ప్రాథమిక విధులు రాజ్యం, సమాజం, ఇతర వ్యక్తుల పట్ల వ్యక్తికి ఉండే బాధ్యతలను తెలియజేస్తాయి. రాజ్యాంగంలోని IV-A భాగంలో 51-A నిబంధనలో వీటిని చేర్చారు. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల ఆధారంగా 42 వ రాజ్యాంగ సవరణ చట్టం (1976) ద్వారా రాజ్యాంగంలో 10 ప్రాథమిక విధులను చేర్చారు. 86 వ రాజ్యాంగ సవరణ చట్టం, 2002 ద్వారా మరో ప్రాథమిక విధిని చేర్చడంతో, వీటి సంఖ్య 11 కు చేరింది. జస్టిస్ జె.ఎస్. వర్మ కమిటీ (1998) సిఫారసుల మేరకు 'జనవరి 3 ను ప్రాథమిక విధుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
* 51-(A) (a): రాజ్యాంగం పట్ల విధేయత కలిగి ఉండాలి. రాజ్యాంగ సంస్థలను, జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని గౌరవించాలి.
(b): స్వాతంత్య్రోద్యమాన్ని ఉత్తేజపరచిన ఉన్నత ఆదర్శాలను గౌరవించాలి, అనుసరించాలి.
(c): దేశ సార్వభౌమత్వాన్ని, సమైక్యత, సమగ్రతలను గౌరవించాలి, కాపాడాలి.
(d): దేశ రక్షణకు, జాతీయ సేవకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి.
(e): భారత ప్రజల మధ్య సోదరభావాన్ని, సామరస్యాన్ని పెంపొందించాలి. మతం, భాష, ప్రాంతీయ, వర్గ విభేదాలకు అతీతంగా ఉండాలి. మహిళల గౌరవానికి భంగం కలిగించే ఆచారాలను విడనాడాలి.
(f): మన వారసత్వ సమష్టి సంస్కృతి (భిన్నత్వంలో ఏకత్వం) గొప్పతనాన్ని గౌరవించాలి, కాపాడాలి.
(g): అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులను కాపాడాలి, ఇతర జీవుల పట్ల దయ ఉండాలి.
(h): శాస్త్రీయ, మానవతా దృక్పథం, పరిశీలనా దృక్పథం, సంస్కరణ దృక్పథల పట్ల సానుకూలతను పెంపొందించుకోవాలి.
(i): ప్రభుత్వ ఆస్తిని కాపాడాలి, హింసను విడనాడాలి.
(j): అన్ని రంగాలలో వ్యక్తిగత, సమష్టి కార్యకలాపాల ద్వారా దేశ ఔన్నత్యాన్ని పెంపొందించడానికి కృషి చేయాలి.
(k): 6 - 14 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల విద్యార్జనకు తగిన అవకాశాలను కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, సంరక్షకులకు ఉంటుంది.
* అయితే ప్రాథమిక విధులు న్యాయ అర్హమైనవి కావు. అందువల్ల వీటి అమలుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు చేయాల్సి ఉంటుంది.
* క్లుప్తంగా చెప్పాలంటే... ఆదేశ సూత్రాలు ప్రభుత్వాలకు నిర్దేశించిన బాధ్యతలు, ప్రాథమిక విధులు ప్రజలకు నిర్దేశించిన బాధ్యతలు.
ప్రాథమిక విధులు
Posted Date : 07-12-2020
జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్
- ప్రాథమిక హక్కులు - 1
- భారత రాజ్యాంగ రచన - స్వభావం
- భారత ప్రజా ప్రాతినిధ్య చట్టాలు
- మండల పరిషత్
- స్థానిక స్వపరిపాలన: వివిధ కమిటీలు - సిఫారసులు
- భారతదేశంలో - స్థానిక స్వపరిపాలన - అభివృద్ధి క్రమం
- హైకోర్టు
- విధాన పరిషత్తు
- రాష్ట్ర శాసనసభ
- ముఖ్యమంత్రి - రాష్ట్ర మంత్రిమండలి
- రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు
- ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ప్రభావం
- లా కమిషన్
- నియంత్రిత సంస్థలు
- అంతర్జాతీయ సంబంధాలు
- అంతర్జాతీయ కూటములు
- ప్రాంతీయ సంస్థలు
- అంతర్జాతీయ సంస్థలు
- ఐక్యరాజ్య సమితి
- ఆదేశిక సూత్రాలు
- ప్రాథమిక విధులు
- పౌరులు - పౌరసత్వం
- భారత రాజ్యాంగ పరిషత్ - రాజ్యాంగం
- భారత రాజ్యాంగం - విశిష్ట లక్షణాలు
- భారత రాజ్యాంగం - పరిణామ క్రమం
- భారత రాజ్యాంగం - స్వభావం
- భారత రాజ్యాంగ నిర్మాణం
- రాష్ట్ర గవర్నర్
- హైకోర్ట్ - రాష్ట్ర న్యాయ వ్యవస్థ
- లోక్సభ - రాజ్యసభ - సభాధ్యక్షులు
- రాజ్యాంగ సంస్థలు
- భారత ఆర్థిక సంఘం
- రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ
- భారతదేశం - సమాఖ్య, ఏకకేంద్ర వ్యవస్థల సమ్మేళనం
- రాజ్యాంగం - చారిత్రక పరిణామం
- ప్రాథమిక హక్కులు
పాత ప్రశ్నపత్రాలు
- టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ రిక్రూట్మెంట్ (నోటిఫికేషన్
- టీఎస్పీఎస్సీ: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (12/2022) పేపర్-2
- టీఎస్పీఎస్సీ: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (12/2022) పేపర్-2
- టీఎస్పీఎస్సీ: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (12/2022) పేపర్-1
- టీఎస్పీఎస్సీ: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (12/2022) పేపర్-2
- టీఎస్పీఎస్సీ: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (12/2022) పేపర్-1
నమూనా ప్రశ్నపత్రాలు
- టీఎస్పీఎస్సీ గ్రూప్-IV (పేపర్-1) 2023 - 3
- టీఎస్పీఎస్సీ గ్రూప్-IV (పేపర్-1) 2023 - 2
- టీఎస్పీఎస్సీ గ్రూప్-IV (పేపర్-2) 2023 - 2
- టీఎస్పీఎస్సీ గ్రూప్-IV (పేపర్-2) 2023 - 1
- టీఎస్పీఎస్సీ గ్రూప్-IV (పేపర్-1) 2023 - 1
- టీఎస్పీఎస్సీ గ్రూప్-I ప్రిలిమ్స్-2022