• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - బ్రిటిష్ పాలనా ప్రభావం

సహజ వనరులు

* సహజ వనరుల లభ్యత ఆర్థికాభివృద్ధిని నిర్ణయిస్తుందని అన్నది ఎవరు?
జ: ఆర్థర్ లూయిస్

 

* ఆర్థికాభివృద్ధి ఆ ప్రాంత సహజ వనరులపై ఆధారపడుతుందని తెలిపింది ఎవరు?
జ: ఫిషర్

 

* ఆర్థర్ లూయిస్ వాదనతో ఏకీభవించింది ఎవరు?
జ: బౌమల్

 

* ఆర్థికాభివృద్ధిలో వనరుల లభ్యత ప్రధానాంశం కాదని తెలిపింది?
జ: హరడ్

 

* సహజ వనరులకు ఉదాహరణలు 
జ: భూమి, నీరు, మత్స్య సంపద, అడవులు, ఖనిజాలు, వాతావరణం, వర్షపాతం

 

* సహజ వనరులకు మరొక పేరు?
జ: ప్రకృతి వనరులు

 

* పునరుత్పన్నం అయ్యే వనరులు ఏవి?
జ: సూర్యరశ్మి, గాలి, నీరు, అడవులు, చేపలు

 

* పునరుత్పన్నం కాని వనరులు ఏవి?
జ: బొగ్గు, చమురు, ఖనిజాలు

 

* సహజ వనరుల్లో అధిక ప్రాధాన్యం ఉన్న అంశం ఏది?
జ: భూమి

 

అడవులు

* మన దేశంలో మొదటి అటవీ విధానాన్ని బ్రిటిష్ కాలంలో ఎప్పుడు  రూపొందించారు?
జ: 1894

 

* స్వాతంత్య్రానంతరం మొదటి అటవీ తీర్మానాన్ని  ఎప్పుడు ఏర్పాటుచేశారు?
జ: 1952

 

*  మొదటి అటవీ తీర్మానం 1952 ను ఎప్పుడు సవరించారు?
జ: 1988

 

* అటవీ విధానం 1952 ప్రకారం దేశంలో ఎంతశాతం అడవులు ఉండాలి?
: 33%

 

* సామాజిక అడవుల పెంపకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
జ: 1970

 

* వన్యప్రాణి సంరక్షణ చ‌ట్టం ఎప్పుడు అమ‌ల్లోకి వ‌చ్చింది?
జ: 1972

 

*  నేషనల్ వేస్ట్‌లాండ్ డెవలప్‌మెంట్ బోర్డును ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 1985

 

* జాతీయ అడవుల పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
జ: 1999 ఆగస్టు

 

* జాతీయ అటవీ పరిశోధనా సంస్థను ఎక్కడ ఏర్పాటు చేశారు?
జ: డెహ్రాడూన్

 

* ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? 
జ: మార్చి 21

 

* ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్ర‌ధాన కార్యాల‌యం ఎక్కడ ఉంది?
జ: డెహ్రాడూన్

 

* పులుల సంరక్షణ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
జ: 1973

 

* సముద్ర తాబేళ్ల పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం?
జ: 1975

 

* మొసళ్ల సంరక్షణ పథకం ఎప్పుడు ప్రారంభమైంది?
జ: 1975

 

* ఏనుగుల సంరక్షణ పథకాన్ని (Operation Elephant) ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
జ: 1990 - 91

 

* అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏవి?
జ: మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా

 

* దేశంలో టేకు ఉత్పత్తులు లభించే రాష్ట్రాలు ఏవి?
జ: మధ్యప్రదేశ్/చత్తీస్‌గఢ్

 

నేలలు/మృత్తికలు

* భూమి ఉపరితలంపై అనేక ఖనిజ లవణాలతో కూడిన మట్టిపొరలను ఏమంటారు?
జ: నేలలు/మృత్తికలు

 

* మృత్తికల పుట్టుక గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
జ: పెడాలజీ

 

* మృత్తికల స్వభావం గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
జ: లిథాలజీ
 

* భారతదేశంలో ప్రధాన నేలలు ఏవి?
జ: 1) ఒండ్రు     2) నల్లరేగడి    3) ఎర్ర     4) లాటరైట్

 

* నదీ నిక్షేపాల కారణంగా ఏర్పడే నేలలు?
జ: ఒండ్రు నేలలు

 

* అత్యంత సారవంతమైన నేలలు?
జ: ఒండ్రు నేలలు

 

* నలుపు రంగులో ఉండే నేలలు?
జ: నల్లరేగడి నేలలు

 

* నల్లరేగడి భూములు నల్లగా ఉండటానికి కారణం?
జ: మెగ్నీషియం ఆక్సైడ్

 

*  నల్లరేగడి నేలలకు మరో పేరు?
జ: రేగర్/రేగడి నేలలు

 

*'తమను తాము దున్నుకునే నేలలు' అని వేటిని పిలుస్తారు?
జ: నల్లరేగడి

 

* నల్లరేగడి నేలలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి?
జ: మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ

 

* పత్తి అధికంగా ఏ నేలల్లో పండుతుంది?
జ: నల్లరేగడి

 

* ఎర్రనేలలు ఎరుపుగా ఉండటానికి కారణం?
జ: ఐరన్ ఆక్సైడ్

 

* ఎర్రనేలలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి?
జ: తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక

 

* లాటరైట్ నేలలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి?
జ: కర్ణాటక, కేరళ, అసోం

 

* బెంగళూరు పెంకుల తయారీకి ఉపయోగపడే నేలలు?
జ: లాటరైట్ నేలలు

 

* ''భారత ప్రజల నుంచి మనం పొందేది ముఖ్యం కానీ వారిని బాగుపరచడం కాదు'' అన్నది ఎవరు?
జ: లార్డ్ శాలిన్ ప్రభువు

 

* బ్రిటిష్ పాలనా కాలాన్ని ఆర్థిక చరిత్రకారులు ఎన్ని రకాలుగా విభజించారు?
జ: 3 రకాలు. అవి: 1. వాణిజ్య మూలధన దశ
                            2. పారిశ్రామిక మూలధన దశ
                            3. మూలధన పెట్టుబడుల దశ

 

* లేజాఫేర్ అంటే ఏమిటి?
జ: ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడం

 

* గ్యారంటీ లాభాల ప్రాతిపదికన బ్రిటిషర్లు ఏ రంగంలో నిర్మాణాలు ప్రారంభించారు?
జ: రైల్వేలు

 

* నూతన గ్యారంటీ విధానం కింద రైల్వేల్లో బ్రిటిషర్లు చెల్లించిన వడ్డీ రేటు ఎంత?
జ: 3.5%

 

* నూతన గ్యారంటీ విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
జ: 1882

 

* భారతదేశ గ్రామాలను 'చిన్నపాటి రిపబ్లిక్‌'లు అని పోల్చింది?
జ: ఛార్లెస్ మెట్‌కాఫ్

 

*  బ్రిటిషర్లు తోటల పెంపకంలో అంతర్జాతీయ ఏకస్వామ్యాధికారాన్ని ఏ కాలంలో పొందారు?
జ: 1857 - 60

 

* పారిశ్రామిక మూలధన దశలో ''బ్రిటన్ పారిశ్రామిక ఉత్పత్తులకు భారత్ మార్కెట్‌''గా మారింది అన్నది ఎవరు?
జ: హెలెన్ లాంబ్

 

*  బ్రిటిష్ పాలన అనుకూల ప్రభావాలు ఏవి?
జ: 1. ఆంగ్ల విద్య
     2. జాతీయభావం వృద్ధి
     3. ఆధునిక దృక్పథం
     4. న్యాయ సంస్కరణలు
     5. రవాణా, సమాచార రంగాల వృద్ధి
     6. రాజకీయ ఆర్థిక ఐక్యత

* బ్రిటిష్ పాలన ప్రతికూల ప్రభావాలు ఏవి?
జ: 1. చిన్న పరిశ్రమల నాశనం
     2. భూ దోపిడీ
     3. వ్యవసాయ వాణిజ్యీకరణ
     4. పారిశ్రామిక తిరోగమనం
     5. కరవు కాటకాల వృద్ధి

 

*  'ఇండస్ట్రియల్ ఎవల్యూషన్ ఆఫ్ ఇండియా' రచయిత ఎవరు?
జ: డి.ఆర్. గాడ్గిల్

 

*  బ్రిటిష్ పాలన వల్ల చిన్న పరిశ్రమలు నాశనం కావడానికి కారణాలు ఏవి?
జ: 1. నవాబులు, స్థానిక రాజులు లేకపోవడం
     2. బ్రిటిష్ ఆర్థిక విధానాలు
     3. విదేశీ వస్తువుల నుంచి పోటీ, వాటి తక్కువ ధరలు
     4. విదేశీ వస్తు వ్యామోహం

 

*  జమీందారీ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు?
జ: కారన్‌వాలీస్. (1793లో బిహార్‌, బెంగాల్‌లో ప్రవేశపెట్టారు)

 

*  జమీందారీ విధానంలో శిస్తు వసూలు అధికారి ఎవరు?
జ: జమీందారు

 

* రైత్వారీ పద్ధతిని ఎవరు ప్రారంభించారు?
జ: మన్రో

 

* రైత్వారీ పద్ధతిని ఎక్కడ ప్రారంభించారు
జ: మద్రాసు, బొంబాయి

 

ఏ భూస్వామ్య విధానంలో మధ్యవర్తులు ఉండరు?
: రైత్వారీ పద్ధతి

 

* రైత్వారీ పద్ధతిలోని ప్రధాన అంశం ఏది?
జ: మధ్యవర్తులు లేకపోవడం

 

* మహల్వారీ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు?
జ: విలియం బెంటింక్ (1833)

 

* మహల్వారీ పద్ధతిని ఏ ప్రాంతాల్లో ప్రారంభించారు?
జ: పంజాబ్, ఆగ్రా, అయోధ్య

 

* మహల్వారీ పద్ధతిలో భూమిశిస్తు ఎవరు వసూలు చేస్తారు?
జ: గ్రామపెద్ద

 

* వ్యవసాయ వాణిజ్యీకరణ ఏ కాలంలో జరిగింది?
జ: 1850 - 1947

 

* బ్రిటిషర్లు వ్యవసాయ వాణిజ్యీకరణ విధానంలో అధికంగా ప్రోత్సహించిన పంటలు ఏవి?
జ: పత్తి, జనుము, పొగాకు

 

రైతులను వాణిజ్య పంటలు పండించేలా ప్రోత్సహించడానికి బ్రిటిషర్లు నియమించిన ఉద్యోగులను ఏమంటారు?
జ: గొనుస్తాస్

 

* ''పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా'' గ్రంథ రచయిత?
జ: దాదాభాయ్ నౌరోజీ

 

''డ్రెయిన్ సిద్ధాంతం'' తెలిపింది ఎవరు?
జ: నౌరోజీ

 

* నౌరోజీ అభిప్రాయం ప్రకారం దేశంలో బ్రిటిషర్లు ఆర్థిక దోపిడీ ఏ రూపంలో చేశారు?
జ: హోమ్‌ఛార్జీలు

 

* హోమ్‌ఛార్జీలు అంటే ఏమిటి?
జ: పాలనా వ్యయాలు

 

* హోమ్‌ఛార్జీలకు ఉదాహరణలు తెలపండి.
జ: రుణాలు, వాటికి చెల్లించిన వడ్డీలు, రైల్వే పెట్టుబడులు, అధికారుల జీతాలు, పెన్షన్లు, అలవెన్సులు

 

* సంపద దోపిడీ (హోమ్ ఛార్జీలు) ప్రభావాలు ఏమిటి?
జ: మూలధనం కొరత, అల్ప ఉత్పత్తి, పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ స్తబ్దత

 

* వ్యవసాయ వాణిజ్యీకరణ ప్రధాన ఫలితం ఏది?
జ: ఆహార ధాన్యాలు

 

* ఆహార ధాన్యాల కొరత దేనికి దారి తీసింది?
జ: కరవు కాటకాలు

 

* బెంగాల్‌లో ఏ సంవత్సరంలో క్షామం వచ్చింది?
జ: 1943

 

* భారత్‌లో అతిపెద్ద క్షామం ఎక్కడ వచ్చింది?
జ: బెంగాల్‌లో

 

* భారత్‌లో తొలి రైల్వేలైన్‌ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
జ: 1853

 

* పోస్టల్ వ్యవస్థను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
జ: 1837

 

బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్‌ను ఏ సంవత్సరంలో స్థాపించారు?
జ: 1770

 

* బ్రిటిష్ పాలనకు పూర్వం భారతదేశంలో ఉన్న సామాజిక వ్యవస్థ లక్షణాలు
   1. స్వయం సమృద్ధి
   2. సహజవనరుల సుసంపన్నత
  3. కుల ప్రాతిపదిక శ్రమ విభజన
  4. నైపుణ్యం ఉన్న చేతివృత్తులు
  5. వస్తు మార్పిడి పద్ధతి
  6. సమష్టి కుటుంబ వ్యవస్థ
  7. న్యాయ నిర్ణయాధికారం ఉన్న గ్రామ పంచాయతీలు
  8. రాచరిక వ్యవస్థ

  

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌