పు బెంగాల్‌ను పాకిస్థాన్‌లోనూ, పశ్చిమ బెంగాల్‌ను భారత్‌లోనూ విలీనం చేయాలని తీర్మానించింది.
» మౌంట్ బాటన్ పథకాన్ని డిక్కి బర్డ్ పథకమని అంటారు.

 

భారత స్వాతంత్య్ర చట్టం: 1947
     ఆంగ్లేయులు భారతదేశ వ్యవహారాలపై రూపొందించిన చివరి చట్టం ఇది. లార్డ్ మౌంట్ బాటన్ సలహామేరకు భారత స్వాతంత్య్ర బిల్లును 1947, జులై 4న బ్రిటన్ పార్లమెంటులో ప్రవేశపెట్టగా జులై 15న బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించింది. 1947, జులై 18న బ్రిటిష్ రాజమకుటం భారత స్వాతంత్య్ర చట్టాన్ని ఆమోదించగా 1947, ఆగస్టు 14 నుంచి అమల్లోకి వచ్చింది.
ముఖ్యాంశాలు:
» 1947, ఆగస్టు 14న గురువారం పాకిస్థాన్ ఏర్పడింది.
» 1947, ఆగస్టు 15న శుక్రవారం భారతదేశం స్వాతంత్య్రం పొందింది.
» ఇండియా, పాకిస్థాన్ దేశాల కోసం వేర్వేరు రాజ్యాంగ పరిషత్తులు ఏర్పాటయ్యాయి.
» మౌంట్ బాటన్ భారతదేశానికి, మహమ్మద్ అలీ జిన్నా పాకిస్థాన్‌కు గవర్నర్ జనరల్స్‌గా నియమితులయ్యారు.
» రెండు దేశాల్లో రాజ్యాంగ రచన కోసం ఏర్పాటైన రాజ్యాంగ పరిషత్‌లు తాత్కాలిక పార్లమెంట్లుగా వ్యవహరిస్తాయి.
» సొంత రాజ్యాంగాలను రూపొందించుకునే వరకు 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి, పరిపాలన ఉంటుంది.
» రెండు దేశాల మధ్య సరిహద్దులను నిర్ణయించడానికి రాడ్ క్లిఫ్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పడింది.
» ఈ చట్టాన్ని యుద్ధం లేకుండా జరిగిన శాంతి ఒప్పందంగా పేర్కొంటారు.
» క్లెమెంట్ అట్లీ ఈ చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన చట్టాల్లో ఉదాత్తమైంది, ఉత్తమమైందిగా అభివర్ణించాడు.
» భారత స్వాతంత్య్రాన్ని దృష్టిలో ఉంచుకుని జవహర్‌లాల్‌ నెహ్రూ భారతజాతిని ఉద్దేశించి ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగాన్ని ద ట్రిస్ట్ విత్ డిస్టినీ (విధితో ఒప్పందం) అంటారు.
» స్వాతంత్య్రం నాటికి దేశంలో 562 సంస్థానాలుండగా, వాటిలో 554 భారత్‌లో విలీనం అయ్యాయి.
» స్వదేశీ సంస్థానాలపై బ్రిటిష్ సార్వభౌమాధికారం రద్దయింది.
» భారత వ్యవహారాల కార్యదర్శి పదవి కూడా రద్దయింది.
» బ్రిటిష్ రాజు లేదా రాణికి ఉన్న భారత చక్రవర్తి అనే బిరుదు రద్దవుతుంది.
» ట్రావెన్‌కోర్ సంస్థానం ఎలాంటి షరతులు విధించకుండా భారత్‌లో విలీనమైంది.
» జునాఘడ్, జమ్మూకశ్మీర్ సంస్థానాలు ప్లెబిసైట్ (ప్రజాభిప్రాయం) ద్వారా భారత్‌లో విలీనమయ్యాయి. హైదరాబాద్ పోలీస్ చర్య ద్వారా భారతదేశంలో విలీనమైంది.

 

వ్యాఖ్యానాలు:
 *  ''ప్రపంచం ఆదమరచి నిద్రిస్తున్న ఈ అర్ధరాత్రి గంటలు మోగుతున్న ఈ వేళ, భారతజాతి మేల్కొంటోంది. ఈ మేల్కొలుపు ఏనాడో విధితో చేసుకున్న ఒప్పందం" - నెహ్రూ
ఇలా జవహర్‌లాల్‌ నెహ్రూ చేసిన ఈ ఉపన్యాసాన్ని ఆనాడు ఆలిండియా రేడియో ప్రత్యక్ష ప్రసారం చేసింది.

* ''మన స్వల్పమైన బాధలు, త్యాగాల వల్ల ఈ విజయం లభించినా, ఇది ప్రపంచ శక్తుల సంఘటనల ఫలితం అని కూడా తెలుసుకోవాలి. బ్రిటిష్ పాలకుల ప్రజాస్వామ్య ఆశయాలు, వారి చారిత్రక సాంప్రదాయ సిద్ధి కూడా కొద్దో గొప్పో కారణాలు అయ్యాయని కూడా తెలుసుకోవాలి" - డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్
* 1947, ఆగస్టు 15న ఏర్పడిన స్వతంత్ర భారతదేశ మొదటి మంత్రివర్గం 
నెహ్రూ ప్రజాస్వామిక స్వభావం మొదటి మంత్రిమండలి కూర్పులో ప్రతిబింబిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి చెందని ప్రముఖులను కూడా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వారు:
    1. డా.బి.ఆర్. అంబేడ్కర్
    2. సీహెచ్. బాబా
    3. జాన్ ముత్తాయ్
    4. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ
    5. షణ్ముగం షెట్టియార్

Posted Date : 07-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత రాజ్యాంగం - విశిష్ట లక్షణాలు

అతి పెద్ద లిఖిత రాజ్యాంగం
ప్రపంచంలోని లిఖిత రాజ్యాంగాలన్నింటిలో భారత రాజ్యాంగం అతి పెద్దది. సర్ ఐవర్ జెన్నింగ్స్ భారత రాజ్యాంగాన్ని అత్యంత సుదీర్ఘమైంది అని అభివర్ణించగా హెచ్.వి.కామత్ భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ చిహ్నమైన ఐరావతంతో పోల్చాడు. మన దేశ రాజ్యాంగాన్ని ప్రారంభంలో ప్రవేశిక, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలుగా విభజించారు. ప్రస్తుతం రాజ్యాంగంలో 465 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 25 భాగాలు ఉన్నాయి.
* రాజ్యాంగం నుంచి 7వ భాగాన్ని తొలగించి 4(A), 9(A), 9(B), 14(A) అనే భాగాలను చేర్చారు.
* భిన్నత్వంలో ఏకత్వమున్న భారతదేశంలో విభిన్న మతాలు, కులాలు, భాషలు, తెగలు, అల్ప సంఖ్యాక వర్గాలు, వెనుకబడిన ప్రాంతాలు, వివిధ పరిమితులు, మినహాయింపులను సంపూర్ణంగా వివరించడం వల్ల మన రాజ్యాంగాన్ని సుదీర్ఘంగా రూపొందించారు.
* కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో శాసన, ఆర్థిక, పరిపాలనా సంబంధాలను విస్తృతంగా వివరించారు. మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు సవరించడం, కొన్ని అంశాలను తొలగించడం, మరికొన్ని అంశాలను చేర్చడం వల్ల మన రాజ్యాంగం సువిశాలంగా రూపొందింది.
* 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం 9వ షెడ్యూల్‌ను రాజ్యాంగానికి చేర్చింది.
* 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 10వ షెడ్యూల్‌ను రాజ్యాంగానికి చేర్చింది.
* 11వ షెడ్యూల్‌ను పి.వి.నరసింహారావు ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా చేర్చింది.
* 12వ షెడ్యూల్‌ను పి.వి.నరసింహారావు ప్రభుత్వం 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా చేర్చింది.
* మన దేశానికి సర్వోన్నత శాసనం రాజ్యాంగం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు, విధులు రాజ్యాంగం నుంచే సంక్రమిస్తాయి.
* అధికారం ప్రజల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నియమిత కాలానికి జరిగే ఎన్నికల ద్వారా బదిలీ అవుతుంది. కాబట్టి మనదేశంలో అధికారానికి మూలం ప్రజలు.

 

పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం
* భారత రాజ్యాంగం కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ప్రసాదించింది. ఈ విధానంలో కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రాల్లో గవర్నర్లు నామమాత్రపు కార్యనిర్వహణాధికారాలు కలిగి ఉంటారు. కేంద్రంలో ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలి, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల నాయకత్వంలోని మంత్రిమండళ్లు వాస్తవ కార్యనిర్వహణాధికారాలను చెలాయిస్తాయి.
* కేంద్రంలో ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి వ్యక్తిగతంగా రాష్ట్రపతికి, సమష్టిగా లోక్‌సభకు బాధ్యత వహించాలి.
* రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండళ్లు వ్యక్తిగతంగా గవర్నర్లకు, సమష్టిగా విధానసభలకు బాధ్యత వహించాలి.

 

సార్వజనీన వయోజన ఓటుహక్కు
* ఆర్టికల్ 326 ప్రకారం భారత పౌరులందరికీ కుల, మత, జాతి, లింగ, జన్మ, భాష, ప్రాంత, ఆస్తి సంబంధ వివక్ష లేకుండా వయోజన ఓటుహక్కును ప్రసాదించడమైంది. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకునే వారి కనీస వయోపరిమితిని 21 సంవత్సరాలుగా నిర్ణయించారు.
* రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 61వ రాజ్యాంగ సవరణ చట్టం - 1988 ద్వారా వయోజన ఓటుహక్కు కనీస వయోపరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించింది.
* ప్రపంచంలో మహిళలకు ఓటుహక్కును కల్పించిన తొలి దేశం న్యూజిలాండ్.
* అమెరికాలో 1965 నుంచి మాత్రమే మహిళలకు ఓటుహక్కును కల్పించారు.
* స్విట్జర్లాండ్‌లో 1971 తర్వాత నుంచి మాత్రమే మహిళలకు ఓటుహక్కును కల్పించారు.
* 2014లో జరిగిన 16వ లోక్‌సభ ఎన్నికల నాటికి మన దేశ ఓటర్లు 83 కోట్ల మంది.

 

ఏక పౌరసత్వం
* భారతదేశ సమగ్రత, సుస్థిరతల దృష్ట్యా భారత ప్రజలకు రాజ్యాంగం ఏక పౌరసత్వాన్ని ప్రసాదించింది. దీని ప్రకారం వివిధ ప్రాంతాల ప్రజలకు ఒకే పౌరసత్వం ఉంటుంది. వారి మధ్య ఎలాంటి వ్యత్యాసాన్ని చూపదు.
* అయితే ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి ఉండటం వల్ల ఆ రాష్ట్ర పౌరులకు ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించారు.
* అమెరికా, స్విట్జర్లాండ్ దేశాలు తమ పౌరులకు ద్వంద్వ పౌరసత్వాన్ని అందిస్తున్నాయి.

 

లౌకిక రాజ్యం
* మత ప్రమేయం లేని రాజ్యాన్ని లౌకిక రాజ్యం అంటారు.
* భారత రాజ్యాంగ ప్రవేశికలో 'లౌకిక' అనే పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం - 1976 ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం చేర్చింది. దీని ప్రకారం రాజ్యం మత వ్యవహారాల్లో తటస్థంగా ఉంటుంది. రాజ్యం ఏ ఒక్క మతానికీ అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు.
* లౌకికతత్వ పరిధిని మరింత విస్తృతపరుస్తూ ప్రాథమిక హక్కుల్లో భాగంగా మత స్వాతంత్య్రపు హక్కును ఆర్టికల్ 25 నుంచి 28 వరకు వివరించారు. దీని ప్రకారం భారతీయులు తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు.
* ప్రభుత్వ విద్యాలయాల్లోనూ, ప్రభుత్వ ధన సహాయం పొందే ఎయిడెడ్ విద్యాలయాల్లోనూ మతబోధన నిషిద్ధిం. 

 

 దృఢ, అదృఢ లక్షణాల సమ్మేళనం
* దృఢ రాజ్యాంగం అంటే సవరించడానికి కష్టమైంది. దీని ప్రకారం ఆ దేశ శాసన నిర్మాణ శాఖలో ప్రత్యేక మెజార్టీ 2/3 లేదా 3/4 వంతుతో సవరించేది.
ఉదా: అమెరికా రాజ్యాంగం.
* అదృఢ రాజ్యాంగం అంటే సవరించడానికి సులభమైంది లేదా సరళమైంది. దీని ప్రకారం ఆ దేశ శాసన నిర్మాణ శాఖలో సాధారణ మెజార్టీ ద్వారా సవరించేది.
ఉదా: బ్రిటన్ రాజ్యాంగం.
* భారత రాజ్యాంగం అమెరికా మాదిరి దృఢమైందీ కాదు, బ్రిటన్‌లా అదృఢమైందీ కాదు. దృఢ, అదృఢ లక్షణాల సమ్మేళనం.
* భారత రాజ్యాంగాన్ని ఆర్టికల్ 368 ప్రకారం 3 పద్ధతుల్లో సవరించవచ్చు.

 

1. సాధారణ మెజార్టీ పద్ధతి
* రాజ్యాంగంలోని కింద పేర్కొన్న 18 అంశాలను పార్లమెంటుకు హాజరై ఓటు వేసిన వారి సాధారణ మెజార్టీతో సవరించవచ్చు.
    1. ఆర్టికల్ - 2 ప్రకారం కొత్త రాష్ట్రాల విలీనం, ఏర్పాటు
    2. ఆర్టికల్ 3 - రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ 
    3. ఆర్టికల్ 169 - రాష్ట్రాల్లో విధాన పరిషత్‌ల ఏర్పాటు, రద్దు.
    4. 2వ షెడ్యూల్ - రాజ్యాంగ ఉన్నత పదవులు, వారి జీతభత్యాలు
    5. ఆర్టికల్ 100(3) - పార్లమెంటు కోరం నిర్ణయించడం
    6. ఆర్టికల్ 105 - సభా హక్కులు
    7. ఆర్టికల్ 106 - పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు
    8. ఆర్టికల్ 118 (12) - పార్లమెంటులో ఉభయసభల నిర్వహణకు రూపొందించిన నియమాలు
    9. ఆర్టికల్ 120(2) - పార్లమెంటులో ఇంగ్లిష్ వాడకం
    10. ఆర్టికల్ 124(1) - సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం
    11. ఆర్టికల్ 348 - అధికార భాషా విషయం
    12. ఆర్టికల్ 11 - పౌరసత్వాన్ని పొందే విధానాలు, రద్దు చేసే పద్ధతులు
    13. ఆర్టికల్ 327 - పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు నిర్వహించడం
    14. ఆర్టికల్ 81 - నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ (డీలిమిటేషన్)
    15. ఆర్టికల్ 240 - కేంద్రపాలిత ప్రాంతాల విషయం
    16. 5వ షెడ్యూల్ - ఎస్సీ, ఎస్టీల పరిపాలనా విషయాలు
    17. 6వ షెడ్యూల్ - అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో ఎస్టీల పరిపాలన
    18. ఆర్టికల్ 135 - సుప్రీంకోర్టు అధికార పరిధిని విస్తృతపరచడం. 

 

2. ఏకపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతి
* రాజ్యాంగంలోని మరికొన్ని నిబంధనలను (సాధారణ మెజార్టీ పద్ధతి, ద్విపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతిలో సవరించేవి తప్ప) పార్లమెంటు 2/3 వంతు ప్రత్యేక మెజార్టీ ద్వారా సవరించగలదు.
ఉదా: ప్రాథమిక హక్కులు, నిర్దేశిక నియమాలు, ప్రాథమిక విధులు

 

3. ద్విపక్ష మెజార్టీ పద్ధతి
* రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలను సవరించాలంటే పార్లమెంటు 2/3 వంతు మెజార్టీతోపాటు భారతదేశంలో సగం కంటే ఎక్కువ రాష్ట్రాల్లో (15 రాష్ట్రాలు) ప్రతి శాసన నిర్మాణ శాఖలో సాధారణ మెజార్టీ అవసరం. అవి: 
1. ఆర్టికల్ 54 - రాష్ట్రపతి ఎన్నిక, ఆర్టికల్ 55 - రాష్ట్రపతి ఎన్నిక విధానం
2. ఆర్టికల్ 73 - కేంద్ర కార్యనిర్వాహక శాఖ,
ఆర్టికల్ 162 - రాష్ట్ర కార్యనిర్వాహక శాఖల అధికార పరిధిని విస్తృతం చేయడం.
3. 5వ భాగం 4వ అధ్యాయం ఆర్టికల్స్ 124 నుంచి 147 వరకు - సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశాలు
4. 6వ భాగం 5వ అధ్యాయం ఆర్టికల్స్ 214 నుంచి 232 వరకు - హైకోర్టుకు సంబంధించిన అంశాలు
5. 7వ షెడ్యూల్ - కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన
6. 4వ షెడ్యూల్‌ - రాజ్యసభలో రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన సీట్ల వివరాలు
7. ఆర్టికల్ 368 - రాజ్యాంగ సవరణ అంశాలు

 

అర్ధ సమాఖ్య
* రాజ్యాంగ రీత్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీ జరిగే వ్యవస్థను సమాఖ్య వ్యవస్థ అంటారు.
* కె.సి.వేర్ భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్య (Quasi Federal)గా పేర్కొన్నాడు.
భారత రాజ్యాంగానికి కింద పేర్కొన్న సమాఖ్య లక్షణాలు ఉన్నాయి. అవి:
    1. లిఖిత రాజ్యాంగం, రాజ్యాంగ ఔన్నత్యం
    2. కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన
    3. దృఢ రాజ్యాంగం
    4. స్వయం ప్రతిపత్తి గల న్యాయవ్యవస్థ
    5. న్యాయ సమీక్ష విధానం
    6. ద్విసభా విధానం

భారత రాజ్యాంగానికి కింద పేర్కొన్న ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి. అవి
    1. ఒకే రాజ్యాంగం, ఒకే పౌరసత్వం
    2. ఏకీకృత న్యాయవ్యవస్థ
    3. అఖిల భారత సర్వీసుల భర్తీకి ఒకే యూపీఎస్సీ
    4. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల ఎన్నికల నిర్వహణకు ఒకే కేంద్ర ఎన్నికల సంఘం
    5. ఒకే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)
    6. రాష్ట్రపతితో కేంద్ర ప్రతినిధులుగా రాష్ట్రాల్లో గవర్నర్ల నియామకం
    7. రాజ్యసభలో రాష్ట్రాలకు అసమాన ప్రాతినిధ్యం
    8. రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి అధికారాలను కలిగి ఉండటం
ఉదా: ఆర్టికల్ 352 - జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం
         ఆర్టికల్ 356 - రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడం
         ఆర్టికల్ 360 - ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించడం
         ఆర్టికల్ 365 - కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసే అధికారం
         ఆర్టికల్ 248 - అవశిష్టాధికారాలను కేంద్రమే కలిగి ఉండటం
         ఆర్టికల్ 249 - జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాజ్యసభ 2/3 ప్రత్యేక మెజారిటీతో ఒక తీర్మానాన్ని ఆమోదిస్తే రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా పార్లమెంటు చట్టాలను రూపొందిస్తుంది.
* ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఆమోదించిన బిల్లు గవర్నరు సంతకంతో చట్టంగా మారుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఆ బిల్లును గవర్నరు ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వు చేస్తారు. అలాంటి సందర్భంలో ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి రాష్ట్ర శాసన నిర్మాణ శాఖపై అధికారాన్ని కలిగి ఉంటారు.
* పైన పేర్కొన్న విధంగా భారత రాజ్యాంగం సమాఖ్య, ఏక కేంద్ర లక్షణాల సమ్మేళనం.

స్వయం ప్రతిపత్తి గల న్యాయవ్యవస్థ
మన దేశ న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తి గలది. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులను నియమించేది రాష్ట్రపతి. కానీ వారిని తొలగించేది పార్లమెంటు 2/3 ప్రత్యేక మెజార్టీ ద్వారానే. దీనివల్ల న్యాయవ్యవస్థ పూర్తి స్వయంప్రతిపత్తిని కలిగి ఉందని తెలుస్తోంది.

 

న్యాయ సమీక్ష అధికారం
* భారత న్యాయవ్యవస్థకు న్యాయ సమీక్షాధికారాన్ని రాజ్యాంగం ప్రసాదించింది. దీని ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించే శాసనాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే అవి చెల్లవు అని న్యాయస్థానాలు జారీ చేసే ఆదేశమే న్యాయ సమీక్ష.
* ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా న్యాయస్థానాలకు ఉన్న న్యాయ సమీక్షాధికారాన్ని తొలగించింది. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా పునరుద్ధరించింది.
* న్యాయ సమీక్ష అనే భావనను మనం అమెరికా నుంచి గ్రహించాం.
* 1803లో మార్బురీ Vs మాడిసన్ వివాదంలో అమెరికన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ మార్షల్ ఇచ్చిన తీర్పు ప్రపంచంలో న్యాయ సమీక్ష భావనకు పునాదులు వేసింది.

అల్ట్రా వైర్స్: శాసనశాఖ శాసనాలు, ప్రభుత్వ పాలనా చర్యలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లవనీ, రాజ్యాంగ విరుద్ధమని న్యాయవ్యవస్థ తీర్పు ఇవ్వడాన్ని అల్ట్రా వైర్స్‌గా పేర్కొంటారు.

ఇంట్రావైర్స్: శాసనశాఖ శాసనాలు, ప్రభుత్వ పాలనా చర్యలు రాజ్యాంగ పరిధికి లోబడి రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నట్లయితే అవి చెల్లుతాయనీ, అవి రాజ్యాంగబద్ధమేనని న్యాయవ్యవస్థ తీర్పు ఇవ్వడాన్ని ఇంట్రావైర్స్ అంటారు.
* రాజ్యాంగంలోని ఆర్టికల్ 50 ప్రకారం న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుంచి వేరు చేశారు.
* 1951 నాటి శంకరీ ప్రసాద్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు మొదలు 2007 నాటి అశోక్‌కుమార్ ఠాకూర్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు వరకు సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తన న్యాయ సమీక్ష అధికారాన్ని వినియోగించుకుంది.
* 1980లో మినర్వా మిల్స్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ న్యాయ సమీక్ష అధికారాన్ని రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగంగా పేర్కొంది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 368లో చేర్చిన 4, 5 క్లాజులు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కొట్టేసింది.

ఏకీకృత న్యాయ వ్యవస్థ
* భారతదేశం న్యాయ వ్యవస్థ నిర్మాణాన్ని బ్రిటన్ నుంచి గ్రహించింది.
* భారతదేశం అనుసరించే న్యాయ వ్యవస్థను ఏకీకృత, సమీకృత న్యాయ వ్యవస్థగా పేర్కొంటారు.
* జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు, రాష్ట్ర స్థాయిలో హైకోర్టులు, జిల్లా స్థాయిలో జిల్లా కోర్టులు, డివిజనల్ స్థాయిలో మున్సిఫ్ కోర్టులు న్యాయ విధులను నిర్వహిస్తున్నాయి.
* ఒకే రాజ్యాంగాన్ని అమలుపరిచే క్రమంలో ఉన్నత న్యాయస్థానాలు దిగువ న్యాయస్థానాలపై అదుపు కలిగి ఉంటాయి.
ఉన్నత న్యాయస్థానాలు జారీ చేసే ఆదేశాలను దిగువ న్యాయస్థానాలు తప్పనిసరిగా అమలుపరచాల్సి ఉంటుంది.
* న్యాయమూర్తుల నియామకంలో ఉన్నత న్యాయస్థానాలను సంప్రదించాల్సి ఉంటుంది.

ద్విసభా విధానం
* 1919 మాంటేగ్ - ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణల ద్వారా కేంద్ర శాసనశాఖలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. భారత ప్రభుత్వ చట్టం 1935 ద్వారా 6 రాష్ట్రాల్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది కేంద్రంలో లోక్‌సభ, రాజ్యసభలతో ద్విసభా విధానానికి దారితీసింది.
* రాష్ట్ర స్థాయిలో ద్విసభా విధానం ఏర్పాటు విషయమై రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్రాల అభిమతాలకే వదిలిపెట్టారు. ఆర్టికల్ 169 ప్రకారం రాష్ట్ర విధానసభ 2/3 వంతు మెజార్టీతో ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదిస్తే, పార్లమెంటు సాధారణ తీర్మానంతో రాష్ట్రాల్లో ఎగువ సభ అయిన విధాన పరిషత్‌ను ఏర్పాటు చేయగలదు లేదా ఉన్నదాన్ని రద్దు చేయగలదు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్లు
* కారన్ వాలీస్ మన దేశంలో సివిల్ సర్వీసెస్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. 
* 1853 చార్టర్ చట్టం ద్వారా భారతీయులకు సివిల్ సర్వీసుల్లో అవకాశం కల్పించారు.
* 1926 నాటి లీ కమిషన్ సిఫార్సుల మేరకు మన దేశంలో సర్వీస్ కమిషన్లు ఏర్పడ్డాయి.
* భారత ప్రభుత్వ చట్టం 1935 ద్వారా జాతీయ స్థాయిలో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పడ్డాయి. అఖిల భారత సర్వీసుల పితామహుడిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశంలో సివిల్ సర్వీసుల నిర్మాణానికి విశేష కృషి చేశారు. ప్రస్తుత ఉద్యోగస్వామ్యం (బ్యూరోక్రసీ), ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ బ్రిటిష్ వారసత్వం నుంచే మనకు సంక్రమించింది.

స్వయం ప్రతిపత్తి ఉన్న కమిషన్లు
* ఆర్టికల్ 148 - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులను, ఖాతాలను తనిఖీ చేసి ప్రజల సొమ్ముకు కాపలాగా ఉండేందుకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ను ఏర్పాటు చేశారు.
* ఆర్టికల్ 280 - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాల పంపిణీకి కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేశారు.
* ఆర్టికల్ 315 - మన దేశంలో ప్రతిభావంతులను పాలనలో భాగస్వామ్యం చేయడానికి, ప్రజలకు నాణ్యమైన సేవలను అందించడానికి కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో ఉద్యోగులను ఎంపిక చేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పడ్డాయి.
* ఆర్టికల్ 324 - దేశంలో నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుత, ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు.
* ఆర్టికల్ 124 - రాజ్యాంగ సంరక్షణకు, వ్యాఖ్యానానికి, అర్థ వివరణకు సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు.
* ఆర్టికల్ 338 - జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
    ఆర్టికల్ 338 (A) - జాతీయ ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
    ఆర్టికల్ 340 - జాతీయ బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

అధికారాల విభజన
     భారత రాజ్యాంగం దేశాన్ని రాష్ట్రాల యూనియన్‌గా ప్రకటించింది.
     రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మూడు రకాలైన అధికారాల విభజన గురించి పేర్కొన్నారు.
1. కేంద్ర జాబితా: ఈ జాబితాలో ప్రారంభంలో 97 అంశాలుండగా ప్రస్తుతం 100 అంశాలు ఉన్నాయి.
2. రాష్ట్ర జాబితా: ఈ జాబితా ప్రారంభంలో 66 అంశాలుండగా ప్రస్తుతం 61 అంశాలు ఉన్నాయి.
3. ఉమ్మడి జాబితా: ఈ జాబితాలో ప్రారంభంలో 47 అంశాలుండగా ప్రస్తుతం 52 అంశాలు ఉన్నాయి.
    పై మూడు జాబితాల్లో లేని అంశాలను అవశిష్ట అధికారాలు అంటారు. ఇవి కేంద్రానికి చెందుతాయి.

 

ప్రాథమిక హక్కులు
రాజ్యాంగంలోని మూడో భాగంలో 12 నుంచి 35 వరకు ఉన్న ప్రకరణలను 7 వర్గాల ప్రాథమిక హక్కులుగా కల్పించారు. వ్యక్తుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రాథమిక హక్కులను పేర్కొన్నారు. ప్రారంభంలో ప్రాథమిక హక్కుల సంఖ్య 7 వర్గాలుగా ఉండగా ఆస్తి హక్కును 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి ఆర్టికల్ 300 (A)లో ఒక సాధారణ చట్టబద్ధ హక్కుగా మార్చింది.

 

ఆదేశిక సూత్రాలు
రాజ్యాంగంలోని 4వ భాగంలో 36 నుంచి 51 వరకు ఉన్న ప్రకరణలు ఆదేశిక సూత్రాలు/ నిర్దేశిక నియమాల గురించి పేర్కొంటున్నాయి. సంక్షేమ రాజ్య స్థాపన, పరిపాలనా వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకంగా ఉండేందుకు ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించిన వీటిని మన దేశ రాజ్యాంగంలో చేర్చారు.

 

ప్రాథమిక విధులు:
భారత రాజ్యాంగంలోని 4(A) భాగంలో 51(A) ఆర్టికల్‌లో ప్రాథమిక విధులను ప్రస్తావించారు. మొదట్లో రాజ్యాంగంలో ప్రాథమిక విధులు లేవు. జస్టిస్ స్వరణ్‌సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ చట్టం - 1976 ద్వారా రష్యా నుంచి 10 ప్రాథమిక విధులను గ్రహించి రాజ్యాంగానికి చేర్చింది.
* ప్రస్తుతం రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల సంఖ్య: 11
* 11వ ప్రాథమిక విధిని 86వ రాజ్యాంగ సవరణ చట్టం - 2002 ద్వారా చేర్చారు.

రాజ్యాంగ మౌలిక స్వరూపం
భారతదేశానికి అత్యున్నత శాసనం రాజ్యాంగం. 1973లో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిస్తూ రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని నొక్కి చెప్పింది. భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతినకుండా మాత్రమే సవరించాలని పేర్కొంది.
* రాజ్ నారాయణ్ Vs ఇందిరాగాంధీ, మినర్వా మిల్స్, ఎల్ఐసీ, ఎస్.ఆర్.బొమ్మై కేసుల్లోనూ సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పునరుద్ఘాటించింది.

Posted Date : 07-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత రాజ్యాంగ పరిషత్ - రాజ్యాంగం

     భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని 1946 డిసెంబరు 9 నుంచి 1949 నవంబరు 26 వరకు (2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు) జరిగిన 11 సమావేశాల ఆధారంగా రూపొందించింది. ఇది 165 రోజులపాటు సమావేశమై, 60 రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇందుకు రూ.64 లక్షలు ఖర్చు అయ్యాయి. భారత రాజ్యాంగ చిహ్నం 'ఏనుగు'.
 

రాజ్యాంగ ఆమోదం

      రాజ్యాంగ అంతిమ ముసాయిదాను డా. బి.ఆర్. అంబేడ్కర్ 1948 నవంబరు 4 న ప్రవేశపెట్టారు. దీన్నే ప్రథమ పఠనం అంటారు. ద్వితీయ పఠనం 1948 నవంబరు 15 నుంచి 1949 అక్టోబరు 17 వరకు జరిగింది. తృతీయ పఠనం 1949 నవంబరు 14 న ప్రారంభమైంది. 1949 నవంబరు 26 న మొత్తం 299 మందిలో 284 మంది సంతకం చేశారు. దీంతో భారత రాజ్యాంగం ఆమోదం పొందినట్లైది. రాజ్యాంగంతోపాటు ప్రవేశికను ప్రత్యేకంగా రాజ్యాంగ సభ ఆమోదించింది. రాజ్యాంగంలో 395 నిబంధనలు, 8 షెడ్యూల్స్, 22 భాగాలు ఉన్నాయి.
 

రాజ్యాంగ అవసరం గుర్తింపు

    1927 లో అప్పటి భారత రాజ్య కార్యదర్శి 'లార్డ్ బిర్కెన్ హెడ్' సవాలును భారత జాతీయ కాంగ్రెస్ స్వీకరించింది. 1927 మే 19 న 8 మంది (మోతీలాల్ నెహ్రూ, అలీ ఇమామ్, తేజ్ బహదూర్ సప్రూ, ఎం.ఎస్. అనే, మంగళ్‌సింగ్, షోయబ్ ఖురేషి, సుభాష్ చంద్రబోస్, జి.ఆర్. ప్రధాన్) సభ్యులతో కమిటీ వేసింది. దీనికి మోతీలాల్ నెహ్రూ అధ్యక్షుడు, జవహర్‌లాల్ నెహ్రూ కార్యదర్శి. ఈ కమిటీ 1928 ఆగస్టు 10 న నివేదికను సమర్పించింది. దీన్ని భారతీయులు భారత రాజ్యాంగ రచనకు చేసిన మొదటి ప్రయత్నంగా చెప్పవచ్చు. దీన్నే 'నెహ్రూ నివేదిక' అంటారు.
* మానవతావాదిగా పేరొందిన భారత రాజనీతి తత్వవేత్త ఎం.ఎన్. రాయ్ మొదటిసారిగా 1934 లో భారత రాజ్యాంగ పరిషత్ అనే భావాన్ని ప్రకటించారు. భారత జాతీయ కాంగ్రెస్ 1935 లో పార్టీపరంగా రాజ్యాంగ పరిషత్‌ను డిమాండ్ చేసింది.
* 1940 లో అప్పటి బ్రిటిష్ - ఇండియా గవర్నర్ జనరల్ లార్డ్ లిన్ లిత్‌గో ప్రకటించిన ఆగస్టు ప్రతిపాదనల్లో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు బ్రిటిష్ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది.
* 1942 లో క్రిప్స్ ప్రతిపాదనల్లో భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు భారతీయుల హక్కుగా మొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించింది. 1946 లో కాబినెట్ మిషన్ లేదా మంత్రిత్రయ రాయబారం (ఫెథిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఎ.వి. అలెగ్జాండర్) ఫెథిక్ లారెన్స్ అధ్యక్షతన తమ ప్రణాళికను ప్రభుత్వానికి వెల్లడించింది. ఇందులో రాజ్యాంగాన్ని రూపొందించడానికి ప్రత్యేక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు అవుతుందని ప్రకటించింది.

 

రాజ్యాంగ పరిషత్ నిర్మాణం

      అవిభాజ్య భారత రాజ్యాంగ పరిషత్ (సభ) మొత్తం సభ్యుల సంఖ్య 389. ఇందులో బ్రిటిష్ - ఇండియాలోని 11 గవర్నర్ పాలిత రాష్ట్రాల నుంచి 292 మంది ఎన్నికయ్యారు. చీఫ్ కమిషనర్ పాలిత ప్రాంతాల (ఢిల్లీ, అజ్మీర్ - మేవార్, కూర్గ్, బ్రిటిష్ బెలూచిస్థాన్) నుంచి నలుగురు సభ్యులు నియమితులయ్యారు.
స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది నియమితులయ్యారు. ఎన్నికైన సభ్యుల్లో 208 మంది (70%) భారత జాతీయ కాంగ్రెస్ నుంచి, 73 మంది (25%) ముస్లిం లీగ్ నుంచి, ఇతర పార్టీల నుంచి, స్వతంత్రులు 15 మంది ఎన్నికయ్యారు.

 

స్వాతంత్య్రం తర్వాత భారత రాజ్యాంగ సభలో వచ్చిన మార్పులు 
భారత రాజ్యాంగ సభ సార్వభౌమాధికార సంస్థగా అవతరించింది. అప్పటి వరకు బ్రిటిష్ - ఇండియా పాలన కోసం బ్రిటిష్ పార్లమెంట్ చేసిన ఏ చట్టాన్నైనా రద్దు చేయడానికి, సవరించడానికి సభకు అధికారం లభించింది.
* భారత రాజ్యాంగ సభ, భారత పార్లమెంట్‌గా కూడా అవతరించింది. భారత రాజ్యాంగ సభ ద్విపాత్రాభినయం చేయాల్సి వచ్చింది. అవి:
      1) రాజ్యాంగాన్ని రూపొందించడం.
      2) దేశ పరిపాలనకు అవసరమైన సాధారణ చట్టాలను రూపొందించడం.
* రాజ్యాంగ సభగా సమావేశమైనప్పుడు డా. బాబూ రాజేంద్ర ప్రసాద్, భారత పార్లమెంట్‌గా సమావేశమైనప్పుడు జి.వి. మౌలంకర్ అధ్యక్షత వహించారు.
* రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్య 389 నుంచి 299కి తగ్గింది. ఇందులో బ్రిటిష్ ఇండియా పాలిత ప్రాంతాలకు 229, స్వదేశీ సంస్థానాలకు 70 మంది ప్రాతినిధ్యం వహించారు. 

 

భారత రాజ్యాంగ సభ - కార్యకలాపాల నిర్వహణ

       భారత రాజ్యాంగ సభ మొదటి సమావేశం 1946 డిసెంబరు 9 న జరిగింది. ఈ సమావేశానికి 211 మంది ప్రతినిధులు (ప్రారంభంలో స్వదేశీ సంస్థానాలు ప్రతినిధులను నియమించక పోవడమే దీనికి కారణం) హాజరయ్యారు. ఈ సమావేశంలో ఫ్రెంచ్ సంప్రదాయాన్ని అనుసరించి రాజ్యాంగ సభలో అత్యంత సీనియర్ అయిన డా. సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగా, ఫ్రాంక్ ఆంథోనిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 1946 డిసెంబరు 11 న డా. బాబూ రాజేంద్ర ప్రసాద్‌ను శాశ్వత అధ్యక్షుడిగా, హెచ్.సి. ముఖర్జీని శాశ్వత ఉపాధ్యక్షుడిగా (డిసెంబరు 13) ఎన్నుకున్నారు. బెనగల్ నరసింహారావు (బి.ఎన్. రావు)ను రాజ్యాంగ సలహాదారుగా నియమించారు. (బి.ఎన్. రావు తర్వాతి కాలంలో అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు).
* రాజ్యాంగ సభ 11 సమావేశాల్లో 7 వ సమావేశం సుదీర్ఘంగా 1948 నవంబరు 4 నుంచి 1949 జనవరి 8 వరకు సాగింది.
* 1946 డిసెంబరు 13 న 'లక్ష్యాల తీర్మానాన్ని' పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రవేశపెట్టారు. దీనిపై సుధీర్ఘంగా చర్చించిన తర్వాత 1947 జనవరి 22 న ఆమోదించింది. ఇదే ఆధునిక భారత రాజ్యాంగంలో ప్రవేశికగా గుర్తింపు పొందింది.
* రాజ్యాంగ సభ తన కార్యకలాపాలను మరింత సమర్థంగా నిర్వహించడానికి వివిధ కమిటీలను నియమించింది. అందులో ముఖ్యమైన కమిటీలు - వాటి అధ్యక్షులు
    1) కేంద్ర ప్రభుత్వ అధికారాల కమిటీ - జవహర్‌లాల్‌నెహ్రూ
    2) కేంద్ర రాజ్యాంగ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
    3) రాజ్యాంగ ముసాయిదా రచనా కమిటీ - డా. బి.ఆర్. అంబేడ్కర్
    4) ప్రావిన్షియల్ రాజ్యాంగ కమిటీ - సర్దార్ వల్లభాయ్ పటేల్
    5) సలహా సంఘం - సర్దార్ వల్లభాయ్ పటేల్
    6) నియమావళి కమిటీ (రూల్స్ కమిటీ) - డా. బాబూ రాజేంద్రప్రసాద్
    7) సారథ్య సంఘం (స్టీరింగ్ కమిటీ) - డా. బాబూ రాజేంద్ర ప్రసాద్
    8) ఆర్థిక, స్టాఫ్ కమిటీ - డా. బాబూ రాజేంద్ర ప్రసాద్
* ఈ కమిటీలన్నింటిలో సలహా సంఘం అతిపెద్దది. ఇందులో అధ్యక్షుడు, 54 మంది సభ్యులు ఉన్నారు. అతి ముఖ్యమైంది డ్రాఫ్టింగ్ కమిటీ. దీన్నే రాజ్యాంగ ముసాయిదా రచనా కమిటీ అని కూడా అంటారు.

డ్రాఫ్టింగ్ కమిటీ: దీనికి డా. బి.ఆర్. అంబేడ్కర్ అధ్యక్షత వహించారు. ఇందులో ఆరుగురు (సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్. గోపాల స్వామి అయ్యంగార్, కె.ఎం మున్షీ, సయ్యద్ మహ్మద్ సాదుల్లా, ఎన్. మాధవరావు (బి.ఎల్. మిట్టల్ స్థానంలో), టి.టి. కృష్ణమాచార్యులు (1948 లో డి.పి. ఖైతాన్ మరణించడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేశారు) సభ్యులున్నారు.
* డ్రాఫ్టింగ్ కమిటీ మొదటి ముసాయిదాను ఫిబ్రవరి 1948 లో, రెండో ముసాయిదాను అక్టోబరు 1948 లో ప్రతిపాదించింది. ఈ కమిటీ సమావేశాలు 141 రోజులు మాత్రమే జరిగాయి.

 

రాజ్యాంగ పరిషత్ సభ్యుల ఎన్నిక    

భారత రాజ్యాంగ పరిషత్ నిర్మాణం రెండు పద్ధతుల్లో జరిగింది. అవి: 1) ఎన్నిక 2) నియామకం. ఎన్నిక 'పరోక్ష పద్ధతి'లో (ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో) ఒక ఓటు బదిలీ విధానం ద్వారా జరిగింది. ప్రతి పది లక్షల జనాభాకు ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహించారు. ఈ ఎన్నికలను 1946 జులై, ఆగస్టు నెలల్లో నిర్వహించారు.
* పంజాబ్ మినహా మిగిలిన బ్రిటిష్ - ఇండియా భూభాగంలో నియోజక వర్గాలను రెండు రకాలుగా విభజించారు. అవి:
    1) జనరల్ (మహ్మదీయులు, సిక్కులు మినహా మిగిలిన వర్గాలు).
    2) మహ్మదీయ నియోజక వర్గాలు (మహ్మదీయులు)
* పంజాబ్‌లో పై రెండు రకాలతో పాటు సిక్కులకు కూడా జనాభా దామాషాలో సీట్లను కేటాయించారు. అంటే 3 రకాల నియోజక వర్గాలను ఏర్పాటు చేశారు.

 

రాజ్యాంగం అమలు

రాజ్యాంగంలోని కొన్ని అంశాలు రాజ్యాంగం ఆమోదం పొందినప్పటి నుంచే (1949 నవంబరు 26) అమల్లోకి వచ్చాయి. ఉదాహరణకు 5 - 9 నిబంధనలు (పౌరసత్వం), 324 (ఎన్నికల సంఘం), 367, 392, 393 మొదలైనవి. అయితే భారత రాజ్యాంగం పూర్తిగా అమల్లోకి వచ్చిన రోజు 1950 జనవరి 26. దీన్నే రిపబ్లిక్‌డే లేదా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
* రాజ్యాంగ రచన 1949 నవంబరు 26 న పూర్తై, ఆమోదం పొందినా, 1950 జనవరి 26 నుంచే రాజ్యాంగం అమలైంది. కారణం - 1930 జనవరి 26 నాటికి సంపూర్ణ స్వరాజ్‌ను సాధించాలని పెట్టుకున్న ఆశయానికి గుర్తుగా జనవరి 26 నుంచి అమలు చేశారు.
* రాజ్యాంగం అమల్లోకి రావడంతో భారత ప్రజలు రూపొందించుకున్న చట్టం ప్రకారం పరిపాలన ప్రారంభమైంది. అప్పటి వరకు అమల్లో ఉన్న చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటే, చెల్లకుండా పోయాయి. మూల రాజ్యాంగాన్ని ఆంగ్లంలో రచించారు. తర్వాత దాన్ని హిందీలోకి తర్జుమా చేశారు.  రాజ్యాంగ నిర్మాణానికి చేసిన కృషి వల్ల అంబేడ్కర్ భారత రాజ్యాంగ పితామహుడిగా, నవ భారత రాజ్యాంగ నిర్మాతగా, ఆధునిక మనువుగా కీర్తి పొందారు.

Posted Date : 07-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పౌరులు - పౌరసత్వం

       ఒక వ్యక్తిని చట్టబద్ధంగా దేశపౌరుడిగా గుర్తించడాన్నే ‘పౌరసత్వం’ అంటారు. సాధారణంగా సమాఖ్య దేశాల్లోని పౌరులకు ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. మనదేశ రాజ్యాంగం భారతదేశాన్ని ‘యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌’గా పేర్కొంది. ఇది అనేక సమాఖ్య లక్షణాలు కలిగి ఉంది. అయినప్పటికీ భారత పౌరులకు ఏకపౌరసత్వం మాత్రమే ఉంది. ఆర్టికల్‌ 370 ప్రకారం జమ్ముకశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి ఉన్నందున ఆ రాష్ట్ర ప్రజలకు ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది.

 

ప్రజలు - వర్గీకరణ

ఒక దేశంలోని ప్రజలను పౌరులు, విదేశీయులని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
* రాజకీయ హక్కులను కలిగి ఉండేవారిని పౌరులంటారు. ఆ హక్కులు లేనివారిని విదేశీయులంటారు.
రాజకీయ హక్కులంటే..
* ఎన్నికల్లో పోటీచేసే హక్కు
*  ఎన్నికల్లో ఓటు వేసే హక్కు
* రాజ్యాంగ అత్యున్నత పదవులను చేపట్టే హక్కు
* ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు

 

భారత రాజ్యాంగం - పౌరసత్వ వివరణ
* రాజ్యాంగంలోని 2వ భాగంలో ఉన్న ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు పౌరసత్వం గురించి వివరిస్తున్నాయి.

 

ఆర్టికల్‌ 5
*  1950, జనవరి 26 నాటికి ఉన్న రాజ్యాంగం ఆరంభంలోని పౌరసత్వాన్ని గురించి తెలియజేస్తుంది.
*  1950, జనవరి 26 లోపు భారతదేశంలో జన్మించి, శాశ్వత స్థిర నివాసం ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరికీ భారతీయ పౌరసత్వం లభిస్తుంది.
*  1950, జనవరి 26 లోపు ఒక వ్యక్తి విదేశాల్లో జన్మించినప్పటికీ, అతడి తల్లి/తండ్రి ఆ సమయానికి భారతీయ పౌరసత్వం కలిగి ఉంటే ఆ వ్యక్తికి కూడా భారతీయ పౌరసత్వం లభిస్తుంది.
*  1950, జనవరి 26 లోపు ఒక వ్యక్తి భారతదేశంలో 5 సంవత్సరాలు శాశ్వత స్థిరనివాసం కలిగి ఉంటే ఆ వ్యక్తికి భారతీయ పౌరసత్వం లభిస్తుంది.

 

ఆర్టికల్‌ 6
*  పాకిస్థాన్‌ నుంచి భారతదేశానికి వలస వచ్చినవారి పౌరసత్వాన్ని గురించి తెలియజేస్తుంది.
*   1948, జులై 19 కంటే ముందు పాకిస్థాన్‌ నుంచి భారతదేశానికి వచ్చి స్థిర నివాసాన్ని ఏర్పరుచుకున్నవారంతా భారతీయ పౌరసత్వానికి అర్హులు.

 

ఆర్టికల్‌ 7
* 1947, మార్చి 1 తర్వాత భారతదేశం నుంచి పాకిస్థాన్‌కు వలస వెళ్లి అక్కడ ఇమడలేక 1948, జులై 19 నాటికి భారత్‌కు వలస వచ్చినవారి పౌరసత్వ హక్కులను గురించి వివరిస్తుంది.

 

ఆర్టికల్‌ 8
* విదేశాల్లో నివసించే భారత సంతతి పౌరసత్వాన్ని గురించి ఉంటుంది.

 

ఆర్టికల్‌ 9
* భారత పౌరులు ఎవరైనా విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించినప్పుడు సహజంగానే భారత పౌరసత్వాన్ని కోల్పోతారు.

 

ఆర్టికల్‌ 10
* భారతీయ పౌరసత్వం శాశ్వతత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే భారతీయుడు ఎప్పటికీ భారతీయుడే.

 

ఆర్టికల్‌ 11
* భారత రాజ్యాంగంలో పౌరసత్వానికి సంబంధించిన సమగ్రమైన నియమాలు  లేవు. పౌరసత్వానికి సంబంధించిన చట్టాలను రూపొందించే అత్యున్నత అధికారం పార్లమెంటుకు ఉంది.

 

భారత పౌరసత్వ చట్టం, 1955

* భారత పార్లమెంటు పౌరసత్వానికి సంబంధించిన సమగ్రమైన నియమాలను నిర్దేశిస్తూ 1955లో భారత పౌరసత్వ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం రెండు ప్రధాన నియమాలపై ఆధారపడి ఉంది.  అవి:
1. Jus Soli (Right of the Soil): జన్మతః పౌరసత్వం
2. Jus Sanguinis (By Descent): రక్త సంబంధం/వారసత్వ రీత్యా పౌరసత్వం
* 1955 నాటి భారత పౌరసత్వ చట్టం ప్రకారం 5 రకాల పద్ధతుల ద్వారా భారత పౌరసత్వాన్ని పొందవచ్చు. అవి:

 

జన్మతః పౌరసత్వం (Citizenship by Birth)
* 1950, జనవరి 26 తర్వాత భారత్‌లో జన్మించి, స్థిర నివాసం ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరూ భారతీయ పౌరసత్వాన్ని పొందగలరు.

 

పరిమితులు
* మన దేశంలోని విదేశీ రాయబార కార్యాలయ ఉద్యోగులకు జన్మించిన పిల్లలు.
* శత్రు దేశాల దంపతులకు జన్మించిన పిల్లలు, భారతదేశానికి విహారయాత్ర నిమిత్తం వచ్చిన విదేశాలకు సంబంధించిన దంపతులకు జన్మించిన పిల్లలు భారతీయ పౌరసత్వానికి అనర్హులు.

 

వారసత్వరీత్యా పౌరసత్వం (Citizenship by Descent)
* 1950, జనవరి 26 తర్వాత ఒక వ్యక్తి విదేశాల్లో జన్మించినప్పటికీ, ఆ వ్యక్తి తల్లి/ తండ్రి భారతీయ పౌరసత్వాన్ని కలిగి ఉంటే విదేశాల్లో జన్మించిన ఆ వ్యక్తిని కూడా భారతీయ పౌరుడిగా పరిగణిస్తారు.
ఉదా: శశిథరూర్‌ (లండన్‌లో జన్మించారు), రాహుల్‌ గాంధీ (అమెరికాలో జన్మించారు), విదేశాల్లోని భారత రాయబార ఉద్యోగులకు జన్మించిన పిల్లలు.

 

నమోదు ద్వారా పౌరసత్వం (Citizenship by Registration)
* విదేశాల్లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన వ్యక్తులు పౌరసత్వ చట్టం, 1955లోని సెక్షన్‌ 5(1)(a) ప్రకారం నమోదు ద్వారా పౌరసత్వాన్ని పొందవచ్చు.
*  భారత పౌరుడిని వివాహం చేసుకున్న విదేశీ మహిళ పౌరసత్వ చట్టం, 1955లోని సెక్షన్‌ 5(1)(c)ద్వారా భారత పౌరసత్వాన్ని పొందగలరు.
ఉదా:జన్మతః ఇటలీ దేశస్థురాలైన సోనియాగాంధీ రాజీవ్‌గాంధీని వివాహం చేసుకోవడంతో 1983లో భారత పౌరసత్వాన్ని పొందారు.

 

సహజీకృతం ద్వారా పౌరసత్వం (Citizenship by Naturalisation)
* విదేశీయులు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల మక్కువ, ప్రేమాభిమానాలతో భారత పౌరసత్వ చట్టం, 1955లోని సెక్షన్ 6(1) ద్వారా భారతీయ పౌరసత్వాన్ని పొందవచ్చు.
అర్హతలు
* కనీసం 18 సంవత్సరాలు నిండి, రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న ఏదైనా ఒక భారతీయ భాషలో తగిన ప్రావీణ్యం ఉండి, భారత్‌లో 5 సంవత్సరాలు శాశ్వత స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నవారు సహజీకృత పౌరసత్వానికి అర్హులు.
ఉదా: మదర్‌ థెరిసా (యుగోస్లావియా).

 

ఒక భూభాగం శాశ్వతంగా భారత్‌లో కలిసిపోవడం ద్వారా పౌరసత్వం (Citizenship by Incorporation of territory)
* 1950, జనవరి 26 తర్వాత ఒక కొత్త ప్రాంతం/ భూభాగం/ రాష్ట్రం/ దేశం భారత్‌లో శాశ్వతంగా కలిసిపోతే ఆ భూభాగంలోని ప్రజలందరికీ భారతీయ పౌరసత్వం లభిస్తుంది.
ఉదా: 1954లో ఫ్రెంచ్‌వారి నుంచి పాండిచ్చేరి, 1961లో పోర్చుగీసువారి నుంచి గోవా, 1975లో చోగ్యాల్‌ రాజు నుంచి సిక్కిం విముక్తి చెంది భారత్‌లో విలీనమయ్యాయి.


రద్దు పద్ధతులు
* 1955 భారత పౌరసత్వ చట్టం కింద 3 రకాల పద్ధతుల ద్వారా భారత పౌరసత్వం రద్దు అవుతుంది. అవి:
1. పరిత్యాగం (Renunciation): ఎవరైనా భారతీయ పౌరుడు విదేశీ పౌరసత్వాన్ని పొందాలనుకున్నప్పుడు భారతీయ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా త్యజించవచ్చు.
2. రద్దు చేయడం (Termination):ఎవరైనా భారతీయ పౌరుడు భారతీయ పౌరసత్వాన్ని త్యజించకుండా, విదేశీ పౌరసత్వాన్ని పొందినప్పుడు భారతదేశ పౌరసత్వాన్ని రద్దు చేస్తారు.
3. అనివార్యపు రద్దు(By Deprivation): ఏ వ్యక్తి అయినా భారత పౌరసత్వాన్ని అక్రమంగా లేదా మోసపూరితంగా సంపాదించినా లేదా భారత రాజ్యాంగాన్ని, జాతీయ జెండాను, భారతీయ సంస్కృతిని అవమానిస్తే అలాంటివారి పౌరసత్వాన్ని రద్దు చేస్తారు.

 

భారత పౌరసత్వ సవరణ చట్టం, 1986

* విదేశీయులు అక్రమంగా భారతీయ పౌరసత్వాన్ని పొందడాన్ని నిరోధించే లక్ష్యంతో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ 1986లో భారత పౌరసత్వ సవరణ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ద్వారా కింది మార్పులు జరిగాయి.
* నమోదు ద్వారా భారతీయ పౌరసత్వాన్ని పొందాలనుకునే వ్యక్తి ఈ చట్టాన్ని అనుసరించి భారత్‌లో 5 సంవత్సరాల శాశ్వత స్థిరనివాసం కలిగి ఉండాలి. (1955 పౌరసత్వ చట్టం ప్రకారం 6 నెలలే)

* ఈ చట్టంలో ‘స్త్రీలు’ అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో ‘వ్యక్తులు’ అనే పదాన్ని చేర్చారు. (1955 పౌరసత్వ చట్టం ప్రకారం భారతీయుడిని వివాహమాడిన విదేశీ మహిళ అని ఉండేది.)
* సహజీకృతం ద్వారా భారతీయ పౌరసత్వాన్ని పొందాలనుకునే వ్యక్తి ఈ చట్టాన్ని అనుసరించి దేశంలో 10 సంవత్సరాలు శాశ్వత స్థిర నివాసం ఉండాలి. (1955 పౌరసత్వ చట్టం ప్రకారం 5 సంవత్సరాలు ఉండేది). 
* భారత పౌరసత్వ చట్టాన్ని 1992, 2003, 2005లో కూడా సవరించారు.

 

భారత పౌరసత్వ సవరణ చట్టం, 2003

* ఎల్‌.ఎం. సింఘ్వీ కమిటీ సిఫారసుల మేరకు ప్రవాస భారతీయులకు (ఎన్‌ఆర్‌ఐ) ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించే లక్ష్యంతో భారత పార్లమెంటు 2003లో ఈ చట్టాన్ని రూపొందించింది.
* ఈ చట్టం ప్రకారం 2004లో ప్రపంచంలోని 16 దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు మనదేశం ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించింది.

 

16 దేశాలు
       స్విట్జర్లాండ్, కెనడా, పోర్చుగల్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, స్వీడన్, గ్రీస్, న్యూజిలాండ్, సైప్రస్, ఫిన్లాండ్, ఐర్లాండ్, ఇటలీ, నెదర్లాండ్, అమెరికా, బ్రిటన్‌.
* 2006, జనవరి 9న జరిగిన ప్రవాస భారతీయ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ తప్ప మిగిలిన అన్ని దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులందరికీ ద్వంద్వ పౌరసత్వాన్ని పొందేందుకు అవకాశం కల్పించారు.

 

ద్వంద్వ పౌరసత్వం - ప్రయోజనాలు

* ప్రవాస భారతీయులు భారత్‌లో ఆస్తులను సంపాదించుకోవచ్చు, పెట్టుబడులు పెట్టవచ్చు.

* విద్య, ఆర్థిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో భారతీయులతో సమానమైన అవకాశాలు పొందవచ్చు.
* ప్రవాస భారతీయులు భారతీయ పాస్‌పోర్ట్‌ను పొందవచ్చు.

 

పరిమితులు
* ఎన్నికల్లో పోటీచేయడానికి వీల్లేదు.
*  రాజ్యాంగ అత్యున్నత పదవులను చేపట్టే అవకాశం లేదు.
* ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు పొందే హక్కు లేదు.
* 2010, జనవరి 1 నుంచి ప్రవాస భారతీయులకు ఓటుహక్కు కల్పించారు.

 

భారతీయ సంతతి వ్యక్తుల పథకం  (పర్సన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌ - పీఐఓ)

* 1999, మార్చిలో ప్రవేశపెట్టిన పీఐఓ కార్డు పథకాన్ని భారత ప్రభుత్వం పునః సమీక్షించి, 2002, సెప్టెంబరు 15 నుంచి కొత్త పీఐఓ కార్డు పథకాన్ని అమల్లోకి తెచ్చింది.
 

ముఖ్యాంశాలు
* పీఐఓ కార్డు పొందాలనుకునే ప్రవాస భారతీయులు పెద్దలయితే రూ.15000, 18 సంవత్సరాల లోపువారైతే రూ.7500 చెల్లించాలి.
* ఈ కార్డు కాలపరిమితి 15 సంవత్సరాలు.
* అఫ్గానిస్థాన్, భూటాన్, బంగ్లాదేశ్, చైనా, నేపాల్, పాకిస్థాన్‌లోని ప్రవాస భారతీయులకు పీఐఓ కార్డులు జారీ చేయరు.
* పీఐఓ కార్డు పొందినవారు మన దేశంలో వ్యవసాయ సంబంధ ఆస్తులను సంపాదించుకోవడాన్ని మినహాయించి, ఆర్థిక, వాణిజ్య, విద్యారంగాల్లో అన్ని రకాల అవకాశాలను పొందవచ్చు. వీరికి రాజకీయ హక్కులు ఉండవు.

 

ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా పథకం

* భారత పౌరసత్వ సవరణ చట్టం 2003 ప్రకారం ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ) కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
ముఖ్యాంశాలు
* ఓసీఐ కార్డును పొందేందుకు 275 అమెరికన్‌ డాలర్లు చెల్లించాలి.
* ఓసీఐ కార్డు ఉన్నవారు భారతదేశాన్ని సందర్శించడానికి వీసా పొందాల్సిన అవసరం లేదు. ఈ కార్డు కాలపరిమితి జీవితకాలం కొనసాగుతుంది.
* ఓసీఐ కార్డుపై బహుళ ప్రయోజన, బహుళ ప్రవేశిక వీసాలు మంజూరు చేస్తారు.
* 5 సంవత్సరాల పాటు ఓసీఐ నమోదైన వ్యక్తి 2 సంవత్సరాలు భారత్‌లో సాధారణ జీవితాన్ని గడిపితే అతడికి భారత పౌరసత్వం ఇస్తారు.
* 1950, జనవరి 26 తర్వాత భారత్‌ నుంచి విదేశాలకు వలస వెళ్లినవారికి ఓసీఐ కార్డు ఇస్తారు.

 

ప్రవాసీ భారతీయ దివస్‌

*  మహాత్మా గాంధీ 1915, జనవరి 9న దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈ చారిత్రక నేపథ్యం కారణంగా 2003, జనవరి 9 నుంచి ఏటా జనవరి 9న ‘ప్రవాసీ భారతీయ దివస్‌’ను జరుపుతున్నారు.
* ప్రవాసీ భారతీయ వ్యవహారాల మంత్రిత్వశాఖను భారత ప్రభుత్వం 2004లో ఏర్పాటు చేసింది.

 

సుప్రీంకోర్టు తీర్పు

డేవిడ్‌ జాన్‌ హాప్‌కీన్స్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు - 1997
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ భారతదేశ పౌరసత్వాన్ని విదేశీయులకు ప్రసాదించే విషయంలో మన దేశం విచక్షణాధికారాన్ని కలిగి ఉంటుందని, విదేశీయులు మన దేశ పౌరసత్వాన్ని పొందడమనేది ప్రాథమిక హక్కుగా పరిగణించరాదని పేర్కొంది.
నూతన పౌరసత్వ బిల్లు  - ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు
* ముస్లిమేతర పౌరులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిన పౌరసత్వ సవరణ బిల్లు 2018ను లోక్‌సభ 2019, జనవరి 8న ఆమోదించింది.
* దీని ప్రకారం బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌ దేశాల నుంచి వచ్చే హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలకు భారత పౌరసత్వాన్ని ఇవ్వాలని ప్రతిపాదించారు. భారత్‌లో పౌరసత్వాన్ని పొందేందుకు కనీస నివాస కాలాన్ని 12 నుంచి 6 సంవత్సరాలకు తగ్గిస్తూ తీర్మానించారు.
* దీనికి తీవ్రంగా స్పందించిన అసోం, మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్‌ రాష్ట్రాలు బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి.

 

అసోం ఒప్పందం - 1985
* 1971, మార్చి 24 తర్వాత అసోం రాష్ట్రానికి వచ్చిన విదేశీయులను మతాలతో సంబంధం లేకుండా బయటకు పంపాలని 1985లో అసోం ఒప్పందం కుదిరింది.
* 1985 నాటి అసోం ఒప్పందాన్ని నూతన పౌరసత్వ బిల్లు ఉల్లంఘిస్తుందని అసోంలో తీవ్ర నిరసనలు కొనసాగుతున్నాయి.

 

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 07-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రాథ‌మిక విధులు

ప్రాథమిక విధులు రాజ్యం, సమాజం, ఇతర వ్యక్తుల పట్ల వ్యక్తికి ఉండే బాధ్యతలను తెలియజేస్తాయి. రాజ్యాంగంలోని IV-A భాగంలో 51-A నిబంధనలో వీటిని చేర్చారు. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల ఆధారంగా 42 వ రాజ్యాంగ సవరణ చట్టం (1976) ద్వారా రాజ్యాంగంలో 10 ప్రాథమిక విధులను చేర్చారు. 86 వ రాజ్యాంగ సవరణ చట్టం, 2002 ద్వారా మరో ప్రాథమిక విధిని చేర్చడంతో, వీటి సంఖ్య 11 కు చేరింది. జస్టిస్ జె.ఎస్. వర్మ కమిటీ (1998) సిఫారసుల మేరకు 'జనవరి 3 ను ప్రాథమిక విధుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
* 51-(A) (a): రాజ్యాంగం పట్ల విధేయత కలిగి ఉండాలి. రాజ్యాంగ సంస్థలను, జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని గౌరవించాలి.
(b): స్వాతంత్య్రోద్యమాన్ని ఉత్తేజపరచిన ఉన్నత ఆదర్శాలను గౌరవించాలి, అనుసరించాలి.
(c): దేశ సార్వభౌమత్వాన్ని, సమైక్యత, సమగ్రతలను గౌరవించాలి, కాపాడాలి.
(d): దేశ రక్షణకు, జాతీయ సేవకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి.
(e): భారత ప్రజల మధ్య సోదరభావాన్ని, సామరస్యాన్ని పెంపొందించాలి. మతం, భాష, ప్రాంతీయ, వర్గ విభేదాలకు అతీతంగా ఉండాలి. మహిళల గౌరవానికి భంగం కలిగించే ఆచారాలను విడనాడాలి.
(f): మన వారసత్వ సమష్టి సంస్కృతి (భిన్నత్వంలో ఏకత్వం) గొప్పతనాన్ని గౌరవించాలి, కాపాడాలి.
(g): అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులను కాపాడాలి, ఇతర జీవుల పట్ల దయ ఉండాలి.
(h): శాస్త్రీయ, మానవతా దృక్పథం, పరిశీలనా దృక్పథం, సంస్కరణ దృక్పథల పట్ల సానుకూలతను పెంపొందించుకోవాలి.
(i): ప్రభుత్వ ఆస్తిని కాపాడాలి, హింసను విడనాడాలి.
(j): అన్ని రంగాలలో వ్యక్తిగత, సమష్టి కార్యకలాపాల ద్వారా దేశ ఔన్నత్యాన్ని పెంపొందించడానికి కృషి చేయాలి.
(k): 6 - 14 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల విద్యార్జనకు తగిన అవకాశాలను కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, సంరక్షకులకు ఉంటుంది.
* అయితే ప్రాథమిక విధులు న్యాయ అర్హమైనవి కావు. అందువల్ల వీటి అమలుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు చేయాల్సి ఉంటుంది.
* క్లుప్తంగా చెప్పాలంటే... ఆదేశ సూత్రాలు ప్రభుత్వాలకు నిర్దేశించిన బాధ్యతలు, ప్రాథమిక విధులు ప్రజలకు నిర్దేశించిన బాధ్యతలు.

Posted Date : 07-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రాథ‌మిక విధులు

1. ఉమ్మడి పౌరస్మృతిని ఆదేశ సూత్రాలలో చేర్చడంలో రాజ్యాంగ నిర్మాతల ఆశయం ఏమిటి?
జ‌: జాతీయ సమైక్యత, సమగ్రత

 

2. మాతా, శిశు సంరక్షణ రాజ్య కర్తవ్యం అని తెలిపే నిబంధన ఏది?
జ‌: నిబంధన 42

 

3. నిబంధన 39 (d) కిందివాటిలో ఏ విషయాన్ని తెలియజేస్తుంది?
  ఎ) సమాన పనికి అసమాన వేతనం
  బి) శారీరక, మానసిక శ్రమకు సమాన వేతనం
  సి) స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం
  డి) ఎ, బి సరైనవి
జ‌: సి (స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం)

 

4. ఆదేశ సూత్రాలు న్యాయార్హమైనవి కావు అని తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది?
జ‌: నిబంధన 37

 

5. కిందివాటిలో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చని నిబంధన ఏది?
ఎ) 38 (2)   బి) 39 (f)    సి) 39 (e)     డి) 39 (A)
జ‌: సి (39 (e))

 

6. గ్రామ పంచాయతీలను స్వయంపాలనా సంస్థలుగా తీర్చిదిద్దాలని తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది?
జ‌: నిబంధన 40

 

7. కిందివాటిలో ప్రాథమిక హక్కులపై ఆదేశ సూత్రాలకు ఆధిక్యం కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?
  ఎ) 40 వ రాజ్యాంగ సవరణ చట్టం
  బి) 44 వ రాజ్యాంగ సవరణ చట్టం
  సి) 43 వ రాజ్యాంగ సవరణ చట్టం
  డి) 42 వ రాజ్యాంగ సవరణ చట్టం
జ‌: డి ( 42 వ రాజ్యాంగ సవరణ చట్టం)

 

8. కిందివాటిలో 43 వ రాజ్యాంగ నిబంధనలో లేని అంశం ఏది?
  ఎ) కార్మికులకు కనీస వేతనం
  బి) కార్మికుల జీవన ప్రమాణాలు
  సి) కార్మికుల కుటుంబాలకు ఉన్నత విద్య
  డి) తగిన విరామం
జ‌: సి (కార్మికుల కుటుంబాలకు ఉన్నత విద్య)

 

9. ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉన్న ఏకైక రాష్ట్రం ఏది?
జ‌: గోవా

 

10. మద్యపాన నిషేధాన్ని అమలు చేయడానికి చట్టాలు చేయాలని తెలిపే నిబంధన ఏది?
జ‌: నిబంధన 47

 

11. నిబంధన 49 ప్రకారం కింద పేర్కొన్న వాటిలో వేటిని సంరక్షించాలి?
  ఎ) ప్రభుత్వ ఆస్తులు     బి) చారిత్రక కట్టడాలు
  సి) చారిత్రక స్థలాలు      డి) చారిత్రక కట్టడాలు, చారిత్రక స్థలాలు సరైనవి
జ‌: డి (చారిత్రక కట్టడాలు, చారిత్రక స్థలాలు సరైనవి)

 

12. అంతర్జాతీయ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నించాలని తెలిపే నిబంధన ఏది?
జ‌: నిబంధన 51 (d)

 

13. ఆదేశ సూత్రాలను భారత ప్రభుత్వ చట్టం - 1935 లోని ''ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌"తో పోల్చిన రాజ్యాంగవేత్త ఎవరు?
జ‌: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్

 

14. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ నిబంధన 45 ని సవరించారు?
జ‌: 86 వ రాజ్యాంగ సవరణ చట్టం

 

15. కిందివాటిలో ఆదేశ సూత్రాలలో లేని అంశం ఏది?
   ఎ) ఉమ్మడి పౌరస్మృతి
   బి) స్త్రీ, పురుషులకు జీవనోపాధి
   సి) లౌకిక విధానం
   డి) సంపద వికేంద్రీకరణ
జ‌: సి (లౌకిక విధానం)

 

16. ప్రాథమిక విధుల దినోత్సవం ఏ రోజు నిర్వహిస్తున్నారు?
జ‌: జనవరి 3

 

17. రాజ్యాంగంలోని 51 (A) a నిబంధనలో లేని అంశం ఏది?
    ఎ) రాజ్యాంగాన్ని గౌరవించాలి          బి) జాతీయ గీతాన్ని గౌరవించాలి
    సి) జాతీయ పతాకాన్ని గౌరవించాలి     డి) తల్లిదండ్రులను గౌరవించాలి
జ‌: డి (తల్లిదండ్రులను గౌరవించాలి)

 

18. ప్రాథమిక విధులపై 1998 లో నియమించిన కమిటీ ఏది?
జ‌: జస్టిస్ జె.ఎస్. వర్మ కమిటీ

 

19. డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం తన మేధాశక్తితో గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగి దేశ క్షిపణి కార్యకలాపాలకు ఎనలేని కృషి చేశారు. ఇది ఏ ప్రాథమిక విధిని సూచిస్తుంది?
జ‌: 51 - (A)J

 

20. ప్రాథమిక విధులను మొదటిసారిగా రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చారు?
జ‌: 1976

 

Posted Date : 07-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆదేశిక సూత్రాలు

      సాధారణంగా ప్రాథమిక హక్కులకు, ఆదేశిక సూత్రాలకు మధ్య విభేదం ఏర్పడితే ప్రాథమిక హక్కులకు ప్రాధాన్యం ఇవ్వాలని 37వ అధికరణం పేర్కొంటోంది. ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ ఉండదని కూడా ఈ అధికరణం ద్వారా స్పష్టం అవుతుంది. చంపకం దొరైరాజన్ కేసులో, కేరళ విద్యా బిల్లు కేసులో సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని ధ్రువపరిచింది.
     కాలానుగుణంగా ప్రభుత్వ పరిధి పెరగడంతో 1970వ దశకంలో ప్రజా సంక్షేమ చట్టాల అమలుకు కొన్ని ప్రాథమిక హక్కులు ఆటంకంగా మారాయి. దీంతో పార్లమెంట్ రాజ్యాంగ సవరణలు చేసింది. దీనికి న్యాయవ్యవస్థ విముఖత చూపింది.
* 1970 నుంచి ఆదేశిక సూత్రాల స్వభావాన్ని, దాన్ని అర్థం చేసుకునే విధానంలో ఇటు కార్యనిర్వాహక వర్గం, అటు న్యాయవ్యవస్థల దృక్పథాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వానికి, న్యాయస్థానాలకు ఆదేశిక సూత్రాల అమలు విషయమై ఘర్షణ వాతావరణం నెలకొని ఉండేది.
* 1970వ దశకంలో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం సామ్యవాద విధానాల అమలు పట్ల మొగ్గు చూపించింది. 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం జరిగినప్పుడు అప్పటి సామ్యవాద USSR ఇచ్చిన మద్దతు వల్ల, కాంగ్రెస్‌లో వచ్చిన అంతర్గత చీలిక వల్ల ఇందిరాగాంధీ సామ్యవాదం వైపు మొగ్గు చూపినట్లు అర్థమవుతుంది. 1971లో చేసిన 25వ రాజ్యాంగ సవరణ ద్వారా 31 (c) అనే అధికరణాన్ని జోడించారు. 
* ఈ అధికరణం ఆదేశిక సూత్రాల్లోని 39 (b) (సామాజిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న సహజ వనరులపై రాజ్యానికి యాజమాన్య నియంత్రణ ఉండాలి. సమాజంలో అందరికీ వాటిని సమానంగా పంపిణీ చేయాలి), 39(c) (ఉత్పత్తి పరికరాలు, సంపద కేవలం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ఆర్థిక విధాన రూపకల్పన) అమలుకు ప్రాథమిక హక్కుల్లోని 14, 19, 31వ అధికరణాలు అడ్డు తగిలితే వాటిని న్యాయసమీక్ష నుంచి మినహాయించాలని పేర్కొంటోంది.
* అయితే ఇది అంతకు ముందు గోలక్ నాథ్ కేసులో (1967) సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అతిక్రమిస్తూ చేసిన రాజ్యాంగ సవరణగా మనకు కనిపిస్తుంది. గోలక్‌నాథ్ కేసులో ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి 25వ రాజ్యాంగ సవరణ ద్వారా కార్యనిర్వాహక వర్గానికి, న్యాయస్థానానికి మధ్య ఒక రకమైన సంకట పరిస్థితి నెలకొంది. అయితే సుప్రీం కోర్టు కేశవానంద భారతి కేసు (1973)లో తీర్పు సందర్భంగా - రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉంటుందని అయితే రాజ్యాంగానికి 'ఒక మౌలిక స్వభావం' ఉందని, దాన్ని దెబ్బతీసే ఎలాంటి రాజ్యాంగ సవరణ చెల్లదని పేర్కొంది. పైన పేర్కొన్న మౌలిక స్వభావంలో న్యాయ సమీక్ష కూడా ఒక లక్షణమని కోర్టు స్పష్టం చేసింది. క్లుప్తంగా చెప్పాలంటే కేశవానంద భారతి కేసులో సుప్రీం కోర్టు ఉద్దేశం - 25వ రాజ్యాంగ సవరణ (39 (b), (c) లలోని సామ్యవాద ఆదర్శాలను చట్టం ద్వారా అమలు చేయడానికి ప్రాథమిక హక్కుల్లోని 14, 19, 31 అధికరణాలు అడ్డుపడినా ప్రభుత్వం అమలు చేసుకోవచ్చు)  హేతుబద్ధమైందే, కానీ పై విషయంలో కోర్టులకు న్యాయ సమీక్షాధికారం ఉంటుంది. 
* కేశవానంద భారతి కేసులో పేర్కొన్న అంశాలను పక్కనబెట్టిన ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. ఈ సవరణ ప్రకారం కేవలం 39(b), (c) కాకుండా ఏ ఆదేశిక సూత్రాల అమలు కోసమైనా చట్టాలు చేసినప్పుడు అవి ప్రాథమిక హక్కుల్లోని 14, 19 అధికరణాలకు విరుద్ధంగా ఉన్నా అవి ఆమోదయోగ్యమైనవే. అయితే మినర్వా మిల్స్ కేసులో సుప్రీం కోర్టు 42వ రాజ్యాంగ సవరణలో ఆదేశిక సూత్రాలకు ఇచ్చిన ఆధిపత్యాన్ని కొట్టివేసింది.
* ఫలితంగా 39 b, c అధికరణాల అమలు కోసం (ఒకవేళ అవి ప్రాథమిక హక్కుల్లోని 14, 19 అధికరణాలతో సంఘర్షించినా) చట్టాలను రూపొందించుకోవచ్చని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే వీటిపై న్యాయస్థానాలకు న్యాయసమీక్షాధికారం ఉంటుంది.
* 1980వ దశకంలో, ఆ తర్వాత ఆదేశిక సూత్రాల స్వభావం పట్ల న్యాయస్థానాల దృక్పథంలో గణనీయమైన మార్పు కనిపిస్తూ వస్తోంది. న్యాయస్థానాలు ఇప్పుడు వ్యక్తి హక్కులకు (ప్రాథమిక హక్కులు) ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాయో సామాజిక హక్కులకు (ఆదేశిక సూత్రాలు) కూడా అంతే ప్రాముఖ్యం ఇస్తున్నాయి. ఆదేశిక సూత్రాలను అమలు చేయమని న్యాయస్థానాలు, ప్రభుత్వాలకు పదేపదే చెబుతున్నాయి. ఉదాహరణకు ఉమ్మడి పౌరస్మృతి (44వ అధికరణం), మద్యపాన నిషేధం (47వ అధికరణం) అమలు చేయమని న్యాయస్థానాలు వివిధ సందర్భాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించాయి.
* 39వ అధికరణానికి అదనంగా 'A' భాగాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. దీని ప్రకారం న్యాయవ్యవస్థ పేదవర్గాల ప్రయోజనాలను కాపాడి, సామాజిక న్యాయాన్ని సమకూర్చేలా వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలి. 

 

40వ అధికరణం 
ఈ అధికరణం ప్రకారం గ్రామ పంచాయతీ వ్యవస్థలను నెలకొల్పి స్వపరిపాలనా విధానంలో గ్రామీణాభివృద్ధికి కృషి చేయాలి. ఇది మహాత్మాగాంధీ ఆశయం. ప్రతి గ్రామం ఒక చిన్న గణతంత్రంగా (Little Republic) ఎదగాలని ఆయన భావించేవారు. స్వరాజ్యం గ్రామ స్వరాజ్యంగా మారితేనే దేశం బాగుంటుందనేది ఆయన అభిప్రాయం. అందుకే ఆయన అభీష్టాన్ని ఆదేశిక సూత్రాల్లో జోడించారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగబద్ధత కల్పించారు. తద్వారా మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను నెలకొల్పి, గ్రామ పంచాయతీలకు, మండలాలకు, జిల్లా యంత్రాంగానికి అనేక విధులను కేటాయించారు.

 

41వ అధికరణం
నిరుద్యోగం, వృద్ధాప్యం, అనారోగ్యం, అంగవైకల్యం లాంటి అశక్తతతో బాధపడేవారికి తగిన ఉద్యోగ, విద్యా సదుపాయాలను కల్పించేందుకు తమ ఆర్థిక పరిస్థితికి లోబడి ప్రభుత్వాలు కృషి చేయాలి.
* ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు మంజూరు చేస్తున్న పింఛన్లు, విద్యార్థులకు అందిస్తున్న ఉపకారవేతనాలు ఈ కోవకే చెందుతాయి. 

 

42వ అధికరణం 
రాజ్యం కార్మికులకు న్యాయమైన పని పరిస్థితులను కల్పించడం (Human conditions of work), స్త్రీలకు ప్రసూతి సౌకర్యం కల్పించడం.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంక్షేమం కోసం అనేక చట్టాలను చేపట్టాయి.
* గర్భిణులకు ఉచిత వైద్యపరీక్షలు, అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటు ఈ కోవకు చెందినవే.
* 1961లో ప్రసూతి రక్షణ చట్టాన్ని రూపొందించారు.

 

43వ అధికరణం
వ్యవసాయ, పారిశ్రామిక, ఇతర రంగాల్లో పనిచేసే కార్మికులకు హేతుబద్ధమైన, గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన వేతనాలు చెల్లింపునకు సంబంధించి అవసరమైన శాసనాలను రూపొందించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి. వారికి తగినంత విరామ సమయం, సాంఘిక, సాంస్కృతిక అవకాశాలను కల్పించాలి. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంఘ ప్రాతిపదికపై లేదా వ్యక్తి ప్రాతిపదికపై కుటీర పరిశ్రమల సంఖ్యను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి.
* కార్మికుల కోసం కనీస వేతన చట్టాన్ని (1948) రూపొందించారు.
* గ్రామీణ అభివృద్ధి కోసం సమాజ వికాస పథకాన్ని (1952) ప్రవేశపెట్టారు. 
* కుటీర పరిశ్రమలు రాష్ట్ర జాబితాకు చెందినప్పటికీ కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు, చేనేత మగ్గాల బోర్డు, కాయిర్ బోర్డును ఏర్పాటు చేశారు.
* 42వ రాజ్యాంగ సవరణ ద్వారా '43 (A)' ను రాజ్యాంగంలో చేర్చారు. దీని ప్రకారం పరిశ్రమల నిర్వహణలో కార్మికులను భాగస్వాములను చేసే చట్టాలను రూపొందించాలి.

 

44వ అధికరణం

* భారతదేశంలో పౌరులందరికీ ఒకే విధమైన ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి.
* ఆదేశిక సూత్రాల్లో అత్యంత సున్నితమైన, వివాదాస్పదమైన అంశమిది.
* వివాహం, విడాకులు, ఆస్తి పంపకాల విషయంలో న్యాయస్థానాలు ప్రస్తుతం మన చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయి.
* ఈ ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తే మన చట్టాల (Personal Law) స్థానంలో దేశంలో అందరికీ ఒకే చట్టం అమల్లోకి వస్తుంది.
* మైనారిటీ (ముస్లిం, క్రిస్టియన్) మత పెద్దలు ఇందుకు సుముఖంగా లేరు.
* రాజ్యాంగ నిర్మాణ సభ సమావేశాల్లో (Constituent Assembly debates) డా.బి.ఆర్.అంబేడ్కర్ ఉమ్మడి పౌరస్మృతికి అనుకూలంగా తమ వాదనలను వినిపించారు. తర్వాతి కాలంలో దేశ న్యాయశాఖ మంత్రిగా హిందూ కోడ్ బిల్లును రూపొందించారు. లోక్‌సభ, రాజ్యసభ ఆమోదించినా రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ ఆమోదం తెలపకపోవడంతో అంబేడ్కర్ తన పదవికి రాజీనామా చేశారు. 
* ఎస్.ఆర్.బొమ్మై కేసులో (1994) సుప్రీం కోర్టు ఉమ్మడి పౌరస్మృతిని అమలుపరిచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించింది.
* అంతకుముందు 1985లో షాబానో కేసులో సి.ఆర్.పి.సి. ప్రకారం విడాకులు పొందిన తన భర్త నుంచి భరణం (ధరావత్తు) పొందాలన్న షాబానో వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. అయితే ఈ తీర్పును నీరుగారుస్తూ అప్పటి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం పార్లమెంట్‌లో Muslim Women (Protection of Rights on Divorce) 1986 చట్టాన్ని తీసుకొచ్చింది.
* శారదా ముద్గల్ కేసులో పెళ్లి కోసం మతం మార్చుకోవడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా ఖండించింది.
* ప్రస్తుత పరిస్థితి: మూడు సార్లు 'తలాక్' చెప్పడాన్ని వ్యతిరేకిస్తూ షయారా బానో పెట్టుకున్న అభ్యర్థన సుప్రీంకోర్టు ముందు పరిశీలనలో ఉంది.

Posted Date : 07-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆదేశిక సూత్రాలు

మాదిరి ప్రశ్నలు

 

1. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు లేదని సుప్రీంకోర్టు ఏ కేసులో తెలిపింది?
జ: గోలక్‌నాథ్ కేసు

 

2. రాజ్యాంగ మౌలిక స్వభావం గురించి సుప్రీం కోర్టు ఏ కేసులో ప్రస్తావించింది?
జ: కేశవానంద భారతి కేసు

 

3. '31 C' ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జోడించారు?
జ: 25

 

4. స్త్రీలకు ప్రసూతి వైద్య సదుపాయాలు కల్పించాలని చెబుతోన్న అధికరణం ఏది?
జ: 42

 

5. 73వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది?
జ: పంచాయతీరాజ్ వ్యవస్థ

 

6. ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్న 40వ అధికరణం దేనికి ఉదాహరణగా చెప్పొచ్చు?
జ: గాంధేయవాద నియమం

 

7. నిరుద్యోగులు, వృద్ధులు, అంగవైకల్యం ఉన్నవారిని ప్రభుత్వం ఆదుకోవడానికి ప్రయత్నించాలని ఏ అధికరణం చెబుతోంది?
జ: 41

 

8. కార్మికుల కనీస వేతన చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
జ: 1948

 

9. కుటీర పరిశ్రమలు ఏ జాబితాకు చెందినవి?
జ: రాష్ట్ర జాబితా

 

10. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు వేసిన మహిళ?
జ: షయారా బానో

Posted Date : 07-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలన, ఆర్థిక సంబంధాలు

భారత రాజ్యాంగ నిర్మాతలు భారతదేశాన్ని పరిపాలనా పరమైన సమాఖ్యగా ఏర్పాటు చేశారు. కానీ సిద్ధాంత పరమైన సమాఖ్యగా ఏర్పాటు చేయలేదు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పాల్సిన ఆవశ్యకతను రాజ్యాంగ నిర్మాతలు గుర్తించారు.

* మన దేశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు 3 విధాలుగా ఉన్నాయి. అవి:
1) శాసన సంబంధాలు - 11వ భాగంలోని 245 - 255 వరకు ఉన్న ప్రకరణల్లో వివరించారు.
2) పరిపాలన సంబంధాలు - 11వ భాగంలోని 256 - 263 వరకు ఉన్న ప్రకరణల్లో వివరించారు.
3) ఆర్థిక సంబంధాలు - 12వ భాగంలోని 264 - 300 (A) వరకు ఉన్న ప్రకరణల్లో వివరించారు.
శాసన సంబంధాలు
రాజ్యాంగంలోని 11వ భాగంలో 245 నుంచి 255 వరకు ఉన్న 11 ప్రకరణల్లో కేంద్ర, రాష్ట్రాల శాసన సంబంధాలను వివరించారు.
ఆర్టికల్ 245
పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల శాసనాధికార పరిధిని వివరిస్తుంది.

ఆర్టికల్ 245 (1)
దేశం మొత్తానికి లేదా కొన్ని ప్రాంతాలకు అవసరమైన శాసనాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది. ఒక రాష్ట్రం మొత్తానికి లేదా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు అవసరమైన శాసనాలను రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంది.
ఆర్టికల్ 245 (2)
పార్లమెంటు చేసిన శాననాలు ఇతర దేశాల్లో నివసిస్తున్న భారతీయులకు కూడా వర్తిస్తాయి. (Extra Territorial Operations)
ఆర్టికల్ 246
పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల మధ్య అధికారాల విభజన, చట్టాలకు సంబంధించిన విషయాలు.
ఆర్టికల్ 246 (1)
7వ షెడ్యూల్‌లో పేర్కొన్న కేంద్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది.
ఆర్టికల్ 246 (2)
* 7వ షెడ్యూల్‌లో పేర్కొన్న ఉమ్మడి జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు ఉంది.
* ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర, రాష్ట్ర చట్టాల మధ్య విభేదాలు వస్తే కేంద్ర శాసనమే చెల్లుతుంది. దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ ఆక్యుపైడ్ ఫీల్డ్స్ అంటారు.
ఆర్టికల్ 246 (3)
7వ షెడ్యూల్‌లో పేర్కొన్న రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంది.
ఆర్టికల్ 246 (4)
రాష్ట్ర ప్రభుత్వాల భౌగోళిక పరిధికి వెలుపల ఉన్న భారత్‌లోని ఇతర ప్రాంతాలకు సంబంధించి పార్లమెంటు ఎలాంటి శాసనాలనైనా రూపొందించవచ్చు.
ఆర్టికల్ 247
కేంద్ర జాబితాలో పొందుపరిచిన అంశాలకు సంబంధించి పార్లమెంటు చేసిన చట్టాలను సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన అదనపు న్యాయస్థానాలను ఏర్పాటు చేయవచ్చు.
ఆర్టికల్ 248
* అవశిష్ట అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. ఈ విధానాన్ని రాజ్యాంగ నిర్మాతలు కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించారు.
* 1935 భారత ప్రభుత్వ చట్టంలోని అవశిష్ట అధికారాలను గవర్నర్ జనరల్‌కు అప్పగించారు. ఒక అంశం అవశిష్ట అధికారమా? కాదా? అనేది సుప్రీంకోర్టు ధ్రువీకరిస్తుంది.
ఆర్టికల్ 249
* జాతీయ ప్రయోజనం దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనాలు రూపొందించగలదు.

ఆర్టికల్ 249 (1)
జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాజ్యసభ 2/3వ వంతు ప్రత్యేక మెజారిటీ ద్వారా ఒక తీర్మానం చేస్తే, రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనాలు రూపొందిస్తుంది. ఈ విధంగా రూపొందిన శాసనం ఒక సంవత్సరం పాటు కొనసాగుతుంది.
ఆర్టికల్ 250
భారత రాష్ట్రపతి ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తే ఆర్టికల్ 250 ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు లభిస్తుంది.
¤ ఈ విధంగా రూపొందిన శాసనం అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత 6 నెలల వరకు మాత్రమే అమల్లో ఉంటుంది.
ఆర్టికల్ 251
ఆర్టికల్ 249, 250 లను అనుసరించి పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశాలపై రూపొందించిన శాసనాలు రాష్ట్ర శాసనాలతో వైరుధ్యం కలిగి ఉంటే పార్లమెంటు రూపొందించిన శాసనాలే చెల్లుతాయి. పార్లమెంటు చేసే చట్టాలకు కాల పరిమితి ముగిసిన తర్వాత రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలు తిరిగి అమల్లోకి వస్తాయి.

ఆర్టికల్ 252
రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు తమ ప్రయోజనార్థం శాసనాలను రూపొందించాలని కోరితే, రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనాలు రూపొందిస్తుంది.
ఉదా: ఎస్టేట్ సుంకం చట్టం, 1955
     ప్రైజ్ కాంపిటీషన్ చట్టం, 1955
     వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972
     జల కాలుష్య నివారణ చట్టం, 1974
     పట్టణ ఆస్తుల పరిమితి చట్టం, 1976
ఆర్టికల్ 253
భారత ప్రభుత్వం విదేశాలతో చేసుకున్న ఒప్పందాలు, సంధులను అమలు చేయడానికి సంబంధించిన శాసనాలను పార్లమెంటు రూపొందిస్తుంది. ఈ ఒప్పందాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాల శాసనాలు ఉంటే వాటిని పార్లమెంటు సవరించవచ్చు.
ఉదా: ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సౌకర్యాలు, రక్షణల చట్టం - 1947
     జెనీవా ఒప్పంద చట్టం - 1960
    హైజాకింగ్ వ్యతిరేక చట్టం - 1982

ఆర్టికల్ 254
* పార్లమెంటు చేసిన చట్టానికి, రాష్ట్ర శాసనసభ చేసిన చట్టానికి వైరుధ్యం ఏర్పడినప్పుడు పార్లమెంటు చేసిన చట్టమే చెల్లుబాటు అవుతుంది.
* రాష్ట్ర జాబితాలోని ఏదైనా అంశంపై పార్లమెంటు చట్టాన్ని రూపొందిస్తే ఆ అంశంపై రాష్ట్రానికి ఎలాంటి అధికారం ఉండదని 1990లో బిహార్ రాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది.
ఆర్టికల్ 255
* ఏదైనా అంశానికి సంబంధించి శాసనం చేయాలంటే రాష్ట్రపతి లేదా గవర్నర్ ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే వారి నుంచి ముందుగా అనుమతి పొందకుండానే పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ శాసనాన్ని రూపొందించి ఉండవచ్చు.
* ఈ విధంగా రూపొందించిన శాసనానికి రాష్ట్రపతి లేదా గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే 'ముందస్తు అనుమతి లేకుండా శాసనం చేశారనే' కారణంపై చెల్లకుండా పోదు.
ఆర్టికల్ 201
* రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను సంబంధిత రాష్ట్ర గవర్నర్, రాష్ట్రపతి పరిశీలన కోసం పంపవచ్చు. రాష్ట్రపతి ఆమోదంతో ఆ బిల్లు శాసనంగా మారుతుంది.

ఆర్టికల్ 352
* రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు రాష్ట్ర జాబితాలోని పాలనాంశాలపై చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు లభిస్తుంది.
ఆర్టికల్ 356
* ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం కారణంగా రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఆ రాష్ట్ర శాసనసభ తరఫున పార్లమెంటు శాసనాలను రూపొందిస్తుంది.
ఆర్టికల్ 31 (ఎ)
* రాష్ట్రాల్లో ఆస్తులను జాతీయం చేసే బిల్లులను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి తప్పనిసరి.
Doctrine of Pith and Substance:
      కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన జరిగిన సందర్భంలో ఒక నిర్ణీత అంశం లేదా చట్టాన్ని ఒక జాబితాలో పొందుపరుస్తారు. ఆ జాబితాలో పొందుపరచిన అంశం మరో జాబితాలో పొందుపరచిన అంశంతో సందర్భానుసారం కొంతవరకు అతిక్రమించినా ఆ చట్టాలు చెల్లుతాయి. దీన్నే Pith and Substance అంటారు.

 

బెంగాల్ vs బెనర్జీ కేసు:
      ఈ కేసులో మనీ లెండింగ్ (అప్పులు) అనే అంశంపై శాసనం చేసే సందర్భంలో కేంద్ర జాబితాలోని ప్రామిసరీ నోట్లు అనే అంశం కూడా ఇమిడి ఉండటం వల్ల అది రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. కొన్ని సార్లు అనుకోకుండా ఒక జాబితాలోని అంశంపై శాసనం చేసే సందర్భంలో మరో జాబితాలోకి చొచ్చుకుని రావడమే Pith and Substance అంటారు.

 

బల్లార్‌షా vs స్టేట్ ఆఫ్ ముంబయి కేసు:
      ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ముంబయి రాష్ట్రం మద్యపానాన్ని నిషేధిస్తూ చట్టం చేసింది. ఈ సందర్భంలో కేంద్ర జాబితాలో పేర్కొన్న విదేశీ మద్యం అనే అంశాన్ని అనుకోకుండా చేర్చడం వల్ల ఆ చట్టం చెల్లుతుందని, అది రాజ్యాంగబద్ధమేనని పేర్కొంది.

 

కేతన్ ఈశ్వర్ షుగర్ మిల్స్ vs స్టేట్ ఆఫ్ ఉత్తర్‌ప్రదేశ్ కేసు:
      ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూములను జాతీయం చేసే సందర్భంలో కేంద్ర జాబితాలోని 'షుగర్ ఫ్యాక్టరీ'ని కూడా జాతీయం చేస్తూ చట్టం చేయడమనేది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని ఈ చట్టం చెల్లుతుందని పేర్కొంది.
      సదరన్ ఫార్మాస్యూటికల్ vs స్టేట్ ఆఫ్ కేరళ కేసు, చావ్లా vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్, సింథటిక్ కెమికల్స్ లిమిటెడ్ vs స్టేట్ ఆఫ్ ఉత్తర్‌ప్రదేశ్ కేసుల్లో Pith and Substance గురించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
Colourable Legislation:
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన శాసనాలు ఏవైనా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని న్యాయస్థానాలు తీర్పునిచ్చిన తర్వాత, అవే శాసనాలను మరో రూపంలో తీసుకొచ్చినప్పుడు అవి కూడా చెల్లవని న్యాయస్థానాలు తీర్పు ఇవ్వడాన్నే Colourable Legislation గా పేర్కొంటారు.
* ప్రత్యక్షంగా ఒప్పు కానిది ఏదీ పరోక్షంగా కూడా ఒప్పు కాదని, ఒక రూపంలో తప్పుగా భావించిన దాన్ని మరో రూపంలో కూడా ఒప్పు కాదని పేర్కొనడాన్నే Colourable Legislation అంటారు.
* కె.సి.జి. నారాయణ్‌దేవ్ vs స్టేట్ ఆఫ్ ఒడిశా కేసులో తొలిసారిగా సుప్రీంకోర్టు Colourable Legislation సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది.
* కామేశ్వరీ సింగ్ vs స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో Colourable Legislation సిద్ధాంతాన్ని అనుసరించి సుప్రీంకోర్టు తొలిసారిగా తీర్పు ఇచ్చింది.
* ఉమ్మడి జాబితాలోని ఏదైనా అంశంపై కేంద్రం, రాష్ట్రాలు పరస్పర విరుద్ధమైన శాసనాలు రూపొందిస్తే, కేంద్ర శాసనమే చెల్లుతుందని చెప్పడాన్ని Doctrine of Repugnancy అంటారు.
* కానీ రాష్ట్రపతి ముందస్తు అనుమతితో రాష్ట్రాలు ముందుగా శాసనం రూపొందిస్తే రాష్ట్ర శాసనమే అమల్లో ఉంటుంది.

కేంద్ర, రాష్ట్రాల మధ్య పరిపాలనా సంబంధాలు
* భారత రాజ్యాంగంలోని 11వ భాగంలో 256 నుంచి 263 వరకు ఉన్న ఆర్టికల్స్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే పరిపాలనా సంబంధాలను వివరిస్తున్నాయి.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికార పరిధికి కట్టుబడి తమ కార్యనిర్వహణాధికారాలను నిర్వహించినప్పటికీ కొన్ని సందర్భాల్లో కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకార సంబంధాలు కూడా ఉంటాయి.
* భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 73 కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిని తెలియజేయగా, ఆర్టికల్ 162 రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిని తెలియజేస్తుంది.
ఆర్టికల్ 256
* రాష్ట్రాలు తమ పరిపాలనను పార్లమెంటు చేసిన చట్టాలకు, కేంద్ర ప్రభుత్వ పరిపాలనకు విరుద్ధంగా నిర్వహించరాదు.
* కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పరిపాలనాపరమైన ఆదేశాలను జారీ చేసినప్పుడు వాటిని రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి.
* డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అభిప్రాయం ప్రకారం కేంద్రానికి ఆర్టికల్ 256 ప్రకారం ఉన్న అధికారం లేకపోయినట్లయితే పార్లమెంటు చేసే చట్టాలను అమలు చేయడం సాధ్యం కాదు.

ఆర్టికల్ 257
* రాష్ట్ర ప్రభుత్వాల కార్యనిర్వహణాధికారాలను కేంద్రం నియంత్రిస్తుంది. రాష్ట్రాలు తమ అధికారాలను వినియోగించుకునే సందర్భంలో అవి కేంద్ర ప్రభుత్వ అధికారాలను ప్రశ్నించే విధంగా ఉండకూడదు.
* కేంద్ర ప్రభుత్వ ఆస్తులైన రైల్వేలు, టెలికమ్యూనికేషన్లు లాంటి వాటిని రాష్ట్రాలు పరిరక్షించాలి. జాతీయ ఆస్తుల సంరక్షణ విషయమై కేంద్ర ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి.
ఆర్టికల్ 258
* కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రైల్వేలు, టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌లు లాంటి నిర్మాణాలను చేపట్టాలని ఆదేశించవచ్చు. వాటి నిర్మాణ ఖర్చులను కేంద్రమే భరిస్తుంది.
* రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్ర కార్యనిర్వాహక అధికార పరిధిలోని ఏవైనా అంశాలను కేంద్ర ప్రభుత్వానికి లేదా కేంద్ర ప్రభుత్వ అధికారులకు షరతులతో లేదా షరతులు లేకుండా అప్పగించవచ్చు. అయితే దీనికి కేంద్రం అంగీకరించాలి. దీన్ని 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ద్వారా చేర్చారు.
ఆర్టికల్ 259
* శాంతి భద్రతల పరిరక్షణ కోసం కేంద్ర సాయుధ బలగాలను రాష్ట్రాల్లో మోహరించవచ్చు. దీన్ని 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ద్వారా తొలగించారు.

ఆర్టికల్ 260
* భారతదేశం వెలుపల ఉన్న భూభాగాలపై శాసన, కార్యనిర్వాహక, న్యాయాధికారాలను కేంద్ర ప్రభుత్వం కలిగి ఉండవచ్చు. అయితే దానికి సంబంధించిన ఒప్పందం భారతదేశానికి విదేశాలతో ఉండాలి. సంబంధిత ఒప్పందం విదేశీ భూభాగపు పరిపాలనకు సంబంధించి అమల్లో ఉన్న శాసనానికి అనుగుణంగా ఉండాలి.
ఆర్టికల్ 261
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రభుత్వ చట్టాలు, రికార్డులు, న్యాయపరమైన చర్యలను భారతదేశమంతా గౌరవించాలి.
* సివిల్ న్యాయస్థానాలు వెలువరించే అంతిమ తీర్పులను భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా చట్ట ప్రకారం అమలుచేయవచ్చు.
ఆర్టికల్ 262
* అంతర్‌రాష్ట్ర నదీ జలాల పంపకంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ట్రైబ్యునల్ తీర్పును అనుసరించి పార్లమెంటు ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తే, దాన్ని న్యాయస్థానాల్లో సవాలు చేయడానికి, న్యాయ సమీక్షకు గురి చేయడానికి వీల్లేదు.
* అయితే నదీ జలాల పంపకంపై పార్లమెంటు రూపొందించిన చట్టాన్ని ఏదైనా రాష్ట్రం ఉల్లంఘిస్తే దానిపై సుప్రీంకోర్టులో సవాలు చేయవచ్చు.
* భారత పార్లమెంటు 1956లో అంతర్‌రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం, రివర్ బోర్డ్ చట్టాన్ని రూపొందించింది.

 

ఇప్పటివరకు మన దేశంలో 8 అంతర్‌రాష్ట్ర నదీ జలాల ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేశారు. అవి:
1. కృష్ణా నదీ జలాల ట్రైబ్యునల్ (1969)
    దీని పరిధిలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి.
2. గోదావరి నదీ జలాల ట్రైబ్యునల్ (1969)
    దీని పరిధిలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి.
3. నర్మదా నదీ జలాల ట్రైబ్యునల్ (1969)
    దీని పరిధిలో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.
4. రావి, బియాస్ నదీ జలాల ట్రైబ్యునల్ (1986)
    దీని పరిధిలో పంజాబ్, హరియాణా రాష్ట్రాలు ఉన్నాయి.
5. కావేరి నదీ జలాల ట్రైబ్యునల్ (1990)
    దీని పరిధిలో కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఉన్నాయి.
6. కృష్ణా నదీ జలాల ట్రైబ్యునల్ - II (2004)
    దీని పరిధిలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి.

7. వంశధార నదీ జలాల ట్రైబ్యునల్ (2010)
    దీని పరిధిలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయి.
8. మహదాయి (మాండవి నది) నదీ జలాల ట్రైబ్యునల్ (2010)
    దీని పరిధిలో గోవా, కర్ణాటక, మహారాష్ట్ర ఉన్నాయి.
ఆర్టికల్ 263
¤ అంతర్ రాష్ట్ర మండలి ఏర్పాటు గురించి తెలియజేస్తుంది.
¤ వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలను విచారించి పరిష్కరించడానికి; అవసరమైన సలహాలు, సిఫార్సులు చేయడానికి రాష్ట్రపతి అంతర్‌రాష్ట్ర మండలిని ఏర్పాటు చేస్తారు.

 

అంతర్‌రాష్ట్ర మండలి నిర్మాణం
* 1990, మే 28న వి.పి.సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ అంతర్‌రాష్ట్ర మండలిని ఆర్టికల్ 263 ప్రకారం ఏర్పాటు చేశారు.
* అంతర్‌రాష్ట్ర మండలికి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు.
* దీనిలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర హోంమంత్రితో సహా ఆరుగురు కేంద్ర కేబినెట్ మంత్రులు సభ్యులుగా ఉంటారు.
* దిల్లీ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు, మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనాధికారులు సభ్యులుగా ఉంటారు.

* అంతర్‌రాష్ట్ర మండలి సంవత్సరానికి 3 సార్లు సమావేశం కావాలి.
* 1991లో అంతర్‌రాష్ట్ర మండలి విధులను నిర్వర్తించడానికి ఒక సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేశారు.
* సెక్రటేరియట్ 2011 నుంచి జోనల్ కౌన్సిల్ సెక్రటేరియట్ నిర్వహించే విధులను నిర్వర్తిస్తోంది.
* అంతర్‌రాష్ట్ర మండలికి సంబంధించి 1996లో ఒక స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్థాయీ సంఘానికి కేంద్ర హోంమంత్రి అధ్యక్షుడిగా, అయిదుగురు కేంద్ర కేబినెట్ మంత్రులు, 9 మంది ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు.
2015, డిసెంబర్ 18న అంతర్‌రాష్ట్ర మండలి సభ్యులను ప్రధాని నరేంద్ర మోదీ నియమించారు. వారు
1. రాజ్‌నాథ్ సింగ్
2. వెంకయ్యనాయుడు
3. సుష్మాస్వరాజ్
4. అరుణ్ జైట్లీ
5. నితిన్ గడ్కరీ
* 2013, డిసెంబర్ 12న డాక్టర్ మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు, ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా వ్యవహరిస్తూ అంతర్‌రాష్ట్ర మండలిని పునర్వ్యవస్థీకరించారు. దీని ప్రకారం కొత్తగా రైల్వే శాఖ మంత్రికి అవకాశం కల్పించారు. శాశ్వత ఆహ్వానితుల సంఖ్యను 6 నుంచి 5కు తగ్గించారు.

 

అంతర్‌రాష్ట్ర మండలి విధులు
* వివిధ రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదాలను పరిష్కరించేందుకు, సూచనలు, సలహాలు ఇవ్వడం.
* కేంద్రానికి, కేంద్రపాలిత ప్రాంతాలకు మధ్య వివాదాలను పరిష్కరించడం.
* రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి, ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేయడం.
* 1990 నుంచి 2005 వరకు అంతర్ రాష్ట్ర మండలి 9 సమావేశాలను నిర్వహించింది.
* 2006, డిసెంబర్ 9న అంతర్ రాష్ట్ర మండలి 10వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించారు.
* 2016, జులై 16న అంతర్ రాష్ట్ర మండలి 11వ సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, జమ్మూ కశ్మీర్, కర్ణాటక ముఖ్యమంత్రులు తప్ప మిగిలిన ముఖ్యమంత్రులు అందరూ హాజరయ్యారు.
* ఈ సమావేశంలో ఆధార్ అనుసంధానానికి సంబంధించిన అంశాలతో పాటు ఎం.ఎం.పూంచీ కమిషన్ సిఫారసులపై చర్చించారు.

 

రాజ్యాంగంలోని ఇతర భాగాల్లో ఉన్న కేంద్ర, రాష్ట్ర పరిపాలనా సంబంధాలు
ఆర్టికల్ 155
    రాష్ట్రాల పరిపాలనలో కీలక పాత్రను పోషించే గవర్నర్లను నియమించేది, నియంత్రించేది, బదిలీ చేసేది కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి.
ఆర్టికల్ 312
   అఖిల భారత సర్వీసుల ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నింటిలో పరిపాలనా విధులను నిర్వహిస్తారు.
ఆర్టికల్ 315
  రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కోరితే ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ)ను కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. అఖిల భారత సర్వీసుల ఉద్యోగులను ఎంపిక చేసే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)ను కేంద్రమే నియమిస్తుంది.
ఆర్టికల్ 339
    షెడ్యూల్డ్ తెగల శ్రేయస్సును పెంపొందించడానికి తగిన కార్యక్రమాలను రూపొందించి, అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కార్యనిర్వాహక ఆదేశాలను జారీచేయవచ్చు.

ఆర్టికల్ 340
   వెనుకబడిన తరగతుల స్థితిగతులను దర్యాప్తు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన సిఫారసులు చేయడానికి ఒక సంఘాన్ని రాష్ట్రపతి నియమిస్తారు.
ఆర్టికల్ 341
   షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాల్సిన ఇతర ప్రభావ వర్గాల విషయమై రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి రాష్ట్రపతి తగిన ఉత్తర్వులు జారీ చేయవచ్చు.
ఆర్టికల్ 355
   రాష్ట్రాల సంరక్షణ బాధ్యత కూడా కేంద్రానిదే. కేంద్రం అనేక సందర్భాల్లో రాష్ట్రాల కోరికపై తన సాయుధ బలగాలను రాష్ట్రాలకు సహాయంగా పంపుతుంది.

 

కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంబంధాలు
* భారత రాజ్యాంగంలోని 12వ భాగంలో ఆర్టికల్ 264 నుంచి 300 (A) వరకు ఉన్న ఆర్టికల్స్‌లో కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక సంబంధాలను పొందుపరిచారు.
* ప్రొఫెసర్ అమల్ రే అభిప్రాయం ప్రకారం కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో మిగిలిన వాటి కంటే ఆర్థిక సంబంధాలే ఎక్కువ వివాదానికి కారణమవుతున్నాయి.

 

ఆర్టికల్ 264
కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల విధింపుకు సంబంధించి కచ్చితమైన విభజన చేశారు. కేంద్ర ప్రభుత్వం 15 రకాల పాలనాంశాలపై పన్ను విధించగలదు. అవి:
1. వ్యవసాయేతర ఆదాయంపై పన్ను
2. ఎగుమతి, దిగుమతి సుంకాలు
3. పొగాకుపై ఎక్సైజ్ పన్ను
4. కార్పొరేషన్ పన్ను
5. మూలధన విలువపై పన్ను
6. వ్యవసాయేతర ఎస్టేట్‌లపై పన్ను
7. వారసత్వ పన్ను
8. అంతర్ రాష్ట్ర రవాణా పన్ను
9. స్టాక్ మార్కెట్, స్టాక్ ఎక్స్చేంజ్ పన్ను
10. చెక్స్, ప్రామిసరీ నోట్లు, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఇన్సూరెన్స్ పాలసీల బదిలీలపై పన్ను
11. అంతర్ రాష్ట్ర వ్యాపారంలో విధించే అమ్మకం పన్ను
12. వార్తా పత్రికలపై అమ్మకపు, ప్రకటనలపై పన్ను
13. అంతర్ రాష్ట్ర వాణిజ్యంలో సరకులపై విధించే పన్ను
14. సర్వీసులపై పన్ను
15. వ్యవసాయేతర భూముల వారసత్వ బదలాయింపు పన్ను
రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం 20 రకాల పాలనాంశాలపై పన్నులు విధిస్తాయి
1. భూమి శిస్తు
2. వ్యవసాయ ఆదాయంపై పన్ను
3. వ్యవసాయ భూములపై వారసత్వ పన్ను
4. వ్యవసాయ భూములపై ఎస్టేట్ పన్ను
5. స్థిరాస్తులపై పన్ను (భూములు, భవనాలు)
6. ఖనిజాలపై పన్ను
7. మద్యపానంపై పన్ను
8. ఆక్ట్రాయ్ పన్ను (స్థానిక ప్రాంతాల్లోకి రవాణా అయ్యే వస్తువులపై పన్ను)
9. విద్యుత్ వినియోగం, అమ్మకంపై పన్ను
10. వాణిజ్య పన్ను
11. ప్రకటనలపై పన్ను
12. రోడ్డు, జల రవాణాపై పన్ను
13. మోటారు వాహనాలపై పన్ను
14. పశువులపై పన్ను
15. టోల్ ట్యాక్స్
16. వృత్తి పన్ను
17. కస్టడీ పన్నులు
18. వినోదపు పన్నులు
19. కేంద్ర జాబితాలోని డాక్యుమెంట్లు మినహా మిగతావాటిపై స్టాంపు డ్యూటీ
20. రాష్ట్ర జాబితాలోని అంశాలకు సంబంధించిన ఇతర ఫీజులు
అవశిష్ట వన్నులు: కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే విధించే పన్నులు
1. బహుమతి పన్ను
2. సంపద పన్ను
3. వ్యయంపై పన్ను
సేవా పన్ను
రాజా చెల్లయ్య కమిటీ సిఫారసుల మేరకు 1994 నుంచి సేవా పన్ను అమల్లోకి వచ్చింది. సేవలపై విధించే పన్నును సేవా పన్నుగా వ్యవహరిస్తారు. కేంద్ర స్థాయిలో ఇది విలువ అధారిత పన్నులో అంతర్భాగంగా ఉంది.

* ప్రస్తుతం సేవా పన్ను రేటు 12%. సేవా పన్నుపై అదనంగా 2% విద్యా సెస్, 1% సెకండరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సెస్ విధించారు. కాబట్టి ప్రస్తుతం మొత్తం సేవా పన్ను రేటు 12.36%.
ఆర్టికల్ 265
 మన దేశంలో చట్టబద్ధంగా మాత్రమే పన్నులు విధించి వసూలు చేయాలి. చట్టం చేయనిదే ఎలాంటి పన్నులు విధించకూడదు.
* పార్లమెంటు రూపొందించే చట్టాలను అనుసరించి దేశవ్యాప్తంగా పన్నులు విధిస్తారు.
* రాష్ట్ర శాసనసభలు రూపొందించే చట్టాల ప్రకారం రాష్ట్రాల్లో పన్నులు విధించి వసూలు చేయాలి.
ఆర్టికల్ 266
   సంఘటిత నిధి, ప్రభుత్వ ఖాతాల గురించి తెలియజేస్తుంది.
ఆర్టికల్ 266 (1)
 
 కేంద్ర ప్రభుత్వం పొందే అన్ని పన్నులు, ట్రెజరీ బిల్లుల ద్వారా కేంద్ర ప్రభుత్వం సేకరించే రుణాలు, ఇతర రుణాలు, అడ్వాన్సులు, ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వానికి లభించే మొత్తాలన్నింటినీ భారత సంఘటిత నిధి (Consolidated Fund of India) లో జమ చేయాలి.
* రాష్ట్ర ప్రభుత్వాలు పొందే అన్ని పన్నులు, ట్రెజరీ బిల్లుల ద్వారా అడ్వాన్సులు, ఇతర మార్గాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు లభించే మొత్తాలన్నింటినీ సంబంధిత రాష్ట్ర సంఘటిత నిధి (Consolidated Fund of State) లో జమ చేయాలి.

ఆర్టికల్ 266 (2)
 కేంద్ర ప్రభుత్వం స్వీకరించే ఇతర ప్రభుత్వ ధనాన్ని కేంద్ర ప్రభుత్వ ఖాతా (Credited to the Public Account of India) లో జమ చేయాలి.
* రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఇతర ప్రభుత్వ ధనాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలి.
ఆర్టికల్ 266 (3)
    కేంద్ర ప్రభుత్వ సంఘటిత నిధి లేదా రాష్ట్ర ప్రభుత్వ సంఘటిత నిధిలో జమ చేసిన మొత్తాలను రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా మాత్రమే శాసనబద్ధంగా వినియోగించాలి.
ఆర్టికల్ 267 (1)
   పార్లమెంటు ఒక శాసనం ద్వారా ఆగంతుక నిధి (Contingency Fund) ని ఏర్పాటు చేయవచ్చు. ఈ నిధి రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది. దీన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ప్రభుత్వ కార్యదర్శి నిర్వహిస్తారు.
* 1950, ఆగస్టు 14న ఏర్పడిన ఆగంతుక నిధికి కేంద్ర సంఘటిత నిధి నుంచి రూ.50 కోట్లను బదిలీ చేశారు.
* ప్రస్తుతం కేంద్ర ఆగంతుక నిధిని రూ.500 కోట్లతో నిర్వహిస్తున్నారు.
ఆర్టికల్ 267 (2)
రాష్ట్ర శాసన సభ ఒక చట్టం ద్వారా రాష్ట్ర ఆగంతుక నిధిని ఏర్పాటు చేయవచ్చు. ఇది సంబంధిత రాష్ట్ర గవర్నర్ ఆధీనంలో ఉంటుంది.
* ఊహించని, ఆకస్మికంగా వచ్చే ప్రకృతి వైపరీత్యాలు లాంటి సందర్భాల్లో ఖర్చులు ఎదురైనప్పుడు పార్లమెంటు అనుమతి పొందడానికి ముందే ఆగంతుక నిధి నుంచి నగదు ఖర్చు చేయవచ్చు. తర్వాత పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇదే నియమం రాష్ట్ర ఆగంతుక నిధికి కూడా వర్తిస్తుంది.
ఆర్టికల్ 268:
    కొన్ని పన్నులను కేంద్రమే విధిస్తుంది. కానీ రాష్ట్రాలు వసూలు చేసి వినియోగించుకుంటాయి.
ఉదా: స్టాంపు డ్యూటీలు, అలంకరణ వస్తవులు, మందులు, పాలసీ మార్పిడులు, చెక్కులు.
ఆర్టికల్ 268 (A)
* సేవలపై పన్నులను కేంద్రమే విధిస్తుంది. కానీ వసూలు చేసి వినియోగించేటప్పుడు కేంద్ర, రాష్ట్రాల ప్రయోజనం కోసం ఉపయోగిస్తారు.
* 10వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 29% వాటా ఇవ్వాలి. ఈ పద్ధతినే ప్రత్యామ్నాయ నిధుల బదిలీ అంటారు. ఇది 1996, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం కేంద్ర పన్నులైన కార్పొరేషన్ టాక్స్, ఎక్సైజ్ సుంకాల్లో రాష్ట్రాలకు కూడా వాటా ఉంటుంది.
* 88వ రాజ్యాంగ సవరణ చట్టం (2003) ద్వారా ఆర్టికల్ 268 (A) సర్వీస్ టాక్స్‌ను చేర్చారు.

ఆర్టికల్ 269
కొన్ని పన్నులను కేంద్రమే విధిస్తుంది. వీటిని కేంద్రమే వసూలు చేసి రాష్ట్రాలకు కేటాయిస్తుంది.
* వస్తువుల కొనుగోలు, అమ్మకాలపై విధించే పన్నును; వస్తువుల కన్‌సైన్‌మెంట్‌పై పన్నును కేంద్ర ప్రభుత్వమే విధించి వసూలు చేస్తుంది. అయితే వీటిని 1996, ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించాలి.
ఉదా: టెర్మినల్ ట్యాక్స్, విమానయానం, నౌకాయానం, రైల్వేలు.
ఆర్టికల్ 270
    కేంద్రం విధించి, వసూలు చేసి కేంద్ర, రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే పన్నుల గురించి వివరిస్తుంది.
ఆర్టికల్ 270 (1)
    కొన్ని పన్నులను కేంద్ర ప్రభుత్వం విధించి వసూలు చేస్తుంది. ఆ విధంగా వచ్చిన మొత్తం రాబడిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేస్తుంది.
ఉదా: వ్యవసాయేతర ఆదాయంపై పన్ను, ఎక్సైజ్ పన్ను.
ఆర్టికల్ 270 (2)
ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్టికల్ 270 (1)లో పేర్కొన్న పన్నులు లేదా డ్యూటీల ద్వారా లభించే నికర మొత్తంలో కొంత శాతం కేంద్ర సంఘటిత నిధిలో కలపరు. ఏ రాష్ట్రాల నుంచి ఆ పన్ను వసూలైందో ఆ మొత్తం సంబంధిత రాష్ట్రాలకే లభిస్తుంది.

ఆర్టికల్ 270 (3)
ఆర్థిక సంఘం ఏర్పాటయ్యే వరకు రాష్ట్రపతి ఆదేశం ద్వారా సూచించిన విధానంలో ఆర్థిక వనరుల పంపిణీ జరుగుతుంది.
* ఆర్థిక సంఘం ఏర్పాటైన తర్వాత దాని సూచనల మేరకు పంపిణీకి సంబంధించి రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేస్తారు.
ఆర్టికల్ 271
ఆదాయపు పన్నుపై విధించే సెస్‌ను కేంద్ర ప్రభుత్వమే వసూలు చేసుకుని వినియోగించుకుంటుంది. దీనిలో రాష్ట్రాలకు ఎలాంటి వాటా ఉండదు.
ఆర్టికల్ 272
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేయాల్సిన పన్నులు. దీన్ని 80వ రాజ్యాంగ సవరణ చట్టం, 2000 ద్వారా తొలగించారు.
ఆర్టికల్ 273
అసోం, బిహార్, ఒడిశా, పశ్చిమ్‌ బంగ రాష్ట్రాలకు సంబంధించి జనుము, జనుము ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా వచ్చే ఎగుమతి సుంకాల్లో ఆ రాష్ట్రాలకు వాటా కేటాయించే బదులు ప్రతి సంవత్సరం ఒక నిర్ణీత విధానం ప్రకారం సహాయక గ్రాంటుగా సంఘటిత నిధి నుంచి క్రేంద్ర ప్రభుత్వం చెల్లించాలి.
ఆర్టికల్ 274
రాష్ట్ర ప్రయోజనాలపై ప్రభావం చూపే పన్నులకు సంబంధించిన బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం అవసరం.

ఆర్టికల్ 274 (1)
కింద పేర్కొన్న అంశాలకు సంబంధించిన బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి.
1. ఏదైనా ఒక పన్నును విధించడానికి లేదా సవరించడానికి సంబంధించిన బిల్లు (లేదా)
2. ఆదాయ పన్ను సంబంధిత చట్టాలకు చెందిన వ్యవసాయ ఆదాయం అనే పదానికి అర్థాన్ని సదరు బిల్లు సవరించే అవకాశం ఉన్నప్పుడు
ఆర్టికల్ 275
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మంజూరు చేసే సహాయక గ్రాంట్లు.
ఆర్టికల్ 275 (1)
ఏవైనా కొన్ని రాష్ట్రాలకు తగిన ఆర్థిక సహాయం అందించడం అవసరమని పార్లమెంటు భావించినట్లయితే, తనకు అవసరమని తోచిన మొత్తాన్ని సహాయక గ్రాంట్ల రూపంలో ఆయా రాష్ట్రాలకు అందజేయవచ్చు. ఈ సహాయక గ్రాంట్లను కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
* కేంద్ర ప్రభుత్వ అనుమతితో షెడ్యూల్డ్ తెగల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి పథకాలకు కేంద్ర ప్రభుత్వం సహాయక గ్రాంట్ల రూపంలో ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది.
* ఏదైనా ఒక రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల పరిపాలనతో సమానంగా ఆ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన అభివృద్ధికి ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు అవసరమైన మొత్తాన్ని కూడా సహాయక గ్రాంట్ల రూపంలో పార్లమెంటు అందజేయవచ్చు. ఉదా: అసోం.

ఆర్టికల్ 275 (2)
     సహాయక గ్రాంట్లకు సంబంధించి పార్లమెంటు శాసనం చేసే వరకు ఆయా అధికారాలను రాష్ట్రపతి కలిగి ఉంటారు. అయితే ఆర్థిక సంఘం ఏర్పాటు తర్వాత దాని సలహా లేనిదే రాష్ట్రపతి సహాయక గ్రాంట్లను కేంద్ర సంఘటిత నిధి నుంచి విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేయకూడదు.
ఆర్టికల్ 276
     వృత్తి, వ్యాపారం, ఉపాధి లాంటి అంశాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వాలు ఒక్కో వ్యక్తిపై సంవత్సరానికి రూ.2500కు మించకుండా పన్ను విధించి వసూలు చేయవచ్చు.
ఆర్టికల్ 277: ఆర్థిక వనరులకు సంబంధించిన మినహాయింపులు.
ఆర్టికల్ 278: వివిధ రాష్ట్రాల ఆర్థిక ఒప్పందాలు.
ఆర్టికల్ 279: నికర ఆదాయం గురించి వివరణ, నిర్వచనం.
ఆర్టికల్ 279 (1)
     పన్నుల ద్వారా వసూలైన నికరాదాయం అంటే పన్ను వసూలుకు అయిన ఖర్చులు పోను మిగిలింది అని అర్థం. ఏ ప్రాంతం నుంచి ఎంత పన్ను వసూలైంది, అందులో నికరాదాయం ఎంత అనే విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నిర్ధారించి ధ్రువీకరించాలి. దీనికి సంబంధించి ఆయన ఇచ్చిన ధ్రువీకరణ పత్రమే అంతిమమైంది.

ఆర్టికల్ 279 (2)
     రాష్ట్రపతి లేదా పార్లమెంటు పన్ను ద్వారా వసూలైన మొత్తాన్ని రాష్ట్రాలకు గ్రాంట్లుగా మంజూరు చెయ్యాలి.
ఆర్టికల్ 280
* కేంద్ర ఆర్థిక సంఘం నియామకం, నిర్మాణం.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక అధికారాలు, ఆర్థిక వనరులు సమానంగా లేవన్నది స్పష్టం. రాజ్యాంగం కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఇచ్చిందని, రాష్ట్రాలు కేవలం వాటి పరిధిలోని సొంత వనరులకే పరిమితమయ్యాయనే విమర్శ ఉంది. అందువల్ల సమాఖ్య ఆర్థిక విధానంలో ఆర్థిక విషయాలకు సంబంధించిన పన్నులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ లాంటి విషయాల్లో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధమైన సమన్వయాన్ని సాధించడానికి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు.
ఆర్టికల్ 280 (1)
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 2 సంవత్సరాల్లోపు, ఆ తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి.
* ఆర్థిక సంఘానికి ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు.
ఆర్టికల్ 280 (2)
ఆర్థిక సంఘం సభ్యుల అర్హతలను, వారి ఎంపిక విధానాన్ని పార్లమెంటు శాసనం ద్వారా నిర్ణయిస్తుంది.

ఆర్టికల్ 280 (3)
ఆర్థిక సంఘం విధులు కింది విధంగా ఉంటాయి.
* భారత సంఘటిత నిధి నుంచి రాష్ట్రాలకు గ్రాంట్ల రూపంలో సహాయం చేయడానికి సంబంధించిన మార్గదర్శక సూత్రాలను సూచించడం.
* రాష్ట్రపతి ఆదేశం మేరకు దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేయడానికి సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వడం.
* పన్నుల ద్వారా వచ్చిన నికర రాబడులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య హేతుబద్దంగా పంపిణీ చేయడం. సంబంధిత రాబడులను రాష్ట్రాల మధ్య వారి వాటాలకు అనుగుణంగా కేటాయించడం.
* ఆర్థిక సంఘం తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది.
ఆర్టికల్ 280 (4)
    ఆర్థిక సంఘం తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. ఇది తన పని విధానాన్ని రూపొందించుకోవడంతో పాటు పార్లమెంటు ద్వారా తనకు సంక్రమించిన అధికార విధులను కూడా నిర్వహించాలి.

14వ ఆర్థిక సంఘం
     ఆర్టికల్ 280 ప్రకారం 2015 - 2020 మధ్య కాలానికి సిఫారసులు చేసేందుకు 2013, జనవరి 2న డాక్టర్ వై.వేణుగోపాల రెడ్డి అధ్యక్షతన 14వ ఆర్థిక సంఘాన్ని నియమించారు.
ప్రధాన సిఫారసులు
* కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 నుంచి 42 శాతానికి పెంచారు.
* రాష్ట్రాలకు మొత్తం గ్రాంట్లు రూ.5.37 లక్షల కోట్లు.
* విపత్తుల నిర్వహణకు రూ.55,000 కోట్లు.
గ్రాంట్ల మంజూరు కోసం 14వ ఆర్థిక సంఘం చేసిన/ అనుసరించిన ప్రామాణికాలు

ఆర్టికల్ 281
    రాష్ట్రపతి ఆర్థిక సంఘం సిఫారసులను, దానిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించే నోట్‌తో సహా పార్లమెంటు ఉభయ సభలకు సమర్పించాలి.
ఆర్టికల్ 282
    ప్రజా ప్రయోజనం నిమిత్తం శాసనం చేసే అధికారం పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభకు లేకపోవచ్చు. అయినప్పటికీ అవి తమ రెవెన్యూల నుంచి అలాంటి ప్రయోజనాల నిమిత్తం గ్రాంట్లను విడుదల చేయవచ్చు.
ఆర్టికల్ 283
    ప్రభుత్వ నిధులైన సంఘటిత నిధి, ఆగంతుక నిధి, ప్రభుత్వ ఖాతాల నియంత్రణ గురించి తెలుపుతుంది.
ఆర్టికల్ 283 (1)
    భారత ప్రభుత్వ సంఘటిత నిధి, ఆగంతుక నిధుల్లో సొమ్మును జమ చేయడం, వాటి నుంచి ఖర్చు చేయడం, ఆ రెండింటిలోనూ జమ చేయని ఇతర ప్రజాధనాన్ని ప్రభుత్వ ఖాతాకు జమ చేయడం గురించి తెలియజేస్తుంది.
ఆర్టికల్ 283 (2)
    రాష్ట్ర ప్రభుత్వ సంఘటిత నిధి, ఆగంతుక నిధుల్లో సొమ్ము జమ చేయడం, వాటి నుంచి ఖర్చు చేయడం, ఆ రెండింటిలోనూ జమ చేయని ఇతర ప్రజాధనాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు జమ చేయడం గురించి తెలుపుతుంది.

ఆర్టికల్ 284
    కోర్టులు స్వీకరించే పిటిషనర్ డిపాజిట్లు, ఇతర మార్గాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే సొమ్ము భారత ప్రభుత్వ ఖాతాకు లేదా సందర్భానుసారం ఆయా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలి.
* వివిధ వర్గాల నుంచి సేకరించిన డిపాజిట్లపై నియంత్రణను తెలుపుతుంది.
ఆర్టికల్ 285
    కేంద్ర ప్రభుత్వ ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం పన్నులు విధించకూడదు.
ఆర్టికల్ 286
    సరకుల క్రయవిక్రయాలపై పన్ను మినహాయింపులు.
ఆర్టికల్ 286 (1)
    రాష్ట్రం వెలుపల జరిగే వస్తువుల క్రయవిక్రయాలు లేదా భారతదేశంలోకి వస్తువులను దిగుమతి చేసుకునే లేదా ఎగుమతి చేసే క్రమంలో జరిగే క్రయవిక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పన్నులు విధించకూడదు.
ఆర్టికల్ 286 (2)
    వస్తువుల క్రయవిక్రయాలను నిర్ధారించే క్రమాన్ని పార్లమెంటు శాసనం ద్వారా నిర్దేశిస్తుంది.
ఆర్టికల్ 287
    కేంద్ర ప్రభుత్వం వినియోగించిన విద్యుత్ లేదా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన విద్యుత్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పన్నులు విధించకూడదు. కేంద్ర ప్రభుత్వ రైల్వేల నిర్మాణం, నిర్వహణలపై ఉపయోగించే విద్యుచ్ఛక్తిపై రాష్ట్రాలు చట్టరీత్యా పన్ను విధించకూడదు.

ఆర్టికల్ 288
    కొన్ని సందర్భాల్లో నీరు, విద్యుచ్ఛక్తిపై రాష్ట్రాలు పన్ను విధించడం నుంచి మినహాయింపులు.
ఆర్టికల్ 288 (1)
    కొన్ని సందర్భాల్లో అంతర్ రాష్ట్ర నదులు, నదీ లోయల అభివృద్ధికి పార్లమెంటు శాసనం ద్వారా ఏర్పాటు చేసిన అథారిటీ నిల్వ ఉంచుకునే, ఉపయోగించే నీరు లేదా విద్యుచ్ఛక్తిపై రాష్ట్రాలు పన్ను విధించకూడదు.
ఆర్టికల్ 288(2)
    రాష్ట్ర శాసనసభ పన్ను విధించడానికి అధికారం కల్పించే శాసనం చేయవచ్చు. ఇలాంటి శాసనం రాష్ట్రపతి ఆమోదం పొందినప్పుడు మాత్రమే అమల్లోకి వస్తుంది.
ఆర్టికల్ 289
    రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తులపై, ఆదాయంపై కేంద్ర ప్రభుత్వం పన్ను విధించడం నుంచి మినహాయింపు.
ఆర్టికల్ 289 (1)
    రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తులు, ఆదాయాలపై కేంద్రం పన్నులు విధించకూడదు.
ఆర్టికల్ 289(2)
    రాష్ట్ర ప్రభుత్వం లేదా దాని తరఫున నిర్వహించే ఆర్థిక, వాణిజ్య లావాదేవీలపై పన్ను విధించే అధికారం పార్లమెంటుకు ఉంది.

ఆర్టికల్ 290
    కొన్ని రకాలైన ఖర్చులు, పెన్షన్లకు సంబంధించిన సర్దుబాట్లను తెలియజేస్తుంది.
ఆర్టికల్ 290(A)
    కొన్ని దేవస్థానాలకు సాలీనా చెల్లించాల్సిన మొత్తాలను తెలియజేస్తుంది. దీని ప్రకారం ట్రావెన్‌కోర్ దేవస్థాన నిధికి కేరళ రాష్ట్ర సంఘటిత నిధి నుంచి ఏటా రూ.46,50,000 చెల్లించాలి.
* హిందూ దేవస్థానాలు, గుడుల నిర్వహణ కోసం తమిళనాడు రాష్ట్ర సంఘటిత నిధి నుంచి ఆ రాష్ట్ర దేవస్థాన నిధికి ఏటా రూ.13,50,000 చెల్లించాలి.
* ఈ నిబంధనను 7వ రాజ్యాంగ సవరణ చట్టం, 1956 ద్వారా చేర్చారు.
ఆర్టికల్ 291
    మాజీ స్వదేశీ సంస్థానాధీశులకు చెల్లించే రాజభరణాల గురించి తెలియజేస్తుంది.
* 26వ రాజ్యాంగ సవరణ చట్టం (1971) ద్వారా ఇందిరా గాంధీ ప్రభుత్వం రాజభరణాలను రద్దు చేయడం వల్ల ఆర్టికల్ 291ని రాజ్యాంగం నుంచి తొలగించారు.
ఆర్టికల్ 292
    పార్లమెంటు నిర్ణయించిన మేరకు భారత సంఘటిత నిధిని హామీగా పెట్టి కేంద్ర ప్రభుత్వం రుణాలను పొందే కార్యనిర్వహణాధికారాన్ని కలిగి ఉంటుంది.

ఆర్టికల్ 293
    రాష్ట్ర ప్రభుత్వాల రుణ సేకరణ.
ఆర్టికల్ 293 (1)
    రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన మేరకు రాష్ట్ర సంఘటిత నిధిని హామీగా పెట్టి దేశం లోపల ఎక్కడి నుంచైనా రాష్ట్ర ప్రభుత్వాలు రుణాలు పొందే కార్యనిర్వహణాధికారాన్ని కలిగి ఉంటాయి.
ఆర్టికల్ 293 (2)
    పార్లమెంటు నిర్ణయించిన షరతులకు లోబడి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలు ఇవ్వవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాల రుణాలకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వవచ్చు. కేంద్ర ప్రభుత్వం భారత సంఘటిత నిధి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలు ఇవ్వగలదు.
ఆర్టికల్ 293 (3)
    ఇచ్చిన రుణాలు తీరక ముందే కేంద్ర అనుమతి లేకుండా ఒక రాష్ట్రం కొత్తగా అప్పులు చేయకూడదు.
ఆర్టికల్ 293 (4)
    కేంద్రం కొన్ని షరతులతో అంతకు ముందు ఇచ్చిన రుణాలను పూర్తిగా తీర్చకముందే కొత్త రుణాలను పొందడానికి రాష్ట్రాలకు అవకాశం ఇవ్వవచ్చు.

ఆర్టికల్ 294
    కొన్ని కేసుల్లో వారసత్వం, ఆస్తులు, హక్కులు, రుణాల విషయంలో ప్రభుత్వ బాధ్యత.
ఆర్టికల్ 295
    ఇతర వివాదాలకు సంబంధించి వారసత్వంగా సంక్రమించే ఆస్తులు, హక్కులు, బాధ్యతలు.
ఆర్టికల్ 296
    స్వాతంత్య్రానికి ముందు ఉన్న రాష్ట్రాలు, సంస్థానాల ఆస్తులపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న హక్కులు.
ఆర్టికల్ 297
 * సరిహద్దు జలాలు లేదా ఖండాంతర్భాగంలోని ఖనిజాలు, ఇతర వనరులన్నింటిపై కేంద్రానికి అధికారం.
 *  ఆర్టికల్ 298 వాణిజ్య కార్యకలాపాలు, అధికారాలు.
*  ఆర్టికల్ 299 ఆస్తి ఒప్పందాలు.
* ఆర్టికల్ 300 వాజ్యాలు, ఇతర అంశాలు
ఆర్టికల్ 300 (A)
    చట్ట ప్రకారం తప్ప వ్యక్తుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకూడదు.

ఇతర అంశాలు
గాడ్గిల్ ఫార్ములా:
     కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ వనరుల పంపిణీకి ఉద్దేశించిన ఫార్ములానే గాడ్గిల్ ఫార్ములా అని పేర్కొంటారు. 4వ ఆర్థిక సంఘం సూచనలు మొదలు 8వ ఆర్థిక సంఘం సూచనల వరకు ఈ ఫార్ములానే అనుసరించారు.
ముఖర్జీ ఫార్ములా
     8వ ఆర్థిక సంఘం సూచనల నుంచి నేటి వరకు దేశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆదాయ వనరుల పంపిణీకి దీన్నే వినియోగిస్తున్నారు.
* కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆదాయ వనరుల పంపిణీకి జనాభా, విస్తీర్ణం, తలసరి ఆదాయం, అభివృద్ధి, పన్నుల వసూలు సామర్థ్యం లాంటి అంశాలను ఆధారం చేసుకుంటున్నారు.


రచయిత: బంగారు సత్యన్నారాయణ

 

Posted Date : 07-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

హైకోర్ట్ - రాష్ట్ర న్యాయ వ్యవస్థ

* భారతదేశంలో తొలి మహిళా హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీలాసేథ్ - హిమాచల్‌ప్రదేశ్.
*  హైకోర్ట్‌లో ఒక్కరోజు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసింది - బి.పి.ఝా.
*  హైకోర్ట్ తొలి న్యాయమూర్తిగా పనిచేసిన మహిళ - అన్నా చాంది (కేరళ).
*  ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ తొలి ప్రధాన న్యాయమూర్తి - కోకా సుబ్బారావు.
*  ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్‌లో పనిచేసిన తొలి మహిళా జస్టిస్ న్యాయమూర్తి  - అమరేశ్వరి.
*  భారత రాజ్యాంగంలోని 214 నిబంధన ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక ఉన్నత న్యాయస్థానం ఉంటుంది. దాన్నే హైకోర్ట్ అంటారు
*  మన దేశంలో హైకోర్ట్ చట్టాన్ని 1861లో లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టారు. దాని ప్రకారం తొలి హైకోర్ట్‌ను 1862 జులైలో కలకత్తాలో ప్రారంభించారు. 1862, అక్టోబరు 26న బొంబాయి, మద్రాసులో హైకోర్ట్‌లను ప్రారంభించారు.
*  రాజ్యాంగంలోని VI భాగంలో ఉన్న 214 నిబంధన నుంచి 237 నిబంధన వరకు, హైకోర్ట్ నిర్మాణం, అధికారాలు, అధికార పరిధి మొదలైనవి వివరించారు.
*  పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ఒక రాష్ట్రానికి లేదా రెండు అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఒక హైకోర్ట్‌ను ఏర్పాటు చేయవచ్చని 1956లో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించారు. (ఆర్టికల్ 231) ఈశాన్య రాష్ట్రాలైన అసోం, అరుణాచల్‌ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్ ఈ నాలుగింటికి కలిపి గౌహతిలో ఒక హైకోర్ట్‌ను ఏర్పాటు చేశారు.
* 2013లో ఏర్పడిన మణిపూర్, మేఘాలయ, త్రిపుర హైకోర్ట్‌లతో కలిపి ప్రస్తుతం దేశంలో 24 హైకోర్ట్‌లున్నాయి. 1966లో కేంద్రపాలిత ప్రాంతమైన దిల్లీలో హైకోర్ట్‌ను ఏర్పాటు చేశారు.
* ఆంధ్ర రాష్ట్రంలో హైకోర్ట్‌ను 1953లో ఒక ప్రధాన న్యాయమూర్తి, 11 మంది ఇతర న్యాయమూర్తులతో గుంటూరులో ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ప్రస్తుతం ఒక ప్రధాన న్యాయమూర్తి, 34 మంది ఇతర న్యాయమూర్తులతో హైదరాబాద్‌లో పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్ట్ 10 సంవత్సరాలు హైదరాబాద్‌లో ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రం నూతన హైకోర్ట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.
* రాజ్యాంగ నిబంధన 216 ప్రకారం హైకోర్ట్‌లో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులుంటారు. న్యాయమూర్తుల సంఖ్య రాష్ట్ర అవసరాలను బట్టి ఉంటుంది. ఎక్కువ మంది న్యాయమూర్తులు అలహాబాద్ హైకోర్టులో ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్ (1 + 57). అతి తక్కువ మంది న్యాయమూర్తులున్న హైకోర్ట్‌లు మేఘాలయ, మణిపూర్, త్రిపుర (1 + 2).
* నిబంధన 217 ప్రకారం హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. హైకోర్ట్ న్యాయమూర్తిగా ఎంపిక కావాలంటే భారత పౌరుడై ఉండాలి, కేంద్ర, రాష్ట్ర న్యాయ సర్వీసుల్లో 10 సంవత్సరాలు న్యాయాధికారిగా, ఏదైనా హైకోర్టులో న్యాయవాదిగా కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి.
* హైకోర్ట్ న్యాయమూర్తులు 62 సంవత్సరాలు వచ్చేంతవరకు పదవిలో కొనసాగవచ్చు. వయో పరిమితిని 65 సంవత్సరాలకు పెంచేందుకు ఉద్దేశించిన 114వ రాజ్యాంగ సవరణ ఆమోదం పొందలేదు.
* రాజ్యాంగం 3వ షెడ్యూల్‌లో హైకోర్ట్ న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం గురించి వివరించారు. 219 నిబంధన ప్రకారం గవర్నర్ లేదా అతడి ప్రతినిధి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు.
* హైకోర్ట్ న్యాయమూర్తుల వేతనాలను నిబంధన 221 ప్రకారం పార్లమెంట్ నిర్ణయిస్తుంది. వేతనాలను రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. పింఛన్‌ను కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
* రాజ్యాంగ నిబంధన 222 ప్రకారం హైకోర్ట్ న్యాయమూర్తులను ఒక కోర్ట్ నుంచి వేరొక కోర్ట్‌కు బదిలీచేయవచ్చు.
* ఏదైనా హైకోర్ట్ న్యాయమూర్తులు తాత్కాలికంగా విధులను నిర్వర్తించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నిబంధన 223 ప్రకారం తాత్కాలిక న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమించవచ్చు. వీరు 65 సంవత్సరాల వయోపరిమితి నిండిన తర్వాత పదవిలో కొనసాగడానికి వీలులేదు.
* ఏదైనా హైకోర్ట్‌లో పనిభారం ఎక్కువగా ఉన్నప్పుడు నిబంధన 224 ప్రకారం రాష్ట్రపతి అదనపు తాత్కాలిక న్యాయమూర్తులను నియమించవచ్చు. వీరి పదవీ కాలం 2 సంవత్సరాలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్  ప్రధాన న్యాయమూర్తి టి. బి. రాధాకృష్ణన్.
* అవినీతి, అధికార దుర్వినియోగం, అసమర్థత, ఆరోపణలున్న న్యాయమూర్తులను సుప్రీంకోర్ట్ న్యాయమూర్తుల మాదిరిగా పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా పదవి నుంచి తొలగించవచ్చు.

 

అభిశంసన ఎదుర్కొన్న హైకోర్ట్ న్యాయమూర్తులు

* 2010లో కలకత్తా హైకోర్ట్ న్యాయమూర్తి షమిత్ ముఖర్జీని పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా తొలగించారు.
* 2011, ఆగస్టు 18న రాజ్యసభ కలకత్తా హైకోర్ట్ న్యాయమూర్తి సౌమిత్ర సేన్‌పై అభిశంసన తీర్మానాన్ని ఆమోదించింది. లోక్‌సభలో చర్చకు రాకముందే సెప్టెంబరు 1న ఆయన రాజీనామా చేశారు.
* తమిళనాడు హైకోర్ట్ న్యాయమూర్తి పి.డి. దినకరన్‌పై 2009లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆరోపణలు నిజమని కమిటీ నిర్ధారించడంతో 2011, జులై 29న ఆయన రాజీనామా చేశారు.
* 2016 - 17లో దళితుడైన సుంకు రామకృష్ణను హింసించారనే ఆరోపణతో ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తి సి.వి. నాగార్జున రెడ్డిపై అభిశంసనకు ప్రయత్నించి విరమించుకున్నారు.
* సుప్రీంకోర్ట్ సమన్లు ధిక్కరించినందుకు కలకత్తా హైకోర్ట్ న్యాయమూర్తి సి.ఎస్. కర్ణన్‌పై నిషేధాన్ని విధించారు.

ఇతర అంశాలు

* సుప్రీంకోర్ట్ న్యాయమూర్తుల మాదిరిగా హైకోర్ట్ న్యాయమూర్తులు కూడా స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి కొన్ని రక్షణలను కల్పించారు. అభిశంసన తీర్మాన చర్చ సమయంలో తప్ప వీరి ప్రవర్తనపై చర్చించకూడదు. పదవీ విరమణ తర్వాత సుప్రీంకోర్ట్‌లో, పనిచేసిన హైకోర్ట్‌లో కాకుండా ఇతర హైకోర్ట్‌లలో వాదించవచ్చు.
* పదవీకాలంలో జీతభత్యాలు తగ్గించకూడదు.
* హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని నియమించేటప్పుడు రాష్ట్రపతి సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని, ఆ రాష్ట్ర గవర్నర్‌ను సంప్రదిస్తారు. ఇతర న్యాయమూర్తుల నియామక సమయంలో హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తారు.
* ప్రధాన న్యాయమూర్తికి నెలకు రూ.2,50,000 ఇతర న్యాయమూర్తులకు రూ.2,25,000 చెల్లిస్తారు.

 

అధికారాలు - విధులు

* ప్రాథమిక హక్కులకు సంబంధించిన అన్ని వివాదాలు హైకోర్ట్ పరిధిలోకి వస్తాయి. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల వివాదాలు, హిందూ వివాహం, విడాకులు, ఆస్తికి సంబంధించిన వివాదాలు కూడా హైకోర్ట్ పరిధిలోకి వస్తాయి.
* జిల్లా న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులపై వచ్చిన అప్పీళ్లను హైకోర్ట్ విచారిస్తుంది. సివిల్ వివాదాల్లో ఆస్తి విలువ ఎక్కువ ఉంటే హైకోర్ట్‌కు అప్పీలు చేసుకోవచ్చు.
* దిగువ స్థాయి కోర్ట్ ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా జిల్లా కోర్ట్ తీర్పు ఇచ్చినప్పుడు, హైకోర్ట్‌లో రెండో అప్పీలు చేసుకోవచ్చు. రెండో అప్పీలు విషయంలో కేవలం చట్టానికి సంబంధించిన అంశాలనే పరిశీలిస్తారు.
* క్రిమినల్ కేసుల విషయంలో (7 సంవత్సరాలకు మించి శిక్ష పడినట్లయితే) సెషన్స్ కోర్ట్ తీర్పుపై హైకోర్ట్‌కు అప్పీలు చేసుకోవచ్చు.
* ట్రైబ్యునల్ తీర్పు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించిందని భావించినప్పుడు హైకోర్ట్‌లో అప్పీలు చేసుకోవచ్చు. హైకోర్ట్‌కు ట్రైబ్యునల్‌పై సాధారణ నియంత్రణ కూడా ఉంటుంది.
* దిగువ స్థాయి న్యాయస్థానాల నిర్వహణ, తీరుతెన్నులపై హైకోర్ట్‌కు అజమాయిషీ ఉంటుంది. కింది కోర్ట్‌ల నిర్వహణకు అవసరమైన నియమ నిబంధనలను హైకోర్ట్ రూపొందించవచ్చు.
* హైకోర్ట్ ప్రత్యేక ఉత్తర్వులతో కింది న్యాయస్థానాల్లోని వివాదాలను ఒక కోర్టు నుంచి ఇంకొక కోర్టుకు బదిలీచేయవచ్చు లేదా స్వయంగా విచారణకు స్వీకరించవచ్చు.
* పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణకు, సాధారణ హక్కుల రక్షణకు నిబంధన 226 ప్రకారం ప్రత్యేక రిట్‌లను జారీచేయవచ్చు.


 

లోక్ అదాలత్ (ప్రజా న్యాయస్థానం)

     కొన్ని కారణాల వల్ల న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారంలో జాప్యం జరుగుతుండటంతో సత్వర పరిష్కారానికి, శాశ్వత ప్రాతిపదికన లోక్ అదాలత్‌లకు వీలుకల్పించే లీగల్ సర్వీసెస్ ఆర్బిట్రేషన్ చట్టాన్ని 2002లో రూపొందించారు. సులభంగా పరిష్కరించదగిన కొన్ని రకాల కేసులను పెద్ద మనుషుల మధ్యవర్తిత్వంతో పరిష్కరించడానికి చట్టబద్ధమైన ప్రతిపత్తిని కల్పిస్తూ 'లోక్ అదాలత్' పేరుతో ప్రజా న్యాయస్థానాల వ్యవస్థను ఏర్పాటుచేశారు.
* ఈ వ్యవస్థ పేదలకు ఉచితంగా న్యాయం అందించడానికి కూడా కృషిచేస్తుంది. మన రాష్ట్రంలో సుమారు 70 లోక్ అదాలత్‌లు పనిచేస్తున్నాయి.
* సాధారణ న్యాయస్థానాల్లో పనిచేస్తున్న న్యాయ మూర్తులు లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారు. ప్రజలకు సత్వరమే, సంతృప్తికరమైన న్యాయాన్ని అందించడమే వీటి ముఖ్య ఉద్దేశం.
* మోటారు వాహనాల వివాదాలు, ఇన్సూరెన్స్ క్లైమ్‌లు మొదలైన విషయాల్లో లోక్ అదాలత్ తీర్పుతో సంతృప్తి చెందనివారు సాధారణ న్యాయస్థానాలకు వెళ్లవచ్చు.
* వినియోగదారుల ఫోరాలు 1986లో వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని చేశాయి. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ఈ ఫోరంలను ఏర్పాటు చేశారు.
* ఇవి మూడు స్థాయుల్లో పనిచేస్తాయి. 20 లక్షల రూపాయల విలువ ఉన్న కేసులు జిల్లా స్థాయిలో జిల్లా ఫోరంల పరిధిలోకి వస్తాయి. 20 లక్షలు దాటిన, కోటి రూపాయల్లోపు రాష్ట్ర ఫోరంల పరిధిలోకి వస్తాయి. కోటి రూపాయల విలువ దాటిన కేసులను జాతీయ స్థాయుల్లో ఉన్న ఫోరాలు పరిష్కరిస్తాయి.
* వినియోగదారులు రూ.100 ఫీజు చెల్లించి ఫిర్యాదు చేయవచ్చు. సాధారణ న్యాయస్థానాల మాదిరిగా న్యాయ ప్రక్రియలు ఉంటాయి.
* 1987లో కుటుంబంలో ఏర్పడిన వివాదాల పరిష్కారానికి దేశంలోనే తొలిసారిగా అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుటుంబ కోర్టులను ఏర్పాటు చేశారు. 

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాష్ట్ర గవర్నర్

      మన దేశంలో సమాఖ్య వ్యవస్థ ఉన్న ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంతో  కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాల నిర్మాణం, అధికారాలను రాజ్యాంగంలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం కేంద్రంలో పార్లమెంటరీ విధానాన్ని ఏర్పాటు చేసి, రాష్ట్రాల్లో కూడా అదే విధానాన్ని అమలుచేశారు. కేంద్రంలో రాజ్యాధికారి అయిన రాష్ట్రపతి నామమాత్రపు అధికారిగా, ప్రభుత్వాధికారం ఉన్న ప్రధాని, మంత్రిమండలి వాస్తవ అధికారాలు వినియోగించుకుంటున్నారు.
రాష్ట్రాల్లో రాజ్యాధికారి అయిన గవర్నర్‌కు నామమాత్రపు అధికారాలు ఉంటాయి. వాస్తవ అధికారాలు ముఖ్యమంత్రి, మంత్రిమండలికి ఉంటాయి.
* రాజ్యాంగంలో 6వ భాగంలో రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి, శాసనసభ నిర్మాణం, అధికారాలు మొదలైన వాటిని వివరించారు (జమ్మూకశ్మీర్ మినహాయించి).
* ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలని నిబంధన 153 సూచిస్తుంది. కానీ 1956లో జరిగిన 7వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఒక వ్యక్తిని రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్‌గా నియమించవచ్చు.
* ప్రపంచంలో సమాఖ్య విధానాన్ని అనుసరిస్తోన్న ఎక్కువ దేశాల్లో రాష్ట్ర గవర్నర్లను ప్రజలు ఎన్నుకుంటారు.
ఉదా: యూఎస్ఏ. మన దేశంలో గవర్నర్లను నిబంధన 155 ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు. కెనడాలో కూడా నామినేషన్ పద్ధతినే అనుసరిస్తున్నారు.
* మన దేశంలో రాష్ట్రాలపై కేంద్రం అజమాయిషీ ఉండాలనీ, గవర్నర్‌ను కూడా ప్రజలే ఎన్నుకుంటే రెండు అధికార కేంద్రాలు (ముఖ్యమంత్రి, గవర్నర్) ఏర్పడతాయనే కొన్ని కారణాల వల్ల గవర్నర్‌ను రాష్ట్రపతి నియమించే పద్ధతిని అనుసరిస్తున్నారు.
* నిబంధన 156 ప్రకారం గవర్నర్ పదవీ కాలం 5 సంవత్సరాలు. రాష్ట్రపతి విశ్వాసమున్నంత వరకూ పదవిలో కొనసాగుతారు. రాష్ట్రపతి గవర్నర్‌ను తొలగించినప్పుడు ఆయన న్యాయస్థానాలను ఆశ్రయించకూడదని 1983లో సూర్యనారాయణ Vs భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
* గవర్నర్ వేతనాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం గవర్నర్ నెల వేతనం రూ.3,50,000. ఇతర సౌకర్యాలుంటాయి. గవర్నర్‌కు అధికార నివాసముంటుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అధికార నివాసం హైదరాబాద్‌లో ఉంది. చిత్తూరు జిల్లా హార్స్‌లీ హిల్స్‌లో వేసవి విడిది గృహం కూడా ఉంది.
* ఒక వ్యక్తి రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఉంటే ఏ రాష్ట్రం ఎంత వేతనం చెల్లించాలనేది రాష్ట్రపతి నిర్ణయిస్తారు. గవర్నర్ వేతనాన్ని రాష్ట్ర సంఘటిత నిధి నుంచి, పింఛన్‌ను కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
* గవర్నర్‌గా నియమించడానికి నిబంధన 157 ప్రకారం భారత పౌరుడై ఉండాలి. 35 సంవత్సరాలు నిండి ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో సభ్యుడై ఉండకూడదు. ఉంటే నియమించిన తర్వాత రాజీనామా చేయాలి.
* సంప్రదాయం ప్రకారం క్రియాశీల రాజకీయాల్లో పాల్గొంటున్న వ్యక్తిని గవర్నర్‌గా నియమించకూడదు. ఒక రాష్ట్ర గవర్నర్‌ను నియమించేటప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించడం, రాష్ట్రేతరుడిని గవర్నర్‌గా నియమించడం మంచి సంప్రదాయం.
* రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రిమండలి సలహా పాటించాలి. నియమించే అధికారిని (రాష్ట్రపతి) సంతృప్తి పర్చాలి. దాంతో కొన్ని పరిస్థితుల్లో గవర్నర్ విధి నిర్వహణ క్లిష్టతరమవుతుంది.
* గవర్నర్ పదవి గౌరవప్రదమైంది. గవర్నర్‌ను రాజ్యపాల్ అని కూడా అంటారు. ఈయన రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్య కార్యనిర్వాహణాధికారి. గవర్నర్ తన అధికారాలను వినియోగించుకున్నప్పుడు ముఖ్యమంత్రి, మంత్రిమండలి సలహాను పాటించాలి. కాబట్టి గవర్నర్ నామమాత్రపు అధికారి మాత్రమే.
* 'గవర్నర్ పదవి బంగారు పంజరంలో చిలుక లాంటిది' అని సరోజిని నాయుడు వ్యాఖ్యానించారు.

అధికారాలు విధులు

కార్య నిర్వాహణాధికారాలు:
     గవర్నర్ రాష్ట్రంలో పరిపాలన నిర్వహణకు కేంద్రంలో రాష్ట్రపతిలా కొంతమంది ఉన్నతాధికారులను నియమిస్తారు.
* నిబంధన 164 ప్రకారం రాష్ట్ర విధాన సభలో మెజారిటీ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమించి అతడి సలహాతో మంత్రిమండలిని నియమిస్తారు.
* చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమ శాఖా మంత్రులను నియమించే అధికారం ఆ రాష్ట్ర గవర్నర్‌కు ఉంటుంది.
* నిబంధన 165 ప్రకారం రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌ను, నిబంధన 233 ప్రకారం జిల్లా కోర్ట్ న్యామూర్తులను, నిబంధన 233 (I), 243 (Y) ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నిబంధన 243 (K), 243 (2A), ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నియమిస్తారు.
* రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు గవర్నర్ ఛాన్సలర్‌గా వ్యవహరిస్తారు. వైస్ ఛాన్సలర్లను నియమిస్తారు. పై నియామకాలన్నీ ముఖ్యమంత్రి, మంత్రిమండలి సలహా మేరకే చేయాలి.

శాసన నిర్మాణాధికారాలు

రాష్ట్రపతి కేంద్ర పార్లమెంట్‌లో సభ్యుడు కాకపోయినా, అంతర్భాగం. అలాగే గవర్నర్ రాష్ట్ర శాసనసభలో సభ్యుడు కాకపోయినా శాసన నిర్మాణ శాఖలో అంతర్భాగం.
* రాష్ట్ర విధానసభ, విధాన పరిషత్ ఆమోదించిన బిల్లులు గవర్నర్ ఆమోదంతో శాసనాలు అవుతాయి (నిబంధన 200).
* గవర్నర్ తిరస్కరిస్తే ఆ బిల్లులు రద్దవుతాయి. దీన్నే 'నిరపేక్ష వీటో' అంటారు. ఉభయ సభలు ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోదించకుండా పునఃపరిశీలనకు పంపవచ్చు. Suspensive veto అంటారు. బిల్లు తిరిగి యథాతథంగా వస్తే తప్పనిసరిగా ఆమోదించాలి. ఆమోదించకుండా, తిరస్కరించకుండా, పునఃపరిశీలనకు పంపకుండా బిల్లును తన వద్దే ఉంచుకునే 'Pocket Veto' అధికారం గవర్నర్‌కు లేదు.
* నిబంధన 201 ప్రకారం గవర్నర్ తన వద్దకు వచ్చిన బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపవచ్చు. రాష్ట్రపతి ఆ బిల్లును ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు లేదా పునః పరిశీలనకు రాష్ట్ర శాసనసభకు పంపవచ్చు. బిల్లు యథాతథంగా తిరిగి వస్తే తప్పనిసరిగా ఆమోదించాలని లేదు. కానీ 'Pocket Veto' వినియోగించి రాష్ట్రపతి తన వద్ద ఉంచుకోవచ్చు. నిబంధన 143 ప్రకారం ఆ బిల్లుపై సుప్రీంకోర్టు  సలహా కోరవచ్చు.
* రాష్ట్ర గవర్నర్ నిబంధన 331 ప్రకారం రాష్ట్ర విధానసభకు ఒక ఆంగ్లో ఇండియన్‌ను, నిబంధన 171 ప్రకారం విధానసభకు (ఉంటే) 1/6వ వంతు సభ్యులను నియమిస్తారు. నిబంధన 332 ప్రకారం గవర్నర్ విధానసభలో కొన్ని స్థానాలను షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు కేటాయిస్తారు.
* నిబంధన 174 ప్రకారం రాష్ట్ర గవర్నర్ శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేయడం, వాయిదా వేయడం చేయవచ్చు.
* నిబంధన 175 ప్రకారం శాసనసభను ఉద్దేశించి ప్రసంగించవచ్చు.
* నిబంధన 176 ప్రకారం గవర్నర్ శాసనసభకు ప్రత్యేక సందేశాలు పంపవచ్చు.
* నిబంధన 213 ప్రకారం శాసనసభ సమావేశంలో లేనప్పుడు 'ఆర్డినెన్స్‌లు' జారీ చేయవచ్చు.
* విధానసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు ఒకేసారి ఖాళీ ఏర్పడితే సభా కార్యక్రమాల నిర్వహణకు నిబంధన 180 ప్రకారం గవర్నర్ ఒక వ్యక్తిని నియమించవచ్చు.
* పార్లమెంట్ ఉభయ సభలకు ఏదైనా బిల్లు విషయంలో భేదం ఏర్పడితే, అలాంటి పరిస్థితిని అధిగమించడానికి రాష్ట్రపతి నిబంధన 108 ప్రకారం ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు. కానీ రాష్ట్ర గవర్నర్‌కు ఆ అధికారం లేదు.

ఆర్థిక అధికారాలు

రాజ్యాంగ నిబంధన 202 ప్రకారం రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే బాధ్యత గవర్నర్‌ది.
* నిబంధన 199 ప్రకారం ఆర్థిక బిల్లును విధానసభలో ప్రవేశపెట్టడానికి గవర్నర్ పూర్వానుమతి ఉండాలి.
* నిబంధన 203 ప్రకారం గవర్నర్ అనుమతి లేనిదే ఏ విధమైన కేటాయింపులూ చేయకూడదు.
* బడ్జెట్ సమావేశాల ఆరంభంలో గవర్నర్ శాసనసభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

న్యాయాధికారాలు

నిబంధన 161 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు వర్తించే విషయాల్లో న్యాయస్థానాలు విధించిన శిక్షలను తగ్గించవచ్చు, మార్చవచ్చు లేదా రద్దుచేయవచ్చు. మరణశిక్షను రద్దుచేసి క్షమాభిక్ష పెట్టే అధికారం గవర్నర్‌కు లేదు కానీ వాయిదా వేయవచ్చు.
* రాష్ట్రపతి సైనిక న్యాయస్థానాలు విధించిన శిక్షలకు కూడా క్షమాబిక్ష పెట్టవచ్చు. రాష్ట్రంలో గవర్నర్‌కు అలాంటి అధికారాలు ఉండవు. ఎందుకంటే రాష్ట్రాలకు సైన్యం ఉండదు.
* నిబంధన 217 ప్రకారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు గవర్నర్‌ను సంప్రదించాలి.
* రాష్ట్రపతికి ఉన్న సైనిక, రాయబార, అత్యవసర అధికారాలు గవర్నర్‌కు ఉండవు.

విచక్షణాధికారాలు

రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రి, మంత్రిమండలి సలహా మేరకు తన అధికారాలను వినియోగించుకోవాలి. కింద పేర్కొన్న కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి, మంత్రి మండలి సలహా లేకుండా తనకు తానే నిర్ణయాలు చేయవచ్చు. వాటినే 'విచక్షణాధికారాలు' అంటారు. అందులో రాజ్యాంగబద్ధమైనవి:
* రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతి ఆమోదానికి పంపవచ్చు.
* రాష్ట్రంలో ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగించడంలో విఫలమై, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందని భావించినప్పుడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని (నిబంధన 356) రాష్ట్రపతికి నివేదిక పంపవచ్చు.
* నిబంధన 371 ప్రకారం కొన్ని రాష్ట్రాల్లో (నాగాలాండ్, అసోం, మణిపూర్ మొదలైనవి) గవర్నర్‌కు స్వయం నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది.
* నాగాలాండ్ గవర్నర్‌కు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి.
* మహారాష్ట్రలో వెనుకబడిన విదర్భ లాంటి ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక బోర్డులను  ఏర్పాటు చేసే అధికారం ఆ రాష్ట్ర గవర్నర్‌కు ఉంది.
* గవర్నర్ కొన్ని సందర్భోచితమైన విచక్షణాధికారాలను వినియోగిస్తారు. కొన్ని సందర్భాల్లో అవి వివాదాస్పదం అవుతున్నాయి.
* రాష్ట్రంలో పరిపాలన నిర్వహిస్తోన్న ముఖ్యమంత్రిని, విధానసభలో మెజారిటీ కోల్పోయారనే కారణంగా రద్దుచేసి, వేరే వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించి విధానసభలో మెజారిటీ నిరూపించుకోమని కోరవచ్చు.
ఉదా: 1984లో ఎన్.టి. రామారావు ప్రభుత్వాన్ని రద్దుచేసి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా నియమించి, మెజారిటీ నిరూపించుకోమని కోరారు అప్పటి గవర్నర్ రామ్‌లాల్. ఈ చర్య వివాదాస్పదం కావడంతో ఆయన్ను గవర్నర్ పదవి నుంచి 'రీకాల్' చేశారు.
* 1994లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు (పార్టీలో చీలిక కారణంగా) విధాన సభ రద్దుకు సిఫారసు చేస్తే గవర్నర్ కృష్ణకాంత్ తిరస్కరించి, ముఖ్యమంత్రిని మెజారిటీ నిరూపించుకోమని కోరారు.
* విధాన సభలో ఏ పార్టీకీ మెజారిటీ లేనప్పుడు ముఖ్యమంత్రి నియామకం, మెజారిటీ నిరూపించుకోమని ఆదేశించడం లాంటి గవర్నర్ అధికారాలు వివాదాస్పదం అవుతున్నాయి.
ఉదా: ఇటీవల కర్ణాటకలో జరిగిన సంఘటన. విధానసభలో అత్యధిక స్థానాలున్న పార్టీ నాయకుడు యడ్యూరప్పను గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమించి 15 రోజుల్లోపు మెజారిటీని నిరూపించుకోమని కోరారు. ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే, మెజారిటీ నిరూపించుకోవడానికి అంత సమయం అవసరం లేదని కోర్టు ఆ వ్యవధిని రెండు రోజులకు తగ్గించింది.
* నిబంధన 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించమని, రాష్ట్రపతికి గవర్నర్లు సిఫారసు చేయడం ఇంతవరకు 124 సార్లు (వివిధ రాష్ట్రాల్లో) జరిగింది. 1951లో మొదటిసారిగా పంజాబ్‌లో, 124వ సారి ఇటీవల ఉత్తరాఖండ్‌లో గవర్నర్‌లు రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. గవర్నర్‌లు ఈ అధికారాలు వినియోగించుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వివాదాస్పదం అవుతున్నాయి.
* గవర్నర్ సిఫారసు మేరకు రాష్ట్రపతి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే, ఆ కాలంలో రాష్ట్రపతి తరపున రాష్ట్ర పాలనా బాధ్యతలను గవర్నర్ నిర్వర్తిస్తారు.
* గవర్నర్ పదవీకాలం అయిదు సంవత్సరాలు పూర్తికాక ముందే అతడిని తొలగించడానికి మహాభియోగ, అభిశంసన తీర్మానాలేవీ లేవు. పదవీకాలం ముగియక ముందు రాష్ట్రపతి గవర్నర్‌ను 'రీకాల్' చేయవచ్చు. రాష్ట్రపతి చేసిన ఆ చర్యను న్యాయస్థానాల్లో సవాలు చేయకూడదు.
* అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్‌ఖోవాను 2016, సెప్టెంబరు 12న రాష్ట్రపతి 'రీకాల్' చేశారు.
* భారతదేశంలో తొలి మహిళా గవర్నర్ సరోజినీనాయుడు (ఉత్తర్‌ ప్రదేశ్).

* దేశంలో ఎక్కువ కాలం గవర్నర్‌గా పనిచేసింది బి.సి. అలెగ్జాండర్. 1988 - 90 వరకు తమిళనాడుకు, 1993 - 2002 వరకు మహారాష్ట్రకు ఈయన గవర్నర్‌గా పనిచేశారు.
* ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ తొలి గవర్నర్ సి.ఎం. త్రివేది.
* ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా గవర్నర్ శారదా ముఖర్జీ.
రెండో మహిళా గవర్నర్ కుముద్‌బెన్ జోషి.
* ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్. ఈయన గవర్నర్‌గా 2009 డిసెంబరు నుంచి కొనసాగుతున్నారు.
* మన రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి, కె.రోశయ్య తమిళనాడు గవర్నర్లుగా పనిచేశారు.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

లోక్‌సభ - రాజ్యసభ - సభాధ్యక్షులు

* స్పీకర్‌గా ఎన్నికైన వ్యక్తి ఏ పార్టీ తరపున లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైనా ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి
     రాజీనామా చేసి, తటస్థ వ్యక్తిగా వ్యవహరించడం సంప్రదాయం.
* ఈ సత్సంప్రదాయాన్ని పాటించిన ఘనత నీలం సంజీవరెడ్డికే దక్కుతుంది. ఆయన తర్వాత మరెవరూ దీన్ని
     పాటించలేదు.
* పార్లమెంటు ముఖ్యవిధి శాసన నిర్మాణం.
* శాసన నిర్మాణంతోపాటు, పాలక వర్గంపై అజమాయిషీ లాంటి మరికొన్ని విధులు కూడా పార్లమెంటు నిర్వహిస్తుంది.
* పార్లమెంటు ఉభయసభలు ఒక ప్రత్యేక ప్రక్రియ (శాసన నిర్మాణ ప్రక్రియ) ద్వారా సభా సమావేశాల్లో అనేక విధాలుగా చర్చించి శాసనాలను తయారుచేస్తాయి.
* సభా సమావేశాల్లో అనేక రకాల తీర్మానాలు ప్రశ్నలు మొదలైన వాటి ద్వారా పాలక వర్గంపై అజమాయిషీ చేస్తూ పాలకవర్గం నియంతృత్వ పోకడలను నివారిస్తుంది.
* పార్లమెంటు ఉభయ సభలు తమ విధులను 'సభా సమావేశాల' ద్వారా నిర్వహిస్తాయి.
సభా సమావేశాల నిర్వహణకు, సభా సమావేశాలకు అధ్యక్షత వహించి సభా కార్యక్రమాలను సజావుగా నిర్వహించడానికి సభాధ్యక్షులు ఉంటారు.
* లోక్‌సభ అధ్యక్షుడిని 'స్పీకర్' అంటారు.
* రాజ్యసభకు ఉపరాష్ట్రపతి అధ్యక్షత వహిస్తారు. రాజ్యసభ అధ్యక్షుడిని ఛైర్మన్ అని వ్యవహరిస్తారు.

 

లోక్‌సభ స్పీకర్

    భారత ప్రభుత్వ చట్టం 1919 ప్రకారం, శాసనసభ కార్యకలాపాల నిర్వహణకు సర్ ఫ్రెడరిక్‌వైట్‌ను అధ్యక్షుడిగా 1921లో గవర్నర్ జనరల్ నియమించారు.
* 1947 వరకు సభాధ్యక్షుడు అని వ్యవహరించేవారు.
* 1950 భారత రాజ్యాంగ చట్టం ప్రకారం ఈ పదవికి 'స్పీకర్' అని నామకరణం చేశారు.
* మొదటి లోక్‌సభ స్పీకర్ జి.వి. మౌలాంకర్.
* రాజ్యాంగ నిబంధన 93 ప్రకారం లోక్‌సభ కార్యక్రమాల నిర్వహణకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులను  ఏర్పాటు చేశారు.
* లోక్‌సభ ఎన్నికల అనంతరం మొదటి సమావేశంలోనే సభ్యుల్లో ఒకరిని స్పీకర్‌గా వేరొకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటారు.
* లోక్‌సభ గడువు ఉన్నంత వరకు (అయిదేళ్లు) అతడు పదవిలో కొనసాగుతాడు. గడువుకు ముందే లోక్‌సభ రద్దయితే కొత్త స్పీకర్ ఎన్నికయ్యేంతవరకు అతడు పదవిలో కొనసాగుతాడు.
* నిబంధన 94 ప్రకారం స్పీకర్‌ను ముందుగా పదవి నుంచి తొలగించాలంటే 14 రోజుల వ్యవధితో ఒక నోటీసు ఇచ్చి, లోక్‌సభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి.
* మొత్తం సభ్యుల్లో సగం కంటే ఎక్కువమంది తీర్మానాన్ని ఆమోదిస్తే స్పీకర్‌ను పదవి నుంచి తొలగిస్తారు.
* తీర్మానాన్ని సభలో చర్చించినప్పుడు అతడు సభాధ్యక్షుడిగా ఉండకూడదు.
* స్పీకర్ పదవి చాలా గౌరవప్రదమైంది.
* ఇంతవరకు ఎవరినీ అభిశంసన తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా పదవి నుంచి తొలగించలేదు.
1954లో జి.వి. మావలంకర్‌పై, 1966లో సర్దార్ హుకుంసింగ్‌పై అభిశంసన తీర్మానాలను ప్రవేశపెట్టారు. కానీ తర్వాత ఉపసంహరించుకున్నారు.
* వేతనం: స్పీకర్‌కు నెలకు రూ.1,40,000 గౌరవ వేతనంతోపాటు ఉచిత ప్రయాణ సౌకర్యాలు, టెలిఫోన్, వైద్య సదుపాయాలు, ఉచిత నివాస గృహం మొదలైన సౌకర్యాలు కల్పిస్తారు.
* స్పీకర్ వేతనాలను సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
స్పీకర్‌కు ప్రత్యేక సచివాలయం, సిబ్బంది ఉంటారు.
* Rules of Procedure and Conduct of Business in Parliment Act 1950 - 51 - 19 శీర్షికలో స్పీకర్ అధికారాలు, విధులను వివరించారు.

 

సభా కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి:
* సభా కార్యక్రమాలు క్రమశిక్షణతో జరిగేలా చూడాల్సిన బాధ్యత స్పీకర్‌ది. క్రమశిక్షణకు భంగం కలిగించే పరిస్థితులను నివారించాలి.
* సభా కార్యక్రమాల నిర్వహణలో గందరగోళ పరిస్థితి ఏర్పడితే కార్యక్రమాలను తాత్కాలికంగా, దీర్ఘకాలికంగా, నిరవధికంగా వాయిదా వేయొచ్చు (ఎడ్జర్న్ చేయడం Sign die).
* హద్దుమీరి క్రమశిక్షణను అతిక్రమించిన సభ్యులను అదుపు చేయాలి. అదుపు చేయడం సాధ్యం కాకపోతే సార్జెంట్ ఇన్ ఆర్మ్ సహాయంతో సభ్యులను బహిష్కరించడం, సస్పెండ్ చేయడం లాంటి చర్యలు తీసుకోవచ్చు.
* సభలో కనీస సభ్యుల హాజరు 'కోరం' లేకపోతే సభను వాయిదా వేయొచ్చు.
* బిల్లుల, తీర్మానాలపై అవసరమైతే ఓటింగ్ జరిపించి ఫలితాలను సభకు తెలపాలి.
* ఓటింగులో స్పీకర్ పాల్గొనరాదు. ఏదైనా అంశంపై సమానమైన ఓట్లు వస్తే స్పీకర్ నిర్ణాయక ఓటు (కాస్టింగ్ ఓటు) వేసి సందిగ్ధ పరిస్థితిని నివారించవచ్చు.
* సభా కార్యక్రమాల్లో సభ్యులందరూ పాల్గొని, మాట్లాడే అవకాశాన్ని నిష్పక్షపాతంగా అందరికీ సమానంగా కల్పించాలి.
* రాజ్యసభ ఆమోదంతో వచ్చిన బిల్లును లోక్‌సభ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి పంపడం.

 

స్పీకర్‌కు ఉన్న పర్యవేక్షణ అధికారాలు:
* వివిధ పార్లమెంటరీ కమిటీలు ఏర్పాటు చేసి, వాటి పనిని పర్యవేక్షించడం.
సభా వ్యవహారాల కమిటీ, సభా నియమాల కమిటీలకు స్పీకర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
* సభా సంఘాలు సకాలంలో నివేదికలు సమర్పించేలా చూడాల్సిన బాధ్యత స్పీకర్‌ది.
* సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రుల నుంచి సరైన సమాధానాలు రాబట్టాలి. సరైన సమాధానం ఇవ్వని మంత్రిని మందలించవచ్చు.
సభా హక్కులకు భంగం కలిగించే సభ్యుల, ఇతరులపై తగిన చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉంది.
* స్పీకర్ అనుమతి లేనిదే సభ్యులపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోరాదు.
* సభా కార్యక్రమాలను, సభ్యుల ప్రసంగాలను రికార్డు చేయించడం. సభా మర్యాదకు, సంప్రదాయాలకు విరుద్ధమైన వాటిని రికార్డుల నుంచి తొలగించడం మొదలైనవి కూడా స్పీకర్ విధులు.
* స్పీకర్‌కు విధి నిర్వహణలో సహాయపడటానికి లోక్‌సభ సచివాలయం ఉంటుంది. సచివాలయ సిబ్బంది కార్యకలాపాలపై స్పీకర్‌కే నియంత్రణ ఉంటుంది.
* 'ప్రభుత్వ అధికార రహస్యాల చట్టం' నెపంతో ఏదైనా సమాచారాన్ని సభకు లేదా కమిటీలకు  అందించకపోతే సరైన సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించవచ్చు. బోఫోర్స్, ఫేర్‌ఫాక్స్ విషయాలను దీనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు.
* లోక్‌సభ సభ్యులు ఎవరైనా రాజీనామా చేస్తే ఆమోదించడం, సభ్యులకు గృహవసతి మొదలైన సౌకర్యాలు సమకూర్చడం స్పీకర్ విధి.
* పార్టీ ఫిరాయింపుల వల్ల లేదా ఏ ఇతర కారణాల వల్ల సభ్యుల అనర్హతలను నిర్ణయించేది స్పీకర్. ఆయన నిర్ణయం తిరుగులేనిది.
* లోక్‌సభకు - రాజ్యసభకు - మంత్రిమండలికి - రాష్ట్రపతికి మధ్య సంధానకర్తగా స్పీకర్ వ్యవహరిస్తారు.
* ఏదైనా బిల్లు విషయంలో ఉభయ సభల మధ్య వివాదం ఏర్పడి ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఆ సమావేశానికి లోక్‌సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు.
* ఏదైనా బిల్లు ఆర్థిక బిల్లా - సాధారణ బిల్లా అని నిర్ణయించే అధికారం స్పీకర్‌కు మాత్రమే ఉంటుంది.
* అఖిల భారత స్పీకర్ల మహాసభకు లోక్‌సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు
* బ్రిటన్‌లో ఒకసారి స్పీకర్‌గా ఎన్నికైతే ఇష్టమైనంత కాలం కొనసాగవచ్చు. మన దేశంలో అధికార పార్టీని కాదన్నవారు స్పీకర్‌గా కొనసాగలేరు.
* అధికార పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే ప్రయత్నం చేయడం వల్ల జి.వి. మౌలాంకర్ సర్దార్ హుకుంసింగ్‌లపై అభిశంసన తీర్మానానికి ప్రయత్నించి, దాన్ని ఉపసంహరించుకున్నారు.
* స్పీకర్ ఒక న్యాయస్థానంలో న్యాయనిర్ణేత కాకపోయినా సభా కార్యక్రమాల నిర్వహణ సందర్భాల్లో తీర్మానాలను అనుమతించడం, తోసిపుచ్చడం, సభానియమాలకు అర్థం చెప్పడం లాంటి విషయాల్లో, అతడి నిర్ణయాలు న్యాయనిర్ణయాలతో సమానమైనవి. వాటికి తిరుగులేదు.
* మన దేశంలో అధికార హోదాలో లోక్‌సభ స్పీకర్‌ది 7వ స్థానం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాతో సమాన గౌరవం ఉంటుంది.
* స్పీకర్ లేని సమయంలో సభకు అధ్యక్షత వహించడానికి డిప్యూటీ స్పీకర్‌గా ఒకరిని ఎన్నుకుంటారు.


 

ప్రొటెం స్పీకర్‌ 

    సాధారణ ఎన్నికల తర్వాత లోక్‌సభకు ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సభ్యుల్లో అందరికంటే సీనియర్‌ వ్యక్తిని రాష్ట్రపతి ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు. ఈ పదవిని ఫ్రాన్స్‌ రాజ్యాంగం నుంచి గ్రహించారు. లోక్‌సభ నూతన స్పీకర్‌ ఎన్నిక జరిగే వరకు ప్రొటెం స్పీకరే సభా అధ్యక్షులుగా కొనసాగుతారు.

* 1952లో ఏర్పడిన మొదటి లోక్‌సభకు జి.వి.మౌలాంకర్‌ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించారు.

* 2019లో ఏర్పడిన 17వ లోక్‌సభకు వీరేంద్రకుమార్‌ ప్రొటెం స్పీకర్‌గా ఉన్నారు.

* బి.డి.దాస్, ఇంద్రజిత్‌ గుప్తా నాలుగుసార్లు ప్రొటెం స్పీకర్‌ పదవిని నిర్వహించారు.

* ప్రొటెం స్పీకర్‌గా పనిచేసే వ్యక్తి స్పీకర్‌ పదవికి పోటీ చేయాలంటే తన ప్రొటెం స్పీకర్‌ పదవికి రాజీనామా చేయాలి.

 

రాజ్యసభ అధ్యక్షుడు
        లోక్‌సభలో 'స్పీకర్' నిర్వహించే విధులను రాజ్యసభలో 'ఛైర్మన్' హోదాలో ఉపరాష్ట్రపతి నిర్వహిస్తారు. పదవిరీత్యా ఉపరాష్ట్రపతికి రాజ్యసభ ఛైర్మన్ హోదాలో నెలకు రూ.1,40,000 వేతనం, ఇతర సౌకర్యాలు ఉంటాయి. రాజ్యసభ ఛైర్మన్ సభలో సభ్యుడు కాదు. కాబట్టి తీర్మానాలపై ఓటు వేసే అధికారం ఉండదు. కానీ బిల్లుల ఆమోదంపై సమాన ఓట్లు వచ్చినప్పుడు 'కాస్టింగ్ ఓటు' వేసి, ఆమోదింపజేయడమో, తిరస్కరించడమో చేయొచ్చు. రాజ్యసభ ఆమోదించిన బిల్లును లోక్‌సభకు పంపడం, రాజ్యసభ సమావేశాల నిర్వహణకు ప్యానల్ స్పీకర్లను ప్రకటించడం, సభానియమాల ఉల్లంఘన విషయాలు పరిశీలించడం, రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ను నియమించడం మొదలైనవి రాజ్యసభ ఛైర్మన్ విధులు. రాజ్యసభ ప్రస్తుత సెక్రటరీ జనరల్ దేశ్‌దీపక్ వర్మ.

Posted Date : 22-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

నియంత్రిత సంస్థ‌లు

ప్రజలకు మెరుగైన సేవలు అందించి, ప్రైవేటీకరణ ద్వారా ఏర్పడే దుష్ఫలితాలను నివారించడానికి, వివిధ సంస్థలు నిర్వహించే కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు భారత్‌లో నియంత్రిత సంస్థలను ఏర్పాటు చేశారు. మనదేశంలో వినియోగదారులు అసంఘటితంగా ఉన్నారు. వారి ప్రయోజనాల పరిరక్షణలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశంలో ఏర్పాటు చేసిన ముఖ్యమైన నియంత్రిత సంస్థలు, వాటి అధికారాలు, విధుల గురించి పోటీపరీక్షార్థులకు అవగాహన అవసరం.
 

అధికారాలు - విధులు
* ఇవి పార్లమెంట్‌ చట్టం లేదా కేంద్ర కార్యనిర్వాహక శాఖ ఉత్తర్వు ద్వారా ఏర్పడతాయి.
* ప్రజలు వివిధ రంగాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వీటికి ఫిర్యాదు చెయ్యొచ్చు.
* ఇవి వారి ఫిర్యాదులను స్వీకరించి, ఆయా సంస్థల నుంచి సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీచేస్తాయి.
* ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థలు అందించిన ఆధారాలు, వివరణలు; వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను విచారిస్తుంది.
* వ్యక్తులు, అధికారుల నుంచి సాక్ష్యాల సేకరణకు వీలుగా తమ ముందు హాజరు కావాలని సమన్లు జారీచేస్తాయి.
* న్యాయ విచారణ అనంతరం అక్రమాల ధ్రువీకరణ జరిగితే జరిమానా విధిస్తాయి.
* ‘నియంత్రిత అథారిటీ’ మార్గదర్శకాలకు లోబడే ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు ధరలను, విక్రయ పద్ధతులను ప్రకటిస్తాయి.
* పార్లమెంట్‌ రూపొందించిన చట్టాలకు అనుగుణంగా నియంత్రిత సంస్థలు తమ అధికార, విధులను నిర్వహిస్తాయి.
* వివిధ సంస్థల మధ్య అనవసరమైన పోటీని నివారించి వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించి, వస్తు, సేవల నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షిస్తూ ధరల స్థిరీకరణకు కృషి చేస్తాయి.

 

ముఖ్యమైన నియంత్రిత సంస్థలు
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా  (TRAI): 
* 1990 దశకంలో వచ్చిన ఆర్థిక సరళీకృత విధానాల ఫలితంగా టెలికాం రంగంలో ప్రైవేట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు వచ్చాయి. దీని ఫలితంగా టెలికాం రంగంలో తప్పనిసరి నియంత్రణ అవసరమైంది.
* 1997లో పార్లమెంట్‌ చట్టం ద్వారా ‘టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక ఛైర్మన్‌తో పాటు ముగ్గురు సభ్యులు ఉంటారు.
అధికారాలు - విధులు:
* టెలికాం సేవల వినియోగదారుల సమస్యలను పరిష్కరించి, అక్రమాలను నివారించడం. టెలీకమ్యూనికేషన్‌కు సంబంధించిన సర్వీసులను పర్యవేక్షించడం.
* టెలీకమ్యూనికేషన్‌ సేవలు, టారిఫ్‌ల నియంత్రణ, వివిధ సంస్థల మధ్య అభిలషణీయమైన పోటీని ప్రోత్సహించడం.
* టెలికాం ఛార్జీలను క్రమబద్ధీకరించి, వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించడం. 
* వివిధ టెలికాం సంస్థల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడం.


ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ ఖీ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా  (IRDAI) 
* పార్లమెంట్‌ చట్టం ద్వారా 1999లో ‘ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ని ఏర్పాటు చేశారు. ఇది జీవిత బీమా రంగంలో ప్రజలకు అందిస్తున్న సేవలను సమర్థవంతంగా పర్యవేక్షిస్తుంది. ఇందులో ఒక ఛైర్మన్, కొంతమంది సభ్యులు ఉంటారు. 
అధికారాలు - విధులు:
* భారత్‌లోని దేశీయ, విదేశీ ఇన్సూరెన్స్‌ రంగాలకి సంబంధించిన సంస్థలపై నియంత్రణ కలిగి ఉంటుంది.
* పాలసీదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తుంది. బీమా కంపెనీలకు, వినియోగదారులకు మధ్య వచ్చే వివాదాలను పరిష్కరిస్తుంది.
* ఇన్సూరెన్స్‌ కంపెనీలకు, మధ్యవర్తులకు అనుమతులు మంజూరు చేస్తుంది.
* చట్ట నిబంధనలను ఉల్లంఘించిన సంస్థల అనుమతులు/ లైసెన్స్‌లు రద్దుచేస్తుంది, జరిమానా విధిస్తుంది.


కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (Competition Commission of India) 
* భారతదేశ ఆర్థిక వ్యవస్థలో బలమైన మార్కెట్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం 1969లో లీళిగిశి చట్టాన్ని రూపొందించింది. 2002లో దాన్ని రద్దుచేసి, పార్లమెంట్‌ కంపెనీల చట్టం ద్వారా ‘కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా’ను ఏర్పాటు చేసింది. ఇందులో ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు.
అధికారాలు - విధులు:
* మార్కెట్‌ శక్తుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడం. స్వేచ్ఛా వాణిజ్య నిర్వహణకు అనువైన పరిస్థితులను కల్పించడం.
* వినియోగదారుల ప్రయోజనాలను పెంపొందించి, నూతన వాణిజ్య విధానాలపై అనుసరించాల్సిన విధివిధానాలను ప్రభుత్వానికి సిఫార్సు చేయడం.


సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌
* ఇది విద్యుత్‌ ఉత్పత్తి, విద్యుత్‌ శక్తి వినియోగం మొదలైన అంశాల్లో ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలను పర్యవేక్షిస్తుంది. దీన్ని భారత పార్లమెంట్‌ చట్టం ద్వారా 2003లో ఏర్పాటు చేశారు. ఇందులో ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు.
అధికారాలు - విధులు:
* విద్యుత్‌ ఉత్పత్తిలో పోటీతత్వాన్ని, పొదుపును పెంపొందించడం.
* విద్యుత్‌ ఛార్జీలను క్రమబద్ధీకరించడం, శాస్త్రీయ పద్ధతిలో వివిధ స్లాబుల ధరలను నిర్ణయించి, ప్రతిపాదించడం.
* విద్యుత్‌ కొనుగోలు, సరఫరా వ్యవహారాలను పర్యవేక్షించడం. విద్యుత్‌ ఉత్పత్తికి సంబంధించిన నూతన పరిశోధనలను ప్రోత్సహించడం. శాస్త్ర, సాంకేతికతను వినియోగించేలా కృషి చేయడం.
* దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య విద్యుత్‌ వ్యవహారాల్లో సమన్వయాన్ని సాధించడం.


సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (Central Pollution Control Board) 
* దేశంలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం 1974లో కాలుష్య నియంత్రణ చట్టాన్ని రూపొందించింది. దీని ద్వారా ‘‘సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌’’ ఏర్పాటైంది. దీనిలో ఛైర్మన్, కొంతమంది సభ్యులు ఉంటారు.
అధికారాలు - విధులు:
* జల, వాయు కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవడం. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం.
* భారీ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో పర్యావరణ సంబంధిత అంశాలను పరిశీలించడం. పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేయడం.
* కాలుష్య నియంత్రణకు వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని సాధించడం.

 

సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (SEBI)
* పార్లమెంట్‌ చట్టం ద్వారా 1992లో ‘సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా’ను ఏర్పాటు చేశారు. షేర్‌ మార్కెట్లలో అక్రమ వ్యాపార కార్యక్రమాలను నియంత్రించడం దీని ముఖ్య ఉద్దేశం.
* దీనిలో ఒక ఛైర్మన్, ఏడుగురు సభ్యులు ఉంటారు.
అధికారాలు - విధులు:
* దేశంలో ఆర్థిక కార్యకలాపాలు సాగించే మధ్యవర్తులు తప్పనిసరిగా దీనిలో నమోదు చేసుకోవాలి.
* సెక్యూరిటీ మార్కెట్లో పెట్టుబడిదారుల ప్రయోజనాలు సంరక్షించడం, బ్యాంకేతర ఆర్థిక సంస్థల  (Non Banking Financial Company - NBFC)  కార్యకలాపాలను పర్యవేక్షించడం, నియంత్రించడం.
* సెక్యూరిటీ మార్కెట్లో అక్రమ, మోసపూరిత వ్యాపారాలను అడ్డుకోవడం.
* సంస్థాగత ఇన్వెస్టర్లు, మ్యూచువల్‌ ఫండ్స్, సమష్టి పెట్టుబడిదారులను రిజిస్ట్రేషన్‌ ద్వారా నమోదు చేసుకొని, ఆర్థిక కార్యకలాపాలు సక్రమంగా జరిగేలా చేయడం.

 

బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా
* భారత పార్లమెంట్‌ 1961లో అడ్వకేట్స్‌ యాక్ట్‌ ద్వారా బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను ఏర్పాటు చేసింది. దేశంలో న్యాయవిద్యను మెరుగుపరచడం దీని లక్ష్యం. ఇందులో ఛైర్మన్, కొంతమంది సభ్యులు ఉంటారు.
అధికారాలు - విధులు:
* న్యాయ వ్యవస్థలో మెరుగైన పనితీరును పెంపొందించేందుకు కృషి చేయడం. న్యాయవాదుల వృత్తికి సంబంధించిన ప్రవర్తనా నియమావళిని రూపొందించడం.
* న్యాయవాదులుగా ప్రాక్టీసు చేయడానికి గుర్తింపు ఇవ్వడం. న్యాయ విద్యను ప్రోత్సహించి మెరుగైన ప్రమాణాలను సాధించడానికి కృషి చేయడం.
* న్యాయవాదుల హక్కులను, ప్రయోజనాలను పరిరక్షించడం.


ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌
* దేశంలో సాంకేతిక విద్యను మెరుగైన రీతిలో నిర్వహించడానికి పార్లమెంట్‌ చట్టం ద్వారా 1987లో ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో ఛైర్మన్, కొంతమంది సభ్యులు ఉంటారు.
అధికారాలు - విధులు:
* ఇంజనీరింగ్, ఫార్మసీ, కంప్యూటర్‌ విద్య, మేనేజ్‌మెంట్, ఉపాధ్యాయ విద్య మొదలైన వాటికి సంబంధించిన నూతన పరిశోధనల నిర్వహణ, నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించడం.
* సాంకేతిక విద్యాసంస్థల స్థాపనకు అనుమతులు మంజూరు చేయడం, గుర్తింపు ఇవ్వడం. సాంకేతిక విద్యలో నూతన పరిశోధనలను ప్రోత్సహించడం.
* నూతన కోర్సుల నిర్వహణకు అనుమతులు ఇవ్వడం, మారుతున్న కాలమాన పరిస్థితులకు తగ్గట్లు సిలబస్‌ను రూపొందించడం.

 

నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI)
* ‘నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా’ను  1988లో ఏర్పాటు చేశారు. ఇది దేశవ్యాప్తంగా రవాణా రంగంలో రహదారులను సమర్థంగా నిర్వహించి, పర్యవేక్షిస్తుంది. దీనిలో ఒక ఛైర్మన్, ఆరుగురు సభ్యులు ఉంటారు.
అధికారాలు - విధులు: 
* జాతీయ రహదారుల నిర్మాణం, నిర్వహణ, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి జాతీయ రహదారులను అభివృద్ధి చేయడం. టోల్‌ప్లాజాల నిర్వహణ, ఫీజుల వసూలుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించడం.
* జాతీయ రహదారులపై ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టడం, రహదారులకు రెండువైపులా చెట్లు పెంచి, సుందరీకరణ కార్యక్రమాలు చేపట్టడం.
* నూతన రహదారుల నిర్మాణంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కృషి చేయడం. రహదారుల నిర్మాణంలో వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని సాధించడం. నిర్మాణ రంగంలో నూతన పరిశోధనలు చేసి ప్రభుత్వానికి నివేదించడం.

Posted Date : 26-06-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

లా కమిషన్‌

దేశంలో న్యాయ పాలనను సమర్థవంతంగా నిర్వహించడానికి, సామాజిక న్యాయాన్ని ప్రజలందరికీ అందించడానికి, అవసరమైన అంశాలపై శాస్త్రీయ అధ్యయనాన్ని నిర్వహించి, తగు సూచనలు, సిఫార్సులు చేసేందుకు ‘లా కమిషన్‌’ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌ నేపథ్యం, నిర్మాణం, విధులపై పోటీ పరీక్షార్థులకు అవగాహన అవసరం.


నేపథ్యం

* మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు ఆంగ్లేయుల పాలనా కాలంలో చార్టర్‌ చట్టం  1833 ప్రకారం 1834లో లార్డ్‌ మెకాలే అధ్యక్షతన తొలిసారిగా లా  కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
* దీని తర్వాత 1853, 1861, 1879లలో వివిధ లా    కమిషన్‌లు ఏర్పాటయ్యాయి. వీటి సిఫార్సుల మేరకు మనదేశంలో 1859లో సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌; 1860లో ఇండియన్‌ పీనల్‌ కోడ్‌; 1861లో క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లను రూపొందించారు.


స్వాతంత్య్రానంతరం..

* స్వాతంత్య్రం తర్వాత మనదేశంలో మొదటి లా కమిషన్‌ను 1955లో ఎంసీ సెతల్‌వాడ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌ను కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీన్ని మూడేళ్లకోసారి పునర్‌వ్యవస్థీకరిస్తున్నారు.
* దేశంలో ఇప్పటి వరకు 21 లా కమిషన్‌లను ఏర్పాటు చేశారు.
* న్యాయ మంత్రిత్వశాఖకు సలహాదారుగా వ్యవహరించడం దీని ఉద్దేశం.
* ఈ కమిషన్‌లో ఛైర్మన్‌ (సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి), నలుగురు సభ్యులు ఉంటారు. 

 

20వ లా కమిషన్‌ - ప్రధాన సిఫార్సులు:

* ఎన్నికల సంస్కరణల అమలుపై 255వ నివేదికను కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు సమర్పించింది.
* ఉరిశిక్ష రద్దుకు సంబంధించి 262వ నివేదికలో కీలక సూచనలు చేసింది. దీని ప్రకారం ఉగ్రవాదం, దేశంపై యుద్ధం ప్రకటించడం మొదలైనవి మినహాయించి ఇతర అన్ని రకాల నేరాలకు ఉరిశిక్షను రద్దు చేయాలని పేర్కొంది.


21వ లా కమిషన్‌ - ప్రధాన సిఫార్సులు:

* ఇది తన 268వ నివేదికను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సమర్పించి, కింది సిఫార్సులు చేసింది.
* తప్పుచేసే న్యాయవాదులకు శిక్షలు విధించాలి. 
* న్యాయవాదులు సమ్మె చేయడం వల్ల కక్షిదారులకు నష్టం జరిగితే సంబంధిత న్యాయవాదులే పరిహారం చెల్లించాలి. ఈ అంశాల పర్యవేక్షణకు ఒక చట్టబద్ధ సంస్థను ఏర్పాటు చేయాలి.
* అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరు వివాహ వయోపరిమితులు లేకుండా, ఇద్దరికీ కనీస వివాహ వయసును 18 ఏళ్లుగా నిర్ణయించాలి.
* వివాహమైన దంపతుల్లో ఆస్తిని ఎవరు సమకూర్చినా దాన్ని వారి ఉమ్మడి ఆస్తిగానే పరిగణించాలి. వారు విడాకులు తీసుకుంటే స్త్రీకి సమాన వాటా ఇవ్వాలి. 
* క్రికెట్‌తో సహా ఇతర అన్ని క్రీడలపై బెట్టింగ్, జూదాన్ని చట్టబద్ధం చేయాలి.
* బెట్టింగ్‌ను చట్టబద్ధం చేశాక మ్యాచ్‌ ఫిక్సింగ్‌ మోసాలు జరగకుండా కఠినమైన నిబంధనలు రూపొందించాలి.


వేతన కమిషన్‌ (Pay Commission) 

* ప్రభుత్వ ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్రం వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తోంది.ఇది మారుతున్న కాల పరిస్థితులు, నిత్యావసర సరకుల ధరల పెరుగుదల ఆధారంగా ఉద్యోగులు, పింఛన్‌దార్ల వేతనాలు, ఇతర అంశాలపై అధ్యయనం చేసి  ప్రభుత్వానికి తగు సూచనలు చేస్తుంది.
* మనదేశంలో ఇప్పటివరకు 7 వేతన సవరణ కమిషన్‌లు ఏర్పాటయ్యాయి.

వేతన సవరణ సంఘం సంవత్సరం ఛైర్మన్‌
1వ 1946 శ్రీనివాస వరదాచారియార్‌
2వ 1957 జగన్నాథ్‌ దాస్‌
3వ 1970 రఘువీర్‌ దయాళ్‌
4వ 1983 పి.ఎన్‌.సింఘాల్‌
5వ 1994 రత్నవేల్‌ పాండ్యన్‌
6వ 2006 జస్టిస్‌ బి.ఎన్‌.శ్రీకృష్ణ
7వ 2014 జస్టిస్‌ ఎ.కె.మాథూర్‌

                

లా కమిషన్‌ విధులు
* కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వివిధ అంశాలపై అధ్యయనాలు నిర్వహించి, సంస్కరణలను సూచిస్తుంది. దేశంలో అమల్లో ఉన్న వివిధ చట్టాల పనితీరును అధ్యయనం చేస్తుంది.
* ఏదైనా విషయంలో సంస్కరణలు అవసరమని భావిస్తే కమిషన్‌ స్వయం పరిశీలన చేయొచ్చు. సమాజంలోని విభిన్న వర్గాల సామాజిక స్థితిగతులు, ఆచార సంప్రదాయాలను అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేస్తుంది.
* సామాజిక, రాజకీయ, న్యాయ అంశాలపై అభిలషణీయమైన నివేదికలు రూపొందించి, ప్రభుత్వానికి నివేదిస్తుంది.


వివిధ లా కమిషన్‌లు, ఛైర్మన్‌ల వివరాలు

లా కమిషన్‌ ఛైర్మన్‌ పదవీకాలం
1వ జస్టిస్‌ ఎంసీ సెతల్వాడ్‌ 1955-58
2వ జస్టిస్‌ వెంకట్రామ అయ్యర్‌ 1958-61
3వ జస్టిస్‌ జేఎల్‌ కపూర్‌ 1961-64
4వ జస్టిస్‌ జేఎల్‌ కపూర్‌ 1964-68
5వ జస్టిస్‌ కేవీకే సుందరం (ఐసీఎస్‌ అధికారి) 1968-71
6వ జస్టిస్‌ పీబీ గజేంద్ర గడ్కర్‌ 1971-74
7వ జస్టిస్‌ పీబీ గజేంద్ర గడ్కర్‌ 1974-77
8వ జస్టిస్‌ హెచ్‌ఆర్‌ ఖన్నా 1977-79
9వ జస్టిస్‌ పీవీ దీక్షిత్‌ 1979-80
10వ జస్టిస్‌ కేకే మాథ్యూ 1981-85
11వ జస్టిస్‌ డీఏ దేశాయ్‌ 1985-88
12వ జస్టిస్‌ ఎంపీ ఠక్కర్‌ 1988-91
13వ జస్టిస్‌ కేఎన్‌ సింగ్‌ 1991-94
14వ జస్టిస్‌ కే జయచంద్రారెడ్డి 1995-97
15వ జస్టిస్‌ బీపీ జీవన్‌రెడ్డి 1997-2000
16వ జస్టిస్‌ బీపీ జీవన్‌రెడ్డి
ఎం. జగన్నాథరావు
2000-01
2002-03
17వ  జస్టిస్‌ ఎం జగన్నాథరావు 2003-06
18వ జస్టిస్‌ ఏఆర్‌ లక్ష్మణ్‌ 2006-09
19వ జస్టిస్‌ పి వెంకట్రామిరెడ్డి 2009-12
20వ జస్టిస్‌ డీకే జైన్‌ (రాజీనామా చేశారు) 
జస్టిస్‌ అజిత్‌ ప్రకాశ్‌ షా

2012-13
2013-15

21వ జస్టిస్‌ బల్బీర్‌సింగ్‌ చౌహాన్‌ 2015-18

                         
నమూనా ప్రశ్నలు

1. 1834లో ఏర్పాటైన లా కమిషన్‌కు అధ్యక్షులుగా ఎవరు వ్యవహరించారు?

1) లార్డ్‌ మెకాలే         2) చార్లెస్‌ హాప్‌కిన్స్‌
3) థామస్‌ ఉడ్స్‌         4) ఎలిన్‌బరో


2. కిందివాటిలో సరికానిది ఏది?
1) సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ను 1859లో రూపొందించారు.
2) ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ను 1860లో రూపొందించారు.
3) క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ను 1861లో రూపొందించారు.
4) కామన్‌ సివిల్‌ కోడ్‌ను 1866లో రూపొందించారు.


3. మనదేశంలో స్వాతంత్య్రం తర్వాత 1955లో ఏర్పడిన మొదటి లా కమిషన్‌కు అధ్యక్షులుగా వ్యవహరించింది?
1) ఎన్‌.గోపాలస్వామి అయ్యంగార్‌
2) ఎం.సి.సెతల్‌వాడ్‌ 
3) శ్రీనివాస అయ్యంగార్‌  
4) వరదాచారి అయ్యర్‌


4. కిందివాటిలో సరైంది ఏది?
1) సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లా కమిషన్‌కు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.
2) సాధారణంగా మూడేళ్లకోసారి లా కమిషన్‌ను పునర్‌వ్యవస్థీకరిస్తారు.
3) మనదేశంలో ఇప్పటివరకు 21 లా కమిషన్‌లు తమ నివేదికలను సమర్పించాయి.
4) పైవన్నీ సరైనవే


5. వివిధ లా కమిషన్‌లు వాటి అధ్యక్షులకు సంబంధించి సరికానిది ఏది? 
1) 14వ లా కమిషన్‌ - జస్టిస్‌ కె.జయచంద్రారెడ్డి
2) 15వ లా కమిషన్‌ - జస్టిస్‌ బి.పి.జీవన్‌రెడ్డి
3) 16వ లా కమిషన్‌ - జస్టిస్‌ కె.ఎన్‌.సింగ్‌
4) 18వ లా కమిషన్‌ - జస్టిస్‌ ఎ.ఆర్‌.లక్ష్మణ్‌


6. 21వ లా కమిషన్‌కు అధ్యక్షులుగా ఎవరు నియమితులయ్యారు?
1) జస్టిస్‌ బల్బీర్‌సింగ్‌ చౌహాన్‌ 2) జస్టిస్‌ డి.కె.జైన్‌
3) జస్టిస్‌ పి.వెంకట్రామిరెడ్డి
4) జస్టిస్‌ అజిత్‌ ప్రకాశ్‌ షా

 

7. 21వ లా కమిషన్‌ సిఫార్సును గుర్తించండి.
1) న్యాయవాదుల సమ్మె వల్ల కక్షిదారులు నష్టపోతే, సంబంధిత న్యాయవాదులే పరిహారం చెల్లించాలి.
2) క్రికెట్‌తో సహా అన్ని క్రీడలపై బెట్టింగ్, జూదాన్ని చట్టబద్ధం చేయాలి.
3) ఉరిశిక్షను మరిన్ని రంగాలు/ నేరాలకు విస్తరించాలి.
4) 1, 2


8. 21వ లా కమిషన్‌ సిఫార్సులకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి.
1) అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరు వివాహ వయోపరిమితులు ఉండటం సరికాదు.
2) అమ్మాయిలు, అబ్బాయిల వివాహ వయోపరిమితి 18 సంవత్సరాలుగా ఉండాలి.
3) వివాహమైన దంపతుల్లో ఆస్తిని ఎవరు సంపాదించినా, దాన్ని వారి ఉమ్మడి ఆస్తిగానే పరిగణించాలి.
4) పైవన్నీ సరైనవే


9. ఉగ్రవాదం, దేశంపై యుద్ధం ప్రకటించడం లాంటి నేరాలు తప్ప, ఇతర అన్ని రకాల నేరాలకు ఉరిశిక్షను రద్దు చేయాలని 262వ నివేదికలో పేర్కొన్న లా  కమిషన్‌ ఏది?
1) 21వ లా కమిషన్‌     2) 20వ లా కమిషన్‌
3) 19వ లా కమిషన్‌     4) 18వ లా కమిషన్‌


10. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారుల జీతభత్యాలు, ఇతర అంశాలపై అధ్యయనం కోసం మనదేశంలో ఇప్పటి వరకు ఏర్పాటైన వేతన సవరణ కమిషన్‌లు?
1) 5       2) 6       3) 7       4) 8


11. వివిధ వేతన సవరణ కమిషన్‌లు, వాటి అధ్యక్షులకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి.
1) ఒకటో వేతన సవరణ కమిషన్‌ -   శ్రీనివాస వరదాచారియార్‌
2) రెండో వేతన సవరణ కమిషన్‌ -    రత్నవేల్‌ పాండ్యన్‌
3) ఆరో వేతన సవరణ కమిషన్‌ -   జస్టిస్‌ బి.ఎన్‌.శ్రీకృష్ణ
4) ఏడో వేతన సవరణ కమిషన్‌ -   జస్టిస్‌ ఎ.కె.మాథూర్‌


12. 20వ లా కమిషన్‌ ఎన్నికల సంస్కరణ అమలుపై కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు సమర్పించిన నివేదిక ఎన్నోది? 
1) 239వ నివేదిక          2) 251వ నివేదిక
3) 255వ నివేదిక          4) 265వ నివేదిక


సమాధానాలు: 1-1; 2-4; 3-2; 4-4; 5-3; 6-1; 7-4; 8-4; 9-2; 10-3; 11-2; 12-3.

Posted Date : 06-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ప్రభావం

1990వ దశకంలో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగంలో అనేక మార్పులు సంభవించాయి. అదే సమయంలో భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ నరసింహారావు 1991లో నూతన ఆర్థిక సంస్కరణలను అమలు చేశారు. దీంతో  మనదేశ పాలనా రంగంపై ఉదారీకరణ (Liberalization), ప్రైవేటీకరణ (Privatization), ప్రపంచీకరణ (Globalization) విధానాలు ప్రభావాన్ని చూపాయి.
 

మౌలికాంశాలు
* కఠినమైన పాలనా నిబంధనల సడలింపు, కనిష్ఠరాజ్యం, లైసెన్సింగ్‌ విధానాన్ని సరళతరం చేయడం.
* ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని తగ్గించి, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం.
* రూపాయి మారకం విలువను మార్కెట్‌ శక్తులు నిర్దేశించడం.
* పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని, పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంపొందించడం.
* ప్రభుత్వ నియంత్రణలో ఉండే రవాణా, రక్షణ, సమాచార రంగాల్లో ప్రైవేట్‌ వ్యక్తులకు అవకాశాలు కల్పించడం.
* బహుళజాతి సంస్థల ప్రవేశానికి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతివ్వడం.
* ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ మొదలైన సంస్థల సూచనలు, సంస్కరణలు అమలు చేయడం.
* సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇవ్వడం.
* ప్రపంచ దేశాల మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్యానికి అవకాశం కల్పించడం.
* సంస్థాగత సర్దుబాట్లను ప్రోత్సహించడం.
* సంక్షేమ రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడం, ప్రభుత్వంపై పరిమితులు విధించడం.


ఉదారీకరణ విధానం ప్రభావం
* 1991లో పీవీ నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఆర్థిక శాఖామంత్రిగా డా.మన్మోహన్‌ సింగ్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ప్రభుత్వం సరళీకృత ఆర్థిక విధానాలకు శ్రీకారం చుట్టింది. దీని ఫలితంగా మనదేశ పారిశ్రామిక, ద్రవ్య విధానాలు ప్రపంచ ధోరణులకు అనుకూలంగా మారాల్సిన అవసరం ఏర్పడింది.
* ప్రభుత్వ నియంత్రణలో ఉండే అనేక పరిశ్రమలు ప్రైవేట్‌ రంగం ఆధీనంలోకి వచ్చాయి. భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పోటెత్తాయి.
* వివిధ పరిశ్రమల స్థాపనకు అవసరమైన లైసెన్సింగ్‌ విధానాలను సరళతరం చేశారు. 
* నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేయడం, ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ ఉద్యోగులకు ‘స్వచ్ఛంద పదవీ విరమణ’ (VRS) మొదలైన సంస్కరణలతో దేశపాలనా రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. కార్పొరేట్‌ పాలన అనే నూతన ఒరవడి ప్రారంభమైంది.
* ‘ఆర్థిక వ్యవహారాలు, బడ్జెట్‌ నిర్వహణ బాధ్యతల చట్టం’ (Fiscal Responsibility and Budget Management - FRBM Act)ను రూపొందించి బడ్జెట్, ఆర్థిక నిర్వహణలపై హేతుబద్ధమైన ఆంక్షలు విధించారు. 
* ఈ చట్టం ద్వారా ద్రవ్యలోటును, ప్రణాళికేతర వ్యయాన్ని నియంత్రించి ఆర్థిక క్రమశిక్షణను సాధించే ప్రయత్నం చేశారు. ఈ చట్టం ప్రకారం దేశంలోని వివిధ రాష్ట్రాలు సేకరించే రుణాలు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 6% మించకూడదని నిర్దేశించారు.
* ఉదారీకరణ విధానం ఫలితంగా దేశంలోకి బహుళజాతి సంస్థలు ప్రవేశించాయి. ఇవి తమ కార్యకలాపాలను విస్తృతం చేశాయి. వీటికి అవసరమైన భూసేకరణను కూడా ప్రభుత్వం సులభతరం చేసింది.


ప్రపంచీకరణ ప్రభావం
* 1991లో సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమైంది. అగ్రరాజ్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ముగిసింది. ఆ సమయంలోనే తూర్పు యూరప్‌లో సామ్యవాదం క్షీణించి ప్రజాస్వామ్య ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. అనేక దేశాలు నూతన ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టాయి. ఈ అంశాలన్నీ ప్రపంచీకరణకు దారితీశాయి.
* ప్రపంచీకరణ కారణంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమయ్యాయి. దీని వల్ల ఎగుమతులు, దిగుమతులు, స్వేచ్ఛా వాణిజ్యం, విదేశీ ఉత్పత్తులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఉద్యోగులు, సాంకేతిక నిపుణుల వలసలు విస్తృతమయ్యాయి. ఫలితంగా పాలనలో ఆర్థిక, ద్రవ్య, పారిశ్రామిక, ఎగుమతి, దిగుమతి విధానాల్లో మార్పులు వచ్చాయి.
* ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ లాంటి సంస్థలు వివిధ దేశాలకు ఆర్థిక సాయం, రుణాలను మంజూరు చేసే సమయంలో కొన్ని షరతులు, నిబంధనలు విధించడం వల్ల ప్రభుత్వాల విధానాలు, పరిపాలనలో అనేక మార్పులు వస్తున్నాయి.
* 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)  ఏర్పాటైంది. ఇది ప్రపంచ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి కృషిచేస్తూ, వివిధ దేశాల పాలనా రంగంపై విశేష ప్రభావం చూపుతోంది.
* భారత్‌ 1995లో డబ్ల్యూటీఓలో సభ్యత్వం పొంది, అనేక వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసింది.
* వ్యాపారానికి సంబంధించిన మేధోసంపత్తి హక్కులు (Trade Related Intellectual Property Rights TRIPS) ద్వారా పరిశోధనలు, ఆవిష్కరణలకు రాయల్టీలు చెల్లించాలనే నియమాలు రూపొందించారు. ఇది దేశ పాలనా ప్రక్రియపై ప్రభావం చూపుతుంది.
* ప్రపంచీకరణ ఫలితంగా పాలనలో ‘సుపరిపాలన’ (Good governance) కీలకంగా మారింది. ఇందులో పారదర్శకత (Transparency), జవాబుదారీతనం (Accountability), మానవ హక్కులు(Human Rights), కార్మిక ప్రమాణాలు (Labour Standards), పర్యావరణ అంశాలపై సున్నితత్వం (Environmental Sensitivity) మొదలైనవి అంతర్భాగంగా ఉన్నాయి.
* ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చే వివిధ రకాల రాయితీలను ‘నగదు బదిలీ పేరు’తో (Cash transfer) ఇవ్వడం ప్రారంభించారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌ ధరలను, రూపాయి మారకం విలువను మార్కెట్‌ శక్తులు నిర్దేశించేలా ప్రభుత్వ పాలనా విధానాల్లో మార్పులు వచ్చాయి.
* కార్పొరేట్‌ పాలన (Corporate governance), ఎలక్ట్రానిక్‌ పాలన (e-governance)లు పాలనలో నూతన మార్పులకు నాంది పలికాయి. 
* పాలనలో లాభార్జన, జవాబుదారీతనం లక్ష్యాలుగా ‘కార్పొరేట్‌ పాలన’ కొనసాగుతోంది.
* ఎలక్ట్రానిక్‌ పాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్ఠంగా వినియోగించి వీడియో కాన్ఫరెన్స్‌లు, ఇంటర్నెట్, ఈ-మెయిల్‌ సేవలను అంతర్భాగంగా కొనసాగిస్తున్నారు.
* ప్రపంచీకరణతో బలమైన పౌరసమాజం అవతరించింది. పౌరులు తమ హక్కుల పరిరక్షణ పట్ల చైతన్యం పొంది, పాలనా విధానాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
* ప్రపంచీకరణ ఫలితంగా వివిధ దేశాల పాలనా రంగాలపై అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ప్రభావం పడింది. దీంతో సంక్షేమ రంగానికి ఇచ్చే ప్రాధాన్యం తగ్గింది. వివిధ వర్గాల వారికి ఇచ్చే సంక్షేమ, అభివృద్ధి పథకాలపై సబ్సిడీలను రద్దు చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిని తగ్గించారు. వివిధ రకాల వస్తు ఉత్పత్తులు, సేవలపై ధరల స్థిరీకరణ నిర్ణయాధికారం మార్కెట్‌ శక్తుల చేతుల్లోకి వెళ్లింది. ప్రభుత్వం అనేక ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంది.


 

ప్రైవేటీకరణ ప్రభావం
* స్వాతంత్య్రానంతరం 1948లో మిశ్రమ ఆర్థిక విధానం, 1956లో భారీ పారిశ్రామిక విధానం, 1977లో కుటీర పరిశ్రమల విధానాలను రూపొందించారు. ఇవన్నీ ప్రభుత్వ రంగ ఆధిపత్యాన్ని తెలిపాయి.
* ప్రభుత్వరంగంలో అలసత్వం, లోపభూయిష్ట విధానాలు, జవాబుదారీతనం లేకపోవడం, సరైన పర్యవేక్షణ కొరవడటం లాంటి కారణాల వల్ల ప్రభుత్వరంగ సంస్థలు సంక్షోభంలోకి వెళ్లాయి. దీంతో ఉత్పత్తి, ఉద్పాదకత సామర్థ్యం దెబ్బతిన్నాయి. ఫలితంగా ప్రభుత్వం 1991లో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టి, ప్రైవేటీకరణకు అనుమతిచ్చింది.
* నూతన పారిశ్రామిక విధానం ద్వారా ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతమైంది. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను గుర్తించి ప్రైవేటీకరించే ప్రక్రియను ఈ శాఖ మొదలుపెట్టింది.
* ప్రైవేటీకరణ ఫలితంగా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న పరిశ్రమల సంఖ్య గణనీయంగా తగ్గింది.
* ప్రభుత్వరంగంలో పాక్షిక ప్రైవేటీకరణ ప్రారంభమైంది. ప్రభుత్వ సేవలను ఒప్పంద ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల ద్వారా అందించే ప్రక్రియ మొదలైంది.
* ప్రభుత్వరంగంలోని కంప్యూటర్, సెక్యూరిటీ సేవలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు మరింత విస్తృతమయ్యాయి.
* 1969 నాటి ఏకస్వామ్య వ్యాపార నియమాల నిరోధక చట్టం  (MRTP Act) స్థానంలో 2002లో ‘కాంపిటీషన్‌ చట్టాన్ని’ తీసుకొచ్చారు. ప్రైవేట్‌ రంగాన్ని బలోపేతం చేయడం, స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం. అందుకోసమే కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ డియా అనే సంస్థను స్థాపించారు.
* దేశీయ ప్రైవేట్‌రంగం విదేశీ పరిశ్రమలతో నేరుగా సాంకేతిక, అవగాహన ఒప్పందాలను కుదుర్చుకునేందుకు అనుమతులు లభించాయి.
* ప్రైవేట్‌రంగ బలోపేతానికి అవసరమయ్యే మూలధన వస్తువులు, యంత్రాల దిగుమతికి సంబంధించి పన్ను రాయితీలు కల్పించారు.
* బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌ రంగాల్లో ప్రైవేటీకరణ ప్రక్రియ మరింత విస్తృతమైంది.
* దేశీయ, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ప్రైవేట్‌ రంగం ద్వారా ప్రభుత్వరంగ వాటాలను కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించారు. తద్వారా మార్కెట్‌ శక్తుల పోటీకి ప్రభుత్వ రంగాన్ని వదిలి, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారు. 

Posted Date : 17-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు

1. భారతదేశంలో మిశ్రమ ఆర్థిక విధానాన్ని దేని ద్వారా ప్రవేశపెట్టారు?
1) 1948 నాటి పారిశ్రామిక తీర్మానం
2) 1956 నాటి పారిశ్రామిక తీర్మానం
3) 1977 నాటి పారిశ్రామిక తీర్మానం
4) 1991 నాటి పారిశ్రామిక తీర్మానం


2. న్యాయమూర్తుల నియామక సమయంలో రాష్ట్రపతి ‘కొలీజియం’ సలహాను పొందాలని 1999లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ ధర్మాసనంలో ఉన్న న్యాయమూర్తుల సంఖ్య?
1) 7             2) 9          3) 11           4) 13


3. ప్రజా ప్రయోజనాల కోసం ప్రైవేట్‌ వ్యక్తుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే  తగినంత నష్టపరిహారం చెల్లించలేదనే కారణంతో సంబంధిత వ్యక్తులు న్యాయస్థానాలను ఆశ్రయించకూడదని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించారు? 
1) 3వ రాజ్యాంగ సవరణ చట్టం, 1952
2) 4వ రాజ్యాంగ సవరణ చట్టం, 1955
3) 7వ రాజ్యాంగ సవరణ చట్టం, 1956     
4) 16వ రాజ్యాంగ సవరణ చట్టం, 1963


4. కిందివాటిలో ఆర్డినెన్స్‌ జారీకి సంబంధించి సరైంది ఏది?
1) ఆర్టికల్‌ 123 ప్రకారం రాష్ట్రపతి జారీ చేస్తారు.
2) ఆర్టికల్‌ 213 ప్రకారం గవర్నర్‌ జారీ చేస్తారు.
3) ఆర్టికల్‌ 239(B) ప్రకారం కేంద్రపాలిత ప్రాంత లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జారీ చేస్తారు. 
4) పైవన్నీ


5. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వివాదాలను ‘న్యాయసమీక్ష’  (Judicial review) పరిధి నుంచి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు?
1) 24వ రాజ్యాంగ సవరణ చట్టం, 1971
2) 25వ రాజ్యాంగ సవరణ చట్టం, 1971
3) 29వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975
4) 39వ రాజ్యాంగ సరవణ చట్టం, 1975


6. 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976 ద్వారా రాజ్యాంగంలో చేసిన మార్పులకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.
1) రాజ్యాంగానికి  IV(A) అనే భాగాన్ని చేర్చి, దానిలో ప్రాథమిక విధులను పొందుపరిచారు.
2) రాజ్యాంగానికి XIV(A) అనే భాగాన్ని చేర్చి, దానిలో పరిపాలనా ట్రైబ్యునల్స్‌ను పేర్కొన్నారు.
3) ఆర్టికల్‌ 368 ప్రకారం పార్లమెంట్‌ చేసే రాజ్యాంగ సవరణ చట్టాలను న్యాయస్థానాల్లో సవాల్‌ చేయకూడదని నిర్దేశించారు.
4) పైవన్నీ 


7. కేశవానంద భారతి జు( స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న అంశాన్ని గుర్తించండి.
1) ప్రాథమిక హక్కులకు భంగం కలిగే విధంగా రాజ్యాంగాన్ని సవరించకూడదు.
2) న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తికి విఘాతం కలిగించకూడదు.
3) రాజ్యాంగమే సర్వోన్నతమైంది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదు.
4) పైవన్నీ


8. 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978ని ఏ ప్రధాని కాలంలో చేశారు? (ఆర్టికల్‌ 352 ప్రకారం దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి   విధించాలంటే కేంద్ర కేబినెట్‌ లిఖితపూర్వక సలహా తప్పనిసరి అని అందులో పేర్కొన్నారు.)
1) ఇందిరాగాంధీ           2) మొరార్జీదేశాయ్‌
3) చరణ్‌సింగ్‌            4) లాల్‌ బహదూర్‌ శాస్త్రి


9. షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ) ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించారు?
1) 50వ రాజ్యాంగ సవరణ చట్టం, 1984
2) 59వ రాజ్యాంగ సవరణ చట్టం, 1988
3) 77వ రాజ్యాంగ సవరణ చట్టం, 1995
4) 78వ రాజ్యాంగ సవరణ చట్టం, 1996


10. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ), షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ) ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొంటోంది?
1) ఆర్టికల్‌ 15(4)(A)           2) ఆర్టికల్‌ 16(4)(A) 
3) ఆర్టికల్‌  17(4)(A)         4) ఆర్టికల్‌  14(4)(B)


11. 1984లో 50వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎవరి ప్రాథమిక హక్కులను నియంత్రించే అధికారం పార్లమెంట్‌కు కల్పించారు?
1) విదేశీ రాయబారులు
2) ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులు
3) సాయుధ దళాలు
4) రాజకీయ పార్టీల నాయకులు


12. కిందివాటిలో 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978కి సంబంధించి సరైంది ఏది?
1) ఆర్టికల్స్‌ 19, 22, 30, 31(A), 31(C) లను సవరించారు.
2) ఆర్టికల్‌ 31లో పేర్కొన్న ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు.
3) ఆర్టికల్‌ 300్బత్శిలో ఆస్తిహక్కును సాధారణ చట్టబద్ధమైన హక్కుగా మార్చారు. 
4) పైవన్నీ


13. 1977లో ఆర్టికల్‌ 356 ద్వారా రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రాల్లో లేనివి?
1) మధ్యప్రదేశ్, ఉత్తర్‌ ప్రదేశ్, రాజస్థాన్‌
2) పంజాబ్, బిహార్, హిమాచల్‌ప్రదేశ్‌
3) మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు
4) పశ్చిమ్‌ బెంగాల్, ఒడిశా, హరియాణా


14. రాజ్‌మన్నార్‌ కమిటీని 1969లో  ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది? (కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం దీన్ని ఏర్పాటు చేశారు.)
1) తమిళనాడు      2) పశ్చిమ్‌ బెంగాల్‌
3) కేరళ              4) రాజస్థాన్‌


15. 1980లో ఆర్టికల్‌ 356 ద్వారా రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వాల్లో లేనివి?
1) తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌
2) కేరళ, బిహార్, అరుణాచల్‌ ప్రదేశ్‌
3) ఒడిశా, పంజాబ్, మధ్యప్రదేశ్‌
4) బిహార్, ఉత్తర్‌ ప్రదేశ్, రాజస్థాన్‌


16. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356ను 100 సార్లకు పైగా దుర్వినియోగం చేశారని ఏ కమిషన్‌ తన నివేదికలో పేర్కొంది?
1) రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌
2) సర్కారియా కమిషన్‌
3) ఎల్‌.ఎం.సింఘ్వీ కమిషన్‌
4) బి.పి.మండల్‌ కమిషన్‌


17. ‘బిహార్‌ రాష్ట్రంలో అమలు చేసిన భూసంస్కరణలు చెల్లుబాటు కావు’ అని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా ప్రకటించింది?
1) రామేశ్వర్‌ ఠాకూర్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌
2) కామేశ్వరి సింగ్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌
3) రాజ్‌ కుమార్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌
4) మేనకా గాంధీ Vs స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌.


18. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు లేదని, ఒకవేళ సవరించాలనుకుంటే నూతనంగా రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది?
1) గోలక్‌నాథ్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసు
2) కేశవానంద భారతి Vs స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసు
3) ఎస్‌.ఆర్‌.బొమ్మై Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు
4) రఘురాం దేశాయ్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు.


19. ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో జరిగిన బ్యాంకుల జాతీయీకరణకు సంబంధించి  కిందివాటిలో సరైంది?
1) 1969లో 14 ప్రైవేట్‌ వాణిజ్య బ్యాంక్‌లను జాతీయం చేశారు. 
2) 1980లో 6 ప్రైవేట్‌్ వాణిజ్య బ్యాంక్‌లను జాతీయం చేశారు.
3) 1984లో 7 ప్రైవేట్‌ వాణిజ్య బ్యాంక్‌లను జాతీయం చేశారు.
4) 1, 2 సరైనవి


20. 1970లో మాజీ స్వదేశీ సంస్థానాధీశులకు ఇస్తున్న రాజభరణాలను రద్దుచేస్తూ ఆర్డినెన్స్‌ను జారీచేసిన అప్పటి భారత రాష్ట్రపతి ఎవరు?
1) జాకీర్‌ హుస్సేన్‌    2) వి.వి.గిరి
3) ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌
4) జ్ఞానీ జైల్‌ సింగ్‌


21. ఆదేశిక సూత్రాల అమలు కోసం రాజ్యాంగానికి చేసే సవరణ చట్టాలను ఏ న్యాయస్థానంలోనూ సవాలు చేయకూదని, ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగంలో ఎక్కడ నిర్దేశించింది?
1) ఆర్టికల్‌ 368, సెక్షన్‌ 4
2) ఆర్టికల్‌ 369, సెక్షన్‌ 4 
3) ఆర్టికల్‌ 371, సెక్షన్‌ 4
4) ఆర్టికల్‌ 372, సెక్షన్‌ 4 


22. 1998లో కొలీజియం వ్యవస్థపై ఆర్టికల్‌ 143 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయ సలహా కోరిన అప్పటి భారత రాష్ట్రపతి ఎవరు?
1) శంకర్‌దయాళ్‌ శర్మ         2) కేఆర్‌ నారాయణన్‌
3) జ్ఞానీ జైల్‌ సింగ్‌          4) ఆర్‌ వెంకట్రామన్‌


23. పార్లమెంట్‌లో 121వ రాజ్యాంగ సవరణ బిల్లును దేనికోసం ప్రవేశపెట్టారు?
1) National judges appointment commission
2) Judjes appointment committe
3) Judiciary review commission
4) Judges action team

 

సమాధానాలు: 1-1; 2-2; 3-2; 4-4; 5-4; 6-4; 7-4; 8-2; 9-3; 10-2; 11-3; 12-4; 13-3; 14-1; 15-2; 16-1; 17-2; 18-1; 19-4; 20-2; 21-1; 22-2; 23-1.

Posted Date : 29-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు

భారత రాజ్యాంగం 1950, జనవరి 26న అమల్లోకి వచ్చింది. సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమన్వయాన్ని సాధించడం దీని ఉద్దేశం. స్వాతంత్య్రోద్యమ లక్ష్యాలు, ఆశయాలు, జాతీయ నాయకుల ఉదాత్త భావనల ఆధారంగా రాజ్యాంగాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఇది అనేక సమస్యలను, సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిపై పోటీ పరీక్షార్థులకు అవగాహన అవసరం.


ఆర్టికల్‌ 356 దుర్వినియోగం
* ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమై, పరిపాలన సక్రమంగా నిర్వహించడానికి వీలులేనప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్‌ 356ను ఉపయోగించి సంబంధిత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన/ రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ తమ స్వప్రయోజనాల కోసం, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలపై ఈ ఆర్టికల్‌ను ప్రయోగిస్తుంది. ఇలా ఇది దుర్వినియోగం అవుతుంది. దీనివల్ల ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది.
* ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్టికల్‌ 356ను వ్యతిరేకించిన పార్టీలే, అధికారం చేపట్టాక దాని సాయంతోనే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను నిర్వీర్యం చేస్తున్నాయి.
* 1977లో కేంద్రంలో మొరార్జీదేశాయ్‌ నేతృత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ సమయంలో రాష్ట్రపతిగా ఉన్న బి.డి.జెట్టి (తాత్కాలిక రాష్ట్రపతి) ద్వారా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న 9 రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్టికల్‌ 356ను ప్రయోగించి, వాటిని రద్దు చేశారు. ఈ విధంగా మధ్యప్రదేశ్, ఉత్తర్‌ ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, బిహార్, హిమాచల్‌ ప్రదేశ్, హరియాణా, పశ్చిమ్‌ బంగా, ఒడిశా ప్రభుత్వాలు రద్దయ్యాయి.
* 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పటి భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ద్వారా ఆర్టికల్‌ 356ను ప్రయోగించి 9 కాంగ్రెస్‌ఏతర రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేసింది. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, పంజాబ్, మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తర్‌ ప్రదేశ్, రాజస్థాన్‌ ప్రభుత్వాలు అందులో ఉన్నాయి.
* ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు రాజకీయ కక్ష సాధింపుల కారణంగా రద్దవడం రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాల్‌గా పేర్కొనవచ్చు. ఇది కేంద్ర, రాష్ట్ర సంబంధాలకు విఘాతం కలిగిస్తుంది.
* డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆర్టికల్‌ 356ను రాష్ట్ర ప్రభుత్వాల పాలిట చావు ఉత్తర్వుగా పేర్కొన్నారు.
* 1969లో తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజమన్నార్‌ కమిటీ, 1977లో పశ్చిమ్‌ బంగా ప్రభుత్వం రూపొందించిన మెమొరాండం ఆర్టికల్‌ 356ను రాజ్యాంగం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశాయి.


సుప్రీంకోర్టు తీర్పులు
ఎస్‌.ఆర్‌.బొమ్మై Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (1994): రాష్ట్రపతి పాలన విధింపును న్యాయస్థానాల్లో సవాల్‌ చేయొచ్చని, ఇది న్యాయ సమీక్షకు అతీతం కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. భారత సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఆర్టికల్‌ 356ను ప్రయోగించకూడదని, రాష్ట్రపతి పాలన విధింపును న్యాయస్థానం తిరస్కరిస్తే రద్దయిన రాష్ట్ర ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.


గడియారం ముల్లును వెనక్కి తిప్పండి:
* అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఆర్టికల్‌ 356ను ప్రయోగించి, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుచేయడం రాజ్యాంగ విరుద్ధమని, అది చెల్లుబాటు కాదని 2016, జులై 13న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా అరుణాచల్‌ ప్రదేశ్‌లో గడియారం ముల్లును వెనక్కి తిప్పాల్సిందేనని, రాష్ట్ర ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని ఆదేశించింది.
* 2002లో జస్టిస్‌ ఎం.ఎన్‌.వెంకటాచలయ్య అధ్యక్షతన ఏర్పాటైన రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌ తన నివేదికను  ప్రభుత్వానికి సమర్పించింది. అందులో మనదేశంలో ఆర్టికల్‌ 356ను వంద సార్లకు పైగా దుర్వినియోగం చేశారని, ఇది సరైన విధానం కాదని పేర్కొంది.

 

శాసన - న్యాయ శాఖల మధ్య వివాదం
* శాసన - న్యాయ శాఖల మధ్య తరచూ వివాదాలు రావడం, ఒక శాఖపై మరొకటి ఆధిపత్య ధోరణికి ప్రయత్నించడం, న్యాయ శాఖ అతిక్రియాశీలత మొదలైనవి రాజ్యాంగం కొత్తగా ఎదుర్కొంటున్న సవాళ్లు.


సుప్రీంకోర్టు తీర్పులు
కామేశ్వరి సింగ్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ కేసు: 
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ ‘బిహార్‌లో అమలు చేసిన భూ సంస్కరణలు చెల్లుబాటు కావు’ అని ప్రకటించింది. దీంతో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చట్టం చేసింది. రాజ్యాంగానికి 9వ షెడ్యూల్‌ను చేర్చి, అందులో భూసంస్కరణల చట్టాలను పొందుపరిచింది. ఈ షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాలపై న్యాయస్థానాలకు ‘న్యాయసమీక్ష అధికారం’ లేకుండా చేశారు. దీని ద్వారా శాసన వ్యవస్థ సుప్రీంకోర్టు తీర్పును అధిగమించే ప్రయత్నం చేసింది.


గోలక్‌ నాథ్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసు (1967): 
* ‘‘ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు లేదు. సాధారణ చట్టాలతో పాటు రాజ్యాంగ సవరణ చట్టాలను కూడా న్యాయసమీక్ష చేస్తాం. ప్రాథమిక హక్కులను పార్లమెంట్‌ సవరించాలంటే కొత్తగా రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేయాలి’’ అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని అధిగమించేందుకు ఇందిరాగాంధీ ప్రభుత్వం 1971లో 24వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఇందులో ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ అంశాన్ని అయినా సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉందని పేర్కొంది.


ఆర్‌.సి.కూపర్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు - కీలక అంశాలు:
* ఇందిరాగాంధీ ప్రభుత్వం 1969లో 14 ప్రైవేట్‌ వాణిజ్య బ్యాంకులను జాతీయం చేసింది. దీనికోసం రూపొందించిన చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. 1970లో మాజీ స్వదేశీ సంస్థానాధీశులకు ఇస్తున్న రాజభరణాలను రద్దుచేస్తూ అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి ఆర్టికల్‌ 123 ప్రకారం ఆర్డినెన్స్‌ను జారీచేశారు. దీన్ని సుప్రీంకోర్టు రద్దుచేసింది. 
* సుప్రీంకోర్టుపై ఆధిపత్యాన్ని సాధించేందుకు పార్లమెంట్‌ 1971లో 25, 26వ రాజ్యాంగ సవరణ చట్టాలను రూపొందించింది.
* 25వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రైవేట్‌ ఆస్తుల జాతీయీకరణ కోసం పార్లమెంట్‌ రూపొందించిన చట్టాలను న్యాయస్థానాల్లో సవాల్‌ చేయకూడదని నిర్దేశించారు.
* 26వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ‘‘రాజభరణాల రద్దు’’ అంశానికి చట్టబద్ధత కల్పించారు.
* ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది. దీని ద్వారా ఆర్టికల్‌ 368కి 4వ సెక్షన్‌ను చేర్చారు. ఆదేశిక సూత్రాల అమలు కోసం రాజ్యాంగానికి చేసే సవరణలను ఏ న్యాయస్థానంలోనూ సవాల్‌ చేయకూడదని నిర్దేశించారు.


మినర్వామిల్స్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (1980):
* ఈ కేసులో సుప్రీంకోర్టు  తీర్పు ఇస్తూ పార్లమెంట్‌ ఆర్టికల్‌ 368కి చేర్చిన 4వ సెక్షన్‌ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని, అది చెల్లుబాటు కాదు అని పేర్కొంది. ప్రాథమిక హక్కులు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని ప్రకటించింది.

 

రాష్ట్రపతి పాలన - ప్రభావం
* ఏదైనా రాష్ట్రంలో కేంద్రం ఆర్టికల్‌ 356ను విధిస్తే కింది మార్పులు సంభవిస్తాయి.
* రాష్ట్ర జాబితాలోకి కేంద్ర ప్రభుత్వం చొచ్చుకు వస్తుంది. రాష్ట్ర పాలనకు అవసరమైన శాసనాలను పార్లమెంట్‌ రూపొందిస్తుంది.
* రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి రద్దవుతుంది.
* రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తారు లేదా సుప్తచేతనావస్థ (సస్పెన్షన్‌)లో ఉంచుతారు. రద్దు చేస్తే 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి. సస్పెన్షన్‌లో ఉంచితే తిరిగి పునరుద్ధరించాలి.
* రాష్ట్ర వాస్తవ కార్యనిర్వహణాధికారిగా గవర్నర్‌ వ్యవహరిస్తారు. ఈయనకు పాలనలో సహకరించేందుకు కేంద్రం ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌లను నియమిస్తుంది.
* హైకోర్టు అధికారాల్లో ఎలాంటి మార్పులు ఉండవు.


న్యాయమూర్తుల నియామకం - కొలీజియం వ్యవస్థ

సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్స్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (1993):
* సుప్రీంకోర్టు - హైకోర్టుల ప్రధాన, ఇతర న్యాయమూర్తులను నియమించే సమయంలో రాష్ట్రపతి తప్పనిసరిగా ప్రధాన న్యాయమూర్తిని ్బదిరిఖ్శి కొలీజియంగా సంప్రదించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 1998లో అప్పటి రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ కొలీజియంపై సుప్రీంకోర్టును న్యాయసలహా కోరారు.
* 1999లో 9 మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ‘‘కొలీజియం’’పై తీర్పును వెలువరిస్తూ కింది అంశాలను పేర్కొంది.
* కొలీజియం అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరో నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన బృందం.
* న్యాయమూర్తులను నియమించేటప్పుడు రాష్ట్రపతి తప్పనిసరిగా కొలీజియం సలహాను పాటించాలి.
* సుప్రీంకోర్టు తీర్పును అధిగమించేందుకు డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో 120వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. దీని ద్వారా  “Judges Appoiontment Committee - JAC” ను ఏర్పాటు చేయాలని ప్రయత్నించి విఫలమైంది.


NJAC ఏర్పాటు
* మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 120వ రాజ్యాంగ సవరణ బిల్లును నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపసంహరించింది. 121వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి  “National Judges Appointment Commission - NJAC” ను ఏర్పాటు చేయాలని భావించింది. దీన్ని పార్లమెంట్‌ 2/3 వంతు సభ్యుల ప్రత్యేక మెజార్టీతో ఆమోదించడంతో పాటు, దేశంలోని 15 రాష్ట్రాల శాసనసభలు కూడా ఆమోదించాయి. దీనికి 2014, డిసెంబరులో రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది. దీంతో ఇది 99వ రాజ్యాంగ సవరణ చట్టం - 2014గా మారింది.
* ఈ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు-హైకోర్టుల ప్రధాన, ఇతర న్యాయమూర్తుల నియామకంలో రాష్ట్రపతి ‘‘కొలీజియం వ్యవస్థ’’కు బదులుగా NJACని సంప్రదించాలి.


సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ ఆన్‌రికార్డ్స్‌ Vs  యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (2015):
* ఈ కేసులో సుప్రీంకోర్టు 2015, అక్టోబరు 16న తీర్పు ఇచ్చింది. విరితిది ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని, అది చెల్లుబాటు కాదని ప్రకటించింది. దీంతో న్యాయమూర్తుల నియామకం విషయంలో రాష్ట్రపతి భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ‘‘కొలీజియం’’ వ్యవస్థ సలహాను పాటించాల్సి వచ్చింది. 

Posted Date : 05-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ముఖ్యమంత్రి - రాష్ట్ర మంత్రిమండలి

సమస్తం.. సమున్నతం!

  రాష్ట్ర ప్రభుత్వ పాలన, ప్రజా సంక్షేమం, పురోగతి పూర్తిగా మంత్రిమండలి పరిధిలోనే ఉంటుంది. అందులో ఒకరు నాయకులై నిర్దేశిస్తే, సలహాలు-సూచనలతో సభ్యుల బృందం సమష్టిగా యంత్రాంగాన్ని నడిపిస్తుంది. ఆ నిర్ణయాలకు తిరుగు ఉండదు. అధికారానికి అడ్డులేదు. విధానాల రూపకల్పన నుంచి శాంతిభద్రతల పరిరక్షణ వరకు సమస్త విషయాల్లోనూ వాస్తవ అధికారంతో సమున్నత పాలనాకేంద్రంగా క్యాబినెట్‌ వ్యవహరిస్తుంది. రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఆ అంశాల గురించి పోటీ పరీక్షల అభ్యర్థులు అవగాహన కలిగి ఉండాలి. 

 

  రాష్ట్ర ప్రభుత్వానికి వాస్తవ అధిపతి ముఖ్యమంత్రి. ఆ పదవిని చేపట్టే వారి సమర్థత, పనితీరు, వ్యక్తిత్వంపై ప్రగతి ఆధారపడి ఉంటుంది. ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రిమండలికి నాయకుడిగా వ్యవహరిస్తూ, పరిపాలనను నిర్వహిస్తారు.

 

రాజ్యాంగ వివరణ: భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో ఆర్టికల్స్‌ 163, 164, 167 ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రిమండలి (క్యాబినెట్‌) గురించి వివరిస్తాయి. జాతీయ స్థాయిలో ఉన్నట్లే, రాష్ట్రస్థాయిలో కూడా పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని  రాజ్యాంగ నిర్మాతలు ప్రవేశపెట్టారు. ఆ ప్రకారం రాష్ట్రస్థాయిలో రాష్ట్రాధినేత అయిన గవర్నర్‌కు నామమాత్రపు కార్యనిర్వాహక అధికారాలు ఉంటే, ప్రభుత్వాధినేత అయిన ముఖ్యమంత్రికి వాస్తవ కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి.

 

ఆర్టికల్, 163(1): గవర్నర్‌కు పరిపాలనలో సహకరించేందుకు ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్ర మంత్రిమండలి ఉంటుంది.

 

ఆర్టికల్, 163(2): ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి పదవీకాలం గవర్నర్‌/విధానసభవిశ్వాసం ఉన్నంత వరకు కొనసాగుతుంది.

ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి కింది కారణాల వల్ల పదవి కోల్పోతుంది.

* విధానసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం ఓడిపోయినప్పుడు.

* విధానసభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు.

* విధానసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తిరస్కరణకు గురైనప్పుడు.

* విధానసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లులు తిరస్కరణకు గురైనప్పుడు.

* విధానసభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన కోత తీర్మానాలు నెగ్గినప్పుడు.

* విధానసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఓడిపోయినప్పుడు.

* ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి మరణించినా, పదవికి రాజీనామా చేసినా, ఆ వ్యక్తిని పదవి నుంచి తొలగించినా మొత్తం మంత్రిమండలి రద్దవుతుంది.

 

నియామకాలు

ఆర్టికల్‌ 164(1): విధానసభకు జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత సగం కంటే ఎక్కువ స్థానాలు గెలుపొందిన రాజకీయ పార్టీ నాయకుడిని/రాజకీయ పార్టీల కూటమి నాయకుడిని ముఖ్యమంత్రిగా గవర్నర్‌ నియమిస్తారు. ముఖ్యమంత్రి సిఫారసుల మేరకు మంత్రివర్గ సహచరులను నియమిస్తారు.

 

ఆర్టికల్‌ 164(2): ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి వ్యక్తిగతంగా గవర్నర్‌కు బాధ్యత వహిస్తారు.

 

ఆర్టికల్‌ 164(3): ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి విధానసభకు సమష్టిగా బాధ్యత వహింస్తుంది.

 

ఆర్టికల్‌ 164(4): ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి సభ్యులు గవర్నర్‌ సమక్షంలో పదవీ ప్రమాణస్వీకారం చేస్తారు.

 

ఆర్టికల్‌ 164(5): ముఖ్యమంత్రిగా/రాష్ట్ర మంత్రిగా నియమితులు కావాలంటే శాసనసభలో సభ్యత్వం ఉండాలి. ఒకవేళ సభ్యత్వం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా/రాష్ట్ర మంత్రిగా నియమితులైతే 6 నెలల్లోగా శాసనసభలో సభ్యత్వం పొందాలి. లేకపోతే వారు పదవిని కోల్పోతారు.

 

ఆర్టికల్‌ 164(6): ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి జీతభత్యాలను రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుంది.

 

ఆర్టికల్‌ 167(1): రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన మంత్రివర్గ నిర్ణయాలను, మంత్రిమండలి జరిపిన తీర్మానాలను గవర్నర్‌కు ముఖ్యమంత్రి తెలియజేయాలి.

 

ఆర్టికల్‌ 167(2): రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన సమాచారాన్ని తనకు తెలియజేయాలని గవర్నర్‌ ముఖ్యమంత్రిని కోరవచ్చు. గవర్నర్‌కు, రాష్ట్ర మంత్రిమండలికి మధ్య సంధానకర్తగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు.

 

ఆర్టికల్‌ 167(3): గవర్నర్‌ ఆమోదం కోసం ఏదైనా బిల్లు/ తీర్మానం వచ్చినప్పుడు దాన్ని మొత్తం మంత్రిమండలి సమగ్రంగా పరిశీలించలేదని గవర్నర్‌ భావిస్తే సంబంధిత బిల్లు/ తీర్మానాన్ని మంత్రిమండలి పునఃపరిశీలనకు పంపవచ్చు. మంత్రిమండలి సంబంధిత బిల్లు/ తీర్మానాన్ని పునఃసమీక్షించి/సమీక్షించకుండా రెండోసారి గవర్నర్‌ ఆమోదముద్రకు పంపితే, తప్పనిసరిగా ఆమోదించాలి. 

 

ముఖ్యమంత్రి అధికారాలు - విధులు

* రాష్ట్ర ప్రభుత్వానికి అధిపతిగా వ్యవహరిస్తారు.

* రాష్ట్ర మంత్రిమండలి ఏర్పాటులో తిరుగులేని అధికారాన్ని కలిగి ఉంటారు. తన పార్టీలో లేదా సంకీర్ణ ప్రభుత్వమైతే భాగస్వామ్య పార్టీల్లో కొందరు సభ్యులను ఎంపిక చేసుకుని వారి పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేసి, వారు మంత్రులుగా నియమితులయ్యే విధంగా చూస్తారు. మంత్రులకు మంత్రిత్వ శాఖల కేటాయింపు, మంత్రిమండలి పునర్‌ వ్యవస్థీకరణకు సంబంధించిన అంశాలపై గవర్నర్‌కు సలహా ఇస్తారు. రాష్ట్ర మంత్రిమండలికి అధ్యక్షత వహిస్తారు. మంత్రిమండలి సమావేశాల అజెండాను నిర్దేశిస్తారు.

* శాసనసభకు ముఖ్యమంత్రి నాయకత్వం వహిస్తారు.  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలు, కార్యక్రమాలను శాసనసభలో ప్రకటిస్తారు. శాసనసభ సమావేశాల్లో, శాసనసభ బయట ముఖ్యమంత్రి చేసే ప్రకటనలకు ఎంతో ప్రభావం ఉంటుంది.

* రాష్ట్ర పరిపాలనకు సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. మంత్రిమండలికి, గవర్నర్‌కు మధ్య వారధిగా ఉంటారు. 

పదవీరీత్యా కింద పేర్కొన్న సంస్థల్లో ముఖ్యమంత్రి సభ్యులుగా ఉంటారు.

* జాతీయ అభివృద్ధి మండలి

* జాతీయ సమగ్రతా మండలి

* నీతి ఆయోగ్‌ 

* జాతీయ జనాభా కమిషన్‌

* అంతర్‌ రాష్ట్ర మండలి

* జోనల్‌ కౌన్సిల్‌ (ప్రాంతీయ మండలి)

* రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

 

రాష్ట్ర మంత్రిమండలి

రాష్ట్ర మంత్రిమండలిలో ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ఉంటారు.

* ఆర్టికల్‌ 164(1)(ఎ) ప్రకారం రాష్ట్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య విధానసభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించకూడదు. చిన్న రాష్ట్రాల్లో మంత్రుల సంఖ్య 12 మంది కంటే తక్కువ ఉండకూడదు.

* ఆర్టికల్‌ 164(1)(బి) ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హులైన శాసనసభ్యులను ఎలాంటి లాభదాయక పదవిలోనూ నియమించకూడదు.

* ఆర్టికల్స్‌ 164 (1)(ఎ), 164(1)(బి)లను 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా (2003) రాజ్యాంగానికి చేర్చారు.

 

మంత్రిమండలి - అధికారాలు, విధులు

 

ప్రభుత్వ విధానాల రూపకల్పన: రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విధానాలను రూపొందించి, అమలుచేసే బాధ్యత ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రిమండలికి ఉంటుంది. ప్రజల సంక్షేమం కోసం రూపొందించే విధానాలపై మంత్రిమండలి లోతుగా చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటుంది.


రాష్ట్ర పరిపాలన: రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనను రాష్ట్ర మంత్రిమండలి నిర్వహిస్తుంది. ప్రభుత్వ విధానాల ప్రకారం శాసనసభ ఆమోదించిన తీర్మానాలను అనుసరించి మంత్రివర్గ సభ్యులు పరిపాలన సాగిస్తారు. ప్రతి మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒకటి లేదా అంతకుమించిన శాఖల పరిపాలనపై నియంత్రణ, బాధ్యత కలిగి ఉంటారు.


సమన్వయ సాధన:  రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల మధ్య మంత్రిమండలి సమన్వయాన్ని పెంపొందిస్తుంది. ఒకవేళ మంత్రుల మధ్య సమన్వయం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన లోపభూయిష్టంగా మారుతుంది. రాష్ట్ర మంత్రిమండలి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రులంతా ఏకగ్రీవంగా ఆమోదించి, అమలు చేస్తారు.


శాంతి భద్రతల పరిరక్షణ: ఇది రాష్ట్ర జాబితాలోని అంశం. ప్రజల ప్రాణాలను పరిరక్షించి శాంతిభద్రతలను నెలకొల్పడం, సాధారణ ప్రజానీకం శాంతియుత సహజీవనాన్ని సాగించే విధంగా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.

 

శాసన నిర్మాణంలో పాత్ర: రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన శాసనాల రూపకల్పనలో రాష్ట్ర మంత్రిమండలి కీలకపాత్ర పోషిస్తుంది. రాష్ట్ర శాసనసభ సమావేశాలకు సంబంధించిన విషయాలన్నింటినీ మంత్రిమండలి నిర్ణయిస్తుంది. శాసనసభలో మెజార్టీ సభ్యుల మద్దతు ఉన్నంతకాలం మంత్రిమండలి శాసనాల రూపకల్పనలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. శాసనసభ సమావేశాల తేదీల నిర్ణయం, సమావేశాల ప్రారంభం, కొనసాగింపు, దీర్ఘకాలిక వాయిదాలకు సంబంధించిన విషయాలపై రాష్ట్ర మంత్రిమండలి గవర్నర్‌కు సలహాలిస్తుంది.

 

నియామక అధికారాలు: రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులందరినీ గవర్నర్‌ పేరుతో మంత్రిమండలి నియమిస్తుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి అభీష్టం చెల్లుబాటవుతుంది. మంత్రిమండలి ద్వారా జరిగే నియామకాల్లో అడ్వకేట్‌ జనరల్, విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లు, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్, సభ్యులు, లోకాయుక్త, ఉపలోకాయుక్త మొదలైన కీలక పదవులు ఉంటాయి.

 

సమష్టి బాధ్యతా సూత్రాన్ని పాటించడం: ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర శాసనసభ/ విధానసభకు సమష్టి బాధ్యత వహించాల్సి ఉంటుంది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన అన్ని విషయాల్లో రాష్ట్ర మంత్రిమండలి ఒక సమష్టి జట్టుగా వ్యవహరిస్తుంది. శాసనసభలో విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే రాష్ట్ర మంత్రిమండలి కొనసాగుతుంది.

 

గవర్నర్‌కు వ్యక్తిగత బాధ్యతను వహించడం: రాష్ట్ర మంత్రిమండలి సభ్యులందరూ తమ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన వ్యవహారాలపై గవర్నర్‌కు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగించే ఉపన్యాస సారాంశాన్ని మంత్రిమండలి రూపొందిస్తుంది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన సలహాలు, సహాయాన్ని గవర్నర్‌కు అందిస్తుంది.

 

ఆర్థికపరమైన విధులు: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలపై మంత్రిమండలికి నియంత్రణ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ విత్త విధానాన్ని మంత్రిమండలి నిర్ణయిస్తుంది. రాష్ట్ర ప్రగతికి అవసరమైన వ్యవసాయ విధానం, పారిశ్రామిక విధానం, విద్యావిధానం, ప్రణాళికల రూపకల్పన మొదలైన బాధ్యతలను మంత్రిమండలి నిర్వహిస్తుంది. శాసనసభ ఆమోదించిన వార్షిక బడ్జెట్‌ కేటాయింపుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అమలుచేస్తుంది.

 

కొన్ని ముఖ్యాంశాలు 

* తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి - కె. చంద్రశేఖర్‌రావు (టీఆర్‌ఎస్‌)

* దేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రి - సుచేత కృపలానీ (ఉత్తర్‌ప్రదేశ్‌) (ఐఎన్‌సీ) 

* దేశంలో రెండో మహిళా ముఖ్యమంత్రి - నందినీ శతపతి (ఒడిశా) (ఐఎన్‌సీ)

* మొదటి కాంగ్రెసేతర మహిళా ముఖ్యమంత్రి - శశికళా గురుదత్‌ కకోద్కర్‌ (గోవా) (మహారాష్ట్ర గోమంతక్‌ పార్టీ)

* దక్షిణాదిలో తొలి మహిళా ముఖ్యమంత్రి - జానకీ రామచంద్రన్‌ (తమిళనాడు) (ఏఐఏడీఎంకే)

* ఈశాన్య రాష్ట్రాల్లో తొలి మహిళా ముఖ్యమంత్రి - సయ్యద్‌ అన్వర్‌ తైమూర్‌ (అస్సాం) (ఐఎన్‌సీ)

* దేశంలో తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి - మాయావతి (ఉత్తర్‌ప్రదేశ్‌) (బీఎస్పీ)

* దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి - దామోదరం సంజీవయ్య (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌)

* దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించినవారు - పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ (25 ఏళ్లు) (సిక్కిం)

* అతి తక్కువకాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించింది - జగదాంబికా పాల్‌ (2 రోజులు) (ఉత్తర్‌ప్రదేశ్‌)

* పదవిలో ఉండగా మరణించిన తొలి ముఖ్యమంత్రి - షేక్‌ అబ్దుల్లా (జమ్ము-కశ్మీర్‌)

* రాష్ట్ర శాసనసభలో ‘సీఎం అవర్‌’ను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి - దిగ్విజయ్‌ సింగ్‌ (మధ్యప్రదేశ్‌)

* హైదరాబాద్‌ రాష్ట్రానికి తొలి, చివరి ముఖ్యమంత్రి - బూర్గుల రామకృష్ణారావు

* ప్రస్తుతం పదవిలో ఉన్న మహిళా ముఖ్యమంత్రి - మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్‌)

* శాసనసభలో సభ్యత్వం లేకుండా ముఖ్యమంత్రి పదవిని చేపట్టి, తర్వాత జరిగిన శాసనసభ ఉప ఎన్నికల్లో ఓడిపోయి పదవి కోల్పోయినవారు - త్రిభువన్‌ నారాయణ్‌ సింగ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌),  శిబూ సోరెన్‌ (ఝార్ఖండ్‌)

 

రచయిత: బంగారు సత్యనారాయణ 

Posted Date : 29-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాష్ట్ర శాసనసభ

విధాన నిర్ణయాల విశిష్ట వేదిక!

  ఒక శాసనం ప్రజల అవసరాలను ప్రతిబింబిచాలి. సంక్షేమాన్ని కాంక్షించాలి. అందుకోసం ఎన్నో సమాలోచనలు సాగాలి. చర్చలు జరగాలి. అందరి అభిప్రాయాలు వ్యక్తం కావాలి. సమతౌల్యత సాధించాలి. అంతిమంగా అత్యుత్తమైన నిర్ణయం వెలువడాలి. ఈ ప్రక్రియకు జాతీయస్థాయిలో పార్లమెంటు, రాష్ట్రంలో శాసనసభ ఉన్నాయి. రాష్ట్రస్థాయిలో ప్రధానంగా విధానసభ అలాంటి విధాన నిర్ణయాలకు విశిష్ట వేదికగా నిలిచింది. ఆ అత్యున్నత సభ నిర్మాణం, సభ్యుల ఎన్నిక, ఇతర రాజ్యాంగపరమైన అంశాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

 

రాష్ట్రస్థాయిలో రాష్ట్రానికి అవసరమైన శాసనాలను రూపొందించే అత్యున్నత వ్యవస్థ శాసన సభ. ఇది రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ, ప్రజాస్వామ్య విధానాలకు ప్రాతిపదికగా నిలుస్తుంది.

 

రాజ్యాంగ వివరణ: భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో ఆర్టికల్‌ 168 నుంచి 212 మధ్య రాష్ట్ర శాసనసభ నిర్మాణం, అధికారాలు, విధులు, సభ్యుల ఎన్నిక, అర్హతలు, అనర్హతల గురించి పేర్కొన్నారు.

 

ఆర్టికల్‌ 168: ప్రతి రాష్ట్రానికి ఒక శాసన సభ ఉంటుంది. అదే రెండు సభలు ఉన్నప్పుడు గవర్నర్‌ + విధాన సభ + విధాన పరిషత్‌గానూ, ఒకే సభ ఉన్నప్పుడు గవర్నర్‌ + విధానసభగానూ ఉంటుంది. గవర్నర్‌ రాష్ట్ర శాసనసభలో అంతర్భాగంగా కొనసాగుతారు. కానీ శాసన సభలో సభ్యత్వం ఉండదు.

 

విధానసభ

దీన్ని దిగువసభ, ప్రజాప్రతినిధుల సభ, శాసనసభ, అనిశ్చితసభగా పేర్కొంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170 విధానసభ గురించి వివరిస్తుంది.

* 1950 నాటి భారత ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాష్ట్ర విధానసభలో ఉండాల్సిన కనీస ఎమ్మెల్యేల సంఖ్య 60. గరిష్ఠ ఎమ్మెల్యేల సంఖ్య 500.

* జనాభా తక్కువ ఉన్న చిన్న రాష్ట్రాల్లో కనీస ఎమ్మెల్యేల సంఖ్య విషయంలో మినహాయింపు ఉంది.

ఉదా: సిక్కిం విధాన సభలో ఎమ్మెల్యేల సంఖ్య 32. గోవా విధాన సభలో ఎమ్మెల్యేల సంఖ్య 40. మిజోరం విధాన సభలో ఎమ్మెల్యేల సంఖ్య 40.

* రాష్ట్ర విధానసభ సభ్యుల సంఖ్య (ఎమ్మెల్యేలు) సంబంధిత రాష్ట్ర జనాభా సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.

* ప్రస్తుతం మనదేశంలో విధానసభల సభ్యుల సంఖ్యను 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగా కొనసాగిస్తున్నారు. ఈ సంఖ్యను 2026 వరకు మార్పు చేయకూడదని అటల్‌ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణ చట్టం, 2001 ద్వారా నిర్ణయించింది.

* ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం, 2014’లోని సెక్షన్‌ 26 ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170ని అనుసరించి ఆంధ్రప్రదేశ్‌ విధానసభలో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యేల సంఖ్యను 225కి, తెలంగాణ విధానసభలో ఇప్పుడు ఉన్న 119 ఎమ్మెల్యేల సంఖ్యను 153కి పెంచే అవకాశం కల్పించారు. కానీ దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం ప్రకటించలేదు.

* ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ విధానసభలోని ఎమ్మెల్యేల సంఖ్య 175. ఇందులో ఎస్సీ వర్గాల వారికి 29 స్థానాలు, ఎస్టీ వర్గాలకు 7 స్థానాలు రిజర్వు చేశారు.

* ప్రస్తుతం తెలంగాణ విధానసభలోని ఎమ్మెల్యేల సంఖ్య 119. ఇందులో ఎస్సీ వర్గాల వారికి 19 స్థానాలు, ఎస్టీ వర్గాలకు 12 స్థానాలు రిజర్వు చేశారు.

 

సభ్యుల అర్హతలు: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 173 రాష్ట్ర విధానసభ/శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలను పేర్కొంటుంది. అవి 

* భారతీయ పౌరుడై ఉండాలి.

* 25 ఏళ్లు నిండి ఉండాలి.

* లాభసాటి ప్రభుత్వ పదవిలో ఉండకూడదు.

* కాలానుగుణంగా పార్లమెంటు చేసే చట్టాలకు అనుగుణమైన అర్హతలు కలిగి ఉండాలి.

* సభ్యులు దివాలా తీసినట్లుగా న్యాయస్థానం ప్రకటించి ఉండకూడదు.

* మానసిక వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ జరిగి ఉండకూడదు.

 

ఎన్నికల ప్రక్రియ: ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలు, రాజకీయ పార్టీలు అత్యంత కీలకమైనవి. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని విధాన సభలకు కేంద్ర ఎన్నికల సంఘం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తుంది. ఈ ఎన్నికల్లో అనేక రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి నిలబెడతాయి. ఏ రాజకీయ పక్షానికి చెందనివారు కూడా ‘స్వతంత్ర అభ్యర్థులు’గా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.

 

ఎలక్షన్‌ మేనిఫెస్టో: ఎన్నికల్లో రాజకీయ పక్షాలు తమ ఎన్నికల ప్రణాళిక పత్రాన్ని (ఎలక్షన్‌ మేనిఫెస్టో) ప్రకటిస్తాయి. ఈ మేనిఫెస్టోలో తాము ఎన్నికైతే ఎలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో చేపడతారో, ఏయే వాగ్దానాలను నెరవేరుస్తారో తమ నియోజక వర్గ ప్రజలకు తెలియజేస్తూ హామీ ఇస్తారు. ఓటర్లు తాము ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకునేందుకు ‘ఎలక్షన్‌ మేనిఫెస్టో’ దోహదం చేస్తుంది.

 

పోలింగ్‌ నిర్వహణ: ఎన్నికల రోజు ప్రజలు ఒకరి తర్వాత మరొకరు ఓటు వేస్తారు. పోలింగ్‌ బూత్‌ అధికారి (ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ - పీఓ) ఓటర్ల గుర్తింపు కార్డులను పరిశీలిస్తారు. సాధారణంగా ఓటర్లందరికీ ఎన్నికల కమిషన్‌ గుర్తింపు కార్డులు జారీ చేస్తుంది. ఓటు హక్కును ఓటర్లు రహస్యంగా వినియోగించుకోవాలి

 

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌

 

కంట్రోల్‌ యూనిట్‌: కంట్రోల్‌ యూనిట్‌లో ప్రిసైడింగ్‌ అధికారి బ్యాలట్‌ బటన్‌ నొక్కగానే ఓటు వేసేందుకు ఈవీఎమ్‌ సిద్ధంగా ఉంటుంది. బ్యాలట్‌ యూనిట్‌లో ఓటరు ఓటు వేయగానే కంట్రోల్‌ యూనిట్‌పై ఉన్న బల్బు ఆగిపోయి, అదే సమయంలో ‘బీప్‌’ అనే శబ్దం వచ్చి, ఓటు నమోదవుతుంది.

 

బ్యాలట్‌ యూనిట్‌: ఇది మూడు విధాలుగా ఉంటుంది.

ఎ) యంత్రం మీద ‘ఆకుపచ్చ రంగు బల్బు’ వెలుగుతున్నట్లయితే ఓటు వినియోగించుకోవడానికి ఈవీఎం సిద్ధమని అర్థం.

బి) ఓటరు అభ్యర్థి గుర్తుకి ఎదురుగా ఉన్న ‘నీలం రంగు బటన్‌’ను గట్టిగా నొక్కాలి.

సి) నీలం రంగు బటన్‌ను నొక్కగానే దానికి ఎదురుగా ఉన్న ‘ఎరుపు రంగు బల్బు బటన్‌’ వెలిగి, ‘బీప్‌’ అనే శబ్దం వచ్చి ఓటు నమోదవుతుంది.

 

ప్రమాణ స్వీకారం: విధానసభకు ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 188 పేర్కొంటుంది. వీరు గవర్నర్‌ సమక్షంలో లేదా గవర్నర్‌ నియమించిన వ్యక్తి సమక్షంలో రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్‌లో ఉదహరించిన విధంగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

 

ప్రొటెం స్పీకర్‌: విధానసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలలో అత్యంత సీనియర్‌ను ‘ప్రొటెం స్పీకర్‌’గా గవర్నర్‌ నియమిస్తారు. ఆ వ్యక్తి గవర్నర్‌ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు.  మిగిలిన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ప్రొటెం స్పీకర్‌ సమక్షంలో జరుగుతుంది.

 

స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌: * విధాన సభ సమావేశాలకు అధ్యక్షత వహించి, సమర్థంగా నిర్వహించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 178 ప్రకారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ ఉంటారు. విధానసభ సభ్యులు తమలో నుంచి ఒకరిని స్పీకర్‌గా, మరొకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ తప్పనిసరిగా విధానసభలో సభ్యులై ఉండాలి.

* ఆంధ్రప్రదేశ్‌ విధానసభ స్పీకర్‌ - తమ్మినేని సీతారాం

* ఆంధ్రప్రదేశ్‌ విధానసభ డిప్యూటీ స్పీకర్‌ - కోలగట్ల వీరభద్రస్వామి

* హైదరాబాద్‌ రాష్ట్ర విధానసభకు తొలి, చివరి స్పీకర్‌ - కాశీనాథ్‌రావు వైద్య

* మన దేశంలో విధానసభకు స్పీకర్‌గా వ్యవహరించిన తొలి మహిళ - షాణోదేవి (హరియాణా)

 

స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ తొలగింపు: * రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 179 స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల తొలగింపు ప్రక్రియను వివరిస్తుంది.

* స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను తొలగించే తీర్మానాన్ని ఎమ్మెల్యేలు 14 రోజుల ముందస్తు నోటీసుతో విధాన సభలో ప్రవేశపెడతారు. విధాన సభ సభ్యులు (ఎమ్మెల్యేలు) సాధారణ మెజారిటీతో ఒక తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను తొలగించవచ్చు.

* స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ విధానసభ/ శాసనసభలో సభ్యత్వం కోల్పోతే పదవులను కూడా కోల్పోతారు.

* స్పీకర్‌ తన రాజీనామాను డిప్యూటీ స్పీకర్‌కు, డిప్యూటీ స్పీకర్‌ తన రాజీనామాను స్పీకర్‌కు సమర్పించాలి.

* విధానసభ స్పీకర్‌పైన గానీ, డిప్యూటీ స్పీకర్‌పైనగానీ తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఎవరిపై తీర్మానం ప్రవేశపెడతారో వారు సమావేశాలకు అధ్యక్షత వహించకూడదు. అవిశ్వాస తీర్మానంపై/ తొలగింపు తీర్మానంపై చర్చ జరిగే సమయంలో వీరు విధానసభ సమావేశాలకు హాజరుకావచ్చు. చర్చలో పాల్గొనవచ్చు. సాధారణ సభ్యుల్లా సభలో ఓటు హక్కును కూడా వినియోగించుకోవచ్చు.

 

సభలో సభ్యత్వం కోల్పోవడం

ఆర్టికల్‌ 191(1) ప్రకారం కింది సందర్భాల్లో శాసన సభ్యులు తమ పదవిని కోల్పోతారు. 

* విధానసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ స్పీకర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించిన తర్వాత స్పీకర్‌ దాన్ని ఆమోదించినప్పుడు.

నోట్‌: విధానసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పంపిన రాజీనామా పత్రాన్ని సంబంధిత వ్యక్తి స్వచ్ఛందంగా రాసింది కాదని, విశ్వసించదగినది కాదని స్పీకర్‌ భావిస్తే అలాంటి రాజీనామాను ఆమోదించరు. ఈ నియమాన్ని 33వ రాజ్యాంగ సవరణ చట్టం, 1974 ద్వారా రాజ్యాంగంలో చేర్చారు.

* పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం విధానసభ సభ్యులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు ధ్రువీకరణ జరిగితే స్పీకర్‌ వారిని అనర్హులుగా ప్రకటిస్తారు.

* విధానసభ సభ్యులు ఎవరైనా సభాధ్యక్షుడి అనుమతి లేకుండా వరుసగా 60 రోజులపాటు సభా సమావేశాలకు గైర్హాజరైతే వారు పదవి కోల్పోతారు.

* ఆర్టికల్‌ 190 ప్రకారం ఒక వ్యక్తి ఒకే సమయంలో విధానసభలో ఎమ్మెల్యేగా, విధాన పరిషత్తులో ఎమ్మెల్సీగా ఉండకూడదు. అంటే ద్వంద్వ సభ్యత్వానికి అనుమతి లేదు.

* ఆర్టికల్‌ 193 ప్రకారం చట్టసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయకుండా సభా సమావేశాల్లో పాల్గొనడం, ఓటు వేయడం నిషేధం. ఎవరైనా ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే వారికి సభలో ఎన్ని రోజులు ప్రవేశించారో అన్నిరోజులకు రోజుకు రూ.500 చొప్పున జరిమానా విధిస్తారు.

 

స్పీకర్‌ అధికారాలు - విధులు

* విధాన సభ సమావేశాలకు అధ్యక్షత వహించి, సమావేశాలను సమర్థంగా నిర్వహించడం.

* సభా నియమాలను ఉల్లంఘించిన సభ్యులను శిక్షించడం.

* పార్టీ ఫిరాయింపులకు పాల్పడే సభ్యుల అనర్హతలను ప్రకటించడం.

* సభలో ప్రవేశపెట్టిన ఏదైనా ఒక బిల్లు ఆర్థిక బిల్లా? కాదా? అని ధ్రువీకరించడం.

* అర్థన్యాయాధికారాలను కలిగి ఉండటం.

* సభా వ్యవహారాల కమిటీ, రూల్స్‌ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించడం.

* సభా కార్యక్రమాల నిర్వహణ, వాయిదా వేయడం.

* సభలో ప్రవేశపెట్టిన ఏదైనా బిల్లుపై ఓటింగ్‌ నిర్వహించినప్పుడు బిల్లుకు అనుకూలంగా, వ్యతిరేకంగా సమాన ఓట్లు వచ్చినప్పుడు అధ్యక్ష స్థానంలో ఉన్న స్పీకర్‌ తన నిర్ణాయక ఓటు/ కాస్టింగ్‌ ఓటు/ కొసరు ఓటును వినియోగించి బిల్లు భవితవ్యాన్ని నిర్ణయిస్తారు.

* విధానసభ సభ్యులకు రక్షణ కల్పించడం. విధాన సభ్యులను పోలీసులు అరెస్టు చేయాలంటే ముందుగా స్పీకర్‌ నుంచి అనుమతి పొందాలి.

* సభా సమావేశాల నిర్వహణకు ఉండాల్సిన ‘కోరం’ను స్పీకర్‌ ధ్రువీకరిస్తారు.

 

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా విధానసభల్లో ఎమ్మెల్యేల సంఖ్య 


1. ఉత్తర్‌ప్రదేశ్‌ - 403 


2. పశ్చిమ బెంగాల్‌ - 294


3. మహారాష్ట్ర - 288


4. బిహార్‌ - 243


5. తమిళనాడు - 234


6. మధ్యప్రదేశ్‌ - 230


7. కర్ణాటక - 224


8. రాజస్థాన్‌ - 200


9. గుజరాత్‌ - 182


10. ఆంధ్రప్రదేశ్‌ - 175


11. ఒడిశా - 147


12. కేరళ - 140


13. అస్సాం - 126


14. తెలంగాణ - 119


15. పంజాబ్‌ - 117


16. హరియాణా - 90


17. ఛత్తీస్‌గఢ్‌ - 90


18. ఝార్ఖండ్‌ - 81


19. ఉత్తరాఖండ్‌ - 70


20. హిమాచల్‌ప్రదేశ్‌ - 68


21. మేఘాలయ - 60


22. మణిపుర్‌ - 60


23. నాగాలాండ్‌ - 60


24. అరుణాచల్‌ ప్రదేశ్‌ - 60


25. త్రిపుర - 60


26. గోవా - 40


27. మిజోరం - 40


28. సిక్కిం - 32

 

కేంద్రపాలిత ప్రాంతాలు


1. దిల్లీ- 70


2. పుదుచ్చేరి - 30


3. జమ్ము-కశ్మీర్‌ - 83


 రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 10-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విధాన పరిషత్తు

శాశ్వతమే.. కానీ రద్దవుతుంది!

  అది మేధావుల సభ. కళాకారులు గళం విప్పే వేదిక. అక్కడ జరిగే సమావేశాల్లో ఉపాధ్యాయులూ ఉత్సాహంగా పాల్గొంటారు. విధాన నిర్ణయాల్లో సామాజిక, ఆర్థిక, విజ్ఞాన, సేవారంగాల నిపుణులు భాగస్వాములవుతారు. శాసన ప్రక్రియలో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తారు. విభిన్న వర్గాల ప్రాతినిధ్యంతో విరాజిల్లే ఆ విశిష్ట మండలి ఉనికి శాశ్వతం. కానీ కావాలనుకున్నప్పుడు రద్దు చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే పునరుద్ధరించుకోవచ్చు.

 

  రాష్ట్రస్థాయిలో అత్యున్నత శాసన నిర్మాణ వ్యవస్థ శాసనసభ. ఇందులో రెండు రకాల సభలు ఉంటాయి. మొదటిది ఎగువసభ. దీనినే విధాన పరిషత్తు అంటారు. రెండోది దిగువసభ, దానినే విధానసభగా వ్యవహరిస్తారు. కొన్ని రాష్ట్రాల్లో విధానపరిషత్తు ఉండదు.ఎగువ సభ బహుళ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే వ్యవస్థ. విధాన పరిషత్తును ఎగువ సభ, పెద్దలసభ, శాశ్వతసభ, శాసన మండలిగా కూడా పేర్కొంటారు. దీనిలో ఉండే సభ్యులను ఎమ్మెల్సీ (మెంబర్‌ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌) అంటారు. 1950 నాటి భారత ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం విధాన పరిషత్తులో ఉండే కనీస ఎమ్మెల్సీల సంఖ్య 40. గరిష్ఠ ఎమ్మెల్సీల సంఖ్య విధానసభ సభ్యుల (ఎమ్మెల్యే) సంఖ్యలో 1/3వ వంతు మించకూడదు.

* భారత ప్రభుత్వ చట్టం-1935 ప్రకారం అప్పటి 11 రాష్ట్రాల శాసనసభల్లోని 6 రాష్ట్రాల శాసనసభల్లో ‘ద్విసభా’ విధానాన్ని అమలు చేసి ఎగువసభగా విధాన పరిషత్తును ఏర్పాటు చేశారు. ఆ ఆరు రాష్ట్రాల్లో మద్రాస్, బాంబే, అస్సాం, బెంగాల్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌.ఉన్నాయి.

 

రాజ్యాంగ సభలో చర్చ

రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో విధాన పరిషత్తుపై విస్తృతమైన చర్చ జరిగింది. ఎగువసభ శాసన నిర్మాణంలో జాప్యాన్ని కొనసాగిస్తుందని, అప్రజాస్వామికమైందని, అనవసర ఖర్చుతో కూడుకున్నదని, దీన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని రాజ్యాంగ సభ సభ్యుడైన హెచ్‌.వి.కామత్‌ పేర్కొన్నారు.చివరికి విధాన పరిషత్తును ఏర్పాటు చేయడం/రద్దుచేయడం అనేది సంబంధిత రాష్ట్ర అభీష్టానికి వదిలిపెట్టాలని రాజ్యాంగ సభ తీర్మానించింది.

 

విధాన పరిషత్తు ఏర్పాటు/తొలగింపు

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 169(1) ఒక రాష్ట్రంలో విధాన పరిషత్తు ఏర్పాటు/తొలగింపు ప్రక్రియ గురించి వివరిస్తుంది. దీని ప్రకారం ఏదైనా రాష్ట్రంలో ఎగువసభ అయిన విధాన పరిషత్తును కొత్తగా ఏర్పాటు చేయాలన్నా లేదా ఉన్న విధాన పరిషత్తును తొలగించాలన్నా ఆ రాష్ట్ర విధాన సభ 2/3వ వంతు ప్రత్యేక మెజారిటీతో తీర్మానం ఆమోదించి పార్లమెంటుకి పంపాలి.పార్లమెంటు సాధారణ మెజారిటీతో ఆ మేరకు చట్టం చేస్తుంది. ‘విధానపరిషత్తును పూర్తిగా లేకుండా చేయడం కుదరదు, కానీ రద్దుచేయవచ్చు’ అని రాజ్యాంగంలో పేర్కొన్నారు.

 

సభ్యుల అర్హతలు

* విధాన పరిషత్తు సభ్యులుగా పోటీ చేసేందుకు ఉండాల్సిన కనీస వయసు - 30 సంవత్సరాలు.

* సభ్యుల పదవీ కాలం - 6 సంవత్సరాలు

* ప్రతి రెండేళ్లకొకసారి 1/3వ వంతు విధాన పరిషత్తు సభ్యులు పదవీ విరమణ చేస్తారు.

* బహుళ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడమే ఈ సభ లక్ష్యం.

 

నిర్మాణం

విధాన పరిషత్తుకు సభ్యులు అయిదు రకాలుగా ఎన్నికవుతారు.

1) పరిషత్తు మొత్తం సభ్యుల్లో 1/3వ వంతు మంది సభ్యులను రాష్ట్రంలోని స్థానిక సంస్థలైన పురపాలక సంస్థలు, నగరపాలక సంస్థలు, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు సభ్యులతో కూడిన ఎన్నికల గణం ఎన్నుకుంటుంది.

2) మొత్తం సభ్యుల్లో మరో 1/3వ వంతు మంది సభ్యులను విధానసభ సభ్యులు (ఎమ్మెల్యేలు) ఎన్నుకుంటారు.

3) మొత్తం సభ్యుల్లో 1/12వ వంతు మంది సభ్యులను రాష్ట్రంలో కనీసం మూడేళ్లపాటు నివాసం ఉంటున్న అన్ని విశ్వవిద్యాలయాల పట్టభద్రులతో కూడిన ఎన్నికల గణం ఎన్నుకుంటుంది.

4) మొత్తం సభ్యుల్లో ఇంకో 1/12వ వంతు మంది సభ్యులను రాష్ట్రంలోని సెకండరీ పాఠశాల స్థాయికి తగ్గకుండా కనీసం మూడేళ్లపాటు పనిచేసిన ఉపాధ్యాయులతో కూడిన ఎన్నికల గణం ఎన్నుకుంటుంది.

5) మొత్తం సభ్యుల్లో 1/6వ వంతు మంది సభ్యులను రాష్ట్ర గవర్నర్‌ నామినేట్‌ చేస్తారు. ఈ సభ్యులు కళలు, సాహిత్యం, విజ్ఞానం, సామాజిక సేవారంగాల్లో ప్రావీణ్యం ఉన్నవారై ఉంటారు.

 

విధాన పరిషత్తు సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఏక ఓటు బదిలీ సూత్రం ప్రకారం ఎన్నికవుతారు.

ప్రస్తుతం మన దేశంలో 6 రాష్ట్రాల్లో  విధాన పరిషత్తులు ఉన్నాయి. అవి 1) ఉత్తర్‌ప్రదేశ్‌ (100 మంది సభ్యులు), 2) మహారాష్ట్ర (78), 3) బిహార్‌  (75), 4) కర్ణాటక  (75), 5) ఆంధ్రప్రదేశ్‌  (58), 6) తెలంగాణ (40).

* జమ్ము-కశ్మీర్‌ విధాన పరిషత్తులో 36 మంది ఎమ్మెల్సీలు ఉండేవారు. జమ్ము-కశ్మీర్‌ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2019 ప్రకారం అక్కడి విధాన పరిషత్తును రద్దుచేశారు.

* విధాన పరిషత్తు మొత్తం సభ్యుల్లో 5/6వ వంతు సభ్యులు ఎన్నిక ద్వారా ఎన్నికవుతారు. మిగిలిన 1/6వ వంతు సభ్యులను గవర్నర్‌ నామినేట్‌ చేస్తారు.

 

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీల ఎన్నిక వివరాలు

ఆంధ్రప్రదేశ్‌-58

తెలంగాణ-40 ఎన్నిక విధానం
20 14 స్థానిక సంస్థల ప్రతినిధుల ద్వారా
20 14 విధానసభ సభ్యుల (ఎమ్మెల్యేలు) ద్వారా
5 3 ఉపాధ్యాయుల ద్వారా
5         3 పట్టభద్రుల ద్వారా
8 6 గవర్నర్‌ నామినేట్‌ చేస్తారు

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విధాన పరిషత్తు ఏర్పాటు, తొలగింపు, పునరుద్ధరణ

* 1958, జులై 1న నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలిసారిగా విధాన పరిషత్తును ఏర్పాటు చేశారు. అప్పటి విధాన పరిషత్తు ఛైర్మన్‌ మాడపాటి హనుమంతరావు, డిప్యూటీ ఛైర్మన్‌ జి.ఎన్‌.రాజు.

* 1985, జూన్‌ 1న ఎన్‌.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విధాన పరిషత్తును రద్దుచేశారు. నాటి విధాన పరిషత్తు ఛైర్మన్‌ సయ్యద్‌ ముఖ్‌సిర్‌షా, డిప్యూటీ ఛైర్మన్‌ ఎ.చక్రపాణి.

* 2007, మార్చి 30న వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విధాన పరిషత్తును పునరుద్ధరించారు. అప్పటి సభ ఛైర్మన్‌ ఎ.చక్రపాణి, డిప్యూటీ ఛైర్మన్‌ మహ్మద్‌ జాని.

* విభజన అనంతరం కొత్త ఆంధ్రప్రదేశ్‌ విధాన పరిషత్తుకు తొలి ఛైర్మన్‌ ఎ.చక్రపాణి, తొలి డిప్యూటీ ఛైర్మన్‌ ఎస్‌.వి.సతీష్‌కుమార్‌ రెడ్డి.

* ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ విధాన పరిషత్తు ఛైర్మన్‌ కొయ్యె మోషెన్‌రాజు, డిప్యూటీ ఛైర్మన్‌ మయానా జకియా ఖానమ్‌.

* తెలంగాణ రాష్ట్ర విధాన పరిషత్తుకు తొలి ఛైర్మన్‌ కె.స్వామిగౌడ్, తొలి డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌.

* ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విధాన పరిషత్తు ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్‌ పదవి ఖాళీగా ఉంది.

 

ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌ పదవులు

* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 182 విధాన పరిషత్తు ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌ పదవుల గురించి వివరిస్తుంది. సభ్యులు (ఎమ్మెల్సీలు) సభా కార్యకలాపాల నిర్వహణ కోసం తమలో నుంచి ఒకరిని ఛైర్మన్‌గాను, మరొకరిని డిప్యూటీ ఛైర్మన్‌గాను ఎన్నుకుంటారు.

* ఆర్టికల్‌ 183 విధాన పరిషత్తు ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌లు తమ పదవులను ఏ విధంగా కోల్పోతారనే విషయాన్ని వివరిస్తుంది. శాసనమండలి/ విధాన పరిషత్తులో సభ్యత్వం రద్దయినప్పుడు, తమ పదవులకు రాజీనామా చేసినప్పుడు, విధాన పరిషత్తులో తొలగింపు తీర్మానం నెగ్గినప్పుడు పదవులను కోల్పోతారు. ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌లను తొలగించే తీర్మానాన్ని 14 రోజుల ముందస్తు నోటీసు ద్వారా తెలియజేయాలి.

* ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌లలో ఎవరిపై తొలగింపు తీర్మానం ప్రవేశపెడతారో వారు సభా సమావేశాలకు అధ్యక్షత వహించకూడదు. అయితే సభా సమావేశాల్లో పాల్గొనవచ్చు. ఛైర్మన్‌ తన రాజీనామాను డిప్యూటీ ఛైర్మన్‌కు, డిప్యూటీ ఛైర్మన్, సభ్యులు (ఎమ్మెల్సీలు) తమ రాజీనామాలను ఛైర్మన్‌కు సమర్పించాలి.

* ఆర్టికల్‌ 184 ప్రకారం ఛైర్మన్‌ పదవి ఖాళీ అయినప్పుడు  డిప్యూటీ ఛైర్మన్‌ సభా సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.

* రాజ్యాంగం ప్రకారం విధాన పరిషత్తు సమావేశాలు సంవత్సరానికి తప్పనిసరిగా రెండు సార్లు జరగాలి. రెండు సమావేశాల మధ్య వ్యత్యాసం 6 నెలలు మించకూడదు.

 

విధాన పరిషత్తు - సమీక్ష

* సాధారణ బిల్లులను విధానసభలో లేద విధాన పరిషత్తులో ప్రవేశపెట్టవచ్చు.

* విధాన సభ ఆమోదించి పంపిన సాధారణ బిల్లులను విధాన పరిషత్తు గరిష్ఠంగా 4 నెలలు పాటు నిలిపి ఉంచగలుగుతుంది.

* విధాన పరిషత్తును ఒక చేతికి ఉండే 6వ వేలిగా, రాజకీయ నిరుద్యోగులకు ఆశ్రయం కల్పించే సంస్థగా విమర్శకులు పేర్కొన్నారు

* విధాన పరిషత్తు భవితవ్యం విధాన సభ చేసే ప్రత్యేక తీర్మానంపై ఆధారపడి ఉంటుంది.

* విధాన సభ ఆమోదించి పంపిన ఆర్థిక బిల్లులను విధాన పరిషత్తు 14 రోజుల్లోగా ఆమోదించాలి. లేకపోతే ఆమోదించినట్లుగానే పరిగణిస్తారు.

 

రాజ్యసభ, విధాన పరిషత్‌ల మధ్య వ్యత్యాసాలు

* రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్‌ కాలేజీలో రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు ఓటర్లుగా ఉంటారు. కానీ రాష్ట్రాల విధాన పరిషత్తు సభ్యులకు (ఎమ్మెల్సీలు) ఎలాంటి ఓటు హక్కు లేదు.

* సాధారణ బిల్లుల ఆమోదం విషయంలో రాజ్యసభ, లోక్‌సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు. కానీ రాష్ట్రస్థాయిలో విధాన పరిషత్తు, విధాన సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే గవర్నర్‌ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు.

* లోక్‌సభ ఆమోదించి పంపిన సాధారణ బిల్లులపై రాజ్యసభ 6 నెలల్లోగా నిర్ణయం ప్రకటించాలి. విధానసభ ఆమోదించి పంపిన సాధారణ బిల్లులపై విధాన పరిషత్తు 3 నెలల్లోగా నిర్ణయాన్ని ప్రకటించాలి.

* రాజ్యసభ శాశ్వతసభ. దీన్ని రద్దుచేయడానికి వీలులేదు. విధాన పరిషత్తును పార్లమెంటు చేసే చట్టం ద్వారా రద్దు చేయవచ్చు.

* రాజ్యాంగ సవరణ ప్రక్రియలో రాజ్యసభ పాల్గొంటుంది. కానీ విధాన పరిషత్తుకు ఎలాంటి ప్రాతినిధ్యం లేదు.

 

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 23-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

హైకోర్టు

పౌరహక్కులకు ఉన్నత రక్షణ!


ఒక రాష్ట్రం పరిధిలో పౌరుల హక్కులను పరిరక్షిస్తుంది. దిగువ న్యాయస్థానాలను నియంత్రిస్తుంది. అప్పీళ్లను విచారిస్తుంది. రాజ్యాంగ వ్యతిరేక చర్యలను, ఉత్తర్వులను సమీక్షిస్తుంది. తీర్పులను భద్రపరుస్తుంది. సుప్రీం కోర్టు తర్వాత ఉన్నతంగా వ్యవహరించే ఈ హైకోర్టుల నిర్మాణం, న్యాయమూర్తుల నియామకం, తొలగింపు, విధులు, అధికారాలు తదతర అంశాలపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి.   

 


రాష్ట్రస్థాయిలో ‘హైకోర్టు’ అత్యున్నత న్యాయస్థానం. ఇది రాజ్యాంగబద్ధంగా ఏర్పాటై, స్వయం ప్రతిపత్తితో వ్యవహరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, రాజ్యాంగ నియమాలకు లోబడి కొనసాగేలా చూస్తుంది.


చారిత్రక నేపథ్యం: ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1861 ప్రకారం 1862 జులై 1న కలకత్తాలో తొలి హైకోర్టు ఏర్పాటైంది. దీని మొదటి ప్రధాన న్యాయమూర్తి ‘సర్‌ బార్నెస్‌ పీకాక్‌’. 1862, ఆగస్ట్‌ 14న రెండో హైకోర్టును బొంబాయిలో; 1862, ఆగస్ట్‌ 15న మూడో హైకోర్టును మద్రాస్‌లో ఏర్పాటు చేశారు. ఈ మూడు హైకోర్టులు 2011లో 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. 1866, మార్చి 17న అలహాబాద్‌లో హైకోర్టు ఏర్పాటైంది.


రాజ్యాంగ వివరణ: రాజ్యాంగంలోని 6వ భాగంలో 214 నుంచి 232 ఆర్టికల్స్‌ హైకోర్టు నిర్మాణం, న్యాయమూర్తుల నియామకం, నియమ నిబంధనలు, హైకోర్టుల పరిధి, అధికారాలు, విధుల గురించి పేర్కొంటున్నాయి.


ఆర్టికల్‌ 214, 216: ఈ ఆర్టికల్స్‌ ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఏర్పాటు చేయాలి. 7వ రాజ్యాంగ సవరణ చట్టం, 1956 ప్రకారం పార్లమెంటు రూపొందించిన శాసనం ద్వారా రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు/ కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి ‘ఉమ్మడి హైకోర్టు’ ఏర్పాటు చేయవచ్చు. సాధారణంగా హైకోర్టు భౌగోళిక పరిధి సంబంధిత రాష్ట్ర భూభాగ పరిధి వరకే ఉంటుంది. ఉమ్మడి హైకోర్టు భౌగోళిక పరిధి సంబంధిత రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల భూభాగ పరిధి వరకు విస్తరించి ఉంటుంది.


న్యాయమూర్తుల సంఖ్య: హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ఇందుకోసం సంబంధిత రాష్ట్ర జనాభా, విస్తీర్ణం, నేరాల తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుతం అలహాబాద్‌ హైకోర్టులో అత్యధికంగా సుమారు 120 మంది న్యాయమూర్తులు ఉన్నారు. సిక్కిం హైకోర్టులో అత్యల్పంగా ముగ్గురు న్యాయమూర్తులే ఉన్నారు.


న్యాయమూర్తుల నియామకానికి ఉండాల్సిన అర్హతలు:

* భారతీయ పౌరుడై ఉండాలి.

* హైకోర్టులో న్యాయవాదిగా 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి.(లేదా) * జిల్లా కోర్టులో న్యాయమూర్తిగా 10 సం।।లు పనిచేసి ఉండాలి.

* రాష్ట్రపతి దృష్టిలో ప్రముఖ న్యాయకోవిదుడై ఉండాలి.

 

నియామకం (ఆర్టికల్‌ 217):

* కొలీజియం సిఫార్సుల మేరకు హైకోర్టుకు ప్రధాన, ఇతర న్యాయమూర్తుల్ని రాష్ట్రపతి నియమిస్తారు.

* హైకోర్టులో పనిఒత్తిడి ఎక్కువ ఉండి, తగిన సంఖ్యలో న్యాయమూర్తులు లేనప్పుడు రెండేళ్ల పదవీకాలానికి అదనపు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు.

 

ప్రమాణ స్వీకారం (ఆర్టికల్‌ 219): హైకోర్టు న్యాయమూర్తులు గవర్నర్‌ సమక్షంలో కిందివిధంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ‘‘భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం కల్గి ఉంటాను. భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను సంరక్షిస్తాను. నా సామర్థ్యం మేరకు రాగద్వేషాలు లేకుండా సమర్థవంతంగా పనిచేస్తాను’’ అని ప్రమాణం చేస్తారు.

 

పదవీకాలం:

* హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలు. గతంలో ఇది 60 ఏళ్లుగా ఉండేది. 15వ రాజ్యాంగ సవరణ చట్టం, 1963 ద్వారా పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచారు.

* న్యాయమూర్తులు తమ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి.

* పార్లమెంటు సిఫార్సుల మేరకు న్యాయమూర్తులను రాష్ట్రపతి తొలగిస్తారు.

 

న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియ:

* హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే అభిశంసన తీర్మానాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టాలంటే కనీసం 100 మంది లోక్‌సభ సభ్యులు; రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే కనీసం 50 మంది రాజ్యసభ సభ్యులు తీర్మాన ప్రతిపై సంతకాలు చేసి ఆయా సభాధ్యక్షులకు అందించాలి.

* అసమర్థత, అవినీతి ఆరోపణలపై న్యాయమూర్తిని తొలగించే ఈ తీర్మానాన్ని లోక్‌సభ, రాజ్యసభలు విడివిడిగా 2/3 ప్రత్యేక మెజార్టీతో ఆమోదిస్తే రాష్ట్రపతి సంబంధిత న్యాయమూర్తులను తొలగిస్తారు.

* 2011లో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ సౌమిత్ర సేన్‌పై రాజ్యసభలో ప్రవేశపెట్టిన తొలగింపు తీర్మానం నెగ్గింది. ఈ తీర్మానం లోక్‌సభలో ప్రవేశపెట్టక ముందే ఆయన పదవికి రాజీనామా చేశారు.

 

జీతభత్యాలు:

* హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను  చట్టం ద్వారా పార్లమెంటు నిర్ణయిస్తుంది. వాటిని సంబంధిత రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. పదవీవిరమణ అనంతరం పెన్షన్‌ను భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.

* 1950లో హైకోర్ట్‌ ప్రధాన న్యామూర్తి వేతనం రూ.4000. ఇతర న్యాయమూర్తుల వేతనం రూ.3500.

* 2018లో రూపొందించిన చట్టం ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేతనం రూ.2,50,000. ఇతర న్యాయమూర్తుల వేతనం రూ.2,25,000.

* న్యాయమూర్తుల జీతభత్యాలకు రాజ్యాంగ భద్రత ఉంటుంది. పదవీ కాలంలో ఉన్నంత వరకు వీరి జీతభత్యాలకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదు. రాజ్యాంగంలోని రెండో షెడ్యూల్‌లో పేర్కొన్న నియమాల ఆధారంగా వీరికి జీతభత్యాలు అందుతాయి.

 

న్యాయమూర్తుల బదిలీ (ఆర్టికల్‌ 222):  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ‘కొలీజియం’ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఒక హైకోర్టు న్యాయమూర్తిని మరో హైకోర్టుకు బదిలీ చేస్తారు.

 

పదవీ విరమణ అనంతరం:

* పదవీవిరమణ అనంతరం న్యాయమూర్తులు వారు పనిచేసిన హైకోర్టులో తప్ప, ఇతర హైకోర్టుల్లో గాని, సుప్రీంకోర్టులో గాని న్యాయవాద వృత్తి చేపట్టవచ్చు.

* పదవీ విరమణ పొందిన న్యాయమూర్తులు విశ్వవిద్యాలయాలకు వైస్‌ఛాన్సలర్‌ (వీసీ) గా, విచారణ సంఘాలకు ఛైర్మన్లుగా, విదేశాలకు రాయబారులుగా నియమితులవుతున్నారు.

హైకోర్టు బెంచ్‌: ఒక రాష్ట్రంలో హైకోర్ట్‌ బెంచ్‌ను అదే రాష్ట్రంలో వేరే నగరంలో ఏర్పాటు చేస్తూ పార్లమెంటు చట్టం చేయవచ్చు.

 

హైకోర్ట్‌ అధికారాలు, విధులు

ప్రాథమిక/ ప్రారంభ/ ఒరిజినల్‌ విచారణాధికార పరిధి:

* అప్పీళ్ల ద్వారా కాకుండా హైకోర్టు నేరుగా విచారించే అధికారాలు దీని పరిధిలోకి వస్తాయి. సుప్రీంకోర్టు విచారణ అధికార పరిధి, హైకోర్టు విచారణ అధికార పరిధిని పోల్చి చూసినప్పుడు హైకోర్టు విచారణ అధికార పరిధే ఎక్కువ. దీనికి కారణం వ్యక్తుల, సంస్థల హక్కుల రక్షణకు హైకోర్టు ‘నిలుపుదల ఉత్తర్వులు’ (Injunction orders) జారీ చేస్తుంది.

* పార్లమెంటు, శాసనసభ ఎన్నికల వివాదాలను విచారిస్తుంది. వివాహం, విడాకులు, వీలునామా వంటి అంశాలకు సంబంధించిన వివాదాలను విచారిస్తుంది.

 

కోర్ట్‌ ఆఫ్‌ రికార్డ్‌:

* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 215 ప్రకారం రాష్ట్రస్థాయిలో హైకోర్ట్‌ ‘కోర్ట్‌ ఆఫ్‌ రికార్డ్‌’గా వ్యవహరిస్తుంది. దీని ప్రకారం హైకోర్టు తాను ఇచ్చిన తీర్పులను రికార్డుల రూపంలో భద్రపరుస్తుంది. రాష్ట్రంలోని దిగువ న్యాయస్థానాలు, వ్యక్తులు, సంస్థలకు కోర్ట్‌ ఆఫ్‌ రికార్డ్‌ శిరోధార్యం. కోర్ట్‌ ఆఫ్‌ రికార్డ్‌ ధిక్కరణను కోర్టు ధిక్కరణ నేరంగా పరిగణించి శిక్షిస్తారు.

* కోర్టు ధిక్కరణ అంటే న్యాయస్థానాల అధికారాలకు విఘాతం కలిగించడం, న్యాయపాలనలో అనవసర జోక్యం చేసుకోవడం, న్యాయస్థానాల తీర్పులను విమర్శించడం.

 

అప్పీళ్ల విచారణాధికార పరిధి: రాష్ట్రస్థాయిలో అత్యున్నత అప్పీళ్ల న్యాయస్థానం హైకోర్ట్‌. దీని భౌగోళిక పరిధిలోని దిగువ న్యాయస్థానాల తీర్పులపై వచ్చిన సివిల్, క్రిమినల్‌ కేసులకు సంబంధించిన అప్పీళ్లను విచారిస్తుంది. దిగువ స్థాయి న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులతో అసంతృప్తి చెందిన వ్యక్తులు, సంస్థలు హైకోర్టును ఆశ్రయించవచ్చు. జిల్లా సెషన్స్‌ కోర్ట్‌ మరణ శిక్షను విధించినా లేదా 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష విధించినా అలాంటి కేసులన్నింటినీ హైకోర్టులో అప్పీలు చేయవచ్చు. అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునళ్లు ఇచ్చిన తీర్పులపై హైకోర్టులో అప్పీలు చేయవచ్చు. ట్రిబ్యునల్స్‌ హైకోర్టు పరిధిలోకి వస్తాయని 1997లో సుప్రీంకోర్టు తీర్పుఇచ్చింది.

రిట్స్‌ జారీ చేయడం: ప్రాథమిక హక్కుల సంరక్షణకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టు 5 రకాల రిట్స్‌ జారీ చేస్తుంది. అవి 1) హెబియస్‌ కార్పస్‌ 2) మాండమస్‌ 3) సెర్షియోరరీ 4) ప్రొహిబిషన్‌ 5) కోవారెంటో *హైకోర్టు ఏదైనా వ్యక్తికి/అధికారికి/ప్రభుత్వానికి ‘‘రిట్స్‌’’(Writs) జారీ చేయవచ్చు.* సుప్రీంకోర్టు, హైకోర్టుల రిట్స్‌ అధికార పరిధి రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని, దీనిని రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించే వీలులేదని 1997లో చంద్రకుమార్‌ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.

 

దిగువ న్యాయస్థానాలపై నియంత్రణ:

* హైకోర్టుకు రాష్ట్రంలోని దిగువ న్యాయస్థానాలపై నియంత్రణాధికారం ఉంటుంది. జిల్లా కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం, బదిలీలు, ఇతర సిబ్బంది ఎంపికలో హైకోర్టు కీలక పాత్రను పోషిస్తుంది.

* దిగువ న్యాయస్థానాలు విచారించే ఏదైనా కేసులో రాజ్యాంగపరమైన, శాసనపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయని హైకోర్టు భావిస్తే సంబంధిత కేసును తనకు బదిలీ చేయించుకుని విచారిస్తుంది.

* హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రంలోని అన్ని దిగువ న్యాయస్థానాలకు శిరోధార్యం.

 

న్యాయ సమీక్షాధికారం:

* పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు రూపొందించిన శాసనాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఉత్తర్వులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లవు అని హైకోర్టు ‘న్యాయసమీక్ష’ ద్వారా ప్రకటిస్తుంది.

* 42వ రాజ్యాంగ సవరణ చట్టం (1976) ద్వారా హైకోర్టు న్యాయ సమీక్షాధికారాన్ని తొలగించారు. 43వ రాజ్యాంగ సవరణ చట్టం (1977) ద్వారా న్యాయసమీక్షాధికారాన్ని పునరుద్ధరించారు.

 

కీలక అంశాలు

* కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన తొలి భారతీయుడు - సుంబనాథ్‌ పండిట్‌

* కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తొలి భారతీయుడు - పి.బి.చక్రవర్తి

* మన దేశంలో హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన తొలి మహిళ - అన్నాచాందీ (కేరళ)

* మన దేశంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తొలి మహిళ - లీలా సేథ్‌ (హిమాచల్‌ ప్రదేశ్‌)

* దిల్లీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తొలి మహిళ - జస్టిస్‌ రోహిణి

* 1954లో గుంటూరులో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తి - జస్టిస్‌ కోకా సుబ్బారావు

* 1956లో హైదరాబాద్‌లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తి - జస్టిస్‌ కోకా సుబ్బారావు

* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తి - జస్టిస్‌ టి.బి.ఎన్‌.రాధాకృష్ణన్‌.

* తెలంగాణ హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తి - జస్టిస్‌ టి.బి.ఎన్‌.రాధాకృష్ణన్‌

* ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌కు తొలి ప్రధాన న్యాయమూర్తి (తాత్కాలిక) - జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ (01-01-2019)

* ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తి (పూర్తిస్థాయి) - జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి (07-10-2019)

 

ప్రస్తుతం మన దేశంలో హైకోర్టుల సంఖ్య: 25

నోట్‌: 1956లో హైదరాబాద్‌లో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు 2019లో తెలంగాణ హైకోర్టుగా అవతరించింది.

రచయిత: బంగారు సత్యనారాయణ 

Posted Date : 07-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశంలో - స్థానిక స్వపరిపాలన - అభివృద్ధి క్రమం

ప్రజల చేతికే పాలనాపగ్గాలు!


ఒక పంచాయతీలో పరిశుభ్రతను ప్రధాని ప్రత్యక్షంగా పర్యవేక్షించడం సాధ్యం కాదు. మారుమూల పల్లెకు మంచినీటిని అందించే బాధ్యతను ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షించలేరు. వేల గ్రామాల్లో విద్యుత్తు, రహదారుల వంటి సౌకర్యాల కల్పన, నిర్వహణ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు కుదిరేపని కాదు. అందుకే ఆ బాధ్యతలన్నింటినీ స్థానిక ప్రజలకే ఇచ్చేశారు. తమను తామే పాలించుకునే రాజ్యాంగబద్ధ అధికారాన్ని అప్పగించేశారు. ఈ పరిణామాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. ఆ వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

 


స్థానిక అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించి, వాటిని సమర్థంగా అమలు చేయాలంటే అధికార వికేంద్రీకరణ అవసరం. అందుకోసం ఏర్పాటైనవే స్థానిక స్వపరిపాలన సంస్థలు. వీటి ద్వారా పాలనాపగ్గాలు ప్రజల చేతుల్లోనే ఉంటాయి. 

 

స్థానిక సంస్థల ఆవశ్యకత

* ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగిస్తాయి.

* పరిపాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తాయి.

* స్థానిక సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కార మార్గాలను అన్వేషిస్తాయి.

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పరిపాలనా భారాన్ని తగ్గిస్తాయి.

* ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి.

 

అభివృద్ధి క్రమం

ప్రాచీన భారతదేశంలో: * రుగ్వేదంలో ‘సభ’, ‘సమితి’ అనే రెండు స్థానిక స్వపరిపాలనా సంస్థల ద్వారా ప్రజాసంక్షేమ పాలన నిర్వహించేవారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. వాటిని పరిపాలనాపరమైన ‘కవలలు’గా పేర్కొన్నారు. ఇవి గ్రామస్థాయిలో అనేక పరిపాలన, రాజకీయపరమైన విధులను నిర్వర్తించేవి.

* ఆది కావ్యంగా పేరుపొందిన ‘రామాయణం’లో ‘జనపదం’ అనే పేరును అనేక గ్రామాల సమాఖ్యగా అభివర్ణించారు.

* మహాభారతంలోని ‘శాంతి పర్వం’ ప్రకారం గ్రామీణ పరిపాలనను ‘గ్రామసంఘాలు’ నిర్వహించేవి.

* శుక్రాచార్యుడు రచించిన ‘నీతిశాస్త్రం’ గ్రంథంలో ‘గ్రామాల కామన్వెల్త్‌’ గురించి పేర్కొన్నారు.

* ‘బౌద్ధం విలసిల్లిన కాలంలోనే భారత్‌లో స్థానిక పాలన వర్ధిల్లింది’ అని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ పేర్కొన్నారు.

* కౌటిల్యుడు తన ‘అర్థశాస్త్రం’ గ్రంథంలో మౌర్యుల కాలం నాటి స్థానిక పరిపాలనను వివరించారు. ఈ గ్రంథంలో గ్రామ పరిపాలన అధికారిని ‘గ్రామణి’ అని, పది గ్రామాల పరిపాలనా అధికారిని ‘దశ గ్రామణి’గా పేర్కొన్నారు.

* మన దేశంలో గ్రామీణ పాలనకు ప్రణాళికాబద్ధమైన పునాదులు వేసి, అభివృద్ధి వైపు అడుగులు వేయించారు చోళులు. చోళరాజైన మొదటి పరాంతకుడు వేయించిన ‘ఉత్తర మెరూర్‌’ శాసనం ప్రకారం చోళులు కుండలకు రంధ్రం చేసి వాటిని బ్యాలెట్‌ బాక్సులుగా, రంగులు వేసిన తాటి ఆకులను బ్యాలెట్‌ పత్రాలుగా ఉపయోగించి ఎన్నికల ప్రక్రియ నిర్వహించేవారు.

* చోళుల పాలనా కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ సమస్యల పరిష్కారం కోసం ‘పంచాస్‌’ అనే అయిదుగురు సభ్యులతో ఒక మండలి ఉండేది. ‘పంచాస్‌’ పదమే ‘పంచాయతీ’గా పరిణామం చెందింది.

మధ్యయుగంలో: * క్రీ.శ.712లో మహ్మద్‌ బిన్‌ ఖాసిం ‘సింధు’ ప్రాంతాన్ని జయించడం, భారత్‌పై తరచూ మహ్మదీయుల దండయాత్రలు జరగడం వంటి పరిణామాలతో ఇక్కడి స్థానిక స్వపరిపాలనకు విఘాతం కలిగింది.

* దిల్లీ సుల్తాన్‌ల పరిపాలనా కాలంలో గ్రామీణ ప్రాంతాల పాలనకు ‘పంచాయతీలు’ ఉండేవి. కానీ అవి పూర్తిస్థాయిలో స్వయంప్రతిపత్తితో కొనసాగలేదు.

* షేర్షా పాలనా కాలంలో భూమిని కొలిచి దాని ఆధారంగా శిస్తు విధించే విధానం, గ్రామీణ స్థానిక సంస్థల పరిపాలన కొనసాగేవి.

* మొగలుల హయాంలో స్థానిక పాలనకు సంబంధించిన అన్ని నిర్ణయాలను ‘పంచాయతీలు’ తీసుకునేవి. వీరి పాలనా కాలంలో పట్టణ పాలనాధికారి ‘కొత్వాల్‌’. అతడికి సహకరించేందుకు ‘మున్సబ్‌’ అనే అధికారి ఉండేవారు.

* ఆంగ్లేయులు, పోర్చుగీసువారు, ఫ్రెంచివారు, డచ్‌వారు వర్తకం కోసం భారత్‌లోకి ప్రవేశించడం, వారి మధ్య జరిగిన ఘర్షణలు, వారు భారతీయులతో చేసిన యుద్ధాలు తదితరాలన్నీ భారత్‌లో స్థానిక స్వపరిపాలనపై తీవ్రమైన దుష్ప్రభావం చూపాయి.

ఆంగ్లేయుల పాలనా కాలంలో: * ఈస్టిండియా కంపెనీ పరిపాలనా కాలంలో ప్రజల నుంచి పన్నుల వసూళ్లే లక్ష్యంగా 1687లో మద్రాసులో తొలి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటైంది. పన్నుల విధింపును ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో 1726లో మున్సిపల్‌ కార్పొరేషన్‌కు బదులుగా ‘మేయర్‌’ కోర్టులను అమల్లోకి తీసుకొచ్చారు. ఈ కోర్టులు పాలనా వ్యవహారాల కంటే న్యాయ సంబంధ విధులకే ప్రాధాన్యం ఇచ్చేవి.

* 1772లో వారన్‌ హేస్టింగ్స్‌ కాలంలో ‘జిల్లా’ను ఒక పరిపాలనా యూనిట్‌గా చేసుకుని, భూమిశిస్తు వసూలు లక్ష్యంగా ‘జిల్లా కలెక్టర్‌’ పదవిని ప్రవేశపెట్టారు.

* 1793 నాటి చార్టర్‌ చట్టం ప్రకారం బొంబాయి, మద్రాసు, కలకత్తా పట్టణాల్లోని స్థానిక స్వపరిపాలనా సంస్థలకు చట్టబద్ధత కల్పించారు.

* 1813 నాటి చార్టర్‌ చట్టం ప్రకారం స్థానిక స్వపరిపాలనా సంస్థలకు పన్నులు విధించే అధికారాన్ని, పన్నులు చెల్లించని వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని కల్పించారు.

* 1861 నాటి ‘ఇండియన్‌ కౌన్సిల్‌’ చట్టం ప్రకారం స్థానిక అవసరాలను తీర్చే బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించారు.

* 1870లో లార్డ్‌ మేయో ప్రవేశపెట్టిన ‘ఆర్థిక వికేంద్రీకరణ’ విధానం, మన దేశంలో పరిపాలనా వికేంద్రీకరణకు పునాదిగా నిలిచింది.

* చార్లెస్‌ మెట్‌కాఫ్‌ భారతదేశ గ్రామీణ సమాజాలను ‘లిటిల్‌ రిపబ్లిక్స్‌’గా అభివర్ణించారు.

 

లార్డ్‌ రిప్పన్‌ చొరవ

* 1882, మే 18న లార్డ్‌ రిప్పన్‌ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన ఒక తీర్మానాన్ని వెలువరిస్తూ ఆర్థిక, పాలనాపరమైన అధికారాలను వాటికి బదిలీ చేశారు. ఈ తీర్మానాన్ని భారతదేశ స్థానిక స్వపరిపాలన చరిత్రలో ‘మాగ్నా కార్టా’గా అభివర్ణిస్తారు. దాని ద్వారా భారత్‌లోని స్థానిక స్వపరిపాలనకు ఒక నిర్దిష్ట రూపం వచ్చింది. అందుకే లార్డ్‌ రిప్పన్‌ను ‘భారత్‌లో స్థానిక స్వపరిపాలనా సంస్థల పితామహుడు’గా పేర్కొంటారు.

రిప్పన్‌ తీర్మానం ప్రకారం స్థానిక సంస్థలను వర్గీకరించారు. అవి 1) దిగువ స్థాయి - గ్రామ పంచాయతీలు 2) మధ్య స్థాయి - తాలుకా బోర్డులు 3) ఉన్నత స్థాయి - జిల్లా బోర్డులు.

స్థానిక సంస్థలకు సంబంధించి బెంగాల్‌ మున్సిపాలిటీల చట్టం - 1884, బెంగాల్‌ స్థానిక ప్రభుత్వాల చట్టం - 1885, బెంగాల్‌ స్థానిక గ్రామీణ స్వయంపాలన చట్టం - 1919 లాంటివి కీలకమైనవి.

 

రాయల్‌ కమిషన్‌ (1907)

భారత్‌లో స్థానిక స్వపరిపాలనా సంస్థల పనితీరును సమీక్షించి, తగిన సిఫార్సులు చేయడానికి 1907లో చార్లెస్‌ హబ్‌హౌస్‌ అధ్యక్షతన ‘రాయల్‌ కమిషన్‌’ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌ 1909లో నివేదిక సమర్పించింది. ఇందులోని అంశాలు:

- ప్రజలు ఎన్నుకునే ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచాలి. మూడు స్థాయుల్లో ప్రతినిధులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి.

- ప్రాథమిక విద్య (ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌) బాధ్యతను పురపాలక సంఘాల (మున్సిపాలిటీ)కు అప్పగించాలి.

- ప్రతి గ్రామానికీ ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలి.

- జనాభా ఆధారంగా పురపాలక సంస్థలను ఏర్పాటు చేయాలి.

- పరిపాలనా వికేంద్రీకరణను పటిష్టంగా అమలుచేయాలి.

 

మింటో - మార్లే సంస్కరణలు (1909)

రాయల్‌ కమిషన్‌ సిఫార్సుల ఆధారంగా 1909లో మింటో - మార్లే సంస్కరణల చట్టంలో స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రతినిధులను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు.స్థానిక పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారు. 

 

మాంటేగ్‌-ఛెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం (1919)

* ఈ చట్టం ద్వారా కేంద్ర జాబితాలోని ‘స్థానిక స్వపరిపాలన’ను రాష్ట్ర జాబితాలోకి మార్చారు.

* స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన శాసనాలు రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభలకు లభించింది.

* 1919 నాటికి మన దేశంలోని జిల్లా బోర్డుల సంఖ్య 207. తాలుకా బోర్డుల సంఖ్య 584.

 

భారత ప్రభుత్వ చట్టం-1935

* ఈ చట్టం ద్వారా మన దేశంలోని స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ‘స్వయంప్రతిపత్తి’ కల్పించారు. వాటి పాలన మంత్రుల పరిధిలోకి వచ్చింది. ఈ సంస్థలకు సభ్యులు ‘నామినేట్‌’ అయ్యే విధానాన్ని రద్దు చేశారు. ‘జిల్లా బోర్డు’లో రాష్ట్రాలకు పూర్తిస్థాయి స్వాతంత్య్రం కల్పించడంతో స్థానిక స్వపరిపాలన సంస్థల స్వావలంబన సాధ్యమైంది.

* భారత ప్రభుత్వ చట్టం-1935 ప్రకారం 1937లో రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అయితే 1939లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమవడం, రాష్ట్ర ప్రభుత్వాలు రాజీనామా చేయడంతో స్థానిక స్వపరిపాలనా సంస్థల పరిస్థితి అయోమయంగా మారింది.

 

స్వాతంత్య్రానంతరం

1947లో మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ రూపకల్పన సమయంలో గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పరిపాలన వికేంద్రీకరణ, స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రాధాన్యాన్ని వివరిస్తూ శ్రీమన్నారాయణ్‌ అగర్వాల్‌ ‘గాంధీ ప్లాన్‌’ను ప్రతిపాదించారు.

 

గాంధీజీ - ఆలోచనలు

* గ్రామ స్వరాజ్యం ద్వారానే రామరాజ్యం సాధ్యమవుతుందని గాంధీజీ పేర్కొన్నారు. భారతదేశ ప్రగతికి గ్రామాలు పట్టుగొమ్మలని, పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రజల భాగస్వామ్యం పెంపొందించాలని ఆయన అన్నారు. * ప్రాచీన భారతంలో ప్రతి గ్రామం స్వయంసమృద్ధితో, చిన్న చిన్న రిపబ్లిక్‌లుగా కొనసాగేవన్నారు.

 

ప్రారంభ రాజ్యాంగంలో 

* 1950, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం IVవ భాగంలోని ఆదేశిక సూత్రాల్లో (ఆర్టికల్‌ 40) గ్రామ పంచాయతీల ఏర్పాటును పేర్కొన్నారు. వీటి ద్వారా పరిపాలనా వికేంద్రీకరణ, పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం సాధ్యమవుతుందని రాజ్యాంగ నిర్మాతలు భావించారు.

* రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజనను పేర్కొన్నారు. దీనిలో స్థానిక స్వపరిపాలనా సంస్థలను ఏర్పాటుచేసే బాధ్యతను రాష్ట్ర జాబితాలో చేర్చారు.

 

పీవీ హయాంలో రాజ్యాంగ హోదా


* పి.వి.నరసింహారావు ప్రభుత్వ కాలంలో 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ద్వారా ‘పంచాయతీరాజ్‌ వ్యవస్థ’కు రాజ్యాంగ భద్రత కల్పించారు. ఈ చట్టంతో రాజ్యాంగానికి IXవ భాగం చేర్చి, దానిలో ఆర్టికల్స్‌ 243, 243(A) నుంచి 243(O) వరకు పంచాయతీరాజ్‌/గ్రామీణ స్థానిక స్వపరిపాలనా సంస్థల విధివిధానాలను పేర్కొన్నారు.

* 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ద్వారా రాజ్యాంగానికి 11వ షెడ్యూల్‌ను చేర్చి, దానిలో పంచాయతీరాజ్‌ వ్యవస్థకు బదిలీ చేయాల్సిన 29 రకాల అధికారాలు, విధులను వివరించారు.

* పి.వి.నరసింహారావు ప్రభుత్వం 74వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ద్వారా పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించింది. ఈ చట్టం ప్రకారం రాజ్యాంగానికి IX(A) భాగాన్ని చేర్చి దానిలో ఆర్టికల్, 243(P) నుంచి  243(ZG) వరకు పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థల పరిపాలనను వివరించారు.

* 74వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ద్వారా రాజ్యాంగానికి కొత్తగా 12వ షెడ్యూల్‌ను చేర్చి, అందులో పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థలకు బదిలీ చేయాల్సిన 18 రకాల అధికారాలు, విధులను నిర్దేశించారు.

రచయిత: బంగారు సత్యనారాయణ

 

Posted Date : 02-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్థానిక స్వపరిపాలన: వివిధ కమిటీలు - సిఫారసులు

ప్రజలే పాలకులై.. స్థానిక నాయకులై!


ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ, పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతూ దేశాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు స్థానిక సంస్థలు అత్యంత కీలకమని అనేక కమిటీలు పేర్కొంటున్నాయి. అవసరమైన అధికారాలు, విధులు, నిధులు సమకూరిస్తే ప్రజాస్వామ్యానికి ప్రత్యక్ష వేదికలైన గ్రామాల్లో సమస్యల పరిష్కారం వేగంగా జరుగుతుందని చెబుతున్నాయి. దాంతోపాటు అధికార వికేంద్రీకరణకు అనేక సూచనలు చేశాయి. ఆ కమిటీలు, అవి చేసిన సిఫారసుల గురించి పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి.

 

 

బల్వంతరాయ్‌ మెహతా కమిటీ (1957): సమాజ అభివృద్ధి పథకం (సీడీపీ), జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం (ఎన్‌ఈఎస్‌ఎస్‌) పథకాల పనితీరుపై అధ్యయనం చేసేందుకు 1957, జనవరి 16న బల్వంతరాయ్‌ మెహతా కమిటీని జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డీసీ) ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ‘ప్రజాస్వామ్య వికేంద్రీకరణ - ప్రజల భాగస్వామ్యం’ అనే మౌలికాంశాలతో మూడంచెల పంచాయతీ వ్యవస్థను సిఫారసు చేస్తూ 1957, నవంబరు 24న ఒక నివేదిక సమర్పించింది. 1958, జనవరిలో ఎన్‌డీసీ దాన్ని ఆమోదించింది.

సిఫారసులు: *మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థ 1) దిగువ స్థాయి - గ్రామ పంచాయతీ 2) బ్లాకు/మధ్య స్థాయి - పంచాయతీ సమితి 3) ఉన్నత/జిల్లా స్థాయి - జిల్లా పరిషత్‌.

* గ్రామ పంచాయతీకి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు.

* బ్లాకు/మధ్యస్థాయి సభ్యులను వివిధ గ్రామ పంచాయతీల సభ్యులు ఎన్నుకోవాలి.

* జిల్లా/ఉన్నత స్థాయిలో సభ్యులను బ్లాకు స్థాయి సభ్యులు ఎన్నుకోవాలి. 

* స్థానిక సంస్థలకు రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా స్వతంత్ర ప్రాతిపదికపై ఎన్నికలు.

* పంచాయతీ సమితికి కార్యనిర్వాహక అధికారాలు, జిల్లా పరిషత్‌కు సలహా, పర్యవేక్షక అధికారాలు.  

* స్థానిక సంస్థలకు అయిదేళ్లకోసారి క్రమం తప్పకుండా ఎన్నికలు.

* జిల్లా పరిషత్‌కు ఛైర్మన్‌గా కలెక్టర్‌.

* భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి పథకాలన్నీ స్థానిక సంస్థల ద్వారానే నిర్వహించాలి.

* స్థానిక సంస్థలు సమర్థంగా పనిచేసేందుకు అవసరమైన ఆర్థిక వనరులు, అధికారాలను కల్పించాలి.

మూడంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రం రాజస్థాన్‌. 1959, అక్టోబరు 2న రాజస్థాన్‌లోని నాగోర్‌ జిల్లా సికార్‌ ప్రాంతంలో తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఈ విధానాన్ని ప్రారంభించారు. ‘‘నేడు ప్రారంభిస్తున్న స్థానిక స్వపరిపాలనా సంస్థలు భారత ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా పనిచేస్తాయి. జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయి. భవిష్యత్తు నాయకత్వానికి పాఠశాలలుగా తోడ్పడతాయి’’ అని ఆ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 

* మూడంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని అమలు చేసిన రెండో రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌. 1959, నవంబరు 1న ‘శంషాబాద్‌’ గ్రామంలో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి దాన్ని ప్రారంభించారు.

 

అశోక్‌ మెహతా కమిటీ (1977): స్థానిక స్వపరిపాలనను మరింత పటిష్ఠపరిచేందుకు, అవసరమైన విధానాలను అధ్యయనం చేసేందుకు జనతా ప్రభుత్వం 1977, డిసెంబరు 12న అశోక్‌ మెహతా కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో నంబూద్రిపాద్, ఎం.జి.రామచంద్రన్‌ సభ్యులు. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ విధానాలను అధ్యయనం చేసిన ఈ కమిటీ 1978, ఆగస్టు 21న 132 సిఫారసులతో నివేదిక సమర్పించింది.

సిఫారసులు: * రెండంచెల పంచాయతీరాజ్‌ విధానం. 1) బ్లాకు స్థాయి - మండల పరిషత్‌ 2) జిల్లా స్థాయి - జిల్లా పరిషత్‌

* మండల పరిషత్‌ అతికీలకమైన అంచెగా కొనసాగాలి. దీనిలో 15,000-20,000 వరకు జనాభా ఉండాలి.

* గ్రామ పంచాయతీలను రద్దు చేసి, వాటి స్థానంలో ‘గ్రామ కమిటీ’లను ఏర్పాటు చేయాలి.

* అభివృద్ధి పథకాల అమలు విషయంలో గ్రామ పంచాయతీని యూనిట్‌గా కాకుండా సబ్‌ యూనిట్‌గా ఏర్పాటు చేయాలి.  

* స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొనాలి. స్థానిక సంస్థల పదవీ కాలం నాలుగేళ్లు.

* పంచాయతీరాజ్‌ వ్యవస్థల పర్యవేక్షణకు పంచాయతీరాజ్‌ మంత్రి నియామకం.

* స్థానిక స్వపరిపాలనా సంస్థలకు క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి. షెడ్యూల్డు కులాలు, తెగ (ఎస్సీ, ఎస్టీ)లకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు.

* బలమైన కారణం లేకుండా స్థానిక సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయకూడదు. ఒకవేళ రద్దు చేస్తే ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి.

* మండల పరిషత్‌ అధ్యక్ష ఎన్నిక ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జరగాలి. జిల్లా పరిషత్‌ అధ్యక్ష ఎన్నిక మాత్రం పరోక్షంగానే ఉండాలి.

* స్థానిక సంస్థలు ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా పన్నులు విధించి, స్వతంత్రంగా నిధులు సమకూర్చుకునే అవకాశం కల్పించాలి.

* స్థానిక సంస్థల ఎన్నికలు సమర్థంగా నిర్వహించేందుకు స్వయంప్రతిపత్తి ఉన్న ఎన్నికల కమిషన్‌ ఉండాలి.

* అర్హుడైన న్యాయాధికారి అధ్యక్షతన ‘న్యాయ పంచాయతీ సంస్థల’ను ఏర్పాటుచేసి, వాటిని గ్రామ పంచాయతీల నుంచి వేరు చేయాలి.

* సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం కేటాయించిన నిధులు ఖర్చు చేసిన విధానంపై సామాజిక తనిఖీ (సోషల్‌ ఆడిట్‌) ఉండాలి.

* ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను మండల పరిషత్‌లు కల్పించాలి.

‘‘స్థానిక స్వపరిపాలనా సంస్థలు విఫలమైన భగవంతుడు కాదు, వాటికి సరైన నిధులు, విధులు సమకూరిస్తే విజయవంతంగా పనిచేస్తాయి’’ అని అశోక్‌ మెహతా కమిటీ పేర్కొంది. ఈ కమిటీ సిఫారసులను 1979లో జరిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించారు. మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం పతనం కావడంతో మొత్తం సిఫారసులు అమల్లోకి రాలేదు. కొన్ని రాష్ట్రాలు మార్పులు, చేర్పులతో కొన్నింటిని అమలు చేశాయి.

* మండల పరిషత్‌ వ్యవస్థను అమలు చేసిన తొలి రాష్ట్రం కర్ణాటక. 1985, అక్టోబరు 2న అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

* మండల పరిషత్‌ వ్యవస్థను అమలు చేసిన రెండో రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌. 1986, జనవరి 13న నాటి ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు  ప్రారంభించారు.

 

దంతెవాలా కమిటీ (1978): ‘బ్లాకు’ స్థాయి ప్రణాళికీకరణపై అధ్యయనం కోసం దంతెవాలా కమిటీని 1978లో జనతా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

సిఫారసులు: * ‘బ్లాకు’ను ఒక యూనిట్‌గా తీసుకుని ప్రణాళికా రచన చేయాలి.

* మాధ్యమిక స్థాయిలో ‘బ్లాకు’ వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వాలి.

* జిల్లా స్థాయి ప్రణాళికా రూపకల్పనలో కలెక్టర్‌దే కీలకపాత్ర.

* గ్రామస్థాయిలో సర్పంచ్‌ పదవికి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నిక.

 

సీహెచ్‌ హనుమంతరావు కమిటీ (1984): ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో ‘జిల్లా స్థాయి’ ప్రణాళికీకరణపై అధ్యయనం చేసేందుకు 1984లో సీహెచ్‌ హనుమంతరావు కమిటీని ఏర్పాటు చేశారు.

సిఫారసులు: * జిల్లా స్థాయిలో జిల్లా ప్రణాళికా బోర్డులను ఏర్పాటు చేయాలి.

* జిల్లా ప్రణాళికా సంఘానికి కలెక్టర్‌ లేదా మంత్రి అధ్యక్షత వహించాలి.

* జిల్లా స్థాయిలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సమన్వయకర్త కలెక్టర్‌.

 

జి.వి.కె.రావు కమిటీ (1985): రాజీవ్‌గాంధీ ప్రభుత్వ కాలంలో ప్రణాళికా సంఘం ‘గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, పరిపాలనా ఏర్పాట్లు’ అనే అంశాలను అధ్యయనం చేసేందుకు 1985లో జి.వి.కె.రావు అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది.

సిఫారసులు: * బ్లాకు వ్యవస్థ, బీడీఓ పదవుల రద్దు.

* జిల్లా అభివృద్ధి అధికారి (డీడీఓ) పదవి ఏర్పాటు.

* జిల్లా స్థాయి యూనిట్‌లకు ప్రణాళిక విధుల బదిలీ.

* జిల్లా స్థాయిలో నైష్పత్తిక ప్రాతినిధ్యంతో కూడిన ఉప కమిటీల ఏర్పాటు.

* స్థానిక సంస్థలకు నిర్ణీత పదవీకాలం ప్రకారం ఎన్నికలు.

‘‘భారతదేశంలో ఉద్యోగస్వామ్యం కారణంగా పరిపాలనా స్ఫూర్తి దెబ్బతింటోంది. ఇది పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలహీనపరచింది. దీంతో ప్రజాస్వామ్యం వేళ్లూనుకున్న వ్యవస్థగా కాకుండా, వేర్లు లేని వ్యవస్థగా మారింది’’ అని జి.వి.కె.రావు కమిటీ ఆక్షేపించింది.

 

ఎల్‌.ఎం. సింఘ్వీ కమిటీ (1986):  ‘ప్రజాస్వామ్యం, అభివృద్ధి సాధనకు పంచాయతీరాజ్‌ సంస్థల పునర్నిర్మాణం’ అనే అంశంపై అధ్యయనం చేయడానికి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1986లో ఎల్‌.ఎం.సింఘ్వీ కమిటీని ఏర్పాటు చేసింది.

సిఫారసులు: * స్థానిక స్వపరిపాలనా సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించాలి. 

* గ్రామీణ పరిపాలనలో ‘గ్రామసభ’కు ప్రాధాన్యం, ప్రత్యక్ష ప్రజాస్వామ్య వేదికగా గుర్తింపు ఇవ్వాలి.

* కొన్ని గ్రామాల సమూహాన్ని కలిపి న్యాయ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలి.

* స్థానిక స్వపరిపాలనా సంస్థల ఎన్నికల వివాదాల పరిష్కారం కోసం న్యాయ ట్రైబ్యునల్స్‌ ఉండాలి.

* స్థానిక స్వపరిపాలనా సంస్థలకు క్రమం తప్పకుండా, సకాలంలో ఎన్నికలు నిర్వహించాలి. ఇందుకోసం స్వయంప్రతిపత్తి ఉన్న ఎన్నికల సంఘం ఏర్పాటు చేయాలి.

* స్థానిక స్వపరిపాలనా సంస్థల అభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరులను, అధికారాలను, విధులను కేటాయించాలి. ఇందుకోసం రాష్ట్రస్థాయిలో రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి.

 

పి.కె.తుంగన్‌ కమిటీ (1988):  స్థానిక స్వపరిపాలనను పటిష్ఠ పరిచేందుకు అవసరమైన సిఫారసులు చేసేందుకు రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1988లో అప్పటి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పి.కె.తుంగన్‌ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది.

సిఫారసులు: * స్థానిక స్వపరిపాలనా సంస్థలకు రాజ్యాంగ హోదా, దేశంలో మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.

* జిల్లా పరిషత్‌కు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) గా కలెక్టర్‌ ఉండాలి.

* స్థానిక సంస్థల పదవీకాలం నిర్దిష్టంగా అయిదేళ్లు.

* జనాభా ఆధారంగా వివిధ వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలి.

* జిల్లా ప్రణాళికా అభివృద్ధికి ఏజెన్సీగా జిల్లా పరిషత్‌ ఉండాలి.

 

వి.ఎన్‌.గాడ్గిల్‌ కమిటీ (1988): రాజీవ్‌గాంధీ ప్రభుత్వ కాలంలో స్థానిక స్వపరిపాలనపై అధ్యయనం కోసం 1988లో వి.ఎన్‌.గాడ్గిల్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది.

సిఫారసులు: * స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా ఇవ్వాలి. ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు, మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి.


రచయిత: బంగారు సత్యనారాయణ 
 

Posted Date : 11-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మండల పరిషత్‌

 సంక్షేమ పాలనకు సమన్వయ వేదిక!

 

 

మండల స్థాయిలో నిర్వహించాల్సిన అభివృద్ధి, సంక్షేమ పనుల గురించి చర్చించి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏర్పాటైన పంచాయతీరాజ్‌ సంస్థే మండల పరిషత్‌. స్థానిక స్వపరిపాలనలో ఇది కీలక అంచె. గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి, అభివృద్ధి కార్యక్రమాల అమలులో గ్రామాల మధ్య సమన్వయానికి కృషి చేస్తుంది. పంచాయతీరాజ్‌ వ్యవస్థలో దిగువ, ఎగువ సంస్థలైన పంచాయతీలు, జిల్లా పరిషత్‌కు అనుసంధాన కేంద్రంగా వ్యవహరిస్తుంది. మండల పరిషత్‌ నిర్మాణం, సభ్యులు, అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికతో పాటు మండల పాలన జరిగే విధానాన్ని పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.

 

మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థలో రెండో అంచె మండల పరిషత్‌. జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీకి మధ్య ఉన్న ‘మాధ్యమిక వ్యవస్థ’ ఇది.

నేపథ్యం: 1978లో పంచాయతీరాజ్‌ వ్యవస్థపై అధ్యయనం చేసిన అశోక్‌ మెహతా కమిటీ రెండంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని సిఫార్సు చేసింది. అవి మండల పరిషత్, జిల్లా పరిషత్‌. దీనిలో మండల పరిషత్‌ అత్యంత కీలకమైన అంచె.

* మండల పరిషత్‌ విధానాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రం కర్ణాటక (1985, అక్టోబరు 2).

* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌.టి.రామారావు ప్రభుత్వం 1986లో ‘ఏపీ మండల పరిషత్‌లు, జిల్లా ప్రజాపరిషత్‌లు, జిల్లా ప్రణాళికా అభివృద్ధి సమీక్ష మండలాల చట్టం’ రూపొందించింది. అది 1987, జనవరి 15 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం అప్పటికే రాష్ట్రంలో అమలులో ఉన్న 330 పంచాయతీ సమితులను రద్దు చేసి వాటి స్థానంలో 1104 మండల పరిషత్‌లు ఏర్పాటు చేశారు.

 

వివరణ: ప్రతి జిల్లాను పరిపాలనా సౌలభ్యం కోసం వివిధ మండలాలుగా విభజిస్తారు. మండలానికి సంబంధించిన పరిపాలనా విభాగమే మండల పరిషత్‌.  ప్రతి మండల పరిషత్‌లో సుమారు 35 వేల నుంచి 50 వేల జనాభా, 25 నుంచి 30 గ్రామ పంచాయతీలు ఉంటాయి.

 

ఎంపీటీసీ: 

* ప్రతి మండల పరిషత్‌ను పరిపాలనా సౌలభ్యం కోసం జనాభా ఆధారంగా మండల ప్రాదేశిక నియోజకవర్గంగా (ఎంపీటీసీ) విభజిస్తారు.

* ప్రతి ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ఎంపీటీసీ సభ్యుడు/సభ్యురాలిని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు.

* ప్రతి ఎంపీటీసీ సభ్యుడు/సభ్యురాలు సుమారు 3,500 మంది జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తారు.

* మండల పరిషత్‌లో ఉండాల్సిన కనీస ఎంపీటీసీ సభ్యుల సంఖ్య 7, గరిష్ఠ సంఖ్య 23.

* మండల పరిషత్‌కు మైనార్టీ వర్గానికి చెందిన ఒకరిని కో ఆప్టెడ్‌ సభ్యుడిగా (ఎంపీటీసీ) నామినేట్‌ చేస్తారు.

* ఒక మండల పరిషత్‌లో ఓటరుగా నమోదైన వ్యక్తి ఆ మండల పరిషత్‌లోని ఏ ప్రాదేశిక నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేయవచ్చు. కానీ ఒక మండల పరిషత్‌లో ఓటరుగా నమోదైన వ్యక్తి వేరే మండల పరిషత్‌ నుంచి పోటీ చేయకూడదు.

 

ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక: ఎంపీటీసీ సభ్యులు తమలో నుంచి ఒకరిని మండల పరిషత్‌కు అధ్యక్షుడిగా (ఎంపీపీ), మరొకరిని ఉపాధ్యక్షుడిగా (వైస్‌ ఎంపీపీ) పరోక్ష పద్ధతిలో చేతులు ఎత్తడం ద్వారా ఎన్నుకుంటారు. మండల పరిషత్, జిల్లా పరిషత్‌ ఎన్నికలు పార్టీల పరంగా జరుగుతాయి.

రిజర్వేషన్లు: 

* ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వారి జనాభా ఆధారంగా రిజర్వేషన్లు నిర్దేశించాలి. వారికి కేటాయించిన రిజర్వేషన్లలో ఆ వర్గం మహిళలకు 1/3వ వంతు కల్పించాలి.

* ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి.

* వెనుకబడిన వర్గాల వారికి ఎంత శాతం రిజర్వేషన్లు ఉండాలనేది సంబంధిత రాష్ట్ర శాసనసభలు రూపొందించే చట్టాల ఆధారంగా నిర్ణయిస్తారు.

* ప్రస్తుతం రాష్ట్రంలో ఓబీసీ వర్గాల వారికి 34 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి.

ఎన్నికలు: 

* ఆర్టికల్‌ 243(కె) ప్రకారం ఏర్పడిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహిస్తుంది.

* ఎంపీటీసీ ఎన్నికల బ్యాలట్‌ పత్రం రంగు - గులాబీ.

అర్హతలు-అనర్హతలు:

 * ఎంపీటీసీగా పోటీ చేయాలంటే 21 సంవత్సరాలు నిండి ఉండాలి.

* సంబంధిత మండల పరిషత్‌ ఓటర్ల జాబితాలో పేరు నమోదై ఉండాలి.

* దివాలా తీసి ఉండకూడదు.

* స్థానిక సంస్థలకు బకాయిపడిన వ్యక్తి ఎన్నికల్లో పోటీకి అనర్హుడు.

* 1995, మే 30 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగిన దంపతులు పోటీకి అనర్హులు.

కాలపరిమితి: 

మండల పరిషత్‌ కాలపరిమితి 5 సంవత్సరాలు. 

* ఎంపీటీసీ, ఎంపీపీ, వైస్‌ ఎంపీపీల కాలపరిమితి 5 సంవత్సరాలు. 
* ఏదైనా కారణంతో ఎంపీటీసీ, ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ స్థానాలకు ఖాళీ ఏర్పడితే 6 నెలల్లోపు ఉపఎన్నికలు నిర్వహించి, సంబంధిత ఖాళీలను భర్తీ చేయాలి.

రాజీనామా: ఎంపీటీసీలు, కో-ఆప్టెడ్‌ సభ్యుడు, మండల అధ్యక్షుడు (ఎంపీపీ), మండల ఉపాధ్యక్షుడు (వైస్‌ ఎంపీపీ) తమ రాజీనామాలను జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (జడ్పీ సీఈఓ)కి సమర్పించాలి.

 

మండల పరిషత్‌ నిర్మాణం, సభ్యులు:

* మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (ఎంపీటీసీలు)

* మండల పరిషత్‌ పరిధిలోని శాసనసభ్యుడు (ఎమ్మెల్యే)

* మండల పరిషత్‌ పరిధిలోని లోక్‌సభ సభ్యుడు (ఎంపీ)

* మండల ఓటర్ల జాబితాలో ఓటరుగా ఉన్న రాజ్యసభ సభ్యుడు (ఎంపీ)

* మండల ఓటర్ల జాబితాలో ఓటరుగా ఉన్న శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ)


మండల పరిషత్‌ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు:

1) జిల్లా కలెక్టర్‌

2) మండల పరిషత్‌ నుంచి ఎన్నికైన జడ్పీటీసీ సభ్యుడు

3) మండల వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ ఛైర్మన్‌

4) మండల పరిషత్‌ పరిధిలోని సర్పంచ్‌లు.

 

మండల పరిషత్‌ - అధికారాలు - విధులు:

* గ్రామ పంచాయతీల సాధారణ విధుల నియంత్రణ

* పశు సంపద అభివృద్ధి, చేపల పెంపకాన్ని ప్రోత్సహించడం

* వ్యవసాయోత్పత్తుల గణనీయ పెంపుదలకు కృషి

* ప్రజల సహకారంతో వివిధ సామాజిక అభివృద్ధి కార్యక్రమాల అమలు

* మండల పరిషత్‌ నిధులతో వివిధ రకాల ట్రస్టులను నిర్వహించడం

* రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన గణాంకాలను సమర్పించడం

* గ్రామీణ పారిశుద్ధ్య వసతుల పెంపుదలకు కృషి

* వైద్య, ఆరోగ్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం

* మండల పరిషత్‌ పరిధిలో రవాణా సౌకర్యాల అభివృద్ధికి కృషి

* స్వయంసహాయక పథకాల అమలు, ప్రజల జీవన ప్రమాణాల పెంపు

* ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు, పర్యవేక్షణ

* అగ్నిప్రమాదాలు, వరదలు, అంటువ్యాధులు సంభవించినప్పుడు సహాయ కార్యక్రమాల నిర్వహణ

* సమాచార కేంద్రాలు, రైతు కేంద్రాలు, గ్రంథాలయాల ఏర్పాటు

* సహకార రంగ పటిష్టతకు కృషి

* సహకార పరపతి సంఘాలు, నీటిపారుదల సొసైటీలు, వ్యవసాయ సొసైటీల ఏర్పాటు

* మహిళా, శిశు సంక్షేమ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ

* వయోజన విద్యా కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ

* అంటరానితనం నిర్మూలన, సాంఘిక దురాచారాల నిర్మూలనకు కృషి

* సాంఘిక సంక్షేమం కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు పథకాలు అమలు పరచడం

మండల పరిషత్‌ అధ్యక్షుడు-అధికారాలు-విధులు

* మండల పరిషత్‌ సమావేశాలకు అధ్యక్షత వహించి, సమావేశాలను సమర్థంగా నిర్వహించడం.

* ఈయన మండల పరిషత్‌కు ప్రథమ పౌరుడు, రాజకీయ అధిపతి.

* మండల పరిషత్‌ రికార్డుల తనిఖీ, పర్యవేక్షణకు సంపూర్ణ అధికారం ఉంటుంది.

* మండల పరిషత్‌ తీర్మానాల అమలులో మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)పై నియంత్రణ ఉంటుంది.

* ప్రజాసంక్షేమం దృష్ట్యా అత్యవసర పనులు చేపట్టాలని ఎంపీడీఓను ఆదేశిస్తారు.

 

మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు-అధికారాలు-విధులు:

* అధ్యక్షుడు మండల పరిషత్‌కు హాజరుకానప్పుడు ఆ బాధ్యతలను నిర్వహించడం.

* మండలాధ్యక్ష పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు నూతన అధ్యక్షుడు ఎన్నికయ్యేంత వరకు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడం.

* అధ్యక్షుడు లిఖితపూర్వకంగా బదిలీ చేసిన అధికార విధులు నిర్వహించడం.

 

అవిశ్వాస తీర్మానం, తొలగింపు:  

* ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలను ఎంపీటీసీ సభ్యులు 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీ ద్వారా అవిశ్వాస తీర్మానంతో తొలగించొచ్చు.

* మండల పరిషత్‌ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయకపోయినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా వారిని రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తుంది. ఇలా వైదొలిగినవారు రెండేళ్ల వరకు తిరిగి ఆ పదవులకు పోటీ చేయలేరు.

 

మండల పరిషత్‌ - ఆర్థిక వనరులు:

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులు.

* భూమి శిస్తు, వినోదపు పన్ను.

* ఖాదీ బోర్డు, గ్రామీణ కుటీర పరిశ్రమల బోర్డు మొదలైన సంస్థలు సమకూర్చే గ్రాంట్లు.

* సాముదాయక అభివృద్ధి పథకం కింద ప్రభుత్వం నుంచి లభించే గ్రాంట్లు.

* మండల పరిషత్‌ విధించే ఫీజులు, సెస్సులు.

* గ్రామ పంచాయతీల నుంచి మండల పరిషత్‌ వసూలు చేసే మొత్తం.

* మండల పరిషత్‌లోని జనాభా సంఖ్య లెక్కన ఒక్కో వ్యక్తికి రూ.5 చొప్పున వార్షిక గ్రాంటుని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది.

* జిల్లా పరిషత్‌ ఆదాయం నుంచి మండల పరిషత్‌కు లభించే వాటా.

* మండల పరిషత్‌ విధించే పన్నులు, సర్‌ఛార్జీలు.

* వివిధ వర్గాల నుంచి లభించే విరాళాలు.

* మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)

* ఎంపీడీఓ మండల పరిషత్‌కు పరిపాలనా అధిపతి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన గ్రూప్‌-1 స్థాయి అధికారి.

* మండల పరిషత్‌కు ప్రధాన కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తారు.

* మండల పరిషత్‌ తీర్మానాలను అమలు చేస్తారు.

* రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఉత్తర్వుల అమలు కోసం కృషి చేస్తారు.

* నెలకోసారి మండల పరిషత్‌ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు.

* మండలంలోని గ్రామ పంచాయతీలపై పర్యవేక్షణాధికారాలు ఉంటాయి.

* మండలాధ్యక్షుడిని సంప్రదించి మండల పరిషత్, మండల మహాసభ సమావేశాలు ఏర్పాటు చేస్తారు.

* మండల పరిషత్‌లోని ఉద్యోగులపై పర్యవేక్షణ, నియంత్రణాధికారాలు కలిగి ఉంటారు.

* మండల పరిషత్‌ సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు. కానీ తీర్మానాల విషయంలో ఓటు హక్కు ఉండదు.

* మండల పరిషత్‌ చివరి సమావేశం జరిగిన తేదీ నుంచి 90 రోజుల్లోపు మరో సమావేశాన్ని ఏర్పాటు చేయకపోతే ఎంపీడీవోపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది.

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 17-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత ప్రజా ప్రాతినిధ్య చట్టాలు

భారత ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951

ఈ చట్టంలో చట్టసభలకు పోటీచేసే అభ్యర్థుల అర్హతలు, అనర్హతలు, ఎన్నికల నిర్వహణ, ఎన్నికల సంబంధమైన వివరాలు, ఇతర అంశాలు ఉన్నాయి. ఇందులోని కీలకమైన సెక్షన్లు, వాటి వివరణ.

సెక్షన్‌ 8(3): 

* నేరం రుజువై రెండేళ్ల జైలుశిక్షకు గురైన వారు ఎన్నికల్లో పోటీ¨కి అనర్హులు. వీరు జైలు  నుంచి విడుదలైన తర్వాత కూడా ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకూడదు.

సెక్షన్‌ 8(4): 

* ఏ చట్టసభ సభ్యుడినైనా దిగువ న్యాయస్థానం ‘దోషి’గా నిర్ధారించినప్పుడు, వారు దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీలు చేయొచ్చు. 

* దిగువ న్యాయస్థానం తీర్పు వెలువరించిన తేదీ నుంచి 3 నెలల వరకు సంబంధిత సభ్యుడికి అనర్హత వేటు నుంచి మినహాయింపు ఉంటుంది (ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకోవడానికి వీలుగా). 

* ఆ వ్యక్తి ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకున్నాక, అది పెండింగ్‌లో ఉన్నంతకాలం అనర్హత వేటు నుంచి రక్షణ పొందుతాడు.

సెక్షన్‌ 29 (A): రాజకీయ పార్టీల నమోదు.

సెక్షన్‌ 29 (B): విరాళాల స్వీకరణకు రాజకీయ పార్టీలకు అనుమతి.
సెక్షన్‌ 29 (C): రాజకీయ పార్టీల విరాళాలపై ధ్రువీకరణ.

సెక్షన్‌ 62 (5): చట్టసభల్లో సభ్యుడిగా కొనసాగాలంటే వారికి ఓటు హక్కు ఉండాలి. 

సెక్షన్‌ 75(A): ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పుల వివరాలను ధ్రువీకరించి, ప్రకటించాలి.

సెక్షన్‌ 77: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై పరిమితులు.

సెక్షన్‌ 78: ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు ఎన్నికలు ముగిసిన 30 రోజుల్లోగా ఎన్నికల వ్యయం వివరాలను ఆయా జిల్లాల ఎన్నికల అధికారులకు సమర్పించాలి.

సెక్షన్‌ 80 (A): పార్లమెంట్, రాష్ట్రశాసనసభల ఎన్నికల పిటిషన్లపై విచారణ చేసే అధికారం హైకోర్టుకు ఉంటుంది.

సెక్షన్‌ 102: ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులకు సమానమైన ఓట్లు వచ్చినప్పుడు, హైకోర్టు పర్యవేక్షణలో లాటరీ ద్వారా ఎన్నిక ఫలితాన్ని నిర్ణయిస్తారు.

సెక్షన్‌ 116 (A): ఎన్నికల వివాదాలపై హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టులో అప్పీలు చేయొచ్చు.
సెక్షన్‌ 123: అవినీతి చర్యలకు పాల్పడిన వారు ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హులు.
సెక్షన్‌ 125(A): ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్లను సమర్పిస్తే వారు శిక్షార్హులు అవుతారు.
సెక్షన్‌ 126: ఎన్నికల ప్రచార గడువు ముగిసిన తర్వాత బహిరంగ సభలు నిర్వహించడం నేరం.
సెక్షన్‌ 126(A): ఎన్నికలు జరిగే తేదీకి 48 గంటల ముందు ఆ ప్రాంతాలలో సభలు,సమావేశాలునిర్వహించడం;దృశ్య,శ్రవణ సాధనాల ద్వారా ప్రచారం చేయడం నిషేధం.

సెక్షన్‌ 128: ఎన్నికల ప్రకియలో రహస్య ఓటింగ్‌ విధానాన్ని ఉల్లంఘించినవారు శిక్షార్హులు అవుతారు.
సెక్షన్‌ 134(A): ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ఏజెంట్లు, పోలింగ్‌ ఏజెంట్లు, కౌంటింగ్‌ ఏజెంట్లుగా వ్యవహరిస్తే శిక్షకు గురవుతారు.
సెక్షన్‌ 134(B): ఎన్నికల సమయంలో పోలింగ్‌ ౠత్‌ల వద్ద ఆయుధాలతో సంచరించడం నేరం.
సెక్షన్‌ 146: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 103 ప్రకారం పార్లమెంట్‌ సభ్యులను అనర్హులుగా ప్రకటించే సందర్భంలో రాష్ట్రపతి; ఆర్టికల్‌ 192 ప్రకారం శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించే సందర్భంలో గవర్నర్‌ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలి.

సెక్షన్‌ 158: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తాము చెల్లించిన ‘డిపాజిట్‌’ (ధరావత్తు)ను తిరిగి పొందాలంటే పోలైన మొత్తం ఓట్లలో 1/6వ వంతు చెల్లుబాటయ్యే ఓట్లు పొందాలి. లేకపోతే డిపాజిట్‌ కోల్పోతారు.
సుప్రీంకోర్టు తీర్పులు
* ‘‘శిక్షకు గురైన ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. హైకోర్టులో అప్పీలు పెండింగ్‌లో ఉందనే కారణంతో చట్టసభల సభ్యుల అనర్హతకు వాయిదా కల్పిస్తున్న ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8(4) రాజ్యాంగ విరుద్ధం’’ - సుప్రీంకోర్టు

* క్రిమినల్‌ నేరాల్లో దోషులుగా నిర్ధారణై, రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలుశిక్షకు గురైన పార్లమెంట్‌ లేదా రాష్ట్రాల శాసనసభల సభ్యులు తక్షణమే అనర్హులవుతారని 2013లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

* క్రిమినల్‌ కేసుల్లో రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్షకు గురైన ప్రజాప్రతినిధులుపై తక్షణమే అనర్హత వేటు పడుతుందని 2013లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే డా.మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దీనిపై ఒక బిల్లును రూపొందించింది. ఇది పార్లమెంట్‌లో ఆమోదం పొందలేదు.

* దీంతో ఈ బిల్లుకు ప్రత్యామ్నాయంగా 2013, సెప్టెంబరు 24న ‘ఆర్డినెన్స్‌’ జారీకి అప్పటి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

* దీని ప్రకారం, దోషులుగా నిర్ధారణ అయిన చట్టసభల సభ్యులు 90 రోజుల్లోగా ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీలు చేసుకోవచ్చు. అక్కడి నుంచి ‘స్టే’ తెచ్చుకుంటే అనర్హత వేటు నుంచి తప్పించుకోవచ్చు.
* ఈ ఆర్డినెన్స్‌పై తీవ్ర విమర్శలు రావడంతో ఆర్డినెన్స్‌తో పాటు సంబంధిత బిల్లును మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 

ప్రజాప్రాతినిధ్య (సవరణ) చట్టం, 2013

* ఈ చట్టం ప్రకారం, ఇతర దేశాల పౌరసత్వం స్వీకరించకుండా భారతదేశం బయట (విదేశాల్లో) నివసిస్తున్న భారతీయులు ఆన్‌లైన్‌లో లేదా ఇతర ఎలక్ట్రానిక్‌ విధానంలో ఓటుహక్కును వినియోగించుకోవచ్చు. ఇది 2011, ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి వచ్చింది.

ప్రజాప్రాతినిధ్య (సవరణ, ధ్రువీకరణ) చట్టం, 2013
* ఓటర్ల జాబితాలో పేరు ఉన్న వ్యక్తి పోలీసు కస్టడీలో లేదా జైలులో ఉంటే, ఆ కారణంతో తన ఓటుహక్కు కోల్పోడు. జైలులో ఉన్నవారి ఓటుహక్కును తాత్కాలికంగానే నిలిపివేస్తారు. ఓటరుగా వారి గుర్తింపు కొనసాగుతుంది.
* పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ ఫౌండేషన్‌ జు( యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు విచారణ సందర్భంగా రాజకీయ నేతల అనర్హత అంశంపై అధ్యయనం చేసి, నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు ‘లా కమిషన్‌ ఆఫ్‌ ఇండియా’ను కోరింది.
* ఇది ‘ఎలక్టోరల్‌ డిస్‌క్వాలిఫికేషన్స్‌’ అనే పేరుతో కీలకమైన సిఫార్సులు చేసింది. అవి:
*  అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చేవారిని అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు భావించాలి. వారికి రెండేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష విధించాలి.
* ఎన్నికల నామినేషన్‌ను పరిశీలించే సమయానికి ఏడాది ముందు నమోదైన అభియోగాల ఆధారంగా సదరు అభ్యర్థిపై అనర్హత వేటు వేయకూడదు.
* అభియోగాలపై విచారణ చేపట్టిన ట్రయల్‌ కోర్టు సంబంధిత చట్టసభ సభ్యుడిపై శిక్ష ఖరారు చేస్తే, అది పూర్తయ్యే వరకు లేదా ఆరేళ్ల వరకు సదరు వ్యక్తి ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి.
* పదవిలో కొనసాగుతున్న పార్లమెంట్, శాసనసభ్యులపై నమోదయ్యే అభియోగాలపై రోజువారీ విచారణ చేపట్టి,సంవత్సరంలోపు దాన్ని పూర్తి చేయాలి.
రాజ్యాంగ సమీక్ష కమిషన్‌ సిఫార్సులు

* జస్టిస్‌ ఎం.ఎన్‌.వెంకటాచలయ్య నేతృత్వంలోని రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌ చట్ట

సభల సభ్యుల అర్హతలు, అనర్హతలపై కొన్ని సిఫార్సులు చేసింది. అవి:
* అయిదేళ్ల వరకు జైలుశిక్ష విధించే నేరాభియోగం ఎదుర్కొంటున్నవారు పార్లమెంట్, రాష్ట్రశాసనసభల ఎన్నికల్లో పోటీచేయకుండా నిరోధించాలి.
* హత్య, అత్యాచారం, అక్రమ రవాణా లాంటి తీవ్ర నేరాలకు పాల్పడిన వారిని ఎన్నికల్లో పోటీచేయకుండా శాశ్వతంగా నిరోధించాలి.
రెండో పరిపాలనా సంస్కరణల సంఘం సిఫార్సులు
* వీరప్ప మొయిలీ నేతృత్వంలోని రెండో పరిపాలనా సంస్కరణల సంఘం ప్రజాప్రతినిధుల అనర్హతలకు సంబంధించి ముఖ్య సిఫార్సు చేసింది. 

అది: తీవ్రమైన నేరాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అనర్హులుగా ప్రకటిస్తూ ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్‌ 8ని సవరించాలి.
సభ్యత్వం కోల్పోయిన వారు
రషీద్‌ మసూద్‌: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఈయన ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. మెడికల్‌ సీట్ల కేటాయింపులో అవినీతికి పాల్పడినట్లు నేరం రుజువు కావడంతో అనర్హతకు గురయ్యారు. ఈయన పార్లమెంట్‌ నుంచి అనర్హతకు గురైన తొలి వ్యక్తి.
లాలూ ప్రసాద్‌యాదవ్‌: ఆర్‌జేడీ పార్టీకి చెందిన ఈయన బిహార్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. పశుగ్రాస కుంభకోణంలో నేరం రుజువు కావడంతో అనర్హత వేటు పడింది. ఈయన పార్లమెంట్‌ నుంచి అనర్హతకు గురైన రెండో వ్యక్తి.
జయలలిత: ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే నేరం రుజువు కావడంతో ఈమె తన శాసనసభ్యత్వాన్ని (ఎంఎల్‌ఏ), తత్ఫలితంగా ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు.
రాహుల్‌ గాంధీ: 2019 నాటి పరువునష్టం కేసులో ఈయనకు రెండేళ్లు శిక్ష విధిస్తూ సూరత్‌ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఈయన తన ఎంపీ పదవిని కోల్పోయారు. ఈయన కాంగ్రెస్‌ తరఫున వయనాడ్‌ నియోజక వర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.
అనర్హతకు గురయ్యే సందర్భాలు
చట్టసభల సభ్యులు/ ప్రజాప్రతినిధులు కింది సందర్భాల్లో అనర్హతకు గురువుతారు.
* కులం, మతం, వర్గం, ప్రాంతం, భాష ప్రాతిపదికగా ఓట్లను అభ్యర్థించడం.
* ఎన్నికల నిర్వహణ సమయంలో పోలింగ్‌ ౠత్‌ను ఆక్రమించడం, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం.
* వివిధ వర్గాల ప్రజల మధ్య భావోద్వేగాలను ప్రేరేపించి, అల్లర్లను ప్రోత్సహించడం.
* ఆహార ఔషధ కల్తీ నిరోధక చట్టం కింద శిక్షకు గురైనప్పుడు. 
* ఎన్నికల వ్యయం పరిమితికి మించి  చేసినప్పుడు
* ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే విధంగా లంచం ఇవ్వడం.

* ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (IPC)లోని సెక్షన్ల ప్రకారం క్రిమినల్‌ నేరం నిరూపితమైనప్పుడు.

* ఎన్నికల వ్యయానికి సంబంధించిన లెక్కలను నిర్ణీత గడువులోగా సమర్పించడంలో విఫలమైనప్పుడు.

* నిమ్నవర్గాలకు చెందిన వారిపట్ల అనుచితంగా ప్రవర్తించి, అస్పృశ్యత నేరనిషేధ చట్టం ప్రకారం శిక్షకు గురైనప్పుడు.

* చట్టసభకు ఎనికైన సభ్యుడికి ఎన్నికైన తేదీ నాటికి తగిన అర్హతలు లేవని రుజువైనప్పుడు.

* ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు రుజువైనప్పుడు.
 

Posted Date : 12-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

  భారత రాజ్యాంగ రచన - స్వభావం

సేకరించి.. మథించి.. సవరించి!


ప్రపంచంలోని అన్ని దేశాల రాజ్యాంగాలను శోధించి, సేకరించి, అందులోని ఆదర్శ విధానాలను, అనుసరణీయ లక్షణాలను అధ్యయనం చేసి, మథించి, అవసరమైన సవరణలు చేసి మన రాజ్యాంగంలో చేర్చారు. స్వాతంత్య్ర పోరాట లక్ష్యాలను, ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వాలకు నిర్దేశకాలుగా మార్చారు. దేశ పరిస్థితులకు తగిన పాలనా ఏర్పాట్లను సంస్థాగతంగా సమకూర్చారు. వీటిపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ప్రధాన దేశాల నుంచి గ్రహించిన లక్షణాలు, రాజ్యాంగ నిర్మాణ సభ స్వరూపం, గొప్పతనం గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.

 

1. కిందివాటిలో సరికానిది?

1) ముసాయిదా రాజ్యాంగానికి 7,635 సవరణలు ప్రతిపాదించారు.

2) ముసాయిదా రాజ్యాంగాన్ని లార్డ్‌ మౌంట్‌బాటన్‌ ధ్రువీకరించారు.

3) ముసాయిదా రాజ్యాంగానికి ఎక్కువ సవరణలు ప్రతిపాదించినవారు హెచ్‌.వి.కామత్‌

4) రాజ్యాంగ సభ చర్చల్లో 7 రోజుల పాటు 24 మంది అమెరికన్లు పాల్గొన్నారు.

 

2. కింద పేర్కొన్న అంశాల్లో సరికానిది?

1) రాజ్యాంగ సభ 11 సమావేశాలు కలిపి 165 రోజులు జరిగాయి.

2) ముసాయిదా రాజ్యాంగంపై 114 రోజులు సమగ్రమైన చర్చ జరిగింది.

3) ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ 1949, నవంబరు 26న (శనివారం) ఆమోదించింది.

4) ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించే సమయంలో గాంధీజీ పాల్గొన్నారు.

 

3. మన దేశంలో 2015 నుంచి రాజ్యాంగ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తున్నారు?

1) జనవరి 26 2) డిసెంబరు 3) నవంబరు 26 4) ఏప్రిల్‌ 14


4. 1949, నవంబరు 26న ఆమోదించిన రాజ్యాంగం 1950, జనవరి 26 నుంచి అమల్లోకి రావడానికి ప్రధాన కారణం?

1) లాహోర్‌లో ఆమోదించిన సంపూర్ణ స్వరాజ్‌ తీర్మానం

2) జవహర్‌లాల్‌ నెహ్రూ ఉద్దేశాల తీర్మానం

3) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సూచన

4) స్వాతంత్య్రం ఇచ్చే సమయంలో ఆంగ్లేయుల శ్వేతపత్రం

 

5.  1949, నవంబరు 26న ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన వెంటనే అమల్లోకి వచ్చిన అంశాల్లో లేనిది?

1) పౌరసత్వం, తాత్కాలిక పార్లమెంటు

2) ఎన్నికల నిర్వహణ ప్రక్రియ

3) అత్యవసర పరిస్థితి అధికారాలు

4) స్వదేశీ సంస్థానాలకు కల్పించిన రక్షణలు

 

6.  1950, జనవరి 26 (గురువారం) నుంచి అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగంలోని అంశాలకు సంబంధించి సరికానిది?

1) ఆర్టికల్స్‌ 395 2) షెడ్యూల్స్‌ 12 3) షెడ్యూల్స్‌ 8 4) భాగాలు 22

 

7.  రాజ్యాంగ సభ చివరి సమావేశం (12వ) ఎప్పుడు జరిగింది?

1) 1950, జనవరి 24 2) 1950, జనవరి 26

3) 1949, నవంబరు 26 4) 1949, జనవరి 26

 

8.  రాజ్యాంగ సభ చివరి సమావేశంలో తీసుకున్న నిర్ణయం?

1) జాతీయ గీతంగా ‘జనగణమన’ ఎంపిక

2) జాతీయ గేయంగా ‘వందేమాతరం’ ఎంపిక

3) భారతదేశ తొలి ప్రధానిగా జవహర్‌లాల్‌ నెహ్రూ నియామకం

4) 1, 2 సరైనవి


9.  రాజ్యాంగ సభ చివరి సమావేశంలో ఎంత మంది ప్రతినిధులు హాజరై రాజ్యాంగ రాతప్రతులపై సంతకాలు చేశారు?

1) 266 2) 284 3) 299 4) 389

 

10.  భారత రాజ్యాంగంపై ప్రముఖుల వ్యాఖ్యానానికి సంబంధించి సరికానిది?

1) భారత రాజ్యాంగం అర్ధ సమాఖ్య - కె.సి.వేర్‌

2) భారత రాజ్యాంగాన్ని ఇంద్రుడి వాహనమైన ఐరావతంతో పోల్చవచ్చు - హెచ్‌.వి.కామత్‌

3) భారత రాజ్యాంగం అందమైన అతుకుల బొంత - గాన్‌విల్‌ ఆస్టిన్‌

4) భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం - దామోదర్‌ స్వరూప్‌సేథ్‌

 

 

11.  ‘భారత రాజ్యాంగం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగా, అసాధారణ పరిస్థితుల్లో ఏక కేంద్రంగా వ్యవహరిస్తుంది’ అని ఎవరు వ్యాఖ్యానించారు?

1) ఐవర్‌ జెన్నింగ్స్‌

2) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌

3) జవహర్‌లాల్‌ నెహ్రూ

4) ప్రమథ్‌ రంజన్‌ ఠాగూర్‌


12. రాజ్యాంగంలోని ప్రతిపేజీని శాంతినికేతన్‌లోని చిత్రకారుల సహకారంతో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా కళాత్మకంగా రూపొందించినవారు?

1) నందలాల్‌ బోస్‌ 2) ప్రేమ్‌బిహారీ నారాయణ్‌ రైజాదా

3) జితేంద్రనాథ్‌ బెనర్జీ 4) సత్యేంద్రనాథ్‌ ఠాగూర్‌

 

 

13.  మన రాజ్యాంగ నిర్మాతలు ‘భారత ప్రభుత్వ చట్టం - 1935 ’ నుంచి గ్రహించిన అంశాల్లో లేనిది?

1) అత్యవసర పరిస్థితి అధికారాలు, గవర్నర్‌ వ్యవస్థ

2) కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు

3) స్వేచ్ఛా, వాణిజ్య, వ్యాపార చట్టాలు

4) అఖిల భారత సమాఖ్య అనే భావన

 

 

14.  రాజ్యాంగ నిర్మాతలు బ్రిటన్‌ నుంచి గ్రహించిన అంశాల్లో లేనిది?

1) పార్లమెంటరీ ప్రభుత్వ విధానం, శాసన నిర్మాణ ప్రక్రియ

2) అటార్నీ జనరల్‌ వ్యవస్థ, కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ వ్యవస్థ

3) న్యాయస్థానాలు రిట్స్‌ జారీ చేసే విధానం, చట్టసభల సభ్యుల హక్కులు

4) దేశాధినేత పేరుమీదుగా పరిపాలన నిర్వహించడం


15. రాజ్యాంగ నిర్మాతలు అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి గ్రహించిన అంశాల్లో లేనిది?

1) రాజ్యాంగ ప్రవేశిక, రాజ్యాంగ ఆధిక్యత, ఉపరాష్ట్రపతి వ్యవస్థ

2) రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం

3) అంతర్‌రాష్ట్ర వర్తక వాణిజ్యం

4) న్యాయస్థానాలకు ఉండే న్యాయసమీక్ష అధికారం, న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తి

 

16.  రాజ్యాంగ నిర్మాతలు కెనడా దేశ రాజ్యాంగం నుంచి గ్రహించిన అంశాలకు సంబంధించి సరికానిది?

1) అవశిష్ట అధికారాలు కేంద్రానికి లభించడం, బలమైన కేంద్ర ప్రభుత్వం

2) రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు విశిష్ట వ్యక్తుల నియామకం

3) రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయ సలహాను పొందడం

4) రాష్ట్రపతి ద్వారా రాష్ట్రాల గవర్నర్‌ల నియామకం

 

17.  రాజ్యాంగ నిర్మాతలు వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలకు సంబంధించి సరైన జత?

a) ఉమ్మడి జాబితా i) దక్షిణాఫ్రికా

b) న్యాయమూర్తుల తొలగింపు ii) జపాన్‌

c) చట్టం నిర్ధారించిన పద్ధతి iii) అమెరికా

d) రాజ్యాంగ సవరణ విధానం iv) ఆస్ట్రేలియా

1) a - ii, b - iv, c - i, d - iii
2) a - iv, b - iii, c - ii, d - i
3) a - iv, b - iii, c - i, d - ii
4) a - iii, b - iv, c - ii, d - i

18.  రాజ్యాంగ నిర్మాతలు వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలకు సంబంధించి సరైన జత?

a) ప్రొటెం స్పీకర్‌ నియామకం i) ఐర్లాండ్‌

b) ఆదేశిక సూత్రాలు ii) ఫ్రాన్స్‌

c) రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం iii) జపాన్‌

d) జీవించే హక్కు iv) దక్షిణాఫ్రికా

1) a - ii, b - i, c - iv, d - iii
2) a - iii, b - i, c - iv, d - ii
3) a - ii, b - i, c - iii, d - iv
4) a - ii, b - iii, c - iv, d - i


19.  రాజ్యాంగ నిర్మాతలు వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలకు సంబంధించి సరైన జత?

a) రాజ్యాంగ ప్రవేశికలోని గణతంత్ర అనే భావన i) కెనడా

b) సుప్రీంకోర్టు సలహా రూపక అధికార పరిధి ii) ఫ్రాన్స్‌

c) దేశాధినేత పేరు మీదుగా దేశ పరిపాలన నిర్వహణ iii) ఆస్ట్రేలియా

d) పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశం iv) అమెరికా

1) a - iii, b - i, c - iv, d - ii
2) a - ii, b - iii, c - iv, d - i
3) a - ii, b - i, c - iv, d - iii
4) a - ii, b - i, c - iii, d - iv

 

20.  కిందివాటిలో భారత రాజ్యాంగం స్వతహాగా ఏర్పాటు చేసుకున్న లక్షణం?

1) రాష్ట్రపతిని ఎన్నుకునే నియోజక గణం (Electoral college)

2) పంచాయతీరాజ్‌ వ్యవస్థ, అఖిల భారత సర్వీసులు

3) అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రత్యేక రక్షణలు

4) పైవన్నీ

 

21.  మన దేశ సాంఘిక, ఆర్థిక లక్ష్యాల సాధన కోసం రాజ్యాంగ సభ అనుసరించిన ‘యూరో - అమెరికన్‌’ నమూనాలో లేని అంశం?

1) ఉదార ప్రజాస్వామ్య విధానాలు

2) కేంద్రీకృత రాజ్యాంగం

3) పరోక్ష ఎన్నిక విధానం

4) పార్లమెంటు ఆధిక్యత

 

22.  రాజ్యాంగ రూపకల్పనకు రాజ్యాంగ సభ సర్వసమ్మతి, సమన్వయ పద్ధతులను ఉపయోగించిందని ‘ది ఇండియన్‌ కాన్‌స్టిట్యూషన్‌ కార్నర్‌ స్టోన్‌ ఆఫ్‌ ఏ నేషన్‌’ అనే గ్రంథంలో ఎవరు పేర్కొన్నారు?

1) గాన్‌విల్‌ ఆస్టిన్‌ 2) కె.ఎం.మున్షీ 3) శిఖర్‌ మిశ్రా 4) నానిపాల్కీవాలా

 

23.  రాజ్యాంగ రూపకల్పనకు రాజ్యాంగ సభ ‘సర్దుబాటు పద్ధతిని’ (Method of Adoption) ఉపయోగించిందని ‘ఇండియన్‌ గవర్నమెంట్‌ అండ్‌ పాలిటిక్స్‌’ అనే గ్రంథంలో ఎవరు పేర్కొన్నారు?

1) మారిస్‌జోన్స్‌ 2) ఐవర్‌ జెన్నింగ్స్‌ 3) ఒ.పి.గోయెల్‌ 4) అవస్తీ, మహేశ్వరి

 

24.  ‘ప్రాచీన కాలం నాటి సాంఘిక, ఆర్థిక నిర్మాణాన్ని తిరస్కరించి ముందుకు కదులుతూ కొత్త వస్త్రాలను రూపొందించుకుంటున్న దేశానికి రాజ్యాంగ సభ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా ఉంది’ అని ఎవరు వ్యాఖ్యానించారు?

1) జవహర్‌లాల్‌ నెహ్రూ

2) డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌

3) అనంతశయనం అయ్యంగార్‌

4) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌


సమాధానాలు

1-2; 2-4; 3-3; 4-1; 5-3; 6-2; 7-1; 8-4; 9-2; 10-4; 11-2; 12-1; 13-3; 14-4; 15-3; 16-2; 17-2; 18-1; 19-3; 20-4; 21-3; 22-1; 23-3; 24-1.

 

భారత రాజ్యాంగ రచన - స్వభావం - 2

అది ప్రజలకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞ!

భారత రాజ్యాంగ రచన వెనుక ఎందరో మేధావుల అపారమైన కృషి ఉంది. అంబేడ్కర్‌ అధ్యక్షతన ఏర్పాటైన రాజ్యాంగ రచనా సంఘం అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, ఎన్నో చర్చలు, జరిపి ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ఏర్పాటైన వివిధ కమిటీలు విస్తృత పరిశీలన, మేధోమథనంతో ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఆధునిక, అభ్యుదయ, పురోగామి అంశాలతో రాజ్యాంగ స్వరూప స్వభావాలను మలిచాయి. ఈ మహాక్రతువు జరిగిన క్రమం, వివిధ కమిటీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ప్రముఖులు, వారి అభిప్రాయాలు, వ్యాఖ్యల గురించి పోటీ పరీక్షార్థులు వివరంగా తెలుసుకోవాలి.


1. కింద పేర్కొన్న వాటిలో సరికానిది?

1) రాజ్యాంగ సభకు కార్యదర్శి హెచ్‌.వి.ఆర్‌.అయ్యంగార్‌

2) రాజ్యాంగ సభకు తాత్కాలిక అధ్యక్షుడు డాక్టర్‌ సచ్చిదానంద సిన్హా

3) రాజ్యాంగ సభకు ముఖ్య లేఖకుడు ఎస్‌.ఎన్‌.ముఖర్జీ

4) రాజ్యాంగ సభకు గౌరవ సలహాదారుడు జవహర్‌లాల్‌ నెహ్రూ

2. బెనగళ నరసింగరావు (బి.ఎన్‌.రావు)కు సంబంధించి కిందివాటిలో సరికానిది?

1) రాజ్యాంగ సభకు సలహాదారుడిగా వ్యవహరించారు.

2) చిత్తు రాజ్యాంగ రూపకర్తగా పేరొందారు.

3) రాజ్యాంగ సభకు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు.

4) అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసిన తొలి భారతీయుడు.

3. రాజ్యాంగ రూపకల్పనలో ‘రాజ్యాంగ సభ’ నిర్వహించిన విధులకు సంబంధించి కిందివాటిలో సరైంది?

1) 1946, డిసెంబరు 9 నుంచి 1947, ఆగస్టు 15 మధ్య రాజ్యాంగ రచనా విధులను మాత్రమే నిర్వహించింది.

2) 1947, ఆగస్టు 15 నుంచి 1949, నవంబరు 26 మధ్య రాజ్యాంగ రచనా విధులతోపాటు దేశపాలనకు అవసరమైన శాసన రూపకల్పన విధులను నిర్వర్తించింది.

3) 1949, నవంబరు 26 నుంచి 1952, మే 13 మధ్య శాసన విధులను నిర్వర్తిస్తూ దేశానికి తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరించింది.

4) పైవన్నీ

4. రాజ్యాంగ రచన కోసం ‘రాజ్యాంగ సభ’ ఏర్పాటు చేసిన విషయ నిర్ణాయక కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించి సరైన జత?

a) కేంద్ర రాజ్యాంగ కమిటీ i) సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌

b) రాజ్యాంగ సలహా సంఘం ii) జవహర్‌లాల్‌ నెహ్రూ

c) రాజ్యాంగ ముసాయిదా కమిటీ iii) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌

d) ఆర్థిక అంశాలపై ఏర్పడిన కమిటీ iv) నళినీ రంజన్‌ సర్కార్‌

1) a - ii, b - i, c - iii, d - iv 2) a - i, b - ii, c - iii, d - iv

3) a - iv, b - i, c - iii, d - ii 4) a - ii, b - iv, c - iii, d - i

5. రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన విషయ నిర్ణాయక కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించి సరైన జత?

a) కేంద్ర ప్రభుత్వ అధికారాల కమిటీ i) జవహర్‌లాల్‌ నెహ్రూ

b) భాషా ప్రయుక్త ప్రాంతాలపై ఏర్పడిన కమిటీ ii) ఎస్‌.కె.థార్‌

c) సుప్రీంకోర్టుపై ఏర్పడిన కమిటీ iii) ఎస్‌.వరదాచారి అయ్యర్‌

d) జాతీయ పతాకంపై ఏర్పడిన కమిటీ iv) డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌

1) a - iii, b - i, c - ii, d - iv 2) a - i, b - ii, c - iv, d - iii

3) a - i, b - ii, c - iii, d - iv 4) a - iv, b - ii, c - iii, d - i

6. రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన విధాన నిర్ణాయక కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించి సరైన జత?
a) ఆర్డర్‌ ఆఫ్‌ బిజినెస్‌ కమిటీ i) డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌
b) సభా కమిటీ ii) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌
c) క్రెడెన్షియల్‌ కమిటీ iii) భోగరాజు పట్టాభి సీతారామయ్య
d) సాంఘిక, ఆర్థిక కమిటీ iv) కె.ఎం.మున్షీ

1) a - iv, b - iii, c - ii, d - i 2) a - iii, b - iv, c - ii, d - i

3) a - iv, b - iii, c - i, d - ii 4) a - ii, b - iii, c - iv, d - i

7. 1947, జనవరి 24న ఏర్పడిన రాజ్యాంగ సలహా సంఘానికి సంబంధించి కిందివాటిలో సరికానిది?

1) దీనికి అధ్యక్షుడు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌.

2) ఈ కమిటీలోని సభ్యుల సంఖ్య 54.

3) ఈ కమిటీని 4 ఉప కమిటీలుగా వర్గీకరించారు.

4) కమిటీ తన నివేదికను 1949, నవంబరు 26న సమర్పించింది.

8. రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన వివిధ ఉప కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించి సరైన జత?

a) ప్రాథమిక హక్కుల ఉప కమిటీ i) హెచ్‌.సి.ముఖర్జీ

b) అల్ప సంఖ్యాక వర్గాల ఉప కమిటీ ii) ఎ.వి.ఠక్కర్‌

c) ఈశాన్య రాష్ట్రాల ఉప కమిటీ iii) జె.బి.కృపలాని

d) అస్సాం ప్రాంతం మినహాయించి ఇతర ప్రాంతాలపై ఏర్పడిన ఉప కమిటీ iv) గోపీనాథ్‌ బార్డోలోయ్‌

1) a - ii, b - iv, c - i, d - iii 2) a - iii, b - i, c - iv, d - ii

3) a - iii, b - i, c - ii, d - iv 4) a - iv, b - ii, c - i, d - iii

9. 1947, ఆగస్టు 29న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ అధ్యక్షతన ఏర్పాటైన రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యులు కానివారు?

1) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కె.ఎం.మున్షీ

2) ఎన్‌.గోపాలస్వామి అయ్యంగార్, బి.ఎల్‌.మిట్టల్‌

3) సయ్యద్‌ మహ్మద్‌ సాదుల్లా, డి.పి.ఖైతాన్‌

4) కె.టి.షా, హెచ్‌.సి.ముఖర్జీ

10. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ముసాయిదా కమిటీ ‘ముసాయిదా రాజ్యాంగాన్ని’ రాజ్యాంగ సభలో ఎప్పుడు ప్రవేశపెట్టింది?

1) 1947, డిసెంబరు 28 2) 1948, నవంబరు 4

3) 1948, డిసెంబరు 21 4) 1949, జనవరి 22

11. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ బృందం రూపొందించిన ముసాయిదా రాజ్యాంగంలోని అంశాన్ని గుర్తించండి.

1) షెడ్యూల్స్‌ - 8 2) ఆర్టికల్స్‌ - 315 3) 1, 2 4) భాగాలు - 20

12. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ను ఆధునిక మనువుగా, రాజ్యాంగ పితామహుడిగా ‘ది కాన్‌స్టిట్యూషనల్‌ గవర్నమెంట్‌ ఇన్‌ ఇండియా’ అనే గ్రంథంలో ఎవరు పేర్కొన్నారు?

1) గాన్‌విల్‌ ఆస్టిన్‌ 2) నానీ పాల్కీవాలా 3) పాల్‌ ఆపిల్‌బీ 4) ఎం.వి.పైలీ

13. రాజ్యాంగ సభ సమావేశాల్లో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించిన వారికి సంబంధించి సరికానిది?

1) భారత జాతీయ కాంగ్రెస్‌ - డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్, జవహర్‌లాల్‌ నెహ్రూ

2) ముస్లింలు - సయ్యద్‌ మహ్మద్‌ సాదుల్లా, మౌలానా అబుల్‌కలాం ఆజాద్‌

3) హిందూ మహాసభ - శ్యాంప్రసాద్‌ ముఖర్జీ, ఎం.ఆర్‌.జయకర్‌

4) అల్పసంఖ్యాక వర్గాలు - కె.టి.షా, కె.ఎం.మున్షీ


14. రాజ్యాంగ సభ సమావేశాల్లో వివిధ వర్గాల వారికి ప్రాతినిధ్యం వహించిన ప్రముఖులకు సంబంధించి సరైన జత?

a) పారశీకులు i) హెచ్‌.సి.ముఖర్జీ

b) యూరోపియన్లు ii) హెచ్‌.పి.మోదీ

c) అల్పసంఖ్యాక వర్గాలు iii) డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌

d) అఖిల భారత కార్మిక వర్గం iv) ఫ్రాంక్‌ ఆంటోని

1) a-iii, b-ii, c-iv, d-i 2) a-iv, b-i, c-iii, d-ii
3) a-ii, b-iv, c-i, d-iii 4) a-ii, b-iv, c-iii, d-i

15. కిందివాటిలో సరికానిది?

1) ప్రారంభంలో రాజ్యాంగ సభలో భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం 69 శాతం.

2) రాజ్యాంగ సభ నుంచి ముస్లింలీగ్‌ వైదొలగడంతో భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం 82 శాతానికి చేరింది.

3) రాజ్యాంగ సభ సమావేశాల్లో అఖిల భారత షెడ్యూల్డు కులాల వర్గానికి ప్రాతినిధ్యం వహించినవారు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌

4) రాజ్యాంగ సభ సమావేశాల్లో జమిందారీ వర్గానికి ప్రాతినిధ్యం వహించినవారు రతన్‌ సింగ్‌.

16. రాజ్యాంగ సభ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది?

1) 1946 డిసెంబరు 9 నుంచి 14 వరకు

2) 1946 డిసెంబరు 9 నుంచి 17 వరకు

3) 1946 డిసెంబరు 9 నుంచి 23 వరకు

4) 1946 డిసెంబరు 9 నుంచి 31 వరకు

17. కిందివాటిలో సరికానిది?

1) రాజ్యాంగ సభకు శాశ్వత అధ్యక్షుడు డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌.

2) రాజ్యాంగ సభకు శాశ్వత ఉపాధ్యక్షులు హెచ్‌.సి.ముఖర్జీ, వి.టి.కృష్ణమాచారి.

3) రాజ్యాంగ సభ తొలి సమావేశానికి హాజరైన సభ్యులు 208 మంది.

4) రాజ్యాంగ సభలో ప్రారంభ ఉపన్యాసం చేసినవారు లార్డ్‌మౌంట్‌ బాటన్‌.

18. జవహర్‌లాల్‌ నెహ్రూ ‘ఉద్దేశాల తీర్మానం/చారిత్రక లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని’ రాజ్యాంగ సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) 1946, డిసెంబరు 11 2) 1946, డిసెంబరు 13

3) 1946, డిసెంబరు 23 4) 1946, డిసెంబరు 31

19. ఉద్దేశాల తీర్మానాన్ని ‘మనం ప్రజలకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞ’ అని ఎవరు అభివర్ణించారు?

1) జవహర్‌లాల్‌ నెహ్రూ 2) మహాత్మా గాంధీ

3) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 4) కె.ఎం.మున్షీ

20. జవహర్‌లాల్‌ నెహ్రూ రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టిన ఉద్దేశాల తీర్మానానికి సంబంధించి సరైంది?

1) ఈ తీర్మానాన్ని రాజ్యాంగ సభ 1947, జనవరి 22న ఆమోదించింది.

2) భారతదేశం ప్రపంచ శాంతి, మానవాళి సంక్షేమం కోసం కృషి చేస్తుంది.

3) భారతదేశం సర్వసత్తాక గణతంత్ర దేశంగా అవతరించాలి.

4) పైవన్నీ


21. ‘డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ బృందం రూపొందించిన ముసాయిదా రాజ్యాంగం 1935, భారత ప్రభుత్వ చట్టానికి జిరాక్స్‌ కాపీలా ఉంది’ అని ఎవరు విమర్శించారు?

1) సర్‌ తేజ్‌ బహదూర్‌ సప్రూ 2) మహ్మద్‌ అలీ జిన్నా

3) మౌలానా హస్రత్‌ మొహాని 4) దామోదర్‌ స్వరూప్‌ సేథ్‌

 

సమాధానాలు

1-4; 2-3; 3-4; 4-1; 5-3; 6-1; 7-4; 8-2; 9-4; 10-2; 11-3; 12-4; 13-4; 14-3; 15-4; 16-3; 17-4; 18-2; 19-1; 20-4; 21-3.

 

పరిపాలనకు పరమ శాసనం

భారత రాజ్యాంగ రచన - స్వభావం - 1

ప్రజాస్వామ్య పాలనకు, అందరికీ ఆమోదనీయమైన, అనుకూలమైన చట్టాల రూపకల్పనకు, పౌర హక్కుల నిర్వచనానికి, సామాజిక న్యాయానికి, సంక్షేమానికి మౌలిక ఆధారం మన రాజ్యాంగం. ఎందరో మహానుభావుల మహోన్నత కృషితో రూపొందింది. దశాబ్దాల కాలపరీక్షలను దాటి ఇప్పటికీ, ఎప్పటికీ తిరుగులేని పరమ శాసనంగా నిలిచింది. అంతటి అత్యున్నతమైన ఆ రాజ్యాంగ రచన జరిగిన విధానం, దాని స్వభావంపై పోటీ పరీక్షల్లో తరచూ ప్రశ్నలు వస్తున్నాయి. ఆ ప్రశ్నల సరళిపై అభ్యర్థులు తగిన అవగాహన పెంపొందించుకోవడానికి రకరకాల బిట్లను ప్రాక్టీస్‌ చేయాలి.

 

1. రాజ్యాంగానికి సంబంధించి కిందివాటిలో సరైంది?


ఎ) దేశ పరిపాలనను వివరించే అత్యున్నతమైన శాసనం.


బి) ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం ఉన్న దేశం అమెరికా.


సి) బ్రిటన్‌ దేశానికి లిఖిత రాజ్యాంగం లేదు.


డి) ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఉన్న దేశం భారత్‌.


1) ఎ, బి, సి 2) బి, సి, డి 3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి


2. ‘రాజ్యాంగం’ అనే భావనను తొలిసారిగా శాస్త్రీయంగా ప్రతిపాదించినవారు?


1) జార్జి వాషింగ్టన్‌ 2) అరిస్టాటిల్‌


3) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 4) ఎం.ఎన్‌.రాయ్‌


3. ‘స్వరాజ్‌’ అనేది బ్రిటిష్‌వారు ప్రసాదించే ఉచిత కానుక కాదని, అది భారత ప్రజల స్వయం వ్యక్తీకరణ అని 1922, జనవరి 5న గాంధీజీ ఏ పత్రికలో పేర్కొన్నారు?


1) యంగ్‌ ఇండియా 2) హరిజన్‌


3) వందేమాతరం 4) బెంగాల్‌ గెజిట్‌


4. భారతీయులకు అవసరమైన రాజ్యాంగ రచనకు ‘రాజ్యాంగ సభ’ను ఏర్పాటు చేయాలని 1934లో ఆంగ్లేయులను తొలిసారిగా డిమాండ్‌ చేసిన భారతీయుడు?


1) దాదాభాయ్‌ నౌరోజీ 2) మోతీలాల్‌ నెహ్రూ


3) మానవేంద్రనాథ్‌ రాయ్‌ 4) సుభాష్‌ చంద్రబోస్‌


5. జవహర్‌లాల్‌ నెహ్రూ అధ్యక్షతన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశం రాజ్యాంగ సభను ఏర్పాటు చేయాలని తొలిసారి అధికారికంగా ఆంగ్లేయులను డిమాండ్‌ చేసింది. అది ఎక్కడ జరిగింది?


1) లాహోర్‌ 2) ఫైజ్‌పుర్‌ 3) ముజఫరాబాద్‌ 4) కలకత్తా


6. భారతీయులతో కూడిన రాజ్యాంగ సభ ద్వారా రాజ్యాంగ రచన జరిగితే మన దేశం ఎదుర్కొంటున్న కుల, మత వర్గాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని 1939లో ‘హరిజన్‌’ అనే పత్రికలో ఎవరు పేర్కొన్నారు?


1) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 2) గోపాలకృష్ణ గోఖలే


3) బాలగంగాధర్‌ తిలక్‌ 4) మహాత్మా గాంధీ


7. ‘భారతదేశాన్ని అన్ని రకాల దాస్యం నుంచి, పోషణ నుంచి విముక్తి చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను, ఇలాంటి దేశంలో అంటరానితనం, మత్తు పానీయాలు, మత్తు మందులు అనే శాపం ఉండరాదు’ అని 1931లో గాంధీజీ ఏ పత్రికలో వ్యాఖ్యానించారు?


1) హరిజన్‌ 2) బాంబే సమాచార్‌


3) యంగ్‌ ఇండియా 4) హేరామ్‌


8. భారతీయులకు అవసరమైన రాజ్యాంగ రచనకు ‘రాజ్యాంగ సభ/రాజ్యాంగ పరిషత్‌’ను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఆంగ్లేయులు తొలిసారిగా దేని ద్వారా గుర్తించారు?


1) భారత ప్రభుత్వ చట్టం - 1935


2) ఆగస్టు ప్రతిపాదనలు - 1940


3) క్రిప్స్‌ రాయబారం - 1942


4) కేబినెట్‌ మిషన్‌ - 1946


9. భారతీయులకు అవసరమైన రాజ్యాంగ రచనకు రాజ్యాంగ సభను ఏర్పాటు చేస్తామని ఆంగ్లేయులు తొలిసారి అధికారికంగా ఎప్పుడు ప్రతిపాదించారు?


1) క్రిప్స్‌ రాయబారం - 1942


2) భారత స్వాతంత్య్ర చట్టం - 1947


3) వేవెల్‌ ప్రణాళిక - 1945


4) రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు (1930 - 1932)


10. మహాత్మా గాంధీ కింద పేర్కొన్న దేన్ని ‘పోస్ట్‌ డేటెడ్‌ చెక్‌’గా అభివర్ణించి తిరస్కరించారు?


1) ఆగస్టు ప్రతిపాదనలు - 1940 2) క్రిప్స్‌ రాయబారం - 1942


3) మంత్రిత్రయ రాయబారం - 1946


4) సిమ్లా సమావేశం - 1944


11. త్వరలోనే రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికైన శాసన సభ్యులు రాజ్యాంగ సభ సభ్యులను ఎన్నుకుంటారని 1945, సెప్టెంబరు 19న దిల్లీలోని ఆలిండియా రేడియో కేంద్రం నుంచి ప్రకటించినవారు?


1) లార్డ్‌ వేవెల్‌ 2) లార్డ్‌ లిన్‌లిత్‌గో


3) స్టాఫర్డ్‌ క్రిప్స్‌ 4) లార్డ్‌ మౌంట్‌బాటన్‌

 

12. బ్రిటన్‌ ప్రధాని క్లెమెంట్‌ అట్లీ మంత్రిత్రయ రాయబారం/కేబినెట్‌ మిషన్‌ను భారతదేశానికి ఎప్పుడు పంపారు?


1) 1945, ఆగస్టు 24 2) 1945, మార్చి 24


3) 1946, మార్చి 24 4) 1947, జనవరి 24

 

13. కిందివారిలో మంత్రిత్రయ రాయబారం/కేబినెట్‌ మిషన్‌లో లేని సభ్యులు?


1) పెథిక్‌ లారెన్స్‌  2) స్టాఫర్డ్‌ క్రిప్స్‌


3) బిర్కెన్‌హెడ్‌   4) ఎ.వి.అలెగ్జాండర్‌

 

14.  రాజ్యాంగ సభ ఎన్నికలకు సంబంధించి కిందివాటిలో సరికానిది?


1) కేబినెట్‌ మిషన్‌ సిఫార్సుల మేరకు 1946లో జరిగాయి.


2) ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగాయి.


3) పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగాయి.


4) పరిమిత ఓటింగ్‌తో ఎన్నికలు జరిగాయి.

 

15.  రాజ్యాంగ పరిషత్‌కు నిర్దేశించిన ప్రాతినిధ్యానికి సంబంధించి కిందివాటిలో సరికానిది?


1) బ్రిటిష్‌ పాలిత రాష్ట్రాల నుంచి 292 మంది


2) స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది


3) కేంద్రపాలిత ప్రాంతాల నుంచి నలుగురు


4) స్వయం ప్రతిపత్తి ప్రాంతాల నుంచి 9 మంది

 

16. రాజ్యాంగ పరిషత్‌/రాజ్యాంగ సభకు వివిధ రాజకీయ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించిన వారికి సంబంధించి సరైన జతను గుర్తించండి.


a) స్వతంత్ర అభ్యర్థులు    i) 3


b) ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌    ii) 73


c) ముస్లిం లీగ్‌     iii) 7


d) యూనియనిస్ట్‌ మహ్మదీయ పార్టీ    iv) 202


1) a - iii, b - iv, c - ii, d - i 2) a - i, b - iv, c - iii, d - ii

3) a - i, b - ii, c - iii, d - iv 4) a - ii, b - iv, c - i, d - iii

 

17. రాజ్యాంగ సభ ఎన్నికలకు (1946) సంబంధించి కిందివాటిలో సరికానిది?


1) రాజ్యాంగ సభకు ఎన్నికైన మొత్తం సభ్యుల సంఖ్య - 389


2) ఎస్సీ వర్గాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య - 26


3) ఎస్టీ వర్గాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య - 23


4) రాజ్యాంగ సభకు ఎన్నికైన మహిళల సంఖ్య - 15


18. కిందివారిలో రాజ్యాంగ సభకు విశిష్ట వ్యక్తులుగా నామినేట్‌ అయిన వారిలో లేనివారు?


1) అనంతశయనం అయ్యంగార్‌ 2) డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌


3) ఎన్‌.గోపాలస్వామి అయ్యంగార్‌ 4) కె.టి.షా


19. రాజ్యాంగ సభ ఎన్నికలకు సంబంధించి కిందివాటిలో సరికానిది?


1) రాజ్యాంగ సభకు ఎన్నికైన ఏకైక ముస్లిం మహిళ బేగం ఎయిజాజ్‌ రసూల్‌.


2) రాజ్యాంగ సభకు ఎన్నిక కాని ప్రముఖులు మహాత్మా గాంధీ, మహ్మద్‌ అలీ జిన్నా.


3) రాజ్యాంగ సభలో ప్రతి ప్రావిన్స్‌ నుంచి సుమారు 10 లక్షల మంది జనాభాకు ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహించారు.


4) స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగ సభలోని సభ్యుల సంఖ్య 289.

 

20.  హైదరాబాద్‌ సంస్థానం నుంచి 15 మంది ప్రతినిధులను రాజ్యాంగ సభకు ఎప్పుడు నామినేట్‌ చేశారు?


1) 1946 నవంబరు 2) 1947 నవంబరు 3) 1948 నవంబరు 4) 1949 నవంబరు

 

21.  రాజ్యాంగ సభకు ఎన్నికైన మహిళలు, వారి ప్రత్యేకతలకు సంబంధించి సరైన జతను గుర్తించండి.


a) భారత్‌లో తొలి మహిళా గవర్నరు i) సరోజిని నాయుడు


b) భారత్‌లో తొలి మహిళా ముఖ్యమంత్రి ii) సుచేతా కృపలానీ


c) భారత్‌లో తొలి మహిళా కేబినెట్‌ మంత్రి iii) విజయలక్ష్మి పండిట్‌


d) యూఎన్‌ఓ సాధారణ సభకు తొలి మహిళా అధ్యక్షురాలు iv) రాజకుమారి అమృతకౌర్‌


1) a - ii, b - iv, c - i, d - iii    2) a - i, b - ii, c - iv, d - iii

3) a - i, b - iii, c - iv, d - ii    4) a - iv, b - ii, c - i, d - iii

 

22. రాజ్యాంగ సభకు ఎన్నికైన ఎవరు కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డ్‌కు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా వ్యవహరించారు?


1) దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ 2) అమ్ముస్వామినాథన్‌


3) పూర్ణిమా బెనర్జీ 4) దాక్షాయణి వేలాయుదన్‌

 

23. రాజ్యాంగ సభకు ఎన్నికైన ప్రముఖ మహిళ హంసామెహతాకు సంబంధించి కిందివాటిలో సరైంది?


1) రాజ్యాంగ సభ సమావేశాల్లో మహిళలకు ప్రాతినిధ్యం వహించారు.


2) 1947 జులై 22న రాజ్యాంగ సభలో జాతీయ పతాకాన్ని ప్రతిపాదించి ఎగురవేశారు.


3) 1, 2 4) రాజ్యాంగ సభకు రాజీనామా చేసిన ఏకైక మహిళ.


24. రాజ్యాంగ సభకు ఎన్నికైన ఎవరు ‘హిస్టరీ ఆఫ్‌ ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌’ గ్రంథాన్ని రాశారు?


1) భోగరాజు పట్టాభి సీతారామయ్య 2) కల్లూరు సుబ్బారావు


3) ఎం.తిరుమలరావు 4) మోటూరు సత్యనారాయణ

 

25. రాజ్యాంగ సభకు ఎన్నికైన ప్రముఖ తెలుగు వ్యక్తులు, వారి ప్రత్యేకతలకు సంబంధించి సరైన జతను గుర్తించండి.


a) టంగుటూరి ప్రకాశం పంతులు i) కర్నూలు సర్క్యులర్‌ రూపకర్త


b) నీలం సంజీవరెడ్డి ii) ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి


c) కళా వెంకట్రావు iii) ప్రముఖ రైతు ఉద్యమ నాయకులు


d) ఆచార్య ఎన్‌.జి.రంగా iv) ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రి


1) a - ii, b - iv, c - i, d - iii 2) a - ii, b - i, c - iv, d - iii

3) a - i, b - iv, c - ii, d - iii 4) a - iii, b - iv, c - i, d - ii

 

26. రాజ్యాంగ రచనకు రాజ్యాంగ సభ జరిపిన ప్రయత్నాల్లో కిందివాటిలో సరికానిది?

1) రాజ్యాంగ సభ రాజ్యాంగ రచనకు నిర్వహించిన సమావేశాలు - 11

2) రాజ్యాంగ సభ రాజ్యాంగ రచనకు ఏర్పాటు చేసిన కమిటీలు - 22

3) రాజ్యాంగ సభ నిర్వహించిన మొత్తం సమావేశాలు - 13

4) రాజ్యాంగ రచనకు అయిన వ్యయం - రూ.64 లక్షలు

 

సమాధానాలు

1-3, 2-2, 3-1, 4-3, 5-2, 6-4, 7-3, 8-2, 9-1, 10-2, 11-1, 12-3, 13-3, 14-2, 15-4, 16-1, 17-3, 18-1, 19-4, 20-3, 21-2, 22-1, 23-3, 24-1, 25-1, 26-3.

Posted Date : 06-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

నదులకూ ఉంటుంది జీవించే హక్కు!

ప్రాథమిక హక్కులు
 

ప్రజాస్వామ్యంలో వ్యక్తి స్వేచ్ఛకు, గౌరవప్రద జీవనానికి రాజ్యాంగం కల్పించిన రక్షణ కవచాలు ప్రాథమిక హక్కులు. ప్రత్యేక సందర్భాల్లో వీటిపై సహేతుక ఆంక్షలను విధిస్తుంటారు. మరి కొన్నిసార్లు శాంతిభద్రతలు, దేశ సమగ్రత పేరుతో ప్రభుత్వాలు కఠినమైన, నిర్బంధ చట్టాలను చేస్తుంటాయి.  అవి రాజ్యాంగ మౌలిక లక్షణాలకు విరుద్ధంగా ఉంటే కోర్టులు అడ్డుకుంటాయి. ప్రాథమిక హక్కుల అమలులో ఎదురయ్యే ఈ వ్యవస్థాగత సంఘర్షణను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. ఆ మౌలిక హక్కుల ఉద్దేశాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న చట్టాలు, వాటిని హరించే విధంగా వచ్చే నిర్బంధ విధానాలు, అనుకూల, ప్రతికూల వ్యాఖ్యలు, సుప్రీంకోర్టు ఆక్షేపణలు, సంబంధిత కేసుల గురించి సమగ్ర అవగాహన పెంచుకోవాలి.

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 


1.    ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు చట్టం-2009లోని అంశాలకు సంబంధించి సరైంది?

ఎ) ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 5 తరగతులు

బి) ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 8 తరగతులు

సి) 6 నుంచి 14 సంవత్సరాల వయసు వారందరూ అర్హులు

డి) ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి 1 : 30

1) ఎ, బి, సి, డి    2) బి, సి, డి

3) ఎ, బి, డి       4) ఎ, సి, డి


2.     ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం అన్ని ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఎంత శాతం సీట్లు తప్పనిసరిగా కేటాయించాలి?

1) 10%   2) 15%  3) 20%  4) 25%


3.     అటల్‌ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వ కాలంలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి ఆర్టికల్‌ 21(A)ను చేర్చారు?

1) 84వ రాజ్యాంగ సవరణ చట్టం, 2001      2) 85వ రాజ్యాంగ సవరణ చట్టం, 2001

3) 86వ రాజ్యాంగ సవరణ చట్టం, 2002     4) 87వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003


4.     రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 22లో పేర్కొన్న అంశాలకు సంబంధించి సరైంది?

ఎ) కారణం లేకుండా వ్యక్తులను అరెస్ట్‌ చేయరాదు.

బి) అరెస్ట్‌ అయిన వ్యక్తిని 24 గంటల్లోగా సమీప మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచాలి.

సి) అరెస్ట్‌ అయిన వ్యక్తి న్యాయవాదిని సంప్రదించడానికి అవకాశం కల్పించాలి.

డి) పీడీ చట్టం ప్రకారం అరెస్ట్‌ అయిన వారికి దానికి కారణాన్ని తెలియజేయాలి.

1) ఎ, బి, సి        2) ఎ, బి, డి

3) ఎ, బి, సి, డి      4) ఎ, సి, డి


5.     కిందివాటిలో పీడీ చట్టాలకు సంబంధించి సరైంది?

ఎ) పీడీ చట్టాలకు సంబంధించిన శాసనాలను రూపొందించే సర్వాధికారం భారత పార్లమెంటుకు ఉంటుంది.

బి) పీడీ చట్టం ప్రకారం అరెస్ట్‌ అయిన వారికి కారణాన్ని తెలియజేయాల్సిన అవసరం లేదు.

సి) ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ అంటే ఒక వ్యక్తి నేరం చేస్తాడన్న అనుమానంతో ముందే నిర్బంధంలోకి తీసుకోవడం.

డి) పునిటివ్‌ డిటెన్షన్‌ చట్టం అంటే నేరం నిరూపితమైన తర్వాత సంబంధిత వ్యక్తిని నిర్బంధించడం.

1) ఎ, బి, సి, డి      2) ఎ, బి, సి  

3) ఎ, బి, డి         4) ఎ, సి, డి


6.     మోహినీ జైన్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక కేసు (1992)లో సుప్రీంకోర్టు వెలువరించిన అంశాలకు సంబంధించి సరైంది?

ఎ) ఆర్టికల్‌ 21 ప్రకారం అన్ని స్థాయుల్లో విద్యార్జన హక్కు ప్రాథమిక హక్కుగా లభించాలి.

బి) విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం క్యాపిటేషన్‌ ఫీజును వసూలు చేయడం రాజ్యాంగ విరుద్ధం.

సి) విద్యాసంస్థల్లో ప్రవేశాల సమయంలో క్యాపిటేషన్‌ ఫీజును వసూలు చేయవచ్చు.

డి) విద్యార్జన హక్కును పౌరులకు నిరాకరించడం అంటే ఆర్టికల్‌ 14ను ఉల్లంఘించడమే.

1) ఎ, బి, సి        2) ఎ, బి, డి   

3) ఎ, సి, డి        4) ఎ, బి, సి, డి 


7.     14 ఏళ్ల వరకు ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా అందించాలని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?

ఎ) ఉన్ని కృష్ణన్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసు 

బి) అశోక్‌ కుమార్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ కేసు

సి) మేధాపాట్కర్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ మధ్యప్రదేశ్‌ కేసు

డి) అరుణా మిశ్రా Vs స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక కేసు


8.     ఆత్మహత్య చేసుకోవడం ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది?

1) జ్ఞానకౌర్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసు (1996)

2) దులావ్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కేసు (1996)

3) 1, 2

4) రతీనాం నాగభూషణ్‌ పట్నాయక్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (1994)


9.     గంగా, యమునా నదులకు జీవించే హక్కు ఉందని 2017లో ఏ కోర్టు ప్రకటించింది?

1) ఉత్తరాఖండ్‌ హైకోర్టు  2) అలహాబాద్‌ హైకోర్టు 

3) దిల్లీ హైకోర్టు       4) హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు


10. ట్రిపుల్‌ తలాక్‌ ద్వారా ముస్లిం భర్త తన భార్యకు విడాకులు ఇవ్వడం చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు 2017లో ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?

1) షకీలా భాను Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

2) సైరా భాను Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

3) బేగం అర్జాయత్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

4) సరళా ముద్గల్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు


11. మహిళలందరినీ వారి వయసుతో సంబంధం లేకుండా శబరిమలై ఆలయంలోకి అనుమతించాలని 2018లో సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?

1) పుట్టుస్వామి Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

2) రమాదేవి Vs స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసు

3) ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసు

4) పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసు


12. వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీలోని సెక్షన్‌ 377 రాజ్యాంగ విరుద్ధమని, వివాహేతర సంబంధం నేరం కాదని 2018లో సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?

1) జోసెఫ్‌ షైన్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

2) వినోద్‌ బెనర్జీ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

3) రంజన్‌ సిన్హా Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

4) షంషేర్‌ సింగ్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు


13. 1950లో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వ కాలంలో రూపొందించిన ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ యాక్ట్‌ (నివారక నిర్బంధ చట్టం)ను ఏ ప్రధాని కాలంలో రద్దు చేశారు?

1) 1969, ఇందిరాగాంధీ       2) 1977, మొరార్జీ దేశాయ్‌ 

3) 1985, రాజీవ్‌ గాంధీ       4) 1989, వి.పి.సింగ్‌


14. కింద పేర్కొన్న చట్టాలకు సంబంధించి సరైంది?

ఎ) మెయింటెనెన్స్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ సెక్యూరిటీ యాక్ట్‌ (MISA) 

బి) టెరరిస్ట్స్‌ అండ్‌ డిస్క్రిప్టివ్‌ యాక్టివిటీస్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌ (TADA)

సి) అన్‌లాఫుల్‌ యాక్టివిటీస్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌ (UAPA)

డి) ప్రివెన్షన్‌ ఆఫ్‌ టెర్రరిజమ్‌ యాక్ట్‌ (POTA) 

1) ఎ, బి, సి       2) ఎ, సి, డి  

3) ఎ, బి, సి, డి    4) ఎ, బి, డి 


15. COFEPOSA అంటే?

1) కన్జర్వేషన్‌ ఆఫ్‌ ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ స్మగ్లింగ్‌ యాక్టివిటీస్‌ యాక్ట్‌

2) కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఎక్స్ఛేంజ్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ స్మాల్‌ యాఆక్టివిటీస్‌ యాక్ట్‌

3) కన్నింగ్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ఎక్స్ఛేంజ్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ స్మగ్లింగ్‌ యాక్టివిటీస్‌ యాక్ట్‌

4) కన్జర్వేషన్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ఎక్స్ఛేంజ్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ స్మగ్లింగ్‌ యాక్టివిటీస్‌ యాక్ట్‌


16. కిందివాటిలో వివిధ చట్టాలు, అవి రూపొందించిన సంవత్సరాలకు సంబంధించి సరైంది?

a) అన్‌లాఫుల్‌ యాక్టివిటీస్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌        i) 1971

b) మేంటెనెన్స్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ సెక్యూరిటీ యాక్ట్‌   ii) 1968

c) టెరరిస్ట్స్‌ అండ్‌ డిస్క్రిప్టివ్‌ యాక్టివిటీస్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌    iii) 1985

d) COFEPOSA                         iv) 1974

1) a-ii, b-iv, c-iii, d-i       2) a-ii, b-i, c-iii, d-iv

3) a-i, b-ii, c-iii, d-iv       4) a-iii, b-iv, c-i, d-ii


17. కిందివాటిలో TADA చట్టానికి సంబంధించి సరైంది?

ఎ) ఈ చట్టాన్ని రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ కాలంలో రూపొందించారు.

బి) ఇది 1985, మే 23 నుంచి అమల్లోకి వచ్చింది.

సి) ఈ చట్టాన్ని రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆక్షేపించింది.

డి) దీన్ని పి.వి.నరసింహారావు ప్రభుత్వం 1995లో రద్దు చేసింది.

1) ఎ, బి, సి    2) ఎ, సి, డి

3) ఎ, బి, డి    4) ఎ, బి, సి, డి 


18. ప్రివెన్షన్‌ ఆఫ్‌ టెర్రరిజమ్‌ యాక్ట్‌ (POTA) చట్టాన్ని 2002లో అటల్‌ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం రూపొందించగా ఏ ప్రధాని కాలంలో రద్దు చేశారు?

1) ఐ.కె.గుజ్రాల్, 2007        

2) డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్, 2004

3) హెచ్‌.డి.దేవేగౌడ, 2011   

4) నరేంద్ర మోదీ, 2016


19. ESMA చట్టానికి సంబంధించి సరైంది?

ఎ) ESMA అంటే ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ మేంటెనెన్స్‌ యాక్ట్‌.

బి) ఈ చట్టం 1968లో ఇందిరా గాంధీ ప్రభుత్వ కాలంలో రూపొందింది.

సి) ఇది 1988లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వ కాలంలో నిర్దిష్ట రూపాన్ని పొందింది.

డి) ఈ చట్టాన్ని 1995లో పి.వి.నరసింహారావు ప్రభుత్వ కాలంలో రద్దు చేశారు.

1) ఎ, బి, సి             2) ఎ, సి, డి  

3) ఎ, బి, సి, డి        4) ఎ, బి, డి 


20. నేషనల్‌ సెక్యూరిటీ యాక్ట్‌కు సంబంధించి సరైంది?    

ఎ) ఈ చట్టాన్ని 1980లో ఇందిరా గాంధీ ప్రభుత్వ కాలంలో రూపొందించారు. 

బి) దీని ప్రకారం జిల్లా మేజిస్ట్రేట్, పోలీస్‌ కమిషనర్‌ నిరోధక ఆజ్ఞలను జారీ చేయగలరు.

సి) ఈ చట్టం ప్రకారం జారీ చేసే నిరోధక ఆజ్ఞలు 12 రోజులు అమల్లో ఉంటాయి.

డి) దీని ప్రకారం జారీ చేసే నిరోధక ఆజ్ఞలను 12 రోజుల్లోపు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాలి.

1) ఎ, సి, డి         2) ఎ, బి, సి   

3) ఎ, బి, డి         4) ఎ, బి, సి, డి 


21. వివిధ కార్యాలయాలు/కర్మాగారాల్లో పనిచేసే మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి సంబంధించిన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా వెలువరించింది?

1) విశాఖ స్వచ్ఛంద సంస్థ Vs స్టేట్‌ ఆఫ్‌ రాజస్థాన్‌ కేసు, 1997

2) కరణ్‌ సింగ్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ కేసు, 1963

3) కామన్‌ కాజ్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు, 2018

4) పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు, 1998



సమాధానాలు

12; 24; 33; 41; 51; 62; 71; 83; 91;  102; 113; 121; 131; 143; 151; 162; 174; 182; 191; 204; 211.

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

Posted Date : 13-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కార్మికుల సంక్షేమం - చట్టాలుకార్మికుల ఆవశ్యకత

ఏ దేశ ప్రగతినైనా నిర్దేశించే సత్తా కార్మిక వర్గానికి ఉంటుంది. దేశ విధానకర్తలు కార్మిక సంక్షేమాన్ని విస్మరించలేరు. కార్మికులకు సౌకర్యవంతమైన పనిగంటలు, పని వాతావరణం, వేతనాలు అందిస్తే వారు దేశ ప్రగతికి మరింత తోడ్పాటు అందిస్తారు. 2025 నాటికి ప్రపంచంలో అత్యధిక కార్మికులు ఉన్న దేశంగా భారత్‌ అవతరిస్తుందని అంచనా.


రాజ్యాంగంలో - ప్రస్తావన


భారత రాజ్యాంగంలోని IVవ భాగంలో ఉన్న ఆదేశిక సూత్రాలు/ నిర్దేశిక నియమాల్లో కార్మిక సంక్షేమం గురించి పేర్కొన్నారు.


ఆర్టికల్‌ 39 ( D): స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి.


 ఆర్టికల్‌ 39 (E): కార్మికులు వారి శారీరక దారుఢ్యానికి మించి పనిచేయకుండా చూడాలి.


 ఆర్టికల్‌ 42: కార్మికులకు పని ప్రదేశాల్లో గౌరవప్రదమైన వాతావరణాన్ని కల్పించాలి. స్త్రీ కార్మికులకు తగిన ప్రసూతి సౌకర్యాలు అందించాలి.


 ఆర్టికల్‌ 43: కార్మికులకు కనీస వేతనం అందించాలి. కార్మికులకు విరామం, విశ్రాంతి, మానసిక వికాసాన్ని కల్పించేందుకు ప్రయత్నించాలి.


ఆర్టికల్‌ 43 (A):  పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి.


కార్మిక సంక్షేమ పథకాలు


అటల్‌ పెన్షన్‌ యోజన


 ఈ పథకాన్ని  కేంద్రం 2015లో ప్రారంభించింది. అసంఘటిత రంగంలోని కార్మికుల సంక్షేమం దీని లక్ష్యం. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ దీన్ని నిర్వహిస్తోంది. ఏదైనా బ్యాంక్‌లో సేవింగ్స్‌ ఖాతా కలిగి, 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు. కనీసం 20 ఏళ్లు ఈ పథకంలో కొనసాగాలి. 


60 ఏళ్లు నిండాక వారు డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని బట్టి  రూ.1000 నుంచి రూ.5000 వరకు నెలవారీ పెన్షన్‌ లభిస్తుంది.


ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన


 ఈ పథకాన్ని 2015లో ప్రారంభించారు. ఇది జీవిత బీమా పథకం. వార్షిక ప్రీమియం రూ.330. రూ.2 లక్షల బీమా కవరేజీ ఉంటుంది. బ్యాంక్‌లో సేవింగ్స్‌ ఖాతా ఉండి, 18 సం. నుంచి 50 సం.లోపు వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు. 


దీన్ని ఏటా రెన్యువల్‌ చేసుకోవాలి. 50 ఏళ్లకు దగ్గరగా ఉన్నవారు ఈ పథకంలో చేరితే, 55 సం.లు వచ్చేవరకు వార్షిక ప్రీమియం చెల్లిస్తే, బీమా సదుపాయం లభిస్తుంది.


స్వావలంబన్‌


దీన్ని 2010లో ప్రారంభించారు. అసంఘటిత రంగంలోని కార్మికుల్లో పొదుపు అలవాటును పెంపొందించడం దీని లక్ష్యం. ఈ పథకంలో చేరిన ప్రతి కార్మికుడికి కేంద్ర ప్రభుత్వం రూ. 1000 చొప్పున తన వాటాగా చెల్లిస్తుంది.


ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన


ఇది వ్యక్తిగత ప్రమాద బీమా పథకం. 2015లో ప్రారంభించారు. ఏడాదికి రూ.12 ప్రీమియం చెల్లించాలి. బ్యాంక్‌లో పొదుపు ఖాతా కలిగి, 18 - 70 ఏళ్ల మధ్య వయసు వారు దీనికి అర్హులు. 


పాలసీదారు ఏదైనా ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైనా రూ.2 లక్షల పరిహారం నామినీకి లభిస్తుంది.


అసంఘటిత రంగ వాటా పెరుగుదల


మనదేశ ఉపాధిరంగంలో అసంఘటిత రంగ కార్మికుల వాటా 1977-78 నాటికి 92.2 శాతంగా ఉంది. అప్పటికి ఇంకా ప్రపంచీకరణ ప్రభావం మొదలుకాలేదు. National Commission for Enterprises in the Unorganised Sector - NCEUSఅధ్యయనం ప్రకారం, వ్యక్తులు లేదా కుటుంబాల యాజమాన్యంలో లేదా భాగస్వామ్యంలో ఉండి, ఉత్పత్తి, అమ్మకాల్లో నిమగ్నమై పదికంటే తక్కువ మందితో పనిచేసే సంస్థలన్నీ అసంఘటిత సంస్థలే.


E-Shram Card


అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక భద్రతను కల్పించడంతోపాటు సంఘటిత రంగ కార్మికులతో సమానంగా ప్రయోజనాలు సమకూర్చేందుకు ప్రభుత్వం ‘E-Shram Portal ను ప్రారంభించింది. దీని ద్వారా దేశంలోని అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను వారికి అందిస్తారు. దీని కోసం కార్మికులకు ‘ E-Shram Cards ను ఇస్తారు. 


ప్రయోజనాలు: - దేశంలో ఎక్కడైనా ఉపాధి పొందొచ్చు.


ప్రతి కార్మికుడికి రూ.2 లక్షల ప్రమాద బీమా కవరేజీ ఉంటుంది. పూర్తి అంగవైకల్యానికి గురైతే రూ.2 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి గురైతే రూ.లక్ష పరిహారం అందిస్తారు.


 అసంఘటిత రంగంలో పనిచేసే 16 - 59 ఏళ్ల వయసు వారు E-Shram Card కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఉచితం. 


 ఈ కార్డుదారులకు ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్‌ యోజన, స్వయం ఉపాధి కోసం జాతీయ పెన్షన్‌ పథకం, ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన, అటల్‌ పెన్షన్‌ యోజన, ప్రజాపంపిణీ వ్యవస్థ, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, ఆయుష్మాన్‌ భారత్‌ లాంటి ప్రయోజనాలు పొందొచ్చు.


కార్మిక చట్టాలు


కర్మాగారాల చట్టం, 1948


ఈ చట్టం ప్రకారం, సంస్థ ప్రతి 150 మంది కార్మికులకు ఒక ప్రథమ చికిత్స పేటిక (బాక్స్‌)ను, 500 మందికి మించి కార్మికులు ఉంటే, అంబులెన్స్‌ సౌకర్యాన్ని కల్పించాలి. 

 కార్మికులకు విశ్రాంతి గదులు, భోజనశాలను ఏర్పాటు చేయాలి. 500 కంటే ఎక్కువ కార్మికులు ఉంటే వారి యోగక్షేమాల పర్యవేక్షణకు ఒక సంక్షేమ అధికారిని నియమించాలి. 30 మందికి మించి మహిళా కార్మికులు పనిచేస్తుంటే శిశు సంరక్షణా కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. 250 మందికి మించి కార్మికులు ఉంటే ‘క్యాంటీన్‌ వసతి’ కల్పించాలి.


ప్లాంటేషన్‌ కార్మికుల చట్టం, 1951


ఈ చట్టం ప్రకారం, 300 లేదా అంతకంటే ఎక్కువ కార్మికులు పనిచేస్తుంటే, వారి సంక్షేమ పర్యవేక్షణకు ఒక సంక్షేమ అధికారిని నియమించాలి. కార్మికులతోపాటు వారి కుటుంబ సభ్యులకు వైద్య, వినోద సౌకర్యాలను కల్పించాలి. మహిళా కార్మికులకు ‘ప్రసూతి భత్యాన్ని’ ఇవ్వాలి. 150 మంది లేదా అంతకు మించి కార్మికులు ఉంటే ‘క్యాంటీన్‌ వసతి’ కల్పించాలి.


గనుల చట్టం, 1952


ఈ చట్టం ప్రకారం, గనుల్లో పనికోసం బాలబాలికలను కార్మికులుగా నియమించకూడదు. 50 మంది లేదా అంతకంటే ఎక్కువ మహిళా కార్మికులు ఉంటే తప్పనిసరిగా ‘శిశు సంరక్షణా కార్యాలయాన్ని’ ఏర్పాటు చేయాలి. 500 లేదా అంతకు మించి కార్మికులు ఉంటే వారికి భోజనశాల, విశ్రాంతి గదుల సౌకర్యాన్ని కల్పించాలి. 250 మంది లేదా అంతకు మించి కార్మికులు ఉంటే ‘క్యాంటీన్‌ వసతి’ అందించాలి. 150 మంది కార్మికులు ఉంటే వారికి ప్రథమ చికిత్స పేటికలు అందుబాటులో ఉంచాలి.


బోనస్‌ చెల్లింపు చట్టం, 1965


యాజమాన్యం కార్మికులకు వేతనాలతో పాటు అదనంగా చెల్లించే ఆర్థిక ప్రయోజనమే ‘బోనస్‌’. దీని ద్వారా కార్మికులకు అదనపు ఆర్థిక ప్రతిఫలం లభిస్తుంది. సంస్థ లాభ-నష్టాలతో సంబంధం లేకుండా బోనస్‌ను చెల్లించాలి. పరిశ్రమలు, కంపెనీల యాజమాన్యంపై బోనస్‌ చెల్లించాల్సిన చట్టపరమైన బాధ్యత ఉంది. ప్రతి యజమాని తన సంస్థలో పనిచేసే కార్మికుడికి సంవత్సరంలో తను సంపాదించుకునే వేతనంలో 8.33% ఆర్థిక వనరును కనీస బోనస్‌గా చెల్లించాలి.


అంతర్‌ రాష్ట్ర వలస కార్మికుల చట్టం, 1979


ఈ చట్టం ప్రకారం, వివిధ రాష్ట్రాలకు ఉపాధి కోసం వలస వెళ్లే కార్మికులకు చట్టపరమైన రక్షణ, సదుపాయాలను కల్పించాలి. కార్మికులకు కనీస వసతులు ఏర్పాటు చేయాలి. వారికి సరైన పని పరిస్థితులను, నివాస వసతి కల్పించాలి.


మోటార్‌ రవాణా కార్మిక చట్టం, 1961


ఈ చట్టం ప్రకారం, రవాణా వాహనంలో తప్పనిసరిగా ప్రథమ చికిత్స పెట్టెను (First Aid Box)ను ఉంచాలి.


ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన


దీన్ని 2015లో ప్రారంభించారు. దీని ద్వారా 20కి పైగా కేంద్ర మంత్రిత్వశాఖలు ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూ, కార్మికులను ఉన్నత స్థితిలో ఉంచే ప్రయత్నం చేస్తున్నాయి. 


 నూతన వ్యాపారాలను ప్రారంభించడాన్ని మరింత సులభతరం చేస్తూ భారత్‌లో తయారీ, డిజిటల్‌ ఇండియా, స్వచ్ఛభారత్‌ అభియాన్‌ లాంటి ప్రధాన కార్యక్రమాల ద్వారా కార్మికులకు వివిధ రకాల ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. 


 స్టార్టప్‌ ఇండియా, స్టాండప్‌ ఇండియా, ముద్ర లాంటి పథకాలతో కార్మికుల్లో సృజనాత్మక ఆలోచనాధోరణులను పెంపొందించి, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు.


బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం, 1986


భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 24 ప్రకారం మన దేశంలో బాల కార్మిక వ్యవస్థను నిషేధించారు. దీని ద్వారా 14 ఏళ్లలోపు వయసున్న పిల్లలను కర్మాగారాల్లో, గనుల్లో పనుల కోసం నియమించకూడదని నిర్దేశించారు.


 బాల కార్మిక నిషేధ చట్టం, 1986 ప్రకారం బాలలు అంటే 14 ఏళ్లలోపు వయసువారు. 


 ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం 13 వృత్తులు, 57 ప్రక్రియల్లో  పనుల కోసం పిల్లలను ఉపయోగించడం నేరం.


 ఈ చట్టంలోని సెక్షన్‌ 3లో పేర్కొన్న నిబంధనలను ఉల్లంఘించి ఏ వ్యక్తి అయినా బాలలను పనుల కోసం ఉపయోగిస్తే సంబంధిత వ్యక్తికి 3 నెలలకు తక్కువ కాకుండా ఒక సంవత్సరం వరకు జైలుశిక్ష లేదా జరిమానా విధిస్తారు.


బాల కార్మిక వ్యవస్థ నిషేధ సవరణ చట్టం, 2016


కేంద్ర ప్రభుత్వం బాల కార్మికుల నిషేధ సవరణ చట్టాన్ని 2016లో రూపొందించింది. ఇందులోని అంశాలు 2016, సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం, 18 ఏళ్లలోపు కౌమార దశలో ఉన్న పిల్లలను ప్రమాదకర పనుల్లో నియమిస్తే సంబంధిత యజమానులకు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తారు.


 ఈ చట్టం ప్రకారం, కార్మిక - ఉపాధి మంత్రిత్వశాఖ జాతీయ బాల కార్మికుల ప్రాజెక్ట్‌ ( NCLP ) పథకాన్ని అమలుచేస్తోంది. ఇందులో ప్రతి జిల్లాకు ఒక సొసైటీ ఉంటుంది. వీటిని జిల్లా ప్రాజెక్ట్‌ సొసైటీలు అంటారు. ఇవి బాల కార్మికులకు పునరావాసం కల్పిస్తాయి. వీటికి జిల్లా మెజిస్ట్రేట్‌ అధ్యక్షత వహిస్తారు.


రచయిత

బంగారు సత్యనారాయణ

విషయ నిపుణులు 

Posted Date : 13-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కేంద్రపాలిత ప్రాంతాలు - ప్రాంతీయ మండళ్లు

సమన్వయంతో సమర్థ పాలన!
 

 

దేశంలో పరిపాలన పరంగా పూర్తిగా లేదా పాక్షికంగా కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో ఉన్న ప్రాంతాలే కేంద్రపాలిత ప్రాంతాలు. రాష్ట్రాలతో పోలిస్తే వీటి పరిపాలన భిన్నంగా సాగుతుంది. పరిపాలనా సౌలభ్యం, రాజకీయ ప్రాధాన్యం, సాంస్కృతిక భిన్నత్వం, రక్షణ, వ్యూహాత్మక అంశాల ప్రాతిపదికన కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటయ్యాయి. వీటి పరిణామక్రమం, క్రమానుగతంగా జరిగిన మార్పుచేర్పులు, సంబంధిత రాజ్యాంగ అంశాలతో పాటు దిల్లీకి సంబంధించి ఉన్న వివాదం గురించి పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. సహకార సమాఖ్యను బలోపేతం చేసే విధంగా చట్టబద్ధంగా ఏర్పాటైన ప్రాంతీయ మండళ్ల స్వరూపం, పరిధి, పనితీరు గురించి తెలుసుకోవాలి.


వ్యూహాత్మక, పరిపాలనా పరమైన, చారిత్రక కారణాలతో కొన్ని ప్రాంతాలను రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఉంచారు. వాటినే కేంద్రపాలిత ప్రాంతాలు అంటారు. ఇవి కేంద్రం ప్రత్యక్ష నియంత్రణలో జాతీయ ప్రాముఖ్యత ఉన్న కేంద్రాలుగా పని చేస్తాయి. వీటికి రాష్ట్రాలకు ఉన్న స్వయంప్రతిపత్తి ఉండదు. 

రాష్ట్రాల్లో నిర్దిష్ట స్థానిక సమస్యలను పరిష్కరించుకోడానికి ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా అభివృద్ధి, సాంస్కృతిక సంరక్షణ, వనరుల నిర్వహణ తదితర అంశాల్లో స్థానిక ప్రాతినిధ్యాన్ని అందిస్తారు.

భారత రాజకీయ పరిపాలనలో కేంద్రం అధికారాన్ని ప్రాంతీయ ప్రయోజనాలతో సమన్వయం చేయడంలో, భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించడంలో, దేశ వ్యాప్తంగా సమర్థ పాలనను అందించడంలో కేంద్ర పాలిత ప్రాంతాలు, ప్రాంతీయ మండళ్లు కీలకంగా వ్యవహరిస్తాయి. 

కేంద్రపాలిత ప్రాంతాలు:  రాజ్యాంగంలోని 8వ భాగంలో ఆర్టికల్‌ 239 నుంచి 241 మధ్య కేంద్రపాలిత ప్రాంతాల గురించి వివరణ ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పాలనలో ఉంటాయి. ప్రస్తుతం మన దేశంలో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 8.

ఆర్టికల్‌ 239(1): కేంద్రపాలిత ప్రాంతాలన్నీ రాష్ట్రపతి పరిపాలన కింద ఉంటాయి. రాష్ట్రపతి కేంద్రపాలిత ప్రాంతాలకు పరిపాలకులను నియమించి వారి ద్వారా పరిపాలిస్తారు. కేంద్రపాలిత ప్రాంత పరిపాలనకు సంబంధించిన శాసనాన్ని పార్లమెంటు ప్రత్యేకంగా రూపొందిస్తే సంబంధిత శాసనమే చెల్లుతుంది.

ఆర్టికల్‌ 239(2): ఒక రాష్ట్ర గవర్నర్‌ను దానికి సమీపంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతానికి పరిపాలకుడిగా రాష్ట్రపతి నియమించవచ్చు. ఇలా నియమించిన గవర్నర్‌ సంబంధిత కేంద్రపాలిత ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తారు.

ఆర్టికల్‌ 239(A): కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి గురించి ఈ ఆర్టికల్‌ వివరిస్తుంది. 14వ రాజ్యాంగ సవరణ చట్టం, 1962 ద్వారా దీన్ని రాజ్యాంగానికి చేర్చారు.

ఆర్టికల్‌ 239(A)(1): పుదుచ్చేరికి శాసనసభ, మంత్రి మండలిని ఏర్పాటు చేస్తూ పార్లమెంటు శాసనాన్ని రూపొందించవచ్చు.

ఆర్టికల్‌ 239(A)(1)(a): పుదుచ్చేరి శాసనసభలోని సభ్యులను ఓటర్లు ఎన్నుకోవచ్చు, నామినేట్‌ చేయవచ్చు.

ఆర్టికల్‌ 239(A)(1)(b): పుదుచ్చేరి శాసనసభ, మంత్రిమండలి నిర్మాణం, వాటి అధికారాలు, విధులకు సంబంధించిన అంశాలపై పార్లమెంటు శాసనం రూపొందించవచ్చు. పార్లమెంటు రూపొందించిన శాసనం ప్రకారం 1963లో పుదుచ్చేరికి శాసనసభను ఏర్పాటు చేశారు.

ఆర్టికల్‌ 239AA: కేంద్రపాలిత ప్రాంతమైన దిల్లీకి ప్రత్యేక ప్రతిపత్తి గురించి వివరిస్తుంది. 69వ రాజ్యాంగ సవరణ చట్టం, 1991 ద్వారా దీనిని నిర్దేశించారు. ఇది 1992 నుంచి అమల్లోకి వచ్చింది.

ఆర్టికల్‌ 239AAs(1): దిల్లీకి జాతీయ రాజధాని ప్రాంత హోదా కల్పించింది.

ఆర్టికల్‌ 239AA(2)(a): కేంద్రపాలిత ప్రాంతమైన దిల్లీకి శాసనసభను ఏర్పాటు చేశారు.

ఆర్టికల్‌ 239AA(2)(b): దిల్లీకి సంబంధించిన శాసనసభ స్థానాల సంఖ్య, నియోజకవర్గాల పునర్విభజన, శాసనసభ కార్యనిర్వహణాధికారాలు మొదలైన వాటికి సంబంధించిన శాసనాలను పార్లమెంటు రూపొందిస్తుంది.

ఆర్టికల్‌ 239AA(2)(c): ఆర్టికల్‌ 324 నుంచి 329 వరకు ఉన్న ఎన్నికల నిబంధనలు దిల్లీ శాసనసభ్యులకు కూడా వర్తిస్తాయి.

ఆర్టికల్‌ 239AA(3)(a): రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలోని అంశాలపై రాజ్యాంగ పరిధికి లోబడి చట్టాలు చేసే అధికారం దిల్లీ శాసనసభకు ఉంది. అయితే రాష్ట్ర జాబితాలోని 1, 2, 18, 64, 65, 66 అంశాలకు సంబంధించిన వాటిపై శాసనాలు రూపొందించే అధికారం దిల్లీ శాసనసభకు లేదు.

ఆర్టికల్‌ 239AA(3)(b): కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన శాసనాలను రూపొందించే అంతిమ అధికారం పార్లమెంటుకు ఉంటుంది.

ఆర్టికల్‌ 239AA(3)(c) : దిల్లీ శాసనసభ రూపొందించిన చట్టం, పార్లమెంటు రూపొందించిన చట్టం మధ్య విభేదాలు ఏర్పడితే పార్లమెంటు చట్టమే అమలవుతుంది. దిల్లీ శాసనసభ రూపొందించిన చట్టం రాష్ట్రపతి ఆమోదంతో అమల్లోకి వచ్చినప్పటికీ, దాన్ని సవరించే/రద్దు చేసే అధికారం పార్లమెంటుకి ఉంటుంది.

ఆర్టికల్‌ 239AA(4): దిల్లీ శాసనసభలోని శాసనసభ్యుల సంఖ్యలో 10% మించకుండా ముఖ్యమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి ఉంటుంది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు పరిపాలనలో సహకరిస్తుంది.

* దిల్లీ పరిపాలనకు సంబంధించిన అంశాలపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు, మంత్రిమండలికి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడితే సంబంధిత విషయాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ రాష్ట్రపతికి నివేదించి, రాష్ట్రపతి ఇచ్చిన ఆదేశాల మేరకు వ్యవహరించాలి.

ఆర్టికల్‌ 239AB: దిల్లీ జాతీయ రాజధాని ప్రాంత పరిపాలనకు అవసరమైన చర్యలను రాష్ట్రపతి చేపట్టవచ్చు. అంటే అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించవచ్చు.

 

సుప్రీంకోర్టు తీర్పు: లెఫ్టినెంట్‌ గవర్నర్ vs దిల్లీ ప్రభుత్వం కేసు-2018

2016లో దిల్లీ హైకోర్టు కీలక తీర్పునిస్తూ దిల్లీ పరిపాలనకు సంబంధించిన సర్వాధికారాలు లెఫ్టినెంట్‌ గవర్నర్‌కే ఉంటాయని పేర్కొంది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని అయిదు మంది సభ్యుల ధర్మాసనం 2018, జులై 4న దిల్లీ హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది. ఈ తీర్పులోని కీలక అంశాలు- * దిల్లీ ప్రభుత్వం తన నిర్ణయాలను లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు తెలియజేయాలి. * దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు సర్వాధికారాలు ఉండవు. * దిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా లేదు.* దిల్లీ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు మధ్య అభిప్రాయభేదాలు వస్తే రాష్ట్రపతి పరిష్కరించాలి. * పరిపాలనకు సంబంధించిన రోజువారీ వ్యవహారాల్లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమోదం లేకుండానే దిల్లీ ప్రభుత్వం పని చేయవచ్చు. * భూమి, శాంతిభద్రతలు, పోలీస్‌ వంటి విషయాలు మినహా మిగిలిన అన్ని అంశాల్లో దిల్లీ మంత్రిమండలి సలహాను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తప్పనిసరిగా అనుసరించాలి.

సుప్రీంకోర్టు తీర్పును అధిగమించేందుకు 2021లో భారత పార్లమెంటు ఒక చట్టాన్ని రూపొందించింది. దీనిప్రకారం 1991 నాటి నేషనల్‌ కాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ దిల్లీ యాక్ట్‌ను 2021, మార్చిలో సవరించింది. దీనిప్రకారం దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు విస్తృత అధికారాలను కల్పించారు.

ఆర్టికల్‌ 239 (B): పుదుచ్చేరి పరిపాలనకు సంబంధించిన ఆర్డినెన్స్‌ జారీ చేసే విధానాన్ని వివరిస్తుంది.

ఆర్టికల్‌-239(B)(1): పుదుచ్చేరి శాసనసభ సమావేశాలు జరగకపోతే దాని ‘అడ్మినిస్ట్రేటర్‌’ ఆర్డినెన్స్‌ జారీ చేయాలంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి తప్పనిసరి. రాష్ట్రపతి ఆమోదంతో జారీ చేసే ఆర్డినెన్స్‌కు చట్టంతో సమాన విలువ ఉంటుంది. కేంద్రపాలిత ప్రాంతం శాసనసభ సమావేశాలు ప్రారంభమైన 6 వారాల్లోపు ఆర్డినెన్స్‌ను శాసనసభ ఆమోదించాలి. లేకపోతే రద్దవుతుంది.

ఆర్టికల్‌ - 240: కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన రెగ్యులేషన్స్‌ను రాష్ట్రపతి జారీ చేయవచ్చు.

ఆర్టికల్‌ - 241: కేంద్రపాలిత ప్రాంతాలలో హైకోర్టును ఏర్పాటు చేయవచ్చు. దీన్ని పార్లమెంట్‌ చట్టం ద్వారా నిర్దేశించవచ్చు. ఆర్టికల్‌ 214 ప్రకారం ఏర్పడిన హైకోర్టుకు ఎలాంటి అధికారాలు, విధులు ఉంటాయో ఈ హైకోర్టుకు కూడా అలాంటి అధికారాలు, విధులు ఉంటాయి.

కేంద్రపాలిత ప్రాంతాల పరిణామక్రమం: ఫజల్‌ అలీ కమిషన్‌ సిఫార్సుల మేరకు జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన దేశంలో 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది. అవి: దిల్లీ, అండమాన్‌ - నికోబార్‌ దీవులు, లక్షదీవులు, హిమాచల్‌ ప్రదేశ్, మణిపుర్, త్రిపుర.

* 2019లో జమ్ము - కశ్మీర్‌ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణతో దాని రాష్ట్ర హోదా రద్దయింది. జమ్ము-కశ్మీర్, లద్దాఖ్‌ల పేరుతో రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటయ్యాయి.

* 2019లో భారత పార్లమెంట్‌ రూపొందించిన చట్టం ప్రకారం డయ్యూ డామన్, దాద్రానగర్‌ హవేలీలను విలీనం చేసి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. ఇది 2020, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది.

* ప్రస్తుతం మనదేశంలోని కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య: 8 అవి 1) దిల్లీ 2) పుదుచ్చేరి 3) లక్షదీవులు 4) డయ్యూ డామన్, దాద్రానగర్‌ హవేలీ. 5) అండమాన్, నికోబార్‌ దీవులు 6) చండీగఢ్‌ 7) జమ్ము-కశ్మీర్‌  8) లద్దాఖ్‌.

* కేంద్రపాలిత ప్రాంతాల్లో రాష్ట్రపతి ప్రతినిధులుగా వ్యవహరించే పరిపాలకులను చీఫ్‌ అడ్మినిస్ట్రేటర్, లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా పేర్కొంటారు.

* చీఫ్‌ అడ్మినిస్ట్రేటర్‌ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు: దాద్రానగర్‌ హవేలీ, డయ్యూ డామన్, లక్షదీవులు, చండీగఢ్‌.

* లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు: దిల్లీ, అండమాన్‌ నికోబార్‌ దీవులు, పుదుచ్చేరి, జమ్ము-కశ్మీర్, లద్దాఖ్‌.

ప్రాంతీయ మండళ్లు: ఫజల్‌ అలీ కమిషన్‌ సిఫార్సుల మేరకు జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 1956లో దేశంలో 5 ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేశారు. 1971లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల మండలి చట్టాన్ని రూపొందించి ‘ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి’ని ఏర్పాటు చేసింది. ఇది 1972 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం మన దేశంలోని ప్రాంతీయ మండళ్ల సంఖ్య 6. ఇవి చట్టబద్ధమైన సలహా సంస్థలు. సిక్కిం భారత్‌లో విలీనం అయినప్పుడు తూర్పు మండలిలో ఉండేది. 2002లో సిక్కింను ఈశాన్య రాష్ట్రాల మండలికి బదిలీ చేశారు.


ప్రస్తుతం దేశంలోని ప్రాంతీయ మండళ్ల - స్వరూపం:

1) ఉత్తర ప్రాంతీయ మండలి: ప్రధాన కేంద్రం దిల్లీ. దీనిలో పంజాబ్, హరియాణా, రాజస్థాన్, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలు; దిల్లీ, చండీగఢ్, జమ్ము- కశ్మీర్, లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.

2) పశ్చిమ ప్రాంతీయ మండలి: దీని ప్రధాన కేంద్రం ముంబయి. ఇందులో మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాలు; డయ్యూ డామన్, దాద్రానగర్‌ హవేలి కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి.

3) దక్షిణ ప్రాంతీయ మండలి: ప్రధాన కేంద్రం చెన్నై. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు; పుదుచ్చేరి, లక్షద్వీప్‌ కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి.

4) మధ్య ప్రాంతీయ మండలి: ప్రధాన కేంద్రం అలహాబాద్‌. ఇందులో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలున్నాయి.

5) తూర్పు ప్రాంతీయ మండలి: ప్రధాన కేంద్రం కోల్‌కతా. ఇందులో బిహార్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలు; అండమాన్‌ నికోబార్‌ దీవులు ఉన్నాయి.

6) ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి: దీని ప్రధాన కేంద్రం గువాహటి. ఇందులో అస్సాం, మణిపుర్, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్, నాగాలాండ్‌ రాష్ట్రాలున్నాయి.

* ప్రాంతీయ మండలి సమావేశాలు సంవత్సరానికి రెండు సార్లు జరగాలి. వాటికి కేంద్ర హోం మంత్రి అధ్యక్షత వహిస్తారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల పాలకులు సభ్యులుగా ఉంటారు.



రచయిత: బంగారు సత్యనారాయణ

 

Posted Date : 11-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత రాజ్యాంగ సవరణ విధానం

ప్రగతి సాధక మార్పు మంచిదే! 

 


చట్టాలు దేశ ప్రగతికి సాధనాలుగా ఉపయోగపడాలి. ప్రజాస్వామ్య పరిణామాలకు, నిబద్ధతకు ప్రతిబింబాలుగా నిలవాలి. రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలను పాటిస్తూ సమకాలీన సామాజిక, రాజకీయ గతిశీలతకు అనుగుణంగా ఉండాలి. అభివృద్ధికి అవరోధాలుగా మారకూడదు.  ఈ లక్ష్యంతో అసలు సవరించకపోతే సమస్యలు ఎదురవుతాయి, మారుస్తూ కూర్చుంటే మౌలిక స్వరూపమే మారిపోవచ్చనే ఆందోళనల మధ్య సమర్థ సవరణ విధానాలను భారత రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించారు. పౌరుల హక్కులు, ప్రయోజనాలను కాపాడుతూ స్థిరత్వం, పురోగతి మధ్య సమతౌల్యతను సాధించే విధంగా వాటిని రూపొందించారు. ఈ అంశాలను సంబంధిత ఆర్టికల్స్, సుప్రీంకోర్టు తీర్పులతో సహా అభ్యర్థులు తెలుసుకోవాలి. ప్రజల అవసరాలకు ప్రతిస్పందించగలిగినట్లుగా ప్రస్తుతం అనుసరిస్తున్న రాజ్యాంగ సవరణ ప్రక్రియను తీర్చిదిద్దిన తీరును అర్థం చేసుకోవాలి.

 

‘‘ ఒకవేళ మనం భారత రాజ్యాంగాన్ని సవరించడానికి వీలు లేని విధంగా తయారు చేస్తే, అది జాతి అభివృద్ధిని, ప్రజల జీవన విధానాన్ని అడ్డుకోవడమే అవుతుంది. ప్రపంచం కాలానుగుణ మార్పులకు తగినట్లుగా పరుగు పెడుతుంటే, మనం సంప్రదాయ సమాజంలోనే ఆగిపోయే అవకాశం ఉంది. ఈ రోజు రూపొందించిన ఈ రాజ్యాంగం భవిష్యత్తు తరాల అవసరాలను తీర్చలేకపోవచ్చు. అందువల్ల రాజ్యాంగాన్ని సరళంగా, కాలానుగుణంగా సవరించే అవకాశం ఉండాలి. ’’

- జవహర్‌లాల్‌ నెహ్రూ (నాటి రాజ్యాంగ పరిషత్తు చర్చలో) 



ఆధునిక యుగంలో భారత ప్రజల ఆకాంక్షలకు తగినట్లుగా రాజ్యాంగాన్ని సవరించే సర్వాధికారం రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటుకు అప్పగించారు. అందుకోసం సవరణ విధానాలను, ప్రక్రియలను, నియమాలను నిర్దేశించారు.



రాజ్యాంగ వివరణ :  భారత రాజ్యాంగంలోని 20వ భాగంలో ఆర్టికల్‌ 368లో భారత రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని వివరించారు. సంబంధిత బిల్లులను పార్లమెంటు ఉభయ సభల్లో ఎక్కడైనా ప్రవేశపెట్టవచ్చు. వాటిని ఆమోదించే క్రమంలో లోక్‌సభ, రాజ్యసభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఆ బిల్లులు వీగిపోతాయి. రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంటు ఆమోదిస్తే, అనంతరం రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టాలుగా అమల్లోకి వస్తాయి. 

1971లో 24వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం రూపొందాయి. వీటి ద్వారా ఆర్టికల్‌ 368లో మార్పులు, చేర్పులు జరిగాయి.

రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం లేదు.

రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంటు ఉభయ సభలు విడివిడిగా ఆమోదించాలి. ఈ బిల్లుల ఆమోద విషయమై ఉభయ సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు.

రాజ్యాంగ సవరణ బిల్లులను రాష్ట్రపతి పునఃపరిశీలనకు పంపడం, తిరస్కరించడం కుదరదు. తప్పనిసరిగా ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది.



దృఢ, అదృఢ లక్షణాల సమ్మేళనం :  రాజ్యాంగాన్ని సవరించే విధానం కఠినంగా ఉంటే దాన్ని దృఢ రాజ్యాంగం అంటారు. ఉదా: అమెరికా రాజ్యాంగం. అక్కడ రాజ్యాంగాన్ని సవరించాలంటే ఆ దేశ శాసన వ్యవస్థ (కాంగ్రెస్‌) 2/3వ వంతు మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదించడంతో పాటు, ఆ దేశంలోని 3/4వ వంతు రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి.

 రాజ్యాంగాన్ని సవరించే విధానం సులభంగా ఉంటే అది అదృఢ రాజ్యాంగం. ఉదా: బ్రిటన్‌ రాజ్యాంగం. బ్రిటన్‌ దేశంలో పార్లమెంటు సాధారణ మెజార్టీ పద్ధతి ద్వారా ఎలాంటి అంశాన్నయినా సవరిస్తుంది.  

 రాజ్యాంగ పరిషత్తులో భారత రాజ్యాంగం ఏవిధంగా ఉండాలనే అంశంపై విస్తృతమైన చర్చ జరిగింది. గోపాలస్వామి అయ్యంగార్‌ నేతృత్వంలోని కొంతమంది సభ్యులు దృఢ రాజ్యాంగం ఉండాలంటే, జవహర్‌లాల్‌ నెహ్రూ నేతృత్వంలోని కొంతమంది సభ్యులు అదృఢ రాజ్యాంగం ఉండాలని సూచించారు. చివరకు రాజ్యాంగాన్ని దృఢ, అదృఢ లక్షణాల సమ్మేళనంగా రూపొందించారు.

‣ రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని దక్షిణాఫ్రికా నుంచి గ్రహించారు.



గోల్డెన్‌ మిడిల్‌ పాత్‌ :  మన రాజ్యాంగ సవరణ ప్రక్రియ దక్షిణాఫ్రికా అంత సరళం కాదు. అమెరికా తరహాలో అత్యంత దృఢమైన విధానం కాదు. ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకుని గోల్డెన్‌ మిడిల్‌ పాత్‌ను అనుసరించారు.

 సవరణ విధానం దృఢంగా ఉంటే కాలమాన పరిస్థితులకు వీలుగా మార్పులు కుదరవు. అదృఢంగా ఉంటే రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది.



సవరణ పద్ధతులు : రాజ్యాంగాన్ని ఆర్టికల్‌ 368 ప్రకారం మూడు రకాల పద్ధతుల ద్వారా పార్లమెంటు సవరిస్తుంది.


1) సాధారణ మెజార్టీ పద్ధతి: సాధారణ మెజార్టీ అంటే సభకు హాజరై ఓటు వేసిన వారిలో సగానికంటే ఎక్కువ మంది (50% +) ఆమోదంతో రాజ్యాంగంలోని కొన్ని అంశాలను సవరించవచ్చు. అవి

ఆర్టికల్‌ 3- రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ

ఆర్టికల్‌ 100 (3)- పార్లమెంటు సమావేశాల నిర్వహణకు కోరంలో మార్పులు, చేర్పులు

ఆర్టికల్‌ 102- పార్లమెంటు సభ్యుల అర్హతలు, అనర్హతలు నిర్ణయించడం.

ఆర్టికల్‌ 105- పార్లమెంటు సభ్యుల సభా హక్కులు.

ఆర్టికల్‌ 106- పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు.

ఆర్టికల్‌ 120- పార్లమెంటులో ఆంగ్ల భాష వినియోగం.

ఆర్టికల్‌ 169- రాష్ట్ర శాసనసభలో విధాన పరిషత్తు ఏర్పాటు/రద్దు.

2వ షెడ్యూల్‌లో పేర్కొన్న రాజ్యాంగ ఉన్నత పదవుల జీతభత్యాలు.

5వ, 6వ షెడ్యూళ్లలోని షెడ్యూల్డ్‌ జాతులు, షెడ్యూల్డ్‌ తెగల పరిపాలనాంశాలు.

 3వ షెడ్యూల్‌లోని రాజ్యాంగ ఉన్నత పదవుల ప్రమాణ స్వీకారం.

 2వ భాగంలోని పౌరసత్వ విషయాలు.

 ఆర్టికల్‌ 82- నియోజక వర్గాల పునర్‌వ్యవస్థీకరణ

 ఆర్టికల్‌ 124 (1)- సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య.

 ఆర్టికల్‌ 239 (ఎ)- కేంద్రపాలిత ప్రాంతాల్లో శాసనసభ, మంత్రిమండలి ఏర్పాటు.

 ఆర్టికల్‌ 343-కేంద్రం అధికార భాషను నిర్ణయించడం.


2) ప్రత్యేక మెజార్టీ పద్ధతి: ఉభయ సభలు వేర్వేరుగా సమావేశమై, ఓటు వేసిన వారిలో 2/3వ వంతు ఆమోదిస్తే రాజ్యాంగ సమాఖ్య లక్షణాలను సవరించవచ్చు. అవి

రాజ్యాంగం 3వ భాగంలో ఆర్టికల్‌ 12 నుంచి 35 మధ్య ఉన్న ప్రాథమిక హక్కులు.

రాజ్యాంగం 4వ భాగంలో ఆర్టికల్‌ 36 నుంచి 51 మధ్య ఉన్న ఆదేశిక సూత్రాలు.

 రాజ్యాంగ 4(ఎ) భాగంలో ఆర్టికల్‌ 51 (ఎ)లోని ప్రాథమిక విధులు.ః మొదటి, మూడు పద్ధతుల్లో పేర్కొననివి.


3) ప్రత్యేక మెజార్టీ, రాష్ట్రాల ఆమోదం: పార్లమెంటు ఉభయ సభలు వేర్వేరుగా 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో తీర్మానం ఆమోదించడంతో పాటు దేశంలోని సగానికంటే (1/2వ వంతు) ఎక్కువ రాష్ట్రాలు కూడా అంగీకరించాలి. ఇది దృఢ రాజ్యాంగ లక్షణం.. ఈ పద్ధతి ద్వారా పలు అంశాలను సవరించే వీలుంది.అవి -

ఆర్టికల్‌ 54 - రాష్ట్రపతి ఎన్నిక

ఆర్టికల్‌ 55 - రాష్ట్రపతి ఎన్నిక విధానం

 ఆర్టికల్‌ 73 - కేంద్ర కార్యనిర్వాహక వర్గ అధికార పరిధిలో మార్పులు, చేర్పులు

 ఆర్టికల్‌ 162 - రాష్ట్ర కార్యనిర్వాహక వర్గ అధికార పరిధిలో మార్పులు, చేర్పులు.

 ఆర్టికల్‌ 241 - కేంద్రపాలిత ప్రాంతాల్లోని హైకోర్టుల అంశాలు.

 ఆర్టికల్‌ 137 - సుప్రీంకోర్టు తీర్పులపై పునఃసమీక్ష.

 11వ భాగంలోని కేంద్ర, రాష్ట్ర సంబంధాలు (శాసన, పరిపాలన సంబంధాలు)

 ఆర్టికల్‌ 131 - సుప్రీంకోర్టు ఒరిజినల్‌ అధికార పరిధిలో మార్పులు, చేర్పులు.

ఆర్టికల్‌ 368- రాజ్యాంగ సవరణ విధానంలో మార్పులు, చేర్పులు.

 4వ షెడ్యూల్‌లో రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించే అంశాలు.

 7వ షెడ్యూల్‌లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన మూడు రకాల అధికారాల విభజన.ః 11వ షెడ్యూల్‌లో పంచాయతీరాజ్‌ వ్యవస్థకు బదిలీ చేయాల్సిన అధికారాలు, విధులు.

 12వ షెడ్యూల్‌లోని పట్టణ, స్థానిక సంస్థలకు బదిలీ చేయాల్సిన అధికారాలు, విధులు.


గోలక్‌నాథ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసు (1967): ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని, రాజ్యాంగాన్ని సవరించాలంటే పార్లమెంటు కొత్తగా రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయాలని పేర్కొంది.

 గోలక్‌నాథ్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధిగమించేందుకు అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 1971లో 24వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 13, 368లను సవరించారు. ఆర్టికల్‌ 13కి క్లాజు (4)ని చేర్చారు. ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్ని అయినా సవరించే అధికారాన్ని పార్లమెంటుకు అప్పగించారు. రాజ్యాంగ సవరణ బిల్లులను రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలని నిర్దేశించారు.


కేశవానంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసు (1973): ఈ కేసులో 24వ రాజ్యాంగ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రాజ్యాంగ సవరణపై పార్లమెంటుకు ఉన్న అధికారాలపై హేతుబద్ధమైన పరిమితులను పేర్కొంది. ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్ని అయినా సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని, అయితే అది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విఘాతం కలగకుండా జరగాలని చెప్పింది. ఆ సందర్భంగా అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎమ్‌. సిక్రీ రాజ్యాంగ మౌలిక స్వరూపంలో సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యం, గణతంత్ర వ్యవస్థ, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అంతర్భాగమని పేర్కొన్నారు. ః ఎస్‌.ఆర్‌. బొమ్మై కేసు (1994)లో సుప్రీంకోర్టు లౌకికవాదం అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని పేర్కొంది.


రాజ్యాంగ సవరణ బిల్లులు వీగిపోతే : రాజ్యాంగ సవరణ బిల్లులు ఏవైనా 2/3వ వంతు మెజార్టీతో ఆమోదం పొందాలి. ఈ బిల్లులు లోక్‌సభలో వీగిపోతే ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. కానీ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో సాధారణ మెజార్టీ కూడా సాధించడంలో విఫలమైతే ప్రభుత్వం తప్పనిసరిగా రాజీనామా చేయాలి.


రచయిత: బంగారు సత్యనారాయణ 

Posted Date : 02-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజకీయ పార్టీలు

ప్రజా ప్రయోజన సంరక్షణ సమూహాలు!


భారత ప్రజాస్వామ్య వ్యవస్థను తీర్చిదిద్దడంలో రాజకీయ పార్టీలదే కీలకపాత్ర. విభిన్న భావజాలాలు, ఆసక్తులు, ప్రాంతీయ ఆకాంక్షలకు అవి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఓటర్లను సమీకరించడం, విధానాలను రూపొందించడం, ప్రభుత్వాలను జవాబుదారీతనంతో పని చేసే విధంగా చూడటంలో ప్రధానంగా వ్యవహరిస్తాయి. భారత జాతీయ కాంగ్రెస్‌ చారిత్రక రాజకీయ వారసత్వం, భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక పటుత్వం, స్థానిక సమస్యల పరిష్కారంలో ప్రాంతీయ పార్టీల చొరవ శక్తిమంతమైన దేశ ప్రజాస్యామ్యంలోని వైవిధ్యాన్ని, బహుముఖత్వాన్ని చాటుతున్నాయి. ప్రజలను సంఘటిత పరిచి, ఎన్నికల ప్రక్రియను సులభతరం చేసే రాజకీయ పార్టీ అర్థం, రకాలు, లక్షణాలను, ప్రభావాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. జాతి ప్రయోజనాల సంరక్షణలో పార్టీల ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవాలి.


ప్రజాస్వామ్య ప్రక్రియలో రాజకీయ పార్టీలు అత్యంత కీలకమైనవి. ఇవి ప్రజలను ప్రజాస్వామ్యంలో భాగస్వాములను చేస్తాయి. రాజకీయ చైతన్యాన్ని కలిగించి ఎన్నికల ప్రక్రియను సులభతరం చేస్తాయి. ప్రజాస్వామ్యం విజయవంతం కావడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తాయి.


రాజకీయ పార్టీ - అర్థ వివరణ: జాతి ప్రయోజనాలను పెంపొందించే లక్ష్యంతో ఒకే రకమైన రాజకీయ దృక్పథాలను కలిగి ఉండి, రాజ్యాంగబద్ధంగా రాజకీయ అధికారాన్ని సాధించడానికి కృషిచేసే కొంతమంది వ్యక్తుల సముదాయాన్ని ‘రాజకీయ పార్టీ’గా పేర్కొనవచ్చు. ప్రపంచంలో 3 రకాల పార్టీ వ్యవస్థలు ఉన్నాయి.


ఏక పార్టీ వ్యవస్థ: ఒకే రాజకీయ పార్టీ అధికారాన్ని చేపట్టడానికి అవకాశం కల్పిస్తూ ఇతర రాజకీయ పార్టీలను నియంత్రించడమో లేదా పరిమితులు విధించడమో చేసే విధానాన్ని ఏకపార్టీ వ్యవస్థగా పేర్కొంటారు. ఈ విధానంలో ప్రతిపక్ష పార్టీలకు, ప్రత్యామ్నాయ పార్టీలకు అవకాశం ఉండదు. రాజకీయ స్వేచ్ఛ కొరవడుతుంది.

* ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైంది. ఇందులో ప్రత్యామ్నాయ ప్రభుత్వ విధానాలకు  అవకాశం ఉండదు.

* ప్రస్తుతం ఏక పార్టీ విధానాన్ని అనుసరిస్తున్న దేశాల్లో చైనా, క్యూబా, వియత్నాం, ఉత్తర కొరియా, ఎరిత్రియా, లావోస్‌ ఉన్నాయి.


ద్విపార్టీ వ్యవస్థ: ద్విపార్టీ వ్యవస్థలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పరిపాలన నిర్వహిస్తుంది. మిగిలిన రాజకీయ పార్టీ ప్రతిపక్షంగా వ్యవహరించి అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి సంబంధించిన విధానాలకు ప్రత్యామ్నాయాలను ప్రతిపాదిస్తూ ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది.

* ద్విపార్టీ వ్యవస్థలో ప్రభుత్వ విధానాలకు సుస్థిరత ఉంటుంది. ప్రజలకు కచ్చితమైన ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ వైఫల్యాలకు ఒక రాజకీయ పార్టీ బాధ్యత వహిస్తుంది.

* ద్విపార్టీ విధానం అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో అమలులో ఉంది.


బహుళ పార్టీ వ్యవస్థ: ప్రభుత్వాల ఏర్పాటు, పరిపాలనలో పోటీపడేందుకు రెండు కంటే ఎక్కువ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో తలపడే వ్యవస్థను బహుళపార్టీ వ్యవస్థగా పేర్కొంటారు. ఈ విధానంలో అనేక రాజకీయ పార్టీలు ఉంటాయి. విభిన్న సిద్ధాంతాలు, రాజకీయ దృక్కోణాలను కలిగి ఉంటాయి.

* ఇక్కడ ప్రత్యామ్నాయాల ఎంపికలో ప్రజలకు స్వేచ్ఛ ఉంటుంది. పరిపాలనలో నియంతృత్వానికి అవకాశం ఉండదు. భిన్నమైన ప్రజాభిప్రాయం వ్యక్తీకరణకు వీలు కలుగుతుంది.

* దేశంలోని అన్ని వర్గాలు, ప్రాంతాలవారికి రాజకీయ ప్రక్రియలో పాల్గొనే స్వేచ్ఛ ఉంటుంది.

* ఈ వ్యవస్థలో రాజకీయ పార్టీల్లో నిరంతర చీలికలు, కలయికలు; సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటు సర్వసాధారణం.

* ఈ విధానం భారత్, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాల్లో అమలులో ఉంది.


రాజకీయ పార్టీల లక్షణాలు: రాజకీయ పార్టీలు వివిధ అంశాలపై తమ విధానాలను స్పష్టంగా రూపొందించుకుంటాయి. విదేశాంగ, సంక్షేమ, ఆంతరంగిక, ఆర్థిక, పారిశ్రామిక తదితర విధానాలను ప్రతి రాజకీయ పార్టీ ప్రత్యేకంగా తమ ప్రాధాన్య క్రమంలో ప్రజలకు వివరిస్తాయి.

* ప్రభుత్వ పరిపాలనా విధానాలపై అవగాహన కల్పించేందుకు రాజకీయ పార్టీలు కృషిచేస్తాయి. అధికారంలో ఉన్న పార్టీ తమ పరిపాలనా విధానాల ఫలితంగా ప్రజలు ఎంత మేరకు లబ్ధిపొందారు, సంక్షేమ ఫథకాల అమలు వల్ల కలిగిన ప్రయోజనాలను వివరిస్తుంది. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ప్రభుత్వ విధానాల్లోని లోపాలను, తద్వారా సంభవించే అనర్థాలను వివరిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరుస్తాయి.

* జాతి ప్రయోజనాలను పరిరక్షించడం రాజకీయపార్టీల లక్ష్యంగా ఉంటుంది. వాటిని విస్మరించిన రాజకీయ పార్టీలను ప్రజలు తిరస్కరిస్తారు.

* రాజ్యాధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు కృషి చేస్తాయి. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ తమ అధికారాన్ని మరింత సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అధికారంలో లేని ప్రతిపక్ష పార్టీ అధికారాన్ని   చేపట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తుంది.


సాధారణ ఎన్నికలు - రాజకీయ పార్టీల ప్రభావం


స్వాతంత్య్రానంతరం లోక్‌సభకు తొలి సాధారణ ఎన్నికలు 1951-52లో జరిగాయి. ఈ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) ఘన విజయం సాధించి కేంద్రంలో తిరుగులేని శక్తిగా అవతరించడంతో పాటు, అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూడా ఏర్పాటు చేసింది. జవహర్‌లాల్‌ నెహ్రూ లోక్‌సభ పక్ష నాయకుడిగా, ప్రధాన మంత్రిగా దేశ రాజకీయాలను శాసించారు. బలమైన ప్రతిపక్ష పార్టీలు లేకపోవడంతో 1957లో జరిగిన రెండో సాధారణ ఎన్నికలు, 1962లో జరిగిన మూడో సాధారణ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ హవా కొనసాగింది. 1967లో జరిగిన నాలుగో సాధారణ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ పార్టీ ఆధిపత్యానికి గండిపడింది. కాంగ్రెస్‌ పార్టీ స్వల్ప మెజారిటీతో కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకున్నప్పటికీ 8 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు/ కాంగ్రెసేతర పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి.

*  1971లో ‘గరీబీ హఠావో నినాదం’తో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభకు జరిగిన తొలి మధ్యంతర ఎన్నికల బరిలో నిలిచింది. 351 స్థానాలు గెలుపొంది కేంద్రంలో తిరుగులేని శక్తిగా అవతరించింది. 1971 నుంచి 1977 వరకు ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ కొనసాగింది.

* 1977లో లోక్‌సభకు జరిగిన ఆరో సాధారణ ఎన్నికల అనంతరం దేశ రాజకీయల్లో గణనీయమైన మార్పులు సంభవించాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తొలిసారిగా కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. జనతాపార్టీ 298 స్థానాలను గెలుపొంది మొరార్జీ దేశాయ్‌ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

* 1979లో జనతాపార్టీలో సంభవించిన అంతర్గత విభేదాల కారణంగా మొరార్జీ దేశాయ్‌ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం చరణ్‌ సింగ్‌ ప్రధానమంత్రి పదివిని చేపట్టి లోక్‌సభలో మెజార్టీ నిరూపించుకోవడంలో విఫలమై 23 రోజులకే పదవిని కోల్పోయారు.

* 1980లో లోక్‌సభకు జరిగిన ఏడో సాధారణ ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ 352 స్థానాలను గెలుపొంది కేంద్రంలో తిరుగులేని శక్తిగా నిలిచింది. 1984, అక్టోబరు 31న ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు.

ఇందిరాగాంధీ హత్యానంతరం లోక్‌సభకు జరిగిన ఎనిమిదో సాధారణ ఎన్నికల్లో రాజీవ్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ 414 స్థానాలు గెలుపొంది దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. బీజేపీ 2 స్థానాలను గెలుపొందింది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రాంతీయ పార్టీ ‘తెలుగుదేశం’ లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆవతరించింది.

*  1989లో లోక్‌సభకు జరిగిన తొమ్మిదో సాధారణ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంపూర్ణ మెజారిటీ పొందలేకపోయింది. దీంతో ‘హంగ్‌ పార్లమెంటు’ ఏర్పడింది. జనతాదళ్‌ పార్టీ నేషనల్‌ ఫ్రంట్‌ కూటమి ద్వారా వి.పి.సింగ్‌ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయోధ్య వివాదం వ్యవహారంలో వి.పి.సింగ్‌ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును బీజేపీ ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం పతనమైంది. 1989 నుంచి దేశంలో సంకీర్ణ శకాల యుగం ప్రారంభమైంది.

*  1991లో లోక్‌సభకు జరిగిన పదో సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించనప్పటికీ పి.వి.నరసింహారావు నేతృత్వంలో కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ మైనారిటీ ప్రభుత్వాన్ని పీవీ తన రాజకీయ చాతుర్యంతో అయిదేళ్లు పూర్తిగా నిర్వహించారు.

* 1996లో లోక్‌సభకు జరిగిన పదకొండో సాధారణ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంపూర్ణ మెజార్టీ రాలేదు. ఈ సభా కాలంలో బీజేపీ తొలిసారిగా అటల్‌ బిహారీ వాజ్‌పేయీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ 13 రోజులకే ప్రభుత్వం పతనమైంది. తర్వాత హెచ్‌.డి. దేవెగౌడ, ఐ.కె. గుజ్రాల్‌ ప్రధాని పదవులు చేపట్టినప్పటికీ పూర్తికాలం కొనసాగలేకపోయారు.

* 1998లో బీజేపీకి చెందిన అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పన్నెండో లోక్‌సభ ఎన్నికల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఏఐఏడీఎంకే తన మద్దతును ఉపసంహరించడంతో ప్రభుత్వం పతనమైంది.

*  1999లో పదమూడో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ‘నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయెన్స్‌’ (ఎన్డీయే) పేరుతో కూటమిని ఏర్పాటు చేసి అటల్‌ బిహారీ వాజ్‌పేయీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

* 2004లో జరిగిన పద్నాలుగో సాధారణ ఎన్నికలు, 2009లో జరిగిన పదిహేనో సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయెన్స్‌ (యూపీఏ)గా ఏర్పడి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలో ప్రభుత్వాన్ని నడిపింది.

*  2014లో లోక్‌సభకు జరిగిన పదహారో సాధారణ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 282 స్థానాలు గెలుపొందింది. అయినప్పటికీ ఎన్డీయే కూటమిగా ఏర్పడి నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

*  2019లో లోక్‌సభకు జరిగిన పదిహేడో సాధారణ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 స్థానాలు గెలుపొందినప్పటికీ ఎన్డీయే కూటమిని ఏర్పాటుచేసి నరేంద్రమోదీ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కేవలం 52 స్థానాలు మాత్రమే సాధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాను కూడా పొందలేకపోయింది. 


రచయిత: బంగారు సత్యనారాయణ 

Posted Date : 19-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశంలో రాజకీయ పార్టీలు  

ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభాలు!

దేశ పౌరుల ఆకాంక్షలకు, ఆశయాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రభుత్వాలను బాధ్యతాయుతంగా సాగనిచ్చే ప్రజాస్వామ్య సాధనాలు రాజకీయ పార్టీలు. అవి భిన్న   సిద్ధాంతాలను, ఆసక్తులను ప్రతిబింబిస్తాయి. వివిధ సామాజిక సమూహాలను రాజకీయ ప్రక్రియలో భాగస్వాములను చేస్తాయి. విధానాలను రూపొందించి, ఎన్నికల్లో పోటీ చేసి పాలనను ప్రభావితం చేస్తాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో మూలస్తంభాలుగా వ్యవహరించే ఆ  పార్టీల గుర్తింపు, వర్గీకరణ, జాతీయహోదా తదితర అంశాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. దాంతోపాటు దేశంలోని జాతీయ పార్టీలు, వాటి విభాగాలు  మొదలైన వివరాలపైనా అవగాహన పెంచుకోవాలి. 


అలలు లేని సముద్రాన్ని, రాజకీయ పార్టీలు లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించడం కష్టం.. ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయడంలో అవి కీలకంగా వ్యవహరిస్తాయి. 


రాజకీయ పార్టీలకు గుర్తింపు: భారత ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్‌ 29(1) ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు గుర్తింపునిస్తుంది. ఎన్నికల గుర్తులను కేటాయిస్తుంది. రాజకీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం 100 మంది ఓటర్ల సంతకాల మద్దతు ఉండాలి. దాంతో పాటు రూ.10,000 డిపాజిట్‌గా చెల్లించి కేంద్ర  ఎన్నికల సంఘం వద్ద ‘రాజకీయ పార్టీ’గా నమోదు చేసుకోవాలి.

* మనదేశంలో రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధమైనవి కావు. రాజ్యాంగంలోని 3వ భాగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్‌ 19(1)(C) ప్రకారం ‘సంఘాలు లేదా అసోసియేషన్లు’ అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని పౌరులు ‘రాజకీయ పార్టీలను’ స్థాపించుకోవచ్చు.

* రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో 52వ రాజ్యాంగ సవరణ చట్టం, 1985 ద్వారా రాజ్యాంగానికి 10వ షెడ్యూల్‌ను చేర్చి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రూపొందించారు. ఆ చట్టంలో ‘రాజకీయ పార్టీలు’ అనే అంశాన్ని పేర్కొన్నారు.

వర్గీకరణ:  భారతదేశంలో రాజకీయ పార్టీలను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి:    

1) జాతీయ పార్టీ

2) రాష్ట్ర-ప్రాంతీయ పార్టీ


జాతీయ పార్టీ - గుర్తింపునకు షరతులు:  ఒక రాజకీయ పార్టీని జాతీయ పార్టీగా గుర్తించాలంటే కింద పేర్కొన్న షరతుల్లో ఏదైనా ఒకదాన్ని నెరవేర్చాలి.

ఎ) గత సాధారణ ఎన్నికల్లో లోక్‌సభ స్థానాలకుగాని, రాష్ట్ర శాసనసభ  స్థానాలకుగాని 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో  జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులు పోటీ చేసి ఉండాలి. పోలై చెల్లుబాటు అయిన ఓట్లలో 6% కంటే తక్కువ కాకుండా ఓట్లను సాధించాలి. దీంతోపాటు ఏ రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి అయినా కనీసం నలుగురు అభ్యర్థులు లోక్‌సభకు ఎన్నిక కావాలి. లేదా

బి) గత సాధారణ ఎన్నికల్లో  లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం (11) సీట్లు గెలుచుకోవాలి. ఈ అభ్యర్థులు కనీసం 3 వేర్వేరు రాష్ట్రాల నుంచి ఎన్నిక కావాలి. లేదా

సి) కనీసం 4 రాష్ట్రాల్లో రాష్ట్రపార్టీగా గుర్తింపు పొందాలి.


జాతీయ పార్టీ హోదా - కొత్త నియమాలు: 2014లో జరిగిన 16వ లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (సీపీఐ), బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ)ల జాతీయ పార్టీ హోదా ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త నియమాలను రూపొందించింది. దీని ప్రకారం వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో నిర్దేశించిన ఓట్లు, సీట్లు సాధించకపోతే ‘జాతీయ పార్టీ హోదా’ రద్దవుతుంది.


జాతీయ రాజకీయ పార్టీ హోదా వల్ల కలిగే ప్రయోజనాలు:

* నామినేషన్ల సమయంలో అభ్యర్థికి ప్రతిపాదకులు ఒక్కరు ఉంటే సరిపోతుంది.

* జాతీయ పార్టీ ఎన్నికల గుర్తును ఇతర పార్టీలకు కేటాయించరు.

* దూరదర్శన్, ఆలిండియా రేడియోలో ఉచితంగా ప్రసార సమయం కేటాయిస్తారు. 

* రెండుసెట్ల ఓటర్ల జాబితా కాపీలను అభ్యర్థులకు ఉచితంగా అందిస్తారు.

* 40 మంది ప్రధాన ప్రచారకర్తల ప్రచార ఖర్చును అభ్యర్థి ప్రచార ఖర్చులో కలపరు.

* అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కొత్తగా జాతీయ పార్టీ హోదాను పొందింది.


జాతీయ పార్టీ హోదా పొందిన రాజకీయ పార్టీలు: ప్రస్తుతం జాతీయ పార్టీ హోదా పొందిన పార్టీలు ఆరు. అవి

1) భారత జాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ)  

2) భారతీయ జనతా పార్టీ (బీజేపీ)

3) బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)

4) నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీసీ)  

5) కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్ట్‌) (సీపీఐ-ఎం)

6) ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)


ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ): ఐఎన్‌సీని 1885, డిసెంబరు 28న ఎ.ఒ.హ్యూమ్‌ స్థాపించారు. ఆంగ్లేయుల పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేశారు. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం దేశంలో సామాజిక, ఆర్థిక లక్ష్యాలను సాధించే ఉద్దేశంతో రాజకీయ సంస్థగా ‘భారత జాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ)’ అవతరించింది. 1955లో మద్రాస్‌ సమీపంలోని ఆవడి వద్ద జరిగిన ఐఎన్‌సీ  సమావేశంలో సామ్యవాద తరహా ప్రజాస్వామ్యమే తమ ప్రభుత్వ లక్ష్యమని జవహర్‌లాల్‌ నెహ్రూ పేర్కొన్నారు.

* అధికార పత్రిక - కాంగ్రెస్‌ అన్వేష్‌

* శ్రామిక విభాగం - ఆలిండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ 

* యూత్‌ విభాగం - ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ 

* ఎన్నికల గుర్తు - హస్తం (మువ్వన్నెల జెండా మధ్యలో హస్తం)

* కూటమి - యూపీఏ


భారతీయ జనతా పార్టీ (బీజేపీ):  1980, ఏప్రిల్‌ 6న అటల్‌ బిహారీ వాజ్‌పేయీ, ఎల్‌కే అడ్వాణీ స్థాపించారు. సామాజిక సంప్రదాయవాదం, హిందూత్వం, జాతీయవాదం, గాంధేయవాద సామ్యవాదం మొదలైనవి ఈ పార్టీ సిద్ధాంతాలు.

* అధికార పత్రిక - కమల్‌ సందేశ్‌

* యూత్‌ విభాగం - భారతీయ జనతా యువ మోర్చా

* రైతు విభాగం - బీజేపీ కిసాన్‌ మోర్చా

* మహిళా విభాగం - బీజేపీ మహిళా మోర్చా

* ఎన్నికల గుర్తు - కమలం (ఆకుపచ్చ, కాషాయ రంగులతో కూడిన జెండా మధ్యలో కమలం పువ్వు) 

* కూటమి - ఎన్‌డీఏ. 


బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ):  1984, ఏప్రిల్‌ 14న కాన్షీరాం స్థాపించారు. సామాజిక న్యాయం, స్వగౌరవం, సామ్యవాద సమానత్వం, లౌకికవాదం, మానవ హక్కులు మొదలైనవి ఈ పార్టీ సిద్ధాంతాలు. బహుజనులు అంటే అధిక సంఖ్యాకులు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ) అని అర్థం. వీరు దేశంలోని మొత్తం జనాభాలో 85% ఉన్నారు.

* ఎన్నికల గుర్తు - ఏనుగు

* ప్రస్తుతం ఈ పార్టీ మాయావతి ఆధ్వర్యంలో నడుస్తోంది.


నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ):  2012, జులైలో పి.ఎ.సంగ్మా స్థాపించారు. 2019, జూన్‌ 7న జాతీయ పార్టీ హోదా పొందింది. ఈశాన్య భారతదేశం నుంచి జాతీయ పార్టీ హోదాను పొందిన తొలి రాజకీయ పార్టీ.  

* ఎన్నికల గుర్తు - పుస్తకం. 

కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్ట్‌) (సీపీఐ-ఎం):  1964, నవంబరు 7న జ్యోతిబసు, ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌ స్థాపించారు. కమ్యూనిజం, మార్క్సిజం, లెనినిజం మొదలైన సిద్ధాంతాల ఆధారంగా ఈ పార్టీ ఏర్పడింది.

* అధికార పత్రిక - పీపుల్స్‌ డెమొక్రసీ

* యూత్‌ విభాగం - డెమొక్రటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా

* శ్రామిక విభాగం - సెంటర్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్‌ 

* విద్యార్థి విభాగం - స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా

* రైతు విభాగం - ఆలిండియా కిసాన్‌ సభ 

* మహిళా విభాగం - ఆలిండియా డెమొక్రటిక్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌ నీ ఎన్నికల గుర్తు - సుత్తి, కొడవలి, నక్షత్రం.


ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌):  2012, నవంబరు 26న అరవింద్‌ కేజ్రీవాల్‌ స్థాపించారు. ఈ పార్టీ ఎన్నికల గుర్తు చీపురు. 2023, ఏప్రిల్‌ 10న కేంద్ర ఎన్నికల సంఘం ఈ పార్టీకి జాతీయ పార్టీ హోదా కల్పించింది. ప్రస్తుతం ఈ పార్టీ దిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో కొనసాగుతోంది. గోవా, గుజరాత్‌ రాష్ట్రాల శాసనసభల్లోనూ ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది.


జాతీయ పార్టీ హోదా రద్దు అయిన పార్టీలు:  2023, ఏప్రిల్‌ 10న కేంద్ర ఎన్నికల సంఘం మూడు రాజకీయ పార్టీల జాతీయ పార్టీ హోదా రద్దు చేసింది. అవి 

1)  ఏఐటీసీ

2) ఎన్‌సీపీ

3) సీపీఐ


ఆలిండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ (ఏఐటీసీ): 1998, జనవరి 1న మమతా బెనర్జీ స్థాపించారు. ఈమె ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌కు ముఖ్యమంత్రి. 

* రాజకీయ నినాదం - మా, మాటి, మనుష్‌ (Mother, Land, People)

* పత్రిక - జాగోబంగ్లా

* విద్యార్థి విభాగం - తృణమూల్‌ ఛాత్ర పరిషత్‌

* రైతు విభాగం - ఆలిండియా తృణమూల్‌ కిసాన్‌ కాంగ్రెస్‌ 

* శ్రామిక విభాగం - ఇండియన్‌ నేషనల్‌ తృణమూల్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ 

* ఈ పార్టీ 2016, సెప్టెంబరు 2న జాతీయ పార్టీ హోదా పొందింది. 2023లో కోల్పోయింది.

* ఎన్నికల గుర్తు - గడ్డిపూలు


నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ): 1999, మే 25న శరద్‌ పవార్‌ ఈ పార్టీని స్థాపించారు.

* విద్యార్థి విభాగం - నేషనలిస్ట్‌ స్టూడెంట్‌ కాంగ్రెస్‌

* యూత్‌ విభాగం - నేషనలిస్ట్‌ యూత్‌ కాంగ్రెస్‌

* మహిళా విభాగం  - నేషనలిస్ట్‌ మహిళా కాంగ్రెస్‌

* ఎన్నికల గుర్తు - గోడ గడియారం


కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (సీపీఐ):  1925, డిసెంబరు 25న ఎస్‌.ఎ.డాంగే, ఎం.ఎన్‌. రాయ్‌ కమ్యూనిజం, మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతాల ఆధారంగా పార్టీని స్థాపించారు.

* అధికార పత్రికలు - న్యూ ఏజ్‌ (ఆంగ్లం), ముల్కీ సంఘర్ష్‌ (హిందీ)

* విద్యార్థి విభాగం - ఆలిండియా స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఎస్‌ఎఫ్‌) 

* శ్రామిక విభాగం - ఆలిండియా ట్రేడ్‌ యూనియన్‌ కాన్ఫరెన్స్‌ (ఏఐటీయూసీ)

* మహిళా విభాగం - నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఉమెన్‌

* యూత్‌ విభాగం - ఆలిండియా యూత్‌ ఫెడరేషన్‌

* ఎన్నికల గుర్తు - వరి కంకి, కొడవలి.


రచయిత: బంగారు సత్యనారాయణ 

Posted Date : 26-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌