• facebook
  • whatsapp
  • telegram

సాధారణ రసాయన శాస్త్రం

1. చెరకు పిప్పిని ఏమంటారు?
1) ప్రెస్‌మడ్‌         2) బగాసే   
3) మొలాసిస్‌         4) వాష్‌


2. ప్రోటీన్‌లో ఎమైనో ఆమ్లాల మధ్య ఉండే బంధం ఏమిటి?
1) పెప్టైడ్‌         2) ఎస్టర్‌   
3) అమైడ్‌         4) అమైన్‌


3. టి.ఎం.సి. (TMC) అంటే?
1) వెయ్యి మిలియన్ల ఘనపు మీటర్లు
2) పది మిలియన్ల ఘనపు మీటర్లు
3) వెయ్యి మిలియన్ల ఘనపు అడుగులు
4) పది మిలియన్ల ఘనపు అడుగులు


4. ఇనుము తుప్పుపట్టడం ఏ రకమైన రసాయన చర్యకు ఉదాహరణ?
1) ఆక్సీకరణం     2) క్షయకరణం   
3) గాల్వనీకరణం     4) ప్రతిక్షేపణం


5. ఆల్కహాల్‌ను తయారుచేసే పద్ధతి ఏది?
1) కిణ్వ ప్రక్రియ (ఫెర్మెంటేషన్‌) 
2) వల్కనీకరణం   
3) సల్ఫిటేషన్‌     4) కార్బొనేషన్‌


6. కిందివాటిలో ‘నవ్వుల వాయువు’ అని దేన్ని పిలుస్తారు?
1) నైట్రిక్‌ ఆక్సైడ్‌     2) నత్రికామ్లం   
3) నైట్రస్‌ ఆక్సైడ్‌     4) నైట్రోజన్‌


7. కిందివాటిలో అత్యంత చల్లబరచిన ద్రవం?
1) పాదరసం     2) గాజు  
3) సీసం     4) ఏదీకాదు


8. వెనిగర్‌ దేని వ్యాపార నామం?
1) సిట్రిక్‌ ఆమ్లం     2) ఆక్జాలిక్‌ ఆమ్లం   
3) ఎసిటిక్‌ ఆమ్లం     4) హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం


9. బాయిల్స్‌ సూత్రం వేటి మధ్య సంబంధాన్ని తెలుపుతుంది?
1) పీడనం, ఉష్ణోగ్రత   
2) ఉష్ణోగ్రత, ఘనపరిమాణం
3) సాంద్రత, ఉష్ణోగ్రత   
4) పీడనం, ఘనపరిమాణం


10. వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీల్లో విద్యుత్‌ విశ్లేష్యకంగా దేన్ని వాడతారు?
1) స్వేదన జలం          2) నైట్రిక్‌ ఆమ్లం   
3) సల్ఫ్యూరిక్‌ ఆమ్లం        4) హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం


11. కిందివాటిలో బలమైన రసాయన బంధం ఏది?
1) హైడ్రోజన్‌ బంధం         2) వాండర్‌ వాల్స్‌ బలాలు
3) అయానిక బంధం       4) ద్విధ్రువ-ద్విధ్రువ ఆకర్షణ బలాలు


12. కిందివాటిలో నైట్రోజన్‌ వాయువు లక్షణం?
1) రుచి ఉండదు       2) వాసన ఉండదు
3) రంగు ఉండదు   4) పైవన్నీ


13. కిందివాటిలో ఏది కనిష్ఠంగా కాలుష్యాన్ని కలిగిస్తుంది?
1) బొగ్గు     2) కిరోసిన్‌   
3) డీజిల్‌     4) హైడ్రోజన్‌


14. కింది ద్రవపదార్థాల్లో అత్యధిక సాంద్రత కలిగింది ఏది?
1) నీరు     2) పాదరసం   
3) పెట్రోల్‌     4) ఆల్కహాల్‌


15. 92 ఎలక్ట్రాన్‌లను కలిగిన అతి భారమైన సహజ మూలకం ఏది?
1) బేరియం     2) కాల్షియం   
3) యురేనియం     4) క్యూరియం


16. రేడాన్‌ ఒక.....
1) మూలకం     2) ఉత్కృష్ట వాయువు   
3) ఎ, బి     4) కృత్రిమ సిల్క్‌


17. వెల్డింగ్‌కు ఉపయోగించే వాయువు ఏది?
1) ఎసిటిలిన్‌     2) ఆక్సిజన్‌   
3) నైట్రోజన్‌     4) ఎ, బి


18. ఆక్సైడ్‌ అయాన్‌ (O−2)లో వేలన్సీ కక్ష్యలోని ఎలక్ట్రాన్‌ల సంఖ్య?
1) 0          2) 8          3) 2           4) 12

 

19. కింది ఏ పదార్థం హైడ్రోజన్‌ బంధాలను ఏర్పరుస్తుంది?
1) ఎసిటిక్‌ ఆమ్లం     2) బెంజీన్‌   
3) నీరు     4) ఎ, బి


20. కిందివాటిలో సరికానిది ఏది?
1) నీటి కాలుష్యం - ఆర్సినిక్, ఫ్లోరైడ్‌
2) వాయు కాలుష్యం - కార్బన్‌ డైఆక్సైడ్‌
3) నేల కాలుష్యం - రసాయన ఎరువులు
4) శబ్ద కాలుష్యం - సల్ఫర్‌ డైఆక్సైడ్‌


21. కాఫీ, కోకో లాంటి పదార్థాల్లో సహజంగా లభించే ఆల్కలాయిడ్‌ ఏది?
1) మార్ఫిన్‌     2) టానిన్‌   
3) కొకైన్‌     4) కెఫిన్‌


22. కిందివాటిలో జడవాయువు కానిది?
1) హీలియం     2) నియాన్‌   
3) ఆర్గాన్‌     4) హైడ్రోజన్‌


23. కాల్షియం కార్బైడ్‌ నీటితో చర్య జరిపితే ఏ వాయువు వెలువడుతుంది?
1) మీథేన్‌     2) ఈథేన్‌   
3) ఎసిటిలిన్‌     4) ప్రొపేన్‌


24. కింది ఏ రసాయన ప్రక్రియ ద్వారా శాఖీయ నూనెల నుంచి వనస్పతిని (డాల్డా) తయారుచేస్తారు?
1) ఆక్సీకరణం     2) క్షయకరణం   
3) అయనీకరణం     4) జల విశ్లేషణ


25. కింది ఏ మిశ్రమాన్ని రాకెట్‌లో ఇంధనంగా ఉపయోగిస్తారు?
1) ద్రవ నైట్రోజన్‌ + ద్రవ ఆక్సిజన్‌   
2) ద్రవ ఆర్గాన్‌ + ద్రవ ఆక్సిజన్‌
3) ద్రవ హైడ్రోజన్‌ + ద్రవ ఆక్సిజన్‌   
4) ద్రవ హైడ్రోజన్‌ + ద్రవ నైట్రోజన్‌

 

26. గాఢ సల్ఫ్యూరిక్‌ ఆమ్లాన్ని ఏ పాత్రలో నిల్వ చేస్తారు?
1) రాగి         2) గాజు 
3) ఆల్యూమినియం     4) పైవన్నీ


27. ప్రతిపాదన(A): గ్రాఫైట్‌ కంటే డైమండ్‌ కఠినమైంది.
 కారణం(R): డైమండ్‌ పొరల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది.
1) A నిజం కానీ  R తప్పు.
2) A తప్పు కానీ R నిజం.
3) A, R రెండూ నిజం, Aకు R సరైన వివరణ.
4) A, R రెండూ నిజం, Aకు R సరైన వివరణ కాదు.


28. కిందివాటిలో రేడియోధార్మిక మూలకం కానిది?
1) థోరియం     2) యురేనియం   
3) రేడియం    4) జిర్కోనియం


29. కింది ఏ కర్బన పదార్థం మాగిన పండ్ల వాసనను కలిగి ఉంటుంది?
1) ఆల్డిహైడ్‌     2) ఈథర్‌ 
3) ఎస్టర్‌     4) ఫినాల్‌


30. కిందివాటిలో పొటాషియం పర్మాంగనేట్‌కు సంబంధించి సరైంది ఏది?
1) ఇది బలమైన ఆక్సీకరణ కారకం
2) దీన్ని గాయాలు, వ్యాధిగ్రస్తమైన చర్మాన్ని శుభ్రం చేయడానికి వాడతారు.
3) నీటిని శుద్ధి చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు.
4) పైవన్నీ


31. డైమండ్, గ్రాఫైట్‌లు దేనికి ఉదాహరణ?
1) సాదృశ్యకాలు     2) రూపాంతరాలు   
3) ఐసోటోప్‌లు     4) ఐసోబార్‌లు


32. పెట్రోలియం వేటి మిశ్రమం?
1) కార్బోహైడ్రేట్‌లు   2) కార్బైడ్‌లు   
3) హైడ్రోకార్బన్‌లు   4) కార్బొనేట్‌లు


33. కింది అంశాలను జతపరచండి.
   పదార్థం              రంగు
a) పొటాషియం       i) నారింజ రంగు
   పర్మాంగనేట్‌ 
b) పొటాషియం       ii) తెలుపు రంగు
   డైక్రోమేట్‌
c) పొటాషియం సల్ఫేట్‌  iii) ఊదారంగు
1) a-ii, b-i, c-iii     2) a-iii, b-i,  c-ii 
3) a-i, b-iii, c-ii     4)  a-iii, b-ii, c-i 

 

34. నీటి అణువు (H2O) అత్యధికంగా ఎన్ని హైడ్రోజన్‌ బంధాలను ఏర్పరుస్తుంది?
1) 1             2) 2           3) 3            4) 4


35. కింది ఏ ఉత్ప్రేరకం ఉష్ణోగ్రత మార్పులపై సున్నితంగా ఆధారపడుతుంది?
1) ఇనుము     2) నికెల్‌ 
3) ఎంజైమ్‌    4) ప్లాటినం


36. ‘బార్‌’ అనేది ఏ భౌతికరాశి  ప్రమాణం?
1) పీడనం     2) బలం   
3) శక్తి     4) తరంగదైర్ఘ్యం


37. కిందివాటిలో హైడ్రోజన్‌ బంధాన్ని ఏర్పరిచేది ఏది?
1) HCl         2) HI           3) HBr  4) HF          


38. కిందివాటిలో మిశ్రమానికి ఉదాహరణ ఏది?
1) స్వేదన జలం    2) ఎల్‌పీజీ 
3) గ్యాసోలిన్‌         4) 2, 3


39. కిందివాటిలో సమ్మేళనానికి ఉదాహరణ?
1) గాలి         2) యూరియా   
3) సోడియం         4) పాదరసం


40. f - ఆర్బిటాళ్లు ఏ కర్పరంలో  ఉంటాయి?
1) 1     2) 2      3) 3        4) 4


41. p - ఆర్బిటాళ్లు ఏ ఆకారంలో ఉంటాయి?
1) గోళాకారం           2) దీర్ఘవృత్తాకారం   
3) ముద్గరాకారం (డంబెల్‌)   
4) దీర్ఘచతురస్రాకారం


42. కిందివాటిలో అధ్రువాణువు ఏది?
1) నీరు       2) హైడ్రోజన్‌   
3) మీథేన్‌       4) కార్బన్‌ డైఆక్సైడ్‌


43. స్పిన్‌ క్వాంటం సంఖ్యను ప్రతిపాదించింది?
1) ఉలెన్‌బెక్, గౌడ్‌స్మిత్‌       2) నీల్స్‌ బోర్‌   
3) మాక్స్‌ప్లాంక్‌           4) జె.జె.థామ్సన్‌


44. కింది అంశాలను జతపరుచండి.    
  గ్రూప్‌-A                 గ్రూప్‌-B
a) స్థిరకక్ష్యలు       i) లూయిస్‌ డీ బ్రోగ్లీ
b)  ఎలక్ట్రాన్‌       ii) లాండ్‌
   ద్వంద్వ స్వభావం
c) అయస్కాంత       iii) నీల్స్‌బోర్‌
   క్వాంటం సంఖ్య
1) a-ii, b-i, c-ii          2) a-iii, b-i,  c-ii
3) a-i, b-iii, c-ii         4) a-iii, b-ii, c-i 


45. d - ఆర్బిటాళ్ల మొత్తం సంఖ్య ఎంత?
1) 1        2) 3         3) 5        4) 7


46. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్‌ను కనుక్కునే సంభావ్యత అధికంగా కలిగిన ప్రాంతాన్ని ఏమంటారు?
1) కర్పరం      2) ఆర్బిటాల్‌  
3) ఉపకర్పరం   4) పరమాణు వ్యాసార్థం


47. కిందివాటిలో ఏ బంధం స్వతంత్రంగా ఏర్పడుతుంది?
1) సిగ్మా       2) పై 
3) 1, 2       4) ఏదీకాదు


48. కిందివాటిలో సరైంది ఏది?
i) అంత్య అతిపాతం వల్ల సిగ్మా బంధం ఏర్పడుతుంది.
ii) పార్శ్వ అతిపాతం వల్ల 'పై' బంధం ఏర్పడుతుంది.
iii) ఏకబంధం కలిగిన అణువులో సిగ్మా బంధం మాత్రమే ఉంటుంది.
1) i మాత్రమే      2) ii, iii 
3) i, ii, iii       4) iii మాత్రమే


49. నీటి అణువు ఆకృతి ఏమిటి?
1) కోణీయం       2) V -  ఆకృతి   
3) పిరమిడల్‌       4) 1, 2


50. ధ్రువద్రావితాలు ఏ ద్రావణుల్లో కరుగుతాయి?
1) అధ్రువ       2) ధ్రువ   
3) ఎ, బి        4) నీటిలో మాత్రమే


51. నాఫ్తలీన్‌ ఏ ద్రావణిలో కరుగుతుంది?
1) నీరు       2) కిరోసిన్‌   
3) బెంజీన్‌       4) 1, 2


52. ఉష్ణోగ్రత పెంచితే వాయువుల ద్రావణీయత.....
1) తగ్గుతుంది          2) పెరుగుతుంది    
3) స్థిరంగా ఉంటుంది 4) 1 లేదా 2


53. సాధారణ ఉప్పుద్రావణం  pH  విలువ ఎంత?
1) > 7      2) < 7   3) 7    4) 2


54. ఏరోమాటిక్‌ హైడ్రోకార్బన్‌కు ఉదాహరణ ఏది?
1) మీథేన్‌       2) ఈథేన్‌    
3) బెంజీన్‌        4) క్లోరోఫాం


55. ఒక మూలకంలోని పరమాణువులు ఒకదానితో మరొకటి కలిసి పొడవైన గొలుసులుగా ఏర్పడటాన్ని ఏమంటారు?
1) రూపాంతరత     2) కాటనేషన్‌  
3) కార్బోనిఫికేషన్‌    4) యూట్రోఫికేషన్‌


56. సిమెంట్‌ తయారీకి కావాల్సిన ముడిపదార్థాలు ఏవి?
1) బంకమన్ను       2) సున్నపురాయి
3) ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌  4) 1, 2

 

57. కిందివాటిని జతపరచండి.
  జాబితా  A      జాబితా  B
A)  నైలాన్‌    I) పెట్రోల్‌
B) ఇన్సులిన్‌    II) నొప్పి నివారిణి
C) గాసోలిన్‌    III) పాలిమర్‌
D) ఆస్పిరిన్‌    IV) హార్మోన్‌
1) A-III, B-IV, C-I, D-II          2) A-III, B-IV, C-II, D-I
3) A-III, B-II, C-I, D-IV         4) A-I, B-IV, C-III, D-IV 


58. చక్కెర పరిశ్రమలో ముఖ్య ఉపఉత్పన్నం ఏమిటి?
1) గ్లూకోజ్‌        2) మొలాసిస్‌  
3) గ్లిజరాల్‌        4) గ్రాఫైట్‌


59. వజ్రంలో కార్బన్‌ పరమాణువులు ఏ నిర్మాణంలో అమరి ఉంటాయి?
1) పొరల నిర్మాణం      2) చతుర్ముఖీయ
3) అష్టముఖీయ      4) V - ఆకారం


60. ఆల్కహాల్‌ ప్రమేయ సమూహాన్ని పరీక్షించడానికి ఉపయోగించే లోహం?
1) కాల్షియం    2) జింక్‌  
3) సోడియం    4) కాపర్‌


61. క్లోరోఫామ్‌ రసాయన ఫార్ములా ఏమిటి?
1) CH3Cl           2) CHCl3
3) CH2Cl2         4) CH3OH 


62. కిందివాటిలో హైడ్రోకార్బన్‌లకు ఉదాహరణ?
1) మీథేన్‌    2) ఈథేన్‌  
3) ఎసిటిలీన్‌    4) పైవన్నీ


63. రెండు కార్బన్‌ల మధ్య త్రికబంధం ఉన్న అసంతృప్త హైడ్రోకార్బన్‌లను ఏమంటారు?
1) ఆల్కైన్‌లు    2) ఆల్కేన్‌లు 
3) ఆల్కీన్‌లు    4) ఫినాల్‌లు


64. చక్కెర పరిశ్రమలో చెరకు రసంలోని ఆమ్లత్వాన్ని తొలగించడానికి కలిపే పదార్థం ఏమిటి?
1) కాల్షియం సల్ఫేట్‌          2) కాల్షియం హైడ్రాక్సైడ్‌
3) మెగ్నీషియం సల్ఫేట్‌      4) మెగ్నీషియం ఆక్సైడ్‌


65. కిణ్వ ప్రక్రియలో గ్లూకోజ్‌ నుంచి ఏర్పడే పదార్థాలు ఏవి?
1) కార్బన్‌ డైఆక్సైడ్‌      2) ఇథైల్‌ ఆల్కహాల్‌  
3) 1, 2      4) ఎసిటిక్‌ ఆమ్లం


66. పిండి పదార్థాన్ని ఏ కారకంతో పరీక్షిస్తారు?
1) సిల్వర్‌ నైట్రేట్‌     2) అయోడిన్‌ 
3) టోలెన్స్‌ కారకం     4) బెనెడిక్ట్‌ ద్రావణం


67. గ్లాస్‌ బ్లోయింగ్‌కు పనికొచ్చే గాజు రకం?
1) బోరో సిలికేట్‌      2) పైరెక్స్‌  
3) సోడా గాజు      4) 1, 2


68. కిందివాటిని జతపరచండి.
ప్లాస్టిక్‌/ పాలిమర్‌      ఉపయోగం
A) పాలిథీన్‌        I) బ్రష్‌లు, దారాలు
B) పాలివినైల్‌ క్లోరైడ్‌       II) ప్లాస్టిక్‌ సంచులు, పాల ప్యాకెట్లు 
C) నైలాన్‌       III) పైపులు
1) A-II, B-III, C-I           2) A-II, B-I, C-III
3) A-I, B-III, C-II           4) A-III, B-II, C-I


69. వేడి చేసినప్పుడు దృఢంగా తయారయ్యే ప్లాస్టిక్‌లను ఏమంటారు?
1) థర్మో ఎలాస్టిక్‌ ప్లాస్టిక్‌లు        2) థర్మో సెట్టింగ్‌ ప్లాస్టిక్‌లు
3) ఎలాస్టోమర్‌లు             4) సహజ పాలిమర్‌లు


70. మూలకం ద్రవ్యరాశి సంఖ్య అంటే ఏమిటి?
1) పరమాణువు కేంద్రకంలోని న్యూట్రాన్‌ల సంఖ్య.
2) పరమాణువు కేంద్రకంలోని ఎలక్ట్రాన్‌ల సంఖ్య.
3) పరమాణువు కేంద్రకంలోని ప్రోటాన్, న్యూట్రాన్‌ల మొత్తం సంఖ్య.
4) పరమాణువు కేంద్రకంలోని ప్రోటాన్, ఎలక్ట్రాన్‌ల మొత్తం సంఖ్య.


71. కిందివాటిని జతపరచండి.
 జాబితా A           జాబితా B
A) 1 ఆంగ్‌స్ట్రామ్‌      I) 1012 మీటర్లు
B) 1 పికోమీటర్‌      II) 1015 మీటర్లు
C) 1 ఫెర్మి         III) 1010 మీటర్లు
1) A-III, B-II, C-I           2) A-I, B-III, C-II
3) A-III, B-I, C-II          4) A-II, B-I, C-III 


72. శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ పేరు మీద ఉన్న మూలకం సంకేతం ఏమిటి?
1) Eu      2) Es       3) I           4) In 


73. కిందివాటిలో ద్విపరమాణుక అణువు కానిది ఏది?
1) హైడ్రోజన్‌    2) ఆక్సిజన్‌ 
3) క్లోరిన్‌    4) పాస్ఫరస్‌


74. ఒక పరమాణువులో 'n' కక్ష్యలు ఉంటే, కేంద్రకం చుట్టూ తిరిగే గరిష్ఠ ఎలక్ట్రాన్‌ల సంఖ్య ఎంత?
1) n2        2) 2n2        3) (n + 1)2           4) (n - 1)2

 

75. కిందివాటిలో అతి బరువైన వాయువు ఏది?
1) హీలియం    2) ఆర్గాన్‌  
3) రేడాన్‌    4) నైట్రోజన్‌


76. కృత్రిమ అయస్కాంతాల తయారీకి ఉపయోగించే లోహం ఏది?
1) సోడియం      2) మెగ్నీషియం
3) అల్యూమినియం      4) కోబాల్ట్‌


77. కిందివాటిలో సరైనవి ఏవి?
i) నీటిలో మలినాలు ఉంటే, దాని బాష్పీభవన స్థానం పెరుగుతుంది.
ii) నీటిలో మలినాలు ఉంటే, దాని ఘనీభవన స్థానం తగ్గుతుంది.
1) i మాత్రమే    2) ii మాత్రమే 
3) i, ii         4) పైవేవీకావు


78. యాంటీసెప్టిక్‌గా ఉపయోగించే పెర్‌హైడ్రాల్‌ దేని ద్రావణం?
1) సోడియం క్లోరైడ్‌         2) హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ 
3) ఆల్కహాల్‌    4) భారజలం


79. కింది ఏ ప్రక్రియ ద్వారా సముద్రపు నీటిని మంచినీటిగా మారుస్తారు?
1) ద్రవాభిసరణం          2) తిరోగమన ద్రవాభిసరణం
3) ఆక్సీకరణం    4) కేంద్రక విచ్ఛిత్తి


80. కిందివాటిలో ద్విస్వభావ ఆక్సైడ్‌కు ఉదాహరణ ఏది?
1) నైట్రిక్‌ ఆక్సైడ్‌    2) కార్బన్‌ డైఆక్సైడ్‌   
3) జింక్‌ ఆక్సైడ్‌    4) కాల్షియం ఆక్సైడ్‌


81. ప్రతిపాదన(A):  హాలోజన్లలో అయోడిన్‌ ఘనస్థితిలో ఉంటుంది.
కారణం (R): అయోడిన్‌ అణువుల మధ్య వాండర్‌వాల్‌ ఆకర్షక బలాలు ఎక్కువగా ఉంటాయి.
1) A నిజం, కానీ R తప్పు         2) A తప్పు, కానీ R నిజం
3) A, R రెండూ నిజం, A కు R సరైన వివరణ.
4) A, R రెండూ నిజం, A కు R సరైన వివరణ కాదు.

 

82. కిందివాటిలో బ్లీచింగ్‌ పౌడర్‌ ఉపయోగాలు ఏవి?
1) క్రిమిసంహారిణి       2) విరంజనకారి 
3) క్లోరినేటింగ్‌ కారకం  4) పైవన్నీ


83. కిందివాటిని జతపరచండి.
 హాలోజన్‌        రంగు
A) ఫ్లోరిన్‌    I) ఊదా రంగు
B) బ్రోమిన్‌    II) పసుపు రంగు
C) అయోడిన్‌    III) ఎరుపు రంగు
1) A-I, B-III, C-II            2) A-II, B-I, C-III
3) A-III, B-II, C-I            4) A-II, B-III, C-I 


84. కిందివాటిని జతపరచండి.
 ఆమ్లం         రసాయన ఫార్ములా
A) హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం   I)  HClO4 
B) పెర్‌ క్టోరిక్‌ ఆమ్లం   II) HClO
C) క్లోరిక్‌ ఆమ్లం      III) HCl
D) హైపోక్లోరస్‌ ఆమ్లం   IV)  HClO3 
1) A-III, B-I, C-II, D-IV         2) A-II, B-I, C-IV, D-III
3) A-III, B-I, C-IV, D-II         4) A-I, B-III, C-IV, D-II 

 

85. MRI - స్కానింగ్‌లో MRI అంటే?
1) Magnetic Resonance Imaging  
2) Magnetic Radiation Imaging
3) Metal Resonance Imaging
4) Magnetic Resonance Iris 


86. కిందివాటిలో సంయోజనీయ సంయోగ పదార్థాలకు సంబంధించి సరైనవి ఏవి? 
i) సంయోజనీయ సంయోగ పదార్థాలు ఘన, ద్రవ, వాయు స్థితుల్లో ఉంటాయి.
ii) సాధారణంగా ధ్రువ ద్రావణుల్లోకరగవు.
iii) సమయోజనీయ సంయోగ పదార్థాలన్నీ మంచి ఉష్ణ, విద్యుత్‌ వాహకాలు.
1) i మాత్రమే    2) ii మాత్రమే  
3) i, ii మాత్రమే    4) i, ii, iii


87. కిందివాటిలో కాంతివేగంతో ప్రయాణించేవి ఏవి?
1) పరారుణ కిరణాలు
2) అతినీలలోహిత కిరణాలు
3) దృగ్గోచర కాంతి     4) పైవన్నీ


88. దృగ్గోచర కాంతి తరంగదైర్ఘ్య అవధి ఎంత?
1) 200 nm - 400 nm           2) 400 nm - 750 nm
3) 150 nm - 350 nm           4) 10 nm - 400 nm 

 

80. కంప్యూటెడ్‌ టోమోగ్రాఫీ స్కానింగ్‌ (CT Scanning) ఉపయోగించే విద్యుదయస్కాంత తరంగాలు ఏవి?
1) అతినీలలోహిత కిరణాలు 
2) గామా కిరణాలు
3) మైక్రో తరంగాలు      4) X -  కిరణాలు


90. సిలికాన్, జెర్మేనియందేనికి ఉదాహరణలు?
1) విద్యుత్‌ వాహకాలు   2) అర్ధ వాహకాలు
3) అర్ధ లోహాలు       4) 2, 3


91. ప్రమాణ హైడ్రోజన్‌ ఎలక్ట్రోడ్‌ పొటెన్షియల్‌ ఎంత?
1) 1.05 V           2) 0 V          3) 1.20 V         4) 2.25 V 


92. ఇంధన ఘటాల్లో ఉపయోగించే ఇంధనాలు ఏవి?
1) హైడ్రోజన్‌     2) మిథనోల్‌
3) 1, 2           4) నైట్రోజన్‌


93. థోరియం (Th) నిల్వలు అత్యధికంగా ఉన్న దేశం ఏది?
1) చైనా         2) భారత్‌        3) భూటాన్‌         4) నేపాల్‌


94. కిందివాటిని జతపరచండి.
జాబితా  A          జాబితా  B
A) రేడియోధార్మికత      I) పాస్కల్‌.సెకండ్‌
B) తలతన్యత      II) బెక్వెరెల్‌
C) స్నిగ్ధత      III) న్యూటన్‌/మీటర్‌
1) A-I, B-III, C-II         2) A-II, B-III, C-I
3) A-III, B-II, C-I         4) A-II, B-I, C-III


95. మొదటి ఆటంబాంబు రూపకర్త ఎవరు?
1) ఒపెన్‌ హైమర్‌       2) ఇ.ఫెర్మి 
3) హెన్రీ బెక్వెరెల్‌       4) మేడం క్యూరీ


96. అర్జంటైట్‌ ఏ లోహ ఖనిజం?
1) బంగారం     2) వెండి 
3) అల్యూమినియం  4) కాల్షియం


97. కిందివాటిలో సల్ఫేట్‌ రూపంలో లభించే ఖనిజాలు ఏవి?
1) బారైట్‌        2) జిప్సం       3) బాక్సైట్‌       4) 1, 2


98. కిందివాటిలో మిశ్రమలోహం కానిది ఏది?
1) ఇత్తడి      2) కంచు  
3) స్టెయిన్‌లెస్‌ స్టీల్‌      4) రాగి


99. కిందివాటిలో స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ఉపయోగాలు ఏవి? 
1) బ్లేడ్ల తయారీ       2) వంటపాత్రల తయారీ
3) శస్త్రచికిత్స పరికరాల తయారీ      4) పైవన్నీ


100. కింది ఏ కర్బన పదార్థాన్ని ‘ఫ్రూట్‌ రైపెనింగ్‌ హార్మోన్‌’ అని అంటారు? 
1) బ్యూటేన్‌           2) ఈథేన్‌  
3) ఇథిలీన్‌           4) బెంజీన్‌


101. తీగలను సోల్డరింగ్‌ చేసేందుకు ఉపయోగించే ‘సోల్డర్‌’ ఏ లోహాల మిశ్రమం?
1) తగరం + సీసం         2) రాగి + సీసం
3) తగరం + వెండి   4) రాగి + వెండి


102. కింది ఏ మిశ్రమ లోహంలో రాగి ఉండదు?
1) కంచు    2) ఇత్తడి  
3) జర్మన్‌ సిల్వర్‌    4) నిక్రోమ్‌


103. కిందివాటిని జతపరచండి.
 జాబితా  A          జాబితా  B
A) నిజ ద్రావణం        I) పాదరస మిశ్రమలోహం
B) కొల్లాయిడ్‌ ద్రావణం  II) చక్కెర ద్రావణం
C) అమాల్గం        III) పాలు, రక్తం
1) A-II, B-III, C-I             2) A-I, B-III, C-II
3) A-II, B-I, C-III             4) A-III, B-II, C-I

 

సమాధానాలు 1-2; 2-1; 3-3; 4-1;  5-1;  6-3;  7-2;  8-3;  9-3; 10-3;  11-4;  12-4;  13-2;  14-3;  15-3;  16-డి  17-2;  18-1;  19-4; 20-4;  21-4;  22-4;  23-3;  24-2;  25-3;  26-2;  27-1;  28-4;  29-3; 30-4;  31-2;  32-3;  33-4;  34-4;  35-3;  36-1;  37-4;  38-4;  39-2; 40-4;  41-3;  42-1; 44-1;  44-2;  45-3;  46-2;  47-1;  48-3;  49-4;  50-2; 51-4; 52-1; 53-3; 54-3; 55-2; 56-4; 57-1; 58-2; 59-2; 60-3; 61-2; 62-4; 63-1; 64-2; 65-3; 66-2; 67-4;  68-1;  69-2; 70-3;  71-3; 72-2; 73-4; 74-2; 75-3; 76-4; 77-3;  78-2;  79-2; 80-3; 81-3; 82-4; 83-4; 84-3; 85-1; 86-3; 87-4; 88-2; 89-4; 90-4; 91-2; 92-3; 93-2; 94-2; 95-1; 96-2; 97-4; 98-4; 99-4; 100-3; 101-1; 102-4; 103-1.

Posted Date : 30-06-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌