• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణ రసాయనశాస్త్రం

1. కిందివాటిలో పరిసరాల్లో ఉండేది ఏది?
     1) వాతావరణం  2) జీవావరణం   3) జలావరణం  4) అన్నీ
జవాబు: అన్నీ

 

2. భూమి చుట్టూ ఉండే ఏ వాయు సముదాయ పొర భూమికి రక్షణ కవచంలా పనిచేస్తుంది?
జవాబు: వాతావరణం

 

3. వాతావరణంలో సుమారుగా 15 కి.మీ. దూరంలో ఆవరించి ఉన్న విభాగం?
జవాబు: ట్రోపోస్ఫియర్

 

4. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు భూమిపై పడకుండా ఒక రక్షణ కవచంలా కాపాడే ఓజోన్ వాయువు ఏ విభాగంలో ఉంటుంది?
జవాబు: స్ట్రాటోస్ఫియర్ 

 

5. కిందివాటిలో కాలుష్యకారిణి కానిది ఏది?
1) DDT 2) కార్బన్ మోనాక్సైడ్ 3) Hg 4) N2
జవాబు: N2

 

6. నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ను 'DO' విలువ అంటారు. నీటిలోని మొక్కలు, జలచరాలు ఆరోగ్యంగా ఉండాలంటే DO విలువ సుమారుగా ఎంత ఉండాలి?
జవాబు: 4 - 6 మి.గ్రా./లీ.

 

7. కింది ఏ రసాయన పదార్థాన్ని ఉపయోగించి నీటి రసాయన ఆక్సిజన్ (COD) అవసరాన్ని లెక్కిస్తారు?
1) పొటాషియం నైట్రేట్ 2) ఆక్సాలిక్ ఆమ్లం
3) పొటాషియం పర్మాంగనేట్ 4) పొటాషియం డైక్రోమేట్ + H2SO4
జవాబు: పొటాషియం డైక్రోమేట్ + H2SO4

 

8. BOD అంటే....
జవాబు: బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్

 

9. పెట్రోల్, డీజిల్, కిరోసిన్ లాంటి ఇంధనాలు అసంపూర్ణ దహనచర్యకు లోనైనప్పుడు వెలువడే వ్యర్థ వాయువుల్లో ప్రధానమైంది ఏది?
జవాబు: కార్బన్ మోనాక్సైడ్

 

10. కిందివాటిలో కార్బన్ మోనాక్సైడ్ హిమోగ్లోబిన్‌తో చర్య జరపడం వల్ల ఏర్పడే కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఫార్ములా ఏది?
1) HbO 2) HbO2 3) HbCO 4) HbCO2
జవాబు: HbCO

 

11. భూమిపై ఎంత శాతం నీరు మంచు రూపంలో ఉంటుంది?
జవాబు: 2%

 

12. ఏసీల్లో ఫోమింగ్ ఏజెంట్‌గా ఏ వాయువును ఉపయోగిస్తారు?
జవాబు: ఫ్రియాన్

 

13. కిందివాటిలో వాతావరణంలో అత్యధికంగా లభించే హైడ్రోకార్బన్ ఏది?
1) మీథేన్ 2) ఈథేన్ 3) ఇథిలీన్ 4) ఎసిటలీన్
జవాబు: మీథేన్

 

14. కిందివాటిలో ఓజోన్ పొర మందం తగ్గించని వాయువు ఏది?
1) CFC 2) NO 3) Cl2 4) CO2
జవాబు: CO2

 

15. కిందివాటిలో ఆమ్లవర్షాలు కురవడానికి కారణంకాని ఆక్సైడ్ ఏది?
1) NO2 2) SO2 3) SO3 4) CO2
జవాబు: CO2

 

16. కిందివాటిలో హరితగృహ వాయువు (GHG) కానిది ఏది?
1) CO2 2) CH4 3) CFC 4) SO2
జవాబు: SO2

 

17. ఫ్రియాన్ రసాయన ఫార్ములా ఏంటి?
జవాబు: CCl2F2

 

18. 'లండన్ ఫాగ్' ఏర్పడటానికి కారణం ఏది?
జవాబు: పరిశ్రమల్లో బొగ్గును మండించడం

 

19. ఊపిరితిత్తులు, శ్వాసకోశాన్ని ఎక్కువగా ప్రభావితం చేసే కాలుష్య కారకం ఏది?
జవాబు: SO2

 

20. అకాల వర్షాలు, తుపానులు దేని ఫలితంగా సంభవిస్తాయి?
జవాబు: గ్లోబల్ వార్మింగ్ 

 

21. హిమశిఖరాలు ఎప్పుడు కరుగుతాయి?
జవాబు: గ్లోబల్‌వార్మింగ్ ఏర్పడినప్పుడు

 

22. కిందివాటిని జతపరచండి.
1) గ్రీన్‌హౌజ్ వాయువులు           A) అధిక పోషకాలు
2) HNO3 + H2SO4               B) నీటి కాలుష్యం
3) ఫ్లోరోసిస్                       C) ఆమ్లవర్షాలు
4) యూట్రిఫికేషన్                  D) గాలి కాలుష్యం
                                  E) శబ్ద కాలుష్యం
జవాబు: 1-D, 2-C, 3-B, 4-A

 

23. గ్రీన్‌హౌజ్ ఫలితం తగ్గించడానికి ఏం చేయాలి?
జవాబు: చెట్లు, అడవులు పెంచాలి

 

24. కిందివాటిలో దేన్ని 'పరిశ్రమలకు వరం కానీ పర్యావరణానికి శాపం' అని పిలుస్తారు?
      1) ఓజోన్      2) కార్బన్ డై ఆక్సైడ్     3) క్లోరోఫ్లోరో కార్బన్స్      4) క్లోరోఫాం
జవాబు: క్లోరోఫ్లోరో కార్బన్స్

 

25. జలకాలుష్యానికి ప్రధాన కారణమేంటి?
1) జనాభా పెరుగుదల 2) వ్యవసాయ రంగంలో హరిత విప్లవం 3) పారిశ్రామికీకరణ 4) అన్నీ
జవాబు: అన్నీ

 

26. విషపూరిత లోహాల వల్ల నీరు కలుషితం అయితే కలిగే దుష్ప్రభావం ఏమిటి?
1) నరాల బలహీనత    2) డయేరియా      3) క్యాన్సర్     4) అన్నీ
జవాబు: అన్నీ

 

27. మినిమాటా వ్యాధిని కలిగించే కాలుష్య కారకమేది?
జవాబు: Hg

 

28. కిందివాటిలో ఏది కాలుష్యానికి కారణం కాదు?
1) పెస్టిసైడ్స్     2) సౌరశక్తి     3) పెట్రోలియం     4) బొగ్గు
జవాబు: సౌరశక్తి

 

29. భోపాల్ దుర్ఘటన ఏ సంవత్సరంలో జరిగింది? (ఈ ప్రమాదంలో MIC వాయువు వెలువడింది)
జవాబు: 1984

 

30. క్యోటో ప్రొటోకాల్ కిందివాటిలో దేనికి సంబంధించింది?
1) వాతావరణ మార్పు    2) నదుల అనుసంధానం    
3) మాదకద్రవ్యాల దుర్వినియోగం   4) అణు ఒప్పందం
జవాబు: వాతావరణ మార్పు

 

31. కిందివాటిని జతపరచండి.
1) గాలిలో ఎక్కువగా ఉండే అణుఘటకాలు       A) N2, O2
2) గాలిలో తక్కువగా ఉండే అణుఘటకాలు      B) CO2, CH4, NO
3) విషలోహాలు                              C) Zn, Al, Fe
4) హరితగృహ వాయువులు                   D) Ne, Ar, Kr
                                           E) Hg, Pb, As
జవాబు: 1-A, 2-D, 3-E, 4-B

 

32. కిందివాటిలో శబ్దస్థాయి ఎన్ని డెసిబుల్స్ (dB) దాటితే అది శబ్దకాలుష్యానికి దారితీస్తుంది?
1) 15 dB     2) 65 dB    3) 100 dB    4) 120 dB
జవాబు: 65 dB

 

33. భౌమ్య కాలుష్యానికి కారణం ఏంటి?
1) పెస్టిసైడ్‌లు    2) పారిశ్రామిక వ్యర్థాలు    3) రసాయన ఎరువులు    4) అన్నీ
జవాబు: అన్నీ

 

34. కింది వాటిలో ప్రాథమిక కాలుష్య కారకం ఏది?
ఎ) CO2      బి) SO2     సి) NO   డి) అన్నీ
జవాబు: అన్నీ

 

35. భారత ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది?
జవాబు: 1986

 

36. పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి ప్రాథమిక విధి - అని భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటోంది?
జవాబు: 51

 

37. మొదటిసారిగా 1972 లో UNO ఆధ్వర్యంలో పర్యావరణ సదస్సు ఎక్కడ జరిగింది?
జవాబు: స్టాక్‌హోం

 

38. అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు?
జవాబు: సెప్టెంబరు 16

 

39. మాంట్రియల్ ప్రొటోకాల్ కిందివాటిలో దేనికి సంబంధించింది?
ఎ) వాతావరణ మార్పులను పసిగట్టడం   బి) ఓజోన్ పొరను పరిరక్షించడం
సి) జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం        డి) ఏదీకాదు
జవాబు: ఓజోన్ పొరను పరిరక్షించడం

 

40. DDT అనేది ఒక...
జవాబు: కీటక నాశనకారి

 

41. వాతావరణంలో అత్యంత వేడిగా ఉండే భాగం ఏది?
జవాబు: థర్మోస్ఫియర్

 

42. కిందివాటిలో హెర్బిసైడ్ (Herbicide) ఏది?
1) సోడియం క్లోరైడ్ 2) సోడియం సల్ఫేట్ 3) సోడియం క్లోరేట్ 4) ఏదీకాదు
జవాబు: సోడియం క్లోరేట్

 

43. కిందివాటిలో ఏది విషపూరితం, కాలుష్యకారిణి?
1) కాడ్మియం 2) లెడ్ 3) మెర్క్యురీ 4) జింక్
జవాబు: 1, 2, 3

 

44. కిందివాటిని జతపరచండి.
1) హరితగృహ ప్రభావం           A) చర్మ క్యాన్సర్, కాటరాక్ట్
2) ఆమ్ల వర్షాలు                  B) మార్బుల్ కట్టడాలు దెబ్బతినడం  
3) ఓజోన్ పొర మందం తగ్గడం   C) ధృవ ప్రాంతాల్లో మంచు కరగడం
4) ఫొటో కెమికల్ స్మాగ్         D) తలనొప్పి, దృష్టి లోపం
                               E) కళ్లలో దురద
జవాబు: 1-C, 2-B, 3-A, 4-E

 

45. తెలంగాణా రాష్ట్రప్రభుత్వం 33% అడవుల విస్తీర్ణం పెంచడమే లక్ష్యంగా తలపెట్టిన 'హరితహారం' కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
జవాబు: 2015 జులై

 

పర్యావరణం - ముఖ్యాంశాలు
* పర్యావరణాన్ని వాతావరణం, జలావరణం, శిలావరణం, జీవావరణం అనే నాలుగు విభాగాలుగా వర్గీకరించారు.
* వాతావరణాన్ని తిరిగి నాలుగు భాగాలుగా విభజించవచ్చు.
1) ట్రోపోస్ఫియర్ 2) స్ట్రాటోస్ఫియర్ 3) మీసోస్ఫియర్ 4) అయనోస్ఫియర్
* పర్యావరణ కాలుష్యం ప్రధానంగా నాలుగు రకాలు
1) గాలి కాలుష్యం 2) జల కాలుష్యం 3) శబ్ద కాలుష్యం 4) భూమి కాలుష్యం
* గాలి/ వాతావరణ కాలుష్యం వల్ల కలిగే అనర్థాలు మూడు రకాలు.
1) ఆమ్లవర్షాలు 2) ఓజోన్ పొర మందం తగ్గడం 3) హరితగృహ ప్రభావం
* నైట్రోజన్, సల్ఫర్ ఆక్సైడ్‌లు నీటిఆవిరితో కలిసి ఆమ్లాలను ఏర్పరుస్తాయి. ఇవి నేలమీద వర్షం నీటితోపాటు కురుస్తాయి. కాబట్టి, వీటిని ఆమ్లవర్షాలు అంటారు.
* CFC, NO, Cl2 వాయువులు స్ట్రాటోస్ఫియర్‌లోని ఓజోన్‌తో చర్యనొంది దాని మందాన్ని తగ్గిస్తాయి.
* CH4, NO, CFC, O3, నీటిఆవిరి, CO2 లను గ్రీన్‌హౌజ్ వాయువులు (GHG) అంటారు. వీటివల్ల భూఉపరితలం వేడెక్కుతుంది. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.

 

రసాయన శాస్త్రం మౌలిక అంశాలు
1.
వెల్లుల్లి ఘాటైన వాసనకు కారణం ఏమిటి?
1) ఫాస్ఫరస్‌ సమ్మేళనాలు   
2) క్లోరిన్‌ సమ్మేళనాలు  
3) సల్ఫర్‌ సమ్మేళనాలు   
4) మెగ్నీషియం సమ్మేళనాలు


2. కింది దేనిలో విద్యుత్‌ వాహకత అధికంగా ఉంటుంది?
1) స్వేదన జలం    2) సముద్రపు నీరు 
3) ఇథైల్‌ ఆల్కహాల్‌  4) స్వచ్ఛమైన నీరు 


3. వేసవిలో మట్టికుండలోని నీరు చల్లగా ఉండటానికి కారణం ఏమిటి?

1) పీడనం      2) నీరు ఆవిరి కావడం   

3) కుండలోని మలినాలు  4) సాంద్రత


4. డెట్టాల్లోని క్రియాశీల పదార్థం ఏది?
1) నీరు     2) క్లోరోగ్జైలెనాల్‌   
3) ఫినాల్‌  3) మిథైల్‌ ఆల్కహాల్‌


5. కిందివాటిని జతపరచండి.
జీవాణువు                  లోహకేంద్రం

A) హిమోగ్లోబిన్‌        i) కోబాల్ట్‌

B) క్లోరోఫిల్‌              ii) ఇనుము

C) విటమిన్‌ B12      iii) మెగ్నీషియం
1) A - ii, B - iii, C - i     2) A - ii, B - i, C - iii
3) A - i, B - iii, C - ii     4) A - iii, B - ii, C - i


6. కిందివాటిలో తక్కువ వాతావరణ కాలుష్యాన్ని కలిగించే ఇంధనం ఏది?

1) పెట్రోల్‌          2) బొగ్గు  
3) డీజిల్‌          4) హైడ్రోజన్‌  


7. కిందివాటిలో అత్యంత సాంద్రత ఉన్న లోహం ఏది?
1) హైడ్రోజన్‌       2) సోడియం   

3) ఆస్మియం         4) పొటాషియం


8. కంటిచూపుపై ప్రభావం చూపే రసాయన పదార్థం ఏది?

1) మిథైల్‌ ఆల్కహాల్‌     2) ఇథైల్‌ ఆల్కహాల్‌ 

3) 1, 2             4) పైవేవీకావు


9. ఒక పరమాణువు ధనావేశ అయాన్‌గా మారినప్పుడు ఏం జరుగుతుంది?

1) పరమాణు వ్యాసార్ధం పెరుగుతుంది.
2) పరమాణు వ్యాసార్ధం తగ్గుతుంది. 
3) పరమాణు భారం తగ్గుతుంది.
4) పరమాణు భారం పెరుగుతుంది.


10. కిందివాటిలో లోహక్షయాన్ని అరికట్టే విధానాలు ఏవి?

1) మిశ్రమ లోహం చేయడం 
2) గాల్వనైజేషన్‌ 
3) ఎలక్ట్రోప్లేటింగ్‌        
4) పైవన్నీ


11. నీటిలోని బ్యాక్టీరియాను సంహరించేందుకు ఉపయోగించే వాయువు ఏది?

1) క్లోరిన్‌      2) ఫ్లోరిన్‌       3) నైట్రోజన్‌      4) ఆర్గాన్‌


12. ముడి చమురు నుంచి పెట్రోల్‌ను ఏ ప్రక్రియ ద్వారా వేరు చేస్తారు?

1) స్వేదనం      2) అంశిక స్వేదనం     3) భర్జనం       4) ప్రగలనం


13. కిందివాటిలో భిన్నమైంది ఏది?

1) బెంజీన్‌       2) ఇథైల్‌ ఆల్కహాల్‌    3) సాధారణ లవణం    4) గ్లూకోజ్‌


14. శీతాకాలంలో బంకమట్టి పెళ్లలుగా విరగడానికి కారణం ఏమిటి?

1) మట్టిలోని సిలికా ఆవిరి కావడం   

2) నీటి అధిక తలతన్యత   

3) మట్టిలోని నీరు ఆవిరి కావడం  

4) నీటి అసంగత వ్యాకోచం


15. డ్యుటీరియం కేంద్రకంలో ఉండే ప్రోటాన్, న్యూట్రాన్‌ల సంఖ్య వరుసగా?

1) 1, 2        2) 0, 2 

3) 1, 1        4) 2, 1


16. ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక లీటర్‌ ద్రావణంలో కరిగి ఉన్న ద్రావితం మోల్‌ల సంఖ్యను ఏమంటారు?

1) నార్మాలిటీ        2) మొలాలిటీ   

3) మోల్‌భాగం       4) మొలారిటీ


17. కింది అంశాలను జతపరచండి.

  విషయం               శాస్త్రవేత్త

A. విద్యుద్విశ్లేషణ    i) జి.ఎన్‌.లూయిస్‌

B. పరమాణు           ii) మైకేల్‌ ఫారడే

  కేంద్రక ఆవిష్కరణ

C. సమయోజనీయ బంధం iii) రూథర్‌ఫర్డ్‌

1) A - iii, B - ii, C - i     2) A - ii, B - i, C - iii

3) A - ii, B - iii, C - i     4) A - i, B - iii, C - ii


18. కిందివాటిని జతపరచండి.

హైడ్రోజన్‌ సమ్మేళనం       రసాయన ఫార్ములా

A. నీరు                             i) D2O  
B. భారజలం                    ii) H2O2
C. హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌     iii) H2O
1) A - iii, B - i, C - ii       2) A - iii, B - ii, C - i

3) A - ii, B - i, C - iii     4) A - i, B - iii, C - ii


19. కింది అంశాలను జతపరచండి.

pH విలువ     పదార్థ స్వభావం
A) 3                 i) క్షారం
B) 7                ii) ఆమ్లం
C) 11              iii) తటస్థం
1) A - iii, B - ii, C - i        2) A - ii, B - i, C - iii

3) A - i, B - iii, C - ii        4) A - ii, B - iii, C - i


20. పదార్థాలను గాలి సమక్షంలో మండించడాన్ని ఏమంటారు?

1) భర్జనం       2) క్షయకరణం      3) వల్కనీకరణం      4) ఎచ్చింగ్‌


21. స్వచ్ఛమైన సిలికాన్‌ను ఏమంటారు?

1) కార్బోరండం       2) క్వార్ట్జ్‌     3) పొడిమంచు       4) నైట్రోలిమ్‌


22. కిందివాటిని జతపరచండి.

ఆర్బిటాల్‌               ఆకృతి

A) s - ఆర్బిటాల్‌       i) క్లిష్టమైన ఆకృతి 

B) p - ఆర్బిటాల్‌      ii) డబుల్‌ డంబెల్‌ ఆకారం 

C) d- ఆర్బిటాల్‌       iii) గోళాకారం  

D) f - ఆర్బిటాల్‌       iv) డంబెల్‌ ఆకారం (ముద్గరాకారం)

1) A - iii, B - iv, C - i, D - ii 
2) A - ii, B - iv, C - i, D - iii
3) A - iii, B - iv, C - ii, D - i
4) A - iv, B - iii, C - ii, D - i


23. బాహ్య కర్పరం అసంపూర్తిగా ఎలక్ట్రాన్‌లతో నిండి ఉన్న మూలకాలను ఏమంటారు?
1) జడవాయువులు        2) ప్రాతినిధ్య మూలకాలు
3) పరివర్తన మూలకాలు    4) అంతర పరివర్తన మూలకాలు


24. సోడాలైమ్‌ ఏ రసాయనాల మిశ్రమం?

1)  సోడియం హైడ్రాక్సైడ్‌ + కాల్షియం హైడ్రాక్సైడ్‌    

2) సోడియం సల్ఫేట్‌ + కాల్షియం హైడ్రాక్సైడ్‌

3) సోడియం హైడ్రాక్సైడ్‌ + కాల్షియం సల్ఫేట్‌

4) సోడియం సల్ఫేట్‌ + కాల్షియం సల్ఫేట్‌


25. థెర్మిట్‌ మిశ్రమం అంటే ఏమిటి?

1) 1 : 3 నిష్పత్తిలో Al పొడి, Fe2CO3 ల మిశ్రమం
2) 1 : 3 నిష్పత్తిలో Al  పొడి, Al2O3 ల మిశ్రమం
3) 1 : 3 నిష్పత్తిలో Mg పొడి, Fe2Oల మిశ్రమం
4) 3 : 1 నిష్పత్తిలో  Al పొడి, CaO ల మిశ్రమం


26. కిందివాటిలో ఆమ్ల ఆక్సైడ్‌లు ఏవి?

i)  CO2    ii) CO     iii) SiO2    iv) MgO
1) i మాత్రమే         2) i, ii      3) i, iii         4) i, ii, iii 


27. కిందివాటిలో గ్రాఫైట్‌కు సంబంధించి సరికానిది ఏది?

1) గ్రాఫైట్‌ కార్బన్‌ రూపాంతరం 
2) గ్రాఫైట్‌ మంచి ఉష్ణ, విద్యుత్‌ వాహకం
3) గ్రాఫైట్‌ను పెన్సిళ్ల తయారీలో ఉపయోగిస్తారు
4) దీనిలో ప్రతి కార్బన్‌ పరమాణువు నాలుగు ఇతర కార్బన్‌ పరమాణువులతో బంధితమై ఉంటుంది.


28. మార్షల్‌ ఆమ్లం అని దేన్ని అంటారు?
1) పెరాక్సీమోనో సల్ఫ్యూరిక్‌ ఆమ్లం 
2) పెరాక్సీ డై సల్ఫ్యూరిక్‌ ఆమ్లం
3) సల్ఫ్యూరిక్‌ ఆమ్లం 
4) పైరో సల్ఫ్యూరిక్‌ ఆమ్లం 


29. ఆక్సిజన్‌ను కనుకున్న శాస్త్రవేత్త ఎవరు?

1)  సి.డబ్ల్యూ. షీలే  2) ఎ. లెవోయిజర్‌ 

3) ఆర్‌. బాయిల్‌      4) అవగాడ్రో

30. పదార్థాలు హైడ్రోజన్‌ను కోల్పోవడాన్ని లేదా ఆక్సిజన్‌ను పొందడాన్ని ఏమంటారు?

1) క్షయకరణం       2) జలవిశ్లేషణం 

3) తటస్థీకరణం       4) ఆక్సీకరణం


31. సల్ఫర్‌ ఒక .....అణువు.

1) ద్విపరమాణుక        2) త్రిపరమాణుక 

3) అష్టపరమాణుక      4) ఏకపరమాణుక


32. కిందివాటిలో సహజవాయువు రంగంలో సేవలందిస్తున్న సంస్థ ఏది?
1) ONGC        2) GAIL

3) 1, 2            4) NTPC


33. భారతదేశపు అతిపెద్ద పరిశోధన సంస్థ అయిన CSIR పూర్తి పేరు ఏమిటి?
1) కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌
2) సెంటర్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌
3) కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండియన్‌  రిసెర్చ్‌
4) కార్పొరేషన్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండియన్‌ రిసెర్చ్‌


34. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ ఎక్కడ ఉంది?
1) విశాఖపట్నం       2) హైదరాబాద్‌ 

3) ఫరీదాబాద్‌       4) బెంగళూరు


35. గోబర్‌గ్యాస్‌లో ఉన్న ప్రధాన వాయువు ఏది?
1) బ్యూటేన్‌       2) మీథేన్‌    3) ఎసిటిలీన్‌     4) కార్బన్‌ డైఆక్సైడ్‌


36. కిందివాటిలో వాయు కాలుష్యానికి కారణాలు ఏవి?
1) పరిశ్రమల నుంచి వెలువడే హానికరమైన వాయువులు
2) అడవుల నరికివేత
3) థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నుంచి వెలువడే హానికరమైన పదార్థాలు
4) పైవన్నీ


37. కిందివాటిలో గ్రీన్‌హౌస్‌ వాయువులు ఏవి?

1) మీథేన్‌      2) కార్బన్‌ డైఆక్సైడ్‌ 

3) నైట్రస్‌ ఆక్సైడ్‌     4) పైవన్నీ


38. యాంటీసెప్టిక్‌గా ఉపయోగపడే బోరిక్‌ ఆమ్లం రసాయన ఫార్ములా ఏమిటి?

1) H3BO3                    2) B2H6  
3) Na2B4O7.10H2O     4) B2O3


39. కిందివాటిలో ‘సూపర్‌ హాలోజన్‌’ అని దేన్ని అంటారు?
1) క్లోరిన్‌        2) బ్రోమిన్‌ 

3) ఫ్లోరిన్‌    4) సిలికాన్‌


40. ఎర్రనేలలు ఆ రంగులో ఉండేందుకు కారణం ఏమిటి?
1) వాటిలో ఉండే ఫెర్రిక్‌ ఆక్సైడ్‌ 

2) వాటిలో ఉండే నైట్రిక్‌ ఆక్సైడ్‌

3) వాటిలో ఉండే జింక్‌ ఆక్సైడ్‌

4) పైవన్నీ


41. పాదరసం (మెర్క్యురీ) మూలకం లాటిన్‌ పేరు ఏమిటి?
1) హైడ్రార్జిరమ్‌      2) ప్లంబం     3) ఆరమ్‌      4) కాలియం


42. ఆమ్లం +  క్షారం   ......+ ...... + ఉష్ణం

1) లవణం, నీరు       2) లవణం, ఆక్సిజన్‌ 

3) నైట్రోజన్, నీరు      4) కార్బన్‌ డైఆక్సైడ్, ఆక్సిజన్‌


43. కిందివాటిని జతపరచండి.

జాబితా - I                  జాబితా - II

A) ఆస్ప్రిన్‌               i) యాంటీబయాటిక్‌
B) అమాక్సిసిలిన్‌    ii) నార్కోటిక్‌
C) హెరాయిన్‌         iii) అనాల్జెసిక్‌
1) A - ii, B - i, C - iii    2) A - iii, B - ii, C - i
3) A - i, B - iii, C - ii    4) A - iii, B - i, C - ii


44. కిందివాటిలో అత్యధిక లోహ స్వభావం ఉన్న మూలకం ఏది?

1) ఫ్లోరిన్‌      2) క్లోరిన్‌       3) బ్రోమిన్‌     4) ఆక్సిజన్‌


45. మంచు కంటే తక్కువ ఉష్ణోగ్రతలను పొందేందుకు ఉపయోగపడేది?
1) పొడిమంచు   
2) మంచు + సాధారణ ఉప్పు 
3) ఆల్కహాల్‌     4) 1, 2


46. వంటగ్యాస్‌లో ఉండే బ్యూటేన్‌ వాయువు ఫార్ములా ఏమిటి?

1)  C2H6           2)  C3H8      3) C4H10       4) CH4


47. వెనిగర్‌ అంటే ఏమిటి?

1) సజల హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం

2) సజల ఆగ్జాలిక్‌ ఆమ్లం 

3) సజల సిట్రిక్‌ ఆమ్లం 

4) సజల ఎసిటిక్‌ ఆమ్లం 


48. ఎరువుల తయారీకి ముడిపదార్థం అయిన అమ్మోనియాను వేటి నుంచి తయారుచేస్తారు?

1) నైట్రోజన్‌ + ఆక్సిజన్‌   

2) నైట్రోజన్‌ + హైడ్రోజన్‌ 

3) నైట్రోజన్‌ + సోడియం 

4) నైట్రోజన్‌ + క్లోరిన్‌


సమాధానాలు: 1-;3 2-2; 3-2; 4-2; 5-1; 6-4; 7-3; 8-1; 9-2; 10-4; 11-1; 12-2; 13-3; 14-4; 15-3; 16-4; 17-3; 18-1; 19-4; 20-1; 21-2; 22-3; 23-2; 24-1; 25-1; 26-3; 27-4; 28-2; 29-1; 30-4; 31-3; 32-3; 33-1; 34-2; 35-2; 36-4; 37-4; 38-1; 39-3 ;40-1 41-1; 42-1; 43-4; 44-1; 45-4; 46-3; 47-4; 48-2.

Posted Date : 16-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌