• facebook
  • whatsapp
  • telegram

పారిశ్రామిక రంగం

1. జీడీపీలో పారిశ్రామిక రంగం - వాటాలు

        1950  -  51         -         16.6%
        1990  -  91         -         27.7%
        2012  -  13         -         27.3%
        2013  -  14         -         26.2%


2. పారిశ్రామిక రంగంలోని ఉపరంగాలు: గనులు-తవ్వకాలు, తయారీ, నిర్మాణం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా.

 

3. వస్తు ఆధారంగా వృద్ధిరేట్లు

-

(2012 - 13)

బేసిక్ వస్తువులు

-

2.5% (ప్రాథమిక)

క్యాపిటల్ వస్తువులు

-

(-6.0%) (మూలధన)

మధ్యంతర వస్తువులు

-

1.6%

వినియోగ వస్తువులు

-

2.4%

 

4. ప్రధాన రంగాల ఉత్పత్తులు

-

(2012 - 13)

విద్యుత్ ఉత్పత్తి

-

912.1 బిలియన్ KWH

బొగ్గు

-

583 మిలియన్ టన్నులు

క్రూడ్ పెట్రోలియం

-

38.0 మిలియన్ టన్నులు

స్టీల్

-

77.6 మిలియన్ టన్నులు

సిమెంట్

-

252.5 మిలియన్ టన్నులు

టెక్స్‌టైల్స్ (క్లాత్)

-

60,453 మిలియన్ స్క్వేర్ మీటర్లు

చక్కెర

-

248 లక్షల టన్నులు

5. ప్రభుత్వ ఆధీనంలోని పరిశ్రమలు - అణుశక్తి, అణు ఖనిజాలు, రైలు రవాణా.
6. అనుమతి (లైసెన్స్) తీసుకోవాల్సిన రంగాలు (5) - ఆల్కహాల్, సిగరెట్లు, హానికర రసాయనాలు, రక్షణ పరికరాలు, పారిశ్రామిక పేలుడు పదార్థాలు.

 

7. పారిశ్రామిక రంగం - వ్యయాలు

ప్రణాళిక

పారిశ్రామిక రంగం
పై వ్యయం(రూ. కోట్లలో)

మొత్తం వ్యయంలో%

1.

55

2.8

2.

938

20.1

3.

1,726

20.1

4.

2,864

18.2

5.

8,989

22.8

6.

15,002

13.7

7.

25,971

11.9

8.

40,623

8.4

9.

40,408

5.0

10.

64,655

4.0

11.

1,85,653

5.1

12.

3,77,302
(కేటాయింపులు)

4.9

 

8. పారిశ్రామిక రంగం - వృద్ధిరేట్లు

ప్రణాళిక

-

వృద్ధిరేటు

8

-

7.4%

9

-

5.0%

10

-

8.2%

11

-

6.9%

12

-

10% (లక్ష్యం)

 

9. భారత్ ఉత్పత్తులు

-

ప్రపంచంలో స్థానం

దుక్క ఇనుము ఉత్పత్తిలో

-

4వ

జనుము ఉత్పత్తిలో

-

1వ

జనుము ఎగుమతిలో

-

2వ

చక్కెర ఉత్పత్తిలో

-

1వ

చక్కెర వినియోగం

-

1వ

 

10. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSMEs) (2011 - 12)

MSMEs సంఖ్య

-

447.7 లక్షలు

స్థిర మూలధనం

-

రూ.11,76,939 కోట్లు

ఉత్పత్తి

-

రూ.18,34,332 కోట్లు

ఉద్యోగిత

-

1,012.6 లక్షలు

 

ప్రభుత్వ రంగం
* 1951లో 5 ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు) ఉండేవి. అప్పటి మూలధనం రూ.29 కోట్లు
* 2011లో వాటి సంఖ్య - 248. ఆ ఏడాది రూ.9,49,499 కోట్లు మూలధనం.
   ఈ 248 ప్రభుత్వ రంగ సంస్థల్లో 240 మాత్రమే నిర్వహణలో ఉన్నాయి.


ప్రైవేట్ రంగం (2012 - 13)
1. రిలయన్స్ ఇండస్ట్రీస్ 
2. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)
3. ఐటీసీ (ఇంపీరియల్ టొబాకో కంపెనీ)

 

పారిశ్రామిక ఖాయిలా

-

2013

పరిశ్రమల సంఖ్య

-

2,49,903

ఈ పరిశ్రమలకు బ్యాంకులు ఇచ్చిన పరపతి

-

రూ.12,800 కోట్లు

ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు)

-

2013 ప్రకారం

మొత్తం

-

277

నిర్వహణలో ఉన్నవి

-

229

నిర్మాణంలో ఉన్నవి

-

48

మొత్తం పెట్టుబడులు

-

రూ.8,50,599 కోట్లు

లాభాల్లో ఉన్న పీఎస్‌యూలు

-

149 (రూ.1,43,559 కోట్లు)

నష్టాల్లో ఉన్న పీఎస్‌యూలు

-

79 (రూ.28,260 కోట్లు)

 

లాభాల్లో ఉన్న పీఎస్‌యూలు
     1. ONGC
     2. NTPC
     3. FCI
     4. CIL
     5. BHEl

 

నష్టాల్లో ఉన్న పీఎస్‌యూలు
     1. BSNL
     2. MTNL
     3. AIL
     4. CPCL (చెన్నయ్ పెట్రో కార్ప్ లిమిటెడ్)
     5. HPFM (హిందుస్థాన్ ఫొటోఫిల్మ్ మాన్యుఫాక్చరింగ్)

 

పారిశ్రామిక రంగ విధానాలు 

* పారిశ్రామిక రంగ అభివృద్ధికి ప్రభుత్వం అనుసరించే వ్యూహం లేదా పద్ధతినే పారిశ్రామిక విధానం అంటారు.
* స్వాతంత్య్రానంతరం ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక విధానాలను ప్రకటించింది.
* పారిశ్రామిక తీర్మానాలను అమలు చేయడానికి ప్రధాన కారణం బ్రిటిష్ పాలనలో కుటీర పరిశ్రమలు నాశనమవడం, భారీ పరిశ్రమలు అభివృద్ధి చెందకపోవడం.


భారత్ పారిశ్రామిక తీర్మానాలు
* 1944లో ప్రణాళిక అభివృద్ధి విభాగాన్ని ఏర్పాటు చేశారు.
* దేశంలో పారిశ్రామిక తీర్మానాలు 1945, 1948, 1956, 1973, 1977, 1986, 1991ల్లో ప్రకటించారు.


స్వాతంత్య్రానికి పూర్వం
       1945 ఏప్రిల్ 21న పారిశ్రామిక విధాన ప్రకటన చేశారు. ఇది పారిశ్రామిక రంగంలో ప్రభుత్వ జోక్యాన్ని, పారిశ్రామిక లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది.


స్వాతంత్య్రం తర్వాత
* స్వాతంత్రం తర్వాత మొదటి పారిశ్రామిక తీర్మానాన్ని 1948 ఏప్రిల్ 6న ప్రకటించారు. (అప్పటి పరిశ్రమల శాఖా మంత్రి శ్యాంప్రసాద్ ముఖర్జీ)

 

1. పారిశ్రామిక తీర్మానం - 1948 :
* ఇది మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసింది.
* ప్రైవేటు, ప్రభుత్వ రంగాల పరస్పరం సహకారానికి ప్రాధాన్యం ఇచ్చింది.
లక్ష్యాలు:
* జీవనస్థాయి పెంపు
* సమాన అవకాశాల కల్పన
* సమన్యాయం
* ఆదాయ వ్యత్యాసాల నిర్మూలన
     పై లక్ష్యాల సాధనకు ఈ తీర్మానం పరిశ్రమలను 4 వర్గాలుగా విభజించింది.
ఎ. ప్రభుత్వ ఏకస్వామ్య పరిశ్రమలు - అణుశక్తి, రైల్వేలు, ఆయుధాలు
బి. ప్రభుత్వం అజమాయిషీ చేసే పరిశ్రమలు - చక్కెర, సిమెంట్, భారీయంత్రాలు, పరికరాలు, ఎరువులు.
సి. మిశ్రమ రంగం - ఇనుము - ఉక్కు, టెలిఫోన్, బొగ్గు, నౌకా, విమానాలు.
డి. ఇతర పరిశ్రమలు - పై వర్గీకరణలో లేనివి ప్రైవేట్ రంగంలో ఉంటాయి.

 

2. పారిశ్రామిక తీర్మానం - 1956
* రెండో పంచవర్ష ప్రణాళిక 1956లో పారిశ్రామిక రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది.
* ఈ అంశాల ఆధారంగా 1956 ఏప్రిల్ 30న మరో తీర్మానాన్ని ప్రకటించారు.
లక్ష్యాలు:
* భారీ పరిశ్రమల ద్వారా పారిశ్రామిక వృద్ధి సాధించడం.
* సామ్యవాద రీతి సమాజ స్థాపన.
* ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల సహకారం.
* ఆదాయం కేంద్రీకృతం కావడాన్ని నిరోధించడం.
     పైవిధంగా 1956 తీర్మానం భారత్‌లో సామ్యవాద తరహా సమాజ స్థాపనకు ప్రభుత్వానికి ప్రాధాన్యం ఇస్తూ మిశ్రమ ఆర్థిక విధానానికి మెరుగులు దిద్దింది.


ముఖ్యాంశాలు:
       ఈ తీర్మానం పరిశ్రమలను 3 వర్గాలుగా విభజించింది.
జాబితా - ఎ: దీనిలో 17 పరిశ్రమలు ఉన్నాయి. ఇవి ప్రభుత్వ ఏకస్వామ్య పరిశ్రమలు.
ఉదా: ఆయుధాలు, అణుశక్తి, ఇనుము - ఉక్కు, రైలు, గనులు.
జాబితా - బి: దీనిలో 12 పరిశ్రమలు ఉన్నాయి.

ఇవి క్రమంగా ప్రభుత్వ యజమాన్యం కిందికి వస్తాయి. జాబితా ఎలో చేర్చని నాన్‌ఫెర్రస్ లోహాలు, అత్యవసర మందులు, ఎరువులు, రోడ్లు, నీటి రవాణా.
జాబితా - సి: ఎ, బి జాబితాల్లో లేనివి. వీటిని ప్రైవేట్ రంగానికి వదిలేశారు.
ప్రాధాన్యం:
* దీనికి విస్తృత ప్రాతిపదిక ఉంది.
* 'జాతీయీకరణ' ప్రస్తావన లేదు.
* ప్రభుత్వ - ప్రైవేట్ రంగాల మధ్య సహకారం.
* కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం.
      పై అంశాలన్నీ ఉండటం వల్ల 1956 తీర్మానాన్ని 'ఆర్థిక రాజ్యాంగం' అంటారు.
* 1956 పారిశ్రామిక తీర్మానానికి సవరణలు చేశారు. ప్రధానంగా 1970, 1973, 1975 లలో లైసెన్సింగ్ విధానానికి సంబంధించి చేసిన సవరణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం:
* 1951 అక్టోబరులో పరిశ్రమల (అభివృద్ధి, క్రమబద్ధీకరణ) చట్టాన్ని చేశారు.
1970 పారిశ్రామిక విధానానికి చేసిన సవరణలు: లైసెన్సింగ్ విధాన లోపాలను పరిశీలించిన హజారే కమిటీపై 1967లో దత్ కమిటీని ఏర్పాటు చేశారు.

* దత్ కమిటీ సిఫారసుల మేరకు 1970లో నూతన లైసెన్సింగ్ విధానాన్ని ప్రకటించారు.
* 1970 తీర్మానం 'సంయుక్త రంగం' (Joint Sector) అనే భావనను ప్రవేశపెట్టింది.
* సంయుక్త రంగం ప్రకారం ఐడీబీఐ, ఐఎఫ్‌సీఐ లాంటి విత్త సంస్థలు చెల్లించిన రుణాలను ఈక్విటీగా మార్చుకోవడం.


పారిశ్రామిక తీర్మానం - 1977
* 1977లో జనతా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1977 డిసెంబరు 3న నూతన పారిశ్రామిక తీర్మానాన్ని ప్రకటించారు.
* ఇది చిన్న పరిశ్రమలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది.
* ఈ విధానం ద్వారా జిల్లా పరిశ్రమల కేంద్రాలు (డీఐసీలు) ఏర్పాటయ్యాయి.


పారిశ్రామిక తీర్మానం - 1980
       జనతా ప్రభుత్వం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 1980లో మరో తీర్మానాన్ని చేసింది.
ముఖ్యాంశాలు:
* ప్రభుత్వ సమర్థత పెంపు.
* 'ఆర్థిక ఫెడరలిజం' భావన ద్వారా వెనుకబడిన జిల్లాల్లో పరిశ్రమల అభివృద్ధి.
* అనుబంధ పరిశ్రమలు, వాటి ఉత్పత్తుల అసెంబ్లింగ్, మార్కెటింగ్‌కు దోహదం చేసేలా 'న్యూక్లియస్' సంస్థలను ఏర్పాటు చేసి చిన్న సంస్థల సాంకేతిక స్థాయిని పెంచడం.
* 'పారిశ్రామిక రుగ్మత'ను హెచ్చరించే విధానం ప్రవేశపెట్టడం.
* మొదటిసారిగా 'పర్యావరణ సమతుల్యం' గురించి ప్రస్తావించడం.


1980లలో ఆర్థిక సరళీకరణ చర్యలు
* 1980లో పారిశ్రామిక అభివృద్ధికి కొన్ని నిబంధనలను సరళతరం చేశారు. అవి:
*  పరిశ్రమల లైసెన్స్ పొందడానికి ఎంఆర్‌టీపీ, ఫెరా (FERA) పరిధిలో లేని సంస్థల పెట్టుబడుల పరిమితిని పెంచారు.
* 28 రకాల పరిశ్రమలు, 82 రకాల మందులకు లైసెన్సింగ్ నుంచి మినహాయించారు.
* ఎంఆర్‌టీపీ, ఫెరా నిబంధనలను సరళం చేశారు.
* 1984లో లైసెన్సుల విస్తృత ఏకీకరణ పథకాన్ని ప్రవేశపెట్టారు.


నూతన పారిశ్రామిక తీర్మానం - 1991
* 1991కి ముందు భారత ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ పాత్ర పరిమితంగా ఉండేది.
* విదేశీ మూలధనం, సాంకేతిక పరిజ్ఞానంలో ప్రైవేట్ పాత్ర ద్వారా జరిగిన అభివృద్ధిని ప్రభుత్వం గుర్తించింది.
* ఆర్థిక వ్యవస్థలో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ లాంటి అంశాల ఆధారంగా ఆర్థిక సంస్కరణల్లో భాగంగా 1991లో ఈ తీర్మానం చేశారు.
* ఈ నూతన పారిశ్రామిక విధానాన్ని అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ 1991 జులై 24న ప్రవేశపెట్టారు.
* వీటిని నూతన ఆర్థిక సంస్కరణలు లేదా రావు - మన్మోహన్ నమూనా లేదా ఎల్‌పీజీ నమూనా అంటారు.

 

1991 పారిశ్రామిక తీర్మానం - ఆశయాలు
* దేశ పారిశ్రామిక రంగాన్ని అధికార ఉక్కు సంకెళ్ల నుంచి రక్షించడం.
* సరళీకరణ, ప్రపంచీకరణ విధానాల అమలు.
* విదేశీ పెట్టుబడులకు ఉన్న అవరోధాల తొలగింపు.
* పెట్టుబడిదారులకు ఎంఆర్‌టీపీ నుంచి విముక్తి.
* ఖాయిలాపడిన పరిశ్రమల తగ్గింపు/ విక్రయం.
లక్ష్యాలు:
*  నిబంధనలను సరళం/ సులభం చేయడం (సరళీకరణ)
* ప్రభుత్వరంగంలో ప్రైవేట్ ప్రాధానాన్ని పెంచడం (ప్రైవేటీకరణ)
* మన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు అనుసంధానం చేయడం (ప్రపంచీకరణ).
* అంతర్జాతీయ పోటీ తట్టుకునేలా ఆర్థిక వ్యవస్థ సామర్థ్యం పెంచడం.
*  ఆర్థిక అసమానతల తొలగింపు.
* పారిశ్రామిక రంగ ఉత్పాదక రేటు, ఆర్థికాభివృద్ధి రేటును పెంచడం.
ముఖ్యాంశాలు:
       ప్రభుత్వం కింది అంశాల్లో సంస్కరణలను తీసుకొచ్చింది.


1. పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం
* పారిశ్రామిక అభివృద్ధి, క్రమబద్ధీకరణ చట్టం 1951 ప్రకారం రక్షణ, వ్యూహాత్మక, రసాయనాలు లాంటి 18 పరిశ్రమలకు తప్ప మిగిలినవాటికి లైసెన్సులు రద్దు. ఈ సంఖ్యను 1997లో 8 పరిశ్రమలకు, 2006లో 5 పరిశ్రమలకు తగ్గించారు.
అవి:
       1) ఆల్కహల్                             2) పొగాకు                      3) రక్షణ
       4) హానికర రసాయనాలు            5) పారిశ్రామిక పేలుడు పదార్థాలు
        పై 5 పరిశ్రమలు మినహా మిగిలినవాటికి ప్రభుత్వ అనుమతి లేకుండా 10 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో తప్ప ఎక్కడైనా స్థాపించే అవకాశాన్ని కల్పించారు.


2. విదేశీ పెట్టుబడుల విధానం
    అధిక ప్రాధాన్యత ఉన్న పరిశ్రమల అభివృద్ధికి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు. ముఖ్యంగా రక్షణలో 26%, బ్యాంకింగ్ 74%, ఇన్సూరెన్స్ 26%, ప్రింట్ మీడియా 26%, టెలికాం రంగాల్లో 74% విదేశీ పెట్టుబడులను ప్రభుత్వం అనుమతిస్తోంది.

 

3. విదేశీ సాంకేతిక విధానం
* కొన్ని నిర్దిష్ట నియమాలతో దేశంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రాధాన్యత రంగాల్లోకి అనుమతి ఇచ్చింది.
* సాంకేతిక పరిజ్ఞానం దిగుమతి కోటి రూపాయలకు మించకూడదు.


4. ప్రభుత్వరంగ విధానం
* ప్రభుత్వరంగ ప్రాధాన్యాన్ని క్రమంగా తగ్గించడం.
* ఖాయిలాపడిన ప్రభుత్వ రంగ సంస్థలను BIFR (పరిశ్రమల ఆర్థిక పునర్నిర్మాణ బోర్డు)కు నివేదించడం.
* ప్రభుత్వరంగ సంస్థ బోర్డుల్లో వృత్తి నిపుణులను నియమించడం.
* ఖాయిలాపడిన పరిశ్రమల్లోని కార్మికుల భద్రతకు జాతీయ పునరుద్ధరణ నిధి (NRF)ని 1992లో ఏర్పాటు చేశారు. 2000లో రద్దు చేశారు.


5. ప్రభుత్వ ప్రాధాన్యాన్ని తగ్గించడం
* 1956 పారిశ్రామిక తీర్మానంలో ప్రభుత్వ రంగానికి 17 పరిశ్రమలను కేటాయించగా 1991 తీర్మానంలో 8 పరిశ్రమలను కేటాయించారు.

 

6. MRTP (Monopolies & Restrictive Trade Practise)కి సవరణలు
* MRTP - 1969 చట్టం పారిశ్రామిక సంస్థల ఏకస్వామ్య అధికారాన్ని నియంత్రించింది.
* MRTP చట్టం దత్ కమిటీ సిఫార్సుల వల్ల ఏర్పడింది.
* రూ.100 కోట్లు దాటిన సంస్థల విస్తరణ, విలీనం, స్థల మార్పిడి లాంటి అంశాలకు సంబంధించి నిబంధనలను తొలగించింది.
* 2002లో రాఘవన్ కమిటీ సిఫార్సుల మేరకు MRTPని రద్దు చేసి దాని స్థానంలో పోటీ చట్టాన్ని (Competition Act) ప్రకటించి ప్రైవేట్ రంగ వృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు.
* MRTP కమిషన్ (1970) స్థానంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2002లో ఏర్పాటైంది.


7. లైసెన్సుల విస్తృత ఏకీకరణ (Broad Bonding)
* లైసెన్సుల విస్తృత ఏకీకరణను 1956లో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం కొత్త యంత్రాలకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదు.
*  దగ్గరి పోలికలు ఉన్న ఉత్పత్తులకు వేర్వేరు లైసెన్సులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకే లైసెన్సు తీసుకోవచ్చు.


8. విస్తృత పరిశ్రమల నిర్వచనం
* పరిశ్రమల నిర్వచన పరిధిని పెంచి వ్యాపార సంస్థలను, సేవలను దీని కిందికి తీసుకువచ్చారు.

 

9. చిన్న, సూక్ష్మ గ్రామీణ పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీ
* ఈ పరిశ్రమల కోసం 1991 ఆగస్టులో ప్రత్యేక విధానాన్ని ప్రకటించారు.
* సూక్ష్మ పరిశ్రమల పెట్టుబడిని 2 నుంచి 5 లక్షల రూపాయలకు పెంచారు.


10. లఘు పరిశ్రమల్లో పెట్టుబడి
      నూతన ఆర్థిక తీర్మానం ప్రకారం లఘు పరిశ్రమల్లో 10 లక్షల రూపాయల పరిమితిని విధించారు.


11. పారిశ్రామిక స్థల నిర్ణయంపై ఆంక్షల రద్దు
* 10 లక్షల జనాభా మించని ప్రాంతాల్లో లైసెన్స్ అవసరం లేని ఎలాంటి పరిశ్రమ అయినా ప్రభుత్వ అనుమతి లేకుండా స్థాపించవచ్చు.
* 10 లక్షల జనాభా మించిన ప్రాంతాల్లో 25 కి.మీ. దూరంలో కాలుష్య రహిత పరిశ్రమలను స్థాపించుకోవచ్చు.
* పై చర్యల ద్వారా ప్రభుత్వ సంస్థల సమర్థతను పెంచుతూ... ప్రైవేట్, విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ సుస్థిర, సత్వర పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేశారు.

 

భారత పారిశ్రామిక రంగం - ప్రధాన పరిశ్రమలు
* భారతదేశంలో ప్రధాన, భారీ పరిశ్రమలను స్వాతంత్య్రానికి పూర్వమే స్థాపించారు. వాటిలో ముఖ్యమైనవి

పరిశ్రమ

స్థాపన

స్థలం

పేపర్

1812

సేరంపూర్ (పశ్చిమ బెంగాల్)

పత్తి

1818

కలకత్తా

జనపనార

1855

రిష్రా (పశ్చిమ బెంగాల్)

చక్కెర

1903

బీహార్

సిమెంట్

1904

మద్రాస్

ఇనుము - ఉక్కు

1907

జంషెడ్‌పూర్ (బీహార్)

ఆధునిక వస్త్ర పరిశ్రమ

1854

బొంబాయి

 

1. ఇనుము - ఉక్కు పరిశ్రమ
* భారత్‌లో మొదటి దుక్క ఇనుమును ఉత్పత్తి చేసే పరిశ్రమను 1870లో కుల్టి (పశ్చిమ బెంగాల్) వద్ద ఏర్పాటు చేశారు.
* భారీ తరహాలో ప్రారంభమైన మొదటి సంస్థ - TISCO (1907 - జంషెడ్‌పూర్, బీహార్)
* దేశంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో స్థాపించిన తొలి కర్మాగారం - VISCO - విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ [(VISCO - 1923 - భద్రావతి, కర్ణాటక)]
* 2వ ప్రణాళిక భారీ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చింది.

ప్రణాళిక

ఇనుము - ఉక్కు కర్మాగారం

సహకరించిన దేశం

2

రూర్కెలా (ఒరిస్సా)
భిలాయ్ (చత్తీస్‌గఢ్)
దుర్గాపూర్ (పశ్చిమ బెంగాల్)

పశ్చిమ జర్మనీ
రష్యా
ఇంగ్లండ్

3

బొకారో (జార్ఖండ్)
(ప్రభుత్వరంగంలో పెద్దది)

రష్యా

4

విశాఖ (ఆంధ్రప్రదేశ్)
సేలం (తమిళనాడు)
విజయనగర్ (కర్ణాటక)

రష్యా
రష్యా
రష్యా

* 2005లో జాతీయ ఉక్కు విధానాన్ని ప్రకటించారు.
* ప్రభుత్వం ఉక్కు కర్మాగారాల నిర్వహణకు 1974లో Steel Authority of India (SAIL)ను స్థాపించింది.
* హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ (1954), బొకారో స్టీల్ (1964) విలీనం ద్వారా సెయిల్ ఏర్పాటైంది.

 

2. వస్త్ర పరిశ్రమ
* భారత్‌లో అతి పురాతన పరిశ్రమ - చేనేత పరిశ్రమ.
* వ్యవసాయం తర్వాత అధిక ఉపాధిని అందించే పరిశ్రమ.
* 1818లో పోర్ట్‌గ్లాస్టర్ (పశ్చిమ బెంగాల్)లో స్థాపించిన తొలి పరిశ్రమ మూత పడింది.
* రెండో పరిశ్రమను 1854లో బొంబాయి వద్ద స్థాపించారు. ఇది ఆధునికమైంది.
వస్త్ర పరిశ్రమలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు: మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు.
* నేషనల్ టెక్స్‌టైల్ కార్పొరేషన్‌ను 1968లో స్థాపించారు.
* వస్త్ర రంగం/ చేనేతపై నియమించిన కమిటీ - సత్యం కమిటీ.
* సత్యం కమిటీ సిఫార్సులపై 2000 సంవత్సరంలో జాతీయ చేనేత విధానాన్ని ప్రకటించారు.
* దేశంలో టెక్స్‌టైల్ ఆధునికీకరణకు 1986లో ఒక నిధిని ఏర్పాటు చేశారు. రూ.750 కోట్లతో ఐడీబీఐ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు.
* మొదటి అపెరల్ పార్కు‌ను తిరువురూలో ఏర్పాటు చేశారు.

 

3. జనపనార పరిశ్రమ
* దేశంలో మొదటి జనపనార మిల్లును 1855లో రిష్రా (పశ్చిమ బెంగాల్) వద్ద స్థాపించారు.
* భారత్ జనుము ఉత్పత్తిలో మొదటి స్థానం, ఎగుమతుల్లో రెండో స్థానంలో ఉంది. జనపనార పరిశ్రమ పశ్చిమ బెంగాల్‌లో ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది.
* ఎక్కువగా ఖాయిలా పడిన పరిశ్రమ కాబట్టి 1987లో జూట్ ప్యాకింగ్ మెటీరియల్ చట్టాన్ని చేశారు.
* దేశంలో తొలి జాతీయ జనుము విధానాన్ని 2005 నుంచి అమలు చేస్తున్నారు.


4. పంచదార పరిశ్రమ
* దేశంలో మొదటి పంచదార పరిశ్రమను 1903లో బీహార్‌లో స్థాపించారు.
* పంచదార పరిశ్రమలన్నీ ఎక్కువగా సహకార రంగంలో ఉన్నాయి.
* అత్యధిక పరిశ్రమలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నాయి.
* వస్త్ర పరిశ్రమ తర్వాత రెండో అతి పెద్ద పరిశ్రమ.
* చక్కెర వినియోగంలో భారత్ మొదటి స్థానంలోనూ, ఉత్పత్తిలో రెండో స్థానంలోనూ ఉంది.
* చక్కెర రంగంపై ఏర్పాటు చేసిన కమిటీ - మహాజన్ కమిటీ.
* చక్కెర రంగంలో ద్వంద్వ ధరల విధానం 1979 నుంచి అమలు.
* చక్కెర అభివృద్ధి నిధిని 1982లో ఏర్పాటు చేశారు.
* ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ షుగర్‌ను కాన్పుర్ (ఉత్తరప్రదేశ్)లో ఏర్పాటు చేశారు.
* 1998లో చక్కెర పరిశ్రమకు లైసెన్సింగ్ విధానాన్ని తొలగించారు (డీలైసెన్సింగ్).
* 2013, ఏప్రిల్ 4 నుంచి చక్కెర లెవీ విధానాన్ని తొలగించారు.


పారిశ్రామిక రంగం - వెనుకబాటుతనం
        భారత్‌లో సహజ మానవ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ అనేక కారణాల వల్ల పారిశ్రామిక రంగం తక్కువ ప్రగతిని సాధించింది. దీనికి ప్రధాన కారణాలు
   1. ఉత్పాదక సామర్థ్యాన్ని వినియోగించుకోకపోవడం
   2. నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు
   3. తక్కువ మౌలిక సదుపాయాల లభ్యత
   4. ప్రాంతీయ అసమానతలు
   5. తక్కువ సాంకేతిక పరిజ్ఞానం


ఆర్థిక గణన - 2005
       ఆర్థిక గణన (ఎకనామిక్ సెన్సస్)ను పరిశ్రమల సంఖ్యను, ఉద్యోగిత, సంస్థల వృద్ధి రేటును లెక్కించడానికి నిర్వహిస్తారు.
* దీని ఆధారంగా జాతీయ వ్యాపార పట్టిక (National Bussiness Register) ను తయారుచేస్తారు.
* మొదటి ఆర్థిక గణనను 1977లో చేపట్టారు.
* తర్వాత వరుసగా 1980, 1990, 1998, 2005లలో తయారు చేశారు.
* 6వ గణనను 2011లో ప్రారంభించారు.


2005 గణన ముఖ్యాంశాలు:

1. ఉపాధి కల్పనలో మొదటి స్థానం -
1) మహారాష్ట్ర
2) తమిళనాడు
3) పశ్చిమ బెంగాల్
4) ఉత్తరప్రదేశ్

 

2. సంస్థల వృద్ధి రేటు -
1. మిజోరాం
2. కేరళ
3. త్రిపుర

 

నష్టదాయక సంస్థలు (Sick Industries)
* నష్టదాయక సంస్థలనే ఖాయిలాపడిన సంస్థలు అంటారు.
* కంపెనీ సవరణల చట్టం ప్రకారం రుణదాత అడిగిన 9 నెలల్లోపు రుణం చెల్లించలేని సంస్థను ఖాయిలాపడిన సంస్థగా చెప్పవచ్చు.
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం 'ఒక సంస్థ నిరంతరాయంగా మిగులు సృష్టించడంలో వైఫల్యం చెంది, తన ఉనికి కోసం బహిర్గత నిధులపై ఆధారపడితే అది ఖాయిలాపడిన పరిశ్రమ'.
* ఒక సంస్థ లేదా పరిశ్రమలోని నష్టాలు దాని నికర ఆస్తుల విలువ దాటితే అది నష్టదాయక/ ఖాయిలాపడిన సంస్థ.


పరిశ్రమలు ఖాయిలా పడటానికి కారణాలు
* పరిశ్రమల ఖాయిలాకు ప్రధానంగా అంతర్గత, బహిర్గత కారణాలు ఉంటాయి.

అంతర్గత కారకాలు:
     1. అసమర్థ యజమాన్య నిర్వహణ
     2. నిర్ణయ విధానంలో లోపాలు
     3. ఆర్థిక/ విత్త సమస్యలు
     4. ఆధునికీకరణ లేకపోవడం
     5. కార్మిక సంబంధ సమస్యలు
     6. సాంకేతిక పరిజ్ఞాన అల్ప వినియోగం
     7. ప్రణాళిక వైఫల్యాలు

బహిర్గత కారకాలు
      1. అవస్థాపన సౌకర్యాల కొరత
      2. డిమాండ్ లేమి
      3. విద్యుత్ లభ్యత కొరత
      4. పరపతి సౌకర్యాల కొరత
      5. ప్రభుత్వ విధానం
      6. విదేశీ, భారీ సంస్థల పోటీ
      7. ఉత్పత్తి కారకాల లభ్యతలో కొరత


ఖాయిలా - ప్రభావాలు
      1. సహజ, మానవ వనరుల వృథా
      2. ఉత్పత్తి దెబ్బతినడం
      3. పారిశ్రామిక అశాంతి
      4. రుణ సంస్థలకు నష్టాలు
      5. పెట్టుబడిదారులకు నష్టాలు
      6. ప్రభుత్వ రాబడులు తగ్గడం

 

ఖాయిల సమస్యలు - నివారణ
1. ఖాయిలాపడిన పరిశ్రమల విత్త సహాయానికి 1971లో IRCI (Industrial Reconstruction Corporation of India) ను ఏర్పాటు చేశారు.
* IRCI 1985లో IRBI (Industrial Reconstruction Bank of India) గా మార్పు చెందింది.
* 1997లో IRBIని IIBI (Industrial Investment Bank of India) గా మార్చారు.
2. ఖాయిలా పరిశ్రమల కంపెనీల చట్టం (SICA - Sick Industries Companies Act)
* SICAను 1985లో తివారీ కమిటీ సిఫార్సుపై ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా 1987లో BIFR (Board for Industrial and Financial Reconstruction)ను ఏర్పాటు చేశారు.
3. ఉద్యోగులను తగ్గించేందుకు ఉద్దేశించిన వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (VRS)ను 1998లో ప్రవేశపెట్టారు. దీన్ని 'గోల్డెన్ షేక్‌హ్యాండ్' అంటారు.
4. పరిశ్రమలు వైదొలిగేందుకు 1999లో ఎగ్టిట్ పాలసీని ప్రారంభించారు.
5. ఖాయిలాపడిన పరిశ్రమల ఉద్యోగుల శిక్షణ, పునరావాసానికి 1992లో జాతీయ పునరుద్ధరణ నిధి (నేషనల్ రెన్యువల్ ఫండ్)ను ప్రారంభించారు. దీన్ని 2000లో రద్దు చేశారు.
6. ఇరాడీ ప్యానెల్ సిఫార్సుల మేరకు SICA స్థానంలో 2002లో కంపెనీ చట్టాన్ని ప్రారంభించారు.
7. BIFR స్థానంలో జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT)ను ఏర్పాటు చేశారు.

 

పారిశ్రామిక రంగం - సేవలు

 

* భారత్‌లో ప్రణాళికా అభివృద్ధి విభాగాన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం - 1944
* భారత్‌లో తొలి పారిశ్రామిక తీర్మానాన్ని చేసిన సంవత్సరం - 1948, ఏప్రిల్ 6
* స్వాతంత్య్రానంతరం తొలి పారిశ్రామిక తీర్మానాన్ని చేసిన సంవత్సరం - 1948
* మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చిన పారిశ్రామిక తీర్మానం - 1948
* 1948 పారిశ్రామిక తీర్మానం పరిశ్రమలను ఎన్ని వర్గాలుగా విభజించింది - 4 వర్గాలు
* 1956 పారిశ్రామిక తీర్మానాన్ని ప్రకటించిన సంవత్సరం - 1956, ఏప్రిల్ 30
* 'సామ్యవాద సమాజ స్థాపన'కు ప్రాధాన్యం ఇచ్చిన పారిశ్రామిక తీర్మానం - 1956
* 'ఆర్థిక రాజ్యాంగం'గా పేరొందిన పారిశ్రామిక తీర్మానం - 1956
* పరిశ్రమల అభివృద్ధి - క్రమబద్ధీకరణ చట్టాన్ని చేసిన సంవత్సరం - 1951
* లైసెన్సింగ్ విధానాల లోపాల పరిశీలనకు ఏర్పాటుచేసిన కమిటీ - హజారే కమిటీ
* పారిశ్రామిక తీర్మానం - 1977ను ఏ ప్రభుత్వం ప్రకటించింది - జనతా ప్రభుత్వం
* పారిశ్రామిక తీర్మానం - 1977లో ప్రాధాన్య రంగం - చిన్న పరిశ్రమలు
* జిల్లా పారిశ్రామిక కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించిన తీర్మానం - 1977

* వెనుకబడిన జిల్లాల్లో పరిశ్రమలను అభివృద్ధి చేయడం అనేది దేనికి సంబంధించిన భావన - ఆర్థిక ఫెడరలిజం
* 'ఆర్థిక ఫెడరలిజం' అనే భావనను తెలిపిన పారిశ్రామిక తీర్మానం - 1980
* మెదటిసారిగా పర్యావరణ సమతౌల్యాన్ని ప్రస్తావించిన తీర్మానం - 1980
* 'భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్' పరిశ్రమ నిర్మాణం ఏ ప్రణాళికలో పూర్తయ్యింది - మూడో ప్రణాళిక
* 'సంయుక్త రంగం' ఏర్పాటు చేసిన పారిశ్రామిక తీర్మానం ఏ సంవత్సరంలోది? - 1970
* 'న్యూక్లియస్ సంస్థలు' అనే భావనను ప్రవేశపెట్టిన తీర్మానం - 1980
* లైసెన్సుల విస్తృత ఏకీకరణ (Broad Bonding) పథకాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం - 1984
* పారిశ్రామిక విధానం - 1991ని ప్రవేశపెట్టిన సంవత్సరం - 1991, జులై 24
* విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టాన్ని (FERA) చేసిన సంవత్సరం - 1973
* FERA ను సవరించి విదేశీమారక ద్రవ్య నిర్వహణ చట్టాన్ని (FEMA) ప్రవేశపెట్టిన సంవత్సరం - 1998
* 'పారిశ్రామిక, వ్యవసాయ, విత్త వాణిజ్య సంస్థల్లో ప్రభుత్వ యాజమాన్యం, నిర్వహణే ప్రభుత్వ రంగం' అని అన్నది - హెన్సన్
* ప్రభుత్వ శాఖ అధీనంలో నిర్వహించే సంస్థలు - శాఖాపరమైన సంస్థలు (Departmental Undertaking)
* శాఖాపరమైన సంస్థలకు ఉదాహరణలు - రైల్వేలు, పోస్టల్

* ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేసే సంస్థలు - ప్రభుత్వ కార్పొరేషన్లు
* ప్రభుత్వ కార్పొరేషన్లకు ఉదాహరణలు - LIC, FCI, IOC, STC మొదలైనవి
* కంపెనీల చట్టం నిబంధనల మేరకు జాయింట్ స్టాక్ కంపెనీ పద్ధతిలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంస్థలను ప్రభుత్వ కంపెనీలు అంటారు.
* ప్రభుత్వ కంపెనీలకు ఉదాహరణ - HMT, హిందుస్థాన్ షిప్‌యార్డ్, ఇండియన్ టెలిఫోన్ పరిశ్రమ
* 1951లో ప్రభుత్వ రంగ సంస్థల సంఖ్య - 5
* 1951లో ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడి విలువ - రూ.29 కోట్లు
* స్థూల స్థిర మూలధన కల్పన (GFCF) అంటే ఏమిటి?
జ: CGO ఉత్పత్తి మదింపు ప్రకారం, నిర్మాణం, యంత్రాలు, పరికరాల కింద మదింపు చేసిన మూలధన వస్తువులన్నింటినీ కలిపితే వచ్చేది.

పారిశ్రామిక రంగం - ఆర్థిక సంస్కరణలు
*
 ఆర్థిక సంస్కరణల్లో ప్రధాన అంశాలు - సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ
* ప్రభుత్వ నిబంధనలు, నియంత్రణలను సులభతరం చేయడం అనే విధానం - సరళీకరణ (Liberalisation)
* ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచే అంశం - ప్రైవేటీకరణ (Privatisation)

* ప్రభుత్వరంగ సంబంధిత సంస్థల నియంత్రణ, నిర్వహణలను ప్రైవేట్ రంగానికి అప్పగించే విధానం - ప్రైవేటీకరణ
* ప్రభుత్వ రంగానికి కేటాయించిన రంగాల్లోకి ప్రైవేట్ రంగాన్ని అనుమతించే ప్రక్రియ - ప్రైవేటీకరణ
* ఒక దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలతో కలిపి వేయడం - ప్రపంచీకరణ (Globalisation)
* ఇంగ్లండ్‌లో ఆర్థిక సంస్కరణలను ప్రారంభించింది - మార్గరెట్ థాచర్
* అమెరికాలో ఆర్థిక సంస్కరణలను ప్రారంభించింది - రోనాల్డ్ రీగన్
* భారత్‌లో ఆర్థిక సంస్కరణలను ప్రారంభించింది - పి.వి.నరసింహారావు
* ప్రైవేటీకరణ అనే పదాన్ని మొదటగా ప్రస్తావించింది - పీటర్ డ్రక్కర్
* ప్రైవేటీకరణ అనే పదాన్ని మొదటిసారిగా ఏ గ్రంథంలో ప్రస్తావించారు? - The Age of Discontinuity
* 'The Age of Discontinuity' అనే గ్రంథ రచయిత - పీటర్ డ్రక్కర్
* మన దేశంలో కొన్ని రంగాల్లో ప్రైవేటీకరణ చేసిన సంవత్సరం - 1980
* భారత్‌లో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన సంవత్సరం - 1991, జులై 24
* నూతన పారిశ్రామిక విధానం చేపట్టిన సంవత్సరం - 1991, జులై 24
* నూతన ఆర్థిక విధానం లక్ష్యాలు - ఆర్థిక వృద్ధిరేటు పెంపు, ఆదాయ, ప్రాంతీయ అసమానతలు తగ్గించడం, సంపూర్ణ ఉద్యోగిత, పేదరికం తగ్గింపు

* 'ఆర్థిక కార్యకలాపాలు జాతుల రాజకీయ సరిహద్దులు దాటి విస్తరించడమే ప్రపంచీకరణ' అని తెలిపింది - దీపక్ నాయర్
* ప్రపంచ దేశాల మధ్య ఏయే అంశాల్లో స్వేచ్ఛా ప్రవాహం ఉంటే దాన్ని ప్రపంచీకరణ అంటారు?
జ: 1) వస్తుసేవలు 2) మూలధనం 3) శ్రామికులు 4) సాంకేతిక పరిజ్ఞానం

* ప్రపంచీకరణ వల్ల లాభాలు ఏవి?
జ: విదేశీ పెట్టుబడుల లభ్యత, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ల విస్తరణ, నాణ్యమైన ఉత్పత్తులు, ఉపాధి, అభివృద్ధి

* భారత్‌లో ప్రపంచీకరణకు తీసుకున్న చర్యలు
1) రూపాయి విలువ సవరణ 2) దిగుమతుల సరళీకరణ 3) విదేశీ పెట్టుబడుల ఆకర్షణ

* సరళీకృత మారక ద్రవ్య యాజమాన్య వ్యవస్థ (LERMS) ను ప్రవేశపెట్టింది - 1992 - 93  

 

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌