• facebook
  • whatsapp
  • telegram

లోహ శాస్త్రం

* భూమి పొరల లోపల లోహాన్ని సమ్మేళన రూపంలో లేదా సహజస్థితిలో కలిగి ఉండే పదార్థాలను ఖనిజాలు అంటారు. 
* ఖనిజాల శుద్ధి, వాటి నుంచి శుద్ధ లోహాన్ని సంగ్రహించడం, మిశ్రమ లోహాలను ఏర్పర్చడం గురించి లోహ శాస్త్రంలో అధ్యయనం చేస్తారు.
* బంగారం, వెండి, ప్లాటినం వంటి నోబుల్ లోహాలు ప్రకృతిలో స్వేచ్ఛా స్థితిలో లభిస్తాయి.
* ఖనిజాల్లో ఉండే ఇసుక, బంకమట్టి, మట్టిరాళ్లు వంటి ఫలితాలను గ్యాంగ్ అంటారు. ఈ మలినాలను తొలగించడానికి లోహ సంగ్రహణంలో వాడే పదార్థాన్ని ద్రవకారి అంటారు.
* ఒక లోహం లేదా దాని మిశ్రమ అంశాలు ఏ పదార్థం నుంచి లభిస్తాయో దాన్ని 'ముడిధాతువు' అంటారు.

* ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే లోహం ప్లాటినం.
* భూమిలో ఎక్కువగా ఉన్న లోహం అల్యూమినియం.
* బంగారం, వెండి, రాగిని 'నాణెపు లోహాలు' అంటారు.
* బంగారం, టైటానియం, ప్లాటినం 'అద్భుత లోహాలు'.
ఇనుము లోహ సంగ్రహణం
* ఇనుమును మాగ్నటైట్, హెమటైట్, లియోనైట్ వంటి ధాతువుల నుంచి సంగ్రహిస్తారు. ఈ లోహ సంగ్రహణంలో సిలికా మలినాలను (గ్యాంగ్) తొలగించడానికి సున్నపురాయిని ద్రవకారికిగా, కోక్‌ను క్షయకారిణిగా వాడతారు.
* వీటిని కొలిమిలోకి పంపి 400oC నుంచి 600oC వరకు వేడి చేస్తారు.
* 750oC వద్ద తయారైన ఇనుమును స్పాంజి ఇనుము అంటారు.
* 1600oC వద్ద దుక్క ఇనుము (Pig Iron or Cast Iron) ఏర్పడుతుంది. ఈ ఇనుములో 4% కార్బన్ ఉంటుంది.
* దీన్ని రివర్బరేటరీ కొలిమిలో శుద్ధి చేసి చేత ఇనుము తయారు చేస్తారు.
* ఇది ఇనుము రూపాలన్నింటిలో శుద్ధమైంది.
* దీనిలో కార్బన్ 0.02% ఉంటుంది.
* స్టెయిన్‌లెస్ స్టీల్‌లో ఇనుము, క్రోమియం, నికెల్ కార్బన్ ఉంటాయి.
* స్టీల్‌లో 1.1% నుంచి 1.5% కార్బన్ ఉంటుంది.

లోహాలు తుప్పు పట్టకుండా నివారించే పద్ధతులు
     1. గాల్వనైజింగ్
     2. ఎలక్ట్రోప్లేటింగ్
     3. మిశ్రమ లోహాన్ని ఏర్పర్చడం
* ఇనుము లోహంపై జింకు లోహాన్ని పలచగా పూత వేయడాన్ని గాల్వనైజేషన్ అంటారు.
* ఇనుము లోహంపై తగరం పూత వేయడాన్ని టిన్నింగ్ అంటారు.
* చవక లోహం ఉపరితలంపై ఖరీదైన లోహం పూత వేయడాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. దీనిలో చవక లోహాన్ని కాథోడ్‌గా, శుద్ధ లోహాపు కడ్డీని ఆనోడ్‌గా ఉపయోగిస్తారు.

* పాదరసం లోహాలతో ఏర్పరిచే మిశ్రమ లోహాలను అమాల్గమ్‌లు అంటారు.
* ఇనుము, ప్లాటినమ్ అమాల్గమ్‌లను ఏర్పర్చవు.
ఉదా: Na - Hg, Zn - Hg
బంగారం
* లోహాలన్నింటిలో బంగారానికి రేకులుగా సాగే గుణం ఎక్కువగా ఉంటుంది.
 

* శుద్ధమైన బంగారం ఆభరణాల తయారీకి పనికిరాదు. దీనిలో గట్టిదనం కోసం రాగిని కలుపుతారు.
* 24, 22 క్యారెట్ల బంగారంలో 2 క్యారెట్ల రాగి కలిసి ఉంటుంది.
* శుద్ధ బంగారం పరిశుద్ధత 100%

* లోహానికి ఖనిజాలు ఒకటి కంటే ఎక్కువగా ఉంటాయి. ఏ ఖనిజం నుంచి లోహాన్ని లాభసాటిగా సంగ్రహిస్తారో దాన్ని ఆ లోహధాతువు అంటారు.
గాల్వనైజేషన్
* ఇనుము తుప్పు పట్టకుండా దానిపై జింకు పూత పూయడాన్ని గాల్వనైజేషన్ అంటారు.
* రెండు, అంతకంటే ఎక్కువ లోహాలు కలసిపోయి ఏర్పడేదాన్ని మిశ్రమలోహం లేదా ఎల్లాయ్ అంటారు.
* సోల్డరింగ్ రాడ్‌లో తగరం + సీసం (Sn + Pb) ఉంటాయి.
* ఇనుము + మాంగనీసు + కార్బన్ (Fe + Mn + C) = స్టీల్ ఏర్పడుతుంది.
* థర్మైట్ (Thermite)విధానాన్ని కనుక్కున్నది - హాన్స్ గోల్డ్‌ష్మిట్
* దుక్క ఇనుములో 2 నుంచి 4.5% కార్బన్ ఉంటుంది.
* చేత ఇనుములో 0.25% కంటే తక్కువ కార్బన్ ఉంటుంది.
* ఉక్కులో 0.5 నుంచి 1.5% కార్బన్ ఉంటుంది.
ముఖ్యమైన సమాచారం
* అన్నిటికంటే తేలికైన లోహం - లిథియం

* భూమి పొరల్లో ఎక్కువగా లభించేది - అల్యూమినియం
* అత్యధిక విద్యుత్, ఉష్ణనామకత ఉన్న లోహం - వెండి

* వేడిచేసినప్పుడు సంకోచించే లోహం - జిర్కోనియం
* మానవ శరీరంలో అతి తక్కువగా ఉండే లోహం - మాంగనీస్
* రక్తంలోని హిమోగ్లోబిన్‌లో ఉండేది - ఇనుము
* నూనెల హైడ్రోజనీకరణంలో వాడే ఉత్ప్రేరకం - నికెల్
* విటమిన్ బి - 12లో ఉండే లోహం - కోబాల్ట్
మిశ్రమలోహ సంఘటనం
* ఇత్తడి  Cu (రాగి) + Zn (జింక్)
* కంచు  Cu (రాగి) + Sn (తగరం)
* బెల్‌మెటల్  Cu (రాగి) + Sn (తగరం)
* స్టీలు  Ze (ఫెర్రస్) + C (కార్బన్) + Mn (మాంగనీస్)
* స్టెయిన్‌లెస్ స్టీల్  Fe (ఫెర్రస్) + Cr (క్రోమియం) + Ni (నికెల్)
* నిక్రోమ్  Ni (నికెల్) + Cr (క్రోమియం) + Mn (మాంగనీస్) + Fe (ఫెర్రస్)
* స్టెల్లిన్  Cr (క్రోమియం) + Ni (నికెల్) + W (వోల్ప్రమ్)
* రోల్డ్ గోల్డ్  Cu (రాగి) + Al (అల్యూమినియం)

వ్యవసాయ సంబంధ రసాయన శాస్త్రం
* వ్యవసాయ రంగంలో రసాయనాల పాత్ర చాలా ముఖ్యమైంది. ఇవి మొక్కలకు కావల్సిన ఎరువులను, క్రిమి సంహారక మందులను తయారు చేయడానికి ఉపయోగపడతాయి. ఈ విధంగా అనేక రకాలుగా ఉపయోగపడే ఈ రసాయనాలను వ్యవసాయ రసాయనాలు (Agrochemicals) అంటారు.
రసాయనాల రకాలు
1. క్రిమి సంహారక మందులు - డీడీటీ, మలథియాన్‌లు
2. కీటక నాశన మందులు - పంటలను నాశనం చేసే కీటకాలను చంపుతుంది.
3. హెర్బి సైడులు - వీటిని సాధారణంగా కలుపు మొక్కలను నాశనం చేయడానికి ఉపయోగిస్తారు.
4. ఫంగి సైడులు - పంటలపై పెరిగే పూతికాహార లేదా పరాన్నజీవి శిలీంధ్రాలను నియంత్రించడానికి ఉపయోగిస్తారు.
5. నిమాటి సైడులు - మొక్కల వేరు వ్యవస్థకు హాని తలపెడతాయి. ఇటువంటి పురుగులను నిమాటి సైడులు ఉపయోగించి నాశనం చేయవచ్చు.
ఎరువులు
* సాధారణంగా మొక్కలు పెరగడానికి నీరు, సూర్యరశ్మి ఎంత అవసరమో నైట్రోజన్, భాస్వరం, కాల్షియం, పొటాషియం ఖనిజాలు కూడా అంతే అవసరం. భూమి నుంచి గ్రహిస్తాయి. కొంతకాలం పోయాక, హరించిన తర్వాత భూమిని సారవంతం చేసేందుకు ఉపయోగించే వాటిని ఎరువులు లేదా ఫెర్టిలైజర్స్ అంటారు.
      1. సహజ ఎరువు
      2. కృత్రిమ ఎరువు

డ్రగ్స్ (రసాయన మందులు)
* ఎనాల్జిసిక్ - బాధను తగ్గించేవి
ఉదా: ఆస్ట్రిన్
* యాంటి పైరెటిక్స్ - జ్వరాన్ని తగ్గించేవి
ఉదా: పారాసిటమాల్
* నార్కొటిక్స్ - అపస్మారక స్థితిని, నిద్రను కలిగించేవి
ఉదా: హెరాయిన్ మార్ఫిన్
* ఫుడ్ ఎడెటివ్స్ - ఆహార పదార్థాలకు రంగు, రుచి, వాసన కలిగించే కృత్రిమ రసాయనాలు
ఉదా: వెనిలిన్ (వెనిల్లా ఫ్లేవర్ కోసం కలుపుతారు).
ఎరువులు
* యూరియా (నత్రజని అధికంగా ఉండే ఎరువు)
* దీనిలో నైట్రోజన్ 34% ఉంటుంది.
* పొటాషియం అధికంగా ఉన్న ఎరువు - యూరియేట్ ఆఫ్ పొటాష్ (పొటాషియం క్లోరైడ్)
* అమ్మోనియం అధికంగా ఉండే ఎరువు - ఫ్యాక్టంపాస్ (అమ్మోనియం కార్బొనేట్) - (NH2CO)
* ఛౌడ భూములను సారవంతం చేసేందుకు జిప్సం కలుపుతారు.
* దీని ఫార్ములా CaSO2 2 H2O.

ఆహార సంబంధిత రసాయన శాస్త్రం (Chemistry of Food)
* మనం తినే ఆహారంలో ఉండే రసాయనాలు జీవనానికి చాలా అత్యవసరం. ఇటువంటి రసాయన గ్రూపులైన ప్రొటీన్లు, ఖనిజ లవణాలు, ఫైబర్‌లు, కొవ్వులు, విటమిన్‌లు, పిండి పదార్థాలు, నీరు మంచి సమతౌల్య ఆహారంలోని పదార్థాలు
టెక్నాలజీ:
* ఆహారానికి రుచి, రంగు, వాసన చేకూరేందుకు అదనంగా వాడే పదార్థాల వల్ల క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయని ఇటీవల కనుక్కున్నారు.
* ఎక్కువ తియ్యగా ఉండటానికి సాకరిన్ వాడతారు. వెనిల్లన్ అనే సుగంధాన్ని మంచి వాసన కోసం ఐస్‌క్రీమ్, కేకుల్లోనూ వాడుతారు.
* చేపలను బయట గాలిలో విడిచిపెడితే అవి త్వరగా పాడైపోవటానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే హానికరమైన సూక్ష్మ జీవులు వీటి మీద పెరగడం వల్ల అవి తొందరగా పాడవుతాయి.
టీ (Tea):
* ఇది నాడీ వ్యవస్థ, కండర వ్యవస్థ క్రియాశీలతను పెంచుతుంది.
* దీనివల్ల అజీర్ణం, గుండెదడ, నరాల బలహీనత వ్యాధులు సంభవిస్తాయి.
కాఫీ (Coffee)
* ఆహారం తర్వాత కాఫీ తాగితే ఆహారం త్వరగా జీర్ణం అయ్యేందుకు దోహదపడుతుంది.
* కెఫిన్ అనే విషపదార్ధం ఉంటుంది.

ఆల్కహాలు (Alcohal)
* ఇది నాడీ వ్యవస్థ చర్యా శీలతను పెంచుతుంది.
* జీర్ణక్రియను అధికం చేస్తుంది.
కొన్ని రకాల విషపదార్థాలు
* బంగాళదుంప - సోలసిస్ - కడుపు నొప్పి వస్తుంది.
* జున్ను - టరామిన్ - పల్స్‌రేటు ఎక్కువ అవుతుంది.
రసాయన సాధారణ నామాలు
    1. సోడియం హైడ్రాక్సైడ్ - కాస్టిక్ సోడా
    2. సోడియం కార్బొనేట్ - బట్టలసోడా / వాషింగ్‌సోడా
    3. సోడియం బై కార్బొనేట్ - వంటసోడా / తినేసోడా /బేకింగ్ సోడా
    4. సోడియం సల్ఫేట్ - సాల్ట్‌కేక్
    5. సోడియం నైట్రేట్ - చిలీ సాల్ట్ పీటర్
    6. పొటాషియం నైట్రేట్ - సాల్ట్ పీటర్
    7. సోడియం థయో సల్ఫేట్ - హైపోద్రావణం
    8. పొటాషియం టెట్రా బోరేట్ - బోరాక్స్ ద్రావణం

    9. పొటాషియం అల్యూమినో సల్ఫేట్ - ఆలమ్/పటిక
    10. కాల్షియం సల్ఫేట్ - జిప్సం
    11. ఆర్ద్ర కాల్షియం సల్ఫేట్ - ప్లాస్టర్ ఆఫ్ పారిస్
    12. కాల్షియం ఆక్సైడ్ - పొడిసున్నం/లైమ్
    13. కాల్షియం కార్బొనేట్ - సున్నపురాయి/లైమ్‌స్టోన్
    14. కాల్షియం హైడ్రాక్సైడ్ - తడిసున్నం/లైమ్ వాటర్
    15. కాల్షియం హైపో క్లోరైడ్ - సాధారణ విరంజని
    16. పాలిటెట్రా ఫ్లోరోఈథేన్ - టెఫ్లాన్
    17. సోడియం కార్బొనేట్ - సోడాయాష్
    18. సోడియం క్లోరైడ్ - సాధారణ ఉప్పు
    19. సెడెటిల్స్ - ఔషధాలు
    20. కాఫర్‌సల్ఫేట్ - బ్లుం విట్రయోల్
    21. ఆస్‌బెస్టాస్ - రాతినార
    22. లిక్విడ్ గోల్డ్ - పెట్రోల్
    23. వెనిగర్ - ఎసిటిక్ ఆమ్లం 

 

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌