• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణం - ప్రాథమిక భావనలు  

1. పర్యావరణం (Environment) అనే పదానికి కింది ఏ భాషా పదం ఆధారం?
జ: ఫ్రెంచ్


2. 'జీవావరణం' కింది ఏ ఆవరణల్లో విస్తరించి ఉంటుంది?
   1) శిలావరణం, జలావరణం                          2) జలావరణం, వాతావరణం 
   3) వాతావరణం, శిలావరణం, జలావరణం      4) వాతావరణం, శిలావరణం
జ: 3(వాతావరణం, శిలావరణం, జలావరణం)


3. పర్యావరణం లక్షణం కానిది?
జ: పర్యావరణం మార్పులకు లోనుకాని వ్యవస్థ.
4. నిర్జీవ లేదా భౌతిక పర్యావరణానికి సంబంధించని ఆవరణం ఏది?
జ: జీవావరణం


5. ఏ ఆవరణాన్ని 'కార్బన్ సింక్‌'గా వ్యవహరిస్తారు?
జ: జలావరణం

6. ఒక రైతు పొలంలో 'నైట్రేట్స్' పుష్కలంగా ఉన్నాయి. అంటే అతడు తన పొలంలో ఏ పంటను పండించి ఉండొచ్చు?
    1) లెగ్యూమినేసి పంటలు    2) చిక్కుడు జాతి పంటలు 
    3) ఫాబేసి జాతి పంటలు     4) పైవన్నీ సరైనవి
జ: 4(పైవన్నీ సరైనవి)


7. వాతావరణంలో అధిక మొత్తంలో ఉన్న జడవాయువు ఏది?
జ: ఆర్గాన్


8. వాతావరణంలో ఉష్ణోగ్రతల స్థిరీకరణకు, మొక్కల ఆహారోత్పాదనకు, భూతాపానికి కారణమవుతున్న ప్రధాన వాయువు ఏది?
జ: కార్బన్ డై ఆక్సైడ్


9. కిందివాటిలో సరిగ్గా జతపరిచిన అంశం ఏది?
    1) ప్రపంచ జల దినోత్సవం - మార్చి 22      2) లిమ్నాలాజి - మంచినీటి అధ్యయన శాస్త్రం
   3) భూమిపై ఉన్న మంచినీరు 1% (మానవ అవసరాలకు ఉపయోగపడేది)    4) పైవన్నీ సరైనవి
జ: 4(పైవన్నీ సరైనవి)


10. భూ వాతావరణంలో లభించని వాయువు ఏది?
జ: క్లోరిన్
 

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌