• facebook
  • whatsapp
  • telegram

లోహాలు, అలోహాలు

లోహాలు - భౌతిక ధర్మాలు 

ద్యుతిగుణం:
* ప్రకాశమంతమైన ఉపరితలం ఉండి కాంతిని పరావర్తనం చేయగలిగే పదార్థాలను ద్యుతిగుణం ఉన్న పదార్థాలనీ, ఆ గుణాన్ని ద్యుతిగుణం అనీ
అంటారు. 
* ద్యుతి గుణం అంటే మెరిసే స్వభావం.
* ప్రకాశమంతంగా లేని పదార్థాలను ద్యుతిగుణం లేని పదార్థాలు అంటారు.
* ఇనుము, రాగి, జింక్, అల్యూమినియం లాంటివి మెరిసే స్వభావాన్ని కలిగి ఉంటాయి.
* గంధకం (సల్ఫర్), కార్బన్ లాంటివి మెరిసే స్వభావాన్ని కలిగి ఉండవు.
* సాధారణంగా లోహాలన్నీ ద్యుతి గుణాన్ని ప్రదర్శిస్తాయి.
* ధ్వనిని ఉత్పత్తి చేసే పదార్థాలను ధ్వని గుణం ఉన్న పదార్థాలు అంటారు.
ఉదా: జింక్, అల్యూమినియం, మెగ్నీషియం

స్తరణీయత:
* పదార్థాలను కొట్టినప్పుడు పలుచటి రేకులుగా సాగే గుణాన్ని స్తరణీయత అంటారు.
* పలుచని చదునైన రేకులుగా మారే పదార్థాలను స్తరణీయ పదార్థాలు అంటారు.
* లోహాలు స్తరణీయత (అఘాత వర్థనీయత) ధర్మాన్ని కలిగి ఉంటాయి.
* పదార్థాల స్తరణీయతా వ్యాప్తి వేర్వేరుగా ఉంటుంది.
* అత్యధిక స్తరణీయత ఉన్న లోహం బంగారం.
* అల్యూమియం, వెండి కూడా అధిక స్తరణీయతతో ఉంటాయి.
తాంతవత:
* పదార్థాన్ని సన్నటి తీగలుగా మార్చగలిగే ధర్మాన్ని తాంతవత అంటారు.
* దాదాపు అన్ని లోహాలు తాంతవత ధర్మాన్ని ప్రదర్శిస్తాయి.
* అధిక తాంతవత ఉన్న లోహం ప్లాటినం.
విద్యుత్ వాహకత:
* తమ ద్వారా విద్యుత్‌ను ప్రవహింపజేసే ధర్మాన్ని విద్యుత్ వాహకత అంటారు.
* దాదాపు లోహాలన్నీ విద్యుత్ వాహకతను ప్రదర్శిస్తాయి.
* అత్యుత్తమ విద్యుత్ వాహకం వెండి.

ఉష్ణ వాహకత:
* పదార్థం ద్వారా ఉష్ణం ప్రసరించే ధర్మాన్ని ఉష్ణవాహకత అంటారు.
* ఉత్తమ ఉష్ణ వాహకం వెండి.
* ఉష్ణ వాహకతను అన్ని లోహాలు ఒకేలా ప్రదర్శించవు.
* అల్యూమినియం, రాగి, ఇనుముకు ఉండే అధిక ఉష్ణవాహకత కారణంగా వాటిని వంట పాత్రల తయారీకి ఉపయోగిస్తారు.
లోహాల రసాయన ధర్మాలు:
* లోహాలు ఆక్సిజన్‌తో చర్య జరిపి క్షార స్వభావం ఉన్న ఆక్సైడ్‌లను ఏర్పరుస్తాయి.
      2 Mg + O2
   2 MgO
      MgO క్షారస్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది నీటిలో కరిగి Mg(OH)2 ఏర్పరుస్తుంది. ఇది ఎరుపు లిట్మస్ కాగితాన్ని నీలి రంగులోకి మారుస్తుంది.
* బంగారం, ప్లాటినం లాంటివి గాలితో చర్య జరపవు కాబట్టి అవి తుప్పుపట్టవు.
* వెండి వస్తువులు, రాగిపాత్రలు, విగ్రహాలు కొంతకాలం తర్వాత మెరుపును కోల్పోతాయి. వెండి వస్తువులు నల్గగా, రాగి వస్తువులు ఆకుపచ్చగా మారతాయి. కారణం ఇవి గాలితో చర్య జరపడమే.
* లోహాలు నీటితో చాలా నెమ్మదిగా చర్య జరుపుతాయి.

* లోహాలు ఆమ్లాలతో చర్యజరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి.
    Mg + 2 HCl
 MgCl2 + H2
* అధిక చర్యాశీలత కలిగిన లోహాలు, తక్కువ చర్యాశీలత కలిగిన లోహాలను స్థానభ్రంశం చెందిస్తాయి.
అలోహాలు:
* అలోహాలు ద్యుతిగుణం, ధ్వనిగుణం లాంటి లోహధర్మాలను కలిగి ఉండవు.
* ఇవి నీటితో, ఆమ్లాలతో చర్య జరపవు.
* అలోహాలు O2 తో చర్యజరిపి అలోహ ఆక్సైడ్‌లను ఏర్పరుస్తాయి.
* ఇవి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి.
    S + O2
 SO2
* ఇవి నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోని మారుస్తాయి.
* లోహాలు - ఉపయోగాలు:
* మిఠాయిలపై అలంకరించడానికి పలుచటి వెండి రేకును ఉపయోగిస్తారు.
* తినుబండారాలను ప్యాకింగ్ చేయడానికి, చాక్లెట్ రేపర్లకు పలుచటి అల్యూమినియం రేకును వినియోగిస్తారు.
* అల్యూమినియం, రాగి మిశ్రమాన్ని నాణేలు, పతకాలు, విగ్రహాల తయారీలో వాడతారు.

* జింక్, ఇనుము మిశ్రమాన్ని ఇనుప రేకుల తయారీలో వినియోగిస్తారు.
* వ్యవసాయ పనిముట్ల తయారీలో ఇనుమును, అలంకరణ సామాగ్రిలో వాడతారు.
* థర్మామీటర్లలో పాదరసాన్ని ఉపయోగిస్తారు.
అలోహాలు - ఉపయోగాలు:
* సల్ఫర్‌ను బాణసంచా, మందుగుండు సామగ్రి, గన్‌పౌడర్, అగ్గిపెట్టెలు, యాంటీసెప్టిక్ ఆయింట్‌మెంట్‌ల తయారీకి ఉపయోగిస్తారు.
* ఉల్లిపాయలు, వెల్లుల్లి, గుడ్డు, వెంట్రుకలు, చేతి గోళ్లలో సల్ఫర్ ఉంటుంది.
* శుద్ధి చేసిన కార్బన్‌ను విరంజనకారిగా వినియోగిస్తారు.
* ఆల్కహాల్‌లో కలిపిన అయోడిన్ (టింక్చర్ అయోడిన్)ను వైద్య అవసరాలకు ఉపయోగిస్తారు.
¤ చాలా వరకు లోహాలు ఘనస్థితిలో లభిస్తాయి.
మన చుట్టూ జరిగే మార్పులు: పదార్థ మార్పులు రెండు రకాలు
      1. భౌతిక మార్పులు
      2. రసాయన మార్పులు.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌