• facebook
  • whatsapp
  • telegram

ఏకచరరాశిలో  రేఖీయ సమీకరణాలు

1.5/9రావాలంటే అకరణీయ సంఖ్య   -9/5రెట్టింపునకు ఎంత కలపాలి?

సమాధానం: 3

2. 13 కి మూడు వరుస గుణిజాల మొత్తం 390. అయితే ఆ గుణిజాల్లో అతి చిన్న గుణిజం ఏది?


1) 117    2) 104    3) 91    4) 143


సాధన: 13 కి అతిచిన్న గుణిజం = x అ.కో.


ఆ గుణిజాలు వరుసగా= x, x + 13, x + 26 

సమస్య ప్రకారం, 

x + x + 13 + x + 26 = 390

3x + 39 = 390

3x = 390 − 39 = 351

 

  

∴ x = 117 
   
సమాధానం: 1

3. రెండు పూర్ణసంఖ్యల భేదం 76. ఆ రెండు సంఖ్యల నిష్పత్తి 17 : 13. అయితే ఆ సంఖ్యల మొత్తం ....


1) 460     2) 760      3) 570     4) 950


సాధన: రెండు పూర్ణసంఖ్యల నిష్పత్తి = 17 : 13


ఆ రెండు సంఖ్యలు వరుసగా  = 17x, 13x 


సమస్య ప్రకారం, 17x − 13x = 76 

  4x = 76

 

ఆ సంఖ్యల మొత్తం  = 17x + 13x = 30x = 30 × 19 = 570 

సమాధానం: 3

4. రెండు సంఖ్యలు 7 : 3 నిష్పత్తిలో ఉన్నాయి. వాటిలో ఒక భాగం రెండో దానికంటే 80 ఎక్కువ. అయితే ఆ సంఖ్యలు వరుసగా ....

1) 150, 70     2) 160, 80    3) 170, 90     4) 140, 60

సాధన: రెండు సంఖ్యల నిష్పత్తి = 7 : 3


మొదటి సంఖ్య = 7x, 


రెండో సంఖ్య  = 3x,   భేదం = 80


7x − 3x = 80 ⇒ 4x = 80 

      

మొదటి సంఖ్య = 7x = 7 × 20 = 140 


రెండో సంఖ్య = 3x = 3 × 20 = 60 


రెండు సంఖ్యలు = 140, 60


సమాధానం: 4

5. బ్యాంక్‌ క్యాషియర్‌ వద్ద రూ.100, 


రూ.50, రూ.10 నోట్లు ఉన్నాయి. ఈ నోట్ల నిష్పత్తి 2 : 3 : 5. క్యాషియర్‌ వద్ద ఉన్న మొత్తం సొమ్ము రూ.2,00,000 అయితే అతడి వద్ద ఎన్ని రూ.100 నోట్లు ఉన్నాయి?


1) 1000 2) 2000  3) 500 4) 1500


సాధన: రూ.100, రూ.50, రూ.10 విలువ ఉన్న నోట్ల నిష్పత్తి = 2 : 3 : 5


నోట్ల సంఖ్య వరుసగా 2x, 3x, 5x 
అనుకోండి.


సమస్య ప్రకారం, 

(2x × 100) + (3x × 50) + (5x × 10)  == రూ. 2,00,000 

200x + 150x + 50x = 2,00,000 400x = 2,00,000 

రూ.100 నోట్ల సంఖ్య =  2x 

=  2 × 500  = 1000


సమాధానం: 1

6. మూడు పూర్ణ సంఖ్యలు ఆరోహణ క్రమంలో ఉన్నాయి. వాటిని వరుసగా 2, 3, 4 లతో గుణించి, కూడితే 146 వస్తుంది. అయితే ఆ సంఖ్యల్లో గరిష్ఠ సంఖ్య?

1) 15        2) 17      3) 19       4) 21 

సాధన: మూడు పూర్ణ సంఖ్యలు = x, x + 1, x + 2 అనుకోండి.

సమస్య ప్రకారం,

2x + 3(x + 1) + 4(x + 2) = 146

2x + 3x + 3 + 4x + 8 = 146

9x + 11 = 146

9x = 146 − 11 = 135 

గరిష్ఠ పూర్ణ సంఖ్యలు =  = x + 2 = 15 + 2 = 17 

సమాధానం:2

7. సాయి వయసు 18 సంవత్సరాల తర్వాత ప్రస్తుత వయసుకు నాలుగు రెట్లు ఉంటుంది. అయితే సాయి ప్రస్తుత వయసు ఎంత?


1) 6    2) 7    3) 4    4) 8


సాధన: సాయి ప్రస్తుత వయసు = x అనుకోండి.


18 సం. తర్వాత సాయి వయసు  = x +  18 


సమస్య ప్రకారం, x + 18 = 4x 

18 = 4x − x

18 = 3x 

సాయి ప్రస్తుత వయసు = 6 సం.


సమాధానం: 1

8. కిరణ్‌ తండ్రి, అతడి తాత కంటే 26 సంవత్సరాలు చిన్న, కిరణ్‌ కంటే 29 సం. పెద్ద. ఆ ముగ్గురి వయసుల మొత్తం 135 ఏళ్లు. అయితే కిరణ్‌ తాత వయసు ఎంత?

1) 72 సం.     2) 78 సం.    3) 68 సం.     4) 62 సం.

సాధన: కిరణ్‌ వయసు =  సం.

కిరణ్‌ తండ్రి వయసు = 29 సం.

కిరణ్‌ తాత వయసు = (x + 29) + 26  సం.

సమస్య ప్రకారం,

x + (x + 29) + (x + 55) = 135  సం.

3x + 84 = 135 ⇒ 3x = 135 − 84 = 51 

కిరణ్‌ తాత వయసు

= x + 55 = 17 + 55 = 72  సం.

సమాధానం: 1

9. ఒక దీర్ఘచతురస్రాకార ఈత కొలను చుట్టుకొలత 184 మీ. దాని పొడవు వెడల్పునకు రెట్టింపు కంటే 2 మీ. ఎక్కువ. అయితే ఆ ఈత కొలను పొడవు, వెడల్పులు వరుసగా ..... (మీటర్లలో)

1) 52, 25     2) 62, 25     3) 62, 30    4) 72, 35 

సాధన: దీర్ఘచతురస్రాకార ఈత కొలను వెడల్పు= x 

పొడవు= 2x + 2 

లెక్క ప్రకారం, ఈత కొలను చుట్టు కొలత = 184 మీ.

2(2x + 2 + x) = 184

2(3x + 2) = 184

3x + 2 = 92

3x = 90 ⇒ x = 30 మీ.

వెడల్పు = x = 30  మీ.,    

పొడవు = 2x + 2 = 60 + 2 = 62 మీ.

సమాధానం:3

10. ఒక ధన సంఖ్య మరో సంఖ్యకు 5 రెట్లు ఎక్కువ. ఆ రెండు సంఖ్యలకు 21 కలిపితే వచ్చే రెండు సంఖ్యల్లో ఒక సంఖ్య మరో సంఖ్యకు రెట్టింపు. అయితే ఆ సంఖ్యలు...


1) 7, 35     2) 8, 40    3) 9, 45     4) 6, 30

సాధన: ఆ సంఖ్యలు వరుసగా x, 5x  అ.కో. 

సమస్య ప్రకారం,  5x + 21 = 2(x + 21) 

⇒ 5x + 21 = 2x + 42

⇒ 5x − 2x = 42 − 21

⇒ 3x = 21

⇒ x = 7 x = 7, 5x = 5 × 7 = 35

∴ ఆ సంఖ్యలు= 7, 35

సమాధానం:1

11. శోభ తల్లి ప్రస్తుత వయసు శోభ ప్రస్తుత వయసుకు 6 రెట్లు. అయిదేళ్ల తర్వాత శోభ వయసు ఆమె తల్లి ప్రస్తుత వయసులో

1/3వ వంతు. అయితే ప్రస్తుతం శోభ, తల్లి వయసులు వరుసగా...

1) 4 సం., 24 సం.   2) 7 సం., 42 సం.     3) 6 సం., 36 సం.   4) 5 సం., 30 సం.

సాధన: శోభ ప్రస్తుత వయసు = x అనుకోండి.


శోభ తల్లి వయసు = 6

లెక్క ప్రకారం

⇒ x + 5 = 2x

⇒ x = 5 

శోభ వయసు = 5 సం.


తల్లి వయసు = 6x = 30 సం.

సమాధానం:4

12. సాయి ఒక పిజ్జాని 3 ముక్కలు చేశాడు. మొదటి ముక్క రెండో దాని బరువు కంటే 9 గ్రా. తక్కువగా, మూడో ముక్క కంటే 5 గ్రా. ఎక్కువగా ఉంది. పిజ్జా మొత్తం బరువు 400 గ్రా. అయితే కింది వాటిని సరిగ్గా జతపరచండి.

i మొదటి ముక్క బరువు  a)  127 గ్రా.


ii రెండో ముక్క బరువు     b) 137 గ్రా.


iii మూడో ముక్క బరువు   c)  141 గ్రా.


                                       d) 132 గ్రా.

1) i-d, ii-c, iii-a     2) i-b, ii-c, iii-a    3) i-d, ii-a, iii-c    4) i-d, ii-b, iii-a

 

సాధన: మొదటి ముక్క బరువు = x గ్రా.,


రెండో ముక్క బరువు =  x +9 గ్రా.,


మూడో ముక్క బరువు = x − 5 గ్రా.అనుకోండి.

(x + x + 9 + x − 5) గ్రా. = 400 గ్రా.

⇒ 3x + 4 = 400

⇒ 3x = 400 − 4 = 396 

మొదటి ముక్క బరువు (x) =  132 గ్రా.

రెండో ముక్క బరువు x + 9 


= 132 + 9 = 141 గ్రా.


మూడో ముక్క బరువు= x − 5 


    = 132  5 = 127 గ్రా.


సమాధానం: 1

* ఒక బహుళైచ్ఛిక పరీక్షలో 160 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు వస్తే, ప్రతి తప్పు సమాధానానికి 2 మార్కులు తగ్గుతాయి. కోమల్‌ అనే విద్యార్థికి ఆ పరీక్షలో 430 మార్కులు వచ్చాయి. అయితే కోమల్‌ ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాశాడు?

1) 128   2) 115   3) 126   4) 125


సాధన: మొత్తం ప్రశ్నల సంఖ్య = 160


సరైన సమాధానాలు రాసిన ప్రశ్నల సంఖ్య 


    =  x అనుకోండి. 


తప్పుగా రాసిన ప్రశ్నల సంఖ్య = 160  


కోమల్‌కి వచ్చిన మార్కులు = 430


4 × x − 2(160 − x) = 430

4x − 320 + 2x = 430


 

కోమల్‌ సరైన సమాధానాలు రాసిన ప్రశ్నల సంఖ్య = 125


సమాధానం: 4


 

Posted Date : 05-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌