• facebook
  • whatsapp
  • telegram

మానవుడి శ్వాస వ్యవస్థ, విసర్జక వ్యవస్థ

మనిషిలోని అవయవాలు సరిగా పనిచేయడంలో, అన్ని జీవక్రియలు సక్రమంగా సాగడంలో శ్వాస, విసర్జక వ్యవస్థలు కీలకంగా వ్యవహరిస్తాయి. కణాలు ఆక్సిజన్‌ను గ్రహించి, శరీరానికి అవసరమైన శక్తిని విడుదల చేయడానికి శ్వాసక్రియ అత్యంత ప్రధానం. ఈ చర్యలో కార్బన్‌డైఆక్సైడ్‌ వెలువడుతుంది. వ్యర్థాలను పరిహరించి, రక్తప్రసరణకు తోడ్పడే మూత్రపిండాల వంటి విసర్జక వ్యవస్థలూ శరీర సమతాస్థితిని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ రెండు వ్యవస్థల గురించి అభ్యర్థులు పోటీ పరీక్షల కోణంలో తెలుసుకోవాలి. 


1.  మానవ శ్వాస వ్యవస్థకు సంబంధించి కింది వాక్యాల్లో సరైంది?

ఎ) ఊపిరితిత్తుల్లో జరిగే శ్వాసక్రియ బాహ్య శ్వాసక్రియ.

బి) ఊపిరితిత్తుల ద్వారా వాయువుల వినిమయం జరుగుతుంది.

జవాబు: ఎ, బి సరైనవి 


2.  కింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని ఎన్నుకోండి.

ఎ) ఊపిరితిత్తుల ద్వారా జరిగే శ్వాసక్రియను పుపుస శ్వాసక్రియ అంటారు. 

బి) మానవుడిలో మాత్రమే పుపుస శ్వాసక్రియ జరుగుతుంది.

సి) పక్షుల్లో శ్వాస అవయవాలు ఊపిరితిత్తులు.

జవాబు: ఎ, సి సరైనవి


3. శ్వాసక్రియలో హిమోగ్లోబిన్‌ పాత్ర గురించి సరైన వాక్యాన్ని ఎంచుకోండి.

ఎ) ఆక్సిజన్‌ రవాణాకు ఉపయోగపడుతుంది.

బి) కార్బన్‌ డై ఆక్సైడ్‌ రవాణాకు ఉపయోగపడుతుంది.

సి) గ్లూకోజ్‌ రవాణాకు ఉపయోగపడుతుంది.

జవాబు: ఎ, బి సరైనవి


4. ఊపిరితిత్తులకు సంబంధించిన సమాచారంలో కిందివాటిలో ఎన్ని వాక్యాలు సరైనవి?

ఎ) ఊపిరితిత్తుల్ని ఆవరించి ఉండే పొర ప్లూరా.

బి) ఊపిరితిత్తులు రెండూ సమాన పరిమాణంలో ఉంటాయి.

సి) ఊపిరితిత్తులకు మాత్రమే సోకే వ్యాధి క్షయ.

డి) ఊపిరితిత్తుల నిర్మాణాత్మక ప్రమాణాలు వాయుగోణులు.

జవాబు: 2 వాక్యాలు


5. కింది వాక్యాల ఆధారంగా సరైన సమాధానాన్ని గుర్తించండి.

ఎ) కణంలోని మైటోకాండ్రియాలో అంతర శ్వాసక్రియ జరుగుతుంది.

బి) శ్వాసక్రియలో శక్తి, నీరు విడుదలవుతాయి.

జవాబు: ఎ, బి రెండూ సరైనవి. ఎ వాక్యం బి తో సంబంధాన్ని చూపుతుంది.


6. మానవుడి శ్వాసక్రియలో ఆక్సిజన్‌ ప్రవేశించే మార్గానికి సంబంధించి సరైన క్రమం?

జవాబు: ముక్కు → నాసికా రంధ్రాలు → గ్రసని → శ్వాసనాళం → శ్వాస నాళికలు → ఊపిరితిత్తులు → వాయుగోణులు


 7. కిందివాటిని గమనించి సరైన వాక్యాలు గుర్తించండి.

ఎ) కణ శ్వాసక్రియను అణు స్థాయి శ్వాసక్రియ అనొచ్చు.

బి) ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసల్లో O2 వినియోగమై, CO2 విడుదలవుతుంది.

సి) ప్లూరల్‌ ద్రవం కందెనలా పనిచేస్తుంది.

జవాబు: ఎ, బి, సి    

 

8.  కింది వాక్యాల్లో భిన్నమైన దాన్ని గుర్తించండి.

ఎ) ఆక్సిజన్‌ ఆక్సిహిమోగ్లోబిన్‌ రూపంలో రవాణా అవుతుంది.

బి) స్వరపేటికలో స్వర తంతువులు ఉంటాయి.

సి) కార్బన్‌ డై ఆక్సైడ్‌ కర్బమినోహిమోగ్లోబిన్‌ రూపంలో రవాణా అవుతుంది.

డి) హిమోగ్లోబిన్‌ను శ్వాసవర్ణకం అంటారు.

ఇ) హిమోగ్లోబిన్‌లో ఇనుము ఉంటుంది.

జవాబు: బి


9.  శ్వాసక్రియ జరిగే భాగాలను జతపరచండి.

ఎ) క్షీరదాలు   1) పుస్తకాకార ఊపిరితిత్తులు

బి) జలగ     2) వాయునాళాలు

సి) కీటకాలు   3) చర్మం

డి) సాలీడు    4) ఊపిరితిత్తులు

జవాబు: ఎ-4, బి-3, సి-2, డి-1 


10. కిందివాటిలో శ్వాసక్రియ గురించి తప్పుగా ఉన్న జతను గుర్తించండి.

ఎ) చర్మం - వానపాము

బి) మొప్పలు - కప్ప టాడ్‌పోల్‌ లార్వా

సి) ఊపిరితిత్తులు - పక్షి

డి) పుస్తకాకార ఊపిరితిత్తులు - రొయ్య

 జవాబు: డి



11. కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి.

ఎ) వర్ణరహిత రక్తాన్ని హీమోలింఫ్‌ అంటారు.

బి) కీటకాల్లో హీమోలింఫ్‌ ఉంటుంది.

జవాబు: ఎ, బి సరైనవి, ఎ వాక్యానికి బి తో సంబంధం ఉంది.



12. శ్వాసక్రియ వర్ణకాలకు సంబంధించిన కిందివాటిని సరిగా జతపరచండి.

ఎ) హిమోగ్లోబిన్‌        1) నీలిరంగు

బి) హీమోసయనిన్‌     2) ఎరుపు

సి) క్లోరోక్రూరిన్‌      3) గోధుమ వర్ణం

డి) పిన్నాగ్లోబిన్‌      4) ఆకుపచ్చ

జవాబు: ఎ-2, బి-1, సి-4, డి-3  


 

13. మానవుడిలో విసర్జక అవయవాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి.

ఎ) ఊపిరితిత్తులు - దివీ2 ను విసర్జిస్తాయి.

బి) మూత్రపిండాలు - నత్రజని సంబంధ వ్యర్థాలను విసర్జిస్తాయి.

సి) చర్మం - చెమటను విసర్జిస్తుంది.

డి) పెద్దపేగు - జీర్ణం కాని ఆహార పదార్థాలను విసర్జిస్తుంది.

జవాబు: ఎ, బి, సి, డి      


14.    మూత్రపిండాల విధులకు సంబంధించి కిందివాక్యాల్లో సరికానివి?

ఎ) మూత్రపిండాలు రక్తాన్ని వడపోస్తాయి.

బి) మూత్రపిండాలు నీరు, ఖనిజ లవణాలను సమతాస్థితిలో ఉంచుతాయి.

సి) మూత్రపిండాలు రక్తాన్ని ఉత్పత్తి చేస్తాయి.

డి) మూత్రపిండాలు రసాయనాలను విడుదల చేసి రక్తపోటును నియంత్రిస్తాయి.

జవాబు: సి మాత్రమే 



15. నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలకు సంబంధించి కిందివాటిని జతపరచండి. 

ఎ) అమ్మోనోటెలిక్‌        1) సాలెపురుగు

బి) యూరియోటెలిక్‌       2) సరీసృపాలు

సి) యూరికోటెలిక్‌       3) ఉభయ జీవులు

డి) గ్వానైన్‌        4) చేపలు

జవాబు: ఎ-4, బి-3, సి-2, డి-1


 

16. కిందివాటిలో అమ్మోనియాను విసర్జించే జీవుల్ని గుర్తించండి.

ఎ) పక్షులు      బి) క్షీరదాలు    

సి) చేపలు      డి) కప్ప టాడ్‌పోల్‌ లార్వా   

ఇ) కప్ప       ఎఫ్‌) రొయ్య  

జి) సరీసృపాలు

జవాబు: సి, డి, ఎఫ్‌    

 

17. మూత్రపిండాలకు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి?

ఎ) వృక్క ధమని మూత్రపిండానికి మంచి రక్తాన్ని సరఫరా చేస్తుంది

బి) మూత్రపిండాలు, వాటి వ్యాధుల అధ్యయనాన్ని నెఫ్రాలజీ అంటారు. 

సి) మూత్రపిండాలు విటమిన్‌-డి తయారీకి సహాయపడుతాయి.

జవాబు: ఎ, బి, సి


18. మూత్రపిండాలకు సంబంధించిన కింది జతల్లో సరికాని వాటిని గుర్తించండి.

ఎ) గ్లైకోసూరియా -  మూత్రంలో గ్లైకోజెన్‌ ఉండటం 

బి) హిమటూరియా - మూత్రంలో రక్తం ఉండటం 

సి) కీటోన్యూరియా - మూత్రంలో కీటోన్‌ దేహాలు ఉండటం

డి) ఆల్బిన్యూరియా - మూత్రంలో ఆల్బుమిన్‌ ప్రొటీన్‌ ఉండటం

జవాబు: ఎ మాత్రమే


19. కిందివాటిలో మానవ మూత్రంలో సహజంగా ఉండని పదార్థాలు?    

ఎ) యూరియా      బి) ప్రొటీన్‌     

సి) యూరికామ్లం         డి) రక్తం  

ఇ) క్రియాటిన్‌      ఎఫ్‌) అమ్మోనియా    

జి) గ్లూకోజ్‌ 

జవాబు: బి, డి, జి 



20. కింది వాక్యాల్లో సరైనవాటిని గుర్తించండి.

ఎ) ఆల్కహాల్‌ డైయూరిటిక్‌గా పనిచేస్తుంది.

బి) కృత్రిమంగా రక్తాన్ని వడపోయడాన్ని హీమోడయాలసిస్‌ అంటారు.

సి) నెఫ్రాన్‌లోని గ్లోమెరులస్‌ ద్వారా అల్ట్రాఫిల్ట్రేషన్‌ జరుగుతుంది. 

డి) మూత్రం పసుపు రంగులో ఉండటానికి కారణం యూరోక్రోమ్‌.

జవాబు: ఎ, బి, సి, డి   


 

21. మూత్రపిండంలోని రాళ్లు రసాయనికంగా కింది ఏ పదార్థాలతో ఏర్పడవు?

ఎ) యూరిక్‌ ఆమ్లం      బి) కాల్షియం కార్బోనేట్‌       

సి) సోడియం ఆగ్జాలేట్‌    డి) కాల్షియం ఆగ్జాలేట్‌     

ఇ) కాల్షియం నైట్రేట్‌      ఎఫ్‌) సోడియం నైట్రేట్‌ 

జవాబు: బి, ఇ, ఎఫ్‌  

 

22. నెఫ్రాన్‌కు సంబంధించిన కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి. 

ఎ) మూత్రపిండాల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు నెఫ్రాన్‌లు.

బి) నెఫ్రాన్‌లలో సూక్ష్మ రక్తనాళాల గుచ్ఛాన్ని గ్లోమెరులస్‌ అంటారు. 

సి) గ్లోమెరులస్‌ ద్వారా రక్తం వడపోత జరుగుతుంది.

జవాబు: ఎ, బి, సి  


 

23. కిందివాక్యాల ఆధారంగా సరైన సమాధానాన్ని గుర్తించండి.

ఎ) డయాబెటిస్‌ ఇన్‌సిపిడస్‌ వ్యాధిలో అతి ఎక్కువ మూత్రం ఉత్పత్తి అవుతుంది.

బి) ఆల్‌కాప్టోన్యూరియా అనే జన్యువ్యాధిలో మూత్రం నలుపు రంగులోకి మారుతుంది.

జవాబు: ఎ, బి సరైనవి, ఎ వాక్యానికి బి తో సంబంధం లేదు

 

24. కిందివాక్యాల్లో వేరుగా ఉన్న వాటిని గుర్తించండి.

ఎ) నెఫ్రాన్‌లోని గ్లోమెరులస్‌ ద్వారా జరిగే వడపోతను అల్ట్రాఫిల్ట్రేషన్‌ (సూక్ష్మగాలనం) అంటారు.

బి) సూక్ష్మగాలనం వల్ల ప్రాథమిక మూత్రం ఏర్పడుతుంది.

సి) హెన్లీ శిఖ్యం నుంచి పునఃశోషణ జరుగుతుంది.

డి) ఆల్కహాల్, ఉప్పు, కాఫీ లాంటి పదార్థాలు మూత్రం ఎక్కువ రావడాన్ని ప్రేరేపిస్తాయి.

జవాబు: డి మాత్రమే  


 

Posted Date : 18-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌