• facebook
  • whatsapp
  • telegram

అటవీ సంపద

మాదిరి ప్రశ్నలు

 

1. 'ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా' ఎక్కడ ఉంది?
ఎ) కటక్ బి) డెహ్రాడూన్ సి) మహేంద్రగిరి డి) ఝార్ఖండ్
జ: డెహ్రాడూన్

 

2. ప్రపంచ అటవీ దినోత్సవం ఎప్పుడు?
ఎ) మార్చి 21 బి) ఏప్రిల్ 21 సి) మే 21 డి) జూన్ 21
జ: మార్చి 21

 

3. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు?
ఎ) జనవరి 2 బి) మే 22 సి) ఏప్రిల్ 22 డి) మే 21
జ: మే 22

 

4. తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం ఎంత శాతం?
ఎ) 25.46 బి) 26.70 సి) 35.40 డి) 33.00
జ: 25.46

 

5. తెలంగాణలో ఎక్కువ అడవులు ఏ రకానికి చెందినవి?
ఎ) చిట్టడవులు బి) ఆర్ద్ర ఆకురాల్చు
సి) అనార్ద్ర ఆకురాల్చు డి) ఏదీకాదు
జ: అనార్ద్ర ఆకురాల్చు

 

6. రాష్ట్రంలో రిజర్వ్ అడవులు ఎక్కువగా ఉన్న జిల్లా ఏది?
ఎ) వరంగల్ బి) ఖమ్మం సి) ఆదిలాబాద్ డి) నిజామాబాద్
జ: ఆదిలాబాద్

 

7. తెలంగాణలో వెదురు, బీడీ ఆకును ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా ఏది?
ఎ) ఖమ్మం బి) నిజామాబాద్ సి) కరీంనగర్ డి) హైదరాబాద్
జ: ఖమ్మం

 

8. తెలంగాణలో ఎన్ని పక్షి జాతులున్నాయి?
ఎ) 365 బి) 2939 సి) 103 డి) 21
జ: 365

 

9. తెలంగాణలో వన సంరక్షణ సమితులు ఎక్కువగా ఉన్న జిల్లా ఏది?
ఎ) రంగారెడ్డి (123) బి) ఆదిలాబాద్ (1124)
సి) మెదక్ (300) డి) ఏదీకాదు
జ: ఆదిలాబాద్ (1124)

 

10. తెలంగాణలో మొదటి అటవీ కళాశాలను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు?
ఎ) గజ్వేల్ బి) సిద్ధిపేట సి) సిరిసిల్ల డి) నకిరేకల్
జ: గజ్వేల్

 

11. అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం ఏ జిల్లాల్లో విస్తరించి ఉంది?
ఎ) నల్గొండ, ఆదిలాబాద్ బి) నల్గొండ, కరీంనగర్
సి) కరీంనగర్, మహబూబ్‌నగర్
డి) నల్గొండ, మహబూబ్‌నగర్
జ: నల్గొండ, మహబూబ్‌నగర్

 

12. కవ్వాల్ అభయారణ్యం ఎక్కడ ఉంది?
ఎ) ఆదిలాబాద్ బి) వరంగల్ సి) రంగారెడ్డి డి) మెదక్
జ: ఆదిలాబాద్

 

13. తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ ఎక్కడ ఉంది?
ఎ) దూలపల్లి (రంగారెడ్డి) బి) జగిత్యాల (కరీంనగర్)
సి) ములుగు (మెదక్) డి) ఏదీకాదు
జ: దూలపల్లి (రంగారెడ్డి)

 

14. 'సామాజిక అడవుల పెంపకం' కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
ఎ) 1971 బి) 1972 సి) 1976 డి) 1980
జ: 1976

 

15. జాతీయ అడవుల కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 1991 బి) 1999 సి) 1961 డి) 1992
జ: 1991

 

16. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని రక్షిత ప్రాంతాలు ఉన్నాయి?
ఎ) 10 బి) 11 సి) 12 డి) 15
జ: 12

Posted Date : 28-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌