• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - ఉనికి

            'సింధునది' పేరు మీదుగా ఇండియా అనే పేరు వచ్చింది. భారతదేశం ఆసియా ఖండంలో దక్షిణ భాగాన ఉంది. భారతదేశం ఉత్తరార్ధగోళంలో 8º4' - 37º6' ఉత్తర అక్షాంశాలు, 68º7' - 97º25' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఇండియా ఉత్తర - దక్షిణాల మధ్య పొడవు 3200 కి.మీ. తూర్పు - పడమరల మధ్య పొడవు 3000 కి.మీ. 
* భారతదేశ భూభాగ సరిహద్దు పొడవు 15,200 కి.మీ. భారతదేశ తీరరేఖ పొడవు 6,100 కి.మీ.
* భారతదేశ వైశాల్యం 3.28 మిలియన్ చ.కి.మీ. అండమాన్ నికోబార్ దీవుల వైశాల్యం 8,248 చ.కి.మీ. 
     లక్షదీవుల వైశాల్యం 32 చ.కి.మీ. వైశాల్యంలో ఇండియా 7వ స్థానం, జనాభాలో 2వ స్థానంలో ఉంది. 
* భారత్ లో మొదట సూర్యోదయాన్ని చూసే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. ఈ ప్రదేశం కంటే గుజరాత్‌లోని ద్వారక వద్ద 2 గంటలు ఆలస్యంగా సూర్యోదయమవుతుంది.
  కారణం: ఇండియా అక్షాంశ, రేఖాంశాల పరంగా 30º పొడవు విస్తరించడం.
* గ్రీనిచ్ కాలంతో పోలిస్తే భారత ప్రామాణిక కాలం 5½ గంటలు ముందు ఉంటుంది.
* భారతదేశ ప్రామాణిక రేఖాంశం 82½º తూర్పు రేఖాంశం. ఈ రేఖాంశం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మీదుగా పోతుంది.
* కర్కటరేఖ భారతదేశంలో  ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, త్రిపుర, మిజోరం, గుజరాత్ రాష్ట్రాల మీదుగా పోతుంది.
* భూపరివేష్ఠిత రాష్ట్రాలు: అంతర్జాతీయ సరిహద్దుగాని, తీరరేఖగాని లేని రాష్ట్రాలు. అవి జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, మధ్యప్రదేశ్.


తీరరేఖ: భారతదేశంలో తీరరేఖ ఉన్న రాష్ట్రాల సంఖ్య 9. ఎక్కువ తీరరేఖ ఉన్న రాష్ట్రాలు వరుసగా గుజరాత్, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 972 కి.మీ. చిన్నతీరరేఖ ఉన్న రాష్ట్రం గోవా. 3 సముద్రాల కలయిక జరిగే రాష్ట్రం - తమిళనాడు
సరిహద్దు రేఖలు:
* భారత్ - చైనా  మెక్‌మోహన్ రేఖ
* భారత్ - ఆప్ఘనిస్థాన్  డ్యూరాండ్ రేఖ 
* భారత్ - పాకిస్థాన్  రాడ్‌క్లిఫ్, 24º అక్షాంశం 
* భారత్ - శ్రీలంక  పాక్ జలసంధి, మన్నార్ సింధుశాఖ.


దీవులు:
* భారతదేశంలోని మొత్తం దీవుల సంఖ్య 247.
* బంగాళాఖాతంలోని దీవుల సంఖ్య 204.
* బంగాళాఖాతంలోని దీవులను అండమాన్ నికోబార్ దీవులని, అరేబియాసముద్రపు దీవులను లక్షదీవులని అంటారు.
* అండమాన్ నికోబార్ దీవులు 10º-14º ఉత్తరఅక్షాంశాల మధ్య విస్తరించి ఉంటే, లక్షదీవులు 8º-11º ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించాయి. 
* లక్ష దీవులు పగడపు దీవులు.
* లక్షదీవులలోని మిన్‌కాయ్ దీవి ద్వారా వెళ్లే ఛానల్ - 8º ఛానల్. మిన్‌కాయ్ దీవి మాల్దీవులను, లక్షదీవులను వేరుచేస్తుంది.
* భూమధ్యరేఖకు దగ్గరగా ఉండే భారత దీవి  గ్రేట్‌నికోబార్.
* భారత్ - శ్రీలంకల మధ్య ఉండే దీవి  పంబన్‌దీవి.


ఇండియా - చిట్టచివరి ప్రాంతాలు
* ఉత్తరం  కిలక్‌దావన్ కనుమ (జమ్మూ-కాశ్మీర్) 
* దక్షిణం  ఇందిరాపాయింట్ (అండమాన్‌నికోబార్) 
* తూర్పు  పూర్వాంచల్ పర్వతాలు (అరుణాచల్ ప్రదేశ్) 
* పడమర  రాణ్ ఆఫ్ కచ్ (గుజరాత్) 
* భారతదేశంలోని రాష్ట్రాల సంఖ్య 28
* కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 7. 
చివరిగా ఏర్పడిన రాష్ట్రాలు :
* ఛత్తీస్‌గఢ్    (26వది) 
* ఉత్తరాంచల్ (27వది)
* జార్ఖండ్ (28వది) (2000 నవంబరు నెల).


కేంద్రపాలిత ప్రాంతాలు - రాజధానులు
1. చండీగఢ్ - చండీగఢ్
2. ఢిల్లీ - ఢిల్లీ
3. పాండిచ్చేరి - పాండిచ్చేరి
4. దాద్రానగర్‌హవేలి - సిల్వస్సా
5. లక్షదీవులు - కవరత్తి
6. అండమాన్ నికోబార్ దీవులు - పోర్ట్‌బ్లెయిర్
7. డయ్యూ, డామన్ - డామన్.


పొరుగు దేశాలతో సరిహద్దులున్న రాష్ట్రాలు:
    దేశం            సరిహద్దు రాష్ట్రాలు
1. పాకిస్థాన్    -  పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్
2. చైనా   -  జమ్మూకాశ్మీర్, ఉత్తరాంచల్, సిక్కిం, హిమచల్‌ప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్
3. ఆప్ఘనిస్థాన్   -  జమ్మూకాశ్మీర్
4. నేపాల్   -  పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరాంచల్,ఉత్తరప్రదేశ్, సిక్కిం
5. భూటాన్   -  అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, అసోం, పశ్చిమబెంగాల్
6. బంగ్లాదేశ్   -  అసోం, పశ్చిమబెంగాల్, మిజోరం, మేఘాలయ, త్రిపుర
7. మయన్మార్   -  మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్


* భారతదేశంతో పొడవైన సరిహద్దు ఉన్న దేశం - బంగ్లాదేశ్, 2వ దేశం - చైనా
* తక్కువ సరిహద్దుఉన్న దేశం- ఆప్ఘనిస్థాన్


భారతదేశం - అడవులు
       2003 నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ రిపోర్ట్ ప్రకారం భారతదేశ భూభాగంలో అడవులు 20.5% మాత్రం విస్తరించి ఉన్నాయి. అయితే 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం దేశ భూభాగంలో 33.3% అడవులు ఉండేవి. విస్తీర్ణపరంగా అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు వరుసగా మధ్యప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్. అడవులు తక్కువగా ఉన్న రాష్ట్రాలు - హర్యానా, పంజాబ్.
* దేశంలో అటవీ సాంద్రత లేదా శాతంపరంగా అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం - మిజోరం.
* తక్కువ - హర్యానా.
* ఈశాన్య రాష్ట్రాల్లో అటవీ సాంద్రత ఎక్కువ.


వర్షపాత విస్తరణ ఆధారంగా అడవుల వర్గీకరణ
* 1. సతత హరిత అరణ్యాలు
* 2. ఆకురాల్చే అరణ్యాలు
* 3. చిట్ట అడవులు/ పొద అడవులు
* 4. టైడల్ అరణ్యాలు/ మాంగ్రూవ్/ మడ అడవులు
* 5. పర్వత ప్రాంత అరణ్యాలు


1. 1800-3300 మీ ఎత్తులోని హిమాలయ అరణ్యాలు - శృంగాకార అరణ్యాలు. ఇవి మెత్తని కలపనిస్తాయి.
వృక్ష జాతులు: పైన్, ఫిర్, సిల్వర్ ఫర్, దేవదార్, స్ప్రూస్.


2. 3300 మీ. కంటే ఎత్తులోని అరణ్యాలు - ఆల్ఫైన్ అరణ్యాలు.
వృక్షజాతులు: చిర్, బిర్చ్.


* పశ్చిమబెంగాల్‌లోని టైడల్ అడవుల్లో సుందరి అనే వృక్షం ఉండటంతో వాటిని సుందర్‌బన్స్ అడవులు అంటారు.
ఆంధ్రప్రదేశ్- అడవులు:
* 23.7% విస్తరించి ఉన్నాయి.
* ఎక్కువగా ఉన్న జిల్లాలు- ఖమ్మం, ఆదిలాబాద్.
* తక్కువగా ఉన్న జిల్లాలు- హైదరాబాద్, కృష్ణా.
* రూసా అనే సువాసన ఉన్న గడ్డిజాతి నిజామాబాద్ జిల్లాలో విస్తరించి ఉంది. దీనిని అత్తర్లు (పర్‌ప్యూమ్స్) తయారీలో ఉపయోగిస్తారు.

 

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌